పోలీస్ బైక్‌పై రాపిడో బిజినెస్ వరంగల్‌లో వైరల్ | Rapido on Police Bike In Warangal Viral Video | Sakshi
Sakshi News home page

పోలీస్ బైక్‌పై రాపిడో బిజినెస్ వరంగల్‌లో వైరల్

Aug 5 2026 10:58 AM | Updated on Aug 5 2026 11:18 AM

Rapido on Police Bike In Warangal Viral Video

హనుమకొండ: పోలీసుల వేగవంతమైన విధుల నిర్వహణ కోసం ప్రభుత్వం అందించిన అధికారిక ద్విచక్ర వాహనం.. రోడ్లపై ర్యాపిడో బైక్‌గా కనిపిస్తే ఎలా ఉంటుంది? వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసు శాఖకు కేటాయించిన అధికారిక బైక్‌ను ర్యాపిడో సేవల కోసం వినియోగిస్తున్నట్లు ఓ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు.

 

సమాచారం ప్రకారం.. హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి సుబేదారి జంక్షన్‌కు వెళ్లేందుకు ఓ వ్యక్తి ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నాడు. కొద్దిసేపటికే వచ్చిన బైక్‌పై పోలీసు శాఖ అధికారిక గుర్తులు ఉండటాన్ని గమనించి ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. బైక్ గురించి రైడర్‌ను ప్రశ్నించగా, ఆ బైక్ తన పోలీసు స్నేహితుడిదని, తాను ర్యాపిడో సేవల కోసం ఉపయోగిస్తున్నానని చెప్పినట్లు సమాచారం. ఈ సంభాషణను ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వైరల్ అయిన వీడియోలో కనిపించిన TS 09 PC 2795 నంబర్ గల బ్లూ కోట్స్ పోలీసు ద్విచక్ర వాహనం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎనుమాముల పోలీస్ స్టేషన్‌కు కేటాయించినదిగా గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement