అవసరమైన వారికి కంటి చూపును ప్రసాదించాలనే మహోన్నత ఆశయంతో శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆర్కాన్సాస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి నిధుల సేకరణ కార్యక్రమం ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్ – 2026’ విజయవంతంగా జరిగింది.
అక్టోబర్ 3, శనివారం బెంటన్విల్లోని ది నైబర్హుడ్ చర్చిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది హాజరయ్యారు. సంగీత, నృత్య ప్రదర్శనలతో ఆహ్లాదకరంగా సాగిన ఈ వేడుక, కంటి చూపు అవసరమైన నిరుపేదలకు సహాయం చేయాలనే సేవా సంకల్పానికి వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని ఆర్కాన్సాస్ విభాగం ఉపాధ్యక్షుడు వైద్యనాథన్ వెంకటసుబ్రమణియన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర నేత్రాలయ లక్ష్యాలను, కంటి వైద్య సేవలను అవసరమైన వారికి అందించడంలో శంకర నేత్రాలయ యూఎస్ఏ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో మరో ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకుంది. శంకర నేత్రాలయ చేపట్టిన ‘అడాప్ట్ ఎ విలేజ్’ (ఒక గ్రామాన్ని దత్తత తీసుకునే కార్యక్రమం) పథకానికి ఆర్కాన్సాస్ రాష్ట్రం నుంచి తొలి దాతగా బాపూజీ వక్కలగడ్డ ముందుకు వచ్చారు. సేవా కార్యక్రమాలకు ఆయన అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఆర్కాన్సాస్ విభాగం నాయకులు వేదికపై ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమం ఆద్యంతం వైద్యనాథన్ వెంకటసుబ్రమణియన్తో పాటు విభాగం నాయకులు అరవింద్ శివసుబ్రమణియన్, కీర్తి దీనదయాళన్, శక్తివేల్ బాలచంద్రన్, సాయి పూర్ణిమ శంకర నేత్రాలయ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు.
ఇక శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు, శంకర రత్న పురస్కార గ్రహీత బాలరెడ్డి ఇందుర్తి అందిస్తున్న నాయకత్వానికి, నిరంతర సహకారానికి ఆర్కాన్సాస్ విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అమెరికా వ్యాప్తంగా శంకర నేత్రాలయ సేవలను విస్తరించడంలో, ‘అడాప్ట్ ఎ విలేజ్’ కార్యక్రమాన్ని బలోపేతం చేయడంలో, సంచార కంటి వైద్య సేవలను మరింత మందికి చేరువ చేయడంలో ఆయన చేస్తున్న కృషిని కొనియాడింది.
అలాగే కార్యక్రమ నిర్వహణ, సమన్వయం, ఇతర ఏర్పాట్లలో సహకరించిన మూర్తి రేకపల్లి, డాక్టర్ రెడ్డి ఉరిమిండి, శ్యామ్ అప్పాలి, వంశీకృష్ణ ఎరువరం, రత్నకుమార్ కవుటూరు, గోవర్ధన్ రావు నిడిగంటి, కార్తికేయన్, దీనదయాళన్లకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ది నైబర్హుడ్ చర్చి యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
చివరగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సతీష్ శ్రీనివాసన్, పాల్ వినోద్ కుమార్, సంతోష్ సీతారామన్, జగన్ రామచంద్రన్, రాజ్ యెర్లగడ్డ, చంద్రశేఖర్ పి., గణపతి రాజమణి అందించిన సేవలను ప్రత్యేకంగా అభినందించింది.
అలాగే విద్యార్థులు సువర్ణరేఖ బాబు, అక్షర లక్ష్మణ్, తన్వి మహేష్ కుమార్, ఆదితా నవీన్ కుమార్, సరయు, రియా కీర్తి, సాధ్వి వైద్యనాథన్, నివిన్ పాల్ వినోద్ కుమార్ సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. కాగా, కంటి చూపు కోల్పోయిన నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శంకర నేత్రాలయ యూఎస్ఏ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు దాతలు, సేవాభిమానులు సహకరించాలని నిర్వాహకులు కోరారు.
ఇదీ చదవండి: హ్యూస్టన్లో పూర్వ విద్యార్థులతో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలు


