మహాశివరాత్రికి పటిష్ట భద్రత కల్పించాలి
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్
అమృతలూరు(కొల్లూరు): మహా శివరాత్రిని భక్తులు ప్రశాంతంగా నిర్వహించుకునేలా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశించారు. అమృతలూరు మండలం గోవాడలో ఉత్సవాల నేపథ్యంలో ఆయన బుధవారం బాలకోటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. పలు శాఖల అధికారులు, ఆలయ కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తొలుత దైవదర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు, ఆర్డీఓ రామలక్ష్మి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగయ్య, సీఎఫ్‌ఓ అనుపమ, తహసీల్దార్ నెహ్రూ, ఎంపీడీఓ శేషమాంబ, సర్పంచి విజయలక్ష్మి, ఆలయ చైర్మన్ రమేష్, ఈఓ విఠల్ శ్రీనివాస్ వర్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


