మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంగళవారం పోచమ్మ అమ్మవారి బోనాల వేడుక అంగరంగవైభవంగా నిర్వహించారు.
అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పణకు భక్తజనం పోటెత్తింది. శివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ఆటపాటలు, డప్పుల చప్పుళ్లతో బోనాల జాతర హోరెత్తింది.


