’మా కుమారుడి వివాహానికి రండి.. మీ సలహాలకు థాంక్యూ’ | Arjun Sania Wedding, Sachin Tendulkar Invites PM Modi And President Murmu, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

అర్జున్‌- సానియా పెళ్లి: ప్రధాని, రాష్ట్రపతికి సచిన్‌ ఆహ్వానం.. ఫొటోలు వైరల్‌

Feb 11 2026 9:44 AM | Updated on Feb 11 2026 10:24 AM

Arjun Sania Wedding: Tendulkar Invites PM Modi President Murmu Pics Viral

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్‌- అంజలి దంపతుల కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ మార్చి 5న వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. స్నేహితురాలు సానియా చందోక్‌తో కలిసి ఏడడుగులు వేయనున్నాడు.

వియ్యంకులతో కలిసి
ఈ నేపథ్యంలో సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar)కుటుంబం.. వియ్యంకులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలిసింది. కాబోయే వధూవరులు అర్జున్‌, సానియా కూడా మోదీని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని సచిన్‌ టెండుల్కర్‌ స్వయంగా వెల్లడించాడు.

రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు
అదే విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి తమ కుమారుడి వివాహానికి (Arjun- Saania Wedding) రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సచిన్‌ తెలిపాడు. ఈ నేపథ్యంలో.. ‘‘గత ఫిబ్రవరిలో గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు మా మదిలో అలాగే ఉన్నాయి.

ఈరోజు అర్జున్‌- సానియా వివాహానికి ఆహ్వానించేందుకు మరోసారి వారిని కలిశాము. వధూవరుల్ని ఆశీర్వదించిన గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు’’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. రాష్ట్రతితో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా పంచుకున్నాడు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని సైతం వివాహానికి ఆహ్వానించినట్లు తెలిపాడు సచిన్‌.

మీ విలువైన సలహాలకు థాంక్స్‌
ఇక ప్రధాని నరేంద్ర మోదీకి సైతం సచిన్‌ ధన్యవాదాలు తెలిపాడు. ‘‘అర్జున్‌- సానియా వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. యువ జంటకు మీరు ఇచ్చిన విలువైన సలహాలు, ఆశీర్వాదాలకు కృతజ్ఞులమై ఉంటాము’’ అని సచిన్‌ ప్రధానితో దిగిన ఫొటోలు షేర్‌ చేశాడు.  

వ్యాపార కుటుంబం
కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనుమరాలే సానియా చందోక్‌. ఆమె కూడా వ్యాపార రంగంలోనే ఉన్నారు. సచిన్‌ కుమార్తె సారా టెండుల్కర్‌కు సానియా స్నేహితురాలు. ఇక అర్జున్‌- సానియాల నిశ్చితార్థం గతేడాది జరిగిన విషయం తెలిసిందే. 

కాగా సచిన్‌- అంజలి దంపతులకు మొదటి సంతానంగా సారా జన్మించగా.. తర్వాత అర్జున్‌ జన్మించాడు. అయితే, అక్క కంటే ముందు తమ్ముడు పెళ్లి పీటలు ఎక్కనుండటం విశేషం.  ఇక సారా వ్యాపార రంగంలో అడుగుపెట్టగా.. అర్జున్‌ తండ్రి బాటలో క్రికెటర్‌ అయ్యాడు. అయితే, ఇప్పటి వరకు ఆశించినంత గుర్తింపు పొందలేకపోయాడు 26 ఏళ్ల  అర్జున్‌. 

చదవండి: నయా రాకెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement