రష్మిక, విజయ్‌ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్‌..! ప్రత్యేకతలు ఇవే.. | Rashmika And Vijay Deverakonda Marriage Venue ITC Mementos Rooms Cost Will Amaze You, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

రష్మిక, విజయ్‌ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్‌..! ఎంత ఖర్చు అవుతుందంటే..

Feb 23 2026 1:37 PM | Updated on Feb 23 2026 1:47 PM

Rashmika Vijay Deverakonda Marriage Venue ITC Mementos

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ నెల ఫిబ్రవరి 26, 2026న వివాహ చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదిక కానుంది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐటీసీ మెమెంటోస్‌ హోటల్‌. సన్నిహిత వర్గాల ప్రకారం..ఒక వారం ముందుగానే బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. పచ్చటి ఆరావళి కొండలు, నీలి ఆకాశానికి నిలయమైన ఈ వాతావరణంలో గడపాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..!.

రష్మిక-విజయ్‌లు వివాహం చేసుకుంటున్న ITC మెమెంటోస్‌ లోపల 117 విల్లాలతో, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, విశాలమైన పచ్చని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వెల్నెస్‌ సెంటర్‌, అందంగా రూపొందించిన లాంజ్‌లు ఉన్నాయి. ఇక్కడ అతిథులు చేతితో తయారు చేసిన కాక్‌టెయిల్స్, వెచ్చని పానీయాలు, ప్రశాంతమైన దృశ్యాలను హాయిగా ఆస్వాదించవచ్చు.

ఈ హోటల్‌లో ఉదయ్ పెవిలియన్, కబాబ్స్  అండ్‌ కుర్రీస్, రాయల్ వేగా, ది రాక్ బార్ వంటి చక్కటి భోజనాలను ఆస్వాదించొచ్చు. శాఖాహారం నుంచి వివిధ ప్రపంచ రుచుల తోపాటు రిఫ్రెష్‌ కాక్‌టెయిల్‌ వరకు అన్నిరకాల టేస్ట్‌లను ఆస్వాదించొచ్చు. పలనా రెసిపీ లోటు అనేదానికి అవకాశం లేకుండా ప్రతి వంటకం అందుబాటులో ఉంటుందట. 

ఆరోగ్యం పరంగా ఫిట్‌నెస్ సెంటర్‌ని అధునాతన యంత్రాలతో సెట్‌ చేశారు. ఇక్కడ ఉన్న విశాలమైన ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ హాయిగా వర్కౌట్లు చేసుకోవచ్చు. ఇదేగాక మరో గొప్ప అనుభూతి ఏంటంటే..ఇక్కడ రాయల్ స్పాలో, వేడుకకు విచ్చేసిన అతిథులు పురాతన భారతీయ చికిత్సలు, ఉత్తేజకరమైన వెల్నెస్ చికిత్సలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ తప్పనిసరిగా ఇన్ఫినిటీ పూల్ లేదా లాంజ్ పూల్‌ను మిస్ అవ్వకండి. 

చక్కటి విశ్రాంతికి నిలయం. ఈ పెళ్లికి విచ్చేస్తున్న అతిథులంతా ఇక్కడ జరిగే  అన్ని రకాల వినోద కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు, ఉదయ్‌పూర్‌ను సందర్శించొచ్చు. ఈ ప్రాంతం  ప్రకృతి సహజ సౌందర్యానికి,  సాహస అనుభవాలను గమ్యస్థానం. ఈ మెమెంటోస్ సూట్లో బసకి- అక్షరాల రూ. 73,199 - 91,499/-లు ఖర్చు అవుతుందట.

 

(చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్‌ వెల్నెస్‌ సీక్రెట్‌..! ఆయిల్‌ మసాజ్‌లు, ఇంట్లో తయారు చేసే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement