గత రెండు రోజులుగా నందన్ నీలేకని పేరు వార్తల్లో హాట్‌టాపిక్‌గా మారింది. యూఐడీఏఐ (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్ అయిన నందన్ నీలేకని నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో ఆయన పేరు వార్తలో మారుమ్రోగిపోతోంది. ఈ కమిటీ పోటీ పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు పలు సిఫార్సులు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆయనెవరు..ఆయన వ్యక్తిగత జీవితం గురించి సర్వత్ర చర్చలు మొదలయ్యాలయి. ఆయన భార్య సైతం దాతృత్వంలో మేటీ అని, పర్యావరణం, నీరు, విద్య కోసం పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చే గొప్య వ్యక్తి అంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అంతేగాదు వారిద్దరి క్యూట్ లవ్ స్టోరీ కూడా తెరపైకి వచ్చింది. ఆయనే స్వయంగా ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించిన స్టోరీ వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారింది. మరి ఆ దంపతుల అందమైన ప్రేమ కథేంటో చూసేద్దామా.!.
నందన్ నీలేకని నీలేకని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడుచ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కూడా. ఆయన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) - ఆధార్ వ్యవస్థకు మాజీ ఛైర్మన్, రూపకర్తగా ప్రసిద్ధి చెందారు. ఆయన 'పీపుల్ బై WTF' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తన భార్యను ఎలా కలిశాను, ఎలా తమ మధ్య ప్రేమ మొదలైందో పంచుకున్నారు. తాను 1977లో జరిగిన ఒక క్విజ్ పోటీలో రోహిణిని మొదటిసారి కలిసినట్లు తెలిపారు. ఆ పోటీలో ఆయన తన కళాశాల ఐఐటి బొంబాయికి, రోహిణి ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీకి ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు.
అయితే ఆ క్విజ్‌లో తాను గెలిచాను కానే హృదయాన్ని కోల్పోయానని నవ్వుతూ చెప్పారు. ఆ తర్వాత తాము కొంతకాలం ప్రేమించుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని అన్నారు. ఇక తన భార్య రచయిత్రి, అత్యంత పరోపకారి అని చెప్పారు. ఆమె 2001లో అర్ఘ్యం ఫౌండేషన్‌ను స్థాపించిందని, అది నీరు, పారిశుధ్య సమస్యలపై పనిచస్తుందని అన్నారు. అలాగే అన్‌కామన్ గ్రౌండ్ (2011), ది హంగ్రీ లిటిల్ స్కై మాన్‌స్టర్ (2020), సమాజ్, సర్కార్, బజార్: ఎ సిటిజన్-ఫస్ట్ అప్రోచ్ (2022) వంటి అనేక పుస్తకాలను రాసినట్లు తెలిపారు.
అయితే భావాల పరంగా తామిద్దరం పరస్పరం వ్యతిరేకంగా ఉంటామన్నారు. తనకూ, తన భార్యకూ మధ్య ఉన్న తేడాలు ఎంత భిన్నంగా ఉంటాయో కూడా వివరించారు. తననుతాను బోరింగ్ వ్యక్తిగా అభివర్ణించుకోగా, రోహిణి మ్రాతం ఆవేశపూరితమైన భావోద్వేగభరిత చంచల స్వభావం గల వ్యక్తి అని అన్నారు. అంతేగాదు ఆమె గురించి ఇంకా చెబుతూ..2017లో తనతో పాటు గివింగ్ ప్లెడ్జ్‌పై సంతకం చేయడం సహా, భారతదేశపు అతిపెద్ద పర్యావరణ దాతలలో ఆమె ఒకరని కూడా పేర్కొన్నారు.
కాగా, భారతదేశ పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నాయకత్వం వహించనున్నట్లు తెలిపారు మోదీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.
(చదవండి: నిశబ్ద నిస్వార్థ వీరుడు..! అతడి సాయానికి సెల్యూట్ చెప్పాల్సిందే..)


