ఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు గోల్డెన్ అవర్స్‌లో సకాలంలో చికిత్స అందించి వారి ప్రాణాల్ని కాపాడేందుకు కేంద్రం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పీఎం రాహత్ పేరుతో రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో రూ.1.5లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు మోదీ తెలిపారు.
శుక్రవారం పీఎంవో నూతన కార్యాలయం సేవాతీర్థ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సేవాతీర్థ్ నుంచి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ‘సేవాతీర్థ్ కొత్త చరిత్రకు సాక్ష్యం. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం సేవాతీర్ధ్. స్టార్టప్ ఇండియా 2.0 కోసం 10 వేల కోట్లతో కార్పస్ ఫండ్. సకాలంలో వైద్యం అందక ప్రాణం పోకూడదన్న ఉద్దేశ్యంతో 1.5లక్షల వరకు నగదు రహిత వైద్యం. పీఎం రాహత్, లక్‌పక్ దీదీలకు 6 లక్షలు పెంచేందుకు యత్నం. ప్రారంభం వ్యవసాయ మౌలిక సదుపాలయ నిధి రెట్టింపు’ చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
పీఎం రాహత్ ఎలా పని చేస్తోంది
ప్రధానమంత్రి రాహత్ (PM RAHAT) పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడానికి రూపొందించింది. ఈ పథకం ద్వారా బాధితులు డబ్బు కోసం ఆందోళన చెందకుండా, వెంటనే చికిత్స పొందే అవకాశం కలుగుతుంది. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు నగదు లేకుండా చికిత్స అందుతుంది. అంటే, ఆసుపత్రి బిల్లులు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వం నేరుగా ఖర్చును భరిస్తుంది.
బాధితుడు ఏ ఆసుపత్రిలో చేరినా, పథకం కింద ఖర్చు నేరుగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇది చికిత్స ఆలస్యం కాకుండా, వెంటనే ప్రారంభం కావడానికి సహాయపడుతుంది. ప్రమాదం జరిగిన మొదటి గంటల్లోనే అవసరమైన చికిత్స (సర్జరీ, ICU, మెడికల్ కేర్) అందించడమే ఈ పథకం లక్ష్యం.‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందితే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కుటుంబ సభ్యులు డబ్బు కోసం పరుగులు తీయకుండా బాధితుడు వెంటనే చికిత్స పొందేలా ఈ పథకం సహాయపడుతుంది. ప్రమాదం తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి తగ్గుతుంది. ఈ పథకం వల్ల ‘డబ్బు లేకపోవడం వల్ల ప్రాణం కోల్పోవడం’ అనే పరిస్థితి తగ్గుతుంది. అంటే, ఆర్థిక స్థితి ఎలా ఉన్నా, ప్రతి ఒక్కరికీ సమానంగా వైద్య సహాయం అందుతుంది.


