లాలీపాప్స్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టమో తెలిసిందే. పంచదార క్యాండీలాంటి ఈ చాక్లెట్‌లంటే పెద్దలకు కూడా ప్రియమైనవే. అలాంటి లాలిపాప్‌ని టెక్నాలజీ సాయంతో వినూత్నంగా ఆవిష్కరించారు. వాటి ప్రత్యేకత తెలిస్తే విస్తుపోతారు.
ప్రపంచ సమావేశమైన సీఈఎస్ 2026 లాస్ వేగాస్‌లో వినూత్న ఆవిష్కరణలతో ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), రోబోటిక్స్ టెక్నాలజీలో ఉన్నత స్థాయి పురోగతిని ప్రదర్శిస్తుండగా..ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ అందర్నీ ఆమితంగా ఆకట్టుకుంది. అదేంటంటే..క్యాండీ చాక్లెట్‌గా పిలిచే లాలిపాప్‌ని కొరికనప్పుడు మ్యూజిక్ వినిపిస్తుంటుందట.
వీటిని లాలిపాప్‌స్టార్‌గా పిలుస్తారట. ఈ అసాధారణమైన క్యాండీ బోన్ కండక్షన్ టెక్నాలజీతో పనిచేస్తుందట. ఈ క్యాండీలో మనం ఐస్ స్పైస్, ఏకాన్, అర్మానీ వైట్ వంటి కళాకారుల పాటలు వినొచ్చట. ఆక్యాండీని చప్పరించినా లేదా కొరికనప్పుడూ మన పుర్రె ఎముకల ద్వారా లోపలి చెవికి ప్రయాణించే ధ్వని సంగీతంలా వినిపిస్తుందట. అంటే మన నోటిలోనే సంగీత కచేరి వినోచ్చన్నమాట.
సింపుల్‌గా చెప్పాలంటే..ప్రపంచపాప్ దిగ్గజాల పాటలన్నీ మన నోటిద్వారానే వినొచ్చు. పైగా కొరకండి సంగీతాన్ని అస్వాదించండి అని సదరు లావా కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది కూడా. అంతేగాదు వీటి ధర ఏకంగా రూ. 808లు. ఇవి కేవలం స్టార్‌వెబ్‌సైట్‌లో లభిస్తాయట. అయితే నెటిజన్లు ఈ ఆవిష్కరణపై మండిపడుతున్నారు. ఇంతకుమునుపు పిల్లల టూత్‌బ్రెష్‌లలో ఇలాంటి టెక్నాలజీనే వినియోగించారని గుర్తు చేస్తూ పోస్టులు పెట్టారు. పైగా అత్యంత పనికిమాలిన వస్తువుగా తిట్టిపోయడం గమనార్హం.
(చదవండి: హీరో రామ్‌చరణ్ ఇంట జపాన్ చెఫ్ చేతి బిర్యానీ..! టేస్ట్ ఎలా ఉందంటే..)


