సమష్టిగా సాగుదాం..
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో సమష్టిగా ముందుకు సాగి ఆదిలాబాద్ బల్దియా పీఠాన్ని కై వసం చేసుకుందామని కాంగ్రెస్ ముఖ్య నేతలు అభిప్రాయ పడ్డారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వారు మంగళవారం గండ్రత్ సుజాత నివాసంలో సమావేశం అయ్యారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడే వారికి, ప్రజల్లో బలమున్న వారికే టికెట్లు కేటాయించాలని అభిప్రాయ పడ్డారు. కాగా, ముఖ్య నేతలంతా విభేదాలు వీడి సమావేశం కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, నాయకులు సాజిద్‌ఖాన్, భోజారెడ్డి, సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.


