సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు పెంచాలి

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

ఇంద్రవెల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణా లు పెంచాలని కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. మండలకేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ స్కూల్‌లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి కలెక్టర్‌ రాజర్షి షా హాజరయ్యారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థు ల సంఖ్య పెంపు, వసతుల కల్పన తదితర అంశాలపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు వా రి తల్లి దండ్రులను శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. అనంతరం మండలకేంద్రంలో చేపట్టిన జనగణన సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీడీవో జీవన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ముఖడే ఉత్తం, సర్పంచ్‌ రాథోడ్‌ మోహన్‌సింగ్‌, ఉప సర్పంచ్‌ తిట్టే సుమిత్‌, హెచ్‌ఎం రవీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement