breaking news
Sangareddy
-
ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేయాలి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఉపాధ్యాయుడ్ని డిప్యుటేషన్‌పై పంపకుండా సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. మండలంలోని కన్నారం ఉన్నత పాఠశాలలో ఫిజికల్సైన్స్ బోఽధించే ఉపాధ్యాయుడు మా కొద్దంటూ విద్యార్థులు ఽఈనెల 17న ధర్నా చేయగా మంగళవారం ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓ పాఠశాలలో విచారణ చేశారు. ఈ విషయమై బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు మహిపాల్‌రెడ్డి, విఠల్, నారాయణ, యాదాగౌడ్, యాదుల్, పోచయ్య తదితరులు మాట్లాడారు. ఉపాధ్యాయుడు శ్రీకాంత్‌గౌడ్ ఓ సంఘంలో జిల్లా పదవిలో ఉన్నాడని అతని పలుకుబడితో డిప్యూటేషన్ వెళ్లేందుకు పైరవీలు చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో విధులు నిర్వహించిన పాఠశాలల్లో సైతం పాఠాలు చెప్పకుండా యూనియన్ కార్యకలాపాలు చేస్తూ తోటి ఉపాధ్యాయులతో గొడవలు పెట్టుకోవడం పరిపాటిగా మారిందన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం చేస్తున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కన్నారం గ్రామస్తుల డిమాండ్ -
భారీగా గంజాయి పట్టివేత
తూప్రాన్: కారులో తరలిస్తున్న సుమారు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా... నాగపూర్‌కు చెందిన నిందితుడు చాంద్‌పాషాతో పాటు మరో ఇద్దరు యువకులు కారులో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువ చేసే 100 కిలోల ఎండు గంజాయిని నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు తన కుటుంబ సభ్యులను కారులో ఎక్కించుకొని వస్తున్నారు. మార్గమధ్యలో టోల్‌ప్లాజాల వద్ద కారును ఆపకుండా వస్తున్నారు. దీంతో అప్పటికే సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ శ్రీనివాస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద వాహనంతో కాపు కాశారు. గంజాయి కలిగిన కారు టోల్‌ప్లాజా వద్ద ఆపకుండా స్టాఫర్‌ను ఢీకొని అతివేగంగా వెళ్లింది. అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని అడ్డం పెట్టడంతో నిందితులు ప్రయాణిస్తున్న కారు పాలీసుల వాహనంను ఢీకొని బోల్తాపడింది. కారులోంచి మంటలు చెలరేగాయి. టోల్‌ప్లాజా సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అనంతరం కారు నుంచి బ్యాగుల్లో దాచిన సుమారు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక పోలీసుల సహకారంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు -
ఊపందుకున్న ఆలు సాగు
ఇప్పటికే వర్షాలతో ఆలస్యమైన సాగు విత్తన సబ్సిడీ లేదు ఆలుగడ్డ విత్తనానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీని అందించడం లేదు. శీతల గిడ్డంగి ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే రైతులకు 40% మేర సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. రైతులు వ్యక్తిగతంగా లేక గ్రూపుగా వచ్చినా ఏర్పాటు చేసుకోవచ్చు. అధిక వ్యయం కారణంగా రైతులు ముందుకు రావడం లేదు. – పండరీ, జిల్లా ఇన్చార్జి ఉద్యానవన అధికారి, సంగారెడ్డిజహీరాబాద్: జిల్లాలో ఆలుగడ్డ పంట విస్తృతంగా సాగవుతోంది. పక్షం రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో రైతులు భూములను దున్ని ఆలుగడ్డ పంట వేసే పనులు చేపట్టారు. దీంతో సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాధారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచే విత్తనం వేసుకునే పనులు ప్రారంభించేవారు. ఇటీవలి వరకు వర్షాలు కురవడంతో విత్తనం వేసుకునే పనులు ముందుకు వెళ్లాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సుమారు 3వేల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. జహీరాబాద్ ప్రాంతంలోనే 90% మేర సాగు జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలోనే 90% మేర పంట సాగుకానుంది. ప్రతి ఏటా రైతులు సంప్రదాయకంగా ఆలుగడ్డ పంటను సాగుచేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 10% మేర పంట సాగయ్యింది. ఎర్ర నేలల్లో మాత్రమే సాగువుతోంది. పాడు, రేగడి మట్టి కలిగిన భూములు ఇంకా దున్నడానికి వీల్లేకుండా చిత్తడిగా ఉన్నాయి. వర్షాల కారణంగా భూముల్లో అధికంగా తేమ కలిగి ఉండటంతో దున్నకానికి అనుకూలంగా లేకుండా పోయిందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో పంట సాగు డిసెంబర్ మొదటివారం వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. 80 రోజుల్లోనే పంట చేతికి అందివస్తుంది. వ్యవసాయ బావులు, బోర్లలో నీరు సమృద్ధిగా ఉండటంతో పంట సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో ఆలుగడ్డ పంట అధికంగా సాగుకానుంది. ఆకాశంలో విత్తనం ధర గతంతో పోల్చిచూస్తే ఈ ఏడాది ఆలుగడ్డ విత్తనం ధరలు ఆకాశంలో ఉన్నాయి. క్వింటాల్ ధర రూ.3,600లు పలుకుతోంది. ఇంతమేర విత్తనం ధర ఉండటంతో చిన్న, సన్నకారు రైతులు మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు మాత్రం క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 మేర అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఒకేసారి దిగుబడులతో ధర పలికేనా! రైతులంతా పంట సాగు ఒకేసారి చేస్తుండటంతో దిగుబడులు కూడా ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. దీంతో పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధరలు లభిస్తాయా లేదా అనే ఆందోళన రైతాంగాన్ని వెంటాడుతోంది. అయినా ఆలుగడ్డ పంట సాగువైపే రైతులు మొగ్గుచూపుతున్నారు. -
హామీలన్నీ అమలు చేస్తాం
సిద్దిపేటరూరల్: ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర కార్మిక, మైనింగ్, పరిశ్రమల శాఖ మంత్రి జి.వివేక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో సిద్దిపేట నియోజకవర్గం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ప్రస్తుత ప్రభుత్వం పథకాలను నెమ్మదిగా అమలు చేస్తుందన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి వర్గల్(గజ్వేల్): ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని వెద్యులకు మంత్రి వివేక్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని బుధవారం రాత్రి మంత్రి వివేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పీహెచ్సీ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోగా, సకాలంలో తాము పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. ఆస్పత్రికి అదనపు సిబ్బందిని నియమించామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా వైద్యాధికారి ధనరాజ్, తహసీల్దార్ రఘువీర్‌రెడ్డి, ఎంపీడీవో మశ్చేందర్, వైద్యాధికారి దీప పాల్గొన్నారు. మంత్రి జి.వివేక్ కలెక్టరేట్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ -
పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతులు
కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, సత్వరం అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.24 లక్షల సబ్సిడీకి డీపీసీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ వర్గాల యువత పరిశ్రమల స్థాపనలో ముందుకు వచ్చి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రా మెటీరియల్స్ సరఫరా, భూకమతాల మంజూరు, విద్యుత్ కనెక్షన్లు, ఇతర అనుమతులపై వచ్చిన దరఖాస్తులను సమీక్షించి, ఫైళ్లను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ, డీటీసీపీ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, ఎకై ్సజ్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వేగంగా దూసుకొచ్చి ..
డివైడర్‌ను ఢీకొట్టిన కారుజిన్నారం (పటాన్చెరు): మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం... మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో మెదక్ బాలనగర్ జాతీయ రహదారి బొంతపల్లి దోమడుగు గ్రామాల మధ్య కారు అజాగ్రత్తగా మితిమీరిన వేగంతో దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. కాగా ఘటనలో కారులోని వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కారును వదిలేసి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కొండపాక(గజ్వేల్): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన మర్వాడి దేవదానం(33) డ్రైవరుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్ వృత్తి సరిగా కొనసాగకపోవడంతో మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో కుటుంబ పోషణ విషయంలో తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కూతురు శారీ ఫంక్షన్ కోసం చేసిన అప్పుల విషయంలో బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. రోళ్లపాడ్లో గుర్తు తెలియని మృతదేహం వట్పల్లి(అందోల్): మండల పరిధిలోని రోళ్లపాడ్ గ్రామ శివారులోని మంజీరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. జోగిపేట ఎస్ఐ పాండు వివరాల ప్రకారం... గ్రామ శివారులోని మంజీరా నదిపై ఉన్న చెక్‌డ్యాం వద్ద మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో అటుగా వెళ్లిన వారు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని వెలికితీశారు. మృతి చెందిన వ్యక్తికి 20 నుంచి 30 ఏళ్ల ఉంటాయని, తెల్లచొక్కా, నీలంరంగు ప్యాకెట్ ఉన్న చొక్కా ధరించి ఉన్నట్లు తెలిపారు. ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు అక్కన్నపేట(హుస్నాబాద్): ఈతకు వెళ్లిన యువకుడు నీటి గుంతలో గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలంలోని జనగామ గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఎండీ.చాంద్ పాషా( 21), గౌస్, మైబుల్, షాదుల్లా స్నేహితులు. సరదాగా హుస్నాబాద్ నుంచి వెళ్లి నిండుకుండలా జలసవ్వడితో ఉన్న గుంత పక్కనే కూర్చొని మద్యం తాగారు. ఈ క్రమంలో చాంద్ పాషా ఈత కొట్టేందుకు నీటి గుంతలోకి దిగాడు. కొద్దిసేపటికీ బయటకు రాకపోవడంతో గల్లంతు అయినట్లు పోలీసులకు స్నేహితులు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ ప్రశాంత్‌తో పాటు హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గల్లంతు అయిన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
నాగపురిలో రాష్ట్ర కూటుల నాటి శాసనం
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని నాగపురి గ్రామంలో రాష్ట్ర కూట కాలం నాటి శాసనం ఉందని చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామంలో పరిశీలించిన సమయంలో పోచమ్మ దేవాలయం పక్కన వేపచెట్టు కింద చెట్ల మధ్యలో రాళ్లతో కట్టిన చిన్న దేవాలయం కనిపించిందన్నారు. దేవాలయ రాళ్లు పరిశీలించగా ఆలయానికి వాడిన ఒక పొడవాటి రాయిపై అక్షరాలు కనిపించాయని, రాయికి సున్నం వేసి ఉండటం వల్ల అక్షరాలు సరిగా కనిపించడం లేదన్నారు. కనిపించిన అక్షరాల లిపిని బట్టి ఇది 8 నుంచి 10వ శతాబ్దం నాటి లిపి అని, అనగా రాష్ట్ర కూటుల కాలం నాటి శాసనంగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు సహకరిస్తే ఆ శాసనాన్ని శుభ్రపరిచి అక్షరాలను చదివితే చరిత్ర, శాసన కాలం అందులో పేర్కొన్న వివరాలు తెలుస్తాయన్నారు.చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ -
గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మూసివేతజహీరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టును అధికారికంగా మూసివేశారు. సంబంధిత శాఖ సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు ఈ మేరకు బుధవారం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దులోని మొగుడంపల్లి మండలంలోని మాడ్గి వద్ద ఈ చెక్‌పోస్టును నిర్వహిస్తూ వచ్చారు. ఇతర రాష్ట్రాల్లో రెండేళ్ల క్రితమే మూసివేసినా రాష్ట్రంలో నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని మూసివేసేందుకు సానుకూలత వ్యక్తం చేయకపోవడం వల్లే కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెక్‌పోస్టుల మూసివేతకు సానుకూలంగా ఉండటంతో అందులోభాగంగా జహీరాబాద్ చెక్‌పోస్టును మూసివేశారు. సరిహద్దు చెక్‌పోస్టులను మూసివేస్తున్నట్లు, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని రవాణ కమిషనర్ అధికారికంగా ప్రకటించడంతో రవాణశాఖ జిల్లా అధికారులు చెక్‌పోస్టును సందర్శించి మూసివేయించారు. జిల్లా రవాణశాఖ కమిషనర్ వెంకట రమణ సమక్షంలో అధికారులు చెక్‌పోస్టు బోర్డులను, బారికేడ్లను తొలగించారు. చెక్‌పోస్టులో ఉన్న కంప్యూటర్లు, రికార్డులు, ఇతర ఫర్నీచర్‌ను డీటీఓ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు మూసివేసినట్లు బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆన్లైన్ వ్యవస్థ నడుస్తోందని, అందులో ఎలాంటి సర్వీసునైనా ఆన్లైన్ విధానం ద్వారా ప్రజలు, వాహనదారులు పొందవచ్చన్నారు. -
మంత్రి వివేక్ సభలో నిలిచిన విద్యుత్ సరఫరా
● సెల్‌ఫోన్ వెలుతురులో చెక్కుల పంపిణీ ● కొద్దిసేపు గందరగోళం గజ్వేల్: పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ చేతుల మీదుగా జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో సాగింది. రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మంత్రి వివేక్, మెదక్ కలెక్టర్ హైమావతి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతో కలిసి పట్టణంలోని ఐవోసీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు ప్రసంగించారు. ఇంతలోనే కరెంటు పోయింది. దీంతో మంత్రితో పాటు వేదికపైన ఉన్న వారు ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు వేచి ఉన్నా కరెంటు రాకపోవడంతో వివేక్ చివరకు సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులోనే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 204 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, కొందరికే సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో మంత్రి అందించారు. -
మంత్రి వివేక్‌కు హరీశ్ రావు కౌంటర్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, వారు చేసిన అప్పులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5వేల కోట్లు మిత్తి చెల్లిస్తుందన్నారు. దీంతో మిగిలిన నిధులతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నామని మంత్రి వివేక్ అన్నారు. దీనికి స్పందించిన హరీశ్‌రావు మంత్రి అబద్దాలు చెబుతున్నారని, కావాలంటే తాను లెక్కలు చెబుతానన్నారు. దీనికి వివేక్ బదులిస్తూ పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించారా? అని లబ్ధిదారులను అడిగారు. పదేండ్లు రేషన్‌కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 16లక్షలకు పైగా రేషన్‌కార్డులు ఇచ్చామన్నారు. మధ్యలో హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షలపైగా రేషన్‌కార్డులు ఇచ్చామని , తప్పు అయితే ఇప్పుడే రాజీనామా చేస్తానన్నారు. ఇందుకు మంత్రి వివేక్ గత ప్రభుత్వం రేషన్‌కార్డులు ఇచ్చి ఉంటే జిల్లాలో 26వేల రేషన్‌కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఇస్తుందన్నారు. అనవసరంగా రూ. లక్ష కోట్లు కాళేశ్వరంపై ఖర్చు పెట్టి అసలైన పథకాలకు నిధులు లేకుండా ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారు. -
పోలీసుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
మంత్రి దామోదర రాజనర్సింహసంగారెడ్డి జోన్: ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవలందించే పోలీసుల ఆరోగ్య సంరక్షణే ప్రతీ ఒక్కరి లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కొరకు నిర్వహించిన సమగ్ర ఆరోగ్య శిబిరాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. శిబిరంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. నిత్యం విధి నిర్వహణలో ఉండే పోలీసుల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి వహించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, జిల్లా వైద్యాధికారి నాగనిర్మల, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
పత్తి విచ్చిన అప్పుల కత్తి!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : పత్తి పంట దిగుబడులు భారీగా పడిపోయాయి. ఎకరాకు కనీసం పది క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సిన పత్తి..కనీసం ఐదారు క్వింటాళ్లు కూడా రావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పత్తి సాగు చేసిన చేలల్లో దిగుబడి మరింత దారుణంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నామమాత్ర దిగుబడులతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం కష్టమని, తమ రెక్కల కష్టం వృథా అయిందని ఆందోళన చెందుతున్నారు. కాగా, వ్యవసాయశాఖ మాత్రం ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అయితే వాస్తవంగా ఆరు క్వింటాళ్లకు మించి రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తితీత పనులు ప్రారంభించారు. దీపావళి పండుగ నుంచి ఈ పత్తి ఏరడం వేగవంతమవుతోంది. 3.48 లక్షల ఎకరాల్లో సాగు.. పత్తి పంటల అత్యధికంగా సాగయ్యే జిల్లాల్లో సంగారెడ్డి ప్రధానమైనది. ఈ పంట అత్యధికంగా సాగవుతున్న జిల్లాలో సంగారెడ్డి మూడో స్థానంలో ఉంటుంది. ఈ ఖరీఫ్ సీజనులో 3.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. వ్యవ సాయశాఖ అంచనా వేసినట్లు ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల చొప్పున 3.48 లక్షల ఎకరాలకు సుమారు 2.79 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడులు వస్తాయని ఆశాఖ లెక్కలు వేసింది. ఈ సీజనులో ఈ మేరకు పత్తి కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికార యంత్రాంగం భావిస్తోంది. అధిక వర్షాలే కారణం.. ఈసారి ఖరీఫ్ సీజనులో భారీ వర్షాలు కురిశాయి. ఒకే రోజు 25 సెం.మీలకు మించి వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పత్తి చేలల్లో రోజుల తరబడి వరద నిలిచిపోయింది. దీంతో మొక్కలు చాలావరకు మురిగిపోయాయి. పత్తి మొక్కకు కింద భాగంలో ఉన్న పత్తికాయలు నీటిలో నానిపోయాయి. దీనీ ప్రభావం పత్తి దిగుబడిపై పడిందని రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పత్తి కాయదశలో ఉన్నప్పుడు అధిక వర్షాలు కురిశాయి. దీంతో పత్తి దిగుబడి తగ్గుతుందని రైతులు అప్పట్లోనే ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు దిగుబడి పూర్తిగా పడిపోవడంతో రైతులు అనుకున్నదాని కంటే ఎక్కువ దిగుబడి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వలస కూలీలు రాలే ప్రతీ ఏటా వచ్చే వలస కూలీలు రామంటున్నారు. మీ దగ్గర దిగుబడి రావడం లేదు. మేము వచ్చి పత్తి తీసినా మాకు గిట్టుబాటు రాదంటున్నారు. ఇతర కూలీల కోసం ప్రయత్నం చేస్తున్నా. – బగిలి బక్కన్న, తాటిపల్లిపత్తితీతకు కూలీలేరి?మునిపల్లి(అందోల్): పత్తీతీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్న కూలీలు సకాలంలో దొరకపొవడంతో చేతికొచ్చిన పత్తి నేల రాలిపోతోంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆటోల్లో ఉదయం వచ్చి సాయంత్రం 6 గంటలకే పత్తి తీసి వెళ్లే కూలీలు ఆటో కిరాయి రాను పోను ఇచ్చి కిలోకు రూ.13 చొప్పున ఇస్తామంటున్నా కూలీలు దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఏటా వచ్చే వలస కూలీలు కొందరు ఈసారి కూడా వచ్చి ముందే పత్తితీత పనులు నిర్వహిస్తామని డబ్బులు తీసుకున్నారు. వారి సొంత గ్రామాలకు వెళ్లిన తర్వాత పత్తితీత పనులకు రావడం లేదని తీసుకున్న అడ్వాన్సు డబ్బులను సైతం తిరిగి పంపిస్తున్నారని కొందరు రైతులు చెబుతున్నారు. పత్తితీత పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఏం చేయాలో తోచక రైతులు దిగాలు పడుతున్నారు. -
2న కార్తీక వన భోజనాలు
సంగారెడ్డిటౌన్ : రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 2న కార్తీక వన భోజనాలు నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ కార్యక్రమానికి జిల్లాలోని వీరశైవ లింగాయత్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. అనంతరం టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ధనంజయ, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున పాటిల్, కోశాధికారి గోవురాజు, ఉపాధ్యక్షుడు సంగిశెట్టి తదితరులు పాల్గొన్నారు. ర్యాకల్‌లో సంచార సైన్స్‌ల్యాబ్ ప్రదర్శననారాయణఖేడ్: ఖేడ్ మండలం ర్యాకల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం శాస్త్ర సంచార ప్రయోగశాల ప్రదర్శన( మొబైల్ సైన్స్ ల్యాబ్)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ ప్రయోగాలను ప్రదర్శించి వాటి తయారీని వివరించారు. 8వతరగతి చదువుతున్న నిఖిల్ తయారుచేసిన ఫ్యాన్‌ను జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తిలకించి సదరు విద్యార్థిని అభినందించారు. నాగల్గిద్ద ఎంఈఓ మన్మథకిశోర్, ప్రధానోపాధ్యాయులు గోపాల్, రీసోర్స్పర్సన్లు వినయ్‌కుమార్, ధన్సింగ్యక్, రాజేశ్వర్, ఉపాధ్యాయులు నర్సింహులు పాల్గొన్నారు. కార్మికులకు బీమా చేయించాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు సంగారెడ్డి ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీలోని ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ చేయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో బుధవారం గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులకు కష్టపడి పనిచేసిన ప్రతి నెలా రెగ్యులర్‌గా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.18 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు సబ్బులు, నూనెలు, యూనిఫాం ఇవ్వాలని కోరారు. కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రటరీలు వేతనాలు వచ్చిన ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సత్తయ్య, దశరథ్ నాయకులు మహేశ్, పోచయ్య, శంకర్, విజేందర్, భీమయ్య, ఇమ్మానియేల్, నిరంజన్, రవి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఘనంగా సదర్ ఉత్సవంరామచంద్రాపురం(పటాన్ చెరు): రామచంద్రాపురం పట్టణంలో యాదవ సంఘం, సదర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దున్నపోతులను అలంకరించి వాటితో విన్యాసాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ బి.పుష్ప తదితరులు పాల్గొన్నారు. -
గుంతను తప్పించబోయి..
చిన్నశంకరంపేట(మెదక్): కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కొర్విపల్లి వద్ద చోటుచేసుకుంది. బుధవారం మెదక్ వైపు నుంచి వస్తున్న సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం రాంరెడ్డిపేటకు చెందిన ఆవుసుల సాయిబాబా కుటుంబ సభ్యులతో కలిసి వర్గల్ హాస్టల్లో తమ కూతురును దింపేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో కొర్విపల్లి వద్ద మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై ఏర్పడ్డ పెద్ద గుంతను తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న పాప కంటికి దెబ్బతగలగా, మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. -
నిబంధనలకు తూట్లు?
శివ్వంపేట(నర్సాపూర్): అనుమతులు లేకుండా పేద, మధ్య తరగతి ప్రజలు ఏదైనా నిర్మాణ పనులు చేపడితే అంతే అధికారులు వెంటనే స్పందించి ప్రతాపం చూపిస్తారు. కానీ, బాగా పలుకుబడి ఉండి నిబంధనలు అతిక్రమించి అక్రమ నిర్మాణ పనులు చేస్తున్న బడా వ్యాపారులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్, టూరిజం కోసం పనులు చేస్తున్నా సంబంధిత అధికారులు కిమ్మనకుండా ఉండటం వెనుక ఆంతర్యమేమిటోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.బండరాళ్లను పేల్చి.. చెట్ల తొలగింపు మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామ పరిధిలోని పట్టా భూములు సర్వే నం.26, 27, 32లోని సుమారు 40 ఎకరాలను కమర్షియల్‌గా మార్చేందుకు హోటల్, టూరిజం పేరిట రెండు నెలల నుంచి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. నాలా కన్వర్షన్ చేయకుండానే భారీ నిర్మాణ పనులు చేస్తున్నారు. పచ్చని చెట్లతో నిండిపోయిన ప్రాంతాన్ని వాల్టా చట్టానికి విరుద్ధంగా భారీ చెట్లను తొలగించి రోడ్ల నిర్మించారు. పెద్ద బండరాళ్లను కంప్రెషర్‌తో పేల్చివేస్తుండటంతో సమీప రైతులు ఇబ్బందులు పడుతున్నారు.హోటల్, టూరిజం రిసార్టుల నిర్మాణాల కోసం బండరాళ్ల పేల్చివేత, చెట్ల తొలగింపు నాలా కన్వర్షన్ లేకుండానే పనులు చోద్యం చూస్తున్న అధికారులుముమ్మరంగా పనులు పచ్చని చెట్లను నేలమట్టం చేసి రోడ్లు వేయడంతోపాటు హోటల్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 40 ఎకరాల్లో హోటల్, టూరిజం కోసం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాళ్ల పేల్చివేతకు మైనింగ్, చెట్ల నరికివేతకు అటవీ, నాలా కన్వర్షన్‌కు రెవెన్యూ, నిర్మాణ పనులకు పంచాయతీ రాజ్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
చివరి గింజ వరకు కొంటాం
● ఎమ్మెల్యే సంజీవరెడ్డి ● వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంనారాయణఖేడ్/కల్హేర్(నారాయణఖేడ్): ప్రభుత్వం వరి ధాన్యం చివరిగింజ వరకూ కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్ మండలంలోని సంజీవన్‌రావుపేట, తుర్కపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో, నిజాంపేట్ మండలంలోని జంబికుంట, రాంరెడ్డిపేట్, మునిగేపల్లి గ్రామాల్లో కల్హేర్ మండలం మహదేవుపల్లి, నిజాంపేట మండలం రాంరెడ్డిపేట్, మునిగేపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...రైతులు పంట ఉత్పత్తులను దళారులకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. గతంలో క్వింటాల్‌కు 7 కిలోల వరకు తరుగుపేరిట తీసేవారని, ఇప్పుడు అలా జరగకూడదని ఆదేశించామని చెప్పారు. మద్దతు ధరతోపాటు సన్నవడ్లకు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ అందిస్తుందని తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోగా డబ్బులు జమ అవుతాయని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో కమీషన్లు బీఆర్ఎస్ పాలనలో రైసుమిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకుని పనిచేశారని సంజీవరెడ్డి ఆరోపించారు. ధాన్యం తూకంలో అధికంగా తరుగు తీసుకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. ఏడీఏ నూతన్ కుమార్, ఏవో శంకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్ అలీ, నాయకులు దత్తుగౌడ్, సాయాగౌడ్, గౌస్‌చిస్తీ తదితరులు పాల్గొన్నారు. -
మంటగలుస్తున్న మానవత్వం
వర్గల్(గజ్వేల్): ఆస్తుల ఆశలో బంధాలు బలహీనమవుతున్నాయి. మానవత్వం మంట కలుస్తున్నది. ఆత్మీయ అనురాగాలు మసకబారుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన సంతానమే కాలయములవుతున్నారు. వర్గల్ మండలం మీనాజీపేట హత్యోదంతం ఘటన తల్లీకూతుళ్ల అనుబంధానికి మచ్చగా మారింది. ఆస్తి కోసం ఓ కూతురు తల్లినే కడతేర్చిన తీరు నివ్వెరపరుస్తున్నది. నీడనిస్తున్న చెట్టునే నరికినట్లు, కుటుంబానికి అండగా నిలిచిన తల్లిని హతమార్చి, భర్తతో సహా ఆ కూతురు కటకటాల పాలైంది. అమాయకులైన ఆమె పిల్లలను, తండ్రిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. పచ్చని సంసారం.. కకావికలం వర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన మంకని బాల్‌నర్సయ్య, బాలమణి(55) దంపతులకు కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కుమారుడు గిరి చేతికందే తరుణంలో మృతిచెందాడు. కాగా పెద్దకూతురు లావణ్యకు తున్కిబొల్లారం భిక్షపతితో పెళ్లి చేశారు. తమకు మగదిక్కు లేకపోవడంతో చిన్నకూతురు నవనీత, మధు దంపతులు, వారి ముగ్గురు పిల్లలతో సహా ఇక్కడే ఉంటున్నారు. పొలం పనులను తండ్రి చూసుకుంటుండగా, తల్లి బాలమణి దినసరి కూలీగా ఆ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నది. ఈ క్రమంలో ఆస్తిలో కొంత భూమి పెద్ద కూతురు లావణ్యకు ఇవ్వాలనే తల్లిదండ్రుల ఆలోచన పచ్చని కాపురంలో చిచ్చుగా మార్చింది. మృత్యురూపమెత్తిన చిన్న కూతురు అన్నీ తానై తల్లిదండ్రులను చూసుకుంటుంటే, ఆస్తిలో కొంత భూమిని అక్కకు ఎలా ఇస్తారంటూ చిన్న కూతురు నవనీత గొడవపడింది. ఈ క్రమంలో అసలు అమ్మనే లేకుండా చేస్తే ఆస్తి తనకే మిగులుతుందని పథకం రచించింది. తన భర్త మధు, తూప్రాన్ మండలం యావాపూర్‌కు చెందిన వరుసకు సోదరుడైన రామని గౌరయ్యతో కలిసి ఈ నెల 10న ఇంట్లోనే తల్లిని ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. మృతదేహాన్ని తున్కిబొల్లారం అయ్యప్ప చెరువులో పడేసి వెళ్లిపోయారు. తరువాత అమ్మ కనపడటం లేదంటూ నాటకానికి తెరలేపింది. ఈ క్రమంలో బాలమణి మృతదేహం లభ్యమవడంతో గుట్టురట్టయింది. కూతురే ఆస్తి కోసం భర్త, మరొకరితో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తెలిసింది. చివరకు భర్తతో సహా కటకటాలపాలైంది.పసిపిల్లలతో.. బాల్‌నర్సయ్య కూతురు, అల్లుడు కలిసి చేసిన దారుణానికి తన భార్య బాలమణి కానరాని తీరాలకు చేరడంతో బాల్‌నర్సయ్య తల్లడిల్లిపోతున్నాడు. పట్టుమని ఏడేండ్ల వయసు కూడా లేని మహనీత(7), రాంచరణ్(4)ల తల్లిదండ్రులు కటకటాల పాలవడంతో, అమ్మమ్మకు ఏమైందో, తల్లిదండ్రులకు ఏమి జరిగిందో తెలియని అమాయకత్వంలో తాత పంచన ఒంటరిగా మిగిలిపోయారు. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసి నా కూతురు పుట్టెడు దుఃఖం మిగిల్చిందని బాల్‌నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పాలు తాగే ప్రాయంలో ఉన్న యేడాదిన్నర చిన్న కొడుకును తల్లి వెంటే పంపించారు.ఆస్తి కోసం దారుణం తల్లిని చంపి.. కూతురు, అల్లుడు కటకటాల్లోకి మీనాజీపేటలో ఉదంతం.. దిక్కుతోచని స్థితిలో కుటుంబం -
మంటగలుస్తున్న మానవత్వం
వర్గల్(గజ్వేల్): ఆస్తుల ఆశలో బంధాలు బలహీనమవుతున్నాయి. మానవత్వం మంట కలుస్తున్నది. ఆత్మీయ అనురాగాలు మసకబారుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన సంతానమే కాలయములవుతున్నారు. వర్గల్ మండలం మీనాజీపేట హత్యోదంతం ఘటన తల్లీకూతుళ్ల అనుబంధానికి మచ్చగా మారింది. ఆస్తి కోసం ఓ కూతురు తల్లినే కడతేర్చిన తీరు నివ్వెరపరుస్తున్నది. నీడనిస్తున్న చెట్టునే నరికినట్లు, కుటుంబానికి అండగా నిలిచిన తల్లిని హతమార్చి, భర్తతో సహా ఆ కూతురు కటకటాల పాలైంది. అమాయకులైన ఆమె పిల్లలను, తండ్రిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. పచ్చని సంసారం.. కకావికలంవర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన మంకని బాల్‌నర్సయ్య, బాలమణి(55) దంపతులకు కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కుమారుడు గిరి చేతికందే తరుణంలో మృతిచెందాడు. కాగా పెద్దకూతురు లావణ్యకు తునికి బొల్లారం భిక్షపతితో పెళ్లి చేశారు. తమకు మగదిక్కు లేకపోవడంతో చిన్నకూతురు నవనీత, మధు దంపతులు, వారి ముగ్గురు పిల్లలతో సహా ఇక్కడే ఉంటున్నారు. పొలం పనులను తండ్రి చూసుకుంటుండగా, తల్లి బాలమణి దినసరి కూలీగా ఆ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నది. ఈ క్రమంలో ఆస్తిలో కొంత భూమి పెద్ద కూతురు లావణ్యకు ఇవ్వాలనే తల్లిదండ్రుల ఆలోచన పచ్చని కాపురంలో చిచ్చుగా మార్చింది. మృత్యురూపమెత్తిన చిన్న కూతురుఅన్నీ తానై తల్లిదండ్రులను చూసుకుంటుంటే, ఆస్తిలో కొంత భూమిని అక్కకు ఎలా ఇస్తారంటూ చిన్న కూతురు నవనీత గొడవపడింది. ఈ క్రమంలో అసలు అమ్మనే లేకుండా చేస్తే ఆస్తి తనకే మిగులుతుందని పథకం రచించింది. తన భర్త మధు, తూప్రాన్ మండలం యావాపూర్‌కు చెందిన వరుసకు సోదరుడైన రామని గౌరయ్యతో కలిసి ఈ నెల 10న ఇంట్లోనే తల్లిని ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. మృతదేహాన్ని తునికి బొల్లారం అయ్యప్ప చెరువులో పడేసి వెళ్లిపోయారు. తరువాత అమ్మ కనపడటం లేదంటూ నాటకానికి తెరలేపింది. ఈ క్రమంలో బాలమణి మృతదేహం లభ్యమవడంతో గుట్టురట్టయింది. కూతురే ఆస్తి కోసం భర్త, మరొకరితో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తెలిసింది. చివరకు భర్తతో సహా కటకటాలపాలైంది.పసిపిల్లలతో.. బాల్‌నర్సయ్య కూతురు, అల్లుడు కలిసి చేసిన దారుణానికి తన భార్య బాలమణి కానరాని తీరాలకు చేరడంతో బాల్‌నర్సయ్య తల్లడిల్లిపోతున్నాడు. పట్టుమని ఏడేండ్ల వయసు కూడా లేని మహనీత(7), రాంచరణ్(4)ల తల్లిదండ్రులు కటకటాల పాలవడంతో, అమ్మమ్మకు ఏమైందో, తల్లిదండ్రులకు ఏమి జరిగిందో తెలియని అమాయకత్వంలో తాత పంచన ఒంటరిగా మిగిలిపోయారు. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసి నా కూతురు పుట్టెడు దుఃఖం మిగిలి్చందని బాల్‌నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పాలు తాగే ప్రాయంలో ఉన్న యేడాదిన్నర చిన్న కొడుకును తల్లి వెంటే పంపించారు. -
వైద్యంలో విప్లవాత్మక మార్పులు
హుస్నాబాద్: నాలుగు జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న హుస్నాబాద్‌లో వైద్య పరంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణంలో రూ.82 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 250 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో ఎనిమిదిమంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని, నెల రోజుల్లో 38 మంది రానున్నారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు వైద్యపరంగా ఎవరూ ఆందోళన చెందవద్దని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మాదిరిగా అన్ని రకాల శస్త్ర చికిత్సలు, వైద్య సేవలు అందుతాయన్నారు. జిల్లా కేంద్రాల్లో తప్ప 250 పడకల ఆస్పత్రి హుస్నాబాద్‌లోనే ఏర్పాటు కానుందని తెలిపారు. అందుకనుగుణంగా నర్సింగ్ కళాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. మినీ స్టేడియంను విస్తరించి స్విమ్మింగ్‌పూల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పట్టణంలో అర్బన్పార్క్తోపాటు మహాసముద్రం గండి సుందరీకరణ కోసం రూ.10 కోట్ల మంజూరుకు జీవో వస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి నుంచి హుస్నాబాద్‌కు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాలువల నిర్మాణ భూ సేకరణకు రైతులు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్టీఓ రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్‌రెడ్డి తదితరులున్నారు. నెలరోజుల్లో 38 మంది వైద్యులను నియమిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ -
భార్య కాపురానికి రావడం లేదని..
ఉమ్మడి జిల్లాలో ఐదుగురు వేర్వేరు కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. హవేళిఘణాపూర్(మెదక్): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని ముత్తాయికోటలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పార్థిగల్ల శివరాజ్(29) మూడేళ్ల క్రితం శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన అఖిలతో వివాహమైంది. కొంత కాలంగా సంసారం విషయంలో ఇంట్లో గొడవలు జరగగా భార్య అఖిల తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన శివరాజ్ ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు తలుపులు పగులగొట్టి మెదక్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మద్యం మత్తులో.. మద్యం మత్తులో వ్యక్తి.. ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన కుమార్(34) రెండేళ్ల క్రితం బతుకు దెరువు నిమిత్తం మెదక్ మండలం పాతూర్ గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూలీ పనికి వెళ్లొస్తానని చెప్పిన కుమార్ మందు తాగా వచ్చి నిత్యంలాగే ఇంట్లో పడుకున్నాడు. ఉదయం చూసేసరికి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. గమనించిన భార్య నిర్మల కిందకు దించి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. మృతునికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఇంట్లో గొడవపడిన మహిళ.. పాపన్నపేట(మెదక్): నదిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏడుపాయల్లో మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... రామాయంపేట మండలం కోమట్‌పల్లికి చెందిన రేణమ్మ (45) సోమవారం ఇంట్లో గొడవపడి ఏడుపాయలకు వచ్చింది. మొదటి బ్రిడ్జి దగ్గర మంజీరా నదిలో దూకింది. కాగా మంగళవారం సాయంత్రం నదిలో ఆమె శవం కనిపించడంతో పోలీసులు ఆమె భర్త మల్లేశ్‌కు సమాచారం అందించారు. పాలడుగులో పశువుల కాపరి...వట్పల్లి(అందోల్): పశువుల కాపరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని పాలడుగు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీహరి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన హరిజ అశోక్(50)కు భార్య అపురూపతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 20 ఏళ్ల క్రితం సంసార విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో పిల్లలను తీసుకొని భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో అశోక్ గ్రామంలో పశువుల కాపరిగా పనిచేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. సోమవారం తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు బంధువులకు సమాచారం అందించారు. మృతుని అక్క శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి పురుషాంగం ప్రదేశంలో, కాళ్లపై రక్తపు మరకలు ఉన్నాయని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య -
జోరుగా జూదం
విచ్చలవిడిగా బొమ్మ బొరుసు జూదంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అలవాటు పడ్డ వ్యక్తులు ఇప్పుడు కొత్తగా బొమ్మ, బొరుసు ఆటకు తెరలేపారు. ఐదు నుంచి పదిమంది గ్రూపులుగా ఏర్పడి రహస్య ప్రదేశాలు, రాత్రి పొద్దు పోయాక ఆటలో నిమగ్నమవుతున్నారు. చీకట్లో క్యాండిల్స్, ఫోన్ టార్చ్‌లైట్ మధ్య బొమ్మ బొరుసు ఆడుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఒక్క ఎనగండ్లలోనే ప్రతిరోజు 10 గ్రూపులు ఈ ఆట ఆడుతున్నట్లు సాక్షి నిఘాలో వెలుగులోకి వచ్చింది. కొంతమంది అయితే తెల్లవారితే గాని ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బొమ్మ బొరుసు ఆటలో డబ్బులు పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకొని రాత్రి పెట్రోలింగ్‌తోపాటు ఆట ఆడే వారు, వారికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత మహిళలు డిమాండ్ చేస్తున్నారు.● బొమ్మ బొరుసుతో జేబులు ఖాళీ ● రాత్రి 10 దాటితే గుంపులుగా ఆట ● ఎనగండ్లలో వేలల్లో పందెం ● కానరాని పోలీసుల నిఘా!కొల్చారం(నర్సాపూర్): జూదంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు వరుస దాడులతో బెంబేలెత్తిన జూదరులు, ఇప్పుడు కొత్త ఆటకు తెర లేపారు. రాత్రి పది దాటితే గ్రూపులుగా ఎక్కడికక్కడ మొబైల్ లైట్ వెలుతురులో బొమ్మ, బొరుసు ఆడుతూ వేళల్లో పందెం కాస్తున్నారు. మండలంలోని ఎనగండ్ల గ్రామంలో ఆడుతున్నట్లు సాక్షి నిఘాలో వెల్లడైంది. మండలంలో ఇటీవల రంగంపేట, ఎనగండ్ల గ్రామాల శివారులో విచ్చలవిడిగా జూదం ఆడిన చాలా కుటుంబాలు వీధిన పడిన ఘటనలున్నాయి. దీంతో ఆ కుటుంబాల సభ్యులు జిల్లా పోలీసులకు సమాచారం అందించడంతో, ఎస్పీ ఆధ్వర్యంలో జూదం ఆట కట్టించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా సమాచారంతో జూదం ఆడుతున్న ప్రదేశాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సదరు జూదరులపై కేసులు సైతం నమోదు చేశారు. దీంతో గత నెల రోజుల నుంచి ఈ ప్రాంతాల్లో జూదం తగ్గుముఖం పట్టింది. -
వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
మిరుదొడ్డి(దుబ్బాక): గుంతలమయమైన రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అందె జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు డిమాండ్ చేశారు. మిరుదొడ్డి నుంచి అందె, ఇక్కడి నుంచి కొండాపూర్ మీదుగా దుబ్బాక మండలం తిమ్మాపూర్, అందె గ్రామం స్టేజీ వరకు ఉన్న రోడ్లకు మరమ్మతులు చేట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జేఏసీ సభ్యులు మిరుదొడ్డి తహశీల్దార్, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రానికి పలు పనుల నిమిత్తం ప్రయాణికులు, రైతులు, కళాశాలలు, పాఠశాలలకు విద్యార్థులు, తదితరులు రాకపోకలు సాగిస్తారని తెలిపారు. అందె నుంచి మిరుదొడ్డి వరకు కంకర తేలి రోడ్డు గుంతలమయంగా మారిందని, దీంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల సమస్యకు పరిష్కారం చూపకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు లింగం, ప్రవీణ్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు సోమేశ్వర్‌రెడ్డి, భైరయ్య, సత్యం, రాజేందర్, యాదగిరి, కరుణాకర్, సాయికుమార్‌రెడ్డి, చందు, రాములు, నాగేశ్వర్‌రెడ్డి, రాజ్‌కుమార్, శ్రీనివాస్, నర్సింగరావు, కుమార్, కృష్ణ, బాలకనకయ్య తదితరులు పాల్గొన్నారు.లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం -
శభాష్ పోలీస్..
జహీరాబాద్ టౌన్: ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు కాపాడారు. ఎస్ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... మండలంలోని బుర్దిపాడ్కు చెందిన ఏ.సంతోష్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ తగాదాల కారణంగా భార్య నాగరాణి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పిల్లలు దీపక్‌రెడ్డి, అక్షయలతో కలిసి జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టులో దూకేందుకు అక్కడికి వెళ్లింది. వారిని చూసిన స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన ఎస్ఐ.కాశీనాథ్ వెంటనే కాస్టేబుళ్లు శివరాజ్, మోహన్‌రాజ్‌లను ప్రాజెక్టు వద్దకు పంపించారు. వారితో మాట్లాడి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు యత్నించిన మహిళ కాపాడిన పోలీసులు -
పేకాట స్థావరాలపై ఉక్కుపాదం
ఉమ్మడి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జూదం ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు. చేగుంట(తూప్రాన్) /కల్హేర్(నారాయణఖేడ్)/న్యాల్కల్(జహీరాబాద్): పేకాట ఆడుతున్న పలువురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి చేగుటంలో పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 8 మందిని అరెస్టు చేసి, ఏడు సెల్ఫోన్లు, రూ.58 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కల్హేర్ మండలంలోని మాసాన్‌పల్లిలో పేకాట ఆడుతున్న 8 మందిని, సిర్గాపూర్ మండలం కడ్పల్ తండా సమీపంలో 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. న్యాల్కల్ మండలలోని ముర్తుజాపూర్ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5,770 నగదుతో పాటు పేకాట ముక్కలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్‌లో 55 మంది..కంగ్టి(నారాయణఖేడ్)/ రామచంద్రాపురం(పటాన్చెరు)/ జహీరాబాద్ టౌన్: కంగ్టి మండలంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని, తెల్లాపూర్‌లో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రూ.3, 36,500, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 85,550 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. -
అంత్యక్రియలకు వెళ్లి స్నానం చేస్తుండగా..
హవేళిఘణాపూర్(మెదక్): స్నానం చేసేందుకు వెళ్లిన బాలుడు మునిగిపోగా, అతడిని కాపాడే ప్రయత్నంలో మరొక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పేరూర్ గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ అంత్యక్రియలకు కృష్ణ(16), చింతకింది భీమయ్య(48) వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్నానం చేసేందుకు మంజీరా వాగు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో స్నానం చేస్తూ కృష్ణ నీటమునిగాడు. అతడ్ని కాపాడే ప్రయత్నంలో భీమయ్య కూడా నీటమునిగి మృతి చెందాడు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు పుష్కలంగా ఉండటంతోపాటు అక్కడ నది లోతుగా ఉందని పోలీసులు తెలిపారు. అస్థికలు కలుపడానికి వెళ్లి.. పుల్కల్(అందోల్): అస్థికలు కలుపడానికి వెళ్లిన వ్యక్తి కాలు జారి నదిలో పడిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మిర్జాగూడకు చెందిన దండారియ ధరంసింగ్, మదయ్య సూరజ్‌సింగ్ బంధువుల అస్థికలు కలుపడానికి సోమవారం సింగూరు ప్రాజెక్టుకు వెళ్లారు. అస్థికల క్రతువు పూర్తయిన తర్వాత మదయ్య సూరజ్ సింగ్(52) స్నానానికని ప్రాజెక్టు దిగువభాగంలో బండరాళ్లపై నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలి జారి నీటిలో పడిపోయాడు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి నీరు రావడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో రెండు రోజుల నుంచి కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్ద గల్లంతైన సూరజ్‌సింగ్ కోసం మత్స్యకారుల సహాయంతో వెతుకుతున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ విశ్వజన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మంజీరా వాగులో పడి ఇద్దరు మృతి -
తల్లిదండ్రులు మందలిస్తారనే..
శివ్వంపేట(నర్సాపూర్): విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని కొంతన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బాడిగే మల్లేశ్‌కు ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. చిన్న కూతురు రోజా(16) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. కొన్నాళ్ల నుంచి దొంతి గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా తండ్రికి తెలిసి మందలించాడు. ఈ నెల 19న తల్లిదండ్రులు ఊరికి వెళ్లడంతో రోజా ఇంటి వద్ద ఉండటంతో ప్రశాంత్ వచ్చి మాట్లాడగా కాలనీవాసులు చూశారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారనే భయంలో ఇంట్లో ఉరి వేసుకుంది. మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలు
దుబ్బాకటౌన్: రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలను పంపిణీ చేస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ ఏడీఏ బాబు నాయక్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు జాతీయ నూనె గింజల పథకం కింద పొద్దు తిరుగుడు రకం తిల్హన్ టెక్ ఎస్యుఎన్హెచ్ – 1 విత్తనాల 2.50 కేజీలకు సబ్సిడీ పోను రూ. 85.20 కే ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్‌బీఈజీ–47 శనగ రకాలు, సీటీ – 4260 మొక్కజొన్న రకం విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయన్నారు. పాస్‌బుక్, ఆధార్ కార్డు జీరాక్స్‌తో వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ నరేశ్, ఏఈవోలు ప్రవీణ్ ఉన్నారు.ఏడీఏ బాబు నాయక్ -
సాగు.. బాగు
వాణిజ్య పంట అయిన ఆయిల్‌పామ్ సాగు వైపు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మార్కెట్లో వంటనూనెకు అధిక డిమాండ్ ఉండటంతో మన దేశంలో పండించేందుకు శ్రీకారం చుట్టింది. ఎకరాకు రూ.52 వేల సబ్సిడీతో ఒక్క రైతుకు 12 ఎకరాలకు వరకు ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్‌జోన్:మెదక్ జిల్లాలో 5 లక్షల పైచిలుకు భూములుండగా వాటిలో సుమారు 4 లక్షల వరకు వరి, మరో 40 వేల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కాగా మన దేశంలో వంటనూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ప్రతి ఏటా లక్ష కోట్లు వెచ్చించాల్సి వస్తోందని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పామ్ సాగుకు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందించి ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నాయి. ఈ మేరకు ఎకరాకు రూ. 52 వేల సబ్సిడీ ఇస్తూ ఒక్కో జిల్లాకు టార్గెట్ పెట్టారు. దీంతో హార్టికల్చర్ అధికారులు రైతులను సాగుకు మొగ్గు చూపేలా అవగాహన కల్పిస్తున్నారు. సబ్సిడీ ఇలా.. ఆయిల్ పామ్ పంట సాగు చేశాక 4 ఏళ్ల తరువాత పంట చేతికి వస్తుంది. అప్పటి వరకు ఒక్క ఎకరాకు నాలుగేళ్ల వరకు రూ. 52 వేల సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం సబ్సిడీని అందిస్తోంది. ఎకరంలో 57 మొక్కలు నాటాలి. ఒక్కో మొక్క ధర రూ. 213 కాగా రూ.12,141 అవుతుంది. ఇందులో రైతు వాటాగా ఒక్కో మొక్కకు రూ. 20 చొప్పున 1,140 మాత్రమే చెల్లించాలి. మిగతా రూ. 11,001 సబ్సిడీని ప్రభుత్వాలు అందిస్తున్నాయి. డ్రిప్ కోసం ఎకరాకు రూ.20 వేల సబ్సిడీ, ఏడాదికి ఎకరాకు రూ. 4,200 చొప్పున నాలుగేళ్లకు మొక్కల సంరక్షణకు 16,800, ఎరువులకు కలిపి మొత్తం ఎకరాకు నాలుగేళ్లలో రూ. 52 వేల సబ్సిడీ వస్తుంది.2,500 ఎకరాలు టార్గెట్ ఈ ఏడాది జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1,300 ఎకరాల్లో సాగుకు రైతులు ఆన్‌న్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 530 ఎకరాల్లో సాగు పూర్తికాగా, ఇంకొందరు పంట సాగులో నిమగ్నమయ్యారు. కాగా ఒక్క రైతు 12 ఎకరాలకు మాత్రమే డ్రిప్‌పై సబ్సిడీ ఉంటుంది. ఆయిల్‌పాం సాగుకు అధిక సబ్సిడీ ఎకరాకు రూ. 52 వేల ప్రోత్సాహం 40 ఏళ్లపాటు దిగుబడి జిల్లాలో 530 ఎకరాల్లో సాగులక్ష్యం పూర్తి చేస్తాం ఈ ఏడు జిల్లాకు 2,500 ఎకరాలు టార్గెట్ విధించారు. ఈ పంట సాగు చేసేందుకు రైతులు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు 530 ఎకరాలు పూర్తయింది. మార్చి వరకు లక్ష్యం పూర్తి చేస్తాం. – ప్రతాప్‌సింగ్, హార్టికల్చర్, జిల్లా అధికారి -
రూ.వేలు ఖర్చవుతున్నాయి
ప్రతీ ఏటా పంటల సీజన్లో టార్పాలిన్ల అద్దెకోసం రూ.ఆరు వేల వరకు వేలు ఖర్చవుతున్నాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వమే సబ్సిడీపై సరఫరా చేయాలి. ఇప్పటికే సమస్యల్లో కూరుకుపోయిన తమకు అదనపు భారంగా మారింది. –లాల్య నాయక్, చౌకత్పల్లి తండా ఉచితంగా సరఫరా చేయాలి ప్రతీ రైతుకు ప్రభుత్వమే ఉచితంగా టార్పాలిన్లు సరఫరా చేయాలి. ఇవి అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాలనుంచి అద్దెకు తెచ్చుకుంటున్నాం. ఈ భారాన్ని తమపై మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – కంలియా నాయక్, దంతేపల్లి తండా గతంలోనే రద్దయిందిరైతులకు సబ్సిడీపై టార్పాలిన్ల పంపిణీ పథకం నాలుగేళ్ల క్రితమే రద్దయింది. పథకాన్ని పునరుద్ధరించాలని చాలామంది రైతులు కోరుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి మంజూరైతే ఇస్తాం. –రాజ్‌నారాయణ, ఏడీఏ, రామాయంపేట -
శనగ సాగు తరుణమిదే!
● యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు ● 20 వేల ఎకరాల్లో సాగు అంచనా ● ఇప్పటికే ప్రారంభమైన విత్తన నాట్లు జహీరాబాద్ టౌన్: పప్పు దినుసులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కంది తర్వాత రబీలో రైతులు శనగ పంట అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఈ పంట సాగుకు ఇదే సరైన తరుణం కావడంతో రైతులు అందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా శనగ, జొన్న, వరి, కుసుమ, గోధుమ తదితర పంటలను రబీలో సాగు చేస్తుంటారు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు ఈ పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సన్నద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు నాటడం ప్రారంభించారు. నల్ల రేగడి భూముల్లో పంట సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయనిపుణులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో అధికంగా సాగు.. జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో శనగ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ నెలాఖరు వరకు అనుకూల సమయం కావడంతో విత్తనాలు విత్తుకోవచ్చు. తర్వాత వేస్తే దిగుబడులు తగ్గుతాయి. విత్తనం విత్తుకోవడంలో ఆలస్యమైతే పూత దశలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పూత రాలిపోతుంది. మంచు ఆధారంగా పండే పంట, నల్లరేగడి నేలల్లో తేమను ఉపయోగించుకుని మొక్కులు పెరుగుతాయి. చౌడు నేలలు పనికిరావు. పూత, కాత సమయల్లో సరిపడ నీరు అందించినా సరిపోతుంది. విత్తన రకాలివే.. కేఏకే 2, జేజీ 11,శ్వేత 2, జ్యోతి, కేఏకే –2, క్రాంతి, అన్నెగిరి, తదితర విత్తన రకాలు మేలైనవి. స్వల్పకాలిక పంట అయినందున విత్తన రకాలను బట్టి 85–100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 40 కిలోల విత్తనాలు సరిపోతుంది. ఎకరాకు 6 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. విత్తిన నెల రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. 30 నుంచి 35 రోజుల దశలో గొర్రుతో అంతరకృషి చేసి కలుపు నివారించుకోవచ్చు. విత్తే ముందు ఫ్లూకోరాలిన్ 45% మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. పంటకు పచ్చ, రబ్బరు పురుగు బెడద అధికంగా ఉంటుంది. ఎండు తెగుళ్లు, వేరు తెగుళ్లు సోకుతాయి. విత్తనాలు. తెగుళ్ల నివారణకు అందుబాటులో ఉన్న వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి. -
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: పేద వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురికి ఆస్పత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని గుర్తు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహ్మారెడ్డి నాయకులు అవుటి శంకర్ పాల్గొన్నారు. ఖేడ్ ఆర్టీసీ డీఎంగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఖేడ్ ప్రాంతంలో ఆయా రూట్లలో పలు బస్సులు నడపాల్సిన గ్రామాలను గురించి వారు చర్చించారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో దీపావళిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులు లక్ష్మిపూజ నిర్వహించారు. పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి శివాలి జోహ్రి శ్రీవాస్తవ ఆమె తల్లి కవితా జోహ్రి శ్రీవాస్తవతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఒరిగామి ప్రదర్శన చేసి రెండు సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించారు. ఈ తాజా రికార్డుతో, శివాలి మొత్తం 21 గిన్నిస్ వరల్డ్ రికార్డులకు చేరుకుని దేశంలోనే అత్యధిక సంఖ్యలో గిన్నిస్ రికార్డులు కలిగి ఉన్న వ్యక్తిగా నిలిచింది. గతంలో శివాలి 19 గిన్నిస్ రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే. గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, పలువురు అధ్యాపకులు, వి ద్యార్థులు శివాలిని అభినందించారు. జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి న్యాల్కల్(జహీరాబాద్): రైతులకు సకాలంలో విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా మండలానికి 350 బస్తాలు శనగ విత్తనాలు, 5 క్వింటాళ్ల కుసుమ విత్తనాలు వచ్చాయని వెల్లడించారు. విత్తనాలు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో రైతు వేదిక వద్దకు మంగళవారం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విత్తనాలను న్యాల్కల్లోని రైతు వేదికల్లో రైతులకు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మ, ఏఈఓలు సాయిలు, హీనా, రైతులు పాల్గొన్నారు. నర్సాపూర్: విద్యుత్ సమస్యలను గుర్తించేందుకే తమ శాఖ ప్రజాబాట కార్యక్రమం చేపట్టిందని మెదక్ డీఈ బాషా, ఏడీఈ రమణరెడ్డి చెప్పారు. మంగళవారం పట్టణంలో ప్రజా బాట కార్యక్రమాన్ని డీఈ ప్రారంభించారు. ప్రజాబాటలో పలు సమస్యలను గుర్తించామని, వాటిని రెండు విభాగాలు విభజించామని చెప్పారు. బడ్జెట్‌తో కూడుకున్న సమస్యలకు నిధులు రాగానే పరిష్కరిస్తామన్నారు. బడ్జేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని రమణరెడ్డి తెలిపారు. పలు వీధుల్లో కండక్టర్ వైరు పాతబడిందని, దానిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఏఈ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణ వేగవంతం చేయాలి
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఏర్పాటు కానున్న నిమ్జ్, టీజీఐఐసీ కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, జహీరాబాద్ డివిజన్లలో జరుగుతున్న టీజీఐఐసీ, నిమ్జ్ భూసేకరణ పనుల పురోగతిపై ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు, టీజీఐఐసీ, నిమ్జ్ అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. నిమ్జ్ ప్రాజెక్టు మొదటి దశ ఏర్పాటుకు ఇప్పటివరకు 1,501 ఎకరాల భూసేకరణ పూర్తి చేసినట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన భూమిని సైతం త్వరలోనే సేకరించి అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...భూసేకరణకు అవసరమైన నిధులు టీజీఐఐసీ తక్షణం చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భూసేకరణకు నిధుల కొరత లేదని తెలిపారు. ఇప్పటివరకు టీజీఐఐసీ, నిమ్జ్ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీల ప్రకారం పరిహారం అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, సంగారెడ్డి, జహీరాబాద్ ఆర్డీఓలు, టీజీఐఐసీ ప్రతినిధులు, నిమ్జ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య -
పప్పు ధాన్యాల సాగు పెంచాలి
జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ఝరాసంగం(జహీరాబాద్): నూనె గింజలతో పాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన ఝరాసంగంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో అధిక దిగుబడులు ఇచ్చే పప్పు దిను సుల వంగడాలపై రైతులకు అవగాహన కల్పించారు. మండలానికి మంజూరైన 10 క్వింటాళ్ల కుసుమ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విత్తనోత్పత్తి కార్యక్రమాలపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అధికారుల సూచనలు సలహాలు పాటించి పంటల్లో అధిక దిగుబడులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్, ఏఈఓలు, రైతులు, పాల్గొన్నారు. -
నూనె గింజల ఉత్పత్తిని పెంచాలి
మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్రేగోడ్(మెదక్)/పాపన్నపేట(మెదక్): నూనె గింజల ఉత్పత్తులను పెంచాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రేగోడ్లోని రైతువేదిక కార్యాలయంలో మంగళవారం నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అమలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ అధికారి, రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. పొద్దుతిరుగుడు 93%, శనగ విత్తనాలు 50% రాయితీతో ఎంపిక చేసిన రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా అధిక దిగుబడి సాధించడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. ప్రతీ రైతు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నూనెగింజల ఉత్పత్తి ద్వారా స్థానిక సాధికారతను సాధించి దిగుమతులను తగ్గించుకోవచ్చని తెలిపారు. -
పంట ఆరబోసేదెలా?
● టార్పాలిన్లు లేక ఇబ్బందులపాలవుతున్న రైతులు ● అద్దెకు తెచ్చుకుంటున్న రైతులపై అదనపు భారం గతంలో మాదిరిగా ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్లు ఇవ్వకపోడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ సీజన్లో ఒక్కొక్కరిపై కనీసం రూ.రెండు వేల నుంచి మూడున్నర వేలవరకు భారం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రామాయంపేట(మెదక్): పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికిగాను ప్రస్తుత పరిస్థితుల్లో టార్పాలిన్లు అత్యవసరం. గతంలో ప్రభుత్వం 50% రాయితీపై వాటిని సరఫరా చేసింది. గత నాలుగైదేళ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. టార్పాలిన్లు లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ధాన్యం ఆరబోస్తున్న రైతులు ఇబ్బందులపాలవుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అద్దైపె టార్పాలిన్లు అందించే వారిని ఆశ్రయిస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయశాఖ ద్వారా టార్పాలిన్లు సరఫరా చేసింది. ఎనిమిది అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు ఉన్న టార్పాలిన్ల అసలు ధర రూ.2,500 కాగా, రైతులకు రూ.1,250 కే అందజేసింది. రెండు, మూడేళ్లపాటు ఈ పథకం కొనసాగగా, పెద్ద సంఖ్యలో రైతులు వాటిని కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో టార్పాలిన్లను సబ్సిడీపై అందజేయగా, గత నాలుగేళ్ల క్రితం ఈ పథకం రద్దయింది. రైతన్నలకు అదనపు ఖర్చు ఆంధ్రప్రదేశ్‌నుంచి వచ్చిన వ్యాపారులు కొందరు జిల్లాలోని పెద్ద గ్రామాలు, పట్టణాల పరిధిలో టార్పాలిన్లు అద్దెకు ఇచ్చే దుకాణాలు ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా పరిధిలో 80 వరకు తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకుని అద్దెకు ఇస్తున్నారు. రైతుల ఆధార్ కార్డులు తనఖా పెట్టుకుని టార్పాలిన్లు ఇస్తూ ఒక్కోదానికి రోజూ రూ.25 నుంచి రూ.30 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికిగాను సాధారణంగా ప్రతీ రైతుకు కనీసం ఆరు నుంచి పది టార్పాలిన్లు అవసరం అవుతుండగా, వాటిపై ప్రతీ రోజు రూ.300 వరకు భారం పడుతోంది. పంట నూర్పిడి చేయడం, ఆరబెట్టడం, సంచుల్లో నింపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించడానికి రైతులకు కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన రైతులపై టార్పాలిన్ల అద్దె కోసం రూ.ఆరు వేల వరకు ఖర్చవుతుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు. -
పోలీసు అమరుల త్యాగం మరువలేం
● కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ ● అమరులకు నివాళులర్పించిన అధికారులు సంగారెడ్డి జోన్: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగం విస్మరించలేనిదని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ ఎస్పీతోపాటు అధికారులు హాజరై ఘనంగా నివాళులర్పించి అమరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పోలీస్ అంటేనే ధైర్యానికి చిరునామా అని, విధి నిర్వహణలో తమ విలువైన ప్రాణాలు ప్రజల కోసం త్యాగం చేశారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ధైర్య సాహసాలే కీలకమని చెప్పారు. అమరుల కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్‌రావు, డీఎస్పీలు సత్తయ్యగౌడ్, సైదా నాయక్, ప్రభాకర్, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఫైనాన్స్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య
నంగునూరు(సిద్దిపేట): ఫైనాన్స్ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని బద్దిపడగలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు... గ్రామానికి చెందిన అవేటి వినోద్ కుమార్ (28) ఆరు నెలల కింద ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో రూ.50 వేలు చెల్లించి రూ .4.50 లక్షల లోన్‌తో డోజర్ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అది సరిగా నడవకపోవడంతో ఈఎంఐలు కట్టలేదు. దీంతో డబ్బులు కట్టాలని ఫెనాన్స్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. అతనికి భార్య రేఖ, కూతురు కీర్తన, కుమారుడు అక్షిత్ ఉన్నారు. కడుపునొప్పి భరించలేక.. మునిపల్లి(అందోల్): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బుదేరా ఏఎస్ఐ ఎం. రవి వివరాల ప్రకారం... మండలంలోని ఇబ్రాహీంపూర్ గ్రామానికి చెందిన ఎండీ దుదేకుల మదార్ పాషా (42)కు కొంత కాలంగా కడుపునొప్పి వస్తోంది. దీంతో ఆయన తరచు మద్యం తాగేవాడు. ఈ క్రమంలో ఆదివారం కడుపునొప్పి రావడంతో తాగిన మత్తులో వ్యవసాయ పొలం దగ్గర ఉన్న చింతచెట్టుకు తాడుతో చెట్టుకు ఉరివేసుకున్నాడు. అప్పులు తీర్చలేక... మెదక్ మున్సిపాలిటీ: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబీకుల కథనం మేరకు... మెదక్ పట్టణంలోని పెద్ద బజార్ వీధికి చెందిన నరేశ్‌చారి(40) కులవృత్తిపై ఆధారపడి భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. నిత్యం బంగారం ధరలు పెరుగుతుండటంతో ఉపాధి దొరకడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీనికి తోడు కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నరేశ్ చారి తన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో.. వెల్దుర్తి(తూప్రాన్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మేడ్చల్మె నాగరాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆటో ఫైనాన్స్ డబ్బులు కట్టడానికి ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబంలో చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. -
మంచి అవకాశం
రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించిన వాట్సాప్ ఛానల్ చాలా బాగుంది. రైతులకు కావాల్సిన పూర్తి సమాచారం ఇందులో దొరుకుతుంది. ఏ సీజన్లో ఎలాంటి పంటలు వేయాలి. ఎలాంటి మందులు ఎంత మోతాదులో వాడాలి. పంటల సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు వంటి అంశాలపై సూచనలు పొందవచ్చు. – శ్యామ్, రైతు,తొగిట, హవేళిఘనాపూర్ అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలో 76 క్లస్టర్లు ఉన్నాయి. ఆయా క్లస్టర్ల పరిధిలోని ఏఈఓల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. స్మార్ట్ ఫోన్లు ఉన్న రైతులంతా ఛానల్లో చేరేలా కృషి చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 30శాతం రైతులు ఈ ఛానల్లో చేరారు. రైతులంతా ఛానల్లో చేరి అవసరమైన వ్యవసాయ సమాచారం పొందాలి. – దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, మెదక్ -
బాణాసంచా ధరలు.. పేలుతున్నాయ్
సంగారెడ్డి క్రైమ్: దీపావళి అంటేనే సిరుల పండుగ. దీప కాంతులు, బాణాసంచా వెలుగుల మధ్య పండుగను జరుపుకుంటారు. పట్టణంలో దీపావళి సందడి మొదలైంది. వేడుకలకు బాణాసంచా వేదిక అవుతుండగా వాటి కొనుగోళ్లు మార్కెట్లో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మండే మార్కెట్, మహిళా ప్రాంగణం ఎదురుగా, పీఎస్ఆర్ గార్డెన్లో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. పట్టణంలో చిన్నారులకు ఎంతో ఇష్టమైన చిచ్చుబుడ్లకు, తారాజువ్వలకు భారీ డిమాండ్ పెరిగింది. అలాగే కాకరవొత్తులు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయినా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కోసం అటు పిల్లలు ఇటు పెద్దలు ఆనందం కోసం వెచ్చించక తప్పడం లేదు. ఆ కారణంగానే దుకాణాలకు వెళ్లే వినియోగదారులపై ధరల మోత మోగుతోంది. టపాకాయల అమ్మకాలు లేక సతమతమవుతున్న వ్యాపారులు ఇదే అదునుగా అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. 20% ధరలు పెరుగుదల గత సంవత్సరంతో పోలిస్తే టపాకాయలకు ఈసారి ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లో ఏకంగా 20 నుంచి 30% మేర ధరలు పెంచారు. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు టపాసులు కొనుగోలు తగ్గించారు. పట్టణంలో టపాకాయల ధరలు చిచ్చుబుడ్ల బాక్సు ధర రూ.200 నుంచి 600, తౌజెండ్ వాలా రూ. 600 నుంచి 1500, 5 తౌజెండ్ వాలా రూ. 3వేల నుంచి 3500 వరకు, భూచ్రకాలు బాక్స్ సైజును బట్టి రూ.50 నుంచి 300, 30 షార్ట్స్ రూ. వెయ్యి నుంచి 2 వేలు, రాకెట్లు బాక్సు ధర రూ.150 నుంచి 1500, మిర్చి ప్యాకెట్ ధర రూ.50 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే వీటి ధరలో 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అలాగే గతంతో పోలిస్తే విక్రయాలు కూడా భారీగా పడిపోయాయని పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే పెరిగిన ధరలు విక్రయాలు భారీగా తగ్గాయి మార్కెట్లో చిన్న పిల్లలకు అటు యువతకు నచ్చేలా అన్ని రకాల టపాకాయలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది దుకాణాల సంఖ్య పెరగడంతో విక్రయాలు భారీగా తగ్గాయి. దీంతో ఆశించిన మేర లాభాలు రావడం లేదు. – ఆకాశ్, దుకాణదారుడు, సంగారెడ్డి -
వృద్ధురాలిపై పైసాచిక దాడి
వట్పల్లి(అందోల్): డబ్బుల కోసం కన్న తల్లిని కర్రలతో కొట్టగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో ఇద్దరు కొడుకులు, నలుగురు మనవళ్లను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించారు. ఆదివారం సీఐ అనిల్‌కుమార్, ఎస్ఐ లవకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని మర్వెళ్లి గ్రామానికి చెందిన చాకలి బసమ్మ(80) ఈనెల 1వ తేదీన అరుగుపై పడుకొని కిందపడి అనారోగ్యానికి గురైదని 3వ తేదీన సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 4న ఆమె మృతి చెందింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. కాగా వృద్ధురాలికి ఛాతి, ఇతర భాగాల్లో రక్తపు గాయాలై మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. దీంతో జోగిపేట సీఐ అనిల్‌కుమార్ గ్రామానికి వెళ్లి కుమారులను విచారించగా తమ తల్లి పోషణ విషయంలో తరుచుగా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతోపాటు రైతుబంధు, పింఛన్ డబ్బుల విషయంలో గొడవపడ్డామని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు కుమారులు చాకలి బసయ్య, చాకలి వెంకయ్యతో పాటు మనువళ్లు అంబయ్య, నర్సింహులు, మోహన్, రాజు మద్యం మత్తులో వృద్ధురాలిని కర్రలతో కొట్టి చంపినట్లు నేరం అంగీకరించారు. పథకం ప్రకారం అరుగు పైనుంచి పడి అనారోగ్యానికి గురైందని అందరిని నమ్మించామని తెలిపారు. డబ్బుల కోసం.. -
యువతి అదృశ్యం
నర్సాపూర్ రూరల్: యువతి అదృశ్యమైంది. ఈ ఘటన నర్సాపూర్ మండలం తిరుమలాపూర్లో శనివారం జరిగింది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బొమ్మల లక్ష్మి కూతురు తులసి (19) రోజులాగే తాను పనిచేస్తున్న మార్ట్‌కు వెళ్తున్నానని శనివారం ఉదయం ఇంట్లో చెప్పి బయలుదేరింది. రాత్రి 10 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బంధువుల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తల్లి బొమ్మల లక్ష్మి తన కూతురు నారాయణపూర్‌కు చెందిన బలిజ రాజు అపహరించుకుపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆటో డ్రైవర్‌కు గాయాలు చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన మాసాయిపేట మండల శివారులోని 44వ జాతీయ రహదారి బంగారమ్మ దేవాలయ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... చేగుంట నుంచి హైదరాబాద్ వైపునకు వెళుతున్న ట్రాలీ ఆటోను వెనకాల వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రహ మాన్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అత డ్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
26 కిలోల గంజాయి పట్టివేత
పటాన్చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వినాయక్ రెడ్డి వివరాల ప్రకారం... ఆటోలో గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి సిబ్బందితో కలిసి ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన నిశాద్ వీరేంద్ర కుమార్‌గా గుర్తించారు. దర్యాప్తులో నిందితుడు ఒడిశాకు చెందిన ఘెను అనే వ్యక్తి గంజాయి ఇస్తాడని, అది తీసుకెళ్లి చెప్పిన ప్రదేశంలో ఇస్తే రూ. 50 వేలు ఇస్తానని చెప్పడంతో డబ్బుకు ఆశపడి చేసినట్లు తెలిపాడు. పట్టుబడిన 26.4 కిలోల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన ఆటో, సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. నిందితుడు వీరేంద్ర కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. -
అరచేతిలో సమగ్ర సమాచారం
వ్యవసాయంలో రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు నేరుగా అందించేందుకు ప్రభుత్వం సాంకేతికతను తీసుకొస్తుంది. పంటల సాగు, చీడ, పీడల గురించి పూర్తి సమాచారం రైతులు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ ఛానల్ ఇటీవల ప్రారంభించింది. ఇందులో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న రైతులు వ్యవసాయ శాఖ అధికారులు అందించే లింక్ ద్వారా చేరవచ్చు. గ్రామాల్లో ఇప్పటికే రైతులకు ఈ చానల్‌పై అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ నిపుణులు ఆన్లైన్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారు. – మెదక్ కలెక్టరేట్ రైతులు వారికి కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే పొందవచ్చు. పంటలకు తెగుళ్లు, క్రిమికీటకాలు సోకినప్పుడు రైతులు ఈ ఛానల్ ద్వారా కావాల్సిన సమాచారం పొందవచ్చు. ప్రస్తుతం రైతులు ఆశించిన స్థాయిలో వ్యవసాయ సమాచారం లేకపోవడంతో పంటల్లో దిగుబడులు కోల్పోతున్నారు. చీడ,పీడలతో పంటలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ రైతులకు ఒకేసారి సమాచారం పొందడానికి ఈ డిజిటల్ వ్యవసాయ పరిజ్ఞానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విత్తన దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు పంటల పూర్తి సమాచారం రైతులు తెలుసుకోవచ్చు. ఏఈఓల ద్వారా చేరవచ్చు మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు రైతులను ఈ ఛానల్లో లింక్ ద్వారా చేర్చుతున్నారు. పంటలకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా క్షణాల్లో పొందవచ్చు. అన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుంది. సమయం, ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ఏ పంటకు ఎంత సబ్సిడీ ఇస్తుంది. ఏ సీజన్లో ఏ పంట సాగుచేస్తే ప్రయోజనం ఉంటుంది. వాతావరణ సమాచారం, విత్తనం నాటు వేయడం, కోత తీయడం పద్ధతులతోపాటు సస్యరక్షణలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తల గురించి సమాచారం పొందవచ్చు. సీజన్ల వారీగా పంటలు సాగు చేసి, చీడ, పీడలను ఽఅధిగమించి రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు. అందుకోసం వాట్సాప్ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయశాఖలో సాంకేతిక విప్లవం -
ట్రాక్టర్ ఢీకొని.. మహిళ మృతి
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కామారం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణగౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన ఇందూర్ సాలవ్వ(50) శనివారం ధాన్యం ఆరబెట్టేందుకు కూలిపనులకు వెళ్లింది. అదే గ్రామానికి చెంది న రైతు భాగయ్య బంధువు ఆవుసులపల్లి గ్రామాని కి చెందిన కుంట స్వామి ట్రాక్టర్లో ధాన్యం తీసుకువస్తూ రివర్స్ చేస్తున్న క్రమంలో మహిళను గమనించకుండా ఢీకొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే గాంఽధీ ఆస్పత్రికి తరలించ గా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాహనం ఢీకొని కూలీ.. మనోహరాబాద్(తూప్రాన్): గుర్తు తెలియని వాహనం ఢీకొని కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్‌గౌడ్ వివరాల ప్రకారం... పటాన్చెరు మండలం పెద్దకంజర్లకు చెందిన మన్నె దశరథ (38) కూలీ పని కోసం శనివారం మండలంలోని కాళ్లకల్‌కు వచ్చాడు. రాత్రి శివారులో దీపక్ దాబా వద్ద జాతీయ రహదారి –44పై రోడ్డు దాటుతున్న క్రమంలో కంటైనర్ ఢీకొట్టడంతో లారి కిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చికిత్స పొందుతూ వ్యక్తి.. చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన బెన్ని కుమార్ (58) మెదక్ ఇరిగేషన్ కార్యాయలంలో విధులు ముగించుకుని అదే గ్రామానికి చెందిన నిఖిల్ స్కూటీపై వస్తున్నారు. గవ్వలపల్లి చౌరస్తా వద్ద టీవీఎస్ ఎక్స్ఎల్ అడ్డుగా రావడంతో అదుపుతప్పి ఢీకొట్టారు. దీంతో బెన్నికుమార్కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడ్ని మేడ్చల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. -
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
జహీరాబాద్ టౌన్: హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం టౌన్ ఎస్ఐ.వినయ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. తమిళనాడు మధురై జిల్లా పరిమల్పట్టికి చెందిన పుతురాజు పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్నాక్స్, కారబుంది తయారు చేసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మణికంఠ పట్టణంలోని హమాలీ కాలనీలో నివాసం ఉంటూ ఆయన కూడా ఇదే వ్యాపారం చేస్తున్నాడు. తాను వ్యాపారం చేస్తున్న ప్రాంతాల్లో పుతురాజ్ బిజినెస్ చేస్తున్నాడని కక్షపెంచుకున్న మణికంఠ శనివారం కత్తితో దాడి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణా లు పాటించాలని సదరు కాంట్రాక్టర్‌కు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ఆదివారం అక్బర్పేట – భూంపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులు, పీహెచ్సీ ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టూబీహెచ్‌కే దాసరి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. తదుపరి పనులను త్వరలోనే ప్రారంభించాలన్నారు. ఆయన వెంట నాయకులు జన్నారెడ్డి, శ్రీనివాస్, జనార్దన్, రమేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. హెల్ప్..హెల్ప్ పొదల్లో హైవే హెల్ప్‌లైన్ బోర్డు కౌడిపల్లి(నర్సాపూర్): హెల్ప్‌లైన్ బోర్డుకు సహాయం కావాల్సి వచ్చింది. జాతీయ రహదారులపై అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1033 నంబర్బోర్డు ముళ్ల పొదల్లో చిక్కుకుంది. దీంతో వాహనదారులకు నంబర్ కనిపించడం లేదు. మండల కేంద్రమైన కౌడిపల్లి సమీపంలో బ్రిడ్జి వద్ద 765డి జాతీయ రహదారి సైడ్రేలింగ్ పక్కన హెల్ప్‌లైన్ నంబర్ బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డు చుట్టూ పిచ్చిమొక్కలు, పొదలు పెరిగిపోవడంతో నంబర్ కనిపించడం లేదు. ఈ ఉచిత టోల్‌ఫ్రీ నంబర్‌తో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాలు, ఇంథనం అవసరం, అంబులెన్స్ ఇతర అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులు ఫోన్ చేసినట్లయితే ప్రభుత్వం వారికి సేవలు కల్పింస్తుంది. బోర్డు చుట్టూ ముళ్లపొదలను తొలగించి నంబర్ కనిపించేలా చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం ములుగు(గజ్వేల్): అక్రమంగా తరలిస్తున్న గోవులను వంటిమామిడి వద్ద రాజీవ్‌రహదారిపై ఆదివారం బీజేపీ, గోరక్షక్, బజరంగ్దళ్ నాయకులు అడ్డుకున్నారు. ఒడిశా నుంచి కొందరు వ్యక్తులు ఓ కంటైనర్ వాహనంలో 150 గోవులను హైదరాబాద్‌కు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న మండల బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్ ఆధ్వర్యంలో వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ములుగు ఎస్ఐ విజయ్‌కుమార్ గోవులతో ఉన్న వాహనాన్ని స్వాధీన చేసుకున్నారు. గోవులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్ఐ గోవులను అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గోశాలకు తరలించారు. విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధం హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటన మండల పరిధిలోని స్కూల్ తండా పంచాయతీ పరిధి లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాలో నివాసముంటున్న పూల్య నిత్యంలాగే వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి పూరిగుడిసెలో ఉన్న నిత్యావసర వస్తువులు, నగదు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితుడు పూల్య తెలిపాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ నరేశ్ సందర్శించి వివరాలు సేకరించారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను కోరారు. దొంగ అరెస్ట్మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని హనీ బేకరీ తాళం పగులగొట్టి సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సీఐ మహేశ్ వివరాల ప్రకారం... దర్యాప్తులో భాగంగా పోలీసులు కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన శరత్‌గా గుర్తించారు. నిందితుడు గతంలో కూడా ఓ కేసులో జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
మంజీరాలో పడి యువకుడు మృతికొల్చారం(నర్సాపూర్): ప్రమాదవశాత్తు యువకు డు మంజీరా నదిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ కాకినా డకు చెందిన నీల సత్తిబాబు కుమారుడు నాని బాబు (21) స్నేహితులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం ఏడుపాయలకు కారులో వచ్చారు. దర్శనం చేసుకున్న అనంతరం సాయంత్రం స్నానాల కుంటలోకి దిగారు. అతను సెల్ఫీ తీసుకుంటుండగా కాలుజారి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. లోతుగా ఉండటంతో మునిగిపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో బయటకి తీయగా అప్పటికే మృతి చెందాడు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం జిన్నారం (పటాన్చెరు): గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్సై హనుమంతు వివరాల ప్రకారం... గడ్డపోతారం పట్టణ పరిధిలోని చౌదరిగూడెం గ్రామానికి చెందిన పాండురంగ చారి (45) శనివారం గ్రామంలోని లింగం చెరువులోకి ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించగా ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి.. వట్పల్లి(అందోల్): మంజీరా నదిలో దూకి అత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. అందోల్ మండలం రోళ్లపాడ్ గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాములు కుటుంబంతో ఇస్నాపూర్‌లో ఉంటున్నాడు. పెద్ద కుమారుడు జగన్(17) శంకర్‌పల్లిలోని ప్రభుత్వ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 16న ఉదయం కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి చింతకుంట మంజీరా బ్రిడ్జి వద్ద నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నదిలో వరద ప్రవాహం ఉండటంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ఆదివారం కొల్చారం మండలం పైతర గ్రామ శివారులోని మంజీరా చెక్‌డ్యాం వద్ద నదిలో మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహా న్ని బయటకు తీసి పెద్దగొల్ల జగన్‌గా గుర్తించారు. చెరువులో పడి వ్యక్తి... మెదక్ మున్సిపాలిటీ: చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలోని దాయర వీధికి చెందిన అదరాసి మహేశ్(28) గోసముద్రం చెరువులో స్నానం చేసేందుకు ఈనెల 18న వెళ్లాడు. తిరిగి రాక పోగా ఆదివారం చెరువులో శవమై కనిపించాడు. మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక
పటాన్చెరు: మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెంమహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. జీవనోపాధి కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చి దశాబ్దాలుగా నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలందరి అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పాటిగ్రామ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. దీపావళి పర్వదినం పురస్కరించుకుని ప్రతీఏటా ఉత్తర భారతీయులు ఘనంగా నిర్వహించుకునే చట్ పూజ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఎంపీటీసీగా ఎన్నికై న నాటి నుంచి ఎంపీపీ, మూడుసార్లు పటాన్చెరు ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో ఇక్కడి ఉత్తరభారతీయుల మద్దతు మరువలేనిదని చెప్పారు. అతి త్వరలో ఉత్తర భారతీయుల కోసం ఫంక్షన్ హాల్, సాకి చెరువు కట్టపై సూర్యదేవుడి ఆలయం నిర్మించబోతున్నామని తెలిపారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి -
చేపపిల్లల పంపిణీకి సర్వం సిద్ధం
నారాయణఖేడ్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువుల నీటితో పూర్తిగా నిండి కళకళలాడుతున్నాయి. కాగా ప్రభుత్వం మత్స్యకారుల లబ్ధికోసం ‘మత్య్స భరోసా’పథకం కింద చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు సిద్ధమైంది. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు అధికారులు అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాష్ట్రంలో మత్య్స భరోసా పథకాన్ని ఇటీవల ప్రారంభించి చేపపిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో వారంలోపు చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత నెలలోనే చేపపిల్లలను వదలాలని భావించినా భారీ వర్షాలు కురవడంతో వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పథకం అమలు మరింత ఆలస్యం అయ్యింది. జిల్లాలో 234 మత్స్యకార సంఘాలు జిల్లాలో 1,135 నీటి వనరులు ఉండగా రిజర్వాయర్లు 3, శాశ్వత నీటి వనరులు 79, సీజనల్ నీరు నిల్వ ఉండే చెరువులు 1,025 ఉన్నాయి. 12,889 మంది సభ్యులతో 234 మత్స్య సహకార సంఘాలు కొనసాగుతున్నాయి. 8,200 మిల్లిమీటర్ల సైజు వరకు గల చేపపిల్లలను వదలనున్నారు. కట్లరోహు, పెద్దపిల్ల, బంగారు తీగ, మృగాల, కొర్రమీను తదితర రకాల చొప్పున సుమారు 3.50కోట్ల చేపపిల్లలను వదలనున్నారు. మత్స్య భరోసా కింద లబ్ధి ప్రభుత్వం మత్య్సకారులను సంక్షేమం కోసం మత్య్స భరోసా పథకాన్ని ప్రవేశ పెట్టింది. మత్స్యశాఖ పరిధిలో జరిగే అభివృద్ధి, సంక్షేమం, రాయితీ ప్రోత్సాహకాలు అన్నీ మత్య్సభరోసా కింద అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాథమిక మత్స్య సహకార సొసైటీల్లో ఉన్న బేస్త, గంగపుత్రులు, ముదిరాజ్, మత్స్యకార్మికుల కుటుంబాలకు ఈ పథకం కిందనే లబ్ధి చేకూర్చనున్నారు.చెరువు వద్ద సైన్‌బోర్డు భారీ ఎత్తున మత్స్య భరోసా కార్యక్రమం కింద చేపపిల్లలు వదిలే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని యోచించింది. భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేసింది. దసరా పండగలోగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినా స్థానిక ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చింది. పథకం కింద ప్రతీ చెరువు వద్ద ప్రత్యేకంగా రూపొందించిన సైన్ బోర్డును ఏర్పాటు చేస్తారు. సైన్ బోర్డుపై రెవెన్యూ గ్రామం, చెరువుపేరు, చెరువులో వదిలే చేపపిల్లల సంఖ్య, చెరువు ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నదనే వివరాలను పొందుపరుస్తారు. మత్స్య భరోసా కింద అమలు ఈసారి 3.50 కోట్ల చేప పిల్లల పంపిణీ ప్రతీ చెరువు వద్ద పూర్తి వివరాలతో బోర్డులు3.50కోట్ల చేపపిల్లల పంపిణీ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు సంసిద్ధంగా ఉన్నాం. మత్స్యశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేపట్టాం. వారంలోపు మంత్రి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మత్స్యకారుల సంక్షేమం కోసం సుమారు మూడున్నర కోట్ల వరకు చేప పిల్లలను వదలనున్నాం. – మధుసూదన్, జిల్లా మత్స్యశాఖ అధికారి, సంగారెడ్డి -
వేధిస్తోన్న బాండ్ పేపర్ల కొరత
సంగారెడ్డి జోన్: జిల్లాలో స్టాంప్ బాండ్ పేపర్ల కొరత ఏర్పడింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి అవసరాల మేరకు సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. లైసెన్స్డ్ స్టాంప్ వెండర్ల వద్ద లభించే బాండ్ పేపర్లు గత కొన్ని రోజుల నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో అటు సాధారణ ప్రజలతోపాటు దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా బాండ్ పేపర్లు దొరకకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటుండటంతో తమ పనుల్లో ఆలస్యం అవుతుందని పలువురు చెబుతున్నారు. వివిధ రకాల పనులకు ఇబ్బందులు బాండ్ పేపర్ల కొరత ఏర్పడటంతో వివిధ రకాల పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూములు, ఇండ్ల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు, కుల ధ్రువీకరణ, వివిధ రకాల పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు, లీగల్, నోటరీ, అమ్మకాలతోపాటు ఇతర పనులకు పేపర్లను వినియోగిస్తుంటారు. రూ.20, రూ.50, రూ100ల బాండ్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. అయితే వారి వారి అవసరాలను బట్టి వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువగా రూ.20, రూ.100 ల పేపర్లు వినియోగిస్తుంటారు. ప్రతీరోజు జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణతోపాటు ఇతర ప్రాంతాల్లోని స్టాంప్ వెండర్ల దుకాణాలకు వస్తుంటారు. పేపర్ల కొరత ఉండి లభ్యం కాకపోవడంతో తమ పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. రెండు నెలలుగా వేధిస్తున్న కొరత రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి ప్రజల అవసరం మేరకు బాండ్ పేపర్లను సరఫరా చేస్తారు. కానీ గత రెండు నెలలుగా అవసరం మేరకు సరఫరా లేదు. దీంతో తమ పనులను వాయిదాలు వేసు కుంటున్నారు. ఇక స్టాంప్ బాండ్ పేపర్లు కొరతతో పేపర్లను నోటరీ చేసి సాధారణ ధర కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు.ఆన్లైన్లో నమోదు చేసి అమ్మకాలు గతంలో బాండ్ పేపర్లను ఆఫ్ లైన్లో ఇష్టారీతిగా అమ్మకాలు చేసేవారు. అయితే గత రెండున్నరేళ్ల నుంచి బాండ్ పేపర్ల అమ్మకాలను ఆన్ లైన్లో నమోదు చేసుకుకుని అమ్ముతున్నారు. బాండ్ పేపర్ అమ్మాలంటే కొనుగోలు దారుల పేరుతోపాటు బాండ్ పేపర్ ఎందుకు అవసరమైందో పూర్తి వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే అమ్ముతున్నారు. బాండ్ పేపర్లను పారదర్శకంగా అమ్మేందుకు ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. భూ క్రయవిక్రయాలతో పాటు ఇతర పనులకు వినియోగం దొరకని రూ.20,రూ.100ల పేపర్లు పెండింగ్ లో వివిధ రకాల పనులు ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
జీవితాల్లో వెలుగులు నింపాలి
కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: దీపావళి వెలుగులు ప్రతీ ఇంటిలో ఆనందం నింపాలని ఈ పండుగను ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకాంక్షించారు. టపాసులు కాల్చేటప్పుడు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. పర్యావరణహిత టపాసులను వినియోగించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు తప్పనిసరిరాయికోడ్(అందోల్): సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్మాలంటే రైతులు తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్‌బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సారిక స్పష్టం చేశారు. పంట విక్రయించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని కేంద్ర ప్రభుత్వం యాప్‌లో స్లాట్ బుక్ చేయించుకునే ప్రక్రియను తప్పనిసరి చేసిందని ఆదివారం ఓ ప్రకటనలో వివరించారు. పత్తి రైతులు తమ పరిధిలోని ఏఈఓలను సంప్రదించి యాప్‌లో తమ పేరుపై బుకింగ్ అయిందా లేదా అనే అంశాన్ని గుర్తించాలన్నారు. లింగాయత్ సమాజ్ అధ్యక్షుడిగా రాజశేఖర్జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణ లింగాయత్ సమాజ్ అధ్యక్షుడిగా రాజశేఖర్ షెట్కార్ వరుసగా నాలుగవసారి ఎన్నికయ్యారు. పట్టణంలోని బసవ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన అధ్యక్షుడిని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న రాజశేఖర్ షెట్కార్‌ను వీరశైవ లింగాయత్ సమాజ్ నాయకులు, ఉద్యోగ సంఘం నాయకులు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ షెట్కార్ మాట్లాడుతూ..వరుసగా సమాజ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృజ్ఞతలు తెలిపారు. లింగయాత్ సమాజ్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులుజిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ పటాన్చెరు టౌన్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్ కాలనీ వాసులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ బాలాజీ నగర్ కాలనీలో సీసీరోడ్డు కారణంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్య నెలకొనడంతో డ్రైనేజీ పనులను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సీసీ రోడ్డు వేయగా..అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మూసుకుపోయి, ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందన్నారు. భవన్స్‌లో ఘనంగా దివాళీ మేళారామచంద్రాపురం(పటాన్చెరు): బెల్ టౌన్‌షిప్‌లోని భవన్స్ పాఠశాలలో శనివారం రాత్రి దివాళీ మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డీసీపీ సృజన, భవన్స్ హైదరాబాద్ వైస్ చైర్మన్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతీ, సంప్రాదాయాలపై చిన్ననాటి నుంచి విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బెల్ జీఎం డా.సంధ్యాకర్, ప్రిన్సిపాల్ ఉమాశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
రవాణశాఖ చెక్‌పోస్టులో ఏసీబీ సోదాలు
జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దులోని మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామ శివారులోని రవాణశాఖ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఆదివారం తెల్లవారు జామున ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ, డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీల్లో పాల్గొన్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సరిహద్దు రవాణ శాఖ చెక్‌పోస్టుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. అందులోభాగంగా జహీరాబాద్ సమీపంలోని 65వ జాతీయ రహదారిపై గల చెక్‌పోస్టులో ఆదివారం ఉదయం వరకు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ, డీఎస్పీ సుదర్శన్ విలేకరులతో మాట్లాడుతూ...చెక్‌పోస్టులో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో అర్ధరాత్రి దాటాక ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో రూ.42,300 నగదు దొరికిందని వివరించారు. ఇందుకు సంబంధించి ఏఎంవీఐ కిరణ్‌కుమార్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఈ నగదును రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఏఎంవీఐ ప్రైవేటు వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.రూ.42,300 నగదు స్వాధీనం -
సమస్యల పరిష్కారానికి కృషి
జిన్నారం(పటాన్చెరు): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం గుమ్మడిదల పట్టణ పరిధిలోని అన్నారం ప్రకృతి నివాస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో కాలనీ వాసులకు ఇచ్చిన హామీ మేరకు కాలనీని సందర్శించానన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరించారు. వెంటనే సమస్యల పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళి, సొసైటీ సభ్యులు వీణాచిన్న, తదితరులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్‌రావు -
జాడలేని కొనుగోలు కేంద్రాలు
కొనుగోలు కేంద్రాలను ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారని సోయా రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో దళారులు సోయా పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – జహీరాబాద్ టౌన్: జిల్లాలో వరి,పత్తి, కంది,మొక్కజొన్న తర్వాత వేలాదిమంది రైతులు సోయాబీన్ పంటను సాగు చేశారు. ఖరీఫ్ సీజన్లో సుమారు 80 వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. జిల్లాలోనే జహీరాబాద్ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో పంటను వేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. కాత పూత దశలో కూడా భారీ వర్షాలు కురవడంతో పంటల దిగుబడిపై ప్రభావం చూపింది. ఏర్పడిన నష్టాన్ని ధర రూపంలో అయినా తీరనుందని రైతులు ఆశతో ఉన్నారు. అయితే పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు.కనీస మద్దతు ధర రూ.5,328కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో క్వింటాల్‌కు రూ 4.892 ఉండగా 2025–26 ఏడాదికి రూ.5.328గా నిర్ణయించింది. కోతలు ప్రారంభంకావడంతో మార్కెట్‌కు పెద్ద మొత్తంలో ధాన్యం వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు బదులు వ్యాపారులు రూ.4 వేలకు లోపే పంటను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్ల కొంతమంది రైతులు గత్యంతరం లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. గతేడాది జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఝరాసంగంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఉత్పత్తిలో నాలుగవంతే కొనుగోలు చేయడం వల్ల మిగిలిన పంటను మార్కెట్లో వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. జహీరాబాద్ డివిజన్లోని గంగ్వార్, కోహీర్, మొగుడంపల్లి వద్ద ప్రైవేట్ వ్యక్తులు నారింజ రైతు మిత్ర సంఘం పేరుతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సోయాబీన్ పంటను కొంటున్నారు. వీరు కూడా క్వింటాల్‌కు రూ.4 వేల లోపే ధాన్యం తీసుకుంటున్నారు. పెట్టుబడులు విపరీతంగా పెరిగాయని, వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి పడిపోయిందని. తీవ్రంగా నష్టపోతున్నందున అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. అన్నదాతల ఎదురుచూపులు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5.328 రూ.4 వేల లోపే కొంటున్న వ్యాపారులు నష్టపోతున్న సోయా రైతులు -
అంబేడ్కర్ స్ఫూర్తితోనే ఉద్యోగం
జహీరాబాద్: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ స్ఫూర్తితోనే తాను గ్రూప్ –1లో విజయం సాధించగలిగానని జహీరాబాద్ పట్టణానికి చెందిన సాహితి పేర్కొన్నారు. గ్రూప్–1లో ఉద్యోగం సంపాదించి అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌గా నియమితులైన సందర్భంగా మాల సంఘాల ఆధ్వర్యంలో ఆమెను ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాహితి మాట్లాడుతూ...తాను చిన్ననాటి నుంచి ఉపాధ్యాయుడైన తన తండ్రి శ్రీనివాస్ ద్వారా అంబేడ్కర్ గురించి తెలుసుకుని ఆయన పట్టుదల, స్ఫూర్తితోనే కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సాధించగలిగానన్నారు. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం మరువలేనిదని చెప్పారు. సామాజిక బాధ్యతగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పాఠశాలలకు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను ఉచితంగా అందించి తనవంతు తోడ్పడతానని హామీనిచ్చారు. గ్రూప్–1 విజేత సాహితి -
ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య
దుబ్బాకటౌన్: ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై కీర్తి రాజు వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన జమునగారి ప్రవీణ్ కుమార్ (33) వ్యవసాయంతో పాటు వరి కోత యంత్రం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం వ్యవసాయ నిర్వహణతో పాటు ఇతర అవసరాల కోసం 8 లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక, తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుండేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ప్రవీణ్ శుక్రవారం రాత్రి పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మనస్తాపంతో వ్యక్తి.. పాపన్నపేట(మెదక్): మనస్తాపంతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఆరెపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మష్కరి లక్ష్మయ్య(57)వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. కొంత కాలంగా అతను మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ నెల 16న అతిగా మద్యం తాగి వచ్చిన అతన్ని భార్యలు నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మయ్య బయటకు వెళ్లి పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. నోట్లో నుంచి నురగలు వస్తుండటంతో గమనించిన కుటుంబీకులు మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సమస్యలతో మేసీ్త్ర.. రామాయంపేట(మెదక్): కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... రామాయంపేట పట్టణానికి చెందిన పెంటమీది మల్లేశం (38) మేసీ్త్ర పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్యతో గొడవపడిన మల్లేశం ఆమెతోపాటు ముగ్గురు పిల్లలను ఇంటి నుంచి పంపించి రాత్రి ఉరి వేసుకున్నాడు. పక్క ఇంట్లో ఉంటున్న వారు చూసి మృతుడి భార్య అనితకు సమాచారం అందజేశారు. -
ఫైనాన్స్ వేధింపులకు యువకుడు బలి
సిద్దిపేటఅర్బన్: ఫైనాన్స్ వేధింపులకు యువకుడి బలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం... ఎల్లుపల్లి గ్రామానికి చెందిన ఐరేని మల్లేశం (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2023లో నూతనంగా నిర్మించుకున్న ఇంటి కోసం ఓ ప్రైవేట్ కంపెనీ ౖౖౖఫైనాన్స్లో రూ. 7 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దీనికి తోడు టీ షాపు నిర్వహించడానికి కొంత అప్పు చేశాడు. ఈ క్రమంలో టీ షాపు సరిగా నడవకపోవడంతో ఆర్థికంగా భారం ఎక్కువైంది. దీంతో ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడంతో ఫైనాన్స్ వారు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారు. ఫోన్ చేయడమే కాకుండా ఇంటికి రావడం, పనికి వెళ్లిన చోటుకి వెళ్లి వేధిస్తున్నారు. కొన్ని రోజులు సమయం ఇస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ వినకుండా ఈ నెల 16న సాయంత్రం ఫైనాన్స్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తేనే వెళ్తామని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన అతడు వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
అన్నం పెట్టమంటే దాడులు.. కలెక్టర్‌కు ఫిర్యాదులు.. కుమారులకు కౌన్సెలింగ్ కాగా ఇటీవల జిల్లా వ్యాప్తంగా 11 మంది వృద్ధులు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలించి వారి పిల్లలను పిలిపించి తల్లిదండ్రులను పోషించడం ‘భారం కాదు బాధ్యతగా’ తీసుకోవాలని పలువురికి కౌన్సెలింగ్ ఇచ్చారు. నెలకు రూ. 10 వేలకు తగ్గకుండా వారి వ్యాధులను బట్టి ఇవ్వాలని ఆదేశించారు. లేనిచో సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో కొందరు పిల్లలు మనసు మార్చుకుని వారి తల్లిదండ్రులను ఇళ్లకు తీసుకెళ్లగా, మరికొందరు పోషణ కోసం నెలనెల డబ్బులు ఇస్తామని ఒప్పుకుంటున్నారు. ఇంకొందరు అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు.కన్న బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేసి వివాహాలు చేస్తే తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. జీవిత చరమాంకంలో చూడాల్సిన కొడుకులు గాలికొదిలేస్తున్నారు. పట్టెడన్నం పెట్టమంటే తల్లిదండ్రులను కొట్టి గెంటేస్తున్నారు. ఆస్తులు లాక్కొని రోడ్డున పడేస్తుండటంతో వృద్ధులు తిండి, గూడు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు భిక్షాటన చేస్తుండగా, మరికొందరు అధికారులను ఆశ్రయిస్తున్నారు. కొడుకుల దాష్టీకాలపై ఈ వారం కథనం. – మెదక్‌జోన్ మెదక్ జిల్లాలో కన్న బిడ్డలు తిండి పెట్టడం లేదని ప్రజావాణిలో వృద్ధులు కలెక్టర్‌ను కలిసి వేడుకుంటున్నారు. కడుపు కట్టుకుని పిల్లల్ని ప్రయోజకులను చేశామంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి అభాగ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా పిలిపించి (సీనియర్ సిటిజన్ యాక్టు) ప్రకారం కన్న తల్లిదండ్రులను పోషించకుండా విస్మరించిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వీరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్కడ సమస్య పరిష్కారం కాని వారు నేరుగా కలెక్టరేట్లోని రెవెన్యూ(సీ) సెక్షన్లో అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలనడంతో నేరుగా వృద్ధులు కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో అభాగ్యులెందరో.. మెదక్ జిల్లా కేంద్రంలో సంధ్యానిలయంలో కొందరు తలదాచుకుంటున్నారు. ఏ దిక్కులేని కొందరు కాగా మరి కొంత మంది అందరూ ఉండి కూడా ఇళ్ల నుంచి గెంటివేయబడిన అభాగ్యులు. ఇలాంటి వారి కోసం పిల్లికొటాల్ వద్ద గల ఎంసీహెచ్ ఆస్పత్రి సమీపంలో ఓ ఆశ్రమం నిర్మించారు. కానీ అది పట్టణానికి దూరంగా ఉండటంతో అక్కడికి వెళ్లకుండా జిల్లా కేంద్రంలో భిక్షాటన చేసి ఫుట్‌పాత్‌లపై తల దాచుకుంటున్నారు. కాగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారిపై చట్టాలు కఠినంగా అమలు చేసి వృద్ధులకు అండగా నిలవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.కుమారుడు గెంటివేస్తే.. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని పుల్లూరులో గ్రామానికి చెందిన గొడుగు పోచయ్య(67)ను అవసాన దశలో పోషించలేక ఇంటి నుంచి కొడుకులు వెళ్లగొట్టారు. దీంతో ఎటుపోవాలో తెలియక రైతు వేదికలో తల దాచుకున్నాడు. తెల్లారేసరికి విగతజీవిగా కనిపించాడు. కాగా భర్తకు భార్య యాదవ్వనే అంత్యక్రియలు నిర్వహించింది. ఆస్తులు లాక్కొని రోడ్డున పడేస్తున్న వైనం కలెక్టర్‌ను ఆశ్రయించిన 11 మంది వృద్ధులు -
సనాతన ధర్మమే లక్ష్యం
కొమురవెల్లి(సిద్దిపేట): సనాతన ధర్మాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆలయాల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామని సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం బర్ధిపూర్ ఆశ్రమ పీఠాధిపతులు వైరాగ్య శిఖామణి, మహామండలేశ్వర్, సిద్ధేశ్వరనందగిరి మహరాజు అన్నారు. శనివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పురాతన ఆలయాల పరిరక్షణ కోసం పని చేయాలని సూచించారు. గ్రామాల్లో ఏమైనా పురాతన ఆలయాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, మల్లయ్య, లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు
జిన్నారం (పటాన్చెరు): చెరువులో ఈతకు వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై హనుమంత్ వివరాల ప్రకారం... గడ్డపోతారం పట్టణ పరిధి లోని చౌదరిగూడెం గ్రామానికి చెందిన గురుగోజు పాండురంగ చారి (45)కి ప్రతిరోజు లింగం చెరువులో ఈతకు వెళ్లే అలవాటు ఉంది. రోజు లాగే శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈతకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతుండగా నీటిలో మునిగాడు. కనిపించకపోవడంతో స్థానికు లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు గాలించిన ఆచూకీ లభించలేదు. చెరువులో మృతదేహం లభ్యం సంగారెడ్డి టౌన్: అదృశ్యమైన వ్యక్తి శవమయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన శివ సాకేత్ (19) ఈనెల 13న ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అయితే అతడు డ్రైవర్‌గా ఊబర్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా ఫసల్వాది శివారులోని మంజీరా వద్ద కారు పార్కు చేసి ఉండటంతో పోలీసులు పరిశీలించారు. చెరువులో మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి.. చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన చేగుంటలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... నార్సింగి గ్రామానికి చెందిన మల్లేశ్(45) చేగుంటలోని గీతా పాఠశాల సమీపంలోని కల్వర్టు వద్ద చేపలు పడుతున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని బయటకు తీశారు. -
అదృశ్యమై.. హత్యకు గురై..
కుళ్లిన స్థితిలో చెరువులో మృతదేహం లభ్యంవర్గల్/ములుగు(గజ్వేల్): అదృశ్యమైన మహిళ హత్య కు గురైంది. గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం... వర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన మంకని బాలమణి(55) ఈ నెల 10న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కూతురు నవనీత ఫిర్యాదు మేరకు 12న గౌరారం పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తు ఓ వైపు, కుటుంబీకులు, బంధుగణం ఆమె ఆచూకీ కోసం పలుచోట్ల వెతుకుతున్నారు. ఈ తరుణంలో శుక్రవారం రాత్రి ములుగు మండలం తున్కిబొల్లారం అయ్యప్ప చెరువులో నల్లటి ప్లాస్టిక్ కవర్ చుట్టేసి, కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహం వెలికి తీయించి మీనాజీపేటకు చెందిన బాలమణిగా గుర్తించారు. ఆమె హత్యకు గురైనట్లు నిర్ధారించి, పలు ఆధారాలు సేకరించారు. శనివారం మృతదేహానికి గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించి కుటుంబీకులకు అప్పగించారు. మెట్ల పైనుంచి జారి పడి కూలి మృతి సంగారెడ్డి క్రైమ్: ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారి పడి కూలి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పోలీసు స్టేషన్ ఫరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... పట్టణంలోని శివాజీనగ ర్ కాలనీకి చెందిన శేఖర్(43) వృత్తిరీత్య కూలీ పను లు చేస్తున్నాడు. ఈ నెల 17న ఉదయం 10గంటల సమయంలో అద్దెకు ఉంటున్న ఇంట్లోని మెట్లపై నుంచి కాలు జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడికి తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికు లు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి .. గజ్వేల్‌రూరల్: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పిడిచెడ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సూరారం కిషన్(28)కు భార్యతో పాటు ఓ కూతురు ఉన్నారు. రెండేళ్ల క్రితం కిషన్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నప్పటికీ తగ్గకపోవడంతో కూతురితో కలిసి భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన అతడు ఈనెల 12న పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. -
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
గజ్వేల్‌రూరల్: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు టీజీఎంఎస్(తెలంగాణ మోడల్ స్కూల్)కు చెందిన విద్యార్థిని లావణ్య ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ వన్నెసా తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ అండర్–17 విభాగంలో ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై ంది. ఈ సందర్భంగా విద్యార్థిని లావణ్యతో పాటు పీడీ పద్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 372 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత మిరుదొడ్డి(దుబ్బాక): ఓ రైస్‌మిల్లుపై అధికారులు దాడులు చేసి పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా... అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామ శివారులోని లక్ష్మీప్రసన్న రైస్ మిల్‌పై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. రైస్‌మిల్లులో 372.40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మరో రైస్ మిల్కు అధిక ధరలకు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి మంజునాథ రైస్ మిల్కు తరలించినట్లు అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి ఎం.సాయి రవి తెలిపారు. కాగా రైస్ మిల్లు నిర్వహిస్తున్న కాపర్తి సంతోష్‌తో పాటు అతని పార్టనర్స్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరీశ్ తెలినారు. రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు న్యాల్కల్(జహీరాబాద్): ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధి మిర్జాపూర్(ఎన్) గ్రామ శివారులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ సుజిత్ కథనం ప్రకారం... ఝరాసంగం మండల పరిధి తుమ్మన్పల్లికి చెందిన నదీం కుటుంబ సభ్యులతో కలిసి ముంగి గ్రామంలో జరిగే విందుకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రాయికోడ్‌కు చెందిన మరో వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. మిర్జాపూర్(ఎన్)గ్రామ శివారులో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నదీంకు కాలు విరిగింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జహీరాబాద్‌కు ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వ్యక్తిపై కత్తితో దాడి.. గాయాలు జహీరాబాద్ టౌన్: ఓ వ్యక్తి చిరువ్యాపారిపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. ఈ ఘటన జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. టౌన్ ఎస్ఐ.వినయ్‌కుమార్ కథనం ప్రకారం... తమిళనాడు మధురై జిల్లా పరిమల్పట్టికి చెందిన పుతురాజు సుమారు మూడేళ్ల నుంచి పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్నాక్స్ తయారు చేసుకుని ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మణికంఠ(29) కూడా హమాలీ కాలనీలో నివాసం ఉంటూ ఆయన ఇదే వ్యాపారం చేస్తున్నాడు. తాను వ్యాపారం చేస్తున్న ప్రాంతంలోకి రావద్దని మణికంఠ ఇటీవల పుతురాజును బెదిరించాడు. అయితే చెప్పిన మాట వినడం లేదని మణికంఠ అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో స్నాక్స్ అమ్ముకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా పుతురాజును పార్కు వద్ద అడ్డుకుని, బూతులు తిడుతూ కత్తితో వీపుపై దాడి చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో మణికంఠ పరారయ్యాడు. వెంటనే గాయపడిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నానమ్మకు తలకొరివి పెట్టిన మనుమరాలుసిద్దిపేటరూరల్: విధి ఆడిన వింతనాటకంలో 14 సంవత్సరాల రమ్య అభాగ్యురాలిగా మిగిలింది. ఇంటి పెద్ద దిక్కు నానమ్మ కూడా అనారోగ్యంతో చనిపోవడంతో మనుమరాలు రమ్య అన్నీ తానై తలకొరివి పెట్టిన ఘటన శనివారం రావురూకుల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బ్యాగరి మల్లవ్వ, మనువరాలైన రమ్యతో కలిసి నివాసం ఉంటుంది. మల్లవ్వ ఇటీల అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందింది. కాగా మల్లవ్వ భర్త వెంకయ్య గతంలో చనిపోగా, నాలుగేళ్ల కిందట కొడుకు, కోడలు కూడా అనారోగ్యంతో చనిపోయారు. రమ్యకు ఒక్క ఆధారమైన మల్లవ్వ మృతి చెందడంతో అనాథగా మారిన రమ్యను చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా గ్రామస్తులు అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేశారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
నర్సాపూర్ రూరల్: వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని నాగులపల్లిలో శనివారం జరిగింది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రెడ్డిపల్లి ప్రశాంత్, భార్య జింకలత(23)ల మధ్య గొడవ జరిగింది. దీంతో శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం చుట్టుపక్కలతో పాటు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో గొడవపడి వెళ్లి.. సంగారెడ్డి క్రైమ్: బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... ఆంఽధ్రప్రదేశ్‌కు చెందిన తపేట్ల అల్లు రామలింగయ్య (38), సంగారెడ్డి పట్టణానికి వచ్చి గణేశ్‌నగర్ కాలనీలో స్థిరపడ్డాడు. వృత్తిరీత్య పట్టణంలో పద్మశాలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య రాజేశ్వరి, ముగ్గురు పిల్లలున్నారు. కొన్ని నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత నెల 22న ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో భార్యతో గొడవపడి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేగుంటలో మహిళ చేగుంట(తూప్రాన్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... మండల కేంద్రమైన చేగుంటకు చెందిన దుద్యాల కళ్యాణి శుక్రవారం బంధువుల ఇంటికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. శుక్రవారం రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
నర్సాపూర్: దాడి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ కేసు వివరా లు వెల్లడించారు. ఉపాధ్యాయుడు కిష్టయ్య ఈనెల 16న సొంత పనిపై కొల్చారం మండల కేంద్రానికి వెళ్లి అనంతరం అన్నారంలోని తన ఇంటికి వెళ్లేందుకు బస్టాండు వద్ద ఆటో ఎక్కాడు. నర్సాపూర్‌కు రాగానే అన్నారం వైపు వెళ్లకుండా తూప్రాన్ మార్గంలోని ఓ కుంట వద్దకు తీసుకెళ్లి ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అతడ్ని కత్తితో చంపుతామని బెదిరించి ఫోన్‌తో పాటు రూ.12వందలు దోచుకున్నారు. కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చౌటకూరు మండలం శివ్వంపేటకు చెందిన సాయికుమార్, కుమార్, రంగంపేటకు చెందిన అనిల్‌ను అరెస్ట్ చేశారు. వీరు పాత నేరస్తులని,పలు కేసులు ఉన్నాయని తెలిపారు. కాగా నిందితులు ఉపయోగించిన ఆటోతోపాటు ఉపాధ్యాయుడి ఫోన్, 12 వందల నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీఐ జాన్‌రెడ్డి, ఎస్ఐ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. మరో కేసులో ఇద్దరు.. చేర్యాల(సిద్దిపేట): దొంగతనం కేసులో ఇద్ద రు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఎల్ శ్రీను కథనం మేరకు... చేర్యాలలోని ఎల్లమ్మ గుడి వద్ద ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా ముస్త్యాలకు చెందిన కెంచు శివశంకర్, సాల్లూరి సిద్ధిరాములు బైక్‌పై వచ్చి పోలీసులను చూసి పారిపోయారు. దీంతో వారిని పట్టుకుని విచారించగా ఈనెల 4న ముస్త్యాలలో తాళం వేసి ఉన్న తరిగొప్పుల నర్సింహులు ఇంట్లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. చోరీ చేసిన రెండున్నర తులాల బంగారు నెక్లెస్, 25 తులాల వెండి పట్టీలతో పాటు బైక్, రెండు సెల్ఫ్లోను స్వాధీనం చేసుకున్నా రు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
ముగిసిన రాంచంద్రారెడ్డి అంత్యక్రియలు
కోహెడరూరల్(హుస్నాబాద్): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ కోసా అలియాస్ రాజు దాదా అంత్యక్రియలు కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో శనివారం ముగిశాయి. ఛత్తీస్‌గఢ్‌లో గత నెల 22న పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. కాగా ఆయన మృతదేహన్ని ఛత్తీస్‌గఢ్ నుంచి కుమారుడు రాజాచంద్ర స్వగ్రామానికి ఉదయం తీసుకొచ్చారు. గ్రామంలో ఆయన ఇంటి వద్ద మృతదేహన్ని చూసి భార్య శాంతితో పాటు కూతురు కన్నీరు మున్నీరుగా విలపించారు. కడసారి చూసేందుకు పలు విప్లవ, ప్రజా పౌరహక్కుల సంఘాల, రాజకీయ పార్టీల నేతలతో పాటు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మవోయిస్ట్లను హతమారుస్తున్నారని పలువురు మండిపడ్డారు. 17 రోజుల తర్వాత మృతదేహం లభ్యంజోగిపేట(అందోల్): జోగిపేటకు చెందిన లోక చంద్ర (37) మృతదేహం చౌటకూరు మండలం వెండికోలు శివారులోని మంజీరా నది ఒడ్డున 17 రోజుల తర్వాత లభ్యమైంది. గత నెల 30న శివ్వంపేట బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. అప్పట్లో గాలింపు చర్యలు చేపట్టినా సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద ప్రవాహం తీవ్రంగా ఉండటం వల్ల మృతదేహం దొరకలేదు. మూడు రోజుల క్రితం నీటి ప్రవాహం తగ్గడం వల్ల మృతదేహం బయటపడింది. శనివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో తహసీల్దారు కార్యాలయం ఎదుట మృతుడి కుటుంబీకులు, బంధువులు నిరసన తెలిపారు. మృతుడి తల్లి ప్రమీల తన కొడుకు చావుకు రాజకీయ నాయకులు కారణమని ఆరోపించింది. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో నిరసన విరమించారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి తగదు
ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులుఖండించిన ప్రజా సంఘాల నాయకులుసంగారెడ్డి టౌన్ : పత్రికలు స్వేచ్ఛగా పనిచేస్తేనే ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతుందని, మీడియా స్వేచ్ఛ కు సంకెళ్లు వేస్తే ప్రజాస్వామ్య మనుగడకే చేటు చేసినట్లవుతుందని సంగారెడ్డి జిల్లాలో వివిధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ పోలీసులు పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం అంశాలపై కథనాలు రాసిన ‘సాక్షి’పై తప్పుడు కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని వక్తలు అభిప్రాయపడ్డారు. పత్రికల గొంతు నొక్కేలా వ్యవహరించడం మంచిదికాదని ముక్తకంఠంతో ఖండించారు.పత్రికలపై కక్ష సాధింపు సరికాదు పత్రికలపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డి, పత్రికపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం రాజ్యాంగం ఇచ్చిన హక్కుకు కాలరాయడమే. పత్రికల విషయంలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులుగా ఖండిస్తున్నాం. – కూన వేణు, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అక్రమ కేసులు ఉపసంహరించాలి సాక్షిఎడిటర్ ధనంజయరెడ్డిపై కక్ష సాధింపులతో కేసులు పెట్టడం సరికాదు. ప్రజల కోసం వార్తలు రాసే మీడియా ప్రతినిధులపై ప్రభుత్వం కక్ష సాధింపు కోసం అక్రమ కేసులు పెట్టడం సరికాదు. కేసులను ఉపసంహరించుకోవాలి. – బంగారు కృష్ణ, జన జాగృతి సేన, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడుమానసిక హింసకు గురిచేయడం సరికాదు ఫోర్త్ ఎస్టేట్‌గా వ్యవహరించే మీడియా ఎపుడు ప్రజల పక్షమే వాహించాలి. నిజాలను శోధించి ప్రజలను జాగరూకత పరిచే బాధ్యత కూడా మీడియాదే. ఏపీలో సరిగ్గా ఆ పాత్రనే పోషిస్తున్న ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి మీద ‘సాక్షి’సిబ్బంది మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టి మానసిక హింసకు గురించేయడం సరికాదు. పాలకులకు అనుకూలంగా రాయడం లేదని, పోలీసుల ద్వారా అణచివేతకు గురిచేస్తే అది పత్రికా స్వేచ్ఛను హరించడమే. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం వెంటనే మానుకోవాలి. – వై.అశోక్ కుమార్,జిల్లా చైర్మన్, (టీపీజేఏసీ) -
బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం
జోగిపేట(అందోల్)/సంగారెడ్డి: జోగిపేట సమీపంలోని కట్టుకం వేణుగోపాల్ అండ్ సన్స్ బాణసంచా హోల్‌సేల్ దుకాణంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.25 లక్షల విలువ చేసే మందుగుండు సామగ్రి పేలి బూడిదైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గత నెల రోజులుగా ఈ దుకాణంలో భారీగా విక్రయాలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం యథావిధిగానే అమ్మకాలు జరుగుతుండగా ఒక్కసారిగా చిన్నగా పేలుడు శబ్దం వినిపించడంతో దుకాణం నుంచి అందరూ బయటకు పరుగులుపెట్టి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఈలోగా దుకాణంలోని ఇతర మందుగుండు సామగ్రికి మంటలు అంటుకోవడంతో అవి పేలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడటం, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. ఇక దగ్ధమైన షాపునకు 50 మీటర్ల దూరంలోనే ఓ గోడౌన్లో లక్షల విలువ చేసే బాణసంచా నిలువ ఉన్నాయి. టపాసులు అటువైపు ఎగిరిపడకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది జోగిపేట, సంగారెడ్డి ఫైర్ ఇంజన్ల సహకారంతో మంటలను అదుపుచేశారు. మేలుకోని అగ్నిమాపక శాఖ అధికారులు ఓ వైపు నిబంధనలను పాటించాలి అంటూనే..మరోవైపు వాటిని అధికారులే విస్మరిస్తూ బాణసంచా దుకాణాలకు అనుమతులు ఇచ్చి తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఫైర్ సేఫ్టీ వివిధ శాఖల అధికారులు నిబంధనలు కఠినతరం చేసి ప్రమాదాలు నివారించేందుకు కృషిచేయాలని ప్రజలు కోరుతున్నారు. జోగిపేట సమీపంలో బాణసంచా హోల్‌సేల్ షాపు దగ్ధం కావడంతో వివరాలు తెలుసుకున్న జిల్లా ఫైర్ అధికారి నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 400 దుకాణాలకు అనుమతి ఇప్పటివరకు జిల్లాతో 400 టపాకాయల దుకాణాలు అనుమతి తీసుకున్నారు. అందులో 35 షాప్‌లను తిరస్కరించాం. ఈరోజు కూడా జిల్లాలో తమ సిబ్బందిని తిప్పి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని తొలగిస్తాం. – నాగేశ్వర్రావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, -
పత్రిక గొంతు నొక్కితే పతనం తప్పదు
రాజకీయ కక్షతో ‘సాక్షి’దినపత్రిక గొంతు నొక్కాలని చూస్తే పతనం తప్పదు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తున్నది. ప్రజల పక్షాన వార్తలు ప్రచురిస్తున్న ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై ఏపీ కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – శ్రీధర్ మహేంద్ర, ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు -
జిల్లాలో బీసీ బంద్ విజయవంతం
● పాల్గొన్న పార్టీ నేతలు, వివిధ సంఘాల నాయకులు ● స్వచ్ఛందంగా పాటించిన వ్యాపార సముదాయాలు సంగారెడ్డి: జిల్లాలో చేపట్టిన బీసీ రిజర్వేషన్లపై బంద్ శనివారం విజయవంతమైంది. జిల్లా కేంద్రం సంగారెడ్డితోపాటు ఆయా మండలాలు, పట్టణాలు, గ్రామాలలో బీసీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలతో పాటు,సీపీఎం,సీపీఐ ఆయా సంఘాల నాయ కులు, నేతలు, విద్యార్థి సంఘాలు పాల్గొని వ్యాపార కార్యకలాపాలు జరగకుండా చూశారు. ఈ బంద్‌లో స్వచ్ఛందంగా ఆర్టీసీ, వివిధ వ్యాపార సముదాయాలు బంద్‌ను పాటించారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభుగౌడ్, పలు సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
తహసీల్‌గ్రౌండ్‌లోబాణసంచా దుకాణాలు
నారాయణఖేడ్: ప్రమాదాలకు అవకాశం లేకుండా చుట్టుపక్కల నివాసగృహాలు లేని, పక్కనే అగ్నిమాపక కేంద్రం ఉన్న ఖేడ్ తహసీల్ గ్రౌండ్లో బాణసంచా దుకాణాలకు అధికారులు అనుమతులివ్వడంతో దుకాణాదారులు శనివారం షెడ్లు, టెంట్లతో దుకాణాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీధర్ ఇదివరకే ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్ల గురించి అవగాహన కల్పించగా ఈ మేరకు దుకాణాదారులు వాటిని పాటిస్తూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజన్నను దర్శించుకున్న దత్తగిరి మహారాజ్వేములవాడ: వేములవాడ రాజన్నను బర్దీపూర్ (సంగారెడ్డి జిల్లా)కు చెందిన దత్తగిరి మహారాజ్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు మహారాజ్ అందజేశారు. ఆయన వెంట ప్రొటోకాల్ ఏఈవో అశోక్‌కుమార్, ఆలయ పర్యవేక్షకులు నునుగొండ రాజేందర్, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు ఉన్నారు. నక్కవాగులో అక్రమ తవ్వకాలుసాక్షి, సిటీబ్యూరో: రామచంద్రాపురంలోని నక్కవాగులో అక్రమంగా మట్టి, ఇసుకను తవ్వుతున్న ముఠా గుట్టు రట్టయింది. రెవెన్యూ, ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్, మైన్స్, పోలీసు విభాగాలతో సమన్వయంతో ఆర్సీపురం యూనిట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కంది మండలం బైయాథోల్ గ్రామంలోని నక్కవాగులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ట్రాక్టర్ పంపులు వినియోగించి వాగులో నుంచి మట్టి, ఇసుకను తవ్వుతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి లారీలు, ఇతర భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేశారు. అలాగే నిందితులు తాత్కాలిక నిర్మాణాలను నిర్మించి నక్కవాగు ప్రవహించే రెండు మార్గాలను అడ్డుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఇరిగేషన్ విభాగానికి సమాచారం అందించి, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎర్రోళ్లకు ఈటల పరామర్శ చిన్నకోడూరు(సిద్దిపేట): బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శనివారం పరామర్శించారు. ఎర్రోళ్ల తండ్రి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం గంగాపూర్‌లోని ఆయన నివాసంలో ఈటల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదా ర్చారు. అంతకుముందు గంగాపూర్ పెద్దమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. -
జాతీయ క్రీడలకు వేదికగా పటాన్చెరు
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ● ముగిసిన 69 వ ఎస్జీఎఫ్రాష్ట్రస్థాయి క్రీడలు పటాన్చెరు: క్రీడలకు, క్రీడాకారులకు కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని..రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మూడు రోజులుగా పటాన్‌చెరులోని మైత్రి మైదానం వేదికగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్ 14 బాలుర, బాలికల కబడ్డీ ,అండర్ 17 బాలుర వాలీబాల్ విభాగం రాష్ట్రస్థాయి పోటీలు శనివారం ముగిశాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడాకారుడు కృష్ణం రాజుతోపాటు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమష్టికృషితో రాష్ట్రస్థాయి క్రీడలను విజయవంతం చేశామన్నారు. జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశ్ మాట్లాడుతూ...క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే లభించడం పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి కబడ్డీ జట్టులో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెరగాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్ మాట్లాడుతూ..కబడ్డీ క్రీడలో జాతీయస్థాయిలో మెదక్ జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం నుండి కబడ్డీ క్రీడాకారులు సైతం జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలని అభిలాషించారు. మెదక్ జట్టు ఘన విజయం శనివారం సాయంత్రం అభిమానుల మధ్య జరిగిన అండర్ 14 బాలుర కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌లో నల్లగొండ జిల్లా జట్టుపై మెదక్ జట్టు ఘన విజయం సాధించింది..అండర్ 14 బాలికల కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు పైన ఖమ్మం జిల్లా జట్టు పైన ఘన విజయం సాధించింది. అండర్ 17 బాలుర వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో వరంగల్ జిల్లా జట్టుపై ఖమ్మం జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మధుసూదన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్‌రెడ్డి, ఎంఈవో లు పీపీరాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి
ఎస్పీ పరితోష్ పంకజ్సంగారెడ్డి జోన్: దీపావళి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసే టపాకాయల దుకాణాదారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఓ ప్రకటనలో తెలిపారు. జనావాసాలకు దూరంగా దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత సబ్–డివిజన్ పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎవరైనా పోలీసుల నుంచి అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే ఎక్స్ ప్లోజివ్ యాక్టు 1884 ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దుకాణాదారులు పాటించాల్సిన నిబంధనలు ● దుకాణాలు జనావాసాలకు దూరంగా, ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ● దుకాణం ఉన్న ప్రదేశానికి స్థల యజమాని నుంచి ఎన్ఓసి సర్టిఫికెట్ పొంది ఉండాలి. ● దుకాణాల మధ్య వ్యత్యాసం 3 మీటర్లు, గృహనిర్మాణాలకు 50 మీటర్ల దూరంలో ఉండాలి. ● జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎలాంటి టపాకాయల షాపులు ఏర్పాటు చేయరాదు. ● ఫైర్ ఆక్సిడెంట్‌కు సంబంధించి తక్షణం స్పందించే విధంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
స్వగ్రామానికి రాంచంద్రారెడ్డి మృతదేహం
● నేడు తీగలకుంటపల్లిలో అంత్యక్రియలు ● గత నెల 22న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ కోహెడరూరల్(హుస్నాబాద్): గత నెల 22న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ నేత కట్టా రాంచంద్రారెడ్డి మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని శనివారం ఉదయం కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామానికి తీసుకురానున్నట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రాంచంద్రారెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన కుమారుడు రాజాచంద్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన తండ్రిని మందుగానే అరెస్ట్ చేసి పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలోనే ఎన్కౌంటర్ చేశారని ఆయన ఆరోపిస్తూ దీనిపై సిట్ ఏర్పాటు చేయాలని కోరాడు. దీంతో విచారణ పూర్తయ్యే వరకు మృతదేహం దహనం చేయకుండా భద్రపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం కేసును డిస్మిస్ చేసింది. దీంతో శనివారం ఉదయం రాంచంద్రారెడ్డి మృతదేహం స్వగ్రామానికి రానుంది. -
పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే
‘సాక్షి’మీడియా పట్ల ఏపీ ప్రభుత్వ వైఖరిపై పాత్రికేయ సంఘాల ఆందోళనసంగారెడ్డి జోన్: ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’మీడియాపై, ఎడిటర్ ఆర్.ధనంజయ్‌రెడ్డిపై ఏపీ ప్రభుత్వం పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తోందని ఇది పత్రికాస్వేచ్ఛను కాలరాయడమేనని పలువురు పాత్రికేయులు మండిపడ్డారు. ‘సాక్షి’మీడియాపై, ఎడిటర్ ఆర్.ధనంజయ్‌రెడ్డిపై ఏపీ పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులను నిరసిస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా పలు జర్నలిస్టు సంఘాలు ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. సంగారెడ్డిలో పలు పాత్రికేయ సంఘాల ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టరేట్ ముందు ధర్నా, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు బండారి యాదగిరి మాట్లాడుతూ...ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’మీడియాను ఏపీలోని చంద్రబాబు సర్కారు అణిచి వేసే ప్రయత్నం చేస్తోందని ఇటువంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియాను కట్టడి చేసేందుకు తప్పుడు కేసులు పెడుతూ జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తూ పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు సర్కారు తన తీరు మార్చుకోని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నాయకులు పానుగంటి కృష్ణ, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ (టెంజు) జిల్లా అధ్యక్షుడు అక్కపల్లి యోగానందరెడ్డి, టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.శ్రీధర్‌గౌడ్, కందిలి ఎడిటర్ సురకంటి రాజేందర్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు శివ, కాకోల్ల నాగరాజు, నాగేశ్‌గౌడ్, శివశంకర్‌రావు, సాయినాథ్, వీరేందర్, అన్వర్, విల్సన్, పరంజ్యోతి, ఈశ్వర్, రాజు, విజయ్‌రావు, యాదగిరి, ‘సాక్షి’బ్యూరోఇన్‌చార్జి పి.బాలప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ శివప్రసాద్, రిపోర్టర్లు రాజశేఖర్, రామలింగుబాలయ్య, ఆంజనేయులు, వెంకటేశం, నర్సింహులు, ప్రశాంత్‌గౌడ్, నర్సింహులు, శ్రీనాథ్, వేణు, నగేశ్, నవాజ్, ‘సాక్షి’టీవీ రిపోర్టర్లు మహేశ్, ప్రదీప్, నరేశ్, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. -
మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య
హవేళిఘణాపూర్(మెదక్): మతి స్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని మక్తభూపతిపూర్ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన బక్కన్నగారి మాణయ్య(47) పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు బతుకు దెరువు నిమిత్తం వెళ్లారు. కాగా స్వగ్రామానికి వెళ్తానని చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు.. తూప్రాన్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని జేండాపల్లి సమీపంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం... శివ్వంపేట మండలం దంతాన్పల్లి గ్రామానికి చెందిన గొల్ల నాగరాజుకు ముగ్గురు కూతుళ్లు. మగ సంతానం లేకపోవడంతో పెద్ద కూతురుకు ఇళ్లరికం అల్లుడిని తెచ్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన పెద్దగొల్ల సాయికుమార్ (20)ను ఆరు నెలల క్రితం ఇంటికి తీసుకువచ్చాడు. కాగా ఈ నెల 15న అతడు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో నాగరాజు అతడ్ని మందలించాడు. ఆ రోజు రాత్రి 9గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిన సాయికుమార్ తిరిగి రాలేదు. చుట్టు పక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. వెంటనే శివ్వంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం హల్దీవాగులో శవమై తేలాడు. -
సాగుపై మహిళా రైతులకు అవగాహన
చేగుంట(తూప్రాన్): మండలంలోని పలు గ్రామాల మహిళా రైతులు సెహగల్ ఫౌండేషన్ హైటెక్ సీడ్స్ ప్రతినిధుల సౌజన్యంతో శుక్రవారం ఇక్రిసాట్ సందర్శనకు వెళ్లారు. పరిశోధనాలయంలో వారికి పెరటి తోటల పెంపకం, డ్రమ్ సీడర్, వరి పంట, డ్రిప్ ద్వారా పంటలు సాగు చేసే విధానం గురించి అవగాహన కల్పించారు. భూమి చదును, వర్మీకంపోస్టు తయారీ, పంటలను ఆశించే క్రిమి కీటకాలు, వాటి నివారణ చర్యల గురించి ప్రయోగశాలలో రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు నీరజ్ కుమార్, అవినాష్, ఫీల్డ్ అసిస్టెంట్లు విజయ్, శ్రవణ్, బాబు పాల్గొన్నారు. -
విద్యార్థి మృతిపై ఎస్సీ కమిషన్ విచారణ
వారం రోజుల్లో బాధ్యులపై చర్యలు హుస్నాబాద్‌రూరల్: మండలంలోని పోతారం(ఎస్)లోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 7న 8వ తరగతి విద్యార్థి వివేక్ అనుమానాస్పదంగా మరణించాడు. శుక్రవారం జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి.సునీల్‌కుమార్ బాబుతో పాటు కలెక్టర్ హైమావతి, సీపీ విజయ్‌కుమార్ పాఠశాలకు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పాఠశాలలో ఆ రోజు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? అక్కడ ఉపాధ్యాయులు ఎవరెవరు ఉన్నారనే వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, ప్రిన్సిపాల్స్‌ను విచారించారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ, సీఐలను కేసు విచారణ గురించి ప్రశ్నించారు. విద్యార్థికి పోస్టుమార్టం చేసిన డాక్టర్లను పిలిపించి మృతదేహంపై గాయాల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కేసు దర్యాప్తు నెలలో పూర్తి అవుతుందని, వారం రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు వివరించారు. వీరివెంట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆర్డీవో రాంమూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఎంపీడీఓ రమేశ్ ఉన్నారు. -
‘బంద్‌కు సంపూర్ణ మద్దతు’
నారాయణఖేడ్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రకాశ్‌రాథోడ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు అలిగే జీవన్ కుమార్, ఖేడ్ నియోజకవర్గ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు అనుముల తుకారాం, సీపీఐ జిల్లా నాయకులు చిరంజీవి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. బంద్‌కు ఎంపీ మద్దతుస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు జహీరాబాదు ఎంపీ సురేశ్ షెట్కార్ తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: రఘునందన్‌రావు జిన్నారం (పటాన్చెరు): క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. గుమ్మడిదల పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...బీజేపీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ బంద్‌కు బీఆర్ఎస్ మద్దతుఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి: బీసీ వర్గాల హక్కుల సాధన కోసం శనివారం తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు తమ పార్టీ మద్దతు ప్రకటించిందనీ, జిల్లా ప్రజలు బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లా బీఆర్ఎస్పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. 42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్రవ్యాప్త బంద్ ఒక శాంతియుత నిరసన రూపమని, బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. బీసీల అభివృద్ధి కోసం ఇది ఒక ఆవశ్యక దశ అని పేర్కొన్నారు. 21న ఉమ్మడి జిల్లా రగ్బీ పోటీలకు ఎంపికనారాయణఖేడ్: జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు పాఠశాల క్రీడా సమాఖ్య (ఎసీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 21న ఉదయం 10 గంటలకు ఖేడ్‌లోని ఈ–తక్షిల పాఠశాల గ్రౌండ్లో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి అండర్–19 రగ్బీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు ఎస్ఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గణపతి శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 19 ఏళ్లలోపు వయస్సుగల బాలబాలికలు అర్హులన్నారు. పూర్తి సమాచారం కోసం 91772 41933, 99595 52635, 96660 44630 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. డ్రగ్స్ తయారు చేస్తే కఠిన చర్యలేజిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారి రాము సంగారెడ్డి: జిల్లాలో ఎక్కడైనా నిషేధిత మాదక ద్రవ్యాలు, ఉత్ప్రేరకాలైన డ్రగ్స్ తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారి రాము హెచ్చరించారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టేన్సెస్ వంటి డ్రగ్స్ తయారీ కార్యకలాపాలు ఉంటే టోల్ ఫ్రీ నం 180059 96969తోపాటు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్కు సమాచారం ఇవ్వాలని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు కొండాపూర్(సంగారెడ్డి): ప్రతీ రైతు తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించాలని ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు సూచించారు. మండల కేంద్రమైన కొండాపూర్‌లో పశువులకు పశువైద్య సిబ్బంది శుక్రవారం చేపట్టిన గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంలో వెటర్నరీ అధికారి వెంకటరమణారెడ్డితో ప్రభు పాల్గొని మాట్లాడారు. టీకాల కార్యక్రమం నవంబర్ 14వ తేదీ వరకు కొనసాగుతుందని పశు పోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తొగర్పల్లి కాంగ్రెస్ నాయకులు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి పశువుల ఆస్పత్రిలో మందులను నిల్వచేసేందుకు గానూ రిఫ్రిజరేటర్ను బహుమతిగా అందజేశారు. -
కుక్కల దాడిలో లేగదూడ మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): కుక్కల దాడిలో ఓ లేగదూడ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని మోత్కులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మడక తిరుపతికి రెండున్నరేళ్ల ఆవుదూడ కుక్కల దాడిలో మరణించింది. దీని విలువ సుమారుగా రూ.40వేల వరకు ఉంటుందని పలువురు రైతులు తెలిపారు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని, పిల్లలు, వృద్ధులు, పశువులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. -
సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన
న్యాల్కల్(జహీరాబాద్): రెండు నెలలుగా గౌరవ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం చర్యలు తీసుకొని వేతనాలు వెంటనే చెల్లించాలని ఎస్ఎస్ఏ (సర్వ శిక్ష అభియాన్) ఉద్యోగులు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు శుక్రవారం ఉదయం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమయానికి వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో రవి, మానిక్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రసమయి ఫాంహౌస్‌పై దాడి
● దిష్టిబొమ్మ దహనం, స్వల్ప ఉద్రిక్తత ● పీఎస్‌లో ఫిర్యాదు చేసుకున్న ఇరు పార్టీల నాయకులు బెజ్జంకి(సిద్దిపేట): కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల గొడవతో మండలంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదనపు డీసీపీ విశాల్ కుషాల్కర్ బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పరిస్థితులు పరిశీలించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గుండారంలో గల రసమయి ఫాంహౌస్ ముట్టడికి యత్నించారు. కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయగా అద్దాలు పగిలాయి. ఫామ్‌హౌస్ వద్ద ఏసీపీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఫాంహౌస్ వద్దకు వచ్చిన బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాల కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో ఉన్న కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు బెజ్జంకిలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను దహనం చేయగా, బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యేను దూషించిన మాజీ ఎమ్మెల్యే రసమయిపై చర్యలు తీసుకోవాలని అదనపు డీసీపీ విశాల్ కుషాల్కర్కు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు శ్రీను, ఉపేందర్, ఎస్ఐలు సౌజన్య, రాజేశ్, అలీ, పోలీసు, సీఆర్పీఎఫ్ జవాన్లు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
అప్రమత్తతతోనే ఆనందకేళి
సంగారెడ్డి క్రైమ్: దీపావళి పండుగలో పెద్దల కంటే పిల్లల సందడే ఎక్కువ. బాణాసంచా పేల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. పండుగను సంతోషంగా జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టపాకాయలు కాల్చే సమయంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చిన్నపాటి కారణాల వల్ల ప్రతి సంవత్సరం చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. జిల్లాలో కంటి చూపు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు మండే పదార్థాలు టపాకాయలకు దూరంగా ఉంచాలి. ● ఇంట్లో, మేడపై కాల్చడానికి ప్రయత్నించవద్దు. బహిరంగ ప్రదేశాలు, ఆరు బయట మాత్రమే కాల్చాలి. ● ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్లతో నిండుగా నీళ్లను పక్కన పెట్టుకోండి. ● నిప్పు రవ్వలు దుస్తులపై పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కాటన్ దుస్తులని ధరించాలి. ● గాయాలైనప్పుడు సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు బర్నల్ లేదా దూది అయోడిన్ తదితర కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్టు అందుబాటులో ఉంచుకోవాలి. ● పిల్లలు కాల్చే సమయంలో పెద్దలు పక్కనే ఉండటం అత్యంత శ్రేయస్కరం. ఇవి తప్పనిసరి ● టపాకాయలను ఒకసారి అంటించిన తర్వాత వెలగలేదని చూసేందుకు దగ్గరకు వెళ్లవద్దు. ప్రమాదవశాత్తు కొన్నిసార్లు పేలే ప్రమాదం ఉంటుంది. ● ఏమాత్రం జాగ్రత్తగా ఉన్న నిప్పు రవ్వలు పూరి గుడిసెలు, గడ్డివాములపైకి దూసుకెళ్లి అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ● చుడీదార్ వేసుకునేవారు వదులుగా ఉన్నవి కాకుండా బిగుతుగా ఉండేవి వేసుకోవాలి. ● పర్యావరణ హితమెన టపాకాయలు (గ్రీన్) వాడితే మంచిది. బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి సూచిస్తున్న నిపుణులు పిల్లలు కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి -
ఆర్టీసీ బస్సు ఢీకొని..
● ఇద్దరు కూలీలదుర్మరణం ● సిద్దిపేట జిల్లాలో ఘటన ములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన ములుగు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం... మండలంలోని కమలాబాద్ గ్రామానికి చెందిన బోయిని సాయిలు(65), మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన లెంకల రాజమల్లు(55) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగానే ములుగు రెవెన్యూ కార్యాలయ సమీంపలో రాజీవ్‌రహదారి డివైడర్‌పై గడ్డిని కత్తిరించే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యంగా, అతివేగంగా వచ్చి కూలీలపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో కూలీలు సాయిలు, రాజమల్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు నుజ్జునుజ్జయి రోడ్డుకు అతుక్కుపోయాయి. ఈ మేరకు ఆర్టీసీ డ్రైవర్ మహ్మద్రఫీపై కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. కమలాబాద్కు చెందిన మృతుడు సాయిలుకు భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మరో మృతుడు రాజమల్లుకు భార్య అనసూయ, కూతురు, కుమారుడు ఉన్నారు.రాజమల్లుసాయిలు -
పూడికతీత పనులెప్పుడో!
● కాల్వల్లో పేరుకుపోయిన పూడిక ● ఉపాధి హామీలో పూడిక తీయాలంటున్న ఇరిగేషన్ అధికారులు ● రెండు శాఖల మధ్య కొరవడినసమన్వయం ● చెరువులన్నీ నిండినా ఆయకట్టుకునీరు అందని దుస్థితి కంది(సంగారెడ్డి): చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటలు నిండి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో ఆయకట్టుకు నీరందని దుస్థితి నెలకొంది. చెరువుల నుంచి ఆయకట్టుకు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఫీడర్ చానళ్లు (కాలువలు) పిచ్చి మొక్కలు,ముళ్ల చెట్లు వ్యర్థాలతో నిండి పోయాయి. పంటకు నీరందించే కాలువల్లో నిండిన పూడికను చాలా రోజుల నుంచి తొలగించకపోవడంతో నీరు పారేందుకు వీలు లేకుండా అధ్వానంగా మారాయి. దీంతో ఆయకట్టు కింద పంటలు సాగు చేస్తున్న రైతులు పంటల సాగుకు బోర్లపైనే ఆధార పడాల్సి వస్తుందని వాపోతున్నారు. అప్పట్నుంచీ పట్టించుకోలేదు గత ప్రభుత్వ హాయాంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటల్లో పూడికను తొలగించి వదిలేశారు. కాలువలను ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో పలుచోట్ల ముళ్ల చెట్లు పెరిగి ఫీడర్ చానళ్లు అధ్వానంగా తయారయ్యాయి. గతంలో చెరువులు, కుంటలు, కాలువల నిర్వహణను ఇరిగేషన్ శాఖ పూర్తిస్థాయిలో చేపట్టంది. అయితే గత ఆరేళ్ల నుంచి ఫీడర్ చానళ్లలో ఏర్పడిన పూడికను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించాలని ఆదేశాలున్నప్పటికీ ఆశాఖ ద్వారా పనులు జరగడం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇతర పనులు చేపట్టడం వల్ల అక్కడక్కడ కాల్వలో ఏర్పడిన పూడికను తీసినా అది పూర్తిస్థాయిలో చేయలేదని ఉపాధి హామీ అధికారులు చెబుతున్నారు. పూడికతో 50% కూడా నీరందని వైనం జిల్లాలో1,741 చెరువులు, కుంటలు ఉండగా మొత్తం ఆయకట్టు 72,082 ఎకరాలు ఉంది. ప్రస్తుతం పలు చెరువులు, కుంటలు కాలువల్లో పూడిక నిండటంతో 50% నీరు కూడా అందని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా సంబంధిత శాఖల అధికారులు స్పందించి కాల్వల్లో ఏర్పడిన పూడికను తొలగించి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.పూడిక తొలగించాల్సి ఉంది ఫీడర్ చానళ్లలో పూడిక ఏర్పడిన మాట వాస్తవమే. పూడికతీతకు నిధులు లేకపోవడంతో ఈ పనులను ఉపాధి హామీ శాఖకు అప్పగించారు. పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు ఇచ్చాం. ఆశాఖ అధికారులతో చర్చించి పూడికతీతకు చర్యలు తీసుకుంటాం. – బాల గణేశ్, ఇరిగేషన్ డీఈ -
మా భూముల జోలికొస్తే ఊరుకోం
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని కట్కూర్ గ్రామంలో దళితుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామంలోని దోమ రాజిరెడ్డి ఇంటి నుంచి దుబ్బతండా గ్రామానికి వెళ్లే దారి వరకు సుమారుగా 1.20 గుంటల భూమి ఉందన్నారు. ఈ భూమిని సహకార సంఘం వరి ధాన్యం కొనుగోలు పేరిట కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించాలని, లేనిపక్షంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ పదవికి అభిప్రాయ సేకరణ
జహీరాబాద్/ఝరాసంగం(జహీరాబాద్): కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షపదవి ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకురాలు సిజరిట పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. శుక్రవారం జహీరాబాద్‌లోని ఎస్వీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం పార్టీ అధిష్టానవర్గం నిర్ణయించిన రిజర్వేషన్ వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం బ్లాకుల వారీగా ముఖ్యనేతలతో ప్రత్యేక గదిలో సమావేశమయ్యారు. వారి నుంచి వ్యక్తిగత వివరాలు తీసుకుని నమోదు చేశారు. ఈ సమావేశంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలకు సంబంధించిన పేర్లను పార్టీ నాయకులు ప్రస్తావించినట్లు తెలిసింది. బ్లాక్ స్థాయి నేతల సమావేశం పూర్తయ్యాక మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలతో సైతం సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. సేకరించిన వివరాలను అధిష్టానవర్గానికి పంపిస్తామని సిజరిట తెలిపారు. సమావేశంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి, కేతకీ చైర్మన్ చంద్రశేఖర్, సీడీసీ చైర్మన్ ముబీన్, మాజీ జెడ్పీటీసీలు భాస్కర్‌రెడ్డి, నాగిశెట్టిరాథోడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుం, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేతకీలో పూజలు కేతకీ సంగమేశ్వరాలయాన్ని సిజరిట సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆమెకు మండల కాంగ్రెస్ శ్రేణులతోపాటు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నారు. అనంతరం పూలమాల, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్‌రావు పాటిల్, నాయకులు రాజ్ కుమార్ స్వామి, సంగమేశ్వర్, రామ్‌రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.నేతలతో సమావేశమైనఏఐసీసీ పరిశీలకురాలు సిజరిట -
కారు అద్దాలు పగులగొట్టి..
రూ.1.50 లక్షలు చోరీ కంది(సంగారెడ్డి): కారులో ఉన్న నగదును గుర్తు తెలియని దండగులు చోరీ చేశారు. ఈ ఘటన కాశీపూర్ శివారులో చోటుచేసుకుంది. ఇంద్రకరణ్ ఎస్ఐ విజయ్ కుమార్ కథనం ప్రకారం... పటాన్ చెరు మండలం బీరంగూడకు చెందిన పిల్లబోయిన శ్రవణ్ కుమార్ తన కారులో రూ.లక్షా 50 వేలు ఉంచి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లాడు. కార్యాలయంలో పని ముగించుకుని సాయంత్రం 3:30 గంటల సమయంలో తిరిగి వచ్చి చూసేసరికి కారు అద్దాలు పగులగొట్టి డబ్బుల బ్యాగును అపహరించినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా రూరల్ సీఐ క్రాంతికుమార్, టౌన్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. -
సివిల్స్‌కు ఎంపికై తే దేశ సేవ చేయవచ్చు
కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి: సివిల్ సర్వీస్ అనేది పరీక్ష మాత్రమే కాదని ఆ పరీక్షలు పాసయితే దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుందని కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. ప్రణాళికతో విశ్లేషణాత్మకంగా చదివితే గ్రామీణ విద్యార్థులు కూడా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. సూల్తాన్పూర్లోని జేఎన్టీయూ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అంతకుముందు చౌటకూర్ మండలం తాడ్దాన్పల్లి, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రంతోపాటు సుల్తా న్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం తాడ్దాన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సహజంగా ఉండే విశ్లేషణాత్మకతను మరింత మెరుగుపరచుకుంటే, వారు యూపీఎస్సీ, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల్లో కూడా రాణించగలరని వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న తేడాలు విద్యార్థుల లక్ష్యసాధనకు అడ్డంకిగా భావించవద్దని ధైర్యం చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ స్థాయిని బట్టి వెంటనే బిల్లులు చెల్లిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. చేపపిల్లల పంపిణీకి ఏర్పాట్లు సంగారెడ్డి జోన్: జిల్లాలో చేపపిల్లల పంపిణి కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...చేప పిల్లల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన చేప పిల్లలనే చెరువుల్లో విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఎంపీడీవోలు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. -
ఎన్నికల కమిటీలో డీసీసీలకు అవకాశం
జోగిపేట(అందోల్): కొత్తగా ఎన్నికయ్యే డీసీసీ అధ్యక్షులకు ఎన్నికల కమిటీలో కూడా అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకురాలు సిజరిట పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గతంలో డీసీసీ అధ్యక్షులు కేవలం సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలను సమీకరించడం జిల్లాకు మాత్రమే పరిమితమయ్యే వారని, కానీ ఈసారి వారి ప్రాధాన్యతను పెంచేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేల స్థానంలో టికెట్ కేటాయించే విషయంలో కూడా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కార్యకర్తల్లో నుంచే డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. జహీరాబాద్ నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 50కిపైగా డీసీసీ అధ్యక్షుడి పదవి కోసం దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈనెల 18 వరకు దరఖాస్తులను స్వీకరించి సంగారెడ్డిలోనే ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐసీసీకి కేవలం ఆరుగురి పేర్లను మాత్రమే పంపుతామని, ఏఐసీసీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు ఎంపిక చేస్తారన్నారు. పార్టీలో మహిళల భాగస్వామ్యం కూడా అవసరమని వారిని కూడా రాజకీయంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ పరిశీలకులు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, రాష్ట్ర ఫెడ్కాన్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎం.జగన్మోహన్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకురాలు సిజరిట -
ప్రారంభమైన ఉపాధి హామీ సభలు
సంగారెడ్డి జోన్: గ్రామాల్లో ఉపాధి హామీ పనులను గుర్తించే గ్రామ సభలు జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ప్రతీ ఏటా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి సభలు నిర్వహించి పనులు గుర్తించేవారు. అయితే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో సభలు నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఆలస్యంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ తయారీకి ఆదేశాలు వచ్చే 2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులను గుర్తించడంతో పాటు కూలీల బడ్జెట్ తయారీకి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజల సమక్షంలో ప్రజలతోపాటు రైతులకు ప్రయోజనాలు కల్పించే పనులను ఎంపిక చేయనున్నారు. సహజ వనరులతోపాటు వ్యవసాయ సంబంధిత, వ్యక్తిగత, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత గుర్తించాలని ఆదేశించారు. గత సంవత్సరంలో గుర్తించిన పనులతోపాటు చేపట్టిన పనుల వివరాలను సభలో చదువుతారు. ఉపాధి హామీలో జియోగ్రఫీకల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) యుక్తధార యాప్‌ను ఉపయోగించి పనులను ఎంపిక చేస్తారు. గతంలో చేపట్టిన పనులు పూర్తయిన తర్వాతే కొత్త పనులు చేపడతారు. పంచాయతీల వారీగా గుర్తించిన పనులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఉపాధి హామీలో చేపట్టే పనులు ప్రజలతోపాటు రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు. పశువుల పెంపకానికి షెడ్ల నిర్మాణం, బయోగ్యాస్ ప్లాంట్, వ్యవసాయ పొలాలకు మట్టి రహదారులు నిర్మించడం, పండ్ల తోటల పెంపకం, నర్సరీల ఏర్పాటు, ఫామ్ పాండ్, ప్రభుత్వ భవనాలలో రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, నీటి నిల్వ గుంతలు, కందకాలు, బండరాళ్లతో చెక్ డ్యామ్, ఇంకుడు గుంతల నిర్మాణంతో పాటు వివిధ రకాల పనులు చేపట్టారు. వచ్చే ఆర్థిక ఏడాదికి రూపకల్పన గ్రామ పంచాయతీ తీర్మానాలతో ప్రణాళిక కూలీల జీవనోపాధిపై ప్రత్యేక దృష్టి ఎన్నికల కోడ్ నేపథ్యంలో సభలు ఆలస్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30.96 లక్షల పనులు కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు 18 లక్షలకు పైగా పని దినాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా పనులు కొనసాగుతాయి. జిల్లాలో 2.18 లక్షల జాబ్ కార్డులు ఉండగా 1.20లక్షల జాబ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
అందరివాడే.. అయినా బదిలీ
రామచంద్రాపురం తహసీల్దార్ బదిలీపై జోరుగా చర్చ రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం తహసీల్దార్ సంగ్రామ్‌రెడ్డి ఆకస్మిక బదిలీ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూరు, ఈదులనాగులపల్లి, వెలిమెలలో రియల్ వ్యాపారం జోరుగా ఉండటంతో ప్రభుత్వ పెద్దల కన్ను ఈప్రాంతంపైనే ఉంటాయి. ప్రభుత్వం మారినా ప్రభుత్వానికి చెందిన ముఖ్యశాఖల అధికారుల బదిలీలు రాష్ట్రస్థాయి బడా నేతల కనుసైగల్లో జరగడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రాంతంలో ఏ శాఖలోనైనా పోస్టింగ్ రావాలంటే రాజకీయ పలుకుబడిఉన్న అధికారులు మాత్రమే ఇక్కడకి వస్తారన్న ఆరోపణలున్నాయి. వచ్చిన తర్వాత వారి ఆగడాలకు అంతూపొంతు లేకుండా పోతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వచ్చినప్పుడే వెళ్లిపోతారని... రంగారెడ్డి జిల్లా నుంచి ఎన్నికల సమయంలో సంగ్రామ్‌రెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఎన్నికల తర్వాత సంగ్రామ్ రెడ్డి బదిలీపై వెళ్తారని స్థానికులు, రెవెన్యూ సిబ్బంది అనుకున్నారు. కానీ, ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సానుకూలంగా వ్యవరించారన్న సానుభూతితో బదిలీ కాకుండా అడ్డుకున్నారని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. దీంతోపాటు రియల్ ఎస్టేట్ సంస్థలకు వారనుకున్న విధంగా పనులు చేశారని రెవెన్యూ సిబ్బందే గుసగుసలాడుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం సంగారెడ్డి ఆర్డీఓ బదిలీ అనంతరం సంగ్రామ్‌రెడ్డి సైతం బదిలీ కావచ్చని చాలామంది చర్చించుకున్నారు. మంత్రికి ఫిర్యాదు చేసినా.. అదే విధంగా గత కొన్ని నెలల క్రితం తెల్లాపూర్ పరిధిలోని ఓ వెంచర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని ఈ విషయాన్ని స్థానికులు ప్రధాన శాఖకు చెందిన మంత్రి దృష్టికి సమస్యను తీసుకుని పోయి విచారణ చేయాలని సదరు మంత్రికి లేఖ సైతం ఇచ్చారు. ఆ విషయంలో జిల్లా ఉన్నతాధికారలు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కొంతమంది అధికారులు, నేతల ఒత్తిడితో వాటిని పట్టించుకోలేదానే విమర్శలున్నాయి. వాటితో పాటు వివాదాస్పదమైన భూములలో తల దూరుస్తున్నారని సంగ్రామ్రెడ్డిపై గతంలో అనేక మార్లు స్థానికులు సైతం ఆరోపించారు. పెద్దల అండతో మరికొంతకాలం ఉంటారనుకున్న సదరు తహసీల్దార్‌పై జిల్లా ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసి అందరిని విస్మయానికి గురిచేశారు. ఇదిలా ఉండగా బదిలీకి గల కారణాలు తెలియక కార్యాలయ సిబ్బంది, పలువురు తలలు పట్టుకుంటున్నారు. మృదుస్వభావంతో కనిపించే సంగ్రామ్‌రెడ్డి బదిలీ స్థానికం పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికై నా నిఘా అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యతోపాటు క్రీడలు ముఖ్యమే
పటాన్చెరు: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమేనని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. పటాన్ చెరు మైత్రి క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి 69 వఎస్జీఎఫ్ క్రీడా పోటీలను గురువారం కలెక్టర్ ప్రావీణ్య క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాజరయ్యా రు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ...క్రీడాకారులకు ఈ మూడు రోజులు అత్యంత కీలకమని ఈ క్రీడల్లో రాణిస్తే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందన్నారు. చదువుతోపాటు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఈ క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ... కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో పతకాల సంఖ్య పెంచేందుకు క్రీడాకారులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక దృఢత్వంతోపాటు విద్య,ఉపాధి అవకాశాల్లో అవకాశాలు వస్తాయని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు ఎస్పీ పరితోశ్ పంకజ్ శుభాకాంక్షలు తెలిపారు. పౌష్టికాహారలోప నివారణకు పోషణ అభియాన్ పటాన్చెరు టౌన్: పౌష్టికాహార సమస్యల పరిష్కారానికి పోషణ అభియాన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పటాన్చెరులో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడీపీఓ జయరాం నాయక్ పాల్గొన్నారు. 69వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాల్లో కలెక్టర్ ప్రావీణ్య కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో పతకాల సాధనకు కృషి చేయాలి: ఎంపీ రఘునందన్‌రావు -
బంద్ విజయవంతం చేయాలి
వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన బీసీ జేఏసీ నేతలు సంగారెడ్డి : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం గురువారం నిర్వహించిన సమావేశంలో జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడారు. పార్టీలకతీతంగా జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అంతకుముందు బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసి చైర్మన్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ..బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్న వారికి తగిన గుణపాఠం చెబుదామన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, గోకుల్ రృష్ణ, వైస్ చైర్మన్ గోరుగంటి రమేశ్ కుమార్, వర్కింగ్ చైర్మన్ కుమ్మరి సాయిలు, నాయకులు హరికిషన్, కో–కన్వీనర్ పి.కృష్ణమూర్తి, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు సంగారెడ్డి ఎడ్యుకేషన్: బీసీ రిజర్వేషన్ 42% అమలు కోసం ఈ నెల 18న జరిగే రాష్ట్ర బంద్‌కు పీడీఎస్‌యూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్ స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన పీడీఎస్‌యూ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ...బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నం.9 ను హైకోర్టు కొట్టి వేసిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ జేఏసీ రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌ను చేర్చడం ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లను సాకారం చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్, జిల్లా నాయకులు శ్రీకాంత్,పవన్, అభిషేక్, శైలజ తదితరులు పాల్గొన్నారు. -
మందకొడిగా దరఖాస్తులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మద్యం షాపులను దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు పోటీ పడుతుండటం సాధారణం. సిండికేట్‌గా మారి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటుంటారు. కానీ జిల్లాలోని నాలుగు మద్యం షాపులకు మాత్రం గురువారం వరకు ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. నారాయణఖేడ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మూడు షాపులకు, అందోల్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మరో షాపునకు ఇప్పటివరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ నాలుగు మద్యం షాపులు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాయి. కాగా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు శనివారంతో ముగియనుంది. ఈసారి స్పందన అంతంతేనా? మద్యం షాపుల కేటాయింపుల విషయంలో ఈసారి మద్యం వ్యాపారుల నుంచి ఆశించిన మేరకు స్పందన కనిపించడం లేదు. 2023తో పోల్చితే ఈసారి అంతంత మాత్రంగానే దరఖాస్తులు వస్తున్నాయి. ఈ జిల్లాలో ఐదు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 101 మద్యం షాపులున్నాయి. 2023లో నిర్వహించిన దరఖాస్తుల ప్రక్రియలో ఏకంగా 6,156 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఇప్పటివరకు 1,264 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులకు గడువు రెండు రోజులు మాత్రమే మిగిలిఉంది. చివరి రెండు రోజులైన శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఎకై ్సజ్ అధికారులు ధీమాతో ఉన్నారు. అయితే 2023లో వచ్చిన స్థాయిలో ఈసారి అంతగా రాకపోవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనుభవం ఉన్న వారితో కలిసి.. మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న వారితో కలిసి సిండికేటుగా మారి పెద్ద మొత్తంలో దరఖాస్తులు చేసుకునేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకునే వారు కూడా కొందరు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒకవేళ అదృష్టం వరించి వచ్చిన మద్యం షాపును నిర్వహించలేని పక్షంలో ఎవరికై నా లీజుకు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కాగా తక్కువ సేల్స్ ఉండే మద్యం షాపులు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న షాపులను కొనుక్కునేందుకు మద్యం సిండికేట్ వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాలకు చెందిన మద్యం వ్యాపారులు కూడా ఈసారి జిల్లాలోని మద్యం షాపులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మద్యం వ్యాపారులు దరఖాస్తులు చేసుకోవాలని భావిస్తున్నారు. సిండికేటుగా మారి.. బల్క్‌గా దరఖాస్తులు మద్యం వ్యాపారులంతా సిండికేటుగా మారి బల్క్‌గా దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఈ దరఖాస్తు ఫీజును రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే పెరిగిన ఈ ఫీజును ఈ వ్యాపారులు ఏమాత్రం లెక్క చేయరనే అభిప్రాయం కూడా ఉంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. బిల్లులు సకాలంలో రావనే భయంతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. వీరంతా ఇప్పుడు ఈ మద్యం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతారనే అంచనాలున్నాయి. పైగా ఈ వ్యాపారంలో మంచి లాభాలు ఉండటంతో ఎలాగైనా మద్యం షాపులను దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఒక్క దరఖాస్తు కూడా రాని మద్యం షాపులు నాలుగు ఆశించిన స్థాయిలో మద్యం వ్యాపారుల నుంచి స్పందన కరవు చివరి రెండు రోజుల్లో బల్క్‌గా వస్తాయనే ధీమాలో ఎకై ్సజ్ వర్గాలు రేపటితో ముగియనున్న గడువు -
విరామమెరుగని బోధన
ఆదర్శంగా నిలుస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు గంగ రాములు హత్నూర(సంగారెడ్డి): పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు 80 ఏళ్ల వృద్ధాప్యంలో సైతం విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండల కేంద్రమైన హత్నూరకు చెందిన కోట గంగ రాములు 1968లో ఉపాధ్యాయుడిగా జిన్నారం మండలం శివనగర్ పాఠశాలలో ఉద్యోగ జీవితం ప్రారంభించి.. 2004 ఏప్రిల్‌లో మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం గంగారం పాఠశాలలో పదవీ విరమణ పొందారు. అనంతరం బోరపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది సంవత్సరాలుగా ఉచితంగా తెలుగు బోధన చేశారు. దౌల్తాబాద్ పాఠశాలలో రెండేళ్లు, కొన్యాల పాఠశాలలో ఐదు నెలలు తెలుగు బోధించారు. 2011 నుంచి హత్నూర కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో 14 ఏళ్లుగా ఉచితంగా విద్యార్థినులకు తెలుగు బోధిస్తున్నారు. వద్ధాప్యంలో 9 ఏళ్ల క్రితమే భార్య లక్ష్మీనరసమ్మ మృతి చెందింది. సంతానం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాల పిల్లలనే తన పిల్లలనుకుంటున్నారు. ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వచ్చి పిల్లలతోనే భోజనం చేసి సాయంత్రం వరకు వారికి బోధిస్తున్నారు. 1999లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం నుంచి అవార్డు సైతం అందుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నెల పెన్షన్ విద్యార్థుల అవసరాలకు, ఆడపిల్లల చదువులు, పెళ్లిళ్లకు కొంతమేర సహాయం అందిస్తానని గంగ రాములు తెలిపారు. 80 ఏళ్ల ఉచితంగ బోధిస్తూ అందరి మన్నలను అందుకుంటున్నారు. -
శభాష్.. దుర్గయ్య
● బస్సులో మరిచిపోయిన 39 తులాల బంగారం బ్యాగ్ అప్పగింత ● నిజాయితీ చాటుకున్న ప్రయాణికుడికి డిపో సిబ్బంది సన్మానం సంగారెడ్డి టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు దుర్గయ్య నిజాయితీ చాటుకున్నాడు. సంగారెడ్డికి చెందిన రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి వసుధ ప్రకాష్ భార్యాభర్తలు గురువారం సికింద్రాబాద్‌లో 39 తులాల బంగారం కొనుగోలు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ బస్టాండ్ నుంచి సంగారెడ్డికి బస్సులో తిరిగి వస్తుండగా బ్యాగ్ సీట్లో పడిపోయింది. అయితే అదే బస్సులో ప్రయాణిస్తున్న దుర్గయ్య అనే ప్రయాణికుడు కండక్టర్ శ్రీధర్ రెడ్డికి బ్యాగ్‌ను అందజేశాడు. వెంటనే డిపో మేనేజర్‌కు తెలియజేయగా.. సంబంధిత ప్రయాణికులకు సమాచారం అందించి సుమారు రూ.50 లక్షల విలువ చేసే 39 తులాల బంగారు బిస్కెట్లను అందజేశారు. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకున్న దుర్గయ్యను ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం కుటుంబ సభ్యులు అతడికి ధన్యవాదాలు తెలిపారు. -
దిగుబడి..దిగాలు
రాయికోడ్(అందోల్)/న్యాల్కల్ (జహీరాబాద్): ఈ ఏడాది పత్తి సాగు రైతులకు కలిసిరాలేదు. అధిక వర్షాలకు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. రూ.వేలల్లో పెట్టుబడులు వెచ్చించిన రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంలేదని వాపోతున్నారు. ఎకరాకు కనీసం 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడిని ఆశించిన రైతులకు కేవలం మూడు నుంచి నాలుగు క్వింటాళ్లే వస్తుండటంతో రైతులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. జిల్లాలో 3.68 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా సుమారు 3,87,539 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. సదాశివపేట, రాయికోడ్, మునిపల్లి, వట్పల్లి, నారాయణఖేడ్, మనూరు తదితర మండలాల్లో అధికంగా సాగు చేశారు. అప్పటికే పత్తి పంటపై ఎకరా సాగు కోసం రూ.30 వేలకు పైగా పెట్టుబడులు పెట్టారు. తొలుత పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలో పత్తి రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ వర్షాలకు పత్తిపంటలు దారుణంగా దెబ్బతినడంతో పంట దిగుబడిపై ప్రభావం చూపాయి. వచ్చిన దిగుబడినైనా దక్కించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కూలీలకు అధిక రేట్లు ఓ వైపు, కూలీల కొరత మరోవైపు పత్తిరైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. పత్తితీత కోసం కిలో రూ.16 చొప్పున కూలీలకు చెల్లించాల్సి వస్తుండటంతో రైతులు నష్టాల బాట పడుతున్నారు. వేధిస్తోన్న కూలీల కొరత జిల్లాలో కూలీల కొరత ఉండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మైబూబ్ నగర్, రంగారెడ్డి, దేవరకొండ, కర్నూల్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి ఆటోలు, ఇతర వాహనాలను ద్వారా కూలీలను తెప్పించుకుని రైతులు పత్తితీత పనులు కొనసాగిస్తున్నారు. కూలీలను ఇతర ప్రాంతాల నుంచి రప్పించేందుకు అయ్యే రవాణ ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వస్తోంది. ఇక వలస కూలీలకు వారానికొకసారి దావత్ కూడా ఇవ్వవలసి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. రైతులకు ఈసారి కలిసిరాని పత్తి సాగు! రూ.12 వేలు చెల్లిస్తే... క్వింటాలు పత్తికి రూ.8,110లుగా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. ధర ఆశాజనకంగా ఉన్నా దిగుబడులు తగ్గనుండటంతో తాము నష్టపోవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే క్వింటాల్‌కు రూ.12 వేలు చెల్లిస్తే నష్టాల నుంచి కొంతమేర బయట పడొచ్చని రైతులు ఆశిస్తున్నారు. కూలీలు దొరకడం లేదు నాలుగు ఎకరాల్లో పత్తిని సాగు చేసి రూ.లక్షకు పైగా వెచ్చించాను. పత్తితీతకు స్థానికంగా కూలీలు దొరకడం లేదు. యాసంగి పంటలపైనే ఆశలు పెట్టుకున్నాను. –భాగన్న, రైతు మాటూర్ గ్రామం రూ.12 వేల ధర నిర్ణయించాలి అధిక వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వం క్వింటాలు పత్తికి కనీసం రూ.12 వేలు నిర్ణయించి ఆదుకోవాలి. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడే వస్తోంది. దీంతో వెచ్చించిన పెట్టుబడులు వస్తే చాలని భావిస్తున్నాం. –గోపాల్‌రెడ్డి, రైతు, ఖాంజమాల్‌పూర్ రాయికోడ్ మండలంతీతలో జాగ్రత్తలు పాటించాలి పత్తి పూత, కాత సమయాల్లో వర్షాలు అధికంగా కురవడంతో పత్తి దిగుబడి పడిపోయింది. దీంతో తీత లో రైతులు జాగ్రత్తలు పాటించాలి. పత్తికాయ నుంచి పత్తిని పూర్తిగా తీయాలి. రవాణాలో పత్తి వృథాను అరికట్టాలి. పంటకు దుమ్ముధూళీ అంటుకోకుండా చూసుకోవాలి. సూర్యోదయం అనంతరమే పత్తిని తీయాలి. పంటను ఆరబెట్టి నాణ్యతను కాపాడుకోవాలి. –సత్యనారాయణ. ఏడీఏ రాయికోడ్. -
ఎంచె దాటేదెలా.. పంట చేరేదెలా!
వరద మిగిల్చిన నష్టం అన్నదాతలను వీడటం లేదు. మంజీరా వరదలతో కుర్తివాడ ఎంచె (వంతెన)కొట్టుకు పోయింది. ఇంత వరకు తాత్కాలిక మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో వంతెన అవతల మంజీరా ఒడ్డున సాగుచేసిన 200 ఎకరాల పంట నీటిపాలైంది. అలాగే సుమారు 800 ఎకరాల్లో పండిన వరి పంట కోత కొచ్చింది. కోసిన ధాన్యం ఇంటికి రావాలంటే ఎంచె ఒక్కటే మార్గం. 2008లో అప్పటి ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి చొరవతో రూ.78 లక్షల వ్యయంతో ఈ వంతెన నిర్మించారు. ఇటీవల వరదలతో రోడ్డు కొట్టుకు పోయిందని, ఇప్పుడు ధాన్యం ఇంటికి తీసుకు రావాలంటే మార్గం మూసుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షాలు పడితే చేతికొచ్చిన పంట కూడా నీటి పాలవుతుందని, అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. – పాపన్నపేట(మెదక్) -
కారు చీకట్లో కాంతి రేఖ..!
సిద్దిపేటకమాన్: కార్నియా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఇదో శుభవార్త. తిరిగి చూపును ప్రసాదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. పైలెట్ ప్రాజెక్టు కింద పోస్టు గ్రాడ్యుయేషన్ టీచింగ్ సదుపాయం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్ మూడు ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసింది. ప్రభుత్వాసుపత్రిలో చనిపోయిన వ్యక్తి నుంచి ఆసుపత్రి ఆప్తమాలజీ విభాగ వైద్యులు కార్నియా సేకరించి హైదరాబాద్ సరోజిని దేవి కంటి ఆసుపత్రికి పంపుతారు. వాటిని అవసరమైన వారికి అమర్చి తిరిగి కంటి చూపును ప్రసాదించనున్నారు. ఇందుకోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్‌నర్సులు, వైద్యులు, సిబ్బందికి శిక్షణ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఆరు గంటల్లోపు కార్నియా సేకరణ సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చే మృతదేహాల నుంచి ఆరు గంటల్లోపు కార్నియా సేకరించి, ప్రత్యేక బాక్సులో స్టోర్ చేస్తారు. ఆర్టీసీ ద్వారా హైదరాబాద్ సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తరలించనున్నారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రెండు కార్నియాలు కంటి చూపు సమస్యతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు చూపును తిరిగి తీసుకురావచ్చని ఆసుపత్రి ఆప్తమాలజీ హెచ్ఓడీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. స్టాఫ్ నర్సులకు అవగాహన సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడంతో సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత ఆధ్వర్యంలో ఆప్తమాలజీ హెచ్ఓడీ చంద్రశేఖర్ వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలోని స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇచ్చారు. దీంతో ఆసుపత్రిలో మృతుడి కుటుంబ సభ్యులు, వారి అటెండ్లకు కార్నియా డొనేట్ చేసేలా కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. వైద్యులు, సిబ్బందికి అవగాహన చనిపోయిన వ్యక్తి నుంచి ఆరు గంటల్లోపు కార్నియా సేకరించి సమస్యతో బాధపడుతున్న వారికి అమర్చడం వల్ల కంటి చూపును ప్రసాదించవచ్చు. పైలెట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎంపికైంది. చనిపోయిన వ్యక్తి నుంచి కార్నియా దానం చేసేలా వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి ఆసుపత్రి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. – డాక్టర్ సంగీత, సూపరింటెండెంట్ సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి -
మనసున్న మాస్టారు..
తొగుట(దుబ్బాక): విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేసిన ఉపాధ్యాయుడు ముక్క రమేశ్ అభినందనీయుడని ప్రధానోపాధ్యాయుడు నయీమా కౌసర్ అన్నారు. మండలంలోని వెంకట్రావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో చేరిన 39మందికి రమేశ్ దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ పేద కుటుంబాల విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని గమనించి వారి అవసరాలను తీర్చడం గొప్ప విషయమన్నారు. ఐదేళ్లుగా విద్యార్థులకు ఏదో రకంగా అండగా నిలుస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఒరాకిల్ స్వచ్ఛంద సంస్థ నుంచి రూ 40వేల విరాళంగా సేకరించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని పేర్కొన్నా రు. అలాగే విద్యార్థులకు రూ 5వేల విలువగల క్రీడా సామగ్రిని అందించారని తెలిపారు. విద్యార్థులు ఎంఎంఎస్ పరీక్షలకు సిద్ధం కావడాని కి రూ 3వేల విలువగల పుస్తకాలు అందించా రని గుర్తుచేశారు. రమేష్ అందిస్తున్న సేవా కార్యక్రమాల మూలంగా పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోందన్నారు. -
ఒప్పందం వెనుక ఆంతర్యమేమిటో!
టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తాం తడి, పొడి చెత్త విభభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బసిల్ ఏజెన్సీకి అప్పగించాం. చెత్త విభజనపై కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. పొడి చెత్త అమ్మకంపై వచ్చే ఆదాయం నుంచి మున్సిపల్‌కు కొంత డబ్బు రావాల్సి ఉంటుంది. ఏజెన్సీ మాత్రం మున్సిపల్‌కు డబ్బులు ఇవ్వడం లేదు. ఇక నుంచి పొడి చెత్తపై టెండర్ ప్రక్రియను చేపడుతాం. మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ప్రతి రోజు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వినియోగించే ఆటోలు, ట్రాక్టర్, అందులో పోసే డీజిల్ ఖర్చంతా మున్సిపాలిటీదే. చెత్తను సేకరించి డీఆర్సీసీ సెంటర్‌కు తరలించేది మున్సిపల్ కార్మికులు. చెత్తను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన షెడ్డు మున్సిపల్‌దే. వాహనాలు, వాటి మరమ్మతుల ఖర్చులన్ని మున్సిపల్వే. అలాంటప్పుడు పొడి చెత్త ద్వారా వచ్చే ఆదాయంలో మున్సిపాలిటీకి నయా పైసా రావడంలేదు. గంపగుత్తగా అమ్ముకోవడానికి చేసుకున్న ఒప్పందం వెనుక ఆంతర్యమేమిటని స్ధానికులు ప్రశ్నిస్తున్నారు. పొడి చెత్త నుంచి వచ్చే ఆదాయంలో కనీసం 30 శాతం మున్సిపల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. పొడి చెత్తలో వచ్చే ప్లాస్టిక్ వస్తువులు, ఖాళీ సీసాలు, అట్టలు ఇలా వచ్చిన వస్తువులకు గాను కిలో కొంత కార్మికులకు ఇన్సెంటివ్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వార్డుల వారీగా తడి, పొడి చెత్త విభజనపై సంస్ధ నిర్వాహకులు ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నా ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు. -
ఎన్నికల అధికారులంఅంటూ తనిఖీ
దంపతుల నుంచి 6 తులాల నగలు తస్కరణ పాపన్నపేట(మెదక్): ఎన్నికల అధికారుల మంటూ నమ్మబలికి దంపతుల వద్ద నుంచి 6 తులాల బంగారం తస్కరించారు. ఈ సంఘటన పాపన్నపేట మండలం కొత్తపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివా స్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగ్సాన్పల్లికి చెందిన ఏడుపాయ ల మాజీ డైరెక్టర్ బూచనెల్లి కిషన్, మాణెమ్మ దంపతులు ఎల్లుపేటలో బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యక్రమానికి స్కూటీపై బయలుదేరారు. ఈ క్రమంలో కొత్తపల్లి అనంతుని వాగు వంతెన వద్దకు రాగానే.. ఇద్దరు అగంతుకులు తాము ఎన్నికల అధికారులమంటూ వీరి వాహనాన్ని ఆపారు. తమ వద్ద నగదు లేదని వారు చెప్పగా, మాణెమ్మ మెడలో ఉన్న బంగారాన్ని చూపిస్తూ.. జాగ్రత్తమ్మా దానిని స్కూటీ డిక్కీలో వేసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆమె పుస్తెల తాడు, గుండ్లు తీసి దస్తీలో కట్టి, డిక్కీలో వేసింది. వెంటనే అగంతకులు మరోసారి చెక్ చేద్దామంటూ.. డిక్కీలో చేయి పెట్టి, మాటలతో ఏమార్చి నగలు తస్కరించారు. అగంతకులు వెళ్లి పోగానే అనుమానం వచ్చిన దంపతులు, డిక్కీలో బంగారు ఆభరణాల కోసం వెతకగా..అవి కనిపించ లేవు. దీంతో మోసపోయినట్లు గ్రహించి పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. వీటి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ఎస్జీఎఫ్ క్రీడా సంబురం
● నేటి నుంచి పటాన్చెరులో ప్రారంభం ● మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు ● తరలిరానున్న 33 జిల్లాల క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పటాన్చెరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలకు పటాన్చెరు మైత్రి మైదానం వేదికగా నిలవబోతోంది. గురువారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొంత నిధులతో క్రీడా పోటీల తోపాటు, క్రీడాకారులకు ఉచిత వసతి, భోజనం, ట్రోఫీలు, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. 33 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు, 60 మంది శిక్షకులు, 160 మంది వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడా సంబరాల్లో పాల్గొనబోతు న్నారు. వాలీబాల్, కబడ్డీ పోటీలు జరగనున్నా యని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో మొదటిసారి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్చెరును వేదికగా నిలపడం జరిగింది. త్వరలో మహిళల కబడ్డీ జాతీయ పోటీలకు పటాన్చెరు వేదికగా నిలవబోతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి క్రీడాకారుడిని రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
● మహిళ కడుపులో 4.1 కిలోల గడ్డ తొలగింపు ● దుబ్బాక ఆస్పత్రి వైద్యుల ఘనత దుబ్బాక: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ చేశారు. బుధవారం సూపరింటెండెంట్ హేమరాజ్‌సింగ్ ఆధ్వర్యంలో వైద్యులు ఓ మహిళకు కడుపులో నుంచి 4.1 కిలోల ఓవరియాన్ మాస్గడ్డను తొలగించారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందెడ్‌కు చెందిన జయ(30) ఏడాది కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. నాందెడ్‌లో ఎన్నో ఆస్పత్రులు తిరిగినా తగ్గడం లేదు. బంధువుల సమాచారం మేరకు మూడు రోజుల క్రితం దుబ్బాక ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. అయితే కడుపులో 15 సెంటీమీటర్ల ఓవరియాన్ మాస్ గడ్డ ఉందని గుర్తించారు. ఈ క్రమంలో బుధవారం ఆయుష్మాన్భారత్ పథకం కింద ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులోంచి గడ్డను తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని హేమరాజ్‌సింగ్ తెలిపారు. కాగా, ఆపరేషన్ చేసి జయ ప్రాణాలు కాపాడిన వైద్యులకు ఆమె బంధువులు అభినందనలు తెలిపారు. -
మౌలిక సదుపాయాలు కల్పించండి
సంగారెడ్డి జోన్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణరావు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలపై బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేయవద్దని, ప్రతీ మండలం, నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులు, సూపర్వైజర్లను నియమించాలని సూచించారు. హమాలీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. వాతావరణ శాఖ నివేదికలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో వరి కొనుగోలు కంట్రోల్ రూమ్, టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముందుగా హార్వెస్టర్ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సౌకర్యం రైతుల విశ్రాంతి కోసం షెడ్ల ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో డీఎం సివిల్ సప్లై అధికారి అంబదాస్ రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల అధికారి బాలసరోజ, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్, పీడీ డీఆర్డిఏ జ్యోతి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు దీపిక, ప్రతిభ, తూనికలు కొలతల శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రావీణ్య -
వేర్వేరు ప్రాంతాల్లో ఘటన
ఇద్దరి బలవన్మరణం రామాయంపేట(మెదక్): రామాయంపేట మండల పరిధిలో వేర్వేరు కారణాల తో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. సదాశివనగర్ తండాకు చెందిన లంబాడి మున్యా (35) వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. తెల్లవారు జామున అతని భార్య లేచి చూడగా, ఇంట్లో ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. దీంతో భయాందోళన చెందిన ఆమె విలపిస్తూ ఈ విషయమై తండా వాసులకు సమాచారం అందించింది. ఎస్ఐ బాల్‌రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసీఆర్ కాలనీలో .. మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి గ్రామానికి చెందిన ఎర్రం బాలకృష్ణ (38) స్థానిక డబుల్ బెడ్రూం కాలనీ ( కేసీఆర్ కాలనీ)లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న బాలకృష్ణ రాత్రి తన వ్యవసాయ బోరు వద్ద క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇల్లు లేని బతుకు ఇంకెందుకు..?
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యచేగుంట(తూప్రాన్): తనకు ఇల్లు లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చేగుంట మండలం పొలంపల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకల ప్రవీణ్ (30)కు సొంత ఇల్లు లేకపోవడంతో గ్రామంలోని ఓ కమ్యూనిటీ భవనంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇందిరమ్మ ఇల్లు సైతం మంజూరు కాలేదు. ఇంటి విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇల్లు లేని బతుకు ఇక ఎందుకు అని వాపోయేవాడు. ఈ క్రమంలో ప్రవీణ్ సోమవారం బయటకు వెళుతున్నట్లు చెప్పి ఇంట్లోంచి వెళ్లాడు. ప్రవీణ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బుధవారం స్థానిక చెరువులో ప్రవీణ్ మృతదేహం తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. -
ఎవరిది ఈ చెత్త ఐడియా..!
సొమ్ము ఒకరిదైతే.. సోకు మరొకరిది అన్నట్లుందీ హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిస్థితి. కష్టం కార్మిలకుదైతే.. కాసులు మాత్రం ప్రైవేట్ ఏజెన్సీ జేబుల్లోకి వెళుతున్నాయి. చెత్త సేకరణ ప్రక్రియకు సంబంధించి ఖర్చంతా భరిస్తున్న మున్సిపాలిటీకి నయా పైసా ప్రయోజనం చేకూరడం లేదు. ఈ ‘చెత్త’ఐడియా మున్సిపల్ అధికారులకు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని పట్టణ ప్రజలు విస్మయం చెందారు. హుస్నాబాద్: మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు నిత్యం ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తారు. తడి చెత్తను వేరు చేసి అక్కడే సేంద్రియ ఎరువుగా మారుస్తుంటే.. పొడి చెత్తను ఓ స్వచ్ఛంద సంస్ధ సొమ్ము చేసుకుంటోంది. తడి, పొడి, హానికర చెత్తను వేరుచేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపల్ అధికారులు, బసిల్ ఫౌండేషన్ తెలంగాణ స్వచ్ఛంద సంస్ధతో ఒప్పందం చేసుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో ప్రతి రోజు 10 ఆటోలు, ఒక ట్రాక్టర్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరిస్తున్నారు. మొత్తం 26 మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రతి నెల 195 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో 20 టన్నుల పొడి చెత్తను వేరు చేసి, మిగతా తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్నారు. పొడి చెత్తను అమ్ముకునేందుకు మహిళా సంఘాలకు అప్పగించాల్సి ఉండగా, ఐదేళ్ల వరకు బసిల్ ఫౌండేషన్‌కు అప్పగించారు. -
కేతకీలో సీనియర్ సివిల్ జడ్జి పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ బి.సౌజన్య, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారికి తీర్థప్రసాదాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఈఓ శివ రుద్రప్ప, ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్, సిబ్బంది పాల్గొన్నారు. సజ్జనార్‌కు ‘ఫొటోఫ్రేమ్’ అందజేతకల్హేర్(నారాయణఖేడ్): సిర్గాపూర్ మండలం జంల తండాకు చెందిన రాష్ట్ర బంజార సంఘం నాయకులు చరణ్‌సింగ్ బుధవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం సజ్జనార్‌కు ఫోటో ఫ్రేమ్ అందజేశారు. ఆశ్రమ పాఠశాల తనిఖీనారాయణఖేడ్: ఖేడ్ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, వసతిగృహాన్ని స్థానిక సబ్ కలెక్టర్ ఉమాహారతి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాబోధన, భోజనం నాణ్యత విషయాల గురించి విద్యార్థులను ఆరా తీశారు. వసతిగృహంలో సమస్యలు, అవసరాలను గురించి వసతిగృహం సంక్షేమ అధికారిణి బాలమణిని అడిగి తెలుసుకున్నారు. విద్య, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, వసతి, పరిశుభ్రత తదితర విషయాల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం చట్టం చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజుసంగారెడ్డి ఎడ్యుకేషన్: బీసీ రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేవల్‌కిషన్ భవన్లో బుధవారం నిర్వహించిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో జయరాజ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ...రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం వెంటనే 42% రిజర్వేషన్ అమలు బిల్లును ఆమోదించాలని, పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. అదేవిధంగా 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సింగూరులో జలవిద్యుత్ ఉత్పత్తిపుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. దీంతో క్రస్టు గేట్లు మూసివేసి జలవిద్యుత్ కేంద్రం ద్వారా రోజుకు 2,500 క్యూసెక్కుల నీటితో రెండు టర్బయిన్లను ఆన్ చేసి 0.5 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. -
భరోసా సేవలు అభినందనీయం
సంగారెడ్డి జోన్: భరోసా కేంద్రం ద్వారా అందించే సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని భరోసా కేంద్రంలో భరోసా ఐదవ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...మహిళలు, బాలికల సంరక్షణకు పెద్దపీట వేశామన్నారు. మహిళలు, పిల్లలు భయం వీడి నిర్భయంగా వచ్చి తమ సమస్యను తెలుపుకోవచ్చని ధైర్యం చెప్పారు. గత ఐదేళ్లలో 657 పోక్సో, అత్యాచార కేసుల్లో వైద్య, న్యాయ సేవలను అందించినట్లు తెలిపారు. 407 కేసులలో రూ1.73 కోట్ల పరిహారం, 24 మందికి మిషన్ వాత్సల్య స్కాలర్ షిప్ రూ.64లక్షలు అందించినట్లు వివరించారు. తక్షణ పరిహారంగా డీఎల్ఎస్ఏ నుంచి రూ. లక్షను, విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద 50 మందికి రూ: 2.83లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భరోసా నోడల్ అధికారి, అదనపు ఎస్పీ రఘునందన్‌రావు, డీఎస్పీ సత్తయ్యగౌడ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ -
బకాయి తిరిగిరాక బలవన్మరణం
జహీరాబాద్ టౌన్: అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఆ డబ్బును సకాలంలో ఇవ్వకపోవడంతో భర్తకు సమాధానం చెప్పలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. జహీరాబాద్ పట్టణ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఎస్సై వినయ్ కుమార్ కథనం ప్రకారం...జహీరాబాద్ పట్టణ పరిధిలో అల్లీపూర్ షేరి నగర్‌కు చెందిన చింతల్‌గట్టు గొల్ల రాజు(38) సదాశివపేట సమీపంలోని ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అవసరాల కోసం నర్సింహులు వద్ద బంగారంపై రూ.4 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న డబ్బుల్ని బ్యాంక్‌లో కట్టమని భార్య స్వప్నకు నాలుగు లక్షలు ఇచ్చాడు. అయితే ఆమె పరిచయం ఉన్న కోహీర్ మండలంలోని గురుజువాడ గ్రామానికి చెందిన శంకర్‌కు ఆ డబ్బును అప్పుగా ఇచ్చింది. విషయం భర్తకు కూడా చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని శంకర్‌ను అడగడంతో డబ్బులు ఇచ్చేది లేదని మొండికేశాడు. దీంతో భర్తకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మానసిక వేదనకు గురైన స్వప్న బుధవారం ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీకాలతోనే గాలికుంటు నివారణ
సంగారెడ్డి టౌన్: పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. ఈ వ్యాధి నివారణ కోసం టీకాల పంపిణీ కార్యక్రమానికి పశుసంవర్థక శాఖ సిద్ధమైంది. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రతీ ఏటా ఆరు నెలలకొకసారి వ్యాధి నిరోధక టీకాలను ఇస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో ఈ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు అధికారులు కార్యచరణ రూపొందిస్తున్నారు. నెలరోజుల పాటు టీకాలు ఈనెల15న టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా, వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లావ్యాప్తంగా 23,30,904 పశు పక్ష్యాదులుండగా వీటిలో మూడు నెలలు పైబడిన పశువులకు టీకాలు వేస్తారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశువైద్యశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీకాలు వేసిన పశువులకు గుర్తుగా కొమ్ములకు ఆకుపచ్చ రంగు వేస్తున్నారు. వ్యాధి లక్షణాలు పశువుల్లో తీవ్రమైన జ్వరం రావడంతో పాటు నీరసించిపోతాయి. నోటి నుంచి తీగల వలే చొంగ కారుతూ ఉంటుంది. కాలిగిట్టలు, నోటి వద్ద పుండ్లు ఏర్పడతాయి. కొద్దిపాటి ఎండను కూడా ఇవి తట్టుకోలేవు. చూడి పశువులు అయితే ఈనుకుపోతుంది. వీటి పాలు తాగే దూడలు మరణిస్తాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోతాయి. నాలుగు నెలల వయసు దాటిన పశువులు, జీవాలకు టీకా వేయించాలి. ఆవులు, గేదెలకు 2 మిల్లీ లీటర్ల చొప్పున టీకా ఇవ్వాలి. టీకాల వేయించడం ద్వారా అవి ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.సద్వినియోగం చేసుకోవాలి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయించాలి. ఈ నెల 15 నుండి నవంబర్ 14 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలో పశువులు ఉన్న రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ వసంతకుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిముందస్తు టీకాలతో వ్యాధి నివారణ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఝరాసంగం(జహీరాబాద్): పశువులకు ముందస్తుగా టీకాలు వేయడంతో గాలికుంటు వ్యాధి నివారణ చేయవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామంలో ఆవులు, ఎద్దులు, గేదెలకు బుధవారం ఉచితంగా టీకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 1.45 లక్షల పశువులకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్‌రావు పాటిల్, నాయకులు చంద్రశేఖర్, మారుతి రావు పాటిల్, సంగ్రామ్ పాటిల్, వేణుగోపాల్‌రెడ్డి, సంగమేశ్వర్, సిబ్బంది హర్షవర్ధన్ రెడ్డి, సునీల్‌దత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన అధికారులు 1.40లక్షల పశువులకు టీకాలు సద్వినియోగం చేసుకోనున్న రైతులు -
చట్టాలపై అవగాహన అవసరం: సౌజన్య
ఝరాసంగం(జహీరాబాద్): ప్రతీ విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. మండల కేంద్రమైన ఝరాసంగం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో–బేటి పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ... విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకుని లక్ష్యాలను సాధించాలన్నారు. క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడీపీఓ అంజమ్మ, ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ నిర్మల, మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, తదితరులు పాల్గొన్నారు. -
స్కూటీలో నుంచి నగదు చోరీ
జహీరాబాద్ టౌన్: పట్ట పగలే గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీలో నుంచి నగదు అపహరించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన అంజయ్య ఎస్బీ ఐ బ్యాంక్ నుంచి మంగళవారం రూ.3.17 లక్షలు డబ్బు డ్రా చేసుకుని బయట పార్కింగ్ చేసిన స్కూటీ డిక్కీలో పెట్టి మళ్లీ లోపలికి వెళ్లి వచ్చారు. బ్యాంక్ పని పూర్తయ్యాక స్కూటీ డిక్కీ తెరిచి ఉండడంతో అందులోని నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గుర్తించారు. బాధితుడు జహీరాబాద్ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వినయ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మందుబాబులకు జరిమానసంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి పట్టణంలోని పాత బస్టాండ్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, బైపాస్‌లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వహించిన డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఎనిమిది మందిని అదుపు లోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిని బుధ వారం కోర్టులో హాజరుపరచగా అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ.. ముగ్గురికి రూ.1,500, మిగతా ఐదు మందికి రూ.1,000, చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్గొన్నారు. రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలునిజాంపేట(మెదక్): నిజాంపేట మండలంలో ని నందిగామ శివారులో బుధవారం ఆటో, బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. వివరా ల ప్రకారం.. మండలంలోని ఎంపీడీఓ కార్యా లయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్, ఫారెస్ట్ ఆఫీసర్ మహేశ్ బైక్‌పై రామాయంపేట నుంచి నిజాంపేటకు వస్తున్న క్రమంలో ఆటో ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు ఆవుల అపహరణకల్హేర్(నారాయణఖేడ్): మండలంలోని ఫత్తేపూర్‌లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఆవులు అపహరించారు. గ్రామానికి చెందిన హన్మంత్, గాండ్ల పండరికు చెందిన పశువులను ఇంటి ఎదుట కట్టేశారు. ఉదయం చూసేసరికి ఆవులు కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీట మునిగి వ్యక్తి మృతి మంజీరాలో మోటారు తీస్తుండగా ప్రమాదం పాపన్నపేట(మెదక్): మంజీరా నదిలో విద్యుత్ మోటారును తీసేందుకు వెళ్లి నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘట న కుర్తివాడలో బుధవారం వెలుగు చూసింది. ఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆబిద్ (53) వ్యవసాయంతో పాటు, ఆటో నడుపు కొంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంజీరా నది దగ్గర ఉన్న తన పోలానికి ,నీరందించే విద్యుత్ మోటారు పైప్‌లైన్ ఊడిపోయింది. దాన్ని బిగించేందుకు మంగళవారం సాయంత్రం వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. బుధవారం ఉదయం అతని మృతదేహం దొరికింది. కేసు దర్యాప్తులో ఉంది. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి కొండపాక(గజ్వేల్): విద్యార్థిని మల్లం మేఘన(14) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం కుకునూరుపల్లికి చెందిన మేఘన రోజూ లాగానే 6వ తేదీన పాఠశాలకు వెళ్లింది. అయితే సర్టిఫికెట్ మర్చిపోవడంతో స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చింది. తిరిగి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారిని దాటుతుండగా హైదరాబాద్ వైపు బుల్లెట్‌పై వెళ్తున్న కోతి అనిల్ ఢీ కొట్టాడు. దీంతో తలకు గాయాలై కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఆమె తండ్రి ఐలయ్య ఫిర్యాదు మేరకు కోహెడ మండలంలోని తీగలకుంటపల్లికి చెందిన అనిల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్‌కు గాయాలుఅక్కన్నపేట(హుస్నాబాద్): ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అక్కన్నపేట మండలం కుందనవానిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెల్ధండి సంపత్‌రాజు ఆర్టీసీ డ్రైవర్. రోజు మాదిరిగానే డ్యూటీకి తన ద్విచక్రవాహనంపై హుస్నాబాద్‌కు వెళుతున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో సంపత్రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108 అంబులెన్స్ సహాయంతో హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మళ్లీ తెరపైకి!
● బడుల తనిఖీలకు టీచర్లు ● పాఠశాలల వారీగా కమిటీలు ● గతంలో వెనక్కి తగ్గిన విద్యాశాఖ చేగుంట మండలం కరీంనగర్ స్కూల్లో తనిఖీసర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యను అందించి.. విద్యార్థుల్లో స్థాయికి తగ్గ సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా టీచర్ర్లతో మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత జూన్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అప్పట్లో టీచర్లు వ్యతిరేకించడంతో అమలును నిలిపివేశారు. తిరిగి కొన్ని మార్పులతో టీచర్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా జిల్లాలో డీఈఓ రాధాకిషన్ సారథ్యంలో ఇప్పటికే వేసిన జిల్లాస్థాయి కమిటీ రోజు వారీ తనిఖీలు జరుపుతోంది. – మెదక్ అర్బన్ ప్రతి వంద ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక కమిటీ, 50 ఉన్నత పాఠశాలలకు మరో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి, ప్రతి వారం డీఈఓలకు నివేదిక అందజేయాలి. ప్రాథమిక పాఠశాలకు ప్రైమరీ హెచ్ఎం, ప్రాథమికోన్నత పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్ నోడల్ అధికారిగా, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఉన్నత పాఠశాలకు గెజిటెడ్ హెచ్ఎం నోడల్ అధికారిగా, ఎనిమిది మంది సబ్జెక్ట్ టీచర్లు, పీఈటీలు సభ్యులుగా ఉంటారు. పర్యవేక్షణ కమిటీ కోసం ఎంపిక చేసిన టీచర్లు కనీసం పదేళ్ల బోధన అనుభవం కలిగి ఉండాలి. జిల్లాలో ఇప్పటికే మొదలైన తనిఖీలు కనీస సామర్థ్యాలే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ ఇప్పటికే జిల్లాలో ఒక తనిఖీ టీంను ఏర్పాటు చేశారు. ఇందులో ఏఎంఓ, సెక్టోరియల్ అధికారులు, ఆయా మండల ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు సభ్యులుగా ఉన్నారు. ప్రతి రోజు ఒక మండలానికి వెళ్లిన టీం సభ్యులు, విడిపోయి ఒక్కొక్కరు ఒక పాఠశాలకు వెళ్తున్నారు. విధిగా ప్రార్థనలో ఉండి, మద్యాహ్నం వరకు ఈఎల్ఎం అమలు తీరును పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితంలోని చతుర్విద ప్రక్రియలు వస్తున్నాయా..? లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు అభ్యాస దీపికల వినియోగాన్ని గమనిస్తున్నారు. టీచింగ్ డైరీ, పీరియడ్ ప్లాన్స్, టీఎల్ఎం వాడకం తీరును చూస్తున్నారు. అయితే ఎండ్‌లైన్.. బేస్‌లైన్ టెస్ట్‌లలో టీచర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని తెలుస్తుంది. పలుచోట్ల బేస్‌లైన్ టెస్ట్‌లను మూల్యాంకనం చేయడం లేదని సమాచారం. ఎండ్లైన్లో 40 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు, బేస్లైన్లో 6 శాతం చూపడం దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మూడు మండలాల్లో జిల్లా టీంలు తనిఖీలు నిర్వహించారు. -
కార్యకర్తల అభీష్టం మేరకే ఎంపిక
రామచంద్రాపురం(పటాన్చెరు): కార్యకర్తల అభీష్టం మేరకే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకురాలు సిజరిట స్పష్టం చేశారు. రామచంద్రాపురం పట్టణంలో నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల, బ్లాక్, గ్రామస్థాయి కార్యకర్తల అభిప్రాయాల సేకరించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎంపిక చేస్తామన్నారు. అధిష్టానం ఎవరిని నియమించినా అందరూ కలసికట్టుగా, ఐక్యం ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, రాష్ట్ర సీనియర్ నాయకులు నీలం మధు, గాలి అనిల్ కుమార్, శశికళ, చిన్న ముదిరాజ్, జిల్లా నాయకులు మవీన్ గౌడ్, అరుణ్ గౌడ్, శ్యామ్‌రావు, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ పరిశీలకురాలు సిజరిట -
మంజీరాలో ఎముకల గూడు లభ్యం
గల్లంతైన 50 రోజులకు ఆచూకి కొల్చారం(నర్సాపూర్): యాభై రోజుల క్రితం మంజీరాలో గల్లంతైన మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్‌కు చెందిన టేక్మాల్ ప్రమీల (58) ఆచూకీ లభ్యమైంది. ఘటనకు సంబంధించి ఎస్ఐ మహ్మద్ మోహినొద్దీన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రమీల ఆగస్టు 26వ తేదీన కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని మంజీరా వద్దకు వెళ్లింది. ఇదే సమయంలో ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో నదిలో గల్లంతైంది. నాటి నుంచి వదర ప్రవాహం తగ్గకపోవడంతో ఆచూకీ తెలియకుండా పోయింది. నాలుగు రోజులుగా ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో చిన్నఘనాపూర్ శివారులోని మంజీరాలో ఎముకల గూడుతో ఉన్న మహిళ మృతదేహం కనిపించడంతో అటువైపుగా వెళ్లిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్ఐ ఎముకల గూడుపై ఉన్న చీర ఆధారంగా ప్రమీలగా గుర్తించారు. మృతురాలి కుమారుడు వీరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వరుస బదిలీలు అందుకేనా?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కీలక అధికారులపై వరుసగా వేటు పడుతుండటం అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రధానంగా రెవెన్యూశాఖలో అధికారులకు ఆకస్మికంగా స్థాన చలనాలు కలుగుతుండటం కలకలం రేపుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్‌రెడ్డిపై ఇటీవల ఆకస్మిక బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. తాజాగా రామచంద్రాపురం తహసీల్దార్ సంగ్రాంరెడ్డిపై కూడా బదిలీ వేటు పడింది. ఆయన్ను ఏకంగా జిల్లాలోనే అత్యంత మారుమూల మండలమైన నాగల్‌గిద్దకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పరిపాలన సౌలభ్యం పేరుతో ఈ బదిలీ చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. కానీ ఈ బదిలీ రెవెన్యూ వర్గాల్లో చర్చకు దారితీసింది. సంగ్రాంరెడ్డిపై ఆకస్మిక బదిలీ వేటుకు కారణాలేంటనే దానిపై చర్చ జరుగుతోంది. రాజకీయ ఒత్తిడే కారణమా? లేదంటే ఏదైనా అవినీతి ఆరోపణలా? అనే అంశంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి సంగారెడ్డికి అసెంబ్లీ ఎన్నికల బదిలీల్లో భాగంగా సంగ్రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి రామచంద్రాపురం తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఈ రామచంద్రాపురం తహసీల్దార్ పోస్టుకు ఎంతో డిమాండ్ ఉంటుంది. పూర్తిగా నగరంలో కలిసి పోయిన ఈ మండలంలో పట్టణీకరణ ఉన్న ప్రాంతం. భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రూ.వందల కోట్లు విలువ చేసే భూములు ఉండే ఇలాంటి మండలాల్లో కీలకమైన తహసీల్దార్ పోస్టు కోసం అధికారులు చేయని ప్రయత్నాలు ఉండవు. పెద్ద ఎత్తున రాజకీయ పైరవీలు చేసుకుని, ప్రజాప్రతినిధుల అండదండలతో ఇలాంటి మండలాల్లో పోస్టింగ్‌లు తెచ్చుకుంటారు. అయితే ఇలాంటి మండలం కీలక మండలం నుంచి ఆకస్మికంగా ఏకంగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలం నాగల్‌గిద్దకు బదిలీపై పంపడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. బదిలీ అయిన సంగ్రాంరెడ్డి బుధవారం వరకు విధుల్లో చేరలేదని సమాచారం.గత నెలలో ఆర్డీఓపై వేటు.. సంగారెడ్డి ఆర్డీఓగా పనిచేసిన రవీంద్రెడ్డిపై గత నెల సెప్టెంబర్‌లో ఆకస్మిక వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కూడా రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. రవీందర్‌రెడ్డి బీఆర్ఎస్ హాయాంలో జిల్లాలో చాలా కాలంగా పనిచేశారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే రవీందర్‌రెడ్డిని నిమ్జ్ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు బదిలీ జరిగింది. ఇది లూప్‌లైన్ పోస్టుగా రెవెన్యూ వర్గాల్లో అభివర్ణిస్తుంటారు. లూప్‌లైన్ పోస్టులోకి వెళ్లిన వెంటనే రవీందర్‌రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలతో కొన్ని నెలల్లోనే తిరిగి సంగారెడ్డి ఆర్డీఓగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఈ ఆర్డీఓ కార్యాలయం పనితీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యాలయం పైరవీకారులకు నిలయంగా మారిందనేది బహిరంగ రహస్యంగా మారింది. సామాన్య రైతులు, నిరుపేదలు వివిధ పనుల నిమిత్తం ఈ కార్యలయానికి వస్తే కనీసం పట్టించుకోని అధికారులు..బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారుల పనులను మాత్రం చకచకా చేసిపెట్టడంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో రవీంద్రెడ్డిపై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఇది దాదాపు నెల రోజులు గడుస్తుండగానే ఇప్పుడు రామచంద్రాపురం తహసీల్దార్‌ను అత్యంత మారుమూల మండలానికి పంపడం రెవెన్యూశాఖతో పాటు, సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్న సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్‌రెడ్డిపై.. ఇప్పుడు ఆర్సీపురం తహసీల్దార్‌కు స్థాన చలనం అత్యంత డిమాండ్ ఉన్న మండలం నుంచి మారుమూల మండలానికి.. రెవెన్యూశాఖలో చర్చనీయాంశమవుతున్న అధికారులపై చర్యలు -
పర్యవేక్షణ ఫలించేనా?
సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యనందించేందుకు నిరంతర సమగ్ర మూల్యాంకనం, బోధనోపకరణాలు ఉపయోగించి బోధించడం లాంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని గుర్తించిన ప్రభుత్వం బడులను తనిఖీ చేసే బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతకుముందు కూడా ఇలా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కుతగ్గిన సంగతి తెలిసిందే. – న్యాల్కల్(జహీరాబాద్):జిల్లాలో 864 ప్రాథమిక పాఠశాలలు, 191 ప్రాథమికోన్నత, 243 ఉన్నత పాఠశాలలు(ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు) ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 6,208 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలకు తొమ్మిది బృందాలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రెండు, ఉన్నత పాఠశాలలకు మూడు బృందాల చొప్పున జిల్లాలో 14 టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఎస్జీటీలు సభ్యులుగా ఉంటారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించిన కమిటీల్లో ముగ్గురు సభ్యులు ఉండగా, ఉన్నత పాఠశాలల కమిటీల్లో తొమ్మిది మంది సభ్యులుంటారు. ఈ కమిటీలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడతాయి. తనిఖీ బృందాలతో మంచి ఫలితాలు! ప్రస్తుతం పాఠశాలలను కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఏంఈఓలు తనిఖీ చేస్తున్నారు. ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం తనిఖీల కోసం ఈ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బృందాలు ఆయా పాఠశాలలను సందర్శించి పాఠశాలల్లో సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలు తీరు, బోధనా విధానం తదితర అంశాలను పరిశీలిస్తుంది. నివేదికలను పైఅధికారులకు పంపిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ సమీక్షలు నిర్వహించనుండటంతో మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా పాఠశాలలను ఉపాధ్యాయుల చేత తనిఖీ చేయించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతి రేకిస్తున్నాయి. అంతేకాకుండా అసలే ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులకు సరైన విద్యఅందడంలేదని, ఉన్న టీచర్ల నుంచే తనిఖీ బృందాలను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల చదువుపై ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయుల చేత పాఠశాలలను తనిఖీ చేయించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.బోధనపై ప్రతికూల ప్రభావం జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6,972 మంది ఉపాధ్యాయులు ఉండవలసి ఉండగా ప్రస్తుతం 6,208 మందే ఉన్నారు. ఇంకా 764 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమిటీల కోసం 60 మంది ఉపాధ్యాయులను తీసుకుంటే టీచర్ల కొరత ఇంకా ఎక్కువ కానుంది. ఫలితంగా చదువులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. బడుల తనిఖీ బాధ్యత టీచర్లకిస్తూ ప్రభుత్వ నిర్ణయం గతంలోనూ ఉత్తర్వులు జారీ ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకతతో ఉపసంహరణ మళ్లీ తెరపైకి వచ్చిన పర్యవేక్షణ కమిటీలుటీచర్లను అవమానించడమే పాఠశాలలను ఉపాధ్యాయుల చేత తనిఖీ చేయించడం ఉపాధ్యాయులను అవమానించడమే. ఈ విధానాన్ని ఇంతకు ముందే వ్యతిరేకించాం. తనిఖీ కోసం ఉపాధ్యాయులను నియమిస్తే వారి కొరత ఇంకా అధికమై విద్యార్థులను నష్టం జరుగుతుంది. రెగ్యులర్ ఎంఈఓలు, నోడల్ అధికారులను నియమించి వారి చేత పాఠశాలలను తనిఖీ నిర్వహించాలి. దత్తాత్రి, తపస్ జిల్లా అధ్యక్షుడు కమిటీలను ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలల తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తాం. జిల్లాలో 1,298 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వాటి తనిఖీ కోసం 14 బృందాలు ఏర్పాటు చేసి తనిఖీ చేపడతాం. – వెంకటేశ్వర్లు, డీఈఓ–సంగారెడ్డి -
కలాం జీవితం స్ఫూర్తిదాయకం
పటాన్చెరు: అత్యంత సామాన్య కుటుంబం నుంచి జీవితాన్ని ప్రారంభించి.. దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టడంతోపాటు రక్షణ రంగంలో మిస్సైల్మెన్గా గుర్తింపు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని అబ్దుల్ కలాం విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ..అబ్దుల్ కలాం ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ప్రత్యేకంగా కేజీ టు పీజీ విద్యా ప్రాంగణంలోనే ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేశామన్నారు. ప్రతీరోజు ఆయన విగ్రహాన్ని చూసినప్పుడల్లా ప్రతీ విద్యార్థి అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి -
ద్విచక్ర వాహనాలు సీజ్
సంగారెడ్డి క్రైమ్: నిబంధనలకు విరుద్ధంగా డబుల్ సైలెన్సర్లతో ప్రజల ప్రశాంతతకు భంగం కల్గిస్తున్న ద్విచక్ర వాహనదారులపై పట్టణ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... వాహనాదారులు రోడ్లపై శబ్దం చేస్తూ వెళ్లడం ద్వారా శబ్ద కాలుష్యానికి కారకులవుతున్నారని తెలిపారు. మంగళవారం పట్టణంలోని స్థానిక ఐబీ, పోతిరెడ్డి పల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యాన్ని సృష్టించిన వాహనదారులను 50 మందికి పైగా అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
కష్టే ఫలి!
● హర్యానా, గుజరాత్ నుంచి 34 గేదెలు ● రోజూ 160 లీటర్ల పాల విక్రయం ● 57 ఏళ్ల వృద్ధుడి సక్సెస్‌పై కథనంసొంతూరులో డెయిరీ ఫామ్ కష్టపడితే ఏదైనా సాధ్యం కృషి పట్టుదలతో పాటు కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. నలబై ఏళ్ల పాటు బయలు నాటకం నేర్పించా. గత సంవత్సరం మా ఊరులో 34 గేదెలతో డెయిరీ ఫామ్ పెట్టిన. రెండు ఫూటల 160 లీటర్ల పాలు విక్రయిస్తున్నా. పాలల్లో కల్తీ జరిగే ఈ రోజుల్లో.. నాణ్యమైన పాలను విక్రయిస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – కాపు విఠల్, డెయిరీ ఫామ్ నిర్వాహకుడుఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసే ఈ రోజుల్లో ఓ వృద్ధుడు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నలబై ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడి.. నేడు ఓ డెయిరీ ఫామ్‌కు ఓనర్ అయ్యాడు. నాణ్యమైన పాలను అందించడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పిస్తున్న అఖిల డెయిరీ ఫామ్ నిర్వాహకుడు కాపు విఠల్ సక్సెస్‌పై కథనం. – రేగోడ్(మెదక్) మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన 57 ఏళ్ల రైతు కాపు విఠల్‌కు తొమ్మిది ఎకరాల భూమి ఉంది. ముగ్గురు కూతుళ్ల వివాహాలు చేశాడు. 1985లో బయలు నాటకాలు నేర్పించే విద్యను నేర్చుకుని 40 ఏళ్ల పాటు 47 గ్రామాలు, పట్టణాల్లో సుమారు వెయ్యి మంది కళాకారులతో బయలు నాటకం ప్రదర్శించారు. అల్లుడి సూచన మేరకు గత సంవత్సరం గ్రామంలో అఖిల డెయిరీ ఫామ్ ఏర్పాటు చేశాడు. హర్యానా, గుజరాత్ నుంచి ఒక్కో గేదెకు సుమారు రూ. లక్ష 80 వేలు వెచ్చించి మొత్తం 34 గేదెలను తీసుకొచ్చాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సుమారు 160 లీటర్ల పాలను రేగోడ్, నారాయణఖేడ్‌లో విక్రయిస్తూ లాభాలను పొందుతూ నేటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నలుగురు బిహార్ కూలీలతో పాటు తాను పని చేస్తూ పామ్‌ను విజయవంతంగా నడుపుతున్నాడు. ఫామ్‌కు సు మారుగా రూ.కోటి ఖర్చు అయిందని విఠల్ తెలిపా రు. రోజూ పాల విక్రయంతో సుమారు రూ.8,800, నెలకు రూ. 2 లక్షల 64 వేలు సంపాదిస్తున్నాడు. నేటి సమాజానికి ఈ వృద్ధుడు ఆదర్శంగా నిలుస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
తాను చనిపోతూ ఆరుగురికి అవయవదానం
అల్లాదుర్గం(మెదక్): తాను చనిపోతూ వ్యక్తి ఆరుగురికి అవయవదానం చేశాడు. వివరా లు ఇలా... మండలంలోని చేవెళ్ల నివాసి మదునురోళ్ల శ్రీకాంత్ దసరా పండుగను సంతోషంగా తన స్వగ్రామంలో చేసుకున్నాడు. వృత్తి రీత్యా హైదరాబాద్‌కు తిరిగి బయలు దేరాడు. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే అతడ్ని హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జూదరుల అరెస్ట్ పాపన్నపేట(మెదక్): జూదం ఆడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ వివరాల ప్రకారం... మండల పరిధిలోని యూసుఫ్‌పేట గ్రామ శివారులో జూదం ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు. ఈ దాడిలో 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.14,049 నగదు, 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గాంధీనగర్‌లో.. హుస్నాబాద్‌రూరల్: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా... మండలంలోని గాంధీనగర్ మామిడి తోటలో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ఫోన్లు, నాలుగు మోటారు సైకిళ్లు, రూ.6,010 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. పెట్రోల్ బంక్‌లో చోరీ నిజాంపేట(మెదక్): పెట్రోల్ బంక్‌లో గుర్తు తెలియని వ్యక్తులు పలు సామగ్రిని అపహరించారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో భారత్ పెట్రోల్ బంక్‌ను ఎనిమిది నెలల నుంచి మూసివేశారు. కాగా మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆఫీస్ అద్దాలు పగులగొట్టి కంప్యూటర్ మానిటర్, సీసీ కెమెరా మానిటర్‌ను దొంగిలించారు. బంక్ యాజమాని యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెటర్నరీ ఆస్పత్రిలో.. చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని వెటర్నరీ ఆస్పత్రిలో చోరీ జరిగింది. వివరాలు ఇలా... ఆస్పత్రిలోని స్టోర్ రూమ్ తాళం పగులగొట్టి గుర్తుతెలియని దుండగులు సంపు మోటారును ఎత్తుకెళ్లారు. మంగళవారం సిబ్బంది వచ్చి చూడగా స్టోర్ రూం తాళం పగులగొట్టి ఉంది. వెటర్నరీ ఆఫీసర్ గీతా మాలిక మోటార్‌తో పాటు చిన్న చిన్న వస్తువులు దొంగిలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దాడి కేసులో ఇద్దరు అరెస్టుజోగిపేట(అందోల్): టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, భార్య వరలక్ష్మిపై దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఎస్ఐ పి.పాండు కేసు వివరాలు వెల్లడించారు. వీరప్ప దంపతులు కంది మండలం నుంచి టేక్మాల్ గ్రామానికి కారులో వెళుతుండగా అందోలు గ్రామానికి చెందిన ఎండి. షాహిద్, ఎండి. జాఫర్ ద్విచక్ర వాహనంపై అజాగ్రత్తగా మద్యం మత్తులో నడుపుతూ వారి కారును ఢీకొట్టారు. అంతేగాక కారును అడ్డగించి వీరప్పను కొట్టారు. అడ్డుకోబోయిన భార్య వరలక్ష్మిని కూడా గాయపరిచారు. కాగా నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపించారు. పాము కాటుతో యువకుడి మృతి దౌల్తాబాద్ (దుబ్బాక): పాము కాటుతో యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన జానిగామ దయాకర్ (22) తమ పంట చేనులో వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో పాము కాటు కరిచింది. వెంటనే అతడ్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
బాబోయ్ దొంగలు
● ఒంటరి మహిళలే టార్గెట్ ● పెరుగుతున్న బంగారం ధరలు ● రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు దుబ్బాకరూరల్: రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటే బెంబెలెత్తిపోతున్నారు. ప్రస్తుతం రూ.లక్షా30వేలకు చేరింది. ఆర్థికంగా ఉన్న కుటుంబాలు ధర ఎంత పెరిగిన అవలీలగా కొనుగోలు చేస్తున్నారు. రోజు రోజుకు బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచర్ల దాడులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే అంతే.. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. అపహరించడానికి ఎంతకై నా తెగిస్తున్నారు. చైన్ స్నాచర్లు ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. దారి వెంట వెళ్తున్న వారి మెడలో బంగారం కనిపిస్తే కనిపిస్తే చాలు బలవంతంగా లాక్కెళ్తున్నారు. దీంతో మహిళలు కిందపడి గాయాల పాలవుతున్నారు. కొందరు స్నాచర్లు బైక్‌పై వచ్చి అడ్రస్ అడిగినట్లు నమ్మించి పుస్తెలతాడును తెంపుకెళుతున్నారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మహిళలపై దాడి చేసి బంగారం లాక్కెళ్తున్నారు. కొన్ని ఘటనలు.. -
ఆక్రమణల తొలగింపు
జహీరాబాద్ టౌన్: రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలోని దత్తగిరి కాలనీలో ఆక్రమణలను తొలగించిన అధికారులు రంజోల్‌లోని అక్రమ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం కోర్టు రోడ్డులో డబ్బాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ రోడ్డులో స్థలాన్ని కబ్జా చేసి డబ్బాలు ఏర్పాటు చేశారు. కాగా పార్కింగ్‌కు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని న్యాయవాదులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు అక్రమంగా ఏర్పాటు చేసిన మూడు డబ్బాలను తొలగించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
కదలికలు గమనించి.. కళ్లలో కారం కొట్టి..
● పుస్తెలతాడు చోరీకి యత్నం ● దుండగుడిని పట్టుకున్న కార్ వాషింగ్ సెంటర్ నిర్వాహకుడుశంకర్పల్లి: ఓ దుండగుడు ఇంట్లోకి దూరి కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్‌తో దాడిచేసి మహిళ పుస్తెలతాడును అపహరణకు యత్నించాడు. పారిపోతున్న దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం శంకర్పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన ప్రకారం... కామారెడ్డి జిల్లా జుల్కల్ మండలం సవర్గాన్కు చెందిన కుంబారే సిద్ధారెడ్డి, సునీత దంపతులు వారి కుమారుడు, కుమార్తెతో కలిసి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్‌పల్లికి వచ్చారు. పట్టణంలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోజుమాదిరిగానే టిఫిన్ సెంటర్‌కు వచ్చిన సునీత పిల్లలకు లంచ్ బాక్స్ కట్టేందుకు 11.30గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లింది. కొన్నాళ్లుగా ఈ దంపతుల కదలికలను గమనిస్తున్న దుండగుడు మంకీ క్యాప్ ధరించి హఠాత్తుగా ఇంట్లోకి చొరబడ్డాడు. సునీత కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. అక్కడే కార్ వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రవీణ్ గమనించి వెంటనే పట్టుకున్నాడు. అతడి బ్యాగులో కారం పొడి, మంకీ క్యాప్, పుస్తెలతాడు లభించింది. అప్పటికే సునీత భర్తకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధారెడ్డి దుండగుడు టిఫిన్ సెంటర్ ఎదురుగా అద్దెకు ఉండే వాసు(45)గా గుర్తించాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వాసు డైలీ ఫైనాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చేవెళ్ల కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
తల్లికి తలకొరివి పెట్టిన కూతురు
అనాథగా మిగిలిన మానసిక వికలాంగురాలునంగునూరు(సిద్దిపేట): తల్లికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మంగళవారం ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెంబర్ల కొమురవ్వ (85)కు నలుగురు కూతుళ్లు. ముగ్గురి పెళ్లి చేసిన అనంతరం భర్త గురువయ్య మరణించడంతో మానసిక వికలాంగురాలైన చిన్న కూతురు విజయతో కలిసి గ్రామంలో నివసిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న కొమురవ్వ మంగళవారం మృతి చెందింది. కుమారులు లేకపోవడంతో పెద్ద కూతురు అరుణ తల్లికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది. తల్లి మరణంతో వికలాంగురాలైన విజయ అనాథగా మిగిలింది. -
పనికి వెళుతున్నానని చెప్పి..
