ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇటీవలే దీన్ని ప్రారంభించారు. శుక్రవారం నాడు ఆ థియేటర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అల్లు అరవింద్.. తన అల్లు సినిమాస్ ప్రత్యేకతల్ని తెలిపారు.
హైదరాబాద్‌లోనే మొట్టమొదటి డాల్బీ సినిమా, ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌ను (స్క్రీన్ 1) కలిగున్న మల్టీప్లెక్స్‌గా అల్లు సినిమా నిలిచిందన్నారు. ఈ స్క్రీన్‌లో 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్లెట్లను బయటకు కనిపించకుండా అమర్చామన్నారు. జర్మనీ టీమ్ మా స్క్రీన్ చూసి ఆశ్చర్యపోయింది అన్నారు.


