Adilabad
-
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్‌రూరల్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని స్విమ్మింగ్ అసో సియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవికుమార్, కొమ్ము కృష్ణ అన్నారు. మండలంలోని చాందా (టి)పంచాయతీ పరి ధిలో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 24న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న వారిలో అనుదీప్రాజ్, లోహిత్ సాయి, చరణ్ తేజ్, మణికృత్ ఉన్నట్లు వివరించారు. విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో కోచ్‌లు వంశీ, శ్రీనివాస్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల హాజరుశాతం పెరగాలి
కైలాస్‌నగర్: విద్యార్థుల హాజరుశాతం పెరిగినప్పుడే మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారముంటుందని ఆ దిశగా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన– ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11నుంచి నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘విద్యా విజయోత్సవం’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ విద్యాసంస్థలో పేరెంట్స్, టీచర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. బడిబాట కార్యక్రమంతో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నప్పటికీ హాజరుశాతం తగ్గుతోందని, తద్వారా డ్రాపౌట్స్ చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ మేరకు ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. ఫలితాలు మెరుగుపడాలంటే 75శాతం హాజరు నమోదయ్యేలా చూడాలన్నారు. రానున్న నూతన విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో సీఎం బ్రేక్పాస్ట్, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్, ఏఎంవోలు లక్ష్మణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. టాపర్స్, అధ్యాపకులు, టీచర్స్‌కు సన్మానం విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్న పలువురు అధ్యాపకులు, ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. వీరితో పాటు పది, ఇంటర్మీడియెట్‌లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం ఆదిలాబాద్ బాల కేంద్రం పుస్తక నిధి ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. -
కార్యదర్శులకు ‘ఉపాధి’ బాధ్యతలు
కైలాస్‌నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. కూలీల సంఖ్య పెంచడంతో పాటు పనులు కల్పించడం, ఎన్ఎంఎంఎస్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ హాజ రు వంటి ఏడు రకాల రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ దివ్యదేవరాజ న్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయంతో గ్రామాల్లో ఉపాధిపనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇలా.. గతంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాక ఉపాధి పనులను పంచాయతీ కార్యదర్శులే పర్యవేక్షించేవారు. టెక్నికల్ అసిస్టెంట్లతో కలిసి అన్ని పనులు వారే నిర్వహించేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఈక్రమంలో పలువురు కార్యదర్శులు తమ రెగ్యులర్ పనులకు ప్రాధాన్యతనిస్తూ ఉపాధి పర్యవేక్షణను విస్మరించినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఉపాధి పర్యవేక్షణ బాధ్యతలు కూడా నిర్వహించాలంటూ కార్యదర్శులను ఆదేశించింది. కార్యదర్శులు ఏం చేయాలంటే.. ఉపాధి సిబ్బంది సాయంతో గ్రామాల్లో వంద రోజుల పనులు, వనమహోత్సవ కార్యక్రమాలు చేపట్టి పర్యవేక్షించాలి. మేట్లను నియమించాలి. వారితో కలిసి కూలీల నుంచి పని డిమాండ్ వివరాలు తీసుకోవాలి. కూలీల మస్టర్లు నమోదు చేసుకునేలా చూడటంతో పాటు వారం చివరలో వాటిపై కౌంటర్ సైన్ చేసి టెక్నికల్ అసిస్టెంట్లకు అప్పగించాలి. ఎన్ఎంఎంఎస్ యాప్‌లో కూలీల ఫేస్ అథెంటికేషన్ ద్వారా హాజరును అప్లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీటితో పాటు జాబ్‌కార్డుల అప్డేషన్, వారినికోసారి సమావేశాల నిర్వహణ, పని ప్రదేశాల్లోని బోర్డును తనిఖీ చేయడం, కూలీలకు అవసరమైన తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం, గ్రీన్ నెట్షెడ్లను ఏర్పాటు చేయడం వంటి పనులను పర్యవేక్షించాలి. ముఖ్యంగా సర్పంచ్‌లతో సమావేశమై కూలీల సంఖ్య పెంచేలా శ్రద్ధ వహించాలి. వీటితో పాటు ఏడు రికార్డులను తప్పనిసరిగా నిర్వహింలని ప్రభుత్వం ఆదేశించింది. సర్కారు తాజా నిర్ణయంతో కూలీల సంఖ్య పెరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఉత్తర్వులు అందాయి ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. వాటిపై ఇటీవల సెక్రెటరీలతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతీ కార్యదర్శి తప్పనిసరిగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచడంతో పాటు పనులు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలి. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
మౌలిక వసతుల కల్పనకు కృషి
ఇచ్చోడ: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రత్యేక కృషి చేస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని అడేగామ(బి)లో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, సర్పంచ్ విశాల్, పార్టీ నాయకులు రాజు, మాదవ్ అమ్టె, జీవీ రమణ, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ముఖరా(బి)లో పంచాయతీ భవనం ప్రారంభం ఇచ్చోడ: గ్రామాల అభివృద్ధి కోసం పాలనాపరమై న ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ అన్నారు. మండలంలోని ముఖరా(బి)లో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ఆదివారం వారు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, గాడ్గే సుభాష్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
నేరడిగొండ/బోథ్: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతుధర లభిస్తుందని, వాటిని సద్విని యో గం చేసుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నేరడిగొండ మండలంలో ని కుమారి, బోథ్ మండలంలోని మర్లపెల్లిలో ఏ ర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాలను ఆది వారం ఆయన ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రైతు చంద్రశేఖర్‌రెడ్డి ఆయన ను శాలువాతో సన్మానించారు. ఇందులో పీఏసీఎస్ చైర్మన్ రమేశ్, సర్పంచ్ గోదావరి, ఉపసర్పంచ్ రవి, తర్నం సర్పంచ్ నీరజ, నాయకులు, పీఏసీఎస్ పాలకవర్గసభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
జీవో నం.3 పునరుద్ధరించాలి
ఆదిలాబాద్‌టౌన్: షెడ్యూల్ ప్రాంతాల్లో ఆది వాసీ యువతకు వంద శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నం.3ను పునరుద్ధరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ఆదివారం న్యూ ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరంను కలిసి ఆదివాసీ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 5వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలను ఆదివాసీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలంటే జీవో నం.3 పునరుద్ధరణ అవసరమన్నారు. పీఎం జన్మన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అడ్డంకులు తొలగించాలని కోరా రు. ఈమేరకు మంత్రి సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సచిన్ తెలిపారు. ఆయన వెంట మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్ పాల్గొన్నారు. పెంచిన పెట్రో ధరలు తగ్గించాలిఆదిలాబాద్టౌన్: పెంచిన పెట్రో ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చే స్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ఆందో ళన చేపట్టారు. బస్టాండ్ ఎదుట రాస్తారో కో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మల్లేశ్ మా ట్లాడుతూ, కేంద్రం గ్యాస్, పెట్రో ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. తక్షణమే ధరల పెంపును ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో నా యకులు లంకా రాఘవులు, బండి దత్తాత్రి, సురేందర్, మంజుల, ఆరిఫాబేగం, రాములు, ఆశన్న, గంగారాం పాల్గొన్నారు. -
‘ఎల్ఆర్ఎస్’లో సాంకేతిక సమస్య
కై లాస్‌నగర్: జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. సాంకేతిక సమస్యలతో రెండు రోజులుగా సర్వర్ పనిచేయడం లేదు. దీంతో ఫీజు చెల్లించేందుకు వచ్చే దరఖాస్తుదారులకు నిరాశ ఎదురవుతుంది. జిల్లాలోని ఏకై క ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఇప్పటికే ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదనే విమర్శలున్నాయి. తాజా గా సాంకేతిక సమస్యలు తోడవడం గమనార్హం. ఇదీ పరిస్థితి.. 2020లో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం విడతల వారీగా ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించింది. మరోసారి మార్కెట్ ఫీజులో 25శాతం రాయితీ వర్తింపజేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 1నుంచి 31వరకు గడువు విధించింది. అయితే దీనిపై అధికారులు సరైన ప్రచారం చేపట్టకపోవడం, దరఖాస్తుదారుల అవగాహన రాహిత్యంతో స్పందన అంతంతే ఉన్నట్లుగా తెలుస్తోంది. సాంకేతిక సమస్యలతో జాప్యం .. మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది మున్సిపల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ. మొత్తం 17,865 మంది ఫీజు చెల్లింపునకు అర్హులు కాగా అందులో కేవలం 4,564 మంది మాత్రమే చెల్లించారు. అందులోనూ 1,716 మందికి ఇంకా ప్రొసీడింగ్ జారీ చేయాల్సి ఉంది. తాజాగా ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించడంతో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో పురోగతి కనిపిస్తుందని భావించారు. అయితే సర్కారు ఆశించిన స్పందన లేదు. ఇప్పుడిప్పుడే దరఖాస్తుదారులు మున్సిపల్ కార్యాలయానికి వస్తుండగా తాజాగా రెండు రోజులుగా సర్వర్ పనిచేయడం లేదు. 25శాతం ఫీజు రాయితీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం మారుస్తున్నందున ఈ సమస్య తలెత్తుతున్నట్లుగా మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా వ్యవసాయ భూములు, ప్లాట్ల మార్కెట్ విలువ పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తుకు ఆదేశించింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు భూముల విలువలతో కూడిన వివరాలు నమోదు చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో కచ్చా లేఅవుట్లోని పది శాతం ప్లాట్లను విక్రయించుకుని మిగతా ప్లాట్లను రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ (ఐజీఆర్ఎస్) చేసుకోవాలనుకునే వారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు ముందుకు వస్తుండగా సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. కాగా, భూములు, ప్లాట్ల మార్కెట్ విలువ పెంచుతున్న నేపథ్యంలో సర్వర్ సమస్య ఏర్పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సోమవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
పసుపు తాడుతో పసిమొగ్గల బంధీ
తల్లిదండ్రుల నిరక్షరాస్యత, పేదరికం, బాలికల భద్రతపై భయం, సామాజిక ఒత్తిళ్లు, మూఢనమ్మకాలు వంటి కారణాలు బాల్య వివాహాలకు దారి తీస్తున్నాయి. ‘ఆడపిల్ల భారం’ అనే పాతబడ్డ భావజాలం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతుండడం పరిస్థితిని విషమంగా మారుస్తోంది. కుటుంబీకులు ఆరోగ్య సమస్యలతో సతమతం అవ్వడం, పిల్లల పెళ్లి కళ్లారా చూడాలనే కోరిక.. తదితర సెంటిమెట్లు కూడా కారణమవుతున్నాయి. తల్లీబిడ్డలకు ప్రాణాపాయం.. చిన్న వయసులో గర్భం దాల్చడం ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తక్కువ బరువుతో శిశువులు పుట్టడం, పోషకాహార లోపం, రక్తహీనత, నెలలు నిండకముందే ప్రసవాలు, అధిక రక్తస్రావం వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. సాధారణ ప్రసవాలు తగ్గిపోవడంతో పాటు శస్త్ర చికిత్సలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అలాగే చిన్న వయసులో గర్భం దాల్చిన మహిళల్లో గర్భస్రావాలు, కాన్పు సమయంలో మరణాల శాతం సాధారణ మహిళలతో పోల్చితే రెండింతలు అధికంగా ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. అలాగే ప్రసవం తర్వాత కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతోందని చెబుతున్నారు. పెరుగుతున్న శిశు మరణాలు.. బాల్య వివాహాలు జరిగిన తర్వాత వారి పిల్ల లు ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రసవ సమయంలో శిశు మరణాలు సైతం అధికంగా ఉంటున్నట్లుగా చెబు తున్నాయి. చిన్న వయసులో గర్భం దాల్చిన వారి లో ఏజెన్సీ, మారుమూల మండలాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. బాల్య వివా హాల నిర్మూలనకు చట్టాల అమలుతో పాటు సమాజంలో అవగాహన పెంపు, బాలికల విద్యకు ప్రాధాన్యత, తల్లిదండ్రుల్లో చైతన్యం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.పసిమొగ్గలనే పసుపు తాడుతో బంధిస్తున్నారు. బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు సమీపిస్తున్నా ఇంకా చిన్నారి పెళ్లికూతుళ్లు దర్శనమి స్తూనే ఉన్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా జిల్లాలో ఘటనలు చోటు చేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. – ఆదిలాబాద్‌టౌన్ -
బాల్య వివాహాలు జరిపిస్తే కేసులు
బాల్య వివాహం చట్టరీత్యా నేరం. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు ఉంటేనే వివాహం జరిపించాలి. ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోని చిల్కూరినగర్లో జరిగిన ఓ బాల్య వివాహానికి సంబంధించి పూజారితో పాటు ఫంక్షన్‌హాల్ యజమాని, పెళ్లికి హాజరైన వారిపై కేసులు నమోదం చేయడం జరిగింది. పూజారులకు అవగాహన కల్పిస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు బాల్య వివాహం జరిపించి పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దు. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి ఆరోగ్య సమస్యలు వస్తాయి..బాల్య వివాహం ద్వారా బాలికలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడంతో కాన్పు సమయంలో నెలలు నిండక ముందే ప్రసవాలు జరుగుతాయి. తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు సైతం ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. తక్కువ బరువు గల పిల్లలు పుడతారు. సిజేరియన్ కాన్పులు ఎక్కువగా అవుతాయి. బీపీ, రక్తహీనత సమస్యలతో బాధపడతారు. – డాక్టర్ రమ, గైనకాలజిస్ట్ -
జిల్లాకు ‘రాజీవ్ జ్యోతి’ యాత్ర
కై లాస్‌నగర్: దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీని స్మరించుకుంటూ తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుంచి ఢిల్లీలోని వీర్‌భూమి వరకు శామ్యూల్ ద్రవ్యం ఆధ్వర్యంలో చేపట్టిన రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. విద్యానగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కార్యాలయం వరకు జ్యోతిని తీసుకువచ్చారు. ఇందులో పార్టీ పట్టణ అధ్యక్షుడు కిజర్ పాషా, నాయకులు సతీశ్, అనిల్, సంజయ్, పరమేశ్వర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
● లింకు డాక్యుమెంట్ లేకుండానే రిజిస్ట్రేషన్లు ● ఇటీవలే విజిలెన్స్ దాడులు.. అయినా మారని ధోరణి ● ఆదిలాబాద్ ఎస్ఆర్వోల తీరిది
ఈ కార్యాలయంలో ఇటీవల వందలాది ప్లాట్లకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఓ సబ్ రిజిస్ట్రార్ ఇందులో కీలక భాగస్వామ్యం వహించినట్లుగా ప్రచారం నడుస్తోంది. పట్టణంలోని భాగ్యనగర్, భీంసరి, సీసీఐ ఏరియాలోని వందలాది ప్లాట్ల కు సంబంధించి ఇది వరకు లింకు డాక్యుమెంట్లు లేకున్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేశారు. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు కీలకంగా వ్యవహరించి సబ్ రిజిస్ట్రార్‌ను మచ్చిక చేసుకుని వ్యవహరం సాగించారని చెప్పుకుంటున్నారు. ఒక్కో ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అధికా రులకు ముట్టజెప్పినట్లుగా ప్రచారం ఉంది. ఆగని తంతు.. ప్రభుత్వం నుంచి నిషేధం ఉన్నప్పటికీ గతేడాది అనధికారిక లేఅవుట్లలో ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆ సమయంలో డీఆర్‌గా ఉన్న ప్రస న్న దీనిపై డీఐజీకి రిపోర్టు అందజేశారు. ఇక ఆ సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తప్పవని అంతా భావించినప్పటికీ కేవలం మరో చోటకు బదిలీకే పరిమితమ య్యారు. ఆ తర్వాత కూడా పలు ప్లాట్లను ఇలాగే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్కెచ్ రెడీ చేయగా ‘సాక్షి’లో కథనం రావడంతో బ్రేక్ పడింది. తర్వాత విజిలెన్స్ దాడులు కలకలం రేపాయి. కొద్ది రోజుల పాటు అక్రమాలకు దూరంగా ఉన్నా ఇటీవల మళ్లీ అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. మొత్తంగా ఆదిలాబాద్ ఎస్ఆర్వోలో అడపా, దడపా వందలాది ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ దళారులు తమ దందా సాగిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు మామూళ్లకు ఆశపడి పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకుని వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంలో పట్టిపట్టనట్లుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. నా దృష్టికి రాలేదు..లింక్ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆధారాలు ఉంటే డీఆర్ కార్యాలయంలో అందజేయాలి. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ఆదిలాబాద్ ఎస్ఆర్వో కార్యాలయంలో ఇలాంటి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నా దృష్టికి రాలేదు. ఆధారాలు అందజేస్తే విచారణ చేసి నిబంధనలకు విరుద్ధంగా జరిగి ఉంటే డీఐజీకి రిపోర్టు అందజేస్తాం. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎం.రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్ -
ప్రయోగాత్మకంగా సాగు చేశాం
తాంసి: కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సాయినాథ్కు చెందిన ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ సహకారంతో మండలంలోని పొన్నారి శివారులో జనవరిలో డ్రోన్ ద్వారా విత్తనాలు చల్లి నువ్వు సాగు చేపట్టారు. జగిత్యాల అగ్రికల్చర్ కళాశాలకు చెందిన జేసీఎస్ 1020 రకానికి చెందిన విత్తనాలను డ్రోన్ ద్వారా విత్తారు. సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 5 నుంచి 8 సెంటీమీటర్ల ఉండేలా 10 నిమిషాల్లోనే విత్తన ప్రక్రియ పూర్తి చేశారు. కలుపు, పురుగు మందులను సైతం కూలీల అవసరం లేకుండా డ్రోన్ ద్వారా పిచికారీ చేశారు. ప్రస్తుతం పంట ఏపుగా పెరగడంతో పాటు దిగుబడి సైతం ఆశించిన విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధానంలో ఎకరం సాగుకు కేవలం రూ.800 మాత్రమే ఖర్చవుతుండగా విత్తనం వేసే సమయం కూడా ఆదా అవుతుంది. అదే సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తే రూ.1400కు పైగా పెట్టుబడి వ్యయంతో పాటు విత్తనం వేయడం ఒక రోజు పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సాధారణ పద్ధతిలో దిగుబడి 3నుంచి 4 క్వింటాళ్లు వస్తుండగా, ఈ విధానంలో 4 నుంచి 5క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పెట్టుబడి తక్కువ.. సమయం ఆదాకృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో ఎకరంలో సాగు చేస్తున్న. డ్రోన్‌తో పది నిమిషాల్ల్లోనే విత్తనాలు విత్తడం పూర్తయింది. అదే కూలీలతో అయితే ఒక రోజు పట్టేది. గడ్డిమందు, పురుగుమందు కూడా డ్రోన్‌తోనే రెండు సార్లు పిచికారీ చేసినం. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. మామూలు విధానంతో పోల్చితే పెట్టుబడి తక్కువ. అలాగే దిగుబడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నన్ను గైడ్ చేస్తున్నారు. – కేమ సాయినాథ్, రైతు రైతులకు సాగులో డ్రోన్ టెక్నాలజీ అందించాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఈ విధానం చేపట్టాం. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ ద్వారా నువ్వు విత్తనాలు వేసి సాగు చేస్తున్నాం. సాధారణ సాగుకు ఈ విధానానికి తేడా కనిపిస్తుంది. ఎకరానికి మామూలుగా రూ.1400 పెట్టుబడి అవుతుండగా.. ఈవిధానంలో రూ.800 దాటదు. విత్తనం వేసే సమయం కూడా తక్కువే. దిగుబడి సాధారణ సాగుతో పోల్చితే 25శాతం వరకు అధికంగా ఉంటుంది. ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – రాంగోపాల్‌వర్మ, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ -
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మోదీ కృషి
ఆదిలాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రధాని ఇందన పొదుపు పిలుపు మేరకు శనివారం ఆయన కారు పక్కనపెట్టారు. పట్టణంలోని కుమ్మరివాడ తదితర వార్డుల్లో సైకిల్‌పై పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఇంధనం ఆదా చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బ్రహ్మానంద్, ధోని జ్యోతి, జోగు రవి, దత్తు, సతీష్, అశోక్ రెడ్డి, ప్రశాంత్, రవి, అజయ్ తదితరులున్నారు. -
‘భగీరథ’ నచ్చట్లే.. చల్లని చెలిమె నీటికే జై
ఆ గూడెంలో ఐదు కుటుంబాలు.. 25 మంది జనాభా ఉన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ ఉన్నా వేసవి ఎండలకు అందులోని నీరు ప్లాస్టిక్ వాసనతో పాటు వేడిగా వస్తోంది. దీంతో గూడెంవాసులు ఆ నీటిని తాగలేక సమీపంలోని వాగులో ఓ చెలిమె ఏర్పాటు చేసుకున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అక్కడి వెళ్లి ఆ నీటితోనే దాహార్తి తీర్చుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దొంగచింత పంచాయతీ పరిధిలోని రాజుగూడ వాసుల నీటిగోసను ప్రతిబింబించే దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. కాగా, తమకు చల్లని రక్షిత నీటి సౌకర్యం కల్పించాలని స్థానికులు కన్నీబాయి, తదితరులు కోరుతున్నారు. – ఉట్నూర్‌రూరల్ -
గిరి గ్రామాల్లో ‘బుడు బమ్ కుకు’
ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. శనివారం వైశాఖ మాసం (బడ్బావై) అమావాస్యను పురస్కరించుకుని మండలంలోని గిరి గ్రామాల్లో చిన్నారులు కాళ్ళకు గజ్జెలు కట్టుకుని రోకలిబండకు కప్పను కట్టి భుజాన వేసుకుని కప్పతల్లికి స్నానం చేయిస్తూ బుడు బమ్ కుకు ఆట ఆడారు. అనంతరం గ్రామ పొలిమేరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కప్పను వదిలిపెట్టారు. ఆ కప్ప ఏదిక్కు వెళ్తుందో ఆ దిక్కు నుంచి వర్షాలు వస్తాయని గిరిజనుల నమ్మకం. – సిరికొండ -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. శనివారం స్థానిక కుమురంభీం కాంప్లెక్స్‌లోని ఎమ్మార్సీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల ఆదివాసీ సర్మేడిలు, వివిధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రధానమంత్రి జుగా పథకంలో భాగంగా ఉట్నూర్‌కు కేంద్ర గ్రంథాలయం మంజూరైందన్నారు. విద్యార్థులు, యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన పుస్తకాలు, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. గిరిజనుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వాట్సాప్ ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలు తెలపవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ రుత్విస్ సాయి కొట్టే, ఐటీడీఏ అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ నాయకులు, సర్మేడిలు, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ సోపానం..సావర్‌ఖెడా గ్రంథాలయం
కెరమెరి: మండలంలోని సావర్‌ఖెడాలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం విద్యార్థులు, నిరుద్యోగుల కు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆగస్టు త ర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన సుమారు 20 మందికి పైగా నిరుద్యోగులు వేసవిలో పోటీ పరీ క్షలకు సన్నద్ధమవుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తక పఠనం చేస్తున్నారు. పీఎంశ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కడేర్ల రంగయ్య బడి బాగుకు చేసిన సేవలు తెలుసుకున్న ‘సర్’ సినిమా డైరెక్టర్ నాగవంశీ గ్రంథాలయ ఏర్పాటుకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. గ్రామస్తులు, దాతల సహకారంతో.. గ్రామస్తులతో పాటు కెరమెరి ఎంఆర్సీలో విధులు నిర్వహస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్ అశ్విని, తదితరులు పుస్తకాల కొనుగోలుకు ఆర్థికసాయం అందించారు. వాటితో డైట్‌సెట్, బీఎడ్, పోలీస్ కానిస్టేబుల్, నీట్, ఆర్జేసీ, ఎస్ఎస్సీ, గ్రూప్స్, ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేశారు. -
తొలుత రభస.. తర్వాత సాఫీగా
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాల నీ, సర్వేనంబర్ 170లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం లక్కీడ్రా నిర్వహించారు. అయి తే ఈ ప్రక్రియ కౌన్సిలర్ల అభ్యంతరాలు, ఆందోళనలు, విజ్ఞప్తుల నడుమ ముగిసింది. కలెక్టర్ రాజర్షిషా ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి చేపట్టారు. ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ, 337 ఇళ్లకు గాను జిల్లా ఇన్చార్జి మంత్రి నుంచి 1032 దరఖాస్తులు అందినట్లుగా తెలిపారు. గతంలో పట్టణంలోని 36వార్డులకు సంబంధించి 618 ఇళ్లకు లక్కీ డ్రా నిర్వహించగా అందులో 488 మంది అర్హులుగా తేలరన్నారు. మరో 16 వార్డులకు 109 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. 48 ఇళ్లను రిజర్వ్‌లో ఉంచి 337 ఇళ్లకు ప్రస్తుతం లక్కీడ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను 49 వార్డుల నుంచి అందిన దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇందులో హౌసింగ్ పీడీ రెడ్డి శంకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఆర్ఐ అజయ్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ల అభ్యంతరం.. అయితే దరఖాస్తుల ఆధారంగా ఇళ్ల కేటాయింపు సరికాదంటూ అధికార కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ కౌన్సిలర్లు మాత్రం అలాగే డ్రా నిర్వహించాలని పట్టుబట్టారు. ఇలా పరస్పర డిమాండ్లతో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. దీంతో అదనపు కలెక్టర్ జోక్యం చేసుకుని ఏ విధానంలో డ్రా నిర్వహించాలనే దానిపై కౌన్సిలర్ల అభిప్రాయం కోరుతూ సంతకాలు సేకరించారు. 22 మంది అన్ని వార్డులకు సమానంగా డ్రా తీయలని కోరగా మిగతా వారు మాత్రం దరఖాస్తుల సంఖ్యకనుగుణంగానే చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో మళ్లీ రభస మొదలైంది. పలువురు కౌన్సిలర్లు అదనపు కలెక్టర్‌ను చుట్టుముట్టి అన్ని వార్డులకు సమానంగా ఇళ్లను కేటాయించాలంటూ పట్టుబట్టారు. ఎంతకీ తగ్గకపోవడంతో అదనపు కలెక్టర్.. కలెక్టర్‌తో వేరుగా చర్చించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే ఇళ్ల పంపిణీ ఆలస్యమైందన్నారు. జూన్ 2న లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేద్దామని, సహకరిస్తే పేదలకు న్యాయం జరుగుతుందని అర్థం చేసుకోవాలంటూ కౌన్సిలర్లను కోరారు. రెండు విధానాలు కాకుండా 1,032 మందితో నేరుగా లక్కీ డ్రా తీద్దామని వచ్చినవారు ‘డ్యాన్స్ చేస్తారని, రానివారు ఏడుస్తారంటూ’ పేర్కొన్నారు. దీంతో చల్లబడ్డ కౌన్సిలర్లు అన్ని వార్డులకు సమానంగా వచ్చేలా డ్రా నిర్వహించేందుకు అంగీకరించారు. దీంతో ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. నాలుగు గంటలకు సమావేశం మొదలు కాగా రాత్రి 7.30గంటలకు ముగియడం పరిస్థితికి అద్దం పడుతుంది. ర్యాండమైజేషన్ ద్వారా..అనంతరం 46 వార్డులకు ఏడు చొప్పున మూడు ఇళ్లకు తక్కువ దరఖాస్తులు రావడంతో వచ్చిన దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపికై న వారి జాబితాను మున్సిపల్, కలెక్టర్ కార్యాలయాల నోటీసుబోర్డుపై ఉంచనున్నట్లుగా తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లోగా తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. గతంలో ఎంపికై న లబ్ధిదారులతో పాటు 337మందిని కలిపి అందరికి జూన్ 2లోగా ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. -
రౌడీయిజాన్ని కనుమరుగు చేస్తాం
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో రౌడీయిజం, గుండాయిజం పూర్తిగా కనుమరుగు చేసి ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లాలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. పద్ధతి మార్చుకోని వారిపై పీడీ యాక్ట్ నమోదుకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే ఆరుగురిపై నమోదు చేశామని స్పష్టం చేశారు. గతంలో జిల్లాలో 1,300కు పైగా రౌడీ, సస్పెక్ట్ షీట్లు ఉండగా, ప్రవర్తన మారిన 500 మంది షీట్లను తొలగించామని, నూతనంగా 300 మందిని చేర్చి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎవరైనా తిరిగి గంజాయి దందా, మట్కా, హత్యలు, భూ ఆక్రమణలు, ల్యాండ్ మాఫియా, నకిలీ పత్రాల సృష్టించడం వంటి నేరాలకు పాల్పడినా, సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెట్టినా సహించేది లేదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో గ్రంథాలయ దినోత్సవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవా ల్లో భాగంగా శనివా రం గ్రంథాలయ ది నోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవేశ పరీక్షలకు, ఇంజినీరింగ్, సైన్స్, సా హిత్య విషయాలకు సంబంధించి నూతన పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత ప్రభుత్వ ఐఐటీ స్థాయిల పరిశోధనా పత్రాలు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. డిజిటల్ గ్రంథాలయం ద్వారా 10 కోట్లకు పైగా పుస్తకాలు, ఆడియో–వీడియో వనరులు ఒక్క క్లిక్‌లో పొందేమని ఆయన వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలంటూ సలహా అందించారు. ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ. మురళీ దర్శన్ మాట్లాడుతూ డిజిటల్ వనరులను ఎలా ఉపయోగించుకోవాలో సాధనాత్మక సూచనలు ఇచ్చారు. పుస్తక ప్రదర్శనలో ఇంజనీరింగ్, శాస్త్ర, సాహిత్య, పోటీ పరీక్షల సంభంధిత తాజా నోట్లు, పుస్తకాలు ప్రదర్శనకు ఉంచారు. గ్రంథాలయాధికారి డాక్టర్ కే.అరుణ జ్యోతి స్వాగత ప్రసంగంలో పుస్తకదానానికి ప్రోత్సాహం ఇచ్చి ‘పుస్తకదానం చేయండి.. అక్షరజ్ఞానం పంచండి‘ అంటూ పాఠకులకు ఆహ్వానం పలుకారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ ప్లానింగ్ శేఖర్ శీలం, అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్.విఠల్, దేవరాజ్, గ్రంథాలయ సిబ్బంది అర్చన, సునీత, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
జొన్న పంట దగ్ధం
బోథ్: మండలంలోని కరత్వాడ శివారులో శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గ్రామానికి చెందిన రైతు అనిల్‌కుమార్ నాలుగెకరాల జొన్నపంట పూర్తిగా దగ్ధమైంది. పంట చేను పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్‌సర్క్యూట్ జరిగి నిప్పురవ్వలు ఎగిసి పడడంతో జొన్నపంటకు నిప్పంటుకుని క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానిక రైతులు, కూలీలు అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇచ్చోడలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా ఫైరింజన్ అందుబాటులో లేదని, వేరే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో అక్కడికి వెళ్లిందని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో రైతులంతా సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పివేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. -
ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
కాగజ్‌నగర్‌టౌన్: భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. నిర్మల్ జిల్లా బాసర రైల్వేస్టేషన్ మీదుగా నడిచే 07189/90 నాందేడ్–ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ అధికారులు ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న ధర్మవరం జంక్షన్లో ప్రారంభం కానుంది. 22న నాందేడ్ నుంచి రెగ్యులర్‌గా నడవనుంది. ఈ రైలులో 8 స్లీపర్, 6 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, 4 జనరల్ బోగీలు ఉంటాయి. ఇందులో దివ్యాంగులకు రాయితీ సౌకర్యం కల్పించారు.క్రమబద్ధీకరణ తర్వాత ఈ రైలుకు కొత్త నంబర్లు కేటాయించారు. 17635 నాందేడ్–ధర్మవరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతీ శుక్రవారం నాందేడ్‌లో బయలుదేరి 6:30 గంటలకు బాసర రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక్కడ రెండు నిమిషాల హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. 17636 ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతీ ఆదివారం ఉదయం 5:25కు బయలుదేరి 10:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 10:40కి బయలుదేరి సోమవారం తెల్లవారు జాము న 4:45 గంటలకు బాసరకు చేరుకుంటుంది. 4:47 గంటలకు నాందేడ్ బయలుదేరుతుంది. ఈ రైలు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, గూడురు, తిరుప తి, పాకాల మార్గం గుండా నడుస్తుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని భక్తులకు ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది. పెద్దపల్లి జంక్షన్‌తో కనెక్టివిటి17636 ధర్మవరం–నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తిరుపతి నుంచి వచ్చే భక్తులకు పెద్దపల్లి జంక్షన్లో ప్రతీ ఆదివారం రాత్రి 11:55కు పెద్దపల్లిలో దిగిన భక్తుల కు 10 నిమిషాల వ్యవధిలో రాత్రి 12:05 గంటలకు వచ్చే 17035 కాజీపేట్–బల్లార్షా ఎక్స్‌ప్రెస్ ఎక్కి రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌కు వెళ్ళవచ్చు. ఈ కొత్త రైలుతో పెద్దపల్లి జంక్షన్ నుంచి తిరుపతికి రైలు సౌకర్యం మరింత మెరుగుపడింది. ప్రతీ గురు, శుక్ర, శని, ఆదివా రాల్లో వరుసగా నాలుగు రోజులు వరంగల్–విజ యవాడ మీదుగా తిరుపతికి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. గురు, ఆదివారాల్లో రాత్రి 8గంటలకు 12762 కరీంనగర్–తిరుపతి బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, శుక్రవారం రాత్రి 10 గంటలకు 17635 నాందేడ్–ధర్మవరం వీక్లీ ఎక్స్‌ప్రెస్, శనివారం రాత్రి 10 గంటలకు 17633 నాందేడ్ తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. -
పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలి
ఆదిలాబాద్: పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందినప్పుడే వారిలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక, విద్యా వారోత్సవాల్లో భాగంగా బాలకేంద్రంలో శనివారం కళలు, హస్తకళల ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. బాలకేంద్రంలో మరిన్ని వసతులు కల్పించేలా కృషి చేస్తామన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించేలా కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులు తబలా, హా ర్మోనియం వాయించడంతో పాటు ఆయా పాటల పై నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందించారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్, విద్యాశాఖ అధికారులు అజయ్, లక్ష్మణ్, బాలకేంద్రం నిర్వహకులు మిట్టు రవి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
నేరేడిగొండ: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. నూతన వంటగదితో పాటు ప్రహరీని ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ పోలీస్ తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. గంజాయి, గుడుంబా, మట్కా వంటి అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచాలన్నారు. ఫిర్యాదుదారులపై గౌరవంగా వ్యవహరిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం రోల్ మామడ వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే, ఇచ్చోడ రూరల్ సీఐ రమేశ్, నేరేడిగొండ ఎస్సై ఇమ్రాన్, ఆర్ఎస్సై ఆశన్న, వెటర్నరీ అధికారి పావని తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’ అదృష్టవంతులెవరో?
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు గాను యంత్రాంగం సిద్ధమైంది. శనివారం సాయంత్రం 4గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అయితే మ్యానువల్‌గా కాకుండా ఆన్లైన్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లుగా తెలిసింది. ఇదీ పరిస్థితి .. నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పట్టణంలోని కేఆర్కే కాలనీలో రెండు బ్లాక్‌లుగా 760 ఇళ్లను నిర్మించగా, మావలలోని సర్వేనంబర్ 170లో 222 ఇళ్ల చొప్పున మొత్తం 982 ఇళ్లను నిర్మించారు. ఇందులో 720 ఇళ్ల కేటాయింపున కోసం మూడేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌యార్డులో లక్కీడ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే క్షేత్రస్థాయిలో నాటి లబ్ధిదారుల స్థితిగతులపై విచారణ చేపట్టిన మున్సిపల్ అధికారులు అందులో 527 మంది మాత్రమే అర్హులుగా ఉన్నట్లుగా తేల్చారు. నేడు లక్కీడ్రా.. సర్వేనంబర్ 170లో ఉన్న 222 ఇళ్లకు గాను 48 ఇళ్లను భవిష్యత్ అవసరాల కోసం రిజర్వ్‌లో ఉంచనున్నారు. మిగిలిన 174 ఇళ్లు, అలాగే కేఆర్కే కాలనీలోని గతంలో లక్కీడ్రాలో మిగిలినవి కలిపి మొత్తం 337 ఇళ్లకు కలెక్టర్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ల సమక్షంలో నేడు లక్కీడ్రా నిర్వహించనున్నారు. అయితే గతంలో దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా నిర్వహించగా ప్రస్తుతం మాత్రం మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారుల సమక్షంలోనే ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఇది కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల అన్ని పార్టీల కౌన్సిలర్లు తమ వార్డుల పరిఽఽధిలో నుంచి కొంతమంది పేర్లతో కూడిన జాబితా సిద్ధం చేసి అధికారులకు అందజేశారు. బీజేపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరు పది నుంచి 15 మంది పేర్లు ఇవ్వగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు 6నుంచి 8 మంది, ఎంఐఎం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముగ్గురేసి పేర్లతో కూడిన జాబితాలను అందజేశారు. వారిచ్చిన జాబితా ప్రకారమే లక్కీ డ్రా నిర్వహిస్తారా లేక దరఖాస్తుదారులందరి వివరాలతో కూడిన జాబితా ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడుతారా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్లోనే ఎంపిక ప్రక్రియలక్కీ డ్రా ప్రక్రియ ఈ సారి మ్యానువల్‌గా కాకుండా ఆన్లైన్లో ఉంటుంది. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా హౌసింగ్, రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. దరఖాస్తులను పలుమార్లు ర్యాండమైజ్‌గా చేసి కౌన్సిలర్లు అంగీకరించిన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక చేపట్టడం జరుగుతుంది. – ఏ.జగదీశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ డబుల్ బెడ్రూం ఇళ్ల సమాచారం.. కేటాయించనున్న ఇళ్లు : 337 దరఖాస్తుదారులు : 1100 మంది -
అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించాలి
కై లాస్‌నగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేయడంతో పాటు బాధితులకు సత్వ రం పరిహారం అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి కేసుల పురోగతిపై సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, విచారణ, పరి హారం అందజేత తదితర అంశాలపై పోలీస్, రెవె న్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సీల రక్షణకు సంబంధించిన చట్టాలను జిల్లాలో పకడ్బందీగా అ మలు చేస్తున్నట్లుగా తెలిపారు. విజిలెన్స్ కమిటీ త రచూ సమావేశమై కేసుల పురోగతిని సమీక్షించా లని సూచించారు. ఎస్సీలపై వేధింపులు జరగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఏఎస్పీ రుత్విక్ సాయి, డీఎస్సీడీవో సునీతా కుమారి, ఆర్డీవో జగదీశ్వర్ రావ్, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాలొన్నారు. పశువుల రక్షణకు ప్రత్యేక చర్యలు ఆదిలాబాద్‌టౌన్: పశువుల సంరక్షణకు ప్రత్యేక చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి అన్నారు. పట్ట ణంలోని పశువైద్యశాల వెనుక భాగంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కంపౌండ్ వాల్‌ను శుక్రవారం పరిశీలించారు. జిల్లాలోని వివిధ చెక్‌పోస్టుల వద్ద స్వాధీనం చేసుకున్న పశువుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా షెడ్ నిర్మించాలని ఆదేశించారు. పట్టుబడిన పశువులను నేరుగా గోశాలకు తరలించడం ద్వారా స్థల సమస్య, నిర్వహణ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పే ర్కొన్నారు. పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని సూచించారు. ఇందులో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రామారావు రాథోడ్, అసిస్టెంట్ డైరెక్టర్ గోపీకృష్ణ పాల్గొన్నారు. -
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
● కుండి శేకుగూడ జీపీ సందర్శన ● క్షేత్రస్థాయిలో సమస్యల పరిశీలన నార్నూర్: గాదిగూడ మండలం కుండి శేకుగూడ జీపీ పరిధిలోని ఆయా గ్రామాల్లో అధికారులు శుక్రవారం పర్యటించారు. ఇటీవల గ్రామస్తులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఆయన సంబంధిత శాఖల అధికారులను పరిశీలనకు ఆదేశించారు. ఈమేరకు డీఎల్పీవో ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల, హౌసింగ్ తదితర శాఖల అధికారులు శుక్రవారం ఆయా గ్రామాలను సందర్శించారు. గ్రామస్తులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని కుండి, కుండి శేకుగూడ, చిన్నకుండి, కుండి మరోతిగూడ గ్రామాలు ఏర్పడి దాదాపు ఏడు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవని తెలిపారు. గ్రామాల్లో ఎక్కువగా పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు ఉండటంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యుత్ స్తంభాలు లేక రాత్రి వేళల్లో అంధకారంలో మగ్గాల్సి వస్తోందని పేర్కొన్నారు. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని, గ్రామంలో బోరు ఉన్నప్పటికీ కరెంటు స్తంభా లు, ట్రాన్స్ఫార్మర్ లేక వినియోగంలోకి రా వడం లేదన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరా రు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీ సుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇందులో ఎంపీడీవో శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్, మీషన్ భగీరథ ఏఈ శివ, హౌసింగ్ డీఈ భుజంగ్‌రావు, ఏఈ రాకేశ్ తదితరులున్నారు. -
పుస్తక పఠనంతో విజ్ఞానం
ఆదిలాబాద్‌టౌన్: పుస్తక పఠనంతో జ్ఞానం పెంపొందుతుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. విద్యా వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో శుక్రవారం గ్రంథాలయ దినోత్సవం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటూ దినపత్రికలు, పుస్తకాలు చదవాలని సూచించారు. ప్రిన్సిపాల్ అతీఖ్ బేగం, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. బజార్హత్నూర్లో.. బజార్హత్నూర్: శాఖ గ్రంథాలయాలకు పక్కా భవనాలతో పాటు వసతుల కల్పనకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. మండల కేంద్రంలో ని గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో లైబ్రేరియన్ రాజన్న, సర్పంచ్ సా యన్న, తదితరులు పాల్గొన్నారు. పుస్తక పఠనంతో ఉజ్వల భవిష్యత్తు ఆదిలాబాద్: పుస్తక పఠనంతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన– ప్రగతి ప్ర ణాళిక’ విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మట్లాడారు. విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి గ్రంథాలయాలను సందర్శించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. నిరంతరం గ్రంథాలయాన్ని సందర్శించే ఉత్తమ పాఠకులను అభినందించి, వారికి బహుమతులు అందజేశారు. అనంతరం గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఇందులో అదన పు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ మల్లెపూల నర్సయ్య, లైబ్రేరియన్ శ్రీనివాస్, సిబ్బంది సతీశ్, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు. -
ఇం‘ధన’ భారం!
కై లాస్‌నగర్: ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే గ్యాస్ ధర మండగా తాజాగా పెట్రోల్, డీజిల్ వంతయింది. ఆయిల్ కంపెనీలు లీటర్‌పై ఏకంగా రూ.3చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి రావడంతో బంకులకు వెళ్లిన వాహనదారులు షాక్‌కు గురయ్యారు. ఈ పెంపుతో జిల్లాపై రోజుకు రూ.7.26లక్షల భారం పడనుంది. అలాగే ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై కూడా చూపే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. రోజుకు రూ.7.26లక్షల భారం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆయిల్ కంపెనీలకు సంబంధించి 70 బంక్‌లు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా రోజుకు 70వేల నుంచి 80వేల లీటర్ల పెట్రోల్ వినియోగమవుతుంది. లీటర్ పెట్రోల్‌పై రూ.3 పెంచినప్పటికీ జిల్లాకు వచ్చేసరికి మరో 39 పైసలు అదనంగా పెరిగాయి. ఈ లెక్కన వాహనదారులపై పెట్రోల్ అదనపు భారం రోజుకు రూ.2.37లక్షల వరకు పడుతుంది. నెలవారీగా పరిశీలిస్తే రూ.71లక్షలుపైనే. ఇక డీజిల్ రేటు జిల్లాలో లీటర్‌కు రూ.3.26 పైసలు పెరగగా.. రోజుకు 1.50 లక్షల నుంచి 1.70 లక్షల లీటర్లు వినియోగమవుతుంది. ఈ లెక్కన వాహనదారులపై రూ.4.89 లక్షల భారం పడుతుంది. నెలవారీగా పరిశీలిస్తే అదనపు భారం రూ.1.46కోట్లకు పైనే ఉండనుంది. ఇది రవాణారంగంతో పాటు నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. పేదలపై పెను భారం ఇంధన ధరల పెంపుతో వాహనదారులపైనే కాకుండా పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం పడే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. రవాణా చార్జీలు సైతం పెరగనున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారనుంది. జిల్లాలోని పెట్రోల్ బంక్‌లు : 70 పెరిగిన ఇంధన ధరలు పాత ధర ప్రస్తుతం పెట్రోల్ రూ.108.86 రూ.112.25 డీజిల్ రూ.97.13 రూ.100.39 -
మారుమూల గ్రామాల సందర్శన
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని మారుమూల గ్రామాలైన వాన్వాట్ పంచాయతీ పరిధి మంగ్లీ, అసోదా పంచాయతీ పరిధి బుర్కి గ్రామాలను ఐటీడీఏ పీవో మంద మకరందు గురువారం సందర్శించారు. మంగ్లీకి రోడ్డు సౌకర్యం సరిగా లేక సుమారు నాలుగు కిలోమీటర్లు బైక్‌పై వెళ్లారు. బైక్ కూడా వెళ్లడానికి వీలు లేని ప్రాంతం నుంచి కాలినడకన గ్రా మానికి చేరుకున్నారు. గ్రామస్తుల సమస్యలు తెలు సుకుని దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వా రా లబ్ధి చేకూరేలా చూస్తామని తెలిపారు. పీవీటీజీ ఏపీవో భాస్కర్, తహసీల్దార్ గోవింద్, ఐటీడీఏ ఈ ఏ సతీశ్, ఆర్ఐ శకుంతల, వాన్వాట్, అసోదా బు ర్కి సర్పంచులు మెస్రం భుజంగ్‌రావ్, మెస్రం నా గోరావ్, ఏఈలు ఆదిత్య, గణేశ్ తదితరులున్నారు. ఆత్మీయ సమ్మేళనం ఉట్నూర్ రూరల్: ఉట్నూర్ పరిధిలోని కుమరం భీమ్ కాంప్లెక్స్‌లో తోటి, కోలాం సర్పంచులు, వార్డ్ సభ్యులు, మేధావులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈటీడబ్ల్యూ తానాజీ, మండల అధికారి గంగాధర్, ఏపీవో జనరల్ వసంతరావు, ఏపీవో పీవీటీజీ భాస్కర్, డీడీ అంబాజి, వైద్యారోగ్యశాఖ అధికారి మనోహర్‌తో కలిసి ఐటీడీఏ పీవో మకరందు హాజరయ్యారు. పీవీటీజీ, కోలాం, తోటి, ఆది వాసీ గిరిజనులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారులకు సమయం కేటాయిస్తానని తెలిపారు. విద్య, వైద్యం కోసం ప్రజల నుంచి ఒక నాయకుడిని ఎంపిక చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
ఆదివాసీలతో సమావేశమైన అహేరి ఎమ్మెల్యే
ఆదిలాబాద్‌రూరల్: మావల మండలంలోని బట్టిసావర్గాం శివారు ప్రాంతంలోగల కుమురంభీం కాలనీకి చెందిన ఆదివాసీలతో ఎన్సీపీ నేత, అహే రి ఎమ్మెల్యే, తెలంగాణ ఇన్చార్జి ఆత్రం బాబా గు రువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ దివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ మాట్లాడు తూ.. ఇంటి స్థలాలకు పట్టాలు, నీరు, విద్యుత్ వి ద్య, వైద్యం, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తెలంగాణ గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పా రు. సామాజిక కార్యకర్తలు అజయ్‌కుమార్, చంద్ర న్న, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రేణు క, ఉపాధ్యక్షురాలు ఇందిరా, ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు విష్ణు, తుడుం దెబ్బ ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు గణపతి, నాయకులు ముకుందరావు, ప్రకాశ్, తులసీరాం తదితరులున్నారు. -
సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు పెంచాలి
ఇంద్రవెల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణా లు పెంచాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మండలకేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ స్కూల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థు ల సంఖ్య పెంపు, వసతుల కల్పన తదితర అంశాలపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు వా రి తల్లి దండ్రులను శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. అనంతరం మండలకేంద్రంలో చేపట్టిన జనగణన సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో జీవన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, సర్పంచ్ రాథోడ్ మోహన్‌సింగ్, ఉప సర్పంచ్ తిట్టే సుమిత్, హెచ్ఎం రవీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులున్నారు. -
రోగులకు అందుబాటులో ఉండాలి
గుడిహత్నూర్: రోగులకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ సూచించారు. గురువారం స్థానిక పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎండల దృష్ట్యా పీహెచ్సీలో మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందుల కోసం ముందస్తుగా ఇండెంట్ పెట్టాలని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు నిరంతర సేవలు అందేలా ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, పీహెచ్‌సీలోనే ప్రసూతి అయ్యేలా చూడాలని సూచించారు. జిల్లా అదనపు వైద్యాధికారి మనోహర్, మండల వైద్యాధికారి నీలోఫర్ ఉన్నారు. -
నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా
ఆదిలాబాద్‌టౌన్: నకిలీ విత్తనాలు, గడ్డి మందులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నెలవారీ నేర సమీక్ష నిర్వహించి మాట్లాడారు. బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యా ల నిర్మూలనకు కృషి చేయాలని తెలిపారు. వర్టికల్ విధానం అమలు చేయాలని, రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఈ కేసుల దర్యాప్తు, పురోగతి, విచారణ, శిక్షలపై సమీక్షించి ప్రతీ ఒక్కరికి సమాన విధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, రాత్రి వేళ గస్తీని మరింత పటిష్టం చేసి అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగ్ వంటి చర్యలను అరికట్టాలని పేర్కొన్నారు. నేరస్తుల ఫింగర్ప్రింట్లను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ సురేందర్‌రావు, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్‌సాయి కొట్టె, శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్‌కాంత్, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రం ప్రారంభం
సాత్నాల: మండలంలోని కాన్ఫా మెడిగూడ రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన జొన్న పంటను నూటికి నూరుశాతం ప్రభుత్వం కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పంట కొనుగోలు కోటాను పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. జైనథ్ ఏఎంసీ చైర్మన్ అల్లూరి అశోక్‌రెడ్డి, తహసీల్దార్ జాదవ్ రామారావు, రైతులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని క్రాంతినగర్ కాలనీలో చేపట్టిన విట్టల రుకుంబాయి ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని పురాతన ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కౌన్సిలర్లు నరేశ్, జీవన్, కృష్ణ, రాకేశ్, అశోక్‌రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు భూమిపూజ
సిరికొండ: విద్యావారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.కోటి 72లక్షలతో చేపట్టిన అదనపు తరగతుల నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం భూమిపూజ చేశారు. ఎస్సెస్సీ టాపర్‌గా నిలిచిన విద్యార్థినితో ఆర్వోఆర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. విద్యార్థినులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను శాలువాలతో సన్మానించారు. మండలంలోని రాయిగూడ ఆశ్రమ పాఠశాలలో రూ.13 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో ప్రమాదకర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తించిన ఎమ్మెల్యే చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని అక్కడే ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సతీశ్‌ను ఆదేశించారు. ఇన్చార్జి ఎంపీడీవో సంతోష్‌కుమార్, సర్పంచులు బొడ్డు దత్తాత్రి, పెందుర్ లక్ష్మణ్, రాజు, ఎంఈవో సునీల్‌కుమార్, ఎస్వో సంధ్యారాణి, ఆత్రం భాస్కర్, నాయకులు రంజాన్, పెంటన్న, ఎక్బాల్, చందు, తదితరులు పాల్గొన్నారు. ఇచ్చోడ: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో రూ.13.50లక్షలతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, సర్పంచ్ కొడప జలైజాకు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు రమణారెడ్డి తదితరులున్నారు. నేరడిగొండ: మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.68 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేశారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నూతన గదుల నిర్మాణం, పాఠశాల భవనానికి మరమ్మతు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మండలాధ్యక్షుల నియామకం
కైలాస్‌నగర్: కాంగ్రెస్ మండ ల, పట్టణ అధ్యక్షులను పార్టీ అ ధిష్టానం ఎట్టకేలకు ఖరారు చే సింది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపే తం చేయడమే లక్ష్యంగా పార్టీకి విధేయులుగా ఉన్న వారికి పదవులు కట్టబెట్టింది. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్‌జాదవ్ పంపించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయి తే, ఇదివరకు ఆదిలాబాద్ పట్టణానికి అధ్యక్షుడు ఉండగా కొత్తగా ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండల కేంద్రాలకూ వేరుగా అధ్యక్షులను నియమించడం ప్రా ధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఊ రిస్తూ వస్తున్న పదవులను ఎట్టకేలకు భర్తీ చేయడంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. త్వరలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్న నేపఽథ్యంలో పార్టీ మండలాధ్యక్షులను నియమించడం కాంగ్రెస్‌కు కలిసిరానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, కొత్త అధ్యక్షులు మండలంలోని నా యకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని పటిష్టం చేయాలని కోరారు. నూతన అధ్యక్షులు వీరే.. మండలం అధ్యక్షుడి పేరు ఆదిలాబాద్‌రూరల్ వెంకటేశ్‌యాదవ్ జైనథ్ జి.జగదీశ్‌రెడ్డి బేల రూప్‌రావు మావల కుదురుపాక సురేశ్ భోరజ్ బత్తుల శ్రీనివాస్ సాత్నాల కనక బాపురావు ఆదిలాబాద్ ఖిజర్ పాషా ఇంద్రవెల్లి ఎండీ జహీర్ ఇంద్రవెల్లిటౌన్ సోన్కాంబ్లేజితేందర్ ఉట్నూర్ దాసండ్ల ప్రభాకర్ ఉట్నూర్టౌన్ సయ్యద్ నిసార్ భీంపూర్ దండే సుదర్శన్ తలమడుగు కసుల ప్రతాప్ తాంసి కౌడాల సంతోష్ సిరికొండ షేక్ ఇమామ్ బజార్హత్నూర్ కళ్లెం విఠల్ ఇచ్చోడ ఆసిఫ్ ఉల్లాఖాన్ నేరడిగొండ ఏలేటి రాజశేఖర్‌రెడ్డి బోథ్ నల్ల శ్రీకాంత్‌రెడ్డి గుడిహత్నూర్ తొడసం దౌలత్రావ్ సొనాల గాజుల పోతన్న నార్నూర్ చౌహాన్ గోవింద్రావు గాదిగూడ గెడం పరశురాం -
పకడ్బందీగా జొన్నల కొనుగోళ్లు
కై లాస్‌నగర్(బేల): రైతులకు ఇబ్బందులు కలగకుండా జొన్న పంటను కొనుగోలు చేస్తామని మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌రావు పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్‌లో చేపట్టిన జొన్న కొనుగోళ్లను గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 30శాతం పంట కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన పంటను ఇక్కడే ఉన్న గోదాంలో నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. గన్నీ సంచుల కొరతతో కొనుగోళ్లలో కొంత జ్యాపం జరుగుతోందని, రైతులు సొంతంగా గన్నీ బ్యాగ్‌లు సమకూర్చుకుంటే ఒక్కో సంచికి రూ.22 చెల్లించనున్నట్లు వివరించారు. -
క్రీడాకారులకు సన్మానం
ఆదిలాబాద్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించిన ‘3వ తెలంగాణ త్రోస్, జంప్స్, 400 మీటర్ల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026’లో విజేతలైన జిల్లా క్రీడాకారులను బుధవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి మాట్లాడారు. ‘రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు 10 పతకాలు సాధించారని, క్రీడాకారుల క్రమశిక్షణ, కోచ్ రాకేశ్ శిక్షణతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. హ్యామర్ త్రోలో అరుణ, విక్రమ్ సింగ్, షాట్‌పుట్‌లో చరణ్ బంగారు, జ్యోతీశ్వరన్, సౌమ్య, జ్యోతి, సంజన, ఖుషి రజత, వంశీ, సౌమ్య కాంస్య పతకాలు సాధించగా అసోసియేషన్ సెక్రటరీ రాజేశ్, పెటా ప్రెసిడెంట్ పార్థసారథి, పీడీ కృష్ణతో కలిసి అభినందించారు. -
వివరాలు తీసుకుని గదులివ్వాలి
ఆదిలాబాద్‌టౌన్: ఆధార్, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా నమోదు చేసిన తర్వాతే గదులివ్వాల ని డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పట్టణంలోని లాడ్జిల యజమానులు, నిర్వాహకులతో బుధవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సమావేశం ని ర్వహించి మాట్లాడారు. గంజాయి విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, పాత మొబైల్ ఫోన్లు సేకరించే నేరస్తులకు గదులు ఇవ్వవద్దని తెలిపారు. లాడ్జిల్లో బ స చేసిన వారి పూర్తి వివరాలను ప్రతీ వారం ఆ యా ఠాణాల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఫొటో గుర్తింపు పత్రాలను భద్రపర్చుకోవాలని తెలి పారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించా రు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టణ సీఐలు సునీల్‌కుమార్, నాగరాజు, ఫణిధర్, ఎస్సైలు సంజయ్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
● రెండోవిడతకు ప్రభుత్వం సమాయత్తం ● జూన్ 2న జిల్లాకేంద్రంలో ప్రారంభం ● 30 వేలకుపైగా ఇళ్లు వచ్చే అవకాశం ● నత్తనడకన తొలివిడత ఇళ్ల నిర్మాణం
కైలాస్‌నగర్: రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా నుంచే ప్రా రంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో జిల్లాలోని గూ డులేని పేదప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న మలివిడత ఇళ్ల ని ర్మాణాలకు శ్రీకారం చుడతా మని, దీనిపై ఈ నెల 21న జరి గే రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. దీంతో సొంతిళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలివిడత కంటే మ లి విడతలో రెట్టింపు స్థాయిలో మంజూరు చేస్తామ నే ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాకు సుమారు 30వేల కు పైగా ఇళ్లు వచ్చే అవకాశముంది. అయితే, వీటిని అనర్హులకు కాకుండా అర్హులను గుర్తించి ఇస్తే పేద ల సొంతింటి కలతోపాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 81వేల మందికి పైగా అర్హులు దారిద్య్ర రేఖకు దిగవనున్న నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోంది. ఒక్కో ని ర్మాణానికి రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తోంది. ఇళ్ల కోసం ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాలతోపాటు ఎంపీడీవో కార్యాలయాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా వ్యా ప్తంగా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరి శీలించిన అధికారులు 81,901 మందిని (ఉ ట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు మినహా) అర్హులుగా గుర్తించారు. ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేనివారిని ఎల్–1 జాబితా లో చేర్చారు. ఇళ్లకు అర్హత ఉండి స్థలం లేనివారు 26,158 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వీరిని ఎల్–2 జాబితా లో చేర్చారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొంది ఉండటం, ఆర్సీసీ పక్కాభవనం ఉండటం, నాలుగు చక్రాల వాహనం, ఆదాయపు పన్ను చెల్లించినవారిని అనర్హులుగా ఎల్–3జాబితాలో చేర్చారు. ఇందులో 53,959 మంది ఉన్నట్లు గుర్తించారు. అర్హులకు కేటాయిస్తేనే ప్రయోజనం తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున జిల్లాకు 7,800 ఇళ్లు మంజూరయ్యాయి. ఆదిలాబా ద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చేసి న విజ్ఞప్తి మేరకు మరో 8వేలకు పైగా ఇళ్లు మంజూ రయ్యాయి. కాగా, ఇందులో చాలామంది అనర్హుల కు మంజూరయ్యాయనే ఆరోపణలు వ్యక్తమయ్యా యి. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అధికసంఖ్యలో ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ విడతలో నైనా అర్హులను గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా వారి సొంతింటి కల సాకారమవుతుంది. ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరనుంది. కానీ, ఇందిరమ్మ కమిటీలపైనే ఆధారపడి వారిచ్చే సిఫారసుల మేరకు ఇళ్లు మంజూరు చేస్తే మళ్లీ అనర్హులకే ప్రయోజనం కలిగే అవకాశముంది. అధికారులు ప్రత్యేక పరిశీలన చేపట్టి అర్హులనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తొలి విడత.. నత్తనడక.. మంజూరైన ఇళ్లు 16,106 మార్కౌట్స్థాయిలో 1,819 బేస్మెంట్ లెవల్లో 5,219 రూఫ్లెవల్లో 2,959 స్లాబ్ లెవల్లో 3,026 పూర్తయిన ఇళ్లు 1,477 ప్రారంభంకాని ఇళ్లు 1,606మొదటి విడతలో మంజూరైన ఇళ్ల వివరాలు జిల్లాలో తొలివిడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. 16,106 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 1,477 మాత్రమే పూర్తి కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 1,606 ఇళ్లు ప్రారంభానికే నోచుకోలేదు. 1,819 నిర్మాణాలు పునాది దశలోనే ఉన్నాయి. ఈ విడతలోనైనా నిర్మాణాల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం సూచిస్తోంది. -
జిల్లావాసికి డాక్టరేట్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన చౌహాన్ రాణా ఆశిష్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జ ర్నలిజం, మాస్ కమ్యూని కేషన్ విభాగంలో పీహెచ్ డీ పట్టా పొందారు. ‘పొలిటికల్ ఇన్ఫ్లూయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఏ కేస్ స్టడీ ఆన్ ట్రైబ్స్ ఆఫ్ ఆదిలాబాద్’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. 2023లో గిరిజన ప్రాంతాల్లో సో షల్ మీడియా, రాజకీయ ప్రభావంపై పరిశోధ న చేసి భూ హక్కులు, విద్య, ఆరోగ్యం లాంటి స్థానిక సమస్యలు, సంప్రదాయ ప్రచార పద్ధతుల కంటే డిజిటల్ ప్ర చార ప్రభావం పెరుగుతోందని వివరించారు. ఇతని తండ్రి చౌహాన్ జైవంత్ రావు విద్యుత్ శా ఖలో సీఈగా, తల్లి స్వరూప చవాన్ ఆది లాబాద్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నా రు. ఆశిష్‌కు డాక్టరేట్ రావడంపై పలువురు అభినందించారు. -
ఇక బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
సాక్షి, ఆదిలాబాద్: సభ్యత్వ నమోదుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. డిజిటల్ పద్ధతిలో నమోదు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఎన్నిక ల కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో పాటు ఓటరు జాబితా సవరణ తదితర కార్యాచరణ అంతా డిజిటల్ పద్ధతిలోనే జరుపుతున్న నేపథ్యంలో పార్టీ ఇలా నిర్ణయించింది. నియోజకవర్గాల్లోని మండలాలు, మున్సిపాలిటీల్లో అన్నిచోట్ల స మన్వయ కమిటీల నియామకానికి నేతలు కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జిగా రావుల శ్రావణ్‌కుమార్‌రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ప్రాదేశిక ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అన్నిచోట్ల క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కా ర్యాచరణ సిద్ధం చేస్తోంది. సభ్యత్వాల నమోదుకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఇద్దరు కార్యకర్తలను ఎంపిక చేసి వారికి జిల్లా కేంద్రాల్లో సాంకేతిక నిపుణులతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. మండలా లు, బల్దియాల్లో ఐదుగురు నేతలతో సమన్వయ క మిటీలను నియమించే దిశగా చర్యలు చేపట్టారు. సంస్థాగత నిర్మాణంపై దృష్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలామంది ముఖ్య నేతలు పార్టీని వీడారు. దీంతో పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేపట్టడంలో కొంత వెనుకబడింది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగత నిర్మాణం చేసి పటిష్టపర్చాలని అ ధినేత కేసీఆర్ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టా రు. జిల్లాలోని బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఇదివరకు జిల్లా అ ధ్యక్షుడిగా వ్యవహరించిన మాజీ మంత్రి జోగు రా మన్న పర్యవేక్షిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో పా ర్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతీ పోలింగ్ బూత్‌కు ఇద్దరు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి వారిని సభ్యత్వ నమోదులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. -
ఐక్యతతో ముందుకు సాగాలి
తాంసి: ఆలయాల నిర్మాణాలు గ్రామస్తుల ఐ క్యతకు నిదర్శనమని, ఐక్యతతో ముందుకు సా గితేనే గ్రామాలాభివృద్ధి సాధ్యమని ఆదిలాబా ద్ ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. బుధవా రం భీంపూర్ మండలంలోని అంతర్గాం గ్రా మంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరయ్యారు. హోమం, ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణంలో షెడ్ నిర్మాణానికి త్వరలోనే రూ.5లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డీసీసీ బీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ ర మేశ్, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, ఎస్సై పీర్‌సింగ్‌నాయక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజు, సర్పంచ్ రాకేశ్‌యాదవ్ తదితరులున్నారు. -
భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లైంగిక దాడికి గురైన మైనర్ బాలిక పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనేందుకు ఇదే నిదర్శనమని ఆరోపించారు. గత ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు స్థానిక ఎమ్మెల్యేకు కనిపించకపోవడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కొప్పుల దేవన్న, కారం కార్తిక్, గెడం నగేశ్, కలగట్టు అనిల్, ఆది నారాయణ, కుమ్ర నగేశ్ తదితరులు బీఆర్ఎస్లో చేరగా రామన్న వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నాయకులు మెట్టు ప్రహ్లాద్, రాఘవేంద్ర, లింగారెడ్డి, వెంకట్‌రెడ్డి, గణేశ్, లస్మన్న, సత్యనారాయణ, అడెల్లు తదితరులున్నారు. -
పాఠశాలల బలోపేతంలో భాగమవ్వాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షిషా పి లుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక వి ద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం రిమ్స్ ఆడిటోరియంలో ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లకు నిర్వహించిన విద్యా అవగాహన సదస్సుకు హాజరై మా ట్లాడారు. ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంగన్వాడీ పి ల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని ప్రజా ప్రతినిధులను కోరారు. విద్యార్థులు మధ్యలో చదు వు మానేయకుండా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతీ పాఠశాలకు నిర్దేశించిన ఎన్రోల్మెంట్ లక్ష్యాలను చేరుకునేందుకు గ్రామాలు, వార్డుల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, డీఎల్పీవో ఫణీందర్, కోఆర్డినేటర్ అజయ్, అధికారులు పాల్గొన్నారు. జనగణనను పకడ్బందీగా చేపట్టాలి కైలాస్‌నగర్: జనగణన పకడ్బందీగా చేపట్టాలని క లెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్, బొక్కలగూడ కాలనీల్లో నిర్వహిస్తున్న జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేను ఆకస్మికంగా పరిశీ లించారు. ప్రక్రియ క్రమపద్ధతిలో సాగుతుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 14నుంచి హౌ స్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్వో) యాప్ ద్వారా డేటా నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో సాంకేతిక అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్ శ్రీహరిబాబు, ఫీల్డ్ ట్రైనర్ సుజాత్‌ఖాన్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నవీన్‌కుమార్, సాయికృష్ణ ఉన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ కఠినంగా అమలు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ–2026ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్థాయి సెన్సిటైజేషన్ వెబినార్‌లో కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. మే 5, 2026న జారీ చేసిన తాజా ఉత్తర్వులను జిల్లాలో అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేంక్షించబోమని హెచ్చరించారు. బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి నిబంధనల ప్రకా రం వారి ప్రాంగణాల్లోనే వ్యర్థాల ప్రాసెసింగ్ జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రవీందర్ రాథో డ్, డీఎల్పీవో ఫణిందర్‌రావు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం తనిఖీ తాంసి: మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు పండించిన జొన్న పంటను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందవద్దని తెలిపారు. అదనపు కలెక్టర్ చిత్రు, మార్క్‌ఫెడ్ డీఎం మ హేశ్, డీఏవో శ్రీధర్‌స్వామి, ఏడీఏ శ్రీనివాస్, ఎంబీఐ శ్రీనివాస్, కొనుగోలు కేంద్రం ఇన్చా ర్జి శ్రీనివాస్, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, తహసీ ల్దార్ లక్ష్మి, ఏవో రవీందర్ తదితరులున్నారు. -
ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ పే ర్కొన్నారు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిమ్స్‌లోని ఏఆర్టీ సెంటర్లో హెచ్ఐవీతో జీవిస్తున్న 18 మంది పేదలకు బుధవారం పౌష్టికాహారం పంపిణీ చేయగా నరేందర్ రాథోడ్ హాజరై మాట్లాడారు. ప్ర భుత్వ ఏఆర్టీ సెంటర్ ద్వారా అందించే మందులతో పాటు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని భరోసా ఇచ్చారు. నా కో, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి నిర్దేశించిన 95:95:99 లక్ష్యాలను అధిగమించి జిల్లా ను ఆదర్శంగా నిలపాలని తెలిపారు. హెచ్ఐవీతో జీవిస్తున్న చిన్నారులకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. చిన్నారుల ఉన్నత విద్య, పెద్దలకు ఆసరా పెన్షన్ల కోసం సంబంధిత అధికారులకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. హెచ్ఐవీతో జీవిస్తున్న వారు క్రమం తప్పకుండా ఏఆర్ టీ సెంటర్లో మందులు తీసుకోవాలని, తద్వారా వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చని పేర్కొన్నారు. హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపకుండా సహకా రం అందించాలని సూచించారు. ఏఆర్టీ సెంటర్ డాక్టర్ పద్మిని ప్రియదర్శిని, సీపీఎం నాగరాజు, ఎన్జీ వో ప్రతినిధులు సాయినాథ్, భాగ్యలక్ష్మి ఉన్నారు. -
‘దళారులకు ధాన్యం అమ్ముకోవద్దు’
బోథ్: ధాన్యం దళారులకు అమ్ముకోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందా లని ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ సూచించారు. సొనాల మండల కేంద్రంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో బోథ్ పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన జొన్నల కొనుగో లు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, సర్పంచ్ బిందుజ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, స్థానిక నాయకుడు తుల శ్రీనివాస్ తదితరులున్నారు. కాగా, సొనాల మండలంలో పలు శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే తిరుగు ప్రయాణంలో స్థానికంగా గల చిన్నపాటి హోటల్ వద్ద ఆగారు. టీ తాగు తూ స్థానికులతో సరదాగా ముచ్చటించారు. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నేరడిగొండ: మండలంలోని వడూర్ గ్రామం నుంచి దంస్యతండా వరకు రూ.15లక్షలతో చేపట్టిన గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి పనులు ప్రారంభం కావడంతో గ్రా మస్తులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని సు ర్దాపూర్ గ్రామంలోని హన్మాన్ ఆలయంలో నిర్వహించిన హన్మాన్ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్యే హాజరై హోమం, ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. స్వా మివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్థానిక ప్ర జాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలి
తలమడుగు: బక్రీద్ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. బుధవారం రాత్రి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువల అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. పశువులను తరలిస్తున్న వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించాలని తెలిపారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. సిబ్బంది 24 గంటలు షిఫ్ట్ విధానంలో విధులు నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా పారిపోయే వాహనాల సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చేరవేయాలని సూచించారు. రూరల్ సీఐ ఫణిదర్, తలమడుగు ఎస్సై రాధిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
ఆదిలాబాద్‌టౌన్: వైద్యసేవల్లో నర్సుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రిమ్స్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్తమ సేవలు అందించిన పలువురు స్టాఫ్ నర్సులు, అధికారులను సన్మానించారు. రోగుల విషయంలో నర్సుల చూపే కరుణ, సేవాభావం అమూల్యమైందని అన్నారు. అందుకే వారిని గౌరవప్రదంగా సిస్టర్స్ అని పిలుస్తారని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ సూపరింటెండెంట్ నరేందర్, నర్సింగ్ సూపరింటెండెంట్లు కల్పన, రమాదేవి, ఉమ పాల్గొన్నారు. ఓటమి విజయానికి తొలిమెట్టుఓటమి అనేది విజయానికి తొలి మెట్టులా మారుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ నం.1 పాఠశాలలో పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల సందర్భంగా పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జిల్లాలో మూడు కేంద్రాలను ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి వంద శాతం ఉత్తీర్ణులు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ అర్బన్ ఎంఈవో సోమయ్య, డీసీఈబీ సెక్రెటరి గజేందర్, ప్రధానోపాధ్యాయురాలు నీలా దేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి మంజూల డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్‌లో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలిపైనే కేసు పెట్టడం దారుణమని అన్నారు. ఇందులో విజయ, మీన, నర్మద, రాధ, ఆరీఫా బేగం, గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ రాజీనామా చేయాలి కై లాస్‌నగర్: తన తనయుడు భగీరథ్ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్ర తినిధి బాలురి గోవర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తీవ్రమైన ఆరోపణలపై విచారణ జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రి హోదాలో కొనసాగడం విచారణ ప్రక్రియను ప్రభావితం చేస్తుందన్నారు. ఇందులో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సంజయ్‌కుమార్, దేవిదాస్చారి తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం ‘పరీక్ష’!
భవిష్యత్‌లో డాక్టర్ కావాలనే ఎన్నో ఆశలతో నీట్ రాసిన విద్యార్థులపై ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది. పరీక్ష రద్దుతో ఆందో ళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండేళ్లు కష్టపడి పరీక్ష రాస్తే ఒక్కసారిగా రద్దు చేయడం మానసిక వేదనకు గురి చేస్తోందని వాపోయారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – మంచిర్యాలఅర్బన్/నిర్మల్రూరల్రాత్రింబవళ్లు కష్టపడ్డాను రెండేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టపడి చదివాను. తెల్ల కోటు వేసుకోవాలనే ఆశతో నీట్‌కు సిద్ధమయ్యాను. ఎన్టీఏ పరీక్ష రద్దుతో నిరాశ నెలకొంది. నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పడంతో ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యాను. తల్లిదండ్రులు కూడా ఇబ్బందికి గురయ్యారు. పేపర్ లీక్ అనేది బాధాకరం. మళ్లీ పరీక్ష రాయాలంటే ఎన్నో ఇబ్బందులుంటాయి. అంతా సంతోషంగా ఉంటామని అనుకున్నా నేపథ్యంలో పరీక్షలు రద్దుకావడం బాధాకరం. – నేహ అంజుం, నీట్ విద్యార్థిని మంచిర్యాలరద్దుతో నిరాశ ఎంబీబీఎస్ సీటు సంపాదించుకోవాలని తల్లిదండ్రులు, నా కల. నేను రెండేళ్లుగా ఎంతో కష్టపడ్డాను. తీరా చూస్తే నీట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరంగా మారింది. నీట్ పేపర్ లీకేజీ కావడం అత్యంత బాధాకరం. ఇలాంటి చర్యల వల్ల మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. నీట్ పేపర్ లీకేజీ పునరావృతం కాకుండా చూడాలి. మళ్లీ పరీక్షలు రాయాలంటే కొంత మేర ఇబ్బందిగా చెప్పవచ్చు. – ప్రాణహిత, నీట్ విద్యార్థిని, మంచిర్యాలమానసిక ఒత్తిడి పెరుగుతుంది మళ్లీ నీట్ రాయమనడంతో మాపై మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. రెండేళ్లు కష్టపడి మొన్ననే పరీక్ష బాగా రాసాం. మార్కులు కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఒక్కసారిగా రద్దుచేసి మళ్లీ పరీక్ష రాయమంటే భయమేస్తోంది. హైదరాబాదులోని కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకున్నాం. మళ్లీ అక్కడికి వెళ్లి చదవాలంటే దూర భారంతోపాటు వ్యయప్రయాసలు పడాల్సిందే. ఒక రాష్ట్రంలో లీకై తే దేశ మొత్తం మంది విద్యార్థులను బలి చేయడం అన్యాయం. – మంగ్లారపు నక్షత్ర, నిర్మల్ -
నేరాల నియంత్రణకు చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా నా కాబందీ నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పట్టణాల్లో 25 ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ, నంబర్ ప్లేట్, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా చెక్‌పోస్టులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇందులో ఆది లాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి తలమడుగు: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ మంగళవారం త నిఖీ చేశారు. రికార్డులు పరిశీలించిన అనంతరం మాట్లాడారు.నకిలీ విత్తనాలు, గంజాయి అక్రమ ర వాణాను అరికట్టాలన్నారు. ఆయన వెంట రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై రాధిక, సిబ్బంది పాల్గొన్నారు. రెండో విడత డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఆదిలాబాద్‌టౌన్: రెండో విడత మెగా డ్రైవింగ్ లైసె న్స్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాట్లాడారు. ఈ నెల 16వరకు సంబంధిత పోలీసు స్టేషన్లలో ఉట్నూ ర్, ఇంద్రవెల్లి, బజార్హత్నూర్ మండలాల యువకులు టూవీలర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్, పదో తరగతి మెమో, అడ్రస్‌ప్రూఫ్ జిరాక్స్‌లను పోలీసు స్టేషన్లో అందజేయాలని సూచించారు. మొదటి విడతలో 205 మంది ఆదివాసీలకు డీజీపీ చేతుల మీదుగా లైసెన్సులు అందించినట్లు చెప్పారు. లర్నింగ్ లైసెన్స్ కోసం మీసేవలో నమోదు చేసుకోవాలని, ఇందుకోసం రూ.600 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
‘నీట్’ లీకేజీపై విచారణ జరిపించాలి
ఆదిలాబాద్‌టౌన్: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పేపర్ లీకేజీ ఘటన దారుణమని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కా ర్యాలయంలో మంగళవారం ముఖ్య నాయకుల స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో జిల్లా నాయకులు సచిన్, వెంకటేశ్, ఇర్ఫాన్, వేణు, రవి, దిగంబార్ తదితరులు పాల్గొన్నారు. -
రశీదులు ఇచ్చి మరీ..
సాక్షి,ఆదిలాబాద్: ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణ కోసం వ్యవసాయ శాఖ డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదమవుతోంది. ప్రైవేట్ విత్తన, ఎరువుల డీలర్ల నుంచి ఇటీవల రశీదులు ఇచ్చి మరీ పెద్ద ఎత్తున వసూళ్లు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రానున్న వానాకాలం సీజన్లో విత్తన లోపాలు, ఎరువుల అక్రమాలు జరిగితే ఆ డీలర్లపై ఎలా చర్యలు తీసుకుంటారు.. విచారణ బాధ్యతా యుతంగా ఎలా చే స్తారు.. అనే చర్చ మొదలైంది. మొత్తంగా ఈ వ్యవహారం ప్రస్తు తం వ్యవసాయ శాఖతో పాటు రైతుల్లోహాట్టాపిక్గా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలకు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి రైతు వారంగా నిర్వహించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. దీంతోపాటు కృషి విజ్ఞాన కేంద్రంలో ఇటీవల జోనల్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరి కమిటీ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి ఆదర్శ రైతులు పాల్గొన్నారు. వ్యవసా య, అనుబంధ శాఖ ల శాస్త్రవేత్తలు పా ల్గొని రైతులకు అవగాహన కల్పించారు. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాల నిర్వహణ కోసం వ్యవసాయ శాఖ ప్రైవేట్ విత్తన, ఎరువుల డీ లర్ల నుంచి పెద్ద మొత్తం వసూలు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు ఎలా.. రానున్నది వానాకాలం సీజన్. జిల్లాలో సుమారు 6లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. పత్తి పెద్ద ఎత్తున సాగవుతుంది. ఆ విత్తనాలను ప్రైవేట్ వ్యాపారులే విక్రయిస్తారు. అంతే కాకుండా ఎరువుల పంపిణీలోనూ డీలర్లదే ప్రధాన భూమిక. అలాంటప్పుడు నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమాలు చోటు చేసుకుంటే వ్యవసాయ శాఖ అధికారులు సదరు కంపెనీలపై నివేదిక వ్యతిరేకంగా ఎలా ఇవ్వగలుగుతారనే ప్రశ్న అందరిలో వ్యక్తమవుతుంది. అలాంటప్పుడు రైతుకు నష్టం జరిగే పరిస్థితులు ఉంటాయి. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంఅడ్వైజరి కమిటీ సమావేశం కోసం.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహణ కోసం ఎవరి నుంచి మేము డబ్బులు స్వీకరించలేదు. కృషి విజ్ఞాన కేంద్రంలో జోనల్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ఉమ్మడి జిల్లా నుంచి రైతులు వచ్చారు. పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఏటా ఒక్కో జిల్లాలో ఈ సమావేశం నిర్వహిస్తుంటారు. దానికోసం కొంత మంది డీలర్ల నుంచి మేము రశీదులు ఇచ్చిమరీ డబ్బులు తీసుకున్నాం. ఇది అక్రమ వసూళ్లు కాదు. కార్యక్రమ నిర్వహణ కోసమే ఇలా చేయడం జరిగింది. – శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రైవేట్ కంపెనీల డీలర్లలో ఒక్కొక్కరి నుంచి వేలాది రూపాయల చొప్పున వ్యవసాయ శాఖ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడింది. ఏకంగా వారు డీలర్లకు రశీదులు ఇచ్చి మరీ వసూళ్లు చేపట్టడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి గవర్నమెంట్ నుంచే బిల్లులు పెట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా బిల్లులు రావడం లేదని ఇలా నేరుగా వసూళ్లు చేశారా.. అనే విషయంపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. -
కోఆప్షన్ ఎన్నిక ఎప్పుడో?
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నిక అంశం చర్చనీయాంశంగా మారింది. దరఖాస్తులు స్వీకరించి 15 రోజులవుతున్నా ప్రత్యేక సమావేశం నిర్వహించకపోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్బంగా కూటమిగా ఏర్పడి ఆ పదవులను దక్కించుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల్లో కో ఆప్షన్ పదవులపై సఖ్యత కుదరలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదే జాప్యానికి కారణమనే విమర్శలున్నాయి. మరోవైపు మున్సిపల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకున్న బీజేపీ ఈ పదవులను ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నాలుగు పదవులకు 27 మంది పోటీ మున్సిపల్ పరిధిలో మొత్తం నాలుగు కో ఆప్షన్ పదవులకు ఎన్నిక జరగనుంది. ఇందులో రెండు జనరల్, మరో రెండు మైనార్టీలకు కేటాయించిన విషయం తెలిసిందే. వీటి కోసం గత నెల 17న మున్సిపల్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 25వరకు దరఖాస్తులు స్వీకరించారు. 28 మంది పోటీకి సై అన్నారు. పరిశీలనలో నిబంధనల ప్రకారం లేని ఒక దరఖాస్తును తొలగించారు. మిగిలిన వాటిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి అత్యధికంగా 20 మంది మాజీ కౌన్సిలర్లు, ఒక మాజీ సర్పంచ్ దరఖాస్తు చేసుకున్నారు. ఎంఐఎం నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు బరిలో నిలిచారు. మొత్తంగా నాలుగు పదవులకు 27 మంది పోటీపడుతున్నారు. ఈమేరకు ఎన్నిక నిర్వహించి మెజార్టీ సభ్యుల మద్దతు పొందిన వారిని కోఆప్షన్ సభ్యులుగా ప్రకటించాలి. బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు కూటమిగా ఏర్పడి చైర్పర్సన్, వైస్‌చైర్మన్ పదవులను దక్కించుకున్న విషయం విదితమే. అధికారం చేపట్టి మూడు నెలలు గడువకముందే వారి మధ్య అభిప్రాయ బేధాలు బయటపడుతున్నాయి. అయితే దీనిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఆ పార్టీకి 21మంది కౌన్సిలర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి 23 సభ్యుల బలం ఉంది. మూడు పదవులను పార్టీ కై వసం చేసుకోవాలని గట్టి సంకల్పంతో ఉంది. నాలుగోది కూడా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించింది. జాప్యంపై నిరాశ దరఖాస్తుల పరిశీలన ముగిసిన నాటి నుంచి 14 రో జుల తర్వాత ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉందని పలువురు కౌన్సిలర్లు చెబుతున్నారు. అయి తే జాప్యం అవుతున్న తీరు చర్చనీయాంశంగా మా రింది. కమిషనర్ సెలవులో ఉండటంతోనే సమావేశ నిర్వహణలో ఆలస్యమైనట్లుగా కూటమి కౌన్సి లర్లు చెబుతున్నారు. మరోవైపు నిబంధనల ప్రకా రం నిర్వహించకుంటే కోర్టుకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. 15 తర్వాత నిర్వహిస్తాం మున్సిపల్ కమిషనర్ సెలవులో ఉండటంతో ప్ర త్యేక సమావేశం నిర్వహణకు వీలుపడలేదు. క మిషనర్ విధుల్లో చేరిన వెంటనే ఈ నెల 15తర్వాత ప్రత్యేక తేదీ ప్రకటించి సమావేశాన్ని నిర్వహిస్తాం. జాప్యంలో ఎలాంటి రాజకీయ కారణా లు లేవు. సభ్యుల ఎన్నిక పారదర్శకంగా నిబంధనల ప్రకారం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – బండారి అనూష, మున్సిపల్ చైర్పర్సన్ -
ఆందోళనకరం
నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలు ఆందోళనకరం. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి, ఒత్తిడిని ఎదుర్కొంటూ ఈ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కొంతమంది చేసిన తప్పులకు నిజాయితీగా చదివిన విద్యార్థులు శిక్ష అనుభవించకూడదు. సమగ్రమైన దర్యాప్తు జరగాలి. అవినీతికి లేదా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా చదివిన విద్యార్థుల మానసిక స్థితి, భవిష్యత్తును కాపాడటం ముఖ్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, డిజిటల్ మానిటరింగ్ అమలు చేయాలి. వైద్య విద్యపై ప్రజల నమ్మకం నిలబెట్టడం అందరి బాధ్యత. – డాక్టర్ ఎస్‌సీహెచ్‌ఎస్ రామకృష్ణ, కార్యదర్శి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రద్దు చేయడం దారుణం నీట్ పరీక్షలు రద్దు చేయడం దారుణం. విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడతారు. ఎంతో కష్టపడి నీట్ రాసిన విద్యార్థులు మంచిర్యాంకులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎక్కడో రాజస్థాన్‌లో పేపర్ లీకేజ్ అయిందని పరీక్షలు రద్దు చేయడం సమంజసం కాదు. మా అబ్బాయి కోన సాయి సాత్విక్ నీట్ పరీక్షకు కష్టపడి చదివాడు. అలాగే రానున్న ఎంసెట్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సమయంలో పరీక్ష రద్దు ప్రభావం ఎంసెట్‌పై పడుతుంది. తిరిగి పరీక్షలు నిర్వహించడం, మళ్లీ చదివి రాయడం అంటే విద్యార్థికి ఇబ్బందిగా ఉంటుంది. – కోన సత్యనారాయణ, కే.పెదపూడి, అంబాజీపేట మండలం, కోనసీమ జిల్లా కొత్త పరీక్షా తేదీలను ప్రకటించాలి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఈ పరీక్షలపై ఆధారపడి నిర్మించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయతను కాపాడటం కేంద్ర పరీక్షా సంస్థల ప్రాథమిక బాధ్యత. ఆరోపణల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయడం విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా తీసుకున్న అత్యవసర చర్యగా భావించాలి. అయితే, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా, త్వరితగతిన కొత్త పరీక్షా తేదీలను ప్రకటించి, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏకు విజ్ఞప్తి చేస్తున్నాం. – మతుకుమిల్లి శ్రీవిజయ్ ధైర్యంగా ఉండాలి నీట్ 2026 ఎన్నో నెలల కృషి, కష్టం. ఎంతోమంది విద్యార్థుల, తల్లిదండ్రుల కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఇది చాలా దారుణం, తిరిగి నీట్ ఎగ్జామ్ ఎప్పుడూ ప్రారంభమవుతుందో తెలిసే వరకు ఎవరూ భయపడకుండా ధైర్యంగా ఉండాలి. – వై.గోవిందరాజు, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు, రాజమహేంద్రవరం -
మహిళా చట్టాలపై అవగాహన అవసరం
రంపచోడవరం: మహిళలు తమకు రక్షణగా నిలిచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని రంపచోడవరం ఎస్డీపీవో అష్రిఫ్ అలీ అన్నారు. మహిళల భద్రత, హెల్మెట్ వినియోగంపై రంపచోడవరంలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నుంచి హెల్మెట్ ధరించి మోటార్ బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళా భద్రత, పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో సీఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ రమేష్, వీఓఏలు, ఐసీడీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
కలెక్టర్ లేని మీటింగ్ ఎందుకు?
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకుండా జిల్లా పరిషత్ సమావేశం ఎందుకని కోనసీమ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. కాకినాడలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. జెడ్పీ సమావేశాలకు కలెక్టర్, జేసీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రతీ సమావేశానికి కలెక్టర్ ఎందుకు దూరంగా ఉంటున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో సుమారు అరగంట పాటు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. కలెక్టర్ లేకుంటే తాము సమావేశం బహిష్కరిస్తామని ప్రకటించారు. సమావేశానికి హాజరుకాని కలెక్టర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టర్ రానప్పుడు దూర ప్రాంతాల నుంచి తాము వచ్చినా ఏమీ ఉపయోగమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ కోనసీమలో జాతీయ రహదాలకు పనులు జరుగుతున్నాయని, ఇరిగేషన్‌కు సంబంధించిన విషయాలు సమావేశంలో చర్చించాలని దీనిపై వివరణ ఇచ్చేందుకు కలెక్టర్ కనీసం జాయింట్ కలెక్టర్ అయినా లేకుంటే ఎలా అన్నారు. జెడ్పీ సమావేశానికి డీఆర్ఓ స్థాయి అధికారులను పంపిస్తున్నారని, ఇలా అయితే సమావేశం వద్దని ఆయన జెడ్పీ చైర్మన్‌కు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశం వేరొక రోజు పెట్టాలని ఆ రోజు కలెక్టర్ వచ్చేలా చూడాలని ఎమ్మెల్సీతో పాటు జేడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు. జెడ్పీ చైర్మన్ తో పాటు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు సభ్యులకు ఎంత సర్దిచెప్పినా వారు తగ్గలేదు. కలెక్టర్‌తో సంప్రదించిన తర్వాతనే తాము సమావేశానికి తేదీలు ఖరారు చేశామని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. కోనసీమ జిల్లాకు జడ్జి రావడంతో ప్రొటోకాల్ నిమిత్తం కలెక్టర్ ఉండాల్సి వచ్చిందని చెప్పడంతో వారు శాంతించారు. సంక్షేమ హాస్టళ్లలో స్వచ్ఛమైన మంచినీరివ్వాలి : ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించకపోవడంతో రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణను ఆయా కంపెనీలు సక్రమంగా చేయడం లేదని, అధికారులు పర్యవేక్షించడం లేదని మండిపడ్డారు. వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత, సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, దీంతో వైద్య సేవలు అందకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని అక్కడి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మండిపడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో వేలాది రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని చెప్పారు. రహదారులు సక్రమంగా లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామని పలువురు సభ్యులు తెలిపారు. ముఖ్యంగా రౌతులపూడి, తేటగుంట, ఎస్ పైడిపాల రోడ్డు పూర్తిగా గోతుల మయం అయిందన్నారు. ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ, వేగుళ్ల జోగేశ్వరరావు, సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కోనసీమ జెడ్పీటీసీ సభ్యుల ఆందోళన రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం వాడి వేడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం వరి రైతులు నష్టపోతున్నారు : ఎంపీ బోస్ ప్రస్తుత రబీలో వరి రైతులకు మద్దతు ధర రాాకపోవడం వల్ల ప్రతి బస్తాకు రూ.200 నుంచి రూ.300 నష్టపోవాల్సి వస్తోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తేమ పేరుతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కోనసీమ జిల్లాలో తక్కువ రైస్‌మిల్లులు ఉండడం వల్ల ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఇతర రైస్ మిల్లులకు కోనసీమ ధాన్యం తరలించే ఏర్పాట్లు చేయాలని, అప్పుడు రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. దీనికి కాకినాడ జిల్లా కలెకర్ట్ సానుకూలంగా స్పందించి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. -
ఏజెన్సీలో టవర్రీ
పోలవరంబుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026ఫ కనెట్ కాక..పరిమితంగా సిగ్నల్స్ జిల్లాలోని ఎగువ ప్రాంతంలో ఉన్న రాజవొమ్మంగి, వై.రామవరం మండలాల్లో బీఎస్ఎన్ల్ సేవల పరిస్థితి దారుణంగా ఉంది. సెల్ టవర్లు ఉన్నా కేవలం మీటర్ల దూరంలో మాత్రమే సిగ్నల్స్ అందుతున్నాయని, అటవీ ప్రాంతాల్లో కేవలం గ్రామం వరకు మాత్రమే సిగ్నల్స్ పరిమితమవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు చింతూరు డివిజన్లో 65 బీఎస్ఎన్ఎల్ టవర్లుండగా వాటిలో 4జీ టవర్లు 57 ఉన్నాయి. డివిజన్ కేంద్రమైన చింతూరులో రెండు నెలలుగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన అండర్ గ్రౌండ్ కేబుల్ తెలంగాణ నుంచి జాతీయ రహదారి 30 వెంబడి చింతూరుకు వస్తుంది. రెండేళ్లుగా ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండడం, తవ్వకాల సమయంలో కేబుల్ తెగిపోయి సిగ్నల్స్ నిలిచిపోతున్నాయి. ఫ పనిచేయన్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఫ నిత్యం మొరాయిస్తున్న వైనం ఫ ప్రజల తీవ్ర అవస్థలు చింతూరు: ఆధునిక కాలంలో సెల్‌ఫోన్‌కు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకోబోయే వరకూ, అర్ధరాత్రి అత్యవసర సమయంలోనూ దీని అవసరం చాలా ఉంటుంది. జేబులో రూపాయి లేకపోయినా పర్వాలేదు గానీ సెల్‌ఫోన్ లేకపోతే బతకడం చాలా కష్టం. దీనికి అనుగుణంగానే వివిధ కంపెనీలు నెట్ వర్క్‌లను విస్తరించుకుంటూ వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. కానీ పోలవరం జిల్లాల్లో మాత్రం సెల్ సిగ్నల్స్ (నెట్ వర్క్) వ్యవస్థ సక్రమంగా పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 12 మండలాల్లో.. జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 450కి పైగా బీఎస్ఎన్ఎల్ టవర్లున్నాయి. వీటి పరిధిలో ఆయా మండలాల్లో లక్ష మందికి పైగా వినియోగదారులు సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 5జీ నెట్వర్క్ విస్తృతంగా అభివృద్ధి చెందుతుంటే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా 2జీ, 3జీ నెట్వర్క్ సేవలే అందుతున్నాయి. ఇటీవల చాలా టవర్లను 4జీగా అప్‌గ్రేడ్ చేసినా సరైన రీతిలో సేవలు అందించడం లేదు. బ్రాడ్‌బ్యాండ్ సేవలూ అంతే.. సెల్ సిగ్నల్స్‌తో పాటు బ్రాడ్ బ్యాండ్ సేవలు కూడా నిలిచి పోతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చింతూరులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడంతో విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల బ్యాటరీలకు సంబంధించిన కాపర్ కేబుల్ చోరీకి గురై 20 గంటలకు పైగా సేవలు నిలిచిపోయాయి. ఇక మారుమూల గిరిజన గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోజుల తరబడి సేవలు నిలిచిపోతుండడంతో అత్యవసర సమయాల్లో సమాచారం ఇచ్చేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నామని వినియోగదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతూరులో బీఎస్ఎన్ఎల్తో పాటు జియో, ఎయిర్టెల్, వీఐ (వొడాఫోన్, ఇండియా) టవర్లు వున్నాయి. వీటిలో జియో ఆపరేటర్‌పై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం 4జీ సేవలతో జియో టవర్ నిర్మాణం కాగా నేటికీ అవే 4జీ సేవలు కొనసాగుతున్నాయి. ఇతర నెట్‌వర్క్‌లకు చెందిన వినియోదారులను ఆకట్టుకునేందుకు త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశచూపడంతో చాలామంది నంబరు పోర్టబులిటీ ద్వారా జియో నెట్‌వర్క్‌లోకి మారారు. ఏడాదిన్నర కావస్తున్నా నేటికీ 5జీ సేవలు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ఎయిర్టెల్ వినియోగదారుల పరిస్థితి కూడా ఇదే రీతిలో వుంది. వాయిస్ కాల్స్ అప్పడప్పుడూ మొరాయించినా ఈ రెండు నెట్‌వర్క్‌లకు సంబంధించి ఇంటర్నెట్ సేవలు చాలా దారుణంగా వున్నాయి. టవర్ల ప్రారంభ సమయంలో 20 ఎంబీకి పైగా వున్న ఇంటర్నెట్ వేగం ప్రస్తుతం 5 ఎంబీ కంటే దిగువకు పడిపోయిందని, ఒక్కోసారి కేబీల్లో చూపిస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. సిగ్నల్స్ దారుణం మెరుగైన సేవలు అందిస్తారనే ఆశతో ఇతర నెట్వర్క్ నుంచి జియోకు మారాను. ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంటోంది. ప్రారంభంలో బాగానే వున్నా ఇటీవల చాలా దారుణంగా పడిపోయింది. 5జీ సేవలు ఇస్తామని చెబితే జియో నెట్‌వర్క్‌లోకి మారినా నేటికీ 4జీ సేవలు మాత్రమే అందిస్తున్నారు. – మల్లెల్లి ప్రదీప్, చింతూరు నెట్వర్క్ మెరుగుపరచాలి మా ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సరిగా పనిచేయడం లేదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రైవేటు నెట్‌వర్క్‌లకు సంబంధించిన సిమ్‌లు కొనుగోలు చేస్తున్నాం. నెట్వర్క్ వ్యవస్థను మెరుగుపరిచి సేవలను విస్తరిస్తే బాగుంటుంది. –గోరా అప్పలస్వామి, అప్పలరాజుపేట, రాజవొమ్మంగి మండలం గ్రామానికే పరిమితం సెల్ సిగ్నల్స్ కేవలం టవర్ ఉన్న గ్రామానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఊరు దాటితే సిగ్నల్ అందడం లేదు. అత్యవసర సమయాల్లో సిగ్నల్ వున్న ప్రాంతాలకు వెళ్లి మాట్లాడాల్సి వస్తోంది. ఆపరేటర్లు సేవలను విస్తరించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. – పయ్యాల నాగేశ్వరరావు, చింతూరు మొరాయింపు సెల్‌ఫోన్ సిగ్నల్స్ నిత్యం మొరాయిస్తుండడంతో జిల్లా పరిధిలోని ప్రజలతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ల్తో పాటు ప్రైవేటు ఆపరేటర్లకు సంబంధించిన టవర్లు సైతం వినియోగదారులుకు నాణ్యమైన సిగ్నల్స్ అందించడంలో విఫలమవుతున్నాయి. ఈ విషయంపై సంబంధిత ఆపరేటర్లకు ఫిర్యాదు చేసినా సిగ్నల్ వ్యవస్థను మెరుగు పరచడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. -
11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
వై.రామవరం: పి.యర్రగొండ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ భూరా రామ్ భైరవ తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 90 సీట్లు ఉండగా, ఈ ఏడాది ఇదే పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన 59 మంది విద్యార్థులకు కేటాయించామన్నారు. మిగిలిన 31 సీట్లను బయట పాఠశాలల నుంచి వచ్చే గిరిజన బాల బాలికలకు ఇస్తామన్నారు. వీటిలో 16 మంది బాలురు, 15 మంది బాలికలకు అవకాశం ఉందని, రాష్ట్ర బోర్డు, సీబీఎస్ఈ, ఇతర గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి వచ్చిన గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. పదో తరగతి మెరిట్ జాబితా ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఆసక్తి కల విద్యార్థుల పాఠశాలలోని తమ కార్యాలయానికి వచ్చి వివరాలు తెలుసుకోవాలన్నారు. -
బొండాలు ధాన్యం కొనకుంటే ఆందోళన
● కోనసీమ రైతు పరిరక్షణ సమితి ● కలెక్టరేట్ వద్ద పారబోస్తామని హెచ్చరిక అమలాపురం రూరల్: జిల్లాలో రబీలో రైతులు పడించిన బొండాలు రకం వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం చేస్తే రైతులు పడించిన ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకువచ్చి కలెక్టరేట్ వద్ద పడేసి నిరసన చేపడతామని రైతులు హెచ్చరించారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద వారు నిరసన తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం, ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు అధ్వర్యంలో రైతు ప్రతినిధులు జేసీ నిడియాదేవిని కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న మండపేట రైస్ మిల్లుల్లో గతంలో ధాన్యం కోనుగోలు జరిగేదని, జిల్లా విభజనతో మండపేట తూర్పుగోదావరి జిల్లాలో కలవడం వల్ల సమస్య వస్తోందన్నారు. రైతు నాయకులు చిక్కం పెద్దబ్బులు, జిన్నూరి వెంకటేశ్వరరావు, ఆకుల లక్ష్మణరావు, ఆకుల శేషనాయుడు, టీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సీడీపీఓ మృతిపై విచారణ చేయాలి
రంపచోడవరం: రాజవొమ్మంగి సీడీపీఓ మరణానికి కారకులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం రంపచోడవరం ఐటీడీఏ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్, జిల్లా అధ్యక్షులు వాణిశ్రీ, అంగన్వాడీల యూనియన్ జిల్లా కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ కొత్తగా పదోన్నతితో రాజవొమ్మంగి సీడీపీఓగా వచ్చిన సుజాత చాలా మృదు స్వభావని, పని పట్ల అంకితభావం గల వ్యక్తి అన్నారు. రాజవొమ్మంగి ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారని అన్నారు. సూపర్వైజర్ బదిలీ విషయంలో సూపర్వైజర్ అసోసియేషన్ నాయకులు శ్రీకాంత్‌రాజు చేసిన వేధింపులు, బెదిరింపు కాల్స్ వల్లే సీడీపీఓ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఫిర్యాదులు ఇచ్చారని, కానీ నేటికి శ్రీకాంత్‌రాజును పోలీసులు అరెస్టు చేయకపోవడం సరికాదన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీనిపై కలెక్టర్ దినేష్ కుమార్ స్పందిస్తూ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆ నివేదక ఆధారంగా కారకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వరి, జిల్లా నాయకురాళ్లు రామలక్ష్మి, రాణి, వెంకటలక్ష్మి, కుమారి, ప్రసన్న, సీత, సునీత, కనకలక్ష్మి, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న, అరటికి గిట్టుబాటు ధర కల్పించాలి
● వైఎస్సార్ సీపీ నేతలు గన్నవరపు, జిన్నూరి ● వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన అయినవిల్లి: మొక్కజొన్న, అరటి పంటలకు ప్రభుత్వం గిట్టుబాబు ధర ప్రకటించాలని, తుపాను, అకాల వర్షాలకు దెబ్బతిన్న ఆయా పంటల రైతులను ఆదుకోవాలని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి రామారావు (బాబి) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని తొత్తరమూడి కె.పెదలంకలో తుపాను, వర్షాలకు దెబ్బతిన్న పంటలను వారు పరిశీలించారు. రైతులు గుత్తాల బాబురావు, రేవు రాంబాబు, బొక్కా సత్యనారాయణ, మద్దా వెంకటలక్ష్మి తదితరులు పాడైన పంటలను వారికి చూపించారు. ఈ ఏడాది మొక్కజొన్న ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని, అరటి సైతం బాగుందని, కానీ మార్కెట్లో గిట్టుబాటు ధర లేక అయినకాడికి విక్రయించాల్సి వస్తోందని వాపోయారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, రామారావు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొక్కజొన్నకు ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2400 చెల్లించే వారని ఈ ప్రభుత్వంలో రూ.1400 నుంచి రూ.1700 మాత్రమే చెల్లింస్తున్నారన్నారు. అరటి గెల మార్కెట్లో రూ.400 వరకూ పలికేదని ఇప్పుడు రూ.50కి కూడా కొనావారు లేరన్నారు. ఇంతలా నష్టపోతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు చూస్తోందని మండి పడ్డారు. తక్షణం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. పంటల బీమాకు కేంద్ర ప్రభుత్వం, రైతులు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తమవాటా చెల్లించలేని స్థితిలో ఉందన్నారు. దీంతో బీమా సంస్థలు పంటల బీమాకు ముందుకు రావడం లేదన్నారు. కార్యక్రమంలో అయినవిల్లి, పి.గన్నవరం మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాసబాబు, యన్నబత్తుల ఆనంద్, రాష్ట్ర రైతు విభాగ జాయింట్ సెక్రటరీ కొర్లపాటి కోటబాబు, రైతు విభాగం మండల అధ్యక్షుడు రెడ్డి గనిరాజు, కోట విజయరాజు, గుత్తుల నాగబాబు, మిండగుడిది శిరీష్ నారాయణస్వామి, కుడుపూడి రామకృష్ణ, మిండగుదిటి రాంబాబు, కుసుమ సునీల్‌కుమార్, మతుకుమిల్లి సత్తులు తదితరులు ఉన్నారు. -
కాలుష్యానికి కారకులను శిక్షించాలి
● దేవి ఫిషరీస్ వద్ద పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామస్తుల ఆందోళన ● అస్వస్థతకు గురైన పలువురు ఆస్పత్రుల్లో చేరిక తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పరిధిలోని రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి వస్తున్న కలుషిత జలాలు కాలువలోకి వదలడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామస్తులు సోమవారం స్థానిక దేవి ఫిషరీష్ వద్ద ఆందోళన చేసి బాధ్యులను శిక్షించాలని, ఆయా కంపెనీలపై అధికారులు దృష్టి సారించాలని నినాదాలు చేశారు. ఎంపీటీసీ సభ్యుడు పాలెపు పోశియ్య, గ్రామ పెద్దలు పంట కాలువ చెంతనే ఉన్న కంపెనీలు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. దీంతో రెండు మూడు రోజులుగా గ్రామంలో సుమారు 30 మంది వివిధ ఆస్పత్రిలలో వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కోరంగిలో రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంటు నుంచి పంట కాలువలోకి విడుదలైన కలుషిత జలాలు -
హక్కుల సాధన కోసమే పోరాటం
● అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ ● అమలాపురంలో మొదలైన మహాసభలు ● ఎర్ర జెండాలతో హోరెత్తిన మహా ప్రదర్శన అమలాపురం టౌన్: వ్యవసాయ కార్మికుల్లో ఐక్యత కోసం, కార్మిక హక్కుల సాధన కోసం జాతీయ, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. అమలాపురం గడియారం స్తంభం సెంటరులో 30వ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహా సభలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం వరకు నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం ఏర్పాట్లు చేసింది. పుర వీధుల్లో సంఘం మహా ప్రదర్శన నిర్వహించింది. ప్రదర్శనలో వ్యవసాయ కార్మిక ప్రతినిధులు 30వ కవాతు నిర్వహించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షుడు ఎ.విజయరాఘవన్, అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు, చైతన్య, రాష్ట్ర కార్యదర్శులు కె.లోకనాధం, వి.వెంకటేశ్వర్లు ప్రసంగించి వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలకు పలు రాష్ట్రాల నుంచి వ్యవసాయ కార్మిక ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. -
ఆవును హతమార్చిన పులి
రాజవొమ్మంగి: చిరుత పులి మళ్లీ రాజవొమ్మంగి మండలంలోకి ప్రవేశించింది. సోమవారం చికిలింత గ్రామంలో రైతు సోమరాజుకు చెందిన ఆవును హతమార్చింది. ఈ విషయం తెలుసుకున్న రాజవొమ్మంగి అటవీ క్షేత్రాధికారి ఉషారాణి తమ సిబ్బందితో వెళ్లి పులి చికిలింత, వాతంగి, పెదగర్రంగి పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పుట్టిన రోజు వేడుకలకు వచ్చి అనంత లోకాలకు.. రంపచోడవరం: స్నేహితులతో కలసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రంపచోడవరం మండలం బోర్నగూడెం గ్రామం శివారున ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం నందరాడ గ్రామానికి చెందిన మేడిశెట్టి తరుణ్ కుమార్ (35) పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకు ముసురుమిల్లి ప్రాజెక్టు వద్దకు స్నేహితులతో కలసి వచ్చాడు. రెండు బైక్‌లపై నలుగురు యువకులు వచ్చారు. ముసురుమిల్లి ప్రాజెక్టు సమీపంలో ఇద్దరు స్నేహితులు ఉండగా, తరుణ్‌కుమార్, ఈలి ప్రవీణ్‌లు కేక్, బిర్యానీ తేవడానికి మోటార్ సైకిల్‌పై రంపచోడవరం బయలు దేరారు. బోర్నగూడెం శివారున ఎదురుగా వేగంగా ఆటో వచ్చి మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొంది. తరుణ్ కుమార్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈలి ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ సన్యాసినాయుడు, ఎస్సై రాంబాబు పరిశీలించి కేసు నమోదు చేశారు. అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు రంపచోడవరం: అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం ప్రకారం.. 2024లో మారేడుమిల్లి సంత మార్కెట్‌కు చెందిన బాలిక (16)పై బలవంతంగా వై.రామవరం మండలం తూనికలపాడు గ్రామానికి చెందిన కంగల బుజ్జిబాబు దొర అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ కోర్ట్ ఫర్ పోక్సో న్యాయమూర్తి శ్రీదేవి తీర్పు చెప్పారు. కడియం రైల్వే గేటు మూసివేత కడియం: సోమవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు కడియం ఫిష్ఫామ్ వద్దగల రైల్వే గేటును మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని వారు కోరారు. -
పీజీఆర్ఎస్కు వెల్లువలా అర్జీలు
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అర్జీలు వెల్లువలా వచ్చాయి. మొత్తం 98 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌కు 13 అర్జీలు వచ్చాయన్నారు. రాజవొమ్మంగి మండలం సింగంపల్లిలో నేషనల్ హైవే 516 నిర్మాణంలో భాగంగా నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌కు ఎనిమిది బాధిత కుటుంబాలు అర్జీ అందజేశాయి. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ నీలవరం – వెదురులంక వీధి వరకూ వేసిన విద్యుత్ స్తంభాలకు సరఫరా అందించాలని, నీలవరం గ్రామానికి ఆశ వర్కర్‌ను నియమించాలని వైస్ ఎంపీపీ తుంబుడు లత, తుంబుడు సోమిరెడ్డి, తుంబుడు నరేందర్‌రెడ్డి కోరారు. ఎటువంటి ఆదాయం లేని తనకు వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని అడ్డతీగల మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన బండి మరిడియ్య దరఖాస్తు సమర్పించారు. నిమ్మలపాలెం గ్రామంలో భూ సర్వే చేసి 74 మంది గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని బలిజ నాగిరెడ్డి, వెంకటరెడ్డి, సంకు అబ్బాయిరెడ్డి తదితరులు అర్జీ ఇచ్చారు. నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, డీఆర్ఓ అంబేద్కర్ పాల్గొన్నారు. -
నిర్లక్ష్యానికి వెదురుపడి
● వెదురు మొక్కల పెంపకంలో అశ్రద్ధ ● పైలెట్ ప్రాజెక్టులోనే హంసపాదు ● గిరిజనులకు చేకూరని ప్రయోజనం అంతన్నారు.. ఇంతన్నారు.. గిరిజనులకు ఆర్థిక ప్రయోజనమే లక్ష్యమన్నారు.. చివరికి పథకాన్ని నీరుగార్చారు.. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన వెదురు మొక్కల పెంపకంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.. ఇలా నిధులు వృథా చేసి, లక్ష్యాన్ని పక్కన బెట్టేశారు. రంపచోడవరం: జిల్లాలో వెదురు మొక్కల పెంపకం ద్వారా గిరిజన రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు రంపచోడవరం ఐటీడీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మారేడుమిల్లి, వై రామవరం మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా వెదురు మొక్కలు పెంపకం చేపట్టేందుకు కార్యచరణ రూపొందించింది. ఉపాధి హామీ, వెలుగు సంయుక్తంగా రైతులను గుర్తించి వారికి మొక్కలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇలా రైతులకు వెదురు మొక్కలు అందజేసింది. ఈ పథకాన్ని ఐటీడీఏ అధికారులు తూతూమంత్రంగా నిర్వహించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకపోవడంతో లక్ష్యం నీరుగారింది. జిల్లాలో పది వేల మంది రైతులతో 4 వేల ఎకరాల్లో వెదురు మొక్కలు నాటించేందుకు కార్యచరణ రూపొందించారు. ఇందులో భాగంగా మండలాల వారీగా రైతులను గుర్తించారు. ఒక్కో రైతు 37 సెంట్ల భూమిలో వెదురు మొక్కలు నాటుకునేందుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో రైతుకు 60 వెదురు మొక్కలు పంపిణీ చేస్తారు. దీని కోసం రైతు రూ.1,200 చెల్లించాలి. అయితే తిరిగి రైతు ఖాతాలో మొక్కలు కొనుగోలు కోసం ఇచ్చిన డబ్బులు జమ చేస్తారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లేందుకు వెలుగు, ఉపాధి హామీ పథకం, ఉద్యాన శాఖ, ఇండస్ట్రీ ఫౌండేషన్లను భాగస్వాములను చేశారు. వెలుగు సిబ్బంది రైతులకు వెదురు మొక్కలను అందజేస్తారు. ఉపాధి హామీ సిబ్బంది మొక్కలు నాటడానికి గోతులు తీసి మస్తర్లు నమోదు చేస్తారు. ఉద్యాన శాఖ వెదురు మొక్కలు నాటుకునే విధానం, పెంపకంపై అవగాహన కల్పిస్తారు. రైతులకు వెదురు మొక్కలను ఇండస్ట్రీ ఫౌండేషన్ సరఫరా చేస్తుంది. సమగ్ర ఇదీ ప్రాజెక్టు స్వరూపం. ఇందులో అడుగడుగడుగునా లోపాలే కనిపించాయి. వర్షాలు పడని సమయంలో.. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మారేడుమిల్లి, వై రామవరం మండలాల్లో సుమారు 1,200 మంది రైతులకు వెదురు మొక్కలను గత ఏడాది సెప్టెంబర్‌లో అందజేశారు. వీటిని వర్షాలు లేని సమయంలో ఇవ్వడంతో మొక్కలను నాటుకునేందుకు రైతులు ఆసక్తి చూపలేదు. ఈ కారణాలతో మొక్కలు నాటకుండానే చాలాచోట్ల చనిపోయాయి. అలాగే నాటిన మొక్కలు దెబ్బతిన్నాయి. ఇచ్చిన మొక్కల్లో సుమారు 50 శాతంపైనే పాడయ్యాయి. మొక్కలు నాటేందుకు అనుకూలంగా లేని సమయంలో ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు ఒత్తిడి కారణంగానే సెప్టెంబర్ నెలలో మొక్కలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొక్కలు ఇచ్చినా వాటిని నాటుకున్నారో తేదో పరిశీలించకపోవడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వం వెదురు అభివృద్ధికి నేషనల్ బాంబో మిషన్ ఏర్పాటు చేసింది. వెదురు నాటిన రైతులకు నాలుగు సంవత్సరాల తర్వాత రూ.37,411 ఆదాయం వస్తుంది. 40 ఏళ్లు పాటు రాబడి రానుంది. ఫలితం శూన్యం ఏజెన్సీలో వెలుగు ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల ఫలితాలు శూన్యమే. వారు చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా గిరిజనులకు ఆర్థికంగా ఆదాయం వచ్చిన దాఖలాలు లేవు. గతంలో జీడిపిక్కల ఫ్యాక్టరీ, జామాయిల్ మొక్కల పంపిణీ, ఇటుకల తయారీ పరిశ్రమ, పసుపు తయారీ, వెదురుతో కొవ్వొత్తుల తయారీ వంటి అనేకం ఉన్నాయి. ఏవీ మంచి ఫలితాలు ఇవ్వలేదు. పైలెట్ ప్రాజెక్టుపై శ్రద్ధ లేక నిరుపయోగం అయ్యింది. – పండా రామకృష్ణదొర, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ కన్వీనర్ -
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు
ఉట్నూర్‌రూరల్: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ఉట్నూర్ మండలం లక్కారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ. 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి సోమవారం ఆయన భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాల గదుల నిర్మాణ పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులు, పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. రాబోయే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం వరకు పనులు పూర్తి చేసి, అదే రోజు ప్రారంభోత్సవం జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు గదులు మంజూరు చేసినందుకు పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లక్కారం సర్పంచ్ రేణుక, వార్డు సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘గురు సంకల్పం’నకు శ్రీకారం
ఉట్నూర్‌రూరల్: ఏజెన్సీ పరిధిలోని గిరిజన పా ఠశాలల్లో విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగుపరిచేందుకు ‘గురు సంకల్పం’ అనే కార్యక్రమాని కి ఐటీడీఏ పీవో మకరందు శ్రీకారం చు ట్టారు. ఈ మేరకు అధికారులతో కలిసి క్యూఆర్, కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. విద్యార్థు ల అభ్యసన స్థాయి మెరుగుపరిచేందుకు వినూ త్న ఆలోచనలు, ఆచరణాత్మక పరిష్కారాలు, వి జయవంతమైన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఆయా పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు ప్రతిపాదనలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి జూన్ 2వరకు సమర్పించాలన్నారు. మొదటి బహుమతిగా రూ.5వేలు, రెండో బహుమతిగా రూ.4 వేలు, వినూత్నమైన వాటికి రూ.3 వేల చొప్పున నగదు అందించనున్నట్లు తెలిపారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
ఇచ్చోడ: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ అన్నారు. మండల కేంద్రంలో రూ.21లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ గ్రామానికి సీసీ రోడ్డు, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కొడప జలైజాకు, ఉప సర్పంచ్ శిరీష్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కృష్ణారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు శివకుమార్‌రెడ్డి, సుభాష్,తదితరులు పాల్గొన్నారు. -
విన్నపాలు వినవలె
కై లాస్‌నగర్: ప్రజావాణి పోర్టల్‌లో నమోదయ్యే ప్ర తీ ఫిర్యాదును నిర్దిష్ట గడువులోపు పరిష్కరించి బా ధితులకు సాంత్వన చేకూర్చాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి స మస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ త్వరి తగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పింఛన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి స మస్యలు వంటి అంశాలకు సంబంధించి మొత్తం 75 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, ఎస్.రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.. -
● ప్రజారోగ్య రక్షణలో కీలకం ● చిరునవ్వుతో రోగులను పలకరించే ‘సిస్టర్స్’ ● నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
రోగులకు సేవలు అందిస్తున్న స్టాఫ్ నర్సులురోగికి వైద్యుడు చికిత్స అందిస్తే ఆచరణలో అమలు చేసేది వీరే.. భయంతో వచ్చే పేషెంట్లో ఆత్మస్థైర్యం నింపేది ఈ సిస్టర్సే.. ప్రసవ వేదనలో ఉన్న గర్భిణి నుంచి అత్యవసర ట్రీట్మెంట్ అవసరమైన రోగి వరకు వీరు అందించే సేవలే కీలకం. ప్రజారోగ్య వ్యవస్థలో వెన్నెముకగా నిలిచే వీరికి ఒక ప్రత్యేక రోజు ఉందండోయ్. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో సేవలందిస్తున్న పలువురి నర్సులపై కథనం. – ఆదిలాబాద్‌టౌన్ -
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం అధికంగా ఉండనుంది.
‘సీసీఐ’కి నోటీసులు జారీ చేయాలి ఆదిలాబాద్‌టౌన్: సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం తుక్కు కింద విక్రయిస్తుంటే విద్యుత్, మున్సిపల్ శాఖాల పెండింగ్ బకాయిలు ఎవరు చెల్లిస్తారని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్ ప్రశ్నించారు. విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యులకు రూ.2వేల కరెంట్ బిల్లు పెండింగ్ ఉంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న అధికారులు సీసీఐ సంస్థ మాత్రం రూ.18 కోట్లు బకాయిలు ఉన్నా ఎందుకు వసూలు చేయడం లేదని అన్నారు. సామాన్యులకు ఒక న్యాయం.. బడాబాబులకు ఒక న్యాయమా అని మండిపడ్డారు. సీసీఐ ఫ్యాక్టరీని తుక్క కింద వి క్రయించిన తర్వాత ఈ బకాయిలను ఎలా వసూలు చేస్తారని, యాజమన్యానికి బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారి జేఆర్ చౌహాన్‌కు సీసీఐకి నోటీసులు ఇవ్వాలంటు వినతిపత్రం అందించారు. ఇందులో సాధన కమిటీ నాయకులు బండి దత్తాత్రి, లోకారి పోశేట్టి, దాసరి రమేశ్, స్వరూప, మమత, జగన్ సింగ్, గోవర్ధన్, బొర్రన్న, సచిన్, పర్వీన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకోండిఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు ఆసక్తి, అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 నుంచి జూన్ 8వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. కోపా, డ్రెస్మేకింగ్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్ కోర్సులో శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 8500465816 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
జనగణనలో భాగస్వాములవ్వాలి
ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి కై లాస్‌నగర్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబి తాను 2002 ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రా జర్షిషా అదేశించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబా ద్ నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధి కారులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి ఆ యన పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ, ప్రతీ నియోజకవర్గంలో బీఎల్వోల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అన్ని వనరులను సిద్ధం చేసుకోవాలన్నారు. మ్యాపింగ్ పురోగతిని పెంచేందుకు ప్రతి బుధవారం రాజ కీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించా లని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆ ర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావ్ పాల్గొన్నారు. ఆదిలాబాద్: జనగణన–2027 ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం నిర్వహించిన ‘సెన్సెస్ వాక్’ (మారథాన్)ను ఆయ న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 12వేల కుటుంబా లు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా వివరాలు నమో దు చేసుకున్నాయన్నారు. జూన్ 9 వరకు నిర్వహించే మొదటి దశ హౌస్‌లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. జిల్లాలోని 1,293 బ్లాకుల్లో ఎన్యూమరేటర్లు పర్యటిస్తారని, వారు అడి గే ప్రశ్నలకు ప్రజలు నిర్భయంగా, యథార్థమైన సమాచారం అందించాలని కోరారు. ప్రజలు ఇచ్చే సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని వెల్లడించారు. ఇది ప్రభు త్వ అభివృద్ధి పథకాల రూపకల్పనకు మాత్రమే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారు తమ ఎస్ఈ ఐడీ చూపిస్తే ప్రక్రియ వేగవంతం అవుతుందని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యాలు పెంపొందించుకోవాలి ఆదిలాబాద్‌రూరల్: వేసవి శిబిరాల్లో విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. విద్యా వారోత్సవాల సందర్భంగా మండలంలోని యాపల్‌గూడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరం, బడి బాట కా ర్యక్రమాలను సోమవారం ఆయన ప్రారంభించారు. తబలా, హార్మోనియం వాయించి విద్యార్థులను ఉత్సాహ పరిచారు. విద్యార్థులు ఆసక్తి మేర కు మ్యూజిక్, కోడింగ్, యోగా, క్రీడల్లో నైపుణ్యం సాధించాలన్నారు. అలాగే జనగణన ప్రక్రియకు ప్రజలంతా సహకరించాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు వినోద్‌రెడ్డి, సర్పంచ్ నీరోష్, ఉపసర్పంచ్ దత్తు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పార్వతి, ఎంఈవో రమేశ్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. స్కానింగ్ యంత్రాలు అందజేత కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరాల్లో చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించి, వైకల్య శాతాన్ని నిర్ధారించేందుకు గాను అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన సెర్ప్ సీఈవో వాటిని జిల్లాకు పంపించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా వాటిని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌కు అందజేశారు. -
ప్రాణాలు లెక్కచేయకుండా..
నేను 2006లో ఔట్సోర్సింగ్ పద్ధతిన జిల్లా ఆస్పత్రిలో పనిచేశాను. 2021లో రెగ్యులర్ ఉద్యోగం వచ్చింది. వైద్య వృత్తిపై మక్కువతో పాటు లైఫ్ సెట్ అవుతుందని ఈ వృత్తిని ఎంచుకున్నాను. నా చెల్లె జ్యోత్స్న సైతం స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. నేను 2007 నుంచి 2021 వరకు రిమ్స్‌లోని ఏఆర్టీ విభాగంలో హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించాను. పలువురు ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నించగా, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఆ వార్డులో పని చేసినప్పుడు నన్ను భయపెట్టారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలు అందించాను. – కె.స్వప్న మేరి, స్టాఫ్ నర్సు భద్రత లేకపోయినా.. నేను 2014 నుంచి 2020 వరకు నిర్మల్ జిల్లాలోని దస్తూ రాబాద్ పీహెచ్సీ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేశాను. అది రౌండ్‌దిక్లాక్ పీహెచ్సీ. రాత్రి సమయంలో ఎలాంటి భద్రత లేకపోయినప్పటికీ విధులు నిర్వర్తించాను. ఆ ప్రాంతంలో పాము, కుక్క కాటు కేసులు అధికంగా వచ్చేవి. రక్తపింజర కాటుకు గురైన పలువురు ప్రాణాపాయ స్థితిలో వచ్చారు. వారికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడడం మరిచిపోలేను. మా అమ్మ, అక్కయ్యకు ఆరోగ్యం బాగలేనప్పుడు నేను కూడా డాక్టర్ కావాలనే ఆలోచన వచ్చింది. ఆర్థిక పరిస్థితులతో కాలేకపోయాను. ఏఎన్ఎం శిక్షణ పొంది స్టాఫ్ నర్సుగా సేవలు అందిస్తున్నాను. – ఇందిరా, స్టాఫ్‌నర్సు -
రాత్రి పగలనే తేడా లేకుండా..
నేను 2011లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా విధుల్లో చేరాను. 2021లో రెగ్యులర్ ఉద్యోగం వచ్చింది. రిమ్స్‌తో పాటు భీంపూర్ పీహెచ్సీలో సేవలందించాను. అక్కడికి రోడ్డు సౌకర్యం సరిగా ఉండదు. వర్షాకాలంలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాగు దాటాల్సి వచ్చేది. నా సేవలకు గుర్తింపుగా అప్పటి ఐటీడీఏ పీవో, కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్నాను. నా కుటుంబ సభ్యుల సహకారంతో విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నాను. – పి.శ్యామల, స్టాఫ్ నర్సు -
నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి ప్రారంభమైన విద్యా వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకుని రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంగీత, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డి గ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో మున్సిపల్ చైర్పర్సన్ అనూష పాల్గొన్నారు. కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాలను ప్రి న్సిపాల్ అతీక్ బేగం, లెక్చరర్లతో కలిసి విడుదల చే శారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. కేజీబీవీ నూతన భవనం ప్రారంభం నార్నూర్: గాదిగూడలోని కేజీబీవీలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఎంపీ నగేశ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదివారం ప్రారంభించారు. రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నార్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 57 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో పుల్లారావు, సెక్టోరియల్ అధికారి ప్రత్యుష, ఎస్వో సరస్వతి, సర్పంచ్ చంద్రకళరాజు, జాదవ్ శ్రీరామ్‌నాయక్, కాంబ్లె ఉద్దవ్, రూప్‌దేవ్, సత్యనారాయణ తదితరులున్నారు. -
బాధ్యతగా వ్యవహరించాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు నేరుగా ఎస్పీకి తమ సమస్యలను వివరించారు. ఫిర్యాదులు స్వీకరించిన ఆయన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. మొత్తం 29 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో సీసీ కొండరాజు, సిబ్బంది వామన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఓఎస్‌హెచ్, ఎస్ఎస్, ఐఆర్ కార్మిక కోడ్ల నిబంధనలు వ్యతిరేకిస్తూ రిమ్స్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ని బంధనల ప్రతులను దహనం చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక రూ ల్స్ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. తక్షణమే ఆ నిర్ణయాలను వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో రిమ్స్ కమిటీ అధ్యక్షుడు పేరుక దేవిదాస్, సు మంత్, సభ్యులు నాగన్న, లక్ష్మి పాల్గొన్నారు. -
సీసీఐ పునఃప్రారంభించాలి
ఆదిలాబాద్‌టౌన్: సీసీఐ పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట జాతీయ రహదా రిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కోకన్వీనర్ కొండా రమేశ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ తె లంగాణకు టూరిస్టులా వచ్చి వెళ్లడం కాకుండా నిధులు, కొత్త ప్రాజెక్టులు ప్రకటించాలని డి మాండ్ చేశారు. జిల్లాలో ఉన్న ఏకై క కేంద్ర ప్ర భుత్వరంగ సంస్థ అయిన సీసీఐని వెంటనే తెరిపించాలని కోరారు. లేకుంటే నిర్వాసిత రై తులకు భూములు తిరిగి అప్పగించాలన్నారు. ఇందులో రమేశ్, పోశెట్టి, దత్తాత్రి, జగన్ సింగ్, ఈశ్వర్ దాస్, సచిన్, మంజుల, జి.సుభాష్, శివ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు సమన్యాయం
కై లాస్‌నగర్: అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని ఎస్సీ విభా గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిశీలకుడు సమతా సుదర్శన్ అన్నారు. పార్టీ బలోపేతంలో భాగంగా జిల్లా, రాష్ట్ర స్థాయి ఎస్సీ విభాగం పదవుల నియామకాల కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు వంద మంది ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిం3చారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తోందని, ఎస్సీ వర్గాలకు పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, వైస్‌చైర్మన్ తన్వీర్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మొండి ‘చేయి’!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాలో ‘హస్తం’పార్టీ నేతలకు నామినేటెడ్ పదవుల్లో నిరాశే మిగిలింది. ఇటీవల ప్రకటించిన పదవుల్లో ఏ ఒక్కరికీ అవకాశం దక్కక అనేక మంది సీనియర్లు నారాజ్‌లో ఉన్నారు. అసంతృప్తి చెందిన నాయకులు ఇటీవల ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ‘జూపల్లి’ దృష్టికి తీసుకెళ్ళారు. ఏళ్ళుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లకు పదవుల్లో అవకాశం ఉంటుందని ఆశించిన వారందరికీ భంగపాటే ఎదురైంది. ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీ అధ్యక్ష పదవులు ఆశించిన వారితో పాటు ఆదివాసీ, మహిళా, కార్మిక, రైతు, యువ నాయకులతో సహా సీనియర్లు ఉన్నారు. ఆశావహులు అనేకం ఉమ్మడి జిల్లాలో అనేక మంది సీనియర్లు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న శ్యామ్‌నాయక్, ఓయూ విద్యార్థి నాయకుడు దుర్గం భాస్కర్ ఆశావహుల్లో ఉన్నారు. నిర్మల్‌లో డీసీసీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పాటిల్, మంచిర్యాల జిల్లాలో కేవీ ప్రతాప్, డా.నీలకంఠేశ్వర్రావు, నూకల రమేశ్, న్యాతరి స్వామి, తదితర యువ నాయకులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కంది శ్రీనివాస్‌రెడ్డి, బోథ్ ఇన్చార్జి అడె గజేందర్, గండ్రాత్ సుజాత, సాజిత్‌ఖాన్ పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇక పార్టీపై అసంతృప్తితో బోథ్ మాజీ ఎమ్మెల్యే బాపురావు ఇటీవల కవిత ఏర్పాటు చేసిన పార్టీలో చేరగా, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్లో చేరారు. ఒకే ఒక్కరికి దక్కిన పోస్టు ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఖానాపూర్ పరిధిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి ఆశించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించినప్పటికీ బాధ్యతలు స్వీకరించలేదు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన కొట్నాక తిరుపతి గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ (జీసీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భారత్ జోడో యాత్ర సమయంలో తిరుపతి వెంట ఉన్నారు. ఆయనకు ఢిల్లీ నుంచి మద్దతు ఉండడంతో ఒక్కరికే నామినేటెడ్ పదవి దక్కింది. కేడర్‌కు ‘చేయి’ఇచ్చేవారేరి? స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కోసం కష్టపడుతున్న వారికోసం అధిష్టానాన్ని ఒప్పించి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కేడర్ కోరుతోంది. ఇక కొందరు తమ బయోడేటాను గాంధీ భవన్‌తో సహా ఢిల్లీ వరకు పంపించారు. అయితే తమకు పదవులు వచ్చేలా స్థానిక ప్రజాప్రతినిధులే చొరవచూపాలని కోరుతున్నారు. త్వరలో భర్తీ చేయబోయే ఉమ్మడి జిల్లా సహకార శాఖలో డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్లు, డివిజన్ స్థాయి మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల, గ్రామస్థాయిలో ప్రాథమిక సహకార సంఘాల్లో నియామకంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ‘మాజీ’ల ఆశలు గల్లంతు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధుల ఆశలు గల్లంతయ్యాయి. వీరిలో సీనియర్ మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాల చారీ, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ ఎంపీ సోయం బాపురావు, తదితర మాజీ ప్రజాప్రతినిధులకు నామినేటెడ్ పదవుల్లో ఆవకాశం రాలేదు. -
● చేతులెత్తేసిన ప్రభుత్వం ● లక్ష్యం పూర్తయిందని నిలిపివేత ● ఇంకా సగానికి పైగా రైతుల వద్ద నిల్వలు
ఇచ్చోడ: రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామనే ప్రభుత్వ మాటలు నీటి మూటలే అవుతున్నాయి. లక్ష్యం సాకుగా చూపి అధికారులు కొనుగోలు కేంద్రాలను మూసి వేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. జిల్లాలో ఇప్పటికీ ఇంకా సగం మంది వద్ద పంట దిగుబడి నిల్వలు ఉండడం గమనార్హం. మరోవైపు ఆయా యార్డులకు తీసుకువచ్చి నెలరోజులవుతున్నా కోనుగోలు చేయకపోవడంతో వారి ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. గత్యంతరం లేక కొందరు ప్రైవేట్‌లో విక్రయించి నష్టపోతుండగా.. చాలా మంది ప్రభుత్వ ప్రకటన కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష 16 వేల క్వింటాళ్లే జిల్లా వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 18 కేంద్రాల ద్వారా మార్చి 26 నుంచి ఏప్రిల్ 24 వరకు కేవలం లక్ష 16వేల 885 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. కొంత మంది రైతులు పత్తి, సోయా సాగు చేసిన భూములను చదును చేసి రబీలో శనగ సాగు చేయడం ద్వారా పంట చేతికి రావడం కొంత ఆలస్యమైంది. ప్రభుత్వం విధించిన గడువులోపు వారి పంటలు చేతికి రాక పోవడంతో మద్దతు ధరకు విక్రయించుకోలేని పరిస్థితి. మద్దతు ధర రూ.5,875 ఉండగా..ప్రైవేట్‌లో రూ.5వేలకు మించి పలకకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని వారు కోరుతున్నారు. జిల్లాలో శనగసాగు వివరాలు సాగు విస్తీర్ణం : 42,277ఎకరాలు దిగుబడి అంచనా : 3,34,700 క్వింటాళ్లు మద్దతు ధర : రూ.5,875 కొనుగోలు చేసింది : 1,16,885 క్వింటాళ్లు -
సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు
శిక్షణకు హాజరైన ఎన్యూమరేటర్లు (ఫైల్)కై లాస్‌నగర్: జాతీయ జనగణనలో భాగంగా తొలివిడతగా గృహాల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి షురూ కానుంది. ఈ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగనుంది. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లోని ఇంటింటికీ వెళ్లి 33 ప్రశ్నలతో కూడిన సమాచారం సేకరించనున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో చేపడుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో విడతలో భాగంగా జనగణనను లెక్కించనున్నారు. 200 ఇళ్లకో ఎన్యూమరేటర్ గృహాల జాబితా సేకరించేందుకు నేటి నుంచి ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. 200 ఇళ్లకు ఒకరు చొప్పున కేటాయించారు. ఆరుగురు చేసిన గణన వివరాలు పర్యవేక్షించేందుకు ఒక సూపర్వైజర్ను నియమించారు. ఇప్పటికే వారికి మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ అందించారు. ఎన్యూమరేటర్ తమ సెల్ఫోన్లో సెన్సెస్ 2027 యాప్ డౌన్లోడ్ చేసుకుని సేకరించిన వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. 33 ప్రశ్నలతో సమాచారం సేకరణ ఇళ్ల జాబితా, గృహగణనలో భాగంగా ఎన్యూమరేటర్లు 33 ప్రశ్నలతో కూడిన సమాచారం సేకరించనున్నారు. భవనం నంబర్ (మున్సిపల్, గ్రామం వారీగా), ఇంటినంబర్, ఇంటినేల, గోడలు, పైకప్పు తయారీకి ఉపయోగించిన ప్రధాన పదార్థం, ఇంటి వినియోగం, ఇంటి పరిస్థితి, కుటుంబ క్రమసంఖ్య, ఫ్యామిలీలో నివసించే వ్యక్తులు, యజమాని పేరు, లింగం, కులం, ఇల్లు (సొంతమా/అద్దెనా), అందుబాటులో ఉన్న గదులు, నివసిస్తున్న వివాహిత జంటలు, తాగునీటి ప్రధాన వనరు, లభ్యత, వెలుతురు ప్రధాన వనరు, మరుగుదొడ్డి సౌకర్యం, రకం, నీటిపారుదల వ్యవస్థ, స్నానపు గది సౌకర్యం, వంట గది ఎల్పీజీ/పీఎన్జీ కనెక్షన్, వంట కోసం వినియోగించే ప్రధాన ఇంధనం, రేడియా, ట్రాన్సిస్టర్, టెలివిజన్, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, టెలిఫోన్, మొబైల్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్, సైకిల్, స్కూటర్, మోటర్‌సైకిల్, మోపెడ్, కారు, జీపు, వ్యాన్, కుటుంబం ప్రధానంగా వినియోగించే ధాన్యాలు, మొబైల్ నెంబర్ వంటి 33 రకాల ప్రశ్నాలతో కూడిన సమాచారం సేకరించనున్నారు. ఈ వివరాలను మౌఖికంగా చెబితే సరిపోతుందని ఎన్యూమరేటర్లకు ఆధార్, పాన్, బ్యాంకు అకౌంట్ పాస్‌బుక్ వంటి ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సిన, ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని.. కుటుంబాలు : 2,84,600 జనాభా : 7,08,972 హౌస్‌లిస్టింగ్ బ్లాక్‌లు : 1923 ఎన్యూమరేటర్లు : 1352 సూపర్వైజర్లు : 241జనగణన పేరిట కొంతమంది ఆకతాయిలు, దుండగులు ఇళ్ల వద్దకు వచ్చి దోపిడీ, దొంగతనాలు వంటి వాటితో మోసగించే అవకాశముంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. గణనకు వచ్చే వారు ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు. వీరు విధిగా ఐడీ కార్డు ధరించి ఉంటారు. ఎవరికై నా అనుమానం కలిగితే ఐడీ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సదరు ఉద్యోగి పేరు, వివరాలు ఇట్టే తెలిసిపోతాయని అధికారులు పేర్కొంటున్నారు. -
ఫెయిలైన వారిపై ఫోకస్
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులపై కలెక్టర్, విద్యా శాఖ ఫోకస్ పెంచారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో వంద శాతం ఉత్తీర్ణులయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఈనెల 12 నుంచి ప్రారంభించేందుకు ఆ శాఖ అధికారులు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశారు. తరగతులకు విధిగా హాజరయ్యేలా చూసే బాధ్యతలను సంబంధిత ప్రధానో పాధ్యాయులకు అప్పగించారు. ఈ విద్యార్థులకు స్నాక్స్ తో పాటు దూరప్రాంతాల నుంచి హాజరయ్యేవారికిరవాణా చార్జీలు సైతం చెల్లించనున్నారు. మూడు కేంద్రాల్లో.. ఈనెల 12 నుంచి జూన్ 3 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని గెజిటెడ్ నం.1 పాఠశాలలో జిల్లా కేంద్రంతో పాటు రూరల్, మావల, బేల, జైనథ్, తలమడుగు, తాంసి మండలాల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. అలాగే ఇచ్చోడ జెడ్పీఎస్‌ఎస్‌లో ఇచ్చోడ, బోథ్, గుడిహత్నూర్, బజార్హత్నూర్, నేరడిగొండ, సిరికొండ విద్యార్థులకు తరగతులు ఉంటాయి. ఇక జెడ్పీఎస్ఎస్ ఉట్నూర్ తెలుగు మీడియం పాఠశాలలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ విద్యార్థులకు బోధించనున్నారు. ఈ తరగతులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతి విద్యార్థికి స్నాక్స్, రవాణా చార్జీల కోసం సమగ్ర శిక్ష ద్వారా రూ.1100 చెల్లిస్తారు. ఇందులో రూ.100 స్టేషనరీ కోసం వినియోగించాల్సి ఉంటుంది. గతేడాది సప్లిమెంటరీ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించారు. 251 మంది హాజరు కాగా 225 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో.. పది ఫెయిల్ అయిన విద్యార్థులు : 350 ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించి : 312 ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి : 38 సబ్జెక్టుల వారీగా.. తెలుగు : 62 హిందీ 19 ఇంగ్లిష్ : 173 గణితం 84 సామాన్య : 132 సాంఘిక : 42 -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా సత్తా
ఆదిలాబాద్: హైదరాబాద్‌లోని జేఎన్ స్టేడియం వే దికగా ఆదివారం నిర్వహించిన 3వ తెలంగాణ త్రో స్, జంప్స్–400 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్‌షి ప్’లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబ రిచారు. మొత్తం 10 పతకాలను (3 స్వర్ణం, 5 రజ తం, 2 కాంస్యం) కై వసం చేసుకుని జిల్లా సత్తా చా టారు. స్వర్ణ పతక విజేతల్లో అరుణ (మహిళల హ్యామర్ త్రో), విక్రమ్ సింగ్ (అండర్–20 బాయ్స్ హ్యామర్ త్రో), కె. చరణ్ (అండర్–18 బాయ్స్ షాట్‌పుట్) ఉన్నారు. రజత పతకాలను ఎన్.జి. జ్యోతీశ్వరన్ (హ్యామర్ త్రో), ఎం.సౌమ్య (హ్యామర్ త్రో), బి. జ్యోతి (డిస్కస్ త్రో), సంజన (అండర్– 16 గర్ల్స్ జావెలిన్ త్రో), సీహెచ్.ఖుషి(హైజంప్) సాధించారు. ఎం.సౌమ్య (డిస్కస్ త్రో), రాథోడ్ వంశీ (హ్యామర్‌త్రో) కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, కార్యదర్శి పి. రా జేశ్, డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసో సియేషన్ అధ్యక్షుడు బెల్లూరి గోవర్ధన్ రెడ్డి, పేటా అధ్యక్షుడు పార్థసారథి అభినందించారు. రాష్ట్ర అథ్లెటిక్స్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేశ్వర్ చేతుల మీదుగా క్రీడాకారులు పతకాలు అందుకున్నారు. కోచ్ వీజీఎస్ రాకేశ్‌ను పలువురు ప్రత్యేకంగా ప్రశంసించారు. -
వాస్తవ సమాచారం ఇవ్వాలి
తొలి విడత ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఎన్యూమరేటర్లకు ప్రజలు వాస్తవ సమాచారం అందించి సహకరించాలి. ఇది ఎలాంటి సబ్సిడీలకు ముడిపడిన అంశం కాదు. భారతీయ పౌరుడిగా ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి.. ఇల్లు ఉందా లేక అద్దెకు ఉంటున్నారా అనే సమాచారాన్ని మాత్రమే సేకరిస్తారు. వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు అడగరు. కేవలం సమాచారం చెబితే సరిపోతుంది. స్వీయగణన చేసుకున్న వారు తమ ఎస్ఈ ఐడీ చూపిస్తే అందులోని సమాచారం సరిగా ఉందా లేదా అనే దాన్ని పరిశీలించి వెళుతారు. ఈ కార్యక్రమ విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. – ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్ -
అన్యాయాన్ని ప్రశ్నించాలని నేర్పింది..
● ప్రేమ పంచుతూ.. సహనం పాటిస్తూ.. ● లక్ష్యసాధనలో తోడయ్యే దైవమే అమ్మ ● నేడు మదర్స్‌డే ఆదిలాబాద్‌టౌన్: ప్రపంచంలో అమ్మను మించిన దైవం లేదు. మా అమ్మ ఊర్మిల గుప్తా ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. మేము ఇద్దరం అన్నదమ్ములం, ఒక సోదరి. అమ్మా నాన్న మా అందరిని చదివించి ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేశారు. అమ్మ చేతి వంట అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రతీ విషయాన్ని వివరించి చెబుతుంది. అన్యాయం జరిగితే ప్రశ్నించాలని నేర్పించింది. కష్టపడేతత్వాన్ని అమ్మను చూసే నేర్చుకున్నాను. ఈ సమాజంలో నిస్వార్థమైన ప్రేమ తల్లిది మాత్రమే. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
20న మెగా జాబ్‌మేళా
కై లాస్‌నగర్: ఈ నెల 20న నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వి నియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష కోరారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మావలలోని చిలుకూరి లక్ష్మీగార్డెన్‌లో నిర్వహించనున్న ఈ మేళా నిర్వహణపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బందితో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉద యం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే మేళాలో వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపా రు. 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మేళాను 18 నుంచి 33 ఏళ్లలోపు నిరుద్యోగ యువత సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్ విడుదల చేశారు. సమావేశంలో ఇన్చార్జ్ కమిషనర్ సందీప్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, స్టెప్ మాజీ సీఈవో వెంకటేశ్వర్లు, వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
జొన్నల కొనుగోళ్లలో ఆంక్షలొద్దు
తలమడుగు: ఆంక్షలు లేకుండా జొన్న పంటను ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసి మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. అలాగే కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, సహకార సంఘ చైర్మన్ భోజారెడ్డి, సీఈవో మోతె శ్రీనివాస్, ఉత్తమ్, శ్రీధర్‌రెడ్డి, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
మాతృత్వం గొప్ప వరం
ఆదిలాబాద్‌టౌన్: మాతృత్వం అనేది ప్రతీ మహిళకు గొప్ప వరం. జీవితం సృష్టించే శక్తి తల్లికి మాత్రమే ఉంటుంది. అత్యంత పవిత్రమైనది. ఒక ప్రాణాన్ని తన గర్భంలో మోస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఓ మహిళ తల్లి కాకపోవడానికి భార్య భర్తల్లో లోపం ఉండొచ్చు. ప్రస్తుత జీవనశైలీ కారణంగా సంతానలేమి సమస్యలు ఎదురవుతున్నాయి. ఉద్యోగ రీత్యా ఒత్తిడికి గురవుతున్నా రు. వీటిని అధిగమించేందుకు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి. గర్భందాల్చిన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోవడం, ప్రశాంతంగా ఉండటం, విశ్రాంతి తీసుకోవడం, కుటుంబ సహకారం చాలా అవసరం. – డాక్టర్ రమ, గైనకాలజిస్ట్ -
అ‘ద్వితీయ’ంగా..
బాధను దిగమింగి.. ముందడుగు వేసి ఆదిలాబాద్‌టౌన్: కర్నూల్ జిల్లా నంద్యాల తాలుకా మసీద్పురానికి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు తిర్యాణిలో కానిస్టేబుల్ విధులు నిర్వహించేవాడు. 1998లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు భార్య నీలమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు. ఆ సమయంలో పెద్ద కుమార్తె శారద ఐదో తరగతి, రెండో కుమార్తె స్వప్న 3వ తరగతి, మూడో కుమార్తె సంధ్య ఇంకా బడికి వెళ్లని పరిస్థితి. నీలమ్మ 7వ తరగతి వరకే చదువుకోవడంతో విద్యా శాఖలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం కల్పించారు. భర్త చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పటికీ బాధను దిగమించి పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చారు ఆ ఇల్లాలు. ప్రస్తుతం పెద్ద కుమార్తె, రెండో కుమార్తె నర్సింగ్ ఆఫీసర్లుగా ఉండగా, మూడో కుమార్తె గృహిణిగా ఉంది. నీలమ్మ ఓపెన్ ఇంటర్ చదివి రికార్డు అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. ఇలా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారిమే.అటు పాలన.. ఇటు లాలన కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణ ప్రథమ పౌరురాలైన బండారి అనూష అటు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, ఇటు తల్లిగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అమ్మగా పిల్లల బాగోగులు చూడటంతో పాటు చైర్‌పర్సన్‌గా పట్టణాభివృద్ధి కోసం ఆరాటపడుతున్నారు. కూతురు అమిత ఐదో తరగతి చదువుతుండగా, కుమారుడు శివకృష్ణ ఒకటో తరగతిలో ఉన్నారు. ఉదయం పిల్లలిద్దరినీ రెడీ చేసి స్కూల్‌కు పంపించేంత వరకు వారితోనే బీజీగా గడుపుతారు. అనంతరం పట్టణ పాలన వ్యవహారాల్లో లీనమవుతారు. ప్రజాప్రతినిధి అయినప్పటికీ కుటుంబంలో తల్లిగా పిల్లల బాధ్యత కూడా అంతే ముఖ్యమని అంటున్నారు చైర్పర్సన్.అమ్మగా ఉంటూనే పాలనలో రాణిస్తున్న వారు కొందరైతే.. కుటుంబ పెద్ద పాత్రనూ పోషిస్తూ ముందుకు సాగుతున్న వారు మరికొందరు. బిడ్డల అభివృద్ధిలో తమదైన పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పలువురు మాతృమూర్తులు. బట్టలు కుడుతూ.. కుమారులను ఉన్నత స్థాయికి చేర్చి ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని సునార్ గల్లీకి చెందిన మూడపెల్లి భారతి కుట్టుమిషన్‌పై బట్టలు కుడుతూ ఇద్దరు కుమారులను ఉన్నత స్థాయికి చేర్చింది. భర్త మానసిక వ్యాధితో బాధపడుతుండడంతో అన్నీ తానై ధైర్యంగా ముందుకు సాగింది. పెద్ద కుమారుడు బాలకృష్ణ ప్రస్తుతం ఎస్బీఐలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా, చిన్న కుమారుడు శివకృష్ణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. వీరు పదో తరగతి తర్వాత పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా నిలిచారు. ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిని కంటికిరెప్పలా చూసుకుంటున్నారు. నాడు తల్లి పడ్డ కష్టంతోనే తాము ఈ స్థాయికి ఎదిగగలిగామని వారు పేర్కొంటున్నారు. -
నా రోల్‌మోడల్..
కై లాస్‌నగర్: అమ్మ అమిత షా నాకు రోల్‌మోడల్. నా ఎదుగుదలలో కీలకం కూడా. చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు ఫోకస్ పెంచేలా నన్ను ప్రోత్సహించారు. గణిత సబ్జెక్ట్‌పై పట్టు సాధించేలా అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకునేలా దిశానిర్దేశం చేశారు. నేను ఐఏఎస్ సాధించానంటే అమ్మ అందించిన ప్రోత్సహంతోనే. అమ్మ చేతి వంటలంటే నాకు చాలా ఇష్టం. వృత్తిపరంగా దూరంగా ఉంటున్నా నా వద్దకు వచ్చినప్పుడు అమ్మనే స్వయంగా చేసి వడ్డిస్తుంది. – రాజర్షి షా, కలెక్టర్ -
ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం
సాత్నాల: ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందించడమే లక్ష్యమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’, రైతు వారోత్సవాల్లో భాగంగా సాత్నాల ప్రాజెక్టు కుడి కాలువ పరిధిలోని మేడిగూడ–సి కెనాల్ వద్ద పూడికతీత పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాగునీటి రంగంలో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. 3.6 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువలో ప్రస్తుతం 1.5 కిలోమీటర్ల మేర పూడికతీత, చెట్ల తొలగింపు పనులు చేపట్టినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న ఈ పనులు పూర్తయితే ఆయకట్టు చివరి వరకు సక్రమంగా సాగునీరు అందుతుందన్నారు. అనంతరం ప్రాజెక్టును పరిశీలించారు. మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.69 లక్షల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఈఈ ఉమామహేశ్వరరావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ మహేశ్, తహసీల్దార్ జాదవ్ రామారావు, ఇన్చార్జి ఎంపీడీవో వెంకట్రాజు, ఏపీవో వెంకటరమణ, సర్పంచ్ అంజనాబాయి, ఇతర అధికారులు, కూలీలు పాల్గొన్నారు.విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలికై లాస్‌నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షిస్తూ, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా జయశంకర్ బడిబాట, లైబ్రరీ డే, తల్లిదండ్రుల సమావేశాలు, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యాసంస్థల్లో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ఇందులో ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని దిశానిర్దేశం చేశారు. జనగణన ప్రక్రియలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రతి ఒక్కరూ పూర్తి చేసేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులు విధిగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని, ఇందుకోసం ఏఈవోలకు స్పష్టమైన లక్ష్యాలను కేటాయించి రోజువారీ నివేదికలు సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.ఇందులో అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సుధారాణి, విద్యా, రవాణా, మార్కెటింగ్, ఇతర సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఉపాధి’కి అనాసక్తి
కై లాస్‌నగర్: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. గతంతో పోల్చితే ఈ ఏడాది భారీగా తగ్గింది. జాబ్‌కార్డులు, పనులు, హాజరవుతున్న కూలీల సంఖ్యకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. ఉపాధి పనులు చేపట్టేందుకు ఏప్రిల్, మే నెలలే అనుకూలం. అయితే ఈ సమయంలోనే కూలీలు ఆశించిన స్థాయిలో పనులకు హాజరుకావ డం లేదు. కూలీల సంఖ్య పెంచాలంటూ అధికారులు పదేపదే ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించని పరిస్థితి. ఇలాగే కొనసాగితే వంద రోజుల పని కల్పించాలనే సర్కారు లక్ష్యం నెరవేరకపోవచ్చని తెలుస్తోంది. కేంద్ర సంస్కరణల ప్రభావమే.. ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. ఇందులో ప్రధానంగా పనుల కు హాజరయ్యే కూలీలకు ముఖ ఆధారిత (ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్) హాజరు అమలు చేస్తోంది. ఇందుకోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కూలీల హాజరును దీని ద్వారానే రెండు పూటలా నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం పనులకు హాజరైన కూలీ ఫొటోతో అటెండెన్స్ నమోదు చేయనుండగా మధ్యాహ్నం గ్రూప్ ఫొటోను నమోదు చేస్తున్నారు. దీంతో పనిచేసిన సమయం కంటే అ టెండెన్స్ వేసేందుకే ఎక్కువగా పోతుందని కూలీలు చెబుతున్నారు. అలాగే గతంలో మాదిరి సులువైన పనులను చేసే అవకాశం లేదు. చెరువులు, ప్రాజెక్టులతో పాటు నీటి కుంటలు, చెక్ డ్యాంల్లో పూడికతీత పనులు, రాళ్ల కట్టలు, మట్టికట్టలు, గుట్టలపైన కందకాలు వంటి కఠినమైన పనులు చేయాల్సి వస్తుంది. గతంలో పనులకు వెళ్లినట్లుగా వెళ్లి కొద్ది సమయానికే తిరిగి వచ్చే వారు. ప్రస్తుతం అలాంటి అవకాశం లేకపోగా, రెండు పూటల అటెండెన్స్ నమోదుతో చాలా మంది అంతగా ఆసక్తి చూపనట్లుగా తెలుస్తోంది. ఫలితంగానే కూలీల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. అలాగే ఈ ఏడాది ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 46 డిగ్రీల మార్క్ దాటాయి. పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు ఉండకపోవడం, భానుడి ప్రభావంతో చాలా మంది పనులకు హాజరుకావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమాలకు చెక్.. కేంద్రం తెచ్చిన ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఉపాధి పనుల్లో అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్టపడింది. గతంలో మాదిరి బోగస్ మస్టర్లు వేసే అవకాశం లే కుండా పోయింది. ప్రస్తుతం నిబంధనల మేరకు ప నులు చేసిన కూలీలకు మాత్రమే అటెండెన్స్ నమోదవుతుంది. దీంతో అవసరమైన కూలీలు మా త్ర మే పనులకు హాజరవుతున్నట్లుగా చెబుతున్నారు. జిల్లాలో ఉపాధి హామీ వివరాలుమొత్తం జాబ్‌కార్డులు 1,74,628 ఇందులో యాక్టివ్ 1,05,514 మొత్తం కూలీలు 1,95,638 పనులకు హాజరవుతున్న వారు 63,600కూలీల సంఖ్య పెంచేందుకు చర్యలు ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. అటెండెన్స్ నమోదు సమస్య దూరం చేసేలా గతంలో ఉన్న మేట్స్ వ్యవస్థను తిరిగి అందుబాటులోకి తెస్తున్నాం. నలుగురైదుగురు కూలీలకు మేట్‌ను నియమిస్తున్నాం. దీంతో పాటు వర్షాకాలంలో చేపట్టే వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలను తవ్వే పనులను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాం. కూలీల హాజరు పెంచేలా సర్పంచ్‌లతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – కుటుంబరావు, అదనపు డీఆర్డీవో -
విధుల్లో నిర్లక్ష్యం వద్దు
ఆదిలాబాద్‌టౌన్: పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం నిర్వహించిన పరేడ్ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి సూచనలు చేశారు. నిత్యం వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వం పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతీ శనివారం నిర్వహించే పరేడ్‌లో తప్పనిసరిగా పాల్గొని కవాతులో నైపుణ్యం సాధించాలన్నారు. యూనిఫామ్‌కు ఉన్న గౌరవాన్ని మరింత పెంచేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. 50ఏళ్లు పైబడిన సిబ్బందికి ప్రత్యేక యోగా కార్యక్రమం కూడా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, పోతారం శ్రీనివాస్, కమతం ఇంద్రవర్ధన్, సీఐలు నాగరాజు, ప్రేమ్‌కుమార్, ఫణిదర్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ఎస్సైలు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సీసీఐ పునఃప్రారంభించాలి
ఆదిలాబాద్‌టౌన్: సిమెంట్ పరిశ్రమను అమ్ముకునే కుట్రను కేంద్రప్రభుత్వం మానుకోవాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమ రక్షణ కో సం పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కలిసి రా వాలని కోరారు. సీసీఐ పునఃప్రారంభించేలా చూడాలని, లేకుంటే నిర్వాసిత రైతులకు భూ ములు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశా రు. అలాగే యాజమాన్యం మున్సిపాలిటీ, వి ద్యుత్శాఖకు చెల్లించాల్సిన పన్ను, బిల్లుల బ కాయిలు వెంటనే చెల్లించాలన్నారు. అప్పటివరకు డిస్మెంటల్ పనులను నిలిపివేయాలన్నా రు. ఇందులో భాగంగా ఈనెల 11న ము న్సిపల్ కార్యాలయం ఎదుట, 14న విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో కోకన్వీనర్లు కొండ రమేశ్, అరుణ్‌కుమార్, జగన్‌సింగ్, ఈశ్వర్దాస్, దాసరి రమేశ్, బండి దత్తాత్రి, లోకారి పోశెట్టి, లంకా రాఘవులు, కిరణ్, సతీష్, ఆశన్న పాల్గొన్నారు. -
పారదర్శకంగా ‘మీసేవ’
కై లాస్‌నగర్: మీ సేవ ద్వారా అందించే సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు చెక్ పెట్టాలని భావించిన ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తహసీల్దార్లకే పరిమితమైన లాగిన్లను జీపీవో, ఆర్ఐలకు కల్పించింది. ప్రయోగాత్మకంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి ఈ విధానాన్ని అమలు చేసింది. విజయవంతం కావడంతో దశలవారీగా అ న్ని సర్టిఫికెట్లకు వర్తింపజేస్తోంది. నూతన విధానం అమలుతో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు పారదర్శకత పెరగనుంది. జీపీవో, ఆర్ఐలకు ప్రత్యేక లాగిన్లు .. ఇప్పటి వరకు తహసీల్దార్కే పరిమితమైన లాగిన్లను తాజాగా గ్రామపాలన అధికారి (జీపీవో), రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)లకు కల్పించింది. వారి సెల్ఫోన్లలోనే దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు వీలుగా మీసేవ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా ఆదాయ సర్టిఫికెట్ల జారీ కోసం దీనిని అమలు చేసింది. మీసేవ నుంచి జీపీవోలకు దరఖాస్తు వివరాలు అందిన వెంటనే వారు దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి విచారణ చేపడుతున్నారు. యాప్‌లో అప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ప్రస్తుతం కులం, నివాస, కుటంబ సభ్యుల ధ్రువీకరణ, ఈబీసీ, ఓబీసీ వంటి సర్టిఫికెట్ల జారీకి వర్తింపజేస్తుంది. ప్రజలు సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. వివరాలు తొలుత యాప్‌లో జీపీవో లాగిన్‌కు వెళుతాయి. విచారణ చేపట్టి ధ్రువీకరిస్తే ఆర్ఐ లాగిన్‌కు చేరుతాయి. అక్కడ ఓకే చేస్తే డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ లాగిన్లకు వెళుతాయి. వారు అప్రూవ్ చేయగానే సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా కార్యాలయంలో హార్డ్ కాపీలు ఇచ్చే ఇక్కట్లు తొలగిపోయాయి. రెవెన్యూశాఖ ద్వారా జారీ చేసే కుల, ఆదాయ, నివాస వంటి వివిధ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ప్రజలు సమీప మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసేవారు. ఈ వివరాలు ఆన్లైన్లో తహసీల్దార్ లాగిన్‌కు వెళ్లేవి. అయినా దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతో పాటు జతచేసిన ధ్రువీకరణపత్రాలతో కూడిన హార్డ్‌కాపీలను తహసీల్ కార్యాలయాలకు వెళ్లి ఇచ్చేవారు. వాటిని ఆర్ఐలు, డిప్యూటీ తహసీల్దార్లు పరిశీలించిన అనంతరం సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్ఐలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టకుండానే ధ్రువీకరించేవారు. ఫలితంగా అనర్హులు సైతం సర్టిఫికెట్లు పొందేవారు. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది. హార్డ్‌కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు రెవెన్యూశాఖ ద్వారా అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. గతంలో మాదిరి తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చి హర్డ్కాపీలే ఇవ్వాల్సిన అవసరం లేదు. దరఖాస్తు వివరాలు జీపీవో, ఆర్ఐల లాగిన్లకు వెలుతాయి. వారు మొబైల్యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత డీటీ, తహసీల్దార్ లాగిన్లకు చేరుతాయి. వారు ఓకే చేయగానే సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఈ ప్రక్రియ తద్వారా పారదర్శకత పెరగడంతో పాటు కార్యాలయాలకు తిరిగే ఇక్కట్లు తొలగిపోతాయి. అలాగే గడువు లోపు సర్టిఫికెట్లు జారీ అవుతాయి. – బండి రవి,ఈ డిస్ట్రిక్ మేనేజర్, ఆదిలాబాద్ జిల్లాలోని మీసేవ కేంద్రాలు : 72 రోజుకు సర్టిఫికెట్ల కోసం అందే దరఖాస్తులు : 218 -
బక్రీద్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఆదిలాబాద్‌టౌన్: బక్రీద్‌ను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖలతో పాటు పోలీస్ అధికారులు, ముస్లిం మత పెద్దలు, ఖురేషి వర్గ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కడైనా చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేసి వధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి జంతువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టుల వద్ద నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో వాహనాల తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్రమ రవాణాను అడ్డుకునే పేరుతో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని, వ్యక్తిగత దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు, అసత్య ప్రచారాలు చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఇందుకోసం జిల్లా పోలీస్ మీడియా మానిటరింగ్ సెల్ నిరంతర నిఘా కొనసాగిస్తోందన్నారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించే పుకార్లను వ్యాప్తి చేసిన వారిపై కూడా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100, సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. బక్రీద్‌ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పూర్తి అనుమతులు తీసుకున్న తర్వాతనే పశువుల వధ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు బి.సునీల్ కుమార్, నాగరాజు, ఫణిదర్, ముస్లిం మత పెద్దలు, ఖురేషి వర్గ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రిమ్స్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేపల ఉత్పత్తిలో కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా అధునాతన సాంకేతిక వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అనూష, మత్స్య శాఖ అధికారి మోయినొద్దీన్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మత్స్యకారులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధిలో పశుపోషణే కీలకం ఆదిలాబాద్‌టౌన్(బేల): గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బ లోపేతంలో పశుపోషణ కీలకమని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. బేల మండలంలోని సిర్సన్న గ్రా మంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మేలు జాతి దూడలను శాసీ్త్రయ పద్ధతిలో పెంచడం ద్వా రా పాల దిగుబడి పెరుగుతుందని తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న కృత్రిమ గర్భధారణ, ఆధునిక సౌకర్యాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రామారా వు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌స్వామి, అధి కారులు సాయితేజ, దీప్రతన్, సర్పంచ్ పోచక్క, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వివరాలు పక్కాగా నమోదు చేయాలి జనగణనలో భాగంగా ప్రతీ ఇంటి వివరాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి అధికారులతో శుక్రవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. జనగణన సన్నాహకంలో భాగంగా ఈనెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి హెచ్ఎల్బీ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ పూర్తయిన తర్వాత జూన్ 9 నుంచి ఇళ్ల జాబితాను పూర్తి చేయాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్లు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. జొన్నల కొనుగోలుకు సర్వం సిద్ధం.. జిల్లాలోని రైతులు సాగు చేసిన జొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. క్వింటాలు మద్దతు ధర రూ.3,699తో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకు గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రాంతాల్లోని రైతుల సౌకర్యార్థం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్ సొసైటీ పరిధిలోని భీంపూర్ డీఆర్ డిపో, తలమడుగు పరిధిలోని డీఆర్ డిపో ఝరి, భోరజ్లోని పిప్పర్వాడ రైతు వేదిక, ఇచ్చోడ సొసైటీ పరిధిలోని గుడిహత్నూర్ జెడ్పీఎస్ఎస్ పాఠశాల, బజార్హత్నూర్లోని దహెగాం రైతువేదిక, ఉట్నూర్ సొసైటీ పరిధిలోని గాదిగూడ, నార్నూర్ ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
‘ప్రాణహిత’ కట్టి తీరుతాం..!
కౌటాల: తెలంగాణలో సాగునీటి రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రాణహిత ప్రాజెక్టును పక్కాగా కట్టి తీరుతామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ఎకై ్స జ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని శుక్రవారం రాష్ట్ర మైనింగ్, కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పాల్వాయి హరీశ్‌బాబుతో కలి సి పరిశీలించారు. బరాజ్ ఎత్తు, సామర్థ్యం, గతంలో చేపట్టిన కాలువల పనులు, మహారాష్ట్రలోని శివిని గ్రామ పరిధిలోని ముంపు పరిధి, అటవీ, పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత– చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు శిలాఫలకాన్ని పరిశీలించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక బుద్ధ మందిర్‌లో పూజ లు చేశారు. ప్రాణహిత నదికి శాస్త్రోక్తంగా పూజలు చేసి జలహారతి ఇచ్చారు. గ్రావిటీ ద్వారా ‘ఎల్లంపల్లి’కి నీరు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేశారని గుర్తు చేశారు. అప్పట్లోనే 106 కిలోమీటర్ల మేర కెనాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి 71.5 కి.మీ.ల భూసేకరణ పూర్తి చేశారని తెలిపారు. 46 కి.మీ.ల మేర పనులు కూడా పూర్తయ్యాయని వెల్ల డించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు ఖర్చు చేసిందని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మిస్తే ఒక్క యూనిట్ విద్యుత్ ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించవచ్చని తెలిపారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యట నకు రానున్న నేపథ్యంలో తుమ్మిడిహెట్టి బరాజ్ విషయాన్ని బీజేపీ నేతలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. తెలంగాణ రైతుల పక్షాన నిలబడి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లా రైతాంగానికి అన్యాయం ప్రాణహిత ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమీషన్ల కోసమే తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి తరలించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం చేశారని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్‌గా ఉన్న మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రపంచ స్థాయి కాంట్రాక్టర్‌గా ఎదిగా రని ఎద్దేవా చేశారు. ప్రాణహిత ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎస్పీ వహీదుద్దీన్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం జానకీరావు, శ్యామ్‌నాయక్, మండల అధ్యక్షుడు నికాడే గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
ఆదిలాబాద్‌టౌన్: మద్యం సేవించి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వా హనదారులతోపాటు అమాయకుల ప్రాణాలు గాలి లో కలిసిపోతున్నాయి. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం మిగులుతోంది. జిల్లాలో డ్రంకెన్‌డ్రైవ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత మద్యం సేవించి బైక్‌లు, కార్లు నడిపే ధోర ణి ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేళ ప్రధాన రహదారులు, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహించి మద్యం మత్తులో వాహనా లు నడిపేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నా రు. గతంలో జరిమానాతోనే సరిపెట్టగా, వారి తీరులో మార్పు రాకపోవడంతో మరింత కఠినంగా వ్య వహరిస్తున్నారు. ఇటీవల పలువురు మందుబాబు లపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా వారికి జరిమానాతోపాటు జైలు శిక్ష విధించారు. మ ద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం లాంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఉదయం వేళలోనూ కేసులు.. ఇదివరకు రాత్రి వేళ మాత్రమే పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల సమయంలోనూ పోలీసుల తనిఖీల్లో మందుబాబులు మద్యం సేవించి వాహనాలు నడుపు తూ పట్టుబడడం ఆందోళనకు గురి చేస్తోంది. ఉద యం 10గంటల వరకు మద్యం షాపులు తెరుచుకో కపోగా బెల్ట్‌షాపుల్లో మద్యం సేవించి వాహనాలపై ప్రయాణాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ చౌక్‌లో నిత్యం కేసులు జిల్లాకేంద్రంలోని తెలంగాణచౌక్‌లో నిత్యం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా నాలుగైదు డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఎక్కువ మొత్తంలో ఈ కేసులు నమోదవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాహనదారులు త మ ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టొద్దని వారు సూచిస్తున్నారు. ఇటీవల నమోదైన కేసుల్లో కొన్ని.. జిల్లాలో ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులకు కోర్టు జైలు శిక్ష విధించింది. వారం క్రి తం జిల్లా వ్యాప్తంగా 20 పోలీస్స్టేషన్ల పరిధిలో పో లీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 1,558 వాహనాలను తనిఖీ చేశారు. సాయంత్రం 6నుంచి రాత్రి 10 గంటల వరకు 79 డ్రంకెన్‌డ్రైవ్ కేసులు, తొమ్మిది మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదైనట్లు వారు తెలిపా రు. గతనెల 29న ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు మద్యం సేవించిన ఇద్దరు వాహనదారులపై కేసు న మోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి మూడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. ఇటీవల ఇచ్చోడ పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ఐదుగురికి కోర్టు ఒక్కరోజు చొప్పున జైలు శిక్ష, తొమ్మిది మందికి జరిమానా విధించింది. ఆదిలాబాద్ ట్రాఫి క్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 17మందికి జైలు శిక్ష వేసింది. అయినప్పటికీ మందుబాబుల్లో మార్పు కానరా వడం లేదు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తూ ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఇకపై డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరిస్తున్నారు. గతేడాది నమోదైన కేసులు 14,491 కోర్టులో జరిమానా చెల్లించినవారు 10,507 ఈ ఏడాది నమోదైన కేసులు (ఇప్పటివరకు) 6,545 కోర్టులో జరిమానా చెల్లించినవారు 3,728 ఈ ఏడాది జైలు శిక్షపడిన వారు 31 -
దగ్ధమైన పంటల పరిశీలన
బోథ్: మండలంలోని కనుగుట్ట గ్రామంలో ఇ టీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన మొక్కజొన్న, జొన్న పంటలను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ గురువారం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతు కుటుంబాలను పరా మర్శించి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన నష్టాన్ని ఎంపీకి వివరించి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని వేడుకున్నారు. ఎంపీ వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. పంట న ష్టాన్ని త్వరగా అంచనా వేసి బాధితులను ఆ దుకోవాలని ఆదేశించారు. గ్రామస్తుల వినతి మేరకు బోథ్ నియోజకవర్గ కేంద్రంలో అగ్ని మాపక కేంద్రం (ఫైర్ స్టేషన్) ఏర్పాటుపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. నాయకులు బోరే రవీందర్, జీవీ రమణ, పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ మాజీ సభ్యులు పాల్గొన్నారు. -
టెక్నాలజీ, యాంత్రీకరణను అందిపుచ్చుకోవాలి
బోథ్: రైతులు ఆధునిక సాంకేతికత, యాంత్రీకరణను అందిపుచ్చుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూ చించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాలకు హాజరై రైతులకు అవసరమై న సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత గ్రూపులుగా ఏర్పడి పీ ఎంఈజీపీ కింద 40శాతం రాయితీతో డ్రోన్లు కొనుగోలు చేసి ఉపాధి పొందాలని సూచించారు. నానో డీఏపీ వినియోగించి మంచి దిగుబడులు సాధిస్తు న్న రైతులను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. అంతకుముందు రైతువేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, సోలార్ విద్యుత్ స్టాళ్లను పరిశీ లించారు. అనంతరం రైతులను సన్మానించారు. కా ర్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌స్వామి, తహసీల్దార్ సుభాష్ చందర్, ఎంపీడీవో రమే శ్, ఆత్మ చైర్మన్ గొర్ల రాజుయాదవ్, సర్పంచ్ అన్నపూర్ణ–మహేందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యా వారోత్సవాలను సక్సెస్ చేయాలి ఆదిలాబాద్‌టౌన్: ఈ నెల 11నుంచి 17వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే విద్యావారోత్సవాలను విజ యవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించా రు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళికలో భాగంగా వి ద్యావారోత్సవాల నిర్వహణపై రిమ్స్ ఆడిటోరి యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్‌తో కలిసి అవగాహన సదస్సు ని ర్వహించి దిశానిర్దేశం చేశారు. విద్యావ్యవస్థను బ లోపేతం చేయడం, డ్రాపౌట్స్‌ను బడుల్లో చేర్పించ డం తదితర విషయాలపై అవగాహన కల్పించారు. గుర్తింపు లేని పాఠశాలలను సీజ్ చేయాలని అధికా రులకు సూచించారు. అనంతరం సైన్స్ ఫోరం స భ్యులు కలెక్టర్, డీఈవోను శాలువాలతో సన్మానించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రవీందర్, పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, డీఎస్వో నందిని, డీఎ ల్పీవో ఫణీందర్‌రావు, ఎంఈవో సోమయ్య ఉన్నారు. వేగంగా డిజిటల్ జనగణన కైలాస్‌నగర్: జిల్లాలో డిజిటల్ జనగణన ప్రక్రియ వేగంగా సాగుతోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపా రు. హైదరాబాద్ నుంచి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భార తి హోలీకేరి జనగణన విధివిధానాలపై కలెక్టర్లు, అ దనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి ఆయన పా ల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 89.34 శాతం స్వయం గణన పూర్తయిందని తెలిపారు. 8,014 ప్రక్రియలకు గాను 7,160 విజయవంతంగా ముగిశాయని వివరించారు. 1,923 హౌస్ లిస్టింగ్ బ్లాక్ డీమార్కేషన్ ప్రక్రియను ఆన్లైన్ పోర్టల్‌లో వందశాతం పూర్తి చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, డీఆర్వో స్రవంతి ఉన్నారు. జొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి జొన్నల కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచి రైతుల కు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కా ర్యాలయంలో జొన్న కొనుగోళ్లపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, మా ర్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్‌కుమార్, జిల్లా సహకార అధికారి సత్యనారాయణ, జిల్లా రవాణా అధి కారి శ్రీనివాస్, గిరిజన సహకార సంస్థ జిల్లా మేనేజర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
లబ్ధిదారులకు చెక్కులు అందజేత
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ అర్బన్, మావల మండలాల పరిధిలోని 192 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం చె క్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు బండారి అనూష, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, డీటీ శ్రీవాణి, ఆర్ఐలు యజువేందర్రెడ్డి, శశికళ, కౌన్సిలర్లు నరేశ్‌కుమార్, గంట జీవన్ తదితరులు పాల్గొన్నారు. సాత్నాల మండలంలో.. సాత్నాల: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 42మంది లబ్ధిదారులకు ఆదిలాబాద్ ఎ మ్మెల్యే పాయల్ శంకర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబార క్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, ఆర్ఐ రమేశ్, సర్పంచ్ సాయివర్మ తదితరులు పాల్గొన్నారు. జైనథ్ మండలంలో.. జైనథ్: మండలంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆ లయ ప్రాంగణంలో లబ్ధిదారులకు కలాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైనథ్, బేల తహసీల్దార్లు నారాయణ, ప్రవీణ్‌కుమార్, సాత్నాల ఆర్ఐ సాయినాథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఆదిలాబాద్‌టౌన్/ఇంద్రవెల్లి/నేరడిగొండ/తాంసి: జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షం అన్నదా తలను అవస్థలకు గురి చేసింది. ఆయా మార్కెట్ యార్డుల్లో రైతులు విక్రయించేందుకు తెచ్చిన ధా న్యం తడిసిపోయింది. చాలామంది రైతులు ముందుగానే ధాన్యం కుప్పలపై కవర్లు కప్పి జాగ్రత్తపడ్డారు. ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు మొక్కజొన్నలు తెచ్చిన రైతులు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పారు. అయినప్పటికీ ధాన్యం తడవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాల్లో చేతికొచ్చిన జొన్న, మొ క్కజొన్న పంటలు వర్షానికి దెబ్బతిన్నాయి. నేరడిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆరబోసిన మక్కలు తడిసి ముద్దయ్యాయి. సకాలంలో ధాన్యం తూకం వేయకపోవడం, సరిపడా టా ర్పాలిన్లు లేకపోవడంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులకు గురయ్యారు. తాంసి మండల కేంద్రంతోపాటు మండలంలోని గిరిగాం, పొన్నారి, వడ్డాడి, హస్నాపూర్, కప్పర్ల గ్రామాల్లోనూ వర్షం కురిసింది. తాంసి సబ్ మార్కెట్‌యార్డులో రైతులు విక్రయించేందుకు తెచ్చిన జొ న్న పంట తడిసిపోయింది. చాలామంది రైతులు ముందే ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పుకొని జాగ్రత్త పడ్డారు. మండలంలో చాలాచోట్ల జొన్నపంటలు గాలివానకు నేలవాలాయి. -
ఏళ్లనాటి భూసమస్య పరిష్కారం
కై లాస్‌నగర్: కలెక్టర్ రాజర్షి షా చొరవతో భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామానికి చెందిన గిరిజన రైతు మడావి గంగారాం ఏళ్లనాటి భూ సమస్య పరిష్కారమైంది. గంగారాంకు చెందిన తొమ్మిదెకరాల సాగు భూమి నిషేధిత జా బితా (ఇనాం భూమి)లో చేరింది. దీంతో పట్టా పొందడానికి అవకాశం లేకుండా పోయి ప్రభు త్వ ప్రయోజనాలు పొందలేకపోయాడు. బాధి త రైతు ఇటీవల కలెక్టర్‌ను కలిసి సమస్య వివరించి పరిష్కారించాలని కోరాడు. స్పందించిన కలెక్టర్ భూభారతి చట్టం ద్వారా సమస్య పరి ష్కరించాలని భీంపూర్ తహసీల్దార్ బానోత్ ర మేశ్‌ను ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో వి చారణ చేపట్టిన అధికారులు ఆ భూమిని రైతు గంగారాం పేరిట నమోదు చేసి పట్టాదారు పా సుపుస్తకం అందజేశారు. దశాబ్దాల నాటి భూ సమస్య పరిష్కారం కావడంతో రైతు గంగా రాం ఆనందం వ్యక్తం చేశాడు. గురువారం కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశా డు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. -
పేదలకు ఎంతో ఉపయోగకరం
రేషన్‌దుకాణాల ద్వారా తక్కువ ధరకే జొన్నలు, మొక్కజొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరం. జొన్న బలవర్ధకమైన ఆహారం. జొన్న రొ ట్టెలు తింటే ఆరోగ్యానికి మంచిది. దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు. రేషన్‌షాపుల్లో ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండటంతో వాటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. జొన్నలు అందించడం ద్వారా పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రేషన్ షాపుల ద్వారా ఒక్కొక్కరికీ 10కిలోల చొప్పున జొన్నలు అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. – మైలారపు రాజేశ్, టీచర్స్‌కాలనీ, ఆదిలాబాద్ -
‘అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం’
ఇచ్చోడ: రైతులు అధైర్యపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ పేర్కొన్నారు. మండలంలోని దుబార్‌పేట్‌లో ఇటీవల అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పంటలను గు రువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పంటల వివరాలు సేకరించాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. నీ టి ఎద్దడిని నివారించాలని దుబార్‌పేట్‌లో గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో వెంటనే స్పందించి బోరుబావికి భూమిపూజ చేశారు. అంతకుముందు సాథ్ నంబర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ నిమ్మల ప్రీతంరెడ్డి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, నాయకుడు మహేందర్‌రెడ్డి ఉన్నారు. -
ఆపదలో అండగా.. గోమాత ఫౌండేషన్
రహదారులపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పుడు మనుషులు క్షతగాత్రులుగా మారినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఈ రోజుల్లో మూగ జీవాలకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వాటికి అండగా నిలుస్తూ చికిత్స అందిస్తోంది పట్టణంలోని గోమాత సేవా ఫౌండేషన్. 2011లో ఈ స్వచ్ఛంద సంస్థ ప్రారంభమైంది. మూగజీవాలు అనారోగ్యంతో ఎక్కడైనా పడిపోవడం, అచేతన స్థితిలో కదలకుండా ఉండడం, రహదారి ప్రమాదంలో గాయాలు కావడం, ఏదైనా మురికి కాలువలో పడిపోవడం వంటి సమయంలో ఆ జీవాలకు ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు వాటి బాగోగులు చూసుకుంటున్నారు ఈ సంస్థ ప్రతినిధులు. స్థానికులు సమాచారం అందిస్తే వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని సపర్యలు అందిస్తున్నారు. ప్రమాదవశాత్తు గోమాతలు చనిపోతే వాటికి శాస్తోక్త్రంగా అంత్యక్రియలు సైతం నిర్వహిస్తుండడం విశేషం. తమకు యంత్రాంగం మరింతగా సహకరిస్తే మూగజీవాల బాగోగులు పూర్తిస్థాయిలో చూడడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫౌండేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. యంత్రాంగం సహకరించాలి.. ఫౌండేషన్‌ను 15ఏళ్ల క్రితం ప్రారంభించాం. అప్పటి నుంచి గోమాతల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రాత్రి, పగలు ఏ సమయమైనా సంప్రదించిన వెంటనే అక్కడికి చేరుకుని జీవాలకు చికిత్స అందిస్తున్నాం. పలు సందర్భాల్లో మరణిస్తే అంత్యక్రియల సైతం చేస్తున్నాం. ఫౌండేషన్ తరఫున ఇప్పటివరకు ఎన్నో ఆవులను ప్రమాదాల నుంచి కాపాడమే కాకుండా, వాటి బాగోగులు చూసుకున్నాం. అధికార యంత్రాంగం సహకరిస్తే మూగజీవాల సేవలో మరింతగా పాటుపడతాం. – సురేష్ ఓటార్కార్, గోమాత సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు, ఆదిలాబాద్ -
మన సంస్కృతి విశ్వవ్యాప్తం
ఆదిలాబాద్: భారతదేశ సంస్కృతి విశ్వవ్యాప్తం అయ్యిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శంకర్ గుట్టపై వెలసిన బీరప్ప ఆలయ పునర్నిర్మాణ పనులు బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, నిధుల కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఇందులో మాజీ మంత్రి జోగు రామన్న, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభ విజయవంతం చేయాలి.. ఆదిలాబాద్: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పశ్చిమ బెంగాల్ తరహా తీర్పే ఇక్కడి ప్రజలు ఇస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా కేంద్రంలో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని కొలిపురా కాలనీలో వాల్ పెయింటింగ్ కార్యక్రమాన్ని చేపట్టి, ప్రజలను కలుస్తూ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట కౌన్సిలర్ శైలజ, పార్టీ నాయకులు రవి, హన్మండ్లు, దినేష్ మటోలియా, శివ తదితరులున్నారు. -
విజ్ఞాన వికాసానికి ‘స్నేహ’హస్తం
కై లాస్‌నగర్: జిల్లాలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల విజ్ఞాన వికాసం కోసం యంత్రాంగం ‘స్నేహ’ పేరిట వేసవి శిబిరాలను వినూత్నంగా నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికా రులతో బుధవారం సన్నాహక సమీక్ష నిర్వహించా రు. ఈ నెల 12 నుంచి విద్యార్థులకు ఆటపాటలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా విజ్ఞానం పెంపొందేలా వీటిని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంస్థ యునిసెఫ్ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ శిబిరాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఇన్చార్జి డీపీవో ఫణిందర్ రావు తదితరులు పాల్గొన్నారు. వినూత్న పంటలు సాగు చేయాలి తాంసి: రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా వినూత్న పంటలు సాగు చేయాలని కలెక్ట ర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని హస్నాపూర్ గ్రామ రైతువేదికలో బుధవారం నిర్వహించిన రైతు వారోత్సవాల కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కా ర్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌స్వామి, సర్పంచ్ లింగారెడ్డి, ఎంపీవో అవినాష్‌రెడ్డి, ఏవో రవీందర్, ఏఈవో అమీరుద్దీన్, పంచాయతీ కార్యదర్శి లావణ్య పాల్గొన్నారు. జొన్నలు కొనుగోలు పరిమితి పెంచాలని వినతి జొన్నల కొనుగోలు పరిమితి ఎకరానికి 15 క్వింటా ళ్లకు పెంచాలని తాంసి మండల రైతులు కోరారు. ఈ మేరకు పొన్నారి గ్రామానికి విచ్చేసిన కలెక్టర్‌ను మండలంలోని వడ్డాడి, హస్నాపూర్ గ్రామాల రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వంతో పాటు మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిమితి పెంచేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
భూమాఫియాపై ఉక్కుపాదం
ఆదిలాబాద్‌టౌన్: భూ మాఫియా మోసాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం భూ చట్టాలు, రికార్డులపై పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ నలంద ప్రియ అవగాహన కల్పించారు. భూ యాజమాన్య చరిత్ర, అమలులోకి వచ్చిన భూ చట్టాల పరిమితులతో పాటు ఇతర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూ సంబంధిత కేసుల్లో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సూపరింటెండెంట్‌ను ఎస్పీ శాలువాతో సన్మానించారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్‌సాయి కొట్టే, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, సీఐలు పాల్గొన్నారు. -
మార్కెటింగ్‌పై అవగాహన అవసరం
ఆదిలాబాద్‌టౌన్: రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందాలంటే మార్కెటింగ్ విధానాలపై సమగ్ర అవగాహన అవసరమని అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో బుధవారం రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు పంట మార్పిడి విధానం పాటించాలన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ధరల సమాచారం, మార్కెట్, నిల్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సాగును లాభసాటిగా మార్చుకోవాలని కోరారు. అంతకుముందు రైతులను వారు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మున్సిపల్ చైర్పర్సన్ అనూష, మార్కెటింగ్ ఏడీ గజానన్, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
అక్రమ లేఅవుట్పై బల్దియా కొరడా
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని అక్రమ లేఅవుట్పై బల్దియా అధికారులు కొరడా ఝుళిపించారు. మహాలక్ష్మివాడ కాలనీలోని సర్వేనంబర్ 76/1/2, 76/1/3 ల్లోని మూడు ఎకరాల స్థలంలో ఓ రియల్ వ్యాపారి లేఅవుట్ ఏర్పాఠి టు చేశాడు. మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే అందులో రాళ్లను పాతి ప్లాట్లుగా మార్చాడు. దీనిపై కమిషనర్‌కు ఫిర్యాదులు రావడంతో ఆయన టౌన్ ప్లానింగ్ అధికారులను విచారణకు ఆదేశించారు. ఈమేరకు టీపీఓ సుమలత, టీపీఎస్ నవీన్‌కుమార్ సిబ్బందితో కలిసి లేఅవుట్‌ను పరిశీలించారు. నిబంధనల ప్రకారం అనుమతులు లేకపోవడంతో అక్రమమని నిర్ధారిస్తూ అందులో పా తిన రాళ్లను తొలగించి వేసినట్లు టీపీవో తెలి పారు. అక్రమంగా ఏర్పాటు చేసే లేఅవుట్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. -
జీవ కారుణ్యం
గోమాత సేవలో నిమగ్నంసాటి మనుషులను పట్టించుకోని ప్రస్తుత సమాజంలో కొంతమంది మూగజీవా లపై మానవత్వం ప్రదర్శిస్తున్నారు. వాటి భావాలను అర్థం చేసుకొని ఆకలి, దప్పికలు తీరుస్తున్నారు. ఆపదొస్తే ఆప్తులుగా నిలుస్తూ కారుణ్యం ప్రదర్శిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆదర్శంగా నిలుస్తున్న ఆయా స్వచ్ఛంద సంస్థలపై ప్రత్యేక కథనం. – ఆదిలాబాద్ దాహార్తి తీరుస్తున్న.. గోమాత సేవా సమితి వేసవి ఎండలకు మనుషులే అల్లాడిపోతుంటారు. మూగజీవాల పరిస్థితి చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో ఏళ్లుగా వాటి దాహార్తి తీర్చడంతో పాటు గ్రాసం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లా కేంద్రంలోని గోమాత సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ. 2010లో ఈ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ వ్యాప్తంగా పశువులు ఎక్కువగా సంచరించే ప్రదేశాలను గుర్తించి 15 నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా వేసవిలో అందులో నీటితో పాటు పచ్చిగడ్డిని సైతం అందుబాటులో ఉంచుతున్నారు ఈ సంస్థ ప్రతినిధులు. కోవిడ్ సమయంలో ఎన్నో ఆంక్షల నడుమ గ్రాసం తీసుకువచ్చి వాటి ఆకలి తీర్చామని పేర్కొంటున్నారు. దాతలు స్పందిస్తే మరిన్ని అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. దాతలు ముందుకు రావాలి.. గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా మూగజీవాలకు సేవ చేస్తున్నాం. పట్టణవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేశాం. అందులో నీటితో పాటు గ్రాసం అందుబాటులో ఉంచుతున్నాం. కోవిడ్ సమయంలో సైతం వాటికి ఆహారం అందించాం. ఎవరైనా దాతలు ముందుకు వస్తే మరిన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – గణేశ్ వర్మ, గోమాత సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు -
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
ఆదిలాబాద్‌రూరల్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసమే వేచి చూడకుండా, ప్రైవేటు రంగంలో ఉన్న అవకాశాలను ద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలన్నారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఇందులో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్, ఉపాధి కల్పన అధికారి మిల్కా, నిరుద్యోగులు పాల్గొన్నారు. -
మళ్లీ వారికే పీఏసీఎస్ పగ్గాలు
కై లాస్‌నగర్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాత పాలకవర్గాలకే తిరిగి ప్రభుత్వం పగ్గాలు అప్పగించింది. పాలకవర్గాలను రద్దు చేస్తూ ఇటీవల జారీ చేసిన జీవో 597ను హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లుగా మొన్నటి వరకు విధులు నిర్వహించిన వారికే తిరిగి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా సహకార శాఖ అధికారి ఎం.సత్యనారాయణ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం నుంచి జిల్లాలోని 28 పీఏసీఎస్ పాత పాలవర్గాలు యథావిధిగా కొనసాగనున్నాయి. హైకోర్టు తీర్పు, ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏం జరిగిందంటే.. జిల్లా సహకార శాఖ పరిధిలోని ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాలకు 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. సొసైటీ చైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. వీటి ఐదేళ్ల పదవీకాలం గడువు గతేడాది ఫిబ్రవరి 13తో ముగిసింది. వారి విజ్ఞప్తి మేరకు పదవీకాలాన్ని ప్రభుత్వం ఆరునెలల పాటు పొడిగించింది. గతేడాది ఆగస్టు 14తో పూర్తి కావడంతో ప్రభుత్వం రెండో సారి పొడిగిస్తూ అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దుచేస్తూ 19 డిసెంబర్ 2025న జీవో 597 జారీ చేసింది. దీంతో సర్కారు నిర్ణయంపై పాలకవర్గాలు ఒక్కసారిగా ఖంగుతున్నాయి. ఉన్నపాటుగా రద్దు చేసిన ప్రభుత్వం తిరిగి ఎన్నికలు నిర్వహిస్తుందని భావించారు. అయితే అలా చేయకుండా పర్స న్ ఇన్‌చార్జీలుగా సహకార శాఖ అధికారులు, ఉద్యోగులను నియమించింది. దీంతో ఆగ్రహించిన చైర్మ న్లు రాష్ట్ర హైకోర్టును అప్పట్లోనే ఆశ్రయించారు. ఈ క్రమంలో వారినే కొనసాగించాలంటూ హైకోర్టు సైతం ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఈ ఆదేశాలు లెక్కచేయకుండా నామినేటేడ్ పద్ధతిలో పాలకవర్గాలను భర్తీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. జీవో ఉపసంహరించుకున్న ప్రభుత్వం .. సొసైటీ పాత పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించాలని చెప్పినహైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం లెక్క చేయకపోవడంతో సొసైటీ చైర్మన్లు మరోసారి న్యా యస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వంపై కోర్టు ది క్కరణ కేసు ఫైల్ చేశారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. పాలకవర్గాలను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 597ను ఉపసంహరించుకుంది. 14.02.2025 రోజున చైర్మన్లు, డైరెక్టర్లుగా ఉన్నటువంటి వారిని యఽథావిధిగా నియమించాలని సహకారశాఖ అధి కారులను ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా సహకారశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని 28 సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లుగా పాత వారికి బాధ్యతలు అప్పగిస్తూ డీసీవో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ తదుపరి చర్యల వరకు పాత సొసైటీలే కొనసాగనున్నాయి. -
217 జీపీల్లో శతశాతం..
కై లాస్‌నగర్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్ను వసూళ్ల గడువు ఇటీవల ముగిసింది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసిన విషయం తెలిసిందే. అయితే పన్ను వసూలు లక్ష్య సాధన కోసం మరో 15 రోజుల పాటు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇది కూడా ఇటీవల ముగియగా జిల్లాలోని 217 జీపీలు శతశాతం వసూలు చేసి ఆదర్శంగా నిలి చాయి. ఇందులో 25 పంచాయతీలు వందశాతానికి మించి వసూలు చేయడం గమనార్హం. లక్ష్యం చేరిన జీపీల్లో అత్యధికంగా ఆదివాసీ గ్రామాలే ఉండటం గిరిపుత్రుల బాధ్యత, చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అన్ని వసతులున్న మైదాన ప్రాంతాల్లోని పంచాయతీలు పన్నుల చెల్లింపులో వెనుకబడడం విస్మయానికి గురిచేస్తోంది. వందశాతం వసూలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 473 పంచాయతీలు ఉండగా ఇందులో 192 వంద శాతం పన్నులు వసూలు చేశాయి. మరో 25 గ్రామాల్లో లక్ష్యానికి మించి వ సూలు చేసి ఆదర్శంగా నిలిచాయి. మరో 20 గ్రా మాలు లక్ష్యానికి 99శాతంతో అడుగుదూరంలో నిలిచాయి. మిగతా పంచాయతీల్లో 57 నుంచి 98 శాతం వరకు వసూలైనట్లుగా అధికారిక లెక్కలు చె బుతున్నాయి. వందశాతం పన్నులను వసూలు చేసి న గ్రామాల్లో ఇచ్చోడ, ఇంద్రవెల్లి, భీంపూర్ మండలాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇక్కడి మెజార్టీ గ్రామాలు ఏజెన్సీ అయినా వందశాతం పన్ను చెల్లించి బాధ్యత, చైతన్యాన్ని చాటుకున్నాయి. జిల్లాలో ఇలా.. జిల్లావ్యాప్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరానికి 85.15 శాతం పన్నులు వసూలయ్యాయి. ఆయా పంచాయతీల పరిధిలో 1,79,236 ఆస్తులు ఉండగా వీటికి సంబంధించి మొత్తం రూ.6కోట్ల71లక్షల 58వేల 878 పన్ను లక్ష్యంగా ఉంది. ఇందులో రూ.6కోట్ల 39లక్షల 90వేల 446 వసూలు చేశారు. రూ.77లక్షల 85వేల 330 బ్యాలెన్స్‌గా మిగిలాయి. మండలాల వారీగా శతశాతం పన్ను వసూలు చేసిన జీపీల వివరాలు వందశాతం లక్ష్యంగా ముందుకు ప్రతీ పంచాయతీలో వందశాతం పన్నులు వసూలు లక్ష్యంగా ప్రయత్నించాం. మెజార్టీ జీపీల్లో లక్ష్యాన్ని సాధించినప్పటికీ కొన్ని చోట్ల వెనుకబడ్డాం. వచ్చే ఏడాది వందశా తం అధిగమించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. ప్రజలు సైతం స్వ చ్ఛందంగా పన్ను చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలి. – ఫణిందర్‌రావు, జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి మండలం పంచాయతీల సంఖ్య సిరికొండ 10 తాంసి 05 భీంపూర్ 17 ఆదిలాబాద్‌రూరల్ 16 జైనథ్ 07 నార్నూర్ 15 ఇంద్రవెల్లి 21 గుడిహత్నూర్ 12 ఇచ్చోడ 31 బజార్హత్నూర్ 15 బోథ్ 08 నేరడిగొండ 11 సొనాల 04 సాత్నాల 07 భోరజ్ 06 గాదిగూడ 06 తలమడుగు 07 బేల 10 ఉట్నూర్ 09 -
● మొదలైన వేసవి క్రీడా శిబిరాలు ● జిల్లావ్యాప్తంగా ఐదు చోట్ల షురూ ● పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ● నెలాఖరు వరకు ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ
కబడ్డీలో శిక్షణ ఇస్తున్న కోచ్ టేబుల్ టెన్సీస్ ఆడుతూ..ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబి రాలు అందుబాటులోకి వచ్చేశాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ గతేడాది నుంచి వీటిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏర్పాటు చేసిన శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈనెలాఖరు వరకు జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఆయా క్యాంప్‌లలో విద్యార్థులకు యోగా, కరాటే, వాలీబాల్, క్రికెట్, అథ్లెటిక్స్ వంటి పలు క్రీడలపై నిపుణుల ద్వారా శిక్షణ అందిస్తున్నారు. కేవలం క్రీడలకే పరిమితం కాకుండా, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జట్టు భావన, స్వీయరక్షణ వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు సాగుతున్న శిక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమ ప్రతిభకు పదును పెంచి మెరుగుపర్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో శిబిరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఇచ్చోడ, బోథ్, నార్నూర్, ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న ఈ క్యాంపులకు 550 మంది హాజరవుతున్నారు. శిక్షకులు ప్రతీ విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి వారికి తగిన మార్గదర్శనం అందిస్తున్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రజలతో సత్సంబంధాలు పెంచాలనే ఉద్దేశంతో ఎస్పీ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఆత్మరక్షణ కళలు.. వివిధ క్రీడాపోటీలు శిబిరంలో భాగంగా విద్యార్థులకు పోలీస్‌స్టేషన్ సందర్శనలు, పోలీసుల విధుల నిర్వహణపై ప్రత్యక్ష అవగాహన, ఆయుధాల వినియోగం, వాటి పనితీరు, పోలీసుల కఠిన శిక్షణ విధానాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి ప్రేరణ కలుగుతుంది. క్రికెట్ సాధనలో చిన్నారులు విద్యార్థులకు మంచి వేదిక.. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు ఇది మంచి వేదికగా నిలుస్తుంది. చెడు అలవాట్లు, మత్తు పదార్థాలు, మొబైల్ ఫోన్లు, వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడం ఈ క్యాంప్ ప్రధాన ఉద్దేశం. శిక్షణతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో పాటు మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతుంది. ఈ శిబిరాల్లో క్రికెట్, టేబుల్ టెన్నీస్, ఆర్చరీ, వాలీబాల్, యోగా, కరాటే తదితర క్రీడాంశాల్లో శిక్షణ కల్పిస్తున్నారు. -
ఆనందంగా ఉంది
నేను కబడ్డీ, వాలీబాల్‌లో శిక్షణ పొందుతున్నా. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నా. స్నేహితులతో కలిసి ఆడటం ఆనందంగా ఉంది. ఆటల్లో గెలుపోటములు సహజమని తెలుసుకున్నా. – శ్రీహిత, విద్యార్థిని క్రికెట్ అంటే ఇష్టం నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఈ క్యాంప్‌లో క్రికెట్, వాలీబాల్‌లో శిక్షణ పొందుతున్నా. జట్టు ఆటల్లో పాల్గొనడం ద్వారా టీమ్ స్పిరిట్‌తో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. – శయాన్, విద్యార్థి కరాటే శిక్షణతో ధైర్యం పెరిగింది.. కరాటే ద్వారా ఆత్మరక్షణ పద్ధతులు నేర్చుకుంటున్నా. ఇప్పుడు నాలో ధైర్యం పెరిగింది. క్రమశిక్షణ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. గురువుల మార్గదర్శనం బాగుంది. – నిహస్వి, విద్యార్థిని జిల్లాలో ఐదు చోట్ల నిర్వహిస్తున్నాం.. సమ్మర్ క్యాంప్‌ల ద్వారా విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతుంది. ఈనెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా ఐదు చోట్ల వీటిని నిర్వహిస్తున్నాం. వీటి ద్వారా పిల్లల్లో పోలీసులనే భయం తొలుగుతుంది. అన్యాయం జరిగినప్పుడు నిర్భయంగా ఫిర్యాదు చేయాలనే విషయం అవగతమవుతుంది. అలాగే వారిలో క్రమశిక్షణ అలవాటు పడుతుంది. ఆయా క్రీడాంశాలకు సంబంధించిన నిష్ణాతులతో శిక్షణ కల్పిస్తున్నాం. అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
అతివలకు ధైర్యం.. భరోసా కేంద్రం
ఆదిలాబాద్‌టౌన్: మహిళలు, బాలికలకు భరోసా కేంద్రం ధైర్యంగా ఉంటుందని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. భరోసా, షీటీమ్ కార్యాలయాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎ స్పీ మాట్లాడుతూ, మహిళలు వేధింపులు, దాడుల కు గురైన వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. భార్యభర్తల మధ్య గొడవలు, ఇతర సమస్యలతో సతమతమవుతున్న వారికి షీటీమ్, భరోసా కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, వన్‌టౌన్ సీఐ సునిల్ కుమార్, ప్రేమ్‌కుమార్, భరోసా సెంటర్ అధికారి రూపరాణి, షీటీమ్ సిబ్బంది వాణి, మహేష్ తదితరులున్నారు. పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి మత సామరస్యాన్ని కాపాడుతూ పండుగలను ప్రశాంతంగా జ రుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌లో ఖురేషి కులస్తులు, హిందూ సంఘాలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. సరైన అనుమతి, ప త్రాలు ఉన్న పశువుల ను మాత్రమే సంహరించాలని సూచించా రు. ఆవులను ఎట్టి పరిస్థితుల్లో వధించవద్దని పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలన్నారు. సొంతగా వాహనాలు ఆపడం, తనిఖీలు నిర్వహించడం వంటివి చేయవద్దని, జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు సునిల్ కుమార్, నాగరాజు, ఫణిందర్, స్వామి తదితరులున్నారు. -
బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం
బోథ్: మండలంలోని కనుగుట్ట శివారులో ఇటీవల ప్రమాదవశాత్తు జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. 19 మంది రైతులకు చెందిన 48 ఎకరాల మేర పంట నష్టపోయినట్లు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు సరిగా లేని విషయాన్ని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఆ శాఖ అధికారులు కూడా అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదు చేయడంతో ఏఈపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. పంట నష్టానికి సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి రైతులకు న్యా యం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీవో జగదీశ్వర్, తహసీల్దార్ సుభాష్ చందర్, సర్పంచ్ అనిత రాజేందర్, రైతులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ సభకు తరలిరావాలి
ఆదిలాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఈనెల 10న నిర్వహించనున్న ప్రధాని న రేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పా యల్ శంకర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కోరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రతీ పోలింగ్ కేంద్రం, గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద, లాలా మున్నా, జోగు రవి, శ్రీకాంత్, కృష్ణయాదవ్, దినేష్ మటోలీయా, సాయి, రాకేష్ తదితరులున్నారు. ముగిసిన ‘జనగణన’ శిక్షణకై లాస్‌నగర్: జనగణన–2027 నిర్వహణపై ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ మంగళవారంతో ముగిసింది. ఎంపిక చేసిన 400 మందికి 8 బ్యాచ్‌లుగా శిక్షణ అందించారు. స్థానిక టీటీడీసీలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ హాజరై గణన ప్రక్రియపై పలు సూచనలు చేశా రు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పక్కాగా చేపట్టాలన్నారు. ఏ ఒక్క కుటుంబం తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 10వరకు స్వీయ నమోదుకు అవకాశం ఉన్నందున పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, రిటైర్డు ఉద్యోగులు, విద్యావంతులు స్వ యంగా తమ వివరాలు నమోదు చేసుకోవా లని సూచించారు. 11 నుంచి ఇళ్ల వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు ఎస్ఈఐడీని చూపిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్‌కుమార్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. -
రాజురా రైతులకు పరిహారం
నేరడిగొండ: అసెంబ్లీలో తాను చేసిన ప్రస్తావన ఫలి తంగా రాజురా గ్రామ రైతులకు నష్ట పరిహారం అందినట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని రాజురా గ్రామంలో చెరువు నిర్మాణంతో భూములు కోల్పోయిన 38 మంది రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.కోటి 18 లక్షల నష్టపరిహారాన్ని మంగళవారం ఆయన పంపిణీ చేశారు. 2012లో చెరువు నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన రైతులకు అప్పటి ప్రభుత్వం 2014లో 50 శాతం నిధులు విడుదల చేసిందని, మిగతా వాటి కోసం రైతులు ఏళ్లుగా ఎదురుచూస్తుండగా, ఇటీవల అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి రెండో విడతగా నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. ఇందులో మండల రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
కై లాస్‌నగర్: రైతులకు ఇబ్బందులు కలుగకుండా యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అ ధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచి వాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో తగు చర్యలు చేపట్టాలన్నారు. సరిపడా టార్పాలిన్లు, తేమనిర్ధారణ యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటా యించిన రైస్ మిల్లులకు వెంటవెంటనే పంపించాలన్నారు. ఇందులో కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, పౌర సరఫరాల శాఖ అధికారులు నందిని, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ నృత్యోత్సవంలో మెరిసిన ‘బాలకేంద్రం’
ఆదిలాబాద్: దేశ రాజధానిలో జిల్లా బాల కేంద్రం చిన్నారులు తమ కూచిపూడి నృత్య ప్రతిభతో సత్తా చాటారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్, అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన జాతీయ నృత్య పురస్కార మహోత్సవంలో అద్భుత ప్రదర్శన ఇచ్చి అవార్డులు సొంతం చేసుకున్నారు. తెలుగు ఉద్యోగుల సంక్షేమ సంఘం, న్యూఢిల్లీ, హైదరాబాద్‌కు చెందిన సాంస్కృతిక లలిత కళల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో నృత్యోత్సవం నిర్వహించారు. ఇందులో గడ్డం శ్రీనిధి, క్షీరసాగర జాహ్నవి, లింగంపల్లి సాయి కార్తీక, పడాల ధన్విక ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వీరి ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు వారికి పురస్కారాలు అందజేయడమే కాకుండా, మలేషియాలో నిర్వహించే అంతర్జాతీయ నృత్య పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అలాగే హాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ సత్యరెడ్డి తన తదుపరి సినిమాలో వీరికి నటించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విజేతలను మాస్టర్స్, తల్లిదండ్రులు, బాల కేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి ప్రత్యేకంగా అభినందించారు. -
పోలీసుల స్పెషల్‌డ్రైవ్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి పోలీసులు భారీ ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి10 గంటల వరకు 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేపట్టారు. 1,558 వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు 79 మంది (డ్రంకెన్ డ్రైవ్), నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలు 61, మైనర్ డ్రైవింగ్‌కు సంబంధించి 9 కేసులు నమోదయ్యాయి. అలాగే అర్ధరాత్రి వేళ అనుమానాస్పదంగా తిరుగుతున్న 200 మంది వ్యక్తుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణకు, ప్రజల భద్రతకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. -
పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట
ఆదిలాబాద్‌టౌన్: పశువుల అక్రమ రవాణాను పూర్తి గా అడ్డుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌లో చెక్‌పోస్టు సిబ్బందికి సోమవారం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బక్రీద్ సందర్భంగా జిల్లాలో ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిప్పర్వాడ, ఆనంద్‌పూర్, శంకర్‌గూడ, లక్ష్మిపూర్, లోకారి, ఉట్నూర్, ఘన్‌పూర్‌లో 24 గంటల పాటు తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై స్థాయి అధికారి పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న పశువులు లభిస్తే వెంటనే గోశాలకు తరలించాలన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎస్పీ వెంట ఆది లాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సునిల్ కుమార్, నాగరాజు, ప్రేమ్‌కుమార్, శ్రావణ్, రమేష్ తదితరులున్నారు. శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రావీణ్యం శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రా వీణ్యం లభిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన వేసవి శిబి రాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఐదు చోట్ల 550 మంది విద్యార్థులతో వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్, బోథ్‌లో ఏ ర్పాటు చేసిన శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, మావల ఎస్హెచ్ఓ రాహుల్‌కాంత్, సీఐలు నాగరాజు, సునిల్ కుమార్, ప్రేమ్‌కుమార్, శ్రావణ్, చంద్రశేఖర్, వెంకటి పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలిమాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అఖి ల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డవ్ (డీఅడిక్షన్ అండ్ వెల్నెస్) సెంటర్‌ను సోమవారం సందర్శించారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి ఈ సెంటర్ ఒక మంచి అవకాశమని తెలిపా రు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, మావల ఎస్‌హెచ్‌వో రాహుల్ కాంత్, టూటౌన్ సీఐ నాగరాజు, మావల సీఐ కె.స్వామి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులకు సూ చించారు. సోమవారం పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 24 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతుల సమస్యలపై రాజకీయాలు వద్దు
ఆదిలాబాద్‌టౌన్: రైతుల సమస్యలపై రాజకీయాలు చేయవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తలమడుగు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 3,180 (హైబ్రిడ్) మద్దతు ధరతో కొనుగోళ్లు చేపడుతోందని, రైతులు 14 శాతం తేమ మించకుండా పంటను తీసుకురావాలని సూచించారు. దళారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇందులో మున్సిపల్ చైర్ పర్సన్ అనూష, బీజేపీ నాయకులు దయాకర్, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పసిడి ధర పెరగడంతోనే..
ఇలా కేటుగాళ్లు దుకాణాలు, ఏటీఎంలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు.ఆదిలాబాద్‌టౌన్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ జ్యూయలరీ షాపులో పట్టపగలే దుండగులు లూ టీకి పాల్పడ్డ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లా వ్యాపారుల్లోనూ ఇది గుబులు రేపుతోంది. మనమెంత భద్రం అనే దానిపై సర్వత్రా చ ర్చ మొదలైంది. పసిడి ధరలు ఆకాశాన్ని అంటడంతో కేటుగాళ్లు బంగారు దుకాణాలపై కన్నేస్తున్నారు. అలాగే మహిళల మెడలో నుంచి ఆభరణాలు సైతం ఎత్తుకెళ్తున్నారు. అంతేకాకుండా వ్యాపార సముదాయాల్లోనూ చోరీలకు పాల్పడుతున్నారు. ఏటీఎం సెంటర్లను దోచుకెళ్తున్నారు. ఈక్రమంలో పో లీసు శాఖ ఇటీవల వ్యాపారులంతా తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించా రు. చోరీలు, సంఘటనలు జరిగినప్పుడు నిందితులను త్వరితగతిన గుర్తించడంతో పాటు పట్టుకునేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు. భద్రత పాటిస్తేనే చోరీలకు చెక్.. జ్యూయలరీ షాపులు, సూపర్ మార్కెట్లు, ఏటీఎం సెంటర్లు, బ్యాంకులు, వైన్స్‌లు, ఇతర వ్యాపార, వా ణిజ్య సముదాయాల్లో భద్రత చర్యలు పాటిస్తేనే చో రీలకు చెక్ పడనుంది. ప్రతీ దుకాణంలో లోపల, బ యట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పో లీసులు సూచిస్తున్నారు. ఏటీఏంలు, జ్యూయలరీ షాపుల్లో సెక్యూరిటీ గార్డులను నియమించుకోవ డం మంచిదని పేర్కొంటున్నారు. అలాగే షాపుల్లో సైరన్ అలారం ఏర్పాటు చేసుకుంటే తుపాకులు, ఇతర ఆయుధాలతో లోనికి చొరబడినప్పుడు వాటి ని నొక్కితే సైరన్ మోగి దొంగలు పారిపోయే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని అప్రమత్తం అవ్వడంతో వారి ఆగడాలకు చెక్ పెట్టవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని వ్యాపార సముదాయాలుబంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం తులం ధర రూ.లక్ష 50వేలకు పైగా పలుకుతుంది. తక్కువ మొత్తంలో దోపిడీకి పాల్పడినా ఎక్కువ మొత్తంలో డబ్బులు రాబట్టుకోవచ్చనే భావనతో దుండగులు ఇలాంటి చోరీలకు యత్నిస్తున్నారు. అలాగే మహిళల మెడలో నుంచి సైతం కేటుగాళ్లు బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్నారు. రోజుకో కొత్త పుంతల్లో చోరీలకు పాల్పడుతున్నారు. -
తెలంగాణలోనూ బీజేపీ అధికారం ఖాయం
ఆదిలాబాద్: తెలంగాణలోనూ బీజేపీ అధికారంలో కి రావడం ఖాయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల ఫలి తాలు రావడంతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం సంబరాలు నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, మి ఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ని కల ఫలితాల్లో దాదాపు 90 శాతం బీజేపీకి అనుకూలంగా ఉండటం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు లాలా మున్నా, జోగు రవి, దినేష్ మటోలియా, ఘటిక క్రాంతి, సుమన్, మయూర్ చంద్ర, కృష్ణ యాదవ్, శ్రీకాంత్, ఉదయ్, సూర్య, కిరణ్ సాయి పాల్గొన్నారు. -
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్ఎస్. చిత్రు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్లు, ఉపాధి హామీ పథకం పనులు, భూ సమస్యల పరిష్కారం వంటి సమస్యలపై పలు అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన ఇలా.. మేమంతా ఎలాంటి జీవనాధారం లేని నిరుపేదలం. పక్కా ఇండ్లు లేవు. ఉన్న స్థలంలో చిన్నపాటి గుడిసెలు వేసుకుని ఏళ్లుగా కాలం వెల్లదీ స్తున్నాం. మాలాంటి వారి కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం ఆనందంగా ఉంది. ఎల్–2 జాబితాలో పేర్లు కలిగిన మాకు ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నాం. – డొప్టాల గ్రామస్తులు, బేల మండలం సర్వేనంబర్ 70నుంచి 8వరకు గల 2 కిలో మీటర్ల మేర పంటచేలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ సర్వేనంబర్ల పరిధిలో మండలంలో ఆరు గ్రా మాల రైతులకు సంబంధించి వెయ్యి ఎకరాలకు పైగా పంట చేలు ఉన్నాయి. సరైన రోడ్డు సౌకర్యం లేక వానాకాలంలో తీవ్ర ఇబ్బందులు ప డుతున్నాం. పొలంబాటలో భాగంగా రోడ్డు నిర్మా ణం చేపట్టి సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం. – గిర్నూర్ రైతులు, బజార్హత్నూర్(మం) మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులం. మండుతున్న ఎండల తీవ్రతకు పాఠశాలల్లోని మొక్కలను సంరక్షించాల్సి న బాధ్యత మాపై ఉంటుంది. దీంతో సెలవు రోజుల్లోనూ పచ్చదనం, పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించే మాకు ప్రభుత్వం వేసవి సెలవుల్లో వేతనాలు మాత్రం మంజూరు చేయడం లేదు. మా కు న్యాయం చేసేలా చూడాలని కోరుతున్నాం. – ప్రభుత్వ పాఠశాలల స్వచ్ఛ కార్మికులు -
గస్తీ మరింత పటిష్టం చేయాలి..
బంగారం ధర పెరగడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు ప్రస్తుతం గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ మరింతగా పెంచాలి. సీసీ కెమెరాలు సంఘం, పోలీసుల ఆధ్వర్యంలో మరిన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బంగారు దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండడంతోనే చోరీలను నియంత్రించవచ్చు. – లక్ష్మణ్‌రాజు, శ్రీనిధి జ్యూయలరీ యజమాని, ఆదిలాబాద్ ఎమర్జెన్సీ సైరన్ ఏర్పాటు చేసుకోవాలి.. జ్యూయలరీ షాపుల యజమానులు, ఏటీఎం సెంటర్ల వద్ద ఎమర్జెన్సీ సైరన్ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో దుండగులు లోనికి చొరబడి ఆయుధాలతో బెదిరించినప్పుడు అలారం మోగితే చుట్టుపక్కల వారితో పాటు పోలీసులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రతీ షాపు వద్ద సెక్యూరిటీ గార్డులతో పాటు ఎంట్రీవద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో ఆయుధాలు ఉన్నవారిని లోనికి రాకుండా అడ్డుకోవచ్చు. కరీంనగర్లో జరిగిన ఘటనకు సంబంధించి దుండగులు జిల్లా మీదుగా వెళ్తే వారిని పట్టుకోవడానికి పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. – ఎల్.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
నీటి దాత.. సుఖీభవ
ఓ వైపు ఎండల తీవ్రత పెరిగింది. భూగర్భ జలాలు అడుగంటి ప్రజలకు నీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇచ్చోడ టీచర్స్‌కాలనీలో గల ఈ బోరు స్థానికుల నీటి అవసరాలు తీర్చుతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా 15 కనెక్షన్లతో సుమారు 50 ఇళ్లకు నీటిని అందిస్తోంది. రిటైర్డ్ ఆర్మీ జవాన్ జాదవ్ అశోక్ ఇంటి వద్ద ఉన్న ఈ బోరు బావికి మండు వేసవిలోనూ నీటి లభ్యత పుష్కలంగా ఉంటుంది. దీంతో కాలనీవాసులను వాడుకోవాలని సూచించగా వారు ఇలా ఇద్దరు ముగ్గురు కలిపి ఓ కనెన్షన్ చొప్పున ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్లుగా దాదాపు 50 కుటుంబాలకు 24 గంటల పాటు నీటిని అందిస్తున్న అశోక్‌ను పలువురు అభినందిస్తున్నారు. – ఇచ్చోడ -
‘ఉపాధి’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
కై లాస్‌నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను ఐక్యంగా ఎండగట్టాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. వీబీజీ రామ్‌జీ పేరిట తీసుకువస్తున్న కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్‌జీ పేరిట కార్మికుల హక్కులను దెబ్బతీయాలని చూస్తోందన్నారు. గతంలో 95 శాతం వరకు నిధులు కేటాయించిన కేంద్రం, ప్రస్తుతం కేవలం 60 శాతానికి పరిమితం చేస్తూ పథకాన్ని క్రమంగా కనుమరుగుచేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీ కార్మికుల సంక్షేమం కోసం సీపీఎం చేపడుతున్న పోరాటాలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇందులో నాయకులు మల్లేశ్, రాఘవులు, కిరణ్, దత్తు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే అందుబాటులోకి..
మున్సిపల్ పరిధిలో వందలాది వాహనాలు ఉన్నాయి. ప్రతినెలా వాటి నిర్వహణ పేరిట లక్షల్లో ఖర్చవుతుంది. ఇందులో వేలాది రూపాయల దుర్వినియోగం అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే బల్దియా ఆధ్వర్యంలో సొంతంగా గ్యారేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం రూ.50లక్షలు కేటాయించాం. సామగ్రితో పాటు షెడ్ నిర్వహణకు అవసరమైన టెండర్లు నిర్వహిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌కు పనులు కేటాయించి త్వరితగతిన అమలులోకి తెచ్చేలా చూస్తాం. – బండారి అనూష, మున్సిపల్ చైర్పర్సన్ -
సీసీఐ నిర్వాసితులకు న్యాయం చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: సీసీఐ భూ నిర్వాసితులకు న్యా యం చేస్తూ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ‘సీసీఐ పరిశ్రమ కొత్త పరిణామాలు– మన కర్తవ్యం’ అంశంపై ఆదివారం చర్చావేదిక ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. పరిశ్రమ పునరుద్ధరణతో యువతకు ఉపాధి అవకాశాలతో పాటు అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతాయని అన్నారు. ప్రస్తుతం పరిశ్రమను తుక్కు కింద అమ్మే ప్రయత్నం జరుగుతుందని, దానిని సహించబోమని పేర్కొన్నారు. అవసరమైతే నిర్వాసితులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే ఇళ్లను ము ట్టడిస్తామన్నారు. సమావేశంలో సీసీఐ సాధన కమి టీ నాయకులు విజ్జగిరి నారాయణ, కొండ రమేశ్, బండి దత్తాత్రి, నర్సింగ్, అరుణ్‌కుమార్, చారి, రాఘవులు, కిరణ్, తరుణ్‌కుమార్, రమేశ్, వెంకట్‌నారాయణ, పోశెట్టి, ప్రహ్లాద్, ప్రేమల, ఈశ్వర్, నర్సింగ్, శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల విషయంలో రాజకీయం వద్దు
జైనథ్: రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో రాజకీయం చేయొద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మండల కేంద్రంలో ని మార్కెట్ కార్యాలయంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ సహకారంతో ఏర్పాటు చేసి న జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ఆదివా రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధి కారులు జొన్న పంట కొనుగోలు చేపడుతున్న విషయం తెలుసుకొని బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగడం సరికాదన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈవో గంగన్న, ఉపసర్పంచ్ సుభాష్, వివిధ పార్టీల నా యకులు లింగారెడ్డి, జగదీశ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గణేశ్‌యాదవ్, రుకేష్‌రెడ్డి, రాందాస్ పాల్గొన్నారు. -
బల్దియా గ్యారేజ్
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఇక సొంత వాహన గ్యారేజీ అందుబాటులోకి రానుంది. చెత్త సేకరణ, నీటి సరఫరా, ఇతరత్రా వాహనాల మరమ్మతులు, సర్వీసింగ్‌కు బల్దియా ఏటా లక్షలా ది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. చిన్నపాటి మరమ్మతులకు సైతం కొన్నిసార్లు వేలాది రూపాయలు చెల్లిస్తున్నారు. దీంతో బల్దియాపై ఆర్థిక భా రం పడుతుంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని భావించిన మున్సిపల్ నూతన కౌన్సిల్ సొంతంగా గ్యారేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రూ.50లక్షలు కేటాయిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకునేలా.. మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ, నీటి సరఫరాకు సంబంధించిన ట్రాక్టర్లు, ట్రాలీఆటోలు, పొక్లెయిన్లు, ట్యాంకర్లు వందలాదిగా ఉన్నాయి. వీటి నిర్వహణను ప్రైవేట్‌గా చేయిస్తున్నారు. దీంతో ప్రతినెలా మున్సిపల్ నుంచి రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అవసరం లేనప్పటికీ ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది తప్పుడు బిల్లులు సృష్టించి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితులను గుర్తించిన నూతన కౌన్సిల్ సొంతంగా బల్దియా గ్యారేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతనెల 29న నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో రూ.50లక్షలు కేటాయిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. టెండర్లు నిర్వహణకు ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థలం ఎంపిక.. పట్టణంలోని 44వ వార్డు పరిధిలోకి వచ్చే సుందరయ్యనగర్‌లోని రక్షిత మంచినీటి స్థలంలో గల మున్సిపల్ ప్రాంతాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఇప్పటికే అక్కడ తాత్కాలికంగా ప్రహరీ నిర్మించి ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో గ్యారేజీగా రూపుదిద్దనున్నారు. మరమ్మతులకు ప్రత్యేక షెడ్లతో పాటు వాటర్ వాషింగ్ కోసం మిషన్ కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం మరమ్మతు పనులను ఇద్దరు కార్మికులు చేపడుతుండగా, గ్యారేజ్ అందుబాటులోకి వస్తేమరో ఇద్దరిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా అవసరమైన సామగ్రి తెప్పించాలని భావిస్తున్నారు. మొత్తంగా బల్దియాకు సొంతంగా గ్యారేజ్ ఏర్పాటు కానుంది. -
జిల్లాలో..
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే బడుల్లో మౌలిక వసతులపై దృష్టి సారించింది. అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ సైతం బడులు తెరిచే రోజు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే 85 శాతం పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాములకు చేరాయి. ఈనెల 15 నుంచి వాటిని మండల పాయింట్లకు చేర్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే వీటిని రవాణా చేసేందుకు నిధులు విడుదల కాకపోవడంతో అయోమయంలో ఉన్నారు. చేరుకున్న పాఠ్య పుస్తకాలు.. పాఠ్యపుస్తకాల్లో తెలుగు, ఉర్దూ మీడియం వారికి పార్ట్–1 పుస్తకాలను పంపిణీ చేస్తారు. మొదటి విడ త జూన్‌లో పంపిణీ చేయనుండగా, నాలుగైదు నెలల తర్వాత పార్ట్–2 పుస్తకాలు రానున్నాయి. వీటిలో తెలు గు, ఉర్దూ ఒకవైపు ఉండగా, ఇంగ్లిష్‌లో మరోవైపు ముద్రించబడి ఉంటుంది. దీంతో ఆంగ్ల మాధ్య మం చదివే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కొన్నేళ్లుగా ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ఇంగ్లిష్, మరాఠీ, హిందీ మీడియంకు సంబంధించి ఒకేసారి సరఫరా అవుతా యి. అయితే ఈ పుస్తకాలను పార్ట్–1గా విభజించడం ద్వారా బరువు సైతం తగ్గిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీటితో పాటు విద్యార్థులకు నోట్‌బుక్‌లను సైతం ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇవి నేరుగా పాఠశాలలకే సరఫరా కానున్నాయి. మొదటిరోజే పంపిణీ.. ప్రభుత్వం విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి జిల్లా కేంద్రాలకు సరఫరా చేసింది. అయితే ఇక్కడి నుంచి ఎంఆర్సీ పాయింట్లకు, అక్కడినుంచి స్కూళ్లకు సరఫరా చేయాల్సి ఉంది. గ తేడాది పాఠ్య పుస్తకాల పంపిణీలో కొంత ఆలస్యమైంది. ఈసా రి అలా జరగకుండా పుస్తకాలను సరఫరా చేసేందుకు విద్యా శాఖాధికారులు చర్యలు చేపడుతున్నాయి. పుస్తకాల పంపిణీకి గడువు సమీపిస్తుండడంతో పూర్తిస్థాయిలో సరఫరా అవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలాల ఎంఈవోలు గోదాం నుంచి పుస్తకాల ను తీసుకెళ్తుండగా, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, బోథ్, ఇంద్రవెల్లి దూర ప్రాంతాల మండలాలకు సకాలంలో సరఫరా చేస్తే విద్యార్థులకు మొదటిరోజే పుస్తకాలను పంపిణీ చేసే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రాథమిక స్థాయికి సంబంధించిన పుస్తకాలు ఇంకా పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. సకాలంలో పుస్తకాలు పాఠశాలలకు చేరుకుంటే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. జిల్లాలో.. మొత్తం పాఠశాలలు : 1,439 రావాల్సిన పాఠ్యపుస్తకాలు : 4,80,700 ఇప్పటివరకు చేరుకున్నవి : 4,10,000 ఇంకా రావాల్సినవి : 70,700డీఈవో పరిధిలో 702 పాఠశాలలు ఉండగా, మిగతా అన్ని యాజమాన్యాలు కలిపి 1,439 ఉన్నాయి. కాగా ప్రైవేట్ మినహా మిగతా యాజమాన్యాలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. జిల్లాకు అవసరమైన పుస్తకాలు 4లక్షల 80వేల 700 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4లక్షల10వేల పుస్తకాలు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం గోదాంతో పాటు మార్కెట్ యార్డులో వీటిని భద్రపర్చారు. ఈనెల 15 నుంచి ఆయా పాఠశాలలకు సరఫరా చేసేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే రవాణా చార్జీలు విడుదల కాకపోవడంతో సరఫరా ఏవిధంగా చేయాలనే ఆలోచనలో పడ్డారు. గతేడాది డీసీఈబీ నుంచి నిధులను సమకూర్చారు. -
ప్రశాంతంగా నీట్
● 48 మంది విద్యార్థుల గైర్హాజరు ● కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ కై లాస్‌నగర్: వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష (నీట్) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 1700 మంది దరఖాస్తు చేసుకోగా వారి కోసం జిల్లా కేంద్రంలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు సాగింది. బయోమెట్రిక్ అటెండెన్స్ నేపథ్యంలో విద్యార్థులను ఉద యం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్ణీత సమయం ము గిసిన వెంటనే గేట్లను మూసివేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చే సిన లోనికి అనుమతించారు. పరీక్షకు 1652 మంది హాజరుకాగా 48 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ సంయుక్తంగా పరిశీలించారు. నిర్వహణపై ఆరా తీఽశారు. వారి వెంట అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, కో–ఆర్డినేటర్ అశోక్ పాల్గొన్నారు. ముగిసిన టీజీఆర్జేసీ ప్రవేశ పరీక్ష ఆదిలాబాద్‌టౌన్: టీజీ ఆర్జేసీసెట్ ఆదివారం ప్ర శాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఇందు కోసం జిల్లా కేంద్రంలో 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల కోసం మొత్తం 4,617 మంది దరఖాస్తు చేసుకోగా, 3,426 మంది హాజరైనట్లు డీఈవో రాజేశ్వర్ తెలిపారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
బోథ్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా 439 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను, బోథ్ మండలానికి చెందిన 235 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. త్వరలోనే బోథ్‌లో నూతన ఫైర్ స్టేషన్ నిర్మాణం కానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆత్మ చైర్మన్ రాజు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని నేరేడిపల్లి, పరుపులపల్లె గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలు విన్నవించారు. పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. శ్రీధర్ రెడ్డి, శంకర్, సర్పంచ్‌లు విశ్వేశ్వర్రావ్,కృష్ణ, ఉప సర్పంచ్ దర్ము తదితరులు పాల్గొన్నారు. రైతులకు తక్షణ సాయం అందించాలి నేరడిగొండ: నియోజకవర్గంలో ఇటీవల అగ్నిప్రమాదాలతో పంట పొలాల్లో వ్యవసాయ పనిము ట్లు, స్ప్రింక్లర్ పైపులు అగ్నికి ఆహుతైన ఘటనపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పందించారు. జిల్లా హార్టికల్చర్ అధికారులతో శనివారం చర్చించారు. తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. -
సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి
కై లాస్‌నగర్: జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదిలాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని స్థానిక ఎస్టీయూ భవన్లో నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ అనూషతో కలిసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు యంత్రాంగం నిరంతరం గ్రామాలను సందర్శించాలన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రజల నుంచి అందిన ప్రతీ దరఖాస్తును నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే దరఖాస్తుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు వివిధ పథకాల ప్రయోజనాలను అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన అంగన్వాడీల స్టాళ్లను తిలకించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో టీజీఎస్సీపీసీఆర్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్, అదనపు ఎస్పీ పి.సురేందర్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌రావు, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి నియంత్రణపై ఫోకస్
కై లాస్‌నగర్: పట్టణ పరిధిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.. అలాగే ఆదిలాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు చర్యలు చేపడుతాం.. బల్దియా ఆదాయం పెంచే దిశగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని అన్నారు ఇటీవల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జగదీశ్వర్‌గౌడ్. శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: మరో వారం, పది రోజుల్లో పట్టణంలోని పలు కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశముంది.. నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతారు? కమిషనర్: ప్రస్తుతం మిషన్ భగీరథ నీటితో పాటు లాండసాంగ్వి, మావల నుంచి కూడా నీటి సరఫరా జరుగుతుంది. సమస్య తలెత్తితే ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తాం. సాక్షి: పట్టణంలోని 49 వార్డులకు ఒకే శానిటరీ ఇన్స్పెక్టర్ ఉండటంతో పర్యవేక్షణ లోపించి పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పుతుందనే విమర్శలున్నాయి.. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కమిషనర్: త్వరలోనే శానిటరీ ఇన్స్పెక్టర్తోపాటు జవాన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తా. అలాగే చెత్త సేకరణ కోసం కొత్తగా ఐదు ఎలక్ట్రికల్ ఆటోలు, ట్రాక్టర్లను కొనుగోలు చేయాలనుకుంటున్నాం. ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దు. ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికే అప్పగించాలి. పట్టణ పరిశుభ్రతకు అందరూ సహకరించాలి. సాక్షి: గ్రేడ్–1 స్థాయి కలిగిన మున్సిపల్లో ఆదాయం పెంపుకోసం ఎలాంటి కార్యాచరణ చేపడుతారు..? కమిషనర్: ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్, నల్లా బిల్లులు సకాలంలో వసూలు చేసేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తాను. ప్రధానంగా జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా ఇళ్లను సర్వే చేయిస్తాను. అలాగే ప్రచార హోర్డింగ్‌లకు సంబంధించి పన్నులను సైతం రెగ్యులర్‌గా రాబట్టేలా చూస్తాను. తద్వారా ఆదాయం పెరిగే అవకాశముంటుంది. సాక్షి: కార్యాలయంలో పలువురు అధికారులతో పాటు ఉద్యోగులు సైతం సమయపాలన పాటించడం లేదనే విమర్శలున్నాయి.. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? కమిషనర్: క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు మినహా మిగతా వారంతా సమయపాలన పాటించాలి. కార్యాలయంలో విధిగా అందుబాటులో ఉండాలి. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై తప్పకుండా తగు చర్యలు తీసుకుంటాం.సాక్షి: పలు కాలనీల్లో లీకేజీల ద్వారా మిషన్ భగీరథ నీరు వృథాగా పోతుంది.. వాటిని ఎలా అరికడుతారు? కమిషనర్: లీకేజీలు గుర్తించేందుకు వార్డుల వారీగా స్పెషల్ డ్రైవ్‌తో పాటు అవసరమైన చర్యలు చేపడుతాం. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. సాక్షి: పట్టణంలో చాలా చోట్ల ఆక్రమణలు పెరిగి రోడ్లు ఇరుకుగా మారాయి.. వాటిపై ఎలాంటి చర్యలు చేపడుతారు? కమిషనర్: ఆక్రమణల విషయాన్ని చైర్పర్సన్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. -
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
సాక్షి, ఆదిలాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు సాగు సంబంధిత అంశాల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1600 గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 60 జీపీల్లో చేపడుతుండగా, ఇప్పటికే 10 గ్రామాల్లో పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వ్యవసాయ వర్సిటీ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏప్రిల్ 27న మొదలు కాగా, మే 23 వరకు కొనసాగనున్నాయి ప్రధాన ఉద్దేశాలు.. యూరియా వాడకం తగ్గించడం, పంట మార్పిడి పాటించడం, సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటించి రైతులను అవగాహన పరిచే దిశగా కృషి చేస్తున్నారు. ఆరు బృందాలుగా.. జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఆరు బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఇందులో వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, జిల్లాలోని వ్యవసాయ కళాశాల బోధన సిబ్బంది పాల్గొని రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు. ప్రాధాన్యత అంశాలు.. -
రోడ్డెక్కిన రైతులు
కై లాస్‌నగర్(బేల): జొన్న, శనగ పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం రోడ్డెక్కి ఆందోళనకు దిగా రు. బేల మండలంలోని సిర్సన్న, కొబ్బాయి జాతీ య రహదారిపై బైఠాయించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో సమాచారం అందుకున్న పో లీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారుల ను సముదాయించారు. మార్కెటింగ్ అధికారులతో మాట్లాడించి ఆందోళన విరమింపజేవారు. వీరి ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడు తూ, పంట కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఇందులో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భోరజ్‌లో.. సాత్నాల: జొన్న కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. భోర జ్ మండలం మాండగడ జాతీయ రహదారిపై రా స్తారోకో నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ, పంటకోత పూర్తయినా కొనుగోలు కేంద్రాలు ప్రా రంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నాఫెడ్ అధికారులు వచ్చి కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇందులో రైతులు ప్రహ్లాద్, ఊషన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘రైతులు రోడ్డెక్కితేనే పంటల కొనుగోళ్లు’ ఆదిలాబాద్‌టౌన్: రెతులు తమ పంటలను కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కితే తప్ప ప్రభుత్వంలో చలనం రావడం లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాద వ్, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరసనలు చేపట్టడంతోనే ప్రభుత్వం దిగివచ్చి కొనుగోళ్లు ప్రారంభించేందుకు చర్యలు చేపడతుందన్నారు. ఇందులో పార్టీ నాయకులు నారాయణ, ప్రహ్లాద్, రమేష్, గంగయ్య, ప్రశాంత్, దయానంద్, ఎస్కే కలీమ్ తదితరులున్నారు. కై లాస్‌నగర్: రహదారిపై బైఠాయించిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు -
అప్రమత్తతతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట
ఆదిలాబాద్‌టౌన్: అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గడిచిన వారం రోజుల్లో చోటుచేసుకున్న సైబర్ నేరాల వివరాలను శనివారం వెల్లడించారు. ప్రస్తుతం అనేక రకాలుగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ఈ మేరకు ప్రజలు అప్రమత్తతగా ఉండాలని సూచించారు. బాధితులు మోసానికి గురైన గంటలోపు 1930లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘గోల్డెన్ అవర్‘ లోపు స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్ము తిరిగి రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం జాబ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఓటీపీ ఫ్రాడ్, ఏపీకే ఫైల్స్ ఫ్రాడ్, బిజినెస్ లోన్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, హనీ ట్రాప్, మనీలాండరింగ్ వంటి వాటితో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి సందేహలున్నా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. గంజాయి రహిత జిల్లా లక్ష్యం ఆదిలాబాద్‌టౌన్: జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జి ల్లా పోలీస్ కార్యాలయంలో గత నెల రోజుల్లో నమోదైన గంజాయి కేసుల వివరాలను శని వారం వెల్లడించారు. గత నెలలో 16 కేసులు నమోదు కాగా 28 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే గంజాయికి బానిసైన 14 మందిని కోర్టు ద్వారా 30 రోజులపాటు డి అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. జిల్లాలో గంజాయిని కనుమరుగు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో 60 మంది సస్పెక్ట్ షీటర్లు, రౌడీ షీటర్ల ను తనిఖీ చేయగా 15 మంది గంజాయి సేవించినట్లు తనిఖీలో తెలిందన్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