యువతి అదృశ్యంపటాన్చెరు టౌన్: పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై హిమబిందు వివరాల ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ కాలనీకి చెందిన మధు కుమారి (21) హైదరాబాద్ మదీనగూడ పరిధిలోని షాపింగ్ మాల్లో పనిచేస్తుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం పనికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లి.. చేగుంట(తూప్రాన్): బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని పొలంపల్లి గ్రామానికి చెందిన ఎరుకల ప్రవీణ్ జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోంచి బయటకు వెళుతున్నట్లు చెప్పి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. బంధువులు, స్థానికుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబీకులు పోలీసులకు పిర్యాదు చేశారు. నర్సాపూర్‌లో వ్యక్తి.. నర్సాపూర్‌రూరల్: వ్యక్తి అదృశ్యమైన ఘటన మండలంలోని రుస్తుంపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్‌రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొన్యాల దుర్గయ్య ఈనెల 12న మధ్యాహ్నం ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు బంధువులు వద్ద, పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
గంజాయి సాగుపై పోలీసుల కూంబింగ్
నారాయణఖేడ్: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు ఖేడ్ డివిజన్ పరిధిలో మంగళవారం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి అక్రమ గంజాయిసాగు, నిల్వల గురించి కూంబింగ్ నిర్వహించారు. ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై రావుల శ్రీశైలం ఆధ్వర్యంలో ఠాణాల ఎస్సైలు, సిబ్బంది, క్యూఆర్టీ టీంలు మంగళవారం పలు గ్రామాలు, తండాల శివార్లలోని పంట పొలాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక నుంచి అన్ని గ్రామాలు, తండాల్లో తనిఖీలు కొనసాగుతాయని డీఎస్పీ తెలిపారు. గంజాయిసాగు, నిల్వతో ఎవరైనా పట్టుబడితే నాన్ బెయిలబుల్ కేసులు, హిస్టరీషీట్ తెరుస్తామని, రైతుభరోసా నిలిపివేత చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గంజాయిసాగు, నిల్వల గురించి ఎవరికై నా తెలిస్తే డీఎస్పీ నంబర్ 87126 56709 కు, ఖేడ్ సీఐ 87126 56733 కు, ఖేడ్ ఎస్సై 87126 56757 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. -
పీటీఏల ఏర్పాటుపై వివరాలివ్వండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టుసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో పేరెంట్, టీచర్ అసోసియేషన్(పీటీఏ)ల ఏర్పాటుపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సర్కార్ నుంచి సూచనలు పొంది చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయి దా వేసింది. తెలంగాణ విద్యా చట్టం–1982లోని సెక్షన్ 30 ప్రకారం అన్ని విద్యా సంస్థల్లో పీటీఏను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అనేక చోట్ల ఆ మేరకు చర్యలు చేపట్టలేదంటూ సంగారెడ్డి జిల్లా కంది మండలం అల్లూర్ గ్రామానికి చెందిన ఉప్పు మల్లికార్జున్ పాటిల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విద్యా వ్యవస్థను సంస్కరించడంలో భాగంగా, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులకు భాగ స్వామ్యం ఉండేలా, కనీస వసతులు, నిర్వహణపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వం పీటీఏలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభమైన 30 రోజులలోపు పాఠశాల హెడ్ మాస్టర్ పీటీఏను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. చాలా స్కూల్స్‌లో ఇది అమలు కావడం లేదన్నారు. చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్–టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం తరపున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని సమర్పించేందుకు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. -
వైద్యకళాశాలలో మైదానం ఏర్పాటు
సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం కలెక్టర్ పర్యటించారు. రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జీజీహెచ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు కానున్న మైదానంలో క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్ కోర్టులు, వాలీబాల్ కోర్ట్, త్రోబాల్ కోర్టు, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు అనువైన మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్ రూపకల్పన చేయాలని జిల్లా క్రీడా అధికారి ఖాసీం బేగ్‌కు సూచించారు. సదరం క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి సదరం క్యాంపులు వారానికి మూడు రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందని వాటిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సదరం క్యాంప్‌నకు వచ్చే దివ్యాంగులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సదరం క్యాంపులో పాల్గొనడానికి ఇప్పటివరకు 1,249 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ ప్రావీణ్య జిల్లా ఆస్పత్రి, వైద్యకళాశాల సందర్శన -
అవినీటి అధికారులపై వేటు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నీటి పారుదల శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకు పోయి పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడిన ఈ అధికారులకు స్థానచలనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో ఈ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు మూకుమ్మడి బదిలీలు జరగనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ అధికారులకు ఏమాత్రం తీసిపోని స్థాయిల్లో జిల్లాలోని కొందరు ఇంజనీరింగ్ అధికారులు పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడ్డారు. ఇలాంటి అధికారులపై దృష్టిసారించిన ఆశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ మేరకు ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. మూడేళ్లకొకసారి బదిలీ ఎక్కడ? నిబంధనల ప్రకారం ప్రతీ మూడేళ్లకొకసారి బదిలీలు చేయాల్సి ఉంటుంది. అయితే రాజకీయ నేతల పంచన చేరుతున్న కొందరు అధికారులు ఏకంగా తొమ్మిదేళ్లుగా ఒకేచోట కదలకుండా ఉన్నారంటే ఈ అధికారులు ఏ స్థాయిలో అక్రమార్జన కూడగట్టారనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఈశాఖలో ఒక చీఫ్ ఇంజనీర్, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 24 డీఈ పోస్టులున్నాయి. అలాగే సుమారు 80కిపైగా ఏఈలు, ఏఈఈలు పనిచేస్తున్నారు. ఖాళీలు పోగా సుమారు 120మందికి పైడా ఇంజనీరింగ్, టెక్నికల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఇందులో కొందరు దశాబ్ద కాలంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులున్నారంటే ఏ స్థాయిలో వీరి ఆగడాలు సాగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.సంగారెడ్డి కోసమే ప్రత్యేక బదిలీలురాష్ట్రవ్యాప్తంగా 106 మంది ఇంజనీరింగ్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదుగురు డీఈలకు, 11 మంది ఏఈఈలకు స్థాన చలనం కలిగింది. అయితే ఈ బదిలీలతో సంబంధం లేకుండా సంగారెడ్డి జిల్లా కోసం ప్రత్యేకంగా బదిలీ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం వందల కోట్లు అక్రమార్జనకు మరిగిన ఈశాఖ అధికారులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఈ బదిలీల విషయం ముందే పసిగట్టిన ఈ అక్రమార్కులు మళ్లీ మంచి పోస్టింగ్‌ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుండటం గమనార్హం.ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం త్వరలో జారీ కానున్న బదిలీల ఉత్తర్వులు! చెరువుల ఆక్రమణదారులతో చెట్టపట్టాల్ వందల చెరువుల అన్యాక్రాంతానికి పరోక్ష సహకారం కోట్లలో అక్రమాస్తులు కూడగట్టిన ఇంజనీరింగ్ అధికారులు సంగారెడ్డి ప్రాంతంలో సుమారు తొమ్మిదేళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన ఓ ఇంజనీరింగ్ ఉన్నతాధికారి చెరువుల కబ్జాదారులతో చేతులు కలిపారు. కంచే చేను మేసిన చందంగా చెరువులను కాపాడాల్సిన ఈ అధికారి వీటిని కబ్జా చేస్తూ వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుకూలంగా వ్యవహరించారు. చెరువుల్లోంచి మట్టిని అక్రమ రవాణాదారుల నుంచి పెద్ద మొత్తంలో దండుకున్నారు. పైగా చెరువులను ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందితే చాలు.. పెద్ద మొత్తంలో దండుకోవడం, ఆక్రమణదారులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడంలో సదరు అధికారి ఆరితేరారు. రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడిన ఈ అధికారిపై ఇప్పుడు బదిలీ వేటు వేయాలని ఆశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.పటాన్చెరు ప్రాంతంలో సుమారు నాలుగున్నరేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న మరో ఇంజనీరింగ్ అధికారి చెరువుల కబ్జా రాయుళ్లతో చెట్టపట్టాలేసుకున్నాడు. సుమారు నాలుగు వందలకు పైగా చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర వాటర్బాడీలకు ఎన్ఓసీలు జారీ చేసి రూ.వందల కోట్లు వెనకేసుకున్నట్లు ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. పైగా చెరువులను కబ్జా చేసే అక్రమణదారులతో చేతులు కలిపి పదుల సంఖ్యలో చెరువులు అన్యాక్రాంతం అయ్యేందుకు పరోక్షంగా సహకరించాడు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఈ అధికారికి స్థానచలనం కల్పించాలని ఆశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
18న బంద్‌ను విజయవంతం చేయాలి
సంగారెడ్డి: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మంగళవారం ఐబీలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు బంద్‌లో పాల్గొనాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ...బీసీలకు 42% రిజర్వేషన్లను రాకుండా అడ్డుకుంటున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, నాయకులు కూన వేణు, కుమ్మరి సాయిలు, శ్రీధర్ మహేంద్ర, రమేశ్ గౌడ్, పుల్లంగారి సురేందర్, గోకుల్ కృష్ణ, బలరాం, కృష్ణమూర్తి, రాందాస్ పాల్గొన్నారు.బీసీ నేతల రౌండ్‌టేబుల్ సమావేశం -
బాణసంచా దుకాణాల కేటాయింపు
నారాయణఖేడ్: దీపావళి పండుగను పురస్కరించుకుని ఖేడ్ పట్టణంలోని తహసీల్ గ్రౌండ్లో బాణసంచా దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులకు మంగళవారం లాటరీ ద్వారా వాటిని కేటాయించారు. దుకాణాలను ఏర్పాటుకు 24 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్ కార్యాలయం నుంచి అటవీశాఖ కార్యాలయం ముందు వరకు అక్కడి నుంచి ఐబీ కార్యాలయం వైపునకు ఏర్పాటు చేసుకోవడానికి లాటరీ తీసి దుకాణాలను కేటాయించారు. వ్యాపారులు నిర్ణీత రుసుము చెల్లించి నిబంధనల ప్రకారం బాణసంచా విక్రయించాలని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటేశివయ్య, శానిటేషన్ అధికారి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. అంతకుముందు లాటరీ విధానాన్ని దుకాణాల కేటాయింపు తీరును మైదానంలో డీఎస్పీ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలే జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వర్రావు సంగారెడ్డి క్రైమ్: జిల్లాలో అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పనిసరని జిల్లా అగ్నిమాపక అధికారి బి.నాగేశ్వర్రావు హెచ్చరించారు. తన కార్యాలయంలో మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ..బాణసంచా విక్రయాల కోసం ఇప్పటివరకు 242 దరఖాస్తులు రాగా 162 దుకాణాలకు మాత్రమే అనుమతులు మంజూరు చేశామన్నారు. పీఎస్ఆర్ ఫంక్షన్ హాల్, బైపాస్‌లోని మహిళా ప్రాంగణం, మండే మార్కెట్లో దుకాణాలు ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పారిశుద్ధ్యం లోపించవద్దు డీపీఓ సాయిబాబాకంది(సంగారెడ్డి): గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని డీపీఓ సాయిబాబా సూచించారు. మండల పరిధిలోని వడ్డెనగూడ, కొయ్యగుండు తండాల్లో పారిశుద్ధ్య పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తడి,పొడి చెత్తను వేరు చేసి ఇచ్చేలా ప్రజలకు పంచాయతీ సిబ్బంది వివరించాలన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. వరి కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి డీఆర్డీఏ జ్యోతి సంగారెడ్డి టౌన్: గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని డీఆర్డీఏ జ్యోతి సూచించారు. సంగారెడ్డిలోని మహిళా సమాఖ్య కేంద్రంలో సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మహిళా సంఘాల సభ్యుల చేత కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చామన్నారు. ఖైదీలకూ న్యాయసహాయం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: జైలులో ఉన్న ఖైదీలకు న్యాయపరమైన సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య స్పష్టం చేశారు. కందిలోని సెంట్రల్ జైలులో ఆమె మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఖైదీలకు కనీస సదుపాయాల అందించాలని సమయానికి బెయిల్, ములాఖత్ అందించాలన్నారు. వంటశాలను, లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఆమె వెంట జిల్లా జైలు అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. -
భూ నిర్వాసితులకు ఇంటి స్థలం కేటాయించాలి
ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుకొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని అలియాబాద్, తొగర్పల్లి గ్రామాలలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ హామీ మేరకు ఇంటి స్థలం కేటాయించాలని ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు విజ్ఞప్తి చేశారు. బాధిత రైతులకు ఇంటి స్థలానికి సంబంధించి పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ టీజీఐఐసీ చైర్మ్న్ నిర్మలారెడ్డి, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డితో కలసి మంగళవారం కలెక్టర్ ప్రావీణ్యను కలిశారు. . ఈ సందర్భంగా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రైతులు కొన్నేళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, వారికి తక్షణమే ఇంటి స్థలం మంజూరు చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తొగర్‌పల్లిలో ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం పాఠశాల భవనం పాడుబడిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం నిర్మలారెడ్డి మాట్లాడుతూ...కొండాపూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కలెక్టర్ సానుకులంగా స్పందించారు. -
ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నిక
నారాయణఖేడ్: ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తల అభిప్రాయం మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆ పార్టీ జిల్లా పరిశీలకురాలు సిజరిట పేర్కొన్నారు. ఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్హాల్లో మంగళవారం ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల అభిప్రాయ సేకరణ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిజరిట మాట్లాడుతూ...ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు పార్టీలో తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యకర్తలు అందరి సమష్టి కృషి కారణంగానే రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని తెలిపారు. ఇదే ఐక్యతలో కార్యకర్తలు ఉండాలని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడి వచ్చిన దరఖాస్తుల్లో వడపోత నిర్వహించి ఆరుగురి పేర్లు అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు అందరినీ కలుపుకుపోయే వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం డీసీసీ అధ్యక్షుడి బాధ్యతగా ఉంటుందన్నారు. ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలు మాట్లాడుతూ..కార్యకర్తల సమష్టి కృషి ఫలితంగానే తాము విజయం సాధించామని, స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో కాంగ్రెస్ జెండాలను ఎగరేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు నగేశ్ షెట్కార్, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, శంకరయ్యస్వామి, రషీద్, ఆనంద్ స్వరూప్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పరిశీలకురాలు సిజరిట అధిష్టానానికి ఆరుగురి పేర్లు -
ఆశలన్నీ కొనుగోలు కేంద్రాలపైనే
అకాల వర్షాలతో ఓవైపు పంటలు దెబ్బతినగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్వల్పకాలిక వానాకాలం పంటలు చేతికొస్తున్నాయి. ఇప్పటికే పెసర, మినుము పంటలు కోతలు కోసి రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం సోయాబీన్ పంట దిగుబడులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా మారనుంది. బయట మార్కెట్లో, దళారుల వద్ద పంటలకు మద్దతు ధర లభించడంలేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. – నారాయణఖేడ్: తగ్గిన పంట దిగుబడి జిల్లాలో 67,676 ఎకరాల్లో సోయాబీన్ పంటను రైతులు సాగు చేశారు. పెసర పంట 12,116 ఎకరాలు, మినుము 9,688 ఎకరాల్లో సాగు చేశారు. అకాల వర్షాల వల్ల పెసర, మినుము పంటలు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడులు రావాల్సి ఉండగా కేవలం 3 క్వింటాళ్ల వరకే దిగుబడులు వచ్చాయి. సోయాబీన్ ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడులు రావాల్సి ఉండగా 4 నుంచి 6 క్వింటాళ్ల వరకే దిగుబడులు వస్తున్నాయి. ప్రభుత్వం సోయాబీన్ క్వింటాల్‌కు రూ.5,328 మద్దతు ధరను ప్రకటించింది. గతేడాది ఈ పంటకు 4,892 మద్దతు ధర ఉండగా ఈసారి 8.9% మద్దతు ధర పెంచారు. పెసర రూ.8,682లు గతేడాది ఉండగా 1% పెంచి ఈ ఏడు రూ.8,767లు, మినుము గతేడాది రూ.7,400 చెల్లించగా 5.4% పెంచి రూ.7,800 చొప్పున మద్దతు ప్రకటించింది. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో రైతులకు ప్రయోజనం చేకూరాల్సి ఉండగా ప్రస్తుత మార్కెట్లో పెసర, మినుము పంటలను దళారులు రూ.6వేల నుంచి రూ.7వేల లోపే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వర్షాలతో తడిసిన పంటలు.. కాగా ఈసారి భారీగా, ఏకధాటిగా వర్షాలు కురవడంతో చేలల్లో నీళ్లు నిలిచి పంటలు బాగా దెబ్బతిన్నాయి. దిగుబడులపై తీవ్ర ప్రభావం పడటంతో రైతులకు పెట్టుబడులు కూడా దక్కలేదు. మార్కెట్లో తడిసిన పంటలకు ధర లేకపోవడంతో మరింత నష్టపోతున్నారు. ప్రభుత్వం తడిసిన, రంగుమారిన పంటను కొనుగోలు చేయదు. దీంతో రైతులకు దళారులే దిక్కయ్యారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి తడిసిన పంటను కొనుగోలు చేసిన పక్షంలో రైతుల ప్రయోజనం కలిగేది. సోయాబీన్ పంట నూర్పిళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల్లో అధికంగా పప్పుదినుసు పంటలు సాగవుతాయి. పంట విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.కోతలు ప్రారంభమైన సోయాబీన్ కానరాని కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పెసర, మినుము దళారులపాలు -
మున్సిపాలిటీలతోనే మెరుగైన పాలన
పటాన్చెరు: గ్రామ పంచాయతీల కంటే మెరుగైన పరిపాలన మున్సిపాలిటీల ద్వారా సాధ్యమవుతుందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన కార్యదర్శి శ్రీదేవి పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సేవ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి ఆమె మంగళవారం ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పటాన్చెరు నియోజకవర్గంలో పరిపాలన సౌలభ్యం, సమీకృత అభివృద్ధి కోసం నూతనంగా ఐదు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.15కోట్ల చొప్పున నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 2047 విజన్ ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరు పౌర సేవ కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ...రాబోయే తరాలకు మెరుగైన సౌకర్యాలు, అభివృద్ధితో కూడిన పట్టణాలను అందించాలన్న లక్ష్యంతోనే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసిందన్నారు. నూతన మున్సిపాలిటీలకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి ఫాల్గుణ కుమార్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్‌రావు, మున్సిపల్ సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన కార్యదర్శి శ్రీదేవి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పౌర సేవ కేంద్రం ప్రారంభం -
నిమ్జ్‌లో రైతుల సందడి
జహీరాబాద్ టౌన్: రెండు నెలల తర్వాత జహీరాబాద్ నిమ్జ్ కార్యాలయంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పరిహారం చెక్కుల కోసం రైతులు పట్టణంలోని నిమ్జ్ కార్యాలయానికి రావడంతో సందడి నెలకొంది. జూలై 10న నిమ్జ్ కార్యాయలంలో ఏసీబీ దాడులు చేయడంతో భూసేకరణకు సంబంధించి పరిహారం చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. స్పీడ్ అందుకున్న భూ సేకరణ పనులకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్‌గా విశాలాక్షి పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆమె భూసేకరణపై శ్రద్ధ చూపుతున్నారు. దీంతో ప్రాజెక్టులో భూములు కొల్పోయిన రైతులు పరిహారం చెక్కుల కోసం కార్యాలయానికి వస్తున్నారు.మళ్లీ ఊపందుకున్న కార్యకలాపాలు -
భద్రతా ప్రమాణాలు పాటించాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రతి ఒక్కరూ పనులు చేసే సమయంలో భద్రత నియమాలు పాటించాలని కార్మిక శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం రాష్ట్ర లోక్ జనశక్తి పార్టీ రామ్‌విలాస్ లేబర్ సేల్ అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పెంటయ్య, చారి, జనార్దన్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ హవేళిఘణాపూర్(మెదక్): యువకులు సైబర్ నేరాలు, డ్రగ్స్ భారిన పడకుండా తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ముత్తాయికోటలో విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొని మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసై ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మురళి, డాక్టర్ శరత్, సాయికిరణ్, నాగరాజు, హెచ్ఎం రఘుబాబు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం స్వాధీనంశివ్వంపేట(నర్సాపూర్): అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీసీఎస్ పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం మండల పరిధిలోని పాంబండలో సీసీఎస్ పోలీసులు దాడులు చేసి ఓ పౌల్ట్రీపామ్‌లో 12 బస్తాల రేషన్ బియ్యం (6 క్వింటాళ్లు) పట్టుకున్నారు. అనంతరం రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని శివ్వంపేట పీఎస్‌కు తరలించారు. వారి ఫిర్యాదు మేరకు సివిల్ సప్లయ్, రెవెన్యూ సిబ్బంది విచారణ చేపట్టారు. ముగ్గురు దొంగలు అరెస్టుమద్దూరు(హుస్నాబాద్): ధాన్యాన్ని అపహరించి తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మండలంలోని కూటిగల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ షేక్ మహబూబ్ కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన అల్ద కొమురయ్య మొక్కజొన్న పంటను కోసి ఆరబెట్టాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హుస్నాబాద్, అక్కపేట మండలాలకు చెందిన గంటల శంకర్, పండుగ సతీశ్, బడుగు సంపత్ సుమారు 12 క్వింటాళ్ల మక్కలను అపహరించి హుస్నాబాద్‌కు తరలిస్తున్నారు. రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పందగా కనిపించడంతో విచారించగా దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మద్యం మత్తులో యువకుల వీరంగం కారుకు అడ్డుగా వెళ్లి దంపతులపై దాడి వట్పల్లి(అందోల్): మద్యం మత్తులో ఇద్దరు యువకులు దంపతులపై దాడి చేశారు. ఈ ఘటన సోమవారం మండలంలోని అల్మాయిపేట వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ పాండు వివరాల ప్రకారం... టేక్మాల్ గ్రామానికి చెందిన భక్తుల వీరప్ప ఆయన సతీమణి వరలక్ష్మితో కలిసి సంగారెడ్డి నుంచి వస్తున్న క్రమంలో అందోల్ గ్రామానికి చెందిన జాఫర్, షాహిద్ బైక్‌పై వస్తూ కారును ఓవర్టేక్ చేశారు. ఈ క్రమంలో ముందుకు వెళ్లి బైక్‌ను కారుకు అడ్డుపెట్టి కారు నడుపుతున్న వీరప్పను బయటకు లాగి దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన సతీమణిపై కూడా దాడి చేయగా అటువైపుగా వెళ్లేవారు అడ్డుకున్నారు. ఈ దాడిలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపు జహీరాబాద్ టౌన్: మున్సిపల్ పరిధిలోని రంజోల్‌లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య సోమవారం తొలగించారు. రంజోల్ గ్రామ పరిధిలోని 111 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కొంత మంది అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. సుమారు 10 అక్రమ కట్టడాలను గుర్తించారు. గ్రామంలో ఒక రోజు ముందు దండోరా వేయించి అనంతరం జేసీబీతో అక్రమ కట్టడాలు, రేకుల షెడ్లను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రాణాలు తీసుకుని.. ఆవేదన మిగిల్చి..
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఐదుగురుబలవన్మరణానికి పాల్పడ్డారు. ఉరి వేసుకొని మహిళ.. నిజాంపేట(మెదక్): ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... నిజాంపేటకు చెందిన విభూతి జ్యోతి, నర్సింహులు దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత నెలలో మహబూబ్‌నగర్‌కు కుమారుడు అనిల్‌కుమార్‌తో సహా వలస వెళ్లారు. ఈ క్రమంలో కుమారుడికి ఫిట్స్ రావడంతో వాగులో పడి చనిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి(41) ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకుంది. గమనించిన ఆమె భర్త ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. ములుగులో వివాహిత.. ములుగు(గజ్వేల్): వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని కొక్కొండ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు... దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లికి చెందిన అశ్విని(26)కి కొక్కొండకు చెందిన గుండ్రెడ్డిపల్లి రవిగౌడ్‌తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కాగా కొద్ది రోజులుగా అశ్వినితో భర్తతోపాటు మరిది, అత్త తరుచూ గొడవపడేవారు. ఈ విషయం అశ్విని తన తండ్రికి పలుమార్లు చెప్పినప్పటికీ సర్దుకు పోవాలని సూచించేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అశ్విని ఇంట్లో ఉరివేసుకుంది. ఆమె మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిసై యువకుడు.. శివ్వంపేట(నర్సాపూర్): మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని గంగాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై మధుకర్‌రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మహబూబ్(25) ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మద్యానికి బానిసై కొన్నాళ్ల నుంచి విధులకు వెళ్లకపోవడంతో తల్లి చాంద్‌బీ మందలించింది. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు బిజ్లిపూర్లో ఫంక్షన్‌కు వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి రాగా మహబూబ్ ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో.. కౌడిపల్లి(నర్సాపూర్): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని సలాబత్‌పూర్‌లో జరిగింది. ఎస్సై మురళి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నెల్లూరి వెంకటేశ్(51) మూడేళ్ల క్రితం అప్పుచేసి కూతురు పెళ్లి చేశాడు. ఓ వైపు పెళ్లికి చేసిన అప్పులు తీరక, మరోవైపు కూతురు జీవితం బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటిదూలానికి ఉరివేసుకున్నాడు. మానసిక ఆందోళనతో.. చిన్నశంకరంపేట(మెదక్): మానసిక ఒత్తిడితో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నారాయణగౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన రెడ్డి యాదగిరి కుమారుడు ప్రసాద్(20) ఇంటి వద్దే ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత బైక్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీశాడు. సోమవారం ఉదయం రెక్కలగుట్ట వద్ద బైక్ కన్పించడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లి వెతకగా చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. నిందితుడికి జీవిత ఖైదు మెదక్ మున్సిపాలిటీ: ఓ కేసులో నిందితుడికి కోర్టు జీవితఖైదుతోపాటు, జరిమాన విధించింది. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వివరాలు... సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీరానాయక్ 2020 నవంబర్ 10న జిల్లా కేంద్రంలోని ఓ కల్లు దుకాణం వద ఓ మహిళ ను పరిచయం చేసుకున్నాడు. ఆమెతో మాటలు కలిపి చేగుంట రోడ్ వైపు ఉన్న ధర్మకుంట సమీపంలోకి తీసుకెళ్లి కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఫకీరానాయక్ పక్కన ఉన్న బాటిల్‌ను పగులగొట్టి మహిళ గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమో దు చేసిన పోలీసులు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడికి జీవిత ఖైదుతోపాటు, రూ.15 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
చట్ట ప్రకారం అగ్రిమెంట్లు చెల్లవు
మార్టిగేజ్ ప్రాపర్టీస్కే లీగల్‌రైట్స్ ఉంటాయి. అప్పుల కోసం ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం సరికాదు. ఇంటర్నల్‌గా రెండు పార్టీలు బాండ్ పేపర్లపై, తెల్లకాగితాలపై చేసుకునే అగ్రిమెంట్లు కోర్టు అంగీకరించదు. సేల్‌డీడ్ ఉంటే ఆస్తిపై సర్వహక్కులు కోల్పోయినట్లే. అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నా.. కబ్జాలో తామే ఉన్నట్టు రుజువు చూపిస్తే కొంత వరకు సేఫ్. కోర్టులో ప్రూవ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. బ్యాంకులు మార్టిగేజ్ చేసుకుంటాయి తప్పా ఆస్తులను అనుభవించవు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచి విధానం కాదు. – సార వెంకటవర్మ, న్యాయవాది, జోగిపేట -
బాబాయ్ దశదిన కర్మకు వెళ్లి..
జగదేవ్‌పూర్(గజ్వేల్): బాబాయ్ దశదినకర్మకు వెళ్లి అబ్బాయ్ చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తిగుల్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ కృష్ణారెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన సర్ధగాని చిన్నరాజు(35), రజిత దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. రాజు గ్రామంలో టెంట్‌హౌస్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వరుసకు బాబాయ్‌లు అయినా సర్ధగాని యాదగిరి, సర్ధగాని నర్సయ్యల దశదినకర్మ కార్యక్రమానికి సోమవారం గ్రామంలోని కుటుంబ సభ్యులతో కలిసి మహాసముద్రం చెరువు కట్ట వద్దకు వెళ్లారు. తలనీలాలు అనంతరం చెరువులోకి దిగి స్నానం చేస్తుండగా రాజు ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చెరువులోకి దిగి రాజును బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. కళ్ల ఎదుట భర్త మృతి చెందడంతో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాము కాటుతో..కొమురవెల్లి(సిద్దిపేట): పాము కాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గౌరాయపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పెద్ది నర్సింహారెడ్డి(57) ప్రతి రోజు మాదిరిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. చేనులో వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఎద్దు పొడిచి వృద్ధుడు..హుస్నాబాద్‌రూరల్: ఎద్దు పొడవడంతో వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన హుస్నాబాద్ మండలం మాలపల్లిలో సోమవా రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన సొల్లు రాజయ్య(75) రోజులాగే బావి వద్ద పశువు లను మేతకు విడిచే క్రమంలో ఎద్దు పొడవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. గమనించిన చుట్టు పక్కల రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య బాలవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడు.. రామచంద్రాపురం(పటాన్చెరు): చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... గత నెల 30న రాత్రి రామచంద్రాపురం పట్టణంలో ఆర్టీసీ డిపో సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వృద్ధుడిని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఈనెల 11న రాత్రి మృతి చెందాడు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహం లభ్యం శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. గుర్తించిన పశువులు కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై మధుకర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తి ఇటువైపునకు వచ్చి ఆకలితో అలమటించి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయ స్సు 55 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. -
పది ప్రత్యేక తరగతుల పరిశీలన
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను డీఈఓ వెంకటేశ్వర్లు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్‌ాధ్యన్ని పరిశీలించారు. పాఠశాలలో సదుపాయా లు, తరగతుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రామకృష్ణకు అభినందన సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రామకృష్ణను సోమవారం డీఈఓ వెంకటేశ్వర్లు అభినందించారు. వివరాల ప్రకారం.. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీచర్చ్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ, నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్ షిప్(నీపా న్యూఢిల్లీ) సంయుక్త ఆధ్వర్యంలో స్కూ ల్ లీడర్షిప్ అకాడమీ తెలంగాణ ట్రయల్ బ్లేజర్స్ 2025 పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది. ఇందులో హెచ్ఎం రామకృష్ణతో పాటుగా అదే పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయురాలు సునీతకు స్థానం దక్కింది. విద్యాభివృద్ధికి హెచ్ఎం రామకృష్ణ చేస్తున్న కృషిని డీఈఓ అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం రామకృష్ణ ట్రయల్ బ్లేజర్స్ పుస్తకాన్ని డీఈఓ వెంకటేశ్వర్లుకు అందజేశారు. కార్యక్రమంలో నిజాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు. -
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులు పటాన్చెరు టౌన్: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యాంటి నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులు అన్నారు. సోమవారం సాయంత్రం పటాన్చెరు మండలం ఐనోల్ గ్రామంలో హైదరాబాద్ బేగంపేట్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థినులతో ఎన్ఎస్ఎస్ వింటర్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ వద్ద మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై డీఎస్పీ అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ శిబిరాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు సమాజంపై అవగాహన కల్పిస్తుందన్నారు. చదువు మీరు కోరుకున్న లక్ష్యాన్ని దగ్గర చేస్తుందని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడితే పోలీసులకు, అధ్యాపకులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నరసింహులు, డాక్టర్ ఎం.మధుకర్, నార్కొటిక్స్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు
కొల్చారం(నర్సాపూర్): చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ హైమద్ మోహినోద్దీన్ వివరాల ప్రకారం... మండలంలోని అప్పాజీపల్లి గ్రామానికి చెందిన బుడ్డెన్నోళ్ల సురేశ్ ఆనకట్టకు నీటి ప్రవాహం తగ్గడంతో చేపల వేటకు వెళ్లాడు. ఆనకట్ట దిగువన చిన్నఘనాపూర్ పరిధి లోని మెకానికల్ బ్రిడ్జి వైపు చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. కొద్ది దూరంలో ఉన్న జాలరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మెదక్ నుంచి అగ్నిమాపక సిబ్బందితోపాటు టీజీఎఫ్ బృందాల ను రప్పించి గాలించారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తిరిగి మంగళవారం గాలింపు చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు. -
వడ్డీ వ్యాపారుల నయా దందా
భూములు రిజిస్ట్రేషన్ చేస్తేనే అప్పులు ● సర్వహక్కులు కోల్పోయే ప్రమాదం ● తేడాలొస్తే భవిష్యత్‌లో ఇబ్బందులే ● మార్టిగేజే బెటర్ అంటున్న న్యాయ నిపుణులు గతంలో బంగారం కుదవపెట్టి, ప్రామిసరీ నోట్లు రాసిస్తే వడ్డీ వ్యాపారులు అప్పులిచ్చేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసిస్తేనే అప్పులు ఇస్తున్నారు. ఈ నయా దందాకు వడ్డీ వ్యాపారులు తెరలేపారు. అయితే ఈ విధానంతో భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా మార్టిగేజ్ చేసి బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటే తీసుకున్న వారు సేఫ్‌గా ఉంటారని చెబుతున్నారు. – జోగిపేట(అందోల్) జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫైనాన్స్‌కు చెందిన వారు సిండికేట్‌గా ఏర్పడి జోగిపేట, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లోని రైతులకు, చిన్న చిన్న వ్యాపారులకు అధిక వడ్డీతో అప్పులు ఇస్తున్నారు. ఇందుకు భూములనే కాకుండా భవనాలు, కమర్షియల్ షట్టర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దళారులకు పండుగ వ్యవసాయ భూమిపై అప్పులిస్తామని చెప్పి ప్రతి గ్రామంలో ఒకరిద్దరూ దళారులు ఉన్నారు. వారు అప్పు ఇచ్చే వ్యక్తులకు తీసుకునే వారిని పరిచయం చేసి డబ్బులు ఇప్పించి రిజిస్ట్రేషన్ వరకు ప్రధాన బాధ్యత తీసుకుంటారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు 2 శాతం కమీషన్‌ను తీసుకుంటున్నారు. ఇటీవల ఓ ఘటన డాకూరు గ్రామానికి చెందిన బోయిని కృష్ణ అందోలు మండలంలోని కొంత మంది రైతులకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పులిచ్చి భూములను తన పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇదే భూమిని రూ.50 లక్షలు, కోటి రూపాయల వరకు ఇతరులకు అమ్ముకున్నాడు. అప్పు తీసుకున్న రైతులు లబోదిబోమన్నారు. ఇప్పటి వరకు రూ.20 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉడాయించాడు. డాకూరు గ్రామానికి చెందిన భాగయ్య కృష్ణపై కేసు పెట్టాడు. కాగా ఆరు మాసాలుగా కృష్ణ పరారీలో ఉన్నాడు. భూమి వాల్యూ తక్కువతోనే.. అధికారికంగా భూముల విలువ తక్కువగా ఉండటంతో బ్యాంకర్లు ఆ మేరకు రుణాలు ఇస్తున్నారు. ఎకరాకు రూ.2.50 లక్షల నుంచి రూ.3.60 లక్షలు మాత్రమే వాల్యూ ఉండటం వల్ల బ్యాంకర్లు భూమిని మార్టిగేజ్ చేసుకొని రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం. ఇక్కడ డబ్బులు తీసుకున్నప్పుడు, విడిపించుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆ ఫీజును అప్పు తీసుకున్న వ్యక్తే చెల్లించాలి. దీంతో అదనపు భారం పడటంతోపాటు భూమిపై సర్వహక్కులు కోల్పోవలసి వస్తుంది. -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
చిలప్‌చెడ్(నర్సాపూర్): వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని చండూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ నర్సింహులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దూదేకుల యూసుఫ్ మద్యానికి బానిసై తరుచూ తాగి భార్య రిజ్వానాతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 3న తాగి వచ్చిన యూసుఫ్ భార్యతో గొడవపడ్డాడు. అనంతరం రాత్రి 9 గంటలకు కుటుంబసభ్యులతో భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారిన తరువాత చూస్తే యూసుఫ్ కనపడలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేదు. తెల్లాపూర్‌లో యువతి.. రామచంద్రాపురం(పటాన్చెరు): యువతి అదృశ్యమైన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొమురంభీమ్ కాలనీకి చెందిన గంగమ్మ స్థానికంగా అపార్ట్మెంట్లోని ఇళ్లలో పనిచేస్తుంది. కాగా మధ్యాహ్నం ఆటోలో బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.