సచిన్‌కు కాబోయో కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.అయితే ఇందుకు సంబంధించి ఇరు కుటుంబాలు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయినప్పటికి అర్జున్ ఎంగేజెమెంట్ వార్త బయటకు రావడంతో సానియా బ్యాగ్రౌండ్ గురుంచి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ సానియా?ముంబైకి చెందిన సానియా చందోక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పట్టా పొందింది. ఆమెకు పెంపుడు జంతువులంటే ఇష్టం. దీంతో సానియా 2022లో ముంబైలో మిస్టర్ పావ్స్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్పీ లగ్జరీ పెట్ స్పాను స్థాపించింది.ఈ కేంద్రాల్లో గ్రూమింగ్, స్పా, కొరియన్, జపనీస్ థెరపీలతో పెంపుడు జంతువులకు పత్యేక ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు రూ.87 కోట్లు ఉన్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిపోర్ట్లు తెలియజేస్తున్నాయి. ఇక సానియా తాత రవి ఘాయ్ ముంబైలో అత్యంతంత ధనవంతుల్లో ఒకరు.ఆయన గ్రావిస్ గ్రూప్ యజమాని. ఈ గ్రూప్ బాస్కిన్-రాబిన్స్ ఇండియా, బ్రూక్లిన్ క్రీమరీ ఐస్ క్రీమ్ లాంటి బ్రాండ్లను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ కార్యకాలాపాల్లో సానియా యాక్టివ్‌గా పాల్గోంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముంబైలోని ఇంటర్ కాంటి నెంటల్ హోటల్ కూడా ఈ కుటుంబానికి చెందిందే. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 624 కోట్ల టర్నోవర్ సాధించింది. అంతకముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది 20% ఎక్కువ. ఆహారం, హాస్పటాలిటీ రంగాల్లో ఎక్కువగా వీరి వ్యాపారం కొనసాగుతోంది. అయితే సానియా తండ్రి గౌరవ్ ఘాయ్‌కి, తన తాత రవి ఘాయ్‌తో కొన్ని కుటుంబ వివాదాలు ఉన్నట్లు సమాచారం.చదవండి: జపాన్‌లో టీమిండియా కెప్టెన్.. ఆకస్మిక పర్యటనపై అనుమానాలు..?