సాక్షి, ఢిల్లీ:హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు అదనపు బెంచ్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ రోజు (బుధవారం) రాజ్యసభలో జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి 2,218 కేసులు విచారణ చేయాల్సి వస్తుందన్నారు. హైకోర్టులో అప్పిలేట్ కోర్టులు ఏర్పాటు చేయాలని సీనియర్ మోస్ట్ హైకోర్టు జడ్జితో అప్పిలేట్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.
హైకోర్టులో క్రిమినల్ కేసులు సింగిల్ బెంచ్ తర్వాత డివిజన్ బెంచ్ విచారించేలా సీఆర్పీసీలో సవరణ తీసుకురావాలని దీనివల్ల 15శాతం భారం సుప్రీంకోర్టుపై తగ్గుతుందని తెలిపారు. తప్పుడు కేసులు విచారిస్తే భారీగా జరిమానాలు విధించాలని రాబోయే పదేళ్ళను దృష్టిలో ఉంచుకొని వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని నిరంజన్ రెడ్డి రాజ్యసభలో మాట్లాడారు.


