సిద్దిపేటజోన్: సిద్దిపేట బల్దియా 2025–26 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లలో 86శాతం వసూలు చేసింది. నిర్దేశిత లక్ష్యం రూ.18కోట్ల 77లక్షలకు గాను చివరి గడువు నాటికి రూ.16కోట్ల 98లక్షలు అధికారులు వసూలు చేశారు. ఒక్క చివరి రోజు రూ.35 లక్షల ఆస్తిపన్ను వసూలు కావడం గమనార్హం. గత ఏడాది కంటే 2శాతం అధికంగా సుమారు రెండు కోట్లు అధికంగా వసూలు చేశారు. సిద్దిపేట ప్రజల సహకారం, పాలకవర్గం తోడ్పాటు, అధికారులు, సిబ్బంది సమష్టి వల్ల టాప్ టెన్ జాబితాలోకి సిద్దిపేట చేరిందని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ బల్దియా తరుపున కృతజ్ఞతలు తెలిపారు.


