breaking news
Sangareddy District News
-
ఎందుకు ఇలా..?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సుమారు 80 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలు ఆ పార్టీ మద్దతుదారులే గెలుచుకున్నారు. అప్పట్లో వార్ వన్‌సైడ్ అన్నట్లుగా ఉండేది. కానీ.. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో ఎందుకు సర్పంచ్ స్థానాలు రావడం లేదు..? పలు మండలాల్లో బీఆర్ఎస్ నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ పడుతోంది.. ఈ పరిస్థితి ఎందుకు కొనసాగుతోంది. అధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ.. అప్పట్లో బీఆర్ఎస్కు వచ్చిన మాదిరిగా ఫలితాలు ఏకపక్షంగా ఇప్పుడు ఎందుకు రాలేదు. ఈ అంశాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు అంతర్గతంగా సమీక్షించుకుంటున్నారు. రెండు విడతల్లో వచ్చిన ఫలితాలపై ఆయా నియోజకవర్గాల ముఖ్యనాయకత్వం అంశాలపై దృష్టి సారించింది. ఈ నెల 11న తొలి విడతలో ఎన్నికలు జరిగిన 136 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా..నేనా అన్నట్లు పోటీ పడిన విషయం తెలిసిందే. అధికారంలో లేకపోయినప్పటికీ.. గులాబీ పార్టీ మద్దతుదారులు గట్టి పోటీని ఇచ్చారు. మొత్తం 136 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు గాను ఏకగ్రీవాలు కలుపుకొని సుమారు 48 వరకు సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. అంటే సుమారు 35 శాతం సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సుమారు 52 శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో కూడా సుమారు 33 శాతం గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలను గులాబీ పార్టీ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. 60 శాతం పంచాయతీల్లో సర్పంచులుగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పట్టునిలుపుకొన్న గులాబీ పార్టీ ఇప్పుడు పల్లె సంగ్రామంలోనూ కాంగ్రెస్‌తో హోరాహోరీగా తలపడుతోంది. మూడో విడతపై ఫోకస్ తొలి రెండు విడతల్లో బీఆర్ఎస్తో పోల్చితే కాస్త ఆధిక్యాన్ని సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు మూడో విడత గ్రామ సర్పంచ్ స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఈనెల 17న జరిగే చివరి విడత పోలింగ్ కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో జరుగుతోంది. జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క న్యాల్కల్ మండలం ఉంది. దీంతో ఈ మూడో విడత పల్లె పోరులో ఎన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎలాగైనా పట్టు నిలుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.రెబల్స్ లేకుండా పెరిగేవేమో.. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులు సర్పంచులుగా బరిలోకి దిగారు. దీంతో పార్టీ ఓట్లు చీలిపోయాయి. ఇది చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలు ఈ రెబల్స్ అభ్యర్థులతో మాట్లాడి నామినేషన్లు ఉపసంహరణ చేసి ఉంటే సర్పంచ్ స్థానాలు మరిన్ని పెరిగే అవకాశాలుండేవని ఆ పార్టీ భావిస్తోంది.ఆ స్థాయిలో స్థానాలు ఎందుకు రావడం లేదు రెండు విడతల ఫలితాలపై కాంగ్రెస్ ఆరా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిన మండలాల్లో పరిస్థితి ఎలా ఉంది..? రెబల్స్ లేకపోయి ఉంటే మరిన్ని స్థానాలు పెరిగేవని కాంగ్రెస్ అంచనా రేపు జరిగే మూడో విడతపై ఫోకస్ -
ఎన్నికల సామగ్రి పంపిణీకి సిద్ధం
నారాయణఖేడ్: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత బుధవారం జరగనున్నాయి. మంగళవారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, సిరా బాటిళ్లు, ఓటరు జాబితాలు తదితర సామగ్రిని పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం సబ్ కలెక్టర్ ఉమాహారతి పరిశీలించారు. మనూరు, నాగల్గిద్ద డిస్ట్రిబూషన్ రిసెప్షన్ సెంటర్లను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలను అందజేశారు. నారాయణఖేడ్ మండలానికి సంబంధించి మండలంలోని జూకల్ శివారులోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీకళాశాల ఆవరణలో టెంట్లు, కుర్చీలు, స్టేజీని ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరగనున్న ఇతర మండలాలకు సంబంధించి సంబంధిత మండల కేంద్రాల్లో ఆయా ఏర్పాట్లను పూర్తిచేశారు. పోలింగ్‌కు సంబంధించి 53 రకాల సామగ్రిని సిద్ధంగా ఉంచారు.పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమాహారతి -
వలస ఓటరే కీలకం
కలిసొచ్చిన అభ్యర్థులు వలస ఓటర్లకు పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీల గ్రామ స్థాయి నాయకులు నామినేషన్ల విత్‌డ్రాల అనంతరం గుర్తుల కేటాయింపు జరగగానే వలస ఓటర్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. రెండు, మూడు రోజులు వలస ప్రాంత ఓటర్లకు కలిసి మద్దతు కూడగట్టారు. తమకు ఓటేసి గెలిపించాలని, ఓటేసేందుకు గ్రామాలకు రావాలని వేడుకున్నారు. కొందరు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉండటంతో వారి వద్దకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకొని వెళ్లి వచ్చేందుకే రెండు రోజులు పట్టింది.నారాయణఖేడ్: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తుండగా.. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు తమ చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వలస ఓటర్ల ప్రభావం బాగా చూపనుంది. జిల్లాలో అత్యధికంగా వలసలకు పెట్టింది పేరుగా నారాయణఖేడ్ నియోజకవర్గం నిలిచింది. ఈ ప్రాంతం నుంచి మెజార్టీ జనాలు వలస జీవనం సాగిస్తుంటారు. దాదాపు ప్రతీ గ్రామం నుంచి వలస వెళ్లిన జనాల సంఖ్య వందల్లో ఉంటుంది. చిన్న గ్రామంలో 500 ఓటర్లు ఉంటే అందులో 100 నుంచి ఆపైగా.. పెద్ద పంచాయతీల్లో 250 నుంచి 400మంది వరకు వలస వెళ్లిన వారు ఉంటారు. 230 గ్రామాలు, మరో 220 వరకు గిరిజన తండాలు నియోజకవర్గంలో ఉంటాయి. హైదరాబాద్ ప్రాంతంలోని ఫ్యాక్టరీ, భవన నిర్మాణ రంగారాల్లో అత్యధిక స్థాయిలో గ్రామాల జనాలు ఉండగా.. జిల్లాతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలతోపాటు కర్ణాటక ప్రాంతంలోని చెరకు కర్మాగారాలకు గిరిజనులు వలస వెళ్తారు. సిరిసిల్లతోపాటు ఇతర ప్రాంతాలకు నేత కార్మికులు వలస వెళ్తారు. దీంతో ప్రతీ గ్రామంలో వలస వెళ్లిన ఓటర్లను ఓటు వేయించేందుకు రప్పించేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు పూర్తి చేశారు. ఓటర్లకు వాహనాలు ఇప్పటికే వలస ఓటర్లను కలిసిన అభ్యర్థులు, నాయకులు వారు గ్రామాలకు వచ్చేందుకు కార్లు, ట్రావెల్స్, ఇతర వాహనాలను ఏర్పాటు చేయించారు. పోలింగ్ నాడు వారు గ్రామాలకు వాహనాల్లో రానున్నారు. కొందరు బస్సుల్లో వచ్చేలా ఏర్పాట్లు చేశారు. వారు వచ్చి వెళ్లే వరకు అన్ని ఏర్పాట్లు చేయించారు. వలస ఓటర్లు చాలామంది కూడా పోటీలో ఉన్న అభ్యర్థులు అందరికీ ఫోన్లు చేసి తాము గ్రామానికి వస్తామని సమాచారం ఇస్తూ ‘మద్దతు’ కోరారు. ఒక్కరికి ఇంత చొప్పున అని లెక్క కట్టి ముట్టచెప్పారు. రూ.వేయి నుంచి రూ.2వేల వరకు అందజేశారు. వలస ఓటర్లకే ఇన్నేసి లక్షలు అయ్యాయంటూ కొందరు నాయకులు, అభ్యర్థులు ప్రైవేట్ సంభాషణల్లో వాపోతున్నారు. జీవనోపాధికోసం గ్రామాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఓటేసేందుకు గ్రామానికి వచ్చి వెళ్లేందుకు రెండో రోజులు అవ్వడంతో ఆ సమయంలో కూలీ పనులు పోగొట్టుకుంటున్నందున అందుకు తగ్గట్లుగా అభ్యర్థులు, నాయకులు చెల్లింపులు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటు కీలకం కావడంతో వలస ఓట్లను కోల్పోకుండా రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు వాట్సప్ ద్వారా సందేశాలు పంపిస్తూ టచ్‌లో ఉంటున్నారు. గ్రామంలో ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్లిన వారికి ఓటేసేందుకు వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు కూడా చేయిస్తున్నారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించిన అభ్యర్థులు ప్రత్యేక వాహనాలూ ఏర్పాటు పోలింగ్ నాడు ఉదయం గ్రామానికి చేరుకోనున్న ఓటర్లు ప్రతీ ఓటు కీలకం కావడంతో విశ్వ ప్రయత్నాలు ఖేడ్‌లో మెజార్టీ జనాల వలస జీవనం -
వారెవ్వా..!
భార్య సర్పంచ్.. భర్త వార్డు మెంబర్ఉద్యమకారుడికి పట్టంవట్పల్లి(అందోల్): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లిలో భార్య సర్పంచ్‌గా, భర్త వార్డు సభ్యుడిగా గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతుదారుడైన టి. సునీతా 70 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. 3వ వార్డు సభ్యుడిగా పోటీ చేసిన ఆమె భర్త మహిపాల్ 52 ఓట్లతో విజయం సాధించారు. ఒకే పంచాయతీ కార్యవర్గంలో భార్య సర్పంచ్‌గా, భర్త వార్డు సభ్యుడిగా ఉండడంతో సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఒకే ఇంట్లో భార్యాభర్తలు గెలుపొందడం పట్ల కుటుంబ సభ్యులు, మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు.ఐదోసారికి ‘స్వప్న’ం సాకారంపుల్కల్(అందోల్): పంచాయతీ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఓటమి పాలైనా ఆ దంపతులు నిరాశ చెందలేదు. పుల్కల్ మండల పరిధిలోని సూరెడ్డి ఇటిక్యాల గ్రామానికి చెందిన కలాలి స్వప్న కుటుంబం సర్పంచ్ బరిలో నిలబడేవారు. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు పోటీలో ఉండేవారు. నాలుగు సార్లు స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. అయినా ఏ నాడూ వారు నిరుత్సాహ పడలేదు. ఓటమి కుంగదీసినా వెనుకడుగు వేయలేదు. ఐదోసారి బరిలోకి దిగారు. స్వప్న 575 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన చిరకాల ‘స్వప్నం’ను సాకారం చేసుకున్నారు.ఎంపీటీసీ పాయే... సర్పంచ్ వచ్చే..మునిపల్లి(అందోల్): పెద్దచల్మెడ ఎంపీటీసీ రాధాబాయి జోషి పదవీ కాలం పూర్తయి రెండేళ్లు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇంతలోనే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ బరిలోకి దిగారు. పెద్దచల్మెడ సర్పంచ్‌గా రాధాబాయి గెలుపొందారు. సోమవారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆమెను అభినందించారు.రాయికోడ్(అందోల్): పంచాయతీ ఎన్నికల్లో రాయిపల్లి గ్రామ ఉద్యమకారుడికి పట్టంకట్టారు. గ్రామానికి చెందిన కాశి బస్వరాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సర్పంచ్ బరిలో నిలిచిన ఆయన.. సమీప ప్రత్యర్థి శ్రీశైలంపై 301 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. ఉద్యమకారుడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికవడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు.విజేతలతో సందడి● క్యాంపు కార్యాలయాలు కిటకిట ● శుభాకాంక్షల వెల్లువజహీరాబాద్: సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందిన వారు తమ తమ పార్టీ నేతలతో కలిసేందుకు వస్తుండడంతో ఆయా పార్టీల కార్యాలయాలు సందడిగా మారాయి. న్యాల్కల్ మండలంలో ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో సోమవారం సాయంత్రం జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్‌లు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఆయనను కలిసేందుకు ఆయా మండలాలకు చెందిన విజేతలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కృతజ్ఞతలు తెలిపారు. గెలుపొందిన వారికి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డిలు పార్టీ క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన విజేతలకు, పార్టీ శ్రేణులకు స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి భారీ విజయం అందించినందుకు గాను పార్టీ శ్రేణులను అభినందించారు. ఈ సందర్భంగా విజేతలకు మిఠాయిలు తినిపించి, శాలువాలతో సత్కరించారు. -
బీఆర్ఎస్ మద్దతు దారులను గెలిపించండి
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నారాయణఖేడ్: అధికరాంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్ మండలం సంజీవన్రావుపేటతోపాటు పలుగ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మద్దతుదారులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు కనువిప్పు కలిగించాలన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఆయాపంచాయతీల అభ్యర్థులు, నేతలు పాల్గొన్నారు. 18న ఉచిత కంటివైద్య శిబిరంనారాయణఖేడ్: శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ నానక్‌రాం గూడలోని శంకర ఆస్పత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో నారాయణఖేడ్‌లోని శ్రీసత్యసాయి మందిరంలో ఈనెల 18న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటివైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సేవాసమితుల జిల్లా కనీనర్ శంకరప్ప తెలిపారు. కంటిపొరలు వచ్చినవారికి శంకర ఆస్పత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామన్నారు. కంట్లో పొరలు వచ్చినవారు ఆధారు కార్డు జిరాక్స్, ఫోన్ నంబరు, ఏవైనా మందులు వాడుతుంటే వాటిని తీసుకురావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విధుల కేటాయింపు ఇలా..సంగారెడ్డి జోన్: మూడో విడత పంచాయతీ ఎన్నికలలో ర్యాండమైజేషన్ ద్వారా అధికారుల కేటాయింపు పూర్తయిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో చివరి విడతలో పోలింగ్ జరిగే మండలాల తుది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మ్యాన్ పవర్ మోడల్ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మల్లన్నకు లక్ష బిల్వార్చన కొమురవెల్లి(సిద్దిపేట): మేడలాంబ, కేతమ్మ సమేత కొమురవెల్లి మల్లికార్జున స్వామికి సోమవారం వైభవంగా లక్షబిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు రుద్రనామస్మరణతో మారుమోగాయి, ఈ సందర్భంగా వీరశైవ రుత్వికులు స్వామివారికి శాస్త్రోక్తంగా లక్ష బిల్వార్చన జరిపారు. ఆదివారం స్వామివారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మల్లన్నకు సుప్రభాతసేవ, గణపతిపూజ, గౌరి పూజ, శివపుణ్యహవాచనం, అఖండ దీపస్థాపన, పంచకలశారాధన, నవగ్రహ, దిక్పాలక, ఏకాదశరుద్ర, లక్ష బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. వీరశైవ వేదపాఠశాల విద్యార్థులు మల్లన్నను స్తుతిస్తూ చేసిన మంత్రోశ్చరణలతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పూజారులు పాల్గొన్నారు. నేడు నాచ‘గిరి’ ప్రదక్షిణ వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో మంగళవారం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త, ఈఓ విజయరామారావు తెలిపారు. లక్ష్మీనృసింహుని జన్మ నక్షత్ర వేళ ఉదయం 7.30 గంటలకు నాచగిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తరించాలని వారు కోరారు. -
మెరుగైన మెట్రోరైల్ సేవల కోసం..
ఐఐటీహెచ్‌తో ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ కీలక ఒప్పందంసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోరైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఢిల్టీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) హైదరాబాద్ ఐఐటీతో కీలక ఒప్పందం చేసుకుంది. ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్లో చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపడడంతో పాటు, ఇంటిగ్రేటెడ్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఐఐటీహెచ్‌లో ప్రత్యేక పరిశోధన విభాగం టీఐహెచ్‌ఏఎన్ (టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్) సహకారాన్ని అందించనుంది. ఈ మేరకు డీఎంఆర్సీ, ఐఐటీహెచ్ ప్రతినిధులు కీలక ఒప్పందాలపై టీఐహెచ్‌ఏఎన్–ఐఐటీహెచ్ హబ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్‌రెడ్డి, ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ సలహాదారు శోభన్చౌదరిలు సంతకాలు చేశారు. టీఐహెచ్ఎన్ అటానమస్ నావిగేషన్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తోంది. డ్రైవర్ రహిత వాహనాలు, డ్రోన్లు, బయోఇన్సైర్డ్ డ్రోన్లపై పరిశోధనలు చేస్తున్న విషయం విదితమే. -
ఉద్యమకారునికి కన్నీటి వీడ్కోలు
బీఆర్ఎస్ నాయకులుగజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారునికి కన్నీటి వీడ్కోలు పలికారు. గజ్వేల్ మండలం కోమటిబండకు చెందిన షేక్ భాస్కర్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి చురుకై న కార్యకర్తగా ఉంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తనదైన ముద్ర వేశాడు. రోడ్డు ప్రమాదంలో భాస్కర్ మృతి చెందాడనే విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. సోమవారం భాస్కర్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మధులతో పాటు తాజా మాజీ ప్రజాప్రతినిధులు భాస్కర్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. కాగా భాస్కర్ మృతితో కోమటిబండలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంతిమయాత్రలో వందలాది సంఖ్యలో ఉద్యమకారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే భాస్కర్ భౌతికంగా లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. -
దశదినకర్మకు వెళ్లి.. అనంతలోకాలకు..
ఇమాంపూర్‌లో ఘటనతూప్రాన్: దశదినకర్మకు వెళ్లి చెరువులో స్నానం చేసేందుకు దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతై శవమై తేలాడు. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఇమాంపూర్ గ్రామానికి చెందిన బక్క సంతోష్‌గౌడ్ (55) తూప్రాన్ పట్టణంలో నివసిస్తున్నారు. ఇమాంపూర్‌లో బంధువుల్లో ఒకరు మృతి చెందగా విషయం తెలుసుకొని ఈ నెల 13న శనివారం కుటుంబ సభ్యులతో కలిసి దశదినకర్మకు వెళ్లారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని చెరువులో స్నానం చేస్తుండగా సంతోష్‌గౌడ్ గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం చెరువులో తేలాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
చేగుంట(తూప్రాన్): చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని కర్నాల్‌పల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కర్నాల్‌పల్లి గ్రామానికి చెందిన చింతాకుల యశోద మూర్ఛ వ్యాధితో బాధపడుతుంది. ఎంతకూ తన వ్యాధి నయం కాకపోవడంతో మనస్తాపం చెందిన యశోద ఈనెల 10న వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సాపూర్ మండలానికి చెందిన వ్యక్తి.. నర్సాపూర్ రూరల్: పాముకాటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని జక్కపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సంగయ్యపేట రమేశ్ (42) నవంబర్ 25వ తేదీన పొలం వద్ద పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు రమేశ్‌ను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ సూరారంలోని నారాయణ మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య మాధవి, పిల్లలు ఉన్నారు. -
చేగుంట సర్పంచ్‌గా స్రవంతి
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రమైన చేగుంట గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. దాదాపు ఐదు వేల ఓట్ల లెక్కింపు కోసం నాలుగు రౌండ్లు టేబుల్‌ను ఏర్పాటు చేయగా రాత్రి 12 గంటలకు నాలుగో రౌండు లెక్కింపు ముగిసే సరికి సండ్రుగు స్రవంతికి 1683 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి దుంపల రమ్యకు 1648 ఓట్లు వచ్చాయి. దీంతో 35 ఓట్ల ఽఆధిక్యంతో స్రవంతి సర్పంచ్‌గా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. మండలంలోని కర్నాల్‌పల్లి గ్రామంలో ఉపసర్పంచు ఎన్నిక వాయిదా పడగా సోమవారం ఉపసర్పంచు కోసం నిర్వహించిన సమావేశంలో వార్డుమెంబర్లు ఏకతాటిపైకి రాకపోవడంతో మళ్లీ ఎన్నిక వాయిదా వేశారు. -
ఘనంగా ‘రాయరావు’ ఆత్మీయ సమ్మేళనం
● హాజరైన ప్రముఖులు ● పాల్గొన్న 200 మంది వంశస్తులుజిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో రాయరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమ్మేళనంలో రాయరావు వంశానికి చెందిన 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయరావు వంశస్తుల్లో ఓ కుటుంబానికి చెందిన ఆర్ఎస్కే భూపాలరావు, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, విశిష్ట అతిథులుగా సీనియర్ సంపాదకుడు రామచంద్ర మూర్తి, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం శివనాగిరెడ్డి మాట్లాడుతూ... నల్లవల్లి గ్రామానికి వేయ్యేళ్ల చరిత్ర ఉందని, ఆనవాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలోని బీరప్ప గుడి వద్ద రాష్ట్ర కూటుల కాలం పదో శతాబ్దం నాటి నాలుగడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు గల రాతిపై నిలబడి నాలుగు చేతుల్లో డమరుకం, శూలం, ఖడ్గం, కపాలా పాత్ర తలపై విరి జడలు వంటిపై కపాల మాలను ధరించిన బైరవ శిల్పం చారిత్రక ప్రాధాన్యత గలదని వివరించారు. రాజారావు దేశ్ముఖులు 18వ శతాబ్దంలో నిర్మించిన కోట సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం ముందు కోనేరు శిథిలావస్థకు చేరాయని, ఈ కట్టడాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉదన్నారు. అనంతరం సీనియర్ సంపాదకుడు రామచంద్ర మూర్తి మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా ఇలాంటి సమ్మేళనాలు నిర్వహిస్తున్నందున రాయరావ్ వంశస్తులను అభినందించారు. సామాజిక సాహిత్య పాలన రంగాల్లో తెలంగాణ రాయరావుల ఖ్యాతిని డాక్టర్ శ్రీధర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాజారావు వంశస్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో ప్రమాదం
● లాడల్ పేలి ఒకరు మృతి,మరొకరి పరిస్థితి విషమం ● పరిశ్రమ ఎదుట కార్మికుల ఆందోళనమనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమలో లాడల్ పేలి ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాపాయ పరిస్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని చెట్లగౌరారంలో గల ఎంఎస్ స్టీల్ పరిశ్రమలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన శరాన్షు కుమార్ విశ్వకర్మ (35), రాజేశ్‌పాండే ఎప్పటిలాగే పరిశ్రమలో క్రేన్‌ను నడిపిస్తున్నారు. విధుల్లో భాగంగా క్రేన్ నడుపుతూ లాడల్(కరిగించిన ద్రావణాన్ని మోసే పెద్ద బకెట్)ను పక్కకు తరలిస్తున్న సమయంలో అది అదుపుతప్పి బట్టిపై పడటంతో పెద్ద శబ్దంతో పేలింది. దీంతో క్రేన్‌పై పని చేస్తున్న శరాన్షుకుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన రాజేశ్ పాండేను చికిత్స కోసం మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా లాడల్ పేలడంతో భారీ శబ్దంతోపాటు వచ్చిన పొగలతో గ్రామస్తులు, కార్మికులు ఉలిక్కిపడ్డారు. గ్రామంలో పరిశ్రమ చుట్టు పక్కల ఇళ్లు అదరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ వద్ద కార్మికుల ఆందోళన విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కార్మికులు పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, కార్మికులకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యాజమాన్యంతో మాట్లాడిస్తామని చెప్పినా కార్మికులు వినకుండా ఆందోళన కొనసాగించారు. ఆర్డీఓ జయచంద్రారెడ్డి, పరిశ్రమల మేనేజర్ ప్రకాశ్, తహసీల్దార్ ఆంజనేయులు, తూప్రాన్ సీఐ రంగాకృష్ణ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అనంతరం కార్మికులతో చర్చలు జరిపారు. -
ఆకతాయిల ఆగడాలు
● గురువన్నపేట పాఠశాలలోవస్తువులు ధ్వంసం ● సందర్శించిన కలెక్టర్ హైమావతి కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని గురువన్నపేట ఉన్నత పాఠశాలలోని వస్తువులను ఆదివారం సెలవురోజు కావడంతో గుర్తు తెలియని ఆకతాయిలు మరుగుదొడ్ల డోర్లు, ఎలక్ట్రీసిటి మీటర్, వైర్,నల్లాలు ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్‌కు తెలిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ హైమావతి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సామగ్రిని ఎవరు ధ్వంసం చేశారని ఉపాధ్యాయులతో కలిసి ఆరా తీశారు. తక్షణమే ధ్వంసమైన సామగ్రిని అమర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. సామగ్రి ధ్వంసం చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను ఫోన్లో ఆదేశించారు. అలాగే వెంటనే పాఠశాలకు ప్రహరిగోడ నిర్మాణానికి నిధులు మంజూరి చేస్తామని, పాఠశాలలోని ఎలక్ట్రీసిటి వస్తులు గదిలో ఉండే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. -
చెప్పాల్సిందే
లెక్కలుసర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు జాగ్రత్త!సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును ఎంపీడీఓలకు తెలియజేసి, రశీదు తీసుకోవాలి. లేకుంటే వేటు పడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు ఎంపీడీఓలకు సమర్పించాలి. – పాపన్నపేట(మెదక్): పంచాయతీ ప్రతినిధులుగా ఎన్నికై న వారు, మేమే గెలిచాం.. ఇక గ్రామానికి మేమే రాజులం అనే భావన వీడి..సేవకులం అనే బాధ్యతను గుర్తించాలి. వారికి అఽధికారాలే కాదు..కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని ఏ మాత్రం మరిచినా.. కుర్చీకే ఎసరు రావచ్చు. పంచాయతీరాజ్ చట్టం –2018 స్థానిక పాలకులకు పగ్గాలు వేసి, అవి ప్రజల చేతికిచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యునికి రూ.50 వేలు ఖర్చు చేయాలి. 5వేల కన్నా జనాభా కంటే తక్కువగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యునికి రూ.30 వేల వరకు ఖర్చు చేయొచ్చు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి 45 రోజులలోపు సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ చేసిన అభ్యర్థులు ఎంపీడీఓకు నిర్ధేశిత పద్ధతిలో లెక్కలు చెప్పాలి. సకాలంలో లెక్కలు చూపకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ రాజ్ చట్టం – 2018 కింద సదరు అభ్యర్థులు మూడేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటిస్తుంది. ఒక వేళ అభ్యర్థి సదరు ఎన్నికల్లో గెలిచి, నిర్ణీత సమయంలోగా ఖర్చు వివరాలు ఇవ్వకుంటే , పదవిని కోల్పోయినట్లు ప్రకటిస్తుంది. సర్పంచ్‌లకు నెలకు రూ.6500 గౌరవ వేతనం ఉంటుంది. సర్పంచ్‌లు కనీసం నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం, రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. లేకుంటే పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా పదవి నుంచి తొలగిస్తారు. అవినీతి ఆరోపణలు నిరూపిమైతే అనర్హత వేటు పడుతుంది. పర్యావరణ పరిరక్షణలో చురుకుగా వ్యవహరించాలి. మొక్కలను నాటడం, అందులో 85 శాతం మేర మొక్కలు బతికేలా చూడటం వారి బాధ్యత. ఇంటింటికీ శౌచాలయాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి.బాధ్యతలో విఫలమైతే చర్యలే.. -
సంతానం కలగడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): సంతానం కలుగడం లేదన్న మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల పరిధిలోని రాజ్‌పేట తండాలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బానోత్ భాస్కర్ భార్య శ్రీదేవి(33) సంతానం కోసం పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు శ్రీదేవిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ పేర్కొన్నారు. పురుగుల మందు తాగి.. హవేళిఘణాపూర్(మెదక్): పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని జక్కన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి రాజు(42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పొలం వద్దకు వెళ్తానని చెప్పిన రాజు ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే మెదక్ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య -
గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు
సంగారెడ్డి టౌన్: గంజాయి కేసులో నలుగురికి సంగారెడ్డి కోర్టు పదేళ్ల జైలు శిక్ష, జరిమాన విధించింది. వివరాలు ఇలా... 2019లో 160 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా గంజాయి తరలిస్తున్న పోలగోని నిఖిల్, పవర్ శ్రీనివాస్, పవర్ సంతోష్, రాథోడ్ శ్రీకాంత్‌లను అరెస్ట్ చేశారు. సీఐలు మోహన్ కుమార్, రమేశ్ రెడ్డి, ఎస్సైలు రాజు, కేఎం విశ్వనాథులు నిందితులను సంగారెడ్డి ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. సీఐ మధుబాబు కేసు నమోదు చేసి, సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెట్టారు. సోమవారం కోర్టు నలుగురికి పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమాన విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం వృద్ధుడికి తీవ్ర గాయాలు హత్నూర( సంగారెడ్డి): షార్ట్‌సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధమై, వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని మాధుర గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... తలారి నర్సయ్య ఇంటి ఎదుట ఉన్న పూరిగుడిసెలో ఎప్పటిలాగే భోజనం చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి ఒక్కసారిగా షార్ట్‌సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధమైంది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో పక్క ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబీకులు, స్థానికులు ఒక్కసారిగా నరసయ్యను మంటల్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. మంటలు అదుపు చేసి, వెంటనే క్షతగాత్రుడిని అంబులెన్‌న్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదులోని ఉస్మానియాకు తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యంచేగుంట(తూప్రాన్): గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మండల కేంద్రమైన చేగుంటలోని బాలాజీ వెంచర్లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రైల్వే స్టేషన్ రోడ్డులోని బాలాజీ వెంచర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతుడి వివరాల కోసం ప్రయత్నించగా ఎలాంటి వివరాలు లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే చేగుంట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరం సంగారెడ్డి క్రైమ్: ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడంతో నిత్యం ప్రయాణికులతో పాటు విద్యార్థులకు ఫుట్‌బోర్డు ప్రయాణం తప్పడం లేదని వాపోతున్నారు. సంగారెడ్డి నుంచి జోగిపేట్ వెళ్లే ప్రధాన మార్గంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్‌లో బస్సులు ఒకేసారి లేదంటే గంటల కొద్ది ఆలస్యంగా రావడంతో విద్యార్థులకు ప్రమాదకర ప్రయాణం తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కాలేజీ సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రమాదకరంగా ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తుండటంతో ఏమాత్రం పట్టుజారినా ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ అధికారులు పరిస్థితులకు అనుగుణంగా బస్సులు సమయపాలన పాటించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఓఆర్ఆర్ డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు
ఇద్దరికీ తీవ్ర గాయాలురామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ సర్కిల్ పరిధిలోని కొల్లూరు ఔటర్ రింగ్‌రోడ్డుపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా, పలువురు స్వల్పంగా గాయపడ్డారు. కొల్లూరు ఇన్స్పెక్టర్ గణేశ్ వివరాల ప్రకారం... మేడ్చల్ జిల్లా మల్లంపేటకు చెందిన నర్సింహులు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా ఉరవకొండకు వెళ్లాడు. ఆదివారం ఓటు వేసి సోమవారం మల్లంపేటకు తిరిగి ప్రయాణమయ్యాడు. సాయంత్రం కొల్లూరు రింగ్‌రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఇరుక్కుంది. ఈ సంఘటనలో నర్సింహులు, శ్రవంతికి తీవ్రగాలయ్యాయి. స్వాతి, కళ్యాణి, ఆంజనేయులుతో పాటు ముగ్గురు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. -
ఒకే కుటుంబం పేరుతో 20 దొంగ ఓట్లు
కర్ణాటక రాష్ట్రంలో కూడా ఓట్లు ఉన్నాయంటూ ఇక్కడి అభ్యర్థులు ఓటు వేయకుండా అభ్యంతరం తెలిపారు. మొగుడంపల్లి మండలంలోని గొటిగార్ పల్లి గ్రామంలో ముగ్గురు కుటుంబ సభ్యులకు, హైదరాబాద్‌లో నలుగురికి ఓట్లు ఉన్నందున అక్కడి ఓటరు లిస్టులను తీసుకొని వచ్చి అధికారుల వద్ద అభ్యంతరం తెలిపారు. దీంతో ఓటర్లు మనస్తాపంతో ఓటు వేయకుండా వెనుదిరిగి వెళ్లారు. ఒకే కుటుంబం పేరుతో 20 దొంగ ఓట్లను నమోదు చేయించి వేయించుకున్నారని బీఆర్ఎస్ మద్దతు దారులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఓటరు లిస్టులను ప్రదర్శించారు. – జహీరాబాద్: -
కమనీయం.. మల్లన్న కల్యాణం
భారీగా హాజరైన భక్తజనం పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సురేఖ కొమురవెల్లి(సిద్దిపేట): మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి కోరమీసాల మల్లన్న కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం క్షేత్రంలోని తోట బావి వద్ద సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక మండపంలో మల్లన్న స్వామి.. మేడలాదేవి, కేతమ్మలను సరిగ్గా మధ్యాహ్నం 12.01గంటలకు వివాహమాడారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో వీరశైవ ఆగమ పండితులు కల్యాణ క్రతువును కనుల పండువగా నిర్వహించారు. కల్యాణ వేడుకను వీక్షించేందుకు రాష్ట్రం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ గర్భగుడిలో ఉదయం 9 గంటలకు మూల విరాట్‌కు కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి. అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకీలో ఊరేగింపుగా మేళాతాళలతో తోటబావి వద్ద గల మల్లన్న కళ్యాణవేదికకు చేర్చి కల్యాణ క్రతువు చేపట్టారు. ప్రభుత్వం తరపున మల్లికార్జున స్వామికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు. మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. -
గెలిచిన వారికే దండ!
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో రెబల్స్ బెడద తలనొప్పిగా పరిణమించింది. పార్టీల నాయకులు ఏ అభ్యర్థికి మద్దతు పలకకుండా మౌనం వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినా పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో నిలుస్తారు. కొన్ని పంచాయతీల్లో ఒకే పార్టీ నుంచి పోటాపోటీగా నామినేషన్లు వేసి విత్‌డ్రాల బుజ్జగింపుల్లోనూ వినకుండా రంగంలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఈ సమస్య నెలకొంది. అధికార పార్టీలో ఈ సమస్య మరీ అధికంగా మారింది. ఒక పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున రంగంలో నిలవడంతో పార్టీల ఆధినాయకులకు ఎవరికి మద్దతు పలకాలో చెప్పలేని సందిగ్ధత నెలకొంది. దీంతో తాము ఎవరి గురించి చెప్పమని, గెలిచి వచ్చిన వారి మెడలో దండ వేస్తామని సమాధానం ఇస్తున్నారు. ఇలా రెబల్స్ బెడద ఉన్న గ్రామాలకు ప్రధాన నాయకులు ప్రచారానికి వెళ్లడం లేదు. పార్టీ మద్దతుతో ఒకరే రంగంలో ఉన్న గ్రామాల్లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు. రెబల్స్ పోటీలో ఉన్న పంచాయతీల్లో గెలుపు, ఓటములపై ప్రభావం చూపనుందని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నారాయణఖేడ్ నియోజకర్గంలోని ఓ మండలంలో మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో ఓ పంచాయతీలో ఒకే పార్టీ నుంచి ముగ్గురు రంగంలో నిలవడంతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి తక్కువ ఓట్లతో గెలుపొందారు. సమీప అభ్యర్థి రాత్రికి రాత్రి భారీగా వ్యయం చేసినా ఫలితం శూన్యం అయ్యింది. ఈ పంచాయతీలో మెజార్టీ వార్డు స్థానాలు ఒక పార్టీ గెలుచుకోగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి సర్పంచ్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఫలితం దృష్ట్యా రెబల్స్ బరిలో ఉన్న ఇతర పంచాయతీల్లోని అభ్యర్థుల్లో గుబులు నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, రెబల్స్ మధ్య గట్టి పోటీ ఉన్న తరుణంలో ప్రధానంగా అభ్యర్థులు గోప్యత, మద్దతు విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. కొందరు నేతలు పార్టీలో ఉన్నా సైలెంట్‌గా ఉండడం కూడా ఆందోళనకు దారి తీస్తుంది. వీరి మౌనం మనకు మద్దతుగా ఉంటుందా ప్రత్యర్థికి అనుకూలంగా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఎమ్మెల్సీకి సీతారాముల తలంబ్రాలు
గజ్వేల్‌రూరల్: భగవంతుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పేర్కొన్నారు. పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహిత రామకోటి రామరాజు ఆదివారం భద్రాచల దేవస్థాన శ్రీరామరక్ష స్తోత్ర పుస్తకాలతో పాటు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ... వేలాది మంది భక్తులతో గోటి తలంబ్రాలు తయారు చేయించి భద్రాచల సీతారాముల కల్యాణోత్సవం తర్వాత తిరిగి వాటిని భక్తులకు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. -
సెల్‌టవర్ ఎక్కి హల్చల్
చిన్నశంకరంపేట(మెదక్): సర్పంచ్‌గా పోటీ చేస్తున్న తన భార్యకు ఓట్లు వేయకుండా కుట్ర చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు శంకర్‌నాయక్ సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి తండాలో ఆదివారం జరిగింది. పోలీసులు సముదాయించి కిందకు దించారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. తండా అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అయినప్పటికీ తనకు ఓట్లు వేయకుండా ప్రత్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచి కుట్ర చేశారని ఆరోపించారు. మనస్తాపంతో సెల్‌టవర్ ఎక్కానని చెప్పారు. ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి దుషాని గెలిచింది. -
కరువైన కట్నాలు
మల్లన్న కల్యాణం.. కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణంలో కట్నాలు కరువయ్యాయి. కొంతకాలంగా స్వామి వారి కల్యాణంలో మంత్రులు, ప్రముఖులు స్వామి వారికి కట్నాలు చదివించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కాంగ్రెస్ నాయకులు కట్నాలు చదివించారు. ఈ సారి ఎవరు కూడా కట్నాలు చదివించకపోవడంతో స్థానికంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కల తప్పిన వీఐపీ గ్యాలరీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆలయ అధికారులు స్వామి వారి కల్యాణ ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యేలు, మంత్రులకు , ప్రజాపతినిధులకు సరిగా అందించకపోవడంతో కల్యాణానికి ప్రముఖులు హాజరు కాకపోవడంతో వీఐపీ గ్యాలరీ కల తప్పింది. వైభవంగా రథోత్సవం స్వామి వారి కల్యాణం అనంతరం స్వామి వారి రథోత్సవాన్ని అధికారులు, అర్చకులు, భక్తులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన సత్రం నుంచి మల్లన్న గుట్టచుట్టూ రథోత్సవం నిర్వహించారు. ఈ సమయంలో భక్తుల కోలాహలం, మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి ఎన్నికల కోడ్ ఉల్లంఘనమల్లికార్జున స్వామి కల్యాణంలో మంత్రి కొండ సురేఖ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. స్వామి కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అనంతరం కల్యాణ వేదిక ప్రాంగణంలోనే విలేకరులతో ప్రభుత్వ పాలసీ గురించి మాట్లాడి మరో వివాదంలో చిక్కుకున్నారు. -
కాళ్లు మొక్కి .. ఓటు అభ్యర్థించి..
కొల్చారం(నర్సాపూర్): మండలంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్ల వద్దకు వెళ్లి చేతులు పట్టుకొని ఇవి చేతులు కావు కాళ్లు అనుకోండి అనే బదులు.. ఏకంగా కలిసిన వారి కాళ్లు పట్టుకొని ఓటు అడుగుతున్నారు. గెలుపు కోసం ఎందాకై నా వెళ్తామన్న ఈ దృశ్యం మండలంలోని సంగాయిపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గోష్కే సులోచన దంపతులు ఇలా ప్రచారం చేశారు. -
టోల్ ప్లాజా వద్ద నిలిచిన వాహనాలు
కొండపాక(గజ్వేల్): మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో కొన్ని మండలాల్లో రెండో విడత ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, తదితర పట్టణాల నుంచి సిద్దిపేట తదితర గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి హైదరాబాద్ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు టోల్ ప్లాజా వద్ద భారీగా క్యూ కట్టాయి. దీంతో టోల్ ప్లాజా నిర్వాహకులు హైదరాబాద్ వైపు ట్రాఫిక్ జాంను నివారించేందుకు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్లేందుకు ఉన్న నాలుగు వరుసల్లో ఒక వరుసను హైదరాబాద్ వైపునకు వెళ్లేలా లైన్ క్లియర్ చేయడంతో ట్రాఫిక్ అదుపులోకి వచ్చింది. -
ఓటు చోరీపై దేశవ్యాప్త ఆందోళన
పటాన్చెరు టౌన్: ఓటు చోరీపై దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఆదివారం పటాన్చెరు డివిజన్లో జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి, ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ... గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, వారి భాగస్వామ్య పార్టీలు ఓడిపోతాయని అనేక సర్వేలు చెప్పాయన్నారు. కానీ ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ఈవీఎంలను మార్పులు చేసి, ఓటు చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు గంగాధర్, రవి గౌడ్, నాయకులు సురేశ్, సుధాకర్, యువరాజ్ పాల్గొన్నారు. -
నేటితో ప్రచారానికి తెర
నారాయణఖేడ్: చివరి విడత ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. ఈనెల 15వ తేదీ సాయంత్రం 5గంటలతో మైకులు మూగబోనున్నాయి. గడువు ముగుస్తుండటంతో అభ్యర్థుల తరపున ప్రచారం చేసే నియోజకవర్గ ముఖ్యనేతలు గ్రామాలను విస్తృతంగా పర్యటిస్తున్నారు. తమ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థికి ఓటువేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. గెలుపుకోసం వ్యూహాలను అందిస్తున్నారు. చివరి రోజు ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరి రోజు ప్రతీ ఓటరును కలిసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. నేటి సాయంత్రం 5గంటల తర్వాత ప్రచారం ఆగిపోనుండటంతో ప్రచార రథాలు, మైకులు, జెండాలను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మద్యం దుకాణాలు బంద్.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో చివరి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. సోమవారం సాయంత్రం 5గంటలకు మద్యం దుకాణాలు మూసివేసి పోలింగ్ రోజు 17వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మూసేసి ఉంటాయి. ఖేడ్ నియోజకవర్గంలో మండల కేంద్రాలు, గ్రామాల్లో 9 మద్యం దుకాణాలను మూసి వేయనున్నారు. ఖేడ్ పట్టణం మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో పట్టణంలోని నాలుగు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. గ్రామాల్లో మద్యం దుకాణాలు మూసి ఉండటంతో మద్యం విక్రయాలు ఎక్కడ జరిగినా వెంటనే సీజ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎకై ్సజ్, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. నేడు, రేపు మద్యం, నగదు జోరు! ఇప్పటికే మద్యం దావత్‌లు నడుస్తుండగా చివరి రెండు రోజు మద్యం పంపిణీ చేయనున్నారు. చాలామంది అభ్యర్థులు గ్రామాల్లో అక్కడక్కడ మద్యం డంప్‌లు చేసి పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వార్డుల వారీగా వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వినికిడి. కొన్ని చోట్ల నగదు పంపిణీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల పాటు మద్యం జోరుగా ఏరులై పారనుంది. గ్రామాల్లో చీఫ్ లిక్కర్ తాగేవారు కూడా బ్రాండెడ్ మద్యం అడుగుతుండటంతో అభ్యర్థులకు ఆ కంపెనీ మద్యం పంపిణీ చేయక తప్పడం లేదు.మూడో విడతకు ఏర్పాట్లు సాయంత్రం 5గంటల నుంచి బంద్ ఇక ప్రలోభాలతో ఓటరుకు ఎర -
వాహనం అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీకొట్టి
గజ్వేల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఉద్యమకారుడు మృతి చెందాడు. ఈ సంఘటన గజ్వేల్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని కోమటిబండకు చెందిన షేక్ భాస్కర్(35)కు భార్య కవితతో పాటు ఇద్దరు కొడుకులున్నారు. తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో సాగు చేస్తూ భాస్కర్ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని ముట్రాజ్‌పల్లి మార్గం వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భాస్కర్ మృతితో కోమటిబండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వరిస్తూ, తెలంగాణ ఉద్యమం కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొని తనదైన ముద్ర వేశాడు. వాహనం ఢీకొని ఒకరు మృతి హవేళిఘణాపూర్(మెదక్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మండల పరిధిలోని లింగ్సాన్‌పల్లి తండా సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... తండాకు చెందిన భాస్కర్(36) పొలం దగ్గరకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో మూలమలుపు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన ఘటనా స్థలంలో అక్కడికక్కడే మరణించాడు. జహీరాబాద్‌లో వృద్ధుడి మృతదేహం..జహీరాబాద్ టౌన్ : గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన పట్టణంలోని ఆదర్శనగర్ రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.వినయ్‌కుమార్ కథనం ప్రకారం... సుమారు 70 సంవత్సరాల వయసు కల్గిన వృద్ధుడు తీవ్ర చలి లేదా అనారోగ్య సమస్యల వల్ల చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. అంబులెన్స్ డ్రైవర్ అబ్దుల్ ఖదీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి.. సంగారెడ్డి క్రైమ్: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రాము నాయుడు వివరాల ప్రకారం... ఆదివారం ఉదయం 9గంటల సమయంలో కొత్త బస్టాండ్ ఎదురుగా గల గణేశ్ వైన్స్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి ( 35–40ఏళ్లు) వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొత్త బస్టాండ్ ఆవరణలోని దుకాణాల్లో క్లీనింగ్ పని చేసే ముత్తుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.ఉద్యమకారుడు మృతి -
బ్రహ్మోత్సవాల నాటికి రైల్వేస్టేషన్.. ఎంపీ రఘునందన్ రావు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల నాటికి రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను స్థానికుల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలో పనులు చాలా వేగంగా పూర్తి అవుతాయనేందుకు ఈ రైల్వే స్టేషనే నిదర్శనమన్నారు. 2024 ఫిబ్రవరిలో రైల్వే స్టేషన్ పనులు ప్రారంభించగా, డిసెంబర్ 2025 నాటికి వంద శాతం పూర్తయ్యాయని తెలిపారు. సంక్రాంతికి రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ పక్కన గల 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కాటేజీలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. ప్రభుత్వం అనుమతిస్తే రైల్వే స్టేషన్ ప్రారంభించిన రోజే కాటేజీలకు భూమి పూజ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు స్వరూప, మల్లేశ్ యదవ్, నాగరాజు, కరుణాకర్ పాల్గొన్నారు. కల్యాణ వేదిక వద్దకు పల్లకిలో మల్లికార్జున స్వామి,మేడలమ్మ, కేతమ్మలను తీసుకొస్తున్న నిర్వాహకులు -
త్రిముఖ పోరు..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రెండో విడత గ్రామపంచాయతీల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థితో పాటు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థి బరిలో ఉన్నారు. చాలా చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థి కూడా పోటీలో ఉండటంతో పోరు రసవత్తరంగా సాగుతోంది. రెండో విడతలో మొత్తం పది మండలాల పరిధిలో 243 గ్రామపంచాయతీలకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో 14 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 229 గ్రామ పంచాయతీల సర్పంచుల స్థానాలకు మొత్తం 649 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ లెక్కన ఒక్కో సర్పంచ్ స్థానానికి ముగ్గురు బరిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు అభ్యర్థులు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా గ్రామాల్లో ఇద్దరేసి అభ్యర్థులు బరిలో ఉన్నారు. పార్టీ మద్దతు పలికిన అభ్యర్థితో పాటు, ఇదే పార్టీ మద్దతు కోసం ప్రయత్నం చేసి భంగపడిన నాయకులు కూడా నామినేషన్ వేసి బరిలో నిలిచారు. ఇలాంటి తిరుగుబాటు అభ్యర్థులున్న గ్రామ పంచాయతీలు ప్రతి మండలంలో నాలుగు నుంచి ఆరు వరకు ఉంటాయి. ఈ తిరుగుబాటు అభ్యర్థులను బరిలోంచి తప్పించేందుకు ఆయా నియోజకవర్గాలకు చెందిన హస్తం పార్టీ ముఖ్యనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పార్టీ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాత్రం దాదాపు అన్ని ఒక్కరే అభ్యర్థి బరిలో నిలిచారు. దీంతో ఈ గులాబీ పార్టీకి రెబల్ బెడద దాదాపు లేకుండా పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో జిల్లాలో సత్తా చాటిన బీజేపీ అభ్యర్థులు చాలా గ్రామాల్లో బరిలో ఉన్నారు. పల్లె సంగ్రామం త్రిముఖ పోరుతో ఆసక్తి కరంగా మారింది. సర్వత్రా ఉత్కంఠరెండో విడతలో 229 గ్రామాలకు ఆదివారం పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రి వరకు వార్డు సభ్యులు, సర్పంచ్ స్థానాల్లో ఎవరు విజయం సాధించారనేది అధికారులు ప్రకటించనున్నారు. ఈ ఫలితాల ప్రకటన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. కౌంటింగ్ చాలా ఆలస్యమైన గ్రామపంచాయతీల ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ సోమవారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దీంతో సర్పంచ్ అభ్యర్థులే కాకుండా, ఉప సర్పంచ్ పదవులు ఆశిస్తున్న నేతలు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది శనివారం మండల కేంద్రాల నుంచి తరలివెళ్లారు.రెండో విడతలో సర్పంచ్ పదవులకు సగటున ముగ్గురు పోటీ చాలా చోట్ల బరిలో కాంగ్రెస్ రెబల్స్ ఓటు బ్యాంకు చీలిపోతుందని ఆ పార్టీలో ఆందోళన నేడే 229 గ్రామపంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన అధికారులు, సిబ్బంది -
బీఆర్ఎస్కు అధికారం ఖాయం
సదాశివపేట(సంగారెడ్డి): ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. సదాశివపేటలోని తన స్వగృహంలో నియోజకవర్గ పరిధిలోని సదాశివపేట, సంగారెడ్డి, కంది, కొండాపూర్ మండలాలకు చెందిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులను శనివారం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాలని కొత్త సర్పంచులకు సూచించారు. కేసీఆర్ పాలన కావాలని ప్రజలందరు కోరుకుంటున్నారని, త్వరలో అది నెరవేరబోతుందన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నూతన సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానం -
ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా నూతన డివిజన్లు
పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన ప్రక్రియను జనాభా, ఓటర్ల ప్రాతిపదికన చేపట్టాలని, పటాన్చెరు కేంద్రంగా జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ ఆర్.వీ కర్ణన్‌ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని బల్దియా కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి నూతన డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలను నివేదిక రూపంలో అందించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో లక్ష 20 వేలకు పైగా ఓటర్లు, రెండు లక్షల జనాభా నివసిస్తుందని తెలిపారు. పాత అమీన్పూర్ మండలం, అమీన్పూర్ మున్సిపల్ కలిపి కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేశారని.. పరిపాలన వికేంద్రీకరణ, సౌలభ్యం కోసం కిష్టారెడ్డిపేట, బీరంగూడ, అమీన్పూర్, పీజేఆర్ కాలనీల పేరిట 30 వేల ఓటర్లకు అనుగుణంగా నాలుగు డివిజన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో తెల్లాపూర్, ముత్తంగి డివిజన్లు ఏర్పాటు చేశారని.. వీటి పరిధిలో గల రెండు పడక గదుల ఇళ్ల సముదాయాల ఓటర్లకు అనుగుణంగా తెల్లాపూర్, వెలిమల, కొల్లూరు, ముత్తంగి పేరుతో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాలని కోరారు. పటాన్చెరు కేంద్రంగా జోనల్ కార్యాలయం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఎమ్మెల్యే వినతి -
రెండో విడతకు రె‘ఢీ’
సంగారెడ్డి జోన్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. అందుకు సంబంధించి పూర్తి ఏర్పాటు చేశారు. జిల్లాలోని 10 మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సంబంధిత అధికారులు ఎన్నికల సామగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. జిల్లాలో 229 సర్పంచ్, 1941 వార్డు స్థానాలకు పోరు జరగనుంది. అయితే 14 సర్పంచ్, 222 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ సందర్భంగా 1200 మంది పోలీసు అధికారులతో మూడు అంచల భద్రత ఏర్పాటు చేశారు. 46 జోన్లు, 56 రూట్లుగా విభజించారు. పదిమంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 436 కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 2700 పీఓలు, 3259 మంది ఓపీఓలను నియమించారు. పది మండలాలలో మొత్తం 2,99,746 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 1,47,985 మంది పురుషులు,1, 51,757 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. కాగా, ఝరాసంగంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహ ణ సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. అప్రమత్తంగా ఉండండి జహీరాబాద్ టౌన్: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో శనివారం పర్యటించారు. పట్టణంలోని బాగారెడ్డి స్టేడియం, మొగుడంపల్లిలోని డీఆర్సీ కేంద్రాలను ఆర్డీఓ దేవూజాతో కలిసి సందర్శించారు. ఎన్నికల విధులకు వెళుతున్న సిబ్బందితో పాటు రూట్ మొబైయిల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ సామగ్రితో డీఆర్సీ కేంద్రం నుంచి బయలుదేరిన సిబ్బంది తిరిగి వచ్చే వరకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ సైదానాయక్, సీఐ శివలింగం, జహీరాబాద్ టౌన్, రూరల్ ఎస్ఐలు వినయ్‌కుమార్, కాశీనాథ్ ఉన్నారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్, వెంటనే ఫలితాలు తొందరపాటు నిర్ణయాలు వద్దు పోలీసులకు ఎస్పీ సూచనలు -
రా.. పల్లె పిలుస్తోంది
జహీరాబాద్: పెద్ద పండుగలు వస్తున్నాయంటే రెక్కలు కట్టుకుని సొంతూళ్లకు వాలిపోతాం. సంక్రాంతి మరో నెలరోజులు ఉందనగానే పుట్టిన ఊరెళ్లేందుకు ముందే టికెట్లు బుక్ చేసుకుంటాం. ఏడాదిలో వచ్చే అనేక వేడుకలు, శుభ కార్యాలకు గ్రామానికి వస్తాం. అయిన వాళ్లతో హాయిగా గడిపి తిరిగి వెళ్లిపోతాం. మరి ఈనెల 14, 17వ తేదీలలో రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పల్లె మళ్లీ రమ్మంటోంది. అందరూ తప్పకుండా రావాలంటూ ఆహ్వానిస్తోంది. పల్లెకు వెళ్లి ఓటేసేందుకు అంతా సిద్ధం అవుతున్నారు. దీంతో సమగ్ర కుటుంబ సర్వేను గ్రామాలు మళ్లీ తలపింపజేయనుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వజ్రాయుధం లాంటిది. ఒక్క ఓటూ కీలకమే. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమైనదే. ఒక్క ఓటు తేడాతో ఓటమి చెందిన వారు ఎందరో ఉన్నారు. సమాన ఓట్లు కూడా వచ్చి టాస్ విధానంలో ఎన్నుకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయనే చెప్పవచ్చు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు నువ్వా.. నేనా అనే రీతిలో ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. దీంతో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక్కో ఓటు కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అనేక మంది విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రీత్యా పలు రాష్ట్రాలలో ఉంటున్నారు. ఉద్యోగులు బదిలీల కారణంగా పలు ప్రాంతాలలో నివసిస్తున్నారు. కూలీలు ఉపాధి నిమిత్తం పలు రాష్ట్రాలలో ఉన్నారు. ఓటు మాత్రం సొంతూరులో ఉంది. ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు సెలవు పెట్టుకుని వస్తే ఓటు వేయవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులను చూడవచ్చు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. దీంతో దూర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు ముందుగానే గ్రామానికి చేరుకోవాలి. సొంతూరు బాట పట్టిన జనం ఒక్క ఓటూ కీలకమే ఉత్కంఠ రేపుతున్న పల్లెపోరు -
తమ్మీ.. జర వచ్చిపో..!
● వలస ఓటర్లపై అభ్యర్థుల దృష్టి ● ఫోన్ చేసి పోలింగ్‌కు రావాలని వేడుకోలు ● దావత్, రవాణా ఖర్చులు సైతం ముట్టచెబుతున్న వైనంన్యాల్కల్(జహీరాబాద్): పంచాయతీ ఎన్నికల్లో వలస ఓట్లు చాలా కీలకం. దీంతో అభ్యర్థులు తమ పార్టీ మద్దతుదారులతో పట్నం వైపు పరుగులు తీస్తున్నారు. వలస వెళ్లిన వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేసేందుకు తప్పకుండా ఊరికి రావాలని బతిమాలుడుతున్నారు. ఓటు వేసేందుకు రావడానికి అసరమయ్యే రవాణా ఖర్చులు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా వలస ఓటర్లు కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొదటి విడత ఎన్నికలు ముగియడంతో రెండవ, మూడవ విడత ఎన్నిలపై అభ్యర్థులు దృష్టి సారించారు. ప్రతి ఓటు కీలకం కావడంతో పాటు స్వల్ప ఓట్ల తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లపై దృష్టి సారించడంతో పాటు బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లపై దృష్టి సారించారు. వారి ఓట్లను ఎలాగైనా తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు వలస వెళ్లిన వారిని గుర్తించి వారు ఉండే ప్రాంతాలకు వెళుతున్నారు. రవాణా ఖర్చులతో పాటు దావత్‌లకు కొంత ముట్టజెప్పుతున్నారు. వారి ఫోన్ నంబర్లను తీసుకొని టచ్‌లో ఉంటున్నారు. రెండవ, మూడవ విడత ఎన్నికల్లో సుమారు 4లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కూడా ఉంది. -
మల్లన్న కల్యాణానికి రారండీ
● కొమురవెల్లిలో నేటి ఉదయం 10:45 గంటలకు.. ● ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ ● వేలాదిగా తరలిరానున్న భక్తజనం ● విస్తృత ఏర్పాట్లు చేసిన ఆలయ వర్గాలు కొమురవెల్లి(సిద్దిపేట): భక్తుల కొంగుబంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. మల్లన్న క్షేత్రంలోని జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. ఈ మహోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. తోటబావి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ మండలపంలో మల్లికార్జున స్వామి, కేతలమ్మ, మేడలదేవిని ఉదయం 10.45నిమిషాలకు వివాహమాడనున్నారు. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించే కల్యాణోత్సవంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మల్లన్న కల్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారు. శనివారం పీఠాధిపతులు మహమండలేశ్వర్, డాక్టర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహంత్ మహస్వామి కొమురవెల్లికి చేరుకున్నారు. స్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు.. ఆలయ గర్భగుడిలో మల్లన్న మూల విరాట్ వద్ద మొదట కల్యాణ తంతును ప్రారంభించి అదే సమయంలో తోట బావి వద్ద ఉత్సవ విగ్రహాలకు కల్యాణం జరిపిస్తారు. -
చిన్నమల్లారెడ్డిలో ఒకరి ఆత్మహత్య
రీ కౌంటింగ్ జరిపించాలికలెక్టర్కు గంగాపూర్ గ్రామస్తుల ఫిర్యాదు మర్కూక్ (గజ్వెల్): మర్కుక్ మండలం గంగాపూర్ యూసుఫ్‌ఖాన్ పల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికను నిలిపివేయాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటును లెక్కించి కౌంటింగ్ నిర్వహించాలని ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జంపల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో లక్ష్మి, శ్యామలకు 194 చొప్పున ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేయాలని అభ్యర్థులు అధికారులకు సూచించినా పట్టించుకోవడం లేదు. దీంతో ఇరువురి మధ్య డ్రా తీస్తున్నామని ఎవరికి వస్తే వారు గెలిచినట్లు అవుతుందని అధికారులు ప్రకటించారు. అధికారులు తీసిన డ్రాలో శ్యామలకు విజయం వరించింది. దీన్ని మరో అభ్యర్థి లక్ష్మి అభ్యంతరం తెలిపారు. ఇదిలా ఉండగా బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ ఉద్యోగికి సంబంధిత అధికారులు ఈనెల ఆరో తేదీన ఓట్లను పంపించారు. 9న ఓట్లు స్పీడ్ పోస్టులో చేరాయి. 11న ఎన్నికలు ముగిసే సమయానికి పోస్టల్ ఓటు చేరుకోలేదు. 12న మధ్యాహ్నం 12 గంటలకు సంబంధిత ఎంపీడీవో కార్యాలయానికి పోస్టు ద్వారా వచ్చాయి. ఈ విషయంలో తిరిగి పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఓట్లను లెక్కించి న్యాయం చేయాలని లక్ష్మి డిమాండ్ చేశారు.కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్ఐ రంజిత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామాయంపేటకు చెందిన ఇబ్రహీం(35)కు బాన్సువాడకు చెందిన ఓ మహిళతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య గొడవలు రావడంతో కొంతకాలంగా భార్య పిల్లలను తీసుకొని తల్లిగారింట్లో ఉంటోంది. దీంతో ఇబ్రహీం కొంతకాలంగా తన అమ్మమ్మ గ్రామమైన చిన్న మల్లారెడ్డిలో ఉంటూ ప్రైవేటుగా మెకానిక్ పనులు చేస్తున్నాడు. భార్య కాపురానికి రావడం లేదని కొద్దిరోజులుగా అతడు మనస్తాపానికి గురవుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం అతడు జీవితంపై విరక్తి చెంది చిన్నమల్లారెడ్డిలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు గుర్తించి, అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
1200 మంది పోలీసులు
రెండో విడతకు సంగారెడ్డి జోన్: పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఆదివారం నుంచి జరిగే రెండో విడత ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రెండో విడత ఎన్నికలకు 1200 మంది పోలీసు అధికారులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే విధి నిర్వహణలో ఉన్న అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలనీ, సొంత నిర్ణయాలు తీసుకోరాదని వెల్లడించారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లోపటిష్ట బందోబస్తు: ఎస్పీ పరితోష్ పంకజ్ -
అందరికీ హామీ... ఓటెవరికి సామీ..?
అంతుచిక్కని ఓటర్ నాడిజహీరాబాద్: ఓటు అడిగేందుకు ఇంటికి వస్తున్న అభ్యర్థులకు ఓటర్లు మాత్రం నిరాశ పర్చడం లేదు. అన్నా...తమ్మీ..అక్కా, చెల్లెమ్మా మా ఓటు మీకే అంటూ ఓటర్లు హామీ ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారానికి వెళుతున్న అభ్యర్థులకు ఓటర్లు ఏ మాత్రం నిరుత్సాహ పర్చడం లేదు. మీకు కాకుంటే ఇంకా ఎవరికేస్తాం చెప్పు అంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఏ అభ్యర్థి ప్రచారానికి వెళ్లినా ఓటర్ల నుంచి మాత్రం ఇదే సమాధానం వస్తోంది. దీంతో అభ్యర్థులు గాలిలో తేలిపోతున్నారు. ఓటు కోసం ఇంత బతిమాలడం ఎందుకన్నా మా ఇంటోళ్ల ఓట్లన్నీ నీకే పడతాయని అభ్యర్థులందరికీ ఇదే మాట చెబుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విడత పూర్తి కాగా ఇంకా రెండో, మూడో విడత ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఓటు కోసం అభ్యర్థులు తామే స్వయంగా అడగడమే కాకుండా ఫలానా ఓటర్లు ఎవరితో సఖ్యతగా ఉంటారనే విషయమై వివరాలు సేకరించుకుని వారి ద్వారా కూడా ఓటు వేయించుకునే విధంగా వ్యూహరచన చేస్తున్నారు. గెలుపు కోసం ఒక్కో ఓటు కీలకం కావడంతో ఏ ఒక్క అవకాశం కూడా చేజారకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అభ్యర్థిస్తున్నారు. సర్పంచ్‌గా ఎన్నుకుంటే ఐదేళ్ల పాటు మీకు సేవలందిస్తామని అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. యువత, మహిళల ఓటు చేజారకుండా ఉండేందుకు నామినేషన్ల దాఖలు నుంచి తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఓటనే నాడి అర్థం కాక అభ్యర్థులు మాత్రం అయోమయానికి గురవుతున్నారు. బ్యాలెట్‌పై ఓటు వేసే చివరి నిమిషం వరకు ఓటర్లు మాత్రం ఎవరికి ఓటు వేస్తారో అనే విషయం ఎవరికీ అంతుపట్టని పరిస్థితి ఉంది. -
మామను హతమార్చిన అల్లుడు
పటాన్‌చెరుటౌన్: మామను అల్లుడు హతమార్చిన సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేశ్ కథనం ప్రకారం.. బీరంగూడ మంజీరానగర్కు చెందిన రామకృష్ణ చెత్త బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంజీరానగర్ కాలనీకి చెందిన చెత్త బండి నడపే చంద్రయ్య (58) కూతురు లక్ష్మితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు. అయితే మద్యానికి బానిసైన రామకృష్ణ తరచూ మద్యం సేవించి ఇంట్లో భార్యతో గొడవ పడుతుండేవాడు. కూతురుతో సైతం అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. గమనించిన భార్య పిల్లలను తీసుకొని మూడు నెలల క్రితం తండ్రి వద్దకు వెళ్లి అక్కడే ఉంటుంది. గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చిన రామకృష్ణ మామతో గొడవకు దిగాడు. మాటామాటా పెరిగి తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు చంద్రయ్యను చికిత్స కోసం బీరంగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల దాడిలో గాయపడిన రామకృష్ణ సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
డెత్ డేగా మారిన బర్త్ డే
కొండపాక(గజ్వేల్): పుట్టినరోజు వేడుకల్లో భాగంగా స్నేహితులను కలిసేందుకు వెళ్తున్న యువకుడు కానిరాని లోకాలకు వెళ్లాడు. దీంతో కుకునూరుపల్లి మండలంలోని తిప్పారం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాలు... గ్రామానికి చెందిన బోగి శ్యామల, నర్సింహులు దంపతుల చిన్న కుమారుడు నవీన్ శుక్రవారం కుటుంబీకులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి చిన్ననాటి స్నేహితులతో కలిసి ముందస్తుగా బర్త్‌డే సెలబ్రేషన్‌ను జరుపుకొని, ఇతరులను కలిసేందుకు కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ములుగు పోలీస్టేషన్ శివారులో రాజీవ్ రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఎగిరి అవతలి ప్రక్కన పడింది. ఈ ప్రమాదంలో నవీన్‌కు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. శుక్రవారం స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి తిప్పారంలో విషాదఛాయలు -
నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శనివారం నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమైంది. 2026–27 విద్యాసంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల విద్యాశాఖ అధికారులు, వర్గల్ నవోదయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, అభ్యర్థులకు అనుమానాలు నివృత్తి చేసేందుకు ‘హెల్ప్‌డెస్క్’ ఏర్పాటు చేశారు. 24 మందికి ఒక ఇన్విజిలేటర్ గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి సమాచారం కోసం హెల్ప్‌డెస్క్ నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన సమాచారం, అనుమానాల నివృత్తి కోసం శ్రీనివాస్‌రావు: 73823 35164, ఎంజీ సోనీ: 94489 01318 హెల్ప్‌డెస్క్ నెంబర్లలో సంప్రదించవచ్చు. -
ఒకరి బైండోవర్
: రూ.లక్ష జరిమానా మిరుదొడ్డి(దుబ్బాక): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ వ్యక్తిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు మిరుదొడ్డి ఎస్ఐ సమత శుక్రవారం తెలిపారు. మండల పరిధిలోని మల్లుపల్లికి చెందిన గరిపల్లి లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటిపై గత నవంబర్ నెల 29న దాడి నిర్వహించగా అక్రమంగా నిలువ ఉంచిన మద్యాన్ని పట్టుకుని అదే రోజు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు వివరించారు. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో అక్రమంగా మద్యం విక్రయించడం మళ్లీ మొదలు పెట్టాడని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఈ నెల 5న అతని ఇంటిపై దాడి చేసి మరింత మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితున్ని శుక్రవారం తసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఎదుట బైండోవర్ చేయగా రూ. లక్ష జరిమానా విధించారన్నారు. పౌష్టికాహారంతో ఆరోగ్యంనర్సాపూర్: పౌష్టికాహారంతో ఆరోగ్యం పొందవచ్చని జూనియర్ సివిల్ జడ్జి హేమలత అన్నారు. శుక్రవారం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సాంఘిక సంక్షేమ డేను పురస్కరించుకొని మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదస్సులో కమిటీ ప్రతినిధులు మధుశ్రీ, స్వరూపరాణి, సుధాకర్, ఆసుపత్రి వైద్యులు పావని, రాజేష్ తదితరులు పాల్గొని రోగులకు పలు సూచనలు చేశారు. గ్యాస్ సిలిండర్ లీకై .. గుడిసె దగ్ధం చిన్నశంకరంపేట(మెదక్): గ్యాస్ సిలిండర్ లీకై పూరి గుడిసె దగ్ధమైంది. ఈ సంఘటన నార్సింగి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. నార్సింగి మండల కేంద్రానికి చెందిన మానేపల్లి రవి కుటుంబ సభ్యులతో కలిసి పూరిగుడిసెలో జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం గ్యాస్సిలింగర్ రెగ్యులేటర్ నుంచి మంటలు వ్యాపించి పూరిగుడిసెకు అంటుకున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఇరుగు, పొరుగు సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మంటల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కాగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన రూ.2.50లక్షలు, మరో రూ.పదివేలు, తులం బంగారు ఆభరణాలు, సర్టిఫికెట్లు, ఇంటి పేపర్లు దగ్ధమైనట్లు బాధితుడు రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సృజన తెలిపారు. అక్రమ మద్యం స్వాధీనం సిద్దిపేటకమాన్: అక్రమంగా రవాణ చేస్తున్న మద్యాన్ని ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్నికల కోడ్ సందర్భంగా పలు గ్రామాల్లో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. తనికీల్లో అక్రమంగా తరలిస్తున్న 21.96లీటర్ల లిక్కర్, 3.25లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకుని ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
కిడ్నాప్ కాదు.. డ్రామా
● దోస్తుల కోసమే నాటకం ఆడాం ● స్వయంగా ఒప్పేసుకున్న విద్యార్థులు ● తల్లిదండ్రులకు అప్పగించిన ప్రిన్సిపాల్ మునిపల్లి(అందోల్): విద్యార్థులు ఆడిన కిడ్నాప్ డ్రామా అంతా అబద్ధమని ప్రిన్సిపాల్ సురభీ చైతన్య తెలిపారు. శుక్రవారం మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులకు విద్యార్థులను అప్పగించారు. గ్రామంలో దోస్తులను కలిసేందుకే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు విద్యార్థులు రాకేశ్, సిద్దార్థ్ ఇద్దరూ ప్రిన్సిపాల్, ఎంపీడీఓ హరినందన్‌రావు, తల్లిదండ్రుల ముందు స్వయంగా ఒప్పుకున్నారు. దీంతో ప్రిన్సిపాల్ విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వీరిద్దరి కిడ్నాప్ నాటకంతో తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, పోలీస్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారని ప్రిన్సిపాల్ ఆవేదన వ్యకం చేశారు. అయితే సోమవారం విద్యార్థులను తిరిగి హాస్టల్‌కు తీసుకొస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు తెలియజేయగా.. మరోసారి కిడ్నాప్, డ్రామాలు ఆడితే మాకేం సంబంధం లేదని, స్వయంగా లెటర్ రాసివ్వాలని ప్రిన్సిపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. కాగా, సీసీ పుటేజీల పరిశీలనతో పాటు వైద్యుల పరీక్షల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని డాక్టర్లు స్పష్టంగా చెప్పడంతో విద్యార్థులే కిడ్నాన్ డ్రామా ఆడినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరినందరావు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. -
ఓటింగ్‌కు దూరంగా ఉద్యోగులు
● పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అనాసక్తి ● గొడవలు జరుగుతాయన్న భయంజహీరాబాద్టౌన్: పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. ఓట్ల లెక్కింపు సమయంలో ఉద్యోగి ఎవరికి ఓటు వేశారనేది అభ్యర్థులకు తేలిగ్గా తెలిసిపోతుంది. దీంతో ఓడిన అభ్యర్థులతో గొవవలు జరుగుతాయని ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అకాశం ఉంది. శిక్షణ తరగతుల సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఇస్తారు. గుర్తులపై టిక్ మార్కు చేసి ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఉన్న బాక్స్‌లో వేయాలి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో సదరు ఉద్యోగి ఎవరికి ఓటు వేశారనేది తెలిసిపోతుంది. దీంతో గ్రామాల్లో గొడవలెందుకనే ఉద్దేశ్యంతో ఓటుహక్కును వినియోగించు కోవడం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో బ్యాలెట్ పత్రాలను సంబంధిత డివిజన్ కేంద్రాలకు పంపుతారు. పంచాయతీ ఎన్నికలు వచ్చే సరికి బ్యాలెట్ పత్రాలను అధికారులు ఉద్యోగుల సొంత గ్రామాలకు పంపుతారు. దీంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పల్లెల్లో ఏ వార్డులో ఎంత మంది.. ఎవరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అనే విషయం స్థానికులకు కచ్చితంగా తెలుస్తుంది. దీంతో ఓట్ల లెక్కిపు సమయంలో మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. కౌటింగ్ హాల్ల్లోని ఎజెంట్లకు ప్రతి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చూపిస్తారు. తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఉద్యోగి ఓటు ఎవరికి వేశారో స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక వేళ అభ్యర్థి ఒక ఓటుతో గెలిస్తే గొడవలకు దారితీస్తుందన్న ఉద్దేశ్యంతో ఉద్యోగులు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో ఆరు వేల మంది ఉపాధ్యాయులతో పాటు ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. సుమారు నాలుగు వేల మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వారందరికీ పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వగా 90 శాతం వరకు ఓటు వినియోగించుకోలేదని సమాచారం. -
సర్పంచ్ నీ ఇష్టం.. వార్డుకు నాకే ఓటేయ్
చిలప్‌చెడ్(నర్సాపూర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారాలు జోరందుకున్నాయి. పలు గ్రామాల్లో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపు సాధించాలనే లక్ష్యంతో, తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న వార్డు సభ్యులకు సైతం కొంత మేర ఖర్చు పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా గ్రామాల్లో ఓటర్లు వార్డు సభ్యుల అభ్యర్థులకు అనుకూలంగా ఉండి, సర్పంచ్ అభ్యర్థిపై నిరుత్సాహంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వార్డు సభ్యుల అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థికి నీయిష్టం... వార్డులో నాకు తప్పనిసరిగా ఓటు వేయ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో చాలావరకు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. -
కర్సయి పోతున్నాయి!
● తడిసి మోపెడవుతున్న ఖర్చు● కార్యదర్శులకు భారమైన ఎన్నికల నిర్వహణ ● ప్రభుత్వం నుంచి నిధులు రాక పోవడంతో అవస్థలు జహీరాబాద్: ఎన్నికల నిర్వహణకు గాను ప్రతిసారి ప్రభుత్వం ముందస్తుగానే నిధులు విడుదల చేస్తుండేది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు మాత్రం ఇప్పటి వరకు నిధుల కేటాయింపులు జరగలేదు. దీంతో ఎన్నికల నిర్వహణ ఖర్చులను సమకూర్చుకోవడం పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. ఇప్పటికే గ్రామాల్లో రెండేళ్ల నుంచి పాలకవర్గాలు లేక పోవడంతో పారిశుద్ధ్య పనులు, ఇతరత్రా అవసరాలకు కార్యదర్శులే అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెడుతున్నారు. ఇంతలోనే ఎన్నికలు రావడం, ఖర్చుల కోసం అవసరమైన నిధులు ఇవ్వక పోవడంతో అవస్థలు పడక తప్పడం లేదు. ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము కుమిలిపోతున్నారు. ఖర్చులు భారంగా... పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ మొదలుకొని ఓట్ల లెక్కింపు వరకు గ్రామస్థాయిలో కార్యదర్శులే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు ఉద్యోగుల భోజన ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది. కేంద్రాల వద్ద టెంట్లు కూడా వేయించాల్సి ఉండడంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శికి రూ.25వేల నుంచి రూ.40వేల వరకు పైగా ఖర్చవుతోందని చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తం పంచాయతీ కార్యదర్శులు నిధులు సమకూర్చుకునే విషయంలో అవస్థలు పడుతున్నారు. అవసరమైన ఖర్చులకు గాను అప్పులు చేసినట్లు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ నిధుల నుంచి ఖర్చు పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై గ్రామ కార్యదర్శుల మీద భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఓ ఎంపీడీఓ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు గాను పంచాయతీ నిధుల నుంచి కార్యదర్శులు ఖర్చు చేసుకోవచ్చన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే ఖర్చుచేసిన నిధులు వస్తాయన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత వారిదే అన్నారు. నిధుల విషయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల మలి విడత ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. తుది విడత ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సారథులే స్వయంగా పల్లె బాట పడుతూ వ్యూహరచన చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచార తీరు మారింది. విందులు, హామీలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలు పంచాయతీ సమరాన్ని ప్రతిష్టాత్మకంగా భావించడంతో పోటీ రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ, మండల స్థాయి నేతలు గ్రామాలను చుట్టిముట్టి వస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నాయకులు గ్రామాల్లో జోరు పర్యటనలు సాగిస్తున్నారు. ప్రచారంలో వెనుకబడి ఉన్న నాయకులు, అభ్యర్థులకు ప్రచార వ్యూహాలను అందిస్తున్నారు. బడా నేతల అండదండలతో గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా అభ్యర్థులు ప్రచార పర్వంలో సాగుతున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్య నాయకులు సైతం ఎలాగైనా గెలుపొందాలని సూచిస్తుండడంతో అభ్యర్థులు, గ్రామస్థాయి నాయకులు తమ శక్తియుక్తులన్నీ కూడగడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముఖ్య నాయకులు గ్రామాల్లో సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహిస్తూ తమ పార్టీ మద్దతుగల అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అంతు చిక్కని ఓటరు నాడి గ్రామీణ ఓటర్లు ప్రస్తుతం అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులంతా తమకు పరిచయస్తులే కావడంతో ప్రచారం కోసం వచ్చే వారితో ఆచితూచిగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అందరికీ ఒకే రకమైన భరోసా కల్పిస్తూ వారి ప్రచారానికి స్పందిస్తున్నారని చెబుతున్నారు. ఎక్కడ కూడా నోరు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రచారం కోసం వచ్చే అభ్యర్థులను వారు తమ ఇళ్లలోకి సాదారంగా ఆహ్వానిస్తూ ఓటు మీకే వేస్తామని చెబుతున్నారు. ఓటర్ల స్పందనను చూసి అభ్యర్థులంతా గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ఓ వీధి వారంతా తమకే మద్దతునిస్తున్నారని, అలాగే కుల సంఘాలు, యూత్ సభ్యులు కూడా తమకే అండగా ఉంటున్నారంటూ ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ప్రలోభాలకు ఎర!శుక్రవారం సాయంత్రం రెండో విడత ప్రచారానికి తెరపడింది. పోలింగ్‌కు సమయం ఉండడంతో ప్రలోభాల పర్వం ప్రారంభమైంది. చివరి దశకు చేరుకోవడంతో ఉన్న రెండు రోజులు అత్యంత విలువైనది భావించి రహస్య మంతనాలు సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. అత్యంత విలువైన సమయాన్ని అతి చాకచక్యంగా మలుచుకునేందుకు యత్నిస్తున్నారు. గ్రామాల్లో మందు, విందులు, తాయిలాలు జోరందుకున్నాయి. -
రూ.1100 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ప్రతిపాదించిన ఎస్టీపీ ప్లాంట్‌ను ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్పూర్ పరిధిలోని సర్వే నంబర్ 993లో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని వివిధ శాఖ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ –20 పథకంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఏడు చెరువులను రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమీన్‌పూర్‌లోని పదెకరాలలో ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామన్నారు. ఇదే సర్వే నంబర్లో ఐదెకరాలు స్టేడియానికి, 10 ఎకరాలు నవోదయ విద్యాలయానికి కేటాయించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ జ్యోతిరెడ్డి, తహసీల్దార్ వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఉపేందర్ రెడ్డి, గోపాల్, మూనిస్, రాములు, జగదీశ్, మోడికాలనీ ప్రతినిధి రమేష్ పాల్గొన్నారు. -
రక్త పరీక్షలు జరుగుతున్నాయా..?
ప్రోగ్రాం మేనేజర్ నాగరాజు ఆరా జహీరాబాద్: జహీరాబాద్‌లోని ఏరియా ప్రభుత్వాస్పత్రిని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ (హెచ్ఐవీ) నాగరాజు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఐసీటీసీ ల్యాబ్‌ను, రికార్డులను పరిశీలించారు. హెచ్ఐవీ కిట్స్ సక్రమంగా ఉన్నదీ లేనిదీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందరికీ రక్త పరీక్షలు జరుగుతున్నాయా అనే విషయమై రోగులను అడిగి ఆరా తీశారు. అందరూ ప్రభుత్వాస్పత్రిలోనే హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్‌ను కలిసి ఆస్పత్రి నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యులు నాగరాజ్ పాటిల్, శేషుబాబు, ల్యాడ్ టెక్నిషియన్ బండి సుధాకర్, కౌన్సిలర్ దండయ్యా పాల్గొన్నారు. సదాశివపేట(సంగారెడ్డి): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 19వ తేదీ నుంచి అండర్–14, 22 వేయిట్ కేటరిగిలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు పట్టణంలోని విజ్ఞాన్ మాడల్ స్కూల్ విద్యార్థిని కే.అశ్విక ఎంపికై ంది. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లిలో శుక్రవారం జరిగిన ఎస్జిఎఫ్ అండర్–14 బాలికల విభాగం నుంచి 22 వేయిట్ కేటగిరిలో అశ్విక బంగారు పతకం సాధించింది. కాగా, అశ్వికను తెలంగాణ స్టేట్ జేకే ఏ బోర్డు ఆఫ్ డైరక్టర్ శంకర్‌గౌడ్ అభినందించారు. టేక్మాల్(మెదక్): మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు శుక్రవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సంగారెడ్డిలోని తన నివాసంలో కలిశారు. ఈసందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈసందర్భంగా సర్పంచ్‌లు మంత్రి సన్మానించారు. రాయికోడ్(అందోల్): మండలంలోని ఔరంగానగర్ గ్రామ పంచాయతీలో ఎన్కెపల్లి అనుబంధ గ్రామంగా ఉండేది. ఇటీవల ఎన్కెపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఈ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. 323 మంది ఓటర్లు ఉండగా ఆరు వార్డులు ఉన్నాయి. 165 మంది పురుషులు కాగా 158 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలంలో అతితక్కువ ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీ ఎన్కెపల్లి, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారురాలిగా మాణెమ్మ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారురాలిగా ఈశ్వరమ్మ సర్పంచ్ బరిలో నిలిచారు. గ్రామ ఓటర్లు తొలి సర్పంచ్ పదవి ఎవరికి కట్టబెడతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉద్యాన డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం ములుగు(గజ్వేల్): ఉద్యాన విశ్వవిద్యాలయంలోని డిగ్రీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17న ఉదయం 10:30 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కంబైన్డ్ కౌన్సెలింగ్ కు దరఖాస్తు సమర్పించాలన్నారు. ఎప్‌సెట్ –2025లో ర్యాంకు పొందిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు హాజరు కావచ్చన్నారు. విశ్వవిద్యాలయం పరీక్షా కేంద్రంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 96524 56779 నంబర్ ద్వారా సంప్రదించాలని ఆయన కోరారు. -
ఆ కుర్చీ కాస్ట్లీ గురూ..!
ఉప సర్పంచ్ కోసమూ భారీగానే ఖర్చు ఉప సర్పంచ్రియల్ ఎస్టేట్, వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన ఓ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కోసం తనకు మద్దతు ఇచ్చిన వార్డు సభ్యులకు ఒక్కొక్కరి రూ.3 లక్షల చొప్పున నజరానా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కొంత మొత్తాన్ని ముందస్తుగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. మరో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పదవి కోసం తనకు మద్దతుగా ఓటు వేసినందుకు గాను ఆయా వార్డు సభ్యులకు ఈ ఎన్నికల్లో అయిన ఖర్చు మొత్తాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. ఇలా ఆరుగురు వార్డు సభ్యుల ఖర్చు సుమారు రూ. ఆరు లక్షల వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో మరో గ్రామ ఉప సర్పంచ్ పదవి కోసం ముందస్తుగానే ఐదుగురు వార్డు సభ్యులకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ.లక్షల్లో నగదును ముట్టజెప్పినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఇలా కేవలం సర్పంచ్ పదవులకే కాదు, ఉప సర్పంచ్ పదవుల కోసం కూడా కొందరు అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ఈ ఉప సర్పంచ్ ఎన్నికలో తమకు ఓటు వేసిన వార్డు సభ్యులకు పెద్ద మొత్తంలో నజరానాలు ముట్టచెబుతున్నారు. రూ.లక్షల్లో ఖర్చు చేసి వార్డు సభ్యుడిగా ఎన్నికవడంతో పాటు, ఉప సర్పంచ్ పదవిని పొందేందుకు అంతకు మించి ఖర్చుకు వెనుకాడటం లేదు. జిల్లాలో తొలి విడతలో మొత్తం 129 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే. కౌంటింగ్ తొందరగా ముగిసి ఫలితాలు వచ్చిన వెంటనే మొత్తం 109 గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్ ఎన్నికను గురువారమే నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైన 20 గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్ ఎన్నిక శుక్రవారం జరిగింది. ఒకటీ, రెండు పంచాయతీలు మినహా తొలి విడతలోని 129 పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. అయితే సర్పంచ్ పదవికి రిజర్వేషన్లు కలిసి రాని నేతలు ఉప సర్పంచులుగా ఎన్నికయ్యేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఈ పదవికి డిమాండ్ ఏర్పడటంతో పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు. తమకు ఓటేసిన వార్డు సభ్యులకు నజరానాలు పలుచోట్ల వార్డు సభ్యుల ఎన్నికల ఖర్చును భరించిన ఆశావహులు తొలి విడతలో దాదాపు 129 గ్రామాల ఉపసర్పంచ్ పదవుల ఎన్నిక పూర్తి ఉప సర్పంచ్ పదవికి కూడా గ్రామాల్లో కొంత ప్రతిష్ట ఉంటుంది. ఉప సర్పంచ్ అని పిలుపించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. దీంతో ఆశావహులు ఖర్చుకు వెనుకాడలేదు. దీనికి తోడు ఉప సర్పంచ్‌కు కూడా చెక్‌పవర్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఉప సర్పంచ్‌కు కూడా చెక్ పవర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ ఉంటుందని భావించి ఈ పదవి వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదైనా అవినీతి ఆరోపణలు వచ్చి సర్పంచ్ సస్పెండ్ అయితే ఉప సర్పంచ్ కీలకం అవుతారు. దీంతో ఈ పదవులకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో నాయకులు రూ.లక్షల్లో ఖర్చు చేసి ఈ పదవిని పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
ముందు 7.. రీకౌంటింగ్ తర్వాత 2
రేగోడ్(మెదక్): మండలంలోని తాటిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక హోరాహోరీగా జరిగింది. గ్రామంలో 617 ఓట్లు ఉండగా, ఇండిపెండెంట్‌గా కవిత, కాంగ్రెస్ తరపున సంపూర్ణ పోటీ చేశారు. ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి కవిత 7 ఓట్ల మెజార్టీతో గెలిచారని అధికారులు ముందుగా ప్రకటించారు. తరువాత కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుదారులు రీకౌంటింగ్ చేయించడంతో ముందుగా 7 ఓట్లు మెజార్టీ ఉన్న కవిత.. చివరకు 2 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. గ్రామాభివృద్ధే తన లక్ష్యమని సర్పంచ్ కవిత తెలిపారు. నాలుగోసారి ఒకే కుటుంబానికి సర్పంచ్ గిరి అల్లాదుర్గం(మెదక్): రిజర్వేషన్ కలిసిరావటంతో వరుసగా నాలుగోసారి ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి వరించింది. అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి పంచాయతీ 2006 నుంచి 2025 వరకు వరుసగా నాలుగు సార్లు రిజర్వేషన్ జనరల్‌కే కేటాయించారు. గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో సాతెల్లిగారి నర్సింహారెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు. ఈ కుటుంబానికే నాలుగోసారి సర్పంచ్ పదవి దక్కడం విశేషం. సర్పంచ్ అభ్యర్థికి గుండెపోటు అస్పత్రికి తరలింపు చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని జంగరాయి సర్పంచ్ అభ్యర్థి ఆర్.అంజిరెడ్డి గుండెపోటుతో అస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి గ్రామంలో ప్రచారం ముగించుకొని ఇంటికి చేరిన సంజీవరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో అనుచరులతో ఎన్నికల గురించి చర్చిస్తున్న క్రమంలో చాతీలో నొప్పి వస్తుందని కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు మెదక్‌లోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోతుల దాడిలో మహిళకు గాయాలుశివ్వంపేట(నర్సాపూర్): కోతుల దాడిలో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని చిన్న గొట్టిముక్కుల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రకళ ఇంటి ఆరుబయట పనులు చేస్తుండగా ఒక్కసారిగా కోతుల గుంపు వచ్చి దాడి చేశాయి. ఆమె అరవడంతో స్థానికులు కోతుల మందను తరిమేశారు. కోతుల దాడిలో చంద్రకళకు చేతులతో పాటు పలు చోట్ల గాయాలయ్యియి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. -
ఒకసారి భర్త సర్పంచ్.. మరోసారి భార్య
● దశాబ్దాలుగా వారి ఏలుబడిలోనే 10 గ్రామ పంచాయతీలు ● హత్నూర మండలంలో విచిత్రం సతి, పతులకే పగ్గాలుహత్నూర( సంగారెడ్డి): రాజకీయాల్లో ఓ చిన్న పదవి కోసం నానా పాట్లు పడుతుంటారు. కానీ.. ఇక్కడ పది గ్రామాలు భార్యాభర్తల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఒకసారి భర్త సర్పంచ్ అయితే... మరోసారి భార్య సర్పంచ్ పదవి పగ్గాలు చేపడుతారు. ఇలా హత్నూర మండలంలోని పది పంచాయతీల్లో దశాబ్దాలుగా పతి, సతుల పాలనే కొనసాగుతోంది. మండలంలోని చీక్ మద్దూర్‌లో గతంలో సర్పంచ్‌గా శ్రీనివాస్ రెడ్డి రెండుసార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో భార్యా ప్రవీణ ఎంపీటీసీగా కొనసాగారు. ప్రస్తుతం తిరిగి కాంగ్రెస్ తరపున ప్రవీణ సర్పంచ్‌గా విజయం సాధించారు. గోవిందరాజ్ పల్లి గ్రామ సర్పంచ్‌గా బండమీది సునీత ఉండగా.. ప్రస్తుతం ఆమె భర్త బండమీది రాజు ఎన్నికయ్యారు. లింగాపూర్‌లో చార్ల లక్ష్మి గతంలో సర్పంచ్‌గా పనిచేయగా ప్రస్తుతం కొడుకు మణిదీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొన్యాల గ్రామంలో రెండోసారి దానంపల్లి సుజాత విజయం సాధించారు. ముచ్చర్ల గ్రామ సర్పంచ్‌గా గతంలో అనిత ఉండగా.. ప్రస్తుతం ఆమె భర్త యాదగిరి విజయం సాధించారు. సాధులనగర్ గ్రామ సర్పంచ్‌గా రెండోసారి కర్రే లక్ష్మి విజయం సాధించారు. మధుర గ్రామ సర్పంచ్‌గా గతంలో మాధవిపనిచేయగా.. ప్రస్తుతం భర్త నవీన్ గౌడ్ ఎన్నికయ్యారు. అలాగే.. కొడిపాకలో మాధవి యాదవ్ రెండోసారి విజయం సాధించారు. దౌల్తాబాద్ సర్పంచ్‌గా సంగీత విజయం సాధించగా.. భర్త నర్సింలు గతంలో ఎంపీపీగా పనిచేశారు. కొత్తగూడెం గ్రామ సర్పంచ్‌గా లకావత్ మాధవి ఏకంగా మూడోసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇలా మండలంలోని 10 గ్రామాల్లో భార్యాభర్తల ఏలుబడిలోనే పంచాయతీ పాలన కొనసాగుతోంది. -
పంచాయతీ సిబ్బందిపై హోంగార్డు దాడి
మద్దూరు(హుస్నాబాద్): పంచాయతీ సిబ్బందిపై దాడిచేసిన హోంగార్డుపై చర్యలు తీసుకోవాలని సిబ్బంది డిమాండ్ చేశారు. స్థానిక చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుడు బాలేశ్ నల్లా పైపుతో కార్యాలయ ఆవరణలోని చెట్లకు నీరు పడుతుండగా చేర్యాల పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించే భానుచందర్ అక్కడి వచ్చి తన కారు కడుక్కోడానికి నల్లా పైపు ఇవ్వాలని అడిగారు. ఐదు నిముషాల తర్వాత ఇస్తానని బాలేశ్ చెప్పడంతో ఆయన కోపంతో దాడికి దిగారు. పక్కనే ఉన్న మరో సిబ్బంది హోంగార్డును ఆపేందుకు ప్రయత్నించగా, అతనిపైనా దాడి చేశారు. దీంతో పంచాయతీ సిబ్బంది హోంగార్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంపీఓ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు.చర్యలు తీసకోవాలంటూ నిరసన -
పగలు ప్రచారం.. రాత్రి మంత్రాంగం
ప్రతిష్టాత్మకం● పల్లెల్లో సర్పంచ్ అభ్యర్థుల ఆపసోపాలు ● గెలుపుకోసం విశ్వ ప్రయత్నాలు ● జోరుగా మలి, చివరి విడత ప్రచారం నారాయణఖేడ్: తొలి విడత ఎన్నికల పర్వం ముగియడంతో మలి, చివరి దశ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రచార పర్వంలో దూసుకు పోతున్నారు. తమకు కేటాయించిన గుర్తులను చూపుతూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉదయం ప్రచారం.. రాత్రిళ్లు మంతనాలు సాగిస్తున్నారు. ఎలాగైనా తాము గెలవాలన్న లక్ష్యంతో ఉన్న అవకాశాలను వాడుకుంటున్నారు. రెబల్స్ బెడద ఉన్న చోట ప్రత్యర్థి వర్గం నుంచి తమకు ఓట్లు వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ పార్టీలో ఉంటూ రెబల్స్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వ్యక్తికి మద్దతు ఇస్తున్న వారిని ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎవరు చెబితే వింటారో అంటూ ఆలోచిస్తూ ఆయా వ్యక్తులు, పార్టీల నాయకులతో మాట్లాడించి మద్దతు కూడగడుతున్నారు. ఈ ఒక్కసారి తమకు మద్దతు ఇవ్వాలని.. అందుకు ప్రతిఫలంగా ఏం కావాలో చెప్పాలంటూ అడుగుతున్నారు. చాలా చోట్ల ఆర్థిక హామీలతోనే అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. దీంతో చాలా పంచాయతీల్లో ఉదయం ఒక పార్టీలో ఉన్న నాయకులు, ఓటర్లు సాయంత్రానికి పార్టీ మారుతున్నారు. కొందరు కుటుంబాలను, కులాలను కూడా చూపుతూ తమ మద్దతు తెలపాలని వేడుకుంటున్నారు. జోరుగా దావత్‌లు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు ఉదయం వ్యవసాయ క్షేత్రాలు, కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి వస్తుండడంతో ఉదయం, సాయంత్రం ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. తమ వెంట తిరిగే కార్యకర్తలు, అభిమానులకు మధ్యాహ్నం సమయంలో చికెన్ రైస్, లేదా చికెన్ బిర్యానీలు తినిపిస్తున్నారు. రాత్రి సమయాల్లో దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చీప్‌లిక్కర్ తాగేవారు కూడా బ్రాండెడ్ మందు అడుగుతున్నారని కొందరు అభ్యర్థులు గుసగుసలాడుతున్నారు. పంచాయతీ పోరును వివిధ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత పంచాయతీ పాలకవర్గాల్లో బీఆర్ఎస్ మద్దతుతోనే ఎక్కువ మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు, పెద్ద నాయకులు పంచాయతీ పోరుపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లెల్లో ప్రజాప్రతినిధులు ఉంటే పార్టీకి పట్టు ఉంటుందని, మరోసారి ఎన్నికల్లో విజయం సులువు అవుతుందని తెలుపుతూ ప్రతీ చోట కాంగ్రెస్ విజయం సాధించాలని సూచిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన నాయకులు సైతం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మొత్తమ్మీద అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పల్లెపోరు వేడెక్కుతోంది. -
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
సీఐటీయూ అధ్యక్షుడు చుక్కా రాములుపటాన్చెరు టౌన్: రాబోయే రోజుల్లో లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికవర్గమంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాము లు అన్నారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే కాలంలో నాన్ పర్మినెంట్ ఉద్యోగులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, యాజమాన్యాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ 18వ అఖిల భారత జాతీయ మహాసభల సందర్భంగా డిసెంబర్ 15న అన్ని పారిశ్రామిక ప్రాంతాలలో, గ్రామాల్లో, నివాస ప్రాంతాలలో సీఐటీయూ జెండాలను ఎగురవేసి ఫ్లాగ్ డే నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పాండు రంగారెడ్డి, ఎం.మనోహర్, వీరారావు, సదాశివరెడ్డి, సత్తిబాబు, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. -
నువ్వా.. నేనా..!
కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటాపోటీ ఫలితాలుసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హోరాహోరీగా సాగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ జిల్లాలో తన పట్టును నిలుపుకొంది. హస్తం పార్టీకి గట్టి పోటీని ఇచ్చింది. కాంగ్రెస్‌తో పోల్చితే బీఆర్ఎస్ కాస్త తక్కువ సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. పంచాయతీ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. వారం రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద మొత్తంలో ఎన్నికల్లో ఖర్చు చేశారు. మద్యం, మాంసం, విందులు ఇచ్చారు. కీలకమైన కులసంఘాలు, యువతను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. సుమారు 65 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం తొలి విడతలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట మండలాలు, పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు, గుమ్మడిదల మండలాలు, నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 136 గ్రామ పంచాయతీలకు గాను ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 129 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ సుమారు 65కు పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. బీఆర్ఎస్కు సుమారు 46 సర్పంచ్ స్థానాలు ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకొంది. అధికార పార్టీకి గట్టి పోటీని ఇచ్చింది. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా గెలవడం సాధారణం. కానీ ఇక్కడ ఇందుకు భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 46 గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా విజయం సాధించారు. కాంగ్రెస్‌తో పోల్చితే బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచిన స్థానాలు కాస్త తక్కువే అయినప్పటికీ.. గట్టి పోటీని ఇచ్చింది. దీంతో గ్రామాల్లో పార్టీకి మంచి పట్టుందని నిరూపితమైంది. స్వతంత్రులు, కమలం పార్టీ సర్పంచులు బీజేపీ మద్దతు దారులు ఈ ఎన్నికల్లో తమ ఉనికి చాటుకున్నారు. నాలుగు గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతు దారులు విజయం సాధించారు. హత్నూర మండలం చందాపూర్‌లో అన్ని వార్డు సభ్యులతో పాటు, సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ.. పంచాయతీ ఎన్నికలకు వచ్చే సరికి ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు కూడా విజయం సాధించారు. ఏ పార్టీ మద్దతు లేకుండా సొంతంగా బరిలోకి దిగిన ఈ స్వతంత్రులు సుమారు ఏడు చోట్ల విజయం సాధించడం గమనార్హం. ఆయా గ్రామాల్లో అభ్యర్థికి ఉన్న మంచి పేరుతో విజయం సాధించినట్లయింది. ఈ గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించడం గమనార్హం. మాజీలు, తాజామాజీలే అధికం చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా మాజీలు, తాజా మాజీలే బరిలో నిలిచారు. రిజర్వేషన్లు కలిసి రాని అతికొన్ని పంచాయతీల్లోనే కొత్తవారు పోటీ చేశారు. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగింది. హస్తం పార్టీ మద్దతుదారులదే పైచేయి పట్టునిలుపుకొన్న గులాబీ పార్టీ మద్దతుదారులు పలు చోట్ల సత్తా చాటిన స్వతంత్రులు ఉనికిని చాటుకున్న బీజేపీ మద్దతుదారులు కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనసంగారెడ్డి జోన్: తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. గురువారం కొండాపూర్ మండల పరిధిలోని మల్లేపల్లిలో కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజేందర్ పాల్గొన్నారు. -
ఓటెత్తిన పల్లె
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పల్లె ఓటరు ఓటెత్తారు. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటు హక్కు వచ్చిన యువత ఉత్సాహంగా ఓటేశారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్చెరు, గుమ్మడిదల, హత్నూర మండలాల్లో పోలింగ్ జరిగింది. ఏకగ్రీవం అయిన సర్పంచు స్థానాలు ఏడు మినహాయిస్తే 129 సర్పంచ్ పదవులకు పోలింగ్ జరిగింది. అలాగే ఏకగ్రీంగా ఎన్నికై న 113 వార్డు సభ్యుల స్థానాలను మినహాయించి 1,133 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రారంభంలో మందకొడిగా.. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తొలి గంట సేపు పోలింగ్ మందకొడిగా సాగింది. 8 గంటల నుంచి ఊపందుకుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. హైదరాబాద్, కర్నాటక, మహరాష్ట్ర వంటి చోట్లకు ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లిన పల్లె ఓటర్లు తమ సొంత గ్రామానికి చేరకుని ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను సర్పంచు అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య ఎన్నికల సరళిని పరిశీలించారు. పలుచోట్ల ఆలస్యంగా కౌంటింగ్ పోలింగ్ ముగిసిన తర్వాత భోజన విరామం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ఏజెంట్లు సకాలంలో రాకపోవడంతో కొన్ని గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లను వేరు చేసి 25 బ్యాలెట్ పేపర్లకు ఒక కట్ట కట్టారు. ఆ తర్వాత ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించారు. ముందుగా వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించారు. ఆ తర్వాత సర్పంచు పదవుల ఫలితాలను ప్రకటించారు. ఓట్లు తక్కువగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఫలితాలు వచ్చాయి. మండల కేంద్రాలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు ఫలితాలు వచ్చాయి. భారీగానే పోలింగ్ తొలివిడత పోలింగ్ భారీగానే నమోదైంది. ఏకంగా 87.96 శాతం నమోదైంది. హత్నూర మండలంలో అత్యధికంగా 90.06 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అత్యల్పంగా పటాన్చెరులో 84.21 శాతం ఓట్లు పోలయ్యాయి. -
పల్లెకు పైసలెట్ల వస్తాయంటే..!
● సొంత వనరులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు ● ఆయా నిధులతోనే మౌలిక వసతుల కల్పన ● మూడు రకాలుగా సమకూరనున్న ఆదాయం జహీరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో కొత్త పాలక మండలి ఏర్పడనుంది. ఈ క్రమంలో గ్రామాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధుల అవసరం ఎంతో ఉంటుంది. ఇందు కోసం గ్రామ పంచాయతీలు ముఖ్యంగా సొంత వనరులను సమకూర్చుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు పొందుతాయి. కర్మాగారాల నుంచి సీఎస్ఆర్ నిధులు కూడా కేటాయింపులు జరుగుతాయి. పంచాయతీలు విధించే పన్నులు, రుసుముల ద్వారా ఆదాయం పొందుతాయి. ఇంటి, నల్లా, వృత్తి, వ్యాపార పన్నులు, వారపు సంతలు, మార్కెట్ల నిర్వహణ, పంచాయతీకి చెందిన భవనాలు, ఖాళీ స్థలాల వంటి ఆస్తులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు బదిలీ అవుతాయి. ఇవి పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు, కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామ పారిశుద్ధ్య, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి.. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే స్టాంపు డ్యూటీలో కొంత వాటాను పంచాయతీలకు అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం సాధారణ గ్రాంట్లు విడుదల అవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీల అమలుకు, ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. గ్రామ పంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించవచ్చు. కార్యాలయ నిర్వహణ, పాలనా వ్యయాలు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పచ్చదనం నిర్వహణ, సామాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా పంచాయతీకి కేటాయించిన బడ్జెట్, ఖర్చుల వివరాలు, ఆడిట్ నివేదికను సులభంగా పరిశీలించవచ్చు. ఇది గ్రామాభివృద్ధిలో జవాబుదారీ తనాన్ని పెంచుతుంది. -
నిజాయితీ చాటుకున్న మహిళ
● బస్సులో దొరికిన బ్యాగ్ పోలీసులకు అప్పగింత ● అందులో 4 తులాల బంగారం,పాస్పుస్తకాలుజిన్నారం (పటాన్చెరు): ఓ మహిళ నిజాయితీ చాటుకుంది. తనకు దొరికిన బంగారు గొలుసు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించింది. ఈ సంఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కవిత బుధవారం ఉదయం ఐదు గంటలకు బొల్లారం నుంచి హనుమకొండకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు కొద్ది దూరం వెళ్లాక చేతికున్న హ్యాండ్ బ్యాగ్ కనిపించకుండా పోయింది. బ్యాగు కోసం బస్సులో వెతికినా లభించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించింది. బ్యాగులో రూ.5లక్షల విలువ గల నాలుగు తులాల విలువైన బంగారు గొలుసు, పాస్ పుస్తకాలు ఉన్నట్లు పేర్కొంది. అయితే.. బొల్లారానికి చెందిన మంజులకు బ్యాగు దొరకడంతో వస్తువులను చూసి అందులో ఉన్న కవిత ఫోన్ నంబర్‌కు అసలు విషయం తెలిపింది. వెంటనే బాధితులకు పోలీసుల సమక్షంలో బంగారు గొలుసు పాస్ పుస్తకాల బ్యాగును అందజేసింది. నిజాయితీని చాటుకున్న మహిళను పోలీసులు అభినందించగా బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్య
తూప్రాన్: చెత్త కాగితాలు ఏరుకోవడంలో ఇద్దరి మధ్య ఏర్పడిన గొడవ హత్యకు దారితీసింది. ఈ సంఘటన పట్టణ పరిధి లింగారెడ్డిపేట చౌరస్తా ఆర్టీసీ బస్టాప్ వద్ద బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా ధర్మారావుపేట గ్రామానికి చెందిన ర్యాపని హనుమంతు తూప్రాన్‌తో పాటు పరిసర గ్రామాల్లో చిత్తు కాగితాలు ఏరుకొని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మరో గుర్తు తెలియని వ్యక్తి కొన్నాళ్లుగా ఇదే ప్రాంతంలో చెత్త కాగితాలు ఏరుకుంటున్నాడు. హనుమంతు ఈ ప్రదేశాల్లో కాగితాలు ఏరొద్దని, ఇది నేను ఒక్కడినే ఏరుకుంటానని పలుమార్లు చెప్పాడు. అయినా సదరు వ్యక్తి తన మాటను లెక్కచేయకుండా కాగితాలు ఏరుకుంటున్నాడు. ఈ క్రమంలోనే లింగారెడ్డిపేట చౌరస్తాలోని ఆర్టీసీ బస్టాప్‌లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి నిద్రిస్తున్నాడు. అక్కడికి చేరుకున్న హనుమంతు సదరు వ్యక్తిని చూసి కోపోద్రికుడై చేతులు కట్టేసి కర్రతో తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావం అయింది. తాడుతో మెడకు బిగించి హత్య చేశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు గమనించి హనుమంతును ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అనుమానం వచ్చి ఆర్టీసీ బస్టాప్‌లో వ్యక్తిని గమనించగా మరణించి ఉన్నాడు. వెంటనే పోలీసులు హనుమంతును అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.పోలీసుల అదుపులో నిందితుడు -
ప్చ్.. ఏం బాగోలేదు!
● అశాసీ్త్రయంగా డివిజన్ల పునర్విభజన ● అమీన్పూర్ను ముక్కలు చేయడం దారుణం ● డివిజన్ల ఏర్పాటుపై స్థానికుల అసంతృప్తి పటాన్చెరు: గ్రేటర్లో కార్పొరేట్ డివిజన్ల పునర్విభజన సరైన పద్ధతిలో జరగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమీన్పూర్ గ్రామాన్ని విడగొట్టి సుల్తాన్‌పూర్‌లో విలీనం చేయడం ఎంత మాత్రం సరైంది కాదన్నారు. అలాగే కిష్టారెడ్డిపేటను రెండు ముక్కలు చేస్తూ నిర్వహించిన పునర్విభజనపై పెదవి విరుస్తున్నారు. పటాన్చెరు డివిజన్‌ను విభజించి కొత్తగా జేపీ కాలనీ పేరుతో రూపొందిన డివిజన్ పరిధిలోకి తెచ్చిన ప్రాంతాలను ఏ పద్ధతిలో చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రోడ్లు, సహజ వనరులైన కాల్వలను పొలిమేర్లుగా చూపుతూ డివిజన్లను ఏర్పాటు చేశారు. అయితే ఎంతో కాలంగా కలిసి ఉన్న గ్రామాలు, ప్రాంతాలను విడదీసి వేరే ప్రాంతం వైపు కలిపి కొత్త డివిజన్‌గా చేయడం పట్ల స్థానిక నాయకులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమీన్‌పూర్‌లోని ఓ భాగం (ఏరియల్ వ్యూ)అమీన్పూర్ను ముక్కలు చేశారుఅమీన్పూర్ను ముక్కలు చేశారు. హెచ్ఎంటీ, పీజేఆర్‌తో పాటు ఇతర కాలనీలను దీప్తి శ్రీనగర్‌లో విలీనం చేయడం దారుణం. అమీన్పూర్ గ్రామా న్ని ముక్కలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు. అమీన్పూర్ను ఛిన్నాభిన్నం చేశారు. పునర్విభజన అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. పార్టీ ఆదేశాల మేరకు పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. –ఆదెల్లి రవీందర్, బీజేపీ నేత ఆక్షేపణలు తెలపవచ్చుఅమీన్పూర్ మొత్తం హైదరాబాద్‌లో 300 డివిజన్లను రూపకల్పన చేశారు. పునర్విభజన ప్రక్రియ ఇంతటితోనే ముగియలేదు. ప్రజలెవరైనా లిఖిత పూర్వకంగా తమ ప్రాంతాల్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలోని అధికారులకు తమ ఆక్షేపణలు అందించవచ్చు. వారం రోజుల వరకు వార్డు డిలిమెటేషన్ ప్రక్రియపై ఆక్షేపణలు తీసుకుంటారు. –జ్యోతిరెడ్డి, ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ -
పటిష్ట బందోబస్తు ఏర్పాటు
హవేళిఘణాపూర్(మెదక్): పోలింగ్స్టేషన్ల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించాలని అదనపు ఎస్పీ మహేందర్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్స్టేషన్ల వద్ద ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ఎవరైనా ఓట్ల కోసం ప్రలోభాలకు గురి చేస్తే సమీపంలోని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించాలన్నారు. పోలింగ్స్టేషన్ల వద్ద గుంపులుగా ఉండరాదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొదన్నారు.మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాయక్, మెదక్‌రూరల్ సీఐ జార్జ్, ఆర్ఐ రామకృష్ణ, ఎస్ఐ నరేశ్‌లు ఉన్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
పరిశీలకులు శేషగిరిరావు విజ్ఞప్తి కల్హేర్(నారాయణఖేడ్): పంచాయతీ ఎన్నికల్లో నియమావళి పాటించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు శేషగిరిరావు సూచించారు. బుధవారం కల్హేర్‌లో సర్పంచ్, వార్డు ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఖర్చు వివరాలు ఎపటికప్పుడు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహేశ్వర్‌రావు, ఏపీఎం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పటాన్చెరు టౌన్: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి మతీన్, ఆ పార్టీ నాయకులు యువరాజ్, రవి ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, ఈశ్వర్ సింగ్ శ్రీనివాస్ అక్షిత్ రాజు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నేడు పత్తి కొనుగోళ్లు బంద్ గజ్వేల్‌రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ మండలం పిడిచెడ్ సమీపంలోని ఈశ్వరసాయి కాటన్ ఇండస్ట్రీస్, సాయి బాలాజీ కాటన్ ఇండస్ట్రీస్, శివగంగా కాటన్ ఇండస్ట్రీస్(బయ్యారం)తో పాటు పట్టణ శివారులోని శ్రీ వాసవి కాటన్ ఇండస్ట్రీస్(జిన్నింగ్ మిల్)లలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరగవని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజున కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ ఉండదని, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మూసి ఉంటుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు. ఇటు చలి.. అటు ప్రచార వేడి బెజ్జంకి(సిద్దిపేట): చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతున్నాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు చలికి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. కొందరు చలిమంటల వద్ద కూర్చుండిపోతున్నారు. ఇదే అదనుగా అభ్యర్థుల మద్దతుదారులు అక్కడికి చేరుకుని ప్రచార వేడిని పెంచుతున్నారు. బెజ్జంకి క్రాసింగ్‌లో చలిమంట వేసుకున్న దృశ్యాన్ని బుధవారం సాక్షి క్లిక్ మనిపించింది. ఎన్నికల ‘సిత్రం’ ప్రచారంలో ‘ఏఐ’ కనికట్టు మిరుదొడ్డి(దుబ్బాక): గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) రాకతో లేని జనాలను ఉన్నట్టు చిత్రిస్తూ ప్రచారాన్ని ఊపందిస్తున్నారు. విభిన్న రీతిలో తమకు కేటాయించిన గుర్తులతో ప్రచారంతో దూసుకెళ్తున్నారు. జనాలను వెంటేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఏఐ సాయంతో ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక తమకు నచ్చిన హీరోల చేతిలో తమకు కేటాయించిన గుర్తులను పెట్టి అభ్యర్థిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. -
బస్సులో మరిచిపోయిన ఆభరణాలు
ప్రయాణికురాలికి అందజేసిన ఆర్టీసీ సిబ్బందికోహెడరూరల్(హుస్నాబాద్): ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన బంగారు పుస్తెలతాడును డ్రైవర్, కండక్టర్ బుధవారం బాధితురాలికి అందజేసి ఔదార్యం చాటుకున్నారు. వివరాలు ఇలా... హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం కోహెడ మీదుగా కరీంనగర్‌కు వెళ్తుంది. ఈ ట్రిప్పులో బస్సులో డ్రైవర్ ఉల్లి చంద్రమౌళి, కండక్టర్ కరుణ ఒక చిన్నపాటి పెట్టెను గమనించారు. దాన్ని తెరిచి చూడగా అందులో సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడు కనిపించింది. దీంతో సదరు నగలను ఆర్టీసీ డిపో మేనేజర్ బి.వెంకటేశ్వర్‌కు అప్పగించారు. ఈ మార్గంలో ప్రయాణించిన వారిని విచారించగా వింపల్లికి చెందిన బద్దం లక్ష్మికి చెందిన ఆభరణాలని తెలిసింది. దీంతో బుధవారం వారిని హుస్నాబాద్ డిపోకు రప్పించి.. అధికారుల సమక్షంలో ఆభరణాలు అప్పగించారు. పోయిన సొమ్మును భద్రంగా ప్రయాణికురాలికి అప్పగించిన కండక్టర్, డ్రైవర్‌ను పలువురు అభినందించారు. -
ముత్తూట్ ఫైనాన్స్‌కు తాళం
పటాన్చెరు టౌన్: ముత్తూట్ ఫైనాన్స్‌కు ఓ బాధితుడు తాళం వేశాడు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ముత్తంగి గ్రామానికి చెందిన సాయి జీవన్ కుమార్ ఇటీవల ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం తాకట్టు పెట్టి రూ.9.51 లక్షలు రుణం తీసుకున్నాడు. డబ్బు సమకూరడంతో రుణం తిరిగి చెల్లించాలనుకున్నాడు. ఈ విషయం మేనేజర్‌కు చెప్పాడు. ఆయన సలహా మేరకు ముత్తూట్ ఫైనాన్స్ అకౌంట్‌కు రూ.9.51 లక్షలతో పాటు వడ్డీ మొత్తం తన బ్యాంక్ ఖాతా నుంచి ఆర్టీజీఎస్ చేశాడు. కానీ బాధితుడికి బంగారం తిరిగి ఇవ్వలేదు. పలుమార్లు మేనేజర్‌ను కలిసి విన్నవించినా సరైన సమాధానం రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు.. బుధవారం ఫైనాన్స్‌కు వెళ్లాడు. మేనేజర్ లేకపోవడంతో సిబ్బందిని నిలదీశాడు. వారి నుంచి కూడా సరైన సమాధానం లేకపోవడంతో ఫైనాన్స్ ప్రధాన ద్వారానికి తాళం వేశాడు. దీంతో ఫైనాన్స్ సిబ్బంది పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తాళం తీయించి సిబ్బందిని బయటకు పంపించారు. వివరణ కోసం మేనేజర్‌ను ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. రుణం చెల్లించినా బంగారం ఇవ్వని ఫైనాన్స్ సిబ్బంది.. నిలదీసిన బాధితుడు సిబ్బంది లోపల ఉండగానే..ప్రధాన ద్వారానికి తాళం -
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
నర్సాపూర్: అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు పట్టుకుని కేసు నమోదు చేశారు. బుధవారం ఎస్ఐ రంజిత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. నర్సాపూర్– వెల్దుర్తి మార్గం లింగాపూర్ గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేశారు. నర్సాపూర్ వైపు నుంచి వచ్చిన ప్యాసింజర్ ఆటోను తనిఖీ చేయగా, అందులో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం బాటిళ్లు తీసుకువస్తూ ఆటోడ్రైవర్ ఆంజనేయులు పట్టుపడ్డారు. 384 క్వార్టర్ల మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎఫ్ఎస్టీ బృందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. దూల్మిట్ట మండలంలో మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ షేక్ మహబుబ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఓ అభ్యర్థి అదే గ్రామానికి చెందిన ఓ రైతు పత్తి చేనులో సుమారు రూ.95వేల విలువ చేసే పది కాటన్ల ఇంపీరియల్ బ్లూ మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు అభ్యర్థి, మరో ఇద్దరితో పాటు ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మిన దూల్మిట్ట షాపు ఓనర్‌పై కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి బైక్, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్ల స్వాధీనం రామాయంపేట(మెదక్): నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం సీఐ నరేందర్ వివరాలు వెల్లడించారు. రామాయంపేటలోని అమృత బార్ నుంచి 90 లీటర్ల మద్యం బాటిళ్లు తీసుకొని కారులో చల్మెడ తరలిస్తుండగా దౌల్తాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద సీవిల్ ఎస్ఐ బాల్‌రాజ్ కలిసి ఎకై ్సజ్ పోలీసులు మద్యం, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రెస్టారెంట్లు, దుకాణాలకు జరిమానహుస్నాబాద్: మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం ఆధ్వర్యంలో బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లపై బుధవారం దాడులు నిర్వహించారు. పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లు, సింగిల్ యూస్ ప్లాస్టిక్, ఫుట్‌పాత్‌లను అక్రమించిన దుకాణాలకు జరిమాన విధించారు. జగదాంబ బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.వెయ్యి, రోహన్ బార్‌కు రూ.వెయ్యి, బాలాజీ హోటల్‌కు రూ.500, జిలేబి షాపునకు రూ.500, సాగర్ పాన్‌షాపునకు రూ.200, రెడ్డి ఎలక్ట్రికల్స్‌కు రూ.500, లక్ష్మికాంత్ బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.500, రేణుకా బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.3వేల జరిమాన విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పర్యావరణ అధికారి రవి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. చికిత్స పొందుతూ యువకుని మృతి నంగునూరు(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రాజగోపాల్‌పేట ఎస్ఐ వివేక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట మండలం కిష్టసాగర్కు చెందిన నర్ర భరత్‌రెడ్డి (22) మంగళవారం నంగునూరు వచ్చి రాత్రి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద బైక్ అదుపుతప్పి కింద పడడంతో తీవ్ర గాయా లయ్యాయి. చికిత్స నిమిత్తం సిద్దిపేట లోని ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. విద్యార్థి ఆత్మహత్య రామాయంపేట(మెదక్): మండలంలోని దామరచెరువు గ్రామానికి చెందిన విద్యార్థి పిట్ల సాయితేజ(20), ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన సాయితేజ చేను వద్ద గుడిసెలో ఉరేసుకున్నాడు. సమీపంలోని రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సాయితేజ ఐటీఐ చదువుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డివిజన్ల పునర్విభజన అశాసీ్త్రయం
గ్రేటర్ పరిధిలో వార్డు ల పునర్విభజన ప్రక్రియ అశాసీ్త్రయంగా నిర్వహించారు. ఏ పద్ధతిలో చేశారనేందుకు సారూప్యత ఎక్కడా కనిపించడం లేదు. ఓటర్ల సంఖ్య తీసుకుని చేస్తే కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అమీన్పూర్లో ఒక్కో వార్డులో 50 వేల ఓటర్లు ఉన్నారు. అమీన్పూర్ జనాభా, ఓటర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పటాన్చెరులో జేపీ కాలనీ పేరుతో వార్డు విభజన చేయడం విడ్డూరంగా ఉంది. –కాసాల సుధాకర్, దిశ కమిటీ సభ్యుడు అమీన్పూర్లో మరిన్ని డివిజన్లు కావాలిఅమీన్పూర్ పట్టణంలో లక్షా పది వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. పటాన్చెరును రెండు డివిజన్లుగా చేసినప్పుడు అమీన్పూర్ను అదే పద్ధతిలో ఐదు డివిజన్లుగా చేసే అవకాశం ఉంది. 25 వేల ఓటర్లకు ఓ డివిజన్‌గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏ మాత్రం అవగాహన లేకుండా గ్రేటర్‌ను 300 ముక్కలు చేశారు. ఓ పద్ధతి లేకుండా డివిజన్లు తయారయ్యాయి. ఏ లెక్కన అమీన్పూర్ను రెండు డివిజన్లుగా చేశారు? –బాశెట్టి కృష్ణ, తాజా మాజీ కౌన్సిలర్ -
పనిచేస్తారా? వెళ్లిపోతారా?
● ప్రతి రోజు 20 మంది డాక్టర్లు రావాల్సిందే ● డీసీహెచ్ఎస్ డాక్టర్ షరీఫ్ హెచ్చరిక జోగిపేట(అందోల్): ప్రతి రోజు డాక్టర్లు సకాలంలో విధులకు హాజరుకావాలని, లేకుంటే చర్యలు తప్పవని డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎండీ షరీఫ్ హెచ్చరించారు. బుధవారం జోగిపేట ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. మంగళవారం కలెక్టర్ ప్రావీణ్య ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో కేవలం ఇద్దరు మాత్రమే విధులకు హాజరు కావడం 11 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో డీసీహెచ్ఎస్ వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పనిచేయాలనుకున్నారా..? వెళ్లిపోతారా? అంటూ గట్టిగానే మందలించినట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖ ఇలాఖాలో ఆస్పత్రిలో పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. సుమారు గంటన్నర సేపు డాక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ‘రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వర్తించాలి.. మీ పనితీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. సరిగా పనిచేయకపోతే మీ ఇష్టం’ అని చెప్పినట్లు తెలిసింది. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. ప్రతి రోజు 22 మంది డాక్టర్లు విధుల్లో పాల్గొనాలని, సెలవుపై వెళితే ముందే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు డాక్టర్లు అవుట్ పేషెంట్లకు అందుబాటులో ఉండాలన్నారు. ఆస్పత్రిలో మందుల కొరతలేదని, సౌకర్యాల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని డీసీహెచ్ఎస్ షరీఫ్ చెప్పారు. -
ఠారెత్తిస్తున్న విద్యుత్ బిల్లులు
పటాన్చెరు టౌన్: సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో విద్యుత్ బిల్లులు 60 శాతం మేర పెరిగిపోయాయని పటాన్చెరు ఐలా ఛైర్మన్ సుధీర్ రెడ్డి, రామచంద్రపురం ఐలా చైర్మన్ క్రాంతి కిరణ్ తెలిపారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఐలా భవన్ నుంచి విద్యుత్ డీఈ కార్యాలయం వరకు పారిశ్రామిక వేత్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డీఈ భాస్కర్‌రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు ఇచ్చిన నోటీసు స్పష్టంగా లేదన్నారు. ఉదయం పని చేసిన సమయంలోనే కాకుండా, రాత్రి వేళ పని చేయని సమయంలో కూడా విద్యుత్ బిల్లులు చెల్లించమంటున్నారని పేర్కొన్నారు. గత విద్యుత్ బిల్లుల కంటే 60 శాతం పెరిగాయని తెలిపారు. పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని కోరారు. అకస్మాత్తుగా కెపాసిటర్లు కొనుగోలు చేసుకోవాలంటే సాధ్యంకాదన్నారు. ఈ విషయమై డీఈ భాస్కర్ మాట్లాడుతూ... పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రామచంద్రపురం ఐలా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కుటుంబ రావు, ఏవీ రావు, రంజిత్, సలీం తదితర పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్తో 60శాతం మేర పెరిగాయి పటాన్చెరు ఐలా ఛైర్మన్ సుధీర్ రెడ్డి డీఈ కార్యాలయం ఎదుట పారిశ్రామికవేత్తల ధర్నా -
పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్
● 161 సమస్యాత్మక ప్రాంతాలు ● విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు హత్నూర( సంగారెడ్డి): జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం మండల కేంద్రమైన హత్నూర గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో అధికారులకు ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. మొదటి విడత ఎన్నికల్లో 161, రెండో విడతలో 566 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. సామగ్రి తీసుకునే సమయంలో ఆలస్యం చేసిన వారికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. జోనల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, సమస్యలు ఉత్పన్నమైతే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎంపీడీవో శంకర్, ఎంపీఈఓ యూసుఫ్ ఉన్నారు. -
తొలి పోరు నేడే
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిసామగ్రిని సరిచూసుకుంటున్న పోలింగ్ సిబ్బందిసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది బుధవారమే పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని తీసుకొని కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. సుమారు 3,500 మంది ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 394 మంది సర్పంచ్ అభ్యర్థులు మొదటి విడతలో సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్చెరు, గుమ్మడిదల, హత్నూర మండలాల పరిధిలోని 136 గ్రామ పంచాయతీల సర్పంచులు, 1,246 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఏడు సర్పంచ్ పదవులకు ఏకగ్రీవం కాగా, 129 గ్రామాల సర్పంచ్ పదవులకు నేడు పోలింగ్ జరగనుంది. మొత్తం 394 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,246 వార్డు సభ్యుల పదవుల్లో 113 వార్డులకు ఏకగ్రీవం కాగా, 1,133 వార్డు సభ్యుల పోస్టులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2,849 మంది అభ్యర్థులు వార్డు సభ్యుల పదవులకు పోటీ పడుతున్నారు. 1,100 మందితో మూడు అంచెల భద్రత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసుశాఖ మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పోలింగ్‌తో పాటు, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్పీ పరితోశ్ పంకజ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం 7 గం. నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 2 గంటల నుంచి కౌంటింగ్.. వెంటనే ఫలితాల ప్రకటన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది బరిలో 394 మంది సర్పంచ్, 2,849 మంది వార్డు అభ్యర్థులు గ్రామ సర్పంచ్ పదవులకు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం గురువారం తేలనుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. సంగారెడ్డి, హత్నూర తదితర మండలాల్లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. -
కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
పటాన్చెరు టౌన్: ఆగి ఉన్న కంటైనర్‌ను కిర్బీ పరిశ్రమ బస్సు ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలవ్వగా.. మిగిలిన వారికి స్వల్ప గాయాలై సంఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కర్ధనూర్ వద్ద చోటు చేసుకుంది. కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం కిర్బీ పరిశ్రమకు చెందిన బస్సు కార్మికులను విధులకు తీసుకెళ్తుండగా కర్ధనూర్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 మంది కార్మికులకు తీవ్రంగా గాయాలవ్వగా.. దాదాపు 23 మంది కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది వరకు ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిలో వెంకటరమణ, రామకష్ణ, జగదీష్, రాందాస్, రవి తీవ్రంగా గాయపడ్డారు. వీరినీ పటాన్ చెరులోని అమేధా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కిర్బీ పరిశ్రమ కార్మికులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. బుధవారం మొదటి షిఫ్ట్‌కి వెళ్తున్న కిర్బీ పరిశ్రమ కార్మికుల బస్సు ప్రమాదానికి గురైంది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే ఆస్పత్రికి వెళ్లి కార్మికులను పరామర్శించారు. వైద్యులతో చర్చించి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు అంతి రెడ్డి, శివ రెడ్డి, బండి శంకర్, తదితరులు పాల్గొన్నారు.ఐదుగురు కార్మికులకు తీవ్రగాయాలు -
నకిలీ ఓట్ల నివారణ ఇలా.. !
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల్లో నకిలీ ఓట్లు వేయకుండా అసలైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఓటు హక్కు వినియోగించుకునే వారు తప్పకుండా ఏదైనా గుర్తింపు కార్డును చూపించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఓటు వేసిన వారు తిరిగి ఓటు వేయకుండా ఉండేందుకు వారి వేలుపై సిరాచుక్క వేయనున్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డు అందుబాటులో లేని పక్షంలో ఓటరు ఫోటోతో కూడిన గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపు కార్డులో చిన్న పొరపాట్లను పట్టించుకోవద్దని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రతీ ఓటరు వేలికి సిరా చుక్క వేస్తారు. ఒక్కసారి ఓటు వేసిన ఓటరు మళ్లీ అదే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా నివారించేందుకు సిరాచుక్క వేస్తారు. ఓటు వేసిన ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుకు ఈ సిరాగుర్తు వేయనున్నారు. చూపుడువేలు లేని వారికి ఎడమచేతి మధ్యవేలికి వేస్తారు. ఆ వేలు కూడా లేనివారికి ఉంగరం వేలుకు, నాలుగు వేళ్లూ లేని పక్షంలో చిటికనవేలుకు.. ఎడమచేయి లేని వారికి కుడిచేయి చూపుడు వేలుకు వేస్తారు. ఆ వేలు లేనిపక్షంలో మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు ఉపయోగిస్తారు. రెండు చేతుల వేళ్లు లేనివారికి వేళ్ల మొదలు, మధ్య భాగంలో.. అసలు చేతులే లేని పక్షంలో ఎడమ చెంపకు సిరాగుర్తును పెట్టాలని ఈసీ నిర్ణయించింది. -
పోరాటాలకు సన్నద్ధం కావాలి
మెదక్ కలెక్టరేట్: రానున్న రోజుల్లో అత్యంత భయంకరమైన పరిస్థితులు రానున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు కార్మిక వర్గం సన్నద్ధం కావాలని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ పిలుపు నిచ్చారు. మంగళవారం మూడవ రోజు సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్ల ప్రమాదం గురించి ఎక్కడ బడితే అక్కడ, గ్రామాలు, పరిశ్రమలు, నివాస ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వం అత్యంత దూకుడుగా ఆ కోడ్లను అమలు చేసేందుకు ముందుకువస్తుందని, వాటిని తిప్పి కొట్టేందుకు అదే తరహాలో పోరాటాలను పెంచాలని సూచించారు. ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పనిచేస్తుందని ఆరోపించారు. విద్యుత్ బిల్లు వల్ల కార్మికులకే కాదు. కర్షకులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దానికి వ్యతిరేకంగా కార్మిక కర్షక మైత్రితో నిర్వహించే పోరాటాలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా చుక్క రాములు, పాలడుగు భాస్కర్, కోశాధికారిగా వంగూరి రాములు శ్రామిక మహిళ సమన్వయ కమిటీ కన్వీనర్ ఎస్వీ రమ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం మహాసభల సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇందులో ఆఫీసు బేరర్లుగా 31మందిని ఎన్నుకోగా, ఉపాధ్యక్షులు వీరయ్య, సుధాభాస్కర్, భూపాల్, ఎస్వీ రమ, కల్యాణం వెంకటేశ్వరరావు, వీరారెడ్డి, జయలక్ష్మి, మల్లిఖార్జున్, వీఎస్ రావు, ఈశ్వరరావు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే 139 మంది రాష్ట్ర కౌన్సిల్, 103 వర్కింగ్ కమిటీ సభ్యులను సైతం ఎన్నుకున్నారు. అత్యంత భయంకర పరిస్థితులు రాబోతున్నాయి సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ముగిసిన రాష్ట్ర ఐదో మహాసభలు -
ఆడపిల్ల పెళ్లికి పుస్తె మెట్టెలు
నర్సాపూర్: గ్రామానికి చెందిన ఆడపిల్ల పెళ్లికి పుస్తెమెట్టెలు ఇస్తానని నర్సాపూర్ మండల పరిధి మంతూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీశైలం యాదవ్ హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. అలాగే, గ్రామంలో ఆడపిల్ల పుడితే ఐదు వేల ఒక రూపాయలు బహుమతిగా ఇస్తానని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు దుస్తులు అందచేస్తానని చెప్పారు. గ్రామమంతటా సీసీ కెమెరాలు అమరుస్తానని, ఇంటర్మీయెట్ చదివే యువతులకు రూ.20వేలు అందచేస్తానని, క్రికెట్, బాస్కెట్ క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తానని, ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఖర్చులకు ఐదు వేల రూపాయలు అందచేసి ఆదుకుంటామని హామీలు ఇస్తూ ప్రచారం చేపడుతున్నారు. అవసరమైతే తాను ఇస్తున్న హామీలు బాండ్ పేపరుపై రాసి ఇస్తానని ప్రకటించారు. ఆడపిల్ల పుడితే రూ.5వేలు డిపాజిట్ గ్రామంలో ఆడపిల్ల పుట్టిన బాలిక పేరుపై రూ.ఐదు వేల ఫిక్స్ డిపాజిట్ చేస్తానని నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పద్మాగౌడ్ హామీ ఇచ్చారు. గ్రామంలో పేదల ఇంటిలో ఎవరైనా మరణిస్తే ఐదు వేల ఆర్థిక సహాయం అందచేస్తానని, వైకుంఠ రథం తయారు చేయించి గ్రామానికి అందచేస్తానని హామీ ఇస్తున్నారు. గతంలో తాము చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ గిరిజన తండాల్లో మంచి నీటి సదుపాయం కల్పి స్తానని హామీలు ఇస్తూ పద్మాగౌడ్ ప్రచారం చేపడుతున్నారు. ఆడపిల్ల పుడితే రూ. 2వేలు గ్రామంలో ఎవరింట్లోనైనా ఆడపిల్ల పుడితే రెండు వేల రూపాయలు బహుమతిగా అందచేస్తానని నర్సాపూర్ మండలంలోని మంతూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి దశరథ్‌గౌడ్ హామీ ఇచ్చారు. గ్రామంలోని నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని, అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయిస్తానని హామీ ఇస్తున్నారు. గ్రామస్తులందరికి ఉచితంగా ఫిల్టర్ వాటర్ అందచేస్తానని, పాఠశాలకు ప్రహరీ నిర్మించేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు. గ్రామంలో విద్యాభివృద్ధి, గ్రామంలోని నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కరించి గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని దశరథ్‌గౌడ్ హామీలు ఇస్తూ ప్రచారం చేపడుతున్నారు. -
నాడు పతులు.. నేడు సతులు
బరిలోకి విద్యావంతురాలుకంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీకి సర్పంచ్ బరిలో ఆసక్తికర పోటీ నెలకొంది. 2019లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ముదిరాజ్ కృష్ణ , సంతపురం లక్ష్మణ్ బరిలోకి దిగగా... 26 ఓట్ల మెజారిటీతో లక్ష్మణ్ గెలుపొందారు. కాగా ప్రస్తుతం బీసీ మహిళకు సీట్ రిజర్వ్ కావడంతో వారి భార్యలు ముదిరాజ్ శ్వేత(బీఆర్ఎస్ మద్దతుదారు), సంతపురం జ్యోతిక (కాంగ్రెస్ మద్దతుదారుగా) బరిలో నిలిచారు. దీంతో ఇద్దరు సభ్యులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వరిస్తుందోనంటూ స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకే వార్డు బరిలో అన్నదమ్ములుకంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని తడ్కల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే వార్డుకు సొంత అన్నదమ్ములు బరిలో నిలిచారు. గ్రామంలో ద్విముఖ పోటీ ఉండగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 4వ వార్డుకు మారుతీరావు, స్వతంత్ర అభ్యర్థిగా మాధవరావు సొంత అన్నదమ్ములు పోటీలో నిలిచారు. కాగా ఎవరికి ఓటు వేయాలో తెలియక ఓటర్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. వార్డులో తమ సంబంధీకుల ఓట్లే ఉండటంతో గెలుపుపై ఇద్దరు ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.జహీరాబాద్ టౌన్: తెలంగాణ–కర్నాటక రాష్ట్ర సరిహద్దులో గల ధనసిరి గ్రామపంచాయతీ సర్పంచి బరిలో ఉన్నత విద్యావంతురాలు అంబ్రాపాలి నిలిచారు. మొగుడంపల్లి మండలం ధనసిరికి చెందిన దింగర్ను ఆమె వివాహమాడారు. అంబ్రాపాలి ఎంఏ(హిస్టరీ) పూర్తి చేశారు. పంచా యతీ ఎన్నికల్లో భాగంగా ధనసిరి గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో గ్రామస్తుల సహకారంతో సర్పంచి బరిలో నిలిచింది. విద్యావంతురాలు అయిన తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. బాండ్ పేపర్ రాసిస్తున్నా.. ఇవిగో మా హామీలు వర్గల్(గజ్వేల్): ‘‘బాండ్ పేపర్ రాసిస్తున్నా.. ఇవి మా హామీలు.. మా సేవ.. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు చూపితే అదే రోజు రాజీనామా చేస్తా..’’ అంటూ వర్గల్ మండలం నాచారం సర్పంచ్ అభ్యర్థి ల్యాతోల్ల వసంత ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రూ.100 విలువైన బాండ్ పేపర్ మీద వాటర్‌ప్లాంట్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం తదితరాల ఏర్పాటుకు కృషి చేస్తామంటూ వివిధ హామీలు రాశారు. అదేవిధంగా ఏ రోజైనా అవినీతికి పాల్పడితే ఆధారాలు చూపిన వెంటనే అదేరోజు రాజీనామా చేస్తానంటూ రాసి ఉన్న బాండ్‌పేపర్ వాట్సాప్ గ్రూపులలో చెక్కర్లు కొడుతోంది. సర్పంచ్‌గా గెలిపిస్తే .. బెజ్జంకి(సిద్దిపేట): తనను సర్పంచ్‌గా గెలిపిస్తే కరీంనగర్ జిల్లాకు మద్దతుగా తీర్మానం ఇస్తానని బెజ్జంకి సర్పంచ్ అభ్యర్థి సంగ రవి మంగళవారం బాండ్ పేపర్‌పై ఒప్పంద పత్రం రాసి పోరాట సమితి నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా పోరాటసమితి నాయకులు మానాల రవి, డీవీ రావులు మాట్లాడుతూ మండల ప్రజల మనోభావాలను గుర్తించి కరీంనగర్లో కలిపేందుకు హామీ ఇచ్చి న నేతలు విస్మరించారని ఆరోపించారు. సర్పంచ్‌లలో కరీంనగర్ జిల్లా కోసం మద్దతు ఇచ్చే వారిని గెలుపించుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్ అభ్యర్థి సంగ రవి తదితరులు పాల్గొన్నారు. మారిన ప్రచార సరళి న్యాల్కల్(జహీరాబాద్): ఎన్నికలు వచ్చాయంటే ఒకప్పుడు ఏ గ్రామంలో చూసినా మైకు చప్పుళ్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపించేవి. కానీ సోషల్ మీడియా రాకతో ప్రచారం తీరే మారిపోయింది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల ద్వారా ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఓటరు లిస్టు ఆధారంగా ఆయా వార్డుల్లో ఉండే ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరిస్తున్న అభ్యర్థులు వారికి నేరుగా ఫోన్ చేసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రస్తుతం గుర్తులు కేటాయించడంతో తమకు కేటాయించిన గుర్తుకు ఓటు వేయాలని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే తాము చేసే అభివృద్ధి పనులను వీడియో రూపంలో తయారు చేసి ఓటర్లకు పంపుతున్నారు. వీటికి ఎవరి అనుమతులు అవసరం లేకపోవడంతో ప్రచారం ముమ్మరంగా చేస్తు న్నారు. అభ్యర్థులు తయారు చేసిన వీడియో ఓటర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. -
పోలింగ్ ఏజెంట్లే కీలకం
● గ్రామ ఓటర్లనే నియమించుకోవాలి ● వార్డుల్లో వార్డు ఓటరే ఉండాలి ● దొంగ ఓట్లను గుర్తించేది స్థానికులే వెల్దుర్తి(తూప్రాన్): ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంటే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డుకు పోటీ చేస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంట్‌ను నియమించుకోవాలి. సదరు ఓటర్లను గుర్తించేది ఏజెంట్స్ కావడంతో సర్పంచ్‌గా పోటీ చేసే ప్రతీ అభ్యర్థి, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి కీలకమైన వ్యక్తిని ఏజెంట్‌గా నియమించుకుంటేనే వారి గెలుపు సాధ్యమవుతుంది. సర్పంచ్ పదవికి పోటీ చేసే వ్యక్తులు ఏ వార్డు నుంచైనా వార్డు మెంబర్ అయితే ఏ వార్డు నుంచి పోటీ చేస్తున్నారో అదే వార్డుకు సంబంధించిన ఓటరును పోలింగ్ ఏజెంట్‌గా నియమించుకోవాలనే నిబంధన ఉంది. ఏదైనా కారణాల వల్ల ఇతరులను నియమించుకోవాల్సి వస్తే ముందే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా తెలిజేయాలి. దానిని పరిశీలించి అనుమతి ఇస్తే తప్ప ఇతరులను నియమించుకునేందుకు వీలులేదు. ఓటర్లను గుర్తించేది ఏజెంట్లే.. ప్రతివార్డులో ఆ వార్డుకు సంబంధించిన ఓటరు వచ్చినప్పుడు ఎన్నికల సిబ్బంది ముందుగా క్రమసంఖ్యతో పాటు అతని పేరు, అంగీకరించినప్పుడే ఓటరుకు వేలుపై ఇంక్ పెట్టి బ్యాలెట్ పేపర్ అందజేస్తారు. ఓటరుకు బ్యాలెట్ పేపర్ అందిన తర్వాత ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఎన్నికల అధికారి దానిని పరిగణలోకి తీసుకోరు. ఎవరైనా ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రిసీడింగ్ అధికారి సమక్షంలో నిగ్గు తేల్చిన తర్వాతే ఆ ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఏజెంట్ల వివరాలు రిటర్నింగ్ అధికారికి పంపాలి.. సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి స్క్రూట్నీ పూర్తి కాగానే ఏజెంట్‌గా నియమించుకునే వ్యక్తి అంగీకార పత్రాన్ని రాత పూర్వకంగా డూప్లికేట్ కాపీతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపించాలి. పరిశీలన అనంతరం రిటర్నింగ్ అధికారి నియామక పత్రంపై ఆమోదం తెలుపుతూ సంతకం చేసి ఒక కాపీని ఏజెంట్‌కు అందజేస్తారు.ప్రతీ పోలింగ్ స్టేషన్లో మొదట వార్డుల వారీగా కౌంటింగ్ ఏజెంట్లను తీసుకొని కౌంటింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ ఏజెంట్‌గా వచ్చేవారు ప్రభుత్వ ఉద్యోగి, పలు రాజకీయ పదవులు చేసిన వారు అనర్హులు. వీరిని తప్ప ఎవరినైనా ఏజెంట్లుగా నియమించుకోవచ్చు. -
కనీస సదుపాయాలు కల్పించండి
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉ పాధ్యాయ, ఉద్యోగులందరికీ కనీస వసతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు పద్మారావు, శ్రీనివాసరావులు కోరారు. మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారిని విజయకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల విధులలో పాల్గొంటున్న పోలింగ్ ఆఫీసర్లకు వారి గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులను ప్రతి మండలంలో పెట్టాలని, చలి తీవ్రత దృష్ట్యా పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు లేకుండా కనీస వస తులు కల్పించాలని కోరారు. పోలింగ్ సిబ్బందికి ఒకే విధమైన రెమ్యూనరేషన్ ఉండేల మండల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. మూడు దశల పోలింగ్‌లో పాల్గొనే వారికి వేర్వేరుగా ఓడీ సౌకర్యం కల్పించాలన్నారు. గర్భిణీలకు, ఫీడింగ్ మదర్స్‌కు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమున్న చోట మినహాయింపు ఇవ్వాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు డ్యూటీ మార్చుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. డీఈఓకు యూటీఎఫ్ వినతి -
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డిహత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం హత్నూర, బోరపట్ల ,నస్తీపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభి వృద్ధికి నోచుకోలేవని, ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయ ని తెలిపారు. పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి కోసం పని చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు. -
నా భర్తను విడిపించండి
● చేయని తప్పుకు మలేషియాలో జైలు శిక్ష ● సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన అబ్దుల్ ఖాదర్ కుటుంబం దుబ్బాక: మలేషియా జైలులో అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న నా భర్తను విడిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అబ్దుల్ ఖాదర్ భార్య సలీమా బేగం, కుమారుడు సల్మాన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం దౌత్యసాయం కోసం సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌రెడ్డి సూచన మేరకు ఎన్నారై అడ్వయిజరీకమిటీ తెలంగాణ ప్రభుత్వం వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్ ఖాదర్ కుటుంబం హైదరాబాద్‌లో సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతి ప్రతం అందించారు. భూంపల్లి–అక్బర్పేట మండలం పోతారెడ్డిపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం మలేషియా దేశం వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న కంపెనీలో చేయని నేరానికి బాధ్యుడిని చేస్తూ జైల్లో వేశారు. 11 నెలలుగా మలేషియా జైల్లో మగ్గుతున్నాడు. -
చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడిని రిమాండ్‌కు తరలింపు కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలో గత 29న జరిగిన చైన్ స్నాచింగ్ చోరీ కేసును కొమురవెల్లి పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఎస్ఐ మహేశ్ వివరాలు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరిపి వివరాలు సేకరించినట్లు తెలిపారు. నమ్మకమైన సమాచారం ఆధారంగా మండల కేంద్రానికి చెందిన తీగుళ్ల రజనీకాంత్‌ను అదుపులోకి తీసుకొన్నామని చెప్పారు. అతడిని విచారించగా నేరం ఒప్పుకొన్నాడని, దీంతో రిమాండ్‌కు తరలించామని తెలిపారు. -
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
జహీరాబాద్ టౌన్: అగ్నిప్రమాదంలో రేకుల ఇల్లు దగ్ధమై ఆస్తి నష్టం జరిగింది. ఈ సంఘటన మండలంలోని అల్గోల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి లక్ష్మమ్మ కూతురుతో కలిసి రేకుల ఇంట్లో ఉంటుంది. గ్రామంలోనే కూలీ పనులకు వెళ్తుంది. మంగళవారం కూడా పనులకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తాళం వేసిన ఇంటి నుంచి మంటలు వచ్చాయి. చుట్టు పక్కల వారు చూసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను ఆర్పడానికి కూడా ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది వచ్చే లోపు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ.లక్ష, మూడు తులాల బంగారం, వంట సామగ్రి, దుస్తులు కాలి బూడిదయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తనిఖీల్లో రూ.లక్ష స్వాధీనం
మునిపల్లి(అందోల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో రూ.లక్షను ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఉప తహసీల్దార్ ప్రదీప్ తెలిపారు. మంగళవారం మండలంలోని బుదేరా చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా పెద్దలోడి గ్రామానికి చెందిన దస్సయ్య రూ.లక్ష తీసుకొస్తుండగా వారు పట్టుకున్నారు. అక్రమ మద్యం పట్టివేత రేగోడ్(మెదక్): మండలంలోని మర్పల్లి గ్రామం వద్ద మంగళవారం బైక్‌పై తీసుకెళ్తున్న మద్యా న్ని పట్టుకున్నట్లు స్థానిక ఆర్ఐ విజయలక్ష్మి తెలిపారు. 58 క్వార్టర్ బాటిళ్లు, 15 బీరు బాటి ళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్, సిబ్బంది ఉన్నారు. ములుగులో... ములుగు(గజ్వేల్): స్థానిక సంస్థల ఎన్నికల వేళ అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ములుగు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రం వద్ద చోటుచేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, ములుగు ఎస్ఐ రఘుపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఓటర్లకు మద్యం పంచేందుకు గానూ ములుగు శివారులో గల శ్యాంసుందర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద నిల్వ ఉంచారని అందిన సమాచారం మేరకు సీఐ, ఎస్ఐలు సిబ్బందితో కలసి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రూ.7,40,520 విలువ చేసే 673 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. గజ్వేల్‌రూరల్: డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరు వ్యక్తులకు రెండ్రోజుల జైలు శిక్ష విధించినట్లు గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి తెలిపారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రధాన చౌరస్తాల వద్ద ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో ఎనిమిది మంది వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు బ్రీత్ ఎనలైజర్ ద్వారా గుర్తించామన్నారు. వారిని మంగళవారం గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతిగౌడ్ ముందు హాజరు పర్చగా విచారణ అనంతరం ఆరుగురికి రూ. 33వేలు జరిమానా, మరో ఇద్దరికి రెండ్రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. అంతకుముందు పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. సదాశివపేట(సంగారెడ్డి): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా... 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆరూర్ గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఎల్అండ్టీ పెట్రోలింగ్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శవాన్ని 108లో సదాశివపేట ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటాయని, మృతుని శరీరంపై రామ గ్రీన్ కలర్ టీషర్టు, డబ్బాలు గల బుడిదరంగు గల షాట్ ధరించి ఉన్నాడని తెలిపారు. -
కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ
మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ సిద్దిపేటకమాన్: కేసీఆర్ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9 ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ అన్నారు. మంగళవారం దీక్షా విజయ్ దివస్‌లో భాగంగా పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేశారన్నారు. యావత్తు తెలంగాణ ప్రజలను ఒక్కటిగా చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చేలా చేశారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, వైస్ చైర్మన్ కనకరాజు, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి, సాయిరాం, సుందర్, శ్రీనివాస్, ఈర్షద్, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్లు ఎక్కడ...?
● 20 మంది వైద్యులకు ఇద్దరే హాజరు ● కలెక్టర్ ప్రావీణ్య ఆగ్రహం ● జోగిపేట ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ జోగిపేట(అందోల్): జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల గైర్హాజర్‌పై కలెక్టర్ ప్రావీణ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె జోగిపేట ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. 20 మంది వరకు డాక్టర్లకు గాను కేవలం ఇద్దరు మాత్రమే ఉండటాన్ని అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా వారంతా ఏమైనట్లు అని ఆర్ఎంఓ అశోక్‌ను ప్రశ్నించారు. ఏదో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ కూడా విధులకు రాకుంటే ఆసుపత్రి పరిస్థితి ఏమిటన్నారు. ఆర్డీఓ పాండు, ఇన్చార్జి తహసీల్దార్ మధుకర్‌రెడ్డి ఆమె వెంట ఉన్నారు. ప్రతి రోజు ఇదే పరిస్థితి మేడం అక్కడే ఉన్న రోగులు సైతం డాక్టర్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో ఒకరుంటే మరొకరు ఉండరని, ప్రతి రోజు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తే డాక్టర్లు లేకపోవడంతో అందుబాటులో ఉండే వారితో చూపించుకొని వెళుతున్నామని చెప్పారు. ఆసుపత్రి పరిస్థితి ఎప్పుడు మారుతుందో అంటూ రోగులు నిట్టూర్చారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలన ఆసుపత్రిలోని రిజిస్టర్లో డాక్టర్లంతా గైర్హాజరై ఉండడంతో కలెక్టర్ తన సెల్‌ఫోన్‌తో ఫొటో తీసుకున్నారు. విధులకు హాజరుకాని డాక్టర్లకు గైర్హాజరు వేశారు. వైద్య మంత్రి నియోజకవర్గంలోని ఆసుపత్రి పనితీరు ఉంటే ఎలా అని కలెక్టర్ అసంతృప్తితో వెనుదిరిగారు. ఎవరెవరు విధుల్లో ఉన్నారు? ఎవరు విధులకు గైర్హాజరయ్యారో వివరాలు తీసుకోవడం విశేషం. డాక్టర్లు మధ్యా హ్నం 12 గంటలకే వెళ్లిపోతున్నారన్న విషయా న్ని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.11 మంది వైద్యులకు షోకాజ్● వైద్యవర్గాల్లో కలకలం జోగిపేట, (ఆందోల్): విధులకు డుమ్మాకొట్టిన జోగిపేట ప్రభుత్వాస్పత్రి వైద్యులపై కలెక్టర్ ప్రావీణ్య కొరడా ఝళిపించారు. మంగళవారం ఆమె తనిఖీ చేసినప్పుడు 20 మంది వైద్యుల్లో కేవలం ఇద్దరు విధుల్లో ఉన్నారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ డుమ్మాకొట్టిన సూపరింటెండెంట్ సహా 11 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీసీ హెచ్‌ఎస్‌కు ఆదేశించారు. డాక్టర్ సౌజన్య, ఎం.అమ్మాజీ, తశనీమ్ మెహర్, శివశంకర్ రెడ్డి, నితిన్ కుమార్, ఎల్.బాంధావి, మేఘ, ఆర్.కిరణ్, పి.మాలతి, పి.ఆనంద్ నాయక్, పి. శ్రావణిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. -
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
సంగారెడ్డి జోన్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ పరితోష్ పంకజ్, అధికారులతో కలసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఎంపిక చేసిన మండల పరిషత్ కార్యాలయాలకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశామన్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని, వెబ్ క్యాస్టింగ్ చేయిస్తున్నామని తెలిపారు. ఎస్పీ పరితోశ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత పోలింగ్ నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టరు చంద్రశేఖర్, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు కార్తిక్‌రెడ్డి, వ్యయ పరిశీలకులు రాకేష్, జిల్లా పరిషత్తు సీఈఓ జానకిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రతి అంశంపై అవగాహన అభ్యర్థులను ఏజెంట్లుగా అనుమతించవద్దు తొలివిడత ప్రచారానికి తెరజిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. తొలి విడతలో భాగంగా జిల్లాలో ఏడు మండలాల పరిధిలో ఉన్న 136 సర్పంచ్ స్థానాలతో పాటు 1246 వాడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఏడు సర్పంచి స్థానాలు, 113 వాడు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 129 సర్పంచ్, 1133 వాడు స్థానాలకు ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తం 3,243 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, గురువారం జరిగే పోలింగ్‌లో 3,500 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. కలెక్టర్ ప్రావీణ్య పటిష్టమైన బందోబస్తు: ఎస్పీ పరితోశ్ -
బీఆర్ఎస్ మద్దతుదారులకు ఓటెయ్యండి: సునీతారెడ్డి
హత్నూర( సంగారెడ్డి): అవినీతి కాంగ్రెస్ పాలనకు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన హత్నూర, బ్రాహ్మణగూడ, నాగుల్దేవులపల్లి గ్రామాలలో బీఆర్ఎస్ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులకు ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఆమె వెంట అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అంకిత భావంతో చదివితేనే ఉన్నత ఫలితాలుడీఈఓ వెంకటేశ్వర్లు మునిపల్లి(అందోల్): ప్రతి విద్యార్థి అంకిత భావంతో చదివితేనే ఉన్నత ఫలితాలు సాధ్యమని డీఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం మండలంలోని పెద్దగోపులారం, మునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అత్యత్తమ గ్రేడ్లను విద్యార్థులు సొంతం చేసుకోవాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అక్షయ పాత్ర భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు తుకారాం, భాస్కర్, ప్రాథమిక పాఠశాల ప్రదానోపాధ్యాయులు నాగేశ్వర్, ఉపాధ్యాయులు వీరన్న, కృష్ణవేణి, ప్రశాంత్ కుమార్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడిలో ప్రీ క్రిస్మస్ వేడుకలునారాయణఖేడ్: అంగన్వాడి కేంద్రాల పనితీరును జిల్లా శిశుసంక్షేమాధికారి లలితకుమారి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఖేడ్ ఐసీడీఎస్ పరిధిలోని తిమ్మాపూర్‌లో అంగన్వాడి పిల్లలతో కలిసి ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేంద్రాల్లో పోషకాహారం అందజేస్తున్న తీరుతో పాటు వివిధ సేవల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. నిబంధనలు, మెనూ ప్రకారం పిల్లలకు పోషకాహారం అందించాలని కోరారు. ఆట పాటలతో బోధన చేస్తూ విద్యార్థులు ఆసక్తితో నేర్చుకొంటారని సూచించారు. ఖేడ్‌లోని బాలసదనం సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఆమెతో పాటు సీడీపీఓ సుజాత, అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షకులు జమున, ప్రమీల, బులడేవిడ్, మంజుల ఉన్నారు. ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ప్రారంభించాలిజహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పంట అయిన చెరకును రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నందున ఈ సీజన్‌కు గాను ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో క్రషింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం కోరారు. ట్రైడెంట్ కర్మాగారంపై ఎనిమిది మండలాలకు చెందిన రైతులు ఆధారపడి ఉన్నారన్నారు. సుమారు 26వేల ఎకరాల్లో 10వేల మంది రైతులు చెరకు పంటను పండిస్తున్నట్లు పేర్కొన్నారు. పండించిన చెరకును ఎక్కడకు తరలించాలో తెలియక రైతులు అయోమయానికి గురువుతున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న చక్కెర కర్మాగారాలు సరైన గిట్టుబాటు ధరను ప్రకటించలేదన్నారు. గిట్టుబాటు ధర ఇప్పించేలా చూడాలన్నారు. సమావేశంలో నాయకులు జి.నర్సింహులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పైలెట్ గ్రామాల్లో ప్రగతి అంతంతే..
మండలానికి ఒకటి చొప్పున 25 గ్రామాల ఎంపికసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది. ఈ గ్రామాల్లో ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల్లో సగం మంది కూడా ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకోకపోవడం గమనార్హం. పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో మండలానికి ఒక గ్రామం చొప్పున 25 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ఒక్క పూరి గుడిసె కూడా ఉండకూడదనే లక్ష్యంతో గ్రామంలో ఉన్న అర్హులైన లబ్ధిదారులందరికి ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 25 గ్రామాల్లో మొత్తం 1,342 గృహాలు మంజూరయ్యాయి. ఇవి మంజూరై దాదాపు ఏడాది దగ్గర పడుతున్నప్పటికీ ఇందులో సుమారు 700 మంది తమ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోయలేదు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకున్న లబ్ధిదారుల్లో చాలా ఇళ్లు బేస్‌మేట్, గొడల స్థాయికే పరిమితమయ్యాయి. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాని గ్రామాల్లో చాలా మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదు. ఇంటి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ గృహాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వీరికి ఇళ్లు మంజూరు కావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే రెండో విడతలో మంజూరు చేస్తామని చెబుతున్నారు. దీంతో కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్న గ్రామాల్లో ఇళ్లు మంజూరు కాలేక, మంజూరైన గ్రామాల్లో ఇంటి నిర్మాణం ప్రారంభం కాలేని పరిస్థితి నెలకొంది. పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో నిర్మాణం ప్రారంభం కాని గృహాలను ఇతర గ్రామాల్లో ఇళ్లు కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు మార్చాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అనేక కారణాలు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బిల్లులు రావనే భయంతో చాలా మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల ఇసుక లభించకపోవడంతో ఇంటికి ముగ్గు పోసుకోలేదు. పెరిగిన ఇసుక ధరలకు ప్రభుత్వం ఇచ్చే బిల్లులు ఏ మాత్రం సరిపోవనే కారణంగా కొందరు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను షురూ చేయలేదు. మరోవైపు పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలతో కూడా లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గూడెం.. ఎందుకు దూరం..?
● పంచాయతీ ఎన్నికల ప్రచారం చేయని ఎమ్మెల్యే ● పటాన్చెరులో కాంగ్రెస్ కార్యకర్తలకు వింత పరిస్థితి ● ఎమ్మెల్యే మద్దతు మాకే అంటూ బీఆర్ఎస్ ప్రచారం ● కనిపించని కాంగ్రెస్ నేతలు కాటా, నీలంపటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలెవరూ పంచాయతీ ఎన్నికలపై పెద్దగా దృష్టి సారించలేదనే చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి తిరగడం లేదు. అలాగని ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న వారు తాము కాంగ్రెస్‌లో ఉన్నామని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇక కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్‌గౌడ్ ఒంటెత్తు పోకడలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు ఎవరనేది ప్రశార్థకంగా మారింది. ఆయన కనీసం ఫోన్లలో కూడా సాధారణ కార్యకర్తకు అందుబాటులో ఉండరనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్‌కు భిన్న సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నియోజకవర్గంలో పటాన్చెరు మండలంలో మూడు గ్రామాలు, గుమ్మడిదల మండలంలో ఏడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలోనే పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ప్రచార పర్వానికి తెర పడింది. కాంగ్రెస్ పెద్ద నేతలెవరూ ఏ గ్రామంలోనూ ప్రచారంలో పాల్గొనలేదు. కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్‌గౌడ్ ఇప్పటికే ప్రజలకు చాలా దూరంగా ఉన్నారని కనీసం ఆయన ఫోన్లో కూడా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే చెప్పాలి. కాటా శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు, కాంగ్రెస్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన నీలం మధు కూడా ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. ఏ పార్టీలో కొనసాగుతున్నానే దానిపై నేటికీ స్పష్టత నివ్వని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా ఈ ఎన్నికల పంచాయతీకి దూరంగానే ఉన్నారు. ఆయన గ్రామ స్థాయిలో ముఖ్య నేతలకే సర్పంచ్ల ఎన్నికల బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. బీజేపీ నేత ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీఆర్ఎస్ నేత ఆదర్శ్‌రెడ్డి మాత్రం అలా ఒక రౌండ్ వేసి తమ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేయాలని తూతూ మంత్రంగా ప్రచారం చేశారు.గుర్తులతో పనేముంది..? పంచాయతీ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ నుంచి ఎవరూ టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతో గెలిచిన సర్పంచ్‌లను తమ దార్లోకి తెచ్చుకోవాలనే ఎత్తుగడ అధికార పార్టీలో ఉన్నట్లు కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పెద్దలెవరూ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని తెలుస్తుంది. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారనే ప్రశ్న పటాన్చెరు ప్రజలెవరూ సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. అయితే మండల పరిధిలోని నందిగామలో ఓ అభ్యర్థి మాత్రం బీఆర్ఎస్ ఫ్లెక్సితో ఏర్పాటు చేసుకున్న ప్రచార రథంపై కేసీఆర్‌తో, పాటు స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టుకుని ‘‘అన్న నా వెంటే ’’ఉన్నారంటూ ఎక్కడ చెప్పకుండా ప్రచారం చేసుకుంటున్నారు. -
ఏకగ్రీవాల జోష్..
నారాయణఖేడ్, కంగ్టి: నారాయణఖేడ్ డివిజన్లో 196 గ్రామపంచాయతీలు ఉండగా మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పలువురు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని పంచగామలో సర్పంచ్ పదవికి ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉండగా వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యా రు. ఖాంజీపూర్ సర్పంచ్ పదవికి ఇద్దరు పోటీ పడుతుండగా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అల్లాపూర్ సర్పంచ్‌గా కమలానాయక్, షేరితండాలో హీరామన్, పీర్లా తండాలో సాలి బాయి, డీఎన్తండాలో కర్ర కమిలీబాయి, గుండుతండాలో మేఘావత్ మౌనిక, పలుగుతండాలో కిషన్‌నాయక్, మాణిక్ నాయక్ తండాలో మంజులా చౌహాన్, కిషన్‌నాయక్ తండాలో సునీతా చౌహాన్లు సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగల్గిద్దా మండలంలోని కేశ్వార్ గ్రామంలో ముంగేమహాదేవి, గంగారాం తండాలో రాథోడ్ రేణుక, కొండానాయక్ తండాలో అశోక్ చౌహాన్, రత్నానాయక్ తండాలో జైపాల్ రాథోడ్ సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్హేర్ మండలంలోపి జామ్లాతండా సర్పంచ్‌గా గోవింద్ నాయక్, కంగ్టి మండలంలోని చందర్తండా సర్పంచ్‌గా శాంతాబాయి, జీర్గీతండాలో రాథోడ్ యమునాబాయి, నిజాంపేట్ మండలంలోని బల్కంచెల్కతండా సర్పంచ్‌గా సరిత, నాగన్నకుంట తండాలో దేవ్‌సోత్ సాలీబాయి, మాణిక్తండాలో మంజులా చౌహాన్ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. సిర్గాపూర్ మండలంలోని లక్ష్మణ్‌నాయక్ తండా సర్పంచ్‌గా దూరీబాయి, ఫత్తేనాయక్తండాలో మంగ్లూబాయి, కిషన్‌నాయక్‌తండాలో శిరీష రాథోడ్ , వంగ్ధాల్ గైరాన్తండాలో మోహన్, చందర్నాయక్తండాలో రుక్మిణీబాయి, వాసర్ తండాలో మంజుల, సిర్గాపూర్ గైరాన్తండాలో సర్పంచ్‌గా వినోద్‌లు ఏకగ్రీవమయ్యారు. సంబందిత అధికారులు నూతన సర్పంచ్‌లను అభినందించారు.నారాయణఖేడ్‌లో 24 గ్రామపంచాయతీలు -
చెరకు రైతు క్రష్..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చెరకు రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ధాన్యం, మొక్కజొన్న మాదిరిగానే చెరకు కొనుగోలుకు కూడా తరుగు తీస్తున్నారు. ఈ తరుగు పేరుతో ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఏకంగా ఐదు శాతం తూకంలో కోత పెడుతుండటంతో రైతులు లబోదిమంటున్నారు. చెరకు అసలే అంతంత మాత్రంగానే ధర చెల్లిస్తున్న యాజమాన్యాలు.. ఇప్పుడు తరుగు పేరుతో నిండా ముంచుతుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టన్నుకు రూ.190 వరకు నష్టం నిబంధనల ప్రకారం చెరకుకు ఎలాంటి తరుగు తీయరాదు. ట్రాష్ (చెత్త) మెటీరియల్ ఉంటేనే కేవలం ఒక్కశాతం మాత్రమే తరుగు తీయాలి. అదికూడా రైతుల చెరకును బెండింగ్ మీటర్లో వేసి ట్రాష్ మెటీరియల్ ఉందని తేలితేనే ఒక్క శాతమే తరుగు తీయాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా తరుగు తీస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హార్వేస్టర్ మిషన్‌తో కోసిన చెరుకులో ట్రాష్ మెటీరియల్ ఉందంటూ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఐదు శాతం తూకంలో కోత పెడుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఐదు శాతం అంటే ఒక టన్నుకు అర క్వింటాళు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం టన్ను చెరుకు ధర రూ.3,800 పలుకుతోంది. అర క్వింటాలు తరుగు పోతే రైతుకు కేవలం రూ.3,610 మాత్రమే ధర దక్కుతోంది. ఇలా చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా తరుగు తీస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. స్థానిక రైతులు (ఫ్యాక్టరీ జోన్)లో ఉన్న రైతుల చెరకుకు ఐదు శాతం తరుగు విధిస్తున్న యాజమాన్యాలు.. స్థానికేతర (ఇతర ఫ్యాక్టరీల జోన్లో ఉన్న) రైతులకు రెండు నుంచి మూడు శాతం తరుగు తీస్తుండటం గమనార్హం. ఇప్పటికే రైతులకు నష్టం రూ.1.20 కోట్లకు పైనే.. జిల్లాలో ఈసారి 11,434 హెక్టార్లలో చెరకు సాగైంది. సుమారు 7.92 లక్షల టన్నుల చెరకు పండుతుందని కేన్ కమిషనరేట్ అధికారులు అంచనా వేశారు. ఈ సీజనులో జిల్లాలో రెండు చక్కెర కర్మాగారాలు క్రషింగ్‌ను ప్రారంభించాయి. గత నెల 14 నుంచి క్రషింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు సుమారు 1.05 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ జరిగింది. ఈ లెక్కన 1.05 లక్షల టన్నుల్లో సగటున మూడు శాతం చొప్పున తరుగు లెక్కేసినా రైతులు సుమారు 3,173 టన్నులు నష్టపోయారు. దీని విలువ సుమారు రూ. రూ.1.20 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లెక్కన క్రషింగ్ సీజన్ ముగిసే వరకు రైతులు ఎంత నష్టపోతారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. భగ్గుమన్న రైతు సంఘాలు చక్కెర కర్మాగారాలు నిబంధనలకు విరుద్దంగా తరుగు తీయడం పట్ల రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ తరుగు దోపిడీకి అడ్డుకట్టవేయాలని డిమాండ్ చేస్తున్నాయి. చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో.. ఇటీవల కలెక్టరేట్లో సంబంధిత అధికారులు, రైతుల సంఘాలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తరుగు దోపిడీ అంశాన్ని రైతు సంఘాల నేతలు లేవనెత్తారు. తరుగు పేరిట ఐదు శాతం తూకంలో కోత లబోదిబోమంటున్న చెరకు రైతులు అసలే అంతంత మాత్రంగా ధర చెల్లిస్తున్న యాజమాన్యాలు ఆపై కోతలతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్న రైతులు -
పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ
● ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం ● కలెక్టర్ పి.ప్రావీణ్య సదాశివపేట రూరల్(సంగారెడ్డి): పంచాయతీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమైనదని, పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. సోమవారం మండలంలోని మద్దికుంట చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాలులో మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు. పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని చెప్పారు. ఓటింగ్ విషయంలో గోప్యత నూటికి నూరు శాతం అమలు జరిగేలా చూడాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా, పారదర్శకంగా జరగాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ తరగతుల నోడల్ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, తహసీల్దార్ బాల్‌రాజ్, ఎంపీడీవో లక్ష్మి పాల్గొన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే కొరడా
● అవసరమైతే క్రిమినల్ కేసులు ● నేరం రుజువైతే జైలు శిక్ష జహీరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి, లేనట్లయితే బరి నుంచి తప్పుకునే పరిస్థితి ఎదురు కావొచ్చు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని (కోడ్)ను ఉల్లంఘిస్తే పోటీ చేయకుండా నిషేధించే అవకాశం ఉంటుంది. అవసరం అయితే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయవచ్చు. నేరం రుజువు అయితే జైలుశిక్ష కూడా పడవచ్చు. అందుకే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిబంధల మేరకు నడుచుకోవాలి. స్వేచ్ఛగా జరిగేందుకే కోడ్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీనినే మోడల్ ఆఫ్ కోడ్ కండక్ట్(ఎంసీసీ) అంటారు. ఏదైనా రాజకీయ పార్టీ, అభ్యర్థి ఈ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు ఇవే.. ● శాతిభద్రతల పరిరక్షణలో భాగంగా బీఎన్ఎస్–163 (144 సీఆర్పీసీ యాక్టు) అమలు చేస్తారు. ● నలుగురి కంటే ఎక్కువ మంది ఒక చోట ఉండవద్దు. ● అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, ప్రచారం నిర్వహించవద్దు. కర్రలు, ఇతర మారణాయుధాలతో తిరగవద్దు. ● పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలి. ఆ తర్వాత ప్రచారం చేస్తే కోడ్ ఉల్లంఘన కింద పరిగణిస్తారు. ● అన్ని రకాల సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాల్లో) ప్రత్యర్థులను విమర్శిస్తూ పోస్టులు పెట్టడంపై ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తారు. ● బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినా, అక్రమంగా మద్యం నిల్వ ఉంచినా, ఓటర్లకు పంచుతూ పట్టుబడినా కేసు నమోదు చేస్తారు. అలాగే 34ఏ ఎకై ్సజ్ చట్టం1968 కింద జరిమాన, శిక్ష విధిస్తారు. -
శిల్పాకారుడికి అరుదైన గౌరవం
ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి ప్రదర్శనకు ఆహ్వానం న్యాల్కల్(జహీరాబాద్): ఎన్నో అద్భుత శిల్పాలు తయారు చేసి రాష్ట్రపతి చేత డాక్టరేట్, ప్రశంసా పత్రం, బంగారు పతకాన్ని అందుకున్న సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్కు చెందిన ప్రముఖ కళాకారుడు హోతి బస్వరాజ్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ శిల్పకళా వర్క్‌షాప్ నడుపుతున్నాడు. ఆయన తయారు చేసిన అమ్మ ఒడిలో భూమాత, భారతీయ సంస్కృతిలో మానవుని ప్రతిరూపం ప్రదర్శనలు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. ఈ నెల 9 నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో జాతీయ స్థాయి శిల్పకళా ప్రదర్శన జరగనుంది. అఖిల భారతీయ శిల్పకళా, క్రాప్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రదర్శనకు బస్వరాజ్‌కు ఆహ్వానం అందింది. తాను తయారు చేసిన ప్రదర్శనలు జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై బస్వరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. -
మింగలేక
కక్కలేక..కార్యదర్శులకు భారంగా మారిన ఎన్నికలుదుబ్బాక : పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి గోరుచుట్టపై రోకలి పోటులా తయారైంది. అసలే రెండేళ్లుగా సర్పంచ్‌లు లేక గ్రామాల్లో సర్వం సెక్రటరీలే చూసుకుంటున్నారు. డ్రైనేజీల శుభ్రం, రోడ్లు, ప్రజాసమస్యల పరిష్కారంతో పాటు గ్రామాల్లో మౌళిక సమస్యలను వారే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గ్రామాల్లో అప్పులు తెచ్చి పెట్టిన పాత ఖర్చుల బిల్లులే పూర్తిగా రాక సతమతమవుతున్న తరుణంలో సెక్రటరీలకు ఈ పంచాయతీ ఎన్నికలు తీవ్ర తలనొప్పిగా మారాయి. మోయలేని భారం.. పంచాయతీ ఎన్నికలు సెక్రటరీలకు.. కరిస్తే కప్పకు కోపం, కరవకుంటే పాముకు కోపం అన్నట్లుగా తయారయ్యాయి. ఈ ఎన్నికల ఖర్చు అంతా పంచాయతీ సెక్రటరీపై పడటంతో మోయలేని భారంతో ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచ్ల నామినేషన్ల నుంచి పోలింగ్ కేంద్రాల వరకు ఖర్చులన్నీ సెక్రటరీలే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నామినేషన్ల తరుణంలో టెంట్లు, అధికారులకు అన్ని సౌకర్యాలతో పాటు ఎన్నికలకు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో కరెంట్, మంచినీళ్లు, టాయిలెట్స్, ఎన్నికల సిబ్బందికి భోజనాలు, ఇతర సౌకర్యాలు వారే చూసుకోవాల్సిన పరిస్థితి. కక్కలేక మింగలేక.. ఆర్థిక భారంతో సెక్రటరీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఒక్కో సెక్రటరీ తక్కువలో తక్కువ రూ.30 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు పెట్టగా, ఇంకా ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎన్ని పెట్టాల్సి వస్తుందోనంటూ తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 508 గ్రామాలు.. జిల్లాలో 508 గ్రామపంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. మొదటి విడతలో జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో 146 గ్రామాలు, దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో 25, రాయపోల్ మండలంలో 19 గ్రామాలు.. మొత్తం 7 మండలాల్లోని 190 గ్రామాలకు 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 174 గ్రామాల్లో 1432 వార్డులకు ఈ నెల 11 న పోలింగ్ జరగనుంది. అలాగే రెండో విడతలో 10 గ్రామాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 182 గ్రామాలు, 1,644 వార్డులకు ఈ నెల 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మిగిలిన గ్రామాల్లో 3వ విడతలో 17న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ఖర్చులు పంచాయతీ సెక్రటరీలకు తలనొప్పిగా మారడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.వస్తాయో..రావో! ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల్లో అప్పులు తెచ్చి ఖర్చులు పెడుతున్నాం. ఈ డబ్బులు మాకు తిరిగి వస్తాయో రావో దేవుడెరుగు అంటూ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పుల పాలయ్యాం.. మళ్లీ ఈ ఎన్నికలు మాకు ఇంకా గుదిబండగా మారాయని పంచాయతీ సెక్రటరీలు చేతులు జోడించి ఈ కొలువులు చేయడం కష్టమేనంటూ తమ గోడు ఎవరు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయో తెలియడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు.చర్యలు తీసుకుంటాం పంచాయతీ ఎన్నికల్లో గ్రామ కార్యదర్శులకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో పోలింగ్ బూత్‌లలో మౌలిక సదుపాయాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యదర్శులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. – భాస్కర శర్మ, ఎంపీడీవో -
వీరోజిపల్లిలో 600 చీరల పట్టివేత
పెద్దశంకరంపేట(మెదక్): ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు తరలిస్తున్న చీరలను పోలీసులు పట్టుకున్నారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి వివరాల ప్రకారం... సోమవారం మండల పరిధిలోని వీరోజిపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 600 చీరలను ఎఫ్ఎస్టీ టీమ్ పట్టుకుంది. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరోజిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మన్నె కృష్ణ హైదరాబాద్ నుంచి వీటిని గ్రామానికి తరలిస్తున్నట్లు వాహన డ్రైవర్ తెలిపినట్లు పోలీసులు చెప్పారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గరిచేయవద్దని సూచించారు. తనిఖీల్లో ఎస్ఐ.ప్రవీణ్‌రెడ్డి, ఎఫ్ఎస్టీ టీం సభ్యులు రమేశ్, సంగమేశ్వర్ తదితరులున్నారు. -
లెక్క.. చెప్పాలి పక్కా!
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు లెక్క చెప్పాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖర్చుకు సంబంధించి ప్రతీ పైసాను తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ ఇటీవల జిల్లాలో జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు తమ ఖర్చుల రికార్డులతో వ్యయ పరిశీలకుల ముందు మూడు సార్లు విధిగా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటలలోపు ఖర్చులను పరిశీలిస్తారు. వ్యయాల పరిశీలనకు హాజరు కాని అభ్యర్థులకు నోటీసులు జారీ చేస్తామని, సరైన సంజాయిషీ ఇవ్వని వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా బరిలో నిలిచే వారు ప్రత్యేక ఖాతా తెరిచి దాని ద్వారా చెల్లింపులు జరపాలి. ఖాతా నంబరు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. పరిమితిలోపే ఖర్చు బరిలో నిలిచిన వారు తమకు నిర్ధారించిన పరిమితిలోపే ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. 5వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి రూ.2.50లక్షలు, వార్డు సభ్యులు రూ.50వేలకు మించి ఖర్చు చేయవద్దు. 5వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి ప్రచారం వ్యయం రూ.1.50లక్షలు, వార్డు సభ్యులు రూ.30వేలకు మించి ఖర్చు చేయొద్దు. ఎన్నికల సంఘం ఖరారు చేసిన వ్యయ పరిమితులకు లోబడి ఖర్చు చేయాలి. ఫలితాలు వచ్చిన 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించాలి. వ్యయ పరిమితి మించినా, లెక్కలు చూపించకపోయినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తారు. విజయం సాధించిన వారు ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలను అందించని పక్షంలో పదవుల నుంచి తొలగిస్తారు. చికెన్ బిర్యానీ రూ.100, మటన్ బిర్యానీ రూ.150 అభ్యర్థుల ప్రచార ఖర్చు ధరలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. అభ్యర్థులకు చికెన్ బిర్యానీకి రూ.100, మటన్ బిర్యానీకి రూ.150గా నిర్ధారించింది. చాయ్‌కు రూ.10, కాఫీ రూ.15, వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్‌కు రూ.20, లస్సీకి రూ.35, వాటర్ ప్యాకెట్‌కు రూ.1, సాదా భోజనానికి రూ.80, సైకిల్ రిక్షా వినియోగిస్తే రోజుకు రూ.400, ఆటో రిక్షా రూ.1,500, లాటా ఏస్‌కు రూ.1,600, వెయ్యి పోస్టర్లకు రూ.5వేలు, నెత్తిన ధరించే టోపీకి రూ.40, టీషర్టుకు రూ.100గా చెల్లించాలని తెలిపింది. ఒకరోజు కారు అద్దె రూ.2,500, ఇన్నోవాకు రూ.3,500గా చూపాలి. కూర్చునేందుకు వినియోగించే కుర్చీ అద్దె రూ.20, వీఐపీ కుర్చీకి రూ.100, డప్పుకు రూ.700, బాణసంచాకు రూ.800గా లెక్కచూపుతూ బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. గెలిచినా, ఓడినా లెక్క తప్పని సరి చాయ్‌కు రూ.10, చికెన్ బిర్యానీకి రూ.100 టోపీ, కరపత్రం, కుర్చీ, వాహనం అన్నింటికీ లెక్కలు ఎన్నికల వ్యయ పరిశీలకులు పోటీ చేసే అభ్యర్థుల వ్యయంపై దృష్టి సారిస్తున్నారు. మండలానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బృందం సభ్యులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచార తీరును పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల వెంట తిరిగే జనం, వారి భోజనం, అల్పాహారం, ప్రచార కరపత్రాలు, వాహనాల ఖర్చు అంచనా వేసి సంబంధిత అధికారులకు సమర్పిస్తారు. -
పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని శిశుగృహం, సఖీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. క్రమశిక్షణతో ఉంటూ చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల బాగోగులను చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరమైతే ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. సంగారెడ్డి టౌన్: సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 19 నుంచి 40 ఏళ్లలోపు సంగారెడ్డి, మెదక్ జిల్లాల మహిళలు అర్హులని పేర్కొన్నారు. రేషన్, ఆధార్ కార్డులు, నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ నెల 17వ తేదీ వరకు సంగారెడ్డి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. సంగారెడ్డి జోన్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆయా మండలాలలో మూడు దశలలో అధికారులు ఓటు వేసేందుకు వీలు కల్పించారు. మండల కేంద్రాలలో ఓటు వేసేందుకు వచ్చే అధికారుల సౌకర్యార్థం ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో ప్రత్యేకంగా అధికారులను నియమించి, ఓటింగ్ ప్రక్రియ జరిగే విధంగా చూస్తారు. మొదటి దశ ఎన్నికలలో పాల్గొనే అధికారులకు మంగళవారం ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. రెండో విడతలో హాజరయ్యే అధికారులకు ఈనెల 10 నుంచి 12 వరకు, చివరి దశ ఎన్నికల అధికారులకు 13 నుంచి 15 వరకు సమయం ఉంటుంది. మూడు దశలలో జరిగే ఎన్నికలకు 13,900పైగా అధికారులు ఎన్నికల విధులకు హాజరుకానున్నారు. వీరందరూ శిక్షణ కార్యక్రమాలు జరిగే ప్రదేశాలలో బ్యాలెట్ ఓటింగ్ కొరకు ఫాం14 దరఖాస్తులు పూర్తి చేశారు. ఒక వేళ అక్కడ ఫాం 14 తీసుకుని వారు నేరుగా మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో అక్కడే తీసకుని ఓటు వేయవచ్చు. న్యాల్కల్(జహీరాబాద్): జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో స్థానిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 11న మొదటి విడతగా గుమ్మడిదల, హత్నూర, కంది, సంగారెడ్డి, సదాశివపేట్, కొండాపూర్, పటాన్చెరు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 10, 11న సెలవులు ప్రకటించారు. అలాగే.. రెండో విడత ఎన్నికలు జరగనున్న అందోల్, చౌటకూర్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి, జహీరాబాద్ ప్రాంతాల్లోని పాఠశాలలకు 13, 14న సెలవులు, మూడో విడతగా ఎన్నికలు జరగనున్న కల్హెర్, కంగ్టి, మనూర్, నాగిల్గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, సిర్గాపూర్, న్యాల్కల్ ప్రాంతాల్లోని పాఠశాలలకు 16, 17న సెలవులు ప్రకటించారు. వాటప్స్ ద్వారా ఆర్బీఐ మెసేజ్‌లు జహీరాబాద్ టౌన్: పాత 50 పైసల కాయిన్‌తో పాటు అన్ని నాణేలు చట్టబద్దమైన కరెన్నీగానే ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ప్రతి ఒక్కరికి వాట్సప్‌లో మెసేజ్‌ల ద్వారా ప్రకటించింది. 50 పైసల నాణేలు చెల్లవని సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ ప్రజలకు నమ్మకం కల్గడానికి వాట్సప్ మెసేజ్‌లు పంపుతుంది. తప్పుడు ప్రచారం ఆపేందుకు ఆర్బీఐ వీడియోతో పాటు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 50 పైసల నుంచి రూ.1, రూ.2, రూ.5, రూ.10 వరకు నాణేలు ఏ డిజైన్‌లో ఉన్నా.. ఏ సీరీస్‌లో ఉన్నా.. అన్నీ చెల్లుతాయని, అన్నీ కూడా చట్టబద్ద గల నాణేలు అన్ని స్పష్టం చేసింది. నాణేలపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, వ్యాపారులు తిరస్కరిస్తే అది చట్టవిరుద్ధమని పేర్కొంది. -
నవోదయకు సర్వం సిద్ధం
13న ప్రవేశ పరీక్ష ● నేడు సీఎస్, సీఎల్ఓలకు శిక్షణ ● వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ వెల్లడి వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లాలో నవోదయ ఎంపిక పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2026–27 విద్యాసంవత్సరానికి గాను వర్గల్ నవోదయలో ఆరోతరగతిలో ప్రవేశానికి ఈ నెల 13న ఎంట్రెన్స్ పరీక్ష (జెఎన్వీఎస్టీ) జరుగుతుంది. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,754 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, పరీక్ష నిర్వహణకు 22 కేంద్రాలు ఏర్పాటు చేశామని వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. సోమవారం ఆయన పరీక్షకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల విద్యాశాఖాధికారుల సమక్షంలో ఆయా జిల్లా కేంద్రాల్లో సెంటర్ సూపరింటెండెంట్లు, సెంటర్ లెవెల్ అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుదన్నారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు అనుమానాల నివృత్తికి 73823 35164, 94489 01318 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
చలి పంజా
సంగారెడ్డి జోన్: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. మూడు రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు గజగజా వణుకుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలో 6.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అలాగే.. అనేక మండలాలలో కూడా సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. దీంతో పలు మండలాల్లో ఆరెంజ్ జోన్‌గా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కోహీర్‌లో 6.6, న్యాల్కల్ 7.5, ఝరాసంగం, మొగుడంపల్లి 7.6, జహీరాబాద్, గుమ్మడిదల, నిజాంపేట్‌లలో 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపశమనం పొందేందుకు చలి మంటలు కాపుతూ, స్వెటర్లు, చేతులకు హ్యాండ్ గ్లౌజులు, మప్లర్లు ధరిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు సుమారు 10–15 సంవత్సరాల తర్వాత అతి తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరో వారం పది రోజుల పాటు చలి తీవ్రత పెరిగే మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అధిక వర్షాలే చలి తీవ్రతకు కారణం ఈ సంవత్సరం వానకాలం సీజన్ లో కురిసిన అధిక వర్షాలే చలి తీవ్రతకు కారణం అని తెలుస్తుంది. ఇప్పటికీ చాలాచోట్ల వాగులలో వరద నీరు ప్రవహిస్తుంది. నీటి కుంటలు, చెరువులలో నీరు పుష్కలంగా ఉంది. ఏది ఏమైనా మరికొన్ని రోజులు చలి నుండి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కోహీర్‌లో 6.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు జిల్లాలో సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదు పలు మండలాలకు ఆరెంజ్ జోన్ -
52 మంది బైండోవర్
కొమురవెల్లి(సిద్దిపేట): ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా మండలంలోని 52 మందిని సోమవారం బైండోవర్ చేసినట్టు ఎస్ఐ మహేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎవరైనా ఎన్నికల ప్రకియలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినా, వివాదాలు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం కొనసాగించేందుకు పటిస్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 17 మందికి జరిమాన సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుపడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి వివరాల ప్రకారం... శనివారం, ఆదివారం అర్ధరాత్రి పట్టణంలో పలు చోట్ల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఐదుగురికి రూ.1500, మిగతా 12 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమాన విధించారు. సిద్దిపేటలో 10 మందికి..సిద్దిపేటకమాన్: సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 10మంది పట్టుబడినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సోమవారం సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.1,02,000 జరిమాన, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. పాము కాటుతో రైతు మృతి చేగుంట(తూప్రాన్): పాముకాటుకు గురై రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దొంతి ఆంజనేయులు వ్యయసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం వ్యవసాయ పొలం వద్ద పాము కాటు వేయగా అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. లారీ డ్రైవర్, క్లీనర్ రిమాండ్ హుస్నాబాద్‌రూరల్: మండలంలోని జిల్లెలగడ్డ చెక్‌పోస్టు వద్ద శనివారం రాత్రి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన డ్రైవర్, క్లినర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి సోమవారం తెలిపారు. హన్మకొండ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న చేపల లారీ డ్రైవర్ అంకుస్సింగ్, క్లినర్ యూసుఫ్‌లు మద్యం తాగి పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. విత్తన సవరణ బిల్లురద్దు చేయాలి వ్యవసాయ కార్మిక, ప్రజాసంఘాల నిరసన మెదక్ కలెక్టరేట్: విత్తన సవరణ బిల్లును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట రాములు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీడబ్ల్యూసీ గోదాం ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 11న నిర్ణయించిన సీడ్స్ బిల్ 2025ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది భారత విత్తన రంగంపై బహుళజాతి కార్పొరేట్ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి తీసుకొచ్చిన ప్రతికూల చట్టమన్నారు. ఇది ఆహార భద్రత, విత్తన స్వావలంబన, రాష్ట్ర హక్కులను తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే.మల్లేశం, రైతు సంఘం గౌరయ్య, కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
అక్రమ మద్యం స్వాధీనం
వట్పల్లి(అందోల్): స్థానిక సంస్థల ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సోమవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. జోగిపేట సీఐ అనిల్‌కుమార్ తెలిపిన వివరాలు... పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వట్పల్లి నుంచి మండలంలోని పోతులబోగుడా గ్రామానికి చెందిన ముద్దాపురం ప్రవీణ్ కారులో అక్రమ మద్యాన్ని తరలిస్తుండగా 480 లిక్కరు బాటిల్స్, 48 బీరు బాటిళ్లను పట్టుకున్నారు. పట్టు బడిన మద్యం విలువ రూ.1,02,840 ఉంటుందని తెలిపారు. తరలిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా 98 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ లవకుమార్, ఏఎస్ఐ సుధాకర్, కానిస్టేబుల్స్ భూమయ్య, రాజు, గీత పాల్గొన్నారు. కొల్చారంలో 95 లీటర్లు.. కొల్చారం(నర్సాపూర్): అక్రమంగా తరలిస్తున్న 95 లీటర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ అహ్మద్ మొహీనుద్దిన్ వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి శివారులో ఏడుపాయల మొదటి బ్రిడ్జి వద్ద సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. పాపన్నపేట మండలం నాగ్సానిపల్లికి చెందిన బాలి జగదీష్ కారులో తరలిస్తున్న 47 లీటర్లు, జయపురం గ్రామానికి చెందిన శ్రీశైలం టీవీఎస్ ఎక్సెల్‌పై తరలిస్తున్న 25 లీటర్లు, ఎన్కేపల్లికి చెందిన చాంద్‌పాషా ఆటోలో తరలిస్తున్న 24 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట పట్టణంలో.. సిద్దిపేటకమాన్: సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ తాళ్లపల్లి శ్రీనివాస్‌ను విచారించగా రేగులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జింగిలి లక్ష్మి, ఆమె అల్లుడైన కుంభం శ్రీకాంత్ సూచనల మేరకు పట్టణంలోని కనకదుర్గ వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి ఆటోలో ఊరికి తరలిస్తున్నట్లు డ్రైవర్ ఒప్పుకున్నాడు. ఆటోలో తరలిస్తున్న రూ.80వేల విలువైన బీర్లు, లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేసినట్లు టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
● మేనిఫెస్టో విడుదల చేసిన ఝాన్సీలింగాపూర్ సర్పంచ్ అభ్యర్థి
రామాయంపేట(మెదక్): ఓ సర్పంచ్ అభ్యర్థి హామీల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలో ఆడపిల్ల పెళ్లికి రూ.11 వేలు ఆర్థిక సహాయం, ఆడపిల్ల పుడితే రూ. 5వేలు, నిరుపేదలు మృతి చెందితే దహన సంస్కారాల నిమిత్తం రూ.5 వేలు, కోతుల బెడద నివారణ తదితర కార్యక్రమాలు చేపడుతానని మండలంలోని ఝాన్సీలింగాపూర్ సర్పంచ్ అభ్యర్థి మానెగల్ల రామకిష్టయ్య హామీలిచ్చారు. సోమవారం ఆయన గ్రామ ప్రజల సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేశారు. గ్రామంలో అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాల్, మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం, బస్తీ దవాఖాన ఏర్పాటు, బైపాస్ రోడ్డు నుంచి సదాశివనగర్ తండా వరకు తారు రోడ్డు, మినీ ట్యాంకుల నిర్మాణం, నూతన వైకుంఠ రథం వంటి పనులు చేస్తానని తెలిపారు. తనను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. రామకిష్టయ్య ప్రచారానికి గ్రామంలో మంచి స్పందన లభిస్తుంది. -
నమూనా బ్యాలెట్లో తిరకాసు
సర్పంచ్ అభ్యర్థి పరేషాన్ పాపన్నపేట(మెదక్): నమూనా బ్యాలెట్ ప్రింటింగ్‌లో జరిగిన పొరపాటు..అభ్యర్థి కొంప ముంచింది. మండల పరిధిలోని గాజులగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఆమెకు కత్తెర గుర్తును అధికారులు కేటాయించారు. అయితే ప్రచారంలో భాగంగా ప్రింటింగ్ చేయించిన నమూనా బ్యాలెట్లో పైన కత్తెర గుర్తు సరిగానే ప్రింట్ అయింది. కానీ కింద తన ప్రత్యర్థికి చెందిన ‘బ్యాట్ గుర్తుకే మన ఓటు’అని అచ్చు వేశారు. ఇది చూసిన ఓటర్లు ఇదేంటబ్బా అని ముక్కున వేలేసుకున్నారు. గమనించని సదరు అభ్యర్థి అప్పటికే కొన్ని నమూనా బ్యాలెట్లు పంచి, తర్వాత తప్పును గుర్తించారు. వాటిని తిరిగి వాపస్ తీసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కల్వర్టును ఢీకొట్టి..యువకుడు మృతి భార్యను అత్తారింట్లో వదిలి వస్తుండగా ప్రమాదం కొండపాక(గజ్వేల్): భార్యను రెండో కాన్పు కోసం అత్తారింట్లో వదిలి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... తొగుట మండలం లక్మాపూర్ గ్రామం కాగా... గజ్వేల్ మండలంలోని ముట్రాజ్‌పల్లి శివారులో డబుల్ బెడ్రూమ్లో పుంటికూర కర్ణాకర్ (28) నివాసం ఉంటున్నారు. కాగా భార్య అఖిల రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి కరుణాకర్‌తోపాటు తల్లి మల్లవ్వతో కలిసి కొండపాక మండలంలోని అత్తగారి ఊరు ఖమ్మంపల్లికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వరుసకు బామ్మర్ది శివతో కలిసి లక్ష్మాపూర్‌కు బయలు దేరారు. మార్గమధ్యలో నిద్ర రావడంతో కొండపాక గ్రామ క్రాస్ రోడ్డు వద్ద కొద్దిసేపు కారును ఆపి పడుకున్నారు. కొద్దిసేపటి తరువాత వస్తూ.. రాంచంద్రాపూర్ గ్రామ శివారులోని రాజీవ్ రహదారి ప్రక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాలై కర్నాకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని మృతుని తండ్రి చంద్రయ్యకు శివ సమాచారం ఇచ్చాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
● బ్రాహ్మణపల్లి ఓటరు జాబితాలో 40 మంది మృతులు! ● రెండుసార్లు ఒకే ఓటరు పేరు ● అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం
నర్సాపూర్ రూరల్: మండలంలోని బ్రాహ్మణపల్లి ఓటర్ జాబితాలో సుమారు 40 మందికి పైగా మృతుల పేర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న వాళ్దాస్ సత్యగౌడ్ ఈ విషయమై నర్సాపూర్ ఆర్డీఓకు ఫిర్యాదు చేసేందుకు వెళుతూ విలేకరులకు ఓటర్ జాబితా గూర్చి వివరించారు. గ్రామంలో 40 మందికి పైగా మృతి చెందిన వారి పేర్లు, ఫొటోలు ఓటర్ జాబితాలో ఉన్నాయని తెలిపారు. దీంతోపాటు 20 మందికి పైగా రెండు చోట్ల పక్కపక్కనే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయన్నాడు. పలుమార్లు ఓటర్ జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నాయని వివిధ దినపత్రికల్లో వార్తలు ప్రచురితమైనా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించాడు. మృతులతో పాటు రెండు చోట్ల ఓటు ఉన్న అభ్యర్థుల ఓట్లు పోల్ అయితే గొడవలు జరిగే అవకాశం ఉందని పోటీలో ఉన్న అభ్యర్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఆర్డీఓతో పాటు కలెక్టర్‌కు తప్పులు తడకగా ఉన్న ఓటరు జాబితాపై ఫిర్యాదు చేయనున్నట్లు పోటీల్లో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తెలిపారు. కొన్ని చోట్ల పేర్లు మారినా ఫొటోలు మారలేదని తెలిపారు. గెలిపిస్తే.. ఆడబిడ్డ పెళ్లికి సాయం -
తొలిసారి..బరిలోకి..
● మండలంలో 16 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు పోటీ ● ఆ పార్టీ వైపు యువత మొగ్గే కారణమా?హత్నూర (సంగారెడ్డి): మండలంలో గతంలో ఒక స్థానానికి కూడా పోటీ చెయ్యని బీజేపీ మద్దతుదారులు ప్రస్తుతం గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌తోపాటు వార్డు స్థానాలకు బరిలో నిలిచారు. అయితే యువత కాషాయం వైపు మొగ్గుచూపుడమే ఇందుకు కారణమంటూ గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో ఇతర అభ్యర్థులకు మద్దతు ఇచ్చే బీజేపీ నాయకులు, యువకులు, ప్రస్తుతం స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసి తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. మండల కేంద్రమైన హత్నూరలో బీజేపీ మద్దతుతో పొట్లగళ్ల శంకర్ బరిలో నిలిచి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దౌల్తాబాద్‌లో బిట్ల విజయలక్ష్మి, కాసాలలో నవీన్, రెడ్డి ఖానాపూర్‌లో జైపాల్, బోరపట్లలో మల్లేశం, చందాపూర్‌లో రామరాజు, మధురలో రవి, చిక్ మద్దూర్‌లో కల్పన శ్రీశైలం, సిరిపురంలో చంద్రమోహన్ రెడ్డి, నవాబుపేటలో మంజుల పోటీలో నిలిచారు. మల్కాపూర్‌లో అనిత, కొత్తగూడెంలో రాజు నాయక్, దేవులపల్లిలో ప్రవీణ్, గోవిందరాజు పల్లిలో బాలయ్య, వడ్డేపల్లిలో మల్లేశం బీజేపీ మద్దతుతో బరిలో ఉన్నారు. కానీ మొదటిసారి బీజేపీ అభ్యర్థులు బరిలో నిలవడం వల్ల ఏ పార్టీకి నష్టం.. ఏ పార్టీకి లాభం అన్న విషయంపై గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడైతే భవిష్యత్తు తేలనుంది.మద్యం, మాంసానికి మస్తు గిరాకీ -
డబ్బు, మద్యం పంపిణీ..
● ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన సర్పంచ్ అభ్యర్థులు, 68 మందిపై కేసు సిద్దిపేటఅర్బన్: ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేసిన ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులపై సిద్దిపేట త్రీటౌన్‌లో కేసు నమోదైంది. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎన్సాన్పల్లి సర్పంచ్ అభ్యర్థి నాగుల స్రవంతి గ్రామంలోని ఓ కుల దైవం గుడి వద్ద అదే కులానికి చెందిన 44 మందికి మద్యం పంపిణీ చేస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్చార్జి వంశీకృష్ణ తన సిబ్బందితో కలిసి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన 68 రాయల్ స్టాగ్ క్వార్టర్ బాటిల్స్, 39 మోటార్ సైకిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి నాగుల స్రవంతితో పాటు మరో 44 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే మిట్టపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి చింతల కుమార్ తన ఇంటి వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని అందిన సమాచారం మేరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ సురేశ్ సిబ్బందితో వెళ్లారు. పోలీసులను గమనించి డబ్బులను పక్క ఇంట్లోకి విసిరేశారు. విసిరేసిన రూ. 25,500ను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి చింతల కుమార్‌తో పాటు చింతల రాజుపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. అయినాపూర్‌లో 24 మందిపై కేసు కొమురవెల్లి(సిద్దిపేట): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం పంపిణీ చేస్తున్న వారిపై కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మండలంలోని అయినాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం... సోమవారం సాయంత్రం గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొంతమంది మద్యం పంపిణీ చేస్తున్నట్లు వచ్చిన సమాచారం వచ్చింది. ఈ మేరకు పోలీసులు మద్యం పంపిణీ చేస్తున్న 24 మందిపట్టుకుని కేసు సమాదు చేశారు. అలాగే ఘటనా స్థలంలో పంపిణీ కోసం ఉంచిన 24 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఓటరు జాబితా తప్పుల తడక
సంగారెడ్డి టౌన్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారం గడువు దగ్గర పడటంతో గ్రామాలతోపాటు , పట్టణాల్లో నివసించే ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు ప్రచారంతో సందడిగా కనిపిస్తుంది. ప్రచారంలో తమ వెంట పాల్గొనే వారితో పాటు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటం లేదు. ఉదయం టిఫిన్ మొదలుకుని, మధ్యాహ్నం, రాత్రి మాంసంతో భోజనం, మూడు ఫూటల మందు వరకు అన్ని అభ్యర్థులే సమకూరుస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల జోరు కనిపిస్తున్నది. సర్పంచ్ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపు యజమానులకు, చికెన్ అమ్ముతున్న దుకాణదారులకు మస్తు గిరాకీ ఉంది. కొన్ని గ్రామాల్లో అయితే నిబంధనలకు విరుద్ధంగా చీరలతో పాటు వంట సామగ్రి పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటళ్లతోపాటు వెంట తిరిగే క్యాడర్‌కు ఒకరికి మించి ఒకరు ఖర్చు చేస్తున్నారు.గ్రామాల్లో ప్రచార జోరు -
హామీల అమలులో విఫలం
¯]lÆ>Þç³NÆŠḥGÐðl$ÃÌôæÅ çÜ$±-™éÆð‡yìlz హత్నూర(సంగారెడ్డి): హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. ఆదివారం హత్నూర మండలం సికిందల్లాపూర్, మంగాపూర్, నస్తీపూర్‌లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల పర్వం కూడా పూర్తి కావడంతో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. మొదటి విడత పోలింగ్ ఈనెల 11న జరగనుండగా, ప్రచారం చివరి దశకు చేరుకుంది. రెండో విడత గుర్తుల కేటాయింపు పూర్తి కాగా, అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకెళుతున్నారు. మూడో విడతకు సంబంధించి గుర్తులను ఈనెల 9న కేటాయించనున్నారు. కాగా జిల్లాలో మొదటి విడతలో 136 పంచాయతీలు, 1,246 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉద్యోగులకు శిక్షణ మొదటి విడత పోలింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులకు శిక్షణ ఇప్పటికే పూర్తి చేశారు. పోలింగ్‌లో పాల్గొనే ఉపాధ్యాయులతో పాటు డివిజన్, జిల్లాస్థాయి అధికారులకు ఎన్నికల శిక్షణ ఇస్తున్నారు. రెండో విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించి సోమవారం ప్రిసైడింగ్్ అధికారులకు వారికి కేటాయించిన మండలంలో శిక్షణ ఇవ్వనున్నారు. మూడో విడతకు సంబంధించిన వారికి 9వ తేదీన శిక్షణ ఇవ్వనున్నారు. 200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారిని కేటాయించనున్నారు. 400 లోపు ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో ముగ్గురిని, 400పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో నలుగురికి కేటాయించనున్నారు. ఎన్నికల సామగ్రిని ఆయా మండలాలకు అధికారులు పంపించి సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీ మండల కేంద్రాలకు తీసుకొస్తున్నారు. బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్‌ను నోడల్ అధికారులుగా నియమించిన జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముమ్మర తనిఖీలు జిల్లాలోని మోర్గి, మాడ్గి, హుసెళ్లి వద్ద పోలీసులు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు. మండల స్థాయిలో నియమితులైన ఫ్లయింగ్ సర్వైలైన్స్ టీం (ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలైన్స్ (ఎస్ఎస్టీ) టీంలు ముమ్మర తనిఖీల్లో నిమగ్నమయ్యారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా పెట్టేందుకు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను నియమించారు. వీరు వాహనాల రాకపోకలపై నిఘా పెట్టారు. జిల్లా సరిహద్దులోని కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పోలీస్ సిబ్బంది మరింత నిఘాతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో రూ. 4.3 లక్షల విలువైన మద్యం పట్టుకుని 77 కేసులు నమోదు చేశారు. 1,450 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గతంలో నెలకొన్న ఘటనలు, తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు జిల్లాలో 1,450 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. వీటి సంఖ్య పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ నాటికి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా 480గా అధికారులు గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాలు గల గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ అదనపు బలగాలను మోహరించాలని నిర్ణయించారు. హిస్టరీ షీట్లు, గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన 1,080 మందిని ముందస్తుగా తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తున్నారు. ముగిసిన పంచాయతీ నామినేషన్ల పర్వం మండలాలకు ఎన్నికల సామగ్రి తుది దశకు చేరుకున్న మొదటి విడత ప్రచారం -
యాసంగి సాగుకు విరామం
పాపన్నపేట(మెదక్): సింగూరుకు మరమ్మతుల నేపథ్యంలో ప్రాజెక్టు ఆయకట్టు కింద యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించాలని రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ నిర్ణయించింది. సుమారు రూ. 13 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు మరమ్మతులు చేయనున్నారు. కాల్వలకు సైతం లైనింగ్ పనులు చేపట్టనున్నారు. పంట ల విరామంతో సింగూరు కింద 35 వేల ఎకరాలు, ఘనపురం కింద 21,625 వేల ఎకరాల్లో పంట వేసే అవకాశం లేదు. ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలతో వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. దీంతో యాసంగిపై ఆశలు పెట్టుకున్న రైతులు నిరాశకు లోనవుతున్నారు. 8.17 టీఎంసీలకు తగ్గింపు సింగూరు జలాశయానికి ఎగువ మట్టికట్టలకు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివిట్‌మెంట్‌తో పాటు మట్టి కట్టలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని, వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే, తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్ఆర్పీ) హెచ్చరించింది. ఈ మేరకు ప్రాజెక్టులో ఉన్న నీటి మట్టాన్ని 517.5 మీటర్లకుకు, నిల్వలను 8.17 టీఎంసీలకు తగ్గించాలని కమిటీ సూచించింది. తాగునీటికి ఢోకా లేదు సింగూరు ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని 1,800 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా 0.45 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు తెలిపారు. ఈ లెక్కన ప్రాజెక్టులో 3 టీఎంసీల నీరు ఉన్నా, వేసవి కాలం వరకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ప్రాజెక్టులో కనీసం 7 టీఎంసీలు ఉన్నా, హైదరాబాద్‌కు నీరందించవచ్చన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 16.8 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, రోజుకు 0.3 టీఎంసీల చొప్పున దిగువకు విడుదల చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచండి యాసంగికి పంట విరామం ఇచ్చినందున, ఘనపురం ఆన కట్ట ఎత్తు పెంచాలని రైతులు కోరుతున్నారు. 2014లో ఆనకట్త ఎత్తు పెంచేందుకు అప్పటి సీఎం కేసిఆర్ రూ. 43.64 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎత్తును మరో 1.725 మీటర్లు పెంచాలని భావించారు. కాగా కొంత వరకు పనులు జరిగాయి. భూసేకరణ కోసం మరో రూ. 8.10 కోట్లు చెల్లించాల్సి ఉంది. వెంటనే నిధులు మంజూరు చేసి ఎత్తు పెంచాలని రైతులు కోరుతున్నారు. రూ.13 కోట్ల అంచనాతో సింగూరుకు మరమ్మతులు కాల్వలకు సైతం లైనింగ్ ప్రాజెక్టు కింద పంటలకు క్రాప్ హాలిడే నీటి పారుదలశాఖ నిర్ణయం -
అరుణోదయం.. ప్రకృతి సోయగం
ఓ వైపు మంచు తెరలు తొలుగుతున్నాయి. మరోవైపు ఆకాశం నుంచి భూమి వైపు సూర్యుడు తొంగి చూస్తున్నాడు. బంగారువర్ణంలో సూర్య కిరణాలు పొగమంచును చీల్చుకుంటూ భూమిని తాకుతున్నాయి. పక్షులు కిలకిలరావాలు చేస్తుండగా.. చెరువులో జల సవ్వడులు.. సూర్యోదయం వేళ ఆకాశం అరుణ వర్ణంలో మెరుస్తూ, ప్రకృతి గీసిన పెయింటింగ్‌లా కనువిందు చేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహబూబ్‌సాగర్ చెరువులో ఆదివారం ఉదయం ఆవిష్కృతమైన అద్భుత దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
అంతటా మనోళ్లే గెలవాలి
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తాచాటాలి ● జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ గజ్వేల్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాను చాటాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డుల కోసం, ఇళ్ల కోసం పేదలకు ఎదురుచూపులే మిగిలాయన్నారు. నేడు ఆ పరిస్థితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో విభేదాలను పక్కనబెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడమే కార్యకర్తలు, నాయకుల లక్ష్యం కావాలన్నారు. ఏకగ్రీవ సర్పంచ్‌లకు సన్మానం గజ్వేల్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికై న కాంగ్రెస్ సర్పంచ్‌లను మంత్రి వివేక్ సన్మానించారు. జగదేవ్‌పూర్ మండలం నిర్మల్‌నగర్ సర్పంచ్ కత్తి పద్మారావు, కొండాపూర్ సర్పంచ్ పుష్ప, పలుగుగడ్డ సర్పంచ్ కనకయ్య, వర్గల్ మండలం తున్కిమక్త సర్పంచ్ స్వామి, కుకునూర్‌పల్లి మండలం పీటీ వెంకటాపూర్ సర్పంచ్ భాస్కర్ తదితరులు సన్మానం పొందిన వారిలో ఉన్నారు. -
ఎరుపెక్కిన మెతుకుసీమ
మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్: సీఐటీయూ రాష్ట్ర మహాసభలు ఆదివారం మెదక్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ ఎత్తున కార్మికులు తరలివచ్చారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, అఖిల భారత ఉపాధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని విధులు నిర్వరించే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిన విధులు నిర్వహించే లక్షలాది మందికి కార్మిక చట్టం ప్రకారం వేతనాలు అందటం లేదన్నారు. కార్మిక చట్టం (వెజ్‌బోర్డు) ప్రకారం ప్రతి కార్మికుడిని పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో యాజమాన్యాలు తప్పు చేస్తే వెజ్‌బోర్డు ఆధారంగా వారిని జైలుకు పంపే అధికారం కార్మిక చట్టాల్లో ఉండేదని, ప్రస్తుతం వాటిని తొలగించి కార్మికులు హక్కుల కోసం ప్రశ్నిస్తే శిక్షించే విధంగా నూతన కార్మిక చట్టాలను తెచ్చారని వాపోయారు. కార్మికులు రోజుకు 8 గంటల కన్నా ఎక్కువగా పనిచేయరాదనే నిబంధన ఉండేదని, ప్రస్తుతం నూతన చట్టాల్లో దాన్ని తొలగించారన్నారు. వీటిని సాధించుకోవటానికి అంతా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ కోషాధికారి సాయిబాబ, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య, రమణ, జిల్లా నేతలు మల్లేశం, బాలమణి తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా ప్రారంభమైన సీఐటీయూ రాష్ట్ర మహాసభలు -
నాడు తనయుడు.. నేడు తల్లి
సర్పంచ్ పీఠంపై ఏటిగడ్డ మాందాపూర్ గ్రామం ఏకగ్రీవంకొల్చారం(నర్సాపూర్): మండలంలోని ఏటిగడ్డ మాందాపూర్‌లో 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎర్రోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించి సర్పంచ్ పీఠం అధిరోహించారు. ఈసారి ఎన్నికల్లో ఈ సర్పంచ్ స్థానం జనరల్ (మహిళ)కు కేటాయించారు. మొదట అన్ని పార్టీలు అభ్యర్థులను బరిలో ఉంచాలనుకున్నప్పటికీ గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, పార్టీలకు అతీతంగా విష్ణువర్ధన్ రెడ్డి తల్లి విజయమ్మను నామినేషన్ వేయించి ఏకగ్రీవం చేశారు. ఇక్కడి ఎనిమిది వార్డులు సైతం ఏకగ్రీవం కావడం గమనార్హం. అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. -
పట్టా ఇచ్చారు.. భూమి మరిచారు
భూమి అప్పగించాలని బాధితుడి ఆవేదననారాయణఖేడ్: ఇరవై ఐదు ఏళ్ల కింద సిర్గాపూర్ శివారులో రెండెకరాల భూమిని పంపిణీ చేసి, అందుకు సంబంధించిన పట్టా పాసుపుస్తకం అందజేశారని.. కానీ ఇప్పటికీ భూమిని చూపలేదని సిర్గాపూర్‌కు చెందిన అమీనాబీ షేక్ మహబూబ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం ఖేడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అప్పట్లో పట్టా పాసుపుస్తకం ఇవ్వగా ధరణి అందుబాటులోకి వచ్చాక కొత్త పాసుపుస్తకాలు సైతం అందజేశారని తెలిపారు. తనకు కేటాయించిన భూమిని చూపాలంటూ 25 ఏళ్లుగా అనేకమార్లు, స్థానిక, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వగా గతంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 18 ఎకరాల్లో సర్వే నిర్వహించి మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని గుర్తించారని చెప్పారు. కానీ హద్దులు చూపిస్తామని చెప్పి అప్పగించడం లేదన్నారు. పట్టా పాసుపుస్తకాలు, ఇప్పటివరకు అందజేసిన వినతిపత్రాల ప్రతులను రిజిస్టర్ పోస్టు ద్వారా ఖేడ్ సబ్‌కలెక్టరు, కలెక్టర్‌కు పంపినట్లు వివరించారు. నెల రోజుల్లో న్యాయం చేయని పక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. -
ఓఆర్ఆర్పై లారీ, కారు ఢీ..
● తండ్రి, కూతురు మృతి ● మరో ఐదుగురికి తీవ్ర గాయాలుపటాన్చెరు టౌన్: మేడ్చల్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ విజయ్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకా రం.. మేడ్చల్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీశైలం, భార్య లక్ష్మి, కూతురు సుభిక్ష (4)తో పాటు వీరి దూరపు బంధువు తిరుపతి, అతడి భార్య జ్యోతిలక్ష్మి, వీరి కూతుర్లు శశిక, ధూవిక మొత్తం ఏడుగురు షిఫ్ట్ కారులో శనివారం రాత్రి మేడ్చల్ నుంచి తిరుపతి బయలుదేరారు. ఈ క్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు ఎగ్జిట్ – 2 సమీపంలో ఓఆర్ఆర్పై అదే మార్గంలో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో సుభిక్ష అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీశైలంను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. శ్రీశైలం భార్య లక్ష్మి, తిరుపతి, అతడి భార్య జ్యోతిలక్ష్మి, వీరి ఇద్ద రు పిల్లలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు శ్రీశైలం, సుభిక్ష (ఫైల్) -
పల్లె పోరు.. ప్రింటింగ్ జోరు
ఫ్లెక్సీ, ప్రింటింగ్ షాపులకు గిరాకీ ● జోరందుకున్న ప్రచారం ● గోడ పత్రికలు, కండువాలు ప్రచురణ దుబ్బాకటౌన్: పల్లె పోరు ఊపందుకుంది. రెండో దశలో జరుగనున్న సర్పంచ్ ఎన్నికల విత్ డ్రా ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు అధికారులు గుర్తులు సైతం కేటాయించడంతో గోడ పత్రికలు, కండువాలు, కర పత్రాల కోసం ఫ్లెక్సీ, ప్రింటింగ్ షాపులకు క్యూ కడుతున్నారు. నిన్న, మొన్న పెళ్లి గిరాకీ లేక వెలవెల బోయిన ఫ్లెక్సీ షాపులు ఎన్నికల నేపథ్యంలో ప్రచార సామగ్రి అమ్మకాలతో రద్దీగా మారాయి. సోషల్ మీడియా సందేశాలకు ప్రత్యేక డిజైన్లు ఓ వైపు ఉదయం లేవగానే ఇంటింటా తిరుగుతూ...ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న అభ్యర్థులు మరో వైపు సోషల్ మీడియాలో ప్రత్యేక సందేశాలతో దూసుకెళ్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సందేశాలతో ఆకట్టుకునేలా ఫ్లెక్సీ షాపులలో డిజైన్లు చేయించి వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్బుక్, తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు, స్టేటస్లు పెడుతున్నారు. దీంతో డిజైనింగ్‌లో సైతం ఫ్లెక్సీ షాపులు బిజీ అవుతున్నాయి. -
చేపల లారీ బోల్తా
ఇద్దరికి స్వల్ప గాయాలుహుస్నాబాద్రూరల్: మండలంలోని జిల్లెలగడ్డ పోలీసు చెక్ పోస్టు వద్ద శనివారం రాత్రి పోలీసు హవానాన్ని ఢీకొట్టిన లారీ బోల్తా పడింది. వివరాలు ఇలా... హన్మకొండ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న చేపల లారీ పోలీసు జీపును ఢీకొట్టడంతో అది కిందకు దూసుకెళ్లింది. ఆ సమయంలో వాహనంలో పోలీసులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బోల్తా పడిన లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు కావడంతో హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ సదానందం పరిశీలించి పోలీసు వాహనాన్ని బయటకు తీసి స్టేషన్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్, ఏలూరు నుంచి చేపల లోడుతో లారీ ఢిల్లీకి వెళ్తుందని, ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అన్నా.. వచ్చి ఓటేయండి
వలస ఓటర్లకు అభ్యర్థుల పిలుపులు● ప్రయాణ ఖర్చులు చెల్లిస్తామని హామీలు! ● గెలుపోటములు ప్రభావితం చేసే అవకాశం ● వలసెళ్లినా.. గ్రామాల్లోనే ఓటు జోగిపేట(అందోల్): ఓటు వేయడానికి రావాలని, ప్రయాణం, మిగతా ఖర్చులన్నీ చెల్లిస్తామంటూ బరిలో నిలిచిన అభ్యర్థులు వలస ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఊరు విడిచి ఇతర పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి జీవించే వారి ఓట్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతుంటారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా వలస ఓటర్లను తమ వైపు ఆకర్శించడం కోసం నయానా...బయానా ఇస్తుంటారు. ఒకరికంటే ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేసి వారి ఓట్లను తమవైపు తిప్పుకునేలా చూస్తున్నారు. కారులో వస్తారా? బస్సులో వస్తారా.. పంచాయతీ ఎన్నికల్లో తక్కువ ఓట్లతోనే జయాపజయాలుంటాయి గనుక వారిని ఏదో రకంగా ఓటు వేయించాలని కంకణం కట్టుకుంటున్నారు. ప్రతి గ్రామం నుంచి 50 నుంచి 100 మంది వరకు ఇతర ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. ఒక్క రోజు పని పోయినా ఆ కూలీ డబ్బులను మేమే చెల్లిస్తామని, కారులో వస్తారా?బస్సులో వస్తారా? ప్రత్యేకంగా వాహనాన్ని మాట్లాడుకొని వస్తారా? అంటూ బేరసారాలు ఆడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విచిత్రమేమిటంటే గ్రామంలోని ఓటర్ల కంటే ముందుగా వలస వెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారని సమాచారం. ఒక్కొక్కరికి కొందరు రూ.500 ఇస్తే, మరికొందరు రూ.600 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పంచాయతీల్లో అయితే రూ.వెయ్యి కూడా చెల్లిస్తున్నట్లు వినికిడి. ఎక్కడున్నా.. ఓటు స్వగ్రామంలోనే.. బతుకుదెరువు కోసం కుటుంబాలతో సహా పటాన్చెరు , బొల్లారం, జగద్గిరిగుట్ట, రామచంద్రాపురం, ఇస్నాపూర్, బాలానగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఏళ్ల తరబడి స్థిరపడినా.. ఓట్లు మాత్రం ఇంకా గ్రామాల్లోనే ఉండటం విశేషం. ఇలా వేలాది మంది తమ పిల్లల చదువులు, ఉద్యోగరీత్యా, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు నిర్వహించుకుంటూ రాజధానిలో స్థిరపడ్డారు. అక్కడ ఉంటున్న వారు ప్రతీ ఎన్నికకు సొంత గ్రామానికొచ్చి ఓటు వేసి వెళ్తుంటారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటు ఎంతో విలువైనది కావడంతో వలస ఓటర్లకు డిమాండ్ పెరిగింది.వలస ఓటర్లకు ఫోన్.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు స్వయంగా వలస ఓటర్ల ఫోన్ నంబర్లు తీసుకొని ఫోన్ చేసి అభ్యర్థిస్తున్నారు. కాకుండా మా తరపున పలానా వ్యక్తి వచ్చి మిమ్మల్ని కలుస్తాడు..మీరంతా నాకే ఓటు వేయాలంటూ సూచిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో కూడా 90శాతానికి పైగా ఓటింగ్ శాతం నమోదవుతుంది. దీనికి కారణం వలస ఓటర్లకు ఖర్చులు ఇచ్చి పిలిపించుకోవడమే. లేకుంటే ఓటు వేయడానికి మేమెందుకు ఖర్చులు పెట్టుకుంటాం.. పోటీ చేసేటోడు ఖర్చులు భరిస్తే వెళతామంటూ భీష్మించుకు కూర్చున్న వారు కూడా ఉన్నారు. -
రాజ్యాంగంతోనే ప్రతి పౌరుడికి హక్కులు
సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రతి భారతీయుడికి రాజ్యాంగం అనేక విశిష్ట హక్కులను కల్పించిందని, సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం పక్షోత్సవాల సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ‘భారత రాజ్యాంగం–విలువలు’ పుస్తకాన్ని ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా అప్పల ప్రసాద్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 15, 16, 17 ఆర్టికల్స్ సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి ప్రాథమిక హక్కులను అందిస్తున్నాయన్నారు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర వ్యాప్తంగా కుల, మత విభేదాలు లేని సమాజ నిర్మాణం, ముఖ్యంగా సంచారజాతుల హక్కుల రక్షణకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. సంచార జాతుల్లో కొన్ని కులాల పేర్లు ఇంకా ప్రభుత్వ రికార్డుల్లో లేవని, వాటిని సర్కారు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ కుమార్ రమేశ్, మనోహర్, సంతోష్, మల్లారెడ్డి, విజయ భాస్కర్, శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రభుదాస్ పాల్గొన్నారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
డయల్ 100కు కాల్.. కాపాడిన పోలీసులువట్పల్లి(అందోల్): సెల్‌ఫోన్ కోసం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు కాపాడారు. ఈ ఘటన ఆదివారం అందోల్ మండల పరిధిలోని సంగుపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన కృష్ణ ఫోన్‌ను ఇంట్లో నుంచి తన స్నేహితుడు ఎత్తుకెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన అతడు ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గమనించిన గ్రామస్తుడు 100కు కాల్ చేయడంతో జోగిపేట పోలీసులు శ్రీకాంత్, అరవింద్ వెంటనే గ్రామానికి వెళ్లి చీరతో దూలానికి ఉరి వేసుకుంటుండగా అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్యాపిల్లలను బలవంతంగా బయటకు వెల్లగొట్టి కృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు కానిస్టేబుల్ తెలిపారు. తన స్నేహితుడు సుధాకర్ ఫోన్‌ను దొంగిలించినట్లు కృష్ణ తెలపడంతో పోలీసులు అతడి నుంచి ఫోన్ రికవరీ చేశారు. 5 నిముషాలు ఆలస్యమైనా ఉరి వేసుకొని ప్రాణం తీసుకునేవాడని, పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి కృష్ణను కాపాడినందుకు స్థానికులు అభినందించారు. -
ఆడపిల్ల పుడితే రూ.5,116
● 18 ఏళ్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ ● ఘనాపూర్ సర్పంచ్ అభ్యర్థి హామీకొల్చారం(నర్సాపూర్): గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో ఓటర్లను ఆకర్షించేందుకు సర్పంచ్ అభ్యర్థులు హామీల వర్షం కురి పిస్తున్నారు. మండలంలోని చిన్న ఘనాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి చందా పురం మధుసూదన్ రెడ్డి.. గ్రామంలో ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్ల పుడితే ఆ బిడ్డ తల్లి పేరుతో బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీసులో రూ.5,116 ఫిక్స్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పథకం డిసెంబర్ 18 నుంచి అమలవుతుందని, 18 ఏళ్లు వచ్చేవరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని ప్రచారంలో చెప్పారు. ముద్దాపూర్ సర్పంచ్ అభ్యర్థి సైతం.. కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలం ముద్దాపూర్ గ్రామ సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థి తూం శ్రీకాంత్ ఓటరుల ను ఆకుట్టుకునేలా వినూ త్న నజరానా ప్రకటించారు. గ్రామ పంచాయతీ బీసీ జనరల్ కోటాలో రిజర్వుకాగా 451 మంది ఓటరులున్నారు. ఎన్నికల్లో సర్పంచ్‌గా ఆశీర్వదించి అవకాశమిస్తే పదవీ కాలం పూర్తయ్యే వరకు గ్రామంలో కుల, మతాలకు అతీతంగా ఆడపిల్ల పుట్టిన వెంటనే పాప పేరిట రూ.5,116 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి డిపాజిట్ పత్రాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తానని ప్రకటించారు. దీంతో పాటు పేద కుటుంబాల్లో ఆపద వచ్చినప్పుడు తమ వంతుగా రూ.5 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకున్నారు. గ్రామాభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తా.. చేర్యాల(సిద్దిపేట): తనను సర్పంచ్‌గా గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి కోరాడు. పదవి చేపట్టిన తరువాత తన కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి అక్రమ ఆస్తులు పెరిగినా, గ్రామ పంచా యతీ జప్తు చేసి ప్రజలకు పంచవచ్చని, మండల పరిధిలోని తాడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొడిగె నర్సింహులు బాండ్ రాశాడు. పనులు చేయడానికి ప్రజల వద్ద చేయి చాచని, పంచాయతీ సొమ్మును అక్రమంగా ఖర్చు చేయనని తెలిపాడు. తప్పుడు లెక్కలు చూపించి డబ్బులు వెనుకేసుకోనని, గ్రామ అభివృద్ధికి సేవకుడిగా పని చేస్తానని పేర్కొన్నాడు. ఆయన రాసిన బాండ్ పేపర్‌ను గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. -
కుటుంబాల్లో పంచాయతీ
● పచ్చని పల్లెల్లో ఎన్నికల చిచ్చు ● విడిపోతున్న పేగు బంధాలు ● దూరమవుతున్న బంధుమిత్రులు ● పోటీలో గురువు..శిష్యుడు ● వరుసకు బావ బామ్మర్దులు సంగారెడ్డి: ‘స్థానిక’ఎన్నికలు కుటుంబాల్లో ‘పంచాయితీ’ పెడుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ భరితంగా ఎన్నికలు జరుగుతున్నాయి. బంధువులు, పేగు బంధాలు, మిత్రులు ఒకరికొకరు అపార్థం చేసుకుంటూ వారి మధ్య చిచ్చు పెట్టుకుంటున్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యుల ఎంపికలు అన్నదమ్ములు, తోడికోడళ్లు, అత్తా కోడళ్లు బరిలో నిలుస్తూ వారి మధ్య దూరం పెంచుకుంటున్నారు. దగ్గర స్నేహితులు బరిలో నిలుస్తూ ఒకరికొకరు రాగాద్వేషాలను పెంచుకుంటూ వారి స్నేహ బంధానికి దూరమవుతున్నారు. ప్రజలందరూ ఎలాంటి మనస్పర్ధలకు వెళ్లకుండా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మాదిరిగా జీవించేది పోయి ఒకరికొకరు దూషణలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలు ఆందోళనకరంగా మారాయి. గ్రామ ప్రజలందరూ ఎలాంటి రాగాద్వేషాలకు వెళ్లకుండా స్నేహపూర్వకంగా మంచి మనసుతో ఆలోచనలు చేసి పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. అలాగే అధికారులు సైతం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రామ ప్రజలు యూత్, ఓటర్లందరూ సంయమనం పాటించి ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆకాంక్షిద్దాం. నాడు సతులు.. నేడు పతులుటేక్మాల్(మెదక్): టేక్మాల్ మేజర్ పంచాయతీ ఎన్నికల్లో గురువు, శిష్యుడి మధ్య పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో టేక్మాల్‌కు బీసీ మహిళ రిజర్వ్ కాగా వారి సతులను నిలబెట్టారు. రెండు ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నాయికోటి సుప్రజ గెలుపొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జనరల్ రిజర్వేషన్ రావడంతో రిటైర్డ్ ఉప విద్యాధికారి కాంగ్రెస్ అభ్యర్థి తిమ్మిగారి సుధాకర్, గులాబీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యదర్శి నాయికోటి భాస్కర్ మధ్య పోటీ తీవ్రంగా సాగుతుంది. వీరిద్దరూ గురువు శిష్యులు, అంతేకాకుండా వరుసకు బావ బామ్మర్దులు. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరున్న టేక్మాల్‌లో మాత్రం ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థులు గెలవలేదు. అధికార పార్టీ అభ్యర్థి సుధాకర్ గెలిస్తే రికార్డు బ్రేక్ చేస్తారా? లేదా బీఆర్ఎస్ అభ్యర్థికే పట్టంకట్టి గెలిపిస్తారో వేచి చూడాలి. సుధాకర్భాస్కర్తండ్రి కొడుకు మధ్య వార్వెల్దుర్తి(తూప్రాన్): పంచాయతీ ఎన్నికలు సాధారణ కుటుంబాలను విభజిస్తున్నాయి. మండలంలోని శంశిరెడ్డిపల్లి తండాలో సర్పంచ్ స్థానంతో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు తీర్మానం చేశారు. సర్పంచ్‌గా బానోత్ గణేశ్, ఉపసర్పంచ్‌గా ఆనబోయిన నర్సింలుతో పాటు మిగిలిన వార్డులకు సభ్యులను నిర్ణయించారు. నామినేషన్లకు చివరిరోజైన శుక్రవారం సాయంత్రం గ్రామస్తుల తీర్మానం మేరకు గణేశ్ సర్పంచ్‌గా, మిగిలిన సభ్యులు వార్డు మెంబర్లు నామినేషన్లు వేయడానికి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గణేశ్ కుమారుడు వినోద్ నేను సర్పంచ్‌గా ఉంటానంటూ నామినేషన్ వేయడానికి సంబంధిత పత్రాలను తీసుకోవడానికి ప్రయత్నించాడు. నేను ఉండగా నీవు సర్పంచ్‌గా ఎలా నామినేషన్ వేస్తావంటూ తండ్రి ప్రశ్నించాడు. గణేశ్ సర్పంచ్‌గా ఉంటేనే తాము ఏకగ్రీవానికి అంగీకరిస్తామని, కుమారుడిని అంగీకరించబోమంటూ తండావాసులు స్పష్టం చేశారు. దీంతో తండ్రి కుమారుడి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కోపంతో వినోద్ తన చేతిలోని నామినేషన్ పత్రాన్ని చించివేసి గందరగోళం సృష్టించాడు. చివరికి పోలీసులు అడ్డుకొని యువకుడికి సర్దిచెప్పడంతో బయటకు వెళ్లిపోయాడు. అన్నదమ్ముల మధ్య పోరుకౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని కూకుట్లపల్లి సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములు నామినేషన్లు వేశారు. గ్రామం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నీరుడి అశోక్ నామినేషన్ వేయగా, అతని తమ్ముడు కుమార్ బీఆర్ఎస్ మద్దతుదారుగా నామినేషన్ దాఖలు చేశారు. కాగా అశోక్ ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసి మెదక్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుమార్ ఇంటి వద్దే వ్యవసాయంతో పాటు ఇతర పనులు చేస్తున్నాడు. కాగా వీరి మధ్య పోటీ గ్రామంలో ఆసక్తికరంగా మారింది. అశోక్‌కుమార్ -
ఖర్చులేని ప్రచారం
ప్రచార సాధనాలుగా వాట్సాప్ గ్రూపులు జహీరాబాద్ టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియా ద్వారా ఖర్చు లేకుండా వీడియోలు, ఫొటోలను పోస్టు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. చాలా పల్లెల్లో ఇప్పటికే గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. సర్పంచ్‌గా గెలిస్తే గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి గురించి అందులో వివరిస్తున్నారు. కొంత మంది ఇంతకుముందు చేపట్టిన ప్రగతి పనుల వీడియోలను షేర్ చేస్తున్నారు. గతంలో చేసిన సేవా కార్యక్రమాల ఫొటోలను సైతం గ్రూపులో పెడుతున్నారు. రోజువారీ ప్రచారం కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తున్నారు. చేపట్టిన అభివృద్ధి పనుల వీడియోలు కూడా పెడుతున్నారు. తనను గెలిపించాలని, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటూ హామీలు ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళా వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేశారు. వీటిలో మహిళా కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమాని గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రచారం ఖర్చులేకుండా జోరుగా సాగుతుంది. -
విత్తన కంపెనీలో ఇంటి దొంగలు
ములుగు(గజ్వేల్): తాము పనిచేస్తున్న విత్తన కంపెనీలోనే విత్తనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇంటి దొంగల గుట్టును పోలీసులు రట్టు చేశారు. బయటి వ్యక్తులతో ముఠాగా ఏర్పడి విత్తనాలను బయటకు పంపుతున్న నిందితుల్లో పలువురిని అరెస్టు చేశారు. ములుగు మండలం కొత్తూరు నూజివీడ్ సీడ్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, ములుగు ఎస్ఐ రఘుపతి విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ములుగు మండలం కొత్తూరు సమీపంలోని నూజివీడ్ విత్తన పరిశ్రమలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, కొందరు ఉద్యోగులు బయటి వ్యక్తులతో కలసి రూ.57.50 లక్షల విలువ చేసే 9,968 కిలోల మొక్కజొన్న విత్తనాలను దొంగతనంగా బయటకు పంపించారు. గత నెల 29న కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అందిన సమాచారం మేరకు పోలీసులు కంపెనీ వద్ద గురువారం సాయంత్రం నిఘా ఉంచారు. కంపెనీ నుంచి విత్తనాలు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పందిరి రమేశ్, మాజీ ఉద్యోగి పెద్దిరెడ్డి సురేశ్, కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన బస్సీ యశ్వంత్, సోహెల్‌ను పట్టుకొన్నారు. నిందితులను విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఈ నేరంతో సంబంధం ఉన్న మరికొంత మందిని అరెస్టు చేశామని, కొందరు పరారీలో ఉన్నట్టు ఆయన తెలిపారు. అరెస్టయిన వారి నుంచి రూ.3,29,500; 12 మొబైల్ ఫోన్లు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులను కోర్టులో హాజరు పర్చామని, మిగతా వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ మహేందర్ తెలిపారు. గుట్టురట్టు చేసిన పోలీసులు పలువురు నిందితుల అరెస్టు, పరారీలో మరికొందరు రూ.3.29 లక్షలు, 12 మొబైల్ ఫోన్లు, 3 వాహనాలు స్వాధీనం కొత్తూరు నూజివీడ్ విత్తన కంపెనీలో ఘటన -
రేషన్ బియ్యం లారీ పట్టివేత
● 300 క్వింటాళ్లుగా గుర్తించిన విజిలెన్స్అధికారులు ● నెల రోజుల వ్యవధిలో మూడోసారితూప్రాన్: రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ లారీని అధికారులు సీజ్ చేశారు. సివిల్ సప్లై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు శుక్రవారం తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం కలిగిన లారీని పట్టుకున్నారు. వరుసగా రెండో రోజు రేషన్ బియ్య పట్టుబడటం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. నెల రోజుల వ్యవధిలో మూడు లారీల్లో భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం విశేషం. రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నుంచి గుజరాత్‌కు 300.90 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ శివానందం, సివిల్ సప్లయ్ రాష్ట్ర విజిలెన్స్ డీఎస్పీ రమేశ్‌రెడ్డి, సీఐ అజయ్‌బాబు, ఇన్స్పెక్టర్ నర్సింహులు ఆధ్వర్యంలో తూప్రాన్ బైపాస్ మార్గంలో వెళ్తున్న లారీని గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు. లారీని తనిఖీ చేసి రేషన్ బియ్యంగా గుర్తించారు. డ్రైవర్ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
గెలిపిస్తే.. ప్రతి ఇంటికి వైఫై
● ఆసక్తికరంగా మ్యానిఫెస్టో.. ● విద్యార్థులకు ట్యాబ్‌లు.. ● యువత, మహిళలకు ఉపాధి ● పంచాయతీ బరిలో అభ్యర్థి హామీలు సంగారెడ్డి టౌన్: ఒకప్పుడు పల్లెల్లో రాజకీయాలంటే పెద్దల పెత్తనాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు. ఇది ఎన్నికల ఉత్సాహం మాత్రమే కాదు, గ్రామాల్లో నాయకత్వ మార్పునకు, అభివృద్ధిలో భాగస్వామ్యానికి యువత ముందుకు వస్తున్నామని చెబుతున్నారు. సంగారెడ్డి మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులుగా అక్కడక్కడ యువకులు పోటీ పడుతున్నారు. మండలంలోని పసల్వాది గ్రామంలో 27 ఏళ్ల యువకుడు హరి ప్రసాద్ ముదిరాజ్ ఎంబీఏ పూర్తి చేశాడు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పంచభూతాల సాక్షిగా ఐదు హామీలు అంటూ మ్యానిఫెస్టో విడుదల చేశాడు. పట్టణాలకు దీటుగా తన గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని సరికొత్తగా ఎన్నికల వ్యూహాన్ని రచించి ముందుకు వెళుతున్నాడు. తాను గెలిస్తే గ్రామంలో ఇంటింటికి ఉచిత వైఫై, విద్యార్థులకు ట్యాబ్‌లు, యువతకు ఉపాధి, మహిళలకు ఉపాధి శిక్షణ, గ్రామంలో బస్సులు ఆగేలా బస్ స్టాప్, వివిధ రకాల సదుపాయాలు కల్పిస్తానని సరికొత్త మ్యానిఫెస్టోను రూపొందించుకొని ప్రచారం నిర్వహిస్తున్నాడు. దీంతో మండల వ్యాప్తంగా ఈ యువకుడి ప్రచారం ఆసక్తిని కలిగిస్తోంది. -
యువతి అదృశ్యం
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి రత్నాపూర్లో యువతి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన బొగ్గుల వెంకటేశ్ కూతురు శ్రావణి గురువారం అదే గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి బయటకు వెళ్లింది. కానీ ఆమె అక్కడికి వెళ్లలేదని తెలుసుకొన్న ఆ కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో యువతి తండి వెంకటేశ్ శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్పారు. -
పదవి వచ్చే.. పొలం పాయే
● గత సర్పంచ్ల పరిస్థితి ● ప్రస్తుతం ఎన్నికల ఖర్చుకు వెనకాడని అభ్యర్థులు మునిపల్లి(అందోల్): ‘మండంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి గత పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టకు పోయి సర్పంచ్‌గా తన భార్యను గెలిపించుకున్నాడు. అనంతరం ఖర్చుకు వెనకాడక ఐదేళ్లలో సుమారు 3 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని అమ్ముకున్నాడు. సర్పంచ్‌గా తన భార్యను గెలిపించి పంతం నెగ్గించుకున్నాడే తప్ప, అస్థిని కాపాడుకోలేక పోయారు’. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారి పరిస్థితి గెలిస్తే అందలం, ఒడితే పాతాళం అన్న మాదిరిగా తయారైంది. బలమైన అభ్యర్థులతో పోటీ అంటే అషామాషి కాదు. రాజకీయంలో పడి అప్పులు చేసి ఎన్నికల్లో గెలవాలనే పంతం పెట్టుకుంటున్నారు. రాజకీయ అనుభవం లేని వారు కొందరైతే, రాజకీయంగా సంవత్సరాల తరబడి అన్ని రకాలుగా ఉన్నవారు కొందరు. సర్పంచ్ పదవి కోసం మండలంలోని ఆయా గ్రామాల్లోని 8 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల మద్దతుతో సర్పంచ్, వార్డు సభ్యులు పోటీ చేస్తున్నారు. ఈనెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన ఎన్నికల ఖర్చు 14వ తేదీ వరకు ఖర్చు పెట్టడం అభ్యర్థులకు తలకుమించిన భారంగా మారవచ్చు. దీంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న కొందరు తమకు తెలిసిన వారి దగ్గరల్లా అప్పులు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలో గెలిస్తే 5 సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్‌గా గ్రామాభివృద్ధి చెద్దామనే అశతో కొందరు. రాజకీయమంటే తెలియని వారు అందలం ఎక్కుతామనే భావనలో ఇంకొందరు అభ్యర్థులున్నారు. మరికొందరు బంగారంతో పాటు స్నేహితుల దగ్గర అత్తమామల దగ్గర అప్పులు చేస్తూ గ్రామంలో గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మరోసారి అనుకూలంగా రిజర్వేషన్ రాకపోవచ్చని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సమయం ఇదేనని అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. -
అదృశ్యమై.. శవమై..
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి వెల్దుర్తి(తూప్రాన్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించింది. ఈ ఘటన మండలంలోని మెల్లూర్ పంచాయతీ పరిధి పెద్దాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దాసరి నర్సమ్మ(38) సత్తయ్యలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఇంట్లో జరిగిన గొడవలతో ఈ నెల 3న ఉదయం నర్సమ్మ బయటకు వెళ్లింది. రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికి శుక్రవారం మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ క్రమంలో సాయంత్రం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో పశువులకాపర్లు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు చెప్పారు. కాగా మృతురాలు నర్సమ్మగా గుర్తించారు. మృతురాలి మెడకు తాడు బిగించి ఉండటంతో హత్యకు గురికావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై మృతురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, వెల్దుర్తి ఎస్ఐ రాజు పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
వామ్మో.. మళ్లీ పోటీనా.!
జంకుతున్న తాజా మాజీ సర్పంచ్‌లు● లక్షలు పెట్టి గెలిచి.. ఆస్తులు అమ్ముకోవడమే.. ● పోటీకి ఆసక్తి చూపని వైనం దుబ్బాక: తమకు అవకాశం ఉన్నా మళ్లీ పోటీ చేసేందుకు తాజా మాజీ సర్పంచ్‌లు జడుసుకుంటున్నారు. చాలా గ్రామాల్లో తమకు అనుకూలంగానే రిజర్వేషన్లు వచ్చినప్పటికీ తాజా మాజీలు పోటీ చేసేందుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దీనిపై పలు గ్రామాల్లో సాక్షి ఆరా తీయగా లక్షలు పెట్టి సర్పంచ్‌లుగా గెలిచి ఉన్న ఆస్తి పాస్తులు అమ్ముకున్నాం.. అప్పుల పాలయ్యామంటూ పలువురు తాజా మాజీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు చాలా తారుమారయ్యాయి.. పైసలు ఉంటేనే పదవులు వస్తాయి తప్పా.. ఏదో చేస్తామంటూ తొందరపడి పోటీచేస్తే అంగి, లాగే మిగులుతుందని మరేం ఉండదంటూ తమ అనుభవాలు చెప్పారు. అప్పుల పాలయ్యాం... తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చినా మళ్లీ పోటీ అంటేనే చాలా మంది తాజా మాజీ సర్పంచ్‌లు జడుసుకుంటున్నారు. కొంతమంది పదవిపై వ్యామోహంతో పోటీకి సిద్ధం కాగా వారి కుటుంబాల్లో (భార్య,పిల్లలు) నామినేషన్ వేస్తే తాము ఇంట్లో ఉండమని, చస్తామంటూ బెదిరించిన సంఘటనలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికే సర్పంచ్ అయి అప్పుల పాలయ్యాం.. మళ్లీ ఆ పొరపాటు చేయమంటూ చాలా మంది పోటీకి దూరంగానే ఉంటున్నారు. తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు పెట్టిన డబ్బులే దిక్కులేవని.. ఆ పైసలు ప్రభుత్వం ఇస్తే భార్యాపిల్లలతో హాయిగా ఉంటామని తాజా మాజీ సర్పంచ్‌లు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఎనుకట మా తాత సర్పంచ్‌గా చేసిండంటా.. ఇప్పుడు నేను సర్పంచ్ అవుతానంటూ చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి గతంలో సర్పంచ్‌లుగా గెలిచి ఆస్తులు అమ్ముకున్న వారు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న గ్రామానికి (500 ఓట్ల లోపు ఉన్న) సర్పంచ్ కావాలంటే కనీసం రూ.15 లక్షల కంటే ఎక్కువగా ఖర్చు పెట్టాలి. అంత ఖర్చు పెట్టిన గెలిచేది నమ్మకం తక్కువ అంటూ పలువురు మాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇతర పంటలు చేతికి రావడం లేదని..
ఇతర పంటలు సాగు చేసుకున్నా వాతావరణం అనుకూలించక చేతికి అందడం లేదు. చెరకు పంటను వేసుకుంటే ఎంతో కొంత చేతికి వస్తుందనే ఆశతో 10 ఎకరాలు చెరకు పంటను సాగు చేశాను. మొదటి పంట 30 టన్నులు వచ్చే పరిస్థితి లేదు. రెండో పంట 25 టన్నుల లోపునే వస్తోంది. ఇది పెట్టుబడులకే సరిపోతోంది. – హద్నూర్ ఓనంరెడ్డి, పస్తాపూర్ భూసారం తగ్గడంతోనే.. భూముల్లో సారం తగ్గడం వల్లే పంట దిగుబడులు రావడం లేదు. రైతులు సారం పెంచుకునేందుకు శ్రద్ధ చూపాలి. ప్రెస్మడ్డిని ప్రతిఏటా భూమిలో వేసుకోవడం, పచ్చిరొట్టెకింద జనుము వేసుకోవడం, అవసరం మేరకు పశువుల ఎరువులు వేసుకున్నట్లయితే పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. – రాజశేఖర్, కేన్ అసిస్టెంట్ కమిషనర్ -
చెరుకు దిగుబడులు అంతంతే!
జహీరాబాద్: చెరకు పంట దిగుబడులు ఆశించిన మేర రాక పోవడం రైతులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతం పెట్టుబడులు అధికంగా పెట్టాల్సి వస్తోందని, దిగుబడులు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఎకరానికి చెరకు పంట ల్యాప (మొదటి పంట) 45 నుంచి 55 టన్నులు, మోడెం (రెండోపంట) 35 నుంచి 45 టన్నుల మేర దిగుబడులు వస్తేనే గిట్టుబాటవుతుందని రైతులు పేర్కొంటున్నారు. చెరకు పంట నాటి నప్పటి నుంచి కోత వరకు దుక్కి దున్నడం, ఎరువులు, నీటి తడులు అందించడం, కట్టుకట్టడం, మినీ ట్రాక్టర్‌తో బోదెలు తీసి అంతర కృషి చేయడం, కోత కోయడం తదితర ఖర్చులు అధికం అవుతున్నాయని రైతులు అంటున్నారు. చేతికి వచ్చిన పంటలో 30 శాతానికి పైగా చెరకు కోత, రవాణా కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. దుక్కి దున్నకం నుంచి కోతవరకు 40 శాతం మేర పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. దీంతో చెరకు పంట ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొదటి పంట 36 టన్నులు, రెండో పంట 28 టన్నుల మేర సగటు దిగుబడులు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో మాత్రం కొంత మంది రైతులు కేవలం 25 టన్నుల దిగుబడులు మాత్రమే సాధిస్తుండగా కొందరు రైతులు 50 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారు. ఏడాది పొడువున ఒకటే పంట వస్తోందని, స్వల్ప కాలిక పంటలు అయితే మూడు పంటలు తీసుకునే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాలలో 14 నెలల వరకు కూడ చెరకు కోత కోయడం సాధ్యం కావడం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెరకు పంట ఏ మాత్రం గిట్టుబాటుగా లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరి–గంగా కర్మాగారం టన్నుకు రూ.3,800 ధరను పక్రటించించగా, గణపతి కర్మాగారం రూ.3,826.20, మాగిలోని కర్మాగారం 3,726 ధరను ప్రకటించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అధిక పెట్టుబడులు అవుతున్నందున టన్నుకు రూ.5వేలు ధర ఉంటేనే గిట్టుబాటవుతుందంటున్నారు. అధిక వర్షాలు దిగుబడులపై ప్రభావం ఈ ఏడాది అధిక వర్షాలు కురియడం వల్ల చెరకు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెరకు గడల మధ్యలో బెండు(సొట్ట) ఏర్పడిందని, దీంతో చెరకు బరువు రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. అధిక వర్షాల వల్ల భూముల్లో నీరు నిల్వ ఉండి దిగుబడులు పడిపోయేందుకు కారణంగా చెబుతున్నారు. జహీరాబాద్ నియోజకరవర్గంలో 9లక్షల టన్నుల చెరకు పంట ఉన్నట్లు, అందులో సగం పంట 25 టన్నుల దిగుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.అధిక వర్షాలే కారణం సగటులో ల్యాప ఎకరాకు 36 టన్నులు, మోడెం 28 టన్నులు గిట్టుబాటు కావడం లేదంటున్న రైతులు -
ఔరా.. ఇదేం రాజకీయం..!
నాడు, నేడు భార్యాభర్తలే పోటీదారులు ● 11 చోట్ల ఒకరి స్థానంలో మరొకరుహత్నూర (సంగారెడ్డి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. గతంలో సర్పంచ్‌గా పనిచేసే వారే మళ్లీ తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపుతున్నారు. భర్తలు నిలిచిన చోట భార్యలు.. భార్యలు నిలిచిన భర్తలు పోటీ చేస్తున్నారు. దీంతో ఔరా ఇదేమి రాజకీయం అంటూ స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో 38 పంచాయతీలు ఉండగా, నాలుగు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 34 పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. 11 గ్రామాల్లో సర్పంచ్ బరిలో గతంలో భార్య సర్పంచ్‌గా ఉన్నవారు నేడు భర్తలు పోటీ చేస్తున్నారు. భర్తలు సర్పంచ్‌గా ఉన్న పంచాయతీల్లో ప్రస్తుతం భార్యలు బరిలో నిలిచారు. గతంలో దౌల్తాబాద్ గ్రామ సర్పంచ్‌గా కొన్యాల వెంకటేశం పనిచేయగా, ప్రస్తుతం భార్య విజయలక్ష్మి బరిలో ఉన్నారు. ఇదే పంచాయతీలో ఎంపీపీగా పనిచేసిన వావిలాల నర్సింహులు.. ప్రస్తుతం తన భార్య సంగీత సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్నారు. నూతనంగా మధుర గ్రామం పంచాయతీగా ఏర్పడటంతో గతంలో గౌండ్ల మాధవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం భర్త నవీన్‌గౌడ్ సర్పంచ్ బరిలో ఉన్నారు. గోవిందరాజుపల్లిలో బండమీది సునీత సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం భర్త రాజు పోటీ చేస్తున్నారు. చిక్ మద్దూర్ సర్పంచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి ఉండగా, ప్రస్తుతం భార్య ప్రవీణ బరిలో ఉన్నారు. ముచ్చర్లలో అనిత సర్పంచ్‌గా ఉండగా ప్రస్తుతం భర్త యాదగిరి పోటీ చేస్తున్నారు. నస్తీపూర్ సర్పంచ్‌గా వరిగుంతం రాములు పనిచేయగా, ప్రస్తుతం భార్య సువర్ణ సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. సాదుల్‌నగర్ సర్పంచ్‌గా నాడు మాలతి పనిచేయగా, ప్రస్తుతం భర్త భాస్కర్‌గౌడ్ బరిలో నిలిచారు. కొత్తగూడెంలో గతంలో లకావత్ మాధవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండోసారి మాధవి ఎన్నికల బరిలో నిలిచారు. కొన్యాల సర్పంచ్‌గా పనిచేసిన సుజాత ప్రస్తుతం తిరిగి రెండోసారి పోటీలో నిలబడ్డారు. కొడిపాక సర్పంచ్‌గా గతంలో పనిచేసిన గొల్ల మాధవి ప్రస్తుతం మళ్లీ బరిలో నిలిచారు. లింగాపూర్ సర్పంచ్‌గా తల్లి లక్ష్మీ గతంలో పనిచేయగా, ప్రస్తుతం తనయుడు మణిదీప్ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇలా మండలంలో ఒకే కుటుంబం నుంచి భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు బరిలో నిలబడి తమ భవిష్యత్‌ను ప్రజల ముందు ఉంచారు. -
భూమి ఆరోగ్యంగా ఉంటేనే..
జహీరాబాద్: భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆశించిన మేర పంట దిగుబడులు సాధ్యమని డీడీఎస్–కేవీకే శాస్త్రవేత్త సి.వరప్రసాద్ అన్నారు. శుక్రవారం కేవీకేలో నిర్వహించిన మట్టి దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు భూముల సారాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అప్పుడే సాగు చేసుకున్న పంటలు మంచి దిగుబడులను సాధించగలుగుతారని పేర్కొన్నారు. డీడీఎస్–కేవీకే నుంచి ఇప్పటి వరకు 24128 మట్టి నమూనాలు పరీక్షించడం జరిగిందన్నారు. ఇందులో 23710 భూసార పరీక్షలు చేసి రైతులకు అందించామన్నారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని దానికి తగ్గట్టుగా ఎరువుల యాజమాన్యం చేసుకుని భూమి ఆరోగ్యం పెంచుకునేలా కృషి చేయాలని వివరించారు. భూమి ఆరోగ్యంగా ఉండేలా సేంద్రియ ఎరువులు వేసుకోవాలని, వర్షాకాలంలో పచ్చిరొట్టె కింద జనుము వేసుకోవాలని, జీవన ఎరువులను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సాయిప్రియాంక, ఎన్.స్నేహలత, జి.శైలజ, వి.రమేష్, ఎం.హేమలత, కై లాష్, భూసార పరీక్షల నిపుణుడు ఇ.స్వామి, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి దిగుబడులకు ఆస్కారం మట్టి పరీక్షలు తప్పని సరి శాస్త్రవేత్త వరప్రసాద్ -
సర్పంచ్ బరిలో ఫీల్డ్ అసిస్టెంట్
ఉద్యోగానికి రాజీనామా న్యాల్కల్(జహీరాబాద్): సర్పంచ్ పదవి కోసం నాయకులతో పాటు చిరుద్యోగులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఎలాగైనా గెలువాలనే ఉద్దేశంతో కొందరు చిరుద్యోగులు రాజీనామాలు సైతం చేస్తుండగా మరి కొందరు తమ సతులను బరిలోకి దింపుతున్నారు. న్యాల్కల్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామానికి చెందిన ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్ కొనదొడ్డి సుకుమార్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు.నామినేషన్ కూడా వేశారు. ఇదిలా ఉండగా మండల పరిధిలోని అమీరాబాద్కు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తన సతీమణిని సర్పంచ్ బరిలోకి దింపారు. ముగిసిన మూడో విడత నామినేషన్లుసంగారెడ్డి జోన్: పంచాయతీ సమరానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మూడు విడతలలో క్లస్టర్ల వారిగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. చివరి విడతలో భాగంగా ఆఖరి రోజు జోరుగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. జిల్లాలో 613 గ్రామపంచాయతీలు, 5370 వార్డు స్థానాలు ఉన్నాయి. రెండో విడతలో స్వీకరించిన నామినేషన్ల అభ్యర్థుల స్కూటీని ఇప్పటికే పూర్తి చేశారు. శనివారం మధ్యాహ్నం 3:00 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 3 గంటల తర్వాత పోటీ అభ్యర్థుల తుది జాబితాతో పాటు వారికి గుర్తులు సైతం ప్రకటిస్తారు. కాగా, మూడో విడతలో సర్పంచ్ పదవికి 356, వార్డు స్థానానికి 791 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చివరి రోజు నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఐదు గంటల లోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి స్వీకరణ ప్రక్రియ జరిగింది. 19 నుంచి గీతంలో అంతర్జాతీయ సదస్సుఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్చెరు: దేశంలోని ప్రయోగశాల జంతు శాస్త్రవేత్తల సంఘం సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధన’ పేరిట అంతర్జాతీయ సదస్సు ఈనెల 19నుంచి 20 తేదీలలో నిర్వహించనున్నారు. అలాగే ఈ 13వ అంతర్జాతీయ ప్రీక్లినికల్ సదస్సుకు ముందు డిసెంబర్ 18న వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహక కార్యదర్శులు డాక్టర్ సుహాసిన్, డాక్టర్ ఎంజే మహేష్ కుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ వర్క్ షాప్‌లో ప్రీక్లినికల్ పరిశోధన నాణ్యతను పెంపొందించడం, శాసీ్త్రయ అధ్యయనాల్లో ప్రయోగశాల జంతువుల నైతిక, మానవీయ, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలు, పేర్ల నమోదు కోసం వెబ్ సైట్లను సందర్శించాలని సూచించారు. అర్థమయ్యేటట్లు బోధించాలిసదాశివపేట(సంగారెడ్డి): టీఎల్ఎం, నూతన పద్ధతుల్లో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించాలని, అప్పుడే విద్యార్ధులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారని జిల్లా విద్యా శాఖాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సదాశివపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుడు బోధి స్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా ప్రతి తరగతిలో విద్యార్ధులతో తెలుగు, ఆంగ్లం చదివించాలని కోరారు. గణితంలో చదుర్విద ప్రక్రియలు తప్పనిసరిగా రావాలన్నారు. అయితే.. నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట సీఎంఓ వెంకటేశం, ఎంఈఓ శంకర్ పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకుంటే పోస్టల్ బ్యాలెట్ మెదక్ కలెక్టరేట్: పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యా లెట్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణ తీరుపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తు పరిశీలించి తప్పనిసరిగా అర్హులకు పోస్టల్ బ్యాలెట్ అందించాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్‌ను నియమించాలన్నారు. -
డీపీఓ సాయిబాబ సస్పెన్షన్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబను సస్పెండ్ చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ ఎంప్లాయిమెంట్ డైరెక్టర్ జి.శ్రీజన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎంతో కీలకమైన జిల్లా పంచాయతీ అధికారిపై సస్పెన్షన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. డీపీఓ తరచూ సెలవుపై వెళుతున్నారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆగస్టులో తొమ్మిది రోజులు, అక్టోబర్‌లో 15 రోజులు, ఈ నెలలో మూడు రోజులు సెలవుపై వెళ్లారు. వీటికి తోడు ఆయనపై కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కూడా ఆయన సెలవుపై వెళ్లడం పట్ల కలెక్టర్ ప్రావీణ్య తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికపై పంపినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. జెడ్పీ సీఈఓకు బాధ్యతలు జిల్లా పంచాయతీ అధికారి (ఇన్చార్జి)గా జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జానకిరెడ్డి శనివారం పదవీబాధ్యతలు తీసుకోనున్నారు. ఎన్నికల వేళ కీలక అధికారిపై వేటు అధికార వర్గాల్లో చర్చనీయాంశం ఇన్చార్జి డీపీఓగా జానకిరెడ్డి -
ఓట్ల వేలంపై సీరియస్
కల్హేర్(నారాయణఖేడ్): మండలంలోని ఫత్తేపూర్‌లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం కుల సంఘం ఓట్ల కోసం వేలం విషయమై అధికారులు సీరియస్ అయ్యారు. శుక్రవారం కల్హేర్‌లో నామినేషన్ కేంద్రాలు తనిఖీ చేసేందుకు వచ్చిన నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి అధికారులతో ఆరా తీశారు. ఓ కుల సంఘం ఓట్ల కోసం రూ.10 లక్షలకు వేలం జరిగిందనే పత్రికల్లో వచ్చిన వార్తలపై చర్చించారు. తహసీల్దార్ శివశ్రీనివాస్, ఎంపీడీఓ మహేశ్వర్‌రావు, ఎస్ఐ రవిగౌడ్‌తో మాట్లాడారు. వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇబ్బందులు లేకుండా చూడండి నారాయణఖేడ్: మండలంలోని వెంకటాపూర్ క్లస్టర్‌ను శుక్రవారం పంచాయతీ ఎన్నికల జిల్లా సాధా రణ పరిశీలకుడు కార్తీక్ రెడ్డి, సబ్‌కలెక్టర్ ఉమాహారతి సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అప్పటివరకు దాఖలైన నామినేషన్ల సంఖ్యను తెలుసుకుని నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారివెంట ఖేడ్ ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.విచారణకు సబ్‌కలెక్టర్ ఆదేశం -
గ్రామాల రూపురేఖలు మారుస్తా
● మంత్రి దామోదర ● కాంగ్రెస్‌లో పలువురు బీఆర్ఎస్ నేతల చేరిక మునిపల్లి(అందోల్): ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం మండలంలోని గార్లపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులను పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల రూపురేఖలు మారుస్తానని చెప్పారు. పార్టీలకతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రహదారుల రూపురేఖలు మారుస్తామన్నారు. తక్కడపల్లి, గార్లపల్లి మధ్య సింగూరు బ్యాక్ వాటర్‌పై వంతెన ఏర్పాటుతో పాటు బుదేరా నుంచి రాయికోడ్ మండలం సీరూర్ గ్రామం వరకు డబుల్ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తాటిపల్లి నుంచి మక్తక్యాసారం గ్రామం వరకు డబుల్ రోడ్డు ఏర్పాటుకు ఇప్పటికే నిధులు మంజూరైనట్లు తెలిపారు. కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న దామోదర -
లోకల్ మేనిఫెస్టో
నారాయణఖేడ్: గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం కావడంతో పల్లెల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. మొదటి, రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా మూడో విడత నామినేషన్ల పర్వం 5వ తేదీతో ముగియనుంది. పోటీలో నిలిచిన, ఇంకా విత్‌డ్రాలు కాకుండా పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు సొంత మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నారు. తాము గెలుపొందితే గ్రామానికి ఫలానా అభివృద్ధి చేస్తామంటూ సొంత మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యావంతులకు సౌకర్యం కల్పిస్తామని చెబుతున్నారు. మరికొందరు పాఠశాల అభివృద్ధి, వీధుల్లో చేపట్టే ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. కుల, యువజన సంఘాలు, మిత్రుల గ్రూపులకు ఫలానా పనులు చేస్తామంటూ చెబుతున్నారు. ఇలా ఆయా వర్గాల వారీ ఓట్లు గంపగుత్తగా వేసుకొనేందుకు తమ ప్రచారాన్ని పదును పెడుతున్నారు. ఓటర్ల నాడిని పసిగట్టి అందుకు అనుగుణంగా హామీలు గుప్పిస్తున్నారు. తాయిలాలకూ సిద్దం.. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో ఓటర్లకు తాయిలాలు మాట్లాడుతున్నారు. కులాలు, సంఘాలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు సంసిద్ధతను చూపుతున్నారు. అభ్యర్థులు ఫలానా సంఘం, కులం ఓట్లు తమ ఖాతాల్లో పడ్డాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లక్షల్లో అప్పులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. సంఘాలకు వంట సామగ్రి, టెంటు, ఇతర వస్తువులు సైతం ఇస్తామంటూ పేర్కొంటూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. కొందరు భూములు, బంగారం తాకట్టుపెట్టి అప్పులు తీసుకుంటున్నారు. గ్రామాల్లో మామూలు పంచాయతీలో రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల దాకా, పెద్ద పంచాయతీల్లో 15లక్షల నుంచి ఆపైగా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. స్థాయికి మించి అప్పులు.. పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందితే సంపాదించేది ఏమో కానీ స్థాయికి మించి అప్పులు చేస్తున్నారు. గత టర్మ్‌లో సర్పంచ్‌లుగా పనిచేసిన వారిలో చాలా మంది చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలయ్యారు. వారి పదవీకాలం పూర్తయి రెండేళ్లు గడచినా ఇంకా బిల్లులు రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయ వనరులు ఉన్న కొన్ని పంచాయతీల్లో మాత్రమే సర్పంచ్‌లు నాలుగు డబ్బులు సంపాదించొచ్చు కానీ మెజార్టీ గ్రామాల్లో సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారు. గత టర్మ్ పరిస్థితులు చూసి కూడా ఇప్పుడు చాలా మంది ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు తహతహలాడుతూ స్థాయికి మించి ఖర్చు చేస్తున్నారు. పల్లెల్లో జోరందుకున్న కుల సమీకరణలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పోటా, పోటీ కార్యాచరణ ఆయా సంఘాలకు తాయిలాలు -
బరిలో 3243 మంది
సంగారెడ్డి జోన్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడతలో 3,243 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రకటించింది. మొదటి విడతలో భాగంగా జిల్లాలో 136 సర్పంచ్, 1,246 వార్డు స్థానాలు ఉన్నాయి. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 149 సర్పంచ్, 215 వార్డు స్థానాల నుంచి అభ్యర్థులు బరి నుంచి తప్పుకున్నారు. 7 గ్రామ పంచాయతీలు, 113 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 129 సర్పంచ్, 1133 వార్డు స్థానాలకు ఎన్నిక జరగనుంది. సర్పంచ్ కు 394, వార్డు స్థానాలకు 2,849 మంది అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. గుర్తుల కేటాయింపుతో ఊపందుకున్న ప్రచారం అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అనంతరం అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. సర్పంచ్, వార్డు స్థానానికి వేరువేరుగా గుర్తులను కేటాయిస్తూ క్లస్టర్ల వారిగా జాబితాలను విడుదల చేశారు. గుర్తులు రావటంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తక్కువ సమయం ఉండడంతో సమయం వృథా చేయకుండా ప్రచారంలో వేగం పెంచారు. అభ్యర్థులు పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. దీంతో గ్రామంలో రోజురోజుకీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఊపందుకున్న మొదటి విడత అభ్యర్థుల ప్రచారం గుర్తులు కేటాయించిన అధికారులు 7 సర్పంచులు..113 వార్డు స్థానాలు ఏకగ్రీవం వేడెక్కుతున్న పల్లె పోరు -
జీఎస్టీ ఎగవేత
● సర్కార్ ఖజానాకు భారీగా గండి ● విజిలెన్స్ తనిఖీలతో వెలుగులోకి అక్రమాలు రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇటీవల ముంబై హైవేపై వాహనాల తనిఖీలు నిర్వహించింది. జీఎస్టీ (వస్తు సేవల పన్ను) చెల్లించకుండా వివిధ రకాల సరుకులను అక్రమంగా రవాణా చేస్తున్న నాలుగు భారీ వాహనాలను పట్టుకుంది. వాణిజ్యపన్నుల శాఖకు వీటిని అప్పగించగా, వాటిని రూ.లక్షకు పైగా జరిమానాలు విధించారు. ఒక్క రోజు నిర్వహించిన తనిఖీల్లోనే నాలుగు వాహనాలు పట్టుబడ్డాయంటే.. నిత్యం ఎన్ని వాహనాలు ఇలా పన్నులు చెల్లించకుండా రవాణా అవుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తాజాగా బుధవారం చేసిన తనిఖీల్లో కూడా తొమ్మిది వాహనాలు జీఎస్టీ ఎగవేస్తున్న అక్రమ రవాణా చేస్తున్నవే ఉన్నాయి. వీటిని కూడా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించగా, రూ.2.30 లక్షల జరిమానా విధించినట్లు ఆశాఖ రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ ప్రకటించారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో జీరో దందా జోరుగా జరుగుతోంది. సర్కార్ ఖజానాకు జమ చేయాల్సిన జీఎస్టీని యథేచ్ఛగా ఎగవేస్తున్నారు. దీంతో సర్కార్ ఖజానాకు భారీగా గండి పడుతోంది. రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్వహిస్తున్న తనిఖీలో తరచూ జీఎస్టీ ఎగవేత వాహనాలు ఉండటం గమనార్హం. ఆకస్మికంగా ఒక్కసారి తనిఖీ చేస్తేనే పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడ్డాయంటే.. నిత్యం ఎన్ని వాహనాలు ఇలా జీఎస్టీని ఎగవేస్తూ సరుకులు రవాణా అవుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అధిక పన్ను రేటు జాబితాలో ఉన్న సరుకులు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ పన్ను విధానంలో సంస్కరణలు తెచ్చిన విషయం తెలిసిందే. విలాస వస్తువులతో పాటు, ఆరోగ్యానికి హాని చేసే గుట్కా, పాన్‌మసాల, పొగాకు జర్థా వంటి వస్తువులను 40 శాతం పన్ను రేటు పరిధిలోకి వచ్చాయి. అక్రమార్కులు ఇలాంటి అధిక పన్నుల కేటగిరీల్లో ఉన్న సరుకులను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తు సర్కార్ ఖజానాకు గండికొడుతున్నారు. పాన్‌మసాలపై ప్రస్తుతం 40 శాతం జీఎస్టీ ఉంది. అంటే ఒక్క వాహనంలో కనీసం రూ.25 లక్షల విలువ చేసే పాన్‌మసాల సరుకులు రవాణా చేస్తే.. ఇందుకు జీఎస్టీ రూ.16 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో వాహనం పన్ను చెల్లించకుండా అక్రమ రవాణా చేస్తుండటంతో సర్కార్ ఖజానాకు రూ.కోట్లలో గండిపడుతోంది.కర్నాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లో.. జిల్లాకు కర్నాటకతో పాటు, మహారాష్ట్ర రెండు అంతర్రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి నిత్యం సరుకులు రవాణా అవుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి రవాణా అయ్యే వాహనాలు ముంబై హైవే రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ హైవే ఇప్పుడు అక్రమ రవాణాకు రహదారిగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అల్లం రైతులకు ఊరట
జహీరాబాద్: ఎట్టకేలకు అల్లం ధర స్వల్పంగా పైకి ఎగబాకుతోంది. రెండేళ్ల నుంచి ధర పాతాళంలో ఉండడంతో రైతులు నష్టాలను చవిచూశారు. ప్రస్తుతం ధర పెరుగుతుండడం రైతులకు ఊరటనిస్తోంది. దీంతో పంటను సాగు చేసుకున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే జహీరాబాద్ నియోజకవర్గంలో అల్లం పంట అధికంగా సాగవుతోంది. ప్రతి ఏటా సుమారు 3వేల ఎకరాలకు పైగా పంట సాగవుతూ వస్తోంది. గత ఏడాది ధర పూర్తిగా పడిపోవడంతో పంట సాగు విస్తీర్ణం సగానికి సగం పడిపోయింది. జిల్లాలో ప్రస్తుతం సుమారు 1,200 ఎకరాల్లో పంట సాగులో ఉన్నట్లు తెలుస్తోంది. గత జూన్‌లో క్వింటాలు ధర రూ.2వేల నుంచి రూ.2,500 మాత్రమే పలికింది. ప్రస్తుతం ధర రెట్టింపు పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో క్వింటాలు ధర రూ.4వేల నుంచి రూ.4,500 వరకు పలుకుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది అధికంగా వర్షాలు పడడం వల్ల పంటలు సైతం దెబ్బతిన్నాయి. అల్లం పంటను సాగు చేసుకున్న రైతులు ఎకరం పంటపై రూ.2లక్షల వరకు నష్టాలను చవిచూశారు. 10 ఎకరాలు పంటను సాగు చేసుకున్న రైతులు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు నష్టాలను చవి చూశారు. అల్లం ధర పెరుగుతుండడం రైతులకు సంతోషాన్ని కలిగిస్తోంది. లాభం రాకున్నా.. పక్క రాష్ట్రాల్లో విస్తారంగా సాగు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జహీరాబాద్ ప్రాంతం, కేరళ రాష్ట్రంలో మాత్రమే అల్లం పంట సాగయ్యేది. ప్రస్తుతం సాగు దేశ వ్యాప్తంగా విస్తరించింది. ప్రధానంగా కేరళ, పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో అల్లం పంట సాగు విస్తరించింది. ఇందులో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో సుమారు 5లక్షల ఎకరాల్లో పంట సాగవుతోందని అల్లం రైతులు పేర్కొంటున్నారు. అధిక సాగు ధరపై ప్రభావం చూపుతోంది.కేరళలో దెబ్బతిన్నందునే... దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో అల్లం పంటను పండించే కేరళ రాష్ట్రంలో పంట దెబ్బతినడం వల్లే మార్కెట్లో ధర పెరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. అక్కడ వర్షాలు అధికంగా పడడంతో పంట దెబ్బతినడంతో హైదరాబాద్ మార్కెట్‌కు అంతంత మాత్రమే వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ధర పెరగడంతో చిగురించిన ఆశలు క్వింటాలు ధర రూ.4వేలు కేరళలో పంట దెబ్బతినడంతోనే.. -
చండీయాగం, దత్త హోమం
భక్తిశ్రద్ధలతో దత్త జయంతి వేడుకలు ఝరాసంగం(జహీరాబాద్): మండలంలోని శ్రీ బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురువారం పౌర్ణమి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్దేశ్వర స్వామిల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. మూడు రోజులుగా 21 యజ్ఞ గుండాలతో నిర్వహించిన శ్రీ చండీయాగం, దత్త హోమం పూజా కార్యక్రమాలు ముగిశాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఆశ్రమ ఆవరణ అంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఉదయం నుంచి సా యంత్రం వరకు హోమం, స్వామి వారికి డోలారోహణం కార్యక్రమాలతో పాటు పూర్ణాహుతి, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆశ్రమ ఆవరణలోని జ్యోతిర్లింగాల వద్ద పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ అనసూయ మాత, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ప్రముఖ హాస్య నటుడు పృథ్విరాజ్, భక్తులు పాల్గొన్నారు. 21,600లో దీపారాధన శ్రీ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని ధ్యాన మందిర ఆవరణలో 21,600 దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. -
సరదా కాకూడదు పెద్ద శిక్ష
● లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సౌజన్య ● ర్యాగింగ్, పోక్సో చట్టాలపై విద్యార్థులకు అవగాహన మాట్లాడుతున్న సౌజన్యసంగారెడ్డి: చిన్నపాటి సరదా పెద్ద శిక్ష కాకూడదని లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య విద్యార్థులకు ఉద్బోధించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో గురువారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాగింగ్, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ..ర్యాగింగ్ చట్టపరంగా తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. చిన్నపాటి సరదాతో జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలకు గురవుతాయని హెచ్చరించారు. ర్యాగింగ్‌ను చూసి మౌనం పాటించడం కూడా నేరమేనని, ఆ సమయంలో బాధితులకు మద్దతు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్లు జూనియర్లకు ఆదర్శంగా ఉండాలన్నారు. మైనర్లతో అనుచిత ప్రవర్తన, గోప్యత ఉల్లంఘన, ఆన్‌న్‌లైన్ వేధింపులు కూడా ఈ చట్టం కింద నేరాలేనని విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్‌ను నాశనం చేస్తుందని విద్యార్థులకు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రఘునందన్, డీఆర్ఓ పద్మజారాణి, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ జయప్రకాష్, ర్యాగింగ్ కమిటీ సభ్యులు కూన వేణుగోపాల్, మఠం శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎన్నికల నియమావళి
కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమెతో పాటు అధికారులు హాజరయ్యారు. స్టేజ్ 2, జోనల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీఈవో వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
285 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
తూప్రాన్: పట్టణ సమీపంలోని బైపాస్ మార్గం 44వ జాతీయ రహదారిపై గురువారం 285 క్వింటాళ్ల రేషన్ బియ్యం కలిగిన లారీని విజిలెన్స్ అధికా రులు పట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండో సారి రేషన్ పట్టుబడడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కొండల్వాడికి లారీలో 285.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తు న్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లై రాష్ట్ర విజిలెన్స్ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో తూప్రాన్ బైపాస్ మార్గంలో దాడి చేసి లారీని పట్టుకున్నారు. లారీని తనిఖీ చేసి రేషన్ బియ్యంగా గుర్తించారు. స్థానిక పోలీసులు, జిల్లా గోడౌన్ డీఎస్ ఓ ఇన్స్పెక్టర్ నర్సింలు సమక్షంలో పట్టణంలోని సివిల్ సప్లై గోడౌన్లో పట్టుబడిన లారీలోని రేషన్ బియ్యాన్ని ఖాళీ చేయించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
ఏం ఎలచన్లో ఏమో పో..
సంగారెడ్డి టౌన్: ఎం ఎలచన్లో ఏమో పో... యాడ జూసిన ఒక్కటే లొల్లి నడుస్తుందే మల్లన్న.. అవునే నర్సన్న మన కాలంలో గిసుంటి ఎలక్షన్ల లొల్లి ఉండకపోతుండే.. ఎవరో ఒకరు నిలబడుతుండ్రి వాళ్లకు అందరం జై కొడుతుంటిమి.. గంతే.. ఇప్పు డు చూస్తే చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.. ఓట్లల్లా నిలబడేటోల్ల పేరు బయటపడ్డది అంటే చాలు. ఖర్చులే ఖర్చులు.. నామినేషన్లు, ప్రచారానికి ర్యాలీ ర్యాలీ తీస్తుండ్రు. పొద్దుగాలన్న నాస్టలు, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పైసలు అంటే లెక్కనే లేదు. నీళ్ల లెక్క ఖర్చు పెడుతున్నరు.. పోనీ గింత ఖర్చుపెట్టి గెలిచినంక ఊర్లకు ఏమన్నా చేస్తారా అంటే అదీ లేదు. ఎవరో నూటికి ఒక్కలు ఊరి కోసం ఏమన్న చేస్తారేమో గానీ అందరూ జేబులు నింపుకొనట్లే కదా. ఎవరన్న ఎట్లన్నా ఉండని మల్లన్న మనమైతే ఊరు కోసం నిలబడేటోళ్లకే ఓట్లు వేయాలి.. పొద్దు పోతుంది. పద ఇంటికి పోదాం అంటూ ముగ్గురు తాతలు ఇంటితోవ పట్టారు. ప్రస్తుతం గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వాతావరణం ఉండడంతో ఎక్కడ చూసిన వయసు పైబడిన వారంతా ఇలా నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం కనిపిస్తున్నది. -
విచిత్ర పొత్తులతో విలేజ్ పాలిటిక్స్
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరనేది చరిత్ర చెప్పిన సత్యం. ఢిల్లీలో శత్రువులు.. గల్లీలో మిత్రులు అన్నట్లు ఉంది పంచాయతీ ఎన్నికల్లో పొడిచిన పొత్తు. ఇందుకు కొత్తపల్లి వేదికగా మారింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్, బీజేపీతో కలిసి అనైతిక పొత్తుకు తెర తీయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి రాజకీయంగా రాష్ట్రస్థాయి గుర్తింపు ఉంది. దివంగత మంత్రి కరణం రామచంద్రారావు మెతుకుసీమ రాజకీయాల్లో మూడు దశాబ్దాల పాటు ఎదురు లేని రాజకీయ ఏలికగా, కేబినేట్ మంత్రిగా కొనసాగారు. అలాంటి రాజకీయ ప్రాధాన్యత గ్రామంలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పాపన్నపేట మాజీ ఎంపీపీ లింగన్న గారి ప్రేమలత, బీఆర్ఎస్ మద్దతుదారుగా కుమ్మరి పద్మ, బీజేపీ తరఫున ఆ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ భార్య అంజలి నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటమే లక్యంగా, కాంగ్రెస్ నాయకులు బీజేపీతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జరిగిన లోపాయికార ఒప్పందంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బుధవారం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. వీరు బీజేపీ మద్దతుదారు అంజలికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం చూసి రాజకీయ నాయకులు ముక్కున వేలేసుకుంటున్నారు. –పాపన్నపేట(మెదక్)


