breaking news
Adilabad District News
-
మద్యానికి దూరంగా.. అంతా ఒక్కటిగా
ఆదిలాబాద్ (బేల): మద్యం మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు మండలంలోని చప్రాల గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. గ్రామంలో మద్యం విక్రయాలు, వి నియోగాన్ని నిషేధించాలని శనివారం ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్ మెస్రం దౌలత్, ఉప స ర్పంచ్ టాక్రే సాగర్ ఆధ్వర్యంలో గ్రామ సంక్షేమం, కుటుంబాల భవిష్యత్‌పై చర్చించారు. మద్యం వల్ల కుటుంబాల్లో కలిగే సమస్యలను అరికట్టి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు హేమంత్ పటేల్, గెడం సూర్యభాన్, మెస్రం శ్రీకాంత్, దోటే ఆకాష్, శాలిక్ నాకతే, మహిళలు లక్ష్మి అనకే, పంచపూల, మెస్రం యశోద, తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన పత్తి, కంది
సాక్షి, ఆదిలాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా పత్తి, సోయా కాకుండా ఆరు తడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించినప్పటికీ జిల్లా రైతులు అనవాయితీనే కొనసాగించారు. పత్తి గతేడాది మించి సాగు కాగా, కంది కూడా కొంత పెరిగింది. సోయా, మొక్కజొన్న మాత్రం తగ్గింది. మరోవైపు జిల్లాలో సాగు విస్తీర్ణం వందశాతానికి చేరువైంది. తెల్లబంగారంపై తగ్గని మురిపెం తెల్ల బంగారాన్ని మురిపెంగా భావించే జిల్లా రైతులు వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి ఒడిదొడుకులు ఉన్నా తమ సాగును మాత్రం మార్చేది లేదనేది స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా పత్తి, సోయా పంటల విస్తీర్ణాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ సీజన్ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. రైతులు మాత్రం పత్తి వైపే మొగ్గు చూపారు. కంది కూడా కొంత మేర పెరిగింది. ఇది సాధారణ అంచనా మాత్రమే.. వానాకాలంలో సాగయ్యే సాధారణ సాగు విస్తీర్ణం అంచనాను వ్యవసాయ శాఖ ముందుగా ప్రకటిస్తుంది. గతేడాదిలో సాగైన పంటల లెక్కల ప్రకారం అంచనా వేస్తుంది. డిజిటల్ క్రాప్ సర్వే తర్వాత కచ్చితమైన వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. బయటపడినట్లేనా .. ఈ వానాకాలంలో 30శాతం మేర లోటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పంటల సాగు విషయంలో రైతులకు పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. సంప్రదాయ పంటలు కాకుండా ఆరుతడి వైపు దృష్టి సారించాలని సూచించారు. వర్షాకాలం సీజన్ మొదలైన తర్వాత మృగశిర కార్తె ప్రవేశంతో జిల్లా రైతులు 20 నుంచి 30 శాతం వర కు విత్తనాలు నాటారు. మొదటి మూడు వారాలు సరైన వర్షాలు లేకపోవడంతో పలువురు రైతులకు విత్తన నష్టం చేకూరింది. మళ్లీ వర్షాభావం ఉన్నప్పటికీ రెండో సారి కూడా పలువురు విత్తనాలు విత్తారు. జూన్ చివరలో మంచి వర్షం కురువడంతో ఊపిరి పీల్చుకున్నారు. జూలై మొదట్లోనూ వర్షాలు పర్వలేదనిపించాయి. ఈ క్రమలో సాగు విస్తీర్ణం సాధారణ అంచనాకు చేరుకుంది. ఆ తర్వాత వరుణుడి జాడ కానరాక మొలకెత్తిన మొక్కలు వాడిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ తరుణంలో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పంటలు నిలిచాయి. ప్రస్తుతం జిల్లా అంతటా పత్తి, సోయా ఇతర పంటల మొలకలు చేలల్లో కనిపిస్తున్నాయి. రైతులు సాగు బీజీలో ఉన్నారు. ముందు ఎలా ఉంటుందో .. జిల్లాలో ప్రస్తుతం సాధారణ వర్షపాతం నమోదు కావడంతో సాగుపరంగా పరిస్థితులన్నీ అనువుగా ఉన్నాయి.సాత్నాల పూర్తిస్థాయిలో నిండకపోయినా మరో మధ్యతరహా ప్రాజెక్ట్ మత్తడివాగు నిండుకుండలా మారింది. చెరువులుకూడా 75శాతంపైగా నిండాయి. భూగర్భజలాలు పర్వలేదనిపిస్తున్నాయి. ఇ ప్పటికై తే పరిస్థితులన్నీ రైతుకు అనువుగా ఉన్నా యి. ఎల్‌నినో నేపథ్యంలో మళ్లీ ఆ ప్రభావం ఉంటుందా అనే ఆందోళన కూడా లేకపోలేదు. -
హెడ్‌కానిస్టేబుళ్లకు పదోన్నతి
కై లాస్‌నగర్: జిల్లాలో పనిచేస్తున్న తొమ్మిది మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదో న్నతి లభించింది. అత్తఉల్లాఖాన్, బి.తులసీ రామ్, పి.ఆదిలక్ష్మి, ఎం.రాధ, కె.జయశ్రీ, ఎం. కోటేశ్వరరావు, ఎం.గోవింద్, డి.రమేశ్, జయకిష్టుకు పదోన్నతి కల్పిస్తూ బాసర జోన్ డీఐజీ ఆర్.భాస్కరన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వారికి పదోన్నతి చిహ్నమైన స్టార్లను శనివారం అలంకరించి అభినందించారు. మరింత ఉత్సాహంతో, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, పోలీ స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, జైస్వాల్ కవిత తదితరులు పాల్గొన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో సూచించారు. కేటుగాళ్లు అనేక పద్ధతుల్లో అమాయకులను మోసం చేస్తున్నారని తెలి పారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఖాకీ కిడ్స్ పేరిట సిబ్బంది గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీకే ఫైల్స్, తెలియని లింక్స్‌ను వాట్సప్‌లో, టెలిగ్రామ్‌లో వినియోగించడం ద్వారా మొబైల్ ఫోన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి అకౌంట్లు ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలి పారు. ఈ వారం వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 38 ఫిర్యాదులు నమోదైనట్లు పేర్కొన్నారు. సైబర్‌నేరం జరిగిన వెంటనే 1930 లేదా జాతీయ సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
బిల్కగూడెం.. అభివృద్ధికి దూరం
దండేపల్లి: ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా దండేపల్లి మండలం లింగాపూర్ జీపీ పరిధిలోని బిల్కగూడెం మాత్రం అభివృద్ధికి దూరంగానే ఉంది. గూడెంలో సుమారు 17 కుటుంబాలు, 80కి పైగా జనాభా నివాసం ఉంటున్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు లేవు. గ్రామంలోని గిరిజనులకు వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకునే స్థోమత లేకపోవడంతో ఓ గుత్తేదారును ఆశ్రయించగా అసంపూర్తిగా నిర్మించి వదిలేశాడు. ఆర్థిక స్థోమత లేని వారు అలాగే వదిలేయగా, కొందరు ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకుని అందులో నివాసం ఉంటున్నారు. గ్రామంలో మరుగుదొడ్లు మచ్చుకై నా లేవు. గూడెంలో చాలా కుటుంబాలకు పక్కా ఇళ్లు లేవు. గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. గుడిసెలో ఉంటున్నాం మాకు ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇత్తం అంటున్నా రు. కానీ ఇప్పటికై తే ఇయ్యలేదు. గుడిసెలో ఉంటున్నాం. చిన్న పిల్లగాండ్లు ఉ న్నరు. చాలా ఇబ్బంది అయితంది. మొదటి విడతలో ఇత్తమన్నరు, రెండో దాంట్లో ఇత్తమన్నరు. ఇ ప్పటికీ ఇల్లు ఇయ్యలేదు. – ముడితె రజిత, బిల్కగూడెం -
● ఆరేళ్ల నిరీక్షణకు తెర ● పింఛన్ దరఖాస్తుల స్వీకరణ షురూ ● సర్కారు ఆదేశాలతో అర్హుల్లో హర్షం
కై లాస్‌నగర్: చేయూత పింఛన్ల కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆగస్టు 15నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు జారీచేసింది. గతంలో ఆన్లైన్లో, ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకు న్న వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సెలవు రోజైనప్పటికీ శనివారం నుంచే స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులు పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీవోకు, పట్టణ ప్రాంతాల్లోని వారు మున్సి పల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో సూచించారు. అర్హులేవరంటే ... ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు , ఫైలేరియా, డయాలసిస్, సికిల్‌సెల్, హిమోఫిలియా వ్యాధిగ్రస్తులు చేయూత పింఛన్‌కు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. వితంతు, ఒంటరి మహిళల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. చేనేత, గీత కార్మికులైతే 50 ఏళ్లు పూర్తికావా లి. సాగు భూమికి సంబంధించి మెట్ట 3.5 ఎకరాలు, మగాణి 7.5 ఎకరాలకు మించి ఉండరాదు. గ్రామీణ ప్రాంతాల్లోని వారి కుటుంబ వార్షికాదా యం రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వారైతే రూ.2లక్షల లోపు ఉండాలి. ఇక ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేట్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న పిల్ల ల తల్లిదండ్రులు అనర్హులు. అలాగే అయిల్, రైస్ మిల్లులు, పెట్రోల్ బంక్‌లు, రిగ్ యజమానులు, ఇప్పటికే ప్రభుత్వ పింఛన్ లేదా స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందేవారు కూడా అనర్హులే. దరఖాస్తు విధానమిలా.. ● దరఖాస్తు ఫారాలను మున్సిపల్, ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయాల్లో ఉచితంగా అందజేస్తా రు. వాటిని పూర్తి చేసి వితంతువులైతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం జతచేయాలి. ● ఒంటరి మహిళలైతే విడాకులు తీసుకున్న, భర్త వదిలేసిన వారు 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులు. భర్త నుంచి వేరుగా ఉంటున్నట్లు తహసీ ల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం జతచేయాలి. అవివాహితులైతే గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు పైబడిన వారు పంచాయతీ కార్యదర్శి, వార్డు అధికారి ధ్రువీకరణ పత్రం జతచేయాలి. ● దివ్యాంగులకు వయస్సుతో సంబంధం లేదు. 40శాతం వైకల్యం కలిగి (వినికిడిలోపమైతే 51శాతం) ఉండాలి. సదరం, యూడీఐడీ సర్టిఫికెట్ తప్పనిసరి. వీరంతా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ● గ్రేడ్–1, 2 ఫైలేరియా బాధితులకు వయస్సుతో సంబంధం లేదు.వైద్యఆరోగ్యశాఖలో నమోదై, ధ్రు వీకరణ పత్రం కలిగి ఉండాలి. వీరు దరఖాస్తులను డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే అందజేయాలి. ● డయాలిసిస్, సికిల్‌సెల్, హిమోపిలియో వ్యాధిగ్రస్తులు ధ్రువీకరణ పత్రాలతో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో దరఖాస్తు చేసుకోవాలి. ఇవి తప్పనిసరి .. అప్లికేషన్ ఫారంపై దరఖాస్తుదారుని ఫొటోను జతచేయాలి. ఆధార్‌కార్డు, వినియోగంలో ఉన్న బ్యాంకు పాస్‌బుక్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, ఓటర్ ఐడీ కార్డులను తప్పసరిగా జతచేయాల్సి ఉంటుంది. ‘చేయూత’కు వేళాయెమున్సిపల్ కార్యాలయంలో కౌంటర్లు ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఐదు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చైర్పర్సన్ అనూ ష పరిశీలించారు. ప్రతి పది వార్డులకు ఒకటి చొప్పున ఆన్లైన్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల ను వార్డు అధికారులు పరిశీలించి, అర్హత కలి గి న వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్వో కల్యాణ్, ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. -
పుస్తకావిష్కరణ
బాసర: విద్యాపాలన, నైతిక నాయకత్వం, పరిశోధన రంగాలు మరిన్ని ఉన్నత శిఖరా లను అధిరోహించేలా రూపొందించిన హ్యాండ్‌బుక్ ఫర్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వాల్యూమ్–1 పుస్తకాని శనివారం బాసర ఆర్జీయూకేటీలో ఆవిష్కరించారు. వైస్‌చాన్స్‌లర్ ఏ.గోవర్ధన్ రచించిన ఈ గ్రంథాన్ని ఆయనతో పాటు ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అసోసియేట్ డీన్లు, వివిధ విభాగాల అధిపతులు (హెచ్ఓడీలు), అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. నేడు కడెం నీటి విడుదల జన్నారం: ఈ నెల 8న ‘ఆయకట్టు ఎదురు చూస్తోంది’ శీర్షి కన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించారు. ఈ నెల 9 ఆదివారం నుండి కడెం ప్రాజెక్టు నీటిని విడుదల చేయనున్నట్లు తెలి పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పేండ్‌పెల్లిలో చోరీ భైంసారూరల్: మండలంలోని పేండ్‌పెల్లిలో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు బెల్ట్షాప్లో దూరి రూ.20 వేల విలువైన మద్యం, పుల్లొల్ల మౌలాజీ ఇంట్లో 1.5 తులాల బంగారం, రూ.60 వేల నగదు ఎత్తుకువెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఒక్కరోజే మూడు చోట్ల చోరీ జరగడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. -
గుడుంబా స్థావరాలపై దాడులు
ఖానాపూర్: మండలంలోని కొమ్ముతండా, రంగంపేట తండా, సత్తన్‌పల్లి, గోసంపల్లి, ఏర్వచింతల్, బీర్నంది, కోలంగుడ, పాత ఎల్లాపూర్ గ్రామాల్లో శనివారం ఎకై ్సజ్, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఆదిలాబాద్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ దాడుల్లో 6 కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ రంగస్వామి తెలిపారు. 13 లీటర్ల గుడుంబా స్వాధీ నం చేసుకుని వెయ్యి లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దా డుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ అక్బర్ హుస్సేన్, ఎస్సైలు వసంతరావు, సింధు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయిలో మనోళ్ల సత్తా
ఆదిలాబాద్: హన్మకొండలో ఇటీవల నిర్వహించిన 12వ తెలంగాణ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–18 బాలికల విభాగంలో టీజీటీడబ్ల్యూఆర్జేసీ ఇంద్రవెల్లి బాలికల కళాశాలకు చెందిన అజ్మీరా రమ్య రేస్‌వాక్‌లో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. అదే కళాశాలకు చెందిన రాథోడ్ అంకిత అండర్–18 బాలికల హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకం కై వసం చేసుకుంది. క్రీడాకారిణులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, కార్యదర్శి రాజేశ్, కోచ్ వీజీఎస్ రాకేష్, పీడీ సౌమ్య ప్రత్యేకంగా అభినందించారు. -
ఫీ‘జులుం’.. ఆగేనా?
ఆదిలాబాద్‌టౌన్ : ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల వసూళ్లకు సంబంధించి పారదర్శకత తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫీజుల దోపిడీకి చెక్ పెట్టేలా చర్యలు చేపట్టింది. విద్యార్థుల నుంచి ఏయే రకాల ఫీజులు వ సూలు చేస్తున్నారో పూర్తి వివరాలను ఆయా విద్యాసంస్థల నోటీస్‌బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు వెబ్సైట్లోనూ పొందుపరచాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ప్రైవేట్‌లో పిల్ల లను చదివించే తల్లి దండ్రుల్లో హర్షం వ్యక్తమవుతుంది. అయితే జిల్లాలో ఈ నిబంధన ఎంతవరకు అమలవుతుందనేది వేచి చూడాల్సిందే. ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు.. ఏటా విద్యా సంవత్స రం ప్రారంభం కాగానే ప్రైవేట్ పాఠశాలల యా జమాన్యాలు అధిక ఫీజు లు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తున్నా యి. అడ్మిషన్, స్కూల్, పరీక్ష ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాం, రవాణా వంటి వాటి పేరిట ఇష్టానుసారం బాదేస్తున్నారు. అయితే ఏ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారు.. ఎంత వసూలు చేస్తున్నారు.. విద్యా సంవత్సరానికి మొత్తం ఎంత ఖర్చవుతుంది అనే విషయాల్లో స్పష్ట త లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈపరిస్థితుల్లో ఫీజుల వివరాలు ముందుగానే బహిరంగంగా వెల్లడించడం వల్ల తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితికనుగుణంగా పాఠశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. వెల్లడించాల్సిందే.. ప్రభుత్వ తాజా ఆదేశాలతో విద్యాసంస్థలు ఫీజుల విషయంలో స్పష్టమైన సమాచారాన్ని తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. నోటీస్‌బోర్డుపై ప్ర దర్శించడంతో పాటు ఆయా పా ఠశాలల వెబ్సైట్లులలోనూ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమలే కీలకం.. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు ఎలా జరుగుతుందనేదే కీలకంగా మారింది. జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలు పాటించేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రకటించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ ఆదేశాల లక్ష్యం నెరవేరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల వివరాలుఎయిడెడ్ 02 ఆన్ ఎయిడెడ్ 184 సీబీఎస్ఈ సిలబస్‌తో కూడినవి 02ఇంకా ఆదేశాలు అందలేదు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించి యాజమాన్యాలు వసూలు చేసే ఫీజుల వివరాలను తప్పనిసరిగా నోటీసుబోర్డులో ఉంచడంతో పాటు వెబ్సైట్లోనూ పొందుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లగా తెలిసింది. అయితే మాకు ఇప్పటి వరకు దానిపై ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఉత్తర్వులు అందిన వెంటనే అన్ని పాఠశాలలను తనిఖీ చేసి పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. – మాధవి, జిల్లా విద్యాశాఖ అధికారి కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో వివిధ పేర్లతో అదనపు వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులు అడపదడపా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పాఠశాలలో వసూలు చేస్తున్న మొత్తం ఫీజు ఎంత? అందులో ఏయే అంశాలకు ఎంత మొత్తం కేటాయించారు? అనే వివరాలు స్పష్టంగాా ఉంటే తల్లిదండ్రులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దీంతో అనవసరమైన లేదా అనుమతిలేని వసూళ్లకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదనపు వసూళ్లకు అడ్డుకట్ట పడేనా..? -
వెదురు.. ఉపాధికి ఆదరువు
నార్నూర్: అడవితో మమేకమై జీవించే గిరిజనులు తరతరాలుగా వెదురుతో ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తూ తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. ఒకప్పుడు ఇంటి అవసరాలకే పరిమితమైన ఈ కళకు ఆధునిక రూపునిస్తూ.. మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తే గిరిజనులకు మంచి ఆదాయవనరుగా మారుతుందనే ఉద్దేశంతో నడ్డంగూడలో ‘కుమురం సూరు’ వెదురు ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ పథకంలో భాగంగా..నార్నూర్ మండలంలోని నడ్డంగూడలో నీతి ఆయో గ్ పథకంలో భాగంగా ‘కుమురం సూరు’ వెదురు ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2026 ఏప్రిల్ 21న కలెక్టర్ రాజర్షి షా కేంద్రాన్ని ప్రారంభించారు. స్కిల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 40 మంది గిరిజనులు వెదురు ఉత్పత్తుల తయారీలో శిక్షణ పొందుతున్నారు. సంప్రదాయ నైపుణ్యానికి ఆధునిక డిజైన్‌ను జోడిస్తూ కొత్త ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పిస్తున్నారు. బొంగుతో బోలెడు కళాఖండాలుఆదివాసీ జీవనంలో వెదురుకు ప్రత్యేక స్థానం ఉంది. పండుగలు, వివాహాలు, వ్యవసాయ పనులు, గృహ అవసరాల్లో వెదురుతో చేసిన వస్తువులు విస్తృతంగా వినియోగిస్తారు. వెదురు బొంగులతో కేవలం బుట్టలు, చాపలే కాకుండా ఆధునిక అవసరాలకు అనుగుణంగా సెల్‌ఫోన్ స్టాండ్లు, బ్యాంగిల్ స్టాండ్లు, పెన్ స్టాండ్లు, గృహాల నమూనాలు, ఎడ్లబండ్లు, నాగళ్లు, వివిధ రకాల పక్షుల ఆకృతులు, తదితర కళాఖండాలు తయారు చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ కళను నేటి మార్కెట్ అవసరా లకు అనుగుణంగా తీర్చిదిద్దితే యువతకు ఉపాధి లభించడంతోపాటు కనుమరుగవుతున్న సంప్రదా య కళకు పునరుజ్జీవం లభిస్తుంది. మార్కెట్ సౌకర్యం కల్పిస్తే గిరిజనులకు ఆదాయం పెరగడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి.ఆదివాసీ కళకు కొత్త చిరునామా..అడవుల్లో సహజంగా లభించే వెదురును ముడి పదార్థంగా వినియోగించి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా గిరిజనుల సంప్రదాయ జ్ఞానానికి వాణిజ్య రూపం లభిస్తోంది. పర్యావరణహితమైన వెదురు ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తే ప్లాస్టిక్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ గిరిజన ‘కళను కాపాడుతూ.. ఉపాధిని పెంచుతూ.. సంప్రదాయాన్ని నిలబెడుతూ’ ముందుకు సాగుతున్న నడ్డంగూడ ‘కుమురం సూరు’ కేంద్రం ఆదివాసీ స్వావలంబనకు ఓ మంచి ఉదాహరణగా నిలుస్తోంది. -
కరెంటు లేకున్నా.. సాగులో మిన్న
కడెం: మండలంలోని మారుమూల గ్రామమైన మిద్దెచింతకు అనేక ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఆదివాసీ గిరిజనులు అంధకారంలోనే జీవిస్తున్నారు. అయినప్పటికీ ఆయిల్ ఇంజన్లతో పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయిల్ ఇంజిన్లతో సాగుకడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మిద్దెచింత గ్రామానికి వెళ్లాలంటే ఉడుంపూర్ ప్రధాన రహదారి నుంచి మూడు కిలోమీటర్లు అటవీప్రాంతం గుండా వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాలి. గ్రామంలో సుమారు 35 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వారంతా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. భూములకు సాగునీరు అందించేందుకు చెరువులు, కాలువలు లేవు. వ్యవసాయ బావులే ఆధారం. గతంలో రాటు బొక్కెనలతో సాగు నీటిని అందించారు. కొన్నేళ్లుగా ఆయిల్ ఇంజిన్లను ఏర్పాటు చేసుకుని జొన్న, పత్తి, నువ్వులు, కందులు, ఇతర పప్పు దినుసులు పండిస్తున్నారు. అటవీచట్టాల అడ్డంకితో ఈ గ్రామం విద్యుత్ సౌకర్యానికి నోచుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. -
గూడు గోడు పట్టించుకోవట్లేదు..
ఆదివాసీలు ఏళ్లుగా అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ అటవీ ఉత్పత్తులు, పోడు వ్యవసాయం చేసుకుంటూ పూరి గుడిసెల్లో నివాసముంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసినా అటవీశాఖ అభ్యంతరంతో గూడు నిర్మాణానికి దూరమవుతున్న పరిస్థితి. ఇలాగైతే ఆదివాసీల అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది. – కుమ్ర రాజు, ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంక్షేమ ఫలాలు అందడం లేదుఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేకంగా ఐటీడీఏ ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షగా మారాయి. ఏటా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాలకులు హామీలు ఇస్తున్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ఇప్పటికీ అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. తాగునీటికి తిప్పలు తప్పట్లేదు. విద్య, వైద్యం కూడా అంతంతే. చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందక రక్త హీనతతో బాధపడుతున్నారు. – మెస్రం శంకర్, ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకుడు ఆదివాసీల అభ్యున్నతికి కృషి ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా పీవీటీజీ తెగలకు చెందిన వారి అభ్యున్నతి, స్థితిగతులు, గూడెల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తుంది. ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా సమీక్షిస్తూ ఆదివాసీల సంక్షేమానికి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నాం. – గోడం నగేశ్, ఎంపీ -
అడవి బిడ్డలు.. సంస్కృతి పరిరక్షకులు
ఉట్నూర్‌రూరల్: ఆదివాసీలు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకుంటూ భావితరాలకు అందిస్తున్నారు. ఆదివాసీ పండుగలు, పాటలు, సంగీతం, ఆటలు, భాష యాస కథలు, వస్త్రాధారణలు, ఆభరణాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. తుడుంగోండులు పెర్సాపేన్ పండుగను దండారీ డప్పుల దరువులతో నిర్వహిస్తుంటారు. కొలాములు పోలకమ్మ పండుగ, భీమయ్యక్ ఉత్సవం (సట్టి దెయ్యాల్), దండారీ, దసరా పండుగల్లో తుడుం మోగిస్తారు. గోండులు జంగుబాయి, పెర్పాపేన్, దండారి ఉత్సవాలల్లో తుడంను డోలుకు సహా వాయుద్యంగా మోగిస్తుంటారు అలాగే డెంసా నృత్యం చేస్తారు. కిక్రి వాయిద్యంగోండి సంప్రదాయాలకు, గౌరవానికి ఇది సంకేతం. గోండి పూజారులైన ప్రధాన్‌లు కర్మకాండలు, వి వాహాలు, చావులు, ఉత్సవాల్లో దీనిని వాయిస్తారు. డోలుడోలు లేని ఆదివాసీ ఊరు ఉండదు. డోలు వాయిద్యానికి ప్రత్యేకమైన జానపద నృత్యాలు, గేయాలు ఉంటాయి. ఆదివాసీల దహన సంస్కారాల్లో వాయిస్తారు. ఒక్కో కార్యానికి ఒక్కోతీరు ఉంటుంది. డోల్కి జోరుడోల్కి వాయిద్యం ఆదివాసీ వివాహ వేడుకల్లో రాత్రి వేళల్లో నృత్యం చేయడానికి వినియోగిస్తారు. పురుషులు సీ్త్ర వేషధారణలో నృత్యం చేస్తుంటారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
ఖిలావరంగల్: రైలులో ప్రయాణికురాలి నుంచి బంగారు పుస్తెల తాడు చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌గౌడ్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ నరేష్కుమార్ తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం వరంగల్ ఎల్గూరు రంగంపేట రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని అంబేడ్కర్‌కాలనీకి చెందిన దుర్గం రాజు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికురాలి వద్ద రూ.6 లక్ష ల విలువైన 44 గ్రాముల బంగారు గొలుసు లభ్యమైంది. నిందితుడు దుర్గం రాజును రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్పీఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై ప్రభాకర్‌రెడ్డి, హెడ్ కానిస్టే బుల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సౌకర్యం కల్పించాలి
జిల్లాలో ఇప్పటికీ పలు గూడేల్లో విద్యుత్ సౌకర్యం లేదు. దశాబ్దాలుగా ఆదివాసీ, గిరిజన కుటుంబాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఐటీడీఏ, పీవీజీటీ, పీఎం జన్మన్ కింద ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నా గిరి గ్రామాల్లో మాత్రం వెలుగులు నింపడం లేదు. అటవీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతోనే కరెంటు సౌకర్యం కల్పించడం లేదని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చీకటి బతుకుల్లో వెలుగులు నింపాలి. – కొడప సోనేరావు, కొలాం సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అటవీ అనుమతులు లేకనే..జిల్లాలో తొమ్మిది గిరిజన గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆయా చోట్ల ప్రత్యామ్నాయంగా సోలార్ ద్వారా వెలుగులు అందిస్తున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల మాత్రం మరమ్మతులో ఉన్నట్లు తెలిసింది. అటవీ శాఖ నుంచి అనుమతులు లేకపోవడంతోనే ఆ గ్రామాల్లో కరెంట్ సౌకర్యం కల్పించలేకపోతున్నాం. – జాదవ్ సుభాష్, విద్యుత్ శాఖ ఎస్ఈ -
రాత్రి వేళల్లో అనవసరంగా తిరిగితే చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై సంచరించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, దొంగతనాల నివారణ, ప్రశాంత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా గురువారం అర్ధరాత్రి ఆపరేషన్ చబుత్రాను వన్‌టౌన్, టూటౌన్, మావల, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించినట్లు తెలిపారు. రాత్రి 12గంటల తర్వాత నిర్వహించిన తనిఖీల్లో రోడ్లపై, ప్రధాన కూడళ్ల వద్ద, హోటళ్ల ముందు, గద్దెలపై అకారణంగా తిరుగుతున్న 134 మంది యువకులను గుర్తించి స్టేషన్లకు తరలించినట్లు పేర్కొన్నారు. వారి కి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులను పిలిపించి అప్పగించినట్లు వివరించారు. అలాగే ధ్రువీకరణ పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడు తూ పట్టణంలో వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 గంటలకే మూసివేయాలని, 11 గంటల లోపు ప్రతిఒక్కరూ ఇళ్లకు చేరుకోవాల ని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వా రిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇందులో పట్టణ సీఐలు సునీల్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మురళి, చంద్రశేఖర్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, ఆర్ఎస్సైలు గోపీకృష్ణ, మనీష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రేషన్‌షాపులకు నిలిచిన బియ్యం సరఫరా
కై లాస్‌నగర్: జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లకు అవస్థలు తప్పడం లేదు. ఆదిలా బాద్ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఆయా దుకాణాలకు చేరాల్సిన బియ్యం పంపిణీ ప్రక్రియ శుక్రవారం నిలిచిపోయింది. పర్యవేక్షించాల్సిన ఓ జిల్లా స్థాయి అధికారి ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జితో పాటు బియ్యంను లారీల్లో నింపాల్సిన హమాలీలపై దురుసుగా వ్యవహరించడంతో వారు డీలర్లకు బియ్యం అందించకుండా గోదాంను మూసివేశారు. సదరు అధికారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. మరోవైపు బియ్యం కోసం అక్కడికి చేరుకున్న డీలర్లు గోదాం మూసి ఉంచడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సదరు అధికారితో పాటు సివిల్ సప్లై డీఎం సుధారాణి, డీఎస్వో నందిని గోదాంకు చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఎల్ఎస్ ఇన్చార్జితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. సర్ది చెప్పడంతో సాయంత్రం 4గంటల తర్వాత బియ్యం సరఫరా తిరిగి పునరుద్ధరించారు. -
గిరిజన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
ఉట్నూర్‌రూరల్: గిరిజన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో గిరిజన, ఆదివాసీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలపై ఉందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ, సేంద్రియ సాగు ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈ మేరకు అవసరమైన సాంకేతిక సహకారం, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఆయా శాఖలు అందించాలని కోరారు. ఐటీడీఏ పీవో మంద మకరందు మాట్లాడుతూ, గిరిజన రైతుల ఆర్థిక పురోభివృద్ధి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఫైవ్ లేయర్ వర్టికల్ ఫార్మింగ్, బయోరిసోర్స్ సెంటర్ ఆధారిత సాగు, ఇప్పపువ్వు (మహువా) ప్రాసెసింగ్ యూనిట్లు వంటి ఆదాయవృద్ధి నమూనాలను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీడీఏ పరిధిలో 2007–08, 2022–23 కాలానికి సంబంధించి సుమారు 60 వేల వరకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. భూభారతి పోర్టల్‌లో వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, సునీల్, రాంరెడ్డి గోపాల్, గంగాధర్, కెవీఎన్రెడ్డి, ఎం.భవానిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, గిరిజన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రాణనష్టం తగ్గించడమే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం మరింత తగ్గించేందుకు అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ చేపడుతున్నట్లు ఎస్పీ అఖి ల్ మహాజన్ తెలిపారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మంది రంలో పోలీసు, వైద్య, ఆర్టీవో, ఫైర్, నేషనల్ హైవే అథారిటీ, 108 అత్యవసర సేవలు,బ్లూకోల్ట్, పెట్రో కార్, హైవే మొబైల్ సిబ్బందితో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగి న త ర్వాత ‘గోల్డెన్ అవర్’ అత్యంత కీలకమని, ఆ సమయంలో వేగంగా స్పందించి సరైన ప్రథమ చికిత్స అందిస్తే అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ సంజీవని’ పేరుతో అత్యవసర స్పందన, ప్రథ మ చికిత్స, ప్రమాద బాధితుల రక్షణపై ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రమాద స్థలంలో సకాలంలో స్పందించి మరిన్ని ప్రాణాలను రక్షించేలా సిబ్బందిని తీర్చిదిద్దుతున్న ట్లు వివరించారు. గడిచిన ఆరు నెలల్లో జిల్లాలో రో డ్డు ప్రమాద మరణాలను 25 శాతం తగ్గించడంలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. సమావేశంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు కిషన్ సింగ్, నూర్ కేతర్బాల్, అదనపు ఎస్పీ బి.సురేందర్ రా వు, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్, వైద్యశాఖతో పాటు ఆర్టీఓ, ఫైర్, ఎన్హెచ్ఏఐ, 108అత్యవసర సేవలు,బ్లూకోల్ట్, పెట్రోకార్ , నేషనల్ హైవే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెరుగైన సేవలు అందించాలి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బాసర జోన్ పరి ధిలో ఇటీవల ఏఎస్సైలుగా పనిచేస్తూ ఎస్సైగా పదోన్నతి పొందిన బి.సాయిలు, పి. శంకర్, డి. చిన్నగంగారం జిల్లాకు బదిలీపై వచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ నీతి, నిజాయతీతో విధులు నిర్వహించాలని వారికి సూచించారు. వాగ్దారిలో ‘పోలీసులు మీకోసం‘ నేరడిగొండ: మండలంలోని వాగ్ధారి గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్పీ సందర్శించారు. 800 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మండలకేంద్రంతో పాటు తర్ణం గ్రామాల్లో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను ప్రా రంభించారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తున్న 20మంది వాహనదారులకు హెల్మెట్లు అందజేసి అభినందించారు. వాలీబాల్ టోర్నీలో విజేతగా నిలి చిన వాగ్దారి జట్టుకు బహుమతి అందజేశారు. పె యింటింగ్లో ప్రతిభ కనబర్చిన చిన్నారులకు బ హుమతి ప్రదానం చేశారు. ఇందులో ఇచ్చోడ రూ రల్ సీఐ రమేశ్, నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్, సర్పంచ్ జాదవ్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘హస్తం’ మార్క్ వ్యూహం!
సాక్షి,ఆదిలాబాద్: క్షేత్రస్థాయి బలోపేతంపై హస్తం పార్టీ దృష్టి సారించింది. సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 21 మందితో మండలస్థాయి కమిటీ.. పది నుంచి 15మందితో మండల స్థాయిలోనూ పొలిటికల్ ఎఫైర్ (పీఏసీ) కమిటీల నియామకం పూర్తి చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యూత్, మహిళ, ఎన్ఎస్యూఐ విభాగాలను పూర్తిస్థాయిలో నియమించడం ద్వారా మండల స్థాయిలో ఓ వంద మంది ముఖ్య నాయకులను గుర్తించింది. గ్రామ పోలింగ్ బూత్‌స్థాయిలో కమిటీలు వేసి కార్యకర్తలందరికీ బాధ్యత అప్పగించడం.. మొత్తంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలంతా కలిసి వెయ్యి మందితో ఆ మండలంలో పటిష్ట క్యాడర్‌ను రూపొందించే ప్రక్రియ పూర్తి చేసి కాంగ్రెస్ మార్క్ వ్యూహాన్ని ప్రదర్శించింది. సంఘటన్ శ్రీజన్ అభియాన్ ద్వారా.. సంఘటన్ శ్రీజన్ అభియాన్ అనేది భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన కార్యక్రమం. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత పునర్ నిర్మాణం, బలోపేతమే లక్ష్యం. కొత్తగా పునర్ నిర్మించే ప్రత్యేక కార్యక్రమంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం, మండల స్థాయిలో బలమైన నాయకత్వాన్ని, కమిటీలను ఏర్పాటు చేయడం, కార్యకర్తలకు గుర్తింపు, వారికి తగిన పదవులు, బాధ్యతలు అప్పగించడం, పారదర్శకమైన ఎంపిక, యువత, మహిళలకు ప్రాధాన్యత, విస్తృత అవకాశాలు కల్పించడం ద్వారా హస్తం పార్టీని బలోపేతం చేయడమేనంటున్నారు ఆ పార్టీ నేతలు. వీటన్నింటి ద్వారా ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం, వారి తరఫున గొంతు విప్పడమే ధ్యేయం. సంఘటన్ శ్రీజన్ అభియాన్‌ను జిల్లా కాంగ్రెస్ పార్టీ గురువారంతో జిల్లాలోని అన్ని మండలాల్లో పూర్తి చేసింది. జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాస రెడ్డి, ఆడే గజేందర్, ముఖ్య నేతలు అల్లూరి సంజీవ్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు బెజ్జంకి అనిల్ కుమార్‌లు ప్రతి మండలంలో పర్యటించి ఈ కార్యక్రమం ద్వారా మండల కమిటీలన్నింటిని పూర్తి చేశారు. ఇదివరకే మండల అధ్యక్షులను నియమించిన పార్టీ, ఇప్పుడు ఆ కమిటీలను కూడా పూర్తి చేసింది. వీటితో పాటు అనుబంధ సంఘాలు, గ్రామ, పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు అన్నింటిని పటిష్ట పరుస్తున్నారు.మండల స్థాయిలోనూ పీఏసీ కమిటీ.. కాంగ్రెస్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) అనేది గతంలో కేవలం రాష్ట్రస్థాయిలోనే ఉండేది. ఇటీవల జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించడం, తదనుగుణంగా జిల్లాలోనూ ముఖ్య నాయకులతో ఈ కమిటీని ఇదివరకే ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం, జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా స్థాయి పీఏసీ కమిటీ చర్చించిన తర్వాత దాన్ని పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది. ఇలా జిల్లా స్థాయిలో ఈ కమిటీకి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ మండల స్థాయిలోనూ పీఏసీ కమిటీలను ఏర్పాటు చేసింది. సంఘటన్ శ్రీజన్ అభియాన్ ద్వారా ఈ కమిటీలను పూర్తి చేసింది. మొత్తంగా మండల స్థాయిలో కమిటీ, పీఏసీ, అనుబంధ సంఘాల ద్వారా ముఖ్య నాయకులను గుర్తించడం, వారికి ఆ మండలంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయడం ద్వారా పార్టీ సముచిత లక్ష్యంతో ముందుకు కదులుతుంది. రానున్న ఎన్నికలకు రేసులో నిలిచేందుకు మండల స్థాయిలో అన్ని విభాగాల్లో పటిష్టంగా రూపొందిస్తున్నారు. -
భూభారతిపై శిక్షణ
కై లాస్‌నగర్: భూభారతి ఆపరేటర్లను ఇటీవల తొలగించిన ప్రభుత్వం తాజాగా జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో భూభారతి పోర్టల్‌కు సంబంధించిన అంశాలపై జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలు, టైపిస్టులు, సీనియర్ అసిస్టెంట్లకు శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు మాట్లాడుతూ, పోర్టల్‌లో దరఖాస్తుల నమోదు, పరిశీలన, రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్, సక్సెషన్ తదితర ప్రక్రియలను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణరెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పంచపూల, కవిత భూభారతి పోర్టల్ నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన విధానం, రికార్డుల నిర్వహణ, సేవల అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం టెక్నికల్ మేనేజర్లు విలాస్వర్మ, ప్రశాంత్, రఘుపతిరెడ్డి రిజిస్ట్రేషన్, సక్సెషన్ ప్రక్రియలకు సంబంధించిన సాంకేతిక అంశాలను వివరించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు కృషి చేయాలి
ఉట్నూర్‌రూరల్: విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. గురువారం పీఎంఆర్సీ భవనంలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న మెళకువలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆశ్రమ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏసీఎంవో జగన్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఉట్నూర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల బీఎల్ఏ–2లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పలు సూచనలు చేశారు. -
ఆచార్య జయశంకర్‌కు నివాళి
కైలాస్‌నగర్: తెలంగాణ సిద్ధాంతకర్త కర్త, ఆచా ర్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని గురువా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి పాల్గొన్నా రు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ దిశానిర్దేశం చేశారని కొని యాడారు. స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేస్తూ ప్రజలు, విద్యార్థులను చైతన్య పరి చారని తెలిపారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసంక్షేమం, జి ల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, డీఆర్వో స్రవంతి, ఏవో వర్ణ, జిల్లా బీసీ సంక్షేమాధికారి డి.సోనియా, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
సాంకేతిక ఆవిష్కరణలపై అవగాహన తప్పనిసరి
కైలాస్‌నగర్: కాలానుగుణంగా అధికారులు సాంకేతిక ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జిల్లా యంత్రాంగం, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ సంయుక్తంగా గు రువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జి ల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు ప్రత్యేక సామర్థ్యాల పెంపుపై వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. డీజీ ఐసీ ప్రతినిధులు వేర్వేరు రంగాల్లో సాధించిన నూ తన ఆవిష్కరణలు, వినూత్న పనితీరు విధానాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూ శిక్షణ ఇచ్చారు. జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, టీ హబ్ మేనేజర్ అంకిత, జిల్లా కోఆర్డినేటర్ నిఖిని వర్మ, టీ వర్క్స్ అసోసియే ట్ అరవింద్, జైకా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీ, అగ్హ బ్ మేనేజర్ ముఖేశ్, టీజీఐసీ కమ్యూనికేషన్స్ లీడ్ సాహిల్, గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్ లీడ్ రమేశ్, వివి ధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తల్లిపాలపై అవగాహన పెంచుకోవాలి ఆదిలాబాద్‌రూరల్: తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మండలంలోని అంకోలి పంచాయతీ పరిధి సిరికొండలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లి పాలు మాత్రమే అందించాలని సూచించారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు చిన్నారులకు కలెక్టర్ చేతుల మీదుగా అన్నప్రాసన చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి మిల్కా, సర్పంచ్ మడావి కిషన్, తహసీల్దార్ గోవింద్, ఎంపీడీవో వంశీకృష్ణ, సీడీపీవో సౌందర్య, వైద్యాధికారి ఆశాకిరణ్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత తప్పనిసరి
ఆదిలాబాద్‌టౌన్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ సూచించారు. గు రువారం హైదరాబాద్ నుంచి వైద్యారోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీల్లో మరింత మెరుగైన సేవలందించాలని సూచించారు. టీబీ నివారణకు కృషి చేయాలని, వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు. గర్భిణులు, చిన్నారులకు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాతా, శిశు మరణాలను తగ్గించాలని, హైరి స్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని తె లిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి సక్రమంగా మందులు అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధి కారి సాధన, ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీని వాస్, ప్రోగ్రాం అధికారులు ఈశ్వర్ రాజు, ని లోఫర్, దేవిదాస్ నాయక్ జాదవ్ పాల్గొన్నారు. -
నిరుపేదలకు ఆసరా
కై లాస్‌నగర్: అత్యంత నిరుపేద కుటుంబాల ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేరళ సర్కారు విజయవంతంగా అమలు చేసిన పేదరిక నిర్మూలన విధానం స్ఫూర్తి గా సమావేశి అజీవికా యోజన (సే) అమలుకు సంకల్పించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా దీన్ని అమలు చేయనుంది. సమాజంలో ఎలాంటి ఆసరా లేని అత్యంత నిరుపేదలను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా జీవనోపాధి కల్పించనుంది. నార్నూర్ మండలం ఎంపిక కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న ఈ పథకం రెండో విడత పైలట్ ప్రాజెక్ట్‌లో రాష్ట్రంలో ఎనిమిది మండలాలను ఎంపిక చేయగా ఇందులో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన నార్నూర్ మండలానికి చోటు దక్కింది. ఈ మండలంలోని అత్యంత వెనుకబడిన ఆదిమ గిరిజన తెగలకు చెందిన కోలాం, గోండు, తోటిలతో పాటు ఎస్సీ సా మాజిక వర్గాల వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నా రు. మండలంలో 34 గ్రామపంచాయతీలు ఉండగా అత్యంత నిరుపేదలున్న 17గ్రామాల పరిధిలో వె య్యి మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మట్టి గోడలతో కూడిన ఒకే గదిలో నివసించేవారు, సొంత ఇల్లు, స్థలం, స్థిరమైన ఆదాయం లేనివారు, నిరుపేద ఒంటరి మహిళలు, వితంతువులు, ఆసరా లేని వృద్ధులు, పారిశుద్ధ్య కార్మికులు, చెత్త సేకరించే వారు, ట్రాన్స్జెండర్లు, టీబీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, బాల కార్మికులున్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో లబ్ధిదారులను ఎంపిక చేసి ఐదంచెల విధానంలో సర్వే చేపడతారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఆయా గ్రామాల్లోని అన్ని వీధుల్లో పర్యటించి వారి పూర్తి వివరాలు సేకరిస్తారు. అనంతరం పంచాయ తీ కార్యాలయం వద్ద మ్యాప్ రూపొందిస్తారు. ఇళ్ల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి ఆధారంగా గ్రామ, మండల సమాఖ్యల ఆధ్వర్యంలో జాబితా ఎంపిక పూర్తి చేసి పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో ద్వారా కలెక్టర్ ఆమోదం కోసం పంపనున్నారు. కాగా, ప్రస్తు తం జిల్లాలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్థిక స్థిరత్వం సాధించే దాకా.. లబ్ధిదారులు ఆర్థిక స్థిరత్వం, స్వయం సమృద్ధి సా ధించేదాకా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవనుంది. రేషన్, ఆధార్, ఓటరు ఎపిక్ కార్డులు, పె న్షన్, బ్యాంక్ అకౌంట్, సదరం సర్టిఫికెట్ తదితర సేవలకు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు అందించేలా మండల సమాఖ్యలు చూస్తాయి. కు టుంబ పోషణకు ఆరు నెలలు ఉచితంగా పౌష్టికా హారం కిట్లు లేదా నెలకు రూ.వెయ్యి చొప్పున నగ దు ఇస్తారు. చిరు వ్యాపారాలు చేసుకునేలా షాపుల ఏర్పాటు, గేదెలు, మేకలు, గొర్రెల పెంపకం కోసం రూ.25వేల నుంచి రూ.30వేల వరకు బ్యాంకుల ద్వారా ఆర్థిక చేయూత అందించనున్నారు. వ్యవసాయ పరికరాలు ఉచితంగా అందజేస్తారు. కేటగిరి, లబ్ధిదారుల వివరాలుకేటగిరి లబ్ధిదారులు పీవీటీజీ 110 ఎస్టీ 677 ఎస్సీ 215 ప్రతీ 30మందికో కోచ్లబ్ధిదారులకు నిరంతరం మార్గదర్శనం చేసేందుకు, వారికి అవసరమైన సేవలు అందించేలా చూసేందుకు ప్రతీ 30 మందికో కోచ్‌ను నియమించారు. ఆయా గ్రామాల్లో పదోతరగతి పూర్తి చేసిన అదే కమ్యూనిటీకి చెందిన యువతులు, మహిళలను ఎంపిక చేశారు. వీరికి మూడు విడతల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం తొలి విడత శిక్షణ పూర్తయింది. లబ్ధిదారులు ఆర్థికంగా స్థిరపడేదాకా అవసరమైన సహాయ, సహకారాలు అందించనున్నారు. ఈ కోచ్‌ల పనితీరును ప్రతినెలా మండల సమాఖ్యలు సమీక్షించి మార్గదర్శనం చేయనున్నాయి. వెయ్యిమందిని ఎంపిక చేస్తాంజిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. 17 గ్రామాల పరిధిలో అత్యంత నిరుపేదలైన వెయ్యి మందిని ఎంపిక చేస్తాం. వారికి అవసరమైన చేయూతను అందించేందుకు, అండగా నిలిచేందుకు ప్రతీ 30 మందికో కోచ్‌ను నియమిస్తున్నాం. సర్వే సమయంలో అందుబాటులో లేని అర్హత కలిగినవారు ఆందోళన చెందవద్దు. గ్రామ, మండల సమాఖ్యలను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవ చ్చు. సెప్టెంబర్ నుంచి పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. – జాదవ్ గోవింద్రావు, అడిషనల్ డీఆర్డీవో (సెర్ప్) -
● బ్లాక్‌మార్కెట్‌కు ఉచిత బియ్యం ● దళారులు, డీలర్ల అక్రమ దందా ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్
కై లాస్‌నగర్: రేషన్‌షాపుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొందరు దళారులు తక్కువ ధరకు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో అడపాదడప బియ్యం పట్టుబడుతూ కేసులు నమోదవుతున్నా అక్రమ దందాకు అడ్డుకట్ట పడడంలేదు. కొందరు రేషన్ డీలర్లు కూడా లబ్ధిదారుల వేలి ముద్రలు వేయించుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. అసలేం జరుగుతోందంటే.. కొందరు దళారులు ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారుల నుంచి కిలో బి య్యాన్ని రూ.12నుంచి రూ.15చొప్పున కొంటున్నా రు. ప్లాస్టిక్ సంచుల్లోకి మార్చి దొడ్డిదారిన మహారా ష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ కిలోకు రూ.30 నుంచి రూ.40 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు స్థానిక బడా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గత మూడున్నరేళ్లలో 3,871 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు దళారుల నుంచి స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో పట్టుకున్న బియ్యం కేసుల వివరాలుసంవత్సరం కేసులు నిందితులు పట్టుకున్న బియ్యం విలువ (రూ.లలో) (క్వింటాళ్లలో) 2023 11 11 224.80 1,57,636 2024 20 41 1,609.40 22,18,395 2025 29 47 1,280.20 42,57,480 2026 (ఇప్పటివరకు) 48 77 156.16 4,02,950 -
మహిళలు, బాలికల భద్రతే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: మహిళలు, బాలికల భద్రతే లక్ష్యమని, ‘పోలీస్ అక్క’ విద్యార్థులకు తోబుట్టువుగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జూలై నెల షీటీం పనితీరును సమీక్షించారు. జూలైలో ఆకతాయిలపై 95 ఈ పెట్టీ కేసులు, మహిళల వేధింపులపై ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులపై స్పందించి 21మంది మైనర్లు, ఇద్దరు మేజర్లకు కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాలు, గ్రామాల్లో 71 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మ హిళల భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, బాల్య వివాహాల నివారణ, మహిళల హక్కులపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. 157 హాట్స్పాట్లలో ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు 57 గ్రామాల్లో భద్రతపై చైతన్యం కల్పించినట్లు తెలి పారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏఎస్సై జయలక్ష్మి, కానిస్టేబుళ్లు మమత, పూజకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అదనపు ఎస్పీ మౌనిక, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, షీటీం ఇన్చార్జి సుశీల, వాణిశ్రీ, సిబ్బంది రోహిణి పాల్గొన్నారు. ఆపదలో ఆపద్బాంధవులుగా నిలవాలి ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవులుగా నిలవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో డయల్ 112, బ్లూ కోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రతీ ఫిర్యాదుపై వెంటనే స్పందించి క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు రక్షణగా నిలవాలని, సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూ చించారు. ఓపెన్ డ్రింకింగ్, రౌడీ షీటర్ల తనిఖీలు, గ్రామ సందర్శనలు, పోలీసు మీకోసం కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. రాత్రి వేళ తనిఖీలు ముమ్మరం చేయాలని, పాయింట్ బుక్స్, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేసి అభినందించారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీసీఆర్బీ ఎస్సై ప్రవీణ్, కమ్యూనికేషన్ ఎస్సై గణేశ్ తదితరులున్నారు.గంజాయి రవాణాపై ఉక్కుపాదం గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆపరేషన్ కవచ్‌లో భాగంగా గంజా యి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా పోలీస్ కార్యాలయానికి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రెండ్రోజుల క్రితం భీంసరి చెక్‌పోస్ట్ సిబ్బంది, టూటౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి గంజాయితో వెళ్తున్న ఓ నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఏఆర్ ఎస్సై రఫీక్ ఉల్ రహెమాన్, ఏఎస్సై లక్ష్మీనారాయణ, కానిస్టేబుళ్లు కిషన్, జలపతిరావు, వంశీ నాయక్‌కు నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. -
పీడీ యాక్ట్ నమోదు.. జైలుకు తరలింపు
ఉట్నూర్‌రూరల్: ప్రజలను బెదిరించడం, రౌడీయిజానికి పాల్పడడం, మోసాలు చేయడం, దాడులు చేయడం వంటి పలు నేరాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న ఆదిలాబాద్ పిట్టలవాడకు చెందిన జాదవ్ గోపాల్ అనే నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిపై ఇప్పటివరకు బెదిరింపులు, రౌడీయిజం, మోసాలు, దోపిడీలు, దాడులు తదితర నేరాలకు సంబంధించి మొత్తం 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రజల భద్రతను పరిరక్షించేందుకు ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు కలెక్టర్ రాజర్షి షా నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, పునరావృతంగా నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. -
కారు దగ్ధం
లక్ష్మణచాంద: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కారు దగ్ధమైన సంఘటన మండలంలోని వడ్యాల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వడ్యాల్ మా జీ సర్పంచ్ అట్ల లలిత భర్త అట్ల రాంరెడ్డి మంగళవారం తన ఇంటి ముందు కారును నిలిపి ఉంచారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పు పెట్టడంతో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు చూసి వెంటనే ఇంటి వారిని అప్రమత్తం చేశారు. వారు వచ్చి బోరు మోటర్ ఆన్ చేసి మంటలను ఆర్పి వేశారు. బుధవారం రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు
ఖానాపూర్: గుడుంబా నిర్మూలనలో భాగంగా ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్, నిర్మల్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సిబ్బంది, ఖానాపూర్ అటవీశాఖ అధికారుల సమన్వయంతో ఈ దాడులు చేపట్టారు. సింగాపూర్ తండా, రాజూరా తండా, రాజూరా, ఇక్బాల్‌పూర్ గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో 6 కేసులు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 25 లీటర్ల ఐడీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, సుమారు 3వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. అలాగే అటవీశాఖ అధికారుల సహకారంతో ఇక్బాల్‌పూర్ శివారు అటవీ ప్రాంతంలో మరో 2వేల లీటర్ల బెల్లం పానకం గుర్తించి ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, నల్లబెల్లం అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగస్వామి హెచ్చరించారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ గంగారెడ్డి, ఎస్సై అభిషేక్, ఎస్సై సింధు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరేందర్‌తో పాటు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
భర్తను హత్య చేసిన భార్య అరెస్టు
భైంసా: నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా –బి గ్రామంలో సంచలనం సృష్టించిన దోతరే బాలాజీ (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మృతుడి భార్య దోతరే పీరాబాయిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించేవాడు. ఆగస్టు 3న మద్యం మత్తులో తన తాత పీరాజీతో గొడవపడి దాడి చేసి ఇంటికి వెళ్లాడు. అనంతరం ఇంట్లో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో మద్యం మత్తులో ఉన్న భర్త గొంతును అతని చొక్కాతో బిగించి ఊపిరాడకుండా చేసి పీరాబాయి హత్య చేసింది. హత్య అనంతరం బాలాజీ మద్యం మత్తులో గ్యాస్ సిలిండర్‌పై పడి గాయాలతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. ఘటనకు సంబంధించిన ఆనవాళ్లను తొలగించి, సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలకు సిద్ధం చేసింది. కానీ మృతుడి బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి శాసీ్త్రయ ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలి ప్రమేయాన్ని నిర్ధారించి అరెస్టు చేశారు. సమావేశంలో భైంసారూరల్ సీఐ ప్రవీణ్ ఉన్నారు. -
సింగరేణి ఉద్యోగి దుర్మరణం
రామగుండం: మిత్రులతో కలిసి సరదాగా నదిలో చేపలు పడుతూ, స్విమ్మింగ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి సింగరేణి ఉద్యోగి మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ శివారులో బుధవారం జరిగింది. ఎస్సై వెంకటస్వామి కథనం ప్రకారం.. గోదావరిఖని వకీల్‌పల్లిగనిలో విధులు నిర్వహించే సింగరేణి ఉద్యోగి కూన రాజ్‌కుమార్(32) బుధవారం తన మిత్రులతో కలిసి గోలివాడ శివారులోని గోదావరినది వద్దకు వచ్చాడు. మిత్రులతో కలిసి సరదాగా చేపలు పడుతూ నీటిలో స్విమ్మింగ్ చేస్తున్న క్రమంలో నీటిలో మునిగి కనిపించకుండా పోయాడు. మిత్రులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంటనే రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. రాజ్‌కుమార్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని గణేశ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా నందిమేడారం. మృతుడికి భార్య అఖిల, కుమారుడు హరీశ్ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్
ఆదిలాబాద్‌టౌన్: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడమే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 220 ద్విచక్ర వాహనాలు, 29 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ లేని, నకిలీ నంబర్ ప్లేట్లతో ఉన్న 6 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురి నుంచి 46 క్వార్టర్ బాటిళ్లు, 28 చిన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. మట్కా ఆడుతున్న షేక్ ఖలీల్, రంజిత్, దినేష్‌లపై కేసులు నమోదు చేసి వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గంజాయి, మట్కా, అక్రమ మద్యం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని హెచ్చరించారు. కాలనీ ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, సీఐలు రహీం పాషా, కె.నాగరాజు, నైలు, చంద్రశేఖర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ఎస్సైలు నాగనాథ్, వి.విష్ణువర్ధన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధన్గర్ మొహళ్లలో బుధవారం నార్కోటిక్ జాగిలం రోమా సహాయంతో తనిఖీలు నిర్వహించగా, 15 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు పేర్కొన్నారు. నిందితుడు షేక్ వాజిద్ ఇంట్లో 4 గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. సీసీఎస్ సిబ్బంది రమేశ్ పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ సైబ ర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్ష కా తిరంగా–సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఎస్పీ మా ట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కా ర్యాలయాలు,బ్యాంకులు, వ్యాపార సంస్థలు, మ హిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్, ఫేక్ లింకులు, నకిలీ యాప్‌లు, ప్రముఖుల పేర్లతో వచ్చే పెట్టుబడి ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘ఆగు.. ఆలోచించు.. ని జం నిర్ధారించు.. సైబర్ భద్రత పెంచు’ అనే సందేశాన్ని ప్రతిఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై సురేందర్, సిబ్బంది పాల్గొన్నారు. అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ అన్నారు. రిమ్స్ ఆడిటోరియంలో ‘సైబర్ జాగృతి దివస్’ సందర్భంగా నిర్వహించిన అ వగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. రోజు రోజుకు నూతన పద్దతుల్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. జాబ్‌ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్‌ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, ఏపీకే ఫైళ్లు, తెలి యని లింక్‌లు, ఆఫర్ల పేరుతో వచ్చే వాటిపట్ల ప్రజ లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. విద్యార్థినులు ఎలాంటి సమస్యలు ఎదురైనా షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు. అనంతరం రిమ్స్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్‌కుమార్, కె.నాగరాజు, బిడి.ప్రేమ్‌కుమార్, నైలు,ఎస్సైలు దేవేందర్, ప్రణయ్‌కుమార్, లెక్చరర్లు, పాల్గొన్నారు. -
గంజాయి విక్రయించిన వారిపై కఠిన చర్యలు
మంచిర్యాలక్రైం: గంజాయి విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల పరిధిలో ఇదివరకు పట్టుబడిన రూ.17లక్షల 9వేల విలువైన గంజాయిని కోర్టు అనుమతితో బుధవారం ధ్వంసం చేశారు. సీపీ మాట్లాడుతూ రెండు జిల్లాల పరిధిలో నమోదైన పాత 81 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 40కిలోల 173 గ్రాముల గంజాయితో పాటు 26 గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు. న్యా యాధికారుల సమక్షంలో ఎఫ్ఎస్ఎల్ పరీక్షల కోసం నమునాలు సేకరించి ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దపెల్లి డీసీపీ రాంరెడ్డి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు వెంకటేశ్వర్లు, నాగేంద్రగౌడ్, సీసీఆర్బీ సీఐ అనిల్, ఎస్సై వినిత తదితరులు పాల్గొన్నారు. -
బాసర లాడ్జీల్లో తనిఖీలు
బాసర: ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో బుధవారం బాసరలోని ప్రైవేట్ లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జీల్లోని గదుల రిజిస్టర్లు, అతిథుల వివరాలు, నిర్వహణ విధానాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. గదులు కేటాయించే ముందు ప్రతీ అతిథి ఆధార్ కార్డు, ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరిశీలించి, దాని జిరాక్స్ ప్రతిని తీసుకోవాలని లాడ్జి నిర్వాహకులకు ఏఎస్పీ సూచించారు. అతిథుల పూర్తి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు బస చేసిన వారి వివరాలు, ఆధార్ జిరాక్స్ ప్రతులను ప్రతిరోజూ సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అందజేయాలని ఆదేశించారు. గుర్తు తెలియని వ్యక్తులకు, అనుమానాస్పద వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు ఇవ్వొద్దని హెచ్చరించారు. లాడ్జీల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముధోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర సీఐ దీపక్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
భూభారతి ఆపరేటర్లు ఔట్!
కై లాస్‌నగర్: భూభారతి పోర్టల్‌లో పనిచేస్తున్న ఆపరేటర్ల సేవలకు ప్రభుత్వం మంగళం పాడింది. తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని విధుల నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ఈమేరకు సంబంధిత సిబ్బందిని ఎంపిక చేసిన యంత్రాంగం కలెక్టర్‌కు నివేదిక పంపించారు. కలెక్టర్ ఆమోదం అనంతరం వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళనకు గురైన ఆపరేటర్లు ఇటీవల కలెక్టర్‌ను కలిసి తమను కొనసాగించేలా చూడాలని వేడుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు రాజధాని బాటపట్టారు. మూడు రోజులుగా విధులకు దూరం కావడంతో జిల్లాలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. తొమ్మిదేళ్లుగా విధుల నిర్వహణ జిల్లాలో 19 గ్రామీణ మండలాలు ఉండగా 21మంది ఆపరేటర్లు ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నా రు. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ధరణి నుంచి ప్రస్తుత భూభారతి వరకు తొమ్మిదేళ్లుగా వి ధులు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ఒక్కొక్కరు చొప్పున 19మంది పనిచేస్తుండగా కలెక్టర్ కార్యాలయంలో ఇద్దరు విధులు నిర్వహించారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.17,500 చొ ప్పు న వేతనం చెల్లిస్తోంది. అయితే ఇటీవల గ్రూప్ –3 లో ఎంపికై న వారిని తహసీల్దార్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా ప్రభుత్వం నియమించింది. వీరిలో చాలామంది ఉన్నత విద్యావంతులు ఉండటంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం సైతం కలిగి ఉన్నట్లుగా గుర్తించింది. దీంతో భూభారతి ఆపరేటర్లు అందిస్తున్న సేవలను ఇక నుంచి వీరికే అప్పగించాలని నిర్ణయించింది. ఈమేరకు ఔట్సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న వారిని తొలగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులతో మూడు రోజు లుగా ఆపరేటర్లు విధులకు రావడం లేదు. ఫలితంగా తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్ల ప్ర క్రియ నిలిచిపోయింది. ఇప్పటికే రెవెన్యూ కార్యాలయాల్లోని మీసేవ అపరేటర్లను తొలగించిన ప్రభుత్వం వారి బాధ్యతలను సైతం జూనియర్ అసిస్టెంట్లకే అప్పగించింది. ఆందోళనలో ఆపరేటర్లు .. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఆపరేటర్లు ఆందోళన కు గురవుతున్నారు. తొమ్మిదేళ్లుగా విధులు నిర్వహించిన తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమను య థావిధిగా కొనసాగించేలా చూడాలని వేడుకున్నా రు. అయితే ప్రభుత్వం వారిని తొలగిస్తూ జీవో జారీ చేయడంతో అధికారులు సైతం ఏమి చేయలని పరిస్థితి. దీంతో రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ పెద్దలను కలువాలని నిర్ణయించిన ఆపరేటర్లు హైదరా బాద్ తరలివెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూమంత్రి పొంగులేటిని కలిసి తమను కొనసాగించేలా చూడాలని వేడుకోనున్నట్లుగా నిర్ణయించారు. -
దేశ సేవే యువత లక్ష్యం కావాలి
భైంసా: దేశాభివృద్ధికి యువతే ప్రధాన శక్తి అని, ప్రతీ యువకుడు దేశ సేవనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ శివశంకర్ పిలుపుని చ్చారు. బుధవారం పట్టణంలోని శ్రీవివేకా నంద ఆవాసంలో సేవా భారతి, శ్రీరామకృష్ణ సేవా సమితి, ఆవాసం సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సై ఉద్యోగాల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. శివశంకర్ మాట్లాడుతూ సమాజ సేవతో పాటు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించే లక్ష్యంతో సే వా భారతి రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు ఆర్థికంగా వెనుకబడిన యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో సేవా భారతి, శ్రీరామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు, శ్రీవివేకానంద ఆవాసం నిర్వాహకులు, శిక్షకులు, పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. కోల్వాషరీని సందర్శించిన అధికారుల బృందంరామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా పరిధి రామకృష్ణాపూర్ కోల్వాషరీని బుధవారం కార్పొరేట్ స్థాయి బొగ్గు ధ్రువీకరణ కమిటీ ప్రతినిధులు సందర్శించారు. వాషరీలోని స్లర్రీ, రిజెక్ట్స్ స్టాక్ కోల్ నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా ధ్రువీకరించారు. అనంతరం బొగ్గు నిల్వలు, నాణ్యత ప్రమాణాలు, నిర్వహణ తీరుపై అధికారుల బృందం సమీక్ష నిర్వహించింది. కార్యక్రమంలో జీఎం సీపీ అండ్పీ మనోహర్, జీఎం క్వాలిటీ రవికుమార్, జీఎం సర్వే రాఘవేంద్రరావు, జీఎం ఎఫ్అండ్ఏ చక్రవర్తి, జీఎం క్వాలిటీ బెల్లంపల్లి రీజియన్ వీరభద్రరావు, మందమర్రి జీఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు మాత్రమే కాదు.. గ్రామాన్ని తీసుకోండి
కై లాస్‌నగర్: ఎయిర్‌పోర్టు నిర్మాణ భూసేకరణలో భాగంగా కేవలం రోడ్డు మాత్రమే కాకుండా గ్రామాన్ని పూర్తిగా తీసుకోవాలని అనుకుంట గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌కు ర్యాలీగా తరలివచ్చారు. ప్రధాన ద్వారం ఎదు ట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లా కేంద్రానికి రావాలంటే రెండు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాల్సి ఉందని, రోడ్డు మార్చడం ద్వారా 17 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ రోడ్డును తీసుకోవాలనుకుంటే గ్రామాన్ని కూడా తీసుకోవాలని, అలాగే భూ సేకరణలో ఎకరానికి కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యను విన్నవించారు. -
‘108’లో ప్రసవాలు
ఇంద్రవెల్లి: 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తతతో ఇద్దరు గర్భిణులకు క్షేమంగా పురుడు పోసిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. 108 సిబ్బంది, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన కుమ్ర సత్యశ్రీ అనే గర్భిణీకి బుధవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు రిమ్స్‌కు రెఫర్ చేశారు. 108లో తరలిస్తుండగా గర్భిణీకి నొప్పులు ఎక్కువ కావడంతో మావల సమీపంలో ఈఎంటీ సిద్ధేశ్వర్ ఆధ్వర్యంలో సిబ్బంది పురుడు పోశారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. హైరిస్క్ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేస్తుండగా 108 సిబ్బంది మాత్రం క్షేమంగా వైద్యం అందించడం గమనార్హం. అలాగే సిరికొండ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రేవతికి పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆస్పత్రికి తరలిస్తుండగా, దస్నాపూర్ సమీపంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ ప్రవీణ్ వైద్యం అందించగా మగశిశువుకు జన్మనిచ్చింది. కార్యక్రమంలో అంబులెన్స్ పైలెట్లు షేక్ సాహిద్, రాజ్‌కుమార్ ఉన్నారు. -
● జిల్లాలో అమలులోకి ప్రత్యేక యాప్ ● నేటి నుంచి ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్’ ద్వారానే.. ● పంపిణీలో పారదర్శకత కోసం ● రాష్ట్ర ప్రభుత్వ యాప్ ఇక బంద్ ● అవస్థలు పడతామంటున్న రైతులు
ఆదిలాబాద్‌టౌన్: దేశ వ్యాప్తంగా ఎరువుల పంపిణీ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్‌ను గురువారం నుంచి అమలులోకి తీసుకొస్తోంది. ఇకనుంచి ఈ యాప్ ద్వారానే రైతులకు అన్ని ఎరువులు పంపిణీ చేయనున్నారు. ముందుగా యాప్‌లో బు క్ చేసుకొని డీలర్ వద్ద నుంచి పొందాల్సి ఉంటుంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేయగా, అందులో ఆదిలాబాద్ ఉంది. గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూరి యా కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించిన విష యం తెలిసిందే. ఇక ఆ యాప్ సేవలు ముగియనున్నాయి. రైతులంతా ఎఫ్ఎఫ్ఎస్లోనే బుకింగ్ చేసుకొని ఎరువులు పొందాల్సి ఉంటుంది. అయితే కొంత మంది కొత్త విధానంపై గుబులు చెందుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మీసేవ కేంద్రాలు, సీఎస్సీ సెంటర్లలో బుక్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. పారదర్శకత లక్ష్యంగా.. ఎరువుల పంపిణీలో మరింత పారదర్శకత కో సం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ఎరువులు సబ్సిడీపై సరఫరా చేస్తోంది. ఇదివరకు రాష్ట్రంలో ఉన్న యూరియా బుకింగ్ యాప్ ద్వా రా యూరియా మాత్రమే సరఫరా అయ్యేది. ప్ర స్తుతం ప్రవేశపెట్టిన ఎఫ్ఎఫ్ఎస్తో యూరియా, డీఏపీ, పాస్పరస్, కాంప్లెక్స్ ఎరువులు తదితరవి డిజిటల్ విధానం ద్వారానే పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే రైతులకు సకాలంలో అందుబాటులో ఉండేలా, ఎరువుల కోసం బారులుతీరడం, అనవసరంగా కొంత మంది పరిమితికి మించి నిల్వలు ఉంచడంతో గతేడాది రైతులు ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. రైతు వేసిన పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే యాప్ ద్వారా సరఫరా అవుతాయి. అదనంగా పంపిణీ చేసే విషయమై ఉన్నతాధికారులు పరిశీలించిన తర్వాతే అందిస్తారు. బ్లాక్ మార్కెట్, ఎరువుల దుర్వినియోగం, అక్రమ నిల్వలు, డీలర్లు కృత్రిమ కొరత సృష్టించడానికి వీలు లేకుండా పోతుంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ ఇలా.. ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌ను ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో రైతు వివరాలు, సాగు విస్తీర్ణం, ఆధార్ నంబర్, రైతు ఐడీ నమోదు చేయాలి. ఎరువుల బుకింగ్ కోసం సంబంధిత డీలర్‌ను ముందుగా ఎంచుకోవాలి. ఏ రకమైన ఎరువులు ఎంత కావాలో న మోదు చేయాలి. అయితే బుకింగ్ చేసుకున్న రెండు రోజుల తర్వాత ఎరువులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బుకింగ్ చేసుకున్న తర్వాత అవస రం లేదనుకుంటే రద్దు చేసుకునే వెసులుబాటు క ల్పించారు. రైతు డీలర్‌వద్దకు వెళ్లిన తర్వాత క్యూ ఆర్ కోడ్ చూపించాలి. స్కాన్ చేసిన తర్వాత బుకింగ్ వివరాలు కనిపిస్తాయి. విక్రయం తర్వాత సమాచారం ఎఫ్ఎఫ్ఎస్ సర్వర్‌లో నమోదవుతాయి.ఈ యాప్ ద్వారా రైతులకు మేలు చేకూరుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎరువుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలను సంప్రదించాలని పేర్కొంటున్నారు. అయితే చాలా మంది రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు. మీసేవ, సీఎస్సీ సెంటర్ల వద్ద వెళ్లి బుకింగ్ కోసం బారులు తీరాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మేలు.. -
తల్లిపాలతో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం
ఆదిలాబాద్/ఆదిలాబాద్‌టౌన్:తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, నవజాత శిశువు శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలు ఎంతో కీలకమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రపంచ తల్లిపా ల వారోత్సవాల సందర్భంగా బుధవారం రిమ్స్ నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మెడికోలు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు నాటికలు, పాటల ద్వారా తల్లిపాల ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. తల్లిపాలు సరిగా రాని సందర్భాల్లో ‘కంగారూ మదర్ కేర్’ విధానం ద్వారా సహజంగా పాల ఉత్పత్తి పెరుగుతుందని, రిమ్స్‌లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఐసీఎంఆర్ ’సంకల్ప్’ కార్యక్రమం ద్వారా నవజాత శిశు మరణాల రేటు తగ్గించగలిగామని పేర్కొన్నా రు. అనంతరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మెడికోలకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతి భ కనబరిచిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఇందులో డీఎంహెచ్‌వో సాధన, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, వైద్యులు వెంకట్ రెడ్డి, అశోక్, వైద్యశాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు అండగా నిలవాలి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అండగా నిలవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. భవిత సెంటర్లలో ఏఐ సాంకేతికతతో పాటు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఫిజియోథెరపిస్టులు, స్పీచ్ థెరపిస్టులను నియమించి పిల్ల లకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలను సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకురావడం అందరి సామాజిక బాధ్యత అన్నారు. అనంతరం ప్రత్యేక అవసరాల పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న పలువురు తల్లిదండ్రులను సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు గంగారాం, డీఈవో మాధవి, డీఎంహెచ్‌వో సాధన, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ జగదీశ్వర్, జిల్లా కోఆర్డినేటర్ ఉష్కం తిరుపతి, ప్రత్యేక అవసరాల పిల్లలు, వారి తల్లిదండ్రులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ రహదారి ప్రాజెక్టులు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న జాతీయ రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఎంపీ గోడం నగేశ్‌తో పాటు పలువురు బీజేపీ ఎంపీలు కోరారు. ఈమేరకు కేంద్ర రహదారుల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బుధవారం ఢిల్లీలో కలిసి విన్నవించారు. రాష్ట్రంలో మెరుగైన రహదారి అనుసంధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా రవాణా, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు మరింత ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి తెలంగాణ మున్సిపాలిటీలకు సంబంధించిన అర్బన్ చాలెంజ్ ఫండ్ అంశంపై చర్చించారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌తో పాటు ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎం.రఘునందన్ రావు, పాల్గొన్నారు. -
పర్వాలేదు..
భూగర్భ జలాల పరిస్థితి.. భూ ఉపరితలం నుంచి లోనికి (మీటర్లలో) జూలై 2025 : 4.00 జూలై 2026 : 7.55 ఆగస్టు 2026 : 4.28 సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో భూగర్భజలాల మట్టం ప్రస్తుతం పరవాలేదనిపిస్తోంది. గతనెలతో పోల్చితే ఇటీవల కురిసిన వర్షాలతో ఆశాజనకంగా మారింది. ఒకటి, రెండు భారీ వర్షాలు కురిస్తే ఈ సీజన్ గట్టెక్కవచ్చనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతోంది. గతేడాది జూలై చివరి వరకు భూగర్భజలమట్టం నాలుగు మీటర్లుగా నమోదవగా.. ప్రస్తుతం 4.28 మీటర్ల లోతులోనే ఉండడం గమనార్హం. అయితే గతేడాది ఆగస్టు పూర్తయ్యే సరికి 1.71 మీటర్లలో ఉండి జలాలు చేతికి అందేలా ౖపైపెకి వచ్చాయి. ఈ నెలలో భారీ వర్షాలు కురిస్తే మళ్లీ ఆ మట్టం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే.. జిల్లాలో జూలై మూడో వారం వరకు 40 శాతానికి మించి లోటు వర్షపాతం ఉన్న పరిస్థితి తెలిసిందే. అయితే ఆ నెల చివరి వారంలో కురిసిన వర్షాల కారణంగా ప్రస్తుతం సాధారణ వర్షపాతానికి చేరుకుంది. కేవలం నాలుగు రోజుల్లో కురిసిన వర్షం మొత్తం లోటు వర్షపాతాన్ని పూరించిన విషయం విధితమే. దాంతోనే భూగర్భ జలాలు ఈ మాత్రం పెరిగాయి. జలాశయాల్లో పరిస్థితి.. జిల్లాలో రెండు మధ్యతరహా ప్రాజెక్టులు సాత్నాల, మత్తడివాగు ఉన్నాయి. ఇందులో సాత్నాల ఇంకా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు. మత్తడివాగు మాత్రం నిండుకుండగా మారడం కొంత ఊరటనిచ్చే అంశం. ఇక చెరువుల పరిస్థితి గమనిస్తే.. ఇంకా వందలాది చెరువులు 75శాతం లోపే ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తేనే అవి నిండేది. జలాశయాల్లో నీటి సామర్థ్యం పెరిగిన పక్షంలో సమీపంలోని గ్రామాల్లో భూగర్భ జలాల మట్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వర్షపాతం వివరాలు.. సాధారణ వర్షపాతం 564 మి.మీ.లు గతేడాది కురిసింది 491 మి.మీ.లు (13 శాతం లోటు) ఈ ఏడాది కురిసింది 513 మి.మీ.లు (9 శాతం లోటు)ప్రజల్లో చైతన్యం అవసరం జిల్లాలో వర్షాభావ పరిస్థితులను ప్రజలు ఈ రెండు నెలల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారు. లోటు వర్షపాతంతో చోటు చేసుకున్న పరిస్థితులు మరో సారి ఉత్పన్నం కాకుండా ప్రజల్లో చైతన్యం పెరగాలి. చేలల్లో పాంపౌండ్స్, ఊట కుంటలు, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించుకోవాలి. ఇంటి సముదాయాల్లో ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టాలి. అలాంటప్పుడే భూగర్భ జలాలను రక్షించగలుగుతాం. – సతీశ్‌యాదవ్, భూగర్భజల అధికారి, ఆదిలాబాద్ -
పెండింగ్ కేసులపై ఫోకస్ పెంచాలి
ఇంద్రవెల్లి: పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా స్థానిక పోలీసు స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులు గ్రామాల్లో నిరంతరం సందర్శిస్తూ వీపీవో విధానం కచ్చితంగా అమలు చేయాలన్నారు. అనంతరం సిబ్బందికి కేటాయించిన కిట్ సామగ్రిని పరిశీలించారు. ఆయన వెంట ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే, సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
● చదువు మానేస్తున్న విద్యార్థులు ● జిల్లాలో ఆగని డ్రాపౌట్స్ ● ఫలితమివ్వని స్పెషల్‌డ్రైవ్‌లు ● స్పష్టం చేస్తున్న గణాంకాలు
ఆదిలాబాద్‌టౌన్: తరగతి గదిలో గడపాల్సిన బా ల్యం ఇంకా చెత్తకుప్పలు, హోటళ్లు, ఇటుక బట్టీలు, దుకాణాలకు పరిమితమవుతున్న పరిస్థితి. మరి కొందరు భిక్షాటన చేస్తూ దర్శనిమిస్తుండగా.. ఇంకొందరు పశువులు కాస్తూ తమ భవిష్యత్తును అంధకారంగా మార్చుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా డ్రా పౌట్ల సంఖ్య ఏటా వందల్లో ఉంటుండడం పరిస్థితి కి అద్దం పడుతోంది. విద్య, కార్మికశాఖలు ప్రతి సంవత్సరం స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా చిన్నారులు ఇంకా పూర్తిస్థాయిలో బడిబాట పట్టకపోవడం గమనార్హం. మరోవైపు ఆయా శాఖలు కాకిలెక్కలతో కాలం వెల్లదీస్తున్నాయనే అపవాదు లేకపోలేదు. బడికి దూరమవుతున్న చిన్నారులు.. జిల్లాలో పాఠశాలలకు దూరమవుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, చిన్న వయస్సులోనే వి వాహం, వలసలు, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి కారణాలతో పలువురు విద్యార్థులు చదువును మఽ ద్యలోనే నిలిపివేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, ఏ జెన్సీ మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తోంది. కొంత మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పనికి వెళ్లడం, మరికొందరు కుటుంబ బాధ్యతల కారణంగా చదువు మానేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు డ్రాపౌట్లను తిరిగి చేర్పించేందుకు చ ర్యలు చేపడుతున్నా అవి సత్ఫలితాలు ఇవ్వడం లే దు. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో నిర్వహించిన బడిబయట చిన్నారుల సర్వేలో జిల్లాలో 250 మంది బాలురు, 236 మంది బాలికలు ఉన్నట్లు అధి కారులు పేర్కొన్నారు. అంతకముందు రెండేళ్లలో నూ దాదాపు ఇంతే మంది ఉండడం గమనార్హం. నామ్‌కే వాస్తేగా సర్వే.. డ్రాపౌట్ పిల్లల సర్వేను జిల్లాలో సీఆర్పీలు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. వీరు మొత్తం 57 మంది ఉండగా ఒక్కొక్కరికి 25 నుంచి 30 పాఠశాలలు ఉన్నాయి. ఇదే సమయంలో వీరు పుస్తకాలు, యూనిఫాం, నోట్‌బుక్‌లను పాఠశాలలకు సరఫరా చేయడం, సమాచా రం సేకరించడం, తదితర పనులు చేస్తున్నా రు. దీంతో డ్రాపౌట్ సర్వే పూర్తి స్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. కేటాయించిన సమయం కూడా సరిపోకపోవడంతో కొన్ని గ్రామాల సర్వే చేపట్టి లెక్కలు చూపిస్తున్నారు. విషయం అధికారులకు సైతం తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మంది డ్రాపౌట్‌గా ఉన్నట్లు చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, వా రిచ్చిన లెక్కలతోనే సరిపెడుతున్నట్లు సమాచారం. జిల్లాలో అత్యధికంగా ఆదిలాబాద్ అర్బన్, ఉట్నూర్, బోథ్, ఆదిలాబాద్‌రూరల్, నేరడిగొండ,భీంపూర్‌లో 40నుంచి 30మంది వరకు, అత్యల్పంగా మావల, నార్నూర్, సిరి కొండ, ఇంద్రవెల్లి ఉన్నట్లు వారి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో వీరి లెక్కలకు పొంతన లేకుండా కనిపిస్తోంది. ఇంకా చాలామంది డ్రాపౌట్ల పేర్లు పాఠశాలల్లో కొనసాగున్నాయి. వాటిని తొలగిస్తే తమ పోస్టులు తగ్గుతాయని భావించిన ఉపాధ్యాయులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. బడి బయట పిల్లలు520 492 4862025–262024–252023–24 విద్యా సంవత్సరం బడిలో చేర్పిస్తున్నాం.. జిల్లాలో గతేడాది నిర్వహించిన బడిబయట సర్వేలో 486 మందిని గుర్తించాం. వీరిలో 250 మంది బాలురు, 236 మంది బాలికలు ఉన్నారు. ఇందులో 211 మంది పిల్లల్ని వివిధ పాఠశాలల్లో చేర్పించాం. మిగతా 275 మంది ఇతర రాష్ట్రాలు, సరిహద్దు గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో డ్రాపౌట్లు లేరు. తల్లిదండ్రులు తమ పిల్ల ల్ని సక్రమంగా బడికి పంపి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలి. – లక్ష్మణ్, సెక్టోరియల్ అధికారి -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
ఆదిలాబాద్‌టౌన్: గిరిజనులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మంగళవారం రిమ్స్‌ను సందర్శించి గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. వైద్యసేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా ప్రతి రోగికి సకాలంలో చికిత్స అందించాలని సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పీవో వెంట రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, అదనపు డీఎంహెచ్‌వో మనోహర్, రిమ్స్ వైద్యులు ఉన్నారు. -
పాఠశాలలకు మూలస్తంభాలు పీఈటీలు
ఉట్నూర్‌రూరల్: పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సర్వాంగీణ వికాసంలోను వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) మూలస్తంభాల వంటి వారని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మంగళవారం ఉట్నూర్ కేజీబీవీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ సమావేశ మందిరంలో జరుగుతున్న ఆశ్రమ పాఠశాలల పీఈటీల శిక్షణా తరగతులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఏ ఉపాధ్యాయుడు గుర్తులేకపోయినా వ్యాయామ ఉపాధ్యాయుడు మాత్రం ఎప్పటికీ గుర్తుంటాడన్నారు. ప్రతీ విద్యార్థి ‘ఫిట్’గా ఉండేలా చూడాల్సిన బాధ్యత వారిదేనన్నారు. క్రీడా మైదానాల కొరతను సాకుగా చూపకుండా, అందుబాటులో ఉన్న చిన్న మైదానం, వనరులతోనే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, బూక్యా రమేశ్, ప్రధానోపాధ్యాయుడు ఆర్.ఉత్తం, రిసోర్స్ పర్సన్లు వి.భూమన్న, ఎల్.ఎన్.శాసీ్త్ర పాల్గొన్నారు. -
బాలుడిపై వీధికుక్క దాడి
ఖానాపూర్: పట్టణంలోని శివాజీనగర్ కాలనీకి చెందిన రంజిత్ కుమారుడు రుద్రాన్ష్ (2)పై వీధికుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికి త్స అందించారు. కాలనీలో వీధికుక్కల బెడద పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఉట్నూర్‌లో ఒకరిపై..ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రానికి చెందిన లియాకథ్పై మంగళవారం పిచ్చికుక్కలు దాడి చేయడంతో గాయాలయ్యాయి. పట్టణంలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు కోళ్ల వ్యర్థాలను రోడ్డుపక్కన పడేయడంతో కుక్కలు సమూహాలుగా చేరి ఒకదానిపై ఒకటి దాడి చేసుకోవడంతో పాటు, ఆ దారిన వెళ్లే బాటసారులు, వాహనదారులు, చిన్నారులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొలాంగూడలో యువకుడిపై.. లింగాపూర్: మండలంలోని జాముల్‌ధర గ్రామ పంచాయతీలోని కొలాంగూడకు చెందిన భీంరావ్పై కుక్క దాడి చేయడంతో గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన భీంరావ్ మంగళవారం ఏల్లాపటార్ గ్రామ సమీపంలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా కుక్క దాడికి పాల్పడింది. గాయాలు కావడంతో లింగాపూర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఉట్నూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు బాధితుడి తండ్రి తెలిపారు. -
అప్రమత్తంగా ఉండాలి
సాత్నాల: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో సాధన అన్నారు. మండలంలోని సైద్పూర్ పీహెచ్‌సీని మంగళవారం తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం సీజనల్ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి వైద్యసేవలందించాలని సిబ్బందికి సూచించారు. నవజాతి శిశు సంరక్షణ, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలన్నారు. ఆమె వెంట ఎన్హెచ్ఎం డీపీవో దేవదాస్నాయక్, వైద్య బృందం ఉన్నారు. -
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి
కై లాస్‌నగర్: జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ పనితీరుపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు రెవెన్యూ సేవలు పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు సమీప మీసేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, రాజేశ్వర్, ఐటీడీఏ పీవో మంద మకరంద్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్టీవో జగదీశ్వర్‌రావు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. డిజిటల్ వ్యసనాలతో ప్రమాదంలో యువత భవిష్యత్తు ఆదిలాబాద్: ఇన్‌స్ట్రాగాం రీల్స్, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వంటి డిజిటల్ వ్యసనాలు కూడా యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు యోగా, ధ్యానం వంటి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనూష, డీఈవో మాధవి, డీఐఈవో గణేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ రామయ్య, బ్రహ్మకుమారి నిర్వాహకులు రేవతి, దిల్రెడ్డి, లెక్రాజ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘బాల ఆధార్’కు బాలారిష్టాలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పొందే ‘బాల ఆధార్’ సేవల బాలారిష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల వరకు ఎలాంటి బయోమెట్రిక్ నమోదు లేకుండానే బాల/శిశు ఆధార్ జారీ చేయాలనే ఉద్దేశంతో యూఐడీఏఐ(యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రత్యేకంగా ఈ వీలు కల్పించింది. మొదట పిల్లలకు పేర్లు పెట్టకముందే బేబీ ఆఫ్‌తోనే తల్లిదండ్రుల ఆధార్‌తో కార్డులు జారీ చేశారు. కానీ కొన్ని చోట్ల ఈ సేవను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించారు. దీంతో మీ సేవ కేంద్రాల్లో జనన ధ్రువీకరణ పత్రం ఉంటేనే బాల ఆధార్ నమోదు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రభుత్వాసుపత్రుల్లో ఈ సేవలు అందడం లేదు. మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిర్మల్ ప్రభుత్వాసుపత్రుల్లో అరకొరగా సేవలు అందుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సేవలు కూడా అందడం లేదు. దీంతో తల్లిదండ్రులు చిన్నారులకు ఆధార్ కోసం తిప్పలు పడుతున్నారు. ఆధార్ చిన్నారుల నివాస రుజువు, తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానం, టీకాలు, ‘అభా’ కార్డు, రేషన్‌కార్డుతోపాటు ఇతర అనేక చోట్ల తప్పనిసరిగా మారింది. రెండు నెలలుగా తిరుగుతున్నా మా పాపకు బాల ఆధార్ కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి రెండు నెలలు నుంచి తిరుగుతున్నాను. రోజూ సర్వర్ పని చేయడం లేదంటూ తిప్పి పంపిస్తున్నారు. అధికారులు సమస్య పరిష్కరించి, ఆధార్ ఇప్పించేలా చూడాలి. –అజయ్, కాగజ్‌నగర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా -
బల్దియాకు ఈ–ఆటోలు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్లో చెత్త సేకరణకు నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన పట్టణాలకే పరిమితమైన ఈవీలు ఇకపై ఆదిలాబాద్ పట్టణ వీధుల్లోనూ దర్శనమివ్వనున్నాయి. కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవతో వీటి కొనుగోలుకు మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించించింది. ఈ మేరకు ఆన్లైన్ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తోంది. ఈ నెల 7న ఖరారు చేసి వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్లను ఎంపిక చేయనున్నారు. ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ నెలాఖరులోగా వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో డిజిల్‌తో నడిచే ఆటోలు, ట్రాక్టర్లనే చెత్త సేకరణకు వినియోగిస్తున్నారు. అయితే ఇంధన వ్యయం బల్దియాకు భారంగా మారుతోంది. పైగా వాటి నుంచి వచ్చే పొగ కారణంగా కాలుష్యం వెదజల్లుతుంది. అంతేకాదు పలు వాహనాలు ఏళ్ల క్రితం నాటివి కావడంతో వాటి స్థానంలో నాలుగు కొత్త వాహనాలను రూ.48లక్షలతో కొనుగోలు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ ఏడాది జూన్ 29న నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చారు. అయితే టేబుల్ ఎజెండాగా చేర్చడంపై బీజేపీతో పాటు బీఆర్ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో ఆమోదం లేకుండానే సమావేశం వాయిదా పడింది. మెజార్టీ సభ్యులు వ్యతిరేకించడంతో చైర్పర్సన్ ఎజెండా అంశాల ఆమోదం కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు ట్రాక్టర్లు కూడా .. అలాగే నాలుగు ట్రాక్టర్లు సైతం కొనుగోలు చేయాలని నిర్ణయించిన అధికారులు వాటికి గత నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ట్రాలీతో కూడిన ట్రాక్టర్లను సరఫరా చేసేందు కోసం రూ.39లక్షలతో ఆన్లైన్ టెండర్లు చేపట్టారు. సికింద్రాబాద్‌కు చెందిన యువ కేంద్రీయ ఉద్యోగ అనే ఏజెన్సీ 1.5 లెస్‌కు దాఖలు చేసింది. సింగిల్ టెండర్ దాఖలుతో సరఫరా బాధ్యతలను సదరు ఏజెన్సీకే అప్పగించారు. ఈ మేరకు గత నెల 28న అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ నెలాఖరులోగా సంబంధిత ఏజెన్సీ ట్రాక్టర్లను సరఫరా చేయాల్సి ఉంది. పర్యావరణ పరిరక్షణకు దోహదం డిజల్, పెట్రోల్‌తో నడిచేవి కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ సైతం అలాగే సూచించారు. ఈ మేరకు చెత్త సేకరణ కోసం ఆరు నాలుగు చక్రాల వాహనాల(ఆటోల) కొనుగోలుకు టెండర్లు నిర్వహిస్తున్నాం. 7న ఖరారు చేస్తాం. త్వరలోనే వాహనాలు రానున్నాయి. పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఆదాకు తోడ్పడనున్నాయి. – అరుణ్‌కుమార్, మున్సిపల్ ఇంజనీర్ కలెక్టర్ చొరవతో.. ఎజెండా అంశాలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా అత్యవరమైన కొన్ని అంశాలను ఆమోదించారు. ఇందులో కౌన్సిల్ ప్రతిపాదించిన నాలుగు కాకుండా మరో రెండింటిని అదనంగా చేర్చి చెత్త సేకరణకు డిజిల్వి కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రూ.90లక్షల వ్యయంతో ఆరు వాహనాల కొనుగోలుకు అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసి ఈ నెల 7వరకు ఆన్లైన్లో దాఖలుకు గడువు విధించారు. అదేరోజు ఖరారు చేసి కాంట్రాక్టర్లను ఎంపిక చేయనున్నారు. నెలాఖరులోగా ఈవీలను అందించేలా గడువు విధించనున్నట్లు సమాచారం. ఈ వాహనాల కొనుగోలు ద్వారా ఇంధన వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తోంది. చార్జీంగ్‌తో నడిచే ఈ వాహనాల ద్వారా శబ్దం రాకపోవడంతో పాటు ఎలాంటి పొగ వెదజల్లదు. -
రాయితీ బియ్యం స్వాధీనం
ఆదిలాబాద్‌టౌన్: రాయితీ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సునీల్‌కుమార్ తెలి పారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో వివరా లు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎ రోడ్రామ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా వె ళ్తున్న మ్యాక్స్ వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో 6 క్వింటాళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యం లభ్యమైనట్లు తెలిపారు. నిందితులు ప్రజల వద్ద నుంచి బియ్యం సేకరించి అక్రమంగా మ హారాష్ట్రకు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ప్ర స్తుతం రాంనగర్లో నివాసం ఉంటున్న మహా రాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జివితికి చెందిన అరవింద్ కాశీనాథ్ జవాలే, ఆదిలాబాద్ పట్ట ణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పంకజ్ కుష్వాహా, కోలిపూరకు చెందిన షేక్ కబీర్‌ను అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వివరించారు. విద్యుదాఘాతంతో కౌలురైతు మృతిమంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యుదాఘాతంతో బావిలో పడి కౌలు రైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు హాజీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నర్సింగాపూర్‌కు చెందిన సీపెల్లి రాజయ్య (48) మంగళవారం తన భార్యతో కలిసి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పొలం వద్దకు వెళ్లాడు. పొలంలో ఉన్న బావిలో ఏర్పాటు చేసిన మోటార్ తక్కువ నీళ్లు పోస్తుందని అందులోకి దిగి మోటార్‌ను పరిశీలిస్తుండగా షాక్‌కు గురై నీటిలో పడిపోవడంతో మృతి చెందాడు. మృతుని భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. హోంగార్డు ఆత్మహత్యమందమర్రిరూరల్: పట్టణంలోని మూడవ జోన్లో నివసించే హోంగార్డు వేముల లక్ష్మణ్(46) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్‌కు భార్య స్రవంతితో గొడవలు ఉండగా కేసు నమోదైంది. నాలుగు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంటి వద్ద ఒక్కడే ఉంటున్నాడు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన మిత్రుడికి ఫోన్ చేసి చెప్పాడు. అతడు పోలీసులకు తెలియజేయగా సంఘటన స్థలానికి వెళ్లి చూడగా ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. అతడికి భార్య భార్య, కుమారుడు ఉన్నారు. అత్యాచారం, హత్య కేసులో ఒకరికి జీవితఖైదునిర్మల్టౌన్: బాలుడిపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా విధి స్తూ.. నిర్మల్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యా యమూర్తి ఎస్.శ్రీవాణి మంగళవారం తీర్పునిచ్చినట్లు నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. రూరల్ మండలంలోని చిట్యాల్ గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్ అలియాస్ రాజు కొన్ని నెలల క్రితం ఓ బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేయడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి ఎస్సై లింబాద్రి, సీఐ రామకష్ణ, ఏఎస్పీ రాజేష్ మీనా దర్యాప్తు చేపట్టి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు. -
నకిలీ దందా C/0 ఇచ్చోడ!
ఇచ్చోడ: నకిలీ ధ్రువీకరణ పత్రాల పర్వం ఆది లా బాద్ జిల్లాలో కొనసాగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు ఏదో ఒకచోట సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంతకాలంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా నకిలీల జోరు మాత్రం తగ్గడంలేదు. ఇచ్చోడ మండలంలో పంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ రబ్బర్ స్టాంప్ తయారు చేసి అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి వివిధ రకాల పత్రాలు సృష్టించిన ముఠాను పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది వ్యక్తుల ప్రమేయంతోనే దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 2020లో ప్రారంభం.. ఇచ్చోడ కేంద్రంగా మొదటిసారిగా 2020లో తప్పుడు పత్రాలు సృష్టించి ఆధార్‌కార్డులో వయస్సును మార్పింగ్ చేసి కల్యాణలక్ష్మి పథకం కింద డబ్బులు డ్రా చేసుకున్న సంఘటన అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. అప్పటి బీజం నేటికీ కొనసాగుతూనే ఉంది. రెండేళ్ల క్రితం ఇచ్చోడ మండల కేంద్రంలో ఆధార్ కార్డులో ఫొటో, పుట్టినతేదీ మార్పింగ్ చేస్తున్న కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిచారు. అప్రమత్తంతో ఆగిన తంతు.. ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్‌లో నివాసముంటున్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ముగ్గురు ఉద్యోగాలు పొందడంతో 2024 జూలై నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 189 మంది నివాస ధ్రువీకరణ పత్రాలకోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన రెవె న్యూ అధికారులు దరఖాస్తులన్నింటినీ తిరస్కరించడంతో నకిలీల తంతు అక్కడితోనే ఆగిపోయింది. పొంచి ఉన్న ప్రమాదం ఇచ్చోడ కేంద్రంగా కొన్నేళ్లుగా కొనసాగుతున్న నకిలీ ధ్రువీకరణ పత్రాలతో భవిష్యత్‌లో ప్రమాదం పొంచి ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.కఠినచర్యలు తీసుకుంటాం నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ పత్రాలు సృష్టించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. జిల్లా వ్యాప్తంగా పలు కేసులు నమోదు చేశాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ, ఆదిలాబాద్ 2024లో తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు..మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొంతమంది నిరుద్యోగ యువకులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్‌లో నివాసం ఉంటున్నట్లు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ముగ్గురు బీఎస్ఎఫ్లో ఉద్యోగంలో చేరారు. ఇంద్రవెల్లి, సిరికొండ, నేరడిగొండ మండలాల్లో మరో ఆరుగురు ఉద్యోగాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందుకు సహకరించిన ఇస్లాంనగర్‌కు చెందిన ఇద్దరు, కేశవపట్నంకు చెందిన మరోవ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా జరిగిన సంఘటనలో సైతం కేశవపట్నం, గుండాల, ఇస్లాంపుర కాలనీలకు చెందిన నిందితులు ఉండడం గమనార్హం -
ఇంటర్ కళాశాలల్లో క్వాలిటీ ఫుడ్..
మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఇంటర్ విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆహార నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రమైన క్యాంపస్ వైపు అడుగులు వేస్తోంది. విద్యార్థులకు పోషకాహర పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు న్యూట్రిషన్ కమిటీలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై శానిటేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీల ఏర్పాటు ఇలా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 47 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 19,950 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక నుంచి ఇంటర్ కళాశాలల్లో న్యూట్రిషన్, శానిటేషన్ నిర్వహణ బాధ్యతలు అధ్యాపకులు, విద్యార్థులకు అప్పగించనున్నారు. ఫుడ్ కమిటీలో ఇద్దరు అధ్యాపకులు, పది మంది విద్యార్థులు, శానిటేషన్‌లో ఒక అధ్యాపకుడు (నోడల్ లెక్చరర్), ఇద్దరు విద్యార్థులు ఉండనున్నారు. ఫుడ్ కమిటీ విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారంపై పరిశుభ్రత, పారిశుద్ధ్యం పనులపై శానిటేషన్ కమిటీ పర్యవేక్షించనుంది. ఆహారంలో నాణ్యత, రుచి లేకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో మెనూ మార్చడం, ఫుడ్ క్వాలిటీ చెక్ చేయడంలో ఫుడ్ కమిటీలు ఎక్కువగా దృష్టి సారించనున్నాయి. ఫుడ్ (న్యూట్రిషన్) కమిటీల బాధ్యతలు విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత పర్యవేక్షణలో ఫుడ్ కమిటీలు కీలకం కానున్నాయి. ప్రతీ రోజు అందించే ఆహార వివరాలు, విద్యార్థుల సంఖ్య, లోపాలు, ఆలస్యాలను న్యూట్రిషన్ స్కీం రిజి ష్టర్లో నమోదు చేస్తారు. తాగునీటి నాణ్యతపై దృష్టి సారిస్తారు. పరిశుభ్రత పర్యవేక్షణకు.. విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్యం, పరిశుభ్రతను పరిరక్షించడానికి శానిటేషన్ కమిటీలు అత్యంత కీలకం. తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, కళాశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచడం. డస్ట్బిన్ల ఏర్పాటు, విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత, పరిశుభ్రమైన అలవాట్లపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం. విద్యార్థుల సంఖ్యను బట్టీ ఇందుకు అవసరమైన స్వీపర్, స్కావెంజర్‌ను నియమించుకునే వీలుంటుంది. ఇందుకు కళాశాల ఫెసిలిటీ మెయింటనెన్స్ గ్రాంటు కింద రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు నిధులు వెచ్చించే వెసులుబాటు కల్పించారు. ఆరోగ్యకరమైన క్యాంపస్‌కు విద్యార్థుల భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు. -
ఇందన్పల్లి రేంజ్ అధికారి సస్పెన్షన్
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ ఇందన్పల్లి ఇన్చార్జి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఎఫ్డీపీటీని ఇక్కడి నుంచి పంపించేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుందన్నారు. రేంజ్ అధికారిపై చర్యలకు ఉన్నతాధికారులు స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ కమి టీ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందునాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, రియాజొద్దీన్, శంకరయ్య, సోహేల్, అజ్మత్ పాల్గొన్నారు. -
అన్న మృతిపై చెల్లెలి అనుమానం..!
కుంటాల: మండలంలోని లింబా(బి) గ్రామానికి చెందిన దోత్రె బాలాజీ (36) సోమవారం రాత్రి ఇంట్లో భార్యతో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాట మాట పెరిగి గొడవ కాస్త పెద్దదిగా కావడంతో కుటుంబ సభ్యులు బాలాజీని ఇంట్లో ఉంచి బయటనుంచి గడియ పెట్టారు. కొద్దిసేపటికి ఇంట్లో నుంచి ఎలాంటి శబ్ధం రాకపోవడంతో గడియ తీసి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మంగళవారం మృతుని సోదరి పల్లెపు లక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు భైంసా రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని భైంసా ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్ పరిశీలించారు. -
అడవి పందులను తరలిస్తున్న బొలెరో పట్టివేత
బాసర: బాసర గోదావరినది వద్ద ఉన్న అటవీశాఖ చెక్‌పోస్ట్‌లో మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో అడవి పందులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాందే డ్ నుంచి సిద్దిపేటకు సుమారు 23 అడవి పందులను బొలెరో వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాహనంతో పాటు ఇద్దరిని భైంసా అటవీశాఖ కార్యాలయానికి తరలి ంచినట్లు డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.శంకర్ పే ర్కొన్నారు. తనిఖీల్లో ఫారెస్ట్ బీట్ అధికారులు శివ, సంజయ్, చెక్‌పోస్ట్ వాచర్లు సద్దాం, న రేంద్ర, అనిమల్ ట్రాకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఆదిలాబాద్(బేల): గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జైనథ్ సీఐ జి.శ్రావణ్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బేల ఎస్సై మధుకృష్ణకు అందిన స మాచారం మేరకు మార్కెట్ యార్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కోర్పన తాలూకా తిప్ప గ్రామానికి చెందిన భీమా గోవింద్ ఆత్రం పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించాడు. అతన్ని తనిఖీ చేయగా, 10 గ్రాము ల ఎండిన గంజాయి లభించింది. విచారణలో తన కు చెందిన వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్య గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అనంతరం మహారాష్ట్రలోని అతని వ్యవసాయ భూమికి వెళ్లి 14 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. గుడుంబా స్థావరాలపై దాడులు బేల పోలీస్ స్టేషన్ పరిధిలోని సైద్పూర్లో మంగళవారం గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 20 లీటర్ల గుడుంబా మిశ్రమం, 30 కిలోల ఇప్పపువ్వు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు సీఐ శ్రావణ్ తెలిపారు. రాథోడ్ ఈశ్వర్, పూసం లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
ఆగని అంబులెన్స్‌ల ఆగడాలు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలో ప్రైవేటు అంబులెన్సుల ఆగడాలు మితిమీరుతున్నాయి. రోగులను తరలించడంలో వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదులు అందుతుండగా, సోమవారం రాత్రి జరిగిన సంఘటన అమానుషంగా ఉంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో నివాసం ఉంటున్న వెలగపూడి నాగభూషణం (65) సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా, తమకు తెలిసిన అంబులెన్సులో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులు అదే అంబులెన్సులో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చి శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఆసుపత్రి వద్ద ఉన్న అంబులెన్సు సిబ్బంది మార్గమధ్యలో అడ్డుకున్నారు. సీరియల్ నంబర్ తమదని, తమ అంబులెన్సులోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలని, వాగ్వాదానికి దిగారు. అంబులెన్సును తిరిగి ఆసుపత్రికి రప్పించి, వారి అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి తరలించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. చనిపోయిన బాధలో ఉన్న వారితో అంబులెన్సు నిర్వాహకులు ప్రవర్తించిన తీరు జిల్లా కేంద్రంలో చర్చనీయాంశం కాగా, ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా, ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) కళాశాల విద్యార్థి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బండారి వినయ్ ఇటీవల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. 400 మీటర్ల పరుగుపందెం పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 7నుంచి హన్మకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వినయ్ పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్‌సాగర్ తెలిపారు. సదరు విద్యార్థిని మంగళవారం కళాశాలలో అభినందించారు. ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి, అధ్యాపకులు కమలాకర్, వర్మ, శ్రీనివాస్, పీఈటీలు అల్లూరి వామన్, ఎం.రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
కడెం నదీ తీరాన అలరించిన షూటింగ్
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో గల కడెం నది పరీవాహక ప్రాంతంలో మంగళవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. 2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి అధికారిక సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ‘నగరానికి ఏమైంది’ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ ధాస్యం దర్శకత్వం వహిస్తుండగా, ప్రధాన పాత్రల్లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మగాంటి, అనీషా ఆంబ్రోస్ నటిస్తున్నారు. ప్రకృతి అందాలు, పచ్చదనంతో కూడిన దృశ్యాల నడుమ కీలక సన్నివేశాలను చిత్రీ కరించారు. విషయం తెలుసుకున్న నేరడిగొండ పరి సర గ్రామాల ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో కడెం నది తీరానికి తరలివచ్చారు. తమ అభిమాన నటీనటులు విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం తదితరులను నేరుగా చూడటానికి ఆసక్తి కనబర్చారు. -
ఐస్‌క్రీమ్‌లో ఈగ
తాండూర్: మండల కేంద్రంలోని ఓ స్వీట్‌హౌజ్‌లో కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో ఈగ రావడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే...కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటికి చెందిన తిరుపతి మంగళవారం తన కుమారుడికి మండల కేంద్రంలోని బాలాజీ దేవ్నారాయణ స్వీట్‌హౌజ్‌లో శివశక్తి కంపెనీకి చెందిన చాకోబార్ ఐస్‌క్రీమ్ కొనిచ్చాడు. దానిని ఆ బాలుడు తింటుండగా అందులో చనిపోయిన ఈగ కనిపించింది. దీంతో బాధితుడు ఫుడ్ ఇన్స్పెక్టర్, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తరచూ స్వీట్‌హౌజ్‌లు, హోటళ్లతో పాటు ఇతర దుకాణాలపై నిత్యం తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయని, అధికారులు ఇప్పటికై నా తనిఖీలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాగి తీగ, ఆయిల్ చోరీముధోల్ : మండలంలోని ఎడ్బిడ్ గ్రామం నుండి ఎడ్బిడ్ తండాకు వెళ్లే రహదారిలో చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి అందులోని రాగి తీగ, ఆయిల్ దొంగిలించారు. ఈ ఘటనతో రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
● ‘మత్స్య’ పంపిణీకి సర్కారు నిర్ణయం ● టెండర్ల నిర్వహణకు అధికారుల కసరత్తు ● ఈ నెలాఖరులోగా సీడ్ వదిలేలా కార్యాచరణ
కై లాస్‌నగర్: కులవృత్తిపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉచిత చేప పిల్లల పంపిణీ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించింది. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. సీడ్ వదిలేందుకు ఇదే అనువైన సమయమని సర్కారు భావించింది. ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. చేప పిల్లల సరఫరాకు సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సారి ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. కరుణించిన వరుణుడు .. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ ఉంటుందో లేదోనని మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇటీవల అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన ఎడతెరిపిలేని వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లకు జలకళ వచ్చేసింది. దీంతో చేప సీడ్ పంపిణీకి మార్గం సుగమమైంది. టెండర్ల నిర్వహణకు కసరత్తు చేప సీడ్ పంపిణీ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.116 కోట్ల నిధులు కేటాయించింది. టెండర్ల ప్రక్రియ చేపట్టాలని మత్స్యశాఖను ఆదేశించింది. గతేడాది మాదిరిగా ఈసారి కూడా 116.23 లక్షల చేప పిల్లలను 224 చెరువులు, రిజర్వాయర్లలో వదిలేలా మత్స్యశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 216 సీజనల్ చెరువుల్లో కట్ల, రహు, బంగారు తీగ చేపలను 35, 35, 30 శాతం నిష్పత్తిలో వదలనున్నారు. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులతో పాటు మరో ఆరు పెద్ద చెరువుల్లో కట్ల, రహు, మృగల చేపలను 40, 50, 10 శాతం నిష్పత్తిలో వదిలేలా కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టెండర్ల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 6న నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. సీడ్ సరఫరా సామర్థ్యంకు అనుగుణంగా కాంట్రాక్టర్లను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ నేతృత్వంలోని డీపీసీ ఎంపిక చేయనుంది. ఇలా ఎంపికై న వారు నిబంధనలకు అనుగుణంగా సీడ్‌ను జలాశయాల్లో వదలాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వచ్చేనెల మొదటివారంలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. త్వరితగతిన చేపడితేనే ప్రయోజనం.. సాధారణంగా చేప సీడ్‌ను జూలై, ఆగస్టులో వదిలితేనే అవి మార్చి వరకు సమృద్ధిగా ఎదిగి పట్టుకుని విక్రయించేందుకు అవకాశముంటుంది. తద్వారా మత్స్యకారులకు ప్రయోజనం దక్కుతుంది. అయితే గతేడాది నుంచి సీడ్ పంపిణీలో తీవ్ర జాప్యమవుతోంది. డిసెంబర్ వరకు కూడా సీడ్ వదలడంతో చేపలు ఎదుగుదలపై ప్రభావం చూపింది. ఈ సారి కొంత ఆలస్యంగానైనా చెరువులు నిండినందున ప్రభుత్వం ప్రక్రియను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు. జిల్లాలో.. మత్స్యపారిశ్రామిక సంఘాలు 107 మత్స్యకార సంఘాల్లోని సభ్యులు 5,040 జిల్లాలో మొత్తం చెరువులు 224 చేప పిల్లల పంపిణీ లక్ష్యం 1.16కోట్లు 35–40 ఎంఎం సైజ్ 83.53 లక్షలు 90–100ఎంఎం సైజ్ 32.70లక్షలు -
డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి
కై లాస్‌నగర్: ఎస్ఐఆర్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్ర ధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో సర్ ప్రక్రియ ప్రగతిపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, తప్పులు దొర్లకుండా డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఒకే కుటుంబసభ్యులను ఒకే పోలింగ్ కేంద్రం కిందకు వచ్చేలా రేషనలైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇందులో కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా తదితరులు పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేయాలికైలాస్నగర్: జిల్లాలో ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పనుల పురోగతిపై కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉన్నతస్థాయి సమావేశం దృష్ట్యా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నీటిపారుదల, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికా రులతో వేర్వేరుగా సమీక్షించారు.ఇందులో అదనపుకలెక్టర్లు చిత్రు,రాజేశ్వర్, ల్యాండ్ సర్వేయర్ ఏడీ ప్రభాకర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. ముదిరాజ్‌ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తాఆదిలాబాద్: ముదిరాజ్‌ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావి స్తానని ఎమ్మెల్యే పా యల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పా ర్కులో సోమవారం ని ర్వహించిన భీమన్న పండుగ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. అంతకుముందు కోలీపూర్ కాలనీ నుంచి భీమన్న దేవుని ప్రతి మను పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా గాంధీ పార్కులోని ఆలయం వరకు శోభాయాత్రగా తీసుకువచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, మాజీ మంత్రి జోగు రామన్న, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, బీసీ సంఘం నాయకులు చిక్కాల దత్తు, క లాల శ్రీనివాస్, సనాతన హిందూ ఉ త్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కు మార్ ఖత్రి, తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల వెల్లువ
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఒకరు.. పింఛన్ అందించి ఆదుకోవాలని మరొకరు.. ఉపాధి కల్పించాలని మరికొందరు ఇలా వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితులు జిల్లా ఉన్నతాధికారులకు తమ గోడు విన్నవించుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు ఎస్. రాజేశ్వర్, చిత్రుతో కలిసి అర్జీలు స్వీకరించారు. సమస్యలను ఆలకించిన కలెక్టర్ వాటిని సత్వరమే పరిష్కరించి బాధితులకు సాంత్వన చేకూర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో స్రవంతి, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, కలెక్టరేట్ ఏవో వర్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 109 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన .. -
ఉత్తమ సేవలకు ప్రశంస
ఆదిలాబాద్‌టౌన్: విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే సిబ్బందికి ప్రశంసలే ఉత్తమ ప్రతి ఫలమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వా రం రోజులుగా నేరాల నియంత్రణ, ప్రజల భ ద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబర్చిన 16 మంది పోలీసు సిబ్బందికి సోమవా రం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్ర శంసాపత్రాలు అందజేశారు. గంజాయికేసుల్లో నిందితులను అరెస్టు చేయడంలో సమర్థవంతంగా పనిచేసిన ఆదిలాబాద్ వన్‌టౌన్ ఎస్సై సంజయ్‌తోపాటు సిబ్బంది మనోహర్, సలా ముద్దీన్ను అభినందించారు. అలాగే బైక్ దొంగతనం కేసులను ఛేదించి నిందితులను పట్టుకున్న టూటౌన్ సిబ్బంది క్రాంతి, నరేశ్‌లకు ప్ర శంసాపత్రాలు అందజేశారు. రైల్వేస్టేషన్ పరిసరాల్లో రాత్రి వేళల్లో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న టూటౌన్ సిబ్బంది గజానన్, అరవింద్, శ్రీని వాస్, సుధాకర్, సాయికుమార్, కిశోర్‌ను స న్మానించారు. రిమ్స్ పరిసరాల్లో మొబైల్ ఫోన్ చోరీలను అరికట్టడంలో కృషి చేసిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ టి.రఘును ప్రశంసించారు. ఆపరేషన్ కవచ్‌లో భాగంగా చెక్‌పోస్టు వద్ద వి ధులు నిర్వహిస్తూ పశువుల అక్రమ రవాణాను అడ్డుకొని చాకచక్యంగా వ్యవహరించిన రఫీక్ హుల్ రెహ్మాన్, కిషన్, వెంకటస్వామిలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి భ కనబర్చే సిబ్బందికి ప్రశంసతో పాటు నగ దు బహుమతి కూడా అందజేస్తామని తెలి పారు. పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మ రింత పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, ఎన్.చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ సిలబస్ మారింది
మంచిర్యాలఅర్బన్: ఇంటర్ విద్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి నూతన కరికులమ్, సవరించిన పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన పద్ధతులు అమలు చేయనుంది. ఇంటర్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఆధారిత విద్యపై అధ్యాపకులకు జిల్లాస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్మీడియెట్ స్థాయిలో ఏఐ బోధన ద్వారా ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం కలుగనుంది. ఉన్నత విద్యతోపాటు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలకు పునాది పడనుంది. పాఠ్యాంశాల్లో మార్పులు.. ఇంటర్మీడియెట్ తెలుగు పుస్తకాన్ని మొత్తం మార్చేశారు. సబ్జెక్టుల వారీగా అనేక మార్పులు చేశారు. జంతుశాస్త్రంలో ప్రోటోజోవాలో గమనం, ప్రత్యుత్పత్తి తొలగించగా.. ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు, భౌతికశాస్త్రంలో ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చేర్చడంతో పాటు ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు, వృక్షశాస్త్రంలో ఆర్థిక వృక్షశాస్త్రం చేర్చి ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు కేటాయించారు. గణితంలో అనుక్రమాలు, శ్రేణులు, సమితుల సిద్ధాంతం అధ్యాయాలు చేర్చారు. రసాయనశాస్త్రంలో పదార్థాల స్థితులు, పర్యావరణ రసాయన శాస్త్రం, స్టోయికియోమెట్రీ పాఠంలో మెలారిటీ భావన తొలగించారు. మొదటి సంవత్సరం ప్రాక్టీకల్ పరీక్షల కోసం క్వాలిటేటివ్ అనాలసిస్ నుంచి 15 లవణాలు కొత్తగా చేర్చారు. హిస్టరీలో యూనిట్–6లో దక్షిణ భారతదేశం, దక్కన్రాజ్యాలు, యూనిట్–8లో ప్రాంతీయ రాజ్యాలు కొత్తగా చేర్చగా మరాఠాలు, ప్రాంతీయ శక్తుల ఎదుగుదల తొలగించారు. సుల్తానేట్ రాజవంశీయుల అంశం యూనిట్–7లో కలిపారు. యూరోపియన్ల రాక, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాటు, జాతీయోద్యమం (తొలిదశ, మలిదశ) యూనిట్లు విలీనం చేశారు. ఎకనామిక్స్‌లో పాజిటివ్ ఎకనామిక్స్, నార్రేటివ్, నార్మేటివ్ ఎకనామిక్స్ చేర్చారు. స్టాటిస్టిక్స్ సూచీ సంఖ్యలు కొత్తగా చేర్చారు. తెలుగులో పాఠ్యాంశాలు మార్పులు చేశారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇలా.. నూతన విధానాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు హైదరాబాద్‌లో పలు వేదికలపై జూలై 31 నుంచి ఆగస్టు 5వరకు మూడు విడుతల్లో రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్లు, డిస్ట్రిక్ రిసోర్స్ పర్సన్లకు (డీఆర్పీ) రెండు రోజుల శిక్షణ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 సబ్జెక్టుల్లో ఇంగ్లిష్ మినహాయిస్తే సబ్జెక్టుకు ఒక్కరి చొప్పున 10 మంది అంటే దాదాపు 40 మంది అధ్యాపకులను డీఆర్పీలుగా ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. డీఆర్పీలు జూనియర్ లెక్చరర్లకు ఇదే తరహాలో రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాథమికాంశాలైన ఏఐ నిర్వచనం, చరిత్ర, రోజువారీ జీవితంలో దాని అప్లికేషన్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిప్ లెర్నింగ్ మధ్య తేడాలు, గణిత శాస్త్రానికి ఏఐ, ప్రోగ్రామింగ్ పునాదులు, తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.శిక్షణ అనంతరం..రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్పీలు జిల్లాల వారీగా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. మారిన సిలబస్‌లో కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో తీసివేసిన, కొత్తగా చేర్చిన పాఠ్యాంశాలను సులభంగా ఎలా బోధించాలో అవగాహన కల్పించనున్నారు. క్లాస్‌రూమ్‌లలో టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సాధనాలు, డిజిటల్ పద్ధతులను ఉపయోగించి పాఠాలను ఆకర్షణీయంగా ఎలా చెప్పాలో శిక్షణ ఇస్తారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే నూతన అసెస్మెంట్, పరీక్షల ప్యాట్రన్‌పై స్పష్టతనిస్తారు. కేవలం సబ్జెక్టు బోధన మాత్రమే కాకుండా విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా గైడెన్స్ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేయనున్నారు. -
జడ్జి కదిలివచ్చి.. వాంగ్మూలం స్వీకరించి
ఆదిలాబాద్‌టౌన్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కోర్టు బయట ఉన్న నిందితుడి వద్దకే ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి బి.సి.శశికుమార్ వచ్చి సోమవారం విచారించారు. ఆసిఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2020లో రేణు పోశం అనే వ్యక్తి ముంజం మల్లయ్యకు రెండేళ్లపాటు తన పొలాన్ని కౌలుకు ఇచ్చాడు. ఆ తర్వాత తానే వ్యవసాయం చేసుకుంటానని ట్రాక్టర్‌తో పొలానికి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మల్ల య్య.. పోశంతో పాటు మరో ఆరుగురిపై పోలీసు స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదు చేశాడు. కేసు విచారణలో భాగంగా ఆరుగురిని కోర్టులో విచారించిన జడ్జి అనారోగ్యంతో బాధపడుతూ వాహనంలో వచ్చిన పోశం వద్దకు చేరుకొని విచారించారు. -
సీడ్ త్వరగా వేస్తేనే ప్రయోజనం
ఏటా సీడ్ ఆలస్యంగా వదల డం ద్వారా మార్చి వరకు నీరు అడుగంటి చేపల బరువు తగి నంతగా పెరగడం లేదు. పంపి ణీ దశలోనే ఎక్కువగా చనిపోతున్నాయి. దీంతో నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా త్వరితగతిన పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. – అల్లుల భోజన్న, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు 6న టెండర్ నోటిఫికేషన్ చేప సీడ్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిధులు సైతం కేటాయిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం ఈనెల 6న టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తాం. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తాం. ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. -
‘ఎస్టీపీ’లకు మోక్షమెప్పుడో?
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేసింది. ప్రధాన పైపులైన్లతో పాటు నాలుగు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)లను నిర్మించాల్సి ఉంది. మూడేళ్లు గడుస్తున్నా ఆ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. నిర్మాణాలకు అవసరమైన స్థలాల సేకరణకు సంబంధించిన నిధులను రెవెన్యూ శాఖకు జమచేసి రెండు నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. దీంతో పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ పట్టణానికి అమృత్ 2.0 కింద కేంద్రం అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి గాను 2023 మే నెలలో రూ.225.46 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ పనులు చేపట్టేందుకు వీలుగా బల్దియా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించారు. 24 కిలోమీటర్ల మేర ప్రధా న పైపులైన్‌తో పాటు నాలుగు మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీల)ను నిర్మించేలా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి 2023లోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్‌తో పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు అగ్రిమెంట్ సైతం చేసుకున్నారు. ఈ ప్రక్రియ జరిగి మూడేళ్లవుతున్నా పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పు డు మొదలవుతాయో కూడా తెలియని పరిస్థితి. భూ సేకరణలో తీవ్ర జాప్యం ... రూ.160 కోట్ల వ్యయంతో నాలుగు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. 80శాతం పట్టణానికి సంబంధించిన మురుగునీటిని శుద్ధి చేసేలా చిల్కూరి లక్ష్మీనగర్‌లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎస్టీపీని నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఆలాగే ఆయా కా లనీలకు సంబంధించిన మురుగునీటిని శుద్ధి చేసే లా కేఆర్కే, బంగారుగూడ, ఇందిరమ్మ కాలనీల్లో ఒకటిన్నర ఎకరం చొప్పున మరో మూడు ప్లాంట్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించారు. అయితే ఇప్ప టి దాకా భూసేకరణ దిశగా అడుగు ముందుకు పడలేదు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడం లేదని తెలుస్తోంది. రూ.8.9 కోట్ల నిధుల జమ ఎస్టీపీల నిర్మాణాలకు అవసరమైన స్థలాల సేకరణ కోసం రూ.8.9 కోట్లు అవసరమం కానుండగా ఆ మొత్తం నిధులను ఈ ఏడాది మే 7న రెవెన్యూశాఖ ఖాతాలో జమ చేశారు. వాటితో భూములను సేకరించాల్సి ఉంది. నిధులు జమ చేసి రెండు నెలలు గడిచినా రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. దీంతో భూ సేకరణలో తీవ్ర జాప్యం అవుతోంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు భూసేకరణ చేపడుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ కాలనీలో ప్రతిపాదించిన ఎస్టీపీని మరో చోటకు తరలించే అవకాశముంది. మిగతా మూడింటికి స్థలాలను సేకరిస్తే పనులు ప్రారంభించే అవకాశముంది. రెవెన్యూ, పబ్లిక్ హెల్త్ అధికారుల మధ్వ సమన్వయం లేకపోవడంతోనే స్థల సేకరణలో జాప్యం అవుతుందనే విమర్శలున్నాయి. రెవెన్యూ అధికారులదే బాధ్యతఎస్టీపీల నిర్మాణాలకు సంబంధించిన స్థలాల సేకరణకు అవసరమైన నిధులను రెవెన్యూశాఖకు జమ చేశాం. వారు రైతుల నుంచి భూములు సేకరించి మాకు అప్పగించాల్సి ఉంది. ఆర్డీవో ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. భూములను మాకు అప్పగించిన వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – అరుణ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ ఎస్టీపీల నిర్మాణాల వివరాలునిర్మించే ప్రాంతం సామర్థ్యం (ఎంఎల్డీలలో) చిల్కూరిలక్ష్మినగర్ 28 కేఆర్కే కాలనీ 1.5 బంగారుగూడ 1 ఇందిరమ్మకాలనీ 1 -
‘ముస్కాన్’ విజయవంతం
ఆదిలాబాద్‌టౌన్: బాలల సంరక్షణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ జిల్లాలో విజయవంతంగా ముగిసిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జూలై 1 నుంచి 31 వరకు నెలరోజులపాటు వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 141 మంది బాల బాలికలను రక్షించి, వారిని చైల్డ్వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరుపర్చడంతో పాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, బాల కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలను రక్షించడం, వారిని కుటుంబాలకు చేర్చడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ ఏడాది ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా పలు శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, దుకాణా లు, పరిశ్రమలు, వర్క్‌షాప్‌లు, ఇతర సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. 18 ఏళ్ల లోపు పిల్లలతో పనిచేయిస్తున్న యజమానులపై 53 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాలల హక్కులను కాపాడటం అందరి బాధ్యత అని అన్నారు. వీధుల్లో సంచరిస్తున్న చిన్నారులు, బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులు, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అభినందించారు. -
కాంగ్రెస్ బలోపేతానికి కృషి
జైనథ్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌యాదవ్ అ న్నారు. మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తలతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి చేరవేసేందు కు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చే యాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, సాజిద్ ఖాన్, సంజీవ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. భోరజ్, సాత్నాలలో..సాత్నాల: కాంగ్రెస్ పార్టీ భోరజ్, సాత్నాల మండల కమిటీల నియామకాల కోసం ఆయా మండలకేంద్రాల్లో ఆదివారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తూ పారదర్శకంగా సిద్ధం చేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ అధికార ప్రతినిధి గోవర్ధన్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ పటేల్, దీపక్‌రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విమానాశ్రయానికి కాంగ్రెస్ కృషే కారణంఆదిలాబాద్(బేల):జిల్లాకు విమానాశ్రయం మంజూ రుకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి కృషే ప్రధాన కారణమని రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే విమానాశ్రయం కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసి పునా ది వేశానని తెలిపారు. అభివృద్ధి పనులకు బీజేపీ నాయకులు క్రెడిట్ తీసుకోవడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ కార్డులు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో మాధవ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ రాష్ట్ర సదస్సులో జిల్లా ప్రతినిధులు
ఆదిలాబాద్: హన్మకొండలో ఆదివారం నిర్వహించిన రెండో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ టెక్నికల్ అధికారుల సదస్సులో అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్, ఇండియన్ అథ్లెటిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో టెక్నికల్ అధికారులకు తాజా నిబంధనలు, పోటీల నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర అథ్లెటిక్స్ నిర్వాహకులు వెంకటేశ్వర్, అథ్లెటిక్స్ కార్యదర్శి పి.రాజేశ్, కోచ్ వీజీఎస్ రాకేశ్, వెయిట్‌లిఫ్టింగ్ కార్యదర్శి వీజీఎస్ జ్యోతీశ్వరన్ పాల్గొన్నారు. అలాగే పీడీలు సౌమ్య, సుజాత, రాజశ్రీ, రాహుల్ అగార్కర్, శివతో పాటు రాష్ట్ర అథ్లెట్లు అనిల్, వంశీ, జశ్వంత్, వసంత, అరుణ, స్వాతి ఉన్నారు. -
సమాచారం ఇవ్వకుండా సెలవు పెట్టొద్దు
ఉపాధ్యాయులు ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు సమాచారం ఇవ్వకుండా సెలవు పెట్టొద్దు. జిల్లాలో 168 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయులు సెలవు పెడితే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పక్క స్కూల్ ఉపాధ్యాయులు, సీఆర్పీ లతో చర్యలు చేపడుతున్నాం. – డి.మాధవి, డీఈవోకనీసం ఇద్దరు టీచర్లు తప్పనిసరి..విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు టీచర్లను కేటా యించాలి. ఒకే టీచర్ ఉంటే బోధన కష్టమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెడితే విద్యార్థులుకు ఇబ్బందులే. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. – శ్రీకాంత్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
సీసీఐ పునరుద్ధరించాలని వినతి
ఆదిలాబాద్: మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చర్యలు చేపట్టాలని ఎంపీ గోడం నగేశ్‌ను సీసీఐ సాధన సమితి ప్రతినిధులు కోరారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభమైతే వేలాది మందికి ఉపాధి అవకాశాలతో పాటు జిల్లా పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభిస్తుందని వివరించా రు. ఈ మేరకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఇందులో సమితి కన్వీనర్ మల్లేశ్, కోకన్వీనర్లు నారా యణ, రమేష్, సభ్యులు సంతోష్, జగన్‌సింగ్, పోశెట్టి, దేవిదాస్, ప్రశాంత్ వాగ్మారే, రమేష్, విఠల్ దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. -
నిషేధిత గడ్డిమందు తరలిస్తున్న నలుగురి అరెస్టు
తాండూర్: భీమిని పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల నిషేధిత గడ్డిమందు తరలిస్తున్న నలుగురిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తాండూర్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో భీమిని ఎస్సై కోటేశ్వర్ తన సిబ్బందితో కలిసి భీమిని మండలం రాంపూర్ శివారులో తనిఖీ నిర్వహించారు. ఇన్నోవా కారులో తరలిస్తున్న గడ్డి మందును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా వెంకటాపూర్ శివారులో తనిఖీ నిర్వహించగా రెండు బైక్‌లపై గడ్డి మందు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు క్యాన్ల, 10 ప్యాకెట్ల గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 క్యాన్లలో రూ.1.04 లక్షల విలువ కలిగిన 210 లీటర్ల గడ్డి మందు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన కాగజ్‌నగర్ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన గుండ రాజు, బట్టుపల్లికి చెందిన పార్వతి కిరణ్, భీమిని మండలం వెంకటాపూర్‌కు చెందిన రుకుం వెంకటేశ్, పల్లె రవీందర్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇన్నోవా కారు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు మహా రాష్ట్రలోని రాజురాలో గడ్డి మందును కొనుగోలు చేసి భీమిని మండల పరిధిలోని రైతులకు అమ్మడానికి ప్రయత్నించగా వారిని చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత పత్తి విత్తనాలు, గడ్డి మందును ఎవరైన విక్రయిస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ దేవయ్య, ఎస్సైలు కోటేశ్వర్, ప్రసాద్‌రావు పాల్గొన్నారు. -
జీవితంలో విలువైన బంధం
ఆదిలాబాద్‌టౌన్: స్నేహం అనేది జీవితంలో అత్యంత విలువైన బంధం. కష్టసుఖాల్లో తోడుగా నిలిచేవారే నిజమైన స్నేహితులు. ఫ్రెండ్స్‌ను ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. చెడు అలవాట్లు, మత్తు పదార్థాలు, నేరాలకు దారితీసే స్నేహానికి దూరంగా ఉండాలి. సోషల్ మీడియాలో స్నేహం చేసేటప్పుడు ఆడపిల్లలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలియని వారికి వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, ఇతర సమాచారం ఇవ్వొద్దు. నా చిన్ననాటి స్నేహితుడు రోహిత్ జమ్ములో ఉంటాడు. నెలలో రెండు సార్లైనా మాట్లాడతాను. ఎక్కడ ఉన్నా స్నేహం అనేది చెరిగిపోదు. ఒకరికొకరు సలహాలు, సూచనలు ఇచ్చుకుంటాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
బస్సు కిందపడి ఒకరి ఆత్మహత్య
మంచిర్యాలరూరల్(హాజీపూర్): బస్సు కింద పడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన హాజీపూర్ మండలం రాపల్లి స్టేజీ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్‌కు చెందిన ఆసాది లింగయ్య(55) ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఆటోలో మంచిర్యాల వైపు వెళ్తున్నాడు. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసిన లింగయ్య ఒక్కసారిగా బస్సు కిందకు దూకాడు. తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య జయశీల, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కుమారుడు సునీల్, కుమార్తె సుజాత ఉన్నారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. లింగయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనస్థాపానికి గురై బస్సు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉరేసుకుని భర్త సిర్పూర్(టి): భార్యతో జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిర్పూర్(టి) ఎస్సై సాగర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లోనవెల్లి గ్రామానికి చెందిన బెండారి పితాంబర్(53), పవిత్ర దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. గ్రామంలో వారికి 12 ఎకరాల భూమి ఉంది. పదెకరాల భూమి కౌలుకు ఇస్తూ రెండెకరాలు సొంతంగా వ్యవసాయం చేసుకుంటుండేవాడు. ఈసారి 12 ఎకరాల భూమి తామే స్వతహాగా చేసుకుందామని భార్య..భర్త పితాంబర్కు చెప్పింది. తనకు ఆరోగ్యం బాగాలేదని 12ఎకరాల భూమి వ్యవసాయం చేయడం సాధ్యం కాదని చెప్పగా శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన పితాంబర్ శనివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్సపొందుతూ వివాహిత మృతి కడెం: పురుగుల మందు తాగిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై సాయికిరణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని కల్లెడకు చెందిన సీపెల్లి గంగామణి (35)ను అదే గ్రామానికి చెందిన రొడ్డ బుచ్చన్న గతనెల 7న తిట్టాడు. మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగింది. కుటుంబీకులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబర్చాలని డీవైఎస్వో దయానంద్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన అథ్లెటిక్స్, జావెలిన్‌త్రో జిల్లాస్థా యి ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించా రు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా దృష్టి సారించాలని సూచించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్ మాట్లాడుతూ, ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీ డాకారులు ఈనెల 7, 8 తేదీల్లో హన్మకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతి నిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఇందులో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రెజరర్ వీజీ ఎస్ రాకేశ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి రామేశ్వర్, పీడీ, పీఈటీల అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాంతారావు, స్వామి పాల్గొన్నారు. -
నిందితులకు శిక్షపడేలా చూడాలి
ఆదిలాబాద్‌టౌన్: దర్యాప్తు పకడ్బందీగా నిర్వహించి బాధితులకు న్యాయం చేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి బి.సి శశికుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఉ మ్మడి జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన దర్యాప్తు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. ఆలస్యం జరిగితే ప్రజలకు కోర్టులపై విశ్వాసం కోల్పోతారని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే నేరస్థలంలో సాక్ష్యాలు సేకరించి దర్యాప్తు చేపట్టాలన్నారు. నిర్దిష్ట సమయంలో చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేయాలన్నారు. బాధితులకు న్యాయం చేసి వారికి రావల్సిన నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో పీపీ ముస్కు రమణారెడ్డి, అదనపు ఎస్పీ సురేందర్‌రావు, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏసీపీ, డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్, అశోక్, లైజన్ అధికారులు రమేశ్, ఈశ్వర్‌సింగ్, రాఘవేందర్, ఉమాదేవి, గంగాసింగ్, పరశురాం, పండరి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా ల, జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థా యి కిడ్స్, జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మారయ్య ఆధ్వర్యంలో ఇటీవల మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో గురుకుల విద్యార్థులు అండర్–8 విభాగంలో గణేశ్, అండర్–10 విభాగంలో రిత్విక్, కార్తిక్, అండర్–12లో సాయిచరణ్, అండర్–16లో యశ్వంత్ ప్రతిభ కనబర్చారు. ఈనెల 7, 8 తేదీల్లో హన్మకొండ జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, పీడీ , ఉపాధ్యాయులు వీరిని అభినందించారు. -
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఫుడ్ ఫాయిజన్ ఘటన ఇంకా మరువకముందే శనివారం మరో ఘటన చోటు చేసుకుంది. గురిజాలకు వెళ్లేదారిలో ప్రభుత్వ గిరిజన బా లుర ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, ఏఎన్ఎం సైతం అస్వస్థత కు గురైన ఘటన కలకలం రేపింది. మధ్యా హ్న భోజనం చేసిన విద్యార్థులు కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకుని కడుపునొప్పితో బాధపడగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి ఏఎన్ఎం భవానీ చికిత్స తీసుకుని డిశ్చార్జీ కాగా విద్యార్థుఽలు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో అకిరానందన్, రుషి , యశ్వంత్ ,నేశ్వంత్, విష్ణు, మణిచరణ్, విక్కీ ఉన్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. -
స్నేహం ఒక గొప్ప వరం..
ఆదిలాబాద్‌టౌన్: స్నేహం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. కష్టసుఖా ల్లో అండగా నిలిచే స్నేహితులే మన బలం. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌర వం, సహకారంతో కూడిన స్నేహం ఎప్పుడు బలోపేతంగా ఉంటుంది. నేను ఇంటర్మీడియెట్ ఉట్నూర్‌లో చదివేటప్పుడు 1988లో బొజ్జ వెంకట్రాజుతో స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం ఆయన కేఎల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మా స్నేహబంధం కొనసాగుతుంది. ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉన్నాం. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ -
‘అపార్’ పూర్తి చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులకు సంబంధించిన అపార్ను వందశాతం పూర్తి చేయాలని డీఈ వో డి.మాధవి అన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో శనివారం సమావేశం నిర్వహించారు. యూడైస్, ఎన్రోల్మెంట్, డ్రాప్ బాక్స్, ఆధార్, అపార్ జనరేషన్, క్యాస్ట్ పెండింగ్ వర్క్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రాప్ బాక్స్‌లో ఉన్నవాటిని రెండు రోజుల్లో పూర్తి చే యాలని సూచించారు. ఈనెల 10లోగా ఫిజిక ల్ అటెండెన్స్, విద్యార్థుల యూడైస్ సంఖ్య ఒకేలా ఉండాలని ఆదేశించారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ రఘురమణ, ఎంఈవో సోమయ్య, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్, స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ ఉస్మానొద్దీన్, సలీ మ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బలోపేతానికి కృషి
ఆదిలాబాద్‌రూరల్: కాంగ్రెస్ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి సమావేశం మావలలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేశ్‌జాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం, నూతన డీసీసీ కార్యాలయ నిర్మాణం, మండల కమిటీల ఏర్పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. జిల్లా విద్యార్థుల ఉన్నత విద్యకోసం తలమడుగు మండలం కజ్జర్ల శివారులోని 800 ఎకరాల ప్రభుత్వ భూమిలో యూనివర్సిటీ జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు కోసం పీఏసీలో తీర్మానించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతిపాదిత కుప్టి నిల్వ సామర్థ్యాన్ని 6.5 టీఎంసీలకు పెంచి సాగు, తాగునీరు అందించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీ, సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను భాగస్వాములను చేయడం తదితర తీర్మానాలు చేసినట్టు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే తానే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ ఇన్చార్జిలు కంది శ్రీనివాస రెడ్డి, ఆడే గజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్, బోథ్, జైనథ్, ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మన్లు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మల్లెపూల సత్యనారాయణ, అల్లూరి అశోక్ రెడ్డి, కుమురం కోటేష్ , ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, నాయకులు సాజిద్‌ఖాన్, సంజీవరెడ్డి, దిగంబర్‌రావు పాటిల్, అడ్డి భోజారెడ్డి, దామోదర్ రెడ్డి, గణేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. మండల కమిటీల కూర్పుపై ‘హస్తం’ దృష్టికై లాస్‌నగర్: పార్టీ పటిష్టతపై కాంగ్రెస్ దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా సన్నద్ధమవుతుంది. ఇందు కోసం పార్టీ చేపట్టిన సంఘటన శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కమిటీల కూర్పునకు శ్రీకారం చుడుతుంది. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆదివారం ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు భోరజ్‌లో, 11గంటలకు జైనథ్‌లో, మధ్యాహ్నం 3గంటలకు బేలలో, సాయంత్రం 5 గంటలకు సాత్నాలలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఆయా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి మండల కార్యవర్గాలను ఖరారు చేయనున్నారు. ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరై సమావేశాలను జయప్రదం చేయాలని డీసీసీ అధ్యక్షుడు కోరారు. -
జాడలేని ఆడ్రెస్!
ఆదిలాబాద్‌టౌన్: విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంకా యూనిఫాం అందలేదు. దీంతో వారికి నిరీక్షణ తప్పని పరిస్థితి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో విద్యార్థులు పాత యూనిఫాం, మరికొంత మంది రంగురంగుల దు స్తులతో బడికి హాజరవుతున్నారు. ప్రభుత్వం ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమైన జూన్ నెలలోనే యూనిఫాం అందజేస్తోంది. ఈసారి కూడా బడులు తెరిచిన మొదటి రోజే యూనిఫాంతో పాటు షూ, బెల్టు అందిస్తామని ప్రకటించినా నేటికి వాటి జాడ కానరావడం లేదు. 13 మండలాలకు వస్త్రం వచ్చినా.. వాటిలో ప్యాంట్ బట్ట మాత్రమే ఉంది. షర్ట్ బట్ట ఎప్పుడు వస్తుందో తెలి యని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు స్వాతంత్య్ర దినో త్సవ సంబరా లకు పాత దుస్తులతోనే హాజరయ్యే దుస్థితి నెలకొంది. చిరిగిన దుస్తులతోనే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద విద్యార్థులే. గతేడాది ప్రభుత్వం రెండు జతల యూనిఫాంను పంపిణీ చేసింది. అయితే మొదట జూన్‌లో, ఆ తర్వాత కొన్ని నెలలకు మరో జత అందించింది. ప్రతిరోజు బడికి ఈ దుస్తులే ధరించడంతో చాలా మంది విద్యార్థులవి చిరిగిపోయాయి. వాటితోనే కొంతమంది పాఠశాలకు వస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన తల్లిదండ్రులు యూనిఫాం కొనుగోలు చేయక ఇబ్బందులు పడుతున్నారు. పంద్రాగస్టుకు పాత వాటితోనేనా.. విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫాం అందకపోవడంతో పంద్రాగస్టుకు పాత బట్టలతోనే హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యా సంవత్సరం మళ్లీ కొత్త డ్రెస్‌ను పంపిణీ చేస్తోంది. థిక్ బ్లూ ప్యాంట్, లైట్‌బ్లూ షర్ట్ అందించనున్నారు. అయితే వీటిని కుట్టించే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఇప్పటికే కొలతలు తీసుకున్నారు. ఒక్కో జతకు రూ.75 చొప్పున ప్రభుత్వం వారికి అందజేయనుంది. మెప్మా, డీఆర్డీఏ, విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగనుంది. అయితే కేజీబీవీ, యూఆర్ఎస్లకు యూనిఫాం సరఫరా అయ్యింది. ప్రభుత్వ, జెడ్పీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు అందలేదు. 13 మండలాలకు వచ్చిన వస్త్రం కూడా బల్క్‌గా వచ్చింది. వాటిని ఎమ్మార్సీ పాయింట్‌కు సరఫరా చేశారు. కట్ చేసి సంబంధిత మండలాలకు పంపిణీ చేయాల్సి ఉంది. వారు ఎస్‌హెచ్‌జీలకు అందిస్తే ఆ పనులు ప్రారంభం అవుతాయి.ప్యాంట్ సరే.. షర్ట్ బట్టేదిగతేడాది ఉన్న దుస్తులను ప్రభుత్వం మార్చింది. నీలిరంగు యూనిఫాం అందజేస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో వస్త్రం సరఫరా చేస్తే జూన్‌లో విద్యార్థులకు యూనిఫాం అందేది. రెండు, మూడు రోజుల క్రితం జిల్లాలోని 13 మండలాలకు ప్యాంట్ బట్ట వచ్చింది. ఇంకా షర్ట్ వస్త్రం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. ఉట్నూర్, ఇంద్రవెల్లి, తాంసి, తలమడుగు, నార్నూర్ మండలాలకు ఇంకా వస్త్రం చేరుకోలేదు. ఎదురుచూస్తున్నాం..ఈ విద్యా సంవత్సరంలో ఇంకా యూనిఫాం అందలేదు. గతేడాది ఇచ్చిన దుస్తులతో పా టు కలర్ డ్రెస్‌లో బడికి వస్తున్నాం. ఎప్పుడు ఇస్తారని ఎదురుచూస్తున్నాం. ఇప్పటికే బడులు ప్రారంభమై రెండు నెలలు గడిచింది. త్వరగా అందించాలి. – గంగోత్రి, పదోతరగతి విద్యార్థిని, జెడ్పీఎస్ఎస్, మావలఆగస్టు 15 నాటికి సిద్ధం..జిల్లాలోని 13 మండలా లకు సంబంధించి ప్యాంట్ వస్త్రం వచ్చింది. సంబంధిత పాఠశాలలకు సరఫరా చేస్తున్నాం. ఆగస్టు 15 నాటికి వి ద్యార్థులకు ఒక జత యూనిఫాం అందించేలా చర్యలు చేపడతాం. ఇప్పటికే కొలతలు తీసుకో వడం జరిగింది. ప్రక్రియను వేగవంతం చేస్తాం. – ఉష్కం తిరుపతి, సెక్టోరియల్ అధికారి -
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ఆ రోగ్య పాఠశాల, సీసీటీవీ ప్రారంభోత్సవానికి హాజ రై మాట్లాడారు. ప్రతి విద్యార్థి కనీసం 200 రోజులు ఖచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకోవా లన్నారు. త్వరలోనే మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పాఠశాలలో ఫిర్యాదులబాక్స్ ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నా రు. అనంతరం విద్యార్థులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, అధికారులు ఆరోగ్య పాఠశాల అంశాలపై పాటలు, ప్రసంగం, నాటికల రూ పంలో అవగాహన కల్పించారు. ముందుగా పాఠశాలలో సీసీ కెమెరాలను కలెక్టర్ ప్రారంభించారు. సీసీ కెమెరాలు విరాళంగా ఇచ్చిన దాతలు మౌనీష్, శ్రీకాంత్ సేవలను, హెచ్ఎం నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఇందులో డీఈవో మాధవి, కౌన్సి ల ర్లు రజిత, మాన్కర్ నాక్సేన్, కాంప్లెక్ హెచ్ఎం సా ధన, ఏఏపీసీ చైర్మన్ రజియా సుల్తానా, దాతలు, వి ద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్
బాసర: నిర్మల్ జిల్లా బాసర–బిద్రెల్లి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డు దుర్మరణం చెందాడు. స్థానికులు, బాసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముధోల్ గ్రామానికి చెందిన కె.బాబు (50) బాసర ట్రిపుల్ ఐటీ ప్రారంభమైనప్పటి నుంచి సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి ముధోల్ నుంచి బాసరకు రాత్రి డ్యూటీ కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో బాసర–బిద్రెల్లి మధ్య ప్రధాన రహదారిపై పంక్చర్ అయిన లారీ నిలిపి ఉంది. దానిని చీకట్లో గమనించలేకపోయిన బాబు.. వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాబు తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, 108లో క్షతగాత్రుడిని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బాబు మృతిచెందాడు. సుదీర్ఘకాలంగా ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న బాబు అకస్మాత్తుగా మరణించడంతో సహచర భద్రతా సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ఘటనపై బాసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాసర ఎస్‌హెచ్‌వో దీపక్ తెలిపారు. -
పోడుసాగుపై ఆంక్షలు ఎత్తివేయాలి
కడెం: మండలంలోని ఉడుంపూర్ గ్రామస్తులు పో డుసాగుపై అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళన చేపట్టారు. ఉడుంపూర్ రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. పంటల సాగులో నిబంధనలు ఎత్తివేయాలని నాలుగు గంటల పాటు కడెం–జన్నారం–ఉట్నూర్ ప్రధాన రహదారి వద్ద రాస్తారోకో చేపట్టి బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎఫ్‌డీవో శివకుమార్ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. పోడుసాగులో ట్రాక్టర్లు, మిషన్లను ఉపయోగించరాదని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ నిబంధన మేరకు ఎడ్ల నాగలితో సాగు చేపట్టవచ్చని తెలిపారు. సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్, పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఏళ్లుగా చేస్తున్న భూముల సాగులో ఇప్పుడు నిబంధనల పేరిట ట్రాక్టర్లు, మిషన్లను అడ్డుకోవడం సరికాదన్నారు. తమ వ్యవసాయాన్ని అడ్డుకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎఫ్ఆర్వో గంటల శ్రీనివాస్‌రెడ్డి వారికి చెప్పడంతో ఆందోళన విరమించారు. నాలుగు గంటల రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లు విసిరి దాడి చేశారు ప్రభుత్వం ఇచ్చిన ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో ట్రాక్టర్‌తో దున్నడం నేరమని కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దాని ప్రకారం ఆపాం. పలువురు గ్రామస్తులు కార్యాలయంపై రాళ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.50 వేల ఆస్తినష్టం వాటిల్లింది. నాతో పాటు, సిబ్బందికి ప్రాణహాని ఉంది. – శ్రీనివాస్‌రెడ్డి, ఎఫ్ఆర్వో, ఉడుంపూర్ -
నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టాలి
ఆదిలాబాద్‌టౌన్: కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో నేరస్తులకు శిక్షలు ప డేలా దర్యాప్తు, కోర్టు డ్యూటీ అధికారులు స మన్వయంతో పనిచేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా కోర్టు డ్యూటీ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కేసుల్లో సాక్ష్యాధారాలను పటిష్టంగా సమర్పిస్తూ, ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. అనంతరం కోర్టు విధుల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేశారు. ఇందులో డీసీఆర్బీ ఎస్సై ప్రవీణ్, కోర్టు లైజన్ అధికారులు గంగాసింగ్, పండరి, కోర్టు డ్యూటీ అధికారులు, డీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు. పిప్పర్వాడలో ‘పోలీసులు మీకోసం’సాత్నాల: భోరజ్ మండలం పిప్పర్వాడలో శనివారం పోలీసులు మీకోసం కార్యక్రమం నిర్వహించారు.వాలీబాల్ పోటీలో విజేత జట్టుకు ఎస్పీ బహుమతి ప్రదానం చేశారు. పూసాయి గ్రామంలో ఏర్పాటు చేసిన 17 సీసీ కెమెరాలను ప్రారంభించారు. 15 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్, ఎస్సైలు పవర్ గౌతం, పీర్ సింగ్, పిప్పర్వాడ సర్పంచ్ సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఖైదీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి
ఆదిలాబాద్‌టౌన్: ఖైదీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇ వ్వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసుశా ఖ చేపట్టిన సెక్యూరిటీ రివ్యూలో భాగంగా శుక్రవా రం జిల్లా జైలును సందర్శించారు. భద్రతా ఏర్పా ట్లు,ఖైదీల సంక్షేమం, పెరోల్ ప్రక్రియపై ఎస్పీ ఆరా తీశారు. అనంతరం ఆవరణను పరిశీలించి ఖైదీల బ్యారక్‌లు, జైలు ఆస్పత్రి, వంటశాల, పరి పాలన విభాగాలు, ఇతర గదులను తనిఖీ చేశారు. ప్రహరీ, ప్రధాన ద్వారం, వాచ్టవర్లు పరిశీలించి భద్రత ప్రమాణాలు పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, వెంకటనర్సయ్య, జైలు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ పి.గోపిరెడ్డి, జైలర్ ఎన్.చంద్రశేఖర్, సీఐ కె. నాగరాజు, ఆర్ఐ డి.వెంకటి,సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా నాకాబందీ జిల్లా వ్యాప్తంగా శుక్ర వారం ప్రత్యేక నాకాబందీ ని ర్వహించారు. మొత్తం 25 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ నాగరాజు, వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎయిర్‌పోర్టు భూసర్వే ప్రక్రియ షురూ
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణ కు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ షురూవైంది. భూసేకరణ, హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వా గుల మళ్లింపు, కరెంట్ స్తంభాల తొలగింపు వంటి తదితర పనుల కోసం ప్రభుత్వం ఇటీవల రూ. 2,278.14కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ భూ సేకరణ ప్రక్రియను ఏ విధంగా చేపట్టాలనే దానిపై హైదరాబాద్ ఆర్అండ్ఆర్ కమి షనరేట్ నుంచి గురువారం వచ్చిన ఉన్నతాధికారి మనోహర్ కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులు, సర్వేయర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. సర్వేవిధానంపై అవగాహన కల్పించారు. న లుగురు సర్వేయర్లతో అధికారులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరు శుక్రవారం పనులను ప్రా రంభించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రాంత భూ రికార్డులు పరిశీలిస్తూ వాటికనుగుణంగా సరిహద్దులు గుర్తించే ప్రక్రియ చేపడుతున్నారు. ప్రక్రియను ఆర్డీవో పి. జగదీశ్వర్‌రావు పరిశీలించారు. బృందాలకు సూచనలు చేశా రు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 వరకు ప్రక్రియ పూర్తిచేసి సంబంధిత ఏజెన్సీలకు భూమిని అప్పగించనున్నట్లు ఆర్డీవో వెల్లడించారు. -
‘పీఎంజీఎస్‌వై’ వర్తింపజేయాలి
ఆదిలాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనను వందశాతం గిరిజనులు నివసిస్తున్న గ్రామాలకు వర్తింపజేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఎంపీ గోడం నగేశ్ విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్డు గ్రామాలు కాకపోయినా, వందశాతం గిరిజనులు నివసిస్తూ కనీసం 250 జనాభా ఉన్న గ్రామాలకు కూడా వర్తింపజేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రహదారి సౌకర్యం ఎంతో కీలకమని, అర్హత ఉన్న ప్రతి గ్రామానికి కేంద్ర పథకాల ప్రయోజనం అందేలా కృషి చేయాలని విన్నవించారు. ఈ ప్రతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. సమావేశంలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని గిరిజన గ్రామాలకు పీఎంజీఎస్‌వై పథకం విస్తరణ అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
● ఈనెలాఖరు వరకు అవకాశం ● జిల్లాలో 77.33శాతం మాత్రమే పూర్తి ● మూడు నెలల రేషన్ కోటా ● కార్డుదారులకు ఊరట
కై లాస్‌నగర్: రేషన్ ఈకేవైసీ నమోదు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గత నెల 31తో ముగియగా తాజాగా ఈనెల 31వరకు పొడిగిస్తూ మరో అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటి వరకు వివరాలు నమోదు చేసుకోని కార్డుదారుల్లో హర్షం వ్యక్తమవుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 77.33 శాతం మంది మాత్రమే ఈకేవైసీ నమోదు చేసుకున్నారు. మిగిలిన వారంతా రేషన్‌షాపులను సంప్రదించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మూడు నెలల బియ్యం కోటా ఈ నెలలోనే అందించాలని నిర్ణయించింది. సమస్యగా ఆధార్ అప్డేషన్ ఆధార్ అప్డేషన్ లేకపోవడం ఈకేవైసీ నమోదుకు అవరోధంగా మారుతోంది. పదేళ్ల క్రితం పొందిన కార్డులను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అప్డేట్ చేసు కోవాల్సి ఉంది. ఇందులో ఐదేళ్లలోపు చిన్నారుల పేర్లను గతంలో వారి తల్లిదండ్రుల ఈకేవైసీ ఆధారంగా రేషన్‌కార్డుల్లో నమోదు చేశారు. ప్రస్తుతం వారి వయస్సు ఐదేళ్లు దాటినందున తప్పనిసరిగా వారి కార్డులను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. చిన్నారుల ఫొటో, కనుబొమ్మలు, ఫింగర్ ఫ్రింట్స్ వివరాలు నమోదు చేయాల్సి ఉంది. దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది కార్డుదారులు పట్టించుకోలేదు. ఈకేవైసీ లేనిదే బియ్యం ఇవ్వడం కుదరదనే ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి వారంతా ప్రస్తుతం ఆధార్‌కు పరుగు తీస్తున్నారు. జూలై 31 చివరి గడువుగా పేర్కొనడంతో ఆందోళనకు గురయ్యారు. తామెక్కడ సరుకులకు దూరమవుతామోనని హైరానా పడ్డారు. ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించడంతో వారికి ఊరట కలిగింది. రేషన్ షాపుల్లో ఈకేవైసీ.. ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోని కార్డుదారులు సమీపంలోని రేషన్‌షాపులను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవచ్చని పౌరసరఫరాల ఽశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం తమ రేషన్‌కార్డుతో పాటు కార్డులోని సభ్యులందరి ఆధార్‌కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. డీలర్ల వద్ద ఉన్న పీవోఎస్పై ఫింగర్‌ఫ్రింట్ వేయడం ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అందరూ నమోదు చేసుకోవాలిరేషన్కార్డుదారుల ఈకేవైసీ నమోదు గడువును ప్రభుత్వం మరో నెల పొడిగించింది. వివరాలు నమోదు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డీలర్లు, ఎన్ఫోర్సుమెంట్ అధికారులు కార్డుదారులకు అవగాహన కల్పించి వంద శాతం ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి. – నందిని, డీఎస్వో -
కరత్వాడ..కనువిందు
భోర్జ్ మండలం డొలార సమీపంలో బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తున్న పెన్గంగబోథ్ మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు దూకుతోంది. ఈ జలదృశ్యం వీక్షించేందుకు సమీప గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇంద్రవెల్లి: ముత్నూర్ సమీపంలోని త్రివేణి చెరువు వద్ద చేపలు పడుతూ.. పెన్‌గంగ ఉధృతి నిండుకుండగా.. సాత్నాల ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో సాత్నాల ప్రాజెక్టు నీటిమ ట్టం క్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయి నిల్వసామర్థ్యం 1.24 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.02 టీఎంసీగా ఉంది. బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకుంది. జల సోయగాలతో ఆకట్టుకుంటోంది. సెలయేళ్లు.. పరవళ్లు వర్షాల కారణంగా జిల్లాలో పెన్‌గంగ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే వరద పోటెత్తింది. పలుచోట్ల బ్రిడ్జిలపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జైనథ్ మండలం బహుదూర్పూర్ సమీపంలోని బ్రిడ్జిపై వరద శుక్రవారం ఉదయం కొంతసేపు కొనసాగింది. ఆ సమయంలో అధికారులు వాహనాలను అనుమతించలేదు. భోరజ్ మండలం డోలార సమీపంలోని బ్రిడ్జితో పాటు ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. మరోవైపు జలపాతాల సవ్వడి.. ప్రకృతి సోయగాలతో కనువిందు చేస్తోంది. గ్రామాల్లో చాలా చోట్ల చెరువులు నిండాయి. పాలనురుగు వలే అలుగు పారుతున్న దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. – జైనథ్/సాత్నాల/ఇంద్రవెల్లి/బోథ్కొరటా–చనాఖాకు జలకళభోరజ్ మండలంలోని కొరటా – చనా ఖాకు భారీగా వరద చేరుతుంది. నీటి నిల్వ సామర్థ్యం 0.830 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.214.4 టీఎంసీగా ఉంది. అలాగే ఇన్‌ఫ్లో 8,650.79 క్యూసెక్కులుగా కొనసాగుతుండగా అవుట్‌ఫ్లో 8,650.79 క్యూసెక్కులుగా ఉంది. -
హెచ్ఐవీ రహిత జిల్లా లక్ష్యం
కై లాస్‌నగర్: జిల్లాను హెచ్ఐవీ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హెచ్ఐవీ నియంత్రణ కార్యక్రమాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్‌సీల్లో బాధితులు, అనుమానితులకు హెచ్ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్–బి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనుమానితులను సమగ్ర తనిఖీ, కౌన్సెలింగ్ కేంద్రాలకు పంపించాలని, బాధితులకు క్రమం తప్పకుండా ఉచి త ఏఆర్టీ మందులు అందించాలన్నారు. బా ధితుల సమాచార గోప్యతను కఠినంగా కాపాడాలని సూచించారు. ముందుగా జిల్లా ప్రో గ్రాం మేనేజర్ నాగరాజు పవర్‌పాయింట్ ప్ర జెంటేషన్ ద్వారా జిల్లాలోని కార్యక్రమాల పు రోగతిని వివరించారు. అనంతరం మొబైలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష హ్యాండ్‌బుక్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో పి.సాధన, అదనపు డీఎంహెచ్‌వో ఈశ్వర్‌రాజ్, ఏఆర్టీ వైద్యులు పద్మిని ప్రియదర్శిని, డీఏపీసీయూ, ఐసీటీసీ, డీఎస్ఆర్సీ, ఏఆర్టీ, టీఐ, ఎల్డబ్ల్యూఎస్, సీఎస్సీ,సిబ్బంది పాల్గొన్నారు. -
కిట్టు.. బోధన మెరుగయ్యేట్టు
లక్ష్మణచాంద: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధన, గణితం, సైన్స్ పాఠ్యాంశాలపై మరింత పట్టు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకం కింద గణితం, సైన్స్ పరికరాల కొనుగోలుకు పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు గణితం కిట్లకు రూ.5 వేలు, సైన్స్ కిట్లకు రూ.5 వేల చొప్పున ఒక్కో పాఠశాలకు రూ.10 వేలు విద్యాశాఖ మంజూరు చేసింది. పరికరాల కొనుగోలుకు కమిటీ ప్రతీ పాఠశాలలో గణిత, సైన్స్ పరికరాల కొనుగోలు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా, గణితం, సైన్స్ ఉపాధ్యాయులు, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు ఉంటారు. పాఠశాలకు మంజూరైన నిధులతో కమిటీ అభిప్రాయం మేరకు గణితానికి రూ.5 వేలు, సైన్స్‌కు రూ.5 వేలు వెచ్చించి అవసరమైన కిట్లను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ప్రయోజనం గణిత, సైన్స్ పరికరాలు కొనుగోలు చేయడం వల్ల ప్రయోగాత్మక బోధన జరిగి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. విద్యార్థులలో సృజనాత్మక, శాసీ్త్రయ దృక్పథాలు పెంచడంలో కిట్లు కీలకంగా మారతాయి. ఈ నిధులతో పీఎంశ్రీ పాఠశాలల్లో గణిత, సైన్స్ క్లబ్‌లను మరింత బలోపేతం చేసి, ప్రాజెక్టు ఆధారిత విద్యను అమలు చేస్తారు. ప్రత్యక్ష బోధన సైన్స్, గణితం పాఠ్యాంశాలను ప్రత్యక్షంగా తరగతి గదిలో విద్యార్థులకు చూపిస్తూ ఉపాధ్యాయుడు బోధన చేయడంతో ఆ పాఠ్యాంశాలను విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అయితే పాఠశాలలకు వచ్చిన డిజిటల్ ప్యానెల్ బోర్డులతో ప్రతీ పాఠ్యాంశాన్ని వీడియోలు, చిత్రాలు, పటాలు చూపిస్తూ బోధించడానికే ఉపాధ్యాయులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యక్షంగా బోధన పరికరాలు, ప్రయోగ పరికరాలు ఉపయోగిస్తూ బోధన చేయడంతో విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుంది. గణిత, సైన్స్ కిట్లను వినియోగిస్తూ ప్రయోగాత్మక, ప్రత్యక్ష బోధనను ఉపాధ్యాయులు చేస్తే ప్రభుత్వం కిట్లను అందించిన లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు, మంజూరైన నిధులు జిల్లా పాఠశాలలు మంజూరైన నిధులు మంచిర్యాల 22 రూ.2.20 లక్షలు ఆదిలాబాద్ 21 రూ.2.10 లక్షలు నిర్మల్ 19 రూ.1.90 లక్షలు కుమురంభీం 16 రూ.1.60 లక్షలు -
సాగులో సమతుల్యత పాటించాలి
నిర్మల్‌చైన్‌గేట్: సాగులో సమతుల్యత పాటించాల ని, పంట మార్పిడి విధానంపై వ్యవసాయ అధికా రులు విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సురర్శన్రెడ్డి సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రాజెక్టుల పరిస్థితి, పంటల సాగు, ఎల్‌నినో ప్రభావం తదితర అంశాల పై నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల్లో నీ టి నిల్వలు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలు, దెబ్బతిన్న రహదారులు, వంతెనల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి.. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులకు పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరికి బదులుగా ఆయిల్‌పామ్, కంది, నువ్వులు, పత్తి తదితర ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు. కొత్త పంటల సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నిండుగా ప్రాజెక్టులు, చెరువులు.. నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ మూడు రోజులు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులు వేగంగా చేపడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా తాగునీటి సమస్య ఉండదన్నారు. రైతులు పంట మార్పిడి విధానాలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తోందని తెలిపారు. తగ్గిన లోటువర్షపాతం... ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ, గతంలో జిల్లాలో 38 శాతం లోటు వర్షపాతం ఉండగా, ప్రస్తుతం అది 6 శాతానికి తగ్గిందని తెలిపారు. జి ల్లాలోని 17 మండలాల్లో సాధారణ వర్షపాతం కురి సిందని తెలిపారు. ఇంద్రవెల్లి, భోరజ్, సిరికొండ, బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాలు ప్రస్తు తం సాధారణ పరిస్థితికి చేరుకున్నాయన్నారు. ఈ ఏడాది జిల్లాలో 5,93,670 ఎకరాల్లో పంటలు సాగయ్యాయని తెలిపారు. 4,37,698 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం 56,751 ఎకరాలు పెరిగిందన్నారు. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు వ్యవసాయంతోపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయన్నారు. సమావేశంలో నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల, నిర్మల్, ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభావిత ప్రాంతాల పరిశీలన
ఉట్నూర్‌రూరల్: భారీ వర్షాల ప్రభావిత గ్రామాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటీడీఏ పీవో మంద మకరందు గురువారం సందర్శించి పరిస్థితి సమీక్షించారు. మండల కేంద్రంలోని నర్సాపూర్ (జె), నాగపూర్ బ్రిడ్జి, ఉట్నూర్ గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కల్వర్టులు, వంతెనలపై ప్రవహిస్తున్న వరద నీటి పరిస్థితిని పరిశీలించి, ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరా యం కలగకుండా తగిన భద్రత చర్యలు చేపట్టాల ని, ప్రమాదకర ప్రాంతాల వద్ద పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర ద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజ లను అనుమతించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, వేగంగా సహాయక చర్యలు చేపట్టేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించా రు. అవసరం లేకుండా వరద ప్రవాహాలు, కల్వర్టులు, వాగులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని వివరించారు. ఆర్డీవో మోహన్, సీఐ ప్రసాద్, తహసీల్దార్ రఘునాథ్, ప్రజాప్రతినిధులున్నారు. -
గడువులోపు ఎయిర్పోర్ట్ భూసేకరణ
కై లాస్‌నగర్: ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రీహ్యాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనరేట్ ఆధ్వర్యంలో భూసేకరణ విభాగ ప్రత్యేక అధికారి మనోహర్‌తో కలిసి ఆయన ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగిందని, 2026 డిసెంబర్ 31 నాటికి సంబంధిత ఏజెన్సీలకు భూమి అప్పగించేలా రెవెన్యూ అధికారులు కార్యాచరణను వేగవంతం చేయాలని సూచించారు. పనులు నిర్ణీత గడువులోపు ముగించేందుకు అవసరమైన అధికారుల బృందాలను పెంచనున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియలో న్యాయపరమైన లోపాలు తలెత్తకుండా ప్రతీ నియమాన్ని కచ్చితంగా పాటించాలని సూచించారు. రికార్డులు పక్కాగా ఉండాలని, క్షేత్రస్థాయి పరిశీలనలో సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయేతర భూములు, నిర్మాణాల లెక్కింపు, రికార్డుల వ్యత్యాసాలపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ విభాగ ప్రత్యేక అధికారి మనోహర్ అధికారులకు భూసేకరణకు సంబంధించిన అంశాలపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ఏవో వర్ణ, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలి ఆదిలాబాద్‌టౌన్: సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. జెడ్పీ సమావేశ మందిరంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ధర్తిఆభ జన జాతీయ గ్రామ ఉత్కర్శ్ అభియాన్, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాకు మరిన్ని యూనిట్లు మంజూరయ్యేలా ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, మత్స్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
● అప్రమత్తంగా అధికార యంత్రాంగం ● లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు ● సహాయక చర్యలకు కంట్రోల్ రూం ● పరిస్థితి పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
హై అలర్ట్అప్రమత్తంగా ఉండాలిఆదిలాబాద్ టౌన్: జిల్లాకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే గాని ఇళ్ల నుంచి బయటకు రావద్దు. వరదలతో ఏమైన ఇబ్బందులుంటే కలెక్టరేట్లోని కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబర్‌ను లేదా ‘డయల్ 100’ను సంప్రదించాలి. డీడీఆర్ఎఫ్ బృందం జిల్లాలో 24 గంటల పాటు అందుబాటులో ఉండి తక్షణ సహాయక చర్యలు చేపడతారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవ ద్దు. జలపాతాల వద్ద సెల్ఫీల కోసం ఆరాటపడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. రైతులు విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్త వహించా లి. చెట్లు, శిథిల భవనాల కింద ఎదరూ ఉండరాదు. వాహనదారులు జాగ్రత్తగా వాహనా లు నడపాలి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశముంది. కాచి చల్లార్చిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలి. ఇళ్ల పరిసరా లు, పూలకుండీలు, ఎయిర్ కూలర్లు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వకుండా చూ డాలి. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలు క నిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాన్ని సంప్రదించాలి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం. కై లాస్‌నగర్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ.. వాగులు, వరద ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టింది. అత్యవసర సాయం కోసం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన అధికారులు 1800 425 1939 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఇందులో 24గంటలు పనిచేసేలా మూడు షిఫ్టుల్లో ఇద్దరేసి చొప్పున ఉద్యోగులను నియమించారు. ప్రభుత్వ ఽశాఖల అధికారులంతా 24గంటల పాటు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. టాం.. టాం.. ప్రత్యేక భద్రత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా గ్రామాలు, మున్సిపాలిటీలోని వార్డుల్లో పంచాయతీ, మున్సిప ల్ సిబ్బంది ద్వారా టాం..టాం చేయించారు. ఉ ప్పొంగి ప్రవహించే వాగులు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే లోలెవల్ వంతెనల వద్ద రాకపోకలు సాగించకుండా ఉండేలా హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పా టు చేశారు. పోలీస్ సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. పెన్‌గంగా పరీవాహక ప్రాంతాలతో పాటు జిల్లాలోని ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితులెదురైనా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఫైర్, పోలీస్ యంత్రాంగంతో కూడిన డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పా న్స్ ఫోర్సు (డీడీఆర్ఎఫ్)ను అందుబాటులో ఉంచారు. కలెక్టర్, ఎస్పీల ప్రత్యేక పర్యవేక్షణ వరద పరిస్థితులను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా పరిశీలించారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్ట్, తలమడుగు మండలంలోని ఖోడద్, సుంకుడి గ్రామాల్లోని లోలెవల్ వంతెనలు పరిశీలించారు. తర్నం వాగు ఉధృతి పెరిగి రాకపోకలు నిలిచిన నేపథ్యంలో ఎస్పీ స్వయంగా పరిశీలించి భద్రత చర్యలపై పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిరంతరం అప్రమ్తతంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. రెండు గంటలకోసారి నివేదిక భారీ వర్షాలు, వరద పరిస్థితిని కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. లోతట్టు ప్రాంతాల పరిస్థితులు, ప్రాజెక్ట్‌ల్లోకి చేరుతున్న వరదనీరు, శిథిలావస్థకు చేరిన భవనాలు, పాఠఽశాలల స్థితిగతులు, విద్యుత్ సరఫరా వ్యవస్థ గురించి తెలుసుకుంటున్నారు. విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు నష్టం జరిగితే విద్యుత్‌కు అంతరాయం కలగకుండా తక్షణమే పునరుద్ధరించేలా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చెట్ల కొమ్మలు విరిగిపడితే తక్షణమే తొలగించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోల ద్వారా ప్రతీ రెండు గంటలకోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముంపు ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని అధికారులు, ఉద్యోగులతో సెల్ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. -
ఎకై ్సజ్ డీసీని కలిసిన టీఎన్జీవోస్ నాయకులు
ఆదిలాబాద్‌టౌన్: ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జనార్దన్‌రెడ్డిని జిల్లా టీఎన్జీవోస్ అనుబంధ ఎకై ్సజ్ సెంట్రల్ ఫోరం నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిఽశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరం జోన్ నోడల్ అథార్టీ పరిధిలోని మినిస్టీరియల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. సెంట్రల్ ఫోరం ఉపాధ్యక్షుడు కె.అరుణ్‌కుమార్, సంఘ బాధ్యులు స్వామి, మహేశ్, రాజశేఖర్, రఘు, మహేశ్, కిరణ్, పవన్ తదితరులున్నారు. -
ప్రాజెక్ట్‌లలో నీటి నిల్వ
ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం ప్రస్తుత పూర్తి నీటి సామర్థ్యం ప్రస్తుత నీటి వరద (మీటర్లలో) నీటిమట్టం (టీఎంసీల్లో) సామర్థ్యం (క్యూసెక్కులు) సాత్నాల 286.50 283.90 1.24 0.553 10,747 మత్తడివాగు 277.50 277.20 0.470 0.430 38,000సాక్షి, ఆదిలాబాద్: ఆకాశానికి చిల్లు పడిందా..! అనే రీతిలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా తడిసి ముద్దయింది. కుండపోత వాన జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఉప్పొంగిన వాగులు, వంకలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్ట్‌లతో పాటు చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ధ్రోణి కారణంగా జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విరామం లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వాగులు, వంకలు, రోడ్లు, డ్రైనేజీలు వరద నీటితో జోరుగా ప్రవహిస్తున్నాయి. బుధ, గురువారాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురవగా, శుక్రవారం కూడా జిల్లాలో తేలికపాటి నుంచి మధ్యస్థ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిలిచిన రాకపోకలు బజార్హత్నూర్ మండలంలో వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్ మండలం నక్కల్‌వాడ పెద్దవాగు, ధనోర వాగు ఉప్పొంగడంతో ఆరు గ్రామాలు, సొనాల మండలంలో వాగు ఉప్పొంగడంతో ఎనిమిది గ్రామాలు, కోట(కె)లో రెండు గ్రామాలు, నార్నూర్ మండలం కడ్కి–కొలాం గూడ మధ్య ప్రధాన రహదారి కల్వర్టు పైనుంచి వరద నీరు ప్రవహించడంతో నార్నూర్, గాదిగూడ మండలాల మధ్య రాకపోకలు స్తంభించాయి. బారిక్రావు గూడలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బేల మండలంలో దహెగాం వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండ మండలం చిక్మన్ వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. బజార్హత్నూర్ చెరువు నిండుకుండను తలపిస్తోంది. జైనథ్ మండలం పిప్పల్గావ్లో వాగు ఉప్పొంగడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్ ఎస్సీ కాలనీలో పాత కూనపెంకుల ఇల్లు వర్షం ధాటికి కూలిపోయింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా వెళ్లే 353–బీ జాతీయ రహదారి భోరజ్ మండలం తర్నం వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ రహదారి పైనుంచి వెళ్లే భారీ వాహనాలు నిలిచా యి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణంలో ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రత్యామ్నాయ దారులు ఉండడంతో పలు వాహనాలను పోలీసులు మళ్లించారు. మత్తడివాగు వరదనీరు విడుదల జిల్లాలో రెండు మధ్య తరహా ప్రాజెక్టులు సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్ట్‌లు ఉండగా, మత్తడివాగుకు భారీగా వరద నీరు రావడంతో ఐదు గేట్లలో నా లుగింటిని ఎత్తి దిగువకు వదిలారు. సాత్నాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి ఇంకా దూరంగా ఉంది. జిల్లాలోని చెరువులన్నింటికీ జలకళ సంతరించుకుంది. పలు చెరువులు అలుగు పారుతున్నాయి. మండలాల్లో ఇదీ పరిస్థితి రెండు రోజుల కిందటి వరకు అన్ని మండలాల్లో వ ర్షాభావ పరిస్థితులు ఉండగా, ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. జిల్లాలోని 12 మండలాలు భీంపూర్, జైనథ్, బేల, గుడిహత్నూర్, ఆదిలాబాద్‌అర్బన్, మావల, తాంసి, తలమడుగు, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, భోరజ్ సాధారణ వర్షపాతానికి చేరుకున్నా యి. గాదిగూడ, నార్నూర్, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్‌రూరల్, బజార్హత్నూర్, సిరికొండ, ఉట్నూర్, సొనాల, సాత్నాల మండలాలు ఇప్పటికీ వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే, ఈ మండలాల్లోనూ భారీగా వర్షం కురవడంతో ఇవి కూడా సాధారణ స్థితికి చేరుకునే అవకాశముంది. జిల్లాలో వర్షపాతం (జూన్ 1నుంచి 30వరకు)స్థితి సాధారణ వర్షపాతం సాధారణం 523.1 మి.మీ.లు కురిసింది 426.3 మి.మీ.లు వ్యత్యాసం 19 శాతం లోటు రెండు రోజుల వర్షపాతం వివరాలు మంగళ–బుధ 52.2 మి.మీ.లు బుధ–గురు 64.6 మి.మీ.లు గురువారం ఉదయం 8.30నుంచి సాయంత్రం 54.4 మి.మీ.లు 5గంటల వరకు చెరువుల్లోకి చేరిన నీరు మొత్తం చెరువులు 331 25–50 శాతం 16 50–75 శాతం 66 75–100 శాతం 66 అలుగు పారుతున్నవి 183మండలాల వారీగా వర్షపాతం (మి.మీ.లు)ఇచ్చోడ 122.4 బజార్హత్నూర్ 117.6 ఇంద్రవెల్లి 96.6 బేల 86.9 నేరడిగొండ 81.5 సిరికొండ 81.0 బోథ్ 72.5 గుడిహత్నూర్ 67.9 తలమడుగు 67.5 సాత్నాల 61.5 జైనథ్ 59.0 భోరజ్ 55.8 ఆదిలాబాద్‌రూరల్ 53.1 మావల 52.4 ఆదిలాబాద్‌అర్బన్ 52.3 ఉట్నూర్ 50.2 గాదిగూడ 45.4 తాంసి 42.2 సొనాల 36.5 భీంపూర్ 32.2 నార్నూర్ 21.4 -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
తలమడుగు: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమశాఖ జిల్లా బాలి కల అభివృద్ధి అధికారి (జీసీడీవో) మెస్రం ఛా య సూచించారు. గురువారం మండలంలోని ఉమ్రీ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చే శారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సమావేశమై మాట్లాడారు. పరిసరాలు, వ్యక్తిగత పరి శుభ్రత పాటించాలని, మరిగించిన నీటిని తా గాలని సూచించారు. అనారోగ్య లక్షణాలు కని పిస్తే వెంటనే ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం విద్యార్థినుల ఆరోగ్య రికార్డులు పరిశీలించారు. వారితో మాట్లాడి ఆరోగ్య పరీక్షలు, పో షకాహారం అందుతున్న తీరు తెలుసుకున్నార. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
నేరడిగొండ: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన వి ద్య అందుతుందని బోథ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ జా దవ్ పేర్కొన్నారు. మండలంలోని పెద్ద బుగ్గారం గ్రామంలోగల ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన డి జిటల్ ప్యానెళ్లు, తరగతి గదులను గురువారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రా ణించాలని సూచించారు. పాఠశాలకు రావడానికి ప్రత్యేకంగా సీసీ రోడ్డు నిర్మిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల కోరిక మేరకు డైనింగ్ హాల్, వాటర్ ప్లాంట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు విద్యార్థినులకు యూనిఫాంలు అందజేశారు. -
‘రామన్న మానసిక స్థితి సరిగా లేకనే విమర్శలు’
కై లాస్‌నగర్: మాజీ మంత్రి జోగు రామన్న మానసిక స్థితి సరిగా లేకనే సీఎం రేవంత్‌రెడ్డిపై తప్పుడు వి మర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతి నిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయ న మాట్లాడారు. ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం రూ.2278.14 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని ఆయన ఓర్వలేకపోతున్నార ని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ఉరేసుకుంటానని సీఎంపై రామన్న చేసిన విమర్శలతో కూడిన వీడి యో క్లిప్పింగ్‌ను ఆయన ప్రదర్శించారు. 2014 ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబా ద్ ఎయిర్పోర్ట్, భూముల సర్వే, లైనింగ్ పనులు జరిగాయని ప్రస్తుతం భూసేకరణకు తమ ప్రభుత్వమే నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
గడువులోపు డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
● రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డికై లాస్‌నగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఎస్ఐఆర్ డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ, జిల్లాలో ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 97.15 శాతం పూర్తయిందన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓట రు జాబితాలో నమోదయ్యేలా అన్ని రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తి పారదర్శకతతో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశా రు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురా లు నలంద ప్రియా తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు తీపి కబురుఆదిలాబాద్టౌన్:నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభు త్వం ఎట్టకేలకు తీపి కబురు అందించింది. కొ ద్ది రోజులుగా ఎదురుచూస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే చాలా మంది మైదానాల్లో కసరత్తుతో పాటు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. త్వరలో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. బాసర జోన్ పరిధి లో 25 సివిల్ ఎస్సై, రెండు ఏఆర్ ఎస్సై, 5 ఫైర్‌మెన్ ఎస్సై పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు టీజీఎస్పీఎస్సై పోస్టు 1, డిప్యూ టీ జైలర్ మేల్ 2 పోస్టులు, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 130 సివిల్ కానిస్టేబుల్, 56 ఏఆర్ కానిస్టేబుల్, 12 ఫైర్ కానిస్టేబుల్, జైల్ మేల్వార్డర్ 4 పోస్టులు భర్తీ కానున్నాయి. -
రిమ్స్ పరిస్థితి ఇది..
ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర వాసులకు రిమ్స్ పెద్ద దిక్కుగా ఉంది. అయితే వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడ పనిచేసే కొందరు డిప్యూటేషన్‌పై ఉండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. రేడియాలజీ విభాగంలో ఒక్కరే ఉన్నారు. సదరు వైద్యుడు ఉదయం నుంచి రాత్రి వరకు సేవలందిస్తున్నా.. రోగులు గంటల తరబడి నిరీక్షిస్తున్న పరిస్థితి. రెగ్యులర్ వైద్యులతో పాటు కాంట్రాక్ట్ వైద్యులు మధ్యాహ్నమే ఇంటిబాట పడుతున్నారు. బయోమెట్రిక్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. ఫార్మసీలో మందులు అందుబాటులో ఉండడం లేదు. రోగులు అక్కడికి వెళితే ఒకట్రెండు మందు గోలీలు ఇచ్చి మిగతావి ప్రైవేట్‌లో కొనుగోలు చేయాలని చెబుతున్నారు. దీంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది. ఇక టీహబ్‌లో యంత్రాలు మరమ్మతుకు గురికావడంతో పరీక్షలు జరగడం లేదు. 51 రకాల పరీక్షలు చేస్తామని చెప్పినప్పటికీ మూడు నుంచి నాలుగు రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. థైరాయిడ్, సీబీపీ, హెచ్‌బీఏ1సీ, విటమిన్ టెస్టులు తదితరవి కొన్ని నెలలుగా చేయడం లేదు. ఏసీలు పనిచేయకపోవడంతో యంత్రాలు చెడిపోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. -
డీసీసీబీ సీఈవోగా విశ్వేశ్వరరావు
కై లాస్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన సీఈవోగా చండా విశ్వేశ్వరరా వు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వర కు పని చేసిన శ్రీధర్‌రెడ్డి గతేడాది సెప్టెంబర్‌లో ని జామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలి సిందే. అప్పటి నుంచి పలువురు ఇన్‌చార్జీలతో పాల న సాగింది. రెగ్యులర్ నియామకం కోసం ఇటీవల ప్రక్రియ నిర్వహించగా ఆరుగురు అధికాులు హా జరయ్యారు. వారిలో మెదక్ జిల్లా సహకార బ్యాంక్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న విశ్వేశ్వర్‌ను నియమిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇన్చార్జి సీఈవో రవి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన కలెక్టర్ రాజర్షిషాను మ ర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
కోఆప్షన్ ఎన్నికపై హైకోర్టు స్టే
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహణ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక సమావేశ నిర్వహణ అసాధ్యంగానే మారుతోంది. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం హైకోర్టును ఆశ్రయించడం సమావేశ నిర్వహణను జఠిలం చేసింది. సమావేశం నిర్వహించాలంటూ బీజేపీ సభ్యులు తొలుత హైకోర్టును ఆశ్రయించగా నెల రోజుల్లోపు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలంటూ తీర్పునిచ్చింది. దీంతో సమావేశం నిర్వహణపై వారిలో ఆశలు రేకెత్తాయి. సమావేశ నిర్వహణకు చైర్పర్సన్ తేదీని ప్రకటించాల్సి ఉంది. దీనిపై ఆమె జాప్యం చేయడంతో మున్సిపల్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశం నిర్వహించాలంటూ కలెక్టర్ ఓ సర్క్యులర్ జారీ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల పక్షాన మాజీ కౌన్సిలర్, కోఆప్షన్ పదవిని ఆశిస్తున్న ఎంఐఎంకు చెందిన షానావాజ్ హుస్సేన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక సమావేశం నిర్వహించే పరిస్థితులు స్థానికంగా లేవని ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోర్టుకు విన్నవించారు. దీంతో ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. నాలుగు వారాల పాటు గడువు విధించింది. దీంతో సమావేశం నిర్వహణపై బీజేపీ సభ్యుల్లో నెలకొన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. -
● రిమ్స్‌లో గైనిక్ సేవలు అంతంతే.. ● రేడియాలజీలో ఒక్కరే వైద్యుడు ● గంటల తరబడి రోగుల నిరీక్షణ ● వెంటాడుతున్న మందుల కొరత ● రోగులకు తప్పని ఆర్థిక తిప్పలు
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు వైద్యానికి సుస్తీ నెలకొంది. రోగులకు నాణ్యమైన వైద్యం అందడం లేదు. జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, ఉట్నూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రితో పాటు రిమ్స్ పరిస్థితి దయనీయంగా ఉంది. వైద్యుల కొరత, అరకొర మందులు, యంత్రాలు మూలనపడడంతో చేయని టెస్టులు, అందుబాటులో ఉండని వైద్యులు వెరసీ రోగుల పాలిట శాపంగా మారుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో జనం ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు వెచ్చించి వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్‌లో వైద్యులు మధ్యాహ్నం దాటితే కనిపించరంటే అతిశయోక్తి కాదు. ఒంటిగంట తర్వాత వారు తమ క్లినిక్‌లలో బిజీగా మారుతున్నారు. లక్షల వేతనం పొందుతున్నా పేదలకు మాత్రం సేవలు అందించేందుకు ముందుకు రావడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. ఓపీ కిక్కిరిసిపోతోంది. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌తో పాటు ఉట్నూర్‌లోని జిల్లా ఆస్పత్రి, బోథ్, నార్నూర్ ఏరియా ఆస్పత్రుల పరిస్థితులపై గ్రౌండ్ రిపోర్ట్. ఏరియా ఆస్పత్రుల్లో..జిల్లాలోని బోథ్, నార్నూర్‌లో ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటి పరిస్థితి దయనీయంగా ఉంది. బోథ్‌లో ముగ్గురు వైద్యులతోనే సేవలు అందిస్తున్నారు. పలు పోస్టులు ఖాళీగా ఉన్నా యి. స్పెషలిస్ట్ వైద్యులు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నార్నూర్‌లో ఏరియా ఆస్పత్రిగా మార్చినా ఇంకా పీహెచ్సీ తరహాలోనే సేవలు కొనసాగుతున్నాయి. ఇక్క డ ఒక్కరు కూడా రెగ్యులర్ వైద్యులు లేరు. ఇద్ద రు ఆర్బీఎస్కే వైద్యులకు డిప్యూటేషన్‌పై కేటా యించారు. వారితోనే సేవలు అందుతున్నాయి. -
ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం చేయాలి
అదిలాబాద్: జిల్లాలో నిర్మించనున్న ఎయిర్పో ర్టు పనులు వేగవంతం చేయాలని కోరుతూ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ న్యూఢిల్లీలో కేంద్ర రక్షణశాఖ జాయింట్ సెక్రెటరీ మహంతిని కలిసి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భూకేటా యింపునకు సంబంధించిన ప్రత్రాలను ఆయనకు సమర్పించి, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు, తదుపరి ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్రరక్షణ శాఖ అధికారులు ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వపాఠశాల గెజిటెడ్ నం.1 లో నేత్ర వైద్య శిబిరం, వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ అనూషతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీఈఓ మాధ వి, కౌన్సిలర్ కలాల శ్రీనివా స్, ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి తదితరులు పాల్గొన్నారు. సరస్వతినగర్‌లో గల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రణాళికలపై విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, మోడల్‌స్కూల్ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ సమన్వయకర్తలతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణా లు పెంచడం లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి మాధవి, అకడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ లక్ష్మణ్, జీసీడీవో, ఎంఈ ఓలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి ఆదిలాబాద్‌రూరల్: గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయా లని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎంపీడీవో సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన మండ ల పరిషత్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. పలువురు సర్పంచ్‌లు గ్రామాల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యాధుల సీజన్ కావడంతో పారి శుద్ధ్య నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, డీపీవో రమేశ్, ఎంపీడీవో వంశీకృష్ణ, తహసీల్దార్ గోవింద్, ఎంపీవో ఆనంద్, అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలికై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మో డల్ విలేజ్ అభివృద్ధిలో భాగంగా ఉట్నూర్ మండలంలోని మత్తాయిగూడలో చేపట్టిన నిర్మాణాలను సెప్టెంబర్ 15నాటికి పూర్తి చేయాలని అధికారుల ను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. మత్తాయిగూడలో మోడల్ విలేజ్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన 155 గృహాల నిర్మాణాల ను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. భోరజ్, బజార్హత్నూర్ మండలాల్లోని గిరి జన ఆవాసాల్లో మంజూరైన మౌలిక వసతుల పనులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని అధికారుల ను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, గృహనిర్మాణ శాఖ పీడీ శంకర్, డీఈ షాకీర్,ఈడీఎం రవి పాల్గొన్నారు. -
ఉట్నూర్ జిల్లా ఆస్పత్రిలో..
ఉట్నూర్ జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయినా వైద్యసేవలు మాత్రం అంతంత మాత్రంగానే అందుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను రిమ్స్‌కు రిఫర్ చేస్తున్నారు. ఆర్థోపెడిక్, ఈఎన్టీ, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ తదితర పోస్టుల్లో స్పెషలిస్టు వైద్యులు లేరు. గైనిక్ విభాగంలో ఒక్కరితోనే సేవలు అందుతున్నాయి. టీహబ్ భవనం ఏర్పాటు చేసినా సిబ్బందిని నియమించలేదు. ఆస్పత్రి సిబ్బందితోనే పనులు కానిచ్చేస్తున్నారు. దీంతో వారిపై పనిభారం పెరుగుతోంది. ఐసీయూ ఏర్పాటు చేసినా ఎప్పుడు తాళం వేసే దర్శనమిస్తోంది. -
మెరుగైన వసతులు కల్పించాలి
కై లాస్‌నగర్: జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో పాఠశాలల అకాడమిక్ పురోగతి, ప్రవేశాలు, పరీక్షల ఫలితాలు, భోజన నాణ్యత, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. ప్రిన్సిపాళ్లు వివరించిన సమస్యలను పరిశీలించిన కలెక్టర్ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి వారం డీఎండబ్ల్యూ, ఆర్ఎల్సీ, విజిలెన్స్, అకడమిక్ కోఆర్డినేటర్లతో కూడిన సంయుక్త బృందం ఒక పాఠశాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్ఎస్ చిత్రు, డీపీవో రమేశ్, మైనారిటీ సంక్షేమ అధికారి కలీం, డీఎంహెచ్‌వో సాధన, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మైనారిటీ గురుకులాలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు, ఆర్ఎల్సీ, విజిలెన్స్, డీఎండబ్ల్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్యం ప్రయోజనకరం
ఉట్నూర్‌రూరల్: రైతులు సాగులో రసాయన ఎరువులు తగ్గించి, ప్రయోజనకరమైన ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు వర్చువల్‌గా మంగళవారం నిర్వహించిన రైతునేస్తం 100వ ఎపిసోడ్ వీడియో కాన్ఫరెన్స్ ఉట్నూర్‌లోని రైతు వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హాజరయ్యా రు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రసాయన ఎరువులు ఇష్టానుసారం వాడితే భూసారం తగ్గడంతో పాటు దిగుబ డిపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రకృతి సేద్యం చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఫాంపాండ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకో వాలన్నారు. జిల్లాకు మరో 1,350 మెట్రిక్ టన్నుల డీఏపీ రానుందని, పట్టా లేని రైతులు కూడా యాప్ ద్వారా ఎరువులు పొందే అవకాశం కల్పించామని పేర్కొన్నా రు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన వ్యవసాయ అధికారులు, ఆదర్శ రైతులకు మెమెంటోలు అందజేసి అభినందించా రు. రైతువేదికలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఆర్డీవో మోహన్‌సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, తహసీల్దార్ రఘునాథ్, ఎంపీడీవో రైసుద్దీన్, ఏడీఏలు శ్రీధర్, రాంకిషన్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్‌లు అనిత, రేణుక, మండల వ్యవసాయ, విస్తరణ, ఉద్యాన, ఇతర శా ఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
నేరడిగొండ మండలంలోని పలు గ్రామాల్లో శీత్లా భవాని వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
● పలుచోట్ల పొంగిన వాగులు, వంకలు‘పుర’ కౌన్సిలర్లకు శిక్షణ కై లాస్‌నగర్: ఇటీవల నూతనంగా ఎన్నికై న మున్సిపల్ కౌన్సిలర్లకు పురపాలనపై మంగళవారం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంచనరీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన శిక్షణకు ఆదిలాబాద్‌కు చెందిన పలువురు కౌన్సిలర్లు హాజరయ్యారు. 2019 మున్సిపల్ యాక్ట్‌తో పాటు విధులు, బాధ్యతలు, అమృత్ 2.0, స్వ చ్ఛభారత్ మిషన్ కార్యక్రమాల అమలు, యూ ఐడీఎఫ్ నిధుల వినియోగం వంటి అంశాలపై రెండు సెషన్లుగా శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక సామగ్రితో కూడిన బ్యాగులను సైతం అందజేశారు. జోరువానఆదిలాబాద్టౌన్/ఉట్నూర్‌రూరల్:ఎట్టకేలకు జి ల్లాలో విస్తారంగా వర్షం కురిసింది.ఇటీవల కురి సిన వాన పంటలకు జీవం పోయగా, ప్ర స్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చే స్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సా ధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన జోరువానతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ సీ జన్‌లో ఇదే భారీ వర్షంగా నమోదైంది. మోస్తరు నుంచి సాధారణ వర్షం నమోదైంది. జిల్లాలో ఎనిమిది మండలాల్లో అత్యధిక, మిగతా మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. ఇచ్చోడలో అత్యధికంగా 36 మి.మీ.లు, తాంసిలో 34.8, ఇంద్రవెల్లి, తలమడుగులో 27, గుడిహత్నూర్‌లో 24.5, భోరజ్‌లో 19, జైనథ్‌లో 16.3, మావలలో 16మి.మీ.ల వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో బజార్హత్నూర్లో 14.8, ఆది లాబాద్ పట్టణంలో 12.3, బోథ్‌లో 9.8, నా ర్నూర్లో 7.8, నేరడిగొండ, బేలలో 7, సొనాలలో 5.8, అత్యల్పంగా గాదిగూడ లోకారి(కె), బేలలోని చెప్రాలలో 4 మి.మీ.ల నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనుండగా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రంతో పాటు ఎంఆర్వో ఇతరత్రా సదుపాయాలతో ఏర్పాటు కానుంది. ఇందుకోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2009 ఎకరాల భూసేకరణకు గాను రూ.2278 కోట్ల నిధుల మంజూరు చేస్తూ ఈనెల 25న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. భూసేకరణతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డంకులు తొలగించేందుకు వివిధ పనుల కోసం ఈ నిధులు వెచ్చింనున్నారు. ప్రైవేట్ అకాడమీల దృష్టి.. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుతో పాటు వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుండగా ఇక్కడ ప్రైవేట్ అకాడమీలు కూడా శిక్షణకు ముందుకు వస్తున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివిధ ప్రైవేట్ అకాడమీలను సంప్రదించగా వారు ఈ ప్రాంతంలో ఏర్పాటుకు ఆసక్తి కనబర్చుతూ తమ దరఖాస్తులు అందజేశారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారా వాటిని కేంద్ర రక్షణ శాఖకు అందజేశారు. అకాడమీలు ఇలా.. పైలెట్ శిక్షణ ఆసక్తి కనబర్చే వారికి విమానం నడపడం నేర్పిస్తారు. దాంతో పాటు పైలట్ లైసెన్సులు, రేటింగ్‌ల కోసం శిక్షణ ఇవ్వడానికి విమానయాన అధికార సంస్థ (డీజీసీఏ, ఈఏఎస్ఏ) నుంచి అధికారిక ఆమోదం పొంది ఉండాలి. అలాంటి సంస్థలే శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టుతో పాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. ప్రైవేట్ పైలట్ శిక్షణ సంస్థలు రెండు ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నాయి. అలాగే ఆరు ఎంఆర్ఓ (నిర్వహణ), రిపేర్ (మరమ్మతు), ఓవర్‌హాల్ (సమగ్ర తనిఖీ) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సుముఖుత వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. – సాక్షి, ఆదిలాబాద్పంటలకు ఊపిరి.. ఎల్‌నినో కారణంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సరైన వానలు లేకపోవడంతో రైతులు వేసిన పంటలు వాడిపోయినట్లు కనిపించాయి. అయితే వారం క్రితం కురిసిన వర్షంతో కొంత జీవం పోసినట్లయింది. ్చప్రస్తుతం భారీ వర్షం నమోదు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి, సోయా, కందితో పాటు ఇతర పంటలకు మేలు చేకూరినట్లే. మరో వారం పది రోజుల వరకు వర్షం కురువకపోయినా పర్వా లేదన్నట్టుగా ఉందని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఇంకా చెరువులు, కుంటలు నిండలేదు. మరో రెండు మూడు భారీ వర్షాలు కురిస్తే జలాశయాలు నీటితో కళకళలాడనున్నాయి. కాగా ఉట్నూర్ మండలంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నర్సాపూర్(జి) వాగు పొంగడంతో రాకపోకలకు కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. వాగు దాటడానికి విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఏటా వర్షాకాలంలో తమకు వాగు తిప్పలు తప్పడం లేదని సర్పంచ్ జుగాదిరావు పేర్కొన్నారు. శాశ్వత వంతెన నిర్మించాలని కోరారు. మరోవైపు జిల్లా కేంద్రంతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యం ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల సమస్యల పరి ష్కారమే తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీ పీ) లక్ష్యమని సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా అధ్యక్షుడు కొట్టూరి ప్రవీణ్‌కుమార్ అన్నా రు. 14వ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్‌ను జిల్లా కేంద్రంలో మంగళవారం ఆవిష్కరించారు. తె లంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీజీ వీపీ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పో రాడుతూ ప్రశ్నించే గొంతుకగా గుర్తింపు పొందిందన్నారు. కార్యక్రమానికి డీఐఈవో జాదవ్గణేశ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆదిలాబాద్ నియోజకవర్గ కన్వీనర్ సతీశ్, బోథ్, నిర్మల్ నియోజకవర్గ కన్వీనర్ గణేశ్, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఎంఆర్ఓ కేంద్రాలు.. 1. జెట్ సెట్ గో 2. డెక్కన్ 3. గోల్డన్ ఈగల్ ఏవియేషన్ 4. స్టార్ ఎయిర్ 5. యథి ఏవియేషన్ 6. థంబై ఏవియేషన్ఎంఆర్ఓ కేంద్రాలు.. 1. జెట్ సెట్ గో 2. డెక్కన్ 3. గోల్డెన్ ఈగల్ ఏవియేషన్ 4. స్టార్ ఎయిర్ 5. యథి ఏవియేషన్ 6. థంబై ఏవియేషన్దరఖాస్తు చేసుకున్న సంస్థలు.. ఎఫ్‌టీవో (పైలట్ శిక్షణ సంస్థలు) 2. వింగ్ ఏవియేషన్ అకాడమీ 1. ప్లైటెక్ ఏవియేషన్ అకాడమీ -
కొత్త పింఛన్లపై ఆశలు
కై లాస్‌నగర్: చేయూత పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపికబురు అందించింది. పంద్రాగస్టు కానుకగా వచ్చే నెల 15నుంచి కొత్తవి మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చేసిన ప్రకటనతో అర్హులైన వారి లో కొత్త ఆశలు చిగురిస్తున్నా యి. ఐదేళ్లుగా మంజూరు లేక ద రఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ నిలి చిపోయింది. అంతకుముందు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించినా రాష్ట్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కొత్తవి మంజూరైతే వీరికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. తొలుత ఒంటరి మహిళలు, వితంతువులకే ప్రా ధాన్యత ఉంటుందని ప్రకటించడంతో ఇతర కేట గిరీల వారిలో కొంత నిరాశ వ్యక్తమవుతుంది. ప్రభుత్వం మళ్లీ దరఖాస్తులు స్వీకరించినట్లైతే లబ్ధిదా రుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం లేకపోలేదు. జిల్లాలో ఇలా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయం నుంచే కొత్త పింఛన్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. 2019–20లో అర్హులైన వారి నుంచి అప్పటి సర్కారు దరఖాస్తులు స్వీకరించి మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్ వయస్సును 2021 సంవత్సరంలో 60 నుంచి 57 ఏళ్లకు తగ్గించి మంజూరు చేసింది. ఇతర కేటగిరీలకు మాత్రం 2020 నుంచే నిలిచిపోయింది. ఆ సమయంలో దరఖాస్తు చేసుకున్న 3,343 మంది ఇప్పటికీ ఎదురుచూస్తునే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పింఛన్ అందిస్తామని ప్రకటిస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. తాజా నిర్ణయంతో వారికి లబ్ధి చేకూరే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. అయితే తొలి ప్రాధాన్యతగా ఒంటరి మహిళలు, వితంతువులకే మంజూరు చేస్తామని ప్రభుత్వం పేర్కొంటుండడంతో జిల్లాలో 2246 మందికి మాత్రమే పింఛన్లు అందే అవకాశముంటుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకే ప్రభుత్వం పింఛన్ మంజూరు చేస్తుందా లేక అర్హులైన వారి నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తుందా అనేదాని పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావా ణితో పాటు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్ర జాపాలనలోనూ దరఖాస్తులు అందజేస్తూనే ఉన్నా రు. ప్రజాప్రతినిధులను సైతం కలుస్తూ తమకు పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే దీనిపై అధికారికంగా ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. గతంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన అర్హులకు మంజూరు చేస్తుందా లేక దరఖాస్తులను కొత్తగా స్వీకరిస్తారా అనేదానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాం. – గోవింద్రావు, అదనపు డీఆర్డీఓ జిల్లాలో కేటగిరీల వారీగా పెండింగ్ దరఖాస్తుల వివరాలు కేటగిరీ దరఖాస్తులు వృద్ధాప్య 549 ఒంటరి 82 వితంతు 2164 దివ్యాంగ 372 గీత 2 చేనేత 1 హెచ్ఐవీ 103 ఫైలేరియా 51 డయాలసిస్ 7 బీడీ కార్మికులు 12 -
ప్రతీ బొట్టు.. ఒడిసిపట్టు
వర్షపునీటిని ఒడిసిపట్టేలా.. కై లాస్‌నగర్: ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్లో సమృద్ధిగా వానలు కురువడం లేదు. జూలై నెలాఖరుకు చేరినా జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే ఉంది. ఈ క్రమంలో తాగు, సాగు నీటి ఇక్కట్లు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడంతో పాటు వర్షపునీటిని ఒడిసిపట్టాలనే లక్ష్యంతో జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15నాటికి జిల్లా వ్యాప్తంగా నీటి సంరక్షణకు అవసరమైన నిర్మాణాలు యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని ఆదేశించింది. తదనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యాలను సాధించే దిశగా కసరత్తు చేస్తోంది. ప్రత్యేక కార్యాచరణ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యాచణ సిద్ధం చేసింది. జిల్లాకు 500 ఫాంపాండ్స్ నిర్మాణ లక్ష్యంగా నిర్దేశించగా వాటిని సాధించే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. పంద్రాగస్టు వరకు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో రెండింటిని తప్పనిసరిగా నిర్మించాలని భావిస్తోంది. లక్ష్యాన్ని సాధించే దిశగా ఆసక్తి గల రైతులతో పాటు శాఖాపరంగా వ్యవసాయ భూమి కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రత్యేకంగా గుర్తించారు. ఇందులో ఆసక్తిగల వారిని ఎంపిక చేయడంతో పాటు ఏ సైజ్‌లో వాటిని నిర్మించాలనే అంచనాలు సిద్ధం చేస్తున్నారు. నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. మూడు సైజ్‌ల్లో ఫాంపాండ్స్‌ను నిర్మించుకునే వెసులుబాటు ఉంది. సైజ్‌ల ఆధారంగా రూ.80వేల నుంచి రూ.3.50లక్షల వరకు చెల్లించనున్నారు. అలాగే ఇళ్లలో ఇంకుడుగుంతలు నిర్మించుకున్న వారికి రూ.6800 అందజేస్తారు. ఇళ్లలోనే కాకుండా సామాజిక నీటి వనరులున్న ప్రాంతాల్లోనూ కమ్యూనిటీ ఇంకుడుగుంతలను శాఖా పరంగానూ నిర్మించనున్నారు. ఇందుకోసం స్థలాలను ఎంపిక చేసే బాద్యతలను ఎంపీడీవో, తహసీల్దార్లకు అప్పగించారు. వీటితో పాటు భూగర్భజలాలు అడుగంటిన బోరుబావులు, చేతిపంపుల వద్ద వర్షపునీరు వృథా పోకుండా నేరుగా భూమిలోకి చేరి నీటిమట్టం పెరిగేలా బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకోసం ఒక్కోదానికి రూ.35వేలు చెల్లించనున్నారు. ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టడమే లక్ష్యంగా ఇంటింటికి ఇంకుడుగుంతలు నిర్మించుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అలాగే పంట పొలాల్లో వర్షపునీటిని సంరక్షిస్తూ సాగుకు వినియోగించుకునేలా నీటి కుంటలు (ఫాంపాండ్స్), నీరు అడుగంటిన బోర్ బావులు, చేతి పంపుల వద్ద రీచార్జ్ నిర్మాణాలతో పాటు గ్రామాల్లో నీటి కరువు ఏర్పడకుండా ఉండేలా చిన్నపాటి చెరువు (ఊటకుంట)లను నిర్మించనున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధితో పాటు నీటి సంరక్షణకు తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ (వీబీ–జీరాంజీ ) పథకం కింద ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. ఆగస్టు 15వరకు లక్ష్యాలను నిర్దేశించిన రాష్ట్ర ప్రభుత్వం గడువులోపు పూర్తి చేసిన అధికారులను సీఎం చేతుల మీదుగా సన్మానించనున్నట్లుగా స్పష్టం చేసింది. ఆ దిశగా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. జిల్లాలోని గ్రామ పంచాయతీలు : 473 ప్రభుత్వం నిర్దేశించిన ఫాంపౌండ్స్ లక్ష్యం : 500 డీఆర్డీఏ గుర్తించిన ఎస్‌హెచ్‌జీ సభ్యులు : 5,362 బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్ నిర్మాణాల లక్ష్యం : 6,270 ఊట కుంటల లక్ష్యం : గ్రామానికి ఒకటి కసరత్తు చేస్తున్నాం ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధించేదిశగా కసరత్తు చేస్తున్నాం. తొలుత ఫాంపాండ్స్ నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తున్నాం. నీటి కుంటలు, ఇంకుడుగుంతల నిర్మాణాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములవ్వాలి. – రాంప్రసాద్, అదనపు డీఆర్డీవో -
బహిరంగంగా మద్యం సేవిస్తే కేసులు
ఆదిలాబాద్‌టౌన్: బహిరంగంగా మద్యం సే విస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆ దిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రై వేట్ పాఠశాలలు, కళాశాలలు, వాటి మైదా నాలు, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివా రం రాత్రి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్రా హ్మణవాడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మ ద్యం సేవిస్తున్న జుబేర్‌ను అదుపులోకి తీసుకు ని క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వివరించా రు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఆదిలాబాద్ సబ్‌డివిజ న్ పరిధిలో ప్రత్యేక గస్తీ బృందాలు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయని తెలిపా రు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి గురించి సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. -
ఉపాధ్యాయుడిని కొనసాగించాలి
కజ్జర్ల గ్రామంలోని ప్రాఽథమిక పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది దుబ్బగూడ, బట్టిసావర్గాం గ్రామాల నుంచి కూ డా పిల్లలను చేర్పించాం. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు సైతం ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సర్దుబాటులో భాగంగా ఒక ఉపాధ్యాయడిని మరో పాఠశాలకు పంపించారు. దీంతో తమ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయుడిని ఇక్కడే కొనసాగిస్తూ నాణ్యమైన విద్యనందించేలా చూడాలి. – విద్యార్థుల తల్లిదండ్రులు, కజ్జర్ల, తలమడుగు -
అప్రమత్తతే రక్ష
ఆదిలాబాద్‌టౌన్: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన సూచించారు. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్, చికున్‌గున్యా వంటి వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. సాక్షి: సీజనల్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?డీఎంహెచ్‌వో: వర్షాకాలంలో వైరల్ ఫీవర్, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. ప్రస్తుతం జిల్లాలో జ్వరాల కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. జిల్లాలో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ప్రాంతాల్లో ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నాం. పాఠశాలలు, గ్రామ సభలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. సాక్షి: సీజనల్ జ్వరాలకు కారణాలు ఏంటి.?డీఎంహెచ్‌వో: వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండడం, దోమలు అధికంగా పెరగడం, కలుషితమైన నీరు తాగడం, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. డెంగీని వ్యాప్తి చేసే ఏడిస్ దోమలు మంచి నీటిలోనే పెరుగుతాయి. దీంతో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. సాక్షి: వ్యాధుల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?డీఎంహెచ్‌వో: ప్రతీ కుటుంబం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూల కుండీలు, నీటి ట్యాంకుల్లో నీరు నిల్వ ఉండకుండా వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. దోమ తెరలు ఉపయోగించాలి. తాగునీటిని మరిగించి, శుద్ధి చేసిన తర్వాతే వినియోగించాలి. వేడి, తాజా ఆహారాన్ని తీసుకోవాలి. సాక్షి: జిల్లాలో మందులు అందుబాటులో ఉన్నాయా.?డీఎంహెచ్‌వో: జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయి. కుక్క, పాము, తేలు కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. సాక్షి: వ్యాధులు నిర్ధారించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?డీఎంహెచ్‌వో: ర్యాపిడ్ ఫీవర్ సర్వే జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఆశ కార్యకర్తలతో ఇంటింటా సర్వే చేపడుతున్నాం. ఫీవర్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ప్రతీ పీహెచ్సీలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశాం. వ్యాధులు ప్రబలిన గ్రామాల్లో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి: కొన్నిచోట్ల వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలపై మీ స్పందన ఏంటి.?డీఎంహెచ్‌వో: పీహెచ్సీలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించాం. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించాం. విధులను విస్మరించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. సాక్షి: జిల్లాలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఏవిధంగా అధిగ మిస్తారు.?డీఎంహెచ్‌వో: జిల్లాలో వైద్యుల కొరత ఉన్న మాట వాస్తవం. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 మంది వైద్యులు పీజీకి వెళ్లడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తొమ్మిది పీహెచ్సీలలో వైద్యులు లేకపోవడంతో జన్మన్, ఆర్బీఎస్కే వైద్యులతో సర్దుబాటు చేశాం. రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం. సాక్షి: హైరిస్క్ గ్రామాలపై ఎలాంటి దృష్టి సారించారు.?డీఎంహెచ్‌వో: జిల్లాలో 220 హైరిస్క్ గ్రామాలను గుర్తించాం. గత ఐదేళ్లలో డెంగీ, ఇతర వ్యాధులు ప్రబలిన వాటిని గుర్తించాం. ఆయా గ్రామాల్లో ప్రతీరోజు డ్రైడే చేపడుతున్నాం. డెంగీ పాజిటివ్ వచ్చిన గ్రామాల్లో పైరిత్రీన్ స్ప్రే చేస్తున్నాం. నీరు నిల్వ ఉన్న కుంటల్లో గంబూషియా చేపలు, ఆయిల్‌బాల్స్ వేస్తున్నాం. గర్భిణీల కోసం బర్త్ వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేశాం. సాక్షి: డెంగీ లక్షణాలను ఎలా గుర్తించాలి.?డీఎంహెచ్‌వో: అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, ఆకలి లేకపోవడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో భయపడకుండా వైద్యుల సూచనలు పాటించాలి. అవసరమైతే మాత్రమే ప్రత్యేక చికిత్స అందిస్తాం. ఎలిజా ద్వారానే డెంగీ నిర్ధారణ అవుతుంది. -
సమస్యలు పరిష్కరించి భరోసా కల్పించాలి
కైలాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేఽశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రూలతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధితుల సమస్యలు వివరించి వాటిని పరిష్కరించేలా చూడాలని ఆదేఽశించారు. అందుబాటులో ఉన్న జిల్లా అధికారులకు దరఖాస్తులను అందజేస్తూ వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. 30 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించి వాటి ప్రగతిని ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, భూ భారతి, ఉపాధిహామీ వంటి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 97 అర్జీలు అందాయి. -
చిన్నారి నోట్లో ఇరుక్కున్న టూత్ బ్రష్
కాసిపేట: మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన వేల్పుల సతీష్ కూతురు అమన్వితశ్రీ(2) నోట్లో దవడలకు టూత్ బ్రష్ చిక్కుకోవడంతో నరకయాతన అనుభవించింది. సోమవారం సాయంత్రం నోట్లో బ్రష్ వేసుకుని ఆడుకుంటున్న సమయంలో కిందపడడంతో చర్మాన్ని చీల్చుకుంటూ దవడలో ఇరుక్కుపోయింది. కాసిపేట పీహెచ్‌సీకి అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో మంచిర్యాల మాతాశిశు కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వరంగల్ ఏంజీఎంకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించగా.. బ్రష్‌ను తొలగించారు. బైండోవర్ ఉల్లంఘించిన ఒకరికి జరిమానాఇచ్చోడ: బైండోవర్ నిబంధనలు ఉల్లఘించిన నైతం సంజీవ్‌కుమార్ అనే వ్యక్తికి రూ.25 వేల జరిమానా విధించినట్లు ఇచ్చోడ ఎస్‌హెచ్‌వో నరేశ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముఖరా బి గ్రామానికి చెందిన నిందితుడు నైతం సంజీవ్‌కుమార్ గతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నందున కేసు నమోదు చేసి బైండోవర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ మద్యం విక్రయిస్తుండడంతో తహసీల్దార్‌కు నివేదిక అందజేయగా తహసీల్దార్ ఇమ్రాన్ సోమవారం ఆయనకు జరిమానా విధించినట్లు తెలిపారు. పాము కాటుతో మహిళ మృతిఆదిలాబాద్రూరల్: పాముకాటుతో మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన గజ్జల దేవ్బాయ్ (65) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవ్బాయ్ కుమారునితో కలిసి కొత్తగూడ గ్రామంలో నివాసం ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఆమెను పాము కాటు వేసింది. రక్తస్రావం జరగడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి కేసులో తొమ్మిది మంది అరెస్టుఆసిఫాబాద్: పోలీసుల పెట్రోలింగ్‌లో భాగంగా తిర్యాణి మండలంలో 170 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేశామని డీఎస్పీ అశోక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్లడించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన మిడిదొడ్డి కృష్ణ, దుర్గం ప్రశాంత్, ఉల్లిపిట్ట గ్రామానికి చెందిన ముంజం భరత్ గంజాయి సేవించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీరి ద్వారా సుంగాపూర్‌కు చెందిన మల్కాడి కృష్ణ, ముంజం శ్రీరామ్, బొర్లకుంట కృష్ణంరాజు, దుర్గం జీవన్, వైరాగడే పుష్పరాజ్, చునార్కర్ నితిన్, బొర్లకుంట సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. గంజాయి వినియోగం, రవాణా నేరమని అన్నారు. ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు. -
పారామెడికల్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
మావల మండల కేంద్రంలోని డాక్టర్ ఎస్.పవార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తోంది. కోర్సులు పూర్తయిన తర్వాత కూడా వారికి ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు నివేదిక ఇవ్వకముందే ఎలాంటి లోటుపాట్లు లేవంటూ కళాశాల యాజమాన్యం ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి కళాశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలి. – ఏబీవీపీ నాయకులు, ఆదిలాబాద్ -
‘బోథ్‌లో ఆసుపత్రులు అభివృద్ధి పర్చండి’
బోథ్: నియోజకవర్గంలోని ఆసుపత్రులను వెంటనే అభివృద్ధి పరిచి, గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, నియోజకవర్గంలో ఎదురవుతున్న వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పరిస్థితులను, ఆసుపత్రుల అభివృద్ధి ఆవశ్యకతను మంత్రికి వివరించారు. బోథ్ ఏరియా ఆసుపత్రిని అందుబాటులోకి తేవడంతో పాటు ఇచ్చోడ, నేరడిగొండ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలను ఆధునీకరించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారి ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య వసతులు కల్పించాలని, కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలని, నేరడిగొండ ఆసుపత్రిలో రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో 30 పడకల ఇన్–పేషెంట్ భవ నం, లేబర్ రూమ్, నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేయాలని కోరారు. -
చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు సిబ్బంది చట్టాలపై పూర్తి అవగాహన పెంపొందించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సివిల్ పోలీసు కానిస్టేబుళ్లకు మూడు రోజుల రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 600 మంది సివిల్ పోలీసు కానిస్టేబుళ్లకు 30 బ్యాచ్‌లుగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బేసిక్ పోలీసింగ్‌తో పాటు ప్రో యాక్టివ్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేస్తూ నేరాల నివారణలో కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. శిక్షణలో దర్యాప్తు ప్రమాణాలు, డయల్100 సేవల నిర్వహణ, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల పర్యవేక్షణ, నూతన బీట్ సిస్టం, ఆయుధాల వినియోగం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వేలిముద్రల సేకరణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. క్రమశిక్షణ, నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ పి.మౌనిక, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, డీసీఆర్బీ ఎస్సై ప్రవీణ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యలు బాధ్యతగా పరిష్కరించాలిఆదిలాబాద్టౌన్: ప్రజా సమస్యలను బాధ్యతగా స్వీకరించి, చట్టపరంగా సత్వర పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 28 మంది ఫిర్యాదుదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే 87126 59973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
వార్డెన్‌ను బెదిరించి వసూళ్లు
ఉట్నూర్‌రూరల్: సమాజంలో ఏది తప్పు, ఏది ఒప్పు కొడుకుకు చెప్పి సన్మార్గంలో పెట్టాల్సిన తండ్రే, కొడుకును వెంట బెట్టుకుని బెదిరింపులు, వసూళ్లకు పాల్పడిన ఘటన ఉట్నూర్ పట్టణంలో వెలుగుచూసింది. సీఐ ఎం.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పాత ఉట్నూర్‌కు చెందిన నేతావత్ రాందాస్, నేతావత్ జైల్‌సింగ్ అనే తండ్రీకొడుకులు గత కొద్ది రోజులుగా ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ కాల్స్ చేసి ఒక కార్యక్రమం పేరుతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ నెల 26న హాస్టల్‌కు వెళ్లిన నిందితులు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని బెదిరించారు. గత ఆరు నెలల్లో రెండు సార్లు రూ.3వేల చొప్పున రూ.6వేలు వసూలు చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వారిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు. బెదిరింపులు, బలవంతపు వసూళ్ల వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై విజయ్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
లక్సెట్టిపేట: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు మహేష్(35) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ ఇటీవల వ్యాన్ కొనుగోలు చేసి నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. వ్యాన్ నెల వాయిదా డబ్బులు చెల్లించేందుకు ఇతరుల వద్ద అప్పులు చేశాడు. వ్యాన్ కుదువ పెట్టి రూ.3లక్షలు అప్పులు చేశాడు. అయినా అప్పులు తీరకపోవడం, వ్యాన్ లేకపోవడం, భార్య అనారోగ్యానికి గురై పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి భార్య వనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై వృద్ధుడు.. లక్సెట్టిపేట: పట్టణంలోని బోయవాడకు చెందిన లింగయ్య(67) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్యకు ఆరుగురు అన్మదమ్ములు ఉండేవారు. గతంలో ఇద్దరు చనిపోగా ఇటీవల మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో తాను కూడా చనిపోతే బాగుండు అని అంటూ ఉండేవాడు. ఆదివారం సాయంత్రం మద్యంమత్తులో గోదావరి రోడ్‌లోని తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. వృద్ధుడి ఆత్మహత్య లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రా మానికి చెందిన రాందేని మల్లేశం(73) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేశం గత కొద్ది రోజులుగా మోకాళ్ల నొప్పులు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. మృతుడి భార్య గురులక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. -
కలెక్టరేట్ ఎదుట ఎన్పీఆర్డీ ధర్నా
కై లాస్‌నగర్: ఎన్నికల సమయంలో దివ్యాంగులకిచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు నగేశ్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమలు చేయడం లేదన్నారు. 2023 నుంచి 2025 వరకు వీల్చైర్లు, ట్రై సైకిళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగులకు వాటిని ఇంకా అందించలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం, ఆర్టీసీ బస్సులో గౌరవం కల్పించా లని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి ఆరిఫా బేగం, గంగసాగర్, ఆశ న్న, ఆర్.మంజుల తదితరులు పాల్గొన్నారు. -
చోరీకి పాల్పడ్డ నిందితుడి అరెస్ట్
బోథ్: ఇంటి తాళం పగులగొట్టి నగదు చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బోథ్ ఎస్సై వి. పురుషోత్తం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న పట్టణంలోని న్యూ కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటికి తాళం వేసి పనికి వెళ్లింది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని పెట్టేలో దాచుకున్న రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 26న బోథ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన కృష్ణకాంత్ జాదవ్‌గా గుర్తించారు. కూలీ పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో బాధితురాలి ఇంటి తాళం పగులగొట్టి చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని ఎస్సై పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.5వేలు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
గ్రీవెన్స్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉట్నూర్ మండలం సాలెవాడ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామానికి అంగన్వాడీ మంజూరు చేయాలని, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం చిత్రు తనకు భూ పట్టా ఇప్పించాలని, ఆసిఫాబాద్ మండలం మాణిక్గూడ గ్రామానికి చెందిన భీము తనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ పీఈటీ ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు ఇచ్చారు. వీరితో పాటు మరికొందరు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఐటీడీఏ పీవో నిత్యం బిజీగా ఉంటూ గిరిజన ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిమగ్నమయ్యే ఐటీడీఏ పీవో మంద మకరందు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దీక్ష స్వీకరించారు. -
తండ్రి చితికి నిప్పుపెట్టిన కూతురు
తాండూర్: తండ్రి చితికి నిప్పంటించి కొడుకులు లేరనే లోటును తీర్చింది. పుట్టెడు దుఃఖంలోనూ దహనసంస్కారాలు నిర్వహించింది. మండలంలోని బోయపల్లి గ్రామానికి చెందిన ఇప్ప కమలాకర్(40) ఆదివారం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన మొదటి భార్య శోభ కూడా మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. వీరికి కూతురు కీర్తన ఉంది. ఆ తర్వాత కమలాకర్ మరో వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలాకర్ తుది శ్వాస విడిచాడు. సోమవారం కమలాకర్ స్థానికులు దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారుడు లేకపోవడంతో కూతురు కీర్తన ఆ బాధ్యతను తీసుకొని తండ్రికి తలకొరివి పెట్టింది. కూతురే అన్నీ తానై అంతిమ సంస్కారాలు నిర్వహించడం అక్కడున్న వారిని కలిచివేసింది. -
విద్యార్థే కేంద్రంగా ఆర్జీయూకేటీ అభివృద్ధి
బాసర: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందించడమే లక్ష్యంగా బాసర ఆర్జీయూకేటీని ముందుకు తీసుకెళ్తున్నామని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. క్యాంపస్‌లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, పరిశోధన, స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వీసీగా బాధ్యతలు స్వీకరించాక మీ ముందున్న సవాళ్లు ఏమిటి? ఎలా అధిగమించారు?వీసీ: విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది మధ్య పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించడం. కార్యాలయాలకే పరిమితమై నిర్ణయాలు తీసుకోకుండా.. నేరుగా విద్యార్థుల వద్దకే వెళ్లి వారి సమస్యలను ఆలకించడం, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడటం, అధ్యాపకులతో సమగ్రంగా చర్చించడం అనే నూతన శైలిని ఆచరణలోకి తెచ్చా. రాత్రివేళల్లో హాస్టళ్లను సందర్శించాలనే ఆలోచన ఎందుకొచ్చింది?వీసీ: రాత్రివేళల్లో నేరుగా పర్యటించడం వల్ల వారి భద్రత, ఆరోగ్యం, మెస్ భోజన వసతి, పరిశుభ్రత, వారి మానసిక స్థితిగతులను క్షేత్రస్థాయిలోనే తెలుసుకునే వీలుంటుంది. ఒక విద్యార్థి మిమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చా? వీసీ: విద్యార్థుల ఫిర్యాదులు, సమస్యలు పక్కా వ్యవస్థ ద్వారా పరిష్కారం కావడమే సరైన పద్ధతి. అత్యవసర సందర్భాల్లో విద్యార్థులు తమ సమస్యలను నేరుగా నా దృష్టికి తెచ్చేలా సులువైన సమాచార వ్యవస్థలను అందుబాటులోకి తెస్తున్నాం. తల్లిదండ్రుల విశ్వాసాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?వీసీ: క్యాంపస్ విద్యా పురోగతిపై వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం, పారదర్శకమైన నిర్వహణ, విద్యార్థుల క్షేమానికి ఇచ్చే ప్రాధాన్యత వారిలో నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యక్షంగా వారితో మాట్లాడి భరోసా ఇస్తున్నాం. ఆర్జీయూకేటీకి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు మీ ప్రణాళిక ఏమిటి?వీసీ : నాణ్యమైన విద్యాబోధన, పరిశోధన పరిశ్రమల అనుసంధానం, నవకల్పనలు (స్టార్టప్ సంస్కృతి), డిజిటల్ పరిపాలన, సామాజిక బాధ్యత ఆధారంగా క్యాంపస్‌ను ముందుకు తీసుకెళ్తున్నాం. గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దడమే మా ప్రధాన ధ్యేయం. ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు ట్రిపుల్ ఐటీని వేదికగా మార్చే ఆలోచన ఉందా? వీసీ: కచ్చితంగా ఉంది. మా విద్యార్థులు కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాక, నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థాపకులుగా ఎదగాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్ ఫండింగ్ మద్దతు, ఇండస్ట్రీ కనెక్టివిటీ, పరిశోధనా వాతావరణాన్ని విస్తృతంగా పెంచుతున్నాం. ‘ఓపెన్ డోర్ పాలసీ’అమలు చేస్తున్నారా? వీసీ: విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తమ సమస్యలను, విలువైన సూచనలను ఎటువంటి భయాందోళనలు లేకుండా వ్యక్తం చేసే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. ‘సంభాషణే ఏ సమస్యకై నా తొలి పరిష్కారం’అనే సూత్రంతో అందరికీ నిరంతరం అందుబాటులో ఉండే సుపరిపాలనగా తీర్చిదిద్దుతున్నాం. -
సోలార్ ప్రాజెక్టు గ్రిడ్‌కు అనుసంధానం
ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పిప్రి శివారులో రైతు పొద్దుటూరు ప్రేమలతాదేవి, కిష్టారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం రెండు మెగావాట్ల పీఎం కుసుం సోలార్ ప్రాజెక్టును ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఎస్ఈ జే.సుభాష్, డీడీఈ తిలక్, సమీప 33/11 కేవీ తరోడ సబ్‌స్టేషన్ వద్ద గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీఎం కుసుమ్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్‌కుమార్, విష్ణు, శ్రీకాంత్, టి.మధుసూదన్‌రావు, ప్రదీప్‌కుమార్‌రెడ్డి, డీపీ వర్మ, సునీల్, పి.విక్రంపాటిల్, పి.రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో వ్యాసపౌర్ణమి ఉత్సవాలు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వ్యాస (గురు)పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం గురు ప్రార్థన, వ్యాసపౌర్ణమి ఉత్సవ సంకల్పం, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, నాందీముఖం నిర్వహించారు. అనంతరం నవగ్రహ, యోగిని, వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండల స్థాపన, ప్రధాన కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, స్థాపిత దేవతా పూజలు, హోమాది వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు మురళీశర్మ, దీక్షిత్, వేద పండితులు అంకుశర్మ, నవీన్ శర్మ, శ్రీనివాస్ శర్మ, ఈవో అంజనాదేవి, ఏఈవో గంగ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘మా సార్లు మాకే కావాలి’
ఇచ్చోడ: మండలంలోని ముఖరా బి ప్రాథమిక పాఠశాల గేటు ముందు సోమవారం విద్యార్థులు, వారి తలిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. ‘మా సార్లు మాకే కావాలి’ అంటూ నినాదాలు చేశారు. ముఖరా బి యూపీఎస్ పాఠశాలలో 104 మంది విద్యార్థులు చదువుతున్నారు. 6, 7 తరగతులలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లను ఇతర స్కూళ్లకు డిప్యూటేషన్‌పై పంపించారు. ఇతర స్కూళ్ల నుంచి ఇద్దరు ఎస్జీటీ టీచర్లను ఇక్కడి పాఠశాలకు కేటాయించారు. దీంతో వేరే స్కూళ్ల నుంచి వచ్చిన ఎస్జీటీ ఉపాధ్యాయులు వద్దని, తమ సార్లనే తమకే కేటా యించాలని ధర్నా నిర్వహించారు. సర్పంచ్ ఖాతున్‌బీ, మాజీ సర్పంచ్ అడవ్మారుతి, విద్యాకమిటీ చైర్మన్ ఇమాద్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
బాసర: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్థన్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో నూతనంగా చేరిన పీయూసీఐ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయ విద్యావిధానం, క్రమశిక్షణ, పరీక్ష సరళి, క్యాంపస్ వసతులు, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓరియెంటేషన్ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గుజ్జరి శంకర్, ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్, అసోసియేట్ డీన్ శేఖర్ శీలం, ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ డాక్టర్ మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
దొంగను పట్టిచ్చిన సీసీ కెమెరా
మంచిర్యాలక్రైం: ఇంటర్నెట్ సెంటర్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా దొంగను పట్టిచ్చింది. మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు సోమవారం తన చాంబర్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన మహ్మద్ మొయిన్ ఇంటర్నెట్ సెంటర్లో ఈ నెల 25న దొంగతనం జరిగింది. కంప్యూటర్, మానిటర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటర్నెట్ సెంటర్లోని సీసీ కెమెరా ఆధారంగా దొంగను బెల్లంపల్లికి చెందిన మహ్మద్ మద్గుంగా గుర్తించారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని హమాలీవాడ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు యజమానిని శాలువాతో సన్మానించారు. -
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
మందమర్రిరూరల్: దేశంలో గోహత్యను పూర్తిగా నిషేధించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గోరక్షణ జిల్లా సేవకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని కామాఖ్యపురం వారాహిదేవి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గోమాత సంరక్షణే ధ్యేయంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మందమర్రి పట్టణంలో 60 వేల సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. సేకరించిన సంతకాల ప్రతులను రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లకు అందజేస్తామని తెలిపారు. సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మంథిని సతీష్, భవానీ, గోరక్షకులు సూరిబాబు, వెంకటేశం, నర్సయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
● ఎయిర్‌పోర్టు భూసేకరణకు లైన్ క్లియర్ ● రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు ● జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● డిసెంబర్ 31లోగా ప్రక్రియ పూర్తికి గడువు
కై లాస్‌నగర్: జిల్లావాసులు ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ఏర్పాటులో మ రో ముందడుగు పడింది. కీలకమైన భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఇందుకోసం రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో 36 జారీ చేసింది. ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏ ఎఫ్) జాయింట్ యూజర్ సర్వీస్‌లకు అనుగుణంగా భూ సేకరణ త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోపు ప్రక్రియ పూర్తి చేయాలని గడువు విధించింది. ఐఏఎఫ్ సర్వేకు అనుగుణంగా ... ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వైమానిక శిక్షణ కేంద్రంతో కూడిన అంతర్జాతీయస్థాయి విమానశ్రాయ ఏర్పాటుకు నిర్ణయించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రక్షణశాఖ స్థలం 369.45 ఎకరాలకు అదనంగా 700 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే భారీ విమానాలు సైతం రాకపోకలు సాగించేలా ఉండాలని భావించింది. దీనిపై సర్వే చేపట్టిన అనంతరం 9వేల ఫీట్లతో కూడిన రన్ వే నిర్మించాల్సి ఉండటంతో మరో 1500 ఎకరాల భూమి అవసరమవుతుందని, దాన్ని ఐఏఎఫ్‌కు అప్పగించాలని పేర్కొంటూ కేంద్ర రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించగా అందుకు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ, విమానాయాన శాఖల ఆదేశాల మేరకు ఐఏఎఫ్ అధికారుల బృందం ఈ ఏడాది జూన్ 17న ఎరోడ్రమ్ మైదానాన్ని పరిశీలించింది. ప్రత్యేక సర్వే నిర్వహించి 2009.23 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. రూ.2,278 కోట్లు మంజూరు .. కేంద్ర విమానయాన, రక్షణశాఖల నివేదికలకు అ నుగుణంగా భూ సేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1609.23 ఎకరాలు ఇండియ న్ ఎయిర్‌ఫోర్స్‌కు, 400 ఎకరాలు సివిల్ ఏవియేష న్కు కేటాయించేలా ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.2,278.14 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ జీవో జారీ చేశారు. ఇందులో అత్యధికంగా రూ.1555.11 కోట్లు భూసేకరణ కోసమే కేటా యించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి అనుకుంట వరకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డును మళ్లించేందుకు రూ.35కోట్లు, 765 కేవీఏ సామర్థ్యంతో కూడిన విద్యుత్ హైటెన్షన్ టవర్లు తొలగించేందుకు రూ.310 కోట్లను కేటాయించింది. ఇరిగేషన్‌శాఖకు సంబంధించిన వాగులకు సంబంధించి రూ.57.49 కోట్లు, మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్ నీటి వనరుల తరలింపునకు రూ.3.20 కోట్లు, విద్యుత్‌శాఖకు సంబంధించి అడ్డంగా ఉన్న స్తంభాలను తొలగించేందుకు రూ.18.76 కోట్లు, ఇతరాత్ర పనుల కోసం రూ. 31కోట్ల చొప్పున మంజూరు చేసింది. త్వరితగతిన భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించేలా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించిన ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. నిధుల మంజూరుతో త్వరలోనే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. ఎక్కడి భూములను సేకరిస్తారనే దానిపై కలెక్టర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా స్పష్టం కానుంది.‘సాక్షి’ చొరవజిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు ఆవశ్యకత, ఈ ప్రాంతవాసుల ఆకాంక్షను వివరిస్తూ ‘సాక్షి’ గతేడాది చర్చా వేదికతో పాటు పలు ప్రత్యేక కథనాలను ప్రచురించిన విషయం విధితమే. ఈ మేరకు పాలకులు స్పందించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అడుగుపడింది. తాజాగా భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ సామాజిక చొరవను జిల్లావాసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గతేడాది మార్చి 6న సాక్షిలో ప్రచురితమైన కథనంశుభ పరిణామంఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం శుభపరిణామం. ఈ మేరకు జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్రం తరఫున అవసరమైన సహకారం అందించేందుకు నా వంతు కృషి చేస్తా. – గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ నిధుల మంజూరు హర్షనీయంఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేయడం హర్షనీయం. విమానాశ్రయ ఏర్పాటు ద్వారా జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. ఇచ్చిన మా టకు కట్టుబడి చర్యలు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే లక్ష్యంగా విమానాశ్రయ నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా భూసేకరణ కోసం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేకంగా జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు. – నరేశ్ జాదవ్, డీసీసీ అధ్యక్షుడు -
ఆదర్శప్రాయుడు అంబేడ్కర్
తలమడుగు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని పల్లి బి గ్రా మంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గా ల అభ్యున్నతికి అంబేడ్కర్ అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి, శ్రీకాంత్, కిరణ్ కుమార్, వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రతా ప్, తదితరులు పాల్గొన్నారు. -
‘నిధుల కేటాయింపును స్వాగతిస్తున్నాం’
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటులో భాగంగా భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటనలో పేర్కొన్నారు. కొ రటా–చనాఖా బ్యారేజ్ 90 శాతం పూర్తయ్యిందని తెలిపారు. మిగతానిధులు సైతం కేటాయిస్తే 50వేల ఎకరాల సాగునీరు అందుతుందని దీంతో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సీసీఐ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల నిధులు కేటాయిస్తే పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ విషయంలో చొరవ చూపాలని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ క్యారిడార్‌తో పాటు విమానాశ్రయం, సీసీఐని పునఃప్రారంభిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సంపాదిత సెలవులు మంజూరు చేయాలిఆదిలాబాద్టౌన్: జనగణన కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిరి శ్రీకాంత్, ఎం. జలంధర్‌రెడ్డి కోరారు. ఈమేరకు డీఈవో మాధవికి ఆదివారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు తక్షణమే ఆదేశాలు జారీ చేసి అర్హులైన వారికి సంపాదిత సెలవులు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఈవో అర్హులైన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. -
29న సమావేశాల నిర్వహణ
మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. తదనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. ఈనెల 29న జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించాం. మండల ప్రత్యేకాధికారి అధ్యక్షతన జరిగే సమావేశంలో సర్పంచ్‌లతో పాటు మండలస్థాయి అధికారులంతా హాజరవుతారు. గ్రామీణ సమస్యలు చర్చకు వస్తాయి. వాటి పరిష్కారానికి అవకాశం ఉంటుంది. సర్పంచ్‌లు సద్వినియోగం చేసుకోవాలి. – బి.రవి, జెడ్పీసీఈవో -
ఎట్టకేలకు ‘పరిషత్’ సమావేశాలు
కై లాస్‌నగర్: మండల పరిషత్ సర్వసభ్య సమావేశా ల నిర్వహణకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇ క నుంచి ప్రతి 45 రోజులకోసారి విధిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మే రకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. తతదనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని మండలాల్లో ఈనెల 29న సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మండల అధ్యక్షులు లేకపోవడంతో ప్రత్యేకాధికారి అధ్యక్షతన కొనసాగనున్నాయి. రెండేళ్ల తర్వాత నిర్వహించనున్న సమావేశాలతో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై గ్రామీణులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇదీ పరిస్థితి.. పాలకవర్గాలు ఉన్న సమయంలో ప్రతీ మూడు నెలలకోసారి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు జరిగేవి. ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి జెడ్పీటీసీతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల, పలువురు డివిజన్ స్థాయి అధికారులు హాజరయ్యేవారు. గ్రామాల సమస్యలను సభ్యులు ఇందులో ప్రస్తావించేవారు. అధికారుల దృష్టికి రావడంతో పాటు పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు అవకాశముండేది. అయితే పరిషత్ పాలకవర్గాల గడువు 2024 జూన్ 24న ముగిసింది. ప్రభుత్వం తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. ఎంపీపీల స్థానంలో ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించినా సమావేశాలు మాత్రం నిర్వహించని పరిస్థితి. పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో కార్యదర్శులు మినహా ఇతర శాఖల అధికారులు పర్యటించిన దాఖలాలు కన్పించడం లేదు. ఇటీవల ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా వారిలో చాలా మంది కొత్తవారే ఎన్నికయ్యారు. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి చాలామందిలో ఉంది. మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తే స్థానికంగా ఉన్న సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశముండేది. సమస్యల పరిష్కారంపై ఆశలు.. రెండేళ్ల జాప్యం తర్వాత ఎట్టకేలకు సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మండల ప్రత్యేకాధికారి అధ్యక్షతన ప్రతి 45 రోజులకోసారి నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్‌లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులంతా హాజరుకానున్నారు. దీంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచ్‌లు వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశముంటుంది. తద్వారా వాటి పరిష్కారానికి మోక్షం లభించే అవకాశముంటుంది. అలాగే పల్లెపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు అవగాహన కల్పించేలా ఈ సమావేశాల ద్వారా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. -
కార్గిల్ వీరులకు ఘన నివాళి
కై లాస్‌నగర్/ఆదిలాబాద్: కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి మనందరికి స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. కార్గిల్ విజ య్ దివస్ పురస్కరించుకుని పట్టణంలోని మున్సి పల్ పార్కులో గల అమరవీరుల స్తూపం వద్ద ఆది వారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహనీయుల వీరత్వాన్ని స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్‌ను గర్వంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ సునీల్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రీ, రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. -
● లేని కోర్సులకు అడ్మిషన్లు ● జిల్లా కేంద్రంలో ఓ పారామెడికల్ కళాశాల తీరిది ● వైద్యఆరోగ్యశాఖ తనిఖీల్లో వెల్లడి ● విద్యార్థుల ఫిర్యాదుతో వెలుగులోకి.. ● అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎస్ పవార్ పారామెడికల్ కళాశాల యాజమాన్యం అమాయక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోంది. మావల మండలకేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని బ స్టాండ్ సమీపంలో కళాశాలను తెరిచింది. కేవలం నాలుగు కోర్సులకు సంబంధించి మాత్రమే అనుమతి ఉండగా, వందల సంఖ్యలో కోర్సులు ఉన్నట్లుగా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులను మభ్యపెట్టి అడ్మిషన్లు తీసుకుని తరగతులు మాత్రం నిర్వహించడం లేదు. దీంతో పలువురు విద్యార్థులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రేపుమాపు అంటూ కాలం వెల్లదీయడంతో కలెక్టర్‌తో పాటు వైద్యారోగ్య శాఖాధికారులకు ఇటీవల ఫిర్యా దు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే రిమ్స్ డైరెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులతో విచారణకు ఆదేశించారు. దీంతో సదరు కళాశాలకు బీఎస్సీ నర్సింగ్‌తో పాటు జీఎన్ఎం తదితర కోర్సులకు అనుమతి లేదని తేలింది. ఈమేరకు కళాశాలపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. నాలుగింటికే అనుమతి.. ఈ పారామెడికల్ కళాశాలలో డీఎంఎల్టీ, డిప్లొ మో అండ్ రేడియోగ్రఫీ అసిస్టెంట్, ఆప్తాలమిక్ అసిస్టెంట్ డిప్లొమో, డిప్లొమో ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఈ నాలుగు కోర్సులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కళాశాల యాజమాన్యం జీఎన్ఎం నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, బీఫార్మసీ, డీఫార్మసీతో పాటు అనేక కోర్సుల పేరిట విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం పర్మిషన్ ఉన్న కోర్సుల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకొని బోధించాల్సి ఉంటుంది. కానీ అక్కడ బోధన చేసేవారు సైతం లేకపోవడం గమనార్హం. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు అక్కడికి వెళ్లి చూస్తే బోధన చేసేవారు లేకపోవడం, కళాశాలలో రెండే గదులు ఉండటం, ల్యాబ్, ఇతర వసతులు లేకపోవడంతో అవాక్కయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. జిల్లా కేంద్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో కొన్ని పారామెడికల్ కళాశాలలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. కళాశాలలో కోర్సులు లేకపోయినప్పటికీ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఉన్న కోర్సుల్లోనూ సక్రమంగా తరగతులు నిర్వహించకపోవడం, బోధన చేసేవారు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రిమ్స్‌లో కేవలం ప్రాక్టికల్ తరగతులు మాత్రమే కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు సబ్జెక్టుపై పట్టు సాధించలేక పోతున్నారు. భవిష్యత్తులో వీరు రోగులకు నిర్వహిస్తే రిపోర్టులు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు.


