
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కుటుంబం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డాక్టర్ అంజలి (Anjali)ని పెళ్లాడిన సచిన్‌కు.. కుమార్తె సారా, కుమారుడు అర్జున్ సంతానం.
అర్జున్ తండ్రి బాటలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని.. ఆల్‌రౌండర్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అయితే, సారా (Sara Tendulkar) మాత్రం భిన్నమైన దారిలో పయనిస్తోంది. న్యూట్రీషనిస్ట్‌గా, మోడల్‌గా రాణిస్తున్న సారా బయో మెడికల్ సైంటిస్ట్ కూడా!!.
28వ వసంతంలోకి అడుగు
అంతేకాదు తండ్రి సచిన్ టెండుల్కర్ నిర్వహిస్తున్న ఫౌండేషన్‌లో సారా డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే.. సారా అక్టోబరు 12న 28వ వసంతంలో అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్ సారా చిన్ననాటి ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘చిరునవ్వులతో పాటు కలలూ కలిసి పంచుకున్నాం. సారా.. నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడూ గర్వపడేలా చేస్తావు. హ్యాపీ బర్త్‌డే!.. ఇలాగే ప్రకాశిస్తూ ఉండు’’ అంటూ కుమార్తెకు ఆశీర్వాదాలు అందజేశాడు.
కాబోయే మరదలు స్పెషల్ విషెస్
ఇక అభిమానులు సైతం సారాకు విషెస్ తెలియజేయగా.. తమ్ముడు అర్జున్, కాబోయే మరదలు సానియా చందోక్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్ట్‌లను సారా ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. అక్క సారాకు బూర్జ్ ఖలీఫాను చూపిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను పంచుకున్న అర్జున్.. పుట్టినరోజు శుభాకాంక్షలు అని విషెస్ చెప్పాడు.

అర్జున్‌తో సానియా ఎంగేజ్‌మెంట్
మరోవైపు.. తన బెస్ట్‌ఫ్రెండ్ సారాను ఆలింగనం చేసుకున్న సానియా చందోక్.. ‘‘నా ఫేవరెట్‌కు హ్యాపీ బర్త్‌డే’’అంటూ హార్ట్ ఎమోజీ జతచేసింది. కాగా ముంబైలోని బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా. ఇటీవలే ఆమెకు, అర్జున్‌కు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సచిన్ టెండుల్కర్ స్వయంగా ధ్రువీకరించాడు.
అయితే, అత్యంత సన్నిహితుల నడుమ జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. ఇదిలా ఉంటే.. అక్క సారా కంటే ముందే తమ్ముడు అర్జున్ పెళ్లికి సిద్ధం కావడం విశేషం. మరోవైపు.. సారాకు ప్రాణ స్నేహితురాలైన సానియా.. అర్జున్ కంటే వయసులో దాదాపు ఏడాది పెద్దది.
కాగా సచిన్ కంటే అంజలి ఐదేళ్లు పెద్దవారన్న విషయం తెలిసిందే. ఇక సారా ఇటీవలే ముంబైలో వెల్‌నెస్ సెంటర్ పైలేట్స్ స్టూడియోను ఏర్పాటు చేయగా.. సచిన్- అంజలి దంపతులు కాబోయే కోడలితో కలిసి పూజలు చేశారు.
చదవండి: కొడుకు 6 వారాల్లో 10 కిలోలు తగ్గితే.. తండ్రి ఆర్నెళ్లలో 38 కేజీలు ఉఫ్!.. వీరి సీక్రెట్ ఇదే