భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి అనూహ్య పరిస్థితుల్లో వాయిదా పడింది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన తరుణంలో అకస్మాత్తుగా స్మృతి తండ్రి ఆరోగ్యం చెడిపోయింది.
ఈ నేపథ్యంలో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి తన మేనేజర్‌తో మీడియాకు చెప్పించింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేక సందేహాలకు తావిచ్చాయి.
స్మృతి తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రిలో చేరిన తర్వాత పలాష్ కూడా ఆస్పత్రి పాలు కావడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత పలాష్ పేరిట ఓ అకౌంట్ నుంచి మేరీ డికోస్టా అనే అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్‌లు వెళ్లాయనేలా స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి.

మోసం చేశాడా?
అందులో స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా మాట్లాడిన పలాష్.. డికోస్టాతో డేటింగ్ చేయడానికి ఉవ్విళ్లూరినట్లుగా అనిపించింది. అంతేకాదు.. స్మృతితో తనకు ‘లాంగ్ డిస్టేన్స్’ ఉందంటూ పలాష్.. సదరు అమ్మాయిని తనతో ఎంజాయ్ చేయాలని కోరినట్లుగా ఉన్న మెసేజ్‌లు వైరల్‌గా మారాయి.
ఈ నేపథ్యంలో పలాష్ తన మాజీ ప్రేయసి బిర్వా షాకు ప్రపోజ్ చేసిన పాత రొమాంటిక్ వీడియోలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్.. స్మృతిని మోసం చేశాడని.. ఇది గుర్తించిన ఆమె తండ్రి అతడితో గొడవ పడే క్రమంలోనే అస్వస్థతకు గురయ్యాడనే వదంతులు వ్యాపించాయి. అయితే, సోషల్ మీడియాలో స్మృతి- పలాష్ గురించి ఇంత రచ్చ జరుగుతున్నా ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందనా లేదు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. అయినా
అంతేకాదు.. తాజా సమాచారం ప్రకారం స్మృతి తండ్రి సాంగ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయినప్పటికీ పెళ్లి గురించి మంధాన కుటుంబం గురించి ఎటువంటి స్పందన రాకపోవడం అనుమానాలు బలపడేలా చేసింది.

ఇద్దరిలో ఎవరు ధనవంతులు?
ఈ నేపథ్యంలో పలాష్.. అందం, కీర్తి ప్రతిష్టలు, డబ్బు ఉన్న స్మృతిని ప్రేమ అనే మత్తులో ఉంచి ద్రోహానికి పాల్పడ్డాడంటూ అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి నెట్‌వర్త్ ఎంత?.. ఇద్దరిలో ఎవరు ధనవంతులు? అన్న చర్చ నడుస్తోంది.

టాప్ క్రికెట్ స్టార్ స్మృతి
భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్‌గా, మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తొలి టైటిల్ అందించిన సారథిగా మంధానకు పేరుంది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలవడంలోనూ ఆమెది కీలక పాత్ర. వెరసి స్మృతి బ్రాండ్ వాల్యూ మునుపటి కంటే భారీ స్థాయిలో పెరిగింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాంట్రాక్టులో ద్వారా ఆమెకు ఏటా రూ. 50 లక్షల వేతనం వస్తుంది. అదే విధంగా ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అదనంగా లభిస్తాయి.
ఆమె నికర ఆస్తుల విలువ ఎంతంటే?
ఇందుకు తోడు ఆర్సీబీ ప్రధాన ప్లేయర్‌గా, కెప్టెన్‌గా స్మృతికి రూ. 3.4 కోట్లు దక్కుతాయి. మహిళా క్రికెటర్లలో ఈ మేరకు అత్యధిక ధరకు ఒప్పందం కుదుర్చుకున్న అమ్మాయి మంధాననే.
వీటితో పాటు బ్రాండ్ ప్రమోషన్స్, ప్రచారం ద్వారా కూడా స్మృతి రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో 2025 నాటికి స్మృతి మంధాన నికర ఆస్తుల విలువ రూ. 32- 34 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా అంచనా.
పలాష్ నెట్‌వర్త్ ఎంత?
ఇక పలాష్ విషయానికొస్తే.. మ్యూజిక్ కంపోజర్‌గా, ఆల్బమ్స్ రూపకర్తగా అతడికి ఆదాయం వస్తోంది. అంతేకాదు.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలాష్ అదనపు ఆదాయం గడిస్తున్నాడు. వీటితో పాటు లైవ్ షోలు, రాయల్టీల ద్వారా పలాష్‌కు భారీ మొత్తమే అందుతోంది. వెరసి 2025 నాటికి అతడి నెట్‌వర్త్ రూ. 20- 41 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
కాగా 2019 నుంచి స్మృతి- పలాష్ రిలేషన్‌లో ఉండగా.. గతేడాది తమ ప్రేమను ధ్రువీకరించారు. ఈ జంట నవంబరు 23న పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా అంతా గందరగోళంగా మారిపోయింది.
చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి


