Bapatla
-
కబడ్డీ జట్టుకు అభినందనలు
చినగంజాం: జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే సబ్ జూనియర్ పురుషుల రాష్ట్ర జట్టు క్రీడాకారులను వైఎస్సార్ సీపీ మండల నాయకులు శనివారం అభినందించారు. స్థానిక కొత్తపాలెం బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న శిబిరంలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులను వారు కలిసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మున్నం నాగేశ్వరరెడ్డి, ఎన్. సుబ్బారెడ్డి, ఎన్. రామిరెడ్డి, రాజు వెంకటేశ్వరరెడ్డి, బొడ్డు ఏడుకొండలరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, మేడికొండ సునీల్, సూర్యనారాయణరెడ్డి, పాదర్తి ప్రకాష్, మార్కాపురం రామారావు, ఆట్ల పోతురాజు, శ్రీకాంత్, కోటిరెడ్డి, స్వామిరెడ్డి పాల్గొన్నారు. -
బెట్టింగ్‌లకు పాల్పడితే జీవితం అంధకారమే !
బాపట్ల టౌన్: బెట్టింగ్‌లకు పాల్పడితే జీవితం అంధకారంగా మారుతుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లను అదునుగా చేసుకొని కొందరు స్వార్థపరులు, చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌లకు తెరలేపే అవకాశం ఉందని హెచ్చరించారు. బెట్టింగ్‌లకు బలి అవుతున్నవారిలో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారని, సులభంగా నగదును అర్జించవచ్చునని ఆశ చూపుతూ ఊబిలో దించుతారని తెలిపారు. ఒక్కసారి అలవాటు పడితే వాటి నుంచి బయటకు రావడం కష్టం అవుతుందని సూచించారు. ఒకసారి ఆదాయం వచ్చినా పలుమార్లు నష్టపోతారని, వాటిని భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారని వివరించారు. బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిదని, ఆశ చూపి అంధకారంలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. యువత దానికి బలి కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రికెట్ మ్యాచ్‌లను వినోదం కోసం మాత్రమే చూడాలని, బెట్టింగులు వైపు మొగ్గు చూపకూడదని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని, బెట్టింగులకు పాల్పడుతుంటే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలని చెప్పారు. గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై, అనుమానితులపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. జిల్లాలో బెట్టింగులను నిర్వహించినా, అమాయకులను, యువతను ఊబిలోకి లాగాలని ప్రయత్నించినా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. నిర్వాహుకులను గుర్తించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 112/100కు సమాచారం అందించాలని, ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ పెను భూతానికి బలి కావద్దు బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు -
మత్స్య సంపద, ఆక్వా సాగు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర కమిషనర్ రమాశంకర్‌నాయక్ బాపట్ల: మత్స్య సంపద, ఆక్వా సాగు పెంచడమే ప్రభుత్వం ముఖ్యోద్దేశమని మత్స్య శాఖ రాష్ట్ర కమిషనర్ రమాశంకర్‌నాయక్ అన్నారు. బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన కమిషనర్ రమాశంకర్‌నాయక్ స్థానిక కలెక్టరేట్‌కు శనివారం చేరుకున్నారు. జిల్లాకు తొలిసారిగా వచ్చిన కమిషనర్‌ను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. కమిషనర్‌ను కలిసిన వారిలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ ఉన్నారు. అనంతరం బాపట్ల, చీరాలలోని రొయ్యల హేచరీలు, పాలీ చీట్ యూనిట్లు, బయోఫ్లోక్ టెక్నాలజీతో నడిచే యూనిట్లు, రొయ్యల ఫామ్, ప్రాసెసింగ్ యూనిట్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు బి కృష్ణకిషోర్, మత్స్యశాఖ అధికారులు, ఆక్వా చెరువులు, ప్రాసెసింగ్ యూనిట్ల నాయకులు, తదితరులు ఉన్నారు. -
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
బాపట్ల: పనిముట్ల కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక రాయితీ రుణాలను కుల వృత్తిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని స్పందన హాలులో శనివారం ఆదరణ ఫేజ్– 3 కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు బాపట్ల రవికుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈడీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే 90% రాయితీని పొందడానికి పనిముట్ల ఖరీదులో 10% ముందుగా డీడీ చెల్లించాలని తెలిపారు. మంజూరు చేసిన అనంతరం ఈ డీడీలను కార్పొరేషన్‌కి అందించాలని ఆయన సూచించారు. కుల వృత్తుదారుల ఆర్థిక ఎదుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, స్వర్ణకార, రజక, మేదర, మొండిబండ, అగ్నికుల క్షత్రియ, బెస్త, వడ్డెర సంఘ నేతలు పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు. బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు -
వలపర్ల తిరునాళ్లలో ఆధిపత్య పోరు
మార్టూరు : మండలంలోని వలపర్ల గ్రామంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన తిరునాళ్లలో అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వలపర్ల గ్రామ పొలిమేరలోని కోతి ఆంజనేయస్వామి ఆలయ తిరునాళ్ల శుక్రవారం రాత్రి నిర్వహించారు. స్థానిక రెండు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకుల మధ్య కొన్ని నెలల నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. తిరునాళ్లకు రెండు ప్రభల ఏర్పాట్ల కోసం చురుగ్గా ప్రయత్నాలు జరిగాయి కూడా. విషయం తెలిసిన ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయం ఇద్దరు నాయకులను హెచ్చరించింది. ఒకే ప్రభను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించింది. చివరకు ఒక ప్రభనే ఏర్పాటు చేసినా లోపల ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రభ స్టేజీపై డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వలపర్ల శివారు గ్రామమైన ద్వారకపాడుకు చెందిన ఓ పది మంది యువకులు స్టేజీ సమీపంలో ఉండగా, మరో వర్గానికి చెందిన యువకులతో వివాదం ప్రారంభమైంది. మొదటి నుంచి అధిపత్య పోరు సమాచారం తెలిసిన సీఐ మద్దినేని శేషగిరిరావు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన వివాదాన్ని మొదట్లోనే పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. తిరిగి 12:30 గంటల ప్రాంతంలో స్టేజీ వెనుక రెండు గ్రూపులు ఘర్షణకు తలపడ్డాయి. విషయం తెలిసిన సీఐ శేషగిరిరావు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన యువకులు పోలీసులను సైతం పక్కకు నెట్టివేసే ప్రయత్నం చేశారు. సీఐ ఆదేశాలతో పోలీసులు ఇరు వర్గాలపై లాఠీచార్జి చేశారు. చివరకు ఒంటిగంట ప్రాంతంలో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తెలుగు తమ్ముళ్ల బాహాబాహి పోలీసుల లాఠీచార్జి -
రైతులు గిడ్డంగుల్లోనే నిల్వ చేసుకోవాలి
బాపట్ల: గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు పండించిన పంటలను గిడ్డుంగుల్లో నిల్వ చేసుకోవచ్చని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాపట్ల గిడ్డంగుల వద్ద రైతులు ధాన్యం నిల్వలపై శనివారం అవగాహన కల్పించారు. మేనేజర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గిడ్డుంగుల్లో ధాన్యం నిల్వ చేసి లాభాలు వచ్చినప్పుడు విక్రయించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ కళాశాల డీన్ డాక్టరు ప్రసూనారాణి మాట్లాడుతూ పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టరు కె.ఎస్.పాల్, హైమాజ్యోతి, కె.సునీల్, అపర్ణ, శీతా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో యడ్లపాడు మండలం వంకాయలపాడుకు చెందిన వ్యక్తి మృత్యువాత పడిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు.. మండలంలోని వంకాయలపాడుకు చెందిన లారీ డ్రైవర్ షేక్ మస్తాన్‌వలి(62) మూడు రోజుల కిందట వైజాగ్‌కు లోడు తీసుకుని వెళ్లాడు. వైజాగ్ నుంచి ఐరన్ లోడ్‌తో తిరుగు ప్రయాణంలో ఉన్న లారీ, శుక్రవారం అర్ధరాత్రి అనకాపల్లిలో మరో లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసం కాగా, మస్తాన్‌వలి నడిపే లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జ కావడంతో డ్రైవర్ సీట్లోనే ఇరక్కుపోయాడు. అక్కడిక్కడే మృతి చెందాడు. ఏడాదిన్నర క్రితం భార్యను కోల్పోయిన మస్తాన్‌వలి, ఇద్దరు సంతానంలో ఒక కుమార్తె కూడా కొద్దికాలం కిందట మృతి చెందింది. ప్రస్తుతం మరో కుమార్తె, అల్లుడు వంకాయపాడు గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. డ్యూటీకి అని వెళ్లిన తన తండ్రి విగతజీవిగా మారాడన్న వార్త విన్న కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపించింది. కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి అచ్చంపేట: కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కోగంటివారిపాలెంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు మండలంలోని ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట జయరావు, సరోజినీల కుమారుడు రామ్‌కుమార్ (28) స్నేహితులతో కలసి శనివారం సాయంత్రం 5గంటల సమయంలో సమీపంలోని కృష్ణానదిలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే నది లోతుల్లో జారి పడిపోయినట్లు తెలిసింది. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు తెలుపుతున్నారు. రామ్‌కుమార్ ఇటీవల వైద్యునిగా అర్హత పొంది గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అసిస్టెంట్ వైద్యునిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. కుమారుడు అకస్మాతుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. పోలీసుస్టేషన్లో ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం మేదరమెట్ల: గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కొరిశపాడు మండలం మేదరమెట్ల పైలాన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. అద్దంకి దామవారిపాలేనికి చెందిన ఏలూరి ఆదినారాయణ (24) సొంత పని నిమిత్తం బైకుపై ఒంగోలు వెళ్లి తిరిగి అద్దంకి వస్తున్నాడు. మేదరమెట్ల పైలాన్ సమీపానికి రాగానే అద్దంకి వైపు వెళ్లేందుకు గాను సర్వీసు రోడ్డులోకి వచ్చే క్రమంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం బైకును బలంగా ఢీకొని వెళ్లిపోయింది. దీంతో బైకుపై ఉన్న ఆదినారాయణ రోడ్డుపై పడి పోయాడు. తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మోసం చేసి డబ్బుతో పరారైన నిందితుడి అరెస్ట్ ●డబ్బు రికవరీ ●14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు ●వివరాలు వెల్లడించిన సీఐ ప్రభాకరరావు మాచర్ల: పొలం రిజిస్ట్రేషన్‌కు ఇవ్వాల్సిన డబ్బు తీసుకుని ఉడాయించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజు రిమాండ్ విధించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ప్రభాకరరావు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ గ్రామానికి చెందిన బండెల నరసింహారెడ్డికి దుర్గి మండలంలోని, ముటుకూరు గ్రామ శివారులో 6.88 ఎకరాల పొలం ఉంది. దీన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా మాచర్ల టౌన్‌కు చెందిన చింతా శ్రీనివాసరావు పరిచయం అయ్యాడు. 2022లో పొలం అమ్మకం విషయంలో చిత్తూరు జిల్లాకు చెందిన మైలా మల్లేష్ యాదవ్, సదరు వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడు. నరసింహారెడ్డి తన పొలాన్ని దుర్గి మండలానికి చెందిన మాదాసు వెంకటేశ్వర్లుకు రూ.70.50 లక్షలకు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అడ్వాన్సుగా రూ.45 లక్షలు మాదాసు వెంకటేశ్వర్లు, మల్లేష్ యాదవ్‌కి ఇచ్చారు. అందులో రూ.15 లక్షలు తన వద్ద పెట్టుకొని రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాతే ఇస్తాను అని మల్లేష్ యాదవ్ నమ్మించాడు. అది నమ్మి నరసింహారెడ్డి మార్చి 15న తన పొలంలో మాదాసు వెంకటేశ్వర్లు పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. నిందితుడి తన వద్ద ఉన్న ఫిర్యాదికి చెందిన రూ.15 లక్షలు, మాదాసు వెంకటేశ్వర్లు వద్ద నుంచి రావాల్సిన రూ.25.50 లక్షలు మొత్తం రూ.40.50 లక్షలు తీసుకొని రిజి స్ట్రేషన్ ఆఫీస్ నుంచి పారిపోయాడు. నిందితుడికి ఫిర్యాది ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించక పోవడంతో మోసపోయినట్లు గ్రహించి సదరు విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ పి.ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ సంధ్యారాణి దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీని ఉపయోగించి నిందితుడిని చిత్తూరు జిల్లాలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నగదు రికవరీ చేసి మాచర్ల కోర్టులో హాజరు పరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
ఉద్యోగ నియామక ఉత్తర్వుల్లో తప్పిదాలు
గుంటూరు మెడికల్: గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్(జీజీహెచ్) కార్యాలయ ఉద్యోగుల తీరుపై రోజురోజుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్డీ కార్యాలయంలో ఫార్మాసిస్టుల ప్రమోషన్లకు జీజీహెచ్ నుంచి జాబితాను పంపించే విషయంలో తప్పిదాలు చేసి మెమోలు పొందిన చరిత్ర ఇక్కడి కార్యాలయ ఉద్యోగులది. విషయమేమిటంటే.. 19 పారా మెడికల్ పోస్టులకు గుంటూరు వైద్య కళాశాలలో రిక్రూట్మెంట్ నిర్వహించి శుక్రవారం అపాయిమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. శనివారం విధుల్లో చేరేందుకు నియామక ఉత్తర్వులు తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన ఉద్యోగులకు ఆ ఉత్తర్వుల్లోని తప్పిదాలతో గుండె ఆగినంత పనైంది. కాంట్రాక్టు ఉద్యోగానికి నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సిన చోట అవుట్సోర్సింగ్ పేరుతో అపాయింట్మెంట్లో తప్పిదాలు టైపింగ్ చేశారు. దీంతో ఆందోళన చెందిన ఉద్యోగులు తమ అపాయింట్మెంట్ తప్పిదాలను సరిదిద్దాలని కోరినా అదేమీ కాదులే టేకిటీజీగా తీసుకోండంటూ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం ఉద్యోగులు సిల్లీగా సమాధానం చెప్పడం అభ్యర్థులకు విస్మయం కలిగించింది. గట్టిగా అడిగిన కొంతమందికి పెన్నుతో సరిదిద్ది మరికొంత మందిని సోమవారం రావాలని ఆదేశించారు. కార్యాలయ ఉద్యోగులు చేసిన తప్పిదాలకు తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికై నా జీజీహెచ్ అధికారులు ఎస్టాబ్లిష్మెంట్ విభాగంపై దృష్టి సారించి ఆసుపత్రి పరువు బజారున పడకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగానికి బదులుగా అవుట్సోర్సింగ్ అని టైపింగ్ జీజీహెచ్ ఎస్టాబ్లిష్మెంట్ సిబ్బంది తీరుపై ఆందోళన -
పార్థసారఽథి అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం పార్థసారఽథి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ రామకోటిరెడ్డి పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా నాగేశ్వరరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన పచ్చళ్ళ సుబ్రహ్మణ్యం కుమారులు వ్యవహరించారు. నేడు శ్రీరంగనాయకులు అలంకారం... లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు శ్రీరంగనాయకులు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని, స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈఓ రామకోటిరెడ్డి కోరారు. -
పీఎం అజయ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
అద్దంకి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం అజయ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పథకానికి ఎంపికై న 13 మందికి శనివారం రూ.17.50 లక్షల రుణాల చెక్కులు అందజేశారు. ఏపీఎం మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరయ్యే ఈ రుణంలో రూ.50వేలు రాయితీ పోను, లబ్ధిదారు వాటా, మిగిలిన రుణాన్ని సున్నా వడ్డీతో తిరిగి సక్రమంగా చెల్లించాలని చెప్పారు. ఏపీఎం కోటేశ్వరరావు పాల్గొన్నారు. లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కర్లపాలెం: లైంగిక వేధింపుల నివారణ, పోక్సో చట్టంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఆరో అదనపు జడ్జి కె.శ్యామ్‌బాబు చెప్పారు. కర్లపాలెం మండల పరిఽధిలోని పేరలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి కె.శ్యామ్‌బాబు మాట్లాడుతూ లైంగిక వేధింపులు, అశ్లీలత వంటి నేరాల వంటివి విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారన్నారు. చట్టాలపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా పేదలు న్యాయ సహాయం పొందవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో పేరలి గ్రామ సర్పంచ్ మల్లెల వెంకటేశ్వర్లు, న్యాయవాదులు, డి.కిరణ్, టి.విజయ్‌కుమార్, కె.శ్రీనివాసరావు, వీరాస్వామి ఫౌండేషన్ అధ్యక్షుడు గొర్రుముచ్చు వందనం తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లోనే సహకార సంఘాల లావాదేవీలునరసరావుపేట: ఇకపై సహకార సంఘాలలో అన్ని లావాదేవీలు ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా శనివారం జిల్లా సహకార బ్యాంక్ ఆవరణలో పీఏసీలు, సీఈవోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. వాణిజ్య బ్యాంక్‌ల మాదిరి సహకార సంఘాలు పనిచేయాలన్నారు. అవసరమైతే తగిన ఫర్నిచర్ సమకూర్చుకోవాలని తెలిపారు. సభ్యులకు ఆన్లైన్ సేవలు అందించాలని చెప్పారు. గో లైవ్‌కు వెళ్లిన అన్ని పీఏసీలు ముందుగా నెట్వర్క్ పనితీరును పరీక్షించుకోవాలని చెప్పారు. సభ్యుల డేటా సరిగ్గా నమోదైందో లేదో లాగిన్ చేసి పరిశీలించుకోవాలని కోరారు. సిబ్బందిలో అవసరమైన వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సిస్టమ్ ఆడిట్లో భాగంగా అన్ని మాడ్యూల్స్ సరిగ్గా పని చేస్తున్నాయో లేదో పరీక్షించుకోవాలని సూచించారు. రియల్ టైం ఎంట్రీ ప్రారంభించాలని, ఏ రోజుకుకారోజు ఆన్లైన్ లావాదేవీలు సక్రమంగా చేస్తూ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. జిల్లాలో 59 పీఏసీలకుగాను 38 పీఏసీలలో గో లైవ్‌కు వెళ్లిన సీఇవోలు, జిల్లా సహకార ఆడిట్ అధికారి డి. శ్రీనివాసరావు, బ్యాంకు సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
పచ్చ నేతల బియ్యం మేత!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున చౌకబియ్యం గుజరాత్‌కు తరలిపోతోంది. బాపట్ల శివారులోని అప్పికట్లకు చెందిన ఒక వ్యాపారి బాపట్ల, పొన్నూరు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం సేకరిస్తున్నాడు. ప్రతినెలా 25 వేల క్వింటాళ్ల వరకు సేకరించి రైస్ మిల్లులో రీసైక్లింగ్ చేసి ప్యాక్ చేస్తున్నాడు. అనంతరం బియ్యాన్ని గుంటూరు తరలించి, అక్కడి నుంచి గుజరాత్‌కు అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ, పోలీసు శాఖ అధికారులకు ప్రతి నెల మామూళ్లు ముట్టజెబుతున్నాడు. బాపట్ల పచ్చ పార్టీ ముఖ్య నేత అనుచరుడిగా ఉన్న సదరు మిల్లర్.. యజమాని పచ్చ నేతకు నెలకు రూ. 15 లక్షల వరకు కప్పం చెల్లిస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇదే నియోజకవర్గం నుంచి మరో ఇద్దరు వ్యాపారులు సైతం ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. వీరు కూడా పచ్చనేతకు రూ. 10 లక్షల – రూ.15 లక్షల వరకు కప్పం చెల్లిస్తున్నట్లు పచ్చ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారంలోకి రాగానే బరితెగింపు... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని పచ్చనేతలు అక్రమంగా తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. జిల్లాలోని బాపట్ల, పర్చూరు, అద్దంకి, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని వారి అనుచరులు ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వీరంతా బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల పచ్చనేతల అండతో డీలర్ల నుంచి చౌక బియ్యాన్ని సేకరిస్తున్నారు. కార్డుదారులకు కిలో రూ. 12 చొప్పున ఇచ్చి కొంటున్న మాఫియా అదే బియ్యాన్ని రూ. 35 నుంచి రూ.40కు అమ్మకం సాగిస్తున్నట్లు సమాచారం. చాలా నియోజకవర్గాల్లో కార్డుదారులకు పైసా ఇవ్వకుండా కొందరు పౌరసరఫరాల శాఖ అధికారుల సహకారంతో స్టాకు పాయింట్ల నుంచే బియ్యాన్ని లిప్టు చేస్తున్నారు. బియ్యం అప్పగించినందుకు నియోజకవర్గ పచ్చనేతకు రూ. 25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు మామూళ్లు ముట్టజెబుతున్నారు. బియ్యం ప్రస్తావన తెస్తే కార్డులు రద్దు చేస్తామని పచ్చనేతలు బెదిరింపులకు దిగుతుండడంతో చాలామంది పేదలు బియ్యం అందక పోయినా నోరు మెదపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. పట్టించుకోని అధికారులు బాపట్ల జిల్లాలోని రేపల్లె, వేమూరు, బాపట్ల ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని స్మగ్లర్లు గుజరాత్‌కు తరలిస్తున్నారు. చీరాల, పర్చూరు, అద్దంకి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సేకరించిన బియ్యాన్ని కృష్ణపట్నం పోర్టుకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి సౌతాఫ్రికాకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు నెల మామూళ్లకు పరిమితమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పేదలకు అందాల్సిన చౌక బియ్యం పచ్చ నేతల పరం అవుతున్నాయి. ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని డీలర్లు స్థానిక పచ్చ నేతలు నియమించుకున్న అక్రమ రవాణాదారులకు అప్పగిస్తున్నారు. వాటిని వ్యాపారులు రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి గుజరాత్‌కు తరలిస్తున్నారు. ఇందుకుగాను నియోజకవర్గ పచ్చ నేతకు రూ. 25 లక్షలకు తగ్గకుండా కప్పం చెల్లిస్తున్నారు. రేషన్ బియ్యం దందాతో అక్రమార్జన అప్పికట్ల నుంచి గుజరాత్‌కు రవాణా బాపట్ల, పొన్నూరు నుంచి సేకరణ అప్పికట్ల మిల్లులో రీసైక్లింగ్ చేసి తరలింపు బాపట్ల పచ్చ నేతకు నెలకు రూ. 25 లక్షలు కప్పం -
ఆదాయం పెంచేలా ప్రణాళికలు
బాపట్ల: వ్యవసాయం, మత్స్య, ఆక్వా ఉత్పత్తులను పెంచడం ద్వారా ఆదాయం వృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. వివిధ శాఖల అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 10.70 శాతం లక్ష్యంతో చర్యలు తీసుకోవాలని చెప్పారు. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 28,184 హెక్టార్లలో సేంద్రియ సాగు చేశామన్నారు. ఏడు శాతం ఉత్పత్తి పెరిగేలా 30,998 హెక్టార్లు లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. తద్వారా జిల్లాకు రూ.4,943 కోట్లు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మత్స్య, ఆక్వా రంగాల ద్వారా ఏడాదిలో రూ.12,440 కోట్లు ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని, 13.41 వృద్ధిరేటు సాధించాలన్నారు. పర్యాటకంపై దృష్టి పెట్టండి అతి తక్కువ నిధులతో ఆరు బీచ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా ఏడాదికి రూ.535 కోట్లు ఆదాయం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. పర్యాటకంలో 18.88 వృద్ధి రేటు ఉంటుందన్నారు. అటవీ సంపద వృద్ధి చేయాలని సూచించారు. ఉద్యాన పంటలు అదనంగా 1,650 హెక్టార్లకు విస్తరించాలని తెలిపారు. విస్తీర్ణం పెరుగుదలతో ఉత్పత్తులు అధికం అవుతాయని.. తద్వారా రూ.4,065 కోట్ల ఆదాయం జిల్లాకు వస్తుందన్నారు. 11.49 శాతం వృద్ధిరేటు సాధన దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. మూడు వేల హెక్టార్లలో సూక్ష్మ, బిందు సేద్యం సాగయ్యేలా రైతులను చైతన్య పరచాలన్నారు. రానున్న ఏడాదిలో 20% వృద్ధిరేటు సాధన దిశగా అధికారులు అడుగులు వేయాలని పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా సంప్రదాయ పద్ధతిలో 54,654 గేదెలు, ఆవులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కృత్రిమ పద్ధతిలో 49,675 గేదెలను ఉత్పత్తి చేయాలన్నారు. దీంతో పాల దిగుబడి మరింత పెరిగి ఆదాయం రూ.6,630 కోట్లకు చేరే లక్ష్యంతో 15.20 శాతం వృద్ధిరేటుగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పరిశ్రమల విస్తరణ కీలకం గ్రానైట్, ఇసుక, కంకర వనరులతో రూ.110 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విస్తరణతో వార్షికాదాయం రూ.1,941 కోట్లకు పెరిగేలా చూడాలన్నారు. తద్వారా 37.51% వృద్ధిరేటు పెరుగుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో రైల్వే లైన్ ద్వారా రూ.109 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. తాజాగా రైల్వే గూడ్స్ రేక్ వంటి తదితర వనరులతో ఏడాదిలో వృద్ధిరేటు 5.83% పెరగనుందన్నారు. గ్రామీణ నీటి సరఫరా మరింత పెంచడానికి రూ.167 కోట్లు పనులు చేయాలని ఆయన తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం పైప్ లైన్ల నిర్మాణం పెంచాలన్నారు. విద్యుత్ శాఖ ద్వారా రూ.731 కోట్లు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రచించాలన్నారు. ప్రస్తుతం రూ.17.91 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణాలు లక్ష్యంగా పనులు చేపడుతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సూచన -
అక్రమార్జనకు దగ్గరిదారి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి 5,6 కిలోమీటర్ల దూరంలోని కాజా టోల్గేట్ నుంచి గన్నవరం వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణానికి మట్టి తవ్వి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్దంగా ఈ మట్టిని కొంతమంది వ్యాపారులకు లారీ రూ.2వేలకు అమ్ముతుంటే ఆ వ్యాపారులు లారీ రూ.7వేల నుంచి రూ.8 వేలకు ఇతరులకు అమ్ముకుంటున్నారు. వాస్తవానికి ఈ మట్టిని తరలించేందుకు మైనింగ్‌శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. అయితే సదరు కాంట్రాక్టర్ అవేవీ పట్టించుకోకుండా మట్టిని అమ్ముకోవడం ప్రారంభించారు. ఇదే అదునుగా తీసుకుని కొంతమంది అక్రమార్కులు సైతం రాజధాని ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన రోడ్లను సైతం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. గత ప్రభుత్వం పేదలకు నివాసాలుగా ఇచ్చిన స్థలాల్లో రోడ్లను సైతం కొన్ని చోట్ల తవ్వేశారు. రాత్రిళ్లు ఆ రహదారిపై మట్టిని తవ్వి ఒక ప్రాంతంలో డంపింగ్ చేసి ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసి అమ్ముకుంటున్నారు. అక్రమ మట్టి తవ్వకాల విషయంలో ఈ మధ్యకాలంలో పలు కేసుల్లో నమోదైన ఓ వ్యక్తి ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజధాని గ్రామాలైన కృష్ణాయపాలెం శివారు, వెంకటపాలెం, మందడం శివారు ప్రాంతాల్లో, కొండవీటి వాగు రోడ్డుకు సంబంధించిన మట్టిని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో లారీలు పెట్టి బయటకు తరలిస్తున్నారు. ఐదు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారు పొక్లెయిన్లు తీసుకువచ్చి వారంతట వారే హద్దులు నిర్వహించుకుని మట్టి తవ్వకాలు నిర్వహించి జేబులు నింపుకొంటున్నారు. నిబంధనలకు నీళ్లు రాజధానిలో రోడ్లను తవ్వేస్తూ మట్టి అక్రమ విక్రయాలు రాజధాని ప్రాంతంలో నిర్వహించే పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లు వదిలి తమ లాభార్జన కోసం పనిచేస్తూ ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారు. దీనికి నిదర్శనం కాజా టోల్ వద్ద నుంచి గన్నవరం వరకు నిర్మించే రహదారిలో కాజా టోల్గేట్ వద్ద నుంచి వెంకటపాలెం శివారు వరకు రోడ్డు నిర్మించేటప్పుడు తవ్వే మట్టిని నిబంధనలకు విరుద్దంగా అమ్ముకోవడమే. సదరు కాంట్రాక్టర్లు అవినీతికి దారి చూపడంతో కొంతమంది స్వార్థపరులు రాజధానిలో నిర్మించిన రహదారులను సైతం తవ్వేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రాజధానిలో చేపట్టిన అభివృద్ధి పనులపై నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
రాష్ట్ర కబడ్డీ జట్టుకు శిక్షణ ప్రారంభం
చినగంజాం: సబ్ జూనియర్ రాష్ట్ర కబడ్డీ జట్టుకు శిక్షణ కార్యక్రమాన్ని మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఆసోది బ్రహ్మానందరెడ్డి శుక్రవారం రాత్రి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి ఎంపికై న 18 మంది క్రీడాకారులతో జట్టు రూపొందింది. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు శిక్షణ కొనసాగనుంది. అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో బిహార్‌లో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు పోటీలు ఉంటాయని జట్టు మేనేజర్ బోగిరెడ్డి స్వామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏఈపీఆర్డీ దాసు, అక్కల రవీంద్రరెడ్డి, స్వామిరెడ్డి, తదిచతరులు పాల్గొన్నారు. -
పాలకులు ఏం సందేశం ఇస్తున్నారు?
పవిత్రమైన గుడి, బడి దారిలో మద్యం దుకాణం ఏర్పాటు చేసి సమాజానికి కూటమి పెద్దలు ఏం సందేశం ఇస్తున్నారో గ్రహించాలి. మా ఇళ్ల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని కోరితే కొందరు కూటమి నేతలు మాత్రం ‘రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది... మీకు పింఛన్లు ఎక్కడి నుంచి ఇవ్వలంటూ’ సమాధానం చెప్పటం విడ్డూరంగా ఉంది. మహిళలు, విద్యార్థినులపై మద్యం మత్తులో దారుణాలు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అధికారం ఉందని ఇలా దుకాణం ఏర్పాటు చేయాలని చూస్తే ఊరుకోం. ఎంతటి వరకై నా ఉద్యమాన్ని నిర్వహిస్తాం. –రజని, ప్రైవేటు ఉపాధ్యాయురాలు, పేటేరు -
నాటుసారాతో జీవితం అంధకారం
నిజాంపట్నం: నాటుసారా తాగి జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఒంగోలు డిప్యూటీ కమిషనర్ కె.హేమంత నాగరాజు అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మండలంలోని దిండి పంచాయతీ అదవల గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో శుక్రవారం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నాటుసారాకు ఉపయోగించే ముడి సరకులను విక్రయించినా నేరమేనని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదులు ఉంటే 94904 55599, 94409 02477 నంబర్లకుగానీ, 14405 టోల్‌ఫ్రీ నంబరుకుగానీ సమాచారం అందించాలని సూచించారు. తొలుత నవోదయం 2.0 పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ రామారావు, నగరం సీఐ ఎం.శ్రీరామ్‌ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రాష్ట్ర కబడ్డీ జట్టుకు శిక్షణ ప్రారంభం
చినగంజాం: సబ్ జూనియర్ రాష్ట్ర కబడ్డీ జట్టుకు శిక్షణ కార్యక్రమాన్ని మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఆసోది బ్రహ్మానందరెడ్డి శుక్రవారం రాత్రి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి ఎంపికై న 18 మంది క్రీడాకారులతో జట్టు రూపొందింది. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు శిక్షణ కొనసాగనుంది. అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో బిహార్‌లో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు పోటీలు ఉంటాయని జట్టు మేనేజర్ బోగిరెడ్డి స్వామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏఈపీఆర్డీ దాసు, అక్కల రవీంద్రరెడ్డి, స్వామిరెడ్డి, తదిచతరులు పాల్గొన్నారు. -
మాల, మాదిగలను విడగొట్టేందుకే కుట్ర
కూటమి సర్కార్‌పై ఏఎన్‌పీఎస్ అధ్యక్షుడు ఆగ్రహం బాపట్ల టౌన్: వర్గీకరణపేరుతో మాలలు, మాదిగలను విడగొట్టేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని అంటరానితన నిర్మూలన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చార్వాక తెలిపారు. కూటమి సర్కార్ వర్గీకరణను జనాభా లెక్కలు పూర్తిగా తేల్చిన తర్వాతనే చేయాలంటూ శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. డాక్టర్ చార్వాక మాట్లాడుతూ వర్గీకరణపై కూటమి ప్రభుత్వం పునరాలోచించుకోవాలన్నారు. దళిత ప్రజా సంఘాలు. గత సంవత్సరం ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్నిస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జై భీమ్రావు పార్టీ బాపట్ల నియోజకవర్గ కన్వీనర్ కొచ్చెర్ల వినయ్‌రాజు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు, రాష్ట్ర మాలమహానాడు అధికార ప్రతినిధి శీలం రోజన్‌బాబు, గుద్దే రాజారావు, గొర్రుముచ్చు వందనం, డాక్టర్ కాగిత వరప్రసాద్, పర్రె కోటయ్య, కొరగంటి శ్యామ్, జోగి ప్రసంగి, తురిమెళ్ళ అమ్మేశ్వరరావు, పేర్లి కాంతారావు పాల్గొన్నారు. -
ఆర్చరీ చాంపియన్ షిప్ ప్రారంభం
ఏఎన్‌యూ(గుంటూరు): ఏపీ ఆర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహిస్తున్న లెనిన్ ఓల్గా మెమోరియల్ అండర్–13, అండర్–10 ఆర్చరీ చాంపియన్‌షిప్ శుక్రవారం యూనివర్సిటీలో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ సభకు ఏఎన్‌యూ వీసీ కె.గంగాధరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీసీ మాట్లాడుతూ ఆర్చరీ పోటీలకు ఏఎన్‌యూ వేదిక కావడం ఆనందదాయకమన్నారు. భవిష్యత్తులో విలువిద్యకు వర్సిటీ పూర్తి సహకారం అదిస్తుందన్నారు. ఏఎన్‌యూ రెక్టార్ ఆచార్య కె రత్నషీలామణి మాట్లాడుతూ క్రీడారంగ అభివృద్దికి యూనివర్సిటీలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం మాట్లాడుతూ ఆర్చరీ క్రీడను రానున్న రోజుల్లో ఏఎన్‌యూలో ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, నేషనల్ జడ్జి బి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఛాంఫియన్షిప్లో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి అండర్–13 విభాగంలో 700 మంది ఆర్చర్ (బాలురు, బాలికలు) పాల్గొంటున్నారు. తొలిరోజు రికర్వ్. కాంపౌండ్, ఇండియన్ రౌండ్ విభాగాలలో ర్యాంకింగ్ పోటీలు జరిగాయి. -
అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
బాపట్ల టౌన్: విధి నిర్వహణలో అలసత్త్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ నిర్వహించే విధుల్లో ప్రిజనర్ ఎస్కార్ట్ కీలకమైనవన్నారు. వాటిని నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించినా, ప్రలోభాలకు లోనైనా ఉపేక్షించబోమన్నారు. ఏమైనా సమస్యలను తమ దృష్టికి తీసుకొని వస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయసారథి, ఎస్బి సీఐ నారాయణ, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ
చెరుకుపల్లి: దేశ రక్షణలో సీఐఎస్ఎఫ్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని అస్సాం సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 15 రోజుల క్రితం ప్రారంభమైన సైకిల్ ర్యాలీ శుక్రవారం చెరుకుపల్లి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు స్వాగతం పలికారు. అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తీర ప్రాంతంలో సైకిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండు బృందాలుగా ఈ నెల 31వ తేదీ నాటికి గుజరాత్ నుంచి కన్యాకుమారి చేరుకుంటామని ఆయన తెలిపారు. 8 మంది మహిళలు కూడా బృందాలలో ఉన్నారని పేర్కొన్నారు. చెరుకుపల్లి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మధ్యాహ్న భోజన విరామం అనంతరం సైకిల్ ర్యాలీ కొనసాగించారు. వేమవరం వద్ద స్వాగతం భట్టిప్రోలు: సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ శుక్రవారం మధ్యాహ్నం బాపట్ల వైపు భట్టిప్రోలు మండలం వేమవరం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా బృందసభ్యుల కోసం భట్టిప్రోలు పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అత్యవసరమైన మందులు పంపిణీ చేశారు. భట్టిప్రోలు హైవేపై నుంచి కనగాల, చెరుకుపల్లి, బాపట్ల, చీరాల వరకు ర్యాలీ కొనసాగనుంది. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి బాపట్ల టౌన్: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ట్రైనీ డీఎస్పీ రావూరి అభిషేక్ తెలిపారు. సీఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ శుక్రవారం సాయంత్రం బాపట్ల జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా సరిహద్దులో బాపట్ల ట్రైనీ డీఎస్పీ రావూరి అభిషేక్ స్వాగతం పలికారు. విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ వీఆర్ వైజాగ్ కమాండెంట్ హర్షిత్ దైవానంద్ తదితరులు ప్రసంగించారు. -
వినతిపత్రాలు స్వీకరించిన మంత్రి
సంతమాగులూరు (అద్దంకి): సంతమాగులూరు మండలం పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజావేదిక నిర్వహించారు. అధికారులతో సమీక్ష అనంతరం ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలు తీసుకున్నారు. ఆయా సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. 80 మంది లబ్ధిదారులకు రూ.39 లక్షల చెక్కులను అందించారు. రూ.9 లక్షలకు ఎల్ఓసీ పత్రాలు అందజేశారు. ప్రశాంతంగా పది పరీక్షలు ● పల్నాడు జిల్లాలో 99శాతం హాజరు ● పరీక్ష కేంద్రాలను సందర్శించిన అధికారులు నరసరావుపేట ఈస్ట్: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 128 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 25,346 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 25,111 మంది హాజరయ్యారు. సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దూరవిద్య పదవ తరగతి తెలుగు, ఉర్దూ పరీక్షకు జిల్లాలోని 27 పరీక్ష కేంద్రాల్లో 1,151మందికి గాను 1,013మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన 13 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 75 కేంద్రాలను తనిఖీ చేశాయి. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురజాల, రెంటచింతలలోని నాలుగు కేంద్రాలు, జిల్లా పరీక్షల పరిశీలకులు ఎన్.గీత చిలకలూరిపేటలోని 11 పరీక్ష కేంద్రాలను సందర్శించారు. జిల్లా పరిధిలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ చంద్రకళ తెలిపారు. పరీక్షల డ్యూటీ నుంచి ఇద్దరు ఉపాధ్యాయుల తొలగింపు గురజాల : పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం డీఈవో చంద్రకళ తనిఖీ చేశారు. గురజాలలోని నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో రెండు రోజులు కిందట జరిగిన హిందీ పరీక్షలో ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు బిట్లు అందించారని పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీఈవో కేంద్రాన్ని పరిశీలించారు. పల్లెగుంతలోని మోడల్ పాఠశాలలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఆరోపణలు వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులను పరీక్షల డ్యూటీ నుంచి తొలగించినట్లు ఆమె చెప్పారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించండి నరసరావుపేట ఈస్ట్: జిల్లా పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులంతా లైఫ్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా అందజేయాలని జిల్లా ఖజానా, లెక్కల అధికారి కె.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దాదాపు 96 శాతం అందించారని, మిగిలిన వారు కూడా వెంటనే జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా సమర్పించాలని సూచించారు. ఆన్లైన్లో ధ్రువీకరణ పత్రం సమర్పించే సమయంలో సమస్యలు తలెత్తినా, వృద్ధాప్యం, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్నవారు సంబంధిత ఖజానా కార్యాలయ సిబ్బంది సహాయంతో మాన్యువల్‌గా సమర్పించవచ్చని ఆయన తెలిపారు. వివరాలకు ఖనాజా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. 27న నిధి ఆప్కే నికత్ గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈనెల 27న నిధి ఆప్కే నికత్ కార్యక్రమాన్ని ఆరు జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఇంద్రనీల్ ఘోష్ శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న సమావేశాల్లో యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు ఇతర వాటాదారులు, లబ్ధిదారులతో పరస్పరం ముఖాముఖీగా చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈనెల 27న సెలవు దినంగా పరిగణించినచో మరుసటి రోజున యథావిధిగా నిధి ఆఫ్ కే నికత్ జరుగుతుందని పేర్కొన్నారు. -
మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన
రేపల్లె రూరల్: తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ రేపల్లె మండలం పేటేరు గ్రామ ప్రజలు శుక్రవారం రెండవ రోజు కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని మహిళలు, చిన్నారులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. షాపు ఏర్పాటు ఆలోచనను విరమించుకునేంత వరకు పోరాటం చేస్తామని మహిళలు తెలిపారు. గంటకుపైగా ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణ సీఐ మల్లికార్జునరావు వచ్చి మహిళలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ఆర్డీవో, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, తహసీల్దార్, డీఎస్పీ కార్యాలయాకు స్థానికులు వెళ్లి వినతిపత్రాలు అందజేశారు. -
గజేంద్ర మోక్షం అలంకారంలో నారసింహుడు
మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం గజేంద్ర మోక్షం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యల పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శేషగిరిరావు, కల్యాణిలు వ్యవహరించగా, ఆస్థాన కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన తాడికొండ తిరుమలరావు, తాడికొండ సాయికుమార్లు వ్యవహరించారు. శనివారం స్వామి పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. -
ఆధునిక వ్యవసాయంతో ఎంతో మేలు
మార్టూరు: ప్రస్తుత ఆధునిక వ్యవసాయంలో నర్సరీల పాత్ర కీలకమైందని.. షేడ్ నెట్లలో తయారైన నారు ఇతర ఉద్యాన మొక్కల పెంపకంతో రైతులకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం చేకూరుతుందని దర్శి ఉద్యాన శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.రవీంద్రబాబు అన్నారు. స్థానిక రాజుపాలెం కూడలిలోని సాయిబాలాజీ కల్యాణ మండపంలో శుక్రవారం బాపట్ల జిల్లా స్థాయి నర్సరీ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధిక ఉత్పత్తులు సాధించాలంటే ఆరోగ్యకరమైన మొక్కలు అవసరమన్నారు. నర్సరీల్లో పెంచిన మొక్కలతోనే అది సాధ్యమన్నారు. గుంటూరు లాం శాస్త్రవేత్త డాక్టర్ ఎ.రజిని మిరప పంటలో వచ్చే తెగుళ్లు, పురుగులు వాటి నివారణ గురించి రైతులకు వివరించారు. బాపట్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి పి.జెన్నెమ్మ నర్సరీల చట్టం 2010 ప్రకారం నర్సరీల రిజిస్ట్రేషన్లు వాటి నిర్వహణ విధానాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఏపీఎంఐ పీడీ బీవీ రమణ మాట్లాడుతూ, ఏపీ, సీఎన్ఎఫ్ జిల్లా డీపీఎం, వాణిశ్రీ, గాండీవ రైతు ఉత్పత్తిదారుల సంస్థ చైర్మన్ పెంటేల శరత్ , డిజిటల్ గ్రీన్ సంస్థ ప్రతినిధి ఎం విజయ రేఖారెడ్డి, మార్టూరు వ్యవసాయ శాఖ ఏడీఏ, కేవీ శ్రీనివాసరావు, మార్టూరు, అద్దంకి, పర్చూరు, చీరాల, కొల్లూరు, ఉద్యానవన శాఖ అధికారులు బి. హనుమంతు నాయక్, దీప్తి, అలేఖ్య, రవి ప్రకాష్ బాబు, కళ్యాణ చక్రవర్తి, మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు ఏవోలు బి. అంజిరెడ్డి, కుమారి, లావణ్య, రాజశేఖర్, వీఏఏలు, ప్రకృతి సేద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ఆచార్య కృపాచారికి పరిశోధక గురు పురస్కారం
తెనాలి: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత ఆచార్యుడు, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి పరిశోధక గురువుగా చేసిన సేవలు ప్రశంసనీయమని ప్రముఖ రచయిత, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. స్థానిక చెంచుపేట డొంకరోడ్డులోని ఆచార్య కృపాచారి నివాసానికి శుక్రవారం ఆచార్య ఇనాక్ వచ్చారు. పరిశోధక గురు పేరుతో కొలకలూరి పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. మాట్లాడుతూ తాము ఏటా ప్రదానం చేస్తున్న కొలకలూరి పురస్కారాలను రచయితలతోపాటు పరిశోధకులు, పరిశోధక గురువుకు కూడా అందజేస్తున్నామని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రకటించిన అవార్డుల్లో పరిశోధక గురు అవార్డుకు కృపాచారిని ఎంపిక చేశామని తెలిపారు. అయితే ఆరోగ్య కారణాలతో హైదరాబాద్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ సభకు కృపాచారి హాజరుకాలేకపోయారని చెప్పారు. అందుచేత తానే స్వయంగా తెనాలి వచ్చి కృపాచారికి ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ఆచార్య ఇనాక్ వివరించారు. కృపాచారి పర్యవేక్షణలో 75 మంది పీహెచ్‌డీలు, 68 మంది ఎంఫిల్ చేసినట్టు గుర్తుచేశారు. పలు విశ్వవిద్యాలయాకు 45 పాఠ్యగ్రంథాలను అందించారనీ, పలు అవార్డులను స్వీకరించారని గుర్తుచేశారు. పురస్కారం స్వీకరించటంపై కృపాచారి తన సంతోషాన్ని ప్రకటించారు. -
నీటి కుంటలు వెంటనే నిర్మించాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: పంట నీటి కుంటలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. పల్లె పండుగ, పంట నీటి కుంటల నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించిన అనంతరం జిల్లా అధికారులతో జె.వెంకట మురళి సమీక్షించారు. నిరుపేదలకు మాత్రమే ఉపాధి హామీ పథకం ద్వారా పారదర్శకంగా పనులు కల్పించాలన్నారు. పండ్ల తోటల సాగు విస్తీర్ణం ఏడాదిలో లక్ష ఎకరాలకు పెరగాలని సూచించారు. పల్లె పండుగ కార్యక్రమంలో నిర్దేశించిన మేరకు సీసీ రోడ్లు, గోకులాలు నిర్మించాలని పేర్కొన్నారు. జిల్లాలోని 276 గ్రామ పంచాయతీలలో 4 వేల పంట నీటి కుంటల నిర్మాణానికి లక్ష్య నిర్దేశం చేశారు. శనివారం అన్ని ప్రాంతాలలో నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి నుంచి రైతులను కాపాడటానికి ఈ కుంటలు ఎంతో ఉపయుక్తం అవుతాయన్నారు. ఇప్పటికే అధికారికంగా 1,524 కుంటల పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 878 గోకులాల షెడ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 551 నిర్మాణంలో ఉన్నట్లు పేర్కొన్నారు. పల్లె పండుగ కార్యక్రమం కింద 881 సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉందని తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల ద్వారా 157.5 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. రూ.103.1 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రహదారులు లక్ష్యం మేరకు ఏప్రిల్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి చేసిన సీసీ రోడ్లన్నింటినీ ఉగాది పండుగ రోజు ప్రారంభించాలన్నారు. 241 అంగన్వాడీ కేంద్రాల భవనాలకు మరమ్మతులు చేయించాలని పీఆర్ ఇంజినీర్లను ఆదేశించారు. పెయింటింగ్ పనులు చేయించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం పనులలో దొంగ మస్టర్లు వేయడం వంటివి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూలీలతో పనులు చేయించరాదన్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. బోర్ల మరమ్మతులు పంచాయతీ నిధులతో చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 12,500 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారుల గృహాలన్నింటిలో వ్యక్తిగత మరుగుదొడ్లను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులతో నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా గీతంపై మనో భేటీ బాపట్ల: బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని జిల్లా కలెక్టర్ జె .వెంకట మురళి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రముఖ గాయకుడు మనో సానుకూలంగా స్పందించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. చందోలు బంగళాముఖి దేవాలయానికి వెళ్తూ మార్గమధ్యలో ఆయన కలెక్టర్‌తో భేటీ అయ్యారు. కలెక్టర్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. జిల్లా గీతంపై చర్చించుకున్నారు. కలెక్టర్ కోరిక మేరకు బాపట్ల జిల్లా గీతాన్ని ఆలపించడానికి మనో అంగీకరించారు. జిల్లా గీతం కోసం నిర్వహించిన పోటీలకు 10 ఎంట్రీలు వచ్చాయి. వీటిని అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించి, భావపురి రచయుతల సంఘం కార్యదర్శి నందిరాజు విజయ్ కుమార్ రచించిన గీతాన్ని ఎంపిక చేసింది. జిల్లా విశిష్టతపై ఫోరం ఫర్ బెటర్ బాపట్ల వారు ప్రచురించిన కరపత్రాన్ని కలెక్టర్ ద్వారా మనోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పి.సి. సాయిబాబు, కాకుమాను గురుకుల పాఠశాల సంగీత ఉపాధ్యాయులు అచ్యుతుని నాగపూర్ణ రమాదేవి, పుస్తకోడ్యమ సమితి కార్యదర్శి జీవీ పాల్గొన్నారు. వడదెబ్బ నివారణకు ప్రత్యేక చర్యలు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు తెలిపారు. వడగాల్పులకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రణాళికపై అధికారులతో శుక్రవారం ఆయన స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. మార్చి నుంచి జూన్ వరకు జిల్లాలో ఎండ తీవ్రత, వడగాల్పులు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందన్నారు ప్రతి మండల కేంద్రంలో 4 చలివేంద్రాల చొప్పున ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గోకులాల నిర్మాణాలు వేగవంతం చేస్తాం
గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన మినీ గోకులాల నిర్మాణాలు నిర్దేశించిన సమయంలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మొత్తం 390 మినీ గోకులాలు మంజూరయ్యాయన్నారు. వీటిలో 284 నిర్మాణాలు పూర్తి చేసామన్నారు. మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఈ నెల చివరి నాటికి మొత్తం పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ జ్యోతిబసు, పంచాయతీరాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య, డ్వామా పీడీ శంకర్ అధికారులు పాల్గొన్నారు. -
జూట్ సాగు.. లాభాలు బాగు
అద్దంకి: సంప్రదాయ పంటల సాగుతో లాభాలు రాక విసుగెత్తిన రైతులు పత్తి, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయంగా జూట్ పంటను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తున్నారు. గోనె సంచులు, బ్యాగులతోపాటు వివిధరకాల వస్తువుల తయారీకి ఉపయోగపడే ఈ జూట్ పంట విస్తీర్ణం జిల్లాలో పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల నుంచి బాపట్ల జిల్లాలోని అద్దంకి, యద్దనపూడి, పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు మండలాల్లో 2 వేల ఎకరాల్లో జూట్‌ను సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించే జూట్ పంటను విత్తనాల కోసం సాగు చేస్తారు. ఈ విత్తనాలు ఈశాన్య రాష్ట్రాల్లో నార కోసం పండించే జూట్ పంట సాగుకు ఎగుమతి అవుతుంటాయి. జూట్ పంట జనుము, గోగు జాతికి చెందినది. దీని నుంచి తీసిన నారను ఉపయోగించి గోనె సంచులు, బ్యాగ్‌లు, ఇతర వస్తువులను తయారు చేస్తారు. అయితే దీన్ని మన రాష్ట్రంలో విత్తనాల కోసం పండిస్తారు. పండించిన విత్తనాలు పశ్చిమ బెంగాల్, తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. అక్కడి రైతులు ఈ విత్తనాలను పొలాల్లో సాగు చేసి ఏపుగా పెంచి గోగు, జనప నార తీసిన విధంగా నార తీసి విక్రయిస్తారు. ఇలా సాగు చేస్తారు... జూట్ పంటకు ఉమ్మడి ప్రకాశం జిల్లా అనుకూలంగా ఉంటుంది. ఈ నేలలను రైతులు ముందుగా మెత్తగా అయ్యేలా పశువుల ఎరువును కలిపి కలియదున్నుతారు. ప్రస్తుతం జేఆర్‌ఓ–8432, జేఆర్‌ఓ–878 రకం విత్తనాలను సాగు చేస్తున్నారు. ఎకరాకు కిలో విత్తనం సరిపోతుంది. మొక్కలు జానెడు ఎత్తుకు రాగానే, తరువాత రెండు సార్లు అంతర సేద్యం చేస్తారు. మోకాలి ఎత్తులో తల తుంచుతారు. దాంతో పక్క కొమ్మలు వచ్చి మరింత దిగుబడికి దోహపడుతుంది. విత్తన రోజు నుంచి 90 రోజుల్లో పంట నుంచి విత్తనాలు తీయడానికి సిద్ధం అవుతుంది. ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ పంటకు విత్తనం ధర చాలా తక్కువ. సేద్యాలు, ఎరువులు, పురుగు మందులు కలుపుకుని ఎకరాకు రూ.5 వేల లోపే అవుతుంది. ప్రస్తుత ధర ఇలా.. జూట్ పంట విత్తనాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం క్వింటా ధర రూ.5 వేలు ఉంది. తొలుత రూ.6 వేలు పలికింది. అన్నీ కుదిరితే ఒక్కో సంవత్సరం క్వింటా విత్తనాలు రూ.15 వేల వరకు పలికిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత ధర ప్రకారం లెక్కి గట్టినా ఐదు క్వింటాళ్ల లెక్కన ఎకరాకు రూ.25 వేలు రాగా, నికర ఆదాయం 20 వేలు వరకు మిగులుతుందని రైతులు చెప్తున్నారు. జిల్లాలో రెండు వేల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు అద్దంకి, మార్టూరు, యద్దనపూడి మండలాల్లో అధికం క్వింటా రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతున్న ధర అన్నీ కుదిరితే ఎకరాకు రూ.లక్ష వరకు ఆదాయం ఈశాన్య రాష్ట్రాలకు విత్తనాలు ఎగుమతి విస్తీర్ణం తక్కువ ఉంటే అధిక ధర జూట్ పంట క్వింటాలు ధర రూ.5 వేలు నుంచి రూ.15 వేల వరకు పలుకుతోంది. ఒక్కో సంవత్సరం ఒక్కో రేటు ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక మార్కెట్ ఏమీ లేదు. కొందరు వ్యాపారులు విత్తనాలను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. – ధన్‌రాజ్, ఏడీఏ గత సంవత్సరం సాగు చేశా నేను గత సంవత్సరం జూట్ సాగు చేశాను. వరుస కుదిరితే మంచి లాభాలే వస్తాయి. ధర బాగుండాలి. గతంలో రేటుతో పోలిస్తే ప్రస్తుతం ధర తక్కువగా ఉన్నట్లే . అయినా ఫర్వాలేదు. రైతుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఇచ్చే పంటగా జూట్ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం క్వింటా రూ.5 వేలు ఉంది. – చెరుకూరి సుబ్బారావు, రైతు -
ముగిసిన ఏఎన్‌యూ ఇంటర్ కాలేజియేట్ బేస్‌బాల్ మెన్ టోర్నీ
గుంటూరు రూరల్: క్రీడా స్ఫూర్తి జీవితంలో ఉన్నస్థాయికి చేరుస్తుందని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. రెండు రోజులుగా చౌడవరం గ్రామంలోని కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల బేస్ బాల్ (మెన్) టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. ఆర్వీఆర్జేసీ కళాశాల జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. రన్నర్ ట్రోఫీని ఏఎన్‌యూ ఫిజికల్ కళాశాల జట్టు సాధించింది. తృతీయ స్థానంలో ఎమ్‌ఏఎమ్ పిజి కాలేజీ, నాలుగో స్థానంలో సిఆర్ కాలేజీ జట్లు నిలిచి ట్రోఫీలను అందుకున్నాయి. టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులతో ఏఎన్‌యూ సాఫ్ట్ బాల్ (మెన్) జట్టును సెలెక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రెజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్ డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, పీడీలు డాక్టర్ పి. గౌరీశంకర్, డాక్టర్ ఎం.శివరామకృష్ణ, ఏఎన్‌యూ టోర్నమెంట్ ఆబ్సర్వర్ డాక్టర్ సూర్యనారాయణ, సెలెక్షన్ కమిటీ మెంబర్స్ డాక్టర్ పీ శ్రీనివాస్, డాక్టర్ ఎమ్ బుచ్చిబాబు, డాక్టర్ రాజామెరిసిన్బాబు, జె.ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. -
నాటుసారాతో జీవితం అంధకారం
నిజాంపట్నం: నాటుసారా తాగి జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఒంగోలు డిప్యూటీ కమిషనర్ కె.హేమంత నాగరాజు అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మండలంలోని దిండి పంచాయతీ అదవల గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో శుక్రవారం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నాటుసారాకు ఉపయోగించే ముడి సరకులను విక్రయించినా నేరమేనని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదులు ఉంటే 94904 55599, 94409 02477 నంబర్లకుగానీ, 14405 టోల్‌ఫ్రీ నంబరుకుగానీ సమాచారం అందించాలని సూచించారు. తొలుత నవోదయం 2.0 పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ రామారావు, నగరం సీఐ ఎం.శ్రీరామ్‌ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య విలువలకు ‘కూటమి’ తూట్లు
నరసరావుపేట: ప్రజాస్వామ్యం, విలువల గురించి ఎన్నికలకు ముందు మాట్లాడిన కూటమి ప్రభుత్వ నాయకులు అధికారంలోకి వచ్చాక వాటికి తూట్లు పొడుస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్ విమర్శించారు. స్థానిక కోటప్ప కొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో గురువారం జిల్లా కమిటీ సభ్యులు వై.రాధాకృష్ణ అధ్యక్షతన పల్నాడు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. విజయ్‌కుమార్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20వేలు ఇవ్వకుండా మొండిచేయి చూపారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు, దిగుబడులు లేక రైతాంగం అల్లాడుతోందని చెప్పారు. రైతుల పక్షాన మాట్లాడిన రైతు సంఘం నాయకులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసి, వలసలు నివారించి, 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలు వలస వెళ్తున్న క్రమంలో ప్రమాదాల బారిన పడి ఆరుగురు చనిపోగా, 70 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. వారందరికీ న్యాయం చేయాలని విజయకుమార్ కోరారు. బనకచర్ల పేరుతో వరికపూడిశెల ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు, రైతులను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. వెనకబడిన పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పార్టీ చేపట్టే పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో యూటీఎఫ్ ప్రకటించిన అభ్యర్థి విజయం కోసం పనిచేసిన నాయకులు, ప్రజాసంఘాలపై కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడడం తగదని ఆయన ఖండించారు. ఎన్నికల రోజున ఓటమి భయంతోనే కూటమి నేతలు ఏజెంట్లపై దాడులు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఏపూరి గోపాలరావు, జి.రవిబాబు, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, ఎస్.ఆంజనేయనాయక్, సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.శివకుమారి పాల్గొన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు ఎప్పుడు ? పంట కాలం ముగిసే వరకు సాగునీరు ఇవ్వాలి సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో గుంటూరు విజయకుమార్ -
పార్టీ శ్రేణులకు గాదె భరోసా
పర్చూరు(చినగంజాం): నమ్మిన నాయకులను, కార్యకర్తలను ఆపదలో ఆదుకుంటానని నిరూపించారు పర్చూరు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి. తన తండ్రి గాదె వెంకటరెడ్డి బాటలో నడుస్తూ పార్టీ శ్రేణులంటే ఎంతో అభిమానం చూపుతున్నారు. ఇందుకు ఫారం 7 దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేసిన సమస్యను పరిష్కరించిన తీరు నిదర్శనంగా నిలిచింది. పర్చూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అందించిన ఫారం 7 ఫిర్యాదులకు సంబంధించి ఎన్నికల కమిషన్ విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ ఫారం 7 విషయం తెరపైకి తీసుకొచ్చారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై ఆయనే స్వయంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సిట్ విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, విచారణ బృందాన్ని ఏర్పాటు చేయించారు. ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. ఈ విషయాన్ని గాదె మధుసూదనరెడ్డి దృష్టికి ఫారం 7 అర్జీదారులు, నాయకులు, కార్యకర్తలు తీసుకొచ్చారు. హైకోర్టు లాయర్లతో ఆయన చర్చించి మార్చి 12వతేదీ కేసు ఫైల్ చేయించారు. అదే రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, హోం సెక్రటరీ, ఎమ్మెల్యే, చీఫ్ సెక్రటరీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 18వ తేదీన విచారణ చేపట్టిన కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం వాయిదా కోరడంతో వాయిదా వేసింది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ విషయమై నియోజకవర్గంలో ఫారం 7 అర్జీదారులు, నాయకులు, కార్యకర్తలు మధుసూదనరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఫారం 7 విషయంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై సిట్ విచారణకు ఎమ్మెల్యే ఫిర్యాదు కోర్టుకు వెళ్లి ధైర్యం నింపిన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గాదె కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో గాదెకు పార్టీ నేతలు, కార్యకర్తలు కృతజ్ఞతలు -
ఆర్ అండ్ బీ ఈఈగా రాజానాయక్
బాపట్ల: రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ఆర్.రాజానాయక్ గురువారం స్వీకరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. సాగర్ డ్యాంను సందర్శించిన సీఈ విజయపురి సౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు మెయిన్ డ్యాం ఎడమ వైపున ఎర్త్ డ్యాంపై ఎండిపొయిన కార్పెట్ గ్రాస్‌కు బుధవారం సాయంత్రం నిప్పంటుకుని పూర్తిగా తగలబడింది. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం నల్లగొండ జిల్లా చీఫ్ ఇంజినీర్ అజయ్‌కుమార్, సాగర్ డ్యాం సర్కిల్ ఈఈ శ్రీధర్‌రావు, ఈఈ మల్లికార్జునరావు, ఇంజనీర్లు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాను నిలిపి వేశామని, తిరిగి లైన్లు కలిపితే ఏమేరకు నష్టం జరిగిందో తెలుస్తుందని చెప్పారు. కేబుల్స్ కాలిపోయినా, సీసీ కెమెరాలు బాగానే ఉన్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో జరిగిన నష్టాన్ని త్వరలో తేలుస్తామని, తిరిగి కేబుల్స్‌ను ఆధునికీకరిస్తామని చెప్పారు. ఈసారి అగ్ని ప్రమాదాలు జరిగినా నష్టం జరగకుండా జీఏ పైపుల నుంచి హెచ్డీ పైపులు వేసి, అందులో నుంచి కేబుల్స్ వచ్చేలా చూస్తామని ఆయన వివరించారు. -
వర్గీకరణ పేరుతో కూటమి చిచ్చు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఎస్సీ వర్గీకరణపై రాజీవ్‌రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనసభ, మండలిలో ఆమోదించిన కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్‌కుమార్ మండిపడ్డారు. మాలమహానాడు ఆధ్వర్యంలో లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గోళ్ల అరుణ్‌కుమార్ మాట్లాడుతూ వర్గీకరణ పేరుతో బాబు ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చుపెడుతోందని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో హాలో మాల.. చలో రాజధాని పేరుతో లక్షలాది మందితో మాలల సింహాగర్జన నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమలో మాలమహానాడు నాయకులు గోదాజాన్పాల్, దారా హేమప్రసాద్, పిల్లి మేరి, ఏసుబాబు, బోరుగడ్డ రజనీకాంత్, రాచకొండ ముత్యాలరాజు, బండ్లమూడి స్టాలిన్, నల్లపు నీలాంబరం, సముద్రాల కోటి, డేవిడ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో లక్షలాది మందితో హలో మాల.. చలో రాజధాని కార్యక్రమం మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్‌కుమార్ -
మిర్చి రైతులకు సాగునీటి కష్టాలు
నరసరావుపేట: జిల్లాలో వారబందీ అమలులో ఎండ తీవ్రతకు మిర్చి పంట ఎండిపోతోందని, తక్షణమే సాగునీరు విడుదల చేసి పంటలను రక్షించాలని ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామానికి చెందిన మిర్చి రైతులతో కలిసి నాగార్జునసాగర్ సంతగుడిపాడు సర్కిల్ డీఈ ఎస్.విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ లక్షల రూపాయల పెట్టుబడులు ఒకవైపు, చీడపీడల బెడద మరోవైపు, ధరలు లేమితో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు నీటి కష్టాలు తోడు కావడంతో మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పారు. పంటకు నీరు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. సాగునీటి కోసం ఆందోళన చెందడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గతంలో నాగార్జునసాగర్ జలాశయంలో డెడ్ స్టోరేజ్ ఉన్న సమయంలో కూడా సాగుకు సరిపడా నీరు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను ఏకంచేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంటలు, నీటి అవసరాలపై ఎన్ఎస్పీ అధికారుల దగ్గర వివరాలు లేకపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని తెలిపారు. ప్రస్తుతం సాగులో ఉన్న మిర్చి, మొక్కజొన్న, దాళ్వా వరి, ఇతర కూరగాయ పంటలు దెబ్బ తినకుండా ఏప్రిల్ 20 వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన డీఈ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని, తక్షణమే నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ఎన్ఎస్పీ డీఈని కలిసి వినతిపత్రం అందజేత -
పరిశ్రమల ఏర్పాటుకు 122 దరఖాస్తులుఆమోదం
నరసరావుపేట: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటులో భాగంగా సింగిల్ డెస్క్ పోర్టల్‌పై ఈ నెలలో వచ్చిన 129 దరఖాస్తులకు గాను 122ను ఆమోదించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.సుధాకర్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పలు అంశాలపై జేసీ సమీక్ష చేశారు. సింగిల్ డెస్క్ పోర్టల్ క్లియరెన్స్, ఎస్సీ, ఎస్టీలకు పెట్టుబడి రాయితీ, పారిశ్రామిక అభివృద్ధిలో రాయితీ విధానం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన, సులభతర వ్యాపారంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, క్లస్టర్ డెవలప్మెంటు ప్రోగ్రాం తదతర పలు అజెండాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కేవైసీ ద్వారా దరఖాస్తుల ప్రాసెస్ వేగవంతంగా చేయాలని చెప్పారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో ఇప్పటి వరకు 4950 మందికి శిక్షణ ఇచ్చామని, 3,357 దరఖాస్తులను బ్యాంకులకు పంపించామని జేసీ తెలిపారు. ఇందులో 521 మంజూరై 452 యూనిట్లకు రుణాలు విడుదల చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కిలోన్నర గంజాయి పట్టివేత
అమరావతి: మండల పరిధిలోని ధరణికోట ఆరు డొంకల బావి సెంటర్ సమీపంలో గురువారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేసి కిలోన్నర గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఆరు డొంకల బావి సెంటర్ సమీపంలోని పాగుబడిన కోళ్ల ఫారంలో గంజాయిని దాస్తుండగా పోలీసులు దాడి చేశారు. గమనించిన నిందితులు అక్కడే వదిలేసి పారిపోయారు. పోలీసులు కిలోన్నర గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ అచ్చియ్య మాట్లాడుతూ పారిపోయిన వారి కోసం పోలీసు బృందాలు, ఈగల్ టీంలు గాలిస్తున్నాయని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. -
ఇసుక రీచ్ కార్మికులకు అండగా వైఎస్సార్సీపీ
వేమూరు: ఇసుక రీచ్ కార్మికుల ఆకలి తీరే వరకు తాను పస్తులుండైనా పోరాటం చేస్తానని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. కొల్లూరు మండలంలోని జువ్వలపాలెంలోని ఇసుక రీచ్ కూలీలకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. గురువారం ఇసుక రీచ్ వద్దకు ఆయన వెళ్లారు. కూటమి ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తరలిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ.. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన రీచ్ కార్మికులకు పని లేకుండా చేసి వారి కుటుంబాలను ఆకలి అలమటింపజేస్తున్నారని పాలకుల తీరుపై మండిపడ్డారు. వారి పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. వారికి తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ట్రాక్టర్లకు, టైరు బండ్లకు ఇసుక లోడ్ చేయకుండా కూటమి నాయకులు అడ్డుకుంటున్నట్లు కూలీలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అటుగా వెళ్లకుండా గండి కొట్టారని చెప్పారు. కొల్లూరు తహసీల్దారును అశోక్‌బాబు కలిసి మాట్లాడటంతో గండి పూడ్చి వేయించారు. కూలీలను ఇసుక లోడింగ్ చేసుకోమని ఆదేశాలిచ్చారు. అశోక్‌బాబు స్వయంగా ట్రాక్టరుపై రీచ్ నుంచి జువ్వలపాలెం వరకు కార్మికులను తీసుకొచ్చారు. కూటమి నాయకులు ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అశోక్‌బాబు మండిపడ్డారు. యంత్రాలతో రాత్రి వేళ వందల లారీలలో ఇసుక నింపి తరలిస్తున్నట్లు ఆరోపించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఇసుక రీచ్‌లో పని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. స్టేషన్ లోపలికి కూటమి నాయకులను అనుమతిస్తూ ప్రతిపక్ష నేతలను మాత్రం రోడ్డుపై నిలబెట్టడం దారుణమని పోలీసుల తీరుపై అశోక్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. జువ్వలపాలెం గ్రామానికి చెందిన రైతు ప్రసాద్‌పై దాడి జరగడంతో అడిగేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులను రోడ్డుపై నిలపడం తగదన్నారు. వేమూరు సీఐతోపాటు ఎస్ఐ రవికృష్ణ తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సుగున మల్లేశ్వరరావు, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, ఉప సర్పంచ్ శొంఠి కోటేశ్వరరావు, గాజుల శ్రీనివాసరావు, వెలివెల రామకృష్ణ, చిలకా ప్రకాశ్, కూచిపూడి మోషే, మస్తాన్ బాషా, దున్నా మేరీసుబాబు, ఎంపీటీసీ బాబీ, డాక్టర్ డి.గోపి, ధూళ్లపూడి రాంబాబు, కోగంటి కోటేశ్వరరావు, తాడికొండ రాంబాబు, లాజురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు తహసీల్దారుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి -
మిర్చి యార్డులో వ్యాపారులకు లైసెన్సు తప్పనిసరి
● జీరో, కటింగ్ వ్యాపారం, మచ్చుకాయల దోపిడీకి అడ్డుకట్ట ● మల్టిపుల్ లైసెన్స్‌దారులపై చర్యలు ● ఇప్పటికే 134 మంది గుర్తింపు ● మరో 27 మందితో జాబితా సిద్ధం ● మరోసారి తనిఖీ చేశాక చర్యలు ● నిర్లక్ష్య ధోరణి, అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు ● మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ విజయ సునీత కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ ఎం.విజయ సునీత స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా మిర్చి వ్యాపారం చేసే వారి వల్ల ధర ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. మిర్చి యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో మార్కెటింగ్‌శాఖ విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావుతో కలిసి యార్డు అధికారులు, సిబ్బందితో గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఒకే కుటుంబంలో రెండు, మూడు లైసెన్స్‌లు ఎలా ఇచ్చారని సంబంధిత అధికారులు, సిబ్బందిని వివరణ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా యార్డులో జరిగిన, జరుగుతున్న అక్రమాలు, జీరో వ్యాపారం, కటింగ్ వ్యాపారం, మచ్చు కాయల దోపిడీపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ విజయ సునీత మాట్లాడుతూ నిర్లక్ష్య ధోరణి, అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యార్డులో జరుగుతున్న వ్యవహారాలకు అధికారులు, సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. యార్డులో లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించే వారిపై.. వ్యాపారం చేస్తూ చేయనట్టు చూపించే వారిపై.. గత రెండు, మూడు నెలలుగా తాము అడుగుతున్న సమాచారం ఇవ్వని దిగుమతి, ఎగుమతి వ్యాపారులపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకే కుటుంబంలో మల్టిపుల్ లైసెన్స్‌లు కలిగి చట్టబద్ధంగా వ్యాపారం చేయకుండా ఐటీ ఎగ్గొట్టే ధోరణితో వ్యవహరిస్తున్న మిర్చి కమీషన్ ఏజంట్స్పై దృష్టి సారించడంతో పాటు వారి జాబితాను రూపొందించామని చెప్పారు. వాటన్నింటిని క్రాస్ చెక్ చేసి 134 మందిని తేల్చడం జరిగిందన్నారు. దీంతోపాటు మరో 27 మంది జాబితా కూడా తయారు చేశామన్నారు. వీటన్నింటిని మరోసారి క్రాస్ చెక్ చేసి వారిపై చర్యలు తీసుకోవడానికి జాబితా రూపొందిస్తున్నట్లు వివరించారు. యార్డులో జీరో వ్యాపారం, కటింగ్ వ్యాపారం, మచ్చుకాయల దోపిడీకి అడ్డుకట్ట వేసి యార్డును మరింత ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. యార్డులో వ్యాపారం చేసే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని ఆదేశించారు. గుంటూరు యార్డుకు కర్నాటక రాష్ట్రం నుంచి అధికంగా మిర్చి బస్తాలు రావడం కారణంగా లోకల్ ఉత్పత్తిపై ఆ ప్రభావం పడి మిర్చి ధర తగ్గే అవకాశం కనిపిస్తోందని తెలిపారు. అధికారులు, వ్యాపారులు, సిబ్బంది అందరూ కలసికట్టుగా బాధ్యతాయుతంగా వ్యవహరించి మిర్చి రైతులకు మంచి ధర కల్పించేలా చూడాలన్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్, మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు బి.రాజబాబు, మిర్చి యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు ఇన్చార్జి సుబ్రమణ్యం, అసిస్టెంట్ ఇన్చార్జి శ్రీకాంత్, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
జయహో భారత్.. జయహో సునీత !
అచ్చంపేట: మహిళా శక్తికి ప్రతీకగా నిలచిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తొమ్మిది నెలల తరువాత సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చిన సందర్భంగా మండలంలోని వేల్పూరు జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు 100మీటర్ల జాతీయ జెండాతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ టి.తులసి మాట్లాడుతూ సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి వచ్చిన క్షణాలు అద్భుతమని, ఆమె ధైర్య సాహసాలు అనితరసాధ్యమని కొనియాడారు. ఈ విజయం యావత్ భారతావని గర్వించదగినదని పేర్కొన్నారు. సునీత విలియమ్స్ భారతదేశంలోని ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుందని తెలిపారు. జయహో భారత్..జయహో సునీత విలియమ్స్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం అగస్టీన్రెడ్డి, ఉపాధ్యాయులు మస్తాన్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్‌బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 100 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ -
కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని 24 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, 11వ తరగతి (ఇంటర్మీడియెట్) ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ టి.వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. 7,8, 9, 10,12వ తరగతుల్లోనూ మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తులను https//apkgbv.apcfss.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. వివరాలకు 97041 00406, 94406 42122 నంబర్లలో సంప్రదించాలని కోరారు. చర్లపల్లి–కన్యాకుమారి మధ్య సమ్మర్ వారాంతపు ప్రత్యేక రైళ్లు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్థం సమ్మర్ వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి–కన్యాకుమారి వయా గుంటూరు డివిజన్ మీదుగా ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వ తేదీ వరకు ప్రత్యేక రైలు(07230) ప్రతి బుధవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు చర్లపల్లి స్టేషన్ నుంచి రాత్రి 9.50 గంటలకు బయలుదేరి రెండో రోజు అర్ధరాత్రి 2.30 గంటలకు కన్యాకుమారి స్టేషన్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. అలాగే కన్యాకుమారి–చర్లపల్లి రైలు(07229) ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు కన్యాకుమారి స్టేషన్ నుంచి తెల్లవారు జామున 5.15 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.40 గంటలకు చర్లపల్లి స్టేషన్‌కు చేరుకుంటుందని ఆయన వెల్లడించారు. జయ గోవర్ధనా.. నారసింహా మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం స్వామి గోవర్ధనోద్ధరణ అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శెనగల రామహనుమాన్, శేషాంజనేయ గోపాల్‌లు వ్యవహరించారు. ఆస్థాన కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు వ్యవహరించారు. శుక్రవారం స్వామి గజేంద్రమోక్షం అలంకారంలో దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల్లో ఖాళీలకు 27న ఉప ఎన్నికలు గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు ఈనెల 27న ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీలను పరోక్ష విధానంలో ఎన్నికల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 27న ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరించిన అనంతరం మధ్యాహ్ననికి ఎన్నిక, ప్రమాణ స్వీకారంతో ప్రక్రియ ముగియనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ద్వారా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షులు, గుంటూరు రూరల్ మండల పరిషత్ ఉపాధ్యక్ష స్థానంతో పాటు తెనాలి మండల నుంచి కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ల స్థానాల వారీగా కొల్లిపర మండలం తూములూరు, చక్రాయపాలెం, మేడికొండూరు మండలం గుండ్లపాలెం, మేడికొండూరు, దుగ్గిరాల మండలం మంచికలపూడి, ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం, పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం, పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు, చేబ్రోలు మండలం శ్రీరంగాపురంలో ఎన్నికలు జరగనున్నాయి. -
ఊయలే ఉరి తాడైంది !
రెంటచింతల: ప్రతి రోజూ సరదాపడి ఊగే ఊయలే తన ప్రాణం తీస్తుందని ఆ బాలుడు ఊహించలేకపోయాడు. రోజూ మాదిరే ఇంట్లో చీరతో ఊయల కట్టుకుని ఊగుతున్న సమయంలో మెడకు బిగుసుకుని ఊపిరాడక మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా రెంటచింతలలో చోటుచేసుకుంది. వెంకటేశ్వరస్వామి మాణం కాలనీకి చెందిన సలిబండ్ల అద్విక్‌రెడ్డి(11) ఆరోగ్యం బాగో లేదని చెప్పి గురువారం పాఠశాలకు వెళ్లకుండా, అమ్మమ్మ ఇంటి పైగదిలో చీరతో కట్టిన ఊయల ఊగుతున్నాడు. మధ్యాహ్నం అన్నం తినడానికి కిందకు అద్విక్‌రెడ్డి రాకపోవడంతో అమ్మమ్మ కటకం శౌరీలు పైకి వెళ్లి చూసింది. ఊయల చీర అద్విక్‌రెడ్డి మెడకు బిగుసుకుని పోయి ఉండటం గమనించి కేకలు వేసింది. బంధువులు వెంటనే స్థానిక వైద్యుని దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అద్విక్‌రెడ్డి స్థానిక ఫాతిమా విద్యానికేతన్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లి నిర్మలరాణి అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తోందతి. తల్లి, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడ వారిని కంట తడి పెట్టించింది. విద్యార్థి అద్విక్‌రెడ్డి అకాలమృతికి పాఠశాల డైరెక్టర్ ఏరువ మర్రెడ్డి, హెచ్ఎం ఏరువ స్టేఫీ స్టార్ సంతాపం తెలిపారు. పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆగిన బాలుడి ఊపిరి -
అమరేశ్వరుడికి వేలం పాటల ద్వారా రూ.54.22 లక్షల ఆదాయం
అమరావతి: అమరేశ్వరుడికి వేలం పాటల ద్వారా రూ.54.22 లక్షలు ఆదాయం వచ్చింది. ఆలయంలో దుకాణాలకు గురువారం బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 2026 మార్చి 31 వరకు పాటదారులు వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. ఆలయంలో కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడాన్ని రూ. 9.51లక్షలకు, ఆవరణలో కొబ్బరికాయలు, పూజ సామగ్రి అమ్ముకునేందుకు రూ.17.20లక్షలు, పార్కింగ్ రుసుం వసూలును రూ.10.61లక్షలకు, బొమ్మలు అమ్ముకునే హక్కుకు రూ.3.90 లక్షలకు, నదీ తీరంలో కూల్‌డ్రింక్స్ షాపునకు రూ.9.9లక్షలకు, చెప్పుల స్టాండ్ నిర్వహణకు రూ. 2.66 లక్షలకు, తలనీలాలకు రూ. 20వేలు, మొదటి ప్రాకారంలో కూల్‌డ్రింక్స్ షాపు నిర్వహణకు రూ. 1.5లక్షలకు పాడుకున్నట్లు ఆయన వివరించారు. స్వామికి ఆదాయం గత ఏడాది రూ. 49.44 లక్షలు రాగా ఈ ఏడాది రూ.54.22 లక్షలు వచ్చినట్లు చెప్పారు. గత ఏదాది కంటే రూ.4.78 లక్షలు అధికంగా వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సిండికేట్‌తో ఆదాయానికి గండి పాటదారులు సిండికేట్ కావడంతో అమరేశ్వరుని ఆదాయానికి గండిపడింది. ఒకటి, రెండు వ్యాపారాలకు తప్పా మిగిలిన అన్నింటిలో పాటదారులు సిండికేట్ అయ్యారు. అధికారులు కూడా పార్కింగ్, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కుకు అధిక మొత్తంలో పాట పెంచారు. మిగిలిన వ్యాపారాలకు తక్కువ మొత్తంలో పెంచి మమ అనిపించారు. ఈ విధంగా దేవుని ఆదాయానికి గండి కొట్టటం దారుణమని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. -
జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి
బాపట్ల: జిల్లాను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో స్థానిక కలెక్టరేట్లో ప్రగతి నివేదికలపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాను వ్యవసాయ అనుబంధ, పారిశ్రామిక రంగాలలో ప్రగతి పథంలో నిలిపేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పర్యాటక రంగానికి అనుకూలమైన వాతావరణం ఉందని, 103 కిలోమీటర్ల సముద్ర తీరం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గుర్తుచేశారు. మత్స్య సంపదకు వనరులు ఉన్నందున పరిశ్రమల స్థాపన దిశంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరదలు రాకుండా కరకట్ట అభివృద్ధికి తగిన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కృష్ణా, పశ్చిమ డెల్టా కాలువల మరమ్మతులపైనా దృష్టి పెట్లాన్నారు. తాగు నీటి ఇబ్బందుల్లేకుండా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, జిల్లా గ్రామీణ నీటి సరఫరాశాఖ ఎస్ఈ అనంతరాజు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై.వెంకటేశ్వరరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా అటవీశాఖ అధికారి భీమయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి జిల్లాకు రైల్వే రేక్ మూమెంట్‌తో ఎంతో మేలు బాపట్ల: జిల్లాకు రైల్వే రేక్ మూమెంట్ రావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. గురువారం బాపట్ల రైల్వే స్టేషన్లో రైల్వే రేక్ లోడింగ్, అన్ లోడింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాకు కొత్త రైల్వే రేక్ రావడంతో జిల్లా రూపురేఖలు మారతాయని అన్నారు. రవాణా ఖర్చులు ప్రజలకు తగ్గుతాయని చెప్పారు. బాపట్ల జిల్లాకు పర్యాటకులు ఎక్కువ శాతం వచ్చే విధంగా వందే భారత్ ట్రైన్లు నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల రైల్వే స్టేషన్‌కు వచ్చిన ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి విలియమ్స్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల రైల్వే స్టేషన్ మాస్టర్ మీనా, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, గొల్లపల్లి శ్రీనివాసరావు, శివరాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
చీరాల రూరల్: రైలు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చీరాల రైల్వేస్టేషన్ వద్ద గల ఫైరాఫీసు గేటు సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు... రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి ఎస్సై పరిశీలించారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతుని వయస్సు 50 – 55 సంవత్సరాలు ఉంటుందని, 5.6 అడుగుల ఎత్తు, ఛామన ఛాయ రంగు, మెడమీద పుట్టుమచ్చ, కుడికాలు తొడమీద మరో పుట్టుమచ్చ ఉన్నట్లు చెప్పారు. శరీరంపై ఎరుపురంగుపై తెల్ల పెద్దగడులు గల నిండు చేతులు చొక్కా, డార్క్ రంగు ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 94406 27646 నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. మరో ప్రమాదంలో ... రైలు ఢీకొన్న ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చీరాల–వెదుళ్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. ఎస్సై సీహెచ్. కొండయ్య తెలిపిన వివరాల మేరకు... రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడనే సమచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించగా మృతుని వద్ద ఎలాంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు. మృతుని వయస్సు 50 – 55 సంవత్సరాలు ఉంటాయని, 5.6 ఎత్తు, ఛామన ఛాయ రంగు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. మృతుని శరీరంపై వంకాయ రంగు, తెలుపు నలుపు గడులు కలిగిన చొక్కా, సిమెంట్ కలర్ జీన్స్‌ప్యాంటు ఉన్నట్లు వివరించారు. మృతుని మెడలో నలుపు, ఎరుపు కలిగిన పూసల దండ ఉందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని ఆచూకీ ఎవరికై నా తెలిసినట్లయితే 94406 27646 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. -
ముగిసిన అంతర కళాశాలల సాఫ్ట్‌బాల్ టోర్నీ
– విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకున్న ఽ ధనలక్ష్మి కాలేజీ జట్టు గుంటూరు రూరల్: క్రీడలతో శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక దృఢత్వం సిద్ధిస్తుందని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. రెండు రోజులుగా చౌడవరం గ్రామంలోని ఆర్వీఆర్జేసీ కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల సాఫ్ట్ బాల్ (మెన్) టోర్నమెంట్ పోటీలు బుధవారంతో ముగిశాయి. పోటాపోటీగా సాగిన టోర్నమెంట్లో ధనలక్ష్మి కాలేజీ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు మొదటి స్థానంలో నిలిచి విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. ఎమ్ఎల్ఎస్ డిగ్రీ కాలేజీ జట్టు రెండొవ స్థానంలో నిలిచి రన్నర్ ట్రోఫీని సాధించింది. తృతీయ స్థానంలో ఏఎన్‌యూ ఫిజికల్ కళాశాల జట్టు నిలవగా, నాలుగవ స్థానంలో ఆర్వీఆర్జేసీ జట్టు నిలిచింది. విజేతలకు ట్రోఫీలను అందజేశారు. టోర్నమెంట్లో మెలకువలతో తమ ఉత్తమ నైపుణ్యాన్ని కనబరిచిన క్రీడాకారులతో ఏఎన్‌యూ సాఫ్ట్ బాల్ (మెన్) జట్టును సెలక్షన్ కమిటీ సభ్యులు నిర్ణయించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, పీడీలు డాక్టర్ పీ గౌరీశంకర్, డాక్టర్ ఎమ్ శివరామకృష్ణ, ఏఎన్‌యూ టోర్నమెంట్ ఆబ్సర్వర్ డాక్టర్ సూర్యనారాయణ, ఏఎన్‌యూ సెలెక్షన్ కమిటీ మెంబర్స్ డాక్టర్ పీ శ్రీనివాస్, డాక్టర్ ఎం.బుచ్చిబాబు, డాక్టర్ రాజామెరిసిన్బాబు, జే ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఏఎన్ఎంల సమస్యలపై డీఎంహెచ్ఓకు వినతి
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా గ్రేడ్–3 ఏఎన్ఎంలుగా ఉండి ఎంపీహెచ్‌ఏగా ప్రమోషన్ పొందిన ఏఎన్ఎంల సమస్యలపై బుధవారం ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు బోడపాటి నాగవర్ధన్ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓకు వినతి పత్రం అందజేశారు. శాంక్షన్ పోస్టు ఉండి, ప్రొజిషన్ ఐడీ లేనివాటికి పీఎఫ్ఎంఎస్ దగ్గర జీతాలు త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. కాంట్రాక్టు, యూరోపియన్ ఫండ్‌లో పనిచేస్తూ రెగ్యులర్ అయిన ఏఎన్ఎంకు సబ్ సెంటర్ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని, శాలరీ డ్రాచేసిన చోట కూడా ఖాళీలు చూపించడం వల్ల కొంత మంది ఏఎన్ఎంలు ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదుకు తగు ఉత్తర్వులు ఇచ్చి మెడికల్ డిపార్టుమెంట్ అటెండెంట్స్‌లో నమోదు చేయాలని కోరారు. సబ్ సెంటర్ బిల్డింగ్ పూర్తిగా శిథిలాస్థవకు చేరి హెచ్ఆర్ఏ లేనివారికి హెచ్ఆర్ఏ శాంక్షన్ చేసేవిధంగా చొరవ చూపాలని కోరారు. ఏఎన్ఎంల ప్రమోషన్లలో మిగిలిపోయిన ఖాళీలను పరిశీలించి ఇతర సిబ్బందికి కూడా ప్రమోషన్ అవకాశం కల్పించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూనియన్ జిల్లా జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ షరీఫ్, గుంటూరు నగర అధ్యక్షుడు ఎం.నరేంద్రబాబు, అంజిరెడ్డి, ఎం.శ్రీనివాస్, ఝాన్సిరాణి, ధనలక్ష్మి, మంగా దేవి, నాగవేణి, సంధ్యారాణి తదితరులు ఉన్నారు. -
ఆటో బోల్తా.. మహిళ మృతి
మరో నలుగురికి గాయాలు జె.పంగులూరు: కూలీల ఆటో జాతీయ రహదారిపై దిమ్మెను ఢీకొని బోల్తా పడిన ప్రమాదంలో ముప్పవరం గ్రామానికి చెందిన కూలీ మేసీ్త్ర షేక్ అషీర్ బీ (60) అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మండల పరిధిలోని అలవలపాడు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ప్రతి రోజు ముప్పవరం నుంచి మిరపకాయలు కోసేందుకు కూలీలు రావినూతల గ్రామం వెళుతుంటారు. బుధవారం ఆటోలో పది మంది బయలు దేరారు. కొండమంజులూరు గ్రామానికి చెందిన సందోలు ఇమ్మానియేలు ఆటో నడిపాడు. జాతీయ రహదారిపై అలవలపాడు అడ్డరోడ్డు దగ్గరకు వచ్చేసరికి రోడ్డుకు అడ్డంగా సిమెంట్ దిమ్మె ఉంది. గత రాత్రి ఒక లారీ సిమెంట్ దిమ్మెను గుద్దటంతో అది రోడ్డు మధ్యలో వచ్చి పడింది. ఆటో డ్రైవర్ అది గమనించకపోవడంతో నేరుగా వెళ్లి దిమ్మను ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కూలీలను పనికి తీసుకెళ్లే మేసీ్త్రషేక్ అషిర్ బీ అక్కడిక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న దాసరి పుష్పాలు, కొమ్ము పాపమ్మ, చింతల లక్ష్మి, వలపర్ల భారతీలకు గాయాలు అయ్యాయి. హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను మార్టురు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆటో డ్రైవర్ ఇమ్మానియేలుకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో గుంటూరు వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై వినోద్‌బాబు తెలిపారు. రేణింగవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మిర్చికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్
సంతమాగులూరు (అద్దంకి): ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర రూ.21 వేలు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం సంతమాగులూరు మండలంలోని సంతమాగులూరు అడ్డరోడ్డు , ఏల్చూరు, కొమ్మాలపాడు గ్రామాల్లోని మిర్చి చేలను పరిశీలించారు. కల్లాల్లోని మిరపకాయలను చూసి, రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఒక ఎకరంలో సాగుకు రూ.2.52 లక్షలు వ్యయం అయిందని రైతులు సీహెచ్ హనుమంతరావు, ఎ. నాగేశ్వరరావు, రామకృష్ణ, ఎస్కే ఖాదర్ చెప్పారు. ఎంతో శ్రమించి పండించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా ధర మాత్రం క్వింటాకు రూ.10 వేలలోపే ఉందని వాపోయారు. జమలయ్య మాట్లాడుతూ క్వింటాకి రూ.21 వేలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.11,781గా ప్రకటించడం దుర్మార్గమన్నారు. మూడు నెలల నుంచి కాలయాపన చేసి క్వింటా మిర్చి కూడా కొనుగోలు చేయలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం సుమారు ఐదు లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారని చెప్పారు. దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క రైతులను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చోద్యం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం ఒకవైపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వారికి ఏదో మేలు చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడటం హాస్యాస్పందంగా ఉందని రైతులు పేర్కొన్నారు. ధరల వ్యత్యాస పథకం కింద ఆదుకుంటామని చెప్పి ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నేరుగా రైతుల నుంచి మిర్చిని క్వింటా రూ.21 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన ప్రాంతాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా సీపీఐ కార్యదర్శి సింగరకొండ, వ్యయసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అద్దంకి నాగేశ్వరరావు, కౌలు రైతుల సంఘం నాయకులు ఎస్కే ఖాదర్ బాషా, చెన్నుబోయిన హనమంతరావు, రామకృష్ణ, మేకల రమణయ్య, ఆవుల యలమందయ్య పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నాయకులను వేధిస్తున్న ప్రభుత్వం
చిలకలూరిపేట: రాజకీయ అరాచకాలకు పరాకాష్ట కూటమి ప్రభుత్వ పాలన అని... న్యాయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి పరిపాలనపై, పేదలపై ప్రేమ లేదని, కేవలం రాజ్య హింసను మాత్రమే ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు దొడ్డా రాకేష్‌గాంధీ కేసు విచారణ నిమిత్తం చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బుధవారం ఆయన హాజరయ్యారు. మాజీ మంత్రి విడదల రజిని నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించడంలో పురోగతి సాధించిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు కోరితే రాష్ట్ర డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వరని, టీడీపీ వారు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేస్తే ఏ మాత్రం కేసులు నమోదు చేయరని ఆరోపించారు. అదే టీడీపీకి చెందిన వారు ఫిర్యాదు చేయడం ఆలస్యం, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు రాష్ట్రం నలుమూలల కేసులు నమోదు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న ఆరాచక వైఖరిని మర్చిపోమని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పోలీసు అధికారులను న్యాయ స్థానాల ముందు నిలబెట్టి తీరుతామని హెచ్చరించారు. జర్మనీలో హిట్లర్ పరిపాలన కాలంలో ముందుగా యూదులను వేధించారని, తమను కాదని కమ్యూనిస్టులు మౌనంగా ఉన్నారన్నారు. అనంతరం కమ్యూనిస్టులను, సోషలిస్టులను కూడా వేధించారని గుర్తు చేశారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న ప్రభుత్వం తదుపరి సమస్యలపై ప్రశ్నించే ప్రతి గొంతుకను వేధించటం ఖాయమన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని తెలిపారు. అన్నీ తప్పుడు కేసులే ! ప్రస్తుతం కేసులు బనాయించి వేధిస్తున్న దొడ్డా రాకేష్ గాంధీ కేసులో పేర్కొన్న ఆరో తేదీ రాత్రి 9గంటలకు గుంటూరులోని శ్యామలానగర్‌లో ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీలు ఉన్నాయని, అవి న్యాయస్థానంలో అందజేశామని తెలిపారు. ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న ఫణీంద్ర అదే సమయంలో గుంటూరులోని ఓ సెలూన్లో ఉండగా, మరో ముద్దాయి రామకోటేశ్వరరావు హైదరాబాద్‌లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని వివరించారు. ఇలాంటి తప్పుడు కేసుల్లో పోలీసుల తరుఫున డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ స్థాయి న్యాయాధికారి హాజరుకావడం వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు వేరే ఉన్నాయని సుధాకరరెడ్డి పేర్కొన్నారు. రాకేష్‌గాంధీని కస్టడీకి తీసుకొని తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. భారతదేశంలో పోలీసుల ముందు ఇచ్చిన వాగ్మూలానికి చట్టబద్దత ఉండదని తెలిపారు. బీసీ మహిళ అయిన మాజీ మంత్రి విడదల రజినీని కేసులో ఇరికించి వేధించేందుకే పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తను న్యాయపరంగా ఆదుకొనేందుకు, అరాచకాలను అడ్డుకొనేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి సుదీర్ఘ వాదనలు రాకేష్గాంధీకి బెయిల్ మంజూరు చేయాలని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. అతనిని పోలీసు కస్టడికి అప్పగించాలని డీడీవోపీ బర్కత్ అలిఖాన్ పోలీసుల తరఫున వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఆర్డర్లు జారీ చేస్తామని వెల్లడించారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
బాపట్ల: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు పేర్కొన్నారు. యూనియన్ ముఖ్యనాయకుల సమావేశం స్థానిక కోన భవన్లో బుధవారం జరిగింది. శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఖాళీలకు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాసరాజు, వి.పూర్ణచంద్రరావు, ఎ.రాంమోహన్‌రావు, టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కరాటే పోటీల విజేతలకు బహుమతులు బాపట్ల: ఆలిండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్–2025 పోటీల్లో బాపట్ల విద్యార్థులు బంగారు, వెండి పతకాలు సాధించారని కోచ్ యర్ర నాగేశ్వరరావు పేర్కొన్నారు. బహుమతులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ బుధవారం జరిగింది. యర్ర నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ మచిలీపట్నంలో జరిగిన పోటీల్లో బాపట్ల నుంచి జూనియర్ విభాగంలో గోల్డ్ మెడళ్లను పి.యశస్విన్, పి.రామ్ వరణ్య, సోనూ నాగసాయి, సిల్వర్ మెడల్‌ను సీహెచ్ జయంతిబాబు, బ్రాంజ్ మెడళ్లను వైష్ణవ్, కె. పర్ణిక సాయి గెలుచుకున్నారని తెలిపారు. గూడవల్లికి చెందిన గోల్డ్ నగలు ఎం. కార్తీక్, పి. బాలాజీ, సీహెచ్ కీర్తన, ఎ. నిత్య, హరి చరిత, గగన, ప్రశంస, అయేషా, కిషోర్, సిల్వర్ మెడల్స్‌ను పి. ఖుషి, సీహెచ్ ధన్య, ఎ. సోహిత, దీక్షిత, కీర్తన. బ్రాంజ్ మెడళ్లను కె.జయంతి, జె. సాన్విత గెలుచుకున్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్లో టీం మేనేజర్లు వ్యవహరించిన అవినాష్, కరాటేలో బహుమతులు సాధించిన విద్యార్థులను పలువురు అభినందించారు. క్వారీ గుంతలో పడి బాలుడు మృతి కర్లపాలెం: అక్రమ సంపాదనే ధ్యేయంగా టీడీపీ చోటా నాయకులు అనఽధికారికంగా ఇసుక క్వారీ తవ్వి విక్రయించుకున్నారు. కానీ దానిని పూడ్చకుండా వదిలేయడంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి రెవెన్యూ పరిఽధిలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు యాజలి ఎస్సీ కాలనీకి చెందిన ఉన్నం కిషోర్ – అమృతమ్మల కుమారుడు ప్రవీణ్‌కుమార్(14) తన స్నేహితులతో కలిసి బుధవారం క్వారీ వద్దకు వెళ్లాడు. తర్వాత నీటిలో మునిగి మృతి చెందాడు. తోటి బాలురు వచ్చి విషయం తెలపటంతో గ్రామస్తులు గాలించారు. ప్రవీణ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. కన్నవారు విలపిస్తున్న తీరు స్థానికులను కూడా కంటతడి పెట్టించింది. అనధికారిక ఇసుక క్వారీని తహసీల్దార్ సుందరమ్మ, ఎస్ఐ రవీంద్ర పరిశీలించారు. బాలుడు మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పూర్వవిద్యార్థుల సహకారం అభినందనీయం బాపట్ల: కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర అభినందనీయమని, వారి సహాయ సహకారాలు ప్రస్తుత విద్యార్థులకు ప్రేరణనిస్తాయని ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మి దేవి అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో నూతనంగా నిర్మించిన ఆలుమ్ని హౌస్ మొదటి అంతస్తును బుధవారం ప్రారంభించారు. డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మి మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించబడిన ఈ వసతి గృహం అతిథులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రసూనరాణి కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సహకరాన్ని అభినందించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా విశ్వవిద్యాలయ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పి.వి.సత్యనారాయణ, డీన్ ఆఫ్ స్టూడెంట్ ఎఫైర్స్ డాక్టర్ జి. కరుణాసాగర్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య తాడేపల్లిరూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 10న పురుగుల మందు తాగిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. తాడేపల్లికి చెందిన కిశోర్(32) మద్యానికి బానిసయ్యాడు. భార్య నాగేశ్వరితో తరచూ గొడవలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో నాగేశ్వరి తల్లి, సోదరుడు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంలో కిశోర్‌కు, వారికి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో నాగేశ్వరి తల్లి, సోదరుడు కిశోర్ కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. మనస్తాపం చెందిన కిశోర్ ఈనెల 10న పురుగుల మందు తాగాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. అయితే భార్య, అత్త, బావమరిది వల్లే తన కొడుకు మరణించాడని కిశోర్ తల్లి బుజ్జి ఆరోపిస్తున్నారు. పెళ్లికి ముందు కిశోర్‌కు వ్యసనాలు లేవని, ఇంటర్నెట్లో పనిచేసేవాడని, ఇటీవల ఆ ఉద్యోగం మానివేయడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని బుజ్జి వివరించారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, సర్దిచెప్పాల్సిన అత్త, బావమరిది కళ్లలో కారం కొట్టి దాడి చేశారని, అందుకే తన కొడుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని, అయినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని విమర్శించారు. -
మెడపై కత్తి!
ఆరోగ్య మిత్రలజీఓ నెం.28 రద్దు చేయాలి ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని చాలా మంది కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అనేక ఒడిదొడుకుల మధ్య ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా కంపెనీలో చేరుస్తారని చెబుతున్నారు. దీంతో చాలా మంది ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఆరోగ్య మిత్రలకు న్యాయం చేయాలి. ప్రధానంగా జీతభత్యాలు పెంచాలి. 28 జీఓను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నదే మా ముఖ్యమైన డిమాండ్. – బడుగు రాజు, ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సమస్యలు పరిష్కరించాలి ఏళ్ల తరబడి ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని పేదలకు సేవ చేస్తున్నాం. మాలాంటి వారిని ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. మా న్యాయమైన సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలి. ఈ విషయాలపై ఈ నెల 12న ఉన్నతాధికారులతో జరిగిన చర్చలు ఫలించలేదు. ప్రస్తుతం తెరపైకి వస్తున్న కొన్ని ఊహాగానాలతో అసలు మా ఉద్యోగాలు ఉంటాయో...ఉండవోనన్న ఆందోళన మా అందరిలో మొదలైంది. – జె. పాప, ఆరోగ్య మిత్ర బాపట్ల టౌన్ : డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేసే ఆరోగ్య మిత్రల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియక సతమతం అవుతున్నారు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా కంపెనీ ద్వారా సేవలు అందిస్తామని కూటమి సర్కార్ చెబుతోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇలా చేయడానికి ఏర్పాట్లు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీమా కంపెనీ వస్తే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు, టీమ్ లీడర్లు, ఆఫీస్ సిబ్బందిని కొనసాగిస్తారా...లేదా.. అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ నెల 10వ తేదీ నుంచి వారందరూ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 12న వారిని చర్చలకు పిలిచారు. చర్చలు విఫలం కావడంతో 17 నుంచి 24వ తేదీ వరకు విధులు బహిష్కరించి శాంతియుత నిరసనకు దిగారు. సీఎఫ్‌ఎంఎస్‌తో ఉద్యోగ భద్రత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేసిన ఉద్యోగులను ఆప్కాస్ (ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్) కిందకు చేర్చారు. వారికి సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా ప్రతి నెలా 5వ తేదీలోపు జీతాలు ఇచ్చారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా కల్పించారు. సీఎఫ్ఎంఎస్ వేతనం తీసుకోవడంతో తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందన్న ఆశతో ఇన్నాళ్లుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను ప్రైవేటు బీమా కంపెనీకి అప్పగించే కుట్ర జరుగుతుండటంతో ఉద్యోగ భద్రతపై వైద్య మిత్రలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 20 నెట్వర్క్ వైద్యశాలలు జిల్లాలోని 20 నెట్వర్క్ వైద్యశాలల్లో 33 మంది ఆరోగ్య మిత్రలు పనిచేస్తున్నారు. వీటిల్లో రెండు ఏరియా వైద్యశాలలు, 8 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పది ప్రైవేట్ వైద్యశాలలు ఉన్నాయి. వాటిల్లో చీరాలలో ఆరు, అద్దంకిలో మూడు, బాపట్లలో రెండు, రేపల్లెలో రెండు ఉన్నాయి. వేమూరులో, నగరంలో, పిట్టలవానిపాలెంలో, నిజాంపట్నంలో, చెరుకుపల్లిలో, మార్టూరులో, పర్చూరులో ఒకటి చొప్పున ఉన్నాయి. ఆరోగ్యశ్రీని బీమా కంపెనీకి అప్పగించేందుకు పాలకుల కుట్ర కూటమి సర్కారు దెబ్బకు సర్వీసుకు ఎసరు 15 ఏళ్లకుపైగా విధుల్లో ఉన్న ఆరోగ్య మిత్రలు కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ 24 వరకు సమ్మెలోనేకొనసాగనున్న ఉద్యోగులు సేవలు అందక తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు 15 సంవత్సరాలుగా సేవలు రోగులు వైద్యశాలల్లో చేరినప్పటి నుంచి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు వైద్య మిత్రలు పర్యవేక్షిస్తుంటారు. పేద రోగులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంటారు. ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ కార్డులు, ఆరోగ్యరక్ష స్కీముకు సంబంధించి వివరాలు తెలియజేస్తుంటారు. ఇలా అన్ని విభాగాల్లో 15 ఏళ్లకుపైగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వయసు కూడా చాలా మందికి 50 ఏళ్లు దాటింది. ఆరోగ్యశ్రీ ప్రైవేటు బీమా కంపెనీ చేతుల్లోకి వెళితే ఎవర్ని తొలగిస్తారోనని ఆందోళనగా ఉందని, ఈ వయసులో వేరే ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగాలకు వెయిటేజ్ ఇవ్వాలని, చనిపోయిన సిబ్బందికి రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గ్రాట్యూటీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
శింగరకొండలోపుల్లెల గోపీచంద్ పూజలు
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ కుటుంబ సమేతంగా బుధవారం రాత్రి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి, వారిని ఆశీర్వదించారు. పల్నాడు జిల్లా డీఆర్డీఏ పీడీ బాధ్యతలు స్వీకరణ నరసరావుపేట: పల్నాడు జిల్లా డీఆర్డీఏ పీడీగా ఝాన్సీరాణి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె ఒంగోలు జిల్లాలో విజిలెన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు. కలెక్టర్ పి.అరుణ్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గతంలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన బాలూనాయక్పై వచ్చిన అవినీతి ఆరోపణల మేరకు ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. గేట్లో జశ్వంత్ భవానీకి 6వ ర్యాంక్ నరసరావుపేట ఈస్ట్: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2025 పరీక్షా ఫలితాలలో పట్టణానికి చెందిన పెంటేల జశ్వంత్ భవాని 6వ ర్యాంక్ సాధించాడు. జశ్వంత్ భవాని తండ్రి రాజశేఖర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ముంబైలో 5జీ సిస్టమ్ ఇంజినీర్‌గా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గేట్ పరీక్షలకు జశ్వంత్ సిద్ధం అయ్యాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. ఇందులో దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో పరీక్ష రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జశ్వంత్ భవాని 6వ ర్యాంక్ సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని పలువురు అభినందనలు తెలియజేశారు. 1,27,005 బస్తాల మిర్చి రాక కొరిటెపాడు(గుంటూరు): మార్కెట్ యార్డుకు బుధవారం 1,27,005 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,24,077 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 – రూ.14,500 వరకు పలికింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
నరసరావుపేట టౌన్: తీవ్ర పని ఒత్తిడితో ఉద్యోగం చేయలేక పోతున్నా.. వద్దు అంటే పెళ్లి చేశారు.. ఇప్పుడు ఉద్యోగం మానేస్తే భార్య తరఫు బంధువుల నుంచి మాట వస్తుంది.. ఒత్తిడి తట్టుకోలేక లోకం విడిచి వెళ్తున్నా..అమ్మా నాన్న నన్ను క్షమించండి ! అంటూ నాలుగు నెలల క్రితం వివాహం అయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో మంగళవారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుడిపాడుకు చెందిన బండ్ల హనుమంతరావు (29) కు నరసరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నాలుగు నెలల కిందట వివాహం అయ్యింది. హనుమంతరావు రెండేళ్ల నుంచి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. పని ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల సెలవుపై వచ్చి స్వగ్రామంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పెద్దలు అతనికి నచ్చ చెప్పారు. కొన్ని రోజులు బాగానే ఉండి రెండ్రోజుల కిందట భార్యను పుట్టింట్లో వదిలి నరసరావుపేట బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం నుంచి అతను బయటకు రాకపోవడాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది మంగళవారం రాత్రి తలుపు బద్దలకొట్టి చూడగా ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ సీహెచ్ విజయ్ చరణ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు వివిధ మార్గాల్లో ప్రయత్నం బండ్ల హనుమంతరావు ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత పలు రకాలుగా ప్రయత్నం చేసి విఫలమై చివరకు ఉరివేసుకొని మృతి చెందినట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భావిస్తున్నారు. కత్తితో మెడ కోసుకునేందుకు మొదట ప్రయత్నం చేశాడు. మృతుడి మెడ భాగంలో ఉన్న గాట్లను పరిశీలించిన పోలీసులు అక్కడ ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. పురుగు మందు తాగిన భార్య భర్త ఆత్మహత్య విషయం తెలుసుకున్న భార్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. పని ఒత్తిడే కారణమంటూ సూసైడ్ నోట్ నాలుగు నెలల క్రితమే వివాహం -
రుణాల పంపిణీలో లక్ష్యాలు సాధించాలి
బాపట్ల: జిల్లాలోని రైతులకు బ్యాంకర్లు అధిక రుణ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశం బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రాధాన్యతా రంగాలు, ప్రాధాన్యత లేని రంగాలకు రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు నూరు శాతం చేరుకోవాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున నిరుపేదల జీవనోపాధి పెంచడానికి రుణ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు. నిరుపేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా రుణ పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం విశ్వకర్మ, పీఎం సూర్య ఘర్, చేనేతలకు ముద్ర రుణాలు, అన్ని విభాగాల కార్పొరేషన్ రుణాలు, కిసాన్ డ్రోన్స్, ఎన్ఎల్ఎం పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలని సూచించారు. గేదెల బీమా కోసం పశుబీమా పథకం అమలుపై ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఉత్పత్తి రంగాల అభివృద్ధికి అధిక రుణాలు ఇవ్వాలని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.10,054 కోట్ల రుణాలు లక్ష్యం కాగా, డిసెంబర్ 31వ తేదీ నాటికి రూ.9,321 కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు రూ.1,154 కోట్లకుగాను రూ.862 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.514 కోట్లకుగాను రూ.168 కోట్లు పంపిణీ చేశామని గుర్తుచేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.13,444 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని బ్యాంకర్లకు లక్ష్యాలు నిర్దేశించగా 93.50 శాతానికి చేరినట్లు వివరించారు. గడిచిన రెండు నెలలు, రానున్న 20 రోజుల్లో నూరు శాతం లక్ష్యాలు చేరుకోవాలని తెలిపారు. కౌలు రైతులకు రూ.100 కోట్లు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం 1.89 లక్షల మంది కౌలు రైతులకు కార్డులు జారీ చేశామన్నారు. వారికి ప్రస్తుతం రూ.55 కోట్లు రుణం ఇవ్వగా, పంట రుణాలు అందించాలని సూచించారు. 7,900 చేనేత కుటుంబాలకు రుణ సదుపాయం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పొదుపు మహిళా సంఘాలకు లక్ష్యం మేరకు రుణ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. ముద్ర రుణాల మంజూరులో ప్రస్తుతం 44.40 శాతం లక్ష్యం కాగా, నూరు శాతం చేరుకోవాలని సూచనలు చేశారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ అభిషేక్, నాబార్డ్ డీడీఎం రవికుమార్, ఎల్డీఎం శివకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జలజీవన్ మిషన్‌కు రూ.149 కోట్లు బాపట్ల: జలజీవన్ మిషన్ జిల్లాకు రూ.149 కోట్ల నిధులు మంజూరయ్యాయని, 337 పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వాటర్, శానిటేషన్ మిషన్ జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ కింద ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పారు. జిల్లాలోని సమగ్ర నీటి సరఫరా పథకాలను, తాగునీటి బోర్ల మరమ్మతులు చేపట్టడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. తాగునీటి పథకాలను మరమ్మతులు చేయడానికి జిల్లా పరిషత్ 15 ఆర్థిక సంఘం నిధుల విషయం గురించి అడిగారు. తాగునీటి పథకాలకు బోర్ల మరమ్మతులకు గ్రామస్థాయిలో పంచాయతీలకు మంజూరైన నిధులు ఎంతనే విషయాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్లను మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీలో మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ అనంత రాజు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధా మాధవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, గుంటూరు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఇఓ కృష్ణ, ప్రకాశం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఇఓ బాలమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి నిరుపేద కుటుంబానికి చేయూత బాపట్ల: ఓ నిరుపేద కుటుంబానికి జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి చేయూత అందించారు. కర్లపాలెం మండలం పేరళి గ్రామానికి చెందిన దోమతోటి సందీప్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కొంతకాలం క్రితం స్తంభంపై విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కుటుంబం వీధిన పడింది. సందీప్ తల్లి కలెక్టర్‌కు దీనిపై వినతిపత్రం అందజేశారు. సందీప్ సోదరుడు సునీల్ కుమార్‌కు పొరుగు సేవల పద్ధతిలో ఉద్యోగం కల్పించి ఆ కుటుంబానికి దారి చూపారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో కమాటీగా అతడిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. నియామక ఉత్తర్వులను కలెక్టర్ స్వయంగా సునీల్ కుమార్‌కు అందజేశారు.జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి జె. రాజదిబోరా తదితరులు పాల్గొన్నారు. -
మాలల అణచివేతకు కూటమి ప్రభుత్వం కుట్ర
నరసరావుపేట: రాష్ట్రంలో మాలలు, వారి ఉప కులాలను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్‌పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ మాల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంగళవారం నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ విస్తల జయరావు ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి హాజరైన జాన్‌పాల్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. 2021 జనాభా లెక్కలు తేల్చకుండా వర్గీకరణ అమలు చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రంలో వేసిన వన్‌మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపటాన్ని మాల మహానాడు వ్యతిరేకిస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ చేసిన సూచనలను అమలు చేయకుండా, ఎంపారికల్ డేటా తీయకుండా రాష్ట్ర విభజనకు ముందు ఉన్న 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకొని వర్గీకరణ చేయటం దారుణన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజా పోరాటంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న రోజుల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జ్ గోదా బాల, జిల్లా ఉపాధ్యక్షుడు కోండ్రు విజయ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిపూడి ఏసురత్నం, జిల్లా ఉపాధ్యక్షుడు కొర్రపాటి ఎర్రయ్య, నాయకులు పాల్గొన్నారు. -
మత్తులో మునిగి తేలుతున్న యువత
బాపట్ల టౌన్: బాపట్ల జిల్లా కేంద్రంలోని యువత మత్తులో జోగుతోంది. తాజాగా మత్తు కోసం ఇంజక్షన్లు చేసుకునే స్థాయికి దిగజారారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఈ తతంగం జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ తరహా యువతకు అడ్డాగా మారింది. ప్రతి రోజు సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో కొందరు యువకులు పరస్పరం మత్తు ఇంజక్షన్లు చేసుకోవడం షరా మామూలైంది. కొద్ది సేపటికి ఇష్టమొచ్చినట్లు కేకలు వేయటం, అటుగా రాకపోకలు సాగించే స్థానికులను భయభ్రాంతులకు గురిచేయటం పరిపాటిగా మారింది. మూడు రోజుల క్రితం మండలంలోని వెదుళ్ళపల్లి సమీపంలో ఓ మహిళ మత్తు కోసం టాబ్లెట్లు పొడిని విక్రయిస్తుండగా స్థానికుల ఫిర్యాదుతో ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన మరవక ముందే తాజాగా మంగళవారం రాత్రి కొందరు యువకులు జమ్ములపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైకి చేరి ఏకంగా మత్తు ఇంజక్షన్లు చేతి నరాలకు చేసుకోవడం పట్టణంలో కలకలం రేపింది. కొరవడిన పర్యవేక్షణ విద్యా కేంద్రంగా పేరున్న బాపట్లలో ఎన్నో ప్రముఖ కళాశాలలు ఉన్నాయి. ఇలాంటి యువత కదలికలను పసిగట్టడంలో పోలీస్ శాఖ అడుగడుగునా విఫలం అవుతూనే ఉంది. పట్టణ నడిబొడ్డున మంగళవారం జరిగిన ఘటన కూడా పట్టణంలోని కొందరు రహస్యంగా వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టుచేయటం ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత పోలీసులు అక్కడకు చేరుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా మత్తు మందు వినియోగం, సరఫరాపై జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పట్టించుకోని పోలీసు అధికారులు ఫ్లైఓవర్ వద్ద నిత్యం మత్తు ఇంజక్షన్ల వాడకం మైకంలో ఇష్టమొచ్చినట్లు కేకలు భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు -
టైరు పేలడంతో కారు ప్రమాదం.. వ్యక్తి మృతి
మార్టూరు: జాతీయ రహదారిపై కారు టైరు పేలడంతో అదుపుతప్పి చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి గ్రామ సమీపంలో జరిగింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది రవి, స్థానికుల కథనం ప్రకారం వివరాలు... విశాఖపట్నానికి చెందిన భీమన నవీన్ (32) గుంటూరుకు చెందిన తన స్నేహితుడి కుటుంబ సభ్యులైన నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక పాపతో కలిసి తమిళనాడు తీర్థయాత్రకు వెళ్లాడు. యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో బొల్లాపల్లి టోల్గేట్ దాటిన కాసేటికే వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ముందు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో కారు అదుపుతప్పి రహదారి పక్కన కాలువ కల్వర్టును వేగంగా ఢీకొంది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న నవీన్ ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయినప్పటికీ ఛాతీ కారు ముందు భాగానికి ఒత్తుకొని తీవ్రంగా గాయపడ్డాడు. కారులో ఉన్న వారిలో చితర జయభారతి, కసినికోట భావన, అఖిల్‌లు గాయాలపాలయ్యారు. సమీపంలో ఉన్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది రవి పోలీసులకు సమాచారాన్ని అందించారు. హైవే అంబులెన్స్ వాహనంలో క్షతగాత్రులను ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నవీన్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. మార్టూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యోమగాముల రాకను కాంక్షిస్తూ ప్రదర్శన
నగరం: అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి భూమిపై తిరిగి బయలుదేరిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ తదితరులు సురక్షితంగా చేరాలని శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు ఆకాంక్షించారు. వారికి స్వాగతం పలుకుతూ నగరంలోని పాఠశాలలో ఉన్న రాకెట్ బొమ్మ వద్ద మంగళవారం ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో సైన్స్ రచయిత బొర్రా గోవర్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎంపీడీవోకు సన్మానం జె.పంగులూరు: రెడ్ క్రాస్ సొసైటీలో ఎక్కువ మంది సభ్యులను చేర్పించినందుకు మంగళవారం కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్లలోని తన కార్యాలయంలో ఎంపీడీవో స్వరూపారాణిని సన్మానించారు. రెడ్ క్రాస్ సొసైటీ వారికి మండల పరిధిలో 50 మందితో రూ.1,100 చొప్పున సభ్యత్వ రుసుము కట్టించినందుకు కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బాపట్ల మేనేజింగ్ కమిటీ మెంబర్ దాసరి ఇమ్మానియేలు పాల్గొన్నారు. శక్తియాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి బాపట్ల టౌన్: శక్తి యాప్‌ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. జిల్లాలోని ప్రధాన కూడలి ప్రాంతాల్లో మంగళవారం శక్తి బృందాలు యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ యాప్ ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఉంటుందన్నారు. ఎస్.ఓ.ఎస్. బటన్ ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందాలు చేరుకొని రక్షిస్తాయని తెలిపారు. జిల్లాలో ఎస్సై నేతృత్వంలో మొత్తం 5 శక్తి బృందాలు ఉన్నాయన్నారు. -
విద్యార్థులు నైపుణ్యాలకు పదును పెట్టాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు అంతర్గతంగా దాగిన నైపుణ్యాలకు పదును పెట్టాలని ఏఎన్‌యూ ఉప కులపతి ఆచార్య కె.గంగాధరరావు పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంగళవారం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా వీసీ గంగాధరరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. కళాశాల కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి శ్యాం సుందర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. అనితాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసందర్భంగా ఎంకాం విద్యార్థిని షేక్ షహనాజ్, ఎంబీఏ విద్యార్థి కె.అనంతలక్ష్మి, ఎమ్మెస్సీ మ్యాథ్స్‌లో వై.నాగమణి, ఫిజిక్స్‌లో బి.దుర్గా లావణ్య, కంప్యూటర్స్ సైన్స్‌లో కె.నాగసాయి రమ్య, కెమిస్ట్రీలో జుబేర్ అహ్మద్, ఎంసీఏ విద్యార్థి ఎన్. సాయిలీల ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. బీకాం జనరల్ విభాగంలో టాపర్‌గా నిలిచిన నరేంద్ర, బీకాం కంప్యూటర్స్‌లో షేక్ ఫారినా, బీఎస్సీ బీజెడ్సీలో షేక్ ఇషా సుల్తానా, బీబీఏలో జి.శ్వేత, ఇంటర్మీడియెట్ ఎంపీసీలో టాపర్ పి. గౌస్య ప్రతిభా పురస్కారాలు పొందారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, వైస్ ప్రిన్సిపాల్ భానుమురళి, అధ్యాపకులు బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి, డీవీ చంద్రశేఖర్, ఎస్. శ్రీనివాసరావు, యు. రవికుమార్ పాల్గొన్నారు. -
బాపట్ల
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025మొక్కజొన్నకూకేంద్ర, రాష్ట్ర పాలకులు రైతే రాజన్నారు.. ఆచరణలో మాత్రం అడుగడుగునా వారిని దగా చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా అధిక వడ్డీలకు అప్పులు చేసి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మొక్కజొన్న రైతు పరిస్థితి పాలకుల నిర్లక్ష్యంతో మద్దతు ధర లేక అగమ్యగోచరంగా తయారైంది.నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్న దానానికి విజయవాడ భవానీపురానికి చెందిన కనమర్లపూడి రామకృష్ణ, సౌమిత్రి పద్మవల్లి రూ. 1,00,116 విరాళమిచ్చారు. 20 రోజులుగా కల్లాల్లోనే.. ఇఫ్తార్ సహర్ (బుధ) (గురు) బాపట్ల 6.24 4.56 నరసరావుపేట 6.26 4.58 గుంటూరు 6.24 4.56 ఈ ఏడాది 6 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. గతంలో ఎన్నడూలేని విధంగా కూలీల కొరతతో అధిక ధరలు హెచ్చించి మొక్కజొన్న కండెలు విరిపించాం. పెట్టుబడులు కూడా పెరిగాయి. కనీసం మద్దతుధర లేకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పటికి కలాల్లో కండెలు ఆరబోసి 20 రోజులు అవుతోంది. రేయింబవళ్ళు వాటిని చూసుకుంటూ కల్లాల్లోనే ఉంటున్నాం. – దర్శి నాగయ్య, గవినివారిపాలెం7న్యూస్రీల్గిట్టుబాటు ధర కల్పించాలి -
12వ పీఆర్సీ చైర్మన్‌ను తక్షణమే నియమించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: పన్నెండో వేతన సవరణ సంఘాని(పీఆర్సీ)కి తక్షణమే చైర్మన్‌ను నియమించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సంఘ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తొమ్మిది నెలల క్రితం అధికారంలోకి రాక ముందు, తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామని, సకాలంలో డీఏలు ఇస్తామని హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. ఇప్పటికీ 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించకపోవడం దారుణమన్నారు. 12వ పీఆర్పీ చైర్మన్‌ను నియమించి, విధి విధానాలను అప్పగించి, సంఘాలతో చర్చలు జరిపి ఐఆర్ ప్రకటించి అమలు చేసేందుకు మరింత జాప్యం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన మూడు డీఏలు ఇప్పటికీ చెల్లించలేదని, మరొక డీఏ జూలైకి రాబోతుందని, ఇప్పటికై నా డీఏలను తక్షణం చెల్లించాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం 2017లో ఇచ్చిన మెమో 57ని ఇంతవరకు అమలు చేయకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా యూటీఎఫ్ ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని హెచ్చరించారు. సంఘ రాష్ట్ర ప్రచురణ విభాగ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలలను అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని, మిగిలిన ప్రాథమిక పాఠశాలలను యధాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 60 మంది విద్యార్థులు దాటిన ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేసి, మిగిలిన యూపీ పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియాలను కొనసాగిస్తూ ప్లస్ 2 పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలన్నారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్, జిల్లా సహధ్యక్షురాలు వై. నాగమణి, కోశాధికారి ఎండీ దౌలా, జిల్లా కార్యదర్శులు ఆదినారాయణ, సాంబశివరావు, గోవిందయ్య, ఆంజనేయులు, షకీలా బేగం, కేదార్ నాధ్, రంగారావు, ప్రసాద్, ఆడిట్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, కోటిరెడ్డి, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఆడపిల్లల సంఖ్య పెంచాలి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
పోలింగ్ కేంద్రాల విభజనపై దృష్టి సారించాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిబాపట్ల టౌన్: ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులతో స్థానిక కలెక్టరేట్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,200 మందికి మించి ఓటర్లు ఉండరాదనే నిబంధన ఉల్లంఘించరాదని తెలిపారు. విభజన ప్రక్రియకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బాపట్ల జిల్లాలో 12,91,415 ఓటర్లు ఉన్నారన్నారు.వీరిలో 6,29,578 మంది పురుషులు, 6,61,756 మంది మహిళలు, మిగిలిన 81 మంది ఇతర ఓటర్లు అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,510 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. 1,100 ఓటర్లులోపు ఉన్న కేంద్రాలు 1,270 అన్నారు. 1,101 ఓటర్లకు మించిన కేంద్రాలు 250 ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రెండు కిలోమీటర్లకు మించి పోలింగ్ కేంద్రం ఓటర్లకు దూరంగా ఉండరాదన్నారు. దీనిపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో ప్రతినెల నియోజకవర్గం, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఓటర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఓటు హక్కు కొరకు జనవరి నుంచి ఇప్పటివరకు 2,399 దరఖాస్తులు రాగా, 382 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లాలోని 319 మంది ఓటర్లు విదేశాల్లో ఉంటున్నారని తెలిపారు. 2,187 మంది వీఐపీ ఓటర్లు ఉండగా, దివ్యాంగ ఓటర్లు 14,551 మంది ఉన్నారన్నారు. 4,532 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని వివరించారు. ప్రతి ఓటరుకు ఆధార్ అనుసంధానం చేయాలన్నారు. ఆధార్ అనుసంధానంలో 1.92 లక్షల ఓట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తక్షణమే పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, బీజేపీ నాయకులు రామకృష్ణ, సీపీఎం నాయకులు గంగయ్య, కాంగ్రెస్ నాయకులు డి.రవికుమార్, వైఎస్సార్సీపీ నాయకులు ఐ.మాల్యాద్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బాలాజీ, బి.ఎస్.పి. నాయకులు కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు షేక్ గౌస్ బాషా, జనసేన నాయకులు శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తెల్లజొన్న రైతు విలవిల
కొల్లూరు: ఖరీఫ్‌లో వరి సాగు చేసిన అన్నదాతలు మూడొంతులు పంట అయినకాడికి దళారులకు విక్రయించి నష్టాలను చవిచూశారు. నామమాత్రంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో సామాన్య రైతులు పండించిన పంటల విక్రయానికి ఆంక్షలు ఎదురవడంతో దళారులను ఆశ్రయించక తప్పలేదు. ప్రస్తుతం రబీలో సాగు చేసిన పంటకై నా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి పారదర్శకంగా కొనుగోలు చేస్తుందని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురవుతోంది. దీనంగా తెల్లజొన్న రైతుల పరిస్థితి రబీలో తెల్లజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి దీనంగా మారింది. నియోజకవర్గంలో చుండూరు, అమృతలూరు మండలాలలో రైతులు అధిక శాతం మినుము, పెసర సాగు చేశారు. పెసర పంటకు మాత్రమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు మండలాలలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగైంది. సుమారు 8 వేల ఎకరాలకు పైగా తెల్లజొన్న సాగులో ఉంది. కొనే దిక్కేది? కొల్లూరు మండలంలో 1,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తెల్లజొన్న వేయగా.. ప్రస్తుతం పంట చేతికందింది. రైతులు జొన్న కంకులు కోసుకొని నూర్పిళ్లు పూర్తి చేస్తున్నారు. మండలంలోని కొల్లూరు, క్రాప, అనంతవరం, చిలుమూరు ప్రాంతాలలో తెల్లజొన్న కంకులు కోత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 200 ఎకరాల వరకు జొన్న కోతలు పూర్తయ్యాయి. ఎకరాకు సుమారు రూ. 20 వేలు పెట్టుబడులు పెట్టారు. సగటున 25 బస్తాల దిగుబడి లభిస్తోంది. గతేడాది ఇదే సమయంలో జొన్న క్వింటాకు రూ. 2,400 వరకు లభించడంతో రైతులకు లబ్ధి చేకూరింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ప్రకటించకపోవడంతో క్వింటాకు దళారులు రూ. 2 వేలు నుంచి రూ. 2,100 వరకు ఇస్తున్నారు. దీంతో రైతాంగం నష్టపోతోంది. రబీలో సాగు చేసిన పంటల విక్రయాలకు వీలుగా వ్యవసాయ శాఖాధికారులు ఈక్రాప్ బుకింగ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. పంట చేతికందినా విక్రయించే మార్గం శూన్యం ప్రభుత్వం నుంచి కొనుగోలు, మద్దతు ధర లేక ఆవేదన దళారులకు తక్కువ ధరకే అమ్మాల్సిన దుస్థితి కూటమి సర్కారు తీరుతో నష్టపోతున్న అన్నదాతలు కొనుగోలు కేంద్రాల ఊసేదీ? రబీలో సాగు చేసిన పంటల కొనుగోలుకు వ్యవసాయ శాఖాధికారులు పంట నమోదు చేసినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. దళారులు చెప్పిన ధరలకే అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పంట కోతలు చివరి దశకు చేరుకునే సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం లేకుండాపోతుంది. – టి. సురేష్, రైతు అనుమతులొస్తే కేంద్రాలు ఏర్పాటు తెల్లజొన్న ప్రస్తుతం కోత దశకు రావడంతో రైతులు నూర్పిళ్లు చేపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పా టు విషయంలో మార్క్‌ఫెడ్ నుంచి ఆదేశాలు రాలేదు. అనుమతులు వచ్చిన వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేస్తాం – ఆర్.వెంకటేశ్వరరావు, వ్యవసాయశాఖాధికారి, కొల్లూరు. -
రైలెక్కాలంటే ఆపసోపాలే
చీరాల టౌన్: చీరాల మండలంలోని ఈపురుపాలెం రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు విజయవాడకు నాలుగు, గూడూరు, బిట్రగుంటకు నాలుగు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈపురుపాలెం స్టేషన్ నుంచి మేజర్ గ్రామమైన ఈపురుపాలెం, తోటవారిపాలెం, బోయినవారిపాలెం, పిట్టువారిపాలెం, సాయికాలనీ, గవినివారిపాలెం గ్రామాల నుంచి రోజు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అంతేగాక వ్యవసాయ సీజన్లో వందలాది మంది కూలీలు ఈపురుపాలెం నుంచి తెనాలి, ఒంగోలు వరకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల ఈ స్టేషన్‌ను కేంద్రం మూడో రైల్వేలైన్ వేసింది. టికెట్ కౌంటర్, ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడైనా టికెట్ కౌంటర్‌కు దగ్గర్లోనే ఫుట్ఓడర్ బ్రిడ్జి ఉంటుంది. ఈ స్టేషన్లో మాత్రం టికెట్ కౌంటర్ బోయినవారిపాలెం వైపు ఉంటే.. ఫుట్ఓవర్ బ్రిడ్జి మాత్రం సావరపాలెం వైపు 100 మీటర్లు దూరంలో ఉంది. ఉదయం వేళల్లో ట్రైన్ ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికులు అటు టికెట్ తీసుకుని ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి వచ్చి ఫ్లాట్‌ఫాంకు చేరుకునేలోపు రైలు స్టేషన్‌ను వదలివెళ్లిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఎత్తు తక్కువగా ప్లాట్ ఫాం ఉదయం వేళల్లో విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు రైలు ఎక్కేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్లాట్ ఫాం ఎత్తుగా లేకపోవడంతో రైలు ఎక్కేందుకు పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్లాట్ ఫాం ఎత్తు పెంచాలని కోరుతున్నారు. పరిసరాల్లో లైట్లు ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. లైట్లు సక్రమంగా లేకపోవడంతో మద్యం తాగేవారు, జల్సారాయుళ్లకు స్టేషన్ ఆవాసంగా మారుతోంది. దీంతో రాత్రివేళల్లో ఈపురుపాలెం స్టేషన్లో దిగాల్సిన ప్రయాణికులు చీరాలలో దిగి ఇంటికి చేరుతున్నారు. ఇకనైనా పాలకులు స్పందించి స్టేషన్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు. చేనేతలు, వ్యవసాయ కూలీలు, వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఉద్యోగులు ఉన్న ప్రాంతం ఈపురు పాలెం. ఈ గ్రామంలో రోజుకు ఎనిమిది రైళ్లు ఆగే రైల్వేస్టేషన్ ఉంది. చైన్నె, విజయవాడ మార్గాల్లో కీలకమైన స్టేషన్. చీరాల రూరల్ మండలంలోని చాలా గ్రామాల్లోని ప్రజలకు విజయవాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు వెళ్లేందుకు అనువైన స్టేషన్ ఇది. కానీ కనీస వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిత్యం వచ్చే వారు టికెట్ తీసుకోవాలన్నా, రైలు ఎక్కాలన్నా అవస్థలు తప్పడం లేదు.దూరంగా టికెట్ కౌంటర్, నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు -
వివాహిత అనుమానాస్పద మృతిపై కేసు
గుంటూరు రూరల్: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. సీఐ వంశీధర్ కథనం ప్రకారం నల్లపాడు గ్రామానికి చెందిన రాజుకు, మామిళ్ళపల్లికి చెందిన సృజన (23)తో ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవల నుంచి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సృజన మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన సృజన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భర్తే తమ కుమార్తెను చంపాడని, ఉరివేసుకుందని సృష్టించాడని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసునమోదుచేసి దర్యాప్త చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. చిట్‌ఫండ్ బాధితుల విచారణ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): నరసరావుపేటలోని సాధన చిట్‌ఫండ్ బాధితులను సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం విచారణ చేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఎప్పటి నుంచి చిట్లు వేస్తున్నారు? ఎంత మొత్తంలో నెల నెలా చెల్లిస్తున్నారనే అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సుమారు 15 మందికిపైగా బాధితుల వద్ద వివరాలు సేకరించారు. అలాగే నరసరావుపేటలోని ఓ ప్రైవేటు బ్యాంక్ ప్రతినిధులు కూడా తమ గోడును సీఐడీ అధికారులకు వినిపించారు. అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య దామరపల్లి(తాడికొండ): వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పుల బాధ పెరిగి కుటుంబ పోషణ భారంగా మారడంతో మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన తాడికొండ మండలం దామరపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడికొండ మండలం దామరపల్లి గ్రామానికి చెందిన వట్టికూటి శ్రీనివాసరావు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టం వస్తుండటంతో ఉన్న 3 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చారు. కౌలుకు పొలం తీసుకొని వ్యవసాయం చేస్తుండగా ఈ ఏడాది కూడా తీవ్రంగా నష్టం రావడంతో మనస్థాపం చెందారు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడికి గురిచేస్తుండటంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారడంతో మనస్థాపంతో శ్రీనివాసరావు భార్య అరుణ కుమారి ఈనెల 14న పొలానికి వేసేందుకు తెచ్చిన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరులోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మంగళవారం ఉదయం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతులకు రిజర్వ్ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి ముగ్గురి వద్ద నుంచి రూ.13 లక్షలు నగదు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై అరండల్‌పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. అరండల్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. ఆంజనేయ పేట ప్రాంతంలో రుద్రా ఫౌండేషన్ యజమాని అయిన అరమండ రవికుమార్ అనే వ్యక్తి 2022లో ఉద్యోగవకాశాల పేరుతో పత్రికా ప్రకటనలు చేశాడు. ఆ ప్రకటనలు చూసిన పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన పాలపర్తి కోటేశ్వరమ్మ రవికుమార్‌ను కలిశారు. అతని మాయమాటలు నమ్మి రూ.5లక్షలు చెల్లించారు. అలాగే గడ్డల వంశీ అనే వ్యక్తి రూ.3 లక్షలు, గొట్టిపాటి మరియదాసు అనే వ్యక్తి రూ.5 లక్షలు రవికుమార్‌కు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయినట్టు గుర్తించిన బాధితులు అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టాభిపురం సీఐ పోస్టుపై సందిగ్ధం నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పశ్చిమ సబ్ డివిజన్లోని పట్టాభిపురం పీఎస్ సీఐ పోస్టుపై సందిగ్ధం నెలకొంది. వీఆర్‌లో ఉన్న సీఐ ఎం.మధుసూదనరావును ఈనెల 16న పట్టాభిపురం పీఎస్ సీఐగా నియమిస్తూ ఓ పోలీస్ ఉన్నతాధికారి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పటి వరకు విధుల్లో ఉన్న వీరేంద్రబాబును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కొత్త సీఐగా మధుసూదనరావు అదే రోజు రాత్రి స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి ఈ పోస్టింగ్‌కు బ్రేక్‌పడినట్లు తెలుస్తోంది. దీంతో సందిగ్ధం నెలకొంది. బుధవారం సాధ్యమైనంత వరకు ఆయనే మళ్లీ సీఐగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. -
తైక్వాండోలో చీరాల క్రీడాకారుల ప్రతిభ
చీరాల: తైక్వాండోలో చీరాల క్రీడాకారుల ప్రతిభ చాటారు. ఆదివారం తెనాలిలోని ఎన్టీఆర్ స్టేడియంలో అస్మిత కేలో ఇండియా ఉమెన్స్ లీగ్ జూనియర్, సీనియర్ తైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చీరాల క్రీడాకారులు విశేష ప్రతిభ చూపి పతకాలు సాధించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పతకాలు సాధించిన 13 మంది తైక్వాండో క్రీడాకారులను మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ అభినందించి సత్కరించారు. తైక్వాండో పోటీల్లో పది జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొనగా చీరాల నుంచి పోటీల్లో పాల్గొన్న 20 మందిలో 13 మంది క్రీడాకారులు పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. తైక్వాండో పోటీల్లో పాల్గొనడం వలన ఆత్మరక్షణతో పాటుగా శారీరక దృఢత్వం, ఏకాగ్రత, స్నేహ బంధాలు పెరగడంతో పాటుగా స్పోర్ట్స్ కోటాలో ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు పొందుతారన్నారు. జూన్‌లో జరగనున్న జాతీయ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. మంచి శిక్షణ అందించిన కోచ్‌లు సలావుద్దీన్, వెంకటప్రసాద్‌లను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
వినుకొండలో వృద్ధురాలి హత్య
మెడలో బంగారు గొలుసు మాయం వినుకొండ: వినుకొండలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. కొత్తపేటలో నివాసం ఉంటున్న వృద్ధురాలు కొప్పరపు సావిత్రి(70)ని దుండగులు పట్టపగలే హత్య చేసి మెడలోని బంగారు గొలుసు చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న టౌన్ సీఐ శోభన్‌బాబుతోపాటు పోలీసు సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంగారు గొలుసు కోసమే హత్యచేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంటిలో లేకపోవటం గమనార్హం. పగలే హత్య చేసి టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి పరారయ్యారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు ఇంటికి కొద్దిదూరంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డాగ్‌స్క్వాడ్ తో పరిశీలన అనంతరం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కేసును త్వరలోనే ఛేదిస్తామని సీఐ తెలిపారు. వైద్యమిత్రల ధర్నా నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో గత 17 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా తమకు ఇప్పటికీ సరైన జీతాలు లేక తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని వైద్యమిత్రలు విన్నవించారు. సోమవారం ప్రకాష్‌నగర్‌లోని ఎన్టీఆర్ వైద్యసేవ కార్యాలయం ముందు శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. తాము ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో ఆస్పత్రికి, రోగులకు మధ్య అనుసంధాన కర్తలుగా వుంటూ పేద ప్రజలకు సేవలు అందజేస్తున్నామన్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబపోషణ భారంగా మారిందన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, తమ సర్వీసుని పరిగణనలోకి తీసుకొని ట్రస్ట్ ఉద్యోగిగా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని కోరారు. ఉద్యోగ విరమణ తరువాత కుటుంబానికి రూ.15లక్షల గ్రాడ్యూటీ ఇవ్వాలని, అంతర్గత ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. గోగులమ్మను తాకిన సూర్య కిరణాలు పెదపులివర్రు (భట్టిప్రోలు): పెదపులివర్రు గ్రామ దేవత శ్రీ గోగులమ్మను సోమవారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. ఏటా ఫాల్గుణ నెలలో అమ్మ విగ్రహంపై కిరణాలు ప్రసరిస్తాయని అర్చకులు దీవి గోపి తెలిపారు. ఈ అపురూప దృశ్యాన్ని భక్తులు దర్శించుకుని తరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మత్స్యావతారంలో శ్రీవారు మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారి ఆస్ధాన అలంకార ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. కై ంకర్యపరులుగా హైదరాబాద్‌కు చెందిన దూర్జటి మధుసూధనరావు, చెంచు వెంకట సుబ్బారావులు వ్యవహరించారు. ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మిళ్లూరి రామచంద్ర శర్మ, కృష్ణవేణి దంపతులు వ్యవహరించారు. -
కాల్ మనీ.. కేటుగాళ్లు
చీరాల: చీరాల పట్టణం, రూరల్ మండంలోని గ్రామాలు, వేటపాలెం మండలంలోని గ్రామాల్లో కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని రోజువారీ కూలీలకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి రోజువారీగా వసూలు చేస్తూ పేదల రక్తాన్ని వడ్డీలతో పీల్చుకు తాగుతున్నారు. ఇలా చీరాలలో కాల్‌మనీ కేటుగాళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఇల్లు రాసివ్వడం, లేదంటే ఊరు వదిలి వెళ్లిపోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. రూ.100కు వడ్డీ రూ.30 వరకు.. కాల్‌మనీ వ్యాపారులకు అసలు కంటే వడ్డీపైనే ఆశ ఎక్కువ. పేదల అవసరాలను క్యాష్ చేసుకుంటూ లక్షలు గడిస్తున్నారు. అత్యవసరమై ఈ కాల్‌మనీ వ్యాపారి వద్ద రూ.10 వేలు వడ్డీకి తీసుకుంటే ఆ అప్పు చెల్లించే నాటికి రూ.40 వేలు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి. పట్టణంలోని శివారు కాలనీలో చేతివృత్తులు చేసుకునే వారు. రోజువారీ కూలీలు, రిక్షా కార్మికులు వీరిబారిన పడి ఆస్తులను పోగొట్టుకొంటున్నారు. ఒక్కో వ్యాపారి సగటున నెలకు వడ్డీల రూపంలో రూ.10 లక్షలు గడిస్తున్నారని సమాచారం. ఆర్థిక అవసరాలే క్యాష్.. చీరాల పట్టణంలో పేదలు అధికంగా నివసించే దండుబాట, పాలేటి నగర్, దళిత వాడలు, తమిళ కాలనీలు, స్వర్ణరోడ్డు, గాంధీనగర్, ఆనందపేట, వైకుంఠపురం, విఠల్‌నగర్, హరిప్రసాద్‌నగర్, హయ్యర్‌పేట, థామస్‌పేట, గొల్లపాలెం తదితర ప్రాంతాల్లోని పేదలే ఈ కాల్‌మనీ కేటుగాళ్లకు ఆవాస కేంద్రాలు. పేదప్రజల ఆర్థిక అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు. చీరాల మండలంలోని ఈపురుపాలెం శివారు కాలనీలు, సాయికాలనీ, తోటవారిపాలెం, సాల్మన్ సెంటర్, రామకృష్ణాపురం, కొత్తపాలెం, చీరాలనగర్ గ్రామాలతో పాటుగా వేటపాలెంలోని ఆరు గ్రామ పంచాయతీల్లో కాల్‌మనీ ఆగడాలకు పెట్రేగిపోతున్నాయి. తీసుకున్న అప్పులకు చక్రవడ్డీలు చెల్లించలేక ఉన్న ఒక్క ఇంటిని వారికి ఇచ్చి ఆ పేదలు ఊరి వదిలి వెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి. మళ్లీ పుట్టగొడుగుల్లా మైక్రో ఫైనాన్స్ సంస్థలు.. పేదలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కాల్ మనీ వ్యాపారులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు మళ్లీ వచ్చాయి. శాతవాహన, మారుతీ, సునీత, షేర్, స్పందన తదితర మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ వ్యాపారాలు ప్రారంభించాయి. ఇవే కాక కొన్ని స్టార్ ఫైనాన్సియర్లు పేదల ఇళ్లను తాకట్టుపెట్టుకుని అధిక వడ్డీలు చెల్లించలేక వారి ఇళ్లను లాక్కుంటున్నారు. అడ్డుకట్ట వేయలేకపోతున్న ప్రభుత్వం.. కాల్‌మనీ, ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు పెట్రేగిపోతున్నా, పలు ఫిర్యాదులు అందుతున్నా కానీ అధికారులు, ప్రభుత్వ పెద్దలు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కాల్‌మనీ వ్యాపారాలు చేసే వారిలో చాలామంది టీడీపీ నేతల అనుచరులు, వారి నాయకుల వెనుకుండి వ్యాపారాలు చేయిస్తున్నారు. చీరాలపై పగడవిప్పిన పైశాచికం రూ.80 వేల ఇచ్చి రూ.5.75 లక్షలు ఇవ్వాలంటూ ఓ రౌడీషీటర్ బెదిరింపు ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలు మళ్లీ విస్తరిస్తున్న మైక్రో ఫైనాన్స్ వ్యాపారాలు ‘జోగి ముత్యాలమ్మ. ఆమెది చీరాల వైకుంఠపురం. వయసు 67 ఏళ్లు. ఇంటి అవసరాలకు రౌడీ షీటర్, ఫైనాన్స్ వ్యాపారి చంద్రశేఖరరెడ్డి వద్ద రూ.80 వేలు విడతల వారీగా వడ్డీకి తీసుకుంది. అప్పును తీర్చేందుకు చంద్రశేఖరెడ్డి వద్దకు పలుమార్లు వెళ్లింది. ఇప్పుడు డబ్బులు వద్దు.. తర్వాత తీసుకుంటానులే.. అని సున్నితంగా తిరస్కరించేవాడు. కొద్ది రోజుల తర్వాత అసలు, వడ్డీతో కలిపి రూ.5.75 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఆమె నివాసం కానీ నగదు కానీ ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో ఆ వృద్ధురాలు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది’. దీంతో బాధితురాలిని చికిత్స కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు కావస్తుంది. -
మెడికల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలి
ధర్నాకు దిగిన జిల్లాలోని సీహెచ్‌వోలు బాపట్లటౌన్: సిబ్బందిని వేధింపులకు గురిచేయడంతోపాటు మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి కారణమైన యద్దనపూడి మెడికల్ ఆఫీసర్ పమిడి శ్రీహర్షపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ జిల్లాలోని సీహెచ్‌వోలు (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)లు సోమవారం డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం ఎదుట ధర్నాచేశారు. బాధితురాలు పసుపులేటి సరోజిని మాట్లాడుతూ యద్దనపూడి మండలం పెద జాగర్లమూడి గ్రామంలో మూడు సంవత్సరాలుగా సీహెచ్వోగా విధులు నిర్వర్తిస్తున్నానని, నేను మెటర్నిటీ లీవ్‌పై వెళ్లి తిరిగి జాయిన్ అయ్యానని తెలిపారు. అప్పటికే నా రికార్డులు, నా శాఖకు సంబంధించిన పరికరాలు లేవని, ఏమయ్యాయని ఆశా వర్కర్, ఏఎన్ఎంలను అడిగితే సరైన సమాధానం చెప్పలేదని తెలిపింది. రికార్డులు మొత్తం రాసుకున్నానని, రూ.20 వేలు ఖర్చుచేసి పరికరాలను కొనుగోలు చేశానని తెలిపింది. మరోసారి 9 నెలల తర్వాత మరలా రికార్డులు తారుమారుచేశారని, పరికరాలను మాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళితే ఆయన నొటికొచ్చినట్లు మాట్లాడటమే కాకుండా ఎఫ్‌ఆర్‌ఎస్‌లో వేలిముద్ర కూడా వేయనియ్యకుండా మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని తెలిపింది. మనస్తాపం చెందిన ఈనెల 8న గుంటూరులోని స్వర్ణాంధ్రనగర్లో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్న మెడికల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ జిల్లాలోని సీహెచ్‌వోలు, ఎంఎల్హెచ్పిలు ధర్నాచేశారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ధర్నా కొనసాగుతూనే ఉంది. డీఎంఅండ్‌హెచ్‌వో అందుబాటులో లేకపోవడంతో ధర్నా విరమించారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ధర్నాను కొనసాగిస్తామని సీహెచ్‌వోలు డిమాండ్ చేస్తున్నారు. -
ఉమ్మారెడ్డి గృహ ప్రవేశానికి సజ్జల హాజరు
స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, కార్యక్రమానికి హాజరైన అందరినీ పలకరించారు. అంతకు ముందు బాపట్ల నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు సజ్జలకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కాగితపు సుధీర్‌బాబు, మండల అధ్యక్షుడు ఎం.కొండలరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, ఆర్టీఐ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జోగి రాజా, వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సోహిత్ పాల్గొన్నారు. తొలుత ఆయనకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. -
అ‘పరిష్కార వేదిక’
సమస్యలతో పోరాడుతున్న హృదయాలు అధికారుల కరుణ కోసం నిరంతరం శ్రమిస్తూ ఓడిపోతున్నాయి. వేదనాభరితమై రగిలిపోతున్నాయి. అయినా కర్కశ యంత్రాంగం దయ చూపడం లేదు. నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. గుండె గోడు పట్టించుకోవడం లేదు. పైగా సమస్య పరిష్కారమైపోయినట్టు మాత్రం రికార్డుల్లో నమోదు చేసుకుంటోంది. ఫలితంగా పేదలు సతమతమవుతున్నారు. మళ్లీ అర్జీలు చేతబట్టి వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్ మెట్లు ఎక్కుతున్నారు. ఈ ని‘వేదనల’ పర్వానికి ముగింపు పలికేదెప్పుడో సర్కారే చెప్పాలి. వీఆర్వోనే కబ్జా చేశాడు నాకు ఖాతా 70 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిని నేను 2006లో తేళ్ళ సువార్తమ్మ దగ్గర కొనుగోలుచేశాను. నా పేరుతో అడంగల్, 1బీ ఉన్నాయి. ఇటీవల నా పొలంలో నుంచి 10 సెంట్లు భూమిని మార్టూరు మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న తేళ్ల అంజయ్య తన పేరుతో ఆన్లైన్ చేసుకున్నాడు. న్యాయం కోసం తహసీల్దార్, కలెక్టరేట్ చుట్టూ ఆరునెలలుగా తిరుగుతున్నా.. ఇప్పటికీ ఫలితం లేదు. వచ్చిన ప్రతిసారి రూ.1,000 ఖర్చు అవుతుంది. సమస్యమాత్రం పరిష్కారం కావడం లేదు. – రామమూరి ప్రభాకరరావు, కొరిశపాడు బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) అధికారులంతా ఒక్కచోట ఉండే వేదిక. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించే అద్భుత కార్యక్రమం. ప్రతి సోమవారం కలెక్టరేట్, పోలీసు జిల్లా కార్యాలయాలతోపాటు డివిజన్, మండల స్థాయి కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. గత ప్రభుత్వ పాలనలో స్పందన పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. వచ్చిన ప్రతి అర్జీ పరిష్కారానికి అప్పటి సర్కారు చిత్తశుద్ధితో కృషి చేసింది. ఒక వేళ ఆ అర్జీ పరిష్కరించదగినది కాకపోతే బాధితులకు అర్థమయ్యేలా వివరించి.. మానవతా దృక్పథంతో వారికి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో న్యాయం చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఫలితాలు రాబట్టింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రీవెన్స్ అభాసుపాలవుతోంది. సమస్యలు పరిష్కారం కావడం లేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అయినా అధికారులు సమస్యలు పరిష్కారమైనట్టు సందేశాలు పంపిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక ఆవేదన చెందుతున్నారు. మాటలతో పరిష్కారమైనట్టేనా..! వాస్తవానికి ఒక అర్హత కలిగిన వ్యక్తి పెన్షన్ కోసం అర్జీ పెట్టుకుంటే.. ఆ పింఛన్ నగదు అతని చేతికి అందినప్పుడే ఆ సమస్య పరిష్కారమైనట్టు.. అయితే అధికారులు వింత పోకడలు పోతున్నారు. పెన్షన్ త్వరలో మంజూరు చేస్తామని సమాధానం ఇచ్చి ఆ అర్జీ పరిష్కారమైనట్టు చూపిస్తున్నారు. అలాగే రోడ్డు కోసం అర్జీ వస్తే నిధులు రాగానే పూర్తిచేస్తామని చెప్పి అర్జీని క్లోజ్ చేస్తున్నారు. ఇలా సమాధానాలతో సమస్యలు పరిష్కారమైనట్టేనా అని అడిగితే అధికారుల వద్ద జవాబు లేదు. అవినీతి తాండవం ముఖ్యంగా రెవెన్యూ అర్జీల విషయంలో అవినీతి పెచ్చుమీరిందనే వాదన అర్జీదారుల నుంచి వ్యక్తమవుతోంది. ఉదాహరణకు భూముల సంబంధిత అంశాలపై అధికారుల వద్దకు వెళితే సర్వేయర్లు, వీఆర్వోలు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లేకుంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని పెడసరిగా సమాధానం చెబుతున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల వద్దకు వెళ్లినా.. మళ్లీ కిందిస్థాయి సిబ్బంది వద్దకు రావాల్సిందే.. అప్పుడైనా ముట్టజెప్పాల్సిందేనని అర్జీదారులు చెబుతున్నారు. వేలల్లో అర్జీలు.. పదుల్లో పరిష్కారం సాకులు చూపి తప్పుకుంటున్న అధికారులు పరిష్కారం కాకున్నా ఫోన్లకు క్లియరెన్స్ సమాచారం మెసెజ్‌లు చూసి నివ్వెరపోతున్న బాధితులు నెలల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు -
పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
ఈనెల 12వ తేదీ రాత్రి పట్టణానికి చెందిన వేమవరపు విజయ్‌కుమార్, మరో 10 మందితో కలసి పట్టణంలోని ఏబీఎం హైస్కూల్ గేటు, రూముల తాళాలను పవర్కట్టర్తో కట్‌చేసి స్కూల్లోని విద్యుత్‌మోటారు, విలువైన వస్తువులను తస్కరించారు. ఈ విషయంపై ఈనెల 13న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాం. పట్టించుకోవడం లేదు. పైగా ఫిర్యాదుదారులను రోజుమార్చి రోజు స్టేషన్‌కు పలిచి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. నిందితులు మాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. చర్యలు తీసుకోవాలి. –డి.జాన్ప్రసన్నబాబురావు, ఎస్.రోజన్‌బాబు, సెక్రటరిలు ఏబీఎఫ్‌ఎంఎస్ ప్రొటెక్షన్ కస్టోడియన్ -
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ఆందోళనకు దిగిన ఆరోగ్యమిత్రలు బాపట్లటౌన్: ఏళ్ల తరబడి డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేస్తున్నా...మా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బడుగు రాజు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. రాజు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేస్తున్నా మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. అనేక పర్యాయాలు దరఖాస్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో శాంతియుత నిరసన తెలియజేస్తున్నామన్నారు. వైద్యసేవ పథకంలో పనిచేసే ప్రతి ఒక్కరిని ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం అమలుచేయాలి, వైద్యసేవ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియో, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు అందించాలి. అర్హత ప్రకారం ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్య మిత్రల నిరసన గుంటూరు మెడికల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కొరతూ సోమవారం విధులు బహిష్కరించారు. గుంటూరులోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమారి, జిల్లా అధ్యక్షుడు జాకీర్‌హుస్సేన్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. పసుపు రైతులకు పరిహారం చెల్లించాలని వినతి తెనాలి: దుగ్గిరాలలోని శుభమ్ మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాదంలో దగ్ధమైన పసుపునకు ప్రభుత్వం ఇచ్చిన హామీప్రకారం పరిహారాన్ని త్వరితగతిన చెల్లించాలని బాధిత రైతులు తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహకు విజ్ఞప్తి చేశారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. 296 మందికి రూ.15 కోట్ల బీమా క్లెయిమ్ అయినట్టు సబ్‌కలెక్టర్ వెల్లడించారు. పరిహారం అందకపోవటంతో రైతులు ఆర్థిక సమస్యలతో అవస్థలు పడుతున్నారని చెప్పారు. -
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
తెనాలి టౌన్: రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం.విజయసునీత పేర్కొన్నారు. మంగళవారం తెనాలి నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. రూరల్ మండలం ఖాజీపేట, హాఫ్‌పేట పరిధిలో రైతులు వేసిన పెసర పంటను పరిశీలించారు. గిట్టుబాటు ధరను తెలుసుకున్నారు. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. దీంతో వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. కొల్లిపర మండలంలో అత్తోట గ్రామంలో పర్యటించి తెల్లజొన్నను పరిశీలించారు. క్వింటాకు రూ.2,200 ధర లభిస్తున్నట్లు రైతులు తెలియజేశారు. కొల్లిపరలో పసుపు రైతులతో మాట్లాడారు. క్వింటా రూ.8000 – రూ.11,000 మధ్య ఉందని రైతులు పేర్కొన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని ఆమె సూచించారు. మార్కెటింగ్ శాఖ విజయవాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కాకుమాను శ్రీనివాసరావు, గుంటూరు సహాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు డి.రాజాబాబు, తెనాలి, దుగ్గిరాల మార్కెట్‌యార్డు కార్యదర్శులు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ జె.కృష్ణారావు, జీడీసీఎంఎస్ గుంటూరు బిజినెస్ మేనేజర్ హరిగోపాల్ పాల్గొన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సంచాలకులు -
తహసీల్దార్ దురుసుగా ప్రవర్తించారు
నాకు తోటవారిపాలెం రెవెన్యూ పరిధిలో ఎకరం భూమి ఉంది. మేము 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. నా పేరుతో రికార్డులన్నీ ఉన్నాయి. నా భర్త జేమ్స్ మూడేళ్ల క్రితం చనిపోయారు. నా కొడుక్కి పక్షవాతం వచ్చి మంచంలోనే ఉంటున్నాడు. నేను వ్యవసాయం చేయలేక మూడేళ్ల క్రితం భాగ్యరాజు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాను. మాకు తెలియకుండా మా పొలాన్ని అతనిపేరుతో ఆన్లైన్ ఎక్కించుకొని ఏడాది నుంచి కౌలు ఇవ్వడం లేదు. అడిగితే నీకు దిక్కున్నచోట చెప్పుకోమన్నాడు. తహసీల్దార్ దగ్గరకు వెళితే దురుసుగా ప్రవర్తించారు. కాగితాలు నీ మొహాన వేసి కొట్టుకో అంటూ దుర్భాషలాడారు. న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీసుకు ఇప్పటికి మూడు సార్లు వచ్చాను. అయినా పరిష్కారం కాలేదు. – దేవరపల్లి ఏలిశమ్మ, బుర్లవారిపాలెం, చీరాల మండలం -
విశ్రాంత ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
బాపట్లటౌన్: సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడూరి ఏకాంభీశ్వరబాబు తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే అందజేయాలని కోరారు. జూలై 1, 2018, జనవరి 1, 2019 నాటి డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. వీటితోపాటు మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ అందజేయాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్ల వారికి 10 శాతం, 75 ఏళ్ల వారికి 15 శాతం, 80 ఏళ్ల వారికి 20 శాతంగా పునరుద్ధరణ చేయాలని సూచించారు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డులతో ఉచిత వైద్యం అందించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తాలూకా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వై.వి.నరసింహారావు, కార్యదర్శి పి.వి.ప్రసాద్, కోశాధికారి సుబ్బారావు, జనరల్ సెక్రెటరీ ఎన్. సిద్దయ్య, కోశాధికారి ఎం.వి బ్రహ్మం పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన -
నెలల తరబడి తిరుగున్నా.. ఫలితం లేదు
నాకు గోకరాజు పాలెం రెవెన్యూపరిధిలో 3.90 ఎకరాలు, మంగలపాలెం పరిధిలో 40 సెంట్లు, వాదలో ఎకరం మొత్తం కలిపి 4.90 ఎకరాల భూమి ఉంది. ఖాజీపాలెంలో మరో 16 సెంట్ల స్థలంలో ఇల్లు ఉంది. నా భర్త సూర్యనారాయణ చనిపోయారు. నాకు 80 ఏళ్లు. నలుగురు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. నా పేరుతో ఉన్న ఆస్తిని నా పెద్దకొడుకు నాకు తెలియకుండానే తన పేరుతో ఆన్లైన్లో నమోదు చేయించుకున్నాడు. నన్ను, మిగిలినవారిని దిక్కులేనివారిగా చేశాడు. గ్రామంలోని లైబ్రరీలో బతుకుతున్నాను. ఇంట్లో జరగకపోవడంతో పొలం పనులకు వెళ్తున్నా. అధికారులు స్పందించి నా ఆస్తిని నాకు చెందేలా చూడాలి. మూడునెలలుగా తిరుగుతున్నా.. ఫలితం లేదు. – వారణాసి మూర్తి శ్యామల, ఖాజీపాలెం, పిట్టలవానిపాలెం మండలం -
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
● అర్జీదారులకు అన్నదానం ● జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి బాపట్లటౌన్ : జిల్లా నలుమూలల నుంచి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కార్యాలయానికి వచ్చే బాధితులకు అన్నదానం చేయటం సంతృప్తికరంగా ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల్లో సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చే అర్జీదారులకు జిల్లా కలెక్టర్ సోమవారం భోజన సౌకర్యాలను కల్పించారు. ప్రజా సమస్యలపై సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సమస్యలను చూసి అక్షయ పాత్ర ఆధ్వర్యంలో భోజనం తయారు చేయించి అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్యాలను చేరుకోవాలి ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని మిర్చిపంటలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. జిల్లాలో విద్యాశాఖ, రోడ్లు, భవనాలు, ఐటీఐ, మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపాల్టీలో చెత్త నిర్వహణ, వైద్య విధాన పరిషత్ శాఖల పనితీరు సరిగా లేదన్నారు. ఆయా శాఖల అధికారులు పనితీరు మార్చుకోవాలన్నారు. సర్వే పారదర్శకంగా చేయాలి గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహించే పలు సర్వేలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా త్వరితగతిన పూర్తిచేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. సచివాలయాల్లోని సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయడంలో జిల్లా వెనుకబడి ఉందని, ఏప్రిల్ మాసం నుంచి బయోమెట్రిక్ ఆధారంగానే జీతభత్యాల చెల్లింపులు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జేసీ ప్రఖర్‌జైన్, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు. నాటుసారానూ పూర్తిగా నిర్మూలించాలి నాటుసారాను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నవోదయం 2.0 పోస్టర్లను ఆవిష్కరించారు. -
మేదరమెట్లకు వైఎస్ జగన్.. వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు వైఎస్ జగన్. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్.అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. ఈ రోజు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. -
భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
పాయకాపురం(విజయవాడరూరల్): మహిళతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై నున్న పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పాయకాపురం ఎల్బీఎస్ నగర్‌కు చెందిన పల్లపు నాగదుర్గ ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పొలం పనులు చేసుకునే ఆమెకు సత్తెనపల్లికి చెందిన కొక్కిలిగడ్డ మోజెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి విజయవాడ వస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నాగదుర్గ కోరగా ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె సత్తెనపల్లి వెళ్లి మోజెస్ తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. అతను రెండు నెలల్లో పెళ్లి చేసుకొంటానని చెప్పి గుంటూరు నెహ్రూనగర్ పాత బస్‌స్టాండ్ వద్ద రూమ్ తీసుకొని కొన్ని నెలలు కాపురం చేసి వెళ్లిపోయాడు. నాగదుర్గ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పేద ఖైదీలకు ఉచిత న్యాయసహాయం
సత్తెనపల్లి: ఆర్థిక స్తోమత లేని పేద రిమాండ్ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ పార్థసారథి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార కమిటీ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జియావుద్దీన్‌తో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను, ఆహారం, దానికి ఉపయోగించే సరుకుల నాణ్యతను పరిశీలించారు. అంతేకాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలించి అన్ని అంశాల పై సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్‌కుమార్ రెడ్డి, సత్తెనపల్లి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) తౌషిద్ హుస్సేన్, ప్యానల్ న్యాయవాది బి.ఎల్.కోటేశ్వరరావు, సబ్ జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం, తదితరులు ఉన్నారు. జిల్లా న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ పార్థసారథి సత్తెనపల్లి సబ్‌జైలు సందర్శన -
బలమైన పోరాటాలు అవసరం
లక్ష్మీపురం: అణగారిన వర్గాలు, పేదల సమస్యల పరిష్కారం కోసం బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఉన్న మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన రెండు రోజుల రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలలో భాగంగా ఆదివారం మొదటి రోజు వర్క్‌షాప్‌ను సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వాలు చెబుతున్న దానికి, ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన లేకుండా ఉందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు గ్రామీణ పేదలు, చేతివృత్తుల వారికి నూతనంగా ఒక్క స్కీమ్ తీసుకువచ్చారా? అంటూ ప్రశ్నించారు. మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేంద్రం చూస్తోందన్నారు. లిఫ్టిక్ సంస్థ డైరెక్టర్ చక్రధర్ బుద్ద, డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రావు, అఫీస్ బేరర్స్ కాబోతు ఈశ్వరరావు, బి. వెంకటేశ్వరరావు, బి. కేశవరెడ్డి, చిలుకూరి వెంకటేశ్వరరావు, ఆర్.విజయ, సి.సుబ్రమణ్యం, కరిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం
అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ బాపట్ల టౌన్: పొట్టి శ్రీరాములు జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ తెలిపారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు 124 వ జయంతిని ఆదివారం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణ త్యాగం చేసిన ఘనుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, పలుమార్లు జైలుకు వెళ్లిన గాంధేయవాది అన్నారు. ఆంధ్రుల కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఖ్యాతిని ప్రతి తెలుగు వారు గుర్తు పెట్టుకోవాలని ఆయన తెలిపారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం అహర్నిశలు కృషి చేయాలని యువతకు ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ నారాయణ, ఆర్ఎస్ఐ సుధాకర్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయకపోతే సమ్మె
వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కారరావు గుంటూరు మెడికల్: ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్య వర్గ సమావేశం ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న డ్రైవర్స్ అసోసియేషన్ హాలులో జరిగింది. ముఖ్యఅతిథిగా వచ్చిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆస్కార రావు మాట్లాడుతూ తాము ప్రభుత్వం ముందు ఉంచిన సమస్యలన్నీ ఆర్థికేతర అంశాలేనని చెప్పారు. తమ సంఘం తరఫున సుమారు 28 డిమాండ్లను లిఖిత పూర్వకంగా తెలియజేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం నేటికీ వాటిని పరిష్కరించిన పాపానపోలేదని వాపోయారు. ఇక పోరాటం తప్పదని తేల్చి చెప్పారు. త్వరలో సమ్మె నోటీసు జారీ చేస్తామన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆహారోన్ మాట్లాడుతూ తమ సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా ఉద్యమానికి జిల్లా శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు సత్వరమే మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలన్నారు. సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ సాగర్ మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన సమయం అసన్నమైందన్నారు. ముఖ్య సలహాదారు రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు సాగర్, రాష్ట్ర కోశాధికారి బాబా సాహెబ్, ఉపాధ్యక్షులు లక్ష్మీ నారాయణ, కృష్ణారెడ్డి, సయ్యద్ చాంద్ బాషా, దుర్గా ప్రసాద్, సత్యనారాయణ బాబు, అపరంజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తులసీ తన్మయ్‌కు బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల నర్సింగ్ విద్యార్థిని వి.తులసీతన్మయ్ తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు ఆదివారం తెలిపారు. తెనాలిలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 5వ గుంటూరు (జిల్లా) ఆహ్వాన తైక్వాండో చాంపియ న్షిప్–2025 పోటీలో తులసీ తన్మయ్ 49 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించినట్టు వివరించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి, నర్సింగ్ విభాగం ఇన్చార్జి ఏవీఎన్ గుప్త అభినందించారు. సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై కేసు పాయకాపురం(విజయవాడరూరల్): మహిళతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై నున్న పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పాయకాపురం ఎల్బీఎస్ నగర్‌కు చెందిన పల్లపు నాగదుర్గ ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పొలం పనులు చేసుకునే ఆమెకు సత్తెనపల్లికి చెందిన కొక్కిలిగడ్డ మోజెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి విజయవాడ వస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నాగదుర్గ కోరగా ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె సత్తెనపల్లి వెళ్లి మోజెస్ తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. అతను రెండు నెలల్లో పెళ్లి చేసుకొంటానని చెప్పి గుంటూరు నెహ్రూనగర్ పాత బస్‌స్టాండ్ వద్ద రూమ్ తీసుకొని కొన్ని నెలలు కాపురం చేసి వెళ్లిపోయాడు. నాగదుర్గ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ ఆత్మహత్య నరసరావుపేట టౌన్: కేసానుపల్లిరోడ్డులోని టిడ్కో గృహాల పక్కనే ఉన్న రైలుపట్టాలపై ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుంటూరు –డోన్ ఎక్స్‌ప్రెస్ కింద పడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుందని రైల్వే ఎస్ఐ శ్రీనివాసనాయక్ తెలిపారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో భద్రపర్చామన్నారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను 94404 38256, 70136 00365 నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
జాతీయ భావంతో విద్యార్థుల నిర్మాణం లక్ష్యం
ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు నూజెండ్ల శ్రీనివాసరావు బాపట్ల: విద్యార్థుల సమస్యలపై పోరాటంతో పాటు వారిని జాతీయ భావాలతో నిర్మాణాత్మక తీర్చిదిద్దడమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లక్ష్యం అని రాష్ట్ర అధ్యక్షులు నూజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపం ప్రాంగణంలో ఆదివారం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. తొలుత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ రీడర్ యు. వరలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూజెండ్ల మాట్లాడుతూ విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. వరలక్ష్మి మాట్లాడుతూ 50 సంవత్సరాల కిందట మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఏబీవీపీ కార్యక్రమాల్లో చేపట్టిన పనులను గుర్తు చేసుకున్నారు. నేటి యువత సమాజంలో రుగ్మతలు రూపుమాపటానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సదస్సుకు వచ్చిన ఏబీవీపీ యువ కెరటాలకు అభినందనలు తెలిపారు. దక్షిణ భారత సంఘటన కార్యదర్శి ఎస్. శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకై క విద్యార్థి యూనియన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని పేర్కొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాగంటి వెంకట గోపి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంటనే డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువతకు నిరుద్యోగ భృతి నెలకు రూ. 3000 అందజేస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు 10 నెలలు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు వెంటనే భృతి అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదులో ఉండిపోయాయని, వాటిని తిరిగి రాష్ట్రంలో నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సూళ్లూరు యాచేంద్ర, వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, న్యాయవాది కళ్లం హరినాథ్‌రెడ్డి, అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్, నంగు ఏడుకొండలురెడ్డి, వల్లూరి భావన్నారాయణ, మామిడి రాజశేఖర్, బాలాజీ, బిల్లూరి భావన్నారాయణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్. సుమన్, రాష్ట్ర కార్యదర్శి పవన్, రఘు పాల్గొన్నారు. -
వైభవంగా పునః ప్రతిష్ట మహోత్సవాలు
గొరిగపూడి(భట్టిప్రోలు): మండలంలోని ప్రసిద్ధి గాంచిన గొరిగపూడి శ్రీ భ్రామరీ దుర్గాదేవి సమేత శ్రీ నాగేశ్వరస్వామి దేవస్థానం జీవధ్వజ విమాన గోపుర శిఖర సహిత పునః ప్రతిష్ట మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రాచీన ఆలయం జీర్ణోద్ధరణ గొప్ప కార్యమని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు కోటి రూపాయలు, మేరుగ నాగార్జున రూ. 25 లక్షలు, పూర్వ గ్రామ కరణం, పులిగడ్డ వారి వంశస్తులు రూ. 25 లక్షలు అందించారు. గ్రామస్తులు వెండి సామగ్రి అందజేశారు. ఆదివారం మధ్యాహ్నం శాంతి కల్యాణం అనంతరం అన్న సంతర్పణ జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గరిగపాటి మల్లిక–వెంకటేశ్వరరావు, ఆలయ అర్చకులు ఆమంచి సృజన్ కుమార్, కార్యనిర్వాహణాధికారి పాపని రాజేశ్వరరావు పాల్గొన్నారు. గొరిగపూడిలో నాగేశ్వరస్వామి ఆలయం పునరుద్ధరణ రూ.1.50 కోట్లతో నిర్మాణం -
ఇద్దరు గంజాయి విక్రేతలు అరెస్టు
ప్రత్తిపాడు: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను వట్టిచెరుకూరు పోలీసులు అరెస్టు చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషనులో ఆదివారం విలేకరులతో సీఐ ఎం. రామానాయక్ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన అల్లం సాయి సాంబశివరావు ఉరఫ్ సాయి, అల్లం నరేంద్ర ఉరఫ్ నానిలు విలాసాలకు అలవాటై దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల కిందట ముట్లూరులోని అల్లం కిరణ్ కుమార్ ఇంట్లో, ఆయనకు చెందిన సాత్విక వే బ్రిడ్జిలో దొంగతనానికి పాల్పడ్డారు. ఆ డబ్బుతో కేజీల్లో గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లు పరిసర గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి లేమల్లెపాడు నుంచి ముట్లూరు వెళ్లే డొంకలో బాపయ్య చెరువు రావి చెట్టు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బృందాలుగా వెళ్లారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు చిన్న బంగారు ఉంగరాలు, ఒక జత వెండి పట్టీలు, రెండు కేజీల గంజాయి, కంప్యూటర్ సీపీయూ, మోనిటర్, హెచ్‌పీ ప్రింటర్, దొంగతనాలకు వినియోగిస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లం సాంబశివరావును పోలీసులు విచారించగా గతంలో గ్రామ సచివాలయంలో దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించాడని సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకే కాన్పులో ముగ్గురు జననం గుంటూరు మెడికల్: హైదరాబాద్‌కు చెందిన పద్మావతి(24)కి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. నాటి నుంచి పిల్లలు లేక అనేక ఆసుపత్రులకు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు సిటిజన్ హాస్పిటల్‌కు చికిత్స కోసం వచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి వైద్య పరీక్షలు చేసి సంతాన చికిత్స అందించారు. గర్భం దాల్చి ఆదివారం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ముగ్గురు ఆడశిశువులని, ఇరువురు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు. వైద్య చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా సహకారం అంంచినట్లు పేర్కొన్నారు. -
టీడీపీలో పెరుగుతున్న వర్గపోరు
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకగా పోటాపోటీ కార్యక్రమాలు చీరాల: చీరాల తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రోజురోజుకు అధికమవుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ రెండు గ్రూలులుగా విడిపోయారు. చివరకు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలో వివాదం మొదలైంది. ఎంపీ వర్గీయులకు చెందిన పొక్లెయిన్లను ఎమ్మెల్యే వర్గీయులు తగలబెట్టారనే కారణంతో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు రెండుగా చీలిపోయాయి. చాపకింద నీరులా ఇది పెరిగిపోయింది. ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంత్యుత్సవం సందర్భంగా రెండు వర్గాలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. రైల్వే బోర్డు మెంబర్‌గా ఉన్న ఎంపీ వర్గీయుడైన పఠాన్ ఆధ్వర్యంలో నాయకులంతా కలసి కామథేను కాంప్లెక్స్ వద్దనున్న శ్రీరాములు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజే ష్, గవిని ప్రసాద్, నక్క ప్రకాష్, జంగా జ్యోతిప్రసాద్, గవిని మణికుమార్, శ్రీరాం రమేష్, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. కొద్ది సేపటి అనంతరం ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య అనుచరులు కూడా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణాద్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు, బీసీసెల్ అద్యక్షుడు కౌతవరపు జనార్దన్, ఎంఆర్ఎఫ్ రమేష్, ఉల్లిపాయల సుబ్బయ్య, గూడూరి శివరాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యకు ఎంపీ తెన్నెటి కృష్ణప్రసాద్ మధ్య కొద్ది నెలలుగా కోల్డ్‌వార్ జరుగుతోంది. ఎంపీ చీరాలలో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలను నిర్వహించడం విశేషం. చీరాలలో మొదటిసారిగా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించారు. -
నల్ల బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయించాలి
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి జె.పంగులూరు: నల్ల బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి కోరారు. పంగులూరు మండలంలోని చందలూరు దళిత కాలనీ కౌలు రైతులతో సీపీఎం ప్రచార యాత్ర నాయకులు ఆదివారం మాట్లాడారు. పొగాకు అమ్ముడు పోక, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని రైతులు తెలిపారు. పంట నష్టపరిహారాలు కూడా అందటం లేదని, రాయితీలు కూడా భూ యజమానులకే అందుతున్నాయని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీపీఎం కార్యవర్గ సభ్యురాలు రమాదేవి మాట్లాడుతూ బర్లీ పొగాకును కూడా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు కంపెనీలు ఇస్టానుసారంగా ధరలు తగ్గించడం, ఆలస్యంగా కొనడంతో రైతులు నష్టపోతున్నారని ఆమె తెలిపారు. సీపీఎం బాపట్ల కార్యదర్శి సీహెచ్. గంగయ్య మాట్లాడుతూ కౌలు రైతులంగా ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఐకమత్యంతో ఏదైనా సాధించగలమని చెప్పారు. హక్కుల కోసం పోరాడాలని, దాని కోసం సంఘాలుగా ఏర్పడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు రాయిని వినోద్‌బాబు, పార్టీ మండల కార్యదర్శి రామారావు, ప్రభాకర్, సుధాకర్, కౌలు రైతులు పాల్గొన్నారు. -
అందని నీరు.. ఎండుతున్న పైరు
బల్లికురవ: రబీ సీజన్లో సాగుచేసిన మొక్కజొన్న, వరి పైర్లు చేతికందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగర్ అద్దంకి బ్రాంచ్ కాలువ పరిధిలో సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో సుమారు 16 వేల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. రబీలో రెండు మండలాల్లో కలిపి సుమారు 7 వేల ఎకరాల్లో మొక్కజొన్న, వరి, పశుగ్రాసం, కూరగాయల పంటలను రైతులు సాగు చేశారు. బ్రాంచ్ కాలువకు నీటి విడుదల తగ్గించటం, వారాబందీ విధానంతో పసుమర్రు, చెన్నుపల్లి, వెంపరాల, వైదన, గుంటుపల్లి, అద్దంకి మేజర్లకు సాగర్ నీరు అందటం లేదు. దీంతో పైర్లు ఎండిపోతున్నాయి. దీనికితోడు మార్చినెలాఖరు వరకే సాగర్ నీరు అందిస్తామని అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. 18/0 సంతమాగులూరు మండలం అడవి పాలెం వద్దకు 1,200 క్యూసెక్కులకు తగ్గకుండా 33/0 వల్లాపల్లి లాకుల వద్దకు 900 క్యూసెక్కులకు తగ్గకుండా చేరితేనే అన్ని మేజర్లకు నీరు అందే అవకాశం ఉంది. వారాబందీ, నీటి పంపిణీ తగ్గించడంతో వల్లాపల్లి లాకుల వరకు 500 క్యూసెక్కులు మాత్రమే అరకొరగా అందుతోంది దీనివల్ల చేలకు నీరు చేరడం లేదని రైతులు చెబుతున్నారు. ఏప్రిల్ 15 వరకు అందించాలి అద్దంకి బ్రాంచ్ కాలువ పరిధిలో మొక్కజొన్న, వరి, పశుగ్రాసం పైర్లు సాగులో ఉన్నాయి. వల్లాపల్లి లాకుల వరకు 900 క్యూసెక్కులకు తగ్గకుండా నీరందిస్తేనే ఎండుతున్న పైర్లను కాపాడుకోగలం. ఎకరాకు సుమారు 20 వేల వరకు పెట్టుబడులు పెట్టాం. నీరందకపోతే నష్టాలు తప్పవు. ఏప్రిల్ 15 వరకు నీరివ్వాలి. – నాయుడు శివయ్య, రైతు నిరంతరాయంగా నీరివ్వాలి వారాబందీ లేకుండా వల్లాపల్లి లాకుల వరకు 900 క్యూసెక్కులకు తగ్గకుండా నిరంతరాయంగా నీరు అందిస్తే ఎండుతున్న పైర్లను కాపాడుకోగలం. అరకొరగా అందుతున్న నీరు వల్ల ఉపయోగం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. అధికారులు ఆదుకోవాలి. – కొమ్మినేని భాస్కర్, రైతు ఆందోళనలో రైతులు -
టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
బాపట్లటౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి 31 వరకు జరగనున్న పరీక్షలకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 16,799 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో 16,361 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 438 మంది సప్లమెంటరీ విద్యార్థులు ఉన్నారు. వీరికోసం 103 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. హాల్ టికెట్లను ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థులకు అందజేశాయి. ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.పురుషోత్తమ్ హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని వివరించారు. పావుగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి వచ్చేలా విద్యార్థులు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించామని, ఈ ప్రాంతంలో జిరాక్స్, నెట్ సెంటర్లు తెరవరాదని వివరించారు. పరీక్షల నిర్వహణకు 103 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 103 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 29 మంది సీ కేటగిరి కస్టోడియన్లు, 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, పదిమంది రూట్ ఆఫీసర్లను నియమించినట్టు వెల్లడించారు. నేటి నుంచి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో 103 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు పకడ్బందీ బందోబస్తు : ఎస్పీ టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు చేపట్టినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని వివరించారు. ఒక్కో కేంద్రం వద్ద ఇద్దరు సిబ్బంది చొప్పున 206 మందిని నియమించామని పేర్కొన్నారు. వీరితోపాటు ప్రతి కేంద్రంలో ఎస్ఐ స్థాయి అధికారి పర్యవేక్షణకు ఉంటారని వెల్లడించారు. -
స్ఫూర్తిప్రదాత పొట్టి శ్రీరాములు
బాపట్ల: ప్రాణ త్యాగంతో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములును ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంత్యుత్సవం స్థానిక పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాల ఆవరణలో ఆదివారం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, అధికారులు, పుర ప్రముఖులు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ శ్రీరాములు పోరాటపటిమను, ప్రాణత్యాగాన్ని కీర్తించారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, డీఈఓ పురుషోత్తం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ విజయమ్మ, జిల్లా అధికారులు, టిడిపి నాయకులు రామసుబ్బారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకట మురళి -
టెన్త్ పరీక్షల విధులకు గైర్హాజరైన టీచర్లకు షోకాజ్ నోటీసులు
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధుల్లో ఇన్విజిలేటర్లుగా నియమించిన 10 మంది ఉపాధ్యాయులకు గుంటూరు తూర్పు ఎంఈవో అబ్దుల్ ఖుద్దూస్ ఆదివారం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ, నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను వేర్వేరు పాఠశాలల్లో ఇన్విజిలేటర్లుగా నియమించారు. అయితే వీరిలో 10 మంది ఉపాధ్యాయులు సోమవారం నుంచి జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షల విధులకు హాజరయ్యేందుకు ఆదివారం సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు రిపోర్టు చేయలేదు. దీంతో సంబంధిత ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హామీలు నెరవేర్చేందుకు కృషి కేంద్ర మంత్రి పెమ్మసాని పెదకాకాని: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడు, పెదకాకాని, కొప్పురావూరు గ్రామాల్లో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లను పెమ్మసాని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు త్వరలో తల్లికి వందనం, మహిళలకు జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం అమలుతోపాటు అన్నదాతలకు రైతు భరోసా నిధులు విడుదలకు కృషి చేస్తున్నట్టు వివరించారు. క్వారీ దేవస్థానంలో ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు చేబ్రోలు: జిల్లాలో ఖ్యాతి గాంచిన చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఎస్పీ దంపతులకు ఆలయ అర్చకులు గూడూరు సాంబశివరావు, శ్రీనివాసశర్మ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవదాయశాఖాధికారి పి.రామకోటేశ్వరరావు వారిని సత్కరించి, ప్రసాదం అందజేశారు. ఎస్ఐ డి.వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీల్లో కౌన్సెలర్ల నియామకం నరసరావుపేట ఈస్ట్: జిల్లావ్యాప్తంగా ఉన్న 24 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో విద్యార్థినులకు మానసిన స్థైర్యం కల్పించేందుకు ఐదుగురు కౌన్సెలర్లను నియమించినట్లు జిల్లా బాలికా సంక్షేమాభివృద్ధి అధికారి డి.రేవతి ఆదివారం తెలిపారు. కేజీబీవీ పాఠశాలల్లోని బాలికలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించి వారిలో ఒత్తిడిని జయించేలా తగు సూచనలను కౌన్సిలర్లు అందిస్తారని వివరించారు. జె.అశోక్, ఎ.శాంతివర్థన్, కె.ప్రేమ్‌కుమార్, యూసఫ్ షరీఫ్, ఫణింద్రకుమార్లను కౌన్సెలర్లుగా సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నియమించినట్టు తెలిపారు. రానున్న వారం రోజుల్లో 14 పాఠశాలలోని విద్యార్థినులకు కౌన్సెలర్లు గ్రూప్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. -
జాతీయస్థాయి పోటీలకు ఖోఖో జట్ల ఎంపిక
జె.పంగులూరు: మండలంలోని స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గత రెండురోజులుగా ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ ఆద్వర్యంలో జాతీయ మహిళల, పురుషుల జట్ల ఎంపిక జరిగినట్లు రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ జట్ల ఎంపికకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి 100 మంది పురుషులు, 100 మంది మహిళలు వరకు పాల్గొన్నారని తెలిపారు. మొదటి రోజు శనివారం పురుషుల జట్టు ఎంపిక జరగగా, రెండో రోజు ఆదివారం మహిళల జట్టు ఎంపిక జరిగినట్లు తెలిపారు. ఈ ఎంపికలో కోచ్‌లు, మేనేజర్లు, వివిధ జిల్లాల కార్యదర్శులు పాల్గొని మంచి ప్రతిభా వంతులైన క్రీడాకారులను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 4 వరకు ఒడిశా రాష్ట్రంలోని పూరిలో జరిగే 57వ సీనియర్ జాతీయస్థాయి ఖోఖో పొటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపిక రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బాచిన చెంచుగరటయ్య, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో పంగులూరు గ్రామస్తులు, దాతల సహకారంతో నిర్వహించినట్లు రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతామరామిరెడ్డి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 28 వరకు ఖోఖో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలో సాప్ అబ్జర్వర్, జిల్లా కార్యదర్శి బి.కాశీవిశ్వనాథరెడ్డి, అధ్యక్షులు కుర్ర భాస్కరావు, ట్రేజరర్ కె హనుమంతురావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ క్రీడాకారులు పాల్గున్నుట్లు సీతారామిరెడ్డి తెలిపారు. -
ఇంజినీరింగ్ విద్యయోస్తు
ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె.. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్హతతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్–2025 (గతంలో ఎంసెట్) నోటిఫికేషన్ ఆధారంగా విద్యార్థులు సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్–2025 ఆధారిత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 40 ఇంజినీరింగ్ కళాశాలల పరిధిలో 20వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cets.a psche.ap.gov.in సైట్‌కు లాగిన్ అయ్యి ఏపీ ఈఏపీసెట్–2025పై క్లిక్ చేయాలి. ఏపీఈఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు పూరింపు ప్రక్రియతోపాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు. ఏపీ ఈఏపీసెట్–2025 షెడ్యూల్ విడుదల మే 21 నుంచి 27 వరకు ఏపీ ఈఏపీసెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహణ మే 19,20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 40ఇంజినీరింగ్ కళాశాలల్లో 20వేల సీట్లు -
ఉపాధ్యాయ బకాయిలు వెంటనే చెల్లించాలి
ఎస్టీయూ (డి) డిమాండ్ అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎస్టీయూ(డి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగం కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక జేబీ స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఎస్టీయూ(డి) సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పా ల్గొన్నారు. సంఘం మండల అధ్యక్షుడు జి.ఆనందరావు అధ్యక్షత వహించారు. సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు అరుణారావు మాట్లాడుతూ పీఆర్సీపై ఇచ్చిన హామీని ప్రభుత్యం నిలబెట్టుకుని ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి ఎం.సాంబశివరావు మాట్లాడుతూ పెండింగులో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. ఎంఈఓ వై.ప్రసాదరావు మాట్లాడుతూ పాఠ శాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి మంటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఎస్టీయు(డి) మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం మండల గౌరవ అర్యక్షుడిగా అంకం బుజ్జిబాబు, అధ్యక్షుడిగా జి.ఆనందరావు, ఉపాధ్యక్షులుగా పీఎస్ కుమారి, శ్రీనివాసరావు, కార్యదర్శిగా ఎం.అదాలు, సహాయ కార్యదర్శులుగా షేక్ షారాభి, బైమున్నీసా, మహిళా కార్యదర్శిగా అన్నం వేణుకుమారి, ఆర్థిక కార్యదర్శిగా కుంభా సాంబశివరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా వి.అరుణరావు, ఎం.సాంబశివరావు, డి.కోటేశ్వరరావులు ఎంపికయ్యారు. ఎంఈఓ–2 శివబాబు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ వైద్యసేవ ఉద్యోగులకు న్యాయం చేయాలి
ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో 17, 24 తేదీల్లో విధులబహిష్కరణ వినుకొండ: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 17, 24 తేదీల్లో రాష్ట్రం మొత్తం విధులు బహిష్కరిస్తున్నామని ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్టీఆర్వీఎస్ పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తుందని, ఆప్కాస్ రద్దు దిశగా ఇప్పటికే అడుగులేసిన ప్రభుత్వం ఏప్రిల్ నుంచి బీమా సేవలు కొనసాగుతాయని తెలిజేసిందన్నారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో గత 17 సంవత్సరాలుగా ప్రజలకు ఉచిత సేవలందించడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బంది ప్రభుత్వాల నుంచి ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నారన్నారు. ఇప్పటికై నా సమస్యలను నెరవేర్చాలని భవిష్యత్ పోరాటానికి సిద్ధమయ్యామని తెలియజేశారు. రాష్ట్ర నాయకులు మాచర్ల బుజ్జి, కాకాని అప్పారావు, జిల్లా నాయకులు సింగంశెట్టి వెంకటేశ్వర్లు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు మంచి భవిష్యత్
ప్రొఫెసర్ డాక్టర్ హీరాసింగ్ నగరం: కంప్యూటర్‌సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని హైదరాబాద్ శ్రీనిధి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ హీరాసింగ్ అన్నారు. స్థానిక ఎస్వీఆర్ఎం కళాశాలలో శనివారం డిజైన్ థికింగ్ ఫర్ ఇన్నోవేషన్ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్లో డాక్టర్ హీరాసింగ్ పాల్గొని మాట్లాడారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. డిజైన్ థింకింగ్ అనేది వినియోగదారుల అవసరాలు, కోరికలను అర్ధం చేసుకొని వాటిని కంప్యూటర్ సైన్స్‌తో పరిష్కరించడమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలలోను మానవాళి జీవనానికి ఎంతగానో ఉసయోగపడుతుందన్నారు. మనిషి చేసే ఎన్నో పనులను ఏఐ సాయంతో చేయగలుగుతున్నాయన్నారు. ఏఐ సాంకేతికతను వినియోగించుకుని మానవాళి మనుగడకు ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. లక్కిరెడ్డి, బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ ప్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కరస్పాడెంట్ వల్లభనేని బుచ్చియ్యచౌదరి, ప్రిన్పిసాల్ హరికృష్ణ, వైస్‌ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, అకడమిక్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, కంప్యూటర్ సైన్స్ హెచ్‌వోడీ సజ్జా శ్రీనివాసరావు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రసన్నాంజనేయ స్వామి ఆదాయం రూ.14.25 లక్షలు
అద్దంకి రూరల్: శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆదాయం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గణనీయం పెరిగినట్లు దేవస్థానం ఏసీ యం. తిమ్మనాయుడు శనివారం తెలిపారు. శనివారం దేవస్థానంలో భక్తులు వేసిన కానుకల హుండీని లెక్కించగా రూ.14,25,272, ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే దాతల నుంచి అన్నదానానికి రూ.12,939, తిరునాళ్ల సందర్భంగా టికెట్ల ద్వారా రూ.10,04,491 వచ్చినట్లు తెలిపారు. గత సంవత్సరం టికెట్లు ద్వారా రూ.8,26,435, హుండీ ద్వారా రూ.8,26,081 వచ్చినట్లు తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.2.66 లక్షలు శింగరకొండ కొండపైన కొలువై ఉన్న క్షేత్రపాలకుడు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆదాయం రూ.2,66,604 వచ్చినట్లు ఏసీ కోటిరెడ్డి తెలిపారు. 15 రోజులకు భక్తులు వేసిన కానుకల హుండీని శనివారం లెక్కించగా రూ.1,38,334, తిరునాళ్ల సందర్భంగా పూజా టికెట్ల వలన 1,28,270 ఆదాయం వచ్చినట్లు తెలి పారు. గత సంవత్సరం హుండీ వలన రూ.89,974, పూజా టికెట్లు వలన రూ.1,05,350 సమకూరింది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అదనంగా రూ.71,280 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వెంటేశ్వరరావు, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఆదాయం రూ. 2.86 లక్షలు శింగరకొండ తిరునాళ్ల సందర్భంగా అద్దంకి ఆర్టీసీ డిపోకు రూ.2,86,920 ఆదాయం వచ్చినట్లు డిపో మేనేజర్ బెల్లం రామ్మోహనరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిపో నుంచి 24 బస్సులు నడిపినట్లు వివరించారు. గత సంవత్సరం రూ.2,06,940 రాగా ఈ సంవత్సరం అదనంగా రూ. 80 వేలు అదనంగా వచ్చినట్లు తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
చీరాల రూరల్: రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మత్తుమందుచ్చి వారివద్దనున్న బంగారు ఆభరణాలను దోచుకునే అంతర్రాష్ట్ర దొంగను చీరాల రైల్వే పోలీసులు అరెస్టుచేసి కటకటాల వెనక్కి నెట్టారు. శనివారం జీఆర్పీ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై సీహెచ్.కొండయ్య నిందితుల వివరాలు వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో నెల్లూరు నుంచి చీరాలకు రైలులో వస్తున్న ఓ మహిళకు మత్తుమందుచ్చి ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దొంగలు అపహరించారు. ఆ సంఘటనపై గుంతకల్లు రైల్వే ఎస్పీ రాహుల్ మీనా, నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ సూచనల మేరకు ఒంగోలు సీఐ ఎస్కె.మౌలా షరీఫ్ ఆధ్వర్యంలో కేసు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు. కేసులోని మొదటి నిందితుడిగా ఉన్న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన కాజల్ వర్మను ఈఏడాది జనవరిలో అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కేసులో రెండో నిందితునిగా ఉన్న హర్యానా రాష్ట్రానికి చెందిన విజేందర్కుమార్ను ఈనెల 12న హర్యానా రాష్ట్రంలో అరెస్టు చేసినట్లు చెప్పారు. కేసులోని నిందితుడిని ఆయా రాష్ట్రానికి చెందిన కోర్టులో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా నెల్లూరులోని రైల్వే కోర్టుకు తరలించి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదులోకి తీసుకున్న చీరాల జీఆర్పీ ఎస్సై సీహెచ్.కొండయ్య, పోలీసులు ఎస్కె.ఖాదర్‌బాషా, డి.శ్రీనురాజు, పి.లక్ష్మీనారాయణలను నెల్లూరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జి.మురళీధఽర్, ఒంగోలు సీఐ ఎస్కె.మౌలా షరిఫ్లు అభినందించారు. -
రెండు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
మేదరమెట్ల: వేర్వేరు ప్రమాదాల్లో ఒకరికి తీవ్రగాయాలు కాగా మరో ఇరువురికి స్వల్పగాయాలైన సంఘటన కొరిశపాడు మండల పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు అద్దంకి రోడ్డులోని కొంగపాడు డొంక సమీపంలో బైకుపై వస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఇతన్ని 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. తీవ్రగాయాలైన వ్యక్తి తాళ్లూరుకు చెందిన పాలపర్తి నగేష్ ఇతను శింగరకొండ తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండనా ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. రెండు ద్విచక్రవాహనాలు ఢీ మేదరమెట్ల భ్రమర వెంచర్ ఎదురు బైకుపై వెళుతున్న ఇద్దరు రోడ్డు ప్రక్కన బైకు ఆపి కాలకృత్యాలు తీర్చుకొని బైకు వద్ద నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చిన మరో బైకు వీరిని ఢీ కొంది. దీంతో నిలబడి ఉన్న లింగారావు, సుబ్బారావులకు గాయాలు కాగా వీరిని వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బైకు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. -
సావిత్రీబాయి పూలే పుస్తకావిష్కరణ
పొన్నూరు: పట్టణంలోని లుంబినీ వనం అంబేడ్కర్ రీసెర్చ్ సెంటరులో కవి డాక్టర్ కత్తి పద్మారావు రచించిన ‘సావిత్రీబాయి పూలే’ పుస్తకాన్ని అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్ గుంటూరు జిల్లా కన్వీనర్ పిల్లి సుజాత ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ సావిత్రీబాయి పూలే జీవిత కథను పుస్తక రూపంలో ప్రపంచానికి తెలియ చేసిన డాక్టర్ కత్తి పద్మారావును అభినందించారు. భారతదేశంలో ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థలు వెలిగించిన ఒక మహోజ్వల కాంతి దీపం సావిత్రీబాయి పూలే అని పేర్కొన్నారు. ఆ మహనీయురాలి పుస్తకాన్ని ప్రతి మహిళ చెంతకు చేరుస్తానని తెలిపారు. అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్ గుంటూరు జిల్లా కన్వీనర్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుజాతను పద్మారావు సత్కరించారు. రేపు న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17న గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫెడరేషన్ చైర్మన్ కాసు వెంకటరెడ్డి శనివారం తెలిపారు. టోర్నమెంట్ సోమవారం 8:30గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. స్పోర్ట్స్ అండ్ కల్చర్ కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, ఈసీ మెంబర్స్ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. విత్తన గుళికల విధానంతో మేలు ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి నరసరావుపేట రూరల్: వర్షాభావ పరిస్థితుల్లో రైతులు భూమిని కప్పి ఉంచే విత్తన గుళికల తయారీ విధానాన్ని అవలంభించాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. ప్రకృతి వ్వవసాయం జిల్లా కార్యాలయంలో సిబ్బందికి నిర్వహిస్తున్న మూడవ రోజు శిక్షణా కార్యక్రమానికి జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హాజరయ్యారు. డీపీఎం మాట్లాడుతూ వేసవిలో ప్రతి రైతు తనకున్న పొలంలో ఈ విత్తన గుళికల విధానం ఆచరించాలని తెలిపారు. -
ఘనంగా గోపుర శిఖర సహిత పునఃప్రతిష్టా మహోత్సవం
గొరిగపూడి(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం గొరిగపూడి గ్రామంలోని శ్రీ భ్రమరి దుర్గాదేవి సమేత శ్రీ నాగేశ్వరస్వామి దేవస్థానం జీవ ధ్వజ విమాన గోపుర శిఖర సహిత పునః ప్రతిష్టా మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి హోమాలు, ప్రాతఃకాల దీక్ష హోమాలు, అనంతరం దేవతామూర్తులు, గోపుర శిఖరాలు, ధ్వజ ప్రతిష్ట పూజ, కుంభాభిషేకం నిర్వహించారు. ప్రతిష్టా మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్న సంతర్పణ చేశారు. రూ.1.10 కోట్ల వ్యయంతో జీవ ధ్వజ విమాన గోపుర శిఖర సహిత పునః ప్రతిష్టా కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున రూ.25 లక్షలు దేవదాయ శాఖకు, రూ.75 లక్షలు వ్యయంతో దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పూర్వ గ్రామకరణం, పులిగడ్డ వారి వంశస్తులు రూ.10 లక్షల విగ్రహాలను సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం శాంతి కల్యాణం, అనంతరం అన్న సంతర్పణ జరగనున్నాయి. ఫణికుమార్ ఆధ్వర్యంలో పూర్వ గ్రామకరణం, పులిగడ్డ వారి వంశస్తుల సహాయ సహకారాలతో బ్రహ్మశ్రీ సృజన్‌కుమార్ ఆధ్వర్యంలో ఆచార్య అర్చక పర్యవేక్షణలో జరుగుతున్నాయి. సర్పంచ్ గరికపాటి మల్లికా–వెంకటేశ్వరరావు, ఆలయ అర్చకులు ఆమంచి సృజన్‌కుమార్, కార్యనిర్వాహణాధికారి పాపని రాజేశ్వరరావులు కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, దేవదాయ ధర్మ శాఖ అధికారులు పాల్గొననున్నారు. -
నర్సరీ భూముల నష్ట పరిహారంపై విచారణ
రెంటచింతల: మాచర్ల – దాచేపల్లి బైపాస్ రోడ్డు(ఎన్‌హెచ్–167 ఏడీ) నిర్మాణంలో భాగంగా రెంటచింతలలో రెండు షేడ్ నెట్ నర్సరీలకు సంబంధించి కోల్పోయిన భూములను శనివారం గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు నేషనల్ హైవే అథారిటీ విజయవాడ ఏఈ ప్రకాష్ నేతృత్వంలోని బృందంతో కలిసి పరిశీలించారు. ఇటీవల రెంటచింతల గ్రామానికి దుగ్గింపూడి జోసఫ్‌రెడ్డి, నరమాల రామకృష్ణ అనే ఇద్దరు రైతులు జాతీయ రహదారి 167 ఏడీ నిర్మాణం వలన తాము ఏర్పాటు చేసుకున్న షేడ్ నెట్ నర్సరీ భూములను కోల్పోయామని, ఇంతవరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని పూర్తిస్థాయిలో విచారించి న్యాయం చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబుకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులు కోల్పోయిన 787, 788 సర్వే నంబర్లలో ఏర్పాటు చేసిన నర్సరీ భూమిని పునఃపరిశీలించేందుకు ఈ బృందం వచ్చిందన్నారు. జాతీయ రహదారి నిర్మాణం వలన ఒక్కో షేడ్ నెట్ నర్సరీ నిర్వహకులు ఎంత భూమిని కోల్పోయారు.. తదితర వివరాలను సేకరించారు. ఈ రెండు నర్సరీలకు సంబంధించి మొత్తం 0.68 ఎకరాల భూమి కోల్పోయినట్లు మండల ఆర్ఐ పల్లా రామకృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టర్‌కు పూర్తి నివేదికను అందజేయనున్నట్లు ఆర్డీఓ మురళీకృష్ణ తెలిపారు. వారి వెంట జిల్లా ఉద్యానఅధికారి సీహెచ్‌వీ రమణారెడ్డి, తహసీల్దార్ మూఢావత్ అర్జున్ నాయక్, జాతీయ సెక్షన్ ఇంజినీర్ శ్రీనివాస్, గురజాల హెచ్ఓ వై.మోహన్, సర్వేయర్ నవులూరి రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. -
కోనేటి రాయుడికి నీరాజనాలు
రాజుపాలెం: పల్నాడు తిరుపతిగా పేరుగాంచిన దేవరంపాడు కొండపై స్వయంభూగా వెలసిన నేతి వెంకన్నస్వామి మూడవ శనివారం తిరుణాళ్లకు భక్తులు పోటెత్తారు. సమీప ప్రాంతాల నుంచే గాక సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు దేవరంపాడు కొండకు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకునే సమయంలో గోవింద నామస్మరణతో కొండ మారుమోగింది. కోనేటి రాయుడికి కోటి దండాలంటు నీరాజనాలు అందించారు. భక్తులు స్వామివారికి పొంగళ్లుచేసి నెయ్యి, బెల్లం, పప్పు వగైరాలు సమర్పించారు. పశుసంపదను కాపాడాలని నెయ్యిని సమర్పించి మొక్కుకున్నారు. తిరునాళ్లలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈఓ గణసతి సురేష్ ఏర్పాట్లు పరిశీలించారు. హుండీలు, విరాళాలు, స్పెషల్, సీఘ్ర దర్శనాలు, తల నీలాలు, లడ్డు, ప్రసాదాల ద్వారా రూ13,47,259లు ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
బాపట్ల: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఏపీ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా తెలిపారు. బాపట్ల పట్టణంలోని బాపట్ల జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల తీరు, పరీక్ష కేంద్రంలో వనరులను ఆమె పరిశీలించారు. ఇంటర్మీ డియెట్ పరీక్షలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుందని చెప్పారు. బాపట్లలోని అన్ని కేంద్రాలలో ప్రశాంతంగా పరీక్షలు జరిగాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ప్రత్యేక అధికారికి వివరించారు. 7,979 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉండగా 7,710 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మిగిలిన 269 మంది గైర్హాజరైనట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ప్రత్యేక అధికారి దృష్టికి తెచ్చారు. వారి వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, కళాశాల ప్రధానాచార్యులు జి కోటేశ్వరరావు, పరీక్ష కేంద్రం సీఎస్ టి.భవాని, తదితరులు ఉన్నారు. ఏపీ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ కృతికా శుక్లా -
సబ్జెక్టు టీచర్లే ఇన్విజిలేటర్లు
బాపట్లటౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఇన్విజిలేటర్లుగా ఈ ఏడాది హైస్కూల్ మాస్టార్లే కొనసాగనున్నారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా గతంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను (ఎస్జీటీ)లను ఇన్విజిలేటర్లుగా నియమించేవారు. ఈసారి ఆ బాధ్యతల నుంచి ఎస్జీటీలను కూటమి ప్రభుత్వం తప్పించింది. హైస్కూల్లో పనిచేసే సబ్జెక్టు టీచర్లు, భాషోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయకులకు ఇన్విజిలేషన్ బాధ్యతలను అప్పగించింది. మొదటి మూడు లాంగ్వేజీ పరీక్షలకు సబ్జెక్టు టీచర్లు ఇన్విజిలేషన్ విధులు నిర్వర్తిస్తారు. తర్వాత జరిగే సబ్జెక్టు పరీక్షలకు భాషోపాధ్యాయులు, ఇతర సబ్జెక్టు టీచర్లు ఇన్విజిలేషన్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. సోమవారం నుంచి జిల్లాలోని 103 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ ఇలా.. జిల్లాలోని 25 మండలాలు, నాలుగు మున్సిపాల్టీల పరిధిలో 16,799 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలికలు 8317 మంది, బాలురు 8482 మంది ఉన్నారు. పరీక్షల పర్యవేక్షణకు 103 మంది చొప్పున డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఆరు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, 29 మంది కేటగిరి కస్టోడియన్లు, 10 మంది రూట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను నియమించారు. వీరితోపాటు 1048 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. 103 మంది క్లర్క్‌లు, 206 మంది ఎఎన్ఎంలు, 206 మంది పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేస్తున్నారు. సీ కేటగిరి సెంటర్లపై ప్రత్యేక నిఘా జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న 103 కేంద్రాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించారు. ఇందులో ఏ–కేటగిరీ 33, బి–కేటగిరీ 41, సీ–కేటగిరీ 29 కేంద్రాలు ఉన్నాయి. సీ–కేటగిరీ కేంద్రాలపై ప్రత్యేక నిఘా కనపరుస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇన్విజిలేషన్ బాధ్యతల నుంచి ఎస్జీటీలను తప్పించిన ప్రభుత్వం 1048 మంది హైస్కూల్ ఉపాధ్యాయులకు బాధ్యతలు రేపటి నుంచి టెన్త్ పరీక్షలు హాజరుకానున్న 16,799 మంది విద్యార్థులు 103 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేశాం పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని మౌలిక వసతులు కల్పించాం. ఈ ఏడాది హైస్కూల్లో పనిచేస్తున్న 1048 మంది భాషోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాలను ఇన్విజిలేటర్లుగా నియమించాం. హైస్కూల్ సిబ్బంది కొరత ఉన్న ప్రాంతంలో ఎస్జీటీలను కూడా తీసుకున్నాం. విద్యార్థులు బాగా వచ్చిన ప్రశ్నలను మాత్రమే ముందుగా రాసుకోవాలి. కష్టమైన ప్రశ్నను రాయడానికి సిద్ధపడి సమయాన్ని వృథా చేసుకోవద్దు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడి, భయానికి లోనుకావద్దు. – శ్రీరామ్ పురుషోత్తమ్, డీఈఓ -
కుట్ర రాజకీయాలపై ఉగ్రరూపం
అధికారం అండ చూసుకుని కాల‘కూటమి’ విషం చిమ్ముతూనే ఉంది. గుంటూరు నగరపాలక సంస్థపై పెత్తనం చలాయించడానికి మాయోపాయాలు పన్నుతూనే ఉంది. నిస్సిగ్గుగా సంతలో పశువులను కొన్నట్లు కార్పొరేటర్లను కొన్న కూటమి నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. కమిషనర్‌ను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు. అడుగడుగునా మేయర్ కావటిని అవమానపరున్నారు. నగరపాలక సంస్థపై కూటమి పెత్తనంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇటు జిల్లా పరిషత్‌లోనూ చైర్పర్సన్ అరాచకాలకు అడ్డూఅదుపూ లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతో, అత్యవసర పనుల పేరుతో కోట్లాది రూపాయల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు బడ్జెట్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. ● వేడెక్కిన గుంటూరు జిల్లా రాజకీయం ● ఒకే రోజు రెండు పరిణామాలు ● మేయర్ పదవికి కావటి మనోహర్ రాజీనామా ● జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు ● కోరం లేక వాయిదా ● రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ నిర్ణయాలుసాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ, ప్రజలతో ఎన్నుకోబడిన స్థానిక సంస్థలను అపహాస్యం చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పదవికి శనివారం రాజీనామా చేశారు. మరోవైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడ్జెట్ ఆమోదించకుండానే రూ. 12 కోట్ల విలువైన పనులను ముందుగానే ఆమోదించుకోవడానికి జెడ్పీ చైర్పర్సన్ పేరుతో కూటమి ప్రజా ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాన్ని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు అడ్డుకున్నారు. సమావేశానికి వారు రాకపోవడంతో కోరం లేక వాయిదా వేయాల్సి వచ్చింది. సంతలో పశువుల్లా కార్పొరేటర్ల కొనుగోలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ పాలక వర్గం పూర్తి మెజార్టీతో అధికారంలో ఉంది. ఎలాగైనా దొడ్డిదారిలో స్థాయీ సంఘాన్ని దక్కించుకునేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు కుట్ర పన్నారు. కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి సంతలో పశువులను కొన్నట్లు కొనుగోళ్లకు తెరలేపారు. వారే స్వయంగా కార్పొరేటర్ల ఇంటికి వెళ్లి మరీ కండువాలు కప్పి వచ్చారు. వంత పాడుతున్న కమిషనర్ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా రాజకీయ నాయకుడిలా టీడీపీ నేతల వంత పాడారు. చిన్న అంశాన్ని అడ్డం పెట్టుకుని కౌన్సిల్‌ను బాయ్‌కాట్ చేసిన ఆయన తర్వాత మేయర్ ఎన్నిసార్లు లేఖలు రాసినా కౌన్సిల్ సమావేశం పెట్టకుండా అడ్డం పడ్డారు. దొడ్డిదారిన స్థాయీ సంఘాన్ని అందిపుచ్చుకున్న తర్వాత ఎమ్మెల్సీ కోడ్ ముగియడంతో తాజాగా మేయర్ ప్రమేయం లేకుండానే స్థాయీ సంఘం సమావేశం తేదీని నిర్ణయించి ప్రకటించేశారు. అజెండా విషయంలో కూడా మేయర్‌ను సంప్రదించలేదు. -
ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
బాపట్ల: ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహ న కల్పించాలని రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా అన్నారు. బాపట్ల సూర్యలంక బీచ్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాలో పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించిందన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మాట్లాడుతూ ప్రభు త్వం ప్రతినెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు. ఇందుకోసం అధికారులకు దిశానిర్దేశం చేశారన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు జయప్రదానికి ప్రజల భాగస్వామ్యం కావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి తడి, పొడి చెత్త, ప్రమాదకర చెత్తను వేరు చేసే విషయంపై మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. సేకరించిన తడి, పొడి చెత్త, ప్రమాదకర చెత్తను చెత్త సంపద తయారీ కేంద్రానికి తరలించాలన్నారు. చెత్త సేకరించే సమయంలోనే వేర్వేరుగా చేసి తిరిగి వాటిని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో 17 లక్షల మంది ప్రజలు ఉన్నారని, వీరి కోసం ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని అన్నారు. సూర్యలంక బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, జాయింట్ కలెక్టర్ ప్రఖర్‌జైన్, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా -
అమరేశ్వరుని సేవలో ఉప లోకాయుక్త
అమరావతి: ప్రముఖశైవక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరుణ్ణి ఉప లోకాయుక్త జస్టిస్ రజని దంపతులు శనివారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు జస్టిస్ రజని దంపతులకు స్వాగతం పలికారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జస్టిస్ రజని దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి శేషవస్త్రంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. నృసింహుని సేవలో.. మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామిని శనివారం రాష్ట్ర ఉప లోకాయుక్త జస్టిస్ రజిని దంపతులు దర్శించుకున్నారు. ఎగువ దిగువ సన్నిధులలో స్వామిని దర్శించుకున్న దంపతులకు ఆలయ ఈవో, సహాయ కమిషనర్ ఏ. రామకోటిరెడ్డి, తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర ఘనంగా స్వాగతం పలికారు. రజిని దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం కారంచేడు: మన గ్రామాలను ప్లాస్టిక్, కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మన వంతు కృషి చేయాల్సిన అవసరం మనందరిపై ఉందని బాపట్ల జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ డీ విజయలక్ష్మి అన్నారు. శనివారం ఆమె మండలంలోని కారంచేడు, స్వర్ణ గ్రామాల్లో జరుగుతున్న ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని ఆమె వివిధ శాఖల సిబ్బంది, గ్రామస్తులతో మాట్లాడారు. కారంచేడు గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆమె పరిశీలించారు. కార్యాలయాలను శుభ్రపరిచే కార్యక్రమంలోను పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం, అమ్మకాలను నిషేధించాలని ఆమె దుకాణ యజమానులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి గుడ్డ సంచులను వెంట తెచ్చుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. చినవంతెన సెంటర్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులతో మానవహారం నిర్వహించి, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్వర్ణ గ్రామంలో ఆమె అవగాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దారు జే నాగరాజు, ఎంపీడీఓ కే నేతాజీ, హౌసింగ్ ఏఈ ఖాశీం సాహెబ్, వైద్యశాఖ, పంచాయతీ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. వైభవంగా శ్రీవారి కల్యాణంనగరంపాలెం:గుంటూరు ఆర్.అగ్రహారంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివా రం ప్రాతఃకాల ఆరాధన, స్వామికి తిరుమంజ న స్నపన, అలంకార పూజ, నిత్యార్చన, నిత్య హోమం, బలిహరణ కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమే త వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అర్చకులు భక్తిప్రపత్తులతో చేపట్టారు. భక్తులు పెద్దసంఖ్యలో తిలకించారు. ఆలయ కమిటీ అన్న ప్రసాద వితరణ చేసింది. సాయంత్రం నిత్య హోమం నిర్వహించారు. స్వామివారి రథోత్స వం భక్తుల గోవింద నామస్మరణతో ఆర్.అగ్రహారం ప్రధాన వీధుల్లో కొనసాగింది. మంగళవాయిద్యాలు, డప్పులు, దేవతామూర్తుల వేషధారణలతో రథోత్సవం ఆకట్టుకుంది. ఆలయ వ్యవస్థాపకులు కన్నా లక్ష్మీనారాయణ, కార్యదర్శులు పాల్గొన్నారు. -
జెడ్పీటీసీలకు సముచిత గౌరవం లేదు
● జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా నిధులు మంజూరు చేయడం తగదు ● కమీషన్లు, పర్సంటేజ్‌లు దండుకుంటున్నారు ● వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేయడం సహించలేకున్నాం ● మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలుగుంటూరుఎడ్యుకేషన్: ప్రజల ఓట్లతో గెలిచిన తమ కు కనీస గౌరవం, సముచిత స్థానం కరువయ్యా యని వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జెడ్పీలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన జెడ్పీటీసీలు గుంటూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గత జెడ్పీ ఎన్నికల్లో కత్తెర హెనీ క్రిస్టినాకు జెడ్పీటీసీగా గెలిపించడంతోపాటు చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీలోకి వెళ్లిన క్రిస్టినా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతో ఆవేదనకు గురి చేశాయని చెప్పారు. ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీలకు గౌరవం ఇవ్వకపోగా, ముందస్తు అనుమతుల పేరుతో జెడ్పీ చైర్పర్సన్ నేరుగా సంతకాలు చేసి పనులు మంజూరు చేస్తున్నారని అన్నారు. జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా, సర్వసభ్య సమావేశం దృష్టికి తీసుకురాకుండా పనులు మంజూరు చేస్తున్నప్పుడు ఇక తమకు విలువ ఎక్కడిదని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతో, అత్యవసర పనుల పేరుతో కోట్లాది రూపాయల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇస్తూ, వాటిలో కమీషన్లు, పర్సంటేజీలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరగాల్సిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆమోదించాల్సి ఉండటంతోపాటు రూ.12 కోట్ల విలువైన పనులకు ముందస్తు అనుమతులను చైర్పర్సన్ ఇచ్చేశారని చెప్పారు. తామందరం సమావేశానికి వెళ్లి ఉంటే తమ అంగీకారం లేకున్నా, కోరం ఉందనే సాకుతో బడ్జెట్‌ను ఆమోదించడంతోపాటు సంబంధిత రూ.12 కోట్ల పనులను తమ అంగీకారం లేకుండా ఆమోదించుకునే వారని చెప్పారు. ప్రజాధనం వృథా కారాదనే ఉద్దేశంతో వైఎస్సార్ సీపీకి చెందిన 42 మంది సభ్యులు సమావేశాన్ని బహిష్కరించినట్లు పేర్కొన్నారు. అసలు ముందస్తు అనుమతులు అనే మాట పంచాయతీరాజ్ చట్టంలోనే లేదన్నారు. ఏకపక్షంగా కేటాయింపులు ప్రత్తిపాడు జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా జెడ్పీటీసీలకు తెలియకుండా ఏకపక్షంగా నిధులు మంజూరు చేస్తూ, జెడ్పీని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అత్యవసర పనుల పేరుతో ధనార్జనే ధ్యేయంగా పనులు ఆమోదిస్తూ, కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. జెడ్పీటీసీలకు ప్రాధాన్యమెక్కడ? కాకుమాను జెడ్పీటీసీ గుల్జాన్బేగం మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడంలో చైర్పర్సన్ హెనీ క్రిస్టినా జెడ్పీటీసీలకు ప్రాధాన్యం కల్పించడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన 56 మంది సభ్యులుగా తాము పార్టీని నమ్ముకుని ఉండగా, కొంత మంది రాజకీయ ప్రయోజనాలతో పార్టీని వీడారని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధులుగా తమ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు తాము ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉందని, జెడ్పీలో జరుగుతున్న కార్యకలాపాలు, నిధుల మంజూరుపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత చైర్‌పర్సన్‌కు ఉందన్నారు. పార్టీని వీడే ముందు జెడ్పీటీసీలుగా తమను సంప్రదిచకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు మినహా, ప్రజాప్రయోజనాలు లేవన్నారు. సమావేశంలో జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
బాలినేని..స్థాయి తెలుసుకొని మాట్లాడు.
మార్టూరు: ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిఠాపురంలో శుక్రవారం జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించటం ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు‘ అన్నట్లుందని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బాలినేని తీరుపై నిప్పులు చెరిగారు. బాలినేనికి రాజకీయ బిక్ష పెట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డిలను విమర్శించే అర్హత బాలినేనికి లేదని బాలినేని తీరు తల్లి పాలు తాగి ఆ తల్లి ఎదపై తన్నినట్లు ఉందని అన్నారు. తన చెల్లెలు భర్త అన్న ఒకే ఒక్క కారణం చేత నీ బావ వైవీ సుబ్బారెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒప్పించి ఒంగోలు టికెట్ ఇప్పించటంతో నీ రాజకీయ ప్రస్థానం ప్రారంభం కావడం నిజం కాదా? అదే సుబ్బారెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటూ జిల్లా రాజకీయాలలో జోక్యం చేసుకోనివ్వకుండా చేసిన నీవు నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బత్తుల అన్నారు. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సీపీ నాశనానికి, మార్కాపురం జిల్లా కాకుండా అడ్డుకున్నది నీవు కాదా? అని ఆయన ప్రశ్నించారు? జిల్లాలోని 12 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గంలో ఐదారుగరికి పార్టీ టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికి ప్రతి ఎన్నికను వ్యాపారంగా మార్చుకున్న నీవా వైఎస్ జగన్‌ను విమర్శించేది? అని అన్నారు. నీ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ అవినీతి అరాచకాలపై విచారణ చేయించాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి -
మేయర్‌కు అవమానాలు
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ఆటలపోటీల విషయంలో గానీ, తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి మేయర్‌కు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా అవమానిస్తూ వచ్చారు. పైగా మేయర్ వద్ద ఉన్న సిబ్బందిని కుదించి వేశారు. కారును, డ్రై వర్ను, అటెండర్‌ను, ఆఫీస్ స్టాఫ్‌ను, అఖరి బిళ్ల బంట్రోతును కూడా తీసేశారు. చాంబర్‌కు వస్తే తాళాలు వేసి పావుగంట సేపు బయట నిలబడేలా చేశారు. మరోవైపు మేయర్‌ను దింపివేసి తమ అభ్యర్థిని బరిలోకి నిలబెడుతున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్పొరేటర్ కోవెలమూడి రవీంద్ర పేరును ప్రకటించారు. మేయర్ పదవిని దక్కించుకునేందుకు మిగిలిన కార్పొరేటర్లతో మంతనాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ అవమానాలను నిరసిస్తూ మేయర్ కావటి మనోహర్‌నాయుడు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు
రశీదుతోనే న్యాయం బాపట్లటౌన్: రోజురోజుకు పెరుగుతున్న ధరలు... కల్తీ సరుకులు...తూకల్లోనూ మోసాలు...ఇదీ ప్రస్తుత పరిస్థితి. వీటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1962 మార్చి 15న అమెరికా సెనేట్ వినియోగదారులకు నాలుగు హక్కులను ప్రసాదించింది. 1973 మార్చి 15 నుంచి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మన దేశంలో 1986 డిసెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజునే జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వినియోగదారుల హక్కులు ఇలా.. నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు పొందడంతోపాటు వినియోగదారుల ప్రయోజనాన్ని కాపాడేందుకు చట్టరీత్యా వినియోగదారులకు కొన్ని హక్కులు కల్పించారు. ఈ హక్కులను ఉపయోగించి అమ్మకందారులు ఏవైనా నాసిరకం వస్తువులను అమ్మిన సందర్భాల్లో సరైన ఫోరమ్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. మోసపూరితమైన వ్యాపారుల వలన నష్టపోతే పరిహారం కోరవచ్చు. వస్తువులపై పూర్తిస్థాయిలో అవగాహన పొందవచ్చు. సేవల్లో ఏవైనా లోపాలు జరిగితే బ్యాంకింగ్, వైద్యరంగం, విద్యుత్, రావాణా, బీమా తదితర సంస్థలపై కేసులు కూడా వేసే వెసులుబాటు వినియోగదారులకు ఉంటుంది. హెల్ప్‌లైన్ సేవలు ఇలా ..వస్తువుల కొనుగోలు, సేవల విషయంలో మోసం, ఆంక్షలపై వినియోగదారుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. చాలా మందికి వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నారు. ఒకవేళ అవగాహన ఉన్నప్పటికీ కోర్టుల చుట్టూ ఏం తిరుగుతాం, తీర్పు ఎప్పటికి వస్తుందోనన్న నిరాశతో చాలామంది వినియోగదారులు మిన్నకుండిపోతున్నారు. జాతీయ వినియోగదారు హెల్ప్‌లైన్ నంబర్ (1916) ఒకటి ఉందని ఇప్పటికీ చాలా మందికి తెలియదు. వినియోగదారులకు మేలైన ప్రయోజనాలు కల్పించేందుకు 1986లోనే చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఈ చట్టాన్ని 1993, 2002, 2019లో పలు విధాలుగా సవరించారు.అప్పటినుంచి కేంద్రం నుంచి జిల్లాస్థాయి వరకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్లు పనిచేస్తున్నాయి. అక్రమ వ్యాపార లావాదేవీల విధానాల విషయంలో కొనుగోలుదారులకు ఈ చట్టం భద్రత కల్పిస్తుంది. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఈ చట్టం సూచిస్తోంది. కొరవడిన అధికారుల పర్యవేక్షణ బాపట్ల జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత విచ్చలవిడిగా వెలుస్తున్న దుకాణాలు, మాల్స్, సూపర్ మార్కెట్, కిరాణా దుకాణాల యజమానులు తూనికలు, కొలతల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారే కానీ వాటిని పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయటంలో విఫలమవుతున్నారు. వ్యాపారస్తులు ప్యాకింగ్ లైసెన్స్‌లు పొందకుండానే ఇష్టమొచ్చిన రీతిలో ప్యాకింగ్ చేసి వస్తువులను విక్రయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యాపారస్తులు మోసాలకు పాల్పడుతున్నారని వినియోగదారులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఓ దుకాణంలో నూనె శాంపిల్స్ సేకరిస్తున్న అధికారులు(ఫైల్)బాపట్ల పట్టణానికి చెందిన సరస్వతి మార్కెట్ కు వెళ్లింది. అక్కడ పలు వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి వచ్చింది. కందిపప్పు ప్యాకెట్ తూకం సక్రమంగా లేనట్లు గుర్తించింది. మళ్లీ మార్కెట్‌కు వెళితే.. దుకాణదారుడు ఆమెనే ఎదురు ప్రశ్నించాడు. దీంతో గొడవెందుకు అనుకుని ఇంటికి వచ్చింది. ఇది ఒక్క సరస్వతి సమస్యే కాదు.. ప్రతి వస్తువూ కొనుగోలు చేసే వినియోగదారుడిది! కొనుగోలు చేస్తున్న వస్తువు క్వాలిటీతోపాటు క్వాంటిటీ ఉందా లేదా అనే అంశాలను గుర్తించడంతో వినియోగదారుల అలసత్వమే దీనికి ప్రధాన కారణం. కేజీ సరుకు కొనుగోలు చేస్తే అందులో 50 గ్రాములు తగ్గినంత మాత్రాన ఏమి అడుగుతాములే! అనే ధోరణిలో ఉన్నారు. కానీ ఇలాంటి వారందరి చేతిలో బ్రహ్మాస్త్రంగా వినియోగదారుల ఫోరం పనిచేస్తోంది. ఇది కొనుగోలుదారుల గొంతుకై వ్యాపారుల మోసాలను నిలదీస్తుంది. వినియోగదారులకు అండగా ఉంటుంది. శుక్రవారం కొన్ని దుకాణాల వద్దకు సాక్షి పరిశీలనకు వెళ్లగా.. అక్కడ తూకాల్లో జరుగుతున్న మోసాలు వెలుగు చూశాయి. వినియోగదారులు ఏ వస్తువులు కొనుగోలు చేసినా తప్పనిసరిగా రశీదు పొందాలి. వ్యాపారస్తులు, వ్యాపార సముదాయాలపై ఫిర్యాదు చేయాంటే రుజువు తప్పనిసరిగా అవసరం అవుతుందనే విషయాన్ని వినియోగదారులు గ్రహించాలి. వస్తువులను కొనుగోలుచేసే సమయంలో నికర తూకం, వస్తువు నాణ్యతా ప్రమాణాలు చూసుకొని కొనుగోలు చేయాలి. అనుచిత వ్యాపార పద్ధతులను అవలంభించరాదు. వినియోగదారుల హక్కులతోపాటు బాధ్యతలను గుర్తించుకోవాలి. సరైన ఆధారాలతో ఫిర్యాదుచేస్తే కేసు 90 రోజుల్లోనే పరిష్కారం అవుతుంది. –డాక్టర్ పీసీ సాయిబాబు, జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సభ్యులు వ్యాపారస్తులు, వ్యాపార సముదాయాల నిర్వాహకులు మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. తూనికలు, కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన దుకాణాలను సీజ్ చేయటంతోపాటు అపరాధ రుసుం విధిస్తున్నాం. ఎవరైనా వినియోగదారుడు నష్టపోతే తమకు ఫిర్యాదు చేస్తే సంబందిత వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటాం. –రామదాసు, తూనికల కొలతల అధికారి, బాపట్ల -
నృసింహునికి బ్రహ్మరథం
మంగళగిరి/మంగళగిరి టౌన్: జై నారసింహా.. జైజై నారసింహా నినాదాలతో మంగళగిరి శుక్రవారం మార్మోగింది. శ్రీ లక్ష్మీనరసింహుని దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనంతో పురవీధులు కిటకిటలాడాయి. స్వామి బ్రహ్మోత్సవాలు 11 రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి స్వామి కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలలకు ఉభయదేవరులతో స్వామి దివ్యరథాన్ని అధిరోహించారు. మూడు గంటల పాటు రథోత్సవం సాగింది. గాలిగోపురం నుంచి దక్షిణాభిముఖంగా ప్రారంభమైన రథం మెయిన్‌బజార్ మిద్దె సెంటర్లోని ఆంజనేయస్వామి ఆలయం వరకు కదలింది. అక్కడ ఆంజనేయస్వామి, వినాయక ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం తిరిగి రథోత్సవం గాలిగోపురం వద్దకు చేరుకుంది. స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని భక్తులు తిలకించి ముగ్ధులయ్యారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాఢ భూషి వేదాంతచార్యులు వ్యవహరించారు. పద్మశాలీయ శ్రీ లక్ష్మీనృసింహస్వామి రథ చప్పాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈవో ఎ.రామకోటిరెడ్డి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి రథాన్ని కొద్దిసేపు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లాగారు. బంగారు గరుడోత్సవం గురువార రాత్రి స్వామి కల్యాణోత్సవం అనంతరం స్వామికి బంగారు గరుడోత్సవం నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ సమారాధన నిర్వహించారు. గరుడోత్సవం శాశ్వత కల్యాణ కై ంకర్యపరులుగా వాసిరెడ్డి సీతారామయ్య కుమారలు జయదత్తు, ప్రభునాథ్లు వ్యవహరించగా బ్రాహ్మణ సమారాధన శాశ్వత కై ంకర్యపరులుగా అరిపిరాల చిన్నఅప్పయ్య శాస్త్రి, మొక్కపాటి ఆనందయ్యలు వ్యవహించారు. మంగళాద్రిపై కొలువుదీరిన ఉగ్ర నారసింహుడు ఆనంద గర్జన చేస్తూ రథారూఢుడైనట్టు.. చెంతనున్న కృష్ణమ్మ జన ప్రవాహమై పురవీధుల్లో పోటెత్తినట్టు.. అష్టదిక్పాలకుల జయజయధ్వానాలతో దక్షిణాభిముఖంగా కదిలినట్టు.. మంగళగిరి నగరం ఆధ్యాత్మికోత్సాహంలో ఓలలాడింది. లక్ష్మీ నరసింహుని రథోత్సవానికి బ్రహ్మరథం పట్టింది. నమో నారసింహా మంగళాద్రి.. ‘జన’దాద్రి అంగరంగ వైభవంగా నృసింహుని దివ్యరథోత్సవం -
బాపట్ల
శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025వాసవీ మాతకు ప్రత్యేక పూజలు దాచేపల్లి : స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ మాశెట్టి బుజ్జి, సభ్యులు పాల్గొన్నారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు తెనాలి: బాలాజీరావుపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. సాయంత్రం పెద్ద రథం ఊరేగింపు జరిగింది. వైభవంగా బ్రహ్మోత్సవాలు భట్టిప్రోలు : పెదపులివర్రులోని శ్రీ భూనీళా సమేత వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నిత్య హోమం నిర్వహించారు. విజయం ఇలా... బాపట్లకు చెందిన బ్యాంక్ ఉద్యోగి భావన్నారాయణ నాలుగేళ్ల కిందట తన ఇంటి దస్తావేజులను గుంటూరు ఐసీఐసీఐ బ్యాంక్‌లో తనఖా పెట్టి రుణం తీసుకున్నాడు. అప్పు మొత్తం చెల్లించినప్పటికీ బ్యాంక్ అధికారులు దస్తావేజులు తిరిగి ఇవ్వలేదు. ఇదేమని అడిగితే దస్తావేజులు పోయాయని చెప్పారు. దీంతో రెండేళ్ల కిందట భావన్నారాయణ గుంటూరులోని కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. బాధితుడి వాదనలు విన్న కోర్టు బ్యాంక్ అధికారులకు రూ.లక్ష జరిమానా విధించి, ఆ సొమ్మును బాధితుడికి అందజేయాలని తీర్పు ఇచ్చింది. బ్యాంక్ అధికారులు రూ.లక్ష నగదు అందజేశారు. ప్రతి వస్తువులో కల్తీలు జరుగుతున్నాయి. తూకాల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. మోసపోయామని తిరిగి వెళ్లినప్పటికీ యజమానులు సరైన సమాధానం చెప్పడం లేదు. అధికారులు స్పందించి వ్యాపార సముదాయాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలి. తూకాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలి. కాలం చెల్లిన వస్తువులను కూడా విరివిగా విక్రయిస్తున్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని నివారించాలి. –షేక్ రబ్బానీ, వినియోగదారుడు ఇఫ్తార్ సహర్ (శని) (ఆది) బాపట్ల 6.23 4.59 నరసరావుపేట 6.25 5.01 గుంటూరు 6.23 4.59 అవగాహనతోనే అక్రమాలకు అడ్డుకట్ట ● తూకాల్లో విరివిగా మోసాలు ● వినియోగదారులు ఆదమరిస్తే భారీనష్టం ● చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం ● నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం 7న్యూస్రీల్అధికారులు చర్యలు తీసుకోవాలి -
భక్తజన సంద్రంగా శింగరకొండ
అద్దంకి: పుణ్యక్షేత్రమైన ప్రసన్నాంజనేయ స్వామి 70వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి శింగరకొండ భక్తజనసంద్రంగా మారింది. ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ రాజగోపురాలు, పరిసరాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ సెట్టింగులతో క్షేత్రం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది. విద్యుత్ ప్రభపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, భక్తుల రద్దీతో క్షేత్ర పరిసరాలు ఇరుకుగా మారాయి. 650 మంది పోలీసు బలగాలతో పర్యవేక్షణ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నలుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 46 మంది ఎస్సైలు, 587 పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. తిరునాళ్ల ఇన్చార్జిగా చీరాల డీఎస్పీ మెయిన్ వ్యవహరించారు. సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి, సంతమాగులూరు మండ లం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు, మేదరమెట్ల పైలా న్ వద్ద, రేణింగవరం జాతీయ రహదారి నుంచి అద్దంకి వైపు భారీ వాహనాలను దారి మళ్లించారు. 99అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ సమీపంలో 10పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. వైభవంగా శింగరకొండ తిరునాళ్ల అద్దంకి/అద్దంకి రూరల్: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి, కొండపైనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల 70వ వార్షిక తిరునాళ్ల శుక్రవారం వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీశైలం దేవస్థాన డిప్యూటీ కమిషనర్ రమణమ్మ ప్రత్యేకాధికారిగా, ఏసీ తిమ్మనాయుడు సిబ్బంది, ప్రత్యేక సిబ్బంది సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, ఉచిత దర్శనంతోపా టు, వీఐపీ, వికలాంగులకు, వృద్ధులకు, ప్రత్యేక దర్శన క్యూలైన్లతోపాటు, వివిధ ధరలతో కూడిన దర్శన క్యూలను ఏర్పాటుచేశారు. క్యూలైన్లలోని భక్తులకు మజ్జిగ, తాగునీరు, దర్శనం చేసుకున్న భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు. ప్రత్యేక పూజలు.. ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళా భక్తులు స్వామివారికి చక్కెర పొంగలి వండి, కుండలను నెత్తిన పెట్టుకుని దర్శనంతో మొక్కులు తీర్చుకున్నారు. కొండ మీద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దేవదాయ శాఖ ఈవో కోటిరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణం, సామూహిక వ్రతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఆలయ పరిసరాల్లో, విద్యుత్ శాఖ, మోదేపల్లి పీహెచ్సీ, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, ఆర్అండ్బీ, ఫైర్, మునిసిపల్‌తోపాటు, మండల పరిషత్, ఎల్ఐసీ, స్టేట్‌బ్యాంక్ వివిధ బ్యాంక్ బ్రాంచ్‌లు, స్వచ్ఛంద సేవా సంస్థలు వాసవి వనిత క్లబ్ ప్రకా శం ప్రభుత్వ హైస్కూల్1980–81 బ్యాంచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటుతో మజ్జిగ, తాగునీరు, పులిహోర పంపిణీ చేశారు.అన్ని సామాజిక సత్రాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదానం నిర్వహించారు. ప్రత్యేక బస్సులు అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. వీటితోపాటు జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, ఒంగోలు, దర్శి, పొదిలితోపాటు వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు. కొండమీద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెంకటాపురానికి చెందిన పాకనాటి అంజిరెడ్డి, పాకనాటి మధుసూదన్‌రెడ్డికి చెందిన రెండు బస్సుల్లో భక్తులను ఉచితంగా చేరవేశారు. అంగళ్లు ఏర్పాటు క్షేత్రానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన బొమ్మలు, చెరుకు విక్రయ, వివిధ వస్తువుల దుకాణాలు ఏర్పాటుచేశారు. భక్తులతో కిక్కిరిసిన దేవస్థాన పరిసరాలు సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా 650 మంది పోలీసులతో బందోబస్తు విద్యుత్ వెలుగుల్లో ప్రభలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
నేడు వైభవంగా శ్రీనివాస కల్యాణం
తాడికొండ:వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఆలయంలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2,700 మంది భక్తులు కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లుచేసినట్లు వివరించారు. సీఆర్డీఏ పరిధిలోని 24 గ్రామాల ప్రజలు వెంకటపాలెం చేరేందుకు వీలుగా 300 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కల్యాణోత్సవానికి ఆలయం ముస్తాబవుతోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో పుష్పాలకంరణ పనులు వేగంగా చేస్తున్నారు. దాదాపు 4 టన్నుల పూలు, 30 వేల క్లట్ ఫ్లవర్స్‌తో అలంకరణ చేశారు. 2,700 మంది తిలకించేలా ఏర్పాట్లు భక్తుల రాక కోసం 300 బస్సులు టీటీడీ ఈవో జె శ్యామలరావు -
అట్టడుగు వర్గాల అభ్యున్నతితోనే దేశాభివృద్ధి
ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి కాజీం ఏఎన్‌యూ: అట్టడుగు వర్గాల అభ్యున్నతితోనే దేశాభివృద్ధి సాధ్యమని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.కాశీం అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాబూ జగ్జీవన్‌రామ్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘రోల్ ఆఫ్ బాబూ జగ్జీవన్‌రామ్ ఇన్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ సభలో ఆచార్య కాశీం కీలకోసన్యాసం చేశారు. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ లక్ష్యం ఒక్కటేనన్నారు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ బి.కోటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ ఎస్.సరళా వందనం, విశ్రాంత ఐఆర్టీఎస్ అధికారి ఎ.భరత్‌భూషణ్ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఆలోచనా విధానాలను వివరించారు. వీసీ ఆచార్య కె గంగాధరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, కావలి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ కళాశాల కామర్స్ విభాగాధిపతి ఆచార్య సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సదస్సు డైరెక్టర్ ఆచార్య పీజే రత్నాకర్ నివేదిక సమర్పించారు. అనంతరం సదస్సు పరిశోధనా పత్రాల సావనీర్‌ను, బాబూ జగ్జీవన్‌రామ్ ఫౌండేషన్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్ ఆనందబాబు రాసిన కర్మయోగి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ పుస్తకాన్ని అతిధులు ఆవిష్కరించారు. -
నూతన పారిశ్రామిక చట్టంపై అవగాహన పెంచుకోవాలి
ఎంఎస్ఎంఈ ఏడీ డాక్టర్ కె.ఎల్.ఎస్.రెడ్డి బాపట్ల: నూతన పారిశ్రామిక విధానాలపై అవగాహన కలిగి ఉండి ప్రభుత్వం ఇచ్చే రాయితీలను, సహకారాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించవచ్చని ఎంఎస్ఎంఇ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కెఎల్ఎస్ రెడ్డి పేర్కొన్నారు. బాపట్ల తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులు, వాటిపై అవలంభించాల్సిన విధానాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమలను స్థాపించేందుకు కావాల్సిన వనరులపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీల గురించి తెలుసుకోవాలని సూచించారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించటం వలన కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ఇండస్ట్రియల్ సైకాలజిస్ట్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలు తక్కువ పెట్టుబడి వ్యయంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని నాణ్యతతో కూడిన ఉత్పత్తి సామార్ాధ్యన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాలలో ఉంటే సబ్సిడీలను కూడా తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కో ఆర్టినేటర్ పి.వీరయ్య, బాపట్ల జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మిశెట్టి రత్నగుప్తా, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులను భాగస్వాములను చేయాలి
రైతు సాధికారిత సంస్థ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్ నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ ప్రణాళికలో రైతులను భాగస్వాములను చేయాలని రైతు సాధికారిత సంస్ధ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి వార్షిక కార్యచరణ ప్రణాళికపై శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి జూమ్ కాల్ ద్వారా హాజరైన విజయకుమార్ మాట్లాడుతూ రసాయన వ్యవసాయం వల్ల పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలుగుతుందని తెలిపారు. వాతావరణం కూడా అత్యవసరస్థితిని ఎదుర్కుంటుందని చెప్పారు. ఖరీఫ్ వార్షిక ప్రణాళిక, సార్వత్రిక సూత్రాలు, పలు జిల్లాల్లో వ్యవసాయ విధానాలు, రైతులు పండిస్తున్న ఏ గ్రేడ్, ఏటీఎం మోడల్లో పండిస్తున్న పంటలు, రైతుల విజయ గాథలను వివరించారు. డీపీఎం అమలకుమారి మాట్లాడుతూ వ్యవసాయ, డీఆర్డీఏ, ఉపాధి హామీ, సెరీకల్చర్, హార్టీకల్చర్ తదితర శాఖల సమన్వయంతో కలిసి ప్రణాళికలను తయారు చేసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో ర్యాలీలు, గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. నవధాన్యాలు సాగుభూమికి ఎంత మేలు చేస్తాయో వివరించారు. రైతులంతా పీఎండీఎస్ పద్ధతిని అవలంబించి సాగు చేయాలని సూచించారు. 30 రకాల విత్తన పద్ధతిని పాటిస్తే భూములు సారవంతమవుతాయని తెలిపారు. భూమి సంవత్సరమంతా పచ్చగా ఉంటే జీవ వైవిధ్యం పెరిగి భూమి సారవంతమై, చీడపీడల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజు, రాష్ట్ర శిక్షకురాలు శాంతి, జిల్లా శిక్షకుడు సైదయ్య, ఎన్ఎఫ్ఏలు నందకుమార్, అప్పలరాజు, సౌజన్య, మేరి, స్వాతి పాల్గొన్నారు. -
గొలుసు లాక్కొని యువకుల పరారీ
నరసరావుపేట టౌన్: ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కొని వెళ్లిన సంఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్‌నగర్ 60 అడుగుల రోడ్డు సీబీఐటీ స్కూల్ సమీపంలో నలిశెట్టి సులోచన నడిచి వెళ్తుండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో బంగారు గొలుసును లాక్కొని పరారీ అయ్యారు. ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంబడించినా ఫలితం దక్కలేదు. ఈ మేరకు బాధితురాలిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిశోర్ తెలిపారు. విశాఖపట్నం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం–చర్లపల్లి ప్రత్యేక రైలు (08579) ఈ నెల 16న సాయంత్రం 6.20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08580) ఈ నెల 17న ఉదయం 10 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, అదే రోజు రాత్రి 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడకుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. -
ఉత్కంఠ మిన్నంటెన్
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి చదువు కీలకదశకు చేరింది. సోమవారం పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులు చదువులో తలమునకలై ఉండగా, వారిని సంసిద్ధం చేయడంలో ఉపాధ్యాయులు నిమగ్నమై ఉన్నారు. బిడ్డల చదువులపై తల్లిదండ్రులూ ఉద్విగ్నక్షణాలు అనుభవిస్తున్నారు. ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 30,410 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాయనున్నారు. వీరికోసం 150 కేంద్రాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ●హాల్‌టికెట్లు పొందిన విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలను సందర్శించి రోజూ పరీక్షకు ఎలా వెళ్లాలి.. ఎంత సమయం ముందు ఇంటి నుంచి బయలుదేరాలనే అంశాలపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ●పరీక్ష రోజు ఉదయం 8.30 గంటల కల్లా కచ్చితంగా పరీక్షా కేంద్రాల వద్ద ఉండేలా చూసుకోవాలి. ●ఉదయం 8.45 నుంచి 9.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారని, 9.30 తరువాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారని గుర్తుంచుకోవాలి. ●హాల్ టికెట్లపై ముద్రించిన తమ వివరాలు, పుట్టినతేదీ, తల్లిదండ్రుల పేర్లు, రాయాల్సిన సబ్జెక్టులు, పరీక్ష కేంద్రం పేరు, చిరునామా సరి చూసుకోవాలి. వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ముందుగానే తాము చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లి, సరి చేయించుకోవాలి. ●హాల్ టికెట్‌పై ఉన్న ఎన్రోల్ నంబరు ఆధారంగా కేటాయించిన గదులకు చేరుకోవాలి. ●పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రంపై ఏడు అంకెలతో కూడిన ప్రత్యేక కోడ్ ఉంటుంది. అది ఉందో లేదో చూసుకోవాలి. ●పరీక్ష గదిలోకి ప్రవేశించగానే బార్ కోడింగ్‌తో కూడిన ఓఎంఆర్ షీట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఇన్విజిలేటర్ సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఓఎంఆర్ షీట్ పూరించాలి. దానిపై అనవసరమైన గీతలు గీయరాదు, వ్యర్థ రాతలు రాయరాదు. ●ఓఎంఆర్ షీట్‌పై విద్యార్థి పేరు, రాయబోవు పరీక్షకు సంబంధించిన వివరాలు సక్రమంగా ఉన్నవీ, లేనివీ నిర్ధారించుకోవాలి. ●9.30 గంటలకు పరీక్ష ప్రారమవుతుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష ముగుస్తుంది. ఈ మధ్య సమయంలో విద్యార్థులను బయటకు అనుమతించరు. ●గుర్తింపు కార్డు కలిగిన పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు, స్క్వాడ్ బృందాలనే పరీక్ష కేంద్రాల్లోకి తనిఖీలకు అనుమతిస్తారు. ●పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుశాఖ 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు విస్తృత రీతిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ●ప్రశ్నపత్రం లీక్ అయిందని, పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిందని కొందరు పనిగట్టుకుని చేసే ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకుండా, విద్యార్థులు పరీక్షలకు ప్రశాంతంగా హాజరు కావాలి. ఒక వేళ్ల ఏదైనా సెంటర్ నుంచి ప్రశ్నపత్రం లీకేజీకి గురైతే, అది ఎక్కడ జరిగిందో గుర్తించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ●పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పక్కవారి పేజీలను చూసి సమాధానాలు రాయాలనే ఆలోచన వీడాలి. కాపీయింగ్‌కు పాల్పడినా, జేబులో స్లిప్పులు పెట్టుకుని వచ్చినా, పరీక్ష కేంద్రంలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పరీక్ష రాసే సమయంలో ఏ విద్యార్ధి వద్ద అయినా స్లిప్పులు కనిపిస్తే పరీక్షల నుంచి డీబార్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ●ఓఎంఆర్ షీట్, ఆన్సర్ బుక్లెట్లలో ఏ ఒక్క పేజీని చింపినా మాల్ప్రాక్టిసుగా పరిగణిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. పదో తరగతి పరీక్షలకు సర్వంసిద్ధం చదువులో తలమునకలైన విద్యార్థులు సంసిద్ధంలో ఉపాధ్యాయులు నిమగ్నం తల్లిదండ్రుల్లోనూ ఉద్విగ్నం 17 నుంచి పరీక్షలు ప్రారంభం పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విస్తృత ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేశాం. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉంటాయి. విద్యార్థులను సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. పరీక్ష కేంద్రాలకు వెళ్లి, వచ్చేందుకు ఆర్టీసీ బస్సులో హాల్ టికెట్ చూపించి, ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. – సీవీ రేణుక, డీఈవో, గుంటూరు -
రేపు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
బాపట్ల: అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం బాపట్లలో జరుగుతుందని పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లవరపు పవన్‌కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్‌కుమార్ మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులతోపాటు కార్యవర్గ సభ్యులందరూ పాల్గొంటారని తెలిపారు. విద్యారంగంలో వస్తున్న మార్పులపై చర్చించటంతోపాటు ఏబీవీపీ భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. బీజేపీ నాయకుడిపై పలువురి దాడి రేపల్లె రూరల్: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన నగరం మండలం బోరమాదిగపల్లిలో చోటుచేసుకుంది. బోరమాదిగపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నగరం మండల అధ్యక్షుడు జుజ్జువరపు సురేష్‌కు అదే గ్రామానికి చందిన చందోలు వీరయ్యతో కొంత కాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. వీరయ్య మరి కొంతమంది గురువారం రాత్రి గ్రామ సమీపంలో కాపుకాసి ఇంటికి వెళ్తున్న సురేష్‌పై దాడికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు కేకలు వేయటంతో వీరయ్యతోపాటు దాడికి ఉపక్రమించిన వారు పారిపోయారు. సురేష్‌ను వైద్య చికిత్సల కోసం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరయ్యతోపాటు దాడికి పాల్పడిన వారు మంకీ క్యాప్ ధరించి ఉన్నారని బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగరం ఎస్ఐ భార్గవ్ తెలిపారు. సురేష్‌పై దాడి సంఘటన తెలుసుకున్న బీజేపీ నాయకులు బేతపూడి వెంకటేశ్వరరావు, పిన్ని సాంబశివరావులు పరామర్శించి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాతకక్షలతో ఓ వ్యక్తిపై దాడి రేపల్లె రూరల్: పాతకక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని జంగాలపాలెంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న కొమరాబత్తిని శ్యామ్‌కుమార్‌పై అదే గ్రామానికి చెందిన కనపర్తి నాగేంద్రబాబు గురువారం రాత్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు నాగేంద్రబాబును అడ్డుకుని తీవ్రంగా గాయపడిన శ్యామ్‌కుమార్‌ను రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. -
వైభవంగా శత చండీ మహా యాగం
సత్తెనపల్లి: పట్టణంలోని భవిష్య పాఠశాల సమీపంలో గల త్రిశక్తి దుర్గాపీఠంలో శతాధిక ప్రతిష్టా బ్రహ్మ, దేవీ ఉపాసకులు, విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక కోశాధికారి, పరమ పూజ్య శ్రీ హనుమత్ స్వామి ఆధ్వర్యంలో పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శత చండీ మహాయాగం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. చండీ పారాయణం, శత చండీ హోమం, గురు వందనం, ప్రధాన దేవతా ఆర్చణ, శత చండీ హోమం, లలిత సహస్ర నామార్చన, దీపార్చన, హారతి, మంత్ర పుష్పం, అమ్మవార్లకు దశ విధ అభిషేకాలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. బగలాముఖి, రాజశ్యామల, వారాహి హోమాలు, యోగిని మండప హోమాలు నిర్వహించారు.గణేష్ యువసేన, త్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవ కమిటీ, త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ నెల 6న ప్రారంభమైన పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శత చండీ మహాయాగం శనివారంతో ముగియనుంది. ఆఖరి రోజు శనివారం సర్వతోభద్ర మండల హోమాలు, ప్రాయశ్చిత హోమాలు, శాంతి హోమాలు, మహా పూర్ణాహుతి, శివపార్వతుల కల్యాణం, ప్రోక్షణ, వేదఆశీర్వచనం, పండితుల సత్కారాలు, అన్నదానం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు హజరుకానున్నట్లు ధర్మకర్తలు తెలిపారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
తాడికొండ: తాడికొండ మండలం నిడుముక్కలలో అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 16 రేషన్ బియ్యం మూటలను గురువారం అర్ధరాత్రి పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిడుముక్కల దర్గాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఈ మూటలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూటలను రేషన్ షాప్ నంబర్ 12కు అప్పగించినట్లు రెవెన్యూ ఆర్ఐ హనుమంతరావు వెల్లడించారు. మాణిక్యవేల్‌కు నివాళి నగరంపాలెం (గుంటూరు వెస్ట్): ట్రిపుల్ ఎక్స్ సోప్ అధినేత డాక్టర్ అరుణాచలం మాణిక్యవేల్ (77) అంత్యక్రియుల శుక్రవారం జరిగాయి. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విధితమే. అరండల్‌పేట 10/2వ అడ్డరోడ్డులోని ఆయన నివాస గృహంలో సందర్శకుల సందర్శనార్థం ఉంచారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్.నూరిఫాతిమా, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి (పశ్చిమ), నసీర్‌అహ్మాద్ (తూర్పు), ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరొందిన ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాణిక్యవేల్ అంత్యక్రియలు కొరిటెపాడులోని శశ్మానవాటికలో జరిగాయి. కుటుంబ సభ్యులు, ట్రిపుల్ ఎక్స్ సోప్ ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున తరలివెళ్లారు. -
నాటు సారాతో కుటుంబాలు రోడ్డు పాలు
నిజాంపట్నం: నాటు సారా తాగటంతో జీవితాలు నాశనమవ్వటమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడిన సంఘటనలు అనేకం ఉన్నాయని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నాటు సారాతో కలిగే దుష్పరిణామాలపై నగరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయం ఆధ్వర్యాన మండలంలోని దిండి పంచాయతీ యేమినేనివారిపాలెం గ్రామంలో శుక్రవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నాటు సారా వ్యతిరేక నినాదాలతో గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. తామే కాకుండా తమ కుటుంబ సభ్యుల జీవితాలను సైతం పాడుచేయటం ఎంత వరకు సబబో తామే ఆలోచించాలని సూచించారు. అపరిశుభ్ర వాతావరణంలో అశాసీ్త్రయంగా తయారు చేయటంతో నాటు సారాలో ఎక్కువ మోతాదులో విషపూరిత రసాయనాలు ఉంటాయని, దీన్ని తీసుకోవటంతో ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, శరీరంలో అన్ని అవయవాలు దెబ్బతింటాయన్నారు. ఆర్థికంగా, సామాజికంగా గౌరవ మర్యాదలు కోల్పోయిన వారవతారన్నారు. నాటు సారా తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా చట్టరీత్యా నేరమని, ఈ నేరానికి పాల్పడిన వారికి 8 సంవత్సరాల కఠిన శిక్షతోపాటు రూ.5లక్షలు జరిమానా విధిస్తారని తెలిపారు. నాటుసారా తయారు చేసేవారికి అవసరమైన ముడిసరుకులు అందించే వారికి, విక్రయించే వారికి కూడా శిక్షలు తప్పవని చెప్పారు. గ్రామంలో నాటుసారా తయారు కాకుండా ఉండేందుకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. గ్రామంలో ఎవరైనా నాటుసారా తయారు చేస్తున్నట్లు గమనిస్తే తమకుగాని, 9490455599, 9440902477 నంబర్లకుగాని, 14405 టోల్‌ఫ్రీ నంబరుకుగాని సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగరం సీఐ శ్రీరామ్‌ప్రసాద్, ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్ఐలు ఎస్.రామారావు, పి.రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. నాటు సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరం బాపట్ల ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు -
ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేయాలి
నరసరావుపేట రూరల్: వ్యవసాయ అనుబంద శాఖల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి సూచించారు. ప్రకృతి వ్యవసాయ 2025 ఖరీఫ్ ప్రణాళికపై క్రోసూరు, వినుకొండ, మాచర్ల డివిజన్లోని సిబ్బందికి గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. డీపీఎం అమలకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యాలయ ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమలకుమారి మాట్లాడుతూ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు నిర్వహించడం వలన రైతులు త్వరితగతిన అభివృద్ధి చెందుతారని తెలిపారు. ప్రణాళిక తయారిలో సామాజిక, ఆర్థిక, భౌతిక వనరులతో పాటు అన్నిరకాల అంశాలను సమగ్రరూపంలో నమోదు చేయాలని సూచించారు. వ్యవసాయ, డీఆర్డీఏ, ఉపాధి హామీ, సెరికల్చర్, హార్టికల్చర్ శాఖల సమన్వయంతో ప్రణాళిక తయారు చేసుకోవలని తెలిపారు. ఏఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాలైన తొమ్మిది సార్వత్రిక సూత్రాలను, వాటి లాభాలను రైతులకు తెలియజేయాలని తెలిపారు. అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజు, జిల్లా శిక్షకుడు టి.సైదయ్య, ఎన్ఎఫ్ఏలు నందకుమార్, సౌజన్య, అప్పలరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక
వినుకొండ: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధ లింగమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 26 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సామాజిక తనిఖీ బృందం సమర్పించిన నివేదికలను పీడీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో అవకతవకలను మొత్తం రూ.48వేలు పెనాల్టీలు విధించారు. అలాగే రూ.4,00,858లు రికవరీ చేయడానికి ఆదేశించారు. కొన్ని అంశాలపై ఏపీడీ విచారణకు ఆదేశిస్తూ రూ.58,876లు కేటాయించారు. గ్రామసభల్లో కూలీలు లేవనెత్తిన అంశాల ఆధారంగా రూ.96,227లు డ్రాప్ చేయాలని నిర్ణయించారు. రైతులు నాటిన మొక్కలను తిరిగి నాటాలని, రోడ్డు పక్కన నాటిన మొక్కలను పునరుద్ధరించాలని ఆదేశించారు. అంతేకాకుండా రూ.10,47,594 విలువైన పండ్ల తోటల మొక్కలు నాటాలని సూచించారు. మొత్తం మీద ఈ సామాజిక తనిఖీల్లో రూ.15,92,679 విలువైన అవకతవకలను గుర్తించారు. ఈ అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశించారు. కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. -
బాల శాస్త్రవేత్త సిద్ధార్థ్‌కు సన్మానం
గుంటూరుమెడికల్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో గుండె పనితీరు పరీక్షలు చేస్తున్న 14 ఏళ్ల బాల శాస్త్రవేత్త సిద్ధార్థ్ సుమారు 14 వేల మంది అమెరికా పౌరులపై రీసెర్చ్ చేశారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. సిద్దార్థ్ తాను కనుగొన్న యాప్ ద్వారా జీజీహెచ్‌లో రెండు రోజులుగా పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు. సిద్ధార్థ్‌ను డాక్టర్ యశశ్వి రమణ గురువారం సత్కరించారు. సిద్ధార్థ్‌కు మంచి భవిత ఉందని చెప్పారు. సిద్ధార్థ్‌ను ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. బాల శాస్త్రవేత్త సిద్ధార్థ్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తాను చేసిన పరీక్షల సందర్భంగా గుర్తించిన అంశాలను వివరించారు. ఐదుగురికి గుండె చప్పుడు ఆధారంగా హుద్రోగం ఉన్నట్టు గుర్తించానని వెల్లడించారు. వీరిలో నలుగురు కార్డియాలజీ విభాగంలో ఓపీకి వెళ్లగా, వారికి గుండె జబ్బు ఉన్నమాట నిజమేనని నిర్ధారణైందన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన సూపరింటెండెంట్ డాక్టర్ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. 20న ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు గుంటూరు మెడికల్: ఆరోగ్య రంగంలో నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై గుంటూరు మంగళదాస్‌నగర్‌లోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో ఈనెల 20న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సి.హెచ్.నాగేశ్వరరావు తెలిపారు. సదస్సుకు కిమ్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతారన్నారు. -
పూర్తి స్థాయిలో హార్బర్ నిర్మించండి
చీరాల టౌన్: చీరాలకు హార్బర్ అందని ద్రాక్షలా మారకుండా ఉండాలంటే వాడరేవులోనే పూర్తిస్థాయిలో నిర్మాణం చేయాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.రమాదేవి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వాడరేవు గ్రామంలోని ఫిష్ ల్యాండ్ సెంటర్ వద్ద సీపీఎం వాడరేవు కార్యదర్శి ఎన్.బాబూరావు ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ ఎరిపిల్లి రమణ అధ్యక్షతన మత్స్యకారులతో సమావేశాన్ని నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ చీరాలకు తలమానికమై వాడరేవులో నిర్మిస్తున్న హార్బర్ వ్యయాన్ని తగ్గిస్తున్నట్లు ప్రయత్నాలు చేయడం చీరాల ప్రజలతోపాటు మత్స్యకారులను తీవ్రంగా మోసం చేసినట్లేనన్నారు. హార్బర్ నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మత్స్యకారుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం దుర్మార్గమన్నారు. గతేడాది ఇవ్వాల్సిన మత్స్యకరా భరోసా సాయాన్ని నేటికీ అందించకుండా పాలకులకు గంగపుత్రులను నట్టేట ముంచారన్నారు. మత్స్యకారులకు రుణాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని మండిపడ్డారు. హార్బర్ ఏర్పాటుతో చీరాల రూపురేఖలు మారడంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మత్స్యసంపద నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు నిర్మాణం చేయడంతో పాటుగా గిట్టుబాటు ధరలు వస్తాయన్నారు. హార్బర్ అనుసంధానంగా పలురకాల వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు కలిగి తీరప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఓ వైపు వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయని, ఈ రహదారి వినియోగంలోకి వస్తే చీరాల పర్యాటకంగా దూసుకెళ్తుందని, అలానే హార్బర్ పనులు కూడా వేగంగా చేస్తే చీరాల, వాడరేవు రూపురేఖలు మారుతాయన్నారు. హార్బర్ వ్యయాన్ని తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 9 హార్బర్ పనులను ప్రభుత్వమే పూర్తి చేయాలన్నారు. సముద్రంలో వేట చేస్తూ మరణించిన, గల్లంతైన వారికి మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం మత్య్సకారులను నయవంచనకు గురించేయడమేనన్నారు. మత్స్యకార సంఘాల నాయకులు కనకరాజు, ఏసు, అంజని, సత్తిబాబు, గాలి, శ్రీను, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్రకార్యవర్గ సభ్యులు రమాదేవి -
సీల్ వేసిన ఇంట్లో చోరీ
వేటపాలెం: స్థానిక బందావారి వీధిలో పోలీసులు సీల్ వేసిన ఇల్లు చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. 2022లో వేటపాలెం కో–ఆరేటివ్ క్రెడిట్ సొసైటీలో రూ.25 కోట్లు డిపాజిట్లను సొసైటీ పాలక వర్గం గోల్ మాల్ చేసింది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న శ్రీరాం శ్రీనివాసరావుకి సంబంధించిన ఆస్తులను పోలీస్‌లు సీజ్ చేశారు. అందులో భాగంగా బందావారి వీధిలో ఉన్న ఇంటికి సీల్ వేశారు. అయితే సీల్ వేసిన ఇంటి వరండాలో ఉన్న ఇనుప గ్రిల్స్‌కి ఉన్న తాళం దొంగలు పగుల గొట్టి ప్రధాన ద్వారం తెరవడానికి దుండగులు యత్నించారు. అయితే ప్రధాన ద్వారం తెరుచుకోకపోవడంతో పక్కనే ఉన్న కిటికీ గ్రిల్స్ కోసి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడవేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు చోరీకి గురైన ఇంటిని సిబ్బందితో కలిసి పరిశీలించారు. చోరీ జరిగి దాదాపు నెల పైగా అయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాన ద్వారం తాళాలు లేకపోవడంతో లోపలికి వెళ్లి చూడటానికి వీలు పడలేదు. ఇంటి యజమానిపై అనుమానాలు.. అయితే రూ.25 కోట్లు గోల్మాల్ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాసరావు.. నరసరాపేటలో నివాసం ఉంటున్నాడు. అతనే సీలు పగుల గొట్టించి ఇంట్లో దాచుకున్న విలువైన వస్తువులను తీయించి ఉంటాడని సొసైటీ బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ1 ముద్దాయిని తిరిగి పోలీస్‌లు అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించాలని కోరుతున్నారు. కోఆపరేటివ్ కేసులో ఏ–1 ముద్దాయి ఇంటిలో ఘటన -
కనుల పండువగా మల్లేశ్వరుని రథోత్సవం
భట్టిప్రోలు: హరహర మహాదేవ..శంభో శంకర...అంటూ భక్తులు తన్మయత్వంతో శివనామస్మరణ చేస్తుంటే భట్టిప్రోలులో గురువారం భ్రమరాంబ మల్లేశ్వరస్వామి రథం ముందుకు కదిలింది. తండోప తండాలుగా తరలి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి రఽథాన్ని ఉత్సాహంగా లాగుతుంటే భక్తులు మిద్దెలు, గోడలు ఎక్కి ఆ సుందర దృశ్యాన్ని తిలకించారు. పురవీధులన్నీ జనంతో నిండిపోయాయి. స్వామి వారి కల్యాణ మహోత్సవాలే భట్టిప్రోలు తిరునాళ్లగా ప్రసిద్ధి గాంచాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టమైన రథోత్సవం సాయంత్రం నేత్ర పర్వంగా కొనసాగింది. రథోత్సవానికి ముందు యాజ్ఞీకులు కౌతా సత్య వెంకట నాగరాజేష్ శర్మ హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో తిరువీధుల నాని నాగార్జున–రోజ దంపతులు పాల్గొన్నారు. రథం దేవాలయం వద్ద నుంచి బయలు దేరి పురవీధుల గుండా స్వామి వారి అత్తవారి ఇల్లు అయిన అద్దేపల్లి అమ్మవారి చెట్టు వద్ద కు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. రథంపై పూలతో అలంకరించిన స్వామి వారిని చూసి భక్తులు పులకించి పోయారు. తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేక చర్యలు తిరునాళ్ల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపల్లె డీఎస్పీ ఆధ్వర్యంలో వేమూరు సీఐ ఆంజనేయులు, భట్టిప్రోలు ఎస్ఐ ఎం.శివయ్య పర్యవేక్షణలో వేమూరు, చుండూరు, సర్కిల్ పరిధిలోని ఏడుగురు ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది 100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమాలను వంశపారంపర్య ధర్మకర్తలు అద్దేపల్లి–భట్టిప్రోలు పద్మశాలీయ బహుత్తమ సంఘీయులు, దేవాలయ కార్యనిర్వాహణాధికారి రేపల్లె ఇన్స్పెక్టర్ శనగవరపు కుమార్‌బాబు పర్యవేక్షించారు. భట్టిప్రోలు పురవీధులలో ఊరేగిన భ్రమరాంబ మల్లేశ్వరస్వామి తరలివచ్చిన భక్తులు -
బరిలో దిగితే బహుమతే..
జె.పంగులూరు: అతనికి పశువులంటే ప్రాణం..వాటికి శిక్షణ ఇవ్వడమంటే మరింత సరదా..అతని వద్ద శిక్షణ పొందిన ఎద్దులు బరిలో దిగితే బహుమతి ఖాయం..అందుకే అతని వద్ద శిక్షణ పొందిన గిత్తలంటే యమ క్రేజ్..రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఎద్దులను కొనుగోలు చేస్తుంటారు..కానీ అతనికి ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు లేదు. జె.పంగులూరు మండలం పంగులూరు గ్రామానికి చెందిన పెంట్యాల రాంబాబు 1991వ సంవత్సరం నుంచి పరుగు పందెపు ఎద్దులకు శిక్షణ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 50 జతలకు శిక్షణ ఇచ్చాడు. నాటు జాతికి చెందినవి, మైసూర్ ఎద్దులను ఎక్కువగా కొనుగోలు చేసి వాటికి శిక్షణ ఇస్తాడు. ఇతని వద్ద శిక్షణ తీసుకున్న ఎద్దుల జతలను కొనుగోలు చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఆసక్తి చూపుతారు. పోషణ ఖర్చుతో కూడిన విషయం పందెపు ఎద్దులను మేపాలంటే ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక జత ఎద్దులకు దాణాకి ప్రతి నెలా రూ.30 వేలు వరకు ఖర్చు అవుతుంది. ఎద్దులను శుభ్రం చేయడానికి, సమయానికి మేత వేయటానికి ఇద్దరు పనివారు కావాలి, ఒక్కొక్కరికి రూ.10 వేలు జీతం ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ఒక జత పందెపు ఎద్దులను పెంచాలంటే సూమారు రూ.5 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. అంతేకాక పందెం జరిగే ప్రాతానికి ఎద్దుల జతను తీసుకెళ్లేందుకు రవాణ ఖర్చులు చాలా ఎక్కువ. నిర్వాహకులు అందించే బహుమతులు దారి ఖర్చులకే సరిపోతాయి. ఎద్దుల పోటీలు ఎక్కువగా గ్రామాలలోనే జరుగుతాయి. వాటిని పెంచి పోషంచేది కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులే. వారికి ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తే మున్ముందు మేలైన జాతి ఎద్దులను పెంచి పోషించవచ్చు. 21సార్లు ప్రథమ స్థానం 1991 నుంచి 2017 సంవత్సరం వరకు 26 సార్లు రాంబాబు ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. 21 సార్లు ప్రథమ స్థానంలో నిలవగా, ఐదు సార్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. మూడు దశాబ్దాలుగా ఎద్దులకు శిక్షణ ఇస్తున్న రాంబాబు తర్ఫీదు ఇచ్చిన ఎద్దులకు మంచి గిరాకీ రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి కొనుగోలు ఎద్దుల నిర్వహణ భారం ప్రస్తుత కాలంలో ఎద్దుల నిర్వహణ భారం. ప్రతి నెలా రెండు జతల ఎద్దులు మేపాలంటే ఇద్దరు జీతగాళ్లు పనిచేయాలి. మొత్తం మీద నెలకు రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. వాటికి ఉలవలు దాణాగా మూడు పూటల పెట్టాలి. ఎద్దుల జతకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేడినీటితో స్నానం చేయించాలి. ప్రతి రోజూ మసాజ్ చేయాలి. అనుక్షణం జాగ్రత్తగా చూసుకోవాలి. పందేలు జరిగే ప్రాంతానికి ఎద్దులను తీసుకుపోవాలంటే రవాణా ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. ఎన్నో విజయాలను సాధించాను. సరైన గుర్తింపు లేదు. – పెంట్యాల రాంబాబు -
శింగరకొండ తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు
బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ అద్దంకి రూరల్: శింగరకొండ తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. గురువారం తిరునాళ్ల సందర్భంగా శింగరకొండ దేవస్థానాన్ని ఎస్పీ సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ తిరునాళ్లకు 3 లక్షల మంది భక్తుల వరకు వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా 650 మంది పోలీసులు, నలుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 46 మంది ఎస్సైలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. దొంగతనాలు ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, పార్కింగ్ ప్రదేశాల్లో నిఘా కోసం 2 డ్రోన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలకు సహాయం అందించేందుకు దేవాలయ ప్రాంగణంలో పోలీస్ కంట్రోలు రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ మొయిన్, ఎస్బీసీఐ నారాయణ, అద్దంకి సీఐ సుబ్బరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున, ఇంకొల్లు సీఐ రమణయ్య పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తెనాలి: చెంచుపేట అమరావతి కాలనీలోని శ్రీగోదా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలను ఆరంభించారు. ఈనెల 17 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, వేదవిన్నపాలు, ప్రధాన కలశస్థాపన, చతుస్థానార్చనలు, నిత్యపూర్ణాహుతి చేశారు. ఉదయం 10 గంటలకు ‘ధ్వజారోహణం’, గరుడ ప్రసాదగోష్టి తదుపరి తీర్థప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణ, నిత్యహోమం, భేరిపూజ, దేవతాహ్వానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈనె 15వ తేదీన శ్రీస్వామివారి కళాణ మహోత్సవం వైభవంగా జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. వార్షికోత్సవాలకు ముందుగా ఈనెల 9వ తేదీనుండి 11వ తేదీవరకు అధ్యయనోత్సవాలు జరిగాయి. -
శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహిస్తాం
తాడికొండ:గుంటూరు జిల్లా వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈనెల 15న సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ చైర్మన్ ఈవో జె.శ్యామలరావుతో కలిసిఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ అమరావతి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక ల క్ష్మి, ఎం.శాంతారామ్, ఎం.ఎస్.రాజు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, సీపీఆర్ఓ డాక్టర్ టి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు -
ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలి
● జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ● పక్కా గృహాల నిర్మాణంపై సమీక్ష బాపట్ల: పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. గృహ నిర్మాణాలపై ఆ శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు గృహాలు మంజూరై వివిధ దశలో అసంపూర్తిగా ఉన్నటువంటి వారికి ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. జిల్లాలో సుమారు 16 వేల 85 గృహాలు నిర్మాణం నిలిచిపోయి ఉన్నాయని తెలిపారు. ఎంఎస్ఓలు, సీఎస్ఓలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సచివాలయ సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది జీఎస్‌డబ్ల్యూఎస్ వారీగా లబ్ధిదారుల గృహాలకు వెళ్లి వారితో సంప్రదించి వారి గృహాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయం గురించి వారికి తెలిపి వారిలో చైతన్యం తీసుకు వచ్చి, గృహాల నిర్మాణం పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి స్వచ్చాంధ్ర కార్యక్రమంతో పర్యావరణాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలని చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించాలని, విక్రయాలను సైతం అరికట్టాలన్నారు. భూమిలో కుళ్లిపోయే పదార్థాలను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ చెప్పారు. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం ఒక అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని పెద్దఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈనెల 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛాంద్ర జిల్లాస్థాయి కార్యక్రమం సూర్యలంక బీచ్ వద్ద శనివారం ఉదయం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, సీపీఓ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు.సామాన్యులను ఆకట్టుకునేలా మొల్ల రామాయణం సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా మొల్ల రామాయణాన్ని రచించారని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో కవియిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి.జి గంగాధర్‌గౌడ్, జిల్లా వెనుకబడిన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, జిల్లా పౌర సంబంధాల అధికారి మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహర్ (శుక్ర) (శని) బాపట్ల 6.23 5.00 నరసరావుపేట 6.25 5.02 గుంటూరు 6.23 5.00● గగ్గోలు పెడుతున్న ఆక్వా రైతులు ● భారీగా తగ్గిన ఎగుమతులు చీరాల: రొయ్య ధరలు రోజురోజుకీ పతనమవుతున్నాయి. రోజుకి రూ.10 చొప్పున తగ్గిపోతుండడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎగుమతిదారులు ప్రస్తుతం ఏ కారణం చెప్పకుండానే ధరలు తగ్గించేస్తున్నారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి మరింత పతనం చేస్తున్నారు. దీని వల్ల ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. గత నెల రొయ్యల ధరలతో లెక్కిస్తే రూ.4 వేల కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. అయితే ప్రస్తుత ధరలతో రూ.3.5 వేల కోట్లకు పడిపోయింది. యూటర్న్.. భారతదేశం నుంచి రొయ్య ఎగుమతులు ఎక్కువగా యూరోపియన్ దేశాలకు వెళుతుంటాయి. యూరప్‌లోని పది దేశాల్లో ఆంధ్రా రొయ్యలకు మంచి డిమాండ్ ఉంది. అయితే కొంతమంది రైతులు అత్యుత్సాహానికి వెళ్లి నిషేధిత యాంటీ బయోటిక్స్ సాగులో వాడడం వల్ల యూరోపియన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ నౌకాశ్రయాల ద్వారా ఎగుమతవుతున్న ప్రతి రెండు కంటెయిన్లలో ఒక దానికి శాంపిల్స్ తీస్తున్నారు. యాంటీ బయోటిక్స్ ఉన్నట్లు తేలితే ఎగుమతులు చేసే లైసెన్సులు రైతులు కోల్పోతున్నారు. అమెరికా దేశానికి ఎగుమతి అయ్యే రొయ్య ఉత్పత్తుల శాంపిల్స్ తక్కువగా తీస్తుండడంతో ఎక్కువ మంది రైతులు ఆ దేశం వైపు మొగ్గు చూపుతున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు నాణ్యమైన సీడ్ అందేలా చూడాల్సిన కోస్టల్ ఆక్వా అఽథారిటీ, మత్స్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాస్తవానికి మత్స్యశాఖ అధికారులు నెలకు రెండు సార్లు హేచరీలను పరిశీలించి ఆయా యజమానులకు నాణ్యమైన సీడ్ ఉత్పత్తులపై పలు చూచనలు, సలహాలను ఇవ్వాల్సి ఉంది. అయితే గత ఆరు నెలలుగా అలా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు జిల్లా తీరం వెంబడి దాదాపు 40 వేల హెక్టార్లలో ఆక్వా సాగు చేసేవారు. ప్రస్తుతం 10 వేల హెక్టార్లకు పడిపోయింది. స్టోరేజీ సౌకర్యం లేకనే.. జిల్లా నుంచి ప్రతి ఏడాది దాదాపు 1.70 లక్షల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తుంటారు. ధరలు ఆశాజనకంగా లేనప్పుడు వాటిని నిల్వ చేసుకునేందుకు సరైన స్టోరేజీలు లేకపోవడంతో సగానికి తెగనమ్ముతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలోని కౌలు రైతులకు ప్రాంతాన్ని బట్టి కౌలు నిర్ణయించారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కౌలు ధర ఉంది. ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే కౌలు రైతుకు చివరకు మిగిలేది అప్పులే.. ప్రస్తుతం రొయ్యల ధరలు ఇలా... కౌంట్ ఫిబ్రవరి మార్చిలో 40 రూ. 410 రూ. 340 50 రూ. 370 రూ. 335 60 రూ.345 రూ.210 70 రూ.310 రూ.275 80 రూ. 290 రూ.250 90 రూ.270 రూ.235 100 రూ. 260 రూ.220 న్యూస్రీల్నాసిరకం సీడ్ ఫీడ్.. హేచరీలు అధిక ధరలతో నాసిరకం సీడ్ అంటగడుతున్నాయి. దీన్ని చెరువుల్లో పోసిన పది రోజులకే రొయ్య పిల్లలు విపరీతంగా చనిపోతున్నాయి. వాటిల్లో కొన్ని బతికి బయటపడ్డా అవి సమాన గ్రోత్ రావడం లేదు. వాటిని అమ్ముకుందామంటే రొయ్యల ప్రాసెస్ కంపెనీ వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి అందినకాడికి దోసుకుపోతున్నారు. ప్రాసెస్ కంపెనీ వ్యాపారులదీ అదే పరిస్థితి. -
లైంగిక దాడుల నివారణపై అవగాహన సదస్సు
గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం సమావేశ మందిరంలో పిల్లలపై లైంగిక దాడులను నివారించడంపై డీఈవోలు, ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్, ఎంఈఓలు ప్రోగ్రాం ఆఫీసర్స్, డిజేబుల్ వెల్ఫేర్ శాఖ, ఆర్బీఎస్కే సిబ్బందికి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎదిగే వయసులో ఉన్న పిల్లలతో కొంత సమయం కేటాయించాలన్నారు. స్నేహపూరితమైన వాతావరణంలో వారితో అన్ని సమస్యలు చర్చించాలన్నారు. పిల్లలు అన్ని విషయాలు పంచుకుంటారని, తద్వారా , వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కార మార్గాలు చెప్పడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ టి.ఓ.టి, ఆర్. సుప్రజ, సైకాలజిస్ట్ విజయకుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయలక్ష్మీ, పిడి ఐసిడిఎస్, తెనాలి, గుంటూరు డెప్యూటీ డీఈవోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్ శ్రావణ్ బాబు, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ ప్రియాంక, పీడియాట్రిస్ట్ పి.నాగ శిరీష పాల్గొన్నారు. -
పొగాకు బ్యారన్ దగ్ధం
మేదరమెట్ల: కొరిశపాడు మండలం దైవాలరావూరు గ్రామంలో గల రాయిపాటి వెంకటసుబ్బయ్యకు చెందిన పొగాకు బ్యారన్ ప్రమాదవశాత్తూ మంటల్లో గురువారం దగ్ధమైంది. బ్యారన్లో పొగాకు కాలుస్తుండగా బ్యారన్‌లోని కర్రలు జారి పడి మంటలు వ్యాపించాయి. దీంతో బ్యారన్‌కు మంటలు వ్యాపించాయి. స్థానికులు అద్దంకి అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సమాచారం తెలియజేయడంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది మంటలు అదుపు చేశారు. పొగాకు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.4లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. శనగల విక్రయాలకు పేర్లు నమోదు చేసుకోండి నరసరావుపేట: జిల్లాలో శనగ పంట వేసి ఈ క్రాప్‌లో తమ పేర్లు నమోదుచేసుకున్న రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి తమ పేర్లను సీఎం యాప్‌లో ఈనెల 15వ తేదీలోగా నమోదుచేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధనుంజయ గనోరే గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో రబీసీజన్‌లో రైతులు 20,700హెక్టార్లలో శనగ పంట వేశారని, దీని ద్వారా 16,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశామన్నారు. క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.5650గా నిర్ణయించడమైందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించదలచుకుంటే సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి తమ పేర్లను యాప్‌లో నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. న్యాయవాది కొలుసు సీతారాంపై దాడి హేయం పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ సత్తెనపల్లి: నూజివీడు న్యాయవాది కొలుసు సీతారాంపై దాడి హేయమైన చర్య అని, ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవటం దారుణమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ న్యాయవాది చిలుకా చంద్రశేఖర్ అన్నారు. న్యాయవాది కొలుసు సీతారాంపై జరిగిన దాడిని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం ఆయన ఖండించారు. ఈ సందర్భంగా చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు లెక్కచేయలేదంటే సామాన్య పౌరుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్ధమవుతుందన్నారు. న్యాయవాద చట్టాల సవరణను మేధావులు, ప్రజాస్వామిక వాదులతో కలసి పౌరసమాజం అర్థం చేసుకోకపోవటం వల్ల పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అపరిమితమైన అధికారాలు చట్ట సభలు పోలీసులకు ఇవ్వటమే ఈ పరిస్థితికి కారణమన్నారు. -
ప్రియురాలితో పెళ్లి కోసం..
కత్తితో చేయి కోసుకుని యువకుడు ఆత్మహత్య కనిగిరిరూరల్: ప్రియురాలితో పెళ్లి కోసం కత్తితో చేయి కోసుకుని ఓ యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ సంఘటన గురువారం రాత్రి కనిగిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన రవితేజకు కనిగిరికి ఇందిరాకాలనీకి చెందిన పుట్టా లక్ష్మీదేవితో పరిచయం ఏర్పడింది. లక్ష్మీ భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు. కొద్ది రోజులుగా లక్ష్మీని పెళ్లి చేసుకుంటానని రవితేజ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రవితేజ మద్యం తాగి ప్రభుత్వాసుపత్రి సమీపంలో కత్తితో చేయి కోసుకున్నాడు. అధిక రక్తస్రావంతో రవితేజ మరణించినట్లు పోలీసులు తెలిపారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరాం పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి కిడ్నీ డే సందర్భంగా ఎయిమ్స్‌లో వాక్‌థాన్ మంగళగిరి: కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహెంతమ్ శాంతా సింగ్ తెలిపారు. అంతర్జాతీయ కిడ్నీ డే సందర్భంగా గురువారం ఉదయం ఎయిమ్స్‌లో వైద్యులు, మెడికల్ విద్యార్థులతో వాక్‌థాన్ నిర్వహించారు. డైరెక్టర్ శాంతాసింగ్ మాట్లాడుతూ కిడ్నీ అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం శరీరంలోని ప్రతి అవయంపైనా పడుతుందన్నారు. కిడ్నీలను కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. నేటి ఆధునిక సమాజంలో కిడ్నీల విక్రయాలు జరగడం దారుణమన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీమంత కుమార్ దాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ హెచ్‌వోడి డాక్టర్ ఉత్తర దాస్, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలిలో ముగిసిన ప్రత్యేక సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారంతో ముగిసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సదరం క్యాంప్‌ను అధికారులు నిర్వహించారు. ఈఎన్టీ, అఫ్తమాలజీ, ఆర్ధోపెడిక్, సైక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులకు వైద్య పరీక్షలు చేశారు. క్యాంప్‌లో పలు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన వైద్యులు పరీక్ష లు నిర్వహించారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పర్యవేక్షించారు. మిర్చిని ఆరబెట్టుకుని తీసుకురావాలి మిర్చి యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి సీజన్ ఊపందుకుందని, రోజుకు 1.50 లక్షల నుంచి 1.80 లక్షల మిర్చి బస్తాలు యార్డుకు వస్తున్నాయని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యార్డుకు రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి రైతులు ఎండు మిర్చిని తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందుతున్నారని వెల్లడించారు. గత ఐదు రోజులుగా వస్తున్న మిర్చి సరుకులో తేమ శాతం అధికంగా ఉండటంతోపాటు, దుమ్ము, ధూళి ఉండటం వల్ల దాని ప్రభావం ధరలపై పడుతోందని తెలిపారు. రైతులు కల్లాల్లోనే మిర్చిని ఆరబెట్టడంతోపాటు దుమ్ము, ధూళి లేకుండా గ్రేడింగ్ చేసుకొని తీసుకువచ్చి మంచి ధర పొందాలని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు. -
శింగరకొండ తిరునాళ్ల ప్రారంభం
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్య క్షేత్రమైన శింగరకొండ తిరునాళ్లను గురువారం ఉదయం ప్రారంభించారు. ఉత్సవాలలో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యహవాచన, అఖండ దీప స్థాపన, మండపారాధన నిర్వహించారు. అనంతరం ధ్వజ స్తంభ నిర్మాణ దాత మేదరమెట్ల శంకరరెడ్డితో అర్చకులు జీవ ధ్వజ పూజ చేయించారు. ఉష్ట్ర పతాకాన్ని ధ్వజారోహణ చేయించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన ఏసీ తిమ్మనాయుడు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శింగరకొండ తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు బుధవారం రాత్రి ప్రసన్నాంజనేయస్వామికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. నగరోత్సవంలో భాగంగా రథాన్ని లాగిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన ఏసీ తిమ్మనాయుడు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి నిమిషానికి ప్రత్యేక బస్సు అద్దంకి: జిల్లాలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా పేరుగాంచిన ప్రసన్నాంజనేయ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ల సందర్భంగా ఈ నెల 14వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రతి నిమిషానికి ఒక ప్రత్యేక బస్సు డిపో నుంచి నడపనున్నారు. ఈమేరకు డిపో మేనేజర్ బి. మోహనరావు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి తిరునాళ్లకు వచ్చే భక్తులు ఈ సౌకార్యన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఒక్కో టికెట్ రూ.10 మాత్రమేనని తెలిపారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
నరసరావుపేట రూరల్: ఈతకు వెళ్లి ఇద్దకు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన మండలంలోని పెట్లూరివారిపాలెం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా కురిచేడుకు చెందిన గోపి(19) నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అద్దంకి మండలం వేంపరాలకు చెందిన తేజ్‌కుమార్(19) ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ పట్టణంలోని ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. బుధవారం సాయంత్రం గోపి, తేజ్కుమార్లు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పెట్లూరివారిపాలెం సమీపంలోని 10 ఆర్ మేజర్ కాలువలో ఈతకు వెళ్లారు. గోపి, తేజ్కుమార్లకు ఈత రాకపోయినా నీటి ప్రవాహం తక్కువుగా ఉండటంతో కాలువలో దిగారు. డ్రాప్ పైనుంచి ఇద్దరు నీటిలోకి దూకారు. డ్రాప్ కింద నీటి ఉధృతి కారణంగా మట్టి కోతకు గురై లోతు ఎక్కువుగా ఉంటుంది. దీన్ని వారు గమనించకపోడంతో ఈత రాక నీటమునిగారు. కాలువ కట్టపై ఉన్న స్నేహితులు గమనించి కేకలు వేశారు. మిర్చిపొలాల్లో కోతకు వచ్చని కూలీలు అక్కడకు చేరుకొని కాలువలోకి దిగి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కిశోర్ తెలిపారు. -
ఉద్యోగులకు నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిబాపట్ల: ప్రభుత్వ ఉద్యోగుల సంస్థాగత నిర్మాణం, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నామని కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐజీఓటీ కర్మయోగి డిజిటల్ శిక్షణ తరగతులు స్థానిక కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐజీఓటీ కర్మయోగి వెబ్ పోర్టల్ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం డిజిటల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రథమంగా అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. మారుతున్న కాలానుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు నవీకరణ పొందడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎఫ్ఎంఎస్ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగికి శిక్షణ అవసరమని, ఈనెల 20వ తేదీలోగా వెబ్ పోర్టల్ నుంచి ఆన్లైన్ ద్వారా డిజిటల్ శిక్షణ పొందాలని ఆదేశించారు. శిక్షణ అనంతరం ఆన్లైన్లో వచ్చే ప్రశ్నావళికి సరైన సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. ఉద్యోగుల నైపుణ్యాలకు మెరుగులు పెట్టడానికే 856 శిక్షణ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో శిక్షణలు ఇవ్వాలని కలెక్టర్ వివరించారు. జిల్లా ప్రణాళిక అధికారి కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి వారం శిక్షణ తరగతులు ఆన్లైన్లో నవీకరణ పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఉద్యోగులందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. సందేహాలకు ఎస్. హరినాథ్ (96521 71785), వి. సృజన (90634 94729) సంప్రదించవచ్చని సూచించారు. ఎంపీడీవోలు తమ పరిధిలోని ఉద్యోగులందరికీ శిక్షణలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ప్రణాళికా శాఖ ఏపీఎస్డీపీఎస్ అధికారి జ్ఞానం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సిమెంట్ లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
జె.పంగులూరు: వేగంగా ప్రయాణిస్తూ నిద్ర మత్తులోకి జారుకొని ఎదురుగా వెళుతున్న సిమెంట్ లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున మండలంలోని రేణింగవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. రేణింగవరం ఎస్ఐ వినోద్‌బాబు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాపట్నం నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం తెల్లవారుజామున రేణింగవరం సమీపంలోకి వచ్చింది. ఆదే సమయంలో డ్రైవర్ కె. శేఖర్ నిద్రమత్తులోకి జారుకుని ఎదురుగా వెళుతున్న సిమెంట్ లారీని ఢీకొట్టాడు. వెంటనే తేరుకొని ఎడమవైపు బస్సును తిప్పడంతో పొలాల్లోకి వెళ్లింది. బస్సు ముందువైపు భాగంగా బాగా దెబ్బతింది. బస్సు డ్రైవర్ శేఖర్ కాళ్లకు బాగా గాయాలయ్యాయి. సీటు వద్ద ఇరుక్కుపోయాడు. హైవే సిబ్బంది వచ్చి అతడిని బయటకు తీశారు. డ్రైవర్‌ది చిత్తూరు జిలా నెమలికుంట గ్రామం. ప్రమాద సమయంలో ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, వారిని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్ఐ వినోద్‌బాబు తెలిపారు. డ్రైవర్ శేఖర్‌ను అద్దంకి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
శిలా ఫలకాలు తొలగించడం సరికాదు !
మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బాపట్ల టౌన్: సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోని శిలా ఫలకాలకే రక్షణ లేకపోతే మారుమూల ప్రాంతాల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ? అంటూ మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత పోరులో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల సౌకర్యార్థం బాపట్లను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కలెక్టర్ కార్యాలయం, జిల్లాలోని వివిధ శాఖల అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని తెలిపారు. నాడు ఎంతో పండుగ వాతావరణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. నేడు అక్కడ గత ప్రభుత్వ అనవాళ్లు కూడా చేయాలనే దురుద్దేశంతో శిలాఫలకాలు తొలగించడం ఎంతవరకు సమంజసమో అధికారులే సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ దుస్థితి ఉంటే, జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఇంకెంత దారుణంగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుందని తెలిపారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా శిలాఫలకాలను ఇష్టమొచ్చినట్లు జిల్లావ్యాప్తంగా ధ్వంసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే చాలాచోట్ల తొలగించారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. శిలాఫలకాల తొలగింపుపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, వాటిని యథాస్థానంలో నిర్మించాలని, లేనిపక్షంలో అధికారుల తీరును న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తామని రఘుపతి హెచ్చరించారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ సీపీకి సుస్థిర స్థానం బాపట్ల: ప్రజల గుండెల్లో నిండిన పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ ప్రజారంజక పాలన అందించిన వైఎస్. జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ప్రతి ఒక్కరం కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు. అబద్ధాల మాటలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేశారన్నారు. ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశామని ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీద్దామని కోన పిలుపునిచ్చారు. ఆశపడి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సర్కారుకు సరైన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రేపల్లె ఇన్చార్జి ఈవూరి గణేష్, చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్‌బాబు, పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు కొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, కోకి రాఘవరెడ్డి, వడ్డిముక్కల డేవిడ్, గవిని కృష్ణమూర్తి, దొంతిబోయిన సీతారామిరెడ్డి, సోహిత్, గంగిశెట్టి రత్తయ్య, కటికల యోహోషువా, జోగి రాజా పాల్గొన్నారు. -
యువత పోరులో నిరసనల హోరు
వైఎస్సార్ సీపీ నిర్వహించిన ‘యువత పోరు’ ర్యాలీకి బాపట్ల జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. బారికేడ్లు పెట్టి అడుగడుగునా నేతలను పోలీసులతో అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. పట్టణంలోని రథం బజారులో గల వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ట్ వరకు నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద కూడా ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరింపజేసింది. ఒకానొక దశలో పోలీసులు, వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో మెరుపు వేగంతో అశోక్‌బాబు, పార్టీ శ్రేణులు బారికేడ్లు దాటుకొని కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లిపోయారు. ఆయన వెంటే లోపలికి నేతలు, పార్టీ శ్రేణులు ప్రవాహంలా కదిలారు. – సాక్షి ప్రతినిధి, బాపట్ల