పార్లమెంట్ సమావేశాలు అప్‌డేట్స్..
రాహుల్‌కు కౌంటర్..
- నిశికాంత్ దూబే వ్యాఖ్యలు
- అమిత్ షాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను దూబే తీవ్రంగా ఖండించారు.
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరికి భయపడరు.
- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే అమిత్ షాకు భయపడుతున్నారు.
- దేశాన్ని విభజించాలని కోరుకునే దేశ వ్యతిరేక శక్తులే అమిత్ షాకు భయపడుతున్నాయి.
- ప్రజలు, ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసంతోనే అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్
- పెల్లెట్ గన్స్‌పై చర్చించాలని పట్టు
- అమిత్ షా సభకు రావాలంటూ నినాదాలు.
- చర్చకు అంగీకరించని ప్రభుత్వం
విద్యార్థులకు న్యాయం చేయాలి: రాహుల్
- రాహుల్ గాంధీ కామెంట్స్..
- విద్యార్థులకు న్యాయం జరగాలి.
- విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
- విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
- సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ ఉన్నత స్థాయి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి.
- రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి.
- విద్యార్థుల హక్కులు, భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
- ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.
Students deserve justice.
An independent SC monitored high powered committee must be constituted to probe brutalities against our students. pic.twitter.com/pZATUeAjwC— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2026
కాంగ్రెస్ వాయిదా తీర్మానం..
- రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్
- అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై చర్చించాలని డిమాండ్
పార్లమెంట్ వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా..
- కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
- పార్లమెంటు ద్వారం వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా
- అయోధ్య విరాళాల చోరీ పైన దర్యాప్తు చేయాలని నినాదాలు
- ఉభయసభల్లో చర్చకు నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
- అయోధ్య విరాళాల చోరీపై స్వతంత్ర ఆడిటింగ్ దర్యాప్తు జరగాలని నినాదాలు
- చందా చోర్.. అధికారం నుంచి గద్దె దిగాలని ప్రతిపక్ష నేతల నినాదాలు
#WATCH | Delhi: Congress MPs including Priyanka Gandhi Vadra and others hold a protest at Makar Dwar of the Parliament, against Union Home Minister Amit Shah over 'police action' against CJP protestors on 20th July. pic.twitter.com/zmuqaWOt6n
— ANI (@ANI) July 30, 2026


