న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఇంట త్వరలో శుభ కార్య జరగనుంది. ప్రియాంక, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రైహాన్ వాద్రా (25) (Raihan Vadra) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన స్నేహితురాలు అవీవా బేగ్ (Aviva Baig)తో రేహాన్ నిశ్చితార్ధం చేసుకున్నారన్న వార్త కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
రైహాన్ వాద్రా (25) ఇటీవల తన ఏడు సంవత్సరాల స్నేహితురాలు అవివా బేగ్‌కు ప్రపోజ్ చేశాడు. దానికి ఆమె ఒకే చెప్పారట. వీరి ప్రేమ ప్రయాణానికి రెండు కుటుంబాలు అనుమతి ఇచ్చినట్టుసమాచారం. అయితే ఈ నిశ్చితార్థంపై ప్రియాంక గాంధీ కుటుంబంనుంచి గానీ, కాంగ్రెస్ పార్టీనుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
రైహాన్ వాద్రా ఎవరు
రైహాన్ వాద్రా డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో చదువుకున్నాడు, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా చదువుకున్నది కూడా ఇ క్కడే కావడం గమనార్హం. ఆ తర్వాత పొలిటిక్స్‌లో ఉన్నత విద్య కోసం లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)కి వెళ్లాడు.
రైహాన్ ఒక విజువల్ ఆర్టిస్ట్ గత పదేళ్లుగా ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టాడు. ముంబైలోని కొలాబాలో ఉన్న సమకాలీన ఆర్ట్ గ్యాలరీ APRE ఆర్ట్ హౌస్‌లో అందుబాటులో ఉన్న బయో ప్రకారం, అతని పోర్ట్‌ఫోలియో వన్యప్రాణులు స్ట్రీట్, వ్యాపార ఫోటోగ్రఫీపై ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. తన తల్లి ప్రియాంక గాంధీ వాద్రా ప్రోత్సాహంతో,ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్నాడు. అలాగే తాత, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ కూడా ఫోటోగ్రఫీపై అభిరుచిని కలిగి ఉండేవారు.
అవివా బేగ్
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మోడరన్ స్కూల్‌లో తన ప్రారంభ విద్యను , OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుండి మీడియా కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీ చదివారు. మాజీ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి. అలాగే ఫోటోగ్రాఫర్ కూడా. 'యు కాంట్ మిస్ దిస్' (ఇండియా ఆర్ట్ ఫెయిర్, 2023) , 'ది ఇల్యూసరీ వరల్డ్' (2019) వంటి అనేక విజయవంతమైన ప్రదర్శనలలో తన కళను ప్రదర్శించారు.


