నేడు సేవా తీర్థ్‌ ప్రారంభం  | PM Narendara Modi to inaugurate new PMO at Seva Teerth | Sakshi
Sakshi News home page

నేడు సేవా తీర్థ్‌ ప్రారంభం 

Feb 13 2026 4:45 AM | Updated on Feb 13 2026 4:45 AM

PM Narendara Modi to inaugurate new PMO at Seva Teerth

కొత్త భవనంలోకి ప్రధాని కార్యాలయం  

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) చిరునామా మారబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సౌత్‌ బ్లాక్‌ను విడిచిపెట్టి, ఇకపై కొత్త భవనం సేవా తీర్థ్‌ నుంచే అధికారిక విధులు నిర్వర్తించబోతున్నారు. నూతన పీఎంఓగా తీర్చిదిద్దిన సేవా తీర్థ్‌ కాంప్లెక్స్‌ను మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే కర్తవ్య భవన్‌–1, కర్తవ్య భవన్‌–2ను సైతం ప్రారంభించనున్నారు. పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్‌ సెక్రెటేరియట్‌ కూడా సేవా తీర్‌్థలోనే కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం ఇవి ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. 

కర్తవ్య భవన్‌–1, 2లలో కేంద్ర న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖలతోపాటు ఇతర శాఖలను ఏర్పా టు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా శాఖల కార్యాలయాలు లుటెన్స్‌ ఢిల్లీ రైసినా హిల్స్‌లోని నార్త్‌ బ్లాక్, సౌత్‌ బ్లాక్‌లో ఉన్నాయి. వాటిని ఖాళీ చేయబోతున్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా సౌత్‌ బ్లాక్‌లో శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. నార్త్‌ బ్లాక్‌ నుంచి కేంద్ర హోంశాఖ కార్యాలయాన్ని ఇప్పటికే కామన్‌ సెంట్రల్‌ సెక్రెటేరియెట్‌లోని 347 రూమ్‌ కాంప్లెక్స్‌కు తరలించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement