దిగ్గజ కంపెనీ కొత్త ప్లాన్.. లక్ష ఉద్యోగులు బయటకు! | Volkswagen May Cut Up To 1 Lakh Jobs Know The Details | Sakshi
Sakshi News home page

దిగ్గజ కంపెనీ కొత్త ప్లాన్.. లక్ష ఉద్యోగులు బయటకు!

Jun 26 2026 7:22 PM | Updated on Jun 26 2026 7:44 PM

Volkswagen May Cut Up To 1 Lakh Jobs Know The Details

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్.. అతిపెద్ద పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. కంపెనీ సీఈఓ ఒలివర్ బ్లూమ్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ ప్రణాళికలో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు, ఫ్యాక్టరీల మూసివేత, పెట్టుబడుల తగ్గింపు వంటి కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

కంపెనీ కొత్త ప్రణాళిక ప్రకారం.. సుమారు లక్ష ఉద్యోగాల వరకు కోతలు ఉండే అవకాశం ఉంది. ఇది సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం అని తెలుస్తోంది. అయితే కంపెనీ 50వేల మంది ఉద్యోగులను తొలగించడానికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

ఫోక్స్‌వ్యాగన్ తన పెట్టుబడి వ్యయాన్ని కూడా తగ్గించాలని చూస్తోంది. రాబోయే ఐదేళ్లలో పెట్టుబడులను సుమారు 15 శాతం తగ్గించి, మొత్తం 130 బిలియన్ యూరోలకు పరిమితం చేయాలని యోచిస్తోంది. ఆర్ధిక ఒత్తిడిని తగ్గించుకోవడంలో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement