breaking news
Sangareddy District Latest News
-
పూర్తిస్థాయిలో రైల్వే సమస్యల పరిష్కారం
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయిలో రైల్వే సమస్యలను పరిష్కరిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీకి వెళ్లే మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జిని రైల్వే, సీఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసుత్తం ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈసమస్యను పరిష్కరించేందుకు రూ.21 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు చెప్పారు. అందులో భాగంగా రైల్వే, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించామన్నారు. త్వరలో అండర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. నిర్మాణం పనుల సమయంలో ప్రజలకు, వాహనాదారులకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా తెల్లాపూర్ రైల్వేస్టేషన్, రేడియల్ రోడ్డు7కు అసుసంధానం చేసేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పటాన్చెరు సర్కిల్ ఉపకమిషనర్ జ్యోతిరెడ్డి, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, తేనా అధ్యక్షుడు రమణ, మాజీ కౌన్సిలర్ రాజు తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్‌రావు -
డెంగీ డేంజర్ బెల్స్
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026గణపతి నవరాత్రిఉత్సవాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు చాలా మంది భక్తులు మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి, పూజించే వారిని ‘సాక్షి’ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మట్టి వినాయకులను పూజించే భక్తులు సెల్ఫీ తీసుకుని ‘సాక్షి’కి పంపిస్తే, వారి ఫొటోలను ప్రచురించనున్నాం. వాట్సాప్ 9949849479కు పంపించండి మరి.. ● డెంగీ నిర్ధారణకు గ్రామాల్లో జ్వర సర్వే ● విపరీతంగా పెరుగుతున్న దోమల ఉధృతిగ్రామాల్లో అనుమానిత కేసులు జిల్లాలో డెంగీ వ్యాధి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణ మార్పుల పరిస్థితుల నేపథ్యంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 42 డెంగీ కేసులు నమోదు కాగా అప్రమత్తమైన వైద్యశాఖ ఇంటింటికీ జ్వర సర్వేను చేపట్టింది. మూడు రోజుల్లో తగ్గకపోతే రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. – సంగారెడ్డి జోన్ -
22 ఏ జాబితాలో 318 అపార్టుమెంట్లు 1,799 ఇళ్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిషేధిత జాబితా 22ఏలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 318 అపార్టుమెంట్లు, 1,799 నివాసాలు ఉన్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. మొత్తం 2,117 ప్రైవేటు స్థిరాస్తులు ఈ జాబితాలో ఉన్నట్లు తేల్చింది. పటాన్చెరు నియోజకవర్గంలో బీహెచ్ఈఎల్ కాలనీల్లో 1,146 ఇళ్లు, సందిగూడెం కాలనీలో 250 ఇళ్లు, బోన్సాయ్కాలనీలో 182 నివాసాలు, బండ్లగూడ కాలనీలో 112, దుర్గా కాలనీలో 56, ముత్తంగి కాలనీలో 53 ఇళ్లు ఈ జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే శ్రీరాంనగర్ కాలనీలో ఏకంగా 259 అపార్టుమెంట్లు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. శ్రీనగర్ కాలనీలోనూ 59 అపార్టుమెంట్లు 22ఏలో ఉన్నట్లు నిర్ధారించారు. డ్రోన్ టెక్నాలజీపై కలిసి పనిచేయనున్న రెండు సంస్థలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అటానమస్ నావిగేషన్ సిస్టమ్‌పై పరిశోధన చేస్తున్న ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన టీహాన్ సంస్థతో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ (ఏపీడీసీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయని ఐఐటీ హైదరాబాద్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. టీహాన్ సంస్థ ఏపీలో డ్రోన్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం, డ్రోన్ సిటీ అభివృద్ధికి సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. డ్రోన్ ఆర్డీ, యూఏవీ ప్లాట్‌ఫాంలు, సెన్సార్లు, పేలోడ్లు వంటి అంశాలపై ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి మాట్లాడుతూ..బలమైన డ్రోన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వం, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఆవిష్కరణలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఆధునిక డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి, పరిశోధకులు, స్టార్టప్‌లు, పరిశ్రమలకు కొత్త అవకాశాలను సృష్టించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో 3,625 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర వెల్లడించారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. కక్షిదారులు తమ వివాదాలను పరస్పర అంగీకారంతో సత్వరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఉచిత న్యాయ సహాయం అందించడం, ప్రజలకు సత్వర న్యాయం అందించడం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
సంగారెడ్డి జోన్/సంగారెడ్డి క్రైమ్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జెడ్పీ కార్యాలయంలో శనివారం శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ప్రజలు ఒకరి మత సంప్రదాయాలను మరొకరు గౌరవిస్తూ మత సామరస్యాన్ని కాపాడాలన్నారు. నిర్వాహకులు తెలంగాణ పోలీస్ పోర్టల్‌లో మండపం వివరాలు, నిమజ్జనం తేదీ, నిమజ్జనానికి వెళ్లే మార్గం తదితర వివరాలను ముందస్తుగా నమోదు చేయాలని సూచించారు. వినాయక ప్రతిష్ఠాపన కోసం ఏర్పాటు చేసే మండపాలను రహదారులపై నిర్మించకుండా, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భద్రతా దష్ట్యా ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ఏదైనా సమాచారం ఉన్నప్పుడు డయల్–112కు లేదా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని వెల్లడించారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్తయ్యగౌడ్, తహస్దీలార్ జయరామ్, తోపాజి అనంత కిషన్, మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, గణేశ్ మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ పరితోశ్ పంకజ్ -
జోగిపేట కోర్టులో 356 కేసుల పరిష్కారం
జోగిపేట(అందోల్): అందోలు మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జోగిపేటలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 356 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్‌లో జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అసదుల్లా షరీఫ్ అధ్యక్షులుగా బెంచ్ సభ్యులుగా సీనియర్ న్యాయవాదులు ఎస్.నారాయణరెడ్డి, ఎస్.కృష్ణారెడ్డిలు వ్యవహరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షరీఫ్ మాట్లాడుతూ...లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వలన కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. పరిష్కారమైన కేసుల్లో 33 క్రిమినల్, 19 బ్యాంకు, 56 జరిమానా, 237 డ్రంక్ అండ్ డ్రైవ్, 5 సైబర్ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. జోగిపేట సర్కిల్ సీఐ అనిల్‌కుమార్, జోగిపేట, పుల్కల్, వట్పల్లి ఎస్‌ఐలతోపాటు స్థానిక పోలీసు సిబ్బంది, బార్ అసోసియేషన్ న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాలొన్నారు. జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండీ అసదుల్లా షరీఫ్ -
భెల్‌ను సందర్శించి.. సమస్యలు చర్చించి
భెల్‌ను సందర్శించిన రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రామచంద్రాపురం(పటాన్చెరు): బీహెచ్ఈఎల్ పరిశ్రమను రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం సందర్శించారు. భెల్ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి, భెల్ టౌన్‌షిప్‌లోని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనకు భెల్ ఈడి వై.శ్రీనివాస్‌రావు, జీఎంలు జె.ఉమామహేశ్వరరావు, నందు, సంధ్యాకర్లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెల్ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు అంశాలను కార్మికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం భెల్ యాజమాన్యంతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. రైస్ మిల్లులపై సోదాలు నిలిపివేయాలితెలంగాణ రైస్ మిల్లు అసోసియేషన్ సమావేశం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సోదాలు నిలిపివేయాలని తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కన్వేన్షన్ హాల్లో శనివారం తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రంలోని రైస్ మిల్లులకు వరి ధాన్యం కేటాయించకపోవడం దారుణమన్నారు. మూడు రోజులుగా కలెక్టర్, పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 9.60కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 9.70 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వం రైస్ మిల్లులకు ఇవ్వగా 9.60కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యంను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చామన్నారు. కొందరు మిల్లర్లు చేసిన అవినీతికి అందరిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అవినీతి పరులను రైస్ మిల్ అసోసియేషన్ నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది 75లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఇవ్వగా 51లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించనున్నట్లు తెలిపారు. అందుకు గాను డిసెంబర్ 31 వరకు సమయం ఇవ్వాలన్నారు. -
క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య
పటాన్చెరు టౌన్: క్యాబ్ డ్రైవర్ అదృశ్యమైన మూడు రోజులకే దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌న్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా.. పాతర్ల పాడుకు చెందిన రాజశేఖర్(32) కొంతకాలంగా హైదరాబాద్‌లోని రసూల్‌పుర సీబీఎన్ నగర్లో నివాసముంటున్నాడు. కాగా లీలను ప్రేమించి వివాహం చేసుకున్న ఆయనకు శ్రీనిధి, అనన్య అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సొంత కారు ఉన్న రాజశేఖర్ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగులను తీసుకెళ్లేందుకు లీజుకు పెట్టాడు. ఈ నెల 10న రాత్రి విధులకు వెళ్లిన అతడు ఇంటికి వచ్చి భోజనం చేసి తిరిగి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోహిర్ గోల్డెన్ దాబా వద్ద కారు సంగారెడ్డి జిల్లా.. కోహిర్‌లోని గోల్డెన్ దాబా వద్ద రాజశేఖర్ కారు ఉన్నట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. మార్గమధ్యలో రుద్రారం శివారులోని జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఓవర్ బ్రిడ్జి సమీపంలో చెట్ల పొదల్లో రాజశేఖర్ మృతదేహం ఉన్నట్లు శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు గుర్తించారు. మృతుడి మెడకు బెల్టు లాంటి వస్తువుతో బిగించిన ఆనవాళ్లతోపాటు తల, ముఖంపై తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో కొంతమంది ఉన్నట్లు టోల్గేట్ వద్ద లభించిన సమాచారం, మొబైల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పలువురు క్యాబ్ డ్రైవర్లను పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌న్‌లో విచారించినట్లు తెలిసింది. మృతుడి సోదరుడు రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రుద్రారం శివారులో మృతదేహం లభ్యం గొంతు నులిమి, తీవ్రంగా కొట్టినట్లు ఆనవాళ్లు -
పౌష్టికాహారం.. సంపూర్ణ ఆరోగ్యం
అంగన్వాడీల్లో నెల పాటు పోషణ మాసోత్సవాలుపౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పలు రకాల పోషకాహారం అందిస్తూ ఐసీడీఎస్ ఆరోగ్య తెలంగాణ సాధనకు కృషి చేస్తుంది. తల్లి మంచి పౌష్టకాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని.. తద్వారా దేశానికి భావి భారతపౌరుడిని అందించగల్గుతామన్న మంచి లక్ష్యంతో పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1150 అంగన్వాడీ కేంద్రాలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాలలో మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1150 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. టీచర్లు 1,059, ఆయాలు 860, గర్భిణులు 5,932, బాలింతలు 4,270, సున్నా నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 66,508 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల 8 వరకు.. ఈ నెల 9న ప్రారంభమైన పోషణ మాసంను అక్టోబర్ 8 వరకు చేపడతారు. ఏ విధమైన ఆహారం తీసుకోవాలి? స్వయంగా తయారు చేసిన రకరకాల పౌష్టికాహారంను అందిస్తూ అంగన్వాడీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ● మొదటి వారంలో ధాన్యాలు, చిరు ధాన్యాలు, ఆకుకూరలు, పళ్ల సమూహాల ప్రదర్శన, బొమ్మలతో అవగాహన కల్పిస్తారు. రెండో వారంలో అంగన్వాడీల నిర్వహణ కమిటీల ఏర్పాటు, తల్లి పాలు, ఆలన పాలనపై అవగాహన, మూడో వారంలో పిల్లల్లో స్వీయ అవగాహన, ఎదుగుదల ప్రోత్సాహానికి అద్దాల ఏర్పాటు, గర్భిణులు, బాలింతల ఇళ్ల సందర్శన, వైద్య సిబ్బందితో సహకారం అందించనున్నారు. నాలుగో వారం ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్యాకేజీ ఆహారంతో కలిగే నష్టాలను వివరిస్తారు. తల్లిదండ్రులు, మహిళా సంఘాలు, పంచాయతీ వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆధునిక యుగంలోనూ పౌష్టికాహార లోపంతో మాతాశిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గర్భిణులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడంతో అబార్షన్లు కావడం.. ప్రసవమయ్యే సమయంలో ఇబ్బందులు తలెత్తి తల్లీబిడ్డలు పురిట్లోనే మరణిస్తున్న ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. పేద కుటుంబాల్లో ఆరోగ్యంపై అవగాహన లేకపోవడంతోనే ఈ సమస్యలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో మాతాశిశు మరణాలను నివారించడానికి ఆరోగ్య తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ మాసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. – దుబ్బాక పోషకాహార లోపంపై విస్తృత ప్రచారం సిద్దిపేట జిల్లాలో 1150 అంగన్వాడీ కేంద్రాలు సరైన అవగాహన లేక గర్భిణులు పోషకాహారం తీసుకోవడం లేదు. దీంతో పుట్టబోయే పిల్లలు అవయవ లోపాలు, తక్కువ బరువుతో పాటు చాలా రకాల అనారోగ్యంతో పుడుతున్నారు. పౌష్టికాహార లోపాలు లేకుండా భవిష్యత్తులో సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాం. – శారద, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిఅంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు, ఐదేళ్ల లోపు పిల్లలకు పోషకాహారం అందిస్తున్నాం. క్రమం తప్పకుండా వారి ఆరోగ్యాన్ని పరిక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. – సుజాత, అంగన్వాడీ టీచర్, దుబ్బాక -
రికార్డుల్లో తప్పులుండొద్దు
కొండపాక(గజ్వేల్): ఎరువుల క్రయ విక్రయాల రికార్డుల్లో తప్పులుండకుండా చూసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి హెచ్చరించారు. మండలంలోని ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ దుకాణాలను శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. వివిధ రకాల ఎరువులు, పురుగు మందుల నిల్వలు, రిజిస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసే వాటికి తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, ఈపాస్ ద్వారానే ఎరువుల విక్రయాలు జరగాలన్నారు. పురుగు మందులు, ఎరువులు ఎంఆర్పీ ధర కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏడీఏ బాబూనాయక్, ఏఓ శివరామకృష్ణ పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి -
బీజీ –3 పత్తి సాగు చేస్తే చర్యలు
కొండపాక(గజ్వేల్): బీజీ– 3 పత్తి విత్తనాలు అధికంగా సాగు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి హెచ్చరించారు. మండలంలోని రవీంద్రనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కాటన్ సాగు విషయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ బీజీ 3 కాటన్ విత్తనాల సాగు వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. అధిక శాతం విత్తనాలు వాడితే ఆరోగ్యపరమైన సమస్యలు, పర్యావరణ ప్రభావం, నేల, నీరు కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకాల పంటలను సాగు చేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు పత్తి పంటను పరిశీలించి తెగుళ్ల నివారణకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాబూనాయక్, ఏఓ శివరామకృష్ణ, సర్పంచ్ కవిత, ఏఈఓలు రమ్యశ్రీ, సుష్మిత, మౌనిక, సాత్విక, రైతులు పాల్గొన్నారు.వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త పల్లవి -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
తొగుట(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని పెద్ద మాసాన్‌పల్లి మదిర వడ్డెర కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. తొగుట ఎస్ఐ నవీన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోదాసు లక్ష్మి, బాలయ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలయ్య చాలా కాలం క్రితం మరణించగా తల్లి కూలీ పనులు చేసి పిల్లలను పెంచి పెద్ద చేసింది. కాగా వారి చిన్న కుమారుడు సంజీవ్ (21) సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సులో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. కాగా ఈ నెల 9న రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం మృతదేహం కనిపించింది. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య -
ఆగమనమూ..వేడుకే
దుబ్బాకలో నయా ట్రెండ్దుబ్బాకటౌన్: వినాయక చవితి వస్తే చాలు పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా నవరాత్రి ఉత్సవాలు, కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కాగా గణేశ్ ఆగమన్‌ను సైతం ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఉద్యమాల పురిటిగడ్డ అయినా దుబ్బాకలో వినాయక నిమజ్జనోత్సవాలకు గొప్ప ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే. స్వాగతం అదిరే.. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సైతం అప్డేట్ అవుతున్నారు. వినాయక చవితి దగ్గర పడుతుండడంతో భారీ గణనాథులను పట్టణాల నుంచి స్వగ్రామలకు తీసుకొస్తున్నారు. ప్రతీ సంవత్సరం లాగా నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించే యువత ఈసారి గణేశ్ ఆగమన్ పేరిట భారీ గణనాథులకు అదిరిపోయే స్వాగతం పలుకుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు.. వినాయకుని ఊరేగింపును వీడియోలు తీస్తూ యువకులు ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో వినాయక ఆగమన్‌కు మరింత ప్రత్యేకత పెరిగింది. కేవలం వివాహాల్లో, పెద్ద పెద్ద సభల్లో వాడే డ్రోన్లను సైతం ఆగమన్ ఊరేగింపునకు వాడటంతో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో మరింత ట్రెండ్ అవుతున్నాయి. వినాయకులకు అదిరిపోయే స్వాగతం భారీ లైటింగ్.. డీజే హోరుహిందూ పండుగలలో వినాయక చవితి అతి పెద్ద పండుగ. ఈ సారి ఆగమన్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ప్రత్యేక బాణాసంచా, పేపర్ స్ప్రేతో, డ్రోన్‌తో స్వాగతం పలికాం. ప్రజలు సైతం ఊరేగింపును చూడడానికి వందల సంఖ్యలో రావడం సంతోషం. – నేహాల్ గౌడ్, మిత్రయూత్ అధ్యక్షుడు, దుబ్బాక -
రసాయనాల్లేని సాగుతోనే మేలు
ములుగు(గజ్వేల్): తెలంగాణలో ఉద్యాన పంటల ఉత్పాదకతను పెంచడంతో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించే సాంకేతికతపై పరిశోధనలు జరగాల్సిన అవసరముందని ములుగు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యాన పంటల్లో రసాయనాల వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హిత జీవ సాంకేతిక విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో విశ్వవిద్యాలయం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ శ్రీ బయో ఎస్తటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో శుక్రవారం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. అన్నదాతలు ఎరువులు, పురుగుల మందులను విచక్షణా రహితంగా వాడకుండా తక్కువ మోతాదు రసాయనాలతో అధిక దిగుబడులు సాధించే సమగ్ర యాజమాన్య పద్ధతులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి శ్రీబయోతో వర్సిటీ ఒప్పందం -
ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ చోరీ ముఠా అరెస్టు
కామారెడ్డి క్రైం: కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో 52 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, కాపర్ వైర్ చోరీ చేసిన అంతర్ జిల్లా ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్చంద్ర కేసు వివరాలు వెల్లడించారు. భిక్కనూరు మండల పరిధిలోని పలు గ్రామాల శివారు ప్రాంతాల్లో ఐదు నెలలుగా ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్, వైరు, ఇతర వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు భిక్కనూరు ప్రాంతంలో 29, మెదక్ జిల్లా పరిధిలో 23 చోట్ల నమోదయ్యాయి. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనుమానితులను గుర్తించారు. మరోసారి చోరీ చేసేందుకు భిక్కనూరు సమీపంలోని పరివార్ హోటల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను మేడ్చల్‌కు చెందిన బల్జీర్ సింగ్, రూప్సింగ్, లకన్ సింగ్‌లుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నాడు. అంతర్ జిల్లా ముఠా సభ్యులు నలుగురూ సొంత అన్నదమ్ములు కావడం గమనార్హం. నిందితులు గతంలో పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చారని పోలీసులు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 30 కిలోల కాపర్ వైరు, రాడ్లు, చోరీకి ఉపయోగించిన పరికరాలు, బైక్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 52 ట్రాన్స్ఫార్మర్లను కొల్లగొట్టిన నిందితులు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర -
మట్టి ప్రతిమలనే ప్రతిష్ఠించాలి
గజ్వేల్‌రూరల్: మట్టి గణపయ్యలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుదామని గజ్వేల్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మన్వీర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో రామకోటి భక్తసమాజం సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతులకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన గణపయ్య విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితమయ్యే అవకాశముందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరేశ్‌బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్సాగర్రావు, సరస్వతి శిశుమందిర్ ప్రధానోపాధ్యాయురాలు హరిణ, నాయకులు సత్యనారాయణ, సోమేశ్, విజయ్‌కుమార్, నర్సింహచారి పాల్గొన్నారు. -
జిజ్ఞాసలో రాష్ట్రస్థాయి అవార్డులు
పటాన్చెరు టౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జిజ్ఞాస స్టూడెంట్ రీసెర్చ్ ప్రాజెక్టుల్లో రాష్ట్రస్థాయి అవార్డులు సాధించారు. శుక్రవారం కళాశాలలో విజయోత్సవ సభ నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ రంగంపై అంతర్రాష్ట్ర వలస శ్రామికుల ప్రభావంపై చేసిన పరిశోధనకు అర్థశాస్త్రంలో ప్రథమ బహుమతి, ఫుడ్ అడల్టరేషన్ పై చేసిన ప్రాజెక్టుకు వృక్షశాస్త్రంలో ద్వితీయ బహుమతి, ఇంగ్లిష్ స్కిల్స్‌పై పరిశోధనకు ఆంగ్లంలో తృతీయ బహుమతి లభించాయి. ఈ సందర్భంగా అవార్డులు సాధించిన విద్యార్థులు, ప్రొఫెసర్ వెంకటేశం,డాక్టర్ మల్లిక, డాక్టర్ షరీఫ్ మియాలను ప్రిన్సి పాల్ ప్రవీణ, అధ్యాపకుల బృందం అభినందించారు. అనంతరం ఎండీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో విద్యార్థులు, సిబ్బందికి మట్టి గణపతులను పంపిణీ చేసి పర్యావరణంపై అవగాహన కల్పించారు. నర్సాపూర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు.. నర్సాపూర్ రూరల్: రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జంతు శాస్త్ర విభాగం విద్యార్థులు ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి అందుకున్నారు. రాష్ట్ర కమిషనరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిజ్ఞాస పరిశోధన ప్రాజెక్టు పోటీలు నిర్వహించారు. కాగా నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగం విద్యార్థులు హబీ టాట్ అండ్ ది నర్సాపూర్ ఫారెస్ట్, తెలంగాణ అనే పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఆయా రకాల పక్షులపై చేసిన పరిశోధనకు మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు అధ్యాపకుడు డాక్టర్ సురేశ్‌ను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. -
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
మద్దూరు(హుస్నాబాద్): మండలంలో గాగిల్లాపూర్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు తుమ్మల గోపీ, వల్లపు అనిల్‌పై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. తీవ్ర గాయాలు దుబ్బాకరూరల్: విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్‌కు కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని హబ్సిపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జోరబొంతల రమేశ్ సబ్ స్టేషన్లో విద్యుత్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేస్తున్న సమయంలో ప్రక్కన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దం రావడంతో పొలాల వద్ద ఉన్న రైతులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని తీవ్ర గాయాలతో పడి ఉన్న రమేశ్‌ను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. మిరుదొడ్డి(దుబ్బాక): భూంపల్లి పీహెచ్సీలో కాలం చెల్లిన ఇంజక్షన్ విషయంలో తలెత్తిన వివాదంలో ఘర్షణ పడ్డ వైద్య సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్‌తో పాటు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు వినోద్ బాబ్జీ, నిర్మల భూంపల్లి పీహెచ్‌సీని సందర్శించారు. ఇంజక్షన్ విషయంలో ఘర్షణ పడిన ఝాన్సీ, దీపికలను వేర్వేరుగా విచారించారు. తుది నివేదికల అనంతరం వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పీహెచ్‌సీలోని మెడిసిన్ ల్యాబ్, స్టాక్ రూం, ఓపీ, రికార్డులను, కాలం చెల్లిన ఇంజక్షన్ల వివరాలపై ఆరా తీశారు. పీహెచ్‌సీకి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. సిద్దిపేటకమాన్: బ్యాంకు ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ ఉద్యోగులు తెలిపారు. శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి పేస్కేల్‌కు అనుగుణంగా కేటగిరి వారీగా వేతనాలు చెల్లించాలన్నారు. బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందికి బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన జీడి చిన్న అంజాగౌడ్ బైక్‌పై వెళ్తుండగా పాత బస్టాండ్ వద్ద వెనక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. రోడ్డు దాటుతుండగా విద్యార్థిని.. చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు దాటుతున్న విద్యార్థిని కారు ఢీకొట్టగా గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. శుక్రవారం పాఠశాలకు వెళ్తున్న పదవ తరగతి విద్యార్థిని శ్వేత రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులు అండర్‌పాస్ ద్వారా పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
నల్లవాగు చివరి ఆయకట్టుకు నీరివ్వాలి
కల్హేర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల ఆందోళనకల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు చివరి ఆయకట్టు కింద ఎండుతున్న పంటలు కాపాడేందుకు సాగు నీరు అందించాలని శుక్రవారం కల్హేర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేశారు. ఇందిరానగర్, కల్హేర్ వద్ద నల్లవాగు ఆయకట్టు కింద సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. నల్లవాగు కాల్వల్లో పిచ్చి మొక్కలు, పూడిక నిండటంతో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడంలేదని తెలిపారు. అధికారులు వెంటనే నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ శివశ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. కదిలిన అధికార యంత్రాంగం నల్లవాగు ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండిపోతుండటంతో నీటి పారుదల శాఖ అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ‘రైతన్నలకు తప్పని నీటి గోస’శీర్షికతో సాక్షిలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మరో పక్క రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో నీటి పారుదల శాఖ డీఈఈ ఎజాజ్, ఎఈ శ్రీవర్ధన్‌రెడ్డి కృష్ణాపూర్, ఇందిరానగర్ వద్ద నల్లవాగు కుడి కాల్వను పరిశీలించారు. కాల్వల్లో చెట్లు, పూడిక తొలగించి నీటి సరఫరా చేసేందుకు వెంటనే చర్యలు తీసకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగన్న, రైతులు ఉప్పరి విఠల్, సాయిలు, ప్రకాశ్ పాల్గొన్నారు. -
లోటు వర్షపాతమే
సాధారణం కంటే తక్కువగా కురిసిన వర్షం● 16 మండలాల్లో నమోదు ● పంట ఎదుగుదలపై వర్ష ప్రభావం ● తగ్గుతున్న భూగర్భ జలాలు సంగారెడ్డి జోన్: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 16% వర్షం తక్కువ కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సుమారు గత 20 రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జూన్, జూలైలో సాధారణం కంటే ఎక్కువగా వర్షం కురిసిన ఆగస్టు నెలలో లోటు వర్షపాతం నమోదైంది. పంట ఎదిగే సమయంలో వర్షాలు కురువకపోవడంతో రైతులు ఆకాశం వైపు దిక్కులు చూస్తున్నారు. తగ్గిన సాగు విస్తీర్ణం జిల్లాలో ఏడు లక్షల అరవై వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ సీజన్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో సుమారు 60వేల ఎకరాల మేర సాగు విస్తీర్ణం తక్కువగా ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పంట సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నెల చివరి వరకు ఎంతమేర పంట సాగైందో తెలిసే అవకాశాలున్నాయి. అత్యధికంగా పత్తి, వరి, చెరుకు పంటలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉన్నాయి. సోయా కాత దశలో ఉంది. ఈ సమయంలో వర్షాలు లేకపోవడంతో పంట ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. చాలాచోట్ల పత్తి పంట తక్కువ ఎత్తులో ఉండగా, సోయాబీన్ పంట ఎండు ముఖం పట్టింది. 16 మండలాల్లో లోటు వర్షపాతం జిల్లావ్యాప్తంగా 28 మండలాలుండగా 16 మండలాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదైంది. రెండు మండలాల్లో అత్యధికంగా 10 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా జూన్, జూలైలో సాధారణం కంటే 12% ఎక్కువగా కురిసింది. ఆగస్టు నెలలో 56% తక్కువగా నమోదైంది. ప్రస్తుత నెలలో పది రోజులు పూర్తయినప్పటికీ చినుకు జాడ లేకుండా పోయింది. సీజన్ మొదటి రెండు నెలలు సాధారణం కంటే 12% అదనంగా ఉన్న వర్షపాతం ఆగస్టులో ఏకంగా 56% తక్కువగా కురిసి లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, ప్రాజెక్టులు, చెక్ డ్యామ్‌లు నీరు లేక కళావిహీనంగా మారాయి. నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం శనివారం నుంచి మరో నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని సంబంధిత శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. ఈ ప్రకటన మేరకు జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతులకు ఈ వర్షాలు ఊరట కలిగించనున్నాయి. ఒకవేళ ఆశిస్తున్నట్లుగా ఈ నెలలో వర్షాలు కురవకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయి, పెట్టుబడులు రావడం కూడా కష్టమేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. పడిపోతున్న భూగర్భ జలాలు వర్షాభావంతో జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. అధికారులు చెప్పినట్లుగా ఆగస్టు పూర్తయ్యేసరికి 11.22 మీటర్ల లోతులో జలం లభిస్తోంది. వట్టిపల్లి మండలంలో 3.32మీటర్ల లోతులో నీరు ఉండగా గుమ్మడిదల మండలంలో 18.15 మీటర్ల లోతులోకి పడిపోయింది. అందోల్, హత్నూర, ఝరాసంగం, జిన్నారం, కంగ్టి, కల్హేర్, కంది, కోహీర్, నిజాంపేట, పుల్కల్ మండలాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతున్నాయి. సంగారెడ్డి, గుమ్మడిదల, పటాన్చెరు మండలాల్లో 16.5 మీటర్ల లోతులో ఉండి ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. మిగతా మండలాల్లో సాధారణ పరిస్థితుల్లో ఉన్నాయి. ఆరుతడి పంటలకు ఇబ్బందులే జిల్లాలో నమోదైన వర్షపాతానికి ఆరుతడి పంటలు సాగు కూడా కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోయాబీన్, మినుము, పెసర పంటలకు ప్రస్తుతం వర్షం ఎంతో ముఖ్యం. నీరు లేక ఎండుముఖం పడుతున్నాయి. సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలకు సిద్ధమవుతున్నారు. నీటి సౌకర్యం ఉన్నవారు పైప్ లైన్‌తోపాటు స్ప్రింకర్ ద్వారా నీటిని అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలి
డీఎస్పీ సత్తయ్య గౌడ్ సంగారెడ్డి టౌన్/ సంగారెడ్డి క్రైమ్: వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, ప్రజలు సహకరించాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ కోరారు. ఈ నెల 14న వినాయక చవితి పురస్కరించుకుని ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పట్టణంలో ఈసారి ఇప్పటివరకు 200 పైగా మండపాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. పోలీస్ పోర్టల్‌లో మండప నిర్వాహకులు తప్పకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతీ మండపం వద్ద ఉత్సవ సమితి సభ్యులు సీసీ కెమెరాలను తప్పకుండా బిగించుకోవాలి వినాయక మండపాల వద్ద అన్నదానం చేసేటప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని, స్పీకర్లను మాత్రమే పెట్టాలని స్పష్టం చేశారు. స్పీకర్లను రాత్రి 10 గంటల తర్వాత బంద్ చేయాలని చెప్పారు. అసెంబ్లీలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: వ్యవసాయ, పశుసంపద ఆధారంగా ఆగ్రోబేస్డ్, డెయిరీ బేస్డ్ పరిశ్రమలను ఖేడ్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో జీరో అవర్‌లో మాట్లాడుతూ..ఆయా పరిశ్రమల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు రైతులు తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. పాడిరైతులకు సైతం ప్రోత్సాహం అందిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేత మవుతుందన్నారు. ఖేడ్ నియోజకవర్గ రైతులు, పశుపోషకుల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని పశువైద్యుల నియామకం, సంచార అంబులెన్స్‌ల పెంపు, పశుపోషణకు రాయితీలు, ఆగ్రో, డెయిరీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి పటాన్చెరు టౌన్: సింఫనీ హోమ్స్ కాలనీలో 22–ఏ నిషేధిత జాబితాపై నెలకొన్న సందేహాలను నివృతి చేసి, ప్రభుత్వ భూమిని కాపాడాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ శేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని సింఫనీ హోమ్స్‌లో 55 ఎకరాల్లో సుమారు 900 విల్లాలున్నాయని, 5 వేల మంది నివసిస్తున్నారని తెలిపారు. 22–ఏ లో మొత్తం కాలనీని చేర్చారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. తహసీల్దార్ వివరాల ప్రకారం..రైల్వే లైన్ కోసం సేకరించిన సుమారు 4.15 ఎకరాల ప్రభుత్వ భూమిని మాత్రమే 22–ఏ లో చేర్చినట్లు తెలిపారు. ఆ స్థలాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎంపీ రఘునందన్‌రావుపై ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మతిన్, యువరాజ్, రాజు, సాయిలు, అక్షిత్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి: సంగారెడ్డి పోస్టల్ డివిజన్ నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్గా బి. అంబేడ్కర్ రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన డి. శ్రీహరి బదిలీపై హైదరాబాద్ వెళ్లారు. ఆయన స్థానంలో అంబేడ్కర్ రాజు బాధ్యతలు చేపట్టారు. -
కీలక ఆధారాలు లభ్యం!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నేదునూరు గ్రామంలో జరిగిన రియల్ఎస్టేట్ వ్యాపారి బాణాల రాంరెడ్డి ఆత్మహత్య ఘటన సంగారెడ్డి జిల్లాలోనూ కలకలం రేపింది. ఈ ఆత్మహత్యకు కారణం పటాన్చెరు ప్రాంతంలోని ఓ భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ భూ వివాదాలే కారణమని ప్రాథమికంగా తేలడం చర్చనీయాంశంగా మారింది. రాంరెడ్డి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రామేశ్వరం బండ ప్రాంతంలో రాంరెడ్డి సుమారు 200 ఎకరాలకు భారీ వెంచర్ వేశారు. ఈ వెంచర్ భూవివాదాలే ఆత్మహత్యకు దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు సమాచారం. వాయిస్ రికార్డులో కీలక అంశాలు.. పోలీసులు స్వాధీనం చేసుకున్న రాంరెడ్డి సెల్ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డుల్లో కీలక అంశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన డెవలప్‌చేస్తున్న వెంచర్‌కు సంబంధించిన భూమి యజమానులకు ఈ వాయిస్ రికార్డులు పంపినట్లు సమాచారం. ఈ భూవివాదాన్ని పరిష్కరించుకునేలా చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ఈ రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధిత భూమి యజమానుల నుంచి స్పందన లేకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ వెంచర్‌కు భూములను హెచ్ఎండీఏ క్లియరెన్స్‌ల కోసం ఇప్పటికే ఆయన రెండు, మూడు పర్యాయాల్లో సుమారు రూ.28 కోట్ల వరకు వెచ్చించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాగా రాంరెడ్డి క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదిగారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ వెంచర్‌తోపాటు, పటాన్చెరు ప్రాంతంలో మరికొన్ని వెంచర్లు అభివృద్ధి చేశారు. రాంరెడ్డి దగ్గరి బంధువుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఈ వెంచర్లో పెట్టుబడులు పెట్టి వివాదంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రమేయంపైనా ప్రచారం! ఈ కేసులో రాంరెడ్డికి ఉన్న ఆర్థిక ఇతర ఇబ్బందులు ఒక అంశమైతే.. పటాన్‌చెరుకు చెందిన ప్రజాప్రతినిధుల వేధింపులు కూడా మరో కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ వెంచర్‌కు సంబంధించి స్థానిక కీలక ప్రజాప్రతినిధులు వాటాలు, పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ భూముల జోన్ మార్పిడి వ్యవహరంలోనూ ఈ ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని అధికారులకు సిఫార్సులు చేసినట్లు సంబంధిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వెంచర్ భూవివాదంలో పోలీసు అధికారి పాత్ర కూడా తెరపైకి వస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన ఓ పోలీసు అధికారి ఈ భూవివాదాల్లో కలగజేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. సదరు పోలీసు అధికారి సెటిల్మెంట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో కలకలం రేగిన రియల్ వ్యాపారి రాంరెడ్డి ఆత్మహత్య పటాన్చెరు సమీప వెంచర్ భూవివాదాలే కారణం! పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో కీలక అంశాలు -
హరీశ్‌రావుకు మట్టి గణపతి అందజేత
సంగారెడ్డి: మాజీ మంత్రి హరీశ్‌రావును బీఆర్ఎస్వీ నాయకుడు అఖిల్ మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని అఖిల్ పేర్కొన్నారు. మట్టి వినాయక విగ్రహాన్ని స్వీకరించిన హరీశ్‌రావు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. కల్హేర్(నారాయణఖేడ్): క్రీడలు విద్యార్థుల్లో మానసిక ప్రశాంతతకు దోహదపడుతాయని ప్రోబేషనరీ డిప్యూటీ కలెక్టర్ కె.లక్ష్మి దీపిక తెలిపారు. సిర్గాపూర్‌లో మండలస్థాయి బాలుర ఎస్జీఎఫ్ క్రీడలను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఆటలతో ఆరోగ్యంగా ఉంటూ చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. -
బీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారు
● టీజీఐసీసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి ● సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన సంగారెడ్డి: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని టీజీఐసీసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకుల తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డిలో నిరసన నిర్వహించారు. రామ్‌నగర్‌లోని జగ్గారెడ్డి నివాసం నుంచి పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నిర్మలారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ..అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరాచకం, గూండాయిజానికి పాల్పడ్డారన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా వ్యవహరించడం దారుణమని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తమకు తామే నెట్టుకుని, పోలీసులపై దాడి చేసి, తిరిగి తామే బాధితులమన్నట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. దళిత వర్గాన్ని అవమానించేలా బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, చర్యలను రాష్ట్ర ప్రజలంతా గమనించారని పేర్కొన్నారు. దళితులు నడిచిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం బీఆర్ఎస్ పార్టీ కుసంస్కారానికి, అనాగరిక చర్యలకు నిదర్శనమని మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి, నాయకులు జార్జ్, కిరణ్‌గౌడ్, సంతోశ్, శ్రీకాంత్, రామ్‌చందర్‌నాయక్, శ్రీకాంత్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, భూమేశ్, తదితరులు పాల్గొన్నారు.జాతీయ రహదారి పనుల పరిశీలననారాయణఖేడ్: నిజాంపేట్– నారాయణఖేడ్– బీదర్ 161బీ జాతీయ రహదారిపై మంజీరా నదిపై పుల్కుర్తి–రాఘవాపూర్ల మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన పనులను శుక్రవారం నేషనల్ హైవే క్వాలిటీ కన్సల్టెంట్ అధికారులు బృందం పరిశీలించింది. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.303 కోట్లు విడుదల చేసింది. నిజాంపేట్ నుంచి బీదర్ వరకు ఖేడ్ మీదుగా 46 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టింది. ఇప్పటివరకు 70% పనులు పూర్తి కాగా మంజీరా నదిపై వంతెన నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు వంతెన నిర్మాణపు పనులను నేషనల్ హైవే డిప్యూటీ ఈఈ సందీప్, ఏఈ భానుప్రకాష్, క్వాలిటీ కన్సల్టెంట్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి బృందం, ఆర్ఎంఎన్జీఎం నాగరాజు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈఈ సందీప్ మాట్లాడుతూ...ఈ రోడ్డు నిర్మాణ పనులు మరో ఆరు నెలల్లో పూర్తవుతాయన్నారు. జరుగుతున్న పనుల నాణ్యత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. -
శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడి
జహీరాబాద్‌లో రైతు సదస్సు జహీరాబాద్ టౌన్ : గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమంలో భాగంగా డీడీఎస్ కేవీకే ఆధ్వర్యంలో శ్రీరైతు సదస్సుశ్రీ నిర్వహించారు. మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థులు, శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి కె.శివ ప్రసాద్ మాట్లాడుతూ.. రైతులు శాసీ్త్రయ పద్ధతులు, నాణ్యమైన సాంకేతికతను జోడించి పంట దిగుబడితో పాటు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. మల్లారెడ్డి వ్యవసాయ పాఠశాల డీన్ డాక్టర్ రాజారెడ్డి, ఫ్యాకల్టీ సభ్యులు, బసంత్‌పూర్ శాస్త్రవేత్త శ్రీమతి జి.విజయలక్ష్మి, కేవీకే శాస్త్రవేత్తలు నేల ఆరోగ్యం, సమగ్ర పోషక యాజమాన్యం, తెగుళ్ల నియంత్రణ, నీటి సంరక్షణపై సూచనలు చేశారు. నారింజ రైతు మిత్ర ప్రతినిధులు పాల్గొని, రైతులు సమష్టిగా పంటలను మార్కెటింగ్ చేస్తూ మెరుగైన మద్దతు ధర పొందే మార్గాలను వివరించారు. -
నానో ఎరువుల వాడకంపై అవగాహన
సిద్దిపేటఅర్బన్: నానో ఎరువుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల మధిర భట్టి రామన్నపల్లి గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఏటీఎంఏ) సిద్దిపేట ఆధ్వర్యంలో వరి పంటలో నానో ఎరువుల వాడకంపై బుధవారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. అలాగే పత్తి పంటలోఅంతర పంటగా కంది సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త పల్లవితో కలిసి మండల వ్యవసాయ అధికారి శ్రీనాథ్ రైతులకు నానో యూరియా, నానో డీఏపీ, లింగాకర్షణ బుట్టలు, వేప నూనెలను అందజేశారు. వీటి వాడకం, ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తోర్నాల శాస్త్రవేతలు, సర్పంచ్ వెంకటయ్య , ఉప సర్పంచ్ సృజన, సంపత్ , ఏఈఓ మీరా, వార్డు మెంబర్ గోపి, రైతులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల గంజాయి పట్టివేత
ముగ్గురు అరెస్ట్ పటాన్చెరు టౌన్: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పటాన్చెరు ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎకై ్సజ్ సీఐ శ్రవణ్ కుమార్ వివరాల ప్రకారం.. పటాన్చెరు ఎకై ్సజ్ పోలీస్ బృందం అమీన్పూర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడి వద్ద గంజాయి లభించింది. పట్టుబడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్‌గా గుర్తించారు. అతడి వద్ద నుంచి 1.76 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు షేక్ ఫయాజుద్దీన్, స్వప్న, సిబ్బంది పాల్గొన్నారు. ఇస్నాపూర్‌లో 2.8 కిలోలు.. గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ, పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇస్నాపూర్‌లోని మహేశ్వర కాలేజీకి వెళ్లే రోడ్డులో మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయి సరఫరా చేస్తున్న సంగారెడ్డి మామిడిపల్లికి చెందిన గణపతి, సదాశివపేట గొల్లగూడెంకు చెందిన మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.8 కిలోల గంజాయి, బుల్లెట్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
గజ్వేల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పిడిచెడ్ గ్రామానికి చెందిన గద్ద గంగయ్య(45) తుర్కపల్లిలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగా బుధవారం విధులకు వెళ్లాడు. సమీప బంధువు చనిపోవడంతో భార్య ఊరికి వెళ్లాలని గంగయ్యకు ఫోన్ చేయడంతో అతడు బయలుదేరాడు. కాగా తుర్కపల్లిలో లిఫ్ట్ అడిగి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. మార్గమధ్యలో ప్రజ్ఞాపూర్ శివారు పాతూరు ప్లైఓవర్ బ్రిడ్జీ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద వెనుక నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి, వెనుక కూర్చున్న గంగయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా గంగయ్య మార్గమధ్యలో మృతి చెందాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టిప్పర్ ఢీకొట్టడంతో వ్యక్తి.. పటాన్చెరు టౌన్: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్‌కు చెందిన రాజు(33) తన స్నేహితుడు సాయి కిరణ్‌తో కలిసి మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. సాయి కిరణ్ వాహనం నడుపుతుండగా రాజు వెనుక కూర్చున్నాడు. సంగారెడ్డి నుంచి పటాన్చెరు వైపు వస్తున్న టిప్పర్ వీరి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. వెనుక కూర్చున్న రాజు రహదారిపై పడిపోవడంతో అతనిపై నుంచి టిప్పర్ వెళ్లింది. ఈ ప్రమాదంలో అతడికి కాళ్లకు, తలకు గాయాలయ్యాయి. పటాన్చెరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
18 గంటలు విద్యుత్ ఇవ్వాలి
● భారతీయ కిసాన్ సంఘ్ ● విద్యుత్ శాఖ ఎస్ఈకి వినతి పత్రం అందజేత ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రైతులకు 18 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను అందించాలని, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అఽధ్యక్షుడు జశ్వంత్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుంచి జిల్లా విద్యుత్ భవన్ వరకు భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ర్యాలీ నిర్వహించి, జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం 10 గంటలు మాత్రమే విద్యుత్ ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటను కాపాడాలంటే సరఫరాను వెంటనే పెంచాలని కోరారు. సిద్దిపేట చుట్టుపక్కల కాల్వలు ఉన్నప్పటికీ చెరువుల్లోకి సాగునీరు రాకపోవడం దురదృష్టకరమని, వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే అందుబాటులో ఉన్న నీటి వనరులతో చెరువులు, కుంటలను నింపేలా చర్యలు చేపట్టాలని కోరారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పలు గ్రామాల్లో ఐదు నుంచి ఆరు గంటలు సక్రమంగా విద్యుత్ అందడం లేదని ఆరోపించారు. రైతులు ఇప్పటికే పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టారని, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
వాహనం ఢీకొని లేగదూడ మృతి
కల్హేర్(నారాయణఖేడ్): గుర్తుతెలియని వాహనం ఢీకొని లేగదూడ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం నిజాంపేట్ మండలం బాచేపల్లి వద్ద 161 నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బద్దరం నాగయ్య పశువులను రోడ్డు దాటిస్తున్న క్రమంలో వాహనం ఢీకొని లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని బాధిత రైతు అధికారులను కోరారు. ఇద్దరు అదృశ్యం పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన భానూర్ పోలీస్‌స్టేషన్‌న్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురం పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన సువర్ణ(51), భర్త లక్ష్మినారాయణతో మంగళవారం రాత్రి గొడవ పడింది. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. బీటెక్ విద్యార్థి.. వర్గల్(గజ్వేల్): బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని గుంటిపల్లిలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్సై ఆరోగ్యం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొమ్మ సందీప్(17) గౌరారం సమీప యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. రోజు మాదిరిగా మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితులు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. బుధవారం తండ్రి కనకయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి కల్హేర్(నారాయణఖేడ్): పంట చుట్టూ కరెంట్ తీగలతో కంచె ఏర్పాటు చేసేందుకు వెళ్లిన యువకుడు షాక్‌తో మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబీకులు, తండావాసుల కథనం ప్రకారం.. ఇందిరానగర్ తండాకు చెందిన మలోత్ జైపాల్(32) తోటి స్నేహితుడికి సంబంధించిన వరి పొలం వద్ద అడవి పందులు రాకుండా కరెంట్ తీగలు పెట్టేందుకు కలిసి వెళ్లాడు. పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసేందుకు స్నేహితుడికి సహకరిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా జరగడంతో జైపాల్ తీవ్రంగా గాయపడి పంట పొలంలోనే మరణించాడు. మృతుడికి భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని బస్తీ దవాఖాన, ఫైలేరియా యూనిట్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సెంటర్‌కు వచ్చే వారి నుంచి సేకరించిన రక్త నమునాలను ఎప్పటికప్పుడు సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపించాలని సూచించారు. ఆరోగ్య కార్యక్రమాల పనితీరు మెరుగుపర్చుకోవాలని, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానిత కేసులను స్క్రీనింగ్ చేసి, వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజిస్ట్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
రాజీ మార్గమే రాజమార్గం
మెదక్‌జోన్: చిన్నపాటి వివాదాలను పెద్దవిగా చేసుకుని కోర్టుల చుట్టూ తిరగకుండా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ మంచి అవకాశమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను కక్షిదారులు పరస్పర అవగాహనతో రాజీపడాలని కోరారు. దీంతో సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. కాగా రాజీ పడదగిన కేసులను గుర్తించి సంబంధిత కక్షిదారులకు అవగాహన కల్పిస్తూ పరిష్కారానికి పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది కృషి చేస్తారని తెలిపారు. రాజీ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు సంబంధిత పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. -
ఒక్క క్షణం.. ప్లీజ్
ఆత్మహత్యలు వద్దు.. ఆలోచించండిసంగారెడ్డి క్రైమ్: చదువు భారమని.. ఉద్యోగం రాలేదని.. ప్రేమ విఫలమైందని కొందరు, అప్పులు తీర్చలేక.. భర్త అనుమానించాడని భార్య.. తల్లిదండ్రులు మందలించారని పిల్లలు.. లవ్ ఫెయిల్ తదితర కారణాలతో క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కన్నవారికి, తమ కుటుంబానికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఇలా జిల్లాలో ఎక్కడో ఒకచోట ఆత్మహత్యకు పాల్పడుతూనే ఉన్నారు. జీవితం చాలా విలువైనది. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి. ఏ సమస్యకై నా ఆత్మహత్య పరిష్కారం కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలా అరికట్టవచ్చు వైద్యనిపుణుల విశ్లేషణ ప్రకారం... ఆత్మహత్యకు పాల్పడాలనుకునేవారు ఒంటరిగా ఉంటారు. వెంటనే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వొచ్చు. డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తారు. మహిళల కోసం 181కు కాల్ చేస్తే సఖి కేంద్రం సిబ్బంది ఇంటికొచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. పిల్లలకై తే 1098కి సమాచారం ఇవ్వాలి.పరిష్కార మార్గాలు తమ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చర్చిస్తే పరిష్కార మార్గాలు లభిస్తాయి. కానీ అవేమీ ఆలోచించకుండా చాలామంది చావు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో వారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. వారిపై ఆధారపడ్డ పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడుతున్నారు. ఎవరైనా తాను బతకనని, కుటుంబానికి బరువయ్యానని చెబితే తేలికగా తీసుకోవద్దు. నేను లేని ఇంటిని, జీవితాన్ని ఊహించుకోండి అంటూ చాలా మంది మానసిక వేదన వెలిబుచ్చుతారు. వారిని మార్చే దిశగా ప్రయత్నం చేయకపోతే కోల్పోయే ప్రమాదం ఉంది. వ్యాయామం అలవాటు చేయడం ద్వారా కొంత మార్పు ఉంటుంది. కొన్ని ఘటనలు.. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో యువతి ఆగస్టు 23న ఆత్మహత్య చేసుకుంది. మనోవేదనతో క్షణికావేశంలో మత్తు ఇంజక్షన్ తీసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పుల్కల్ మండలానికి చెందిన యువకుడు కడుపు నొప్పి తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. -
కొండపాక.. ఆధ్యాత్మికతకు నిలయం
అష్టాదశ శక్తి పీఠం దేవాలయ చైర్మన్ కొండపాక(గజ్వేల్): ఆధ్యాత్మికత, సేవా దృక్పథానికి కొండపాక ప్రాంతం భవిష్యత్తులో నిలయంగా మారనుందని అష్టాదశ శక్తి పీఠం దేవాలయ చైర్మన్, ప్రభుత్వ మాజీ సలహాదారు కే.వీ రమణాచారి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో మహిమాన్వితమైన దేవతామూర్తుల దర్శనం ఒకే చోట లభించేలా ఉమా రామలింగేశ్వర సహిత అష్టాదశ శక్తి పీఠం దేవాలయాన్ని నిర్మించామన్నారు. బుధవారం దేవాలయ ఆవరణలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అష్టాదశ శక్తి పీఠం దేవాలయం దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని నిత్యాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఆనంద నిలయం చైర్పర్సన్ లత, వికలాంగుల సేవా సంస్థ చైర్మన్ వంశీ రాధాకృష్ణ, కొండలరావు, ట్రస్టు చైర్మన్ నాగరాజు, రిటైర్టు డిప్యూటీ డీఈఓ వైకుంఠం, సర్పంచ్ నవీన పాల్గొన్నారు. -
బాలల కథల పుస్తకం ఆవిష్కరణ
సిద్దిపేటఅర్బన్: బాలల లోకంలో విహరించిన కథలు ఎల్లకాలం నిలుస్తాయని కథాశిల్పి ఐత చంద్రయ్య పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రచించిన కథల పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 36 మంది విద్యార్థులు రచించిన కథలను ముద్రించడం గొప్ప విషయమని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేశ్, ప్రధానోపాధ్యాయుడు నాగేందర్‌రెడ్డి, కవులు ఉండ్రాళ్ల రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, ఎన్నవెళ్లి రాజమౌళి, పెందోట వెంకటేశ్వర్లు, భైతి దుర్గయ్య, ఎడ్ల లక్ష్మి, మాధవీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వాహనదారులకు తీపి కబురు
● బ్రాహ్మణపల్లి రైల్వేగేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ● ఎంపీ రఘునందన్‌రావుకు కృతజ్ఞతలు తూప్రాన్ /శివ్వంపేట: తూప్రాన్ పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వేగేట్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారు. ఈ రైల్వే గేట్ వద్ద నిత్యం వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను, అలాగే అక్కన్నపేట రైల్వే స్టేషన్లో అజంతా ఎక్స్‌ప్రెస్‌కు స్టాపేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరంపై వివరిస్తూ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు రైల్వే జనరల్ మేనేజర్‌ను బుధవారం కలిసి సమగ్ర నివేదిక సమర్పించారు. ఎంపీ అభ్యర్థనపై స్పందించిన రైల్వే జీఎం 10 రోజుల్లోనే డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసి, మంజూరు ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే తూప్రాన్–నర్సాపూర్ రహదారిపై ప్రయాణించే వాహనదారుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. దీంతో ఎంపీకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షుడు జానకిరామ్గౌడ్, ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.సిద్దిపేట వాసికి డాక్టరేట్ సిద్దిపేటజోన్: సిద్దిపేటకు చెందిన డాక్టర్ బలరాంకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన వనరులను మైక్రో గ్రిడ్ పవర్ సిస్టంలో సమర్థవంతంగా అనుసంధానం చేయడం, హార్మోనిక్స్ తగ్గించడం, విద్యుత్ వ్యవస్థలో సమతుల్యత మార్పిడి తదితర అంశాలపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. రాష్ట్ర గవర్నర్ శుక్లా ఆయనకు డాక్టరేట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బలరాం ను అభినందించారు. బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి మిరుదొడ్డి(దుబ్బాక): బీడీ కార్మికులకు ప్రభుత్వం వెంటనే రూ. 4,016 జీవన భృతి చెల్లించాలని సీఐటీయూ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దెల అంజయ్య కోరారు. బుధవారం మిరుదొడ్డి ఎంపీడీఓ వినోద్ కుమార్, ఇన్చార్జి ఎంపీఓ ఫహీంకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమల్లో పని రోజులు తగ్గిపోవడంతో పాటు, పెరిగిపోతున్న నిత్యావసర ధరల కారణంగా కార్మికుల కుటుంబాలు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవన భృతిని అమలు చేయాలని కోరారు. కేసీఆర్‌పై వ్యాఖ్యలకు నిరసనగా.. సమావేశం బైకాట్ సిద్దిపేటరూరల్: మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మండల సర్పంచ్‌లు సమావేశంను బైకాట్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం కోసం మండల ప్రత్యేకాధికారి ప్రియాంక అధ్యక్షతన సాధారణ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కాగా 10 గంటలు దాటినా సభ్యులు ఎవరూ రాలేదు. దీంతో ప్రత్యేకాధికారి ప్రియాంక, మండల స్థాయి అధికారులు సీట్లలో కూర్చొని సుమారు రెండు గంటల పాటు వేచి చూశారు. తీరా సర్పంచ్‌లు కార్యాలయం వద్దకు వచ్చినా లోపలికి రాలేదు. మాజీ సీఎం కేసీఆర్ మరణాన్ని కోరుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమావేశాన్ని బైకాట్ చేశారు. అనంతరం రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ నవతకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, సర్పంచ్‌లు పద్మ శ్రీనివాస్, మమతరాజు, తిరుపతి, పద్మాదేవి, బాల్‌రాజు ఉన్నారు. -
‘అసైన్డ్’లో అక్రమ నిర్మాణాలు
● అనుమతులు లేకున్నా అడిగేవారు కరువు ● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రేకుల షెడ్లు హత్నూర(సంగారెడ్డి): అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. అధికారుల అనుమతి లేకున్నా బడాబాబులు ఇష్టారాజ్యంగా రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. హత్నూర మండలం ముచ్చర్ల గ్రామ శివారులో సర్వే నంబర్ 98, 242లో అసైనన్డ్ భూములను ప్రభుత్వం పేదలకు కేటాయించింది. ఆ భూములను రాజకీయ నాయకులు, బడా కాంట్రాక్టర్లు కొనుగోలు చేశారు. పక్క నే ఆనుకొని ఉన్న తురకల ఖానాపూర్ శివారులోని అసైనన్డ్ భూములు సైతం లీజు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించారు. ఇంకేముంది ఇష్టానుసారంగా రేకుల షెడ్లు నిర్మించారు. వాటిని ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బడా నాయకుల బరితెగింపు అనుమతుల్లేని నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో బడా నాయకులు బరితెగించి నిర్మాణాలు కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పంటల సాగు కోసం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినా, ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముచ్చర్ల– తురకల ఖానాపూర్ శివారులోని మల్కాపూర్– పటాన్చెరు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని కబ్జా చేసి రేకుల షెడ్ల నిర్మాణాలు చేపట్టి వాణిజ్య, వ్యాపార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో బడాబాబులు అనుమతులు లేకున్నా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నా రు. మండల అధికారులు ఎలాగూ స్పందించడం లేదని, కనీసం కలెక్టర్ అయినా అసైన్డ్ భూములను కాపాడాలని కోరుతున్నారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
నర్సాపూర్ రూరల్: మండలంలోని చిన్న చింతకుంటలో ప్రకృతి వ్యవసాయ సాగు కోసం ఎంపికై న 40 మంది రైతులకు బుధవారం తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి ప్రకృతి (సేంద్రియ) ఎరువులతో పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకంతో భూసారం కోల్పోవడంతో పాటు పంటలు దిగుబడి పూర్తిగా తగ్గుతుందన్నారు. దీంతో పాటు రసాయన ఎరువులతో పండించిన ధాన్యం, పప్పు దినుసులు ఇతర ఆహార పదార్థాలతో అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. మనుషుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయాన్ని అలవర్చుకొని పంటలు సాగు చేయాలని వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ సాగుకు ఎంపికై న రైతులకు వేప నూనె, హ్యూమిక్ ఆమ్లం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సరిత, రైతులు మహేశ్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాళోజీ సేవలు చిరస్మరణీయం
సంగారెడ్డి జోన్: కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం కాళోజీ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో వేర్వేరుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి అక్షర యోధుడిగా కాళోజీ నిలిచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. మట్టి వినాయకులనే పూజించాలి పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మండపాల ఏర్పాటులో నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిర్వాహకులు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో విద్యాశాఖ అధికారి
రూ. 20 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన డీఐఈఓ గోవిందరాంసంగారెడ్డి ఎడ్యుకేషన్: ఏసీబీ వలకు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవిందరాం చిక్కారు. ఓ ప్రైవేట్ కళాశాలకు పాజిటివ్ రిపోర్టు ఇచ్చేందుకు సదరు యాజమాన్యం నుంచి రూ. 20 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. జిల్లా విద్యాధికారి గోవిందరాం గత కొన్ని రోజుల క్రితం పట్టణంలోని వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో కళాశాలలో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో పాటు చిన్ని చిన్న లోటుపాట్లను గుర్తించారు. దీంతో కళాశాలకు పాజిటివ్ రిపోర్టు ఇవ్వాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర విద్యాశాఖకు కళాశాలపై నెగిటివ్ రిపోర్టు ఇస్తానని బెదిరించారు. ఈ నేపథ్యంలో కళాశాల నిర్వాహకులు ఒప్పందం ప్రకారం ముందుగా రూ. 30 వేలు ఇచ్చారు. మిగితా రూ. 20 వేల కోసం రోజు ఫోన్ చేసి ఇబ్బందులు పెట్టారు. దీంతో వారు ఈనెల 7న ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం కలెక్టరేట్లోని ఇంటర్మీడియెట్ కార్యాలయంలో కళాశాల యాజమాన్యం నుంచి రూ. 20 వేలు తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, జిల్లా గోవిందరాంపై విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. బీరంగూడతో పాటు సంగారెడ్డి పట్టణంలోని రెండు కళాశాలలు అనుమతి లేకున్నా, కొనసాగుతున్నాయని విద్యార్థి సంఘాలు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
● ఎల్సీ రిటర్న్ ఇవ్వకముందే ఆన్ ● ప్రాణాలతో బయటపడిన రైతు పాపన్నపేట(మెదక్): విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ నిర్వాకంతో మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఓ రైతు.. సమయస్ఫూర్తితో వ్యవహరించి త్రుటిలో ప్రాణపాయం నుంచి బయపడిన సంఘటన మండలంలోని రుగ్యా తండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్యాతండా పరిధిలోని రుగ్యా తండాలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద బోర్ మోటార్‌కు వెళ్లే వైరు తెగిపోయింది. దీంతో సంబంధిత గిరిజన రైతు రవి నార్సింగి లైన్మెన్ బాబుకు ఫోన్ చేసి ఎల్సీ అడిగాడు. వెంటనే ఎల్సీ ఇచ్చిన బాబు, పని చేసుకోమని పురమాయించాడు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన రవి, రెండు నట్లు విప్పి, మూడో నట్టు విప్పుతుండగా కరెంట్ వచ్చింది. అయితే ఆ సమయంలో నట్టు పూర్తిగా ముట్టుకోకపోవడంతో కొంచెం హమ్మింగ్ వచ్చింది. కాళ్లకు చెప్పులు ఉండటంతో పాటు కరెంట్ పనులపై కొంచెం అవగాహన ఉండటంతో కింద ఉన్న వారికి విషయం తెలిపాడు. వెంటనే రైతులు లైన్మెన్కు విషయం తెలపడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేయించాడు. దీంతో తృటిలో రవి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే విషయమై డీఈ రామేశ్వర్స్వామి వివరణ కోరగా.. సాధారణంగా ఒకేసారి రెండు ఫీడర్లకు ఎల్సీ ఇవ్వొద్దు, కానీ విద్యుత్ సిబ్బంది పొరపాటున ఇచ్చారని తెలిపారు. అవగాహన లోపంతో బాచారం ఫీడర్ రిటర్న్ ఇవ్వాల్సి ఉండగా, నార్సింగి ఫీడర్ ఇచ్చాడన్నారు. అందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రోడ్ల విస్తరణకు శ్రీకారం
గడువు కోరిన వ్యాపారులుజహీరాబాద్ టౌన్: పట్టణంలో రోడ్ల విస్తరణ పనులకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. భవానీ మందిర్, హనుమాన్ మందిర్ రహదారులను 40 అడుగుల వెడల్పుతో విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీల సహాయంతో దుకాణాల ఎదుట భాగంలోని మెట్లను తొలగిస్తూ కూల్చివేత పనులు ప్రారంభించారు. అయితే, జేసీబీలతో నేరుగా కట్టడాలు తొలగిస్తే భవనాలు తీవ్రంగా దెబ్బతింటాయని భావించిన వ్యాపారులు.. తామే స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకుంటామని అధికారులకు విన్నవించారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించి, ఈనెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ తేదీలోగా మార్కింగ్ వరకు ఉన్న కట్టడాలను స్వయంగా తొలగించుకోవాలన్నారు. లేనిపక్షంలో మున్సిపల్ సిబ్బంది కూల్చివేత పనులు కొనసాగిస్తారని స్పష్టం చేశారు. కాగా, రోడ్ల విస్తరణతో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.21కోట్లతో తెల్లాపూర్ అండర్‌బ్రిడ్జి
ఎంపీ రఘునందన్రావురామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని రైల్వే సమస్యలను పరిష్కరించినట్లు మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్‌ను కలిసి రైల్వే సమస్యలపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెల్లాపూర్ – విద్యుత్‌నగర్ మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వెడల్పు కోసం రూ.21 కోట్లు మంజూ రయ్యాయని తెలిపారు. దీనిపై శనివారం సాయిబాబా ఆలయం వద్ద రైల్వే, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తెల్లాపూర్ రైల్వే స్టేషన్‌ను రేడియల్ రోడ్డుకు అనుసంధానించేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి మంజూరైందని చెప్పారు. ఇందులో భాగంగానే త్వరలో ఆ పనులకు భూమిపూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దిశ కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, బీజీపీ రామచంద్రాపురం డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్, తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, నాయకులు సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై పాముల కలకలం
కల్హేర్(నారాయణఖేడ్): నిజాంపేట్ మండల కేంద్రం సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి పాములు కలకలం రేపాయి. వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. రహదారిపైకి కొండచిలువ, ఇతర పాములు వస్తున్నాయని వాహనదారులు తెలిపారు. సంగారెడ్డి టౌన్: పట్టణంలోని బాల సదన్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అలాగే పిల్లల సంరక్షణ, భద్రతతో పాటు హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. అనంతరం అక్కడి పిల్లలతో ముచ్చటించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. బాల సదన్‌లో అందుతున్న భోజనం, తాగునీటి సదుపాయాలు, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్లో అదనపు ప్లాట్‌ఫాం రూ. 40 కోట్లతో నిర్మాణం కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్లో రూ. 40 కోట్లతో అదనపు ప్లాట్ ఫాం నిర్మించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధి కారి పద్మజ వెల్లడించారు. బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు, అఽధికారులు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో రెండు రైళ్లను పెంచాలని వినతిపత్రం అందించారు. ఆమె మాట్లాడుతూ మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు చేపడుతున్న రైల్వే లైన్ పనులు పూర్తయితే టెంపుల్ కారిడార్ ఏర్పాటు అవుతుందన్నారు. 24 గంటలూ భక్తులకు రైల్వే సిబ్బంది స్టేషన్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. మల్బరీ సాగుతో సిరులు రాష్ట్ర పట్టు పరిశ్రమశాఖ జేడీ లత తొగుట(దుబ్బాక): మల్బరీ సాగు చేసిన రైతుల ఇంట సిరుల పంట పండుతుందని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత అన్నారు. మండలంలోని పెద్దమాసాన్‌పల్లి రైతు వేదికలో ‘నాపట్టు.. నా అభిమానం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అవగాహ న సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేడీ హాజరై మాట్లాడారు. పట్టుగూళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. మల్బరీ సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అన్నివిధాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఎల్ని నో ప్రభావంతో వర్షాలు కురిసే పరిస్థితి లేనందన రైతులు సాగుకు ముందురావాలన్నారు. మిగితా పంటల మాదిరిగా పంట పెట్టుబడి ఖర్చులు అంతగా ఉండవన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసే దిశగా రైతులు ఆలోచించాలని ఆమె కోరారు. అనంతరం శాస్త్రవేత్తలు మల్లికార్జున్, రాఘవేంద్ర మల్బరీ సాగుపై రైతులకు ఆవగాహన కల్పించారు. -
నిజాయితీతో కూడిన రచనలకే ఆదరణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నీతినిజాయితీతో కూడిన రచనలనే ప్రజలు ఆదరిస్తారని సీనియర్ రచయిత, ఉపాధ్యాయ ఉద్యమనేత దారం మల్లారెడ్డి, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి పేర్కొన్నారు. వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన కవిసమ్మేళనంలో, దారం మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరి జ్ఞానాన్ని అంది పుచ్చుకుంటూనే లక్ష్యసాధన దిశగా రచనలు సాగాలని సూచించారు. వర్తమాన సమాజం అనేక సంక్షోభాలతో సతమతమవుతున్నదని, దీని వెనకున్న సూత్రధారులు, పాత్రధారులెవరో తేటతెల్లం చేయాల్సిన బాధ్యత రచయితలపై ఉందన్నారు. సహజ వనరులను చెరబట్టేందుకు కార్పోరేట్ శక్తుల పన్నాగాలను తమ రచనల ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి పర్కపెల్లి యాదగిరి, స్రవంతి మహిపాల్, మహమూద్ పాషా, అశోక్ రాజు, కొమురవెల్లి అంజయ్య, బోరెడ్డి మధుసూదన్ రెడ్డి, సుధాకర్, తాటికొండ విష్ణుమూర్తి, అందె ప్రవీణ్, రాజయ్య, రమేశ్ లాల్, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యమనేత దారం మల్లారెడ్డి -
విధుల్లోనే కుప్పకూలి..
తుప్రాన్: విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో అల్లాపూర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విధులకు మెదక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ డి.ఆనంద్ (52) హాజరయ్యారు. విధుల్లో ఉండగానే తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి పోలీసు సిబ్బంది ఆయనను మేడ్చెల్ జిల్లాలోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆనంద్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా హెడ్ కానిస్టేబుల్ మరణ వార్త తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆనంద్ స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా, మల్కాపూర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. గుండెపోటుతో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మృతి -
మిగిలింది నియామకమే!
నివేదించారు..జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు దీపక్‌రాథోడ్ ఆ పార్టీ అధినాయకత్వానికి నివేదిక సమర్పించారు. జిల్లాలో క్షేత్రస్థాయిలోని క్యాడర్ అభిప్రాయం, ద్వితీయశ్రేణి నాయకుల మనోభావాలు, జిల్లా అగ్రనేతల సూచనలను తీసుకున్న దీపక్‌రాథోడ్ ఈ మేరకు రెండు రోజుల క్రితం నివేదికను ఆ పార్టీ అధినాయకత్వానికి అందజేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అధిష్టానం ఈ పదవిని ఎవరికి ఫైనల్ చేస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఈ పదవి ఆశిస్తున్న నాయకులు అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అని వేచి చూస్తున్నారు. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైన అధికార కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రధానంగా జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు తమ అనుచరులకు ఈ పదవిని ఇప్పించుకునేందు కు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఐదు నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షుల ని యామకం జరిగి ఏడాదిన్నర దాటినప్పటికీ సంగారెడ్డి డీసీసీ నియామకం మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. సంగారెడ్డితోపాటు, రంగారెడ్డి, రామగుండం సిటీ డీసీసీలు పెండింగ్‌లో ఉండిపోయాయి. డీసీసీపై అధిష్టానానికి నివేదిక! -
సీఎంను దూషించిన యువకుడిపై కేసు
కొల్చారం(నర్సాపూర్): సామాజిక మాధ్యమంలో సీఎంను దూషించిన యువకుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్ కథనం ప్రకారం.. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ఎంజాల శ్రీనివాస్ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరమైన, అవమానకరమైన పదజాలంతో దూషించాడు. పైగా సెల్ఫోన్లో చిత్రీకరించి తన వాట్సప్ స్టేటస్‌లో, ఇతరులకు షేర్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గొండ కష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. చేగుంట(తూప్రాన్): జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పులిమామిడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్రె దుర్గయ్య(70) భార్య సత్తమ్మ మూడేళ్ల క్రితం మృతి చెందింది. ఈ విషయంలో దుర్గయ్య మనస్తాపానికి గురై నిత్యం తన భార్యను గుర్తు చేసుకుంటూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద దుర్గయ్య చెట్టుకు ఉరివేసుకున్నాడు. మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ బిక్యానాయక్ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తాతా మధుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
● మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి ● అదనపు డీసీపీకి ఫిర్యాదు పటాన్చెరు టౌన్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అదనపు డీసీపీ ఉదయ్‌కుమార్, సీఐ రవీందర్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారని, ఆయనపై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధ పదవిని అవమానించడంతోపాటు ఎస్సీ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్పింగ్‌లు వార్తా మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నాయని, వాటిని పరిశీలించి విచారణ చేపట్టాలని కోరారు. -
బంతిపూల సాగు..
ఆరుతడి కింద సేద్యం చేస్తున్న రైతులు కొల్చారం(నర్సాపూర్): ఒకే రకమైన నీటి ఆధారిత పంటలు సాగు చేసి నష్టపోకుండా ఉండేందుకు, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్న అధికారుల సూచనల మేరకు రైతులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సంగాయిపేట గ్రామ శివారులో గ్రామానికి చెందిన తుంగని సత్తయ్య బోరు బావిలో పుష్కలంగా నీరున్నా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నీటి ఆధారిత పంట వరి సాగు చేస్తున్నాడు. కాగా నష్టపోవద్దన్న అధికారుల సూచనలతో ఆరుతడి కింద బంతితోటను సాగు చేస్తున్నాడు. ఎకరంలో బంతి సాగు చేస్తూ నీటిని పొదుపుగా వాడుతున్నాడు. తద్వారా ఒక పంట దెబ్బతిన్న మరో పంట ఆదుకుంటుందని ఆ రైతు భిప్రాయపడ్డాడు. మొదటి బోరు కింద వరి పంట సాగు చేశాను. ఎకరం పొలం ఊరికే వదిలేశాను. వరికి నీరు ప్రస్తుతం పుష్కలంగా అందిస్తుంది. ఊరికే వదిలేసిన ఎకరంలో ఆరుతడి పంట కింద బంతి సాగు చేసా. పంటకు నీటి వినియోగం కూడా తక్కువే. వచ్చేది పండుగల సీజన్, బంతి సాగు ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది. – తుంగని సత్తయ్య, రైతు, సంగాయిపేట. -
9 బడులు.. రూ.79 కోట్లు
ఉమ్మడి జిల్లాలో పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 73 స్కూళ్లను ఎంపిక చేసి రూ.699.985 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులిచ్చింది. ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలకు నిధులు మంజూరు చేయడంతో వాటి రూపురేఖలు మారనున్నాయి. – సంగారెడ్డి జోన్ ప్రైవేటు పాఠశాలల్లో లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. పబ్లిక్ స్కూల్స్ అందుబాటులోకి వస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గే అవకాశముంటుంది. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి, మెరుగైన మౌలిక వసతులతోపాటు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం, ఉత్తమ ఫలితాలు సాధించి, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం, విశ్వాసం పెంపొందించడమే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఆధునిక సాంకేతికతతో కూడిన తరగతిగదులు, పౌష్టికాహారం, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు, క్రీడా మైదానాలు, పోటీ పరీక్షల కోసం గ్రంథాలయం, తదితర వసతులు కల్పించనున్నారు. మారనున్న పాఠశాలల రూపురేఖలు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయితే విద్యా బోధనతోపాటు క్రీడా, కంప్యూటర్ రంగాల్లో సైతం రాణించేందుకు అవకాశాలుంటాయి. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు, దౌల్తాబాద్, సంగారెడ్డిలోని మునిపల్లి, జిన్నారం, సదాశివపేట, జహీరాబాద్, నిజాంపేట, మెదక్ జిల్లాలోని మెదక్, వెల్దుర్తి మండలాల్లోని పాఠశాలలను ఎంపిక చేశారు. -
మహిళలపై పోలీసుల తీరు సరికాదు
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జోగిపేట(అందోల్): అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం, పోలీసుల తీరుకుని నిరసనగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మహిళ ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరును ఆయన పూర్తిగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పి.జైపాల్ రెడ్డి, మాజీ మార్కెట్లో చైర్మన్లు నారాయణ, డీబీ నాగభూషణం, మాజీ ఎంపీపీ బాలయ్య పాల్గొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అందోల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విద్యార్థినులకు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మద్దతు పలికారు. -
భాషకు ప్రాణాధారం యాస
● ఉద్యమంలో కీలకంగా మారిన యాస ● నేడు తెలంగాణ మాండలిక (భాషా) దినోత్సవం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఏ భాష సాహిత్యాలైనా ఆ ప్రాంత జీవన స్థితిగతులను, చారిత్రక నేపథ్యాన్ని, సంస్కృతీ సంప్రదాయాలు, ప్రజల మనోభావాలను ప్రతిబింబించే అమూల్య సాధనాలు. ఈ క్రమంలో తెలుగు నేల ప్రాశస్త్యాన్ని, తెలుగు ప్రజల జీవన వైవిధ్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత సాహిత్యానికే దక్కుతుంది. రచనకు ప్రాణాధారం భాష అయితే, భాషకు ప్రాణాధారం యాస. ప్రజల నిత్య వ్యవహారం లోంచి పుట్టిన పలుకు సాహిత్యంలో ప్రతిధ్వనించినప్పుడే అది ప్రజల హృదయాలను తాకుతుంది. భాష ఎంత సహజంగా, జనజీవనానికి ఎంత దగ్గరగా ఉంటే ఆ సాహిత్యం అంతగా దేదీప్యమానమవుతుంది. అలాంటి తెలంగాణ ప్రజల పలుకుకు, పల్లె భాషకు, ప్రాంతీయ యాసకు పట్టం గట్టిన తొలి వైతాళికుడు కాళోజీ నారాయణరావు. తెలంగాణ మట్టి వాసనను, మనిషి మనసు తడిని, పల్లె పలుకుబడిని తన కలానికి అద్దిన ప్రజాకవి. సెప్టెంబర్ 9న ప్రజాకవి కాళోజీ జయంతిని, తెలంగాణ మాండలిక (తెలంగాణ భాషా) దినోత్సవంగా నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, రజాకార్ల సమయంలో, ప్రజల ఆవేదనకు అద్దం, ఆత్మగౌరవానికి ఆయుధం, సామాజిక చైతన్యానికి శంఖారావంగా మన యాస నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాటల్లో, చేతల్లో, రాతల్లో, ఆలోచనల్లో, ఆవేదనలో, ఆహార్యంలో తెలంగాణ స్వరూప స్వభావాలను సంపూర్ణంగా దర్శింపజేసిన జిల్లా కవులు, రచయితలు ఎందరో ఉన్నారు. సిద్దిపేటలో తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది కవులు తమ కవితలు, రచనల ద్వారా ఉద్యమానికి మరింత వన్నె తెచ్చారు. దీంతో ఉద్యమం పూర్తిగా కింది స్థాయికి వెళ్లి, ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. నేటికి యువ కవులు, రచయితలు రచనలు, కవితలను తెలంగాణ యాసలోనే వెలువరిస్తున్నారు. తెలంగాణ భాషా సంస్కృతికి ప్రతీక కాళోజీ. తెలంగాణ ఉద్యమ సమయంలో యాస కీలకపాత్ర పోషించింది. తెలంగాణ యాస ఒక భాషా రూపం కాదు. అది ప్రజల జీవన స్వరం. తెలంగాణ యాస సాహిత్యంలో గౌరవాన్ని పొంది, పల్లె పలుకును పండితుల పీఠంపై కూర్చోబెట్టింది. –డాక్టర్ బామండ్ల రాజు, తెలుగు అధ్యాపకులు మన అమ్మ భాష, మాట్లాడే భాష మనకు ప్రత్యేకం. తెలంగాణ యాసకు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రపంచంలో తెలుగు మాట్లాడే వారు 10కోట్ల మంది ఉన్నా.. వారు మాట్లాడే యాసను గుర్తించి తెలంగాణ వారిని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. –అమ్మన చంద్రారెడ్డి, సిద్దిపేట రచయితల సంఘం అధ్యక్షుడు -
సంగారెడ్డికి స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డు
● 31వ వార్డుకు రూ.10 లక్షల నగదు రివార్డుసంగారెడ్డి: స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో రాష్ట్రస్థాయిలో సంగారెడ్డి మున్సిపాలిటీకి గుర్తింపు లభించడంతోపాటు, 31వ వార్డుకు రూ.10 లక్షల రివార్డు లభించింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ జగ్గరి సతీశ్‌రెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులుండగా 31వ వార్డుకు సంబంధించి 100% డోర్ టూ డోర్ కలెక్షన్, 60% సోర్స్ సెగ్రిగేషన్, వార్డుల్లో గ్రీన్ డెవలప్మెంట్, ప్రతీ వీధికి డ్రైనేజ్ క్లీనింగ్ చేపట్టడం వంటి అంశాలకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు సాధించేందుకు సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కమిషనర్‌తోపాటు 31 వ వార్డు ప్రజలకు జగ్గారెడ్డి, నిర్మల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, నాయకులు జార్జ్ పాల్గొన్నారు. -
నల్లవాగు ఆయకట్టుకు నీరందించాలి
మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డిడిమాండ్ కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు చివరి ఆయకట్టు కింద ఎండుతున్న పంటలు కాపాడేందుకు సాగు నీరు అందించేంతవరకు పోరాటం చేస్తామని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండలంలోని ఖానాపూర్(కె)లో భూపాల్రెడ్డిను కల్హేర్ ఎస్ఐ రవిగౌడ్ ఆధ్వర్యంలో గృహ నిర్బంధం చేశారు. నీటి సరఫరా చేయాలని కలెక్టరేట్‌కు బయల్దేరుతుండగా పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు. వర్షాలతో నల్లవాగు ప్రాజెక్టు నిండినా ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. నల్లవాగు కాల్వల్లో పిచ్చి మొక్కలు, పూడిక నిండటంతో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడంలేదని తెలిపారు. ప్రజల తరఫున మాట్లాడితే గొంతు నొక్కేందుకు నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామ్‌సింగ్, నాయకులు ఉప్పరి మోహన్ పాల్గొన్నారు. -
భద్రత ప్రమాణాలే ముఖ్యం
జిన్నారం (పటాన్చెరు): పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం బొల్లారం పారిశ్రామికవాడలోని సీఐ సుధీర్‌కుమార్ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికవాడలో భద్రత ప్రమాణాల విషయంలో పరిశ్రమల సహకారం అందించాలని సూచించారు. పరిశ్రమల్లో భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు వాటి పర్యవేక్షణకు యాజమాన్యాలు బాధ్యత వహించాలన్నారు. అలాగే పరిశ్రమల్లో విధులు నిర్వహించే కార్మికుల వ్యక్తిగత వివరాలు సేకరణకు సంబంధించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి రాయుడు, ఇతర పరిశ్రమల ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. డీసీపీ చింతమనేని శ్రీనివాస్ -
బ్రెస్ట్ ఫీడింగ్ గదిని సద్వినియోగం చేసుకోండి
జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారినారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ గదిని తల్లులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి సూచించారు. ఖేడ్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన గదిని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణ సమయంలో తల్లులు తమచిన్నారులకు బహిరంగ ప్రదేశాల్లో పాలుపట్టేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశామన్నారు. తల్లిపాలు శిశువులకు అత్యంత శ్రేష్టమైన పోషకాహారంతోపాటు ఎదుగుదలకు ఎంతో కీలకమని చెప్పారు. అనంతరం కేజీబీవీలో బాలికలకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఆవరణలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం సుబ్రహ్మణ్యం, సీడీపీఓ సుజాత, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం సమన్వయకర్త పల్లవి, సఖి సమన్వయకర్త కల్పన, వైద్యాధికారి తరణి తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్‌ను ప్రధానిగా చేసుకుందాం
డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డిసంగారెడ్డి: రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే ఏకై క లక్ష్యంగా ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలో మంగళవారం జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన సంఘటన్ సజన్ కార్యక్రమంలో ఆమె పాల్గొ మాట్లాడా రు. స్వాతంత్య్రం రాకముందునుంచి దేశ ప్రజలకు సేవ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు నిచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమానికి హాజరైన ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ లింగం నాయక్ మాట్లాడుతూ... ఆదివాసీలు, యానాదులు, చెంచులు మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ గిరిజనుడికి గుర్తింపునిచ్చేందుకు సంఘటన్ సజన్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జిల్లా కమిటీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, జిల్లా అధ్యక్షుడు రామ్‌చందర్ నాయక్, ఇన్చార్జ్ కిషన్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జార్జ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
దాడి కేసులో ఇద్దరి అరెస్ట్
ఆయుధాలు, బైక్ స్వాధీనం జహీరాబాద్ టౌన్ : కత్తితో దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జహీరాబాద్ రూరల్ ఎస్సై రాజేందర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 6న దిడ్గి గ్రామానికి చెందిన సయ్యద్ అస్లాం(33), జుబేర్ అదే గ్రామానికి చెందిన నీరటి రాజుతో గొడవపడ్డారు. అడ్డుకోబోయిన నీరటి ప్రశాంత్, నీరటి యశ్వంత్‌ను బెదిరిస్తూ అస్లాం కత్తితో, జుబేర్ ఇనుప రాడ్‌తో వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి అల్గోల్ చౌరస్తాలో మెహఫిల్ హోటల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తి, ఇనుప రాడ్, పల్సర్ బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చిరాకుపల్లి ఎస్సై వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు. -
జీపీ కార్యదర్శిపై చర్యలు తీసుకోండి
న్యాల్కల్(జహీరాబాద్): నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోన్న మండల పరిధిలోని మిర్జాపూర్(ఎన్) గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం గ్రామ పంచాయతీ నిధులను డ్రా చేయాలంటే సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్ సంతకాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై న అక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అధికారులు ఉప సర్పంచ్‌గా ఉన్న శ్రీకాంత్‌రెడ్డికి సర్పంచ్ బాధ్యతలను అప్పగించారు. గ్రామ పంచాయతీ నిధుల డ్రాకు సంబంధించి మరో సభ్యుని సంతకం అవసరం కాగా పాలక వర్గం సభ్యులు వార్డు సభ్యుడు జగన్‌ను ఎన్నుకున్నారు. కానీ పంచాయతీ కార్యదర్శి సంపత్‌కుమార్ మాత్రం గత ఆరు నెలలుగా తమ సంతకం లేకుండానే ఆయన సంతకం పెట్టి నిధులు డ్రా చేస్తున్నారని వార్డు సభ్యులు జగన్ తదితరులు ఆరోపించారు. టీఎస్ బీపాస్ అకౌంట్ నుంచి తమకు తెలియకుండానే నిధులు డ్రా చేస్తున్న ఈ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు డీపీఓకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే శంకర్‌పై ఫిర్యాదు
నంగునూరు(సిద్దిపేట): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు లింగంగౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్‌గౌడ్, తిరుపతి, సిద్దు, స్వామి, వెంకటేశ్వర్లు, అనిల్ పాల్గొన్నారు. అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని గౌరవెల్లి గ్రామంలో ఇటీవల నిర్వహించిన పాఠశాల క్రీడా సమాఖ్య మండలస్థాయి క్రీడా పోటీల్లో కట్కూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరించారు. కాగా వాలీబాల్ సీనియర్ బాలుర విభాగంలో ప్రథమ , ఖోఖో సీనియర్ బాలికల విభాగంలో ద్వితీయ, ఖోఖో జూనియర్ బాలికల విభాగంలో ద్వితీయ, కబడ్డీ సీనియర్ బాలుర విభాగంలో వరుసగా మూడో ఏడాది ప్రథమ బహుమతి సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. దీంతో సర్పంచ్ బాలరాజు, ప్రధానోపాధ్యాయులు సీహెచ్.రఘ విద్యార్థులను అభినందించారు. వ్యక్తికి 5 ఏళ్ల జైలు, జరిమానా సంగారెడ్డి: గంజాయి అక్రమ రవాణా కేసులో నేరం రుజువు కావడంతో ఓ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ జిల్లా అదనపు న్యాయ అధికారి జయంతి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారుల వివరాల ప్రకారం.. నిందితుడు బీరంగూడకు చెందిన మాలపాటి కరుణాకర్ రెడ్డి అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా అప్పట్లో ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఎకై ్సజ్ అధికారులను, సిబ్బందిని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్ గాయత్రి, జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు అభినందించారు. యువకుడి పరిస్థితి విషమం నర్సాపూర్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలో మంగళవారం నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారిలోని రెడ్‌ఫోర్ట్ హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎర్ల నవీన్ బైక్‌పై నర్సాపూర్ వస్తుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్‌కు తీవ్ర గాయాలవగా కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి విషమంగా ఉంది. చేర్యాల(సిద్దిపేట): పుట్టుకతో మలద్వారం లేకుండా జన్మించిన దూడకు స్థానిక ప్రాంతీయ పశువైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి కృత్రిమ మలద్వారం ఏర్పాటు చేశారు. చేర్యాలకు చెందిన రావుల శంకర్‌గౌడ్‌కు చెందిన దూడ పుట్టుకతోనే మలద్వారం లేకపోవడంతో పశువైద్యులను సంప్రదించారు. ఈ మేరకు ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డా.జంగ రాజిరెడ్డి ఆధ్వర్యంలో దూడకు ‘సీకోస్టమి’ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలో భాగంగా దూడ కుడివైపు పొట్టభాగంలో కృత్రిమ మలద్వారాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దూడకు మల విసర్జనకు మార్గం ఏర్పడింది. ఈ అరుదైన శస్త్రచికిత్సలో జేవీఓ మనోహర్‌తో పాటు సిబ్బంది బాలమణి పాల్గొన్నారు. -
వృద్ధుల పింఛన్‌కు అవకాశమివ్వండి
సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి వినతి హత్నూర (సంగారెడ్డి): వృద్ధులకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నస్తిపూర్ గ్రామానికి చెందిన సామాజిక సేవ కార్యకర్త వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రజాభవన్‌లో ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి విద్యాసాగర్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు చేయకపోవడంతో ఎందరో చేయూత లబ్ధిదారులు ఇబ్బందులు పడుతూ పెన్షన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. వినతిపత్రం తీసుకున్న నోడల్ అధికారి విద్యాసాగర్ సానుకూలంగా స్పందించి నట్లు తెలిపారు. ఆ వినతి పత్రాన్ని గ్రామాభివృద్ధి శాఖ సీఈఓకు పంపిస్తానని చెప్పినట్లు వివరించారు. ఆ ఏజెన్సీలను రద్దు చేయండిమెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి డిమాండ్ సంగారెడ్డి: కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలను రద్దు చేయాలని మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.యాదగిరి డిమాండ్ చేశారు. ఏజెన్సీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాధికారులను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాస్పత్రి ముందు మంగళవారం కార్మికులు ధర్నా చేయడంతోపాటు మోకాళ్లతో నిరసన తెలిపారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సదానందం,నాగరాజు,రమేశ్, రమాదేవి మరియమ్మ, భాగ్యలక్ష్మి, సునీత, మంజుల, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు. వ్యాయామమే ఆరోగ్యానికి ఔషధంస్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సుభాష్ రేగోడ్(మెదక్): ప్రజల్లో ఫిజియోథెరపీ.. వ్యాయామం ప్రాముఖ్యతపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పి.సుభాష్ తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా వ్యాయా మం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించవచ్చన్నారు. గుండె వ్యాధు లు, పక్షవాతం, క్రీడా గాయాలు, సర్జరీకి ముందు–తర్వాత రిహాబిలిటేషన్‌లో ఫిజియోథెరపీ కీలకమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫిజియోథెరపీ సేవలపై అవగాహ న మరింత పెరగాలని ఆయన సూచించారు.తొగుట(దుబ్బాక): ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సూచించారు. మిరుదొడ్డి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పర్పంచ్‌లు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆధార్‌కార్డే ఆధారమైంది..
మెదక్ కలెక్టరేట్: పదకొండేళ్ల క్రితం తప్పిపోయిన మతిస్థిమితం లేని అమ్మాయికి ఆధార్‌కార్డే ఆధారమై తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి హేమభార్గవి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన మతిస్థిమితం లేని బాలిక 11 ఏళ్లున్నప్పుడు 2014లో ఇంటి నుంచి తప్పిపోయింది. హైదరాబాద్‌లో దొరకడంతో అధికారులు మెదక్ జిల్లా శివ్వంపేటలో గల బేతాని సంరక్షణ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. ఆమెకు ఆధార్‌కార్డు లేకపోవడంతో వివరాలు నమోదు చేయించేందుకు పలుమార్లు ప్రయత్నం చేయగా రిజక్ట్ అయ్యింది. దీంతో ఇటీవల ఆమెను మాదాపూర్‌లోని ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లగా అప్పటికే నమోదైన ఆధార్ నెంబర్ వచ్చిందని తెలిపారు. దాని ఆధారంగా తల్లిదండ్రుల ఆచూకీ లభించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె వయస్సు 23ఏళ్లు కాగా తల్లిదండ్రులను పిలిపించి ఆమెను అప్పగించారు. ఈ విషయంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది నాగరాజు, శ్రీనివాస్, సరిత, మంజుల, బేతాని ఆశ్రమ సోషల్ వర్కర్ వీరబాబ పాల్గొన్నారు. 11ఏళ్ల తరువాత తల్లిదండ్రుల చెంతకు చేరిన అమ్మాయి -
పాముకాటుతో బాలుడి మృతి
కంగ్టి(నారాయణఖేడ్): పాముకాటుకు గురై బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రాంతీర్థం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పార్వతి, నగేశ్ దంపతులు తమ కుమారుడు సూర్య(12)తో కలిసి చేనులో వ్యవసాయం పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు పాము కరిచినట్లు బాలుడు తెలుపడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అక్కడి నుంచి నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో బాలుడు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఏకై క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చికిత్స పొందుతూ వివాహిత.. బెజ్జంకి(సిద్దిపేట): చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందింది. కుటుంబీకుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చీమలకుంటపల్లెకు చెందిన తుమ్మ కొమరయ్య గతంలో ఉపాధి నిమిత్తం బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామానికి వచ్చాడు. అతని పెద్ద కుమార్తె తేజ(27)కు గ్రామంలోని మెండ రాజుతో 2018లో పెళ్లి చేశాడు. ఆ తరువాత కొమరయ్య స్వగ్రామానికి కుటుంబంతో తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తేజకు తమ కుటుంబాన్ని కలవలేననే బాధ ఉండేది. ఈనెల 4న తేజ ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన బంధువులు వెంటనే అంబులెన్సులో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తేజ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
టోల్ ప్లాజా వద్ద తనిఖీలు
కొండపాక(గజ్వేల్): మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసేలా ప్రేరేపించడాన్ని నిరసిస్తూ ఎర్రవల్లిలో ఫాంహౌజ్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా వెళ్తారని, వీరిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు వెళ్తారన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు మంగళవారం పోలీసులు కొండపాక , కుకునూరుపల్లి మండలాల బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు కాకుండా బయట ఉన్న నాయకులు ఫాంహౌజ్ వద్దకు వెళ్లకుండా దుద్దెడ శివారులోని రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అయినా బీఆర్ఎస్ నాయకులు ఫాంహౌజ్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. టోల్ ప్లాజా వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. -
‘సర్’ నోటీసులపై గుబులు
ఇంకా పూర్తికాని పంపిణీ ప్రక్రియ ● బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలు సేకరణ ● అభ్యంతరాల స్వీకరణకు స్పెషల్ డ్రైవ్ ● నోటీసుల జారీలో అధికారుల నిర్లక్ష్యం సంగారెడ్డి జోన్: సమగ్ర ఓటరు జాబితా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం జూన్ 25న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ చేపట్టింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఓటర్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు తిప్పలు తప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు. 2002 జాబితా ఆధారంగా 2025 జాబితాను అనుసంధానం చేసుకుంటూ ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అందించారు. గత నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలతో గత ఓటరు జాబితాకు తేడాలు ఉండటంతో సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. 4 లక్షల 60 వేల మందికి నోటీసులు జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాకు మ్యాపింగ్ కాని వారితో పాటు ముసాయిదా జాబితాలో ఉన్న వివిధ రకాల తేడాలు, చిన్నపాటి పొరపాట్లు ఉన్న వారందరికీ నోటీసులు అందిస్తున్నారు. ఈ మేరకు 5 నియోజకవర్గాల్లో 4,60,387 మంది ఓటర్లకు నోటీసులు అందించేందుకు జనరేట్ చేశారు. ఇప్పటివరకు 3 లక్షల 12 వేల వరకు నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా లక్షా 48 వేల మందికి నోటీసులు అందించాల్సి ఉంది. అన్ మ్యాపింగ్ అయిన ఓటర్లు, గత ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న వివరాలను పోలుస్తూ స్వల్ప తేడాలు ఉన్న, ఓటరు పేరు మార్పు చెందినా వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. మ్యాపింగ్ పూర్తయినప్పటికీ ఓటరు పేరు, వయస్సు, తల్లిదండ్రుల పేర్లలో తేడాలు ఇతర కారణాలతో నోటీసులు అందాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి తేడాలు ఉన్నా నోటీసులు జనరేట్ చేస్తుంది. నోటీసులు జారీ చేయడంలో పలువురు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సమాచారం. ఇబ్బందులు పడుతున్న ఓటర్లు.. అర్హులైన ఓటర్లకు వివిధ కారణాలతో నోటీసులు రావటంతో సరిదిద్దుకునేందుకు తమ పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఓటరుగా ఉండేందుకు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల పత్రాల్లో ఏవైనా నాలుగు సంబంధిత బీఎల్ఓలకు అందించాల్సి ఉంటుంది. ఎక్కువగా నిరుపేదలతో పాటు నిరక్షరాస్యులు ఉండటంతో ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ వేస్తున్నారు. పత్రాలు లేకపోవడంతో తమ ఓటు గల్లంతవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఈనెల 16 వరకు ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సర్ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాల సేకరణకు బూత్‌ల వారీగా ప్రత్యేకంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. నియోజకవర్గం జనరేట్ అయిన జారీ చేసిన పెండింగ్‌లో నోటీసులు నోటీసులు ఉన్నవినారాయణఖేడ్ 74,960 68,189 6,771 అందోల్ 66,306 50,797 15,509 జహీరాబాద్ 79,539 67,084 12,455 సంగారెడ్డి 75,641 48,829 26,812 పటాన్చెరు 1,63,941 77,112 86,829 -
బస్తీ దవాఖానాలకు సుస్తీ!
● అంతంత మాత్రంగానే వైద్య సేవలు ● సమస్యల నిలయాలుగా ఆరోగ్య కేంద్రాలు ● వేధిస్తున్న సిబ్బంది కొరత జహీరాబాద్ టౌన్: పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువనున్న హమాలీ కాలనీ, గడీ తదితర ప్రాంతాల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్నాయి. పాలకుల శ్రద్ధ లోపించడం, అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువవటంతో ఆయా దవాఖానాల్లో వైద్య సేవలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖానాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉండగా..సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతీ బస్తీ దవాఖానాలో వైద్యుడితోపాటు నర్సు, అటెండర్, స్వీపర్ అందుబాటులో ఉండాలి. కానీ, ఇక్కడ కేవలం వైద్యుడు, నర్సు మాత్రమే పనిచేస్తుండటంతో పారిశుద్ధ్యం సహా ఇతర పనుల నిర్వహణ పడకేసింది. సరైన మోతాదులో మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాల అపరిశుభ్రత..పశువులు, కుక్కల స్వైరవిహారం, దవాఖానాల చుట్టూ మురుగునీరు చేరి ఈగలు, దోమలకు నిలయంగా మారాయి. దీంతో ఆస్పత్రికి రావాలంటేనే బాధితులు జంకుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బస్తీ దవాఖానాలలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి, సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
విద్యారంగ సమస్యలపై పోరాటం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఈనెల 18, 19, 20 తేదీలలో జరిగే యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని కార్యాలయంలో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పై ప్లీనరీలో విస్తృతంగా చర్చించి, భవిష్యత్‌లో చేపట్టాల్సిన విద్యార్థి ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు జాతీ య, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, రుక్మిణి, జస్విక, ప్రియాంక, సాహితి, ధరణి, చందన తదితరులు పాల్గొన్నారు. -
వినతులు త్వరగా పరిష్కరించండి
అదనపు కలెక్టర్ పాండుసంగారెడ్డి జోన్: ప్రజావాణిలో వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 80 వినతులు అందాయని తెలిపారు. కలెక్టరేట్లో 50, సంగారెడ్డి డివిజన్లో 24, జహీరాబాద్ 5, నారాయణఖేడ్ 1 వినతి అందగా, అందోల్ డివిజన్లో ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అదేవిధంగా మండలస్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు మొత్తం 317 అర్జీలు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తమకు జీవనాధారమైన భూములను సాగు చేయనీయకుండా కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి కంచె వేస్తున్నారని కందికి చెందిన మహిళా రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు చర్య లు తీసుకొని పంటలు సాగు చేసేలా అనుమతి ఇవ్వాలని కోరారు. -
సర్వర్ సతాయిస్తోంది!
జనగణనలో భాగంగా విలేజ్ డైరెక్టరీల తయారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయా గ్రామాల్లోని మౌలిక సదుపాయాల వివరాలను నమోదు చేసే ఓఆర్‌జీఐ వెబ్సైట్ సర్వర్ సతాయిస్తోంది. దీంతో ఆయా గ్రామాలు, పట్టణాల సమూల సమాచారాన్ని జీపీఓలు క్రోడీకరించినప్పటికీ.. ఆ సమాచారాన్ని వెబ్సైట్లో నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి జనగణన (సెన్సస్)లో భాగంగా ఇప్పటివరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (ఇండ్ల గణన) చేసిన ప్రభుత్వం, ఇప్పుడు విలేజ్ డైరెక్టరీ (గ్రామ సమాచార దర్శని), మున్సిపాలిటీలకు సంబంధించి టౌన్ డైరెక్టరీలను రూపొందిస్తున్న విషయం విధితమే. గ్రామ, పట్టణానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొత్తం తొమ్మిది రకాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల వివరాలను ఈ డైరెక్టరీల్లో నమోదు చేశారు. పాఠశాలలు, వివిధ రకాల కళాశాలలు వంటి విద్యా పరమైన సౌకర్యాలు, ఆసుపత్రులు.. వాటిల్లో అందించే వైద్య సేవలు.. ఆయా గ్రామంలో ఇవి లేకపోతే ఎంత దూరంలో అందుబాటులో ఉన్నాయనే వివరాలను సేకరించారు. తాగునీటి వసతి, డ్రైనేజీలు.. బస్సు, రైలు, విమాన వంటి రవాణ సదుపాయాలతో పాటు కమ్యునికేషన్స్ వంటి వివరాలను కూడా ఈ డైరెక్టరీలో పొందుపరుస్తున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు.. సాగు భూమి.. గ్రామ/ పట్టణ భౌగోళిక వివరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, చేతివృత్తులు ఇలా మొత్తం తొమ్మిది అంశాలకు సంబందించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. మూడో వంతు గ్రామాలకే.. జిల్లాలో 647 పంచాయతీలు ఉన్నాయి. 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటికి గ్రామ, పట్టణ డైరెక్టరీలను తయారు చేస్తున్నారు. ఆగస్టు 10 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు ఆఫీసర్లు ఈ గ్రామ సమాచారాన్ని సేకరిస్తున్నారు. నెల రోజుల పాటు కొనసాగిన ఈ ప్రక్రియ నేటితో ముగియాల్సి ఉంటుంది. కానీ సర్వర్ సమస్య కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈవివరాలన్నింటిని నమోదు చేసే ఓఆర్‌జీఐ వెబ్సైట్ సర్వర్ తరచూ సతాయిస్తోందని జీపీఓ (పంచాయతీ కార్య దర్శులు) వాపోతున్నారు. ఒక్కో సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలంటే సమయం బాగా తీసుకుంటోందని, తీరా వివరాలన్నీ టైప్ చేశాక సర్వర్ సమస్య కారణంగా సేవ్ కావడం లేదని చెబుతున్నారు. దీంతో 647 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటివరకు సుమారు 450 పంచాయతీల్లోనూ ఈ ప్రక్రియ పూర్తికాలేదని అంటున్నారు. దీంతో ఈ గడువు మరికొన్ని రోజులు పొడగించాల్సిన పరిస్థితి నెలకొంది. విలేజ్, టౌన్ డైరెక్టర్ రూపకల్పనకు సాంకేతిక సమస్యలు గ్రామాల, పట్టణాల్లో మౌలిక వసతుల వివరాల సేకరణ ఆన్లైన్లో నమోదుకు మొరాయిస్తున్న ఓఆర్‌జీఐ వెబ్సైట్ నేటితో ముగియనున్న నిర్దేశిత గడువు జిల్లా పరిధిలో ఉండే పటాన్చెరు, తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం, వంటి ప్రాంతాల్లోని ఈ వివరాలను జిల్లా అధికారులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు పంపారు. ఈ వివరాలను ఆ కార్పొరేషన్ అధికారులే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
జీపీ కార్యదర్శికి షోకాజ్
హత్నూర(సంగారెడ్డి): ‘చెత్తశుద్ధి కరువు‘ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి స్పందించారు. మండలంలోని ఎల్లమ్మగూడలో సేకరించిన చెత్తను చెరువులో వేసినందుకు కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం చెరువులో వేసిన చెత్తను సిబ్బందితో తొలగింపజేశారు. గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లలో వేర్వేరుగా వేసి ఎరువులు తయారు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. ఇష్టానుసారంగా చెత్తను చెరువుకుంటలో వేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. మండలంలో 38 పంచాయతీలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులకు సైతం మెమోలు జారీ చేస్తున్నట్లు ఇన్చార్జి ఎంపీడీఓ యూసుఫ్ తెలిపారు. -
అక్రమ అరెస్ట్‌తో గొంతు నొక్కలేరు
రామచంద్రాపురం(పటాన్చెరు): అక్రమ అరెస్ట్‌లతో తమ గొంతు నొక్కలేరని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అన్నారు. సోమవారం పట్టణంలోని నివాసంలో ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపు మేరకు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తమను హౌస్ అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మా పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. పుల్కల్(అందోల్): మండల పరిధిలోని సింగూర్ ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) గ్రామ సమాఖ్యలో రుణాల రికవరీలో అవకతవకలు జరిగినట్లు మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో 23 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. సంఘాల ద్వారా తీసుకున్న రుణాలు ప్రతీ నెల వాయిదాల ప్రకారం చెల్లించాలి. అయితే కొందరు సభ్యులు రుణాల రికవరీపై నిర్లక్ష్యం వహిస్తూ చెల్లింపులు జరపలేదు. దీంతో వీఓఏ రెగ్యూలర్‌గా చెల్లింపులు జరిపే మహిళల నుంచి తీసుకున్న రుణ డబ్బులను సభ్యులందరికీ సర్ధుబాటు చేసి చెల్లింపులు చూపారు. దీంతో సక్రమంగా చెల్లించే మహిళా సభ్యులు సకాలంలో చెల్లించనట్లుగా మారారు. ఈ విషయం బ్యాంకు అధికారుల ద్వారా తెలుసుకున్న మహిళా సభ్యులు ఐకేపీ అధికారులను నిలదీశారు. దీంతో సోమవారం ఐకేపీ ఏపీఎం చంద్రశేఖర్ గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. సుమారు రూ.10 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. కొండాపూర్(సంగారెడ్డి): రెండు రోజులుగా కొండాపూర్‌లో జరుగుతున్న డీవైఎఫ్ఐ జిల్లా మహాసభలు సోమవారంతో ముగిశాయి. ముగింపు రోజున జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీకాంత్, కార్యదర్శిగా బాబురావు, ఉపాధ్యక్షులుగా అనిల్, శ్రీకాంత్ సహాయ కార్యదర్శిగా మహేందర్ రెడ్డి, కమిటీ సభ్యులుగా మోహిన్ పాషా, మహిపాల్, సాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు, భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు మాణిక్యం, జయరాజ్, నాగరాజ్, రాజయ్య , నర్సింలు, ఆసిఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్: జాతీయస్థాయి రాక్‌బాల్ పోటీలు బీవీరాజు ఇంజనీరింగ్ కాలేజీలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం రెండో రోజు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడల నిర్వహణ అభినందనీయమని మురళీయాదవ్‌ను అభినందించారు. అనంతరం ఆయా రాష్ట్రాల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాక్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పోటీలను పర్యవేక్షించారు. కాగా, వర్షంతో పోటీల నిర్వహణకు కొంత ఇబ్బందిగా మారింది. -
బకాయిలు వెంటనే చెల్లించాలి
రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ మెదక్‌జోన్: ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. సోమవారం మెదక్‌లోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 10న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చా రు. పీఆర్సీ నివేదిక ఆధారంగా ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆరు విడతల కరువు భత్యం (డీఏ) పెండింగ్‌లో ఉందని, అది ఒకే దఫాలో చెల్లించాలన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల సొమ్ము ప్రభుత్వం వద్ద నిలిచిపోయి, ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. నగదు రహిత ఆరోగ్య కార్డులు అనేక ఆస్పత్రుల్లో చెల్లుబాటు కాకపోవడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పటం లేదని వాపోయారు. కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, జేఏసీ రాష్ట్ర ప్రతినిధులు దామోదర్‌రెడ్డి, గజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక మాస్టర్ ప్లాన్
మూడు దశాబ్దాలగా జహీరాబాద్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడనుంది. వారం రోజుల్లో మాస్టర్ ప్లాన్ అమలుకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే మున్సిపల్ కౌన్సిల్ పలుమార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తాజాగా చైర్మన్ యూనూస్, కమిషనర్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. – జహీరాబాద్ జహీరాబాద్ పట్టణం రోజు రోజుకు విస్తరిస్తున్నా రహదారులు మాత్రం ఆక్రమణలతో కుంచించుకుపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వారం రోజుల్లో ఎప్పుడైనా రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే వ్యాపారుల వైపు నుంచి సైతం సమ్మతం లభించింది. దీపావళి వరకు అయినా విస్తరణ పనులను తాత్కాలికంగా వాయిదా వేయాలని, వచ్చిన విన్నపాలను అధికారులతో పాటు మున్సిపల్ కౌన్సిల్ తిరస్కరించింది. పట్టణంలోని భవానీ మందిర్, హనుమాన్ మందిర్ రోడ్డు, లతీఫ్ రోడ్డు, ఆదర్శనగర్, బ్లాక్ రోడ్డు, తహసీల్, మోహన్ థియేటర్ రహదారి, 65వ జాతీయ రహదారులను విస్తరించనున్నారు. పట్టణ ప్రణాళిక అధికారులు గుర్తించిన పలు ఆక్రమణ కట్టడాలను ఈసందర్భంగా తొలగించనున్నారు. 1987 డిసెంబర్ 15న వెలువడిన జహీరాబాద్ మాస్టర్ ప్లాన్ జీఓ 995, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం రోడ్లను విస్తరించేందుకు గాను అధికారులు నిర్ణయించారు. టౌన్ ప్లానింగ్ సైతం నోటీసులను జారీ చేసింది. మొదట ఈ రోడ్ల విస్తరణ మొదటి విడతలో అధికంగా రద్దీగా ఉండే భవానీ మందిర్, హనుమాన్ మందిర్ రహదారులను విస్తరించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు, ఇంటి యజమానులతో సమావేశాలు నిర్వహించారు. అన్నివర్గాల నుంచి సమ్మతి లభించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆయా రహదారులను 40 ఫీట్ల వెడల్పుతో విస్తరించనున్నా యి. ఇరువైపులా 5 ఫీట్ల వంతున సెట్ బ్యాక్ ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. రహదారులను ఆక్రమించిన దు కాణాలను ఎంత మేర కూల్చి వేయాల్సి ఉంటుందనే విషయమై ఇప్పటికే కొలతలు నిర్వహించి మార్కింగ్ వేశారు. దశలవారీగా గుర్తించిన రోడ్లన్నింటీని విస్తరించనున్నారు. మోహన్ థియేటర్ రోడ్డును 60 ఫీట్లుగా విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జహీరాబాద్‌లో ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం దశలవారీగా రహదారుల విస్తరణకు మున్సిపల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ మూడు దశాబ్దాల అనంతరం మోక్షం తీరనున్న ట్రాఫిక్ సమస్య ఆయా రహదారులపై పలు వ్యాపార సంస్థలు ఉన్నాయి. వ్యాపార సంస్థల ముందు పార్కింగ్ సదుపాయం లేదు. 20 నుంచి 30 ఫీట్ల వెడల్పుతో రహదారులు కుచించుకుపోయాయి. కొనుగోళ్ల నిమిత్తం దుకాణాలకు వెళ్లే ప్రజలు వాహనాలను దుకాణాల ముందే పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు సందర్భాల్లో ట్రాఫిక్ స్తంభిస్తోంది. రహదారులను విస్తరించేందుకు మున్సిపల్ శాఖ నిర్ణయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఐఐటీహెచ్‌లో ఇగ్నైట్ సదస్సు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వినియోగదారుల అవసరాలు, నూతన సాంకేతికత, ప్రయోగాలు, నిరంతర అభ్యాసనతోనే నిజమైన మార్పు సాధ్యమవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ సీఎండీ డాక్టర్ అనిల్ ఖండేల్వాల్ అన్నారు. హైదరాబాద్ ఐఐటీలో గెయిల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఎంస్నీ ఫౌండేషన్, ఐటీఐసీ ఇంక్యుబేటర్ ఆధ్వర్యంలో ‘ఎంసీ 2 ప్లస్ ఇగ్నైట్ హైదరాబాద్ కనెక్ట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గెయిల్ సీఎండీ దీపక్‌గుప్త మాట్లాడుతూ.. భారత్‌లో ఇంధన అవసరాలు వేగంగా పెరుగుతున్న తరుణంలో స్వచ్ఛమై న ఇంధనం, ఇంధన భద్రత, సాంకేతిక స్వావలంబనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్, సెన్సార్లు, రోబోటిక్స్, డ్రోన్లు, డిజిటల్ ట్విన్స్‌తో సంప్రదాయ మౌలిక వసతులను ‘ఇంటెలిజెంట్ అసెట్స్’గా మార్చాలని సూచించారు. ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్లో వృథాగా పోతున్న కోల్డ్ ఎనర్జీని డెటా సెంటర్లు, కోల్డ్ స్టోరేజీలు, ఎయిర్సెపరేషన్ యూనిట్లలో వాణిజ్యపరౖంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఎండీ అక్షయ్‌కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
పాపన్నపేట(మెదక్): మండల పరిధి చిత్రియాల్ గిరిజన తండాలో సోమవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్లో ఇనుప పైపులు వేసే క్రమంలో అదుపుతప్పి విద్యుత్ తీగలకు తగలడంతో కరెంట్ షాక్ గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల కుమార్ (35) ట్రాక్టర్ నడుపుతూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం చిత్రియాల్ తండాలోని లక్ష్మణ్ వద్ద కూలీ పనుల కోసం వెళ్లాడు. అక్కడ షెడ్డు నిర్మాణం కోసం ఇనుప పైపులు తీసి ట్రాక్టర్లో వేస్తుండగా బ్యాలెన్స్ తప్పి పైన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లకు ఆ ఇనుప పైపులు తగిలాయి. దీంతో పుట్టల కుమార్‌కు విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కంది/సంగారెడ్డి క్రైమ్: నాలుగు ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ విజయ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. కంది మండలం జుల్కల్కి చెందిన కావలి బాల్‌రాజ్ (24) గ్రామంలో టైర్ షాప్ నిర్వహిస్తూ నివాసం ఉంటున్నాడు. 2025 జూన్‌లో ఓ నలుగురేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడగా, బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన న్యాయవాదులు, పోలీసు సిబ్బందిని, భరోసా కేంద్రాన్ని ఎస్పీ అభినందించారు. మార్షల్‌ఆర్ట్స్‌లో అవార్డులు సిద్దిపేటజోన్: హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎక్స్లెన్న్స్ ఐకాన్ 2026లో సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు మార్షల్ ఆర్ట్స్‌లో అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది పాల్గొన్న టోర్నీలో జిల్లాకు చెందిన కరాటే మాస్టర్ సాజిద్ పాషా గోల్డెన్ నంది అవార్డును అందుకున్నారు. అలాగే ఆయన శిష్యులు శిఖ, ఎల్లాగౌడ్, ప్రభాకర్, మల్లేశం, నవీన్, అస్మా, హరి, అలీ, రేవంత్, శ్రీరాం, రవళి కావ్యలకు వివిధ కేటగిరిల్లో అవార్డులు వచ్చాయి. రాష్ట్ర పోటీలకు గురుకుల విద్యార్థులు చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 11న జరగనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ పి.నర్సింహ్మచారి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ోటిలింగాలలో జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో 8 మంది పాల్గొనగా వర్షిత్, హర్షవర్ధన్, జస్వంత్, వైష్ణో ఆర్యన్, మనోజ్, అభి ఎంపికయ్యారని చెప్పారు. నకిలీ పత్రాలతో ఆస్తుల విక్రయం మూసాపేట: తల్లిదండ్రులకు తానే నిజమైన వారసుడినని నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులను విక్రయించారని సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...కూకట్పల్లి జయనగర్‌లో నివాసం ఉండే ఉన్నం వెంకటేశ్వర్లు, పార్థసారథి తల్లిదండ్రులైన ఉన్నం సుబ్బానాయుడు, అచ్చమ్మలు అమీన్పూర్, బీరంగూడలో సర్వే నం.967లో 1,200 గజాలు కొనుగోలు చేశారు. 2013లో అచ్చమ్మ, 2017లో సుబ్బానాయుడు మరణించారు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం తహశీల్దార్ జారీ చేశారు. అయితే వెంకటేశ్వర్లు తల్లిదండ్రుల స్థలాలను అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా...ఆ స్థలాలపై రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2018లో శ్రీనివాస్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పొందినట్లు తెలిసింది. సుబ్బానాయుడు, అచ్చమ్మలు తమ తల్లిదండ్రులేనని నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని విక్రయించారని, అసలైన వారసులం తామేనని వెంకటేశ్వర్లు, పార్థసారథి ఫిర్యాదు చేశారు. -
తండాలో జ్వర పరీక్షలు
● కదిలిన ఆరోగ్య సిబ్బంది ● 20మందికి రక్తపరీక్షలు ● సీజనల్ వ్యాధులపై అవగాహన అక్కన్నపేట(హుస్నాబాద్): ‘గిరిజన తండాల్లో ప్రబలుతున్న విషజ్వరాలు’అంటూ ఈ నెల 06న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆరోగ్యసిబ్బంది స్పందించారు. మండలంలోని చాపగానీతండా గ్రామపంచాయితీలో సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 40మంది ప్రజలు పాల్గొని 20 మందికిపైగా రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎంఎల్‌హెచ్‌పీ దివ్య మాట్లాడుతూ...తండాలో పర్యటించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అదేవిధంగా దోమల వ్యాప్తిని నివారించటం, విషజ్వరాలు, సీజనల్ వ్యాధులకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలు సూచనలు చేశారు. ఈ కాలంలో కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని ప్రజలకు సూచించారు. గ్రామాలలో ఆశా కార్యకర్తలు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోతు రాజేందర్, హెల్త్ అసిస్టెంట్ బాబురావు, ఏఎన్ఎం రజిత, ఆరోగ్య సిబ్బంది శ్రీనివాస్, సాంబయ్య, ఫరీద్, ఆశ కార్యకర్త తదితులు పాల్గొన్నారు. -
చిగురుమామిడికి పబ్లిక్ స్కూల్ మంజూరు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీజీపీఎస్) మంజూరైంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించేందుకు 73 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.699.895 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఈనెల 5న జీవోనం.164 జారీ చేసింది. ఈ జాబితాలో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఎంపిక చేశారు. ఈ పాఠశాల అభివృద్ధికి రూ.9.62 కోట్ల అంచనావ్యయం కేటాయించారు. హుస్నాబాద్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆధునిక మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.60 కోట్ల పరిపాలనా అనుమతులు హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు హుజూరాబాద్‌కు మార్గంలో ఎదురవుతున్న ఇబ్బందులు హైలెవల్ బ్రిడ్జి మంజూరుతో తీరనున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజూరాబాద్ సుందరగిరి రహదారిపై కిలో మీటర్ 10/022 వద్ద హైలెవల్ బ్రిడ్జి (10 మీటర్ల వెడల్పు) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6.60 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి సోమవారం వెల్లడించారు. ఈ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతో పరిసర గ్రామాల ప్రజలకు ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. హైలెవెల్ బ్రిడ్జి మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
జింకపిల్లను కాపాడిన యువరైతు
కంగ్టి(నారాయణఖేడ్): కంగ్టి మండలంలోని చౌకన్పల్లి శివారులో కాలువిరిగి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న జింకపిల్లను స్థానిక యువకులు రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంటనే గాయపడిన జింకపిల్లను స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తరలించగా.. ఎల్ఎస్ఏ వైద్యులు బస్వయ్య స్వామి ప్రథమ చికిత్స చేసి ఇంజెక్షన్ అందజేశారు. అనంతరం సిర్గాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాముకు సమాచారం అందించడంతో ఆయన అక్కడికి చేరుకుని జింకపిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ జింకపిల్లకు మరింత మెరుగైన వైద్యం అందించి నారాయణఖేడ్ పార్కులో వదిలిపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కంతి శ్రీనివాస్, యువకులు పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలోనే ఇలా..!!
మండలవ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై పర్యవేక్షణ లేనికారణాలతోనే పనులు నిలిచిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నాలుగు ఇరుకు గదుల్లో కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మరమ్మతులు చేయించి అందులో నెట్టుకొచ్చారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సైతం ఎంతో ఇబ్బందుల నడుమ ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలా కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజావాణికి వచ్చే మండల అధికారులు, ప్రజలు వస్తే కూర్చోబెట్టేందుకు కుర్చీలు, టేబుళ్లు కూడా లేని దుస్థితిలో ఉన్నారు. ఇరుకు గదుల్లో ఎంపీడీఓ కార్యాలయం గతేడాది సెప్టెంబర్‌లో నూతన భవనానికి మంత్రి పొన్నం శంకుస్థాపన ఏడాది కావస్తున్నా ముందుకు సాగని పనులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో పలు అభివృద్ధి పనులకు అట్టహాసంగా శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మండల కేంద్రంలోని ‘పోలీస్‌స్టేషన్ వెనక భాగంలో...ఇందిరమ్మ మోడల్ హౌజ్‌కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 387లో సుమారుగా రెండెకరాల ప్రభుత్వ స్థలంలో ‘నూతన ప్రజాపరిషత్ భవనం’నిర్మించేందుకు కేటాయించారు. గతేడాది సెప్టెంబర్‌లో రూ.1.50కోట్ల వ్యయంతో ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి కలెక్టర్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఏడాది కావస్తున్నా పునాదులు తీసి బండరాళ్లు అడ్డు వస్తున్నాయని పనులను నిలిపివేశారు. అక్కన్నపేట(హుస్నాబాద్) పనులు జరగడం లేదు స్వయంగా మంత్రి శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం ఇరుకు గదుల్లో నెట్టుకొస్తున్నారు. త్వరగా నూతన భవనం నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుంది. మంత్రి ఇలాకాలోనే ఇలా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదంటే మాకే బాధేస్తుంది. –జన్నారపు సంపత్, సర్పంచ్ అక్కన్నపేట గ్రామం -
కులసంఘం భూమి కబ్జా చేశారని ధర్నా
హుస్నాబాద్‌రూరల్: ముదిరాజ్ కుల సంఘం భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని మా భూమి మాకు ఇవ్వాలని అక్కన్నపేట మండలం గుబ్బడీ గ్రామస్తులు ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌లు మాట్లాడుతూ.. గుబ్బడి ముదిరాజ్ కుల సంఘం కోసం జనగామ శివారులో రెండెకరాల భూమి కొనుగోలు చేశామని, దీనిని అప్పటి కుల సంఘం నాయకుడు రాజయ్య అక్రమంగా ఆర్వోఆర్లో పట్టా చేసుకున్నారని ఆరోపించారు. వంద కుటుంబాలకు చెందిన కుల సంఘం భూమిని అక్రమంగా కుల పెద్దకు ఎట్లా పట్టా చేశారని ప్రశ్నించారు. ఆర్డీవో స్పందించి గ్రామంలో విచారణ జరిపించి, అక్రమంగా చేసిన పట్టాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజావాణిలో ఆర్డీవో రాంమూర్తికి వినతి పత్రం అందించారు. న్యాయం చేయాలని ఆర్డీవోకు వినతి -
హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు
మద్దూరు(హుస్నాబాద్): భూ తగాదా విషయంలో సొంత అన్న కొడుకుపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఎస్ఐ మహ్మద్ ఆసీఫ్ కేసు వివరాలు వెల్లడించారు. దూల్మిట్ట మండలంలోని హనుమతండా పరిధిలోని మహారాజ్ తండాకు చెందిన సభావత్ దేవేందర్ తన అన్న కొడుకు సభావత్ రాకేశ్‌తో కొన్నేళ్లుగా భూ తగాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 1న ఉదయం బావి వద్ద గొడవ జరిగిన అనంతరం మధ్యాహ్నం ఇంటికి వెళ్లాడు. తర్వాత దేవేందర్ రాజేశ్‌పై కత్తితో దాడి చేయగా అతడికి తల వెనుక భాగంలో గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దేవేందర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడ్ని చేర్యాల జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా కోర్టు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
డ్రగ్స్‌పై అవగాహనలో ఆదర్శం
నషాముక్త్ యువ భారత్‌లో.. లకుడారం జీపీకి రెండో స్థానం కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామంలో సర్పంచ్ శిల్ప యువత మత్తు పదార్థాల బారిన పడితే కలిగే నష్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించి సఫలీకృతురాలైంది. కాగా నషా ముక్త్ యువభారత్ వికసిత్ భారత్ విజేతల్లో లకుడారం గ్రామ పంచాయతీ 2026 ఆగస్టు పోటీల్లో దేశవ్యాప్తంగా ద్వితీయ బహుమతిని గెలుచుకుంది. హర్యానా రాష్ట్రంలో నీర్పూర్ గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు తల్లిదండ్రుల క్షోభకు గురి చేసే విషయాలపై గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పిల్లలు మానుకునేలా సర్పంచ్ శిల్ప తల్లిదండ్రులకు అండగా నిలిచారు. దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీల్లో లకుడారం పేరును దక్కించుకుంది. నిరంతరం ఇలాంటి ఆదర్శమైన పనులు చేస్తూ మరిన్ని బహుమతులు అందుకోవాలని నషాముక్త్ యువభారత్ ఆకాంక్షించింది. ఈ సందర్భంగా సర్పంచ్ శిల్ప మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో నషా మక్త్ యువ భారత్ పోటీల్లో దేశంలో రెండో స్థానంలో నిలిచామన్నారు. ఇలాగే సహాయ సహకారాలుంటే మరిన్ని ఆదర్శమైన బహుమతులు అందుకుంటూ, గ్రామ పేరు ప్రతిష్టలను పెంచుతామన్నారు. బహుమతిని గెలుచుకోడంపై గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
న్యాల్కల్(జహీరాబాద్): న్యాల్కల్ మండల పరిధిలోని మెటల్‌కుంట గ్రామ శివారులో రాత్రి రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి (30) మృతదేహం లభ్యమైంది. మృతుడు నీలం రంగు షర్టు, నైట్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వికారాబాద్ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 7702629707 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. రామచంద్రాపురం (పటాన్చెరు): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వృద్ధుడు ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... గత నెల 14న సదరు వృద్ధుడు రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా చెరువు మట్టి తరలింపు జేసీబీ, ట్రాక్టర్లు స్వాధీనం కొండపాక(గజ్వేల్): అక్రమంగా మట్టిని తరలిస్తున్న జేసీబీ, 2 ట్రాక్టర్లకు జరిమానా విధించినట్లు తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. మండలంలోని దుద్దెడలోని చెరువులోంచి ఈనెల 4న అక్రమంగా మట్టిని జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో ప్రైవేటు వ్యక్తులకు సరఫరా చేస్తున్న విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది వెళ్లి జేసీబీతో పాటు 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జేసీబీకి రూ. 5వేలు, ఒక్కొక్క ట్రాక్టరుకు రూ. 2 వేల చొప్పున జరిమానా విధించామని తెలిపారు. జేసీబీ, ట్రాక్టర్ల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించి వాహనాలను అప్పగించామని పేర్కొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): భార్యతో గొడవపడి జీవితంపై విరక్తి చెందిన యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్ద శంకరంపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ. ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బాయికాడి భాస్కర్ (39) ఆదివారం రాత్రి తన భార్యతో కుటుంబ సభ్యుల విషయంలో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం పట్టణ శివారులోని రేగోడుకు వెళ్లే రహదారిలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్ స్వర్ణకార వృత్తి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మృతుడికి భార్య దీప, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ట్రాక్టర్ అపహరణ.. నిందితుడి అరెస్టు
ములుగు(గజ్వేల్): ట్రాక్టర్‌ను అపహరించిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సోమవారం ములుగు ఎస్ఐ రఘుపతితో కలిసి గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని సింగన్నగూడ గ్రామానికి చెందిన మన్నె ప్రవీణ్ తన తండ్రి ఏగొండకు చెందిన ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేసి అక్కడే వదిలేసి వస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ నెల 5న రాత్రి తన ట్రాక్టర్‌ను పొలం వద్ద ఉంచి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు పొలం వద్దకు వెళ్లి చూడగా ట్రాక్టర్ కనిపించలేదు. దీంతో ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రఘుపతి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఎస్ఐ, సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సింగన్నగూడకు చెందిన పాత నేరస్తుడు మన్నె నరేశ్(33) అపహరణకు గురైన ట్రాక్టర్‌ను మేడ్చెల్ వైపు తీసుకెళ్తుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని విచారించగా ట్రాక్టర్‌ను అపహరించినట్లు ఒప్పుకున్నాడు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని, నిందితుడిని గజ్వేల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు -
చెత్తశుద్ధి కరువు
● అధికారుల పర్యవేక్షణ లోపం ● కలుషితమవుతున్న చెరువులు, కుంటలు హత్నూర(సంగారెడ్డి): ప్రతిరోజు గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్డు ఏర్పాటు చేసింది. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో అది నిరుపయోగంగా మారింది. దీంతో సేకరించిన చెత్తను గ్రామ శివారులోని చెరువుల్లో వేస్తున్నారు. మండలంలోని ఎల్లమ్మ గూడ పంచాయతీలో గత ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించింది. ఎరువులు తయారు చేయాలన్న లక్ష్యంతో అది ఏర్పాటు చేసినప్పటికీ లక్ష్యం నీరుగారి పోతోంది. మండలంలోని పలు గ్రామాల్లో రోజూ సేకరించిన చెత్తను చెరువు, కుంటలో వేయడంతో అవి కలుషితమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను చెరువు, కుంటలో కాకుండా ఇతర ప్రాంతంలో వేయించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానికంగా ఉండని కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకునే గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మండలంలో 38 పంచాయతీలు ఉండగా, సుమారు 35 మంది కార్యదర్శులు పట్టణాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. సర్టిఫికెట్లపై సంతకాలు చేయించేందుకు పంచాయతీకి వెళితే అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు, హైదరాబాద్ వంటి పట్టణాల నుంచి విధులకు చుట్టపు చూపుగా వస్తూ వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
డీజే..యమడేంజర్
శబ్ద కాలుష్యంతో ప్రాణాలకే ముప్పు సంగారెడ్డి క్రైమ్: వేడుకల్లో భారీ డీజే సౌండ్ పెట్టడం వల్ల చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా డీజే మోగడం సరదాగా మారింది. ఇష్టమైన పాటలు మరింత సౌండ్ వినిపించేందుకు ఇందులో సౌలభ్యం ఉండటంతో యువత అమితంగా ఇష్టపడుతున్నారు. దీంతో ఎటు చూసినా రానున్న గణపతి ఆగమన్, గణపతి నవరాత్రి మండపాలు, ఊరేగింపులు ఇలా ఎక్కడ చూసినా డీజేలు మోగనున్నాయి. అయితే శబ్దం మితిమీరితే ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పండుగలు, విందులు, వినోదాలు వంటి సందర్భం ఏదైనా డీజే వినియోగంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. భారీ శబ్దంతో సమస్య జిల్లా కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో పండుగలు, విందులు జరుపుకునేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. డీజే శబ్దాన్ని ఒక స్థాయి వరకు మాత్రమే శరీరం తట్టుకుంటుంది. 60 డెసిబుల్స్ తీవ్రతతో ఏకధాటిగా వింటే వినికిడి సమస్యలు వస్తాయి. సమస్య తలెత్తిన వెంటనే చికిత్స పొందకుండా ఉంటే పూర్తిగా వినికిడి దెబ్బతింటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ డెసిబుల్ 85 దాటితే గుండె లయ తప్పుతుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. గుండెపోటుతో పాటు మెదడులోని నరాలు చిట్టిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వేడుక ఏదైనా డీజే ఉండాల్సిందే! భారీ శబ్దంతో గుండెపోటు వచ్చే అవకాశం పరిమితి మించితే ప్రమాదమే అధిక శబ్దాలు అనర్థానికి దారితీస్తాయి. భారీ శబ్దాలు ప్రమాదకరం. ఈ శబ్దాలను దగ్గరగా వింటే చెవులు, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఒక్కోసారి గుండెపోటు కూడా రావచ్చు. చిన్నారులు, వృద్ధులు తీవ్రమైన శబ్దాలకు దూరంగా ఉండడం ఆరోగ్యకరం. – డాక్టర్ సురేశ్ కుమార్, సంగారెడ్డినిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రధాన రోడ్లలో, కాలనీల్లో భారీ డీజేలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. డీజేను సీజ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – సత్తయ్య గౌడ్, డీఎస్పీ, సంగారెడ్డి -
ఆలయాల్లో చోరీలు.. దొంగ అరెస్ట్
సిద్దిపేటరూరల్: ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రూరల్ సీఐ విద్యాసాగర్ కేసు వివరాలు వెల్లడించారు. దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన ఆస సుదర్శన్ ఇటీవల హైదరాబాదులో వాటర్ ట్యాంక్ డ్రైవర్‌గా పని చేస్తుండగా కాలుకు ఫ్రాక్చర్ అయింది. దీంతో సరైన పనిలేక, డబ్బుల కోసం ఆలయాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో నాంచారుపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి గుడిలో రెండు గుడి గంటలు, ఇర్కోడు ఎల్లమ్మ గుడిలో రెండు గంటలు, హుండీని ఎత్తుకెళ్లి డబ్బులు తీసుకుని పొలాల్లో పడేశాడు. దొంగిలించిన గంటలను సిద్దిపేటలో షాపులో అమ్మివేశాడు. అలాగే 4వ తేదీన రాఘవాపూర్ ఎల్లమ్మ గుడిలో 3 గంటలు, అదే రోజు ముస్తాబాద్ మండలం బదనకల్‌లోని ఎల్లమ్మ గుడిలో 2 గంటలు దొంగిలించి రంగధాపల్లి చౌరస్తాలో గల స్క్రాప్ షాపులో విక్రయించాడు. ఈ క్రమంలో శనివారం బూరుగుపల్లి ఎల్లమ్మ గుడి వద్ద మరో దొంగతనానికి కాపు కాస్తుండగా సమయస్ఫూర్తితో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనం, హెల్మెట్, రించ్ పానా, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో సుదర్శన్ పలుమార్లు జైలుకు సైతం వెళ్లొచ్చినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి మృతికి కారణమైన కొడుకు రిమాండ్ ములుగు(గజ్వేల్): తండ్రి మృతికి కారణమైన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రఘుపతితో కలిసి గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని అడవిమజీద్ గ్రామానికి చెందిన కొమ్ము నవీన్ కుటుంబ సమస్యలతో తన తండ్రి ఆంజనేయులుపై దాడి చేశాడు. దీంతో గాయపడిన తండ్రి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లభించిన ప్రాథమిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ప్రకారం పోలీసులు నిందితుడు కొమ్ము నవీన్‌ను ఈ నెల 5న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని గజ్వేల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. -
ఎరువులు మోతాదు మించొద్దు
రాయికోడ్(అందోల్): ఎరువులు, రసాయనాలు మోతాదుకు మించకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి సారిక అన్నారు. మండలంలోని శంశోద్దీన్పూర్లో అయిల్‌పామ్ పంటలో అంతర పంటగా సాగు చేసిన మినుము పంటను వ్యవసాయశాఖ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు మినుము పంటలో మొక్కల ఎదుగుదల, పూత, ఆశించిన దిగుబడి పొందేందుకు నేల స్వభావానికి తగ్గట్లుగా సమతుల్య ఎరువులను వినియోగించాలన్నారు. ఆధునిక పోషక యాజమాన్య పద్ధతులను అవలంభించాలని సూచించారు. నానో డీఏపీ, యూరియాను రైతులకు అందించి, వాటితో కలిగే ప్రయోజనాపై అవగాహన కల్పించారు. నీటి యాజమాన్యం, కలుపు నివారణ మార్గా లను వివరించారు. అంతర పంటల సాగుతో రైతు లు ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది మమత, రమేశ్ రైతులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడికి అవార్డు ప్రదానం
చేర్యాల(సిద్దిపేట): విద్యా రంగంలో విశేష సేవలు అదిస్తున్నందుకు మండల పరిధిలోని దొమ్మాట ఎంపీపీఎస్ హెచ్ఎం అనగోని వెంకటేశ్వర్లు జాతీయ స్థాయి అవార్డు పొందారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపు భవిష్యత్తులో మరింత బాధ్యతతో విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసేందుకు ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆయనను పలువురు విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. సదాశివపేట(సంగారెడ్డి): తొమ్మిదిమంది జూదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ వెంకటేశ్ వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని ఓ శ్మశానవాటిక సమీపంలో పాడుబడ్డ రేకుల షెడ్డులో ఆదివారం పేకాట అడుతున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు మధ్యాహ్నం దాడి చేసి 9 మంది జూదరులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో చీల వీరేశం, గొంటెల నరేందర్, చినమల శ్రీనివాస్, అల్గొల సతీశ్‌కుమార్, అల్లం నాగరాజు, ఎగమామిడి శ్రీనివాస్, బోడగామ వీరేశం, ప్రకాశ్, బంటు మహేశ్‌కుమార్ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.23వేల నగదు, 10 ఫోన్లు, 6 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకుని జూదరులపై కేసు నమోదు చేశారు. 5 తులాల బంగారం, వెండి, నగదు అపహరణ జహీరాబాద్ టౌన్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన పట్టణంలోని నారాయణనగర్ కాలనీలో చోటుచేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ లవకుమార్ కథనం ప్రకారం.. కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి కెంపుల సాయన్న కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 2న ఉదయం తమ కూతురి ఇంటికి వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా, బీరువాను సైతం పగులగొట్టి అందులోని 5 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి వస్తువులు, రూ. 50 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సంగారెడ్డి క్రైమ్: హాస్టల్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాము నాయుడు వివరాల ప్రకారం.. వట్పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామానికి చెందిన గొల్ల కిషన్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లక్ష్మణ్(13), స్థానిక సంగారెడ్డిలోని హాస్టల్‌గడ్డలో ఉన్న సమీకృత సంక్షేమ హాస్టల్లో ఉంటూ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం 5 గంటలకు తన స్వగ్రామం నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థి సాయంత్రం హాస్టల్‌కు వెళ్లలేదు. ఇటు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో హాస్టల్ అధికారులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిస్తే 87126 61830 నంబర్లకు తెలియజేయాలని తెలిపారు. -
జాతీయ రాక్‌బాల్ పోటీలు షురూ
నర్సాపూర్: నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ కళాశాల జాతీయస్థాయి రాక్‌బాల్ పోటీలకు వేదికగా మారింది. ఆదివారం 10వ సీనియర్ నేషనల్, 7వ సీనియర్ మిక్స్డ్ నేషనల్ రాక్‌బాల్ ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహిస్తున్న అజయ్ ట్రస్టు చైర్మన్, సౌత్ ఇండియా రాక్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీయాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గెలుపోటములను క్రీడాకారులు సమానంగా స్వీకరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో సౌత్ ఏషియా రాక్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపేందర్ సాగ్వాన్, ఆల్ ఇండియా రాక్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ఉమ్మడి మెదక్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ రాజమణి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చెష్యాదవ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కాగా, ఈసారి రాక్‌బాల్ ఛాంపియన్షిప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశంలోని 16 రాష్ట్రాల నుంచి మొత్తం 24 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 42 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు నర్సాపూర్‌కు చేరుకోవడంతో పట్టణంలో క్రీడా సందడి నెలకొంది. -
‘సర్’ నోటీసులు
ఆందోళనలో ఓటర్లు! ● ఏం చేయాలో తెలియక అయోమయం ● జహీరాబాద్‌లో 79 వేల మందికి.. జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన టి.నగేశ్ ఎన్యూమరేషన్ పత్రంలో పొందుపరిచిన తండ్రి వయసుకు తన వయసుకు చాలా దగ్గర వ్యత్యాసం ఉండటంతో ఆయనకు నోటీసు వచ్చింది. దానికి ఎలాంటి పత్రం ఇవ్వాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ● ’పట్టణంలోని వతన్బాగ్కు చెందిన వాహీద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులొచ్చాయి. పత్రాలు సమర్పించాలని బీఎల్ఓ చెప్పారు. కానీ ఏ పత్రాలు సమర్పించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ● జహీరాబాద్ నియోజకవర్గంలోని కొందరు వ్యవసాయ కూలీలకు కూడా నోటీసులు వచ్చాయి. వీరందరికీ అధికారుల ముందు జవాబు ఏమీ ఇవ్వాలో తెలియడం లేదు. ఇలా చాలా మందికి నోటీసులు రావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ● ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తయింది. ముసాయిదా జాబితాను ఇటీవల అధికారులు విడుదల చేశారు. కొందరి పేర్లు, చిరునామాలు, వయసు తదితర వివరాల్లో తప్పులు వచ్చాయి. చిన్న, చిన్న పొరపాట్ల వల్ల చాలా మందికి సర్ నోటీసులు వచ్చాయి. 2020 ఓటరు జాబితాలో ఉన్న తప్పులు ఉన్న ఓటర్లకు ఇప్పుడు నోటీసులు అందుతున్నాయి. నోటీసులు అందుకున్న వారు నిర్దేఽశించిన తేదీల్లో సరైన పత్రాలు అందజేయాలి. ఎన్యూమరేషన్ సమయంలో ఓటర్లు చుక్కలు చూడగా.. ఇప్పుడు నోటీసుల ప్రక్రియ కూడా అలానే జరుగుతుంది. బీఎల్ఓలు ఇళ్లకు వెళ్లకుండా ఓటర్లకు ఫోన్ చేసి నోటీసులు తీసుకెళ్లాలని చెబుతున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎక్కడ తొలగిపబడుతుందోనని అందోళనకు గురవుతున్నారు. 79 వేల మందికి.. జహీరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా.. 2,31,564 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ చేశారు.79,539 మందికి ఎన్నికల కమిషన్ నుంచి వివిధ కారణాలతో నోటీసులు జారీ చేయనుంది. ఇప్పటి వరకు 62,667 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా 16,858 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో కొంత మంది అధికారుల వద్ద హాజరై వారికి సంబంధిత పత్రాలను అందిస్తున్నారు.నోటీసులు అందుకున్న వారు ఎన్నికల సంఘం నిర్దేశించిన సరైన పత్రాలు అందజేయాలి. నోటీసు వచ్చినంత మాత్రాన ఓటు హక్కు తొలగిపోదు. చిన్నపాటి తేడాలు ఉన్నవారు సంబంధిత ధ్రువపత్రాలతో హియరింగ్ సమయంలో సరిచేసుకోవచ్చు. ఓటర్లు భయపడాల్సిన పనిలేదు. తగిన పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. – దశరథ్, తహసీల్దార్, జహీరాబాద్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం ఎస్ఐ అమరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన దర్జి దుర్గేశ్(40) శనివారం రాత్రి పనిపై కౌడిపల్లికి బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో కౌడిపల్లిలోని ఐఓసీ పెట్రోల్‌పంప్ సమీపంలో 765డి జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టగా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని హైదరాబాద్ సూరారంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య అనురాధ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు,బైక్ ఢీకొని ఒకరికి త్రీవ గాయాలు అక్కన్నపేట(హుస్నాబాద్): కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కేశనాయక్‌తండా గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పరిధిలోని చెరువు ముందు తండాకు చెందిన బానోతు భాస్కర్ తండా నుంచి రామవరం గ్రామ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన కారు అతడి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో భాస్కర్‌కు తల భాగం, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు భాస్కర్ తెలిపారు. -
పంటలు పందుల పాలు
● అన్నదాతలపైనా దాడి ● పైరుల రక్షణకు తప్పని పాట్లు ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు అడవి పందులు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి వేళల్లో పంట పొలాలను తీవ్రంగా పాడు చేస్తున్నాయి. రైతులపై సైతం దాడికి దిగుతున్నాయి. దీంతో పంటలు కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు – న్యాల్కల్(జహీరాబాద్) జిల్లాలోని న్యాల్కల్, రాయికోడ్, ఝరాసంగం, జహీరాబాద్, మనూర్, నారాయణఖేడ్, కోహీర్ తదితర మండలాల్లో అడవి పందుల సంచారం ఎక్కువగా ఉంది. ఇవి కర్ణాటక సరిహద్దులో ఉండడం, అక్కడ అడవుల విస్తీర్ణం అధికంగా ఉండడంతో అక్కడ నుంచి పందులు ఎక్కువగా ఇక్కడకు వస్తున్నాయి. ప్రస్తుతం చెరకు, పత్తి, పెసర, మినుము, సోయాబీన్‌తో పాటు ఇతర పంటలు సాగులో ఉన్నాయి. రాత్రి సమయంలో పంటలను పందులు పాడు చేస్తున్నాయని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పందుల బారి నుంచి పంటలు కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. పొలాల చుట్టూ పాత చీరలు కట్టడం, ఇనుప తీగలు అమర్చడం, రాత్రి వేళల్లో టపాకాయలు కాల్చడం వంటిని చేస్తున్నారు. ఫలితంగా పందులు బెడద నుంచి కొంత వరకు పంటలను రక్షించుకుంటున్నామని చెబుతున్నారు. ఇన్ని చేసినా పంటలపై పందుల దాడి కొనసాగుతూనే ఉందని వాపోతున్నారు. పందుల గుంపు తిన్నంత తిని మిగితా పంటలను పాడు చేస్తున్నాయని అంటున్నారు. ప్రతి రోజు రాత్రి పొలాల వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని పంట నష్టపోయిన తమకు పరిహరం చెల్లి ంచాలని మండలంలోని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. -
సైకిల్‌పై వచ్చి.. విధులు పర్యవేక్షించి..
ఆదర్శంగా నిలుస్తున్న హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్సైకిల్పై వచ్చి శానిటేషన్ పనులను పరిశీలిస్తున్న కమిషనర్ మల్లికార్జున్హుస్నాబాద్: కాలుష్య రహిత పర్యావరణానికి కృషి చేస్తూ విధులు నిర్వహిస్తున్న హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 80 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై ప్రయాణం చేస్తూ పనులను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం సిద్దిపేట నుంచి హుస్నాబాద్ పట్టణానికి సైకిల్‌పై ప్రయాణించి ఇక్కడి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పట్టణంలోని ప్రతీ గల్లీకి తిరుగుతూ పనులను పర్యవేక్షించారు. వీధుల పరిశుభ్రత, ఇంటింటి చెత్త సేకరణ, తదితర అంశాలను స్వయంగా పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అలాగే పట్టణంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం సైకిల్‌పై వచ్చి పనులను తనిఖీ చేయడం, గల్లీ, గల్లీకి తిరుగుతూ కమిషనర్ దాదాపు పట్టణంలో 20 కిలో మీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేశారు. ప్రతి రోజు సైకిల్ తొక్కడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం, వాహనాలు తగ్గించి సైకిల్ వాడకం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని కమిషనర్ చేపట్టిన ఈ సైకిల్ ప్రయాణం మంచి సందేశాన్ని అందించిందని ప్రజలు చర్చించుకున్నారు. అలాగే ప్రభుత్వ వాహనాన్ని పక్కన బెట్టి, సైకిల్‌పై వచ్చి ఖర్చు ఆదా చేశారని పేర్కొన్నారు. అయితే సైకిల్ ప్రయాణం ఇలానే కొనసాగాలని స్ధానికులు కోరుకుంటున్నారు. కాగా కమిషనర్‌ను మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్పర్సన్ పద్మ, కౌన్సిలర్లు అభినందించారు. 80 కిలోమీటర్లు ప్రయాణం పారిశుద్ధ్య పనుల తనిఖీలు -
గణేశ్ విగ్రహాన్ని తీసుకెళ్తుండగా ప్రమాదం
కొండపాక(గజ్వేల్): గణనాథుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఐదుగురురికి తీవ్ర, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. కొత్తగూడెంలో భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేసేందుకు యువకులు హైదరాబాద్‌లో విగ్రహాలు తయారు చేస్తున్న చోట ఖరీదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 14న గణనాథుడిని ప్రతిష్టించేందుకు ఆదివారం హైదరాబాద్ నుంచి ట్రాక్టరు సహాయంతో గణనాథుడిని ట్రాలీలో 8 మంది యువకులు తీసుకెళ్తున్నారు. కాగా కొత్తగూడెంకు గణనాథుడిని తీసుకెళ్లేందుకు హైదరాబాద్ నుంచి వరంగల్ దారి వెంట ఉన్న లోలెవల్ బ్రిడ్జిల వద్ద నుంచి తీసుకెళ్లడం సాధ్యం కాదని సిద్దిపేట, హుస్నాబాద్ మీదుగా తీసుకెళ్తున్నారు. కాగా దుద్దెడ శివారులోని కలెక్టరేట్ వద్ద రాజీవ్ రహదారిపై రెండు వైపులా విద్యుత్తు వైర్లు అడ్డుగా ఉండటంతో గణనాథుడిని తీసుకెళ్తున్న యువకులు దిగి కర్ర సహాయంతో వైర్లను సరి చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపునకు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ యువకులను ఢీకొట్టి గణనాథుడిని తీసుకెళ్తున్న ట్రాలీని సైతం ఢీకొట్టింది. దీంతో ఐదుగురు యువకులకు తీవ్ర, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పాటు గణనాథుని విగ్రహం ఎగిరి సుమారు 10 గజాల దూరంలో రోడ్డుపై పడగా నుజ్జునుజ్జు అయ్యింది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్రేన్ సహాయంతో గణనాథుడి విగ్రహాన్ని ప్రక్కకు జరిపి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన సిమెంట్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురికి తీవ్ర, ముగ్గురికి స్వల్ప గాయాలు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు -
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
శివ్వంపేట(నర్సాపూర్): రానున్న కాలంలో ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు ఎలక్ట్రానిక్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం వాహనదారులపై ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని శభాష్పల్లిలో ఈవీ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. బయటి దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం 5లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. దీన్ని అధిగమించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తూప్రాన్ – నర్సాపూర్ హైవే బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని విలేకరులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రైల్వే ఉన్నతాధికారులను ఫోన్లో ఆదేశించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఈవీ చార్జింగ్ స్టేషన్ యజమాని సాదుల్లా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, మండల అధ్యక్షుడు రవి, సర్పంచులు యాదగిరి, కుమార్, బీజేపీ నాయకులు కొండల్రావు, రమేశ్‌గౌడ్, నర్సారెడ్డి, భిక్షపతి, అంజి ఉన్నారు. ఈవీ చార్జింగ్ స్టేషన్ ప్రారంభం ఎంపీ రఘునందన్ రావు -
ఉత్సాహంగా 3కే రన్
పటాన్చెరు టౌన్: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్ ఆదివారం ఉత్సాహంగా సాగింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో జరిగిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని సూచించారు. రన్లో యువత, మహిళలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పరిశ్రమల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘పచ్చదనం పెంచుదాం.. కాలుష్యం.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం’ అంటూ అవగాహన కల్పించారు. ‘రన్ ఫర్ నేచర్’లో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలతో పాటు మొక్కలు పంపిణీ చేశారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె..
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో సామాజిక సంఘ సేవకుడు బోధనం చిన్న నర్సింహారెడ్డి (54) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి భార్య నీరజతో పాటు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు శ్రీజ తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. సిద్దిపేటకమాన్: చాలిచాలనీ జీతంతో పాటు ఉద్యోగం పర్మినెంట్ కాకపోవడంతో మానసిక వేదనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. నంగునూరు మండలం రాజగోపాల్‌పేటకు చెందిన అకుబత్తిని నర్సింలు, భార్య లలిత, ఇద్దరు కుమారులతో కలిసి పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు పవన్‌కుమార్ (25) సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏనిమిదేళ్లుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ల్యాబ్ అటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంత కాలంగా చాలీచాలని జీతంతో చేసే ఈ ఉద్యోగం ఉంటుందో లేదోనని మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ప్రభుత్వాసుపత్రి ఆసుపత్రిలోని మూడో ఫ్లోర్లో పాథాలజీ డిపార్ట్మెంట్లో ఫైర్ సేఫ్టీ ఇనుపరాడ్డుకు తాడుతో ఉరివేసుకున్నాడు. ఆదివారం చూసిన సిబ్బంది కిందకు దించి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యుదాఘాతంతో రైతు కూలీ మృతి
వెల్దుర్తి(తూప్రాన్ ): విద్యుత్ షాక్‌తో రైతు కూలీ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మండల కేంద్రం వెల్దుర్తిలో చోటుచేసుకుంది. ఎస్సై కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం.. శేరిల గ్రామానికి చెందిన మిర్జపల్లి లక్ష్మి, యాదగిరి దంపతుల కుమారుడు రఘుపతి(28) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం వెల్దుర్తి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద గట్టుపై గడ్డి తొలగించే పనికి వెళ్లాడు. గట్టుపై యంత్రంతో గడ్డిని తొలగిస్తుండగా, అక్కడే ఉన్న బోర్ మోటార్ విద్యుత్ తీగలకు యంత్రం తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తను కోల్పోయిన భార్య రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేసీఆర్‌ను కలిసిన ‘గూడెం’
పటాన్చెరు: మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఎర్రవల్లిలో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్య క్రమాలను ఆయనకు వివరించారు. గత రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గానికి నిధులు కరువయ్యాయని వాపోయారు. దీంతో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 22–ఏ మూలంగా నియోజకవర్గంలో 50 వేలకు పైగా ఎకరాల భూములు నిషేధిత జాబితాలో చేరాయని, ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి ప్రజలకు న్యాయం చేయా లని కేసీఆర్‌కు విన్నవించారు. పటాన్చెరు టౌన్: బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశ పెడుతుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం పటాన్చెరులో గాంధీ పార్క్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు వికాస పాదయాత్ర చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, ఉద్యోగ నియామకాలు వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఐఎన్టీయూసీ, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): 18 ఏళ్లు నిండిన నూతన ఓటర్లు తమ దరఖాస్తులు అందించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సూచించారు. ఆదివారం మండలంలోని రుద్రారం, కొర్విపల్లి పోలింగ్ బూత్‌లను ఆమె తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కోసం గ్రామాల్లో ప్రత్యేక క్యాంపెనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ఓటర్లు ఫారం–6 ద్వారా దరఖాస్తులు అందించాలన్నారు. అలాగే ఏదైనా సవరణ అవసరమైతే ఫారం–8 ద్వారా అందించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగింపు దశకు చేరిందని, నోటీస్‌లు అందుకున్నవారు తమ వివరణ అందించాలని కోరారు. ఆమె వెంట తహసీల్దార్ మాలతి, ఆర్ఐ రాజు ఉన్నారు. చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే వారాంతపు సంతలో కూరగాయల కోసం వచ్చిన వారి సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. వారాంతపు సంతకు సమీప గ్రామాల నుంచి ప్రజలు, పరిశ్రమల కార్మికులు ఎక్కువగా వస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో జేబుల్లోని సెల్ఫోన్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తున్నారు. ప్రతివారం చోరీలు పరిపాటిగా మారిపోవడంతో సంతకు రావడానికి జనాలు జంకుతున్నారు. గతం వారం సంతలో ఒకేరోజు పది మంది ఫోన్లు చోరీకి గురైనట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో సెల్ఫోన్లు దొంగిలిస్తూ మైనర్లు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. పోలీసులు నిఘాను పెంచి మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగతనాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
’బొమ్మల పల్లకీ’ పురస్కారాలు ప్రదానం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నందికంది రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆదివారం ’కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ‘బొమ్మల పల్లకీ’ ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారు. పోటీల్లో విజేతగా నిలిచిన సీతమ్మ లొద్ది యాత్రపై వీడియో రూపొందించిన డి.రవీందర్ రెడ్డి(ప్రథమ), శ్రీరంగాపూర్ రంగనాయకుల చరిత్రపై వీడియో రూపొందించిన ఎన్.విష్ణుకు(ద్వితీయ)పురస్కారాలు అందజేశారు. అలాగే తెలంగాణ చరిత్రపై విభిన్న అంశాలతో వీడియోలు రూపొందించిన యూనుస్ పర్హాన్, రవికుమార్, సముద్రాల రాజు, ఆచార్య భద్రగిరిష్, రంగాచార్యులు, సతీశ్, రోహిత్, శ్రీనివాస్, సాయికుమార్, కిశోర్, నరేందర్, కరుణాకర్, రాజ్‌కుమార్, రమేశ్ శర్మ, శ్రీకాంత్ తదితరులకు ప్రత్యేక ప్రతిభ పురస్కారాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు రామోజు హరగోపాల్, ఇంటాక్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మణికొండ వేదకుమార్ అందజేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని నేటి తరానికి దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా అందించేందుకు చరిత్ర బృందం చేస్తున్న ప్రత్యేక కృషిలో భాగంగానే ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈమని శివనాగిరెడ్డి, కేటీసీబీ కట్టా శ్రీనివాస్, సర్పంచ్ స్రవంతి, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, అరవింద ఆర్యా, మఠం వినోద్ కుమార్, అశోక్ బాబు, విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
2 కోట్ల ఉద్యోగాలెక్కడ?: డీవైఎఫ్ఐ
కొండాపూర్(సంగారెడ్డి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత విధానాలతో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా 4వ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 12 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తుండగా, మరోవైపు నీట్, రైల్వే, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షల్లో వరుసగా ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనే సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆ పోస్టులను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి అనిల్, నాయకులు జయరాజు, మాణిక్యం, శ్రీకాంత్, ప్రశాంత్, శ్రీకాంత్, బాబురావు, వాణి, రమేశ్, సాయికుమార్, అర్జున్, ప్రజా సంఘాల నాయకులు రాజయ్య, నాగ భూషణం, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పండి
రేగోడ్(మెదక్): ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ‘వెయ్యి రోజుల దగా’పై పోరుబాట నిర్వహించారు. ఈసందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలుపుతామని ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర పథకాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మంగళం పాడారన్నారు. సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జైపాల్‌రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రమేశ్, మాజీ అధ్యక్షుడు వినోద్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మాజీ ఎంపీటీసీ నర్సింహులు, గ్రామ అధ్యక్షుడు సుభాశ్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యానికి బానిసై.. డ్రైవర్ ఆత్మహత్య
జహీరాబాద్ టౌన్: మద్యానికి బానిసై ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణ సమీపంలోని అల్లిపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై లవకుమార్ కథనం ప్రకారం.. అల్లిపూర్లోని నేతాజీనగర్‌కు చెందిన మట్టు నరేష్ (31) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు ఎంత నచ్చజెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. జిన్నారం(పటాన్చెరు): ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సుధీర్ కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నారాయణగూడ విట్టల్ దాడి ప్రాంతానికి చెందిన శ్రీవారి మురళి (60) మెట్రో మెనేజ్మెంట్ సెక్యూరిటీ ఏజెన్సీలో సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం కాజిపల్లి కంకర క్వారీలో విధులు నిర్వహిస్తున్న ఏజెన్సీ సభ్యులకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు టిప్పర్లు వెళ్లేందుకు రోడ్డు సరిపోకపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. అందులోని ఓ టిప్పర్ వెనకాల మురళి తన ద్విచక్ర వాహనంపై ఆగి ఉన్నాడు. వెనకాల వ్యక్తి ఉన్న విషయాన్ని గమనించని డ్రైవర్ ఎదురుగా ఉన్న వాహనానికి దారిని ఇచ్చే క్రమంలో ఒక్కసారిగా వెనక్కి వచ్చాడు. దీంతో టిప్పర్ మురళిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మేనల్లుడు యశ్వంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్నూర(సంగారెడ్డి): పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలు మిషన్‌లో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని ముచ్చర్ల శివారులోని సువర్ణదుర్గ పేపర్ పరిశ్రమలో శనివారం చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని గూడ జిల్లా పత్రగాయి గ్రామానికి చెందిన సిమోతి మారండి (48) భర్త కుంచు మురుమూరుతో కలిసి పరిశ్రమలో గత కొంతకాలంగా కార్మికురాలుగా పనిచేస్తోంది. భర్త కొద్ది రోజుల క్రితం సొంతూరుకు వెళ్లగా, ఆమె మాత్రం ఎప్పటిలాగే ఉదయం విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భోజనానికి బయటకు వచ్చి విధుల్లోకి వెళ్లింది. ఈక్రమంలో దుస్తులు పేపర్ మిషన్‌కు తగిలి అందులో పడి మృతి చెందింది. పరిశ్రమ యాజమాన్యం రహస్యంగా సంగారెడ్డి ఆస్పత్రికి తరలించిందని కార్మికులు ఆరోపించారు. మహిళా కార్మికురాలికి న్యాయం చేయాలని తోటి కార్మికులు పరిశ్రమ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కార్మికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. -
యూరియా బుకింగ్ సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: యూరియా బుకింగ్ యాప్‌లో సాంకేతిక సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో శనివారం గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో పంట నమోదు మరింత వేగంవంతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న వాలంటీర్ ద్వారా మాత్రమే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుల నమోదు జిల్లా లో 75 శాతం పూర్తి అయిందన్నారు. అంతకు ముందు జిల్లాలో పారిశ్రామిక కారిడార్ కోసం భూసేకరణపై ఆర్డీఓలు, తహశీల్దార్లతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, మాసాయిపేట, మెదక్ మరియు శంకరంపేట మండలాల్లో పారిశ్రామిక కారిడార్ కోసం తగిన భూసేకరణ చేపట్టాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్, వినయ్, వందన, వ్యవసాయ, ఆర్డీఓఎస్, టీజీఐఐసీ తదితర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమా సింగ్ -
వన్యప్రాణుల లెక్కెంత?
ములుగు ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థుల పరిశోధనపాల్వంచరూరల్: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల ఆనవాళ్లు, అడుగుజాడల కోసం విద్యార్థులు సర్వే నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్లో బీఎస్సీ(ఫారెస్ట్) తృతీయ సంవత్సరం చదువుతున్న 15 మంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా జంతువులపై అధ్యయనం చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చారు. డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్, వైల్డ్‌లెఫ్ ఎఫ్డీఓ బాబు వారిలో పది మందిని కిన్నెరసాని అభయారణ్యం, మరో ఐదుగురిని అశ్వారావుపేట రేంజ్లో కేటాయించారు. నెల పాటు ఎఫ్‌బీఓల సహకారంతో సర్వే జరగనుండగా విద్యార్థులు అటవీ జంతువుల అడుగుజాడలను గుర్తించి నివేదిక ఇస్తారు. ఇప్పటికే అశ్వారావుపేట రేంజ్, అభయారణ్యంలోని యానంబైలు, ఆళ్లపల్లి, రంగాపురం రేంజ్‌లలో సర్వే పూర్తికాగా, ప్రస్తుతం చింతోని చెలక ఏరియాలో కొనసాగుతోంది. కాగా, 15 మంది విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థినులు కూడా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. రాత్రి అడవిలోని బేస్ క్యాంప్‌ల్లోనే వంటావార్పు చేసుకుని అక్కడే నిద్రిస్తున్నారు. -
అటవీ ప్రాంతంలో తవ్వకాల కలకలం
గజ్వేల్‌రూరల్: మండల పరిధిలోని రంగంపేట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం తెలుసుకున్న రంగంపేట సర్పంచ్ నాగరాజు గ్రామస్తులతో కలిసి గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో తవ్వకాలు జరిపిన బొమ్మనగుండ్ల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో నాలుగైదు చోట్ల తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతం సమీపంలోని పంట పొలాల వద్దకు రైతులు, మహిళలు పనుల కోసం వస్తుంటారని, తవ్వకాలు జరపడంతో భయాందోళనలకు గురవుతున్నట్లు తెలిపారు. తవ్వకాలు జరిగిన చోట పగిలిపోయిన కుండ పెచ్చులను గుర్తించామని, ఈ తవ్వకాలు గుప్త నిధుల కోసమా.. లేదా ఇంకేమైనా ఉందా అనే కోణంలో సంబంధిత శాఖల అధికారులు విచారణ జరిపి, తవ్వకాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. -
బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్..
యువ రైతు దుర్మరణం వెల్దుర్తి(తూప్రాన్): బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ఓ యువ రైతు దుర్మరణం చెందాడు. వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎస్సై కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రిక్కం యాదమ్మ, రాములు దంపతుల కుమారుడు రిక్కం శ్రీకాంత్ (30) తనకున్న అర ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఉదయం శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పొలానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వరి పంటకు కలుపు తీస్తుండగా, పంటకు నీరు పెట్టడానికి బోర్ మోటార్ ఆన్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య అనూషతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీకాంత్ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెయ్యిరోజుల్లోనే పూర్తి చేసి చూపించాం
నారాయణఖేడ్: బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేపట్టని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వెయ్యి రోజుల్లోనే పూర్తి చేసి చూపిందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. గత పాలనలో నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 3,500 ఇందిరమ్మ గృహలు మంజూరు చేశామన్నారు. గత పాలకులు ఎంతమందికి ఇండ్లు నిర్మించి ఇచ్చారో చెప్పాలన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు మంజూరు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అడిగిన వారందరికి రేషన్‌కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం, గ్యాస్ అందజేస్తుందన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతోనే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి పార్టీ బలపర్చిన వారిని ఎన్నుకున్నారని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్‌రెడ్డి, అత్మ చైర్మన్ వినోద్‌పాటిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, నాయకులు తాహేర్ అలీ, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి
జిన్నారం (పటాన్చెరు): రైతులను నట్టేట ముంచడమే కాకుండా వారి భూములను నిషేధిత జాబితాలో చేర్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌డ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి శనివారం గుమ్మడిదల పట్టణ కేంద్రంలో రైతు పోరుబాట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కి రైతులను హరిగోస పెడుతుందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదన్నారు. ఎరువుల దుకాణాల్లో, యాప్‌లో కూడా యూరియా దొరకని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం వెంటనే రైతు సమస్యలను పరిష్కరించాలని లేదా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి -
చకచకా బిల్లులు ఓకే
విడుదలవుతున్న ఇందిరమ్మ బిల్లులుసంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ఇప్పటివరకు 2,195 ఇళ్లు పూర్తి 535 మంది లబ్ధిదారులకు చేరిన డబ్బులు జిల్లావ్యాప్తంగా గతేడాది జూలైలో మొదటి విడత ఇందిరమ్మ పథకంలో 8,910 ఇండ్లు మంజూరయ్యాయి. ఇటీవల పూర్తిగుడిసెలు గల 727 కుటుంబాలను గుర్తించి వారికి సైతం ఇళ్లు మంజూరు చేయటంతో ఆ సంఖ్య 9,637కు చేరుకుంది. కాగా అందులో 2,290 నేటికీ ప్రారంభించలేదు. మరో 890మంది బేస్మెంట్ ప్రారంభించేందుకు గుర్తులు పెట్టుకున్నారు. 1,183 బేస్మెంట్ లెవల్ పూర్తయినవి, రూఫ్‌లెవెల్ కంప్లీట్ అయినవి 645, స్లాబ్‌వరకు అయినవి 2,434 కాగా పూర్తిగా సిద్ధమైనవి 2,195. ఆర్నెల్ల తర్వాత ఫైనల్ బిల్లు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2,195 ఇళ్లు పూర్తి కాగా ఆరునెలలుగా ఫైనల్బిల్లులు ఆగిపోవటంతో అప్పులు చేసి నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లులకోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆందోళన చెందారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు వెచ్చించి నిర్మించుకున్నారు. కాగా, ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుందనే ధీమాతో బయట అప్పులు చేశారు. కేంద్రం ఏకంగా 6 నెలల పాటు బిల్లులు ఆపటంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. కాగా గత 15 రోజుల నుంచి ఆఖరు బిల్లులు సైతం విడుదలవుతుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు కంప్లీట్ అయిన ఇల్లు 2,195కాగా ఫైనల్ బిల్లులు 535మంది కి వచ్చింది. ఇంకా 1,660 మందికి త్వరలో వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆఖరు బిల్లులు మంజూరవుతుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఈ పథకం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు కాగా అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒక్కో ఇంటికి రూ.3.88 లక్షలు ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం వాటా కింది రూ.1.12 లక్షలను ఇస్తోంది. కాగా, ఇళ్లు పూర్తయిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు ఇవ్వగా కేంద్రం విడుదల చేసే ఆఖరుబిల్లులు ఆలస్యం కావటంతో అప్పులు చేసి నిర్మించిన లబ్ధిదారులు ఆందోళన చెందారు. కాగా, ఇటీవల ఆఖరుబిల్లులు సైతం మంజూరు కావటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. –మెదక్‌జోన్ ఒక్క పూరిగుడిసె కూడా ఉండకూడదు జిల్లాలో ప్రతీ కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని, పూరిగుడిసెలు మాత్రం ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంజూరైన ఇళ్లల్లో కొన్నింటిని నేటికీ ప్రారంభించకపోయినప్పటికీ వారి పేర్లను రద్దు చేయకుండా అలాగే ఉంచుతున్నారు. అందుకు ప్రధాన కారణం వారిలో అత్యధికులు పూరిగుడిసెలు, రేకుల షెడ్లు ఉన్నవారు కావడంతో వారికి మంజూరైన ఇళ్లను రద్దు చేయటం లేదు. ఇక వారు నిర్మించుకోవటమే ఆలస్యమని అధికారులు చెబుతున్నారు. కాగా రెండోవిడత సైతం త్వరలో మంజూరవుతాయని వారు పేర్కొన్నారు. -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ విలువలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి కమ్ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, వ్యక్తిగత సమాచార భద్రత వంటి అంశాలపై విద్యార్థులకు ఆమె అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని, సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి -
22 ఏ బాధితులకు ఎంపీ సంఘీభావం
పటాన్చెరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌కు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని ఎంపీ రఘునందన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం, రెవెన్యూ మంత్రి ఆస్తులను ఒక్కరోజులో 22ఏ జాబితా నుంచి తొలగించినట్లే సామాన్యుల ఆస్తులను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు పట్టణంలోని సింఫోనీ పార్క్ హోమ్స్ కాలనీలో శనివారం 22 ఏ బాధితులతో ఆయన సమావేశమై వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..55 ఎకరాల్లో 953 ఇళ్లతో నిర్మించిన సింఫోనీ పార్క్ హోమ్స్ కాలనీని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హెచ్ఎండీఏ నుంచి లే అవుట్ అనుమతులు, జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు తీసుకున్న తర్వాతే ఇళ్ల నిర్మాణం జరిగిందని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన అనుమతులను నమ్మి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇళ్లను కొనుగోలు చేసి 12 ఏళ్లుగా నివసిస్తున్నారని చెప్పారు. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని అనుమతులిచ్చిందని, ఇప్పుడు అదే ప్రభుత్వం తిరిగి ఆ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకుని తమ సమస్యపై ఉద్యమించాలని ఎంపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, దిశ కమిటీ సభ్యుడు కాసాల సుధాకర్, కాలనీ అధ్యక్షుడు విజయ్‌రాజ్, ప్రధాన కార్యదర్శి సత్యారావు, పటానన్ చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు, 22ఏ బాధితులు తదితరులు పాల్గొన్నారు. సీఎంకొక న్యాయం.. సామాన్యులకొక న్యాయమా? బాధితులను కలిసిన ఎంపీ రఘునందన్‌రావు -
తాగునీటి కటకట
పైప్‌లైన్ చివరి గ్రామాలకు గ్రిడ్ నీటి సరఫరా బంద్ మంజీరా ప్రవాహం తగ్గడంతో డబ్ల్యూటీపీ అందని నీళ్లు రాఘవాపూర్, పాంపాడ్ డబ్ల్యూటీపీల్లో సామర్థ్యంలో సగమే పంపింగ్ ఇప్పుడే ఇలా ఉంటే..వేసవిలో సమస్య తీవ్రతపై ఆందోళన మిషన్‌భగీరథ రాఘవాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు (డబ్ల్యూటీపీ) సామర్థ్యం రోజుకు 19 మిలియన్ లీటర్లు. కానీ మంజీరా నదిలో నీళ్లు లేని కారణంగా ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి పది మిలియన్ లీటర్లు మాత్రమే పంప్ చేస్తున్నారు. ఇక్కడ 24 గంటలు పంపింగ్ జరిగితే దీని పరిధిలో ఉన్న 74 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. కానీ సగం కూడా పంపింగ్ జరగకపోవడంతో ఝరాసంగం వంటి మండలాలకు అసలు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల్లో స్థానికంగా ఉన్న బోర్ల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి లభ్యత తగ్గడంతో పలు తాగునీటి పథకాల నుంచి పంపింగ్ తగ్గించాల్సి వస్తోందని వాటర్‌గ్రిడ్ ఈఈ విజయలక్ష్మి ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఉన్న నీటితో వీలైనంత ఎక్కువ గ్రామాలకు సరఫరా చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించామని మిషన్‌భగీరథ ఈఈ పాష పేర్కొన్నారు. సమస్య తీవ్రమైతే బోర్లను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాకాలంలోనే తాగునీటి కటకట షురూవైంది. తాగునీటికి ప్రధాన ఆధారమైన మంజీరా నది వెలవెలబోతుండటంతో తాగునీటి సమస్య ఇప్పటి నుంచే ప్రారంభమైంది. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న వేసవిలో తాగునీటి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన నీటి వనరు అయిన సింగూరు జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలకుగాను, ప్రస్తుతం 4.49 టీఎంసీలు నీళ్లు మాత్రమే ఉన్నాయి. కేవలం 515 అడుగుల మేరకు మాత్రమే నీటి మట్టం ఉంది. దీంతో తాగునీటి సమస్య షురూవైంది. రానున్న జనవరి నుంచి సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిషన్‌భగీరథ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 912 గ్రామాలు, నివాసిత ప్రాంతాలున్నాయి. వీటికి వివిధ పథకాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో.. మంజీరా క్యాచ్మెంట్ ఏరియాలో సరైన వర్షాలు కురవకపోవడంతో నదిలో నీటి ప్రవాహం చాలా మట్టుకు తగ్గిపోయింది. ఉధృతంగా ప్రవహించాల్సిన ఈ నది చాలాచోట్ల వెలవెలబోతోంది. దీంతో సింగూరుకు ఆశించిన మేరకు నీరు చేరలేదు. దీంతో ఈ జలాశయం ఆధారంగా ఉన్న తాగునీటి పథకాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు డబ్ల్యూటీపీలో పలు సాంకేతిక సమస్యలు కూడా తరచూ తలెత్తుతున్నాయి. దీంతో నీటి పంపింగ్‌కు ఇబ్బందులు వస్తున్నాయి. ఆయా తాగునీటి పథకాల పరిధిలో ఇప్పటి నుంచే తాగునీటి సమస్య తలెత్తుతోంది. రానున్న మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో తాగునీటి సమస్యల మరింత జఠిలమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
సంతోషంగా ఉంది!
ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకున్నాను. నాకు పూర్తిస్థాయిలో రూ.5 లక్షల బిల్లు వచ్చింది. ఇప్పడు నాకెంతో సంతోషంగా ఉంది. –చాకలి సంగమ్మ,1వ వార్డు, మెదక్ ఆఖరు బిల్లులు మంజూరు ఇందిరమ్మ ఇంటి పథకానికి సంబంధించి ఆఖరు బిల్లులు సైతం మంజూరవుతున్నాయి. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోవాలి. పూరిగుడిసెలున్న లబ్ధిదారులకు ప్రాధాన్యతనిస్తున్నాం. –మాణిక్యం, పీడీ హౌజింగ్ -
అవార్డు అందుకున్న కీర్తి చంద్రిక
హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం బోధిస్తున్న కీర్తి చంద్రిక రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందని కీర్తి చంద్రిక అన్నారు. రాష్ట్రస్థాయి అవార్డు రావడం మరింత బాధ్యతను పెంచిందని మరింత ప్రయోగాలు చేసి విద్యార్థులకు గుణాత్మకమైన గణిత బోధన చేస్తానని తెలిపారు. న్యాయమూర్తి సుచరిత అల్లాదుర్గం(మెదక్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అల్లాదుర్గంలో ఈ నెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జ్ సుచరిత వెల్లడించారు. అల్లాదుర్గం కోర్టులో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజీ కుదుర్చుకోవడానికి కక్షిదారులకు లోక్ అదాలత్ ఉపయోగపడుతుందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు కక్షిదారులకు సహకారాలు అందించాలన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి: కొన్నేళ్ల క్రితం సంగారెడ్డిలో ఐబీ గెస్ట్ హౌస్ నుంచి బసవేశ్వర విగ్రహం వరకు అంతా ఖాళీగా ఉండేదని అప్పట్లో రూ.80లక్షలతో బీటీ రోడ్డు వేయించాననని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు రూ.18కోట్లతో బైపాస్ రోడ్డు విస్తరణ పనులు చేయిస్తున్నానని ఆయన మీడియాకు తెలిపారు. బైపాస్ రోడ్డును అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అనుమతి కోరడంతో ఆయన ఓకే చెప్పడంతో పనులు కూడా చకచకా కొనసాగుతున్నాయన్నారు. రోడ్డు ఆల స్యం అవుతుందని విమర్శలు వస్తున్నా యని అయితే చెట్లకు ఇబ్బంది లేకుండా, విద్యుత్ సరఫరా ఆగిపోకుండా, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా రోడ్డును విస్తరిస్తున్నామంటే ఆషామాషీ వ్యవహారం కాదని వివరించారు. -
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులే
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలో విద్యారంగానికి విశిష్ట సేవలందించిన 100 మంది ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంజిరెడ్డి మాట్లాడుతూ..ఉపాధ్యాయులను సన్మానించడం ద్వారా వారి సేవలను గౌరవించడమే కాకుండా, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు , సమాజంలోని ప్రతి ఒక్కరికీ అది మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు తమ విలువైన సమయాన్ని సెల్‌ఫోన్, సామాజిక మాధ్యమాల్లో వృథా చేయకుండా చదువు, క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంగీత, నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమాహారతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత, జిల్లా విద్యాధికారి రోహిణి ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి -
కదిలిన ట్రాన్స్‌కో యంత్రాంగం
కల్హేర్(నారాయణఖేడ్): వేలాడుతున్న కరెంట్ తీగలకు కర్రలు ఏర్పాటు చేసి స్తంభాలుగా మార్చడంతో ట్రాన్స్‌కో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. కర్రలను తొలగించి కొత్తగా విద్యుత్ స్తంభం ఏర్పాటు చేశారు. ‘కర్రలే విద్యుత్ స్తంభాలు’శీర్షికతో ఈ నెల 4న ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. నిజాంపేట్ మండలం మునిగేపల్లి శివారులో నారాయణఖేడ్ మార్గంలో 161బీ జాతీయ రహదారి పక్కన మూలమలుపు వద్ద వ్యవసాయ విద్యుత్‌లైన్ తీగలు బాగ కిందకు వేలాడుతున్నాయి. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో రైతులు తాత్కాలికంగా కర్రలు ఏర్పాటు చేశారు. ప్రమాదంతో పొంచి ఉండటంతో అధికారులు తక్షణమే కర్రలు తొలగించారు. కొత్తగా విద్యుత్ స్తంభం ఏర్పాటు చేశారు. విద్యుత్ లైన్లో కిందికి వేలాడుతున్న తీగలను సరిచేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కర్రలు తొలగించి స్తంభం ఏర్పాటు -
చేతులెత్తేసినట్లేనా?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిషేధిత భూములు, నివాస స్థలాలు..22–ఏ దరఖాస్తుల పరిష్కారంలో జిల్లా అధికార యంత్రాంగం చేతులెత్తేసిందా..? ఈ నిషేధిత భూముల జాబితాలోంచి తమ భూములను, తమ స్థలాలను తొలగించాలని వచ్చిన దరఖాస్తులను పక్కన బెట్టేసిందా..? జిల్లాస్థాయి కమిటీ (డీఎల్సీ) పరిష్కరించిన దరఖాస్తులు నామమాత్రమేనా..? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈ నిషేధిత జాబితాలోంచి తమ భూములను తొలగించాలని కోరుతూ ఇప్పటివరకు సుమారు 190 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పరిష్కారమైన దరఖాస్తులు పదిలోపే ఉన్నట్లు సమాచారం. మిగిలిన సుమారు 180కి పైగా దరఖాస్తులు తమ పరిధిలో లేదని..రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులకు పంపి ఇక్కడి అధికారులు చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. నివాస స్థలాలు, వెంచర్లు.. జిల్లాలో ఈ నిషేధిత జాబితాలో పెట్టిన భూముల్లో నివాస స్థలాలున్నాయి. ఇండ్లు కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల అసైన్డ్ భూముల్లో చాలా ఏళ్ల క్రితమే ఇళ్లు, ఇతర భవనాలు నిర్మించుకున్నారు. చాలా ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములు కూడా ఈ జాబితాలో చేరిపోయాయి. ప్రధానంగా సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గంలో వేలాది ఎకరాలు అసైన్డ్ భూములు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల భూములు, ప్రభుత్వ భూముల్లో వెంచర్లు, నివాసాలు వెలిశాయి. వీటిని నిషేధిత జాబితాలో చేర్చడంతో వీటిని విక్రయించడానికి వీల్లేకుండా పోయింది. తమ ఆర్థిక అవసరాల కోసం వీటిని విక్రయిద్దామంటే రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పొరపాటున నిషేధిత జాబితాలో పడిన భూములు, నివాస స్థలాలను 22ఏ నుంచి తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా సుమారు 200 వరకు దరఖాస్తులు వచ్చాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలిస్తోంది. ఇందులో చాలామట్టుకు తాము నిర్ణయం తీసుకోలేమని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. 22 ఏ లోంచి తొలగించాలని 200 దరఖాస్తులు వీటిల్లో పరిష్కారమైంది పది శాతం లోపే! రాష్ట్రస్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదనలు నిషేధిత అంశంపై కొనసాగుతున్న రాజకీయ రచ్చ ఈ నిషేధిత జాబితా 22ఏ అంశం రాజకీయ రచ్చకు దారితీసింది. అమాయకుల ప్రైవేటు ఆస్తులను, పట్టాభూములను నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం ప్రజలను వేధిస్తోందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇటీవల పటాన్చెరులో బాధితులతో సమావేశం నిర్వహించిన ఆ పార్టీ ఈ దరఖాస్తులను పరిష్కరించని పక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు హెచ్చరించారు. మరోవైపు బీజేపీ కూడా ఈ 22ఏ జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్, బీజేపీల తీరును తీవ్రంగా తప్పుబడుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారని, అధికారులపై ఒత్తిడి చేసి అసైన్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తోంది. ఇలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ 22ఏ నిషేధిత భూములు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అధికారులు మాత్రం ఈ దరఖాస్తుల విషయంలో గోప్యత పాటించడం పలు ఆరోపణలను దారి తీస్తోంది. -
తెలుగు మాష్టారంటే ఇష్టం
తెలుగు భాషపై పట్టు పెంచుకునేలా కవిత్వాలతో పాటల రూపంలో సబ్జెక్టును బోధిస్తూ విద్యార్థులకు తెలుగు భాషపై మమకారాన్ని పెంచేలా చేస్తున్న తెలుగు మాష్టారు డాక్డర్ పూర్ణ కృష్ణ అంటే ఎంతో ఇష్టం. తన బోధనా శైలితో విద్యార్థులను ఆకట్టుకుంటూ ప్రతీ విద్యార్థి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. తెలుగు భాష గొప్పతనం, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ ఆసిక్తికరమైన రీతిలో పాఠాలు బోధిస్తారు. కేవలం సబ్జెక్టుకే పరిమితం కాకుండా కథలు, పద్యాలు, సామెతలు, కవితలు నాటికల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. అందమైన చేతిరాతపై కూడా మెళకువలు నేర్పిస్తారు. అందుకే తెలుగు మాష్టారు అంటే ప్రత్యేకమైన అభిమానం. –సంపత్ కుమార్, పదోతరగతి, వెల్టూర్ -
దివ్యాంగ బాలలపై ప్రత్యేక నజర్
నారాయణఖేడ్: అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతతోపాటు దివ్యాంగ విద్యార్థుల గుర్తింపుపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ(ఎస్‌హెచ్‌వీఆర్) 2026– 27 రేటింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రశాంత్ కార్యక్రమం ద్వారా దివ్యాంగ పిల్లలను గుర్తించే ప్రక్రియలో ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ మేరకు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణను పెంపొందించే ఉద్దేశంతో స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రతీ పాఠశాల యూడైస్ కోడ్ ద్వారా అధికారిక పోర్టల్ లేదా మొబైల్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉన్నా అతి త్వరగా ఈ ప్రక్రియను ముగించాలని సూచించారు. పాఠశాలలు పాటించే ప్రమాణాల ఆధారంగా వారికి 1 నుంచి 5 స్టార్ వరకు రేటింగ్ ఇవ్వనున్నారు. ప్రత్యేక అవసరాల గుర్తింపు జిల్లాలో 1 నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ 1,919 పాఠశాలలుండగా అందులో 3,73,613 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థులు 3,572 మందిగా ఇప్పటికే నమోదై ఉన్నారు. ప్రస్తుతం నిర్వహించనున్న నమోదు ప్రక్రియ ద్వారా దివ్యాంగ విద్యార్థుల సంఖ్య పెరగనుంది. పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రాథమిక దశలో గుర్తించి వారికి తగిన తోడ్పాటు అందించడమే ప్రశాంత్ యాప్ ప్రధాన ఉద్దేశ్యం. సెప్టెంబర్ 30 నాటికి ఈ విద్యార్థుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఇందులోభాగంగా ఉపాధ్యాయులందరూ ప్రశాంత్ పోర్టల్ లేదా యాప్‌లో లాగిన్ అయి అందులో సూచించిన శిక్షణ వీడియోలను తప్పనిసరిగా వీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు పిల్లల్లోని అంగవైకల్య లక్షణాలు నిశితంగా గమనించి వారి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లా విద్యాశాాఖ అధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో మెరుగైన అభ్యసన వాతావరణాన్ని కల్పించడంతోపాటు దివ్యాగ విద్యార్థులకు సముచిత న్యాయం చేయడమే ఈ రెండింటి లక్ష్యంగా పేర్కొన్నారు. పాఠశాలలకు స్వచ్ఛ ఏవం రేటింగ్ నెలాఖరు వరకు నమోదుకు మార్గదర్శకాలు దివ్యాంగులకూ అందరితోపాటు చదువు ప్రత్యేక అవసరాలు, దివ్యాంగ విద్యార్థులను గుర్తించి అందరు విద్యార్థులతో సమానంగా చదువుకొనేలా వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. మరీ వైకల్యం అధికంగా ఉన్న విద్యార్థులు గుర్తించి భవిత కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అక్కడ చదువుతోపాటు వారంలో రెండు రోజులపాటు ఫిజియోథెరపీ సేవలు అందిస్తారు. -
చోరీ నిందితురాలి అరెస్ట్
జహీరాబాద్ టౌన్: దొంగతనానికి పాల్పడిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జహీరాబాద్ టౌన్ ఎస్ఐ లవకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని అహ్మద్ నగర్‌కు చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు షకీల్ పాషా ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్ణాటకలోని కలబురగి జిల్లా భరత్ తండాకు చెందిన జయశ్రీ చొరబడింది. తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇంటి తలుపులతో పాటు బీరువా తాళాలు పగులగొట్టింది. అందులోని రెండు తులాల బంగారం నల్లపూసల దండ, 20 తులాల వెండి పట్టగొలుసులు, రెండు వెండి కాళ్ల కడియాలను చోరీ చేసి పరారైంది. ఆమె వద్ద నుంచి వెండి, బంగారు సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. అల్లాదుర్గంలో మేకల దొంగలు.. అల్లాదుర్గం(మెదక్): గూగుల్ మ్యాప్ ఆధారంగా చోరీలకు పాల్పడుతున్న మేకల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అల్లాదుర్గంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ దయానంద్ వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అవుల బాలయ్యకు చెందిన రెండు మేకలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై బాధితుడు అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పటాన్చెరు మండలం లాక్డార్ గ్రామానికి చెందిన పల్లపు సాయికుమార్, వడ్డె అనిల్, వడ్డె షాదుల్లా, వడ్డె ప్రసాద్, మనోహర్ కలిసి మేకలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితులు కారులో తిరుగుతూ గూగుల్ మ్యాప్ ఆధారంగా మేకల షెడ్డులను పసిగట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. తూప్రాన్: గుర్తుతెలియని దుండగులు మేకలను ఎత్తుకెళ్లారు. బాధితుడి కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో నరేంద్ర తన మేకలను ఇంటి సమీపంలోని షెడ్లో కట్టేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో షెడ్లోకి చొరబడిన గుర్తుతెలియని దొంగలు, అందులో ఉన్న ఐదు మేకలను అపహరించారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి మేకలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గంగరాజు తెలిపారు. -
జిల్లాలో ఘనంగా కృష్ణాష్టమి
● వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రముఖులు సంగారెడ్డి : జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలోని శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు పలు వేషధారణలో పలువురిని ఆకట్టుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో రామ్ మందిర్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తోటల కార్యక్రమం నిర్వహించారు. పూజల్లో మురళీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో అలరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. కార్యక్రమ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో సందడిగా మారింది. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకష్ణుడి జీవిత సందేశాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ధర్మం, సత్యం, మానవత్వం వంటి విలువలను ఆచరించాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచించారు. -
పాఠశాలకు తీసుకొచ్చి..
పాఠాలు చెప్పి..చిలప్‌చెడ్(నర్సాపూర్): విద్యార్థి పాఠశాలకు రాకపోతే.. ఉపాధ్యాయుడే వెతుక్కుంటూ వెళ్లి తీసుకొస్తాడు. మండల పరిధిలోని చండూర్ ఉన్నత పాఠశాలకు ఈ మధ్యే పదోన్నతిపై దాండిగ రమేశ్ వచ్చాడు. సమయపాలన, క్రమశిక్షణకు పెట్టింది పేరు. ముందుగా ఆయన పాఠశాలలోని అన్ని తరగతులలో హాజరుశాతం పరిశీలించి, పాఠశాలకు రాని విద్యార్థుల ఇంటికి స్వయంగా వెళ్తారు. ఎందుకు బడికి రాలేదో, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటారు. కారణం లేకుండా ఇంటి వద్ద ఉన్న విద్యార్థులను బడికి తీసుకువస్తారు. దీంతో విద్యార్థుల హాజరుశాతం పెరిగింది. ఉపాధ్యాయుడి తీరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువుతోనే బంగారు భవిష్యత్ సాధ్యమని, తల్లితండ్రులు పిల్లల చదువును నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నారు, -
తోలుబొమ్మలతో బోధన
దుబ్బాక: వినూత్న పద్ధతులతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ప్రశంసలు అందుకుంటోంది గంభీర్పూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉప్పునూతల మాధవి. నా చిన్న ప్రపంచం అనే శీర్షికతో కథారూపంలో ఉన్న పాఠ్యాంశాలను స్వయంగా రూపొందించుకున్న తోలుబొమ్మల ద్వారా ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ(ఎస్ఈఆర్టీ)వారి మ్యాగజైన్లో హర్బెంజర్స్ ఆఫ్ చేంజ్ అనే శీర్షికన మాధవి సక్సెస్ స్టోరీ ప్రచురింపబడింది. జిల్లా స్థాయిలో ఉత్తమ బోధన ప్రదర్శన కింద ఎంపికై .. హైదరాబాద్‌లో 600 మంది విద్యాధికారుల సమక్షంలో ప్రదర్శించారు. మొదటి బహుమతితో పటు ప్రశంసలు అందుకున్నారు. పలు అవార్డులతో పాటు ఇటీవల రాష్ట్రస్థాయి పప్పెటరీ పోటీల్లో కన్సోలేషన్ బహుమతిని అందుకుంది. -
బోధనాదరణలో రాజయ్య
ఆదర్శ ప్రధానోపాధ్యాయుడిగా వెంకటరాజయ్య సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలోని కంది మండలం చెర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా వెంకటరాజయ్య పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నాలుగేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతను సాధించడంలో విశేష కృషి చేశారు. దీని ఫలితంగానే గతేడాది జిల్లాలో ప్రథమ, ద్వితీయ రెండు ర్యాంకులు కూడా చెర్యాల పాఠశాలకే లభించాయి. గతేడాది ట్రిపుల్ ఐటీకి ఆరుగురు విద్యార్థులు ఎంపిక కాగా ఈసారి ఏకంగా 22 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఒకే పాఠశాల నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎంపిక కావడం మొదటిసారి కావడం విశేషం. చెర్యాల పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కు ఎంపికయ్యారు. వీరికి ఏడాదికి రూ.12,500 ఉపకార వేతనంగా వస్తుంది. ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో.. వెంకటరాజయ్య విద్యా బుద్ధులు నేర్పిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత హోదాలో పని చేస్తున్నారు. సోమక్కపేటలో ఉపాధ్యాయుడిగా విద్యను బోధించిన సమయంలో ఆ గ్రామ విద్యార్థి బి.వెంకటేశం శనివారం సంగారెడ్డి జిల్లాలో భానూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా, జెడ్పీహెచ్ఎస్ చండూర్ విద్యార్థి అనిల్‌కుమార్ బిహార్‌లోని ఆర్మీ మెడికల్ కళాశాలలో ఫ్రొఫెసర్‌గా, పెద్దశంకర్ పేట విద్యార్థి మునిపల్లి మండలంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పోతరాజు భాస్కర్‌తోపాటు సుమారుగా 17మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఆదిలక్ష్మీకి తన గురువు వెంకటరాజయ్య కంటే ముందుగానే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గతేడాది ఎంపికయ్యారు. -
రైలు ఢీకొని యువకుడి మృతి
తూప్రాన్: రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసుల వివరాలు..బ్రాహ్మణపల్లికి చెందిన గుర్రం బాలేశ్(35) గ్రామ సమీపంలోని ఓ తోటలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలు ఢీకొట్టగా మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా వంద మంది ఎంపిక
నేడు కలెక్టరేట్లో అవార్డుల ప్రదానం సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ వంద మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. వీరందరికీ శనివారం కలెక్టరేట్లో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల విభాగంలో తొమ్మిది మంది, స్కూల్ అసిస్టెంట్ గణితం విభాగంలో 10 మంది, ఫిజికల్ సైన్స్ విభాగంలో 10 మంది, బయోసైన్స్ విభాగంలో ఐదుగురు, సోషల్ స్టడీస్ విభాగంలో ఆరుగురు, ఇంగ్లిషు విభాగంలో ఆరుగురు, తెలుగు విభాగంలో నలుగురు, హిందీ విభాగంలో నలుగురు, పీజీ సీఆర్టీ నర్సింగ్ కేటగిరీలో ఒకరు, పీఈటీ కేటగిరీలో తొమ్మిదిమంది, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం కేటగిరీలో ఒకరు, సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో 35 మంది ఉపాధ్యాయులు ఎంపికై నట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. మఠం కీర్తి చంద్రికకు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు హత్నూర(సంగారెడ్డి): జిల్లాలోని హత్నూర మండలం దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న కీర్తి చంద్రికను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. తెలంగాణ స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా, వర్క్ బుక్ రైటర్‌గా ఎంతోమంది విద్యార్థులను గణితం అంటే ఇంత సులభమా అనే విధంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేసి సులభమైన పద్ధతిలో విద్యాబోధన అందిస్తూ జిల్లాలో ఆదర్శంగా నిలిచారు. ఎస్సీఈఆర్టీ ప్రచురించిన ‘‘ప్రయోగ దీపిక –గణిత ప్రయోగశాల మాన్యువల్’’వివిధ అభ్యాసన పుస్తకాల రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించారు. దౌల్తాబాద్ పాఠశాలలో తక్కువ ఖర్చు, ఖర్చు లేని బోధనా అభ్యసనా సామగ్రితో ఓ గణిత ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. గుణాత్మక విద్యకు దాతల సహకారం కోసం సమన్వయం సామాజిక విద్యా కార్యక్రమాల్లో భాగంగా కీర్తి చంద్రిక విశేష కృషి చేశారు. డీఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి సహకారంతో బేసిక్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఆక్వేషన్ ప్రోగ్రాం ద్వారా 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రాథమిక గణిత నైపుణ్యాల వర్క్‌బుక్‌లను ఉచితంగా అందించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఆమె సమర్థవంతమైన బోధన, మెటీరియల్స్ సమన్వయంతో పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అత్యుత్తమ మార్కులు సాధించడం విశేషం. -
బ్యాంకుకు వినియోగదారుల ఫోరం షాక్
తూప్రాన్: జేసీబీ సబ్సిడీ విషయంలో లబ్ధిదారురాలిని వేధించిన ఓ బ్యాంకుకు సంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. అక్రమంగా వాహనాన్ని సీజ్ చేసినందుకు బ్యాంకుకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా.. మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన బజారు భాగ్యలక్ష్మి స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్థిరపడటానికి 2020లో ప్రభుత్వం రూ.12.24లక్షల సబ్సిడీతో జేసీబీని మంజూరు చేసింది. దివ్యాంగుల ఆర్థిక పునరావాస పథకంలో భాగంగా సబ్సిడీని పొందింది. అయితే లోన్ కోసం రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లిలో ఓ బ్యాంకును ఆశ్రయించింది. కాగా ప్రభుత్వం నుంచి సబ్సిడీ మంజూరు సకాలంలో కాలేదు. దీంతో బాధితురాలు వాయిదాలు చెల్లించింది. మొత్తం బ్యాంకు నుంచి తీసుకున్న రుణం, వడ్డీతో సహా రూ.29.06 లక్షలు చెల్లించింది. కాని ప్రభుత్వం 2025లో సబ్సిడీని బాధితురాలి బ్యాంకు ఖాతాలో జమ చేసింది. కాగా అప్పటికే జేసీబీ కోసం తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించారు. అయితే తనకు మంజూరైన సబ్సిడీ డబ్బులను ఇవ్వాలని బాధితురాలు బ్యాంకు అధికారులను కోరింది. ఇందుకు అధికారులు సబ్సిడీలో సగం మాత్రమే ఇస్తామని, మిగిలిన దానికి అభ్యంతరాలు చెబుతూ కాలయాపన చేశారు. దీంతో విసుగు చెందిన బాధితురాలు భాగ్యలక్ష్మి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. లబ్ధిదారురాలికి బ్యాంకు నుంచి రావాల్సిన రూ.17.54లక్షల మొత్తాన్ని 9% వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. జేసీబీ వాహనాన్ని సీజ్ చేసి, బాధితురాలి ఉపాధిని దెబ్బతీసినందుకు రూ.5 లక్షలు, కోర్టు ఖర్చులు కింద రూ.10 వేలు చెల్లించాలని తీర్పేనిచ్చింది. జేసీబీ సబ్సిడీ విషయంలో కోర్టుకు దివ్యాంగురాలు రూ.17.54లక్షలు, 9శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశం జేసీబీ సీజ్ చేసినందుకు రూ.5 లక్షల పరిహారం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నిజాంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మండల పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాందేడ్ జిల్లాకు చెందిన గణేశ్(21), నిర్మల్‌కు చెందిన పవార్ అనిల్ అలియాస్ వినోద్(37) కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్ నుంచి కొమురవెల్లికి బయలుదేరారు. కాగా నందిగామ శివారులోని నిర్మాణంలో ఉన్న వంతెన సమీపానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను అధిక వేగం కారణంగా గమనించకపోవడంతో వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు లేకపోవడంతో ఉదయం అటుగా వెళ్లిన ప్రయాణికులు గమనించి పోలీసులకు చెప్పారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామ శివారులోని కుంగిన బ్రిడ్జి వద్ద రోడ్డు సరిగా కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు వాహనదారులు పేర్కొన్నారు. -
గిరాకీ లేక.. ఫైనాన్స్ చెల్లించలేక..
ఆటోడ్రైవర్ బలవన్మరణం వర్గల్(గజ్వేల్): ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని మీనాజీపేటలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్ఐ ఆరోగ్యం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పులబోయిన యాదగిరి, లక్ష్మి దంపతుల కుమారుడు వంశీ(24) ఆటో డ్రైవర్. వివాహం కాలేదు. సుమారు మూడు నెలల క్రితం ఒక ట్రాలీ ఆటోను కొనుగోలు చేసి, దానిని నడుపుతున్నాడు. నెలనెలా ఫైనాన్‌న్స్ ఈఎంఐలు చెల్లిస్తుండేవాడు. నెల రోజులుగా ఆటోకు గిరాకీ లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. ఫైనానన్స్ చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం గ్రామ డంపింగ్‌యార్డ్ వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు నమోదు రేగోడ్(మెదక్): పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మండలంలోని టి.లింగంపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ పోచయ్య వివరాల ప్రకారం.. టి.లింగంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో కొందరు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం వచ్చింది. వెంటనే తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాట ఆడుతున్న ఎనిమిది మందిలో ఏడుగురు పట్టుబడ్డారు. మరొకరు పారిపోగా.. ఏడుగురిని అరెస్ట్ చేసి వారివద్ద ఉన్న నగదు రూ.7,850, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. -
చక్కటి రాతలకు ‘చుక్కాని’
పుల్కల్(అందోల్): విద్యార్థులకు ముత్యాల్లాంటి అక్షరాలు రాయడానికి తెలుగు ఉపాధ్యాయుడు కృషి చేస్తున్నాడు. మండల కేంద్రం పుల్కల్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌చారి అక్షరాల రూపకల్పనకు కృషి చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. తాను విధులు నిర్వర్తిస్తున్న పాఠశాలలోనే కాకుండా తోటి ఉపాధ్యాయులు బోధించే పాఠశాలల్లో సైతం సెలవు రోజుల్లో విద్యార్థులకు మంచి రాత కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 68 ఉన్నత పాఠశాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణిత అక్షరాలపై చక్కటి రాత రాయడానికి విద్యార్థులకు ప్రత్యేక మెలకువలు బోధించాడు. 2024లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా పభ్రుత్వం ఎంపిక చేసి సన్మానించింది. యూట్యూబ్‌లో సైతం చక్కటి అక్షరాల మెలకువలు నేర్పుతున్నాడు. -
పేద విద్యార్థుల అభ్యున్నతికి..
చేర్యాల(సిద్దిపేట): వృత్తి పట్ల నిబద్ధత, సేవాగుణం, మంచితనానికి మారుపేరుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అందె విజయ్‌కుమార్ నిలుస్తున్నారు. విద్యార్థుల ప్రగతి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. 20 ఏళ్లుగా అనాథ, నిరుపేద పిల్లలకు అండగా నిలిచి, ఇప్పటివరకు 10 మంది తల్లిదండ్రులు లేని పిల్లలను దత్తత తీసుకుని విద్యను అందించారు. పేద బాలికల వివాహాలకు సహాయం చేయడంతో పాటు హమాలీలు, రిక్షా కార్మికులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు ఇచ్చారు. ‘గివింగ్ హ్యాండ్స్’ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశంసలందుకుంటున్నారు. పలు రాష్ట్రస్థాయి అవార్డులతో పాటు 2025లో సిద్దిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా సత్కారం అందుకున్నారు. గ్రామీణ నిరుపేద విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడమే తన ఆశయమని విజయ్‌కుమార్ పేర్కొన్నారు. -
ప్రైవేట్‌కు నై.. సర్కారుకు జై..
జహీరాబాద్ టౌన్: బడి లేని ఊరు ఉండొచ్చు కానీ పాఠశాలలో పిల్లలు లేని పరిస్థితి రాకూడదని సంకల్పించారు. ప్రైవేట్ వైపు పరుగెడుతున్న గ్రామాన్ని ప్రభుత్వ పాఠశాల వైపు అడుగులు వేయించారు హెచ్ఎం దేవిసింగ్ రాథోడ్. మండలంలోని గోవింద్‌పూర్‌లో ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ మెజార్టీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లేవారు. ఇందుకు హెచ్ఎం. దేవిసింగ్ రాథోడ్ గ్రామస్తులతో పలు సార్లు సమావేశం నిర్వహించి నాణ్యమైన విద్యబోధనపై ప్రచారం చేశారు. గ్రామ పంచాయతీతో పాటు ప్రజల సహకారంతో పాఠశాల భవనాన్ని అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ తరహా డ్రెస్ కోడ్ అమలు చేశారు. దీంతో విద్యార్థుల సంఖ్యతో పాటు విద్యాప్రమాణాలు మెరుగ్గుపడ్డాయి. ఆయన సేవలకు గుర్తింపుగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడితో పాటు బెస్ట్ టీచర్, రైసింగ్ తెలంగాణ అవార్డును పొందారు. -
డ్రాపౌట్స్ తగ్గి... రెట్టింపైన పిల్లలు
గిరిజన తండాలోని ఉపాధ్యాయుడి కృషి పుల్కల్(అందోల్)ః విధుల పట్ల నిబద్ధత కలిగిన ఓ ఉపాధ్యాయుడు గిరిజన తండాల్లోని విద్యార్థుల్లో వెలుగులు నింపాడు. మారుమూల గిరిజన తండాల్లో డ్రాపౌట్స్ తగ్గించి గిరిజన విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా కృషి చేశాడు. మండల పరిధిలోని గొంగ్లూర్ గిరిజన తండాలో విద్యాబోధన చేస్తున్న ప్రవీణ్ కుమార్ డ్రాపౌట్ తగ్గించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేశారు. 800 వందల జనాభా కలిగిన గొంగ్లూర్ గిరిజన తండాలోని విద్యార్థులు తండాలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా ప్రైవేటుకు మొగ్గుచూపే వారు. మరికొందరు ఇంటి వద్ద చిన్న పిల్లలను ఆడిపించేవారు. 5 తరగతుల వరకు ఉన్న ఆ పాఠశాలలో 2024 వరకు కేవలం 24 మంది విద్యార్థులుండేవారు. కానీ ప్రవీణ్ కుమార్ ఆ పాఠశాలకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలను గిరిజనుల సహకారంతో బాగుచేసి విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లికుండా కట్టడి చేశారు. మెరుగైన విద్యా బోధన చేసి మూడేళ్లలో డ్రాపౌట్స్ తగ్గించి విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేశారు. ఇప్పుడు మారుమూల గిరిజన తండాలోని పాఠశాలలో 30 మంది బాలురు,16 మంది బాలికలు విద్యాబోధన చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయుడి కృషి వల్ల పాఠశాలలో మార్పు కనిపించి డ్రాపౌట్లను నివారించామని తండా సర్పంచ్ సురెందర్ తెలిపారు. స్వచ్చంద సంస్థల సహకారంతో పాఠశాలలో మెరుగైన విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. -
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ తట్టుకోలేరు
ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి: ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు ఆ హామీల అమలులో పూటకో మాట చెబుతూ ప్రజల్ని మభ్య పెడుతోందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విమర్శించారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిరసన ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగుపెడితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటేనే ముఖ్యమంత్రి, మంత్రులు నోట్లో నాలుక లేనట్టుగా.. సమాధానం కోసం తడబడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి రామచంద్రాపురం(పటాన్చెరు): 104 సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా చెందిన 104 ఉద్యోగ సంఘం నాయకులు రామచంద్రాపురంలోని ఆయన నివాసంలో శుక్రవారం ఆయనను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ..గత 18ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న 300మందిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. డీఎంఈ పరిధిలోని ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. వీరిని నిబంధనల ప్రకారం జిల్లా డీఎస్సీ ద్వారా ఎంపీక చేసినప్పటికీ వారికీ నేటికీ ఔట్సోర్సింగ్ విధానంలోనే వేతనాలివ్వడం బాధాకరమన్నారు. ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వట్పల్లి(అందోల్): రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తులు విద్య, రాజకీయపరంగా ఎదగాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు, బాచుపల్లి మాజీ సర్పంచ్, విగ్రహ దాత ఆగం పాండు ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సపాన్ దేవ్ ఆకాంక్షించారు. అందోల్ మండల పరిధిలోని నాదులాపూర్ గ్రామ ముదిరాజ్ సంఘం, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సామాజిక చైతన్య అధ్యక్షుడు బానిస నారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ముదిరాజ్ పితామహులు కొరివి కృష్ణస్వామి 133వ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో వారు మాట్లాడుతూ...ముదిరాజ్ కులస్తులు ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి కుల బంధువులు ఉన్నతస్థాయిలోకి చేరుకోవాలని సూచించారు. జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ఏరియా ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం పాము ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రిలోని ప్రసూతి, చిన్నపిల్లల వార్డు సమీపంలోకి ఒక్కసారిగా పాము రావడాన్ని గమనించిన రోగులు, చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. వార్డులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, పామును చంపారు. రోగులు, పసిపిల్లలు ఉండే ముఖ్యమైన వార్డుల వద్దకే భారీ పాము రావడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే..
జహీరాబాద్ టౌన్: వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జహీరాబాద్ టౌన్ ఎస్సై లవకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. కోహిర్ మండలం బిలాల్పూర్ గ్రామానికి చెందిన కొనగారి వినయ్‌కుమార్‌కు రెండేళ్ల క్రితం తోరమామిడి గ్రామానికి చెందిన బంటు స్వాతితో వివాహమైంది. కాగా పెళ్లికి ముందే స్వాతికి కోహీర్ పట్టణంలోని లాలాగూడకు చెందిన వరుసకు బావ అయిన నాగరిగారి ప్రవీణ్ కుమార్‌తో ప్రేమలో ఉంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో స్వాతికి వినయ్‌కుమార్‌తో వివాహం జరిగింది. కాగా పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రవీణ్ కుమార్ తన మరదలు స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి భర్త భార్యతో విడిగా ఉంటున్నాడు. కొన్ని రోజుల నుంచి ప్రవీణ్ కుమార్ తరచూ స్వాతి భర్తకు ఫోన్ చేస్తూ, ‘నీ భార్య నా దగ్గరే ఉంది, నువ్వు ఏమీ చేయలేవు‘ అని బెదిరిస్తూ మెసేజ్‌లు, ఫొటోలు పంపిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాడు. ఈ క్రమంలో వినయ్ కుమార్‌ను పూర్తిగా మట్టుబెట్టాలని ప్రవీణ్ కుమార్ కర్నాటక బీదర్‌కు చెందిన తన పెద్దమ్మ కొడుకు ప్రవీణ్‌తో కలిసి హత్యకు పథకం పన్నాడు. గత నెల 9న సాయంత్రం జహీరాబాద్‌లోని చెన్నారెడ్డి కాలనీలో వినయ్‌కుమార్‌ను అడ్డుకుని గొడవ పెట్టుకున్నారు. ప్రవీణ్ అతనిని వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా నాగరిగారి ప్రవీణ్ కుమార్ వెంట తెచ్చుకున్న కత్తితో వినయ్ వీపుపై తీవ్రంగా పొడిచాడు. ఈ దాడిలో వినయ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరిరి రిమాండ్‌కు తరలించారు. కత్తితో దాడి ఇద్దరు నిందితుల అరెస్టు -
నమూనా ఎన్నికలు.. ప్రజాస్వామ్యంపై..
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రమైన చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు లక్ష్మణ్ విద్యార్థులకు క్షేత్ర స్థాయి సందర్శనతో పాఠాలు బోధిస్తున్నారు. గ్రామ పంచాయతీని సందర్శించి సచివాలయ పరిపాలన, రేషన్ షాపులను సందర్శించి ప్రజాపంపిణీ వ్యవస్థ, పోలీస్ స్టేషన్‌ను సందర్శించి శాంతిభద్రతల పరిరక్షణ, విద్యార్థులతో నమూనా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. గత సంవత్సరం రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యుల వివరాలతో గ్యాలరీని ఏర్పాటు చేయించారు. పలు అంశాల్లో విద్యార్థులకు ప్రత్యక్ష బోధన అందిస్తూ.. పలువురి మన్ననలు అందుకుంటున్నారు. -
క్రీడల మహారాణి.. సుజాత
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): క్రీడాకారులను తయారు చేయడంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ సుజాత తన మార్కును చూపిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తయారు చేస్తూ, అలాగే ఆర్మీ, పోలీస్, తదితర ఉద్యోగాల్లో రాణించేలా శిక్షణనిస్తూ మార్గదర్శనం చేస్తున్నారు. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు వచ్చేలా ఆసక్తి కనబర్చే అంశంపై దృష్టి పెడుతున్నారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి కలిగేలా ప్రతి రోజు ఆటలు నేర్పిస్తూ, హాజరు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటుండ్రు. హాస్టల్లో ఉండి చదువుతున్న విద్యార్థులు ఇంటిపై బెంగ పెట్టుకోకుండా పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు కృషి చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు ఎక్కడ జరిగినా అక్కడికి విద్యార్థినులను తీసుకుని వెళ్తారు. సుజాత మేడం టీచర్ కాదు, మాకు అమ్మలాంటిదని విద్యార్థినులు చెప్పడం గమనార్హం. -
వినూత్న బోధన..ప్రతిభను వెలికితీస్తూ..
నారాయణఖేడ్: ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలకు వరుస కట్టిన విద్యార్థులు.. ఉపాధ్యాయుడు చేసిన కృషి, బోధనా తీరుకు ఆకర్శితులై సర్కారు బడికి వస్తున్నారు. మండలంలోని సంజీవన్‌రావుపేట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడు సుదర్శన్ వడ్ల విద్యార్థులకు కృత్యాదార విధానంలో బోధన , ఆకర్శణీయమైన బోధనాభ్యాసన సామగ్రిని వినియోగిస్తున్నారు. దీంతో విద్యార్థులు సాధిస్తున్న ప్రగతిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు చేరేలా కృషి చేస్తున్నారు. బడిబాట వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడంతో 2024–25లో 92 మంది ఉన్న సంఖ్య రెండేళ్లలో 175కు చేరింది. పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ఆటలు, లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా కృషి చేస్తున్నారు. రూమ్ టు రీడ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. -
చదవాలంటే నడవాల్సిందే..
● బస్సు రాక విద్యార్థుల ఇక్కట్లు ● నిత్యం కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి శివ్వంపేట(నర్సాపూర్): గ్రామానికి మెరుగైన రోడ్డు ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామానికి డబుల్ రోడ్డు ఉన్నప్పటికీ బస్సు సదుపాయం లేకపోవడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోమారం ఉన్నత పాఠశాలకు విద్యార్థులు నిత్యం నడుచుకుంటూ వెళ్తున్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని పలుమార్లు ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు గోమారం, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. గోమారం గ్రామం వరకు వస్తున్న ఆర్టీసీ బస్సులను సికింద్లాపూర్ గ్రామం వరకు పొడిగిస్తే ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
నేపాల్ వరదల్లో తెల్లాపూర్వాసులు గల్లంతు!
ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాత్రకు వెళ్లిన శ్రీధర్ కుటుంబం రామచంద్రాపురం(పటాన్చెరు): నేపాల్, టిబెట్ సరిహద్దులో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదల్లో తెల్లాపూర్‌కు చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతైనట్లు తెలుస్తోంది. తెల్లాపూర్ పరిధిలోని ‘మై ఫెయిర్ అపార్ట్మెంట్’లో నివాసముండే ఎన్ఆర్ఐ శ్రీధర్ యూకే నుంచి వచ్చి 2023 నుంచి స్థానికంగా నివాసముంటున్నారు. కాగా, శ్రీధర్ అతని భార్య దీప్తి, కుమారుడు అభినవ్ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 13న మానస సరోవరయాత్రకు బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 26న గ్యిరోంగ్ ఇమిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న సమయంలో ఆకస్మిక వరదలు రావడంతో వారితో సంబంధాలు తెగిపోయాయి. శ్రీధర్ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియకపోవడంతో మైఫెయిర్ అపార్ట్మెంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో ఉన్న శ్రీధర్ సోదరుడు విషయం తెలుసుకుని స్వదేశానికి వచ్చినట్లు సమాచారం. శ్రీధర్ కుటుంబ క్షేమంగా తిరిగి రావాలని స్థానికులు కోరుకుంటున్నారు. -
జైలుకెళ్లొచ్చినా.. మారని తీరు
● చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు ● రెండు బైక్‌లు, రెండు సిలిండర్లు స్వాధీనం తూప్రాన్: జైలుకెళ్లొచ్చినా తీరు మార్చుకోకుండా మళ్లీ నేరాల బాట పట్టిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సీఐ వెంకట రాజాగౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. స్థానిక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. సూర్యపేట జిల్లా మఠంపల్లి గ్రామానికి చెందిన మామిడి శ్రీకాంత్(31) ఇటీవల దొంగతనం కేసుల్లో ఖమ్మం జైలు నుంచి విడుదలై తూప్రాన్‌కు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే శని, ఆదివారాల్లో పట్టణంలో స్కూటీ, రెండు సిలిండర్లు చోరీ చేశాడు. దీనిపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు, అనుమానాస్పదంగా తిరుగుతున్న మామిడి శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో అతను వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగగా తేలింది. సదరు నిందితుడు గతంలో కూడా ఆంధ్ర, తెలంగాణలో పలు చోట్ల దొంగతనాలు చేసి, జైలు జీవితం అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ గంగరాజు, సిబ్బంది మహేశ్, కృష్ణ, గోవర్ధన్, సురేశ్, రాజును సీఐ అభినందించారు. -
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక
మెదక్‌జోన్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెదక్ డిగ్రీ కళాశాల విద్యార్థిని అంజలి బంగారు పతకం సాధించి జాతీయస్థాయి క్రీడలకు ఎంపికై ందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. మంగళవారం కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల 26, 27వ తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 12వ తెలంగాణ సౌత్ జోన్ అండర్ – 20 జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్న్ షిప్ పోటీల్లో అంజలి అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై ందని తెలిపారు. అక్టోబర్‌లో పాండిచ్చేరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆడనుందని చెప్పారు. కార్యక్రమంలో లెక్చరర్లు డాక్టర్ ప్రవీణ్ కుమార్, తిరుమలరెడ్డి, మల్లేశం, పరిపాలన అధికారి అంజాద్ అలీ, సూపరింటెండెంట్ మల్లికార్జున్ పాల్గొన్నారు. -
జాతి వైరం పక్కన పెట్టి..
నర్సాపూర్ రూరల్: కుక్కలు వరాహాన్ని వెంటబడి తరమడం, మొరగడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ నర్సాపూర్ పట్టణంలోని 15వ వార్డులో కనిపించిన ఓ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ ఓ వరాహం తన పిల్లలతో పాటు కుక్క పిల్లలకు పాలు ఇస్తూ తల్లి ప్రేమను పంచుతోంది. తల్లిని కోల్పోయిన ఆ కుక్క పిల్లలు ఆకలితో అలమటిస్తుండగా, ఆ వరాహం వాటికి పాలు ఇవ్వడం చూసి స్థానికులు ముగ్ధులవుతున్నారు. జాతి భేదం లేకుండా అమ్మ ప్రేమ గొప్పదని ఈ దృశ్యం నిరూపించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కుక్కపిల్లకు పాలిచ్చిన వరాహం -
ఆలస్యంగా అల్పాహారం
● మధ్యాహ్న భోజనం కూడా.. ● అవస్థలు పడ్డ విద్యార్థినులు న్యాల్కల్(జహీరాబాద్): విద్యార్థినులకు సమయానికి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందకపోవడంతో ఆకలితో అవస్థలు పడ్డారు. రెండు గంటలకు పైగా ఆలస్యంగా టిఫిన్, మిడ్ డే మీల్స్ అందించడంతో కడుపు మాడ్చుకుని తరగతులకు హాజరైన ఘటన మండల కేంద్రమైన న్యాల్కల్లోని కేజీబీవీలో మంగళవారం చోటు చేసుకుంది. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు గల కేజీబీవీలో 305 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా 185 మంది విద్యార్థినులు తరగతులకు హాజరు కాగా మిగిలిన 120 మంది రాఖీ పౌర్ణమి పండుగకు ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. వీరందరికి నిత్యం వంట నలుగురు (కుక్‌లు) వంట వండుతున్నారు. అందులో ముగ్గురు అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు. దీంతో ఉన్న ఒక్క వంట మనిషి వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తుంది. ఉదయం 8.30 గంటలకు అల్పాహారం అందించాల్సి ఉండగా 11గంటలకు అందించారు. భోజనం మధ్యాహ్నం 1 గంటలకు అందించాల్సి ఉండగా 3 గంటలకు అందించినట్లు విద్యార్థినులు తెలిపారు. ఇదిలా ఉండగా విద్యాలయం ఆవరణలోని బోరు మోటారు కూడా పాడైపోయి నీటి కోసం వంట వండే వారు ఇబ్బందులు పడుతున్నారు. విద్యాలయంలో పని చేస్తున్న ప్రత్యేక అధికారి నియామకం జరగకపోవడం ఉన్న ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించకపోవడం వల్ల కూడా పలు సమస్యలు ఉత్పన్నమౌతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకుని అల్పాహారం, మధ్యాహ్న భోజనం సమయానికి అందించాలని విద్యార్థినులు కోరుతున్నారు. -
చిట్కుల్లో కాంగ్రెస్‌కు షాక్
పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మాజీమంత్రి హరీశ్‌రావును కోకాపేటలోని ఆయన నివాసంలో మంగళవారం పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ పటాన్చెరు మండల ఇన్చార్జ్ గడీల శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్‌తో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిట్కుల్ అభివృద్ధి, స్థానిక సమస్యలు, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై నాయకులు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కూడా కాంగ్రెస్ నాయకులు కలిశారు. చిట్కుల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి: చౌటకుర్ మండలం శివంపేట గ్రామ శివారులో ఉన్న బీరు పరిశ్రమను జిల్లా అదనపు కలెక్టర్ పాండు పీసీబీ అధికారి విజయలక్ష్మితో కలిసి మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు. పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలను మంజీరా నదిలోకి వదులుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పదించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశ్రమపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంతో అధికారులు పరిశ్రమ అంతటా కలియ తిరిగి ఆరా తీశారు. త్వరలోనే పరిశ్రమపై తగిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి హత్నూర(సంగారెడ్డి): ఎంపీడీవోగా శంకర్ అందించిన సేవలు అభినందనీయమని జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి పేర్కొన్నారు. హత్నూర ఎంపీడీవో గా పదవీ విరమణ పొందిన శంకర్ పుష్పలత దంపతులకు మంగళవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జానకిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎంపీడీవోగా శంకర్ చేసిన సేవలు జీవిత కాలంలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి లేకుండా సౌమ్యంగా పనిచేయించుకుని అధికారుల ఆదేశాలను పాటించిన వ్యక్తి శంకర్ అని ప్రశంసించారు. ఉద్యోగ ధర్మంతోపాటు సమయపాలన పాటిస్తూ ఎప్పుడు ఉన్నతాధికారులకు అందుబాటులో ఉండి సేవలు చేస్తే రిటైర్డ్ అయిన తర్వాత కూడా గుర్తింపు ఉంటుందన్నారు. మండల స్థాయి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు వివిధ పార్టీల నాయకులు శంకర్ దంపతులను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, డీఆర్డీఏ అదనపు పీడీ బాలరాజ్, ఇన్చార్జి ఎంపీడీవో యూసుఫ్, తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పాల్గొన్నారు.బాధ్యతగా పనిచేయాలిఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి కల్హేర్(నారాయణఖేడ్): ప్రజల సమస్యలు తీర్చేందుకు అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి సూచించారు. కల్హేర్‌లో మంగళవారం నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి ఆయన హాజరై మాట్ల్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతీ నెల ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే సమావేశానికి తల్లిదండ్రులు హాజరుకావాలని, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నీటి సరఫరా, వివిధ సమస్యలను సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తెచ్చారు. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ వినోద్పాటీల్, మండల ప్రత్యేకాధికారి అనిల్‌కుమార్, ఎంపీడీఓ హరినందన్‌రావు, ఎంఈఓ సురేశ్, సర్పంచ్‌లు గోవింద్‌నాయక్, సంగన్న, సంతోషమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఖాళీల భారం.. రోగులకు శాపం
ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నియామకాల లేమితో సతమతమవుతోంది. ఈ ప్రాంత పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆస్పత్రికి ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వైద్యులతోపాటు పారామెడికల్ సిబ్బంది కొరత వల్ల రోగులకు వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు కూడా విధులకు సరిగ్గా రావడంలేదు. దీంతో పలు ఘటనలు చోటు చేసుకుని ఇక్కడి దయనీయ పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. –జహీరాబాద్ టౌన్ వైద్య సిబ్బంది కొరత తదితర కారణాల వల్ల ఈ ఆస్పత్రిలో ఇటీవల వరుసగా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆక్సిజన్ అందక నవజాత శిశువు మృతి చెందింది. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మరో ఘటనలో డ్యూటీ డాక్టర్ గైర్హాజరు కాగా ఆమె స్థానంలో ప్రైవేట్ డాక్టర్ విధులు నిర్వహించారు. ఓ రోగికి ఈసీజీ తీయాల్సిరాగా టెక్నీషియన్ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో పేషంట్ కేర్ సిబ్బందే స్వయంగా ఈసీజీ తీసిన విషయం చర్చనీయాంశగా మారింది. దీంతో జిల్లా సబ్ కలెక్టర్ ఉమాహారతి ఇటీవల ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. జహీరాబాద్ ఆస్పత్రిలో వరుస ఘటనలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రోజుకు వెయ్యి మంది పట్టణం జాతీయ రహదారిపై ఉంది. దీంతో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి నియోజకవర్గంతోపాటు కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల రోగులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతీ రోజు ఆస్పత్రికి సుమారు వెయ్యి మందికి పైగా రోగులు ఆస్పత్రికి చికిత్స కోసం వస్తారు. ఏరియా ఆస్పత్రిలో సుమారు 130 మంది డాక్టర్లు, సిబ్బంది ఉండాలి కానీ 70 మంది వరకు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 50 మంది డాక్టర్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం 17 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో రోగులకు వైద్యసేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఖాళీలతోనే ఇబ్బందులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదకలు పంపించాం. ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందితో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాం. –డాక్టర్ కిరణ్‌కుమార్, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న వారు ఇష్టారాజ్యంగా విధుల నిర్వహణ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో ప్రసవాలు జరిగేవి. సుమారు 300 పైగా ప్రసవాలతోపాటు సీజేరియన్ ఆపరేషన్లు కూడా పెద్ద సంఖ్యలో నిర్వహించే వారు. ప్రసవాల కారణంగా ఆస్పత్రికి పలు అవార్డులు కూడా వచ్చాయి. అలాంటింది ప్రస్తుతం గైనకాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ డాక్టర్ లేకపోవడంతో కాంట్రాక్ట్ పద్ధతిలో ముగ్గురిని నియమించారు. ఐదారుమంది ఉండాల్సిన చోట ముగ్గురు కాంట్రాక్టర్ సీ్త్ర వైద్యులు ఉండటంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ప్రణాళికతో చదువుకోవాలి
సంగారెడ్డి జోన్: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ప్రతీ ఒక్కరు ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షలకు సంబంధించి ఐదు నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం బీసీ సంక్షేమ అధికారి జగదీశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పోటీ పరీక్షలకు అవసరమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతోపాటు ప్రతిరోజూ నిర్ణీత సమయాన్ని కేటాయించాలన్నారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం సాధించడం సాధ్యమేనన్నారు. జీవితంలో ప్రతీ రంగంలోనూ సమస్యలు, సవాళ్లు ఉంటాయని వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలన్నారు. సమస్యలను చూసి వెనకడుగు వేయకుండా వాటిని అవకాశాలుగా మలుచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
బాలిక అపహరణ కేసులో..
● వివరాలు వెల్లడించిన ఏసీపీ శ్రీనివాస్ పటాన్చెరు టౌన్: మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. రామేశ్వరంబండ వీకర్ సెక్షన్‌కు చెందిన మహమ్మద్ అలీం పాషా (24), పటాన్‌చెరుకు చెందిన ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. గతంలో బాలికను ఆమె తల్లిదండ్రుల అనుమతి లేకుండా తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆగస్టు 30న రాత్రి సుమారు 11 గంటలకు తన స్నేహితులైన వడ్డే రాజేశ్ అలియాస్ శివరాత్రి రాజేశ్, ముద్దం రాజు ముగ్గురూ కలిసి బాలికను తీసుకెళ్లే క్రమంలో ఆమె తల్లిదండ్రులు అడ్డుకుంటే దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే బాలికను నిందితుల నుంచి రక్షించి సైబరాబాద్ భరోసా కేంద్రానికి తరలించారు. అయితే పరారీలో ఉన్న నిందితులను మంగళవారం ఉదయం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో తన ఇంటికి వచ్చిన మహమ్మద్ అలీం పాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజేశ్, ముద్దం రాజులను కూడా అరెస్ట్ చేసి నిందితులపై పోక్సో చట్టం–2012లోని సెక్షన్లు 5, 6 తో పాటు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. కాగా అలీం పాషా గతంలో ఓ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. సమావేశంలో సీఐ రవీందర్, ఎస్ఐలు మహేశ్వర్ రెడ్డి ,వినోద్ ఆసిఫ్ అలీ , సిబ్బంది పాల్గొన్నారు.


