ప్రశాంత వర్మ దర్శకత్వంలో 'జై హనుమాన్' సినిమా లాంచనంగా మొదలైంది.
రిషభ్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు.
ఆదివారం ఉదయం హంపిలోని అంజనాద్రి బెట్టపై ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
తొలి భాగంలో నటించిన తేజా సజ్జాతో పాటు నిర్మాతలు పాల్గొన్నారు.


