సూపర్‌వైజర్ల సెక్టార్ల మార్పు | - | Sakshi
Sakshi News home page

సూపర్‌వైజర్ల సెక్టార్ల మార్పు

Feb 10 2026 9:49 AM | Updated on Feb 10 2026 9:49 AM

సూపర్

సూపర్‌వైజర్ల సెక్టార్ల మార్పు

నర్సాపూర్‌: ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ స్కీం(ఐసీడీఎస్‌) నర్సాపూర్‌ ప్రాజెక్టులోని సెక్టార్లలో పని చేస్తున్న సూపర్‌వైజర్లను ఇతర సెక్టార్లకు మార్పు చేస్తూ స్థానిక సీడీపీఓ హేమభార్గవి ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులోని 11 మంది సూపర్‌వైజర్లను ఒకేసారి మార్పు చేయడం గమనార్హం. ప్రాజెక్టులోని నర్సా పూర్‌, తూప్రాన్‌, మనోహరాబాద్‌, శివ్వంపేట, కౌడిపల్లి, చిలప్‌చెడ్‌ మండలాల పరిధిలో 11 సెక్టార్లు ఉన్నాయి. 11 సెక్టార్లలో విధులు నిర్వహిస్తున్న సూపర్‌వైజర్లను ఒక సెక్టారు నుంచి మరో సెక్టారుకు మార్పు చేస్తూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై స్థానిక సీడీపీఓ హేమభార్గవిని వివరణ కోరగా.. చాలా కాలం పాటు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న సూపర్‌వైజర్లను ప్రాజెక్టులోని మరో సెక్టారుకు మార్చాలన్న నిబంధనల మేరకు వారిని మార్చినట్లు ఆమె తెలిపారు.

సీఏలను వేధిస్తున్న ఏపీఎం

అల్లాదుర్గం(మెదక్‌): గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఐకేపీ సీఏలను ఏపీఎం వేధింపులకు గురి చేస్తున్నారని ముస్లా పూర్‌ సీఏలు లలిత, దుర్గమణి ఆరోపించారు. ఈ మేరకు వారు సోమవారం అల్లాదుర్గం కార్యాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సక్రమంగా విధులు నిర్వహిస్తున్నా.. సమావేశాలకు రావాలని, వస్తే సమావేశంలో కూర్చోనివ్వకుండా బయటకు పంపిస్తున్నారని తెలిపారు. నా ముందు మీరు ఉండొద్దు , ఎప్పుడు పిలిస్తే అప్పుడు కార్యాలయానికి రావాలని ఏపీఎం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పారు. తాము ఏమి తప్పు చేశామో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఏలందరిని ఇదే విధంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై జిల్లా అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.

వృద్ధుడు అదృశ్యం

సంగారెడ్డి క్రైమ్‌: వృద్ధుడు అదృశ్యమయ్యా డు. ఈ ఘటన పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామనాయుడు వివరాల ప్రకారం... సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మీరుడి మల్లయ్య(62), తన భార్య దుర్గమ్మతో కలిసి సోమవారం ఉదయం కళ్ల చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మందుల కోసం ఆస్పత్రి లోపలికి వెళ్లిన మల్లయ్య బయటకు రాలేదు. చుట్టుపక్కల, తెలిసిన బంధు వుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చేపలవేటకు వెళ్లి

యువకుడు మృతి

చిన్నశంకరంపేట(మెదక్‌): చేపలవేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి మండలం శంకాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. నార్సింగి ఎస్‌ఐ సృజన కథనం మేరకు... గ్రామానికి చెందిన బైకరి రమేశ్‌ (26) సోమవారం ఉదయం చేపలవేటకు వెళ్లాడు. స్థానిక మైసన్‌చెరువులో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో మునిగాడు. గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సూపర్‌వైజర్ల సెక్టార్ల మార్పు1
1/2

సూపర్‌వైజర్ల సెక్టార్ల మార్పు

సూపర్‌వైజర్ల సెక్టార్ల మార్పు2
2/2

సూపర్‌వైజర్ల సెక్టార్ల మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement