నేడు జెమ్‌కేర్‌ ఆస్పత్రిలో ఉచిత వెద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

నేడు జెమ్‌కేర్‌ ఆస్పత్రిలో ఉచిత వెద్య శిబిరం

Feb 14 2026 10:09 AM | Updated on Feb 14 2026 10:09 AM

నేడు

నేడు జెమ్‌కేర్‌ ఆస్పత్రిలో ఉచిత వెద్య శిబిరం

చేగుంట(తూప్రాన్‌): ఉపాధిహామీ పనుల్లో జరిగిన అవకతవకలపై రికవరీతో పాటు అపరాధ రుసుం చెల్లించాలని డీఆర్డీఓ అదనపు పీడీ రంగాచార్యులు ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఏడాది ఉపాధి హామీ పనులకు సంబంధించి సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ఉపాధి పనులకు సంబంధించిన లోపాలను రిసోర్స్‌పర్సన్‌లు సమావేశంలో వివరించారు. ఆయా పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన రంగాచార్యులు సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిన అవకతవకలకు రూ.53,751 రికవరీ చేయాలని ఆదేశించారు. అలాగే పలు పనుల్లో లోపాలకు గాను రూ.7వేలు అపరాధ రుసుము చెల్లించాలన్నారు. కార్యక్రమంలో డీవీఓ శ్రీహరి, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఆర్పీ నరేందర్‌, క్యూసీ అధికారి అరుణ, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎపీఓ శ్వేత, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

మెదక్‌జోన్‌: మెదక్‌ పట్టణంలోని ప్రముఖ కార్పొరేట్‌ జెమ్‌కేర్‌ ఆస్పత్రిలో శనివారం ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్యాంపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతోంది. జనరల్‌ మెడిసిన్‌, న్యూరాలజీ, కార్డియాలజీ, పల్మొనాలజీ, నెఫ్రాలజీ, యురాలజీ, రుమటాలజీ, విభాగాల వైద్యుల కన్సల్టేషన్ల వద్ద పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపింది. అలాగే బీపీ, షుగర్‌ పరీక్షలు అందించనున్నారు. ఒకవేళ అదనపు పరీక్షలు అవసరం ఉంటే 50 శాతం రాయితీపై అందించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలకు 98497 60818 నంబర్‌లో సంప్రదించగలరని పేర్కొన్నాయి.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

అల్లాదుర్గం(మెదక్‌): మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల పాఠశాలకు చెందిన ఇద్దరు, బాలికల ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి అండర్‌ 18 వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. గురువారం మెదక్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. దీంతో విద్యార్థినులు సనా అంజు, అఫ్రిన్‌, మౌనిక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులను తహసీల్దార్‌ మల్లయ్య, ఎంపీడీఓ వేద ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్‌ సౌమ్య, హెచ్‌ఎంలు స్వప్న, నాగరాజు, ఉప సర్పంచ్‌ పాండు, నాయకులు అభినందించారు.

క్రీడాకారులకు మంచి భవిష్యత్తు: డీవైఎస్‌ఓ రమేశ్‌

కౌడిపల్లి(నర్సాపూర్‌): సీఎం కప్‌ క్రీడలతో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని డీవైఎస్‌ఓ రమేశ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని వెల్మకన్న ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలు పాఠశాల పీడీ పూర్ణచందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన అండర్‌ 15, అండర్‌ 18 విభాగంలో బాల, బాలికలు 70 మంది పాల్గొన్నారు. బాలికల విభాగంలో ఆరాధ్య, సహస్ర, శ్రీనిధి, మీనాక్షి, వర్షిత, నెహశ్రీ, బాలుర విభాగంలో అరుణ్‌, గణేశ్‌, సాయిఈశ్వర్‌, యశ్వంత్‌, కిరణ్‌ ప్రతిభ కనబర్చారు. వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి 24వరకు గచ్చిబౌలిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సరోజ తదితరులు పాల్గొన్నారు.

‘ఉపాధి’ పనుల్లో

అవకతవకలు రికవరీకి ఆదేశం

నేడు జెమ్‌కేర్‌ ఆస్పత్రిలో  ఉచిత వెద్య శిబిరం1
1/1

నేడు జెమ్‌కేర్‌ ఆస్పత్రిలో ఉచిత వెద్య శిబిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement