వర్టస్ యానివర్సరీ ఎడిషన్‌ లాంచ్.. 150 యూనిట్లు మాత్రమే! | Volkswagen Virtus Anniversary Edition Launched In India At Rs 19.20 Lakh | Sakshi
Sakshi News home page

వర్టస్ యానివర్సరీ ఎడిషన్‌ లాంచ్.. 150 యూనిట్లు మాత్రమే!

Aug 7 2026 2:59 PM | Updated on Aug 7 2026 3:04 PM

Volkswagen Virtus Anniversary Edition Launched In India At Rs 19.20 Lakh

ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో.. వర్టస్ యానివర్సరీ ఎడిషన్‌ను రూ. 19.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత వర్టస్ స్పెషల్ ఎడిషన్, టాప్ స్పెక్ జీటీ ప్లస్ స్పోర్ట్ ట్రిమ్ ఆధారంగా నిర్మితమైంది.

వర్టస్ యానివర్సరీ ఎడిషన్ అవకాడో పెర్ల్ రంగులో లభిస్తుంది. రూఫ్ నలుపు రంగులో ఉంటుంది. బ్లాక్ అల్లాయ్ వీల్స్, రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్‌లు, బ్లాక్ బూట్ లిప్ స్పాయిలర్ కూడా ఉన్నాయి. ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో కేవలం 150 యూనిట్లు మాత్రమే లభిస్తుంది. డిజైన్ ప్యాకేజీలో ఫ్రంట్ బంపర్‌పై గ్లాస్ బ్లాక్ ట్రిమ్, ముదురు రంగు హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్ హౌసింగ్‌లు, గ్లాస్ బ్లాక్ డాష్‌బోర్డ్ ఇన్సర్ట్‌లతో కూడిన బ్లాక్ కలర్ క్యాబిన్ ఉంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. లెదరెట్ అపోల్స్ట్రే, రెడ్ కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ సన్‌రూఫ్, 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎనిమిది స్పీకర్ల ఆడియో సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి.

ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ కూడా ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 1.5 లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ (150 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్) ఎంపికలో లభిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. 19.62 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement