ఆమిర్‌ఖాన్‌కు ఆదిత్య ఠాక్రే కౌంట‌ర్‌ | Aaditya Thackeray on Aamir Khan statement on Sonam Wangchuk | Sakshi
Sakshi News home page

హీరో ఆమిర్‌ఖాన్‌కు ఆదిత్య ఠాక్రే కౌంట‌ర్‌

Jul 18 2026 2:39 PM | Updated on Jul 18 2026 2:54 PM

Aaditya Thackeray on Aamir Khan statement on Sonam Wangchuk

ముంబై: ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌, సామాజిక ఉద్య‌మ‌కారుడు సోనమ్ వాంగ్‌చుక్‌పై బాలీవుడ్ విల‌క్ష‌ణ‌ న‌టుడు ఆమిర్‌ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన (యూబీటీ) నాయ‌కుడు ఆదిత్య ఠాక్రే ఘాటుగా స్పందించారు. సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా త్రీ ఇడియ‌ట్స్ సినిమాలో తాను పోషించిన పాత్ర‌కు రూప‌క‌ల్ప‌న చేశార‌న్న ప్ర‌చారాన్ని ఆమిర్‌ఖాన్ ఖండించారు. అస‌లు త‌మ సినిమాకు, వాంగ్‌చుక్‌కు సంబంధం లేద‌న్న‌ట్టుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో ఆమిర్‌ఖాన్‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

ఆమిర్‌ఖాన్‌ వ్యాఖ్య‌ల‌పై తాజాగా ఆదిత్య ఠాక్రే స్పందించారు. విద్యార్థుల కోసం ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి నిరాహార‌దీక్ష చేస్తున్న వారికి మ‌ద్ద‌తు తెల‌పడం క‌నీస బాధ్య‌త అని అన్నారు. ''మీరు ప్రముఖులైనా కాకపోయినా.. దేశంలో యువత, విద్యార్థుల కోసం ఎవరైనా నిరాహార దీక్ష చేస్తుంటే, వారు ఎందుకు దీక్ష చేస్తున్నారు, ప్రభుత్వం వారి మాట ఎందుకు వినడం లేదని అడగడం మన బాధ్యత''ని ఆదిత్య ఠాక్రే అన్నారు. కాగా, సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు శ‌నివారం ఉద‌యం బ‌ల‌వంతంగా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వాంగ్‌చుక్‌కు హృతిక్ రోషన్ మ‌ద్ద‌తు
విద్యార్థుల కోసం నిరాహార దీక్ష చేప‌ట్టిన సోనమ్ వాంగ్‌చుక్‌కు బాలీవుడ్ అగ్ర‌న‌టుడు హృతిక్ రోషన్ సంఘీభావం ప్ర‌క‌టించాడు. ఈ మేర‌కు ఇన్‌స్టా స్టోరీలో వాంగ్‌చుక్ వీడియో షేర్ చేసి, త‌న అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ''ఇది నిజమే అనిపిస్తోంది. నా సినిమాల్లో ఒకదాంట్లో ఉపాధ్యాయుడి పాత్ర పోషించినప్పుడు, విద్యార్థులు ఎదుర్కొనే మానసిక వేదన గురించి నేను తెలుసుకున్నాను'' అని కామెంట్ పెట్టాడు. వాంగ్‌చుక్‌కు మ‌ద్ద‌తు తెలిపిన హృతిక్ రోషన్‌ను 'వెన్నెముక కలిగిన స్టార్' అని అభిమానులు కొనియాడుతున్నారు.

బాలీవుడ్‌ ప్ర‌ముఖుల మ‌ద్ద‌తు
సోనమ్ వాంగ్‌చుక్‌కు ఇప్ప‌టికే ప‌లువురు న‌టీన‌టులు సంఘీభావం తెలిపారు. జీనత్ అమ‌న్, కిర‌ణ్‌రావు, అదితిరావు హైద‌రీ, ఫ‌తిమా స‌నా షేక్‌, సోనాక్షి సిన్హా, ఇమ్రాన్ ఖాన్‌, ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, అభయ్ డియోల్, ఓమి వైద్య, అతుల్ కుల‌క‌ర్ణి, షాయాజీ షిండే త‌దిత‌రులు సోనమ్ వాంగ్‌చుక్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. బాలీవుడ్ అగ్ర‌హీరోలైన ఖాన్ త్ర‌యం మాత్రం స్పందించ‌లేదు.

చ‌ద‌వండి: కూతురి వీడియోను ప్ర‌ధానికి ట్యాగ్ చేసిన శ‌త్రుఘ్న సిన్హా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement