బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఆదిలాబాద్‌టౌన్: వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సమ్మె చేప ట్టారు.యూనైటెడ్ ఫోరం ఆఫ్‌బ్యాంకింగ్ యూ నియన్ పిలుపు మేరకు శివాజీ చౌక్‌లోని ఎస్బీ ఐ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రీజినల్ కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ, 2023లో సమ్మె చేపట్టిన సమయంలో ప్రభుత్వం ఐదు రోజుల పని దినాలను అంగీకరించిందని అన్నారు. ప్రస్తుతం ఆ ఫైల్ కేంద్రం వద్ద ఉందని, మూడేళ్లుగా అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒకరోజు సమ్మె చేపట్టినట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కా కపోతే పూర్తిగా విధులు బహిష్కరిస్తామని స్ప ష్టం చేశారు. కార్యక్రమంలో బ్యాంకు యూని యన్ నాయకులు వినయ్‌కుమార్, రమేశ్, ప్రవీణ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అడెల్లు, సుదర్శన్, అంకిత్ జాదవ్, పరమేశ్వర్, నాగరాజు, హరికిషన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.


