కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులకు శంకరరత్న పురస్కారం | Former VP Venkaiah Naidu Presents Sankara Ratna Award to Prasad Reddy Shobha Reddy | Sakshi
Sakshi News home page

కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులకు శంకరరత్న పురస్కారం

Oct 26 2026 1:56 PM | Updated on Oct 26 2026 2:29 PM

Former VP Venkaiah Naidu Presents Sankara Ratna Award to Prasad Reddy Shobha Reddy

చెన్నైలో శంకర నేత్రాలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసాద్‌ రెడ్డి కాటం రెడ్డి, శోభ రెడ్డి దంపతులకు శంకరరత్న పురస్కారం 2025ను ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. శంకర నేత్రాలయ చైర్మన్‌ డా సురేంద్రన్‌, శంకరనేత్రాలయ అధ్యక్షులు డా గిరిష్‌రావు, శంకరనేత్రాలయ అమెరికా అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. 

ఈ వేడుకలో డల్లాస్ ట్రస్టీ, శ్యామ్ అప్పాలి, మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి గోలి, ఉభయ  తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ ఈ ఎల్ ఎన్ నరసింహన్, చెన్నై నగర ప్రముఖులు, శంకరనేత్రాలయ చెన్నై సిబ్బంది పాత్రికేయ బృందం హాజరు అయ్యారు. గతంలో ఈ సేవపురస్కారాన్ని రతన్‌ టాటా, ఇస్రో చైర్మన్‌ పద్మవిభూషణ్‌ డా. జి మాధవన్‌ నాయర్‌, మాజీ ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ పద్మవిభూషణ్‌ ఏ ఎం నాయక్‌, మాజీ టీసీ ఎస్‌ సీ ఈ ఓ పద్మభూషణ్‌ఎస్‌ రామదొరై, మాజీ హెచ్‌ డీఎఫ్‌ సీ పద్మభూషణ్‌ దీపక్‌ పరేఖ్‌, తమిళ చిత్ర దర్శకులు ఎస్ పి ముత్తురామనే, తదితరులు అందుకున్నారు. 

అలాగే ప్రవాస భారతీయుల్లో ఎస్ వి ఆచార్య , బాలరెడ్డి ఇందుర్తి తదితరులు గతంలో ఈ అవార్డుని స్వీకరించగా, ఈ అవార్డు గ్రహీతలైన ఎస్ పి ముత్తురామన్, ప్రముఖ తమిళ్ రచయిత వి వి రంగనాథన్ హాజరు కావడం మరో విశేషం. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..తమిళనాడుతో, మద్రాసు శంకరనేత్రాలయతో ఉన్న తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ..కాటంరెడ్డి ప్రసాద్‌ రెడ్డి, శోభా రెడ్డి సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరు వీరి సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకుని మరింత సహకారాన్ని అందించాలని సూచించారు. 

శంకరనేత్రాలయ అమెరికా విభాగ అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా అమెరికాలో శంకరనేత్రాలయ అనేక రాష్ట్రాలలో చాఫ్టర్లు ఓపెన్‌ చేశామని, తద్వారా వాలింటీర్స్‌ సంఖ్య గణనీయంగా పెరగడమే గాక వాళ్లు  చేసే సేవ కార్యక్రమాలు మరింతమంది దాతల దగ్గరకు చేరుకుని సంస్థకు కావాల్సిన నిధులు మునుపెన్నడూ లేని విధంగా సమకూరినట్లు తెలిపారు. 

అలాగే కాటంరెడ్డి ప్రసాద్‌ రెడ్డి దంపతులు ఈ పురస్కారానికి అర్హులని కొనియాడారు. ఎన్నో సేవాసంస్థలకు అండదండగా ఉంటూ నిస్వార్తంగా సేవలందిస్తున్నారని అ‍న్నారు. అంతేగాదు తమ లాభాలలో రెండు మిలియన్ల డాలర్స్‌ ప్రతిఏడాది విరాళంగా ఇస్తారని తెలిపారు. శంకరనేత్రాలయ సంస్థ అంటే ఈ దంపతుకు ప్రత్యేక అభిమానమని కూడా అన్నారు. అలాగే వారిందించిన సేవలను కూడా వివరించారు. కాగా, కార్యక్రమం అనంతరం మైసూర్ లోని శ్రీ దత్తపీఠాన్ని సందర్శించారు. అక్కడ అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడమేగా   శంకరనేత్రాలయ సంస్థ చేపడుతున్న అనేక ఉచిత కంటి సేవాకార్యాక్రమాల గురించి  వివరించి, భవిష్యత్ కార్యాచరణ కోసం ఆశీస్సులు కోరారు. 

ఇదీ చదవండి: ప్రముఖ సాహితీవేత్త డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాంకాంగ్ పర్యటన

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement