ఆకాశ వీధిలో లోహ విహంగాల సంబరం అరుదెంచింది. అతిపెద్ద విమానాల ప్రదర్శనకు నగరం సిద్ధమైంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా– 2026’ షో అబ్బురపర్చనుంది.
బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు నగరవాసులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తనుంది. వైమానిక విన్యాసాలకు చిరునామాగా నిలిచే భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ టీమ్, ప్రపంచ ప్రఖ్యాత లండన్ ఏరోబాటిక్ టీమ్ మార్క్ జాఫ్రీస్ అద్భుత విన్యాసాలను ప్రదర్శించనున్నారు.


