హైదరాబాద్ నగరంలోని హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ కొత్త రూపం సంతరించుకుంది.
ఆధునిక డిజైన్, అత్యాధునిక సదుపాయాలు, ప్రయాణికులకు మెరుగైన వసతులతో స్టేషన్‌ను తీర్చిదిద్దారు.
అమృత్ భారత్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించిన ఈ స్టేషన్..
నగర రవాణా వ్యవస్థలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
పేరుకు తగ్గట్టే హైటెక్ హంగులు ప్రయాణికులను, చూపరులను ఆకట్టుకుంటున్నాయి.


