శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా చాప్టర్, తన వార్షిక గ్రాండ్ ఫినాలే విజయవంతంగా ముగిసిన సందర్భంగా, సంస్థ నిధుల సేకరణలో కీలక పాత్ర పోషించిన స్వచ్ఛంద సేవకులను గౌరవించేందుకు, సాంబార్ టు సుక్కా రెస్టారెంట్ బ్యాంక్వెట్ హాల్‌లో ప్రత్యేక స్వచ్ఛంద సేవకుల అభినందన విందును నిర్వహించింది.
దాతల అసాధారణ దాతృత్వం, స్వచ్ఛంద సేవకుల అంకితభావం, సమాజం పట్ల అచంచలమైన మద్దతును ప్రతిబింబిస్తూ, శంకర నేత్రాలయ గత రెండు ఏళ్లలో ప్రతి ఏడాది 2 మిలియన్ డాలర్ల నిధులను సేకరించి అద్భుతమైన మైలురాయిని సాధించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శంకర నేత్రాలయ సలహాదారుల మండలి సభ్యులు అరవింద్ కృష్ణస్వామి, వారి సతీమణిజయా కృష్ణస్వామి చ్చేశారు. BRS MLC, మాజీ అట్లాంటా నివాసి మధు తాతా గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఇతర విశిష్ట అతిథులలో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) కార్యదర్శి శ్రీ రమేష్ మర్రి గారు, వనవాసి కళ్యాణ ఆశ్రమం తరపున రామనారాయణ రావు బొనగిరి ఉన్నారు.

SNUSA అట్లాంటా చాప్టర్ అధ్యక్షులు బాలా రెడ్డి ఇందుర్తి యకత్వంలోని బృందం, విశిష్ట అతిథులను, హాజరైన వారందరినీ హృదయపూర్వకంగా స్వాగతించింది. అట్లాంటా చాప్టర్ నాయకత్వ, నిర్వాహక బృందంలో కోశాధికారి మూర్తి రేకపల్లి ; ధర్మకర్తలుశ్రీనిరెడ్డి వంగిమళ్ళ గారు, రాజశేఖర్ ఐల, డా. కిషోర్ రెడ్డి రాసమళ్ళు; సాంస్కృతిక విభాగ అధ్యక్షురాలు నీలిమా గద్దమానుగు; CVP వెంకీ నీలం; చాప్టర్ లీడ్స్ బిజు దాస్, కార్తికేయన్ వినాయగం, రామరాజు గదిరాజు ఉన్నారు. అకాడమీ గురువులు, అనేకమంది అంకితభావ స్వచ్ఛంద సేవకులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
సాయంత్రానికి ప్రత్యేక సంగీత వైభవాన్ని జోడిస్తూ, అట్లాంటాకు చెందిన ప్రతిభావంతులైన గాయకులు శ్రీ ఫణి డొక్కా, శిల్పా ఉప్పులూరి, సందీప్ కొవ్తా తెలుగు, హిందీ పాటల మధుర గానంతో ప్రేక్షకులను అలరించారు. వారి శ్రావ్యమైన ప్రదర్శనలు ఉల్లాసభరిత, పండుగ వాతావరణాన్ని సృష్టించి, వేడుకను మరింత చిరస్మరణీయం చేశాయి.
ఇదీ చదవండి: హాంకాంగ్‌లో ఘనంగా సాముహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు


