ఒక ఇంచి వినాయకుడు.. జూమ్‌ చేసి భక్తుల దండాలు! | Mumbais 1 Inch Ganesha Idol Goes Viral | Sakshi
Sakshi News home page

ఒక ఇంచి వినాయకుడు.. జూమ్‌ చేసి భక్తుల దండాలు!

Sep 22 2026 9:44 AM | Updated on Sep 22 2026 9:44 AM

Mumbais 1 Inch Ganesha Idol Goes Viral

మలాడ్: ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ గణేశ్ మండపం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా భారీ విగ్రహాలు, భారీ అలంకరణలతో కనిపించే గణేశ్ మండపాలకు బదులుగా.. ఇక్కడ కేవలం ఒక ఇంచి పరిమాణంలో ఉన్న గణేశుడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ధన్‌జీవాడీ చా ధన్‌రాజ్ గణపతి మండపంలో ఈ సూక్ష్మ గణేశ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ చిన్న గణశుడిని ఓ శివలింగం లోపల ఉంచారు. శివుడికి సంబంధించిన అంశాలతో గణేశుడిని అలంకరించడంతోపాటు, ఆయనను నందిపై నిలబెట్టారు.

శివలింగంలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా మాత్రమే ఈ విగ్రహాన్ని స్పష్టంగా చూడగలం. విగ్రహం అతి చిన్నదిగా ఉండటంతో భక్తులు తమ మొబైల్ ఫోన్లలో 3x డిజిటల్ జూమ్ ఉపయోగించి వినాయకుడని దర్శించుకుంటున్నారు. ఈ చిన్న గణేశుడి చుట్టూ కైలాస పర్వతాన్ని తలపించేలా ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేశారు. పత్తితో చేసిన అలంకరణను ఆకాశాన్ని సూచించేలా ఉపయోగించారు. మండపంలో తొలుత వెండి ఆభరణాలతో అలంకరించిన పెద్ద గణేశ విగ్రహం భక్తులకు కనిపిస్తుంది. దాని పక్కనే  ప్రత్యేక ఆకర్షణగా సూక్ష్మ గణపతిని పెట్టారు. 

ఇదీ చదవండి: పాలు.. నేలపాలు.. బకెట్లతో ఎగబడిన జనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement