ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనత | First woman judge of Zambian Supreme Court was once a Delhi girl | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనత

Aug 7 2026 11:07 AM | Updated on Aug 7 2026 11:35 AM

First woman judge of Zambian Supreme Court was once a Delhi girl

Justice Abha Nayar Patel ఢిల్లీలో పుట్టి పెరిగిన అభా నాయర్‌ జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. ఎదిగి చరిత్ర సృష్టించారు. అభాకు ఏడేళ్ల వయసులో ఆమె కుటుంబం ఉపాధి కోసం 1973లో జాంబియాకు వెళ్లింది.అంతేకాదు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ ఆహ్వానం మేరకు భారత సుప్రీంకోర్టు ధర్మాసనం  (Judicial Dais)పై ఆసీనులైన తొలి జాంబియా న్యాయమూర్తిగా కూడా ఆమె నిలిచారు.

ఆమె భారతదేశ పర్యటలో భాగంగా సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (SCAORA) నిర్వహించిన "న్యాయం అందించే భవిష్యత్తు: ఆవిష్కరణ, సమ్మిళితం మరియు సమగ్రత" అనే అంశంపై జస్టిస్ పటేల్ ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వి. మోహన కూడా ప్రసంగించారు. జస్టిస్ సూర్య కాంత్ ఆహ్వానం మేరకు  జస్టిస్‌ అభా నాయర్‌ భారత సుప్రీంకోర్టు న్యాయపీఠాన్ని అలంకరించడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించడం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అల్గారిథమ్‌ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల గతంలో ఉన్న పక్షపాతాలు (historical bias) మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. న్యాయ వితరణలో ఆవిష్కరణ (Innovation), నిబద్ధత (Integrity), సమ్మిళితత్వం (Inclusivity) అనే మూడు అంశాలు కీలకమని తెలిపారు. “సమగ్రత లేని ఆవిష్కరణ ప్రమాదకరం. సమ్మిళితత్వం లేని సమగ్రత అసంపూర్ణం, అలాగే ఆవిష్కరణ లేని సమ్మిళితత్వం తరచుగా ప్రభావం చూపలేనంత నెమ్మదిగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. న్యాయస్థానాలలో సాంకేతిక సాధనాలను ఉపయోగించేటప్పుడు, అవి తీర్పు ఫలితాల నిష్పక్షపాతాన్ని, అలాగే న్యాయం పొందే అవకాశాన్ని రెండింటినీ మెరుగుపరిస్తే తప్ప వాటిని ఉపయోగించకూడదని జాంబియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభా నాయర్ పటేల్ గురువారం అన్నారు. అనియంత్రిత ఆవిష్కరణలు ఇప్పటికే ఉన్న అసమానతలను కేవలం "డిజిటలైజ్" చేయగలవని ఆమె హెచ్చరించారు.

జాంబియా కోర్టు రికార్డుల డిజిటలైజేషన్  అండ్‌ వర్చువల్ సాక్ష్యం దిశగా  నెమ్మదిగానే అయినప్పటికీ, అర్థవంతమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సందర్బంగా జస్టిస్‌ సూర్యకాంత్ మాట్లాడుతూ సాంకేతికత వల్ల భారతదేశంలో సామాన్యులకు న్యాయం చేరువైందని, సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించే అవసరం లేకుండా కేసుల విచారణను ట్రాక్ చేసే వెసులుబాటు కలిగిందన్నారు. అయితే ఏఐ న్యాయ నిర్వహణకు సాయపడగలదే తప్ప, న్యాయమూర్తి సానుభూతిని, మానవీయ విచక్షణను ఎంతమాత్రమూ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.

కాగా చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి జాంబియాకు వెళ్లిపోయిన అభానాయర్‌ అర్కడి విశ్వవిద్యాలయంనుండి లా పూర్తి చేశారు. యుకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు.   అనంతరం 1989లో జాంబియా బార్‌లో చేరారు. పర్వతారోహకురాలు కూడా అయిన ఆమె 'కిలిమంజారో' పర్వతాన్ని అధిరోహించడం మరో విశేషం. 2019లో హైకోర్టు న్యాయమూర్తిగా, 2023 ఏప్రిల్‌లో కోర్ట్ ఆఫ్ అప్పీల్‌కు, ఈ ఏడాది మే 27న జాంబియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి సాధించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement