సాక్షి,ఢిల్లీ: లోక్‌సభలో తనకు మాట్లాడే అవకాశం లేదని తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, క్షమాపణలు చెప్పబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారు. బుధవారం రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు.
‘విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యకు కేంద్రహోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలి. పోలీసులు మేకులున్న లాఠీలతో విద్యార్థులను చావబాదారు. పెల్లెట్ గన్ తగిలి ఓ యువకుడు కన్ను పోవాల్సిన పరిస్థితి వచ్చింది.మహిళలు, మైనర్లపై కూడా దాడులు చేశారు. పోలీసులకు అమిత్‌షా ఆదేశాలైనా ఇచ్చి ఉండాలి.. ఆయనకు తెలియకుండా జరిగుండాలి’అని వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీల నిరసనల సందర్భంలో, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల కాల్పులు, లాఠీఛార్జీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
అమిత్ షా ఆదేశాలు ఇచ్చారనడానికి రాహుల్ గాంధీ దగ్గర ఏవైనా రాతపూర్వక ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని, లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు సభకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని, అలాంటప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు.


