నిమజ్జనం వేళ.. చిరాగ్ పాశ్వాన్ కన్నీరు! | Chirag Paswan Gets Emotional During Ganpati Immersion, Viral Video Sparks Mixed Reactions Online | Sakshi
Sakshi News home page

నిమజ్జనం వేళ.. చిరాగ్ పాశ్వాన్ కన్నీరు!

Sep 19 2026 12:22 PM | Updated on Sep 19 2026 1:06 PM

Chirag Paswan Gets Emotional During Ganpati Visarjan

ముంబై: గణపతి నిమజ్జనం భక్తులకు భావోద్వేగంతో కూడిన సందర్భం. గణపయ్యకు వీడ్కోలు పలికే సమయంలో నటుడు, కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగానికి గురైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు.
 

గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో చిరాగ్ పాశ్వాన్ అక్కడే ఉన్నారు. వీడ్కోలు పలుకుతున్న సమయంలో ఆయన తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయినట్లు వీడియోలో కనిపించింది. చుట్టూ ఉన్న భక్తులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటుండగా.. చిరాగ్ పాశ్వాన్ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోను చూసిన కొంతమంది సోషల్ మీడియా యూజర్స్‌ చిరాగ్ పాశ్వాన్ కన్నీళ్లు నిజమైనవేనా అంటూ ప్రశ్నించారు. మరికొందరు ఆయన నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిరాగ్ పాశ్వాన్‌వి ‘నకిలీ కన్నీళ్లు’ అంటూ ఒకరు వ్యాఖ్యానించగా.. మరొకరు ‘గొప్ప నటుడు’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఇంకొందరు ఆయన నవ్వుతూ ఏడుస్తున్నట్లు నటిస్తున్నారని, ఇదంతా ఫేక్ అంటూ కామెంట్లు చేశారు.

ఇదీ చదవండి: పారిస్‌ ఒప్పందాన్ని నిలబెట్టాం : ప్రధాని మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement