మోసపోయాం.. న్యాయం చేయండి
బెజ్జంకి(సిద్దిపేట): అధిక వడ్డీ ఆశ చూపించి మోసగించిన వ్యక్తి నుంచి డబ్బులు ఇప్పించాలని మండలంలోని బేగంపేటకు చెందిన పలువురు బాధితులు సోమవారం సిద్దిపేట సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... రెండేళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి గ్రామంలో ఉన్న బంధుత్వాన్ని ఆసరా చేసుకుని పరిచయాలతో ప్రతి నెల వడ్డీ వస్తుందని, పెట్టుబడి పెట్టాలని నమ్మించి సుమారు రూ. 8కోట్లు తీసుకున్నాడని తెలిపారు. కొన్ని నెలలు వడ్డీ ఇచ్చి మానేశాడని, కరీంనగర్‌లో వారి ఇంటికి వెళితే తాళం వేసి ఉందని చెప్పారు. అప్పులు తెచ్చి, భూములు, బంగారం తాకట్టు పెట్టి డబ్బులిచ్చామని తెలిపారు. మోసగించిన సురేశ్ ఆచూకీని గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరారు.
సీపీకి బేగంపేట బాధితుల వేడుకోలు


