‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక | Vijay Deverakonda first post On Marriage with Rashmika Wedding of Virosh | Sakshi
Sakshi News home page

Vijay Rashmika Wedding: ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక

Feb 22 2026 11:11 PM | Updated on Feb 23 2026 8:29 AM

Vijay Deverakonda first post On Marriage with Rashmika Wedding of Virosh

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి విషయమై స్పందించారు. అభిమానులు వీరిని ఎంతో ఇష్టంగా “విరోష్” అని పిలుస్తున్నారు. అదే పేరును తమ వివాహ వేడుకకు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు.  


“మేం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ముందే అభిమానులు ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చాలా ప్రేమతో ఒక పేరు పెట్టారు. అందువల్ల మా వివాహ వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ విజయ్, రష్మిక పేర్కొన్నారు. ఈ జంట వివాహ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 26న విజయ్ – రష్మిక మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్ కృష్ణలో రాత్రి 7 గంటలకు గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

వీరిద్ధరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచే ఈ జంటపై రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు పెళ్లి వార్తలతో ఆ రూమర్స్‌కు ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబలి’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. దీనికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ కపుల్‌గా పేరుగాంచిన విజయ్, రష్మిక వివాహం కోసం వీరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement