ఆధునిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే తప్ప ఒక సాధారణ కుటుంబం సౌకర్యవంతంగా జీవించలేని పరిస్థితి. అందులో ఎంతో శ్రమ, ఓర్పు, సహనం దాగి ఉంటుంది. అలాంటిది ఒక స్టార్టప్‌ను విజయవంగా నడపాలంటే ఇద్దరూ వ్యక్తిగత జీవితంలో చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలా ఇద్దరు భాగస్వాములు ఒక స్టార్టప్‌ను నిర్మించడంలో పూర్తిగా నిమగ్నమై నప్పుడు జీవితం ఎలా ఉంటుందో వివరిస్తూ ఒక స్టార్టప్ ఫౌండర్ తన భార్యతో గడిపే క్షణాల గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. జస్ట్ కొన్ని కన్ల పాటు విమానాశ్రయంలో తన భార్యను కలుస్తున్న చిత్రాన్ని పంచుకుంటూ ఆయన లింక్డ్‌ఇన్ (LinkedIn) పోస్ట్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతపై కొత్త చర్చను రేకెత్తించారు.
ఢిల్లీకి చెందిన, అట్-హోమ్బ్యూటీ, వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ (YesMadam) సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్య ఆర్య, (భార్య గరిమా శర్మ) తన పోస్ట్ ద్వారా వ్యక్తిగత జీవిత విశేషాలను షేర్ చేశారు. కలిసి గడపడానికి చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ, ఆ కొన్ని క్షణాలను అర్థవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నించామంటూ చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: కంగనా రనౌత్‌లా మారిన సాయోని ఘోష్ : ఏకిపారేస్తున్న నెటిజన్లు
బహుశా ఎవరూ వివాహాన్ని ఇలా ప్లాన్ చేసుకోరు. మాలో ఒకరం ల్యాండ్ అవుతున్నాం మరొకరం బయలు దేరుతున్నాం," అని ఆదిత్య ఆర్య తెలిపారు. అయినా, తామిద్దరం ఒకే గేట్ వద్ద 90 సెకన్ల పాటు చేతులు పట్టుకుని, ప్రపంచంలో ఉన్న సమయమంతా మాకే ఉన్నంత గొప్పగా ఫీలయ్యామని తెలిపారు. కేవలం ఈ ఒకటిన్నర భేటీలో తీసుకున్న ఒక పిక్‌ను షేర్ చేశారు. అంతేకాదు విమానాశ్రయంలో తన భార్యను ఇలా అనుకోకుండా కలవడం ఇది మొదటిసారి కాదని ఆయన పేర్కొన్నారు. నిజానికి, చాలా జంటలు డేట్‌లకు వెళ్తుంటే, తాము మాత్రం "లేఓవర్లు" (విమాన ప్రయాణాల్లో మధ్యలో ఆగడం) చేస్తుంటామని చెప్పారు.
ఇది సంస్థ నేర్పిన పాఠం
నిజానికి ఎవరూ తన దాంప్యత జీవితాన్ని ఇలా ప్లాన్ చేసుకోరు. కానీ కలిసి ఒక వ్యాపారాన్ని లేదా సంస్థను నిర్మిస్తున్నప్పుడు మీ జీవితం ఆటోమేటిక్‌గా ఈ రూపాన్ని సంతరించుకుంటుంది. తక్కువ సమయాన్ని కూడా గరిష్టంగా ఎలా ఉపయోగించుకోవాలో ‘యస్ మేడమ్’ మాకు నేర్పింది. ఫౌండర్లుగా ఉన్నవారి వివాహ బంధానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని తొమ్మిదేళ్ల వైవాహిక జీవితంపై ఆదిత్య వెల్లడించారు.
గరిమా శర్మ స్పందన
ఆదిత్య ఆర్య భార్య కంపెనీ గరిమా శర్మ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె తన భర్త పోస్ట్‌పై స్పందిస్తూ, ఇతరులకు విచిత్రంగా అనిపించేది తమకు లభించే రొమాన్స్ అని పేర్కొన్నారు. ఒక కంపెనీని నిర్మించడం, ఉపాధిని సృష్టించడం, తామిద్దరం నమ్మే ఆశయం కోసం జీవించడం... మాటలతో మాత్రమే కాకుండా అవకాశాలను సృష్టించడం ద్వారా దేశానికి సేవ చేయవచ్చని తమ పిల్లలకు చూపించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పారు. కొందరు ఎయిర్‌పోర్ట్‌లో పక్క పక్కనుంచి వెళుతున్న సాధారణ ప్రయాణీకులా తమని చూడొచ్చు. కానీ తాము మాత్రం ఒకేడ్రీమ్ వైపు అడుగులు వేస్తున్న ఇద్దరిని చూశాం అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులు


