breaking news
Aaryavir Sehwag
-
మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామన్యుల నుంచి సెలబ్రేటిల వరకు విరాట్ కోహ్లిని ఆరాధిస్తుంటారు. ఈ ఢిల్లీ బాయ్ ఎంతో మంది యువ క్రికెటర్లకు రోల్ మోడల్. ఈ జాబితాలో టీమిండియా లెజెండరీ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఉన్నాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సూపర్‌స్టార్ విరాట్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవాలని ఆర్యవీర్ కలలు కంటున్నాడు. తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆర్యవీర్ మాత్రం ఆర్సీబీకి ఆడాలని తహతహలాడుతున్నాడు.17 ఏళ్ల ఆర్యవీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. డీపీఎల్ వేలంలో ఈ అన్క్యాప్డ్ ప్లేయర్‌ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.8 లక్షల భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది టోర్నీలో ఇప్పటివరకు ఆడే అవకాశం అతడికి లభించలేదు. సెంట్రల్ ఢిల్లీ ఆటగాడు యశ్ ధుల్ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు వెళ్లనుండడంతో ఆర్యవీర్‌కు మిగితా మ్యాచ్‌ల్లో ఆర్యవీర్ భాగమయ్యే ఛాన్స్ ఉంది."ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లి గొప్ప బ్యాటర్. కోహ్లితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనేది నా కల. ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తాను. అదేవిధంగా మా నాన్న నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.ప్రతి ఒక్కరిని గౌరవించడం, అందరితో మర్యాదగా నడుచుకోవడం, కెరీర్ పరంగా ఎంత ఎదిగినా తగ్గే ఉండాలి మా నాన్న మాకు నేర్పించారు అని ఇన్సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్యవీర్ పేర్కొన్నాడు.కాగా ఆర్యవీర్ తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. గతేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-19 జట్టు తరపున డబుల్ సెంచరీతో చెలరేగాడు. మేఘాలయ జట్టుపై 297 పరుగులు చేసి త్రుటిలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.చదవండి: వాంఖెడే స్టేడియంలో గావస్కర్ విగ్రహావిష్కరణ -
జాక్‌పాట్!.. భారీ ధరకు అమ్ముడుపోయిన సెహ్వాగ్ కొడుకు
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్‌పాట్ కొట్టేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 (DPL Auction) వేలంలో ఏకంగా రూ. 8 లక్షలు దక్కించుకున్నాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఈ మేర భారీ మొత్తం వెచ్చించి ఈ అన్క్యాప్డ్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది.డబుల్ సెంచరీ వీరుడుకాగా ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) ఢిల్లీ తరఫున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న 17 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటాడు. ముఖ్యంగా గతేడాది మేఘాలయ జట్టు మీద డబుల్ సెంచరీతో మెరిసిన ఆర్యవీర్.. తృటిలో తండ్రి రికార్డుకు దూరమయ్యాడు. 297 పరుగుల వద్ద అవుటైన అతడు ట్రిపుల్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు.కాగా టెస్టుల్లో సెహ్వాగ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 319 కాగా.. అతడి కుమారుడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ రికార్డును చేరుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఫెరారీ కారు గెలుచుకునే అవకాశం చేజార్చుకున్నాడు. గతంలో సెహ్వాగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ఫెరారీ మిస్ అయ్యావు‘‘టెస్టు క్రికెట్లో నేను కొన్ని మైలురాళ్లు సాధించానని నా కుమారులకు తెలుసు. అందుకే.. కనీసం స్కూల్ క్రికెట్లోనైనా నా హయ్యస్ట్ స్కోరు 319 పరుగుల బెంచ్ మార్కును దాటితే వారికి ఫెరారీ కొనిస్తానని చెప్పాను’’ అని సెహ్వాగ్ గతంలో చెప్పాడు.ఇక తన కుమారుడు ఆర్యవీర్ 2024లో ఈ ఫీట్‌ను మిస్ కాగా.. ‘‘బాగా ఆడావు ఆర్యవీర్. కానీ కేవలం 23 పరుగుల తేడాతో ఫెరారీ మిస్ అయిపోయావు. నీలోని పరుగుల దాహాన్ని ఇలాగే ఉండనివ్వు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించు. ఆడుతూనే ఉండు’’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.అమ్ముడుపోని వేదాంత్కాగా ఇలా తనదైన శైలిలో పరుగులు సాధిస్తున్న ఆర్యవీర్‌ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తమ సొంతం చేసుకుంది. అయితే, సెహ్వాగ్ చిన్న కుమారుడు వేదాంత్ (Vedant Sehwag)కు మాత్రం వేలంలో నిరాశే మిగిలింది. నిజానికి ఆర్యవీర్ కంటే ముందే వేదాంత్ పేరు వేలంలోకి వచ్చింది.ఖరీదైన ఆటగాడిగా సన్రైజర్స్ప్లేయర్కానీ అతడిని కొనేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 వేలంలో సిమర్జీత్ సింగ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ సెంట్రల్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 39 లక్షలు వెచ్చించింది. ఈ రైటార్మ్ పేసర్ ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న విషయం తెలిసిందే. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లలోనూ సిమర్జీత్ భాగమయ్యాడు.మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ స్టార్ నితీశ్ రాణాను వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనుగోలు చేసింది. రూ. 34 లక్షల ధరకు అతడు జట్టుతో చేరాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా ఇదే జట్టుకు ఆడనున్నాడు. అతడి కోసం ఫ్రాంఛైజీ రూ. 13 లక్షలు వెచ్చించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో భాగమైన జట్లు ఇవేసౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురాణీ ఢిల్లీ గతేడాది ఆడగా.. ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు వచ్చాయి. ఇక 2024లో మొదలైన డీపీఎల్‌లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ విజేతకాగా.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ రన్నరప్‌గా నిలిచింది.చదవండి: IND vs ENG 2nd Test: బర్మింగ్‌హామ్‌లో జైహింద్