లవర్‌ను పెళ్లాడి బిహార్‌కు, ఇన్‌స్టాలో అమెరికా అమ్మడు సందడి | American Woman Moves To Bihar Village After Marriage Shares Glimpses Of Her Desi Life | Sakshi
Sakshi News home page

లవర్‌ను పెళ్లాడి బిహార్‌కు, ఇన్‌స్టాలో అమెరికా అమ్మడు సందడి

Sep 17 2026 3:57 PM | Updated on Sep 17 2026 5:32 PM

American Woman Moves To Bihar Village After Marriage Shares Glimpses Of Her Desi Life

అమెరికాలోని అట్లాంటా (జార్జియా) నగరానికి చెందిన యువతి హోప్‌ తను ప్రేమించిన వాడికోసం విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టింది. భారతీయ యువకుడైన అభిషేక్ సింగ్‌ను వివాహం చేసుకుని బిహార్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో స్థిరపడింది. ఆమె తన విభిన్నమైన కల్చరల్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.  

2023లో హోప్‌ అభిషేక్ సింగ్‌ను వివాహం చేసుకుంది. 2025 అక్టోబర్‌లో తొలిసారిగా ఇండియాకు వచ్చింది. అంతే ఇక్కడి  సంస్కృతిపై ఇష్టంతో బిహార్‌లోని ఒక చిన్న గ్రామంలోనే స్థిరపడింది. ఆమె ప్రస్తుతం ఆమె బిహార్‌లోని గ్రామీణ వాతావరణానికి, అక్కడి సాధారణ జీవనశైలికి అలవాటుపడి, భర్త, కుమారుడితో ఎంతో ఆనందంగా గడుపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 

ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్‌

 

ప్లాస్టిక్ టబ్‌లో చేతులతో బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, సాంప్రదాయ పొయ్యి మీద వంట చేయడం వంటి సాధారణ గ్రామ జీవితపు దినచర్యలను ఆమె తన సోషల్ మీడియా వీడియోల ద్వారా పంచుకుంటూ ఉంటుంది. ఎక్కువగా కుర్తాలు, చీరలు ధరించడం, సింధూరం పెట్టుకోవడం వంటి భారతీయ ఆచారాలను పాటిస్తోంది.  'గెట్-రెడీ-విత్-మి' వీడియోలు బాగా పాపులర్‌ అయ్యాయి. అలాగే ఆమె కంటెంట్‌లో ఆహారం కూడా ఒక ముఖ్యమైన భాగం. సమోసా చాట్, పావ్ బాజీ, రోటీలు చేయడం వంటి వంటకాలను స్వయంగా చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ  ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడం విశేషం. 

ఇదీ చదవండి: పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి

సోషల్ మీడియా స్పందన
భారతీయ సంస్కృతికి అలవాటు పడి, స్థానిక భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న తీరుపై నెటిజన్లు సంతోషాన్ని ప్రకటిస్తున్నారు.  అమెరికాను వదిలి బీహార్‌లోని ఒక మారుమూల గ్రామంలో ఆమె జీవిస్తుండటం పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె నిర్ణయాన్ని ఆశ్చర్యంగా,విమర్శనాత్మకంగా చూస్తుండగా,మరికొందరు ఆమె భారతీయ సంస్కృతిని స్వీకరించిన తీరును అభినందిస్తున్నారు. అప్పుడప్పుడు విమర్శలు ఎదురైనప్పటికీ, ఆమె కంటెంట్‌కు వచ్చిన స్పందనలో చాలా వరకు సానుకూలంగానే ఉంది. ఈ అసాధారణమైన సాంస్కృతిక మార్పు, ఆమె గ్రామ జీవితానికి అలవాటుపడిన తీరు యూజర్లను ఆకట్టుకున్నాయి. 

ఇదీ చదవండి: మలేషియా విమానంలోనే ప్రాణం విడిచిన భారతీయుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement