ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..! | Volkswagen Uses 100 Sheep Instead Of Lawnmowers To Maintain 31,000 Solar Panels, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!

Jul 10 2026 4:03 PM | Updated on Jul 10 2026 4:35 PM

To maintain the solar powered factory in Poland using 100 sheeps by Volkswagen

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ (Volkswagen)  వినూత్ర ప్రయోగం విశేషంగా నిలుస్తోంది. పోలాండ్‌లోని పోజ్నాన్ (Poznań) నగరంలో ఉన్న తన తయారీ ప్లాంట్‌లో ఒక సరికొత్త, పర్యావరణహితమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అక్కడున్న 31,000 కంటే ఎక్కువ సోలార్ ప్యానెళ్ల కింద పెరిగే గడ్డిని  తొలగించేందుకు సాంప్రదాయ మెకానికల్ యంత్రాలకు (Lawnmowers) బదులుగా 100 గొర్రెల మందను రంగంలోకి దించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు, నిర్వహణ సమస్యలు తగ్గడమే కాకుండా, సౌర ఫలకాల నీడ వల్ల గొర్రెలకు వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తోంది.

ఐరోపాలోనే అతిపెద్ద ఆన్-సైట్ సోలార్ ప్యానల్ వ్యవస్థలలో ఒకటి.పోజ్నాన్ ప్లాంట్‌లో ఉన్న 18.3 మెగావాట్ (MW) సోలార్ ప్లాంట్  ఇది వోక్స్‌వ్యాగన్ ఫ్యాక్టరీకి అవసరమైన వార్షిక విద్యుత్తులో 25 శాతం వరకు అందిస్తుంది. ఇక్కడి ప్యానెళ్ల కింద గడ్డి విపరీతంగా పెరగడం వల్ల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో యంత్రాల వాడకాన్ని తగ్గించి,సహజంగా గడ్డిని తొలగించేందుకు గొర్రెలతో మేపుతున్నారు. ఇది యంత్రాల వల్ల వచ్చే కర్బన ఉద్గారాలను, ఖర్చులను తగ్గిస్తుంది.

గివ్ అండ్ టేక్ పాలసీ
దీని వల్ల అటు కంపెనీకి లాభం, ఇటు గొర్రెలకు  చక్కటి ఆహారం, చల్లదని వస్తుందని భావిస్తోంది.  అంటే ఎండ ఎక్కు వున్నపుడు సోలార్ ప్యానెళ్లు గొర్రెలకు చల్లని నీడను ఇస్తూ, వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. అలాగే ప్యానెళ్ల కింద ఏపుగా పెరిగిన గడ్డిని శుభ్రంగా మేసేయడం వల్ల ఫ్యాక్టరీకి నిర్వహణ భారం తగ్గుతుంది. ఈ వినూత్న ప్రయోగంలో వోక్స్‌వ్యాగన్ సంస్థ పోజ్నాన్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌తో చేతులు కలిపింది. జంతు సంరక్షణ, ఆరోగ్యం రక్షణతోపాటు, నేల నాణ్యత, జీవవైవిధ్యం (biodiversity), కీటకాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందని పరిశోధకులు చెబు తున్నారు. 

ఇదీ చదవండి : 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!

గొర్రెల యజమాని  ఏమన్నారంటే
గొర్రెల యజమాని జస్టినా నోవాక్-గజెక్‌ మాట్లాడుతూ.. గొర్రెలు భయపడితే గుంపులుగా ఒకేచోట ఉండి పోతాయని, కానీ ఇక్కడ అవి చిన్న చిన్న సమూహాలుగా విడిపోయి ప్రశాంతంగా మేస్తున్నాయని చెప్పారు. దీన్ని బట్టి ఆ జంతువులు అక్కడ చాలా సురక్షితంగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పర్యావరణానికి నష్టం రాకుండా, కార్బన్‌ ఉద్గారాల బెడద లేకుండా ఆధునిక పరిశ్రమలు ప్రకృతితో కలిసి ఎలా ప్రయాణించ వచ్చో చెప్పడానికి ఈ "సోలార్ ప్యానెల్స్ + గొర్రెల పెంపకం" ఒక అద్భుతమైన ఉదాహరణగా  నిలుస్తోంది. 

ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement