రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్‌ | Rs 500 Crore Notice To Aaditya Thackeray In Sushant Singh Ex Manager Case | Sakshi
Sakshi News home page

రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్‌

Sep 17 2026 12:32 PM | Updated on Sep 17 2026 1:15 PM

Rs 500 Crore Notice To Aaditya Thackeray In Sushant Singh Ex Manager Case

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salian) మరణం కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం సంచలనంగా మారింది. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నశివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరేకు భారీ షాక్‌ తగిలింది.  

అనుమానాస్పదంగా మరణించిన తన కుమార్తెకు న్యాయం  చేయాలనిపోరాడుతున్న దిశా తండ్రి సతీష్ సాలియన్ రూ. 500 కోట్ల నష్టపరిహాం కోరుతూ నోటీసులు పంపారు. శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే , ఎన్‌సిపి (ఎస్‌పి) నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ల కు పరువు నష్టం దావా నోటీసులు జారీ అయ్యాయి.  ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగా రాజకీయ ప్రేరేపితమైందిగా  తాను చేస్తున్న న్యాయ పోరాటాన్నిచిత్రీకరించడానికి ఈ ఇద్దరు నాయకులు ప్రయత్నించారని  సతీష్ సాలియాన్, దీనికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తన నోటీసులో పేర్కొన్నారు.

బహిరంగ క్షమాపణకు డిమాండ్
సతీష్ సాలియన్ 'షరతులు లేని, స్పష్టమైన , ఎలాంటి షరతులు లేని లిఖితపూర్వక బహిరంగ క్షమాపణ' చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్షమాపణను అన్ని ప్రధాన ప్రింట్, టీవీ మరియు డిజిటల్ మీడియా వేదికలలో ప్రచురించి, ప్రసారం చేయాలి. అంతేకాదు బేషరతుగా బహిరంగ క్షమాపణలతోపాటు, సోషల్ మీడియాలో మూడు నిమిషాల వీడియోను పోస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఆదిత్య థాకరే మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఇప్పటికే  ఖండించారు. దిశా సాలియాన్‌ను తాను ఎప్పుడూ కలవలేదని, తన పేరును ఈ కేసులో అనవసరంగా లాగుతున్నారని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

 

2020 జూన్ 8న  28 ఏళ్ల దిశా సాలియన్, ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఒక ఎత్తైన నివాస భవనం నుండి పడి మరణించింది. పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా పరిగణించి, యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ఏడీఆర్) నమోదు చేశారు. ఆరు రోజుల తర్వాత, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించారు.ఈ కేసును సీబీఐ తాజాగా తన చేతులోకి తీసుకుని, హత్య మరియు క్రిమినల్ కుట్ర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement