హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో లక్షలాదిగా తరలివచ్చారు.
ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన జనం ఖైరతాబాదు బారులు తీరారు.
రైల్వేగేటు, లక్షీకాపూల్, మింట్ కాం పౌండ్, ఐమాక్స్ థియేటర్ తదితర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మూడు ప్రధాన మార్గాలు ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి.


