ఆస్ట్రేలియాపై వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం | Aaryavir Sehwag misses maiden India U-19 fifty by three runs against Australia in Rajkot | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాపై వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం

Sep 21 2026 12:10 PM | Updated on Sep 21 2026 12:23 PM

Aaryavir Sehwag misses maiden India U-19 fifty by three runs against Australia in Rajkot

PC: X

భారత దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు, భారత అండర్-19 జట్టు ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్ తృటిలో తన తొలి అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. రాజ్ కోట్ వేదికగా ఆస్ట్రేలియా యువ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో ఆర్యవీర్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఆసీస్‌ బౌలర్లను ఉతికారేసిన ఆర్యవీర్..  9 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తండ్రిని తలపించేలా ఆకట్టుకునే షాట్లతో చెలరేగిపోయిన జూనియర్ సెహ్వాగ్... మొత్తంగా 48 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఉండగా అతడు దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు.

అంతకుముందు జరిగిన తన అరంగేట్ర మ్యాచ్‌లోనూ ఆర్యవీర్ 28 పరుగులతో పర్వాలేదనిపించాడు. మరోవైపు ఆర్యవీర్ అందించిన శుభారంభంతో భారత యువ జట్టు రెండో వన్డేలో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. 40 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.

తుది జ‌ట్లు
ఆస్ట్రేలియా అండ‌ర్‌-19: నీల్ పటేల్, హేడెన్ బార్బులోవిక్(వికెట్ కీప‌ర్‌), జెడ్ హోలిక్, జాక్ క్జోస్నెక్(కెప్టెన్‌), బ్లేక్ కాటిల్, మాథ్యూ లాఫ్, కానర్ గ్రెగొరీ, జాకబ్ పీట్జ్, పాట్రిక్ సుల్లివన్, థామస్ వాసియో, థియో ట్సింగోస్

భార‌త్‌: లక్ష్య రాజేష్ రాయచందానీ(కెప్టెన్‌), ఆర్యవీర్ సెహ్వాగ్, కుషాగ్ర ఓజా, యశ్బర్ధన్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్(వికెట్ కీప‌ర్‌), వీకే వినీత్, యశ్వీర్ గౌడ్, మనల్ చౌహాన్, చిగురుపాటి వెంకట, కావ్య పటేల్, మోహిత్ ఉల్వా
చదవండి: IND vs AUS: తొలి ‘వన్డే’లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement